ఇండియా & వరల్డ్ 2012 సంవత్సరం అక్టోబరు నుండి డిసెంబరు వరకు మొత్తం
ఇండియా & వరల్డ్
అక్టోబరు 2012 ద్వైపాక్షిక సంబంధాలు
మయన్మార్‌లో జాతుల ఘర్షణలు
మయన్మార్ పశ్చిమ ప్రాంత రాష్ట్రం రాఖేన్లో బౌద్ధ రాఖేన్, ముస్లిం రోహింగా జాతుల మధ్య అక్టోబర్ 22న జరిగిన ఘర్షణల్లో 100 మంది మరణించారు. శతాబ్దానికి పైగా రాఖేన్ రాష్ట్రంలో రోహింగాలు నివసిస్తున్నారు. వీరిని మయన్మార్ ప్రభుత్వం గుర్తించ లేదు. వారిని అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిగా పరిగణిస్తున్నారు. వీరికి, స్థానిక బౌద్ధులకు మధ్య తరచు ఘర్షణలు చెలరేగుతున్నాయి.
సార్క్ హోం మంత్రుల సమావేశం
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య(సార్క్) దేశాల హోం/ అంతర్గత మంత్రుల ఐదో సమావేశం మాల్దీవుల్లో సెప్టెంబర్ 26న జరిగింది. ఈ సమావేశంలో భారత్ తరఫున హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పాల్గొన్నారు. దక్షిణాసియాలో అభివృద్ధికి ఉగ్రవాదం అతిపెద్ద అవరోధంగా మారిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్
నవంబరు 2012 ద్వైపాక్షిక సంబంధాలు
అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్ భారత పర్యటన
అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ భారత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నవంబర్ 12న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. పరస్పర సహకారంతోపాటు ఆర్థిక రంగంలో మరింత సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించుకున్నాయి. బొగ్గు, ఖనిజ వనరుల అభివృద్ధి, చిన్నతరహా అభివృద్ధి పథకాల అమలు సహా నాలుగు ఒప్పందాలపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి. యుద్ధం కారణంగా విధ్వంసానికి గురైన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరేందుకు కర్జాయ్ భారత్‌కు వచ్చారు. గత కొన్నేళ్లుగా భారత్ ఉదారంగా అందిస్తున్న సహాయానికి అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్ఘాన్ అభివృద్ధి, పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భారత్ ఉదారంగా సహకరిస్తూ, ప్రధాన భాగస్వామిగా నిలుస్తోందని ఆయన అన్నారు. అఫ్ఘాన్‌లో పెట్టుబడులకు ప్రస్తుతం అవకాశాలు మెరుగుపడ్డాయని, భవిష్యత్తులో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండగలదని, అందువల్ల మిత్రదేశాల నుంచి పెట్టుబడులను ఆశిస్తున్నామని చెప్పారు.
కెనడా ప్రధాని స్టీఫెన్ భారత పర్యటన
కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ నవంబర్ 4 నుంచి 9 వరకు భారత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీఅయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో పనిచేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్‌పై ద్వంద్వ పన్నుల భారం పడకుండా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతేకాకుండా దాదాపు 36 ఏళ్ల విరామం తర్వాత భారత్‌కు యురేనియం, అణు రియాక్టర్‌లను ఎగుమతి చేసేందుకు కెనడా అంగీకరించింది. దీనిపై 2010లో కుదిరిన పౌర అణు సహకార ఒప్పందాన్ని అమలు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్ 1974లో అణు పరీక్షలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కెనడా 1976లో మన దేశానికి యురేనియం ఎగుమతిపై నిషేధం విధించింది.
AIMS DARE TO SUCCESS
ఇండియా & వరల్డ్
డిసెంబరు 2012 ద్వైపాక్షిక సంబంధాలు
ఇండో-ఉక్రెయిన్ ఒప్పందం
ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యమకోవిచ్ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగంతోపాటు మరో నాలుగు రంగాల్లో సహకారానికి సంబంధించి డిసెంబర్ 10న ఒప్పందాలు కుదిరాయి. అణు భద్రతలో కూడా పరస్పరం సహకరించుకోవాలని కూడా ఇరు దేశాలు అవగాహనకు వచ్చాయి.

No comments:
Post a Comment