AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 12 February 2018

అంతర్జాతీయం 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

అంతర్జాతీయం 2016 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 

జనవరి 2016 అంతర్జాతీయం
అత్యంత వేడి సంవత్సరంగా 2015
అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2015 రికార్డుకెక్కినట్లు అమెరికా వాతావరణ సంస్థ జనవరి 25న పేర్కొంది. గత ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతల మధ్య భారీ వ్యత్యాసాలు నమోదైనట్లు తెలిపింది. ఈ శతాబ్దంలో 2014 కంటే 2015లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1961-1990 మధ్యకాలంలోని సగటు కంటే 2015లో 0.76 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. దీన్ని దీర్ఘకాలిక వాతావరణ మార్పుగా గుర్తించారు. 

లాటిన్ అమెరికాలో జికా వైరస్
దోమల ద్వార వ్యాపించే ప్రమాదకర జికా వైరస్ లాటిన్ అమెరికాలో విస్తరిస్తోంది. ప్యూటోరికాలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య జనవరి 27 నాటికి 19కి చేరింది. ‘ఈ డిస్ ఈజిప్టె’ అనే దోమకాటు కారణంగా జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వారికి శిశువులు చిన్న తలలతో పుట్టటం, మరణించటం, పక్షవాతం వంటి ప్రమాదాలకు గురవుతారు. కరేబియన్ దీవుల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తిని తొలిసారిగా గుర్తించారు.

ఉగ్ర నిర్మూలనకు భారత్-అరబ్‌లీగ్ నిర్ణయం
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనలో బహ్రెయిన్ రాజధాని మనామాలో జనవరి 24న ఉగ్రవాదం నిర్మూలనకు భారత్- అరబ్ లీగ్ నిర్ణయించాయి. మనామాలో భారత్- అరబ్ కోఆపరేషన్ ఫోరమ్ మంత్రిత్వ స్థాయి సమావేశం జరిగింది. ఉగ్రవాదం నుంచి మతాన్ని విడదీయాలని సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు నిధులు అందకుండా అడ్డుకునేందుకు వ్యూహాలు రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉగ్రవాదం, అరబ్‌ప్రాంతం, భద్రతా మండలి సంస్కరణలు, అణ్వాయుధ నిరాయుధీకరణ వంటి వివిధ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.

సౌదీలో చదరంగాన్ని నిషేధిస్తూ ఫత్వా
సౌదీ అరేబియాలో చెస్ ఆటను (చదరంగం) నిషేధిస్తూ గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ షేక్ ఫత్వా జారీ చేశారు. ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ జూదాన్ని నిషేధించిందని, చెస్ కూడా జూదం కిందకే వస్తుంది కాబట్టి దీనిని నిషేధిస్తూ ఫత్వా జారీచేయాల్సి వచ్చిందని షేక్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సౌదీ అరేబియాలో గ్రాండ్ ముఫ్తీ అంటే లీగల్ అధికారాలు గల అత్యున్నత ముస్లిం సంస్థ. దీనికి అధిపతిని సౌదీ రాజే నియమిస్తారు. అధిపతి జారీచేసే ఫత్వాలను ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. కొన్ని వివాదాస్పద ఫత్వాలను ప్రభుత్వం అమలు చేయకుండా చూసిచూడనట్లు వదిలేస్తోంది.

ఇరాన్‌పై ఆంక్షలు తొలగించిన అమెరికా, ఈయూ
ఇరాన్‌పై విధించిన చమురు, ఆర్థిక ఆంక్షలను అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు ఎత్తేశాయి. దీంతో పాటు స్తంభింపచేసిన పదివేల కోట్ల డాలర్ల ఆస్తులను కూడా విడుదల చేశాయి. ఇరాన్, అమెరికాలు పరస్పరం బందీలను (ఖైదీలు) విడుదల చేశాయి. ఐక్యరాజ్యసమితి తనిఖీ బృందం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అణు కార్యక్రమ నియంత్రణకు సంబంధించి 2015 జూలైలో అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం అణు నియంత్రణ చర్యలు చేపట్టింది.

జకార్తాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు దాడులు జరిపారు. అధ్యక్షుని భవనానికి సమీపంలో, అమెరికా, ఫ్రాన్స్, ఐరాసా కార్యాలయాల పరిసరాల్లో జనవరి 14న కాల్పులు, బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా, ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి.

తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సాయ్ ఇంగ్ వెన్ విజయం
తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సాయ్ ఇంగ్ వెన్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) విజయం సాధించింది. డీపీపీ గెలుపుతో సాయ్ ఇంగ్ వెన్ తైవాన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. జనవరి 16న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఇంగ్ వెన్ పార్టీ 60 శాతానికి పైగా ఓట్లు సాధించింది. అధికార పార్టీ కేఎంటీకి 30 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతోప్రస్తుత అధ్యక్షుడు మా ఇంగ్ జౌ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశారు.

సిరియాలో 300 మంది ఊచకోత
సిరియాలోని దేర్ ఎజార్ నగరంపై ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడి చేసి 300 మందిని ఊచకోత కోసిందని.. మరో 400 మందికి పైగా జనాన్ని బందీలుగా పట్టుకుందని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సానా జనవరి 17న తెలిపింది. ఐసిస్ దాడుల్లో చనిపోయిన వారిలో 50 మంది ప్రభుత్వ సైనికులు కాగా.. మిగతా వారు పౌరులని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.

భారత్‌లో ధనికుల సంఖ్య 2.36 లక్షలు
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంపన్నుల పరంగా.. 2.36 లక్షల మందితో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఇక 12.60 లక్షల మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (6.54 లక్షల మంది), ఆస్ట్రేలియా (2.90 లక్షల మంది) కొనసాగుతున్నాయి. ‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్-2016’ వెల్త్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 1 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులను కలిగిన వ్యక్తులను సంపన్నులుగా పరిగణించి అధ్యయనం చేశారు. టాప్ 10లో సింగపూర్ (2.24 లక్షల మంది, ఐదవ స్థానం), హాంకాంగ్ (2.15 లక్షల మంది, ఆరవ స్థానం), దక్షిణ కొరియా (1.25 లక్షల మంది, 7వ స్థానం), తైవాన్ (98,200 మంది, 8వ స్థానం), న్యూజిలాండ్ (89,000 మంది, 9వ స్థానం), ఇండోనేసియా (48,500, 10వ స్థానం) ఉన్నాయి.

పాక్ యూనివర్సిటీలో ఉగ్రదాడి
పాకిస్తాన్‌లోని చార్‌సద్దాలో ఉన్న బాచాఖాన్ యూనివర్సిటీలోకి జనవరి 20న నలుగురు తాలిబన్ ఉగ్రవాదులు చొరబడి 20 మందిని హతమార్చారు. విద్యార్థులు, అధ్యాపకులు లక్ష్యంగా జరిగిన దాడిలో 20 మంది విగతజీవులవ్వగా.. 50 మంది వరకు గాయపడ్డారు. దాడి సమయంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. టైస్టులను తన వద్దనున్న పిస్టల్‌తో కాసేపు నిలువరించి విద్యార్థులు తప్పించుకునేలా అవకాశం కల్పించారు. తాను మాత్రం ఉగ్రవాదుల కాల్పుల్లో నేలకొరిగాడు. అనంతరం యూనివర్సిటీని చుట్టుముట్టిన పాక్ సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దాడికి తమదే బాధ్యతని ‘తెహరీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్’ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

లార్డ్ ఆఫ్ టన్నెల్స్ ఆటకట్టు
సొరంగాలు తవ్వి జైళ్లు, గృహ నిర్బంధాల నుంచి చాకచక్యంగా తప్పించుకోవటం,అమెరికా-మెక్సికో సరిహద్దు గుండా మత్తు పదార్థాల స్మగ్లింగ్‌లో ఆరితేరిన డ్రగ్‌డాన్ జొవాకిన్ లెల్ చాపో గుజ్మన్ ఆటకట్టయింది. ‘ది లార్డ్ ఆఫ్ టన్నెల్’గా పేరొందిన 58 ఏళ్ల గుజ్మన్‌ను మెక్సికో బలగాలు వెంటాడి ఎట్టకేలకు జనవరి 8న పట్టుకున్నాయి. గుజ్మన్‌ను అతని స్వస్థలమైన సినాలోవాలో పట్టుకున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో ప్రకటించారు. గుజ్మన్ కట్టుదిట్టమైన భద్రత ఉండే అల్టిప్లానో జైలు నుంచి గత ఏడాది జూలై 11న అనూహ్యంగా తప్పించుకొన్నాడు.

పాక్‌లో ‘జైషే’ చీఫ్ మసూద్ అరెస్టు
పఠాన్‌కోట్ ఉగ్రదాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు రెహ్మాన్ రవూఫ్‌లను పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరితోపాటు పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతోపాటు జైషే సంస్థకు చెందిన కార్యాలయాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం.. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు పకడ్బందీగా పనిచేయాలని, ఈ ప్రయత్నంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. దీంతో పాటు పఠాన్‌కోట్ ఘటనలో లోతైన విచారణ కోసం ఐఎస్‌ఐ, ఎంఐ, ఐబీలతో పాక్ ప్రధాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఒబామా చివరి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం
సరికొత్త ఉగ్రవాద వ్యవస్థలకు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, మధ్యప్రాచ్య దేశాలు స్వర్గధామాలుగా రూపొందే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. అమెరికా, అమెరికా మిత్రదేశాల రక్షణ కోసం ఇస్లామిక్ స్టేట్, అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థలపై వేటను కొనసాగిస్తానని మరోసారి ప్రతిజ్ఞ చేశారు. 2017 జనవరిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఒబామా జనవరి 13న తన చివరి ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేశారు. ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అల్‌కాయిదాలపై అమెరికా విదేశాంగ విధానం ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. రాజకీయ నాయకులు ముస్లింలను అవమానించడం, మసీదులను ధ్వంసం చేయడం వల్ల మన భద్రత పెరగదని, అది తప్పని పేర్కొన్నారు. అలాంటి చర్యల వల్ల ప్రపంచం దృష్టిలో పలుచనవుతామని విపక్ష రిపబ్లికన్ పార్టీని ఉద్దేశించి వాఖ్యానించారు.

పాత్రికేయులకు భారత్ ప్రమాదకరం
జర్నలిస్టులకు సంబంధించి ఆసియాలో భారత్ అత్యంత ప్రమాదకర దేశమని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 110 మంది జర్నలిస్టులు అసహజంగా చనిపోతే వారిలో 9 మంది భారతీయులేనని వార్షిక నివేదికలో తెలిపింది. జర్నలిస్టులకు పాక్, అఫ్గాన్‌ల కంటే భారత్ ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విధి నిర్వహణలో 67 మంది హత్యకు గురైతే, ఇరాక్‌లో అత్యధికంగా 11 మంది హత్యకు గురయ్యారని తెలిపింది.

