AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 7 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 22 2018

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జనవరి 22*🌅

*🏞సంఘటనలు*🏞

1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి

1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది

1980: భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.

1992: సుభాష్‌చంద్రబోస్‌కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

*🌻🌻జననాలు*🌻🌻

1882: అయ్యదేవర కాళేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1962)

1885: మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహ.

1906: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)

1909: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)

1924: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (మ.2012)

1936: వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)

1960: జమునా రాయలు, పురుష పాత్రలను స్ర్తిలు పోషించడం, రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు.

1965: డయాన్ లేన్, అమెరికాకు చెందిన చిత్ర నటి.

*🌹🌹మరణాలు*🌹🌹

1901: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (జ.1819).

1940: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863)

1972: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)

2007: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)

2014: అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (జ.1923)

2016: పండిట్ శంకర్‌ ఘోష్‌ భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)
🏧🏧🏧🏧🏧🏧
*🤘 నేటి సుభాషితం🤘*

*అవసరానికి పనికిరాని ఆస్తులు, అవసరం తీరాక హ్యాండ్ ఇచ్చే బంధువులు ఉన్నా, లేకున్నా ఒక్కటే.*
🏧🏧🏧🏧🏧🏧
_*శుభోదయం*_    
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
నమ్మినవారిని మోసం చేయకు..
నమ్ముకున్నవారికి ద్రోహం చేయకు..!
నమ్మకం అనేది ఒక సంపద..!
పెంచుకోవాలి గాని తుంచుకో కోకూడదు..!! 
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
అనుకునేదానికన్నా మీరు వందరెట్లు బలవంతులు మిమ్మిల్ని మీరు గట్టిగా నమ్ముకొండి చాలు ఎంత పెద్ద సమస్యైనా మీకు దాసోహం కాక తప్పదు.
🏧🏧🏧🏧🏧🏧
🔲 సూక్తులు

▪నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.

▪నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు.

▪నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.

▪నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.

▪నిఘంటువులో మాత్రమే విజయం, సాధనకు ముందు వస్తుంది.
🏧🏧🏧🏧🏧🏧
*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  22, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(నిన్న సాయంత్రం 3 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 20 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 5 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : బాలవ
వర్జ్యం :
(ఈరోజు సాయంత్రం 5 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(నిన్న రాత్రి 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 12 గం॥ 49 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 4 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 49 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 8 గం॥ 13 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)
గుళికకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 15 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 11 గం॥ 2 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 26 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మీనము
🏧🏧🏧🏧🏧🏧
*💎 నేటి ఆణిముత్యం 💎*

గంగిగోవుపాలు గంటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను జాలు 
విశ్వదాభిరామ వినుర వేమ!

*తాత్పర్యం:*

మేలైన ఆవు పాలు గరిటెడైనను అవి పిల్లలకు ఆరోగ్యామును, దేవతలకు ప్రీతిని గలిగించును. గాడిద పాలు కుండెడు ఉన్నను వానికి ఈ గుణములు లేవు. గనుక నిష్ప్ర యోజనము. అట్లే భక్తి తోను, ఆదరణము తోను పెట్టిన అన్నము అన్నార్థికి తృప్తి నిచ్చును. నిరాదరణముతో బం డెడన్నము పెట్టినను అది అసహ్యమే యగును. "సంవిదాదేయమ్" అని వేదవాక్యము. నేను పెట్టుచున్నానను అహంకారముతో కాక, భగవత్ప్రీతికై పెట్టుచున్నానను భక్తి భావముతో పెట్టినది కొంచెమై నను గొప్పదే యగును.

       *👬 నేటి చిన్నారి గీతం 👬*

*🐜చిట్టి చీమ🐜*

చీమ చీమ ఓ చిట్టి చీమ 
ఎక్కడికి నీ పరుగెక్కడికి?
క్రమము తప్పక వెళ్లుచుంటివి 
క్రమ శిక్షణతో మసలు చుంటివి! 
దాన కోసము పరుగు దీస్తివి
ఐక్యత తోటి మెదులు‘ చుంటవిి! 
పుట్ట కోటను కట్టు కొంటివి' 
పాములకే నీవు స్థావరమిస్తివి!
శత్రువుల నుండి రక్షణ కొరకై 
సైన్యము వలె నీవు కావలుంటివి! 
ఆయువు నీది చిన్నదియైన
ఆపదలెన్నీ ఎదురైనష్పటికి! 
జంకక బొంకక నడుచుచురిటివి 
జనులకే ఆదర్శముగ నిలిస్తివి! 
చలి చీమలన్నీ ఏకమైననూ 
చంపవా మరి పెద్ద పామునైననూ!

