AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 7 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 21 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 21 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పాటు.1972ఈరోజున మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం జరుపుకుంటారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి1915నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
సత్యమూర్తి1939వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
ఎండ్లూరి సుధాకర్1959తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
వ్లాదిమిర్ లెనిన్1924సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
జార్జ్ ఆర్వెల్1950బ్రిటీష్ రచయిత.
ఇ.వి.వి.సత్యనారాయణ2011తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
ఎల్కోటి ఎల్లారెడ్డి2015మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
మృణాళినీ సారాభాయి2016ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
పరశురామ ఘనాపాఠి2016ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)

ఈ రోజు జికె 
*భూగోళ శాస్త్రము*
🌼🌸🌺🌻🌹🌞🌼🌸🌹
1)ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలు ఏమిటి?
*హిమాలయాలు*

2)ప్రపంచంలో పొడవైన పర్వతాలు ఏమిటి?
*ఆండీస్ పర్వతాలు*

3)ప్రపంచంలో అత్యంత విశాలమైన పీఠభూమి ఏమిటి?
*టిబెట్ పీఠభూమి*

4)భూమి అంతర్భాగంలో జనించే ఊర్ద్వ బలాలు పైకి నెట్టడం వలన ఏర్పడే పీఠభూమి ఏమిటి?
*పర్వతపాద పీఠభూమి*

5)ప్రపంచంలో రెండవ అత్యంత విశాలమైన పీఠభూమి ఏమిటి?
*ఆల్టి ప్లానో*

6)కాల్షియం సల్ఫేట్ ద్రావణం ఆవిరై నందువల్ల ఏర్పడే ఖనిజం ఏది?
*కాలి సైట్ శిల*

7)సూర్యసిద్ధాంతము అనే గ్రంధాన్ని ఎవరు రచించారు?
*ఆర్య భట్ట*

8)విశ్వంలో 1974వ సంవత్సరంలో మొదటి బ్లాక్ హోల్స్ ను ఎవరు కనుగొన్నారు?
*స్టీఫెన్ వాకింగ్*

9)నక్షత్ర వీధులకు బయటకు ఒక కాంతిపుంజం వలె కనిపించే వాటిని ఏమంటారు?
*క్వాసార్స్*

10)భూమికి చంద్రునికి మధ్య గల అత్యధిక దూరాన్ని ఏమంటారు?
 *ఆపోజి*

*Idiom of the Day*

*📚back to the drawing board*

✍🏾Meaning:
You can say "back to the drawing board" when a plan or a design has failed, and you decide to begin all over again.

▪️For example:

🔺Their plans to open a hotel in Fiji fell through, so it was back to the drawing board. 

🔺Our new drug worked on rats, but when it was tried on people it failed, so we had to go back to the drawing board and start again.
━━━━━━━━━
#Idiom_of_the_Day

స్తంభించిన అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు

వాషింగ్టన్‌ : శనివారం నుండి అమెరికా ప్రభుత్వ నిర్వహణ స్తంభించింది. పాలక, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు ఈ పరిస్థితికి కారణమైంది. ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు అవసరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో సెనెట్‌ సభ్యులు విఫలమయ్యారు. ప్రధాన అంశాలపై రాజీ పడేందుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు సుముఖంగా లేరు. ఇమ్మిగ్రేషన్‌ విధానంలో సంస్కరణలు, బడ్జెట్‌ చర్చలు విఫలం కావడంతో శుక్రవారం సెనెట్‌ తాత్కాలిక వ్యయ బిల్లును ఆమోదించడంలో విఫలమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఫిబ్రవరి 16వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరేవి. ప్రస్తుత వ్యయ చర్యలకు శుక్రవారం అర్ధరాత్రితో కాల పరిమితి ముగిసింది.

అధ్యక్షుడుగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించి శనివారానికి ఏడాది పూర్తయింది. ఈ రోజునే ప్రభుత్వ నిర్వహణ కూడా స్తంభించింది. ఇది ట్రంప్‌ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. అయితే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా శని, ఆదివారాల్లో మూసి వుండడం వల్ల ప్రభావం ఎలా వుంటుందనేది వెంటనే తెలియరాదు.