విజన్ 2030 యూఎన్‌వో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విడుదల
 ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఆకలి, పేదరిక, లింగ భేదం లేని సమాజాన్ని ఏర్పాటు దిశగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల జాబితాను విడుదల చేసింది. ప్రభుత్వాధినేతలు, ప్రజల మధ్య మానవత్వం, సామాజిక అనుసంధానం కోసం ఈ లక్ష్యాలు ఉపయోగపడతాయని యూఎన్‌వో సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ పేర్కొన్నారు. రానున్న 15 ఏళ్లలో అసమానతలు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీజీ లక్ష్యాలు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు.

AIMS DARE TO SUCCESS 

ఫిబ్రవరి 2016 అంతర్జాతీయం
కొత్త పంథాలో ఐరాస చీఫ్ ఎన్నిక
ఐక్యరాజ్య సమితి నూతన చీఫ్ ఎన్నిక నూతన పంథాలో సాగనుంది. అర్హులైన అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూ చేసి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులతో సభ్యదేశాలు భేటీ కావటంతో పాటు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. 70 ఏళ్ల ఐరాస చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టలేదు. దీంతో మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అర్హతలు ఉన్న అభ్యర్థులతో ఏప్రిల్ 12 నుంచి 14 వరకు వరుసగా సమావేశాలు నిర్వహించనున్నట్లు ఐరాస సర్వసభ్య సభ అధ్యక్షుడు మోగెన్స్ లిక్కెటాఫ్ట్ తెలిపారు.

షాంఘైలో బ్రిక్స్ బ్యాంకు ప్రధాన కార్యాలయం
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికాలు(బ్రిక్స్) ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ).. షాంఘై కేంద్రంగా పనిచేసేందుకు ఒప్పందం కుదిరింది. ప్రధాన కార్యాలయ ఏర్పాటు కోసం సభ్యదేశాలు.. ఫిబ్రవరి 27న చైనాతో ఒప్పందం చేసుకున్నాయి. జీ20 భేటీ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఎన్‌డీబీకి సారథ్యం వహిస్తున్న కేవీ కామత్‌లు దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు.

భారత్‌లో ‘ఎఫ్-16’ తయారీకి సిద్ధం 
అమెరికాకు చెందిన యుద్ధవిమానాల తయారీ సంస్థ లకీద్ మార్టిన్.. భారత్‌లో ‘ఎఫ్-16’ ఫైటర్ విమానాల తయారీకి సిద్ధమని ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సింగపూర్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో లకీద్ మార్టిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షా తెలిపారు. భారత్‌లో‘ఎఫ్-16’ తయారీ దిశగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు మద్దతు పలుకుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

సిరియాలో కారుబాంబుల దాడిలో 87 మంది మృతి
సిరియాలోని హామ్స్ నగరం, డమాస్కస్ శివారులోని ఓ ప్రార్థనా మందిరం దగ్గర ఫిబ్రవరి 21న వేర్వేరు కారుబాంబుల దాడిలో 87 మంది మృతి చెందారు. హామ్స్‌లోని ఆల్-జహ్రనా జిల్లాలో జరిగిన దాడిలో 57 మంది మృతి చెందగా, సయిదా జినాబ్‌లో జరిగిన దాడిలో 30 మంది చనిపోయారు.

ప్రపంచంలో సౌరశక్తితో నడిచే తొలి పార్లమెంటు
ప్రపంచంలో పూర్తి సౌరశక్తితో నడిచే మొట్టమొదటి పార్లమెంటుగా పాకిస్తాన్ పార్లమెంటు నిలిచింది. చైనా సహాయంతో 55 మిలియన్ డాలర్ల వ్యయంతో పాకిస్తాన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఫిబ్రవరి 23న రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సోలార్ పవర్‌తో నడిచే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. పాకిస్తాన్, చైనా మధ్య స్నేహానికి ఈ ప్రాజెక్టు మరో నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు
అమెరికా ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు అమ్మడానికి ఫిబ్రవరి 13న అంగీకరించింది. వీటి కొనుగోలు విలువ రూ. 4,670 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్. జైన్ ఇది భారత వ్యతిరేక కార్యక్రమంగా పరిగణిస్తున్నామని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు తెలిపారు.

ఉత్తర కొరియా సైన్యాధిపతికి ఉరి
కొరియన్ పీపుల్స్ ఆర్మీ (కేపీఏ) జనరల్ స్టాఫ్ చీఫ్ రి యోంగ్ గిల్‌ను ఉరి తీసినట్లు ఉత్తర కొరియా మీడియా ఫిబ్రవరి 10న వెల్లడించింది. రాజకీయ కుట్ర, అవినీతికి పాల్పడినందుకు ఆయనకు ఉరిశిక్ష విధించినట్లు యోన్ హాప్ వార్తా సంస్థ పేర్కొంది. 2013లో గిల్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ విధానాలతో తనకు అనుకూలించని వారిని అంతం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జోంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణాంతరం 2011లో అధికారం చేపట్టారు. 2013లో తన మామ జాంగ్ సోంగ్ థాయెక్‌ను రాజకీయ కుట్ర, అవినీతి అభియోగాలపై ఉరి తీయించాడు. సైన్యంపై పూర్తి ఆధిపత్యం నిలుపుకోవడానికి ఉన్ అనేక మంది అధికారులను తొలగించడం లేదా అధికారం తగ్గించడం లాంటి చర్యలు తీసుకున్నాడు.

విపత్తు నష్టాల్లో మూడో స్థానంలో భారత్
2015లో విపత్తుల వల్ల బాగా నష్టపోయిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి విపత్తు ముప్పు నియంత్రణ కార్యాలయం (యూఎన్‌ఐఎస్‌డీఆర్) ఫిబ్రవరిలో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 2015లో భారత్‌లో విపత్తుల వల్ల 2800 మంది మరణించారని, రూ. 22,000 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో 26, రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 22, మూడో స్థానంలో ఉన్న భారత్‌లో 19 విపత్తులు సంభవించినట్లు తెలిపారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంబంధ విపత్తుల్లో 22,700 మంది మరణించారని, 6650 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.

హిందూ వివాహ బిల్లుకు సింధ్ ఆమోదం
పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రం దేశంలో హిందూ వివాహ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఫిబ్రవరి 15న ఈ బిల్లును సింధ్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ రాష్ట్రంలో హిందువులు పెద్దసంఖ్యలో ఉన్నారు. దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల వివాహ బిల్లు ముసాయిదాను ఫిబ్రవరి 9న పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం హిందువులు పెళ్లి చేసుకునే నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. దంపతుల్లో ఎవరైనా ఇతర మతం స్వీకరిస్తే ఆ వివాహం చెల్లుబాటు కాదన్న 12 (3) క్లాజ్‌పై తీవ్ర అభ్యంతరాల నడుమ బిల్లు ఆమోదం పొందింది.

టెహరాన్‌కు చేరుకున్న తొలి ‘సిల్క్ రోడ్’ రైలు
చైనా తొలి సిల్క్ రోడ్ రైలు ఫిబ్రవరి 15న ఇరాన్ రాజధాని టెహరాన్‌కు చేరుకుంది. చైనా సరుకులతో కూడిన రైలు అత్యంత పురాతనమైన ఈ మార్గంలో ప్రయాణం సాగించిందని ఇరాన్ రైల్వే సంస్థ తెలిపింది. 32 కంటైనర్లతో కూడిన ఈ రైలు తూర్పు ఝెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన వాణిజ్య ఉత్పత్తులతో కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌ల మీదుగా 9,500 కిలోమీటర్లు ప్రయాణం సాగించి 14 రోజుల తర్వాత గమ్యస్థానానికి చేరుకుంది.

అంగోలాలో బయటపడ్డ వంద కోట్ల వజ్రం
ఆఫ్రికా దేశమైన అంగోలాలో జరుపుతున్న తవ్వకాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువచేసే వజ్రం బయటపడింది. ఈశాన్య అంగోళా ప్రాంతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మైనింగ్ కంపెనీ తవ్వకాలు జరుపుతుండగా ఏడు సెంటీమీటర్ల పొడవు, 404 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం దొరికింది. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో దీనిది 27వ స్థానం.

అణు నష్టపరిహార ఒప్పందానికి భారత్ ఆమోదం
అణు నష్టంపై అదనపు నష్టపరిహార ఒప్పందానికి (సి.ఎస్.సి.) భారత్ ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపింది. పౌర అణు బాధ్యతలకు సంబంధించి ఇది ముఖ్యమైన ముందడుగు. దీనికి సంబంధించిన పత్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)కు భారత ప్రతినిధి అందజేశారు. ఈ ఒప్పందం భారత్‌కు సంబంధించి మే 4 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అణు ప్రమాదాల్లో బాధితులకు నష్ట పరిహారం పెంచడం లక్ష్యంగా సి.ఎస్.సి. కుదిరింది.

తైవాన్ భూకంపంలో 40 మంది మృతి
తైవాన్‌లో ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపం వల్ల 40 మంది వరకు మరణించినట్లు గుర్తించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక మంది శిథిలాల కింద కూరుకుపోయారు. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.4గా నమోదైంది.

భారత్-అఫ్గాన్ దౌత్యవేత్తలకు వీసా అవసరం లేదు
భారత్, అఫ్గానిస్థాన్ దౌత్యవేత్తలు ఇరు దేశాల్లో వీసాతో పనిలేకుండానే రాకపోకలు సాగించొచ్చు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఫిబ్రవరి 2న ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అఫ్గానిస్థాన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మంత్రిమండలి అధిపతి అబ్దుల్లా అబ్దుల్లా ఫిబ్రవరి 2న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. 

ఇజ్రాయెల్-సిరియాల మధ్య శాంతి బాధ్యతలు భారతీయుడికి
 శత్రుదేశాలైన ఇజ్రాయెల్-సిరియా మధ్య శాంతిని నెలకొల్పే బాధ్యతను ఐక్యరాజ్య సమితి ఓ భారతీయుడికి అప్పగించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ జైశంకర్ మీనన్‌ను.. యునెటైడ్ నేషన్స్ డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్(యూఎన్‌డీఓఎఫ్)కు కమాండర్‌గా నియమిస్తూ యూఎన్ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతలను నేపాల్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ పూర్ణచంద్ర థపా నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో ఇకపై మీనన్ కొనసాగుతారు. దేశీయంగా, అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పే ఆపరేషన్లకు నాయకత్వం వహించిన అనుభవం మీనన్‌కు ఉంది. ఇజ్రాయెల్-సిరియాల సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా చూడడం యూఎన్‌డీఓఎఫ్ నాయకుడిగా మీనన్ బాధ్యత.

