AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 7 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 23 2018

📖 *చరిత్రలో ఈ రోజు*
👉 *మంగళవారం, 23.01.18*
👉  *సంవత్సరములో 23వ రోజు - 4వ  వారం*
👉  *ఇంకా 342 రోజులు మిగిలినవి.*

*⭕ ప్రత్యేక దినాలు* 
💥సుభాష్‌చంద్రబోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం

🌎 *సంఘటనలు*
🔹1565: తళ్లికోట యుద్ధము
🔹1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు.
🔹1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
🔹1977: 'జనసంఘ్‌', 'భారతీయ లోక్‌దళ్‌', కాంగ్రెస్‌ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి.

✅ *జననాలు*
🗺1863: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
🗺1890: హిల్డా మేరీ లాజరస్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
🗺1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ప్రముఖ తెలుగు సాహితీకారులు. (మ.1979)
🗺1897: సుభాష్ చంద్రబోస్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)
🗺1906: ముదిగొండ విశ్వనాధం, ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు. (మ.1984)
🗺1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)
🗺1915: ఆర్థర్ లూయీస్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
🗺1926: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012).

🔴 *మరణాలు*
🔺1972: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు. (జ. 1914)
🔺1978: హిల్డా మేరీ లాజరస్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890) [జననం, మరణం ఒకే తేదీ]
🔺1989 : ప్రఖ్యాత చిత్రకారుడు సాల్వడార్ డాలీ మరణం (జ.1904).
🔺2015: ఎం. ఎస్. నారాయణ, ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. (జ.1951)
🔺2016: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్‌. (జ.1937)🙏
🏧🏧🏧🏧🏧🏧🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు..
మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది. "
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" మోసపోవడం కూడా ఒక పాఠమే..!
మరోసారి మోసపోకుండా ఉండడానికి..!! "

         💦🐬🐥🐳💦
🏧🏧🏧🏧🏧🏧
*⛔ఉద్యోగులకు*
 *శుభవార్త*

*♦-పీఎఫ్ వడ్డీరేటును యథాతథంగా కొనసాగించాలని కేంద్రం యోచన*

🌻 న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలోని ఉద్యోగులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలో తీపికబురును అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును మార్చకూడదని కేంద్రం నిశ్చయించుకున్నట్లు తెలుస్తున్నది. 

🌻గత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతంగా ఉన్న వార్షిక వడ్డీ రేటును ఈ ఏడాది కూడా అలాగే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) వద్ద ఉన్న షేర్లలో అదనంగా మరో 0.15 శాతం షేర్లను కుదించడం ద్వారా పీఎఫ్ వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనాన్ని బట్టి తెలుస్తున్నది.

🌻పీఎఫ్ డిపాజిట్లపై ఈ ఏడాది కూడా 8.65 శాతం వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వం 2015 ఆగస్టు నుంచి ఈపీఎఫ్‌ఓ కొనుగోలు చేసిన షేర్లలో కొన్నింటిని అమ్మాలని యోచిస్తున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. రూ.2 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మడం ద్వారా ఈపీఎఫ్‌ఓ అదనంగా రూ.850 కోట్లను రాబట్టుకుంటుందని భావిస్తున్నామని, ఈ ఏడాది పీఎఫ్ వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించేందుకు ఈ అదనపు ఆదాయాన్ని ఉపయోగించే అవకాశం ఉందని ఆ పత్రిక పేర్కొన్నది.

🌻 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ రేటుతో పాటు షేర్ల అమ్మకానికి సంబంధించిన పద్ధతులను ఖరారు చేసేందుకు ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు వచ్చే నెలలో సమావేశం కానున్నారు.
🏧🏧🏧🏧🏧🏧
*🚩తెలంగాణకు మరో 30 ప్రయోగశాలలు*

♦విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచి వారి ఆలోచనలను పదును పెట్టుకునేలా ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌(ఏటీఎల్‌)లు తెలంగాణ రాష్ట్రానికి మరో 30 మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా రెండో విడత కింద 1500 ప్రయోగశాలల ఏర్పాటుకు నీతి ఆయోగ్‌ ఆమోదం తెలపగా రాష్ట్రానికి 30 దక్కాయి.

♦ గతంలో మొదటి విడత కింద మూడు దశల్లో రాష్ట్రానికి 29 మంజూరయ్యాయి. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలకు 2,441 ప్రయోగశాలను మంజూరు చేయగా తెలంగాణకు 59 లభించాయి. వాటిల్లో ఎక్కువగా కేంద్రీయ, జవహర్‌ నవోదయ విద్యాలయాలు, ప్రైవేట్‌ పాఠశాలలే ఉండటం గమనార్హం. ఆదర్శ పాఠశాలలు ఈ విషయంలో కొంత మెరుగ్గానే ఉన్నాయి. ఈ ప్రయోగశాల ఏర్పాటుకు అయిదు సంవత్సరాల్లో రూ.10 లక్షలు అందజేస్తారు. పాఠశాలల యాజమాన్యాలు 1500 చదరపు అడుగుల విస్తీర్ణం ప్రత్యేకంగా కేటాయించాలి. అంతర్జాల సౌకర్యం, కంప్యూటర్‌, సైన్స్‌ ప్రయోగశాల, గ్రంథాలయం తదితర సౌకర్యాలు ఉండాలి. 
🏧🏧🏧🏧🏧🏧
" #గాంధీ కాదు #బ్రిటిష్ వారిని #భారత్ నుండి వెళ్ళగొట్టింది #సుభాష్_చంద్రబోస్ "

#జనవరి_23న_నేతాజీ_సుభాష్_చంద్రబోస్_జయంతి 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనబడకుండాపోయి డెబ్భయ్యేళ్ళు దాటినా భారత ప్రజలలో ఆయన ఆచూకీ గురించి, ఆయన అదృశ్యం వెనుక దాగి ఉన్న రహస్యాల గురించిన ఉత్కంఠ ఏమాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంది. ప్రపంచ చరిత్రలోనే ఇదొక అద్భుతమైన విషయం. భారత ప్రజలు నేతాజీని అంతగా ఎందుకు ఆరాదిస్తున్నారో తెలుసుకోవాలంటే అసలు ఆ మహావీరుడు దేశానికి చేసిన మహోన్నత సేవలను తెలుసుకోవాలి. నేతాజీకి సంబంధించి రహస్యంగా ఉండిపోయిన రికార్డులు, ధ్రువపత్రాల నుండి లభ్యమౌతున్న సమాచారాన్ని బట్టి ఆయన బ్రిటిష్ సామ్రాజ్యంపై ఎంత బలమైన దాడి చేసేరో తెలుస్తుంది. ఆ వివరాలన్నీ వెలుగు చూడకపోవడం నేతాజీకి, ఆయన సహచరులకు తీరని అవమానమే. స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర నిరుపమానమైనది. 1947లో బ్రిటిష్ వారి నుండి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం నేతాజీని, ఆంగ్ల పాలకులపై ఆయన నడిపిన అద్భుత పోరాట విశేషాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. 

