AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 7 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 17 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 17 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు1989మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.2008టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
ఎం.జి.రామచంద్రన్‌1917సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బెంజమిన్ ఫ్రాంక్లిన్1706అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790)
జార్జ్ స్టిగ్లర్1911ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
ఎల్.వి.ప్రసాద్1908తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
ముహమ్మద్ ఆలీ,1942విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
మడిపల్లి భద్రయ్య1945తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
శాంతకుమారి2006పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు,
బాబీ ఫిషర్2008చదరంగం క్రీడాకారుడు. (జ.1943)
జ్యోతిబసు2010పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)
వి.రామారావు2016సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
🏧🏧🏧🏧🏧🏧
*✍డిజిటల్ వినియోగంలో నిజామాబాద్ యువత టాప్:*

 *❇హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా నిర్వహించిన ఏఎస్‌ఈఆర్ సర్వేలో డిజిటల్ వినియోగంలో నిజామాబాద్ జిల్లా యువత ముందన్నట్టు వెల్లడైంది. నిజామాబాద్ జిల్లాలో 70.3 శాతం యువత డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు తేలింది. నిజామాబాద్ జిల్లాలో60 గ్రామాల్లో 945 కుటుంబాలకు చెందిన 1,035 మంది యువతపై సర్వే నిర్వహించారు. సర్వే నివేదిక ప్రకారం.. జిల్లాలో చదువడం వచ్చిన యువత 76 శాతం ఉండగా.. వారిలో బాలురు 73.4 శాతం, 78.2 శాతం బాలికలు ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇది దేశ సగటుతో సమానంగా ఉండటం విశేషం. జిల్లాలో ఇంగ్లీష్ చదువడం తెలిసిన వారు 70.4 శాతం నమోదైంది. చదువడం, అర్థం చేసుకోవడంలో 57.6 శాతం యువత ఉన్నారు. ఆర్థిక సంబంధ లెక్కలు తెలిసిన వారు 67.7 శాతం ఉన్నారు. 96.2 శాతం భారతదేశ పటాన్ని గుర్తించగా.. 54.2 శాతం రాజధాని పేరు చెప్పారు. *

*👉దేశ సగటుకు దగ్గరగా నిజామాబాద్ జిల్లా:*

*❇అసర్ నివేదిక ప్రకారం చదువడం నేర్చిన వారిలో దేశ సగటు 76.6 శాతం ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో 76 శాతం ఉన్నది. ఇంగ్లీష్ చదువడంలో నిజామాబాద్ జిల్లా దేశసగటు కంటేపై స్థాయిలో ఉన్నది. డబ్బులు లెక్క పెట్టడం తెలిసిన వారిలో దేశ సగటు 75.7 శాతం ఉంటే నిజామాబాద్ జిల్లాలో 78.4 శాతంతో ఉన్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*_☘"జీవితంలో ఆనందం ఏం చేస్తున్నారన్నదాన్ని బట్టి ఉండదు. చేస్తున్న పనిని ఎంత ఇష్టంగా చేస్తున్నారన్న దాంట్లో వుంటుంది.ఏ పనినైనా ఇష్టంగా , పరిపూర్ణమైన శ్రధ్ధతో చేయండి. తప్పక ఆనందం లభిస్తుంది."🙏_*
🐥🐥🐥🐥🐥🐥
జీవితం అనేది ధన సంపాదనతోనో, మేడలలో , మిద్దెలలో నివశిస్తేనో లభించేదికాదు.!ప్రతి దినం నీవు “ నిజాయితీగా, నిష్కల్మషంగా , ఆత్మసంతృప్తితో , బ్రతుకు.ఇక ప్రతి నిముషం నీకు “ ఆనందమయమే !అదియే మనిషికి అసలైన “ ఆనందం” .
🐥🐥🐥🐥🐥🐥
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" నేను చెప్పవలసింది ఏమైనా ఉంటే గాని నా పెదవులు విప్పను, నాకేమైనా గౌరవం ఉన్నదంటే అందువల్లనే..! "

                _*-బెర్నార్డ్ షా*_

       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
"ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలాగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే..! "
🐥🐥🐥🐥🐥🐥
*🤘 నేటి సుభాషితం🤘*

*నమ్మకం అన్నది మనకు వెలుగు నివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి.*
🐥🐥🐥🐥🐥🐥
🔲 సూక్తులు

▪తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.

▪తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.

▪తెలియని మూర్ఖుని కంటే అన్ని తెలిసిన మూర్ఖుడు అవివేకుడు.

▪తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.

▪తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.

▪తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.
🐥🐥🐥🐥🐥🐥
*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  17, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న రాత్రి 7 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 17 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : నాగ
వర్జ్యం :
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 8 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు సాయంత్రం 3 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 53 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 12 గం॥ 3 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 47 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 12 గం॥ 25 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 11 గం॥ 1 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 25 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 8 గం॥ 13 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 2 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మకరము
🐥🐥🐥🐥🐥🐥
*💎 నేటి ఆణిముత్యం 💎*

అతి గుణహీన లోభికిఁ బదార్ధము గల్గిన లేక యుండినన్
మితముగఁ గాని కల్మిగల మీదటనైన భుజింపడింపుగా
 సతమని నమ్ము  దేహమును సంపద ,నేఱులు నిండి పాఱినన్
గతుకగఁ జూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా !

*భావము :*

భాస్కరా ! గుణహీనుడైన లోభివాడు పదార్ధం ఉన్నా, లేకపోయినా  కొంచమే  తింటుంటాడు.  సంపద ఉన్నా కూడ ఈ సంపద ,  ఈ శరీరము శాశ్వతమనుకొంటూ   కొంచంగానే  తింటాడు.   ఏఱు నిండుగా నీరు ప్రవహిస్తున్నా గతకటానికి అలవాటు పడిన కుక్క అలానే   నాలుకతోనే  గతుకుతూ  త్రాగుతుంది కదా !