*రచన :కోనం పర్సరాములు*
🏧🏧🏧🏧🏧🏧
*✍🏼 నేటి నీతి కథ ✍🏼*

*కోకిల స్వార్థం*

ఒక పర్వత ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి ఎన్నో పచ్చటి, పొడవైన పైన్‌ చెట్లతో నిండి ఉండేది. వసంతకాలం రావడంతో అడవి మరింత పచ్చగా, దట్టంగా తయారయింది.

ఒక కోకిల ఎక్కడి నుంచో వచ్చి పైన్‌ చెట్టు పైన గూడు కట్టుకుంది. అది ఉల్లాసంగా ఉన్నప్పుడల్లా తన అద్బుతమైన స్వరగానాలతో అడవినంతా హాయిగాఉంచేది.

ఆకురాలే కాలం రానే వచ్చింది. పైన్‌ చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. కోకిల ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒక రోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి, మంచి పుష్పాలు విరబూసి, ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.

అద్భుతంగా పాటలు పాడే కోకిల వెళ్ళిపోతుండటం చూసిన పైన్‌ చెట్టు, కోకిలతో "సోదరీ! ఎక్కడికెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కన్పించినంతమాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా" అని అంది.

బదులుగా కోకిల, "లేదు, లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను" అంది.

పైన్‌ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా కోకిల తన రెక్కలు విప్పి తుర్రున ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధకంటే, కోకిల వెళ్ళిపోయిందన్న బాధతోనే పైన్‌చెట్టు మరింత కుంగిపోయింది. అతి చిన్నదైన కోకిల, చాలా పెద్దదైన పైన్‌చెట్టుకు ఒక గుణపాఠం నేర్పింది.

*నీతి : స్వార్ధపరులైన స్నేహితులను ఎన్నడూ నమ్మరాదు.*
🏧🏧🏧🏧🏧🏧
*మన మహర్షులు*

*శతానంద మహర్షి*

శతానంద మహర్షి ఎవరో కాదు గౌతమ మహర్షి అహల్యలకు పుట్టిన నలుగురు కొడుకులలో పెద్దవాడు. గౌతమ మహర్షి అహల్యలు కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యము గడుపుతూ లోకంలో కరువు కాటకాలు ప్రబలినపుడు తమ తపఃశక్తితో మూడులోకాల వాళ్లకి అన్నవస్త్రాలు ఇచ్చారు. ఇలా చాలా కాలం గడచిన తరువాత గౌతముడు అహల్యని ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె స్త్రీకి  సహజంగా ఉండే కోరిక అయిన మాతృత్వాన్ని కోరుకుంది.

అహల్య కోరిక మేర గౌతముడు ఆమెను వంద వనములలో తిప్పి, వందరకాలుగా ఆనందపడేలా చేసాడు. అలా శత రకాలుగా ఆనందపడి కొడుకుని కన్నారు కాబట్టి ఆ బాలుడికి శతానందుడు అని పేరు పెట్టారు. శతానందుడు తండ్రి గౌతముని దగ్గరే సమస్త వేదశాస్త్రాది విద్యలు నేర్చుకుని బ్రహ్మచర్యాశ్రమము పాటిస్తూ మహా తపశ్శాలి అయ్యాడు. అతని బుద్ధివైభవము, జ్ఞానసంపద, తపోనిరతి విని జనక మహారాజు తన ఆస్థాన పురోహితునిగా వుండుమని ప్రార్ధించాడు. ఇది విన్న గౌతమ మహర్షి ఆనందించి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఇద్దరినీ మిథిలా నగరానికి పంపాడు. అక్కడ జనకుడు శతానండుడిని తమ కులగురువుని చేసుకున్నాడు.

తరువాతి కాలంలో గౌతముడు అహల్యను శపించటం, శ్రీరాముదు పుట్టటం, వనవాసము, యాగ రక్షణకోసం విశ్వామిత్రుని వెంట వెళ్ళటం, శతానందుని తల్లి అయిన అహల్య శాపవిమోచనము మొదలయినవి జరిగిపోయి, శ్రీరాముడు మిధిలకు వచ్చినప్పుడు, జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతం పలుకుతాడు. శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి గొప్పతనం గురించి వివరంగా చెప్తాడు.

మిథిలా నగరంలో ఏర్పాటు చేసిన సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచి సీతమ్మను పెల్లిచేసుకునే సందర్భంలోదశరథుడి వైపు వశిష్టుడు ఉంటే జనకుడి వైపు శతానందుడు ఉండి గోత్రప్రవరాలు చెప్పి సీతారామ కళ్యాణం చేయించారు.

కొంతకాలం తరువాత సతానండుడికి తన భార్య వల్ల సత్యధృతుడు అనే కొడుకు పుడతాడు. అతను పుడుతూనే చేతిలో బాణంతో పుట్టటం వల్ల అతనికి 'శరద్వంతుడు' అని పేరు వచ్చెను. అప్పటినుండే శరము అంటే బాణం వదలకుండా ఉండటం వల్ల అతని మనస్సు వేదశాస్త్రాది విద్యల వైపు కన్నా ధనుర్వేదం వైపే ఎక్కువగా మనసు పారేసుకునేవాడు. గొప్ప తపఃశక్తితో ఎన్నో అస్త్రాలు పొంది ఇంకా మరెన్నో అస్త్రాలని పొందటానికి తపస్సు చేస్తూనే ఉండేవాడు.