గమనించవలసిన విషయం ఏమిటంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉధృతంగా సాగలేదు. నేతాజీ మాత్రం రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఒక మహదవకాశంగా తీసుకున్నారు. ఇదే ఆఖరి అవకాశంగా ఒక్క ఆరు నెలలు ఉధృతంగా పోరాడినట్లయితే మనం స్వాతంత్ర్యం పొందగలమని కాంగ్రెస్ వారిని కోరారు. అయితే ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న బ్రిటిష్ అధికారులపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గాంధీగారి నాయకత్వంలోని కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయలేదు. 

కాంగ్రెస్ యొక్క వైఖరికి విసుగెత్తిపొయిన సుభాష్ చంద్రబోస్ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఉద్దేశ్యం వివిధ దేశాలలో బ్రిటిష్ వారి తరఫున పోరాడుతున్న భారతీయ సైనికులను సమీకరించి, వారితో బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడం. అలా సమీకరించిన భారతీయ సైనికులతో ఆయన "ఆజాద్ హింద్ ఫౌజ్" స్థాపించేరు. ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణంలో నేతాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. బ్రిటిష్ వారితో పోరాడటానికి సమర్థ సైనిక గణాన్ని తయారు చేసారు. 

ఒకప్రక్క బ్రిటిష్ సైన్యంతో తలబడడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ సిద్ధమౌతున్న తరుణంలోనే గాంధీజీ 1942లో "క్విట్ ఇండియా" ఉద్యమానికి పిలుపునిచ్చారు. నిజానికి ఇలాంటి ఉద్యమం కోసం 1939లోనే నేతాజీ పట్టుబట్టారు. నిజానికి గాంధీగారి క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో అవసరమైనదే అయినప్పటికీ మొదలుపెట్టిన మూడు వారాలలోనే ఆ ఉద్యమం అణగారిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకి దాని ఊసే అంటా మర్చిపోయేరు. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ అద్భుతాలే చేసారు. నిజానికి క్విట్ ఇండియా ఉద్యమం పలు ప్రాంతాలలో వ్యాపించాల్సి ఉంది. మరి ఏం జరిగింది? దీనికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్కాన్ని విందాం. 

బి.బి.సి.కి చెందిన ఫ్రాన్సిస్ వాట్సన్ కి 1955 ఫిబ్రవరిలో ఇంచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటిష్ వారు 1947లో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణాలను వివరించారు అంబేద్కర్. "ఉన్నట్టుండి హఠాత్తుగా 1947లో బ్రిటిష్ వారి నుండి మనకు అధికార మార్పిడి ఎందుకు జరిగిందో తెలియదు. బ్రిటిష్ ప్రధాని మిష్టర్ ఆట్లీ భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేందుకు అకస్మాత్తుగా ఎందుకు అంగీకరించేడో అర్థం కావటంలేదు. దీని వెనుకనున్న రహస్యం ఆయనకే తెలియాలి. బహుశా ఆయన రాయబోయే ఆత్మకథలో ఈ వివరాలు వెల్లడిస్తాడేమో?" అని అంబేద్కర్ అన్నారు. 

బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించడానికి రెండు నెలల ముందు, అంటే 1956 అక్టోబరులో క్లెమెంట్ ఆట్లీ ఒక రహస్య ప్రైవేటు ఉపన్యాసంలో అసలు విషయాన్ని బయటపెట్టాడు. వాటిని గ్రహించడానికి బాహ్య ప్రపంచానికి రెండు దశాబ్దాలకు పైనే సమయం పట్టింది. 

"కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొన్నేళ్ళు కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పాలనకు వచ్చిన ఇబ్బందీ లేదు. మరి ఏదో ఉపద్రవం ముంచుకొస్తునట్టు మీరెందుకు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు? ఇంత హడావిడిగా దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేయడానికి కారణం ఏమిటి?" అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’ ‘‘మరి గాంధీ ప్రభావం ఏమిలేదా?’’ అన్న ప్రశ్నకు ఆయన తడుముకోకుండా ‘‘చాలా తక్కువ’’ అని బదులిచ్చాడు!

సర్ ఆట్లీ వెల్లడించిన వివరాలు అంబేద్కర్ కి ఆశ్చర్యం కలిగించలేదు. ఇది ఆయన ముందే ఊహించారు. బి.బి.సి.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, "భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి లేబర్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు రెండున్నాయి" అని అన్నారు. 

అంబేద్కర్ ఇంకా ఇలా అంటారు: "దేశంలో ఏం జరిగినా, దేశంలోని నాయకులు ఎన్ని ఆందోళనలకు పిలుపునిచ్చినా సరే భారతదేశ సైన్యం మాత్రం తమ పట్ల విధేయతతోనే ఉంటుందని బ్రిటిష్ వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. అలా ప్రచారం చేస్తూనే దేశంలో తమ పాలనను కొనసాగిస్తూ వచ్చేరు. కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా నేతాజీ చేబట్టిన సైనిక కార్యకలాపాలు బ్రిటిష్ వారు విశ్వాసాన్ని పటాపంచలు చేసింది. భారతీయ సైనికులందరూ ఒక పటాలంగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసారు.” 

నేడు నేతాజీ మిస్టరీకి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మేజర్ జనరల్ జి.డి. బక్షి వెల్లడిస్తున్న వివరాలను పరిశీలిస్తే అంబేద్కర్ మాటలలోని వాస్తవం మనకు అవగతమౌతుంది. 

లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె. సిన్హా జమ్మూ-కాశ్మీర్, అస్సాం రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు. 1946లో ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ముగ్గురు అధికారులలో ఏకైక భారతీయుడు ఈయన. "ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల భారతీయ సైనికులలో గల సానుభూతి తక్కువదేమీ కాదు. 1857 సంగ్రామం లాంటిది మరొకటి జరగవచ్చునేమోనని 1946లో బ్రిటిష్ వారు భయపడ్డారు" అని 1976లో సిన్హా అభిప్రాయపడ్డారు. 

ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ సర్ నార్మన్ స్మిత్ 1945లో సమర్పించిన ఒక రహస్య నివేదిక ఇలా పేర్కొంది: "ఆజాద్ హింద్ ఫౌజ్ కారణంగా ఉత్పన్నమౌతున్న పరిస్థితులు దేశంలో దేశంలో నెలకొన్న అశాంతిని గురించి హెచ్చరిస్తున్నాయి. భారత ప్రజలలోను, సైన్యంలోనూ ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల గల సానుభూతిని ఉపేక్షించడానికి వీల్లేదు." 