AIMS DARE TO SUCCESS 

మార్చి 2016 అంతర్జాతీయం
ఐరాస హక్కుల సలహాదారుగా భారతీయుడు
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూన్‌హెచ్‌ఆర్సీ) ఆధ్వర్యంలో ‘మానవహక్కులు, బహుళజాతి సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు’ అనే అంశంపై పనిచేస్తున్న బృందానికి సలహాదారునిగా భారత సంతతి విద్యావేత్త సూర్యదేవా నియమితులయ్యారు. ఆయన్ను ఆసియా-పసిఫిక్ ప్రతినిధిగా యూన్‌హెచ్‌ఆర్సీ నియమించింది. దేవా ప్రస్తుతం హాంకాంగ్‌లోని ఓ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

లాహోర్‌లో ఆత్మహుతి దాడి: 69 మంది మృతి
పాకిస్తాన్ వాణిజ్య రాజధాని లాహోర్‌లోని ఓ చిన్నపిల్లల పార్కులో ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి బాంబు దాడిలో 69 మంది దుర్మరణం చెందారు. 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత ప్రాంతం, అత్యంత రద్దీగా ఉండే లాహోర్ టౌన్ ప్రాంతంలోని గుల్షన్-ఎ-ఇక్బాల్ పార్క్ ప్రధాన గేటు వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

మయన్మార్ అధ్యక్షునిగా టిన్ క్వా ప్రమాణం
మయన్మార్ కొత్త అధ్యక్షునిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు టిన్ క్వా(60) మార్చి 30న ప్రమాణ స్వీకారం చేశారు. క్వా ప్రమాణ స్వీకారంతో 50 ఏళ్ల మిలిటరీ పాలన తర్వాత సూచీ ప్రజాస్వామ్య ఉద్యమంతో మయన్మార్‌లో కొత్త శకానికి పునాది పడినట్లయ్యింది. మరోవైపు సూచీ.. క్వా కేబినెట్‌లో విదేశాంగ శాఖతో పాటు విద్య, ఇంధన, అధ్యక్ష కార్యాలయ శాఖల బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. మాజీ జనరల్ థీన్ సేన్ స్థానంలో టిన్ క్వా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ తెచ్చిన కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం సూచీ కోల్పోయినా.. క్వా ద్వారా ఆమె పరోక్షంగా దేశాన్ని నడిపించనున్నారు. 2015 నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డీ) ఘన విజయం సాధించింది.

యునెస్కో రక్షిత జీవావరణ రిజర్వుల జాబితాలోకి అగస్త్యమల
ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో జీవావరణ రిజర్వుల జాబితాలో భారత్‌లోని పశ్చిమ కనుమల్లోని అగస్త్యమల ప్రాంతానికి చోటు దక్కింది. పెరూ రాజధాని లిమాలో మార్చి 19న ముగిసిన యునెస్కో అంతర్జాతీయ సమన్వయ మండలి సమావేశంలో కొత్తగా వివిధ దేశాలకు చెందిన 20 జీవావరణ రిజర్వులను వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేర్చారు. దీంతో మొత్తం 120 దేశాల్లో ఉన్న రిజర్వ్‌ల సంఖ్య 669కి చేరింది. కేరళ, తమిళనాడుల్లోని పశ్చిమ కనుమల్లో ఉన్న అగస్త్యమల ప్రాంతంలో 2,254 ఎత్తై జాతి రకానికి చెందిన మొక్కలతో పాటు 400 విశిష్ట లక్షణాలున్న మొక్కలున్నాయి.

రష్యాలో కూలిన విమానం.. 62 మంది మృత్యువాత 
రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 62 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం మార్చి 19 వేకువజామున దక్షిణ రష్యాలోని రోస్తోవ్ ఓన్ డాన్ పట్టణంలో జరిగింది. దుబాయ్‌కి చెందిన ఫ్లైదుబాయ్ సంస్థ విమానం.. విమానాశ్రయంలో దిగటానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో నిట్టనిలువునా నేలను ఢీకొంది. ఫలితంగా జరిగిన భారీ పేలుడు వల్ల విమానంలో ఉన్న 62 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు.

37వ సార్క్ మంత్రుల సమావేశం
సార్క్ దేశాల మంత్రుల 37వ సమావేశం నేపాల్‌లోని పొఖారాలో మార్చి 14 నుంచి 17 వరకు నాలుగు రోజులపాటు జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ సమావేంలో పాల్గొని ప్రసంగించారు. సార్క్ దేశాలను మరింత అనుసంధానం చేసేందుకుగాను దక్షిణాసియా ఆర్థిక సంఘం(ఎస్‌ఏఈయూ)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్)లోని ఎనిమిది సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సార్క్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘానిస్తాన్, మాల్దీవులు సభ్య దేశాలుగా ఉన్నాయి.

88 ఏళ్ల తరువాత క్యూబాకు అమెరికా అధ్యక్షుడు
ఎనిమిదిన్నర దశాబ్దాల యుద్ధ మేఘాల్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబ సమేతంగా మార్చి 20న క్యూబా పర్యటన ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య చరిత్రాత్మక విదేశాంగ విధానానికి నాంది పలకనుంది. 1959లో ప్రభుత్వాన్ని కూలదోసి ఫిడెల్ క్యాస్ట్రో అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి క్యూబాను అమెరికా శత్రుదేశంగా భావిస్తూ వచ్చింది. అంతర్జాతీయంగా క్యూబాను ఏకాకి చేసే ప్రయత్నమూ జరిగింది. 88 ఏళ్ల తర్వాత క్యూబాలో పర్యటిస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే.

బ్రసెల్స్‌లో బాంబు పేలుళ్లు: 35 మంది మృతి
యూరోప్‌లోని బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లు సృష్టించారు. మార్చి 22న బ్రసెల్స్‌లోని జావెంటెమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు అత్యంత శక్తిమంతమైన పేలుళ్లకు, యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం దగ్గర్లోని భూగర్భ మెట్రోస్టేషన్లో ఓ భారీ విస్ఫోటనానికి పాల్పడి 34 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ పేలుళ్లలో మరో 200 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. ఎయిర్‌పోర్ట్ పేలుళ్లలో 14 మంది, మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌పోర్ట్ పేలుళ్ల క్షతగాత్రుల్లో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు భారతీయ ఉద్యోగులు నిధి చాపేకర్, అమిత్ మోత్వానీ ఉన్నారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ప్రకటించింది.

క్షిపణి పరీక్షలను నిర్వహించిన ఇరాన్
అమెరికా ఆంక్షలను లెక్కచేయకుండా ఇరాన్ మార్చి 8న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఆ దేశ తూర్పు భాగంలోని అల్‌బోర్జ్ పర్వతశ్రేణి నుంచి ప్రయోగించిన క్షిపణులు.. 1400 కిలోమీటర్ల దూరంలోని ఓమన్ సముద్ర తీరభాగంలో గల లక్ష్యాలను ఛేదించాయి. ఈ పరీక్షలకు ఇరాన్ ‘ద పవర్ ఆఫ్ వెలాయత్’గా పేరుపెట్టింది. ఈ పరీక్షలు దేశ సమగ్రతను కాపాడుకోవడంలో తమ సంసిద్ధతను తెలియజేస్తాయని ఇరాన్ అధికారక న్యూస్ ఏజెన్సీ ఇర్నా ప్రకటించింది.

ఇండోనేసియాలో సంపూర్ణ సూర్యగ్రహణం
ఇండోనేసియాలో మార్చి 8న సంపూర్ణ సూర్యగ్రహణం కన్పించింది. భారత్ పాటు ఆసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవించింది. గ్రహణం.. హిందూ మహాసముద్రం నుంచి ప్రారంభమై సుమత్రా, బోర్నియా, సులావెసి, ఆస్ట్రేలియా గుండా ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ముగిసింది.

మయన్మార్ అధ్యక్షుడిగా టిన్ క్వా
మయన్మార్ అధ్యక్షుడిగా టిన్ క్వా మార్చి 15న ఎన్నికయ్యారు. ఆయన గతంలో అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధ్యక్షురాలు అంగ్ సాన్ సూచీ డ్రైవర్‌గా పనిచేయడంతో పాటు ఆమెకు ప్రధాన అనుచరుడిగా మెలిగారు. ఆర్మీ రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశాన్ని కోల్పోయిన సూచీ.. టిన్ క్వాను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు.

బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా
అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ఖాతా నుంచి సుమారు వంద మిలియన్ డాలర్ల సొమ్ము గల్లంతైన ఉదంతంపై బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అతీవుర్ రహ్మాన్ మార్చి 15న తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి షేక్ హసీనాను కలసి రహ్మాన్ తన రాజీనామా లేఖను అందజేశారు. రహ్మాన్ ఏడేళ్లపాటు ఈ పదవిలో ఉన్నారు. అమెరికా బ్యాంకు ఖాతాలో ఉన్న బంగ్లా ప్రభుత్వ నిధులను గుర్తుతెలియని హాకర్లు కొల్లగొట్టారు. కొన్ని వారాల కిందట వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బంగ్లా ప్రభుత్వాన్ని కుదిపేసింది. హాకర్లు 101 మిలియన్ డాలర్లను కొల్లగొట్టారని, 81 మిలి యన్ డాలర్లు ఫిలిప్పీన్స్‌కు, మిగతా డబ్బులు శ్రీలంకకు తరలించారని బ్యాంకు తెలిపింది.

ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు
 ఉత్తర కొరియాపై కఠినమైన ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) మార్చి 2న ఆమోదం తెలిపింది. ఈ ఆంక్షల్లో భాగంగా ఉత్తరకొరియాలోకి ప్రవేశించే, ఆ దేశం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాల్లో సరుకు రవాణాను తనిఖీ చేస్తారు. ఉత్తర కొరియాకు ఆయుధాల అమ్మకం, ఆయుధ పరిజ్ఞానం బదిలీ పై ఆంక్షలు ఉంటాయి. దీంతో పాటు విమాన ఇంధనం, బంగారం, టైటానియం, బొగ్గు, ఇనుము ఎగుమతులపై నిషేధం, ఆ దేశం నుంచి దౌత్యవేత్తలను ఉపసంహరణ వంటి అంశాలు ఆంక్షల్లో ఉన్నాయి.

అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రదాడి
అఫ్గానిస్థాన్ (జలాలాబాద్)లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు మార్చి 2న దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక అఫ్గాన్ భద్రతాధికారితో పాటు ఎనిమిది మంది పౌరులు మరణించారు. భద్రతా దళాలు జరిపిన దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్
పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఆశ్చర్యపరిచే నిర్మాణశైలితో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైల్వేస్టేషన్ న్యూయార్క్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఆల్‌ఖైదా ఉగ్రవాదుల 9/11 దాడుల్లో 14 ఏళ్ల కిందట కూల్చివేసిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతంలోనే దీన్ని నిర్మించారు.