శతానందుని కొడుకైన శరద్వంతుడికి కృపుడు, కృప అని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. వాళ్ళని ఎక్కువ కాలం శంతనమహారాజే పెంచుతాడు. కృపుడు కూడా ధనుర్విద్యలో గొప్పవాడయ్యి కృపాచార్యుడిగా పేరు పొంది కౌరవ - పాండవులకి గురువయ్యాడు. 

ఈ విధంగా శతానంద మహర్షి తన తపఃశక్తి వల్ల మాత్రమే కాకుండా మంచి కొడుకు, మంచి మనవల్ని కూడా పొందటం వల్ల ఇంకా గొప్పవాడయ్యాడు
🏧🏧🏧🏧🏧🏧
*✅ తెలుసుకుందాం ✅*

*⭕జున్ను లో రంద్రాలు ఎలా ఏర్పడతాయి?*

✳జున్ను అంటే ఇష్టపడని వారుండరేమో ! ప్రపంచం లో 2000 రకాల జున్నులు లభిస్తున్నాయి . జున్ను తయారీ అనేది ఒక బ్యాక్టీరియా చర్య . పాలను జున్నుగా మార్చే బ్యాక్టీరియా విడుకలచేసే లాక్టిక్ ఆమ్లాన్ని తినే కొన్ని బ్యాక్తీరియాలు పాలలో ఉంటాయి . ఇవి లాక్టిక్ ఆమ్లాన్ని తిని కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తాయి . అలా విడుదలైన వాయువు బయటకు వచ్చేందుకు చేసే ప్రయాణం లో రంద్రాలు ఏర్పడతాయి . ఆ రంద్రాలు లోపల ఏర్పడిన కార్బ కార్బన్ దయాక్శైడ్ విడుదల మార్గాలు , జున్ను తయారుచేసిన ఉష్ణోగ్రత ను బట్టి ఈ రంద్రాలలో తేడా ఉంటుంది .
🏧🏧🏧🏧🏧🏧
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *♦సుభాషిత వాక్కు*

*"అదృష్టం తనంత తానుగావచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మవద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, స్వంతం చేసుకో! అదే అదృష్టం అంటే."*

*"To share your weakness is to make yourself vulnerable; to make yourself vulnerable is to show your strength."*

 *🌷మంచి పద్యం🌷*

*లక్ష్యముండినేమి లాభంబు లేదురా*
*కష్టపడక ఫలము కలుగ బోదు*
*పాటుపడుచు నుండు ఫలములు పొందగ*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* 

*లక్ష్యం ఉన్నప్పటికీ కష్టపడనిచో ఫలితం పొందలేము. కష్టపడితేనే ఫలితం లభిస్తుంది.*

*♦నేటి జీ కె*♦

*1) రంజీట్రోఫీ (క్రికెట్) విజేత ఎవరు?*

A: *విదర్భ జట్టు*

*2) "దేవధర్ ట్రోఫీ" (క్రికెట్) విజేత ఎవరు?*

A: *తమిళనాడు*

*3) "దులీప్ ట్రోఫీ" (క్రికెట్) విజేత ఎవరు?*

A: *ఇండియా రెడ్*

*4) "ఇరానీ కప్" (క్రికెట్) విజేత ఎవరు?*

A: *రెస్ట్ ఆఫ్ ఇండియా*

*5) "సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపి" (క్రికెట్) విజేత ఎవరు?*

A: *ఈస్ట్  జోన్*
🏧🏧🏧🏧🏧🏧
*​✍డిగ్రీ లెక్చరర్ల మెయిన్స్ అభ్యర్థుల జాబితా విడుదల​*

*❇హైదరాబాద్ : పలు విభాగాల పోస్టులకు సంబంధించిన మెయిన్స్ పరీక్షకు అర్హులైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్లు సహా జూనియర్ కాలేజీలోని ప్రిన్సిపాల్స్, ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ లెక్చరర్లు, స్కూళ్లలోని ప్రిన్సిపాల్స్‌కు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసినట్టు ఆదివారం ఒక ప్రకటనలో కమిషన్ కార్యదర్శి వివరించారు. ఫిబ్రవరి 19 నుంచి 24 వరకు ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. పూర్తి వివరాల కోసం తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.*
🏧🏧🏧🏧🏧🏧
*_✍ఈ నెల 28న పల్స్‌పోలియో.._*