భారత సైనికుల నుండి ఉత్పన్నం కాబోయే తిరుగుబాటు గురించి చర్చించడానికి బ్రిటిష్ ఎమ్.పి.లు ఆ దేశ ప్రధాని క్లెమెంట్ ఆట్లీని 1946 ఫిబ్రవరిలో కలిసారు. ఆట్లీని కలిసిన బ్రిటిష్ ఎమ్.పి.లు ఏమన్నారో తెలుసా? "ఇప్పుడు మనముందు రెండే మార్గాలున్నాయి. మొదటిది భారతదేశాన్ని వదలిపెట్టి వచ్చేయడం. రెండవది భారతీయుల మనల్ని వెళ్లగొట్టే వరకు వేచిచూడటం. రెండవ దాని గురించి ఆలోచిస్తే భారతీయ సైనికులలో మన పట్ల గల విధేయతను విశ్వసించడానికి వీల్లేని పరిస్థితి. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఇప్పుడు భారత జాతికి ఆదర్శవీరులైనారు" అని.  

బ్రిటిష్ వారితో చేసిన యుద్ధాలలో ఓడిపోయినప్పటికీ భారత్ లో ఆంగ్లేయుల పాలనకు గట్టి దెబ్బే కొట్టారు నేతాజీ. దురదృష్టవశాత్తూ భారతదేశానికి నేతాజీ అత్యవసరమైన సమయంలో ఆయన అదృశ్యమైపోయారు. 

మన ముందుతరాల వారి కంటే మనకే నేతాజీ అదృశ్యం వెనుక దాగిన విషయాలు ఎక్కువగా తెలుస్తున్నాయి. మనం నేడు ఇష్టారాజ్యంగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. నేతలెందరున్నా నేతాజీ ఒక్కడే! జయంతులే తప్ప వర్థంతులు లేని ఆ మహానీయునకు మనమే ఎంతో ఋణపడి ఉన్నాం. మన జాతికి, మన దేశాన్నేలే పాలకులకు కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి,

 పూజించవలసింది ఆయననే.
🏧🏧🏧🏧🏧🏧
*నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *23--01--2018* 
*మంగళ వారము*

*********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *భౌతికశాస్త్రం*

*విషయం:-* *ఎలక్ట్రాన్ విన్యాసము-నియమాలు*

*సమయం*:- *10.30 ని,,ల నుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *గణితం*

*విషయం*:-  *జామెట్రికల్ కన్సస్ట్రక్షన్ -I*

*సమయం*:- *11.30ని,,

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *హిందీ*

*విషయం*:- *అనమోల్ రత్న - II*

*సమయం*:- *2.00pm

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:- *ఇంగ్లీష్*

*విషయం*:- *ద వండర్ ఫుల్ వరల్డ్—3*           (ఫేస్ షీట్)

*సమయం*:- *2.45 pm 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*:  *సాంఘీకశాస్త్రం*

*విషయం*:- *దేవుని యందు భక్తి, ప్రేమ - I*

*సమయం*:- *3.40 pm

          ★★★★★★★
_*శుభోదయం*_    
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. "

          _*-స్వామి వివేకానంద*_
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" బంధాలను నిలిపుకోవాలంటే బాధ్యతేరిగి మసలుకోవాలి. అభిమానిస్తున్నాం కదా అని హద్దుమీరి అత్యాశకుపోతే బంధాలు తెగిపోతాయి. "
🏧🏧🏧🏧🏧🏧*🍁💦మీ స‌ర్వీసు కాలాన్ని బ‌ట్టి ఎంత గ్రాట్యుటీ వ‌స్తుందో లెక్కించండి💦🍁*
___________________________________

అటు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇటు ప్రైవేట్ సంస్థ‌ల్లో ప‌నిచేసేవారు గ్రాట్యూటీ అందుకుంటారు. దీన్ని ఎలా లెక్కించి ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రాట్యుటీపై చెల్లించాల్సిన ప‌న్నుపై కూడా అవ‌గాహ‌న పెంచుకుందాం...

గ్రాట్యుటీపై ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని రూ.10ల‌క్ష‌ల నుంచి రూ.20ల‌క్ష‌లకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకుంది. పార్ల‌మెంటులో ఆమోదం పొందాక ఇది అమ‌లులోనికి వ‌స్తుంది. ఒకే సంస్థ‌లో ఎన్నో ఏళ్లుగా ప‌నిచేసేవారికి ఈ నిర్ణ‌యం పెద్ద ఊర‌ట‌ను క‌లిగించ‌నుంది.

చాలా మంది ఉద్యోగుల‌కు గ్రాట్యుటీపైన స‌రైన అవ‌గాహ‌న లేద‌నే చెప్పాలి. ఉద్యోగంలో చేరే ముందు సంస్థ‌ హామీ ఇచ్చిన విధంగా మొత్తం జీతం చేతికంద‌దు. ప్రావిడెంట్ ఫండ్‌, గ్రాట్యుటీ లాంటి కోత‌లుంటాయి. ఈ నేప‌థ్యంలో గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ప‌న్ను లెక్కింపు ఎలా అన్న విష‌యాల‌ను వివ‌రంగా తెలుసుకుందాం…

*💧గ్రాట్యుటీ అంటే ఏమిటి?*

ఒక సంస్థ‌లో 10 కంటే ఎక్కువ మంది ప‌నిచేసేటట్ట‌యితే ఆ సంస్థ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చ‌ట్టం, 1972 ప్ర‌కారం ఉద్యోగుల‌కు కొంత సొమ్ము రూపంలో ఇచ్చే ప్ర‌యోజ‌నాన్నే గ్రాట్యుటీ అంటారు.

*💧5ఏళ్ల పాటు ప‌నిచేసి ఉండాలి*

గ్రాట్యుటీ చెల్లింపుల‌ చ‌ట్టం ప్ర‌కారం … 5ఏళ్ల‌పాటు ఒకే సంస్థ‌లో ఉద్యోగి ప‌నిచేసి ఉండాలి. పని చేసిన ప్ర‌తి సంవ‌త్స‌రానికి 15 రోజుల వేత‌నానికి స‌మాన‌మైన సొమ్మును ఇవ్వాలి. వేత‌నం అంటే ఇక్క‌డ బేసిక్ శాల‌రీ, డీఏ, క‌మిష‌న్‌ క‌లిపుకొని.

*పూర్తి సంవ‌త్స‌రంగా లెక్కింపు*

అంతేకాకుండా గ‌డ‌చిన సంవ‌త్స‌రం ఉద్యోగి 6 నెల‌ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేస్తే … గ్రాట్యుటీ చెల్లింపుల కోసం పూర్తి సంవ‌త్స‌రం ప‌నిచేసినట్టుగా లెక్కిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి 7ఏళ్లు 6నెల‌లు ప‌నిచేశాడ‌నుకుందాం. ఆ వ్య‌క్తికి 8 ఏళ్లకు స‌మాన‌మైన‌ గ్రాట్యుటీని చెల్లిస్తారు.