ఐఎస్‌ఎస్ నుంచి తిరిగివచ్చిన వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి ముగ్గురు వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగివచ్చారు. వీరు ప్రయాణించిన ప్రత్యేక వాహనం కజకిస్థాన్‌లోని ఝెజ్‌కాజ్గాన్‌లో మార్చి 2న సురక్షితంగా దిగింది. స్కాట్ కెల్లీ, మిఖైల్ కోర్నెంకో, సెర్గీ వోల్కోవ్ అనే ముగ్గురు వ్యోమగాములు రికార్డు స్థాయిలో ఏడాదిపాటు అంతరిక్షంలో గడిపి తిరిగి భూమికి చేరుకున్నారు. సమీప భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి మానవులను పంపే యత్నాలకు సంబంధించి వీరు కీలకమైన పరిశోధనలు నిర్వహించారు. వీరు 2015 మార్చి 27న ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. తర్వాతి బృందం మార్చి 18న ఐఎస్‌ఎస్‌కు పయనం కానుంది. నాసా వ్యోమగామి జెఫ్ విలియమ్స్, రష్యాకు చెందిన ఒలెగ్ స్క్రిప్రోచ్కా, లెక్సీ వోవ్‌చినిన్‌లు ఈ బృందంలో ఉన్నారు.

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2016 అంతర్జాతీయం
టిబెట్ ప్రధాన మంత్రిగా లోబ్సంగ్ సాంగే
టిబెట్ ప్రధాన మంత్రిగా న్యాయ కోవిదుడు, రాజకీయవేత్త లోబ్సంగ్ సాంగే ఏప్రిల్ 27న తిరిగి ఎన్నికయ్యారు. ధర్మశాల నుంచి పాలన సాగుతున్న టిబెట్‌కు సాంగే తొలిసారి 2011 ఆగస్టులో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 

పపువా న్యూగినియాలో రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 28 నుంచి 2 రోజుల పాటు పపువా న్యూగినియాలో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి పీటెర్ ఓ నీల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఆ దేశంలో చమురు, సహజ వాయువుల వెలికితీత, అభివృద్ధిలో సహకరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ ఆ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 100 మిలియన్ డాలర్ల రుణం, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు మందులు అందజేసేందుకు అంగీకరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 209 మిలియన్ డాలర్లుగా ఉంది. పపువా అతిపెద్ద పసిఫిక్ ఐలాండ్ దేశం. ఆ దేశ జనాభా 7.1 మిలియన్లు. విస్తీర్ణం 462.840 చ.కి.మీ. ఈ దేశంలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.

పారిస్ ఒప్పందంపై 171 దేశాల సంతకాలు
గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 22న భారత్ సంతకం చేసింది. 2015 డిసెంబర్‌లో కుదిరిన ఈ ఒప్పందంపై భారత్ తరఫున కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంతకం చేశారు. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 171 దేశాలు సంతకాలు చేశాయి. ఒక అంతర్జాతీయ ఒప్పందంపై ఒకే రోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి. 

20 డాలర్ల నోటుపై బానిస నేత చిత్రం
బానిసత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సామాజిక కార్యకర్త హరీట్ టబ్‌మన్ చిత్రాన్ని 20 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని అమెరికా చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఈ నోటుపై ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ స్థానంలో టబ్‌మన్ చిత్రాన్ని ఉంచాలని నిర్ణయంచారు. సుమారు 1820లో బానిసగా జన్మించిన టబ్‌మన్ వందలాది మందిని బానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి కృషి చేశారు.

ఐక్యరాజ్యసమితిలో అంబేడ్కర్ జయంతి
ఐక్యరాజ్యసమితిలో తొలిసారి ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ (125వ) జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఐరాస అభివృద్ధి కార్యక్రమం నిర్వాహకురాలు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, ఐరాస లోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 2030 అభివృద్ధి అజెండా సాధనకు, అంబేడ్కర్ ఆశయాల మేరకు ప్రపంచవ్యాప్తంగా పేద, బడుగు వర్గాల అభివృద్ధికి భారత్‌తో కలిసి కృషి చేస్తామని క్లార్క్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి ఆశయ సాధనకు అసమానతలపై పోరు అనే అంశంపై చర్చ జరిగింది.

ఈక్వెడార్‌లో భూకంపం 235 మంది మృతి
ఈక్వెడార్‌లో ఏప్రిల్ 16న సంభవించిన భూకంపం వల్ల 235 మంది మరణించగా, 1557 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం వల్ల మాంటా, పోర్టోవిజో, గయాక్విల్ నగరాల్లో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా సంభవించింది. రాజధాని క్విటోకు వాయవ్య దిశలో 170 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈక్వెడార్‌తో పాటు పెరూ ఉత్తర ప్రాంతం, కొలంబియా దక్షిణ ప్రాంతంలోనూ భూమి కంపించింది. 

వివిధ దేశాల్లో మానవ హక్కులపై అమెరికా నివేదిక
పోలీసులు, భద్రతా దళాల దూషణలే భారత్‌లో అతిముఖ్యమైన హక్కుల సమస్యలని అమెరికా వెల్లడించింది. 2002లో గుజరాత్ అల్లర్లకు బాధ్యులను గుర్తించి వారికి శిక్ష విధించటంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటంపై పౌర సమాజంలో తీవ్రమైన నైరాశ్యం నెలకొందని తెలిపింది. 2015 సంవత్సరానికి వివిధ దేశాల్లో మానవహక్కుల అమలుపై విడుదల చేసిన నివేదికలో అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాలను పేర్కొంది. భారత్‌తోపాటు పలు ఆసియా దేశాల్లో పరిస్థితిపైనా వేర్వేరుగా నివేదికలు విడుదల చేసింది. పోలీసులు, భద్రతా దళాల వేధింపులు, అత్యాచారాలు, అధికారిక హత్యలే ప్రధాన మానవహక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. క్షేత్రస్థాయి వరకు పేరుకుపోయిన అవినీతి, ఎస్సీ, ఎస్టీ మహిళలు, చిన్నారులపై దారుణాలు, కులం, మతం, వర్గం పేరుతో గొడవలతో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోందని ఈ నివేదికలో తెలిపింది. 1990ల్లో ఇస్లామిక్ వేర్పాటువాదుల దుశ్చర్య (దోపిడీ, అత్యాచారం, ఆస్తుల ధ్వంసం) కారణంగా వేల సంఖ్యలో కశ్మీరీ పండిట్లు ఉన్న ఊరు వదిలి జమ్మూ, ఢిల్లీతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారని ఈ నివేదిక పేర్కొంది. భారత్‌తోపాటు చైనాలోనూ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోందని పేర్కొంది. 

ఉక్రెయిన్ నూతన ప్రధాని గ్రోయిస్‌మాన్
ఉక్రెయిన్ నూతన ప్రధానిగా ప్రస్తుత సభాధ్యక్షుడు వొలోదిమర్ గ్రోయిస్‌మాన్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాని ఆర్సెనీ యత్సెన్యూక్ ఏప్రిల్ 10న రాజీనామా చేయగా ఆ దేశ పార్లమెంట్ 14న ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరిలో అధికారం చేపట్టిన యత్సెన్యూక్... రెండు నెలల క్రితమే అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రభుత్వ యంత్రాంగంతో సక్రమంగా పనిచేయించడంలో విఫలమవడం, అవినీతి, ఆర్థిక స్థిరత్వం వంటి సమస్యలను పరిష్కరించలేకపోవడంతో ఆయన మద్దతుదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. పార్లమెంట్‌లోని రెండు ప్రధాన పక్షాల ఆమోదంతో గ్రోయిస్‌మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 

టీసీఎస్‌కు 6,000 కోట్ల జరిమానా
టాటా గ్రూప్‌నకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపై విస్కాన్సిన్‌లోని అమెరికా ఫెడరల్ కోర్టు దాదాపు రూ.6,000 కోట్ల (940 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఎపిక్ సిస్టమ్స్’ తాలూకు సాఫ్ట్‌వేర్ తస్కరణ కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముంబైలోని ‘టీసీఎస్’, తన అమెరికా అనుబంధ కంపెనీ ‘టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్’ సంస్థలు కలసి ఎపిక్ సిస్టమ్స్‌కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. అలాగే నష్టపూర్వక జరిమానా కింద మరో 700 మిలియన్ డాలర్లు కూడా కట్టాలని స్పష్టంచేసింది. ఎపిక్ సిస్టమ్స్ సంస్థ... తన సాఫ్ట్‌వేర్ తస్కరించారని పేర్కొంటూ టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపైన 2014 అక్టోబర్‌లో మాడిసన్‌లోని యూఎస్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసింది.

బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం
లాటిన్ అమెరికాలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అభిశంసనకు మెజారిటీ ప్రజాప్రతినిధులు ఏప్రిల్ 18న ఆమోదం తెలపటంతో సంక్షోభం తలెత్తింది. బ్రెజిల్ కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువ సభలో 513 మంది సభ్యులు ఉండగా.. అధ్యక్షురాలి అభిశంసన తీర్మానానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించింది. అధ్యక్షురాలిపై అభిశంసన చేపట్టాలా లేదా అన్న నిర్ణయం ఎగువ సభ అయిన సెనేట్ చేతుల్లో ఉంది. సెనేట్ అభిశంసనకే నిర్ణయం తీసుకున్నట్లయితే.. ఇటీవల దిల్మాతో విభేదించి ఆమెకు కీలక ప్రత్యర్థిగా మారిన ఉపాధ్యక్షుడు మైఖేల్ టేమర్ అధ్యక్ష పగ్గాలు చేపడతారు.

3,890కి చేరిన పులుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా తొలిసారి పులుల సంఖ్య పెరిగిందని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్).. గ్లోబల్ టైగర్ ఫోరమ్ (జీటీఎఫ్) ఏప్రిల్ 11న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2010లో 3,200గా ఉన్న పులుల సంఖ్య ఈ ఏడాదికి 3,890కి చేరుకున్నట్లు తెలిపింది. భారత్, రష్యా, నేపాల్, భూటాన్ దేశాల్లో పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల ఫలితంగానే వాటి సంఖ్య పెరిగినట్లు నివేదిక అభిప్రాయపడింది. మొత్తం పులుల్లో భారత్‌లో 2,226, రష్యాలో 433, ఇండోనేషియాలో 371 పులులున్నాయి.

వాతావరణ ఒప్పందంపై 120 దేశాల సంతకాలు
భూతాపాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన కార్యచరణను అమలు చేసేందుకు 120 దేశాలు అంగీకరించాయి. ఈ దేశాలన్నీ త్వరలో వాతావరణ ఒప్పందంపై సంతకాలు కూడా చేయనున్నాయి. డిసెంబర్ నాటికి ఈ దేశాల సంఖ్య 200కు చేరొచ్చని అంచనా. ఏప్రిల్ 22న న్యూయార్క్‌లో ఈ మేరకు సమావేశం జరిగే అవకాశముంది. భూతాపాన్ని 2.0 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ప్రస్తుతానికి స్థాయికి మించిన కర్బన ఉద్ఘారాలను వాతావరణంలోకి వదులుతున్న దేశాలు 55 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయి.