*❇హైదరాబాద్ : పోలియో రహిత సమాజం కోసం ఈ నెల 28న జరిగే పల్స్ పోలియోకు సర్వం సిద్ధమయ్యింది. వైద్యారోగ్యశాఖ సహా ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు కార్యక్రమ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాయి. పోలియో మహామ్మారిని తరిమికొట్టేందుకు, చిన్నారులను ఈ వ్యాది భారి నుంచి కాపాడేందుకు ప్రతీ ఏటా వైద్యారోగ్యశాఖ చిన్నారులకు వ్యాక్సీన్లు వేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఈ ఏడాది జనవరి 28న సైతం రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియోను నిర్వహించనున్నారు.*

*❇ఉదయం 7 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సీన్లు వేయనున్నారు. పోలింగ్‌బూత్‌లు, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, నర్సింగ్‌హోంలు, అంగన్‌వాడీ సెంటర్లు, కమ్యూనిటీహాళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్లేస్కూళ్లు, గార్డెన్లు, పార్క్‌లు, ఫంక్షన్‌హాళ్లు, దేవాలయాలు, మజీద్, చర్చి, గురుద్వారాలు, సమావేశమందిరాల్లో చుక్కలు వేయించుకోవచ్చు. దీంతో ప్రయాణం చేసే వారి కోసం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఎగ్జిబిషన్‌లలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్‌టీంలు పిల్లలకు పోలియో చుక్కలను వేస్తాయి.*

*❇ ఒక వేళ ఆ రోజు అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సీన్ వేయించుకోలేని చిన్నారులకు వ్యాక్సీన్లు వేయనున్నారు. వీరికి జనవరి 29, 30, 31 తేదీల్లో మూడురోజుల పాటు వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీల్డ్‌సిబ్బందిని నియమించారు. వీరంతా నేరుగా ఇంటికే వచ్చి వ్యాక్సీన్‌ను వేయడానికి జిల్లా వైద్యారోగ్యశాఖ తగు ఏర్పాట్లు చేసింది.*
🏧🏧🏧🏧🏧🏧
*_✍మెడికల్‌ కాలేజీలకు అటానమస్‌: లక్ష్మారెడ్డి_*

*❇ఆదిలాబాద్‌: రాష్ట్రంలో అన్ని మెడికల్‌ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా రిమ్స్‌ ఆస్పత్రి, ఉట్నూర్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్లను ప్రారంభించారు.*

*❇వీటితోపాటు అధునాతన పరికరాలు సిటీ స్కానింగ్, డయాలసిస్‌ సెంటర్, డిజిటల్‌ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈ హెల్త్‌సెంటర్, పేయింగ్‌ రూమ్స్, పీడియాట్రిక్‌ ఐసీయూ, టెలీమెడిసిన్‌ సెంటర్లను మంత్రులు జోగు రామన్న,  ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో సింగిల్‌ ఫిల్టర్‌ ద్వారా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో 10 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
*_✍2019లో ఒకే ఇంజనీరింగ్‌ పరీక్ష!_*

*❇సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే అంశం పై చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. జేఈఈ మెయిన్‌ ద్వారానే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలతోపాటు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని సీట్ల భర్తీకీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా ఓకే పరీక్షపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొంది. మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిశా ఇప్పటికే జేఈఈ మెయిన్‌ మెరిట్‌ ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తుండగా.. తాజాగా కేరళ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు అంగీకారం తెలిపింది. మిగతా రాష్ట్రాలు త్వరలోనే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలోనే(2018–19) ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్రం గతేడాది భావించింది. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు అవసరమైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏర్పాటులో జాప్యం కావడంతో వాయిదా వేసింది. పైగా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశం కావడం, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందునా వచ్చే ఏడాదిలో అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా సేకరించే బాధ్యతను ఏఐసీటీఈకి అప్పగించింది.  దీంతో ఏఐసీటీఈ లేఖలు రాసింది.*

*👉ఎన్‌టీఏ ఆధ్వర్యంలోనే..*

*❇జాతీయ స్థాయిలో వివిధ పరీక్షలను ప్రస్తుతం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. అయితే ఇతర విద్యా కార్యక్రమాలను కూడా చూస్తున్న సీబీఎస్‌ఈకి వాటి నిర్వహణ సమస్యగా మారుతుండటంతో కేంద్రం ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది. ఎన్‌టీఏ ఏర్పాటుకు సంబంధించిన చర్యలపై కసరత్తు ప్రారంభించింది. మరోవైపు మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ వంటి పరీక్షలను 2019 నుంచి ఎన్‌టీఏ ఆధ్వర్యంలోనే నిర్వహించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది.*