*💧15 రోజుల వేత‌నం*

గ్రాట్యుటీ చెల్లింపులను లెక్కించేందుకు, ఒక నెల‌లో పని దినాల‌ను 26రోజులుగా చూస్తారు. కాబ‌ట్టి 15 రోజుల‌కు స‌మాన‌మైన వేత‌నాన్ని … (నెల వేత‌నం * 15)/26 గా లెక్కిస్తారు. ఇలా వ‌చ్చిన సంఖ్య‌ను ఎన్నేళ్ల స‌ర్వీసు ఉంటే అన్నేళ్ల‌కు లెక్కివేసి గ్రాట్యుటీని చెల్లిస్తారు.

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేట‌ప్పుడూ ఇదే లెక్క‌ను అనుస‌రించి గ్రాట్యుటీ చెల్లింపు చేస్తారు.

*💧స‌ర్వీసులో ఉండ‌గా గ‌తించిన‌ట్ట‌యితే…*

ఒక‌వేళ ఉద్యోగి స‌ర్వీసులో ఉండ‌గా మ‌ర‌ణిస్తే… అయిదేళ్ల క‌నీస ప‌రిమితి వ‌ర్తించ‌దు. గ్రాట్యుటీ ప్ర‌యోజ‌నాన్ని నామినీ లేదా చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సుల‌కు అంద‌జేస్తారు. ఉద్యోగి చివ‌ర ప‌నిచేసిన రోజు మొద‌లుకొని 30రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లింపుల‌న్నీ జ‌రిగిపోవాలని చ‌ట్టం చెబుతోంది. అలా చేయ‌ని ప‌క్షంలో అద‌నంగా వ‌డ్డీ చెల్లించాల‌ని చ‌ట్టంలోని నిబంధ‌న‌లు చెబుతున్నాయి.

*💧సంస్థ‌లు ఎలా చెల్లిస్తాయి?*

సంస్థ‌లు గ్రాట్యుటీని త‌మ సొంత నిధుల నుంచి లేదా సామూహిక గ్రాట్యుటీ ప‌థ‌కం ద్వారా చెల్లిస్తుంటాయి. గ్రాట్యుటీ కోసం కేటాయించిన నిధుల‌ను ఏదైనా బీమా సంస్థ వ‌ద్ద ఉంచుతారు. బీమా సంస్థ‌లు గ్రాట్యుటీ నిధిని పెట్టుబ‌డిగా పెట్టి వాటిపై రాబ‌డులు వ‌చ్చేలా చూసుకుంటాయి. మార్కెట్ రిస్క్ త‌గ్గించుకునేందుకు సాధార‌ణంగా ఈ నిధుల‌ను డెట్ లేదా స్థిర ఆదాయాన్నిచ్చే ప‌థ‌కాల్లోనే పెట్టుబ‌డి పెడ‌తారు.

*💧గ్రాట్యుటీపై ప‌న్ను వ‌ర్తింపు*

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం … గ్రాట్యుటీని ‘Income From Salary’ విభాగంలోనికి చేర్చారు. ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్‌, 1961 ప్ర‌కారం సెక్ష‌న్ 10(10) కింద గ్రాట్యుటీ ద్వారా అందే సొమ్ముపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

*💧ఈ సంద‌ర్భాల్లో పూర్తి మిన‌హాయింపు*

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, స్థానిక ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌లోని ఉద్యోగుల‌కు గ్రాట్యుటీపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అదే విధంగా గ్రాట్యుటీ సొమ్మును ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత అందుకున్నా లేదా స‌ర్వీసులో ఉండ‌గా ఉద్యోగి మ‌ర‌ణించిన‌ట్ట‌యితే పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.
ప్ర‌స్తుత చ‌ట్టం ప్ర‌కారం … రూ.10ల‌క్ష‌ల దాకా అందుకునే గ్రాట్యుటీ సొమ్ముపై ప‌న్ను మిన‌హాయింపు ఉంది.

*💧ఇత‌ర ఆదాయ వ‌న‌రుల విభాగంలోనికి…*

ఉద్యోగి మ‌ర‌ణించినప్పుడు నామినీకి లేదా చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సుల‌కు అందించే గ్రాట్యుటీ పైన ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే నామినీగా ఆ ప్ర‌యోజ‌నాన్ని అందుకునేవారు మాత్రం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ఇత‌ర ఆదాయ వ‌న‌రుల విభాగం కిందికి వ‌స్తుంది
🏧🏧🏧🏧🏧🏧
*🌻సందేహాలు -- సమాధానాలు🌻*
____________________________________

🌷ప్రశ్న:
నేను SGTగా చేస్తున్నాను.నేను MEO అనుమతి తో 30 రోజులు హాఫ్ పే లీవ్ ఉపయోగించుకొని B.Ed పూర్తి చేశాను.నా B.Ed చెల్లుబాటు అవుతుందా??

*🌹జవాబు:*
*సరైన పద్ధతి కాదు.DEO అనుమతి లేకుండా రెగ్యులర్ కోర్సు చదవటం రూల్స్ కి విరుద్ధం. ఇప్పటికైనా DEO గారికి దరఖాస్తు చేసి ఆ పీరియడ్కు సెలవు మంజూరు చేఇ0చుకుంటే మీ B.Ed చెల్లుబాటు అవుతుంది.*
_____

🌷ప్రశ్న:
పిఈటీ,క్రాఫ్ట్,డ్రాయింగ్,పండిట్ పోస్టుల్లో పనిచేస్తున్న టీచర్లు కి LFL HM పదోన్నతి పొందే అవకాశం ఉందా??

*🌹జవాబు:*
*జీఓ.11/12 ; తేదీ:23.1.2009 ప్రకారం కేవలం sgt లకి మాత్రమే LFL HM గా పదోన్నతి పొందే అవకాశం ఉంది.*
_____

🌷ప్రశ్న:
సరెండర్ లీవ్ జీతంపై ఐఆర్ వస్తుందా??

*🌹జవాబు:*
*రాదు.*
_____

🌷ప్రశ్న:
నేను మున్సిపాలిటీ లో SGT ను.నేను 1 ఇయర్ పాటు జీత నష్టం సెలవు పెట్టాలని అనుకుంటున్నాను.మంజూరు చేసే అధికారం ఎవరికి ఉంటుంది??

*🌹జవాబు:*
*మున్సిపాలిటీ టీచర్ల కి నియామకపు అధికారి కమీషనర్ కనుక 1 ఇయర్ EOL మంజూరు చేసే అధికారం కూడా కమీషనర్ కే ఉంటుంది.*
_____

🌷ప్రశ్న:
HM సెలవు పై వెళ్లే సందర్భంలో ఇన్చార్జి భాద్యతలు ఎవరికి ఎలా ఇవ్వాలి.