ఐరాసలో తొలిసారి అంబేడ్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో నిర్వహించనున్నారు. కల్పనా సరోజ్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ హారిజాన్‌ల సహకారంతో భారత శాశ్వత ప్రతినిధుల బృందం అంబేద్కర్ 125వ జయంతిని నిర్వహిస్తోంది. అంబేడ్కర్ జయంతికి ఒకరోజు ముందు ఏప్రిల్ 13న ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలు జరుపుతారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీలు) సాధన కోసం అసమానతలపై పోరాటానికి గుర్తుగా అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నామని భారత్ బృందం తెలిపింది. ‘సుస్థిర అభివృద్ధి సాధనకు అసమానతలపై పోరాటం’పై సదస్సు కూడా నిర్వహించనున్నారు.

బ్రస్సెల్స్‌లో భారత్ - యూరోపియన్ యూనియన్ సదస్సు
13వ భారత్ - యూరోపియన్ యూనియన్ (ఈయూ) సదస్సు మార్చి 30న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగింది. ఈ సదస్సులో 2020 ఇండియా-ఈయూ ఉమ్మడి అజెండాకు ఆమోదం తెలిపారు. వచ్చే ఐదేళ్లలో భారత్-ఈయూల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ట పరచేందుకు ఈ అజెండా తోడ్పడనుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జాన్ క్లౌడే జుంకెర్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌లు పాల్గొన్నారు. 

వాషింగ్టన్‌లో నాలుగో అణు భద్రత సదస్సు
 నాలుగోది, చివరిదైన అణు భద్రత సదస్సు ఏప్రిల్ 1, 2 తేదీల్లో వాషింగ్టన్‌లో జరిగింది. సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో అణు, రేడియో ధార్మికతకు చెందిన ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ భద్రతకు ఎదురవుతున్న ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా మాట్లాడుతూ ఉగ్రవాదులు అణు దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి ప్రపంచానికి ముప్పుందన్నారు. అణ్వాయుధాలను తగ్గించడంలో పురోగతి సాధించాలని ఆయన భారత్-పాకిస్తాన్‌లను కోరారు. ఐఏఈఏ అణు భద్రత నిధికి భారత్ మిలియన్ డాలర్లను అందించనుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సదస్సులో 20 దేశాలకు చెందిన నేతలు, యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఇంటర్‌పోల్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ బెల్జియం పర్యటన
భారత ప్రధాని నరేంద్రమోదీ బెల్జియం పర్యటనలో భాగంగా మార్చి 30న ఆ దేశ ప్రధాని చార్లెస్ మిచెల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ మేరకు పునరుత్పత్తి ఇంధన రంగంలో సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిందిగా ప్రధాని మోదీ బెల్జియంను ఆహ్వానించారు. మార్చి 22న బ్రస్సెల్స్‌లో ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి భారత ప్రధాని నివాళులర్పించారు.

దోషిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
రాజ్యాంగాన్ని అతిక్రమించి కోట్లాది రూపాయల దేశ సంపదను సొంతానికి వాడుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, ఆఫ్రికన్ నేషనల్ అలియన్స్ (ఏఎన్‌సీ) నేత జాకబ్ జుమాను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం మార్చి 31న దోషిగా తేల్చింది. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఎన్‌కండ్లాలోని ఆయన ప్రైవేట్ నివాసానికి కోట్లాది రూపాయలు వినియోగించారు. భారత్‌కు చెందిన గుప్తా కుటుంబంతో జాకబ్ అక్రమ వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కోర్టు విచారణ నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. తన ప్రైవేటు నివాసం ఆధునీకరణకు ఖర్చు చేసిన ప్రభుత్వ ధ నం 16 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆయన్ను ఆదేశించింది.

అణు భద్రత సదస్సులో ప్రసంగించిన మోదీ
అణు భద్రతను భారత్ జాతీయ ప్రాధాన్యంగా గుర్తించి పటిష్టమైన సంస్థాగత ప్రణాళిక, స్వతంత్ర నియంత్రణ వ్యవస్థతో ముందుకెళ్తోందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన అణు భద్రత సదస్సు ప్రసంగంలో.. అణువ్యాప్తి నిరోధం, భద్రత అంశాలపై భారత్ తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. అణు ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు అక్రమ రవాణాను అడ్డుకోవటం, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటంపైనా భారత్ ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. ‘అణు ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ చొరవ’ పేరుతో 2017లో జరిగే సమావేశాన్ని భారత్‌లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 2005లో ‘భారీ నష్టం చేసే ఆయుధాలు, వాటి సరఫరా వ్యవస్థ చట్టం’ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలను భారత్ అమలు చేస్తోందని మోదీ వెల్లడించారు.

విదేశాల్లో ప్రముఖుల ఆస్తులను బయటపెట్టిన ఐసీఐజే
పన్నులు ఎగ్గొడుతూ కోట్లకొద్ది సంపదను విదేశాల్లో అక్రమంగా కూడబెడుతున్న దేశాధినేతలు, ప్రపంచస్థాయి నాయకులు, సెలబ్రిటీల వివరాలు బట్టబయలయ్యాయి. ఇందుకు సంబంధించిన దాదాపు కోటీ 15 లక్షల రహస్య పత్రాలు పనామా దేశానికి చెందిన ప్రముఖ సంస్థ మొసాక్ ఫోన్సెకా నుంచి లీకయ్యాయి. దాదాపు ఏడాదిపాటు ఈ పత్రాలను శోధించిన ‘ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కన్సార్టియం(ఐసీఐజే)’ ఈ వివరాలను బహిర్గతం చేసింది. దాదాపు 120 దేశాల్లోని జర్నలిస్టులు, మీడియా సంస్థలతో కూడిన ఐసీఐజేలో మన దేశం నుంచి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఉంది. దర్యాప్తులో భాగంగా 2,14,000 విదేశీ కంపెనీలకు చెందిన 2.6 టెరాబైట్ల డేటాను... 1.15 కోట్లకుపైగా పత్రాల్ని ఐసీఐజే చేజిక్కించుకుంది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి సెలబ్రిటీల వివరాలతో పాటు పుతిన్, జిన్‌పింగ్, నవాజ్ షరీఫ్, డేవిడ్ కామెరూన్, మాక్రి, పీట్రో పారోషెంకో వంటి దేశాధినేతల వివరాలను బహిర్గతం చేసింది. ఈ జాబితాలో 500 మంది భారతీయులున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 54% పెరిగిన మరణశిక్షలు
మరణశిక్షలు నిషేధించాలంటూ ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ 2015లో ఆశ్చర్యకరంగా వాటి సంఖ్య 54 శాతం పెరిగింది. అత్యధికంగా మరణశిక్షలు విధిస్తున్న దేశాల జాబితాలో చైనా, ఇరాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇక మొదటి మూడు దేశాల్లోనే దాదాపు 90 శాతం మరణశిక్షలు అమలయినట్లు వెల్లడించింది. 2014లో 22 దేశాల్లో 1,061 మరణశిక్షలు అమలుకాగా, 2015లో ఈ సంఖ్య 1,634కు పెరిగిందని తెలిపింది. 1989 తర్వాత 2015లోనే అత్యధికంగా మరణశిక్షలు విధించారు. డిసెంబర్16, 2014లో పెషావర్‌లో పాఠశాలపై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మరణశిక్షపై నిషేధాన్ని ఎత్తేసి.. 2015లో 326 మందిని ఉరి తీసిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో మరణశిక్షను నిషేధించారు. 2015లో భారత్‌లో ఒక మరణశిక్ష విధించారు. 1993లో ముంబైలో బాంబ్ పేలుళ్లతో మారణహోమం సృష్టించి 257 మృతికి కారకుడైన యాకూబ్ అబ్ధుల్ రజాక్ మెమన్‌ను గతేడాది జూలై 30న నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు.

AIMS DARE TO SUCCESS 

మే 2016 అంతర్జాతీయం
ఇస్తాంబుల్‌లో ప్రపంచ మానవతా సదస్సు
టర్కీలోని ఇస్తాంబుల్‌లో మే 23, 24 తేదీల్లో తొలి ప్రపంచ మానవతా సదస్సు (వరల్డ్ హ్యుమానిటేరియన్ సమ్మిట్) జరిగింది. ఈ సదస్సులో ఐక్యరాజ్యసమితిలోని 173 దేశాలు, ప్రైవేటు రంగాలకు చెందిన 350 మంది ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నుంచి 2,000 మంది పాల్గొన్నారు. సదస్సులో ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల్లో నిర్మాణాత్మక మార్పులకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో వివిధ అంశాల పట్ల ప్రతినిధులు తమ నిబద్ధతను ప్రకటించారు. ఇందులో సంక్షోభంలో ఉన్న పిల్లలు, యువతకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎడ్యుకేషన్ కెనాట్ వెయిట్ ఫండ్ ఏర్పాటు, అత్యవసర సహాయం కోసం పెట్టుబడులను సమర్థవంతంగా సేకరించేందుకు ఎ గ్రాండ్ బార్గైన్, అత్యంత సంక్షోభంలో ఉన్న దేశాల కోసం గ్లోబల్ ప్రిపేర్డ్‌నెస్ పార్టనర్‌షిప్, ప్రపంచవ్యాప్తంగా సురక్షిత, సుస్థిర సమాజాల నిర్మాణం కోసం కోటి మందిని సమీకరించడం వంటి అంశాలున్నాయి.

జపాన్‌లోని షిమాలో జి-7 దేశాల సదస్సు
జి-7 దేశాల 42వ సదస్సు జపాన్‌లోని షిమాలో మే 26, 27 తేదీల్లో జరిగింది. సదస్సు అనంతరం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూకే దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థికాభివృద్ధిని అత్యవసర ప్రాధాన్యత అంశంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పుని ఎదుర్కొనేందుకు ఉమ్మడి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

సిరియాలో ఐసిస్ ఆత్మాహుతి దాడుల్లో 148 మంది మృతి
సిరియాలోని జాబ్లెహ్, టార్టుస్ నగరాలపై ఉగ్రవాద సంస్థ ఐసిస్ మే 23న జరిపిన వరుస బాంబుదాడుల్లో 148 మంది చనిపోయారు. జాబ్లెహ్ 100 మంది, టార్టుస్‌లో 48 మంది చనిపోయినట్లు సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది.

సగటు ఆయుర్ధాయంలో 5 ఏళ్ల పెరుగుదల 
2000-15 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్ధాయం 5 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మే 18న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆఫ్రికా ప్రాంతంలో సగటు ఆయుర్ధాయం అత్యధికంగా 9.4 ఏళ్లు పెరిగి..60 ఏళ్లకు చేరుకుంది. అత్యధికంగా జపాన్‌లో మహిళల సగటు ఆయుర్ధాయం 86.8 ఏళ్లు ఉండగా, పురుషుల సగటు ఆయుర్ధాయం స్విట్జర్లాండ్‌లో అధికంగా 81.3 ఏళ్లని నివేదిక పేర్కొంది. అత్యల్పంగా సియైలియోన్‌లో పురుషుల సగటు ఆయుర్ధాయం 49.3 ఏళ్లు, మహిళల సగటు ఆయుర్ధాయం 50.8 ఏళ్లుగా ఉంది.