*❇ఇక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను కూడా ఎన్‌టీఏ ద్వారానే నిర్వహించాలన్న ఆలోచన చేస్తోంది. దీనిపై ఐఐటీ కౌన్సిల్‌తో చర్చలు జరుపుతోంది. అయితే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాటి కోసమే జేఈఈ మెయిన్‌ను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఇక రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లను మాత్రం పలు రాష్ట్రాలు తమ సొంత ప్రవేశ పరీక్షల ద్వారానే భర్తీ చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా అదే చేస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్‌కు డిమాండ్‌ తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంసెట్‌ అవసరమే లేదన్న భావన ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ అంశమే అప్రస్తుతం అవుతుందన్న భావన నెలకొంది. అయితే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని ఏఐసీటీఈకి తెలియజేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.*
🏧🏧🏧🏧🏧🏧
*🔊చిన్న లెక్కా చేయలేరు..*

*🌀తెలుగు మినహా మిగతా బోధనాంశాల్లో అంతంత పరిజ్ఞానమే*

*▪ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో మరీ దారుణం*

*🔰జాతీయ సాధన సర్వేలో వెల్లడైన వాస్తవాలు*

*🍥సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఆశించినంత మేర లేవు.. తెలుగులో తప్ప ఇతర బోధనాంశాల్లో విద్యార్థుల ప్రగతి అంతంతమాత్రంగానే ఉంది.. ప్రాథమిక తరగతుల విషయం అటుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలు మరీ తక్కువగా ఉన్నాయి.. గణితం.. సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో విద్యార్థులు చిన్నచిన్న ప్రశ్నలకు సైతం విద్యార్థులు సమాధానాలు రాయని పరిస్థితి ఉంది.. ప్రాథమిక తరగతులకు చెందిన విద్యార్థులు మాత్రం అన్ని బోధనాంశాల్లో ఫరవాలేదనిపించారు.. ఉపాధ్యాయులు ఇకనైనా విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచే విధంగా ప్రయత్నించాలి.. అధికారులు సైతం పర్యవేక్షణ పెంచి విద్యార్థులకు చేస్తున్న బోధన ఇతర అంశాల గురించి పరిశీలించాల్సిన అవసరం ఉంది.. జాతీయ సాధన సర్వే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోధనలో మార్పు రావాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది.*

*🌸అయిదో తరగతి గణితంలో ఒక వస్తువు కొలతకు ప్రమాణాలు రాయమంటే కూడా 60 శాతం మంది విద్యార్థులు రాయలేకపోయారు.* 

*⬛జామితీయ ఆకారాల చుట్టు కొలతలు, వైశాల్యాలను సైతం 53 శాతం మంది విద్యార్థులు వివరించలేకపోయారు*

*❇అయిదో తరగతి పర్యావరణ శాస్త్రంలో వివిధ జంతువుల ప్రత్యేక లక్షణాలు, స్పందన, చూపు, వినికిడి వంటి అంశాలకు సంబంధించిన సమాధానాలు విద్యార్థులు బాగా రాశారు.*

*💠సమూహ వస్తువులు, కృత్యాలకు సంబంధించిన ధర్మాలు, రంగులు, రుచి, ధ్వనులు వంటి అంశాలను గురించి విద్యార్థులు రాయలేకపోయారు.*

*♦3వ తరగతి గణితంలో పొడువు, దూరాన్ని సెం.మీ ఆధారంగా అంచనా వేయడంతోపాటు ప్రమాణాల మధ్య సంబంధాన్ని 57 శాతం మంది విద్యార్థులు వివరించలేకపోయారు.*

*🌀3వ తరగతి పర్యావరణ శాస్త్రంలో విద్యార్థులకు గ్రామీణ, ఇండోర్‌, అవుట్‌డోర్‌ ఆటల గురించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు 60 శాతం మంది రాయలేకపోయారు.* 

*🔊కుటుంబసభ్యుల మధ్య సంబంధాలను గురించి సరైన సమాధానాలు 48 శాతం మంది విద్యార్థులు రాయలేకపోయారు.*

*📋✒ఎనిమిదో తరగతి సర్వేలో విద్యార్థుల అధ్యయన స్థాయిలు ఇవీ..*

*🐌సామాన్యశాస్త్రం*

*🌿నిజ జీవితంలో విజ్ఞానశాస్త్రం పాత్రను కేవలం 10.08 శాతం మంది విద్యార్థులు మాత్రమే వివరించగలిగారు. మిగతా విద్యార్థులు అసలు స్పందించని పరిస్థితి ఉంది. చి వేర్వేరు పదార్థాలు, ప్రక్రియలు, సమ్మేళనాల గురించి విద్యార్థులు వివరించలేదు*.