*🌹జవాబు:*
*Rc. No.2409 ; తేదీ:27.1.2005 ప్రకారం HM సెలవు పెట్టే సందర్భంలో సీనియర్ మోస్ట్ కి భాద్యతలు అప్పగించాలి. ఇన్ ఛార్జ్ ఇచ్చిన విషయం స్టాఫ్ ఆర్డర్ లో రాసి సంబంధిత టీచర్ ఆమోదం తీసుకోవాలి.సదరు విషయం సెలవు మంజూరు అధికారికి తెలియపరచాలి.*
🏧🏧🏧🏧🏧🏧
*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  23, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(నిన్న సాయంత్రం 4 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 35 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాభద్ర
(నిన్న ఉదయం 7 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 6 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : తైతిల
వర్జ్యం :
(ఈరోజు రాత్రి 8 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 56 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 9 గం॥ 4 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 49 ని॥ వరకు)(రాత్రి 11 గం॥ 10 ని॥ నుంచి రాత్రి 11 గం॥ 55 ని॥ వరకు)
రాహుకాలం :
(సాయంత్రం 3 గం॥ 16 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 40 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 12 గం॥ 27 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మీనము
🏧🏧🏧🏧🏧🏧             *✍🏼 నేటి నీతి కథ ✍🏼*

*🐺🦁నక్కా, సింహం, జింక🦌*

అనగనగా ఒక అడవిలో ఒక నక్క వుండేది. ఒక రోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క.

ఆ సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. “రాజన్! మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక వుంది!” అని నక్క అంది.

సింహం నక్కతో బయలుదేరింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి యెక్కి దాక్కుంది. నక్కా, సింహం అక్కడికి వచ్చే సరికి వాటికి యేమి కనిపించలేదు.

సింహం ఆ నక్కను కోపంగా చూసి, “నన్నే ఆటపట్టించాలనుకున్నావా! జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే!” అని ఆ నక్కను తినేసింది.

*దుష్టులెప్పుడైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు.*
🏧🏧🏧🏧🏧🏧
*📖 మన ఇతిహాసాలు 📓*

*సనకసనందాదులు*

సనకసనందాదులు లేదా సనత్ కుమారులు బ్రహ్మ మానస పుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు. ధర్మప్రజాపతి పుత్రులు. వీరితల్లి హింస. సనకసనందాదులు, సప్తర్షులు, పదునాలుగు మనువులు నా సంకల్పం వలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు అని కృష్ణుడు అంటాడు. సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సు చేస్తూ కాలం గడిపారు. బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు.

భాగవత పురాణం 12 మంది మహా భక్తులు పేర్కొనబడ్డారు. వీరు జీవన్ముక్తులైనా విష్ణువు భక్తులై దేశ సంచారులుగా భగత్సేవచేస్తూ జీవిస్తారు. అందరిలోకి పెద్దవారైనా సనత్ కుమారులు చిన్నపిల్లలుగా సంచరిస్తుంటారు. వీరు హిందూ పురాణాలో విశిష్టమైన పాత్ర పోషించారు.

ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనకసనందాదులు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు.

*కృతయుగములో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు*

*త్రేతాయుగములో రావణాసురుడు, కుంభకర్ణుడు*

*ద్వాపరయుగములో మందు శిశుపాలుడు, దంతవక్ర్తుడు*
🏧🏧🏧🏧🏧🏧
*✅ తెలుసుకుందాం ✅*

*⭕జ్ఞాన దంతం ఎందుకు వస్తుంది?*

✳మనిషి జ్ఞానానికి దంతానికి అసలు సంబంధమే లేదు . మరి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలయదు . మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి , కింది , పై దవడల్లో కుడి వైపు 8 , ఎడమ వైపు 8 దంతాలు అమరి ఉంటాయి . ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు(incissors) పళ్ళు , ఒక కోరపన్ను(canine tooth) , 2 అగ్రచర్వనాలు(premolars) , 3 చర్వనాలు(Molars) ఉంటాయి . వీటిలో అన్నిటికన్నా లోపల వుండే మూడవ చర్వనాన్ని (3 rd molar) జ్ఞాన దంతము గా పిలుస్తారు . 

ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లు తో ఉండేది ... కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి , లోపలి చర్వనానికి స్థానం ఇరుకైనది . ఈ దంతం సాధారణం గా 15 నుండి 25 ఏళ్ళ మధ్య వస్తుంది . ఇరుకు దవడ లో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగు తుంది . 

అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యా లో మార్పోచ్చి అసలు జ్ఞాన దంటాలే ఏర్పడకపోవచ్చునన్నది ఊహ. బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది , ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు .
🏧🏧🏧🏧🏧🏧
*🤘 నేటి సుభాషితం🤘*

*దురదృష్టమని బాధకు అదృష్టంపై ఆశ పెట్టుకోకు కష్టాన్ని నమ్ముకొని పైకి ఎదుగు*

        *💎 నేటి ఆణిముత్యం 💎*

ఉడుముండదె నూరేండ్లును

బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌

మడుపునఁ గొక్కెర యుండదె

కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

*తాత్పర్యం:*

ఉడుము నూరేళ్లు, పాము పది వందలఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటిజీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితంఅలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.

ఈ సృష్టి లో ఎన్నో రకాల జీవులున్నాయి. ఈ సృష్టిలో ప్రతీ జీవికి, ప్రతీ వస్తువుకీ ఏదో ఒక అర్ధం ఉంటుంది తప్పకుండా..

నిజం చెప్పాలంటే ప్రాణులన్నీ కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలి. అప్పుడే ఈ సృష్టి సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అంటే బ్యాక్టీరియా లాంటి జీవులు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది degrade అవ్వదు. అలాగే శాఖాహారులు, మాంసాహారులు అయిన ఎన్నో జీవులు దేని జీవన విధానం అది పాటించడం వల్లనే ఈ జీవన చక్రంఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ...ఇంక మనిషి విషయానికి వస్తే, ఈ జీవ పరిణామ క్రమంలో ఎదిగిన అన్నీ జీవుల్లోకీ ఉన్నతమైన, తెలివైన ప్రాణి మానవుడే. అందుకే మనం మిగతా అన్ని జీవుల్ని మచ్చిక చేసుకోడమే కాకుండా ఎన్నోరకాలుగా exploit కూడా చేస్తున్నాము. అన్ని జీవులకంటే బాగా అభివృద్ధి చెందిన మెదడు మనిషికి మాత్రమే ఉంది. ఆలోచనా శక్తి, మంచి చెడు తెలుసుకోగలిగే విచక్షణా జ్ఞానం, మన భావాలని ఒక భాషలో వ్యక్తపరచగలిగే మనకి మాత్రమే సొంతం.కానీ...వాటిని మనం ఎంత వరకు ఉపయోగిస్తున్నాం? అన్నదే ఈ పద్యం లో నీతి.