ఈజిప్టు విమాన ప్రమాదంలో 66 మంది మృతి
ఈజిప్టుఎయిర్‌కు చెందిన విమానం మే 19న మధ్యధరా సముద్రంలో కూలిన దుర్ఘటనలో 66 మంది మృతిచెందారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలిన ‘ఎంఎస్ 804’ శకలాలను ఆగ్నేయ ఏజియన్ సముద్రంలో గ్రీస్‌కు చెందిన కర్పతోస్ ద్వీపం వద్ద.. కనుగొన్నామని ఈజిప్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. విమానం సాంకేతిక లోపం వల్ల కాకుండా ఉగ్రవాద దాడి వల్లే కూలి ఉండవచ్చని ఈజిప్టు పౌర విమానయాన మంత్రి ఫాతీ చెప్పారు.

అఫ్గాన్ తాలిబాన్ చీఫ్ మన్సూర్ హతం
అమెరికా సైనిక దళాలు పాకిస్తాన్‌లో జరిపిన ద్రోన్ దాడుల్లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ గ్రూపు అగ్రనేత ముల్లాహ్ అక్తర్ మన్సూర్ హతమయ్యాడు. అఫ్గాన్ సరిహద్దులోని పాకిస్తాన్‌లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో మే 21న అమెరికా ప్రత్యేక దళాలు మానవ రహిత ద్రోన్ల ద్వారా జరిపిన వైమానిక దాడుల్లో మన్సూర్ హతమయ్యాడు. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను మన్సూర్ చేపట్టాడు. ఇప్పుడు మన్సూర్ మృతితో తాలిబాన్ కొత్త అధిపతిగా హైబతుల్లా అఖుంద్‌జాదా ఎన్నికయ్యాడు.

రాష్ట్రపతి ప్రణబ్ చైనా పర్యటన
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 24న చైనా చేరుకున్నారు. చైనాలోని ప్రముఖ వాణిజ్య నగరమైన గ్వాంగ్జౌలో ప్రణబ్‌కు ఆ విదేశాంగ ఉప మంత్రి లియూ జెన్‌మిన్ అధికారికంగా స్వాగతం పలికారు. మే 25న గ్వాంగ్జౌ భారత్-చైనా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రణబ్ ప్రసంగించారు. మే 26న బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర నాయకులతో రాష్ట్రపతి చర్చిస్తారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఆ దేశ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ ఝాంగ్ డేజియాంగ్‌లతో కూడా భేటీ అవుతారు.

లండన్‌లో అవినీతి వ్యతిరేక సదస్సు
లండన్‌లో మే 12న ప్రపంచ అవినీతి వ్యతిరేక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అంతమొందిస్తామని వివిధ దేశాధినేతలు ప్రతినబూనారు. ఈ సదస్సులో 40 దేశాల అధినేతలు, ఆర్థిక, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

బ్రెజిల్ అధ్యక్షురాలు రౌసెఫ్ సస్పెన్షన్
బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను ఆ దేశ సెనెట్ మే 12న సస్పెండ్ చేసింది. బడ్జెట్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. ఈ తీర్మానానికి సెనెట్ ఆమోదం లభించింది. దీంతో ఉపాధ్యక్షుడు మిచెల్ టెమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో డుటెర్టే విజయం
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డుటెర్టే ఎన్నికయ్యారు. మే 9న జరిగిన ఎన్నికల్లో పీడీపీ-లబాన్ పార్టీ నాయకుడు డుటెర్టే భారీ మెజారిటీతో విజయం సాధించారు. 

భారత్- అమెరికా రెడ్‌ఫ్లాగ్ విన్యాసాలు
భారత్-అమెరికా వాయు సేనల రెడ్‌ఫ్లాగ్ విన్యాసాలు అమెరికాలోని అలస్కాలో మే 13న ముగిశాయి. నాలుగు వారాల పాటు సాగిన ఈ విన్యాసాల్లో భారత్‌కు చెందిన 10 యుద్ధ విమానాలు, 170 మంది సిబ్బంది పాల్గొన్నారు.

బ్రిటన్‌లో తొలి ముస్లిం మేయర్‌గా సాదిక్ ఖాన్
 బ్రిటన్ రాజధాని లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ మే 7న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో బ్రిటన్‌లో మేయర్ పదవి చేపట్టిన తొలి ముస్లింగా రికార్డులకెక్కారు. పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్‌స్మిత్‌పై 57 శాతం ఓట్లతో విజయం సాధించారు.

డిమెన్షియాపై నివారణకు స్మార్ట్ గేమ్
మనుషుల్లో తీవ్ర మతిమరుపునకు కారణమయ్యే డిమెన్షియాను తొలిదశలోనే నిర్ధారించేందుకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్ గేమ్‌ను లండన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనికి ‘ సీ హీరో క్వెస్ట్’ అని పేరుపెట్టారు. ఇది ఆయా ప్రాంతాల్లో సంచరించే మనుషులకు సంబంధించిన సమాచారాన్ని పెద్దఎత్తున సేకరిస్తుంది.

ఐర్లాండ్ ప్రధానిగా ఎండా కెన్నీ తిరిగి ఎన్నిక
ఐర్లాండ్ ప్రధాన మంత్రి (Taoiseach)గా ఎండా కెన్నీ రెండో సారి ఎన్నికయ్యారు. ఎన్నికల నేపథ్యంలో గత 10 వారాలుగా కెన్నీ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. కెన్నీ నేతృత్వంలోని ‘ఫైన్ గేల్ పార్టీ’ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో ఆయన మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా రెండు సార్లు ఎన్నికైన ‘ఫైన్ గేల్ పార్టీ’ నాయకుడిగా కెన్నీ చరిత్ర సృష్టించారు. 2011లో ఆయన తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా డుటర్టీ ఘన విజయం
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పీడీపీ-లబాన్ పార్టీ నేత రొడ్రిగో డుటర్ట్టీ ఎన్నికయ్యారు. మే 9న జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 60 లక్షల ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. ఫిలిప్పీన్స్‌కు ఈయన 16వ అధ్యక్షుడు. డుటర్జీ గతంలో దావో నగర మేయర్‌గా పనిచేశారు. కాగా, ఈ ఎన్నికల్లో తొలిసారిగా గెరాల్డైన్ రోమన్(49) అనే ట్రాన్స్‌జెండర్ చట్టసభకు ఎన్నికయ్యారు.

న్యూజిలాండ్ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏప్రిల్ 30న న్యూజిలాండ్ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక సంప్రదాయం ప్రకారం మవోరీ తెగ అధిపతితో, ఆయన భార్యతో పరస్పరం ముక్కు రాసుకున్నారు. ముక్కు రాసుకునే సంప్రదాయాన్ని ‘హోంగీ’గా పిలుస్తారు. దీని వల్ల శ్వాస మార్పిడి జరిగి, రెండు మనసులు కలుస్తాయని విశ్వాసం. న్యూజిలాండ్ మూలవాసులైన మవోరీలు క్రీ.శ. 1280లో అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. స్వాగతం తర్వాత ప్రణబ్.. గవర్నర్ జనరల్ మట్‌పరే భేటీ అయ్యారు. మే 1న ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

AIMS DARE TO SUCCESS 

జూన్ 2016 అంతర్జాతీయం
65.3 మిలియన్లకు ప్రపంచ శరణార్థులు
ప్రపంచంలో శరణార్థులు, నివాసాలను వదిలి వెళ్లిన వారి సంఖ్య 2015 నాటికి 65.3 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్ 20న ఐక్యరాజ్య సమితి ఈ వివరాలు వెల్లడించింది. శరణార్థుల్లో పాలస్తీనియన్లు అత్యధికంగా (5 మిలియన్లకు పైగా) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో సిరియా (4.9 మిలియన్లు), అఫ్గానిస్తాన్ (2.7 మిలియన్లు) ఉన్నాయి. శరణార్థుల సంఖ్య ఒక్క 2015లోనే 5.8 మిలియన్ల మేర పెరిగింది. ప్రపంచ జనాభా 7.349 బిలియన్లు కాగా, ప్రతి 113 మందిలో ఒకరు నిర్వాసితులుగానో లేదా శరణార్థిగానో ఉంటున్నారని ఐరాస పేర్కొంది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 65.3 మిలియన్ల మంది శరణార్థుల్లో 40.8 మిలియన్ల మంది సొంత దేశంలోనే శరణార్థులుగా ఉన్నారు. మరో 21.3 మిలియన్ల మంది సరిహద్దులు దాటి వెళ్లారు. 

సియోల్‌లో ఎన్‌ఎస్‌జీ వార్షిక సమావేశం
అణు సరఫరాదారుల బృంద (ఎన్‌ఎస్‌జీ) వార్షిక సదస్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జూన్ 23, 24 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో ఎన్పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)ని సమర్థంగా అమలు చేయాలని ఎన్‌ఎస్‌జీ సభ్య దేశాలు నిర్ణయించాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కల్పించే అంశంపై చర్చలు కొనసాగుతాయని సమావేశానంతరం విడుదల చేసిన ప్రకటనలో సభ్యదేశాలు పేర్కొన్నాయి. నాన్-ఎన్పీటీ దేశాల సభ్యత్వంపై సాంకేతిక, న్యాయ, రాజకీయ కోణాల్లో కూడా పరిశీలించినట్లు సభ్యదేశాలు పేర్కొన్నాయి. ఎన్పీటీపై భారత్ సంతకం చేయనందున ఆ దేశ సభ్యత్వ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని, ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కోసం ముందుగా విధివిధానాలను రూపొందించాలని చైనా వాదించింది. దీంతో భారత్ సభ్యత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎన్‌ఎస్‌జీ సభ్యదేశాల రెండు రోజుల సదస్సు ముగిసింది.

తాష్కెంట్‌లో ఎస్‌సీఓ సదస్సు
షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌సీఓ) సదస్సు జూన్ 24న తాష్కెంట్‌లో జరిగింది. ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఎస్‌సీఓలో భారత్ సభ్యత్వం ఉపయోగపడుతుందని ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సీఓలో భారత్‌కు పూర్తి సభ్యత్వానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు జరిగాయి.

