AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 7 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 20 2018


*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జనవరి 20*🌅

*🏞సంఘటనలు*🏞

1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు.

1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

2009: అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.

2010: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.

2011: భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు.

*🌻🌻జననాలు*🌻🌻

1907: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)

1920: బి.విఠలాచార్య,'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999)

1940: కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త.

1960: విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.

*🌹🌹మరణాలు*🌹🌹

1900: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)

1988: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890)

2008: సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939)

2016: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)

2016: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)
🏧🏧🏧🏧🏧🏧
🔲 సూక్తులు

▪ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.

▪ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.

▪ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.

▪నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.

▪నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.
🏧🏧🏧🏧🏧🏧
*🤘 నేటి సుభాషితం🤘*

*తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.*
🏧🏧🏧🏧🏧🏧
*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  20, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 8 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 28 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 31 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : గరజ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 11 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 0 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 11 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 2 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 9 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 26 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 26 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 4 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 9 గం॥ 37 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 1 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 6 గం॥ 49 ని॥ నుంచి ఉదయం 8 గం॥ 13 ని॥ వరకు)
యమగండం :
(మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 14 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : కుంభము
విశేషం : ఏకాదశి ఉపవాసం
🏧🏧🏧🏧🏧🏧
*💎 నేటి ఆణిముత్యం 💎*

అహము నిండ, మంచి ఆలోచనలు రావు,
మనసు వికలమగును, మదము హెచ్చు;
తాను దూరమౌను, తనవారి నుండియే
ఏవగింపబడును, హీను డౌను

*భావము :*

అహంభావికి మంచి ఆలోచనలు రావు. మనసు వికలమౌతుంది. మదం పెరుగుతుంది. తాను దూరమవుతూ తనవారి చేతనే అసహ్యింపబడి హీనుడౌతాడు.

           *👬 నేటి చిన్నారి గీతం 👬*

*ఎవ్వరెరుగని తోట*

పువ్వులున్నాయ్ పువ్వులు! 
మల్లె పువ్వులు, మొగలి పువ్వులు 
మాలతీ మందార పువ్వులు 
పువ్వులున్నాయ్ పువ్వులు! 
ఎవ్వరెరుగని తోటనుంచీ 
పువ్వులెన్నో‌కోసి తెచ్చా 
పువ్వులున్నాయ్ పువ్వులు! 
బాట చివ్వర కోటలో ఒక 
చోట చక్కని తోట ఉన్నది 
తోట లోపల పూట పూటా 
పాట పాడే పిట్టలున్నవి 
చెట్టు చెట్టుకు పోయి పిట్టలు 
చిట్టి పాటలు పాడగానే 
పాటలన్నీ పువ్వులై ఆ 
తోటనిండావిరగబూస్తాయ్! “పువ్వులున్నాయ్ పువ్వులు! 
సన్నజాజులు, బొండు మల్లెలు 
సాటి లేని గులాబి గుత్తులు 
కమ్మ కమ్మని కొమ్మ సంపంగి 
గుమ్ముగుమ్మను పొగడ పువ్వులు 
పువ్వులున్నాయ్ పువ్వులు..
🏧🏧🏧🏧🏧🏧
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *🔹సుభాషిత వాక్కు*🔹

*"గొంతు పెంచడం గొప్పకాదు...మాట విలువ పెంచుకో..పంట పండేది వాన చినుకులకే గానీ ఉరుములకు కాదు..."*

*"If you cannot trust yourself, you cannot even trust your mistrust of yourself – so that without this underlying trust in the whole system of nature you are simply paralyzed."*

 *🌷మంచి పద్యం🌷*

*పనులు ఎన్నియైన పరమార్థ మొక్కటి*
*కోటి విద్యలన్ని కూటి కొరకె*
*పనులు చేయకున్న ఫలితంబు కలుగదు*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* 

*ఎన్ని పనులు చేసినా, కోటి విద్యలు నేర్చినా జానెడు పొట్ట కోసమే. పనులు చేయకున్న ఫలితము కలుగదు.*

*♦జికె టుడే♦*

*🔥గ్రహాలు రెండు రకాలు🔥*

*1.అంతర గ్రహాలు*

*2.బాహ్య గ్రహాలు*

*🔹అంతర గ్రహాలు-బుధుడు,శుక్రుడు, భూమి, కుజుడు.*

*ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి వీటిని టేరీస్ట్రియల్ గ్రహాలు అంటారు*