ఉడుము నూరేళ్ళు, పాములు పది వందల ఏళ్ళు బతుకుతాయి అంటున్నారు. మీకు తెలుసో లేదో...ఉడుము అనే జీవి నిజంగానే అన్నేళ్ళు బతుకుతుంది. ఈ ఉడుము గురించి ఇంకో చిత్రం కూడా ఉంది. ఈ సృష్టిలో ఈ జీవి గొప్పతనం దానికే ఉంటుందని ఇందాకే అనుకున్నాం కదా... ఇంతలోనే మంచి ఉదాహరణ కూడా దొరికింది. అదీ ఈ ఉడుము తన కాళ్ళతో ఏదయినా పట్టుకుందంటే దాన్ని విడిపించడం ఎవ్వరి తరమూ కాదు. అందయూక్ మన వాళ్లు ఏదయినా గట్టిగా పట్టుబడితే ఉడుము పట్టు అంటూ ఉంటారు. నేనెక్కడో చదివాను చిన్నప్పుడు...అది ఏంటంటే మన ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా..యుక్తికీ, శక్తికీ, ధైర్యసాహసాలకి మారు పేరు అయిన శివాజీ ఏదో రాజ్యం కోట ఎక్కడం కోసం ఉడుముని పైన గోడ మీద వేసి దాని పట్టుని సహాయంగా తీసుకుని పైకి ఎగబ్రాకాడట. నిజంగా ఈ సంగతి నేను చదివాను ఎప్పుడో స్కూల్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ పద్యం చూసి నాకు గుర్తొచ్చింది. నిజమే అయ్యి ఉండచ్చు..మరి ఉడుము పట్టు అలాంటిది కదా..!

ఇంకో సంగతీ...పాములు పది వందలేళ్ళు బ్రతుకుతాయని ఊరికే మాటవరసకి అన్నట్టున్నారు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పాములు బ్రతకవు. కానీ, పాములకు దగ్గర జాతి అయిన తాబేళ్లు మాత్రం చాలా ఏళ్ళు జీవిస్తాయి. అంటే..100 ఏళ్ళ పైన..అన్నీ జీవుల్లోకెల్లా ఎక్కువ బ్రతకగలిగే జంతువు ఇదే అనుకుంటా....

ఇవన్నీ సరే గానీ...ఈ పద్యంలో చెప్పదలుచుకున్న ఉపదేశం ఏంటంటే... ఎన్నో జీవులు ఎన్నో ఏళ్ళు బతుకుతూనే ఉంటాయి. కానీ, మనిషికి మాత్రమే ధర్మార్ధకామమోక్షాలను తెలుసుకునే అవకాశం ఉంది. అందుకే మనిషి జన్మ ఎత్తినందుకు సార్ధకత్వం ఉండాలి అంటున్నారు. ఏమో మరి...మనం ఎంతవరకు సార్ధకత్వం చేసుకోగలమో...
🏧🏧🏧🏧🏧🏧
*👬 నేటి చిన్నారి గీతం 👬*

*ఏదో ఏదో చూడాలి*

ఏదో ఏదో చూడాలి 
ఏదేదో మాటాడాలి
చక్కని పల్లెలు చూడాలి 
రైతులతో మాటాడాలి 
పచ్చని పైరులు చూడాలి 
పొలాలతో మాటాడాలి
ఎత్తగు కొండలు చూడాలి
బండలతో మాటాడాలి 
లోతగు కోనలు చూడాలి 
సరసులతో మాటాడాలి
చిక్కని అడవులు చూడాలి 
తరువులతో మాటాడాలి 
వంపుల దారులు చూడాలి 
మృగాలతో మాటాడాలి
అన్నిటినీ చూడాలి 
అందరితో మాటాడాలి...
🏧🏧🏧🏧🏧🏧
*✍ఇగ్నోలో కోర్సులకు  ఫీరియింబర్స్‌మెంట్‌*

*❇ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం) 2018 విద్యాసంవత్సరానికి  దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజును రీయింబర్స్‌ చేయనున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ రకాల సర్టిఫికేట్‌ కోర్సులు, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ ప్రొగ్రాంలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీరీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేది జనవరి 31. అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.*

*❇ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రం ఫీజును ముందుగా చెల్లించాలనీ, ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తరువాత వారి ఫీజును తిరిగి చెల్లిస్తామని ఇగ్నో అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌నుంచి అప్లికేషన్‌ ఫాంను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తుతో పాటు కులధ్రువీకరణ పత్రాలను జత చేసి పంపాలి. మిగతా వివరాలకు www.ignou.ac.in ను సంప్రదించవచ్చు.*
🏧🏧🏧🏧🏧🏧
*💥కొత్త టెక్నాలజీతో మేడారం జాతరలో బందోబస్తు*

*💥ఆదివాసీ మహాజాతర హైటెక్ హంగులు అద్దుకుంటున్నది. కోటిమందికిపైగా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు పోటెత్తనుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. క్రౌడ్ కౌంటింగ్, క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలతోపాటు, తప్పిపోయినవారి వివరాలను ఫొటోలతో తెలిపేందుకు వీఎంఎస్ బోర్డులను పోలీసులు జాతరలో ఏర్పాటుచేస్తున్నారు. గగనతల వీక్షణకు డ్రోన్ కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు యాప్‌లు, వెబ్‌సైట్లు సిద్ధం చేశారు. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.*

*💥క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు*

♦ఎక్కడైనా భక్తులు పెద్దసంఖ్యలో గుమిగూడినా, నిలిచిపోయినా క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు గుర్తించి కంట్రోల్‌రూమ్ ద్వారా సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని పంపించివేస్తారు. కోటిమందికిపైగా జనసమూహం 10నుంచి 15కిలోమీటర్ల అతి చిన్న ప్రదేశంలోకి వస్తుండటంతో.. అక్కడ ఏ ఒక్క నిమిషం అంతరాయం ఏర్పడినా సరిచేయడానికి పోలీసులకు తలకుమించిన సమస్య అవుతుంది. అందుకే క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు అటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. ఎక్కడైనా వెయ్యిమంది నిలిచినట్లు కెమెరా గుర్తించగానే ఆ ప్రదేశం వివరాల్ని కంట్రోల్‌రూమ్‌కు చేరవేస్తుంది. దీంతో అక్కడి అధికారులు సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు. వారు అక్కడికి చేరుకుని వారిని అక్కడినుంచి ముందుకునడిపిస్తారు. వెనుకాల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు.