*🏔సాంఘికశాస్త్రం*

*🌸భారతదేశం పటంలో చరిత్ర కలిగిన ప్రాంతాలను విద్యార్థులు గుర్తించలేకపోయారు*

*▪ఆరోగ్య, విద్య రంగాల్లో స్థానిక ప్రభుత్వాల పాత్రను కూడా వివరించలేదు*

*🔶కులం, మహిళలు, వితంతువుల వివాహాలు, బాల్య వివాహాలు, పోలీసు, న్యాయ వ్యవస్థల్లో వస్తున్న మార్పులపై కూడా విద్యార్థులు సమాధానాలు రాయలేకపోయారు.*

*🔘ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ఏమి ఉన్నాయి.. ఎంత వరకు ప్రజలకు చేరుతున్నాయో కూడా తక్కువ మంది రాశారు.*

*🔢గణితం*

*●ఇచ్చిన దత్తాంశానికి టేబుల్‌ తయారు చేసి విశ్లేషణ చేయమంటే విద్యార్థులు ఎవరూ కూడా చేయలేదు. చి బార్‌ ఛార్ట్స్‌, ఐ గ్రాఫ్‌ గీసి విశ్లేషణ చేయడంలోనూ విద్యార్థులు ఆసక్తి చూపించలేదు. చి ఇచ్చిన రెండు అకరణీయ సంఖ్యల మధ్య ఉండే అకరణీయ సంఖ్యలను కనుక్కోలేకపోయారు. చి సమృత పాఠాల వైశాల్యాలను యూనిట్‌ చదరాల ద్వారా లేదా గ్రాఫ్‌ షీట్‌ ద్వారా అంచనా వేయలేకపోయారు.* 

*◆సమగణం, స్థూపగరంలోని వస్తువుల ఉపరితల వైశాల్యం, గణ పరిమాణాలను సైతం చాలా తక్కువగా విద్యార్థులు కనుగొన్నారు.*
🐥🐥🐥🐥🐥🐥
*⌚పరీక్ష కాలవ్యవధి పొడిగింపు: విద్యార్థినుల గ్రేడ్లపై సానుకూల ప్రభావం!* 

 *🏦ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పరిణామం*

*🔶ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో గణితం, కంప్యూటర్‌ సైన్స్‌లలో పరీక్ష కాలవ్యవధిని పొడిగించడం విద్యార్థినుల గ్రేడ్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది.  గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల కాలవ్యవధిని 90 నుంచి 105 నిముషాలకు గతేడాది పొడిగించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.* 

*♻అయితే, అటు ప్రశ్నల విషయంలో మాత్రం ఎలాంటి సులువులు, వెసులుబాట్లను ప్రకటించలేదు. కేవలం వ్యవధిని పొడిగించడం వల్ల చక్కని ఫలితాలను సాధించిన ఆడపిల్లల సంఖ్య పెరిగినట్లు ‘సండే టైమ్స్‌’ తెలిపింది*. 

*🌀ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఈ విశ్వవిద్యాలయంలో మిగిలిన సబ్జెక్టుల కంటే గణితం గ్రేడ్ల విషయంలో మహిళల సంఖ్య అంతంతమాత్రం. గణితంలో ప్రధమస్థానంలో ఉత్తీర్ణులైన మహిళల సంఖ్య 21.2శాతంగా ఉంటే...పురుషులు 45.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఈ దిశగా విశ్వవిద్యాలయంలో విశ్లేషణలు, కసరత్తులు జరిగాయి. చివరకు పరీక్ష కాలవ్యవధి పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రభావం విద్యార్థినుల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపింది.*

*📋✒‘ఇగ్నో’లో పీహెచ్‌డీలో ప్రవేశానికి మార్చి 4న ప్రవేశ పరీక్ష!*
  
*🏛ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)లో పీహెచ్‌డీ, ఎంఫిల్‌ (రెగ్యులర్‌) కోర్సుల్లో చేరేందుకు మార్చి నాలుగోతేదీన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష జరుగుతుంది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ‘ఇగ్నో’ పరిశోధనావిభాగం సంచాలకులు ప్రొఫెసర్‌. కౌస్తువ బారిక్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.*

*📝ప్రవేశపరీక్ష రాయదలచుకున్న అభ్యర్థులు సంబంధిత దరఖాస్తు ఫారాలను సమర్పించడానికి ఫిబ్రవరి 16ను తుది గడువుగా నిర్ణయించారు. ఈనెల 23వ తేదీ నుంచీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులోకి వస్తుంది.ఎకనామిక్స్‌లో ఎంఫిల్‌ కోసం దరఖాసు తచేసుకునే వారు ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. నిర్దేశిత అర్హతలు ఉంటే సరిపోతుంది.*
[1/22, 08:53] జి కె అడ్మిన్: "టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మార్చి 1 నుంచి 5 వరకు టీఆర్టీ రాతపరీక్షల ప్రాథమిక కీ విడుదల కానుంది. వాటిపై అభ్యంతరాలను మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. మార్చి 25న తుది కీ విడుదలవుతుంది. ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీ వరకు టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే దిశగా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది.
ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు రాతపరీక్షలుటీఆర్టీ దరఖాస్తుల వివరాలు
పోస్టు దరఖాస్తులు
ఎస్‌ఏ 1,45,158
ఎస్జీటీ 89,149
ఎల్‌పీ 24,219
ఎస్‌ఏ(పీఈ) 2,177
పీఈటీ 16,871
మొత్తం 2,77,574