*🔹బాహ్య గ్రహాలు-గురుడు,శని, యురేనస్, నెప్ట్యూన్ లు.*

*🌷ఇవి హైడ్రోజెన్, హీలియం, సమ్మేళనంతో ఉంటుంది. వీటిని జోవియన్ గ్రహాలు అంటారు.*

*♦సౌరకుటుంబంలో ప్రస్తతం 8 గ్రహాలు ఉన్నాయి.*

*🔹నిమ్న గ్రహాలు-బుధుడు, శుక్రుడు, భూమి.*

*🔹ఉన్నత గ్రహాలు-కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻*🔵వచ్చేనెల సెట్ నోటిఫికేషన్లు*

ఆన్‌లైన్ ప్రవేశపరీక్షలు పూర్వ పదిజిల్లాల్లోనే

-స్వల్పంగా పెరుగనున్న పరీక్షఫీజులు

-సెట్స్-2018 కమిటీ సమావేశం నిర్ణయాలు

🌐 తెలంగాణ: రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరంలో తొలిసారిగా ఆన్‌లైన్లో నిర్వహించనున్న ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్ పరీక్షా కేంద్రాలను పూర్వ 10 జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తున్నామని, అందుకు సంబంధించి కన్వీనర్లు కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 

శుక్రవారం 2018 సెట్స్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. 

అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు వెలువడుతాయని పేర్కొన్నారు. 

ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో పరీక్ష ఫీజులు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయని పాపిరెడ్డి చెప్పారు. 

ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి అన్నిరకాల ప్రవేశపరీక్షల షెడ్యూల్‌తో సహా వచ్చేనెలలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని సెట్స్ సమావేశంలో చర్చించారు.

 ఈ మేరకు ప్రవేశ పరీక్షల వారీగా విడి విడిగా కమిటీ సభ్యులు సమావేశమై ప్రవేశ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను విడుదల చేయాలని సూచించారు. 

✳వచ్చే నెలలో అన్ని జూనియర్ కాలేజీలలో నమూనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

 అయితే ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వం, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో ఉచితంగా నమూనా ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారన్నారు.

 ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో పరీక్ష ఫీజులు కూడా స్వల్పంగా పెరుగుతాయని, త్వరలో విడివిడిగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

 సమావేశంలో టీఎస్‌టీఎస్ అధికారులు, టీసీఎస్ ప్రతినిధులు, ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి పలు ప్రవేశ పరీక్షల కన్వీనర్లు అధికారులు పాల్గొన్నారు.

*⛔24న ఇంటర్వ్యూలు*

హైదరాబాద్‌: కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పోస్టులకు నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఈ నెల 24న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 

*🔵మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించండి*

*వైద్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఉపాధ్యాయ సంఘాల వినతి*

🛑హైదరాబాద్‌,: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యాన్ని పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం అందించారు. గడువు గతేడాది డిసెంబర్‌ 31తో ముగిసినా పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణ యం తీసుకోలేదన్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లిన ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.
🏧🏧🏧🏧🏧🏧
💻 *ఆన్‌లైన్‌లో ఎంప్లాయిమెంట్‌ కార్డు! *

♦ *సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎంప్లాయిమెంట్‌ కార్డు కావాలంటే నిరుద్యోగులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. కూర్చున్న చోటు నుంచే ఎంప్లాయిమెంట్‌ కార్డు పొందవచ్చు. అది కూడా ఒకటి, రెండు రోజుల్లోనే. ఆన్‌లైన్‌ విధానంలో నమోదు చేసుకునేలా ఉపాధి, శిక్షణ శాఖ తాజాగా  www. employment.telangana.gov.in వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఎంప్లాయిమెంట్‌ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలంటే ఆధార్‌ నంబర్, మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీలు ఉండాలి.*

🆕🆕 *కొత్తగా నమోదు చేసుకునే నిరుద్యోగి ఫొటో, నివాస, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు కాగితంపై సంతకాన్ని సిద్ధం చేసుకోవాలి.*