*💥డ్రోన్ కెమెరాలు* 

♦సమ్మక్క సారలమ్మ జాతర జరిగే నాలుగు రోజుల్లో మేడారానికి కోటిమందికిపైగా భక్తులు రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. మేడారం అటవీప్రాంతంలో ఉండటంతో భక్తుల తాకిడికి తొక్కిసలాట జరుగకుండా, వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోకుండా 4 డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. జాతరకు ముందునుంచే భక్తులు రోజూ పెద్దసంఖ్యలో వస్తుండటంతో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్నారు. 

*💥వీఎంఎస్*

♦మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్రధానంగా భయాందోళనలకు గురయ్యేది పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనని.. కోటిమంది భక్తులు వస్తుండటంతో తమవారు ఎక్కడ తప్పిపోతారోనని తల్లిదండ్రులు భయపడుతుంటారు. కానీ, ఈసారి ఆ ఆందోళనలు తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. వీఎంఎస్ బోర్డులు జాతరలో 10 వరకు ఏర్పాటుచేయనున్నారు. ఇందులో తప్పిపోయిన వారి ఫొటోలను ప్రదర్శిస్తూ.. వారి సంబంధీకుల వివరాలు ప్రదర్శించడంతోపాటు మైక్‌లో అనౌన్స్ చేయనున్నారు. దీంతో భక్తులకు అవసరమైన సూచనలు, ట్రాఫిక్ అంశాలు వెల్లడించనున్నారు. 

*💥క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలు* 

♦జాతరలో అమ్మవారి గద్దెల ప్రాంగణంలో తొక్కిసలాటకు తావులేకుండా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఆరు క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి గద్దెల వద్దకు భక్తులు వెళ్లేసమయంలో వాళ్లను లెక్కించి.. కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. నిర్దేశిత సమయంలోగా వాళ్లు బయటకు వెళ్లారా లేదా..? అన్నది ఎగ్జిట్‌లో ఉన్న కెమెరాలు పరిశీలిస్తాయి. ఉదాహరణకు గద్దెల ప్రాంగణంలో సుమారు రెండువేల మంది భక్తులు ఉండేందుకు అవకాశం ఉంటే.. వారికి తల్లుల దర్శనానికి 20 నిమిషాలు పడుతుందని అనుకుంటే, ఆ సమయంలోగా వాళ్లు బయటకురాకపోతే కంట్రోల్‌రూమ్‌లోని పోలీసు సిబ్బందిని ఎగ్జిట్ గేట్‌లోనున్న కెమెరాలు అలర్ట్ చేస్తాయి. దీంతో అక్కడినుంచి గద్దెల వద్దనున్న సిబ్బందికి సమాచారం అందుతుంది. వాళ్లు త్వరగా భక్తులను బయటకు పంపేందుకు అప్రమత్తం అవుతారు. 

*💥హెలికాప్టర్ సేవలు* 

♦మేడారం జాతరకు గతంలోనే హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈసారి యాప్ రూపంలో బుకింగ్‌కు రెవెన్యూ శాఖ అవకాశం కల్పించింది. హైదరాబాద్‌నుంచి ఒక్కొక్కరికీ రూ.12,999 చార్జీ వసూలు చేస్తుండగా, మేడారంనుంచి జాతర పరిసరాల్ని వీక్షించేందుకు ఒక్కొక్కరికీ రూ.2,499 వసూలు చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మేడారం యాప్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీనితోపాటు జాతరకు సంబంధించిన పూర్తి రూట్‌మ్యాప్‌ను యాప్‌లో ఏర్పాటుచేశారు. జాతరలో జంపన్నవాగు ఎక్కడ ఉంది..? అక్కడినుంచి గద్దెల ప్రాంగణానికి ఎలా వెళ్లాలి..? తిరిగి బస్టాండ్ కాంప్లెక్స్‌కు ఎలా చేరుకోవాలో తెలిపే మ్యాప్‌ను ఏర్పాటుచేశారు.

*💥200 సీసీటీవీ కెమెరాలు* 

♦సమ్మక్కసారలమ్మ మహాజాతరకు పోలీసు శాఖ గద్దెలకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, జాతరలో రద్దీని గుర్తించటం, దొంగతనాల నివారణ, బందోబస్తును పర్యవేక్షించేందుకు మేడారం పరిసరాల్లో అమ్మవార్ల గద్దెల నుంచి జంపన్నవాగు, చిలుకలగుట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్, రెడ్డిగూడెం, ఇంగ్లిష్‌మీడియం, వనం రోడ్డు, గద్దెల ప్రాంగణం, మేడారం వై జంక్షన్, పోలీసు క్యాంపు ప్రాంతాల్లో ఈ కెమెరాలు అమర్చారు. వీటిని పోలీసు క్యాంపు వద్ద నిర్మించిన కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. 

*💥వజ్ర మినీ ఏసీ బస్సులు* 

♦జాతరకు వజ్ర మినీ ఏసీ బస్సులను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ నడిపించనున్నది. ఇతర బస్సులు కేవలం మేడారం వరకు మాత్రమే ఆన్‌లైన్ బుకింగ్‌లో అవకాశం ఇస్తుండగా.. రిటర్న్‌లో ఆన్‌లైన్ బుకింగ్‌కు అవకాశం కల్పించడంలేదు. కానీ, వజ్ర బస్సులకు మాత్రం ఆర్టీసీ అప్-డౌన్‌కు అవకాశం కల్పిస్తున్నది. ఇప్పటికే టీఎస్ ఆర్టీసీ వజ్ర పేరిట నిర్వహిస్తున్న యాప్ ద్వారానే ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

*💥హరిత హోటల్*

♦మేడారంలో కొత్తగా నిర్మిస్తున్న హరిత హోటల్‌లో భక్తుల కోసం ఎనిమిది కాటేజీలు ఏర్పాటుచేస్తున్నారు. అతి త్వరలో ఇవి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలను కూడా ఇంకా నిర్ణయించలేదు. తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ బార్ అండ్ రెస్టారెంట్ భవనాన్ని రూ. రెండు కోట్లతో.. ఎనిమిది కాటేజీలను రూ.మూడు కోట్లతో నిర్మిస్తున్నారు. టీఎస్‌టీడీసీ వెబ్‌సైట్‌ద్వారా కాటేజీలను బుక్ చేసుకోవచ్చు. 24నుంచి బుకింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. ఆధునిక గుడారాల బుకింగ్ సైతం ఈ వెబ్‌సైట్‌తోనే టూరిజం సిబ్బంది నిర్వహించనున్నారు.

*💥ఇంట్రానెట్*

♦జాతరకు పెద్దసంఖ్యలో పోటెత్తే భక్తుల కారణంగా ఒక్కోసారి సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి పోలీసులు సమాచారం కోసం ఇంట్రానెట్‌ను వినియోగించనున్నారు. దీని కారణంగా ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా అధికారులు, సిబ్బందితో నిరంతరం సమాచారం కొనసాగించవచ్చు.