             *👬 నేటి చిన్నారి గీతం 👬*

*పులి కనిపిస్తే ఏం చేస్తావు!*

ఒక్కసారిగా పులి కనిపిస్తే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి కనిపిస్తే 
అదరను బెదరను ఏ మాత్రం,
పరుగులు పెట్టను ఏ మాత్రం...
ఒక్కసారిగా పులి ఎదురుంటే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి ఎదురుంటే 
మెల్లగ వెనక్కు పోతాను, 
చల్లగ జారుకుంటాను...
ఒక్కసారిగా పులి ఎదురొస్తే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి ఎదురొస్తే 
భీకర శబ్దం చేసేస్తా,
పెద్దగ దేహం పెంచేస్తా,,,
ఒక్కసారిగా పులి పైబడితే 
ఏం చేస్తావు, ఏం చేస్తావు!
ఒక్కసారిగా పులి పైబడితే 
ఆ పులి వీపున గుద్దేస్తా,
పిడికిలి బిగించి పొడిచేస్తా.

             *✍🏼 నేటి కథ ✍🏼*

*మిణుగురు పురుగు, కాకి*

అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.
కాకి “యేమిటది” అని అడిగింది.

“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.

ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది.

ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది!
🐥🐥🐥🐥🐥🐥
*📖 మన ఇతిహాసాలు 📓*

*ద్రౌపది*

ద్రౌపది దృపద మహారాజు యాగపుత్రిక. పాండవుల సతి.

*జననం వెనుక కథ*

ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.

రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి అని ఐదుసార్లు కోరింది. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.

మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. ద్రోణాచార్యుని ఆఙ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి దృపదుని భందించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన దృపదుడు, ద్రోణుని చంపగల కుమారుడు, మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యఙ్ఞం చేస్తాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది మరియు ధృష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది.

కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ... యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.

ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. అతనికి అద్భుత, విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకూ, కర్ణుడికీ ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కల్గింది. అతన్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవలసి వచ్చింది.

పట్టమహిషైన ద్రౌపదికి తన జీవనపథమ్మీద, తన వివాహంపైన ఉన్న ధర్మశంకలను, కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు), కృష్ణుడు తీర్చారు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. ఆమెను పార్థునికివ్వాలన్న తలపుతో ఉన్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న మాట విని, ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.

ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.

అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.
🐥🐥🐥🐥🐥🐥🐥
*✅ తెలుసుకుందాం ✅*

*⭕జీవరాశి కేవలం భూమిమీదనే ఉందా?*

✳జీవం పుట్టుకకు మరియు దాని మనుగడకు కావలసిన వాతావరణం మనకు తెలిసి కేవలం ఈ భూమి మీదనే ఉంది.మిగతా గ్రహాలమీద నీరు లేకపోవడము,అధిక వేడిమి లేదా అతి శీతలం,ప్రాణ వాయువు లేకపోడము వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల కారణంగా జీవం ఉండదనే చెప్పాలి.కాని....ఈ భూమి మీద లాగానే ఏ సుదూర గ్రహం మీదో అనుకూల పరిస్థితులు ఉంటే తప్పకుండా జీవం ఉండే అవకాశాలు కొట్టిపారేయలేం.
🐥🐥🐥🐥🐥🐥
        Old joke

ఒక స్టూడెంటు ఇంగ్లీషు  ప్రొఫెసర్ని
*'నటూరే '* కి మీనింగు ఏంటి అని అడిగాడు.

 ప్రొఫెసర్ అ వర్డ్ ఎపుడూ విని 
ఉండకపోవడం వల్ల కంగారు పడి అర్ధం రేపు చెపుతానన్నాడు.
ఇంటికి పోయి ఇంగ్లీషు ప్రొఫెసర్ 
ఎన్నో డిక్షనరీలు రాత్రంతా వెతికినా 'నటూరే' అనే పదమే ఎక్కడా కనపడలేదు.
మర్నాడు క్లాసుకి వస్తూనే ఆ స్టూడెంటు మీనింగు చెప్పమని అడగ్గానే
గాభరాపడి రేపు చెప్తానని తప్పించుకున్నాడు. 
రోజూ స్టూడెంటు అడగడం  ప్రొఫెసర్ తప్పించుకోడం జరిగిపోతుండేది.  
ఆ స్టూడెంటు కనపడితే చాలు ప్రొఫెసర్ కి
భయంతొ కాళ్ళూ చేతులు వణికేవి.
 ఆఖరికి ప్రొఫెసర్ స్టూడెంటుని అడిగాడు. *"నటూరే కి స్పెలింగ్ ఏంటో చెప్పు?"*
స్టూడెంటు చెప్పాడు 'NATURE' అని.
ప్రొఫెసర్ పిచ్చికోపంతో తిట్టసాగాడు. 
వెధవన్నర వెధవ! నేచర్ ని 
నటూరే అంటూ నా ప్రాణం తీసావు కదా! 
నిన్ను కాలేజి నుంచి 
వెంటనే బర్తరఫ్ చేస్తున్నాను,
అని అనగానే ప్రొఫెసర్ 
కాళ్ళ మీద పడి స్టూడెంటు ఏడవసాగాడు.
సార్ ! కనికరించండి. 
అంత పని చేయొద్దు ! 
*నా ' ఫుటూరే ' నాశనం చేయకండి సార్ !!*
ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు!!!
('ఫుటూరే' = FUTURE)

😝🤣😂😛😝😝🤣😂

No comments:

Post a Comment