మూలాన్ని చ‌ద‌వండి" - టీఆర్టీకి 2,77,574 దరఖాస్తులు  http://tz.ucweb.com/1_4cA99

*✳స్థానిక సంస్థలు – కమిటీలు✳*

*💁బల్వంతరారు మెహతా కమిటీ*

👉ప్రణాళికా సంఘం చేపడుతున్న సమాజ వికాస కార్యక్రమాల అధ్యయనానికి భారత ప్రభుత్వం 1957, జనవరి 16న బల్వంతరారు మెహతా కమిటీని ఏర్పాటు చేసింది.

👉ఈ కమిటీ 1952, 1953 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (సీడీపీ), నేషనల్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీస్‌ (ఎన్‌ఈఎస్‌) కార్యక్రమాలను అధ్యయనం చేసి 1957, నవంబర్‌ 24న నివేదికను సమర్పించింది. కమిటీ తన నివేదికలో ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం’ అనే భావనతో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫార్సు చేసింది.

*💁‍♂సిఫార్సులు :*
1. మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అవి.. ఎ) గ్రామపంచాయతీ, బి) పంచాయతీ సమితి, సి) జిల్లాపరిషత్‌.
2. గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి.
3. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌లకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి.
4. పంచాయతీ సమితికి కార్యనిర్వాహక, జిల్లాపరిషత్‌కు సలహా, రర్యవేక్షణ అధికారాలు కేటాయించాలి.
5. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలను స్వతంత్రంగా నిర్వహించాలి.
6. స్థానిక సంస్థలకు ఐదేళ్లకొకసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి.
7. ప్రణాళిక, అభివృద్ధి విధులను స్థానిక ప్రభుత్వాలకు అప్పగించాలి.
8. జిల్లాపరిషత్‌కు కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించాలి.
9. స్థానిక సంస్థలకు అవసరమైన వనరులను కచ్చితంగా నిర్దేశించి, పంపిణీ చేయాలి.
– శ్రీనగర్‌లో 1958 ఏప్రిల్‌ 1న సమావేశమైన జాతీయ అభివృద్ధి మండలి బల్వంతరారు మెహతా కమిటీ సిఫార్సులను పాక్షికంగా ఆమోదించింది.
– మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం.. రాజస్థాన్‌.
– అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1959, అక్టోబర్‌ 2న రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా సికార్‌లో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నేడు ప్రారంభించిన ఈ స్థానిక ప్రభుత్వాలు… భారత ప్రజాస్వామ్య, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, భవిష్యత్‌ నాయకత్వానికి పాఠశాలలుగా ఉపయోగపడ తాయి’ అని అన్నారు.
– మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలుచేసిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఉమ్మడి ఏపీలో తొలిసారిగా మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో 1959, అక్టోబర్‌ 11న పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1959, నవంబర్‌ 1న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్థానిక సంస్థను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా తరువాత శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ల చట్టం 1964, జనవరి 18 నుంచి అమలులోకి వచ్చింది.
– పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సంబంధించి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన పద్ధతిని అనుసరించడంలేదు.
– నాలుగంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం : పశ్చిమ బెంగాల్‌
– మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు : రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌.
– రెండంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు : ఒడిశా, హర్యానా, అసోం, తమిళనాడు.
– ఒకే అంచెతో పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు : సిక్కిం, గోవా, త్రిపుర, కేరళ, జమ్మూ-కాశ్మీర్‌.
– బల్వంరారు మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏర్పాటు చేసిన పంచాయతీలను మొదటి తరం పంచాయతీలు అంటారు.

*💁అశోక్‌మెహతా కమిటీ (1977)*

👉మొరార్జీదేశారు ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ వ్యవస్థ అధ్యయనానికి 1977, డిసెంబర్‌లో అశోక్‌మెహతా కమిటీని (13 మంది సభ్యులతో) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1978, ఆగస్టులో మొత్తం 132 సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫార్సు చేసింది.