🔷  *ఎంప్లాయిమెంట్‌ కార్డు రెన్యువల్, అదనపు విద్యార్హత వివరాల నమోదు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకోవచ్చు. ఇప్పటికే కార్డున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. వీళ్లు గడువులోగా తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను పోర్టల్‌ ద్వారా రెన్యువల్‌ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కార్డు పొందితే అది మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. సకాలంలో రెన్యువల్‌ చేసుకోలేకపోయిన వారికి ఆరు నెలల గ్రేస్‌ పీరియడ్‌ అదనంగా ఇస్తారు. ఈ సమయంలోనూ రెన్యువల్‌ చేసుకోకపోతే ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్ఛంజ్‌ జాబితా నుంచి అతడిని శాశ్వతంగా తొలగిస్తారు. ఎంప్లాయిమెంట్‌ కార్డు నమోదుకు ఒకరికి ఒకేసారి అవకాశం కల్పిస్తారు. నిరుద్యోగి స్థానిక జిల్లా తరఫునే దరఖాస్తు చేసుకోవాలి. 45 ఏళ్ల లోపున్న నిరుద్యోగులే అర్హులు. ఇప్పటికే ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు మరింత ఉత్తమ ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అతను పని చేస్తున్న సంస్థ నుంచి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించాలి.*

✊*పాఠశాల అంటే అందమైన భవనం కాదు -బోధించే ఉపాధ్యాయుడే.* ---రంజీవ్ ఆచార్య         
                     
రాజ్ భవన్ పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులు , తల్లిదండ్రులు, NGO ల సమక్షంలో అవమాన పరిచేలా మాట్లాడిన కలెక్టర్ వైఖరికి నిరసనగా ఈ రోజు ఆ పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టారు.దీనికి సంఘీభావంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజ్ భవన్ పాఠశాలను చేరుకొని తమ మద్దతును తెలియజేశారు.ఈ సమస్యను పరిష్కరించే దిశగా DEO గారు జరిపిన చర్చలు విఫలమైన సందర్బంలో  రేపటి నుండి జిల్లా వ్యాప్త ఉద్యమానికి సిద్దమవుతున్నట్లు తెలుసుకున్న గౌరవ విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి రంజీవ్ ఆర్ ఆచార్య గారు ఈ రోజు సాయంత్రం పాఠశాలకు చేరుకొని సుదీర్ఘంగా సమస్యల పై చర్చించారు.

(1) సోమవారం నిర్వహించే కలెక్టర్ పరీక్ష భారంగా మారిందని , రెగ్యులర్ పరీక్షలకు తోడు వీటిని నిర్వహించడం వలన ఉపాధ్యాయుల పై ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలియచేయగా కలెక్టర్ తో మాట్లాడి రద్దు చేయిస్తానని హామీ ఇచ్ఛారు.

(2) C.L , CCL వాడుకునే విషయంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరగా అత్యవసర సందర్బంలో మాత్రమే వినియోగించు కుంటూ ఈ 2 నెలలు 10 వ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కోరారు.

 (3) పాఠశాలల్లో NGO ల పాత్రను Non Academic అంశాలకు పరిమితం చేయాలని, విద్యా సంబంధ విషయాల్లో జోక్యాన్ని నివారించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

(4) చివరగా గవర్నర్ కు సమీపంలో ఉన్న పాఠశాల కావడంతో పై నుండి ఉన్న ఒత్తిడి వలన మంచి మార్కులు రావాలన్న ఉద్దేశ్యంతో ఆ విధంగా మాట్లాడి ఉంటారని కానీ అది సమర్థనీయం కాదని, కలెక్టర్ తరపున తాను క్షమాపణ కోరుతున్నానని, ఇంతటితో ఈ విషయాన్ని వదిలి విద్యార్థుల పై ద్రుష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చల పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు సంత్రుప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళనను విరమించడం జరిగింది.ఈ పోరాటం లో ధైర్యంగా నిలిచి  పాల్గొన్న రాజ్ భవన్ ఉపాధ్యాయులకు నైతిక మద్దతు తెలిపిన ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు,ఎలక్ట్రానిక్ మీడియా మరియు  పత్రికా మిత్రులకు అన్ని ఉపాధ్యాయ సంఘాల తరపున ధన్యవాదాలు.  