*💥పోలీస్ యాప్* 

♦మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేక యాప్ ఏర్పాటుచేశారు. ఇందులో పార్కింగ్ అంశం భక్తులకు అత్యంత ఉపయోగకరం కానున్నది. జాతరకు వచ్చే భక్తులకు 32 పార్కింగ్ లాట్‌లను ఏర్పాటుచేశారు. ఉదాహరణకు ఇందులో ఒక పార్కింగ్‌లాట్‌లో 500 వాహనాలు నిలిపే అవకాశం ఉండగా.. అందులో ఎన్ని వాహనాలకు సరిపడా స్థలం ఉన్నది..? లేదా లాట్ నిండిందా..? అన్న అంశాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ యాప్‌లో అప్‌డేట్స్ ఉంటాయి. వాటి ఆధారంగానే వాహనాలను పోలీసులు అనుమతించడం.. వాహనదారులకు సైతం ముందుగానే ఏ పార్కింగ్ లాట్‌లో స్థలం ఖాళీగా ఉందనే సమాచారం తెలియనున్నది. ఈ యాప్ ఈ నెల 24న ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది.

*💥ఎంప్లాయీస్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్*

♦ఈ సాఫ్ట్‌వేర్ పూర్తిగా పోలీసులకు సంబంధించినదే అయినా, జాతరలో తొలిసారిగా వినియోగిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో ముందుగా మేడారంలోని జాతరను సెక్టార్లుగా విభజిస్తారు. ఏ సెక్టార్లలో ఏయే అధికారులు, సిబ్బంది పనిచేయాలో వారికి ఎస్సెమ్మెస్ రూపంలో సందేశాలు పంపిస్తారు. ఈ సందేశాలు స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్లకు వచ్చేలా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. పోలీసులకు అవసరమైన సూచనలను ఎప్పటికప్పుడు దీని సాయంతోనే అందించనున్నారు. 
🏧🏧🏧🏧🏧🏧
*పాఠశాల అసెంబ్లీ కోసం*
 *🌷సుభాషిత వాక్కు🌷*

*"ఆశించి జీవించే వ్యక్తి లో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తి లో ఆత్మీయత ఉంటుంది."*

*"Your worth consists in what you are and not in what you have."* 

*🔹మంచి పద్యం*🔹

*వేల్పులెందరినిల వేడు చున్ననుగాని*
*ఎన్ని మున్కలేయ ఏమి ఫలము*
*ఆత్మ శుద్ధి లేని ఆచారమెందుకు*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* 

*ఎంతమంది దేవుళ్ళను మ్రొక్కినా గాని, హృదయ సౌశీల్యము లేని ఆచారాలు వ్యర్ధము.*

  *♦నేటి జీ కె*♦

1) *ఇటీవల ICC ప్రకటించిన అవార్డులలో 2017సం.కి  గానూ ICC "క్రికెటర్ ఆఫ్ ద ఇయర్"  అవార్డ్ ఎవరికి లభించింది?*

A: *విరాట్ కోహ్లీ*

2) *2017 "అంధుల ప్రపంచ కప్ క్రికెట్" విజేత ఎవరు?*

A: *భారత్*

3) *"TTD బోర్డ్ చైర్మన్" గా AP ప్రభుత్వం ఎవరిని  నియమించింది?*

A: *K.రాఘవేంద్ర రావు(సినీ డైరెక్టర్)*

4) *కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్  అవార్డ్ ఎవరికి దక్కింది?*

A: *నారా లోకేష్*

5) *"మధ్యప్రదేశ్ గవర్నరు"గా ఎవరు నియమించబడ్డారు.?*

A: *ఆనంది బెన్*
🏧🏧🏧🏧🏧🏧
 Latest Updated List Of Chief Ministers And Governors Of Indian States

Updated on 03 Oct 2017

Knowing the Capitals, Chief Ministers And Governors Of Indian States would perhaps be one of the most basic things which you are expected to remember. The same for the Union Territories of India becomes even more important! These may be asked in both written exams or interviews. We have listed below the same in an easy manner to revise. Feel free to copy the information, print it, share it or even bookmark the page (press Ctrl+D) for future access. Mug it up so that you remember it even during your sleep  (In case you find some error(s) please let us know in the comments below )

State

Capital

Chief Minister

Governor

Andhra Pradesh

Hyderabad(de jure)
Amaravati (de facto)

N.Chandrababu Naidu

E.S Lakshmi Narasimhan

Arunachal Pradesh

Itanagar

Pema Khandu

Brigadier Dr BD Mishra

Assam

Dispur

Sarbananda Sonowal

Jagdish Mukhi

Bihar

Patna

Nitish Kumar 

Satya Pal Malik

Chattisgarh

Raipur

Dr. Raman Singh

Balram Dass Tandon

Goa

Panaji

Manohar Parrikar

Mridula Sinha

Gujarat

Gandhinagar

Vijay Rupani 

Om Prakash Kohli

Haryana

Chandigarh

Manohar Lal Khattar

Kaptan Singh Solanki

Himachal Pradesh

Simla, Dharamsala(Second Capital in Winter)

Virbhadra Singh

Acharya Dev Vrat

Jammu & Kashmir

Srinagar(Summer)
Jammu(Winter)

Mehbooba Mufti

Narinder Nath Vohra

Jharkhand

Ranchi

Raghubar Das

Draupadi Murmu

Karnataka

Bangalore

Siddaramaiah

Vajubhai Vala

Kerala

Thiruvananthapuram

Pinarayi Vijayan

P. Sathasivam

Madhya Pradesh

Bhopal

Shivraj Singh Chouhan

Om Prakash Kohli

Maharashtra

Mumbai

Devendra Fadnavis

Chennamaneni Vidyasagar Rao

Manipur

Imphal

N. Biren Singh

Najma Heptulla

Meghalaya

Shillong

Dr. Mukul  Sangma

Ganga Prasad

Mizoram

Aizawl

Lal Thanhawla

Nirbhay Sharma

Nagaland

Kohima

T. R. Zeliang

Padmanabha Balkrishna Acharya

Odisha

Bhubaneswar

Naveen Patnaik

S.C. Jamir

Punjab

Chandigarh

Amarinder Singh

V. P. Singh Badnore

Rajasthan

Jaipur

Vasundhara Raje

Kalyan Singh

Sikkim

Gangtok

Pawan Kumar Chamling

Shriniwas Dadasaheb Patil

Tamil Nadu

Chennai

Edappadi K. Palaniswami

Banwarilal Purohit

Telangana

Hyderabad

K Chandrasekhar Rao

E.S Lakshmi Narasimhan

Tripura

Agartala

Manik Sarkar

Tathagata Roy

Uttar Pradesh

Lucknow

Yogi Adityanath

Ram Naik

Uttarakhand

Dehradun

Trivendra Singh Rawat

Krishan Kant Paul

West Bengal

Kolkata

Mamta Benerjee

Keshari Nath Tripathi

No comments:

Post a Comment