*💁‍♂సిఫార్సులు :*
1. గ్రామ పంచాయితీల స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి.
2. రెండంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేయాలి.
3. మండల పరిషత్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి.
4. జిల్లా పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రత్యక్ష లేదా పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి.
5. రాజకీయ పార్టీలు పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలి.
6. స్థానిక సంస్థలకు నాలుగేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి.
7. పంచాయతీరాజ్‌ సంస్థల్లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి.
8. 15 నుంచి 20 వేల జనాభాతో మంచల పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
9. పంచాయతీరాజ్‌ శాఖకు మంత్రిని నియమించాలి.
10. పంచాయతీరాజ్‌ సంస్థల నియంత్రణకు సోషల్‌ ఆడిట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
11. స్థానిక ప్రభుత్వాలు.. రాష్ట్రప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితులు లేకుండా వాటికి పన్ను విధింపు, వసూలు, నిధుల ఖర్చు అధికారాలు కల్పించాలి.
12. జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని అధికార వికేంద్రీకరణ చేయాలి.
13. పంచాయతీల నిధులు, జమా ఖర్చులపై సామాజిక తనిఖీ నిర్వహించేందుకు శాసనసభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి.
– మొరార్జీ దేశారు ప్రభుత్వం 1979లో కొన్ని మార్పులతో అశోక్‌మెహతా కమిటీ సిఫార్సులను ఆమోదించింది. ఈ సిఫార్సులను అమలు చేసిన మొదటి రాష్ట్రం కర్ణాటక (1985, అక్టోబర్‌ 2 (రామకృష్ణ హెగ్డే సీఎం).
– ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం 1986లో 330 పంచాయతీ సమితుల స్థానంలో 1104 మండలాలను ఏర్పాటు చేసింది.
– అశోక్‌ మెహతా కమిటీ సిఫార్సులను అమలు చేసిన మూడో రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌.
– అశోక్‌ మెహతా కమిటీ తన నివేదికలో పంచాయతీరాజ్‌ సంస్థలకు సరైన నిధులు, విధులు కేటాయిస్తే విజయవంతంగా పనిచేస్తాయని పేర్కొంది.
– అశోక్‌ మెహతా కమిటీ నివేదిక అనంతరం (1979 తరువాత) కాలాన్ని పునరుజ్జీవ దశ లేదా రెండోతరం పంచాయతీలు అంటారు.
– భారతదేశంలో 2004, మే 22న పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. (మే 27న అమలులోకి వచ్చింది).
దంత్‌వాలా కమిటీ (1978)
ఈ కమిటీని బ్లాక్‌ స్థాయిలో ప్రణాళికీకరణపై నివేదిక సమర్పించేందుకు ఏర్పాటు చేశారు.
సిఫార్సులు :
– గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.
– జిల్లాస్థాయిలో ప్రణాళికా వికేంద్రీకరణ జరగాలి.
– జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో కలెక్టర్‌ ప్రధానపాత్ర పోషించాలి.
– ప్రణాళిక వికేంద్రీకరణలో భాగంగా బ్లాక్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని ప్రణాళికలను రూపొందించాలి.
సి.హెచ్‌.హనుమంతరావు కమిటీ (1984)
జిల్లా ప్రణాళికలపై నివేదికను సమర్పించేందుకు సి.హెచ్‌.హనుమంతరావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కింది సిఫార్సులు చేసింది.
– జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
– ప్రత్యేక జిల్లా ప్రణాళిక సంఘాన్ని కలెక్టర్‌ లేదా మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలి.
– జిల్లాస్థాయిలో అన్ని అభివృద్ధి, ప్రణాళిక కార్య కలాపాల్లో కలెక్టర్‌ సమన్వయకర్తగా వ్యవహరించాలి.

*💁జి.వి.కె.రావు కమిటీ (1985)*

👉ప్రణాళికాసంఘం చేపడుతున్న పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు 1985లో జి.వి.కె.రావు కమిటీని ఏర్పాటు చేశారు.
సిఫార్సులు :
1. బ్లాక్‌ వ్యవస్థను రద్దుచేయాలి.
2. అభివృద్ధిలో జిల్లా పరిషత్‌ కీలక పాత్ర పోషించాలి.
3. జిల్లాపరిషత్‌కు చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరించాలి.
4. జిల్లాను ప్రధాన యూనిట్‌గా ఏర్పాటు చేయాలి.
5. భారతదేశంలో అభివృద్ధి చెందిన ఉద్యోగిస్వామ్యం స్థానంలో ప్రజాస్వామ్యాన్ని అబివృద్ధి చేయాలి.
6. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్‌ పాత్రను తగ్గించాలి.
7. జిల్లా పరిషత్‌కు డీడీవో లేదా సీఈవో (అధికారి)ను నియమించాలి.
ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ (1986)
భారతదేశంలోని పంచాయతీరాజ్‌ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీని ఏర్పాటు చేసింది.

*💁‍♂సిఫార్సులు :*
1. పంచాయతీరాజ్‌ సంస్థలకు రాజ్యాంగ హౌదా కల్పించాలి.
2. గ్రామసభ ఏర్పాటు చేయాలి.
3. పంచాయతీరాజ్‌ సంస్థలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక జ్యుడీషియల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి.
4. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి.
5. గ్రామీణ పరిపాలనలో గ్రామ సభలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయించాలి.
6. స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాలి.

No comments:

Post a Comment