*ఉపాధ్యాయులను ఉపాధ్యాయసంఘాలను తక్కువ చేసి మాట్లాడేవారికి ఇది గుణపాఠం కావాలి.*

✊ *మన ఐక్యతే మన బలం.*

            🍃✊🌺
🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. "

          _*-స్వామి వివేకానంద*_

       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" బంధాలను నిలిపుకోవాలంటే బాధ్యతేరిగి మసలుకోవాలి. అభిమానిస్తున్నాం కదా అని హద్దుమీరి అత్యాశకుపోతే బంధాలు తెగిపోతాయి. "

         💦🐬🐥🐳💦
రాత పరీక్ష స్కాం: 16మంది కానిస్టేబుళ్ల అరెస్ట్, మొత్తం 97మంది

హైదరాబాద్: పోలీసు శాఖలో జరిగిన భారీ రాత పరీక్ష స్కాం వెలుగు చూసింది. 2010లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఇప్పటికే విధుల్లో ఉన్న 16మంది పోలీసులను అరెస్ట్ చేసింది.

నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో ఈ స్కాం వెలుగుచూసింది. రాత పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన సీఐడీ.. 2011లో కానిస్టేబుళ్లుగా ఎంపికై, పోస్టింగ్ తీసుకున్న 10మంది కానిస్టేబుళ్లను మొదట అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మరో ఆరుగురు కానిస్టేబుల్లను అదుపులోకి తీసుకుంది.

ఒకరికి బదులు మరొకరితో రాత పరీక్షలు రాయించినట్లు గుర్తించిన ఎస్ఎఫ్ఎల్ నివేదిక ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేపట్టి స్కాం గుట్టును రట్టు చేసింది.

సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో అక్రమాలకు పాల్పడిన 10మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 97మంది ఇలా అక్రమాలకు పాల్పడి ఉద్యోగాన్ని పొందినవారేనని సీఐడీ గుర్తించింది. ప్రస్తుతానికి 16మందిని అరెస్ట్ చేసిన సీఐడీ.. మిగితా వారిని అరెస్ట్ చేసే పనిలో పడింది. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు సమాచారం.
🏧🏧🏧🏧🏧🏧
ఎస్‌ఐ సస్పెండ్.. సీఐ, ఏసీపీకి చార్జ్‌మెమోలు

హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐని సస్పెండ్ చేయడంతో పాటు సీఐ, ఏసీపీకి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చార్జ్‌మెమోలు జారీచేశారు. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని బాధిత మహిళ ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో 2016లో ఫిర్యాదు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతూ పలువురి నుంచి డబ్బులు దండుకున్నారు. కాగా కేసు నీరుగారేవిధంగా ఎస్, సీఐ, ఏసీపీ వ్యవహరించారని ఆరోపణ. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నిందితుడు కర్మాగిల్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 1.60 లక్షలు, 5 సెల్‌ఫోన్లు, వీసా పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.

కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ శోభన్‌బాబును సస్పెండ్ చేయడంతో పాటు ఘట్‌కేసర్ సీఐ, మల్కాజిగిరి ఏసీపీకి చార్జ్‌మెమోలు జారీ చేశారు. కేసులో ఇప్పటివరకు 33 మంది బాధితులు ఉన్నారు.
🏧🏧🏧🏧🏧🏧
 ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్: 98పోస్టులకు అప్లై చేస్కోండి

హైదరాబాద్: ఐఓసీఎల్(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) 98 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 97 జూనియర్ ఆపరేటర్ పోస్టులు, ఒక జూనియర్ ఛార్జ్‌మన్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు జనవరి 20, 2018 నుంచి ఫిబ్రవరి 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఐఓసీఎల్(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్)

పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్, జూనియర్ ఛార్జ్‌మన్

ఖాళీల సంఖ్య: 98

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా.

చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2018

విద్యార్హత: జూనియర్ ఆపరేటర్‌ అభ్యర్థులు సంబంధిత ట్రేడ్స్‌లో ఐటీఐతోపాటు మేట్రిక్, జూనియర్ ఛార్జ్‌మన్ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఇనిస్ట్రూమెంటేషన్/సివిల్/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ నుంచి మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థులు 10.02.2018 వరకు 18-26ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 20.01.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 10.02.2018
🏧🏧🏧🏧🏧🏧
*✍వచ్చేనెల సెట్ నోటిఫికేషన్లు*

*👉ఆన్‌లైన్ ప్రవేశపరీక్షలు పూర్వ పదిజిల్లాల్లోనే*

*👉-స్వల్పంగా పెరుగనున్న పరీక్షఫీజులు*

*👉-సెట్స్-2018 కమిటీ సమావేశం నిర్ణయాలు*

*❇ తెలంగాణ: రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరంలో తొలిసారిగా ఆన్‌లైన్లో నిర్వహించనున్న ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్ పరీక్షా కేంద్రాలను పూర్వ 10 జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తున్నామని, అందుకు సంబంధించి కన్వీనర్లు కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.*

*❇శుక్రవారం 2018 సెట్స్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు.* 

*❇అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు వెలువడుతాయని పేర్కొన్నారు.* 

*❇ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో పరీక్ష ఫీజులు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయని పాపిరెడ్డి చెప్పారు.*

*❇ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి అన్నిరకాల ప్రవేశపరీక్షల షెడ్యూల్‌తో సహా వచ్చేనెలలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని సెట్స్ సమావేశంలో చర్చించారు.*

 *❇ఈ మేరకు ప్రవేశ పరీక్షల వారీగా విడి విడిగా కమిటీ సభ్యులు సమావేశమై ప్రవేశ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను విడుదల చేయాలని సూచించారు.*

*❇వచ్చే నెలలో అన్ని జూనియర్ కాలేజీలలో నమూనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.*

 *❇అయితే ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వం, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో ఉచితంగా నమూనా ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారన్నారు.*

 *❇ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో పరీక్ష ఫీజులు కూడా స్వల్పంగా పెరుగుతాయని, త్వరలో విడివిడిగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.*

 *❇సమావేశంలో టీఎస్‌టీఎస్ అధికారులు, టీసీఎస్ ప్రతినిధులు, ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి పలు ప్రవేశ పరీక్షల కన్వీనర్లు అధికారులు పాల్గొన్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍24న ఇంటర్వ్యూలు*

*❇హైదరాబాద్‌: కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పోస్టులకు నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఈ నెల 24న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.* 
🌿🌴☘🌱🌱🌿🌴🍀
*📚పాఠశాలల్లో విద్యార్థులకు ‘స్వచ్ఛ’ పాఠాలు!*

*🔘స్వచ్ఛ కార్యక్రమాల అవగాహనపై జీహెచ్‌ఎంసీ రూటు మార్చింది. విద్యార్థుల్లో చైతన్యం కల్పించడం ద్వారా వారి తల్లిదండ్రులు, ఇరుగు, పొరుగు వారిలో మార్పు తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో స్వచ్ఛ పాఠాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. గ్రేటర్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో స్వచ్ఛ కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రార్థనా సమయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఉద్యోగులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 20 శాతం పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయని కమిషనర్‌ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. తరగతుల వారీగా నియమిస్తోన్న కమిటీలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితోపాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రతినెలా కమిటీలోని అధ్యక్షులు, సభ్యులు మారుతారు. ఇళ్లలో తడి, పొడి చెత్త వేరు చేసేలా తల్లిదండ్రులు, పొరుగున ఉన్న వారిని మార్చాల్సిన బాధ్యత విద్యార్థులకు అప్పగిస్తారు.*
🏧🏧🏧🏧🏧🏧
*💰సైనిక సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగుల ఒకరోజు మూలవేతనం విరాళం*

*❇సైనిక సంక్షేమ నిధికి రాష్ట్రంలోని 3.65 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనర్లు తమ ఒక రోజు మూలవేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఐకాస నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, దేవీప్రసాద్‌, కారెం రవీందర్‌రెడ్డి, మమత, సత్యనారాయణ, రాజేందర్‌లు శుక్రవారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి వేతన విరాళ పత్రం అందజేశారు. ఫిబ్రవరి 1న చెల్లించే వేతనం నుంచి ఈ విరాళాన్ని మినహాయించి, సైనిక సంక్షేమనిధిలో జమ చేయాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తనను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. మంత్రులు రూ.25 వేలు, ఎమ్మెల్యేలు రూ.10 వేల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించారని హరీశ్‌రావు తెలిపారు. మొత్తంగా రూ.50 కోట్ల మేరకు సంక్షేమ నిధికి జమ అవుతాయన్నారు.*

No comments:

Post a Comment