వచ్చేసింది.. వాట్సాప్ బిజినెస్ యాప్..!

@ipixeloid

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు చెందిన బిజినెస్ ఎడిషన్ యాప్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. గతేడాది ఈ యాప్ విడుదల గురించి వాట్సాప్ ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ యాప్ విడుద‌లై యూజర్లకు లభిస్తున్నది. వ్యాపారులు తమ కస్టమర్లకు సులభంగా దగ్గరయ్యేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ ఉత్పత్తుల అమ్మకం దగ్గర నుంచి తాము అందిస్తున్న సేవలు, కస్టమర్ కేర్ సర్వీసులను ఈ యాప్ ద్వారా వ్యాపారులు తమ కస్టమర్లకు సులభంగా వివరించేందుకు, వారికి మరింత దగ్గరయ్యేందుకు వీలు కలుగుతుంది. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో సాధారణ యాప్‌లో మాదిరిగానే అన్ని ఫీచర్లు లభిస్తున్నాయి. దీంట్లో వ్యాపారులు తమ బిజినెస్ ప్రొఫైల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

తమ వ్యాపారం గురించిన సమాచారం, ఈ-మెయిల్ అడ్రస్‌లు, స్టోర్ చిరునామాలు, వెబ్‌సైట్ వివరాలను నిక్షిప్తం చేసుకోవచ్చు. దీంతోపాటు కస్టమర్లకు మెసేజ్‌లు ఇవ్వవచ్చు. వారికి గ్రీటింగ్స్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ సందేశాలు పంపవచ్చు. కస్టమర్లు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇవ్వవచ్చు.

@pixeloid

ఎంత మంది కస్టమర్లకు ఎన్ని మెసేజ్‌లు పంపారో తెలుసుకోవచ్చు. వాట్సాప్ వెబ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే తాము కస్టమర్ కాల్‌ను స్వీకరించలేని సమయాల్లో రిప్లై ఇచ్చే విధంగా ఆటోమేటెడ్ మెసేజ్‌లను ఇందులో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్నది.

త్వరలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై దీన్ని లాంచ్ చేయనున్నారు. ఇండోనేషియా, ఇటలీ, మెక్సికో, యూకే, యూఎస్ దేశాల్లో ఈ యాప్ లభిస్తుండగా, త్వరలో భారత్‌లోనూ వాట్సాప్ బిజినెస్ యాప్ వ్యాపారులకు అందుబాటులోకి రానుంది. కాగా ఇప్పటికే ఈ యాప్‌ను కొన్ని లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం.

@world_soft

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ : ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగబోయే మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ జాతరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం యాదగిరి వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి 690 ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి 392, జేబీఎస్ నుంచి 205, కేపీహెచ్‌బీ నుంచి 49, జగద్గిరిగుట్ట నుంచి 33 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

ఓక్కసారిగా 67 శాతం ఛార్జీలు పెరిగాయి
 
చెన్నై : దాదాపు ఆరేళ్ల తర్వాత తమిళనాడులో బస్సు ఛార్జీలు పెరిగాయి. ఊహించని రీతిలో 67 శాతం పెంచి రవాణా శాఖ పెద్ద షాకే ఇచ్చింది. కాగా, శనివారం నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. ఇక పెరిగిన ధరలను ఓసారి పరిశీలిస్తే...

చెన్నై నగర పరిధిలోని మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ పరిధిలో టికెట్‌ కనిష్ఠ ధరను 5 రూపాయలుగా నిర్ణయించింది. ఇంతకు ముందు అది 3 రూపాయలుగా ఉండేది. గరిష్ఠ ధరను 14-23 రూపాయలుగా సవరించింది. నాన్‌-మెట్రో ఛార్జీల విషయంలో 3రూ. నుంచి 5. రూలకు పెంచి.. గరిష్ఠ ధరను 12 నుంచి 19 రూపాయలకు సవరిచింది. గ్రామీణ సర్వీసులు, ఆర్టీనరీ సర్వీసులపై మినమిమ్‌ టికెట్‌ ధరను ఒక రూపాయి పెంచి 6 రూ.

No comments:

Post a Comment