ఈయూలో ఉండలేమని తేల్చిన బ్రిటన్ వాసులు
యురోపియన్ యూనియన్‌తో నాలుగున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకునేందుకే మెజారిటీ బ్రిటన్లు మొగ్గుచూపారు. జూన్ 23న జరిగిన రెఫరెండంలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం)కే మద్దతు తెలిపారు. ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్.. ఈయూ నుంచి తప్పుకోనున్న రెండో దేశంగా (గ్రీన్‌లాండ్ తర్వాత) నిలిచింది. యూకే ఎన్నికల కమిషన్ చీఫ్ జెన్నీ వాట్సన్ ప్రతిష్ఠాత్మకమైన మాంచెస్టర్ టౌన్‌హాల్ నుంచి జూన్ 24న ఈ ఫలితాలను వెల్లడించారు. దాదాపు 3.3 కోట్ల మంది బ్రిటన్లు (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జీబ్రాల్టర్) రెఫరెండంలో పాల్గొనగా 1.74 కోట్ల మంది (51.9 శాతం) విడిపోవాలని.. 1.61 కోట్ల మంది (48.1 శాతం) ఈయూతో కలిసుండాలని తమ నిర్ణయాన్ని తెలియజేశారు. బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య తేడా 12.69 లక్షలు మాత్రమే. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో ఎక్కువ మంది యురోపియన్ యూనియన్‌లోనే ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలపగా.. ఉత్తర, మధ్య ఇంగ్లాండ్, వేల్స్, మెజారిటీ ఇంగ్లీష్ కౌంటీలు మాత్రం బ్రెగ్జిట్‌కే మొగ్గుచూపాయి. రెఫరెండం ఫలితంతో.. త్వరలోనే ప్రధాని పదవినుంచి తప్పుకోనున్నట్లు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరాన్ వెల్లడించారు.

భారత్ ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి చైనా విముఖత
భారత్ సభ్యత్వంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే అణు సరఫరాదారుల కూటమి (ఎన్‌ఎస్జీ) సభ్య దేశాల రెండ్రోజుల ప్లీనరీ జూన్ 24న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ముగిసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై భారత్ సంతకం చేయనందున... ఆ దేశానికి సభ్యత్వం అంశం పరిగణనలోకి తీసుకోవద్దని సదస్సులో చైనా వాదించింది. బ్రెజిల్, స్విట్జర్లాండ్, టర్కీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌లు చైనాకు మద్దతు తెలిపాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం ముందుగా విధివిధానాలు రూపొందించాలని చైనా కోరింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు గ్రూపులోని చాలా దేశాలు మదతిచ్చినా చైనా అడ్డుపుల్ల వేసింది.

ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడి
టర్కీలోని ప్రముఖ పర్యాటక నగరం ఇస్తాంబుల్‌లో గల అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. జూన్ 28వ తేదీన జరిగిన ఈ దాడిలో 41 మంది సామాన్యులు మృతిచెందారు. మరో 239 మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థేనని టర్కీ ప్రభుత్వం పేర్కొంది. మృతుల్లో 23 మంది టర్కీ పౌరులు కాగా.. 13 మంది విదేశీ జాతీయులు ఉన్నారు. టర్కీలో అతిపెద్దది, యూరప్‌లో అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాల్లో మూడోది, ప్రపంచ స్థాయిలో 11వ స్థానంలో ఉన్న అటాటర్క్ విమానాశ్రయానికి ముగ్గ్గురు ఆత్మాహుతి బాంబర్లు మారణహోమానికి తెరతీశారు.

రాష్ట్రపతికి ఐవరీ కోస్ట్ అత్యున్నత పురస్కారం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఐవరీ కోస్ట్ పర్యటనలో భాగంగా జూన్ 15న ఆ దేశ అధ్యక్షుడు అలాసనే యుటారాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోకో ఉత్పత్తి కేంద్రమైన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీని అలాసనే కోరారు. పర్యటన సందర్భంగా ఐవరీ కోస్టు అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ నేషనల్ ఆర్డర్‌ను ప్రణబ్‌కు అలాసనే ప్రదానం చేశారు.

రాష్ట్రపతి నమీబియా పర్యటన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నమీబియా పర్యటనలో భాగంగా జూన్ 16న ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. నమీబియా నుంచి యురేనియం దిగుమతిపై ఆ దేశ అధ్యక్షుడు హేజ్ గీంగోబ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌కు యురేనియం సరఫరాకు ఉద్దేశించిన 2009 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు నమీబియా ప్రకటించింది.

జాఫ్నా స్టేడియాన్ని ప్రారంభించిన మోదీ, సిరిసేన
శ్రీలంకలోని జాఫ్నా పట్టణంలో పునరుద్ధరించిన స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు సంయుక్తంగా జూన్ 18న ప్రారంభించారు. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సిరిసేన హాజరవగా, ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరె న్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ స్టేడియం మరమ్మతులకు భారత్ రూ.7 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి 40 ఏళ్ల జైలు శిక్ష
గూఢచర్యం కేసులో ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ కోర్టు జూన్ 18న జీవిత ఖైదు విధించింది. సహనిందితులైన మరో ఆరుగురికి మరణశిక్ష వేసింది. సైనికనిఘా సంబంధ అధికార రహస్యాలను ఖతర్‌కు, దోహాకు చెందిన ఓ టీవీ నెట్‌వర్క్‌కు మోర్సీ, ఇతర నిందితులు అందజేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కైరో క్రిమినల్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదు పండింది. వీరికి 25 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దేశ భద్రతకు సంబంధించిన పత్రాల చౌర్యానికి పాల్పడ్డారంటూ మోర్సీకి అదనంగా 15 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఈజిప్ట్ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మోర్సీ. 2012 నుంచి 2013 జూలై మధ్యకాలంలో అధ్యక్షునిగా కొనసాగారు.

మెక్సికోలో మోదీ పర్యటన
ప్రధాని మోదీ మెక్సికో పర్యటనలో భాగంగా జూన్ 9న ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటోతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో సహకార విస్తరణపై ఇరు దేశాల నేతలు చర్చించారు. చర్చల అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి మద్దతిస్తున్నట్లు మెక్సికో ప్రకటించింది. 

మలబార్ విన్యాసాల్లో పాల్గొన్న భారత్, అమెరికా, జపాన్
మలబార్ ఎక్సర్‌సైజ్ పేరుతో భారత్, అమెరికా, జపాన్‌లు జూన్ 10న నౌకాదళ విన్యాసాలను ప్రదర్శించాయి. సైనిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర సమన్వయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తూర్పు చైనా సముద్రంలోని వివాదాస్పద జలాలకు చేరువలో ఈ యుద్ధ విన్యాసాలు జరిగాయి. వీటిలో భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, సాత్పుర, శక్తి, కిర్చ్‌లతో పాటు మొత్తం 22 యుద్ధ నౌకలు, ఒక అణు జలాంతర్గామి, 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. 1992 నుంచి భారత్, అమెరికాలు ఏటా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి.

రాష్ట్రపతి ఘనా పర్యటన
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఘనా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించి ఇరు దేశా ల మధ్య జూన్ 13న మూడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో దౌత్య, అధికారిక పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా నిబంధన తొలగింపు, ఇరు దేశాల మధ్య వివిధ అంశాలను సమీక్షించేందుకు ఉమ్మడి కమిషన్ ఏర్పాటు వంటి అంశాలున్నాయి. 

అమెరికాలో నైట్ క్లబ్‌పై దాడిలో 49 మంది మృతి
అమెరికాలోని ఓ నైట్‌క్లబ్ (ఆర్లాండోలోని)లో సాయుధ దుండగుడు జూన్ 11న జరిపిన కాల్పుల్లో 49 మంది మరణించగా, 53 మంది గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన దుండగుణ్ని ఫ్లోరిడాకు చెందిన ఒమర్ సిద్ధిఖీ మతీన్ (29)గా అధికారులు గుర్తించారు. ఈ దాడి ఉగ్రవాద చర్యేనని ఎఫ్‌బీఐ నిర్ధారించింది.

పాక్‌లో చైనా భారీ పెట్టుబడులు
పాకిస్తాన్‌లో రైల్వే నెట్‌వర్క్, గ్యాస్ పైప్‌లైన్ నిర్మించడానికి చైనా 8.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.56 వేల కోట్లు) వెచ్చించనుంది. సెంట్రల్ డెవలప్‌మెంట్ వర్కింగ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 85 శాతం మొత్తాన్ని చైనా రుణంగా ఇవ్వనుంది. పాకిస్తాన్ రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు ఏడు బిలియన్ డాలర్లు, ఇరాన్ నుంచి గ్యాస్‌పైప్‌లైన్ నిర్మాణం కోసం 1.4 బిలియన్ డాలర్లు ఇవ్వనుంది. 2021 నాటికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పాక్ ప్రభుత్వం తెలిపింది.

భారత్-అఫ్గాన్ ఫ్రెండ్‌షిప్ డ్యాం ప్రారంభం
అఫ్గానిస్తాన్ లో భారత ఆర్థిక సాయంతో నిర్మించిన భారత్- అఫ్గాన్ ఫ్రెండ్‌షిప్ డ్యాంను ఆ దే శాధ్యక్షుడు అషఫ్రఘనీతో కలసి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూన్ 5న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్ రూ.1,700 కోట్ల ఆర్థిక సహాయం చేయడం తోపాటు సాంకేతిక సహకారాన్ని అందించింది. ఇరాన్ సరిహద్దుల్లోని హరి రుడ్ నదిపై హెరాత్ సమీపంలో ఈ డ్యాంను నిర్మించారు.

ప్రధాని నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ పర్యటన
స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూన్ 6న ఆ దేశ అధ్యక్షుడు జోహన్ ష్నీడర్ అమ్మన్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి మద్దతిస్తామని ష్నీడర్ ప్రకటించారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెలికితీయడం, ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించే అంశంపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి.

ప్రజా సంక్షేమంలో ఉత్తమ దేశంగా స్వీడన్
ప్రజా సంక్షేమంలో ఉత్తమ దేశంగా స్వీడన్ నిలిచింది. లండన్‌కు చెందిన ఓ సంస్థ గుడ్ కంట్రీ-2015 పేరుతో జూన్ 3న విడుదల చేసిన జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో నిలవగా, భారత్ 70 స్థానంలో నిలిచింది. ప్రజల సంక్షేమం కోసం ఆయా దేశాలు చేస్తున్న కృషిపై సర్వే నిర్వహించి 163 దేశాలతో జాబితాను రూపొందించారు. సైన్స్ అభివృద్ధి, సంస్కృతి, శాంతి భద్రతలు, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సమానత్వం వంటి 35కు పైగా అంశాల్లో ఐరాస, ప్రపంచ బ్యాంకు సూచీలను తీసుకొని సర్వే నిర్వహించారు.

భారత్ ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి అమెరికా మద్దతు
అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు ప్రకటించారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ జూన్ 7న వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఒమామాతో భేటీ అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇరువురు అగ్ర నేతలూ భేటీ కావటం ఇది ఏడోసారి. ప్రస్తుత భేటీలో.. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం, క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంసీటీఆర్)లో భారత్ ప్రవేశం, వాతావరణ మార్పు, ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్యం తదితర అంశాలపై చర్చించారు. మరోవైపు క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లో భారత్‌ను సభ్యదేశంగా చేర్చుకోవటానికి అందులోని సభ్యదేశాలన్నీ ఆమోదం తెలిపాయి. మొత్తం 34 సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశమూ భారత్ చేరికకు అభ్యంతరం తెలుపలేదని దౌత్యవేత్తలు జూన్ 7న వెల్లడించారు.

అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి ప్రసంగించారు. జూన్ 8న వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో హౌస్ ఆఫ్ చాంబర్స్‌లో ఈ సమావేశం జరిగింది. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానుల్లో మోదీ ఆరవ వ్యక్తి. తొలి ప్రధాని నెహ్రూ 1949 అక్టోబర్ 13న అక్కడ ప్రసంగించారు. తరవాత జూన్ 13, 1985న రాజీవ్ గాంధీ ప్రసంగించారు. 1994 మే18న పీవీ నరసింహరావు, 2000 సెప్టెంబర్ 14న వాజ్‌పేయి, 2005 జూలై 19న మన్మోహన్ అగ్రదేశ పార్లమెంటులో ప్రసంగించారు.

‘బానిసత్వం’లో భారత్‌దే తొలిస్థానం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బానిసల్లో ఎక్కువమంది భారత్‌కు చెందినవారేనని 2016 ప్రపంచ బానిసత్వ సూచిక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 4.6 కోట్ల మంది ప్రజలు బానిసత్వంలో మగ్గుతున్నారని అందులో 1.84 కోట్ల మంది భారత్‌కు చెందిన వారేనని తాజా నివేదక వె ల్లడించింది. వ్యభిచారం, భిక్షాటన, నిర్బంధంగా పనిచేసే కార్మికులు ఆధునిక బానిసలుగా మారుతున్నారని వివరించింది. ఆస్ట్రేలియాలోని వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారత్ తరువాత ఐదు ఆసియా దేశాలు వరుసగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్‌లు నిలిచాయి. ఉత్తర కొరియా, ఇరాన్, ఎరిత్రియా, హాంకాంగ్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, గ్వినియా, డెమోక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ సూడాన్ దేశాల్లో ఈ అధునిక బానిసత్వంపై కనీస చర్యల్ని ప్రభుత్వాలు తీసుకోవడం లేదని నివేదిక చెప్తోంది. నెదర్లాండ్స్, అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, క్రొయేషియా, స్పెయిన్, బెల్జియం, నార్వేలు దీనిపై పటిష్టంగా పోరాడుతున్నాయంది. 

అత్యంత పొడవైన రైల్వే సొరంగం ప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గాన్ని స్విట్జర్లాండ్‌లోని ఎర్ట్స్‌ఫెల్డ్‌లో జూన్ 1 లాంఛనంగా ప్రారంభించారు. ఈ మార్గాన్ని ఆల్ప్స్ పర్వాతాల కింద నిర్మించారు. యూరప్ దేశాల మధ్య రవాణాను ఇది మరింత సులభతరం చే స్తుంది. ‘గొత్థార్డ్ బేస్ టన్నెల్’గా పిలిచే దీని పొడవు 57 కి.మీ. కాగా, కొన్నిచోట్ల ఉపరితలానికి 2.3 కి.మీ దిగువన ఉంటుంది. ఈ మార్గంలో నడిచిన తొలి రైలులో ప్రయాణించిన వారిలో స్విస్ అధ్యక్షుడు స్నీడర్-అమ్మన్‌తోపాటు జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్, ఇటలీ ప్రధాని రెంజి కూడా ఉన్నారు. దీన్ని నిర్మించడానికి 17 ఏళ్లు పట్టింది. రూ.8,100 కోట్లు ఖర్చు చేశారు. దీని వల్ల స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్, ఇటలీలోని మిలాన్ మధ్య ప్రయాణ కాలం గంట తగ్గుతుంది. రైలు ఇందులో ప్రయాణించడానికి 20 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతం జపాన్‌లోని సీకన్ సొరంగమార్గం (53.9 కి.మీ) పేరు మీదున్న రికార్డును గొత్థార్డ్ బేస్ టన్నెల్ బద్దలుకొట్టింది.

AIMS DARE TO SUCCESS 

జూలై 2016 అంతర్జాతీయం
అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ, ట్రంప్ అభ్యర్థిత్వాల ఖరారు 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ జూలై 19న ఖరారయ్యారు. అభ్యర్థిత్వం కోసం 13 నెలలుగా పార్టీలోని అనేక మందితో పోటీపడి ట్రంప్ విజయం సాధించారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన 1,237 ఓట్ల (మొత్తం రిపబ్లికన్ ప్రతినిధుల ఓట్లలో సగం)ను ఆయన సాధించారు.

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ జూలై 27న ఖరారయ్యారు. ఆమె పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్‌ను స్వీకరించారు. దీంతో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కించుకున్న తొలి మహిళగా అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో హిల్లరీ తలపడనున్నారు. 68 ఏళ్ల హిల్లరీ అమెరికా విదేశాంగ మంత్రిగా, ప్రథమ మహిళగా, న్యూయార్క్ సెనెటర్‌గా గతంలో బాధ్యతలు నిర్వహించారు.

నేపాల్ ప్రధాని కేపీ ఓలి రాజీనామా
నేపాల్ ప్రధాని కేపీ ఓలి జూలై 24న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించుకోగా, అధికార కూటమిలోని మధేసి పీపుల్స్ రైట్స్ ఫోరమ్, డెమోక్రాటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు సైతం హామీలను నెరవేర్చడంలో ఓలి విఫలమయ్యారంటూ అవిశ్వాసానికి మద్దతిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓలి తన పదవికి రాజీనామా చేశారు.

కాబూల్ ఉగ్ర దాడిలో 80 మంది మృతి
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో జూలై 24న ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 80 మంది మరణించగా, 231 మంది గాయపడ్డారు. అభివృద్ధికి దూరంగా ఉన్న తమ ప్రాంతంలో ప్రధాన విద్యుత్ లైన్ వేయాలనే డిమాండ్‌తో కాబూల్‌లోని దే మజాంగ్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న హజారా వర్గీయులపై ఈ ఉగ్ర దాడి జరిగింది.

పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్టు ప్రారంభం
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్టును బంగ్లా ప్రధాన మంత్రి షేక్ హసీనాతో కలసి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూలై 21న ప్రారంభించారు.ఇది ఆసియాలోనే అతిపెద్ద ల్యాండ్ పోర్టు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యానికి పెట్రాపోల్-బెనాపోల్ ప్రధాన సరిహద్దు మార్గం. యాభై శాతానికి పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. భద్రత, ఇమిగ్రేషన్, కస్టమ్స్ వంటి ముఖ్య సేవలను సమర్థవంతంగా పెట్రాపోల్ ఐసీపీ అందిస్తుంది.

మంగోలియాలో 11వ ఆసియా-యూరప్ సదస్సు
మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో పదకొండో ఆసియా-యూరప్ సదస్సు (ఏఎస్‌ఈఎం) జూలై 15, 16 తేదీల్లో జరిగింది. భారత్ తరఫున సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం కఠినంగా అణిచివేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భారత్ సహా 51 దేశాలు పాల్గొన్నాయి. ఆసియా, యూరప్ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

బాస్టిల్ డే ఉగ్ర దాడిలో 84 మంది మృతి
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా జూలై 15న నీస్ నగరంలో ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలపై ఓ ఉగ్రవాది ట్రక్కుతో దూసుకెళ్లిన దుర్ఘటనలో 84 మంది మృతి చెందారు. ఆ సమయంలో దాదాపు 30 వేల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్ మృతిచెందాడు. ట్రక్కు డ్రైవర్ ట్యునీసియాలో జన్మించిన ఫ్రాన్స్ పౌరుడని, అతడి పేరు మొహమమ్మద్ లాహౌయీజ్ బోహల్లెల్‌గా గుర్తించారు. దాడి జరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు హోలాండే ప్రకటించారు. 

టర్కీలో సైనిక తిరుగుబాటు
టర్కీలో అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ నుంచి అధికారాన్ని చేజిక్కుంచుకోవటం లక్ష్యంగా జూలై 15వ తేదీ రాత్రి ఆ దేశ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసింది. తిరుగుబాటును ప్రభుత్వ అనుకూల సైన్యం అడ్డుకుంది. రాజధాని అంకారాలోనూ, ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లోనూ తిరుగుబాటు వర్గం దాడి చేసింది. ఈ సందర్భంగా జరిగిన హింసలో 104 మంది తిరుగుబాటు సైనికులు సహా మొత్తం 265 మంది చనిపోయారు. సుమారు 8 వేల మంది తిరుగుబాటు సైనికులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. జూలై 15ను ప్రజాస్వామ్య దినోత్సవంగా నిర్వహిస్తామని టర్కీ ప్రధాన మంత్రి బినాలి ఇల్దిరిమ్ ప్రకటించారు.

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఆయన పార్టీ అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన 1,237 ఓట్లు (మొత్తం రిపబ్లికన్ ప్రతినిధుల ఓట్లలో సగం) సాధించారు. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ అధికారికంగా ధ్రువీకరించారు. ఏడాది క్రితం పార్టీలో చేరిన ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ నినాదంతో బరిలో ఉన్న జాన్ కసిచ్, జెబ్ బుష్ లాంటి ప్రముఖులను ప్రైమరీల్లో ఓడించారు. నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్‌తో ట్రంప్ పోటీపడనున్నారు. ట్రంప్‌కు డిప్యూటీగా (ఉపాధ్యక్ష పోటీదారుగా) ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్ నామినేట్ అయ్యారు.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రిగా టర్న్‌బుల్ ఎన్నిక
ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన మంత్రి టర్న్‌బుల్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమి విజయం సాధించింది. మొత్తం 150 సీట్లున్న పార్లమెంటులో లిబరల్-నేషనల్ కూటమి 74 స్థానాలు దక్కించుకుంది. బిల్ షార్టెన్ నాయకత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ 66 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో ఆసీస్ ప్రధాన మంత్రిగా టర్న్‌బుల్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.

బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరిసా మే జూలై 13న ప్రమాణ స్వీకారం చేశారు. థెరిసా (59) ఇప్పటి వరకూ దేశ హోంమంత్రిగా ఉన్నారు. ఉక్కు మహిళగా పేరుపడ్డ మార్గరెట్ థాచర్ అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న మహిళా నేత థెరిసా గుర్తింపు పొందారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ (బ్రెగ్జిట్) జూన్ 23న నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో తీర్పు వెల్లడవటంతో.. బ్రెగ్జిట్‌ను బలంగా వ్యతిరేకించిన కామెరాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. జూలై 13న కామెరూన్ తన పదివికి రాజీనామా చేశారు.

చైనా చారిత్రక హక్కులు చెల్లవన్న ట్రిబ్యునల్
దక్షిణ చైనా సముద్రంలో తనకు చారిత్రక హక్కులు ఉన్నాయన్న చైనా వాదనను ఐక్యరాజ్యసమితి నియమిత అంతర్జాతీయ ట్రిబ్యునల్ జూలై 12న కొట్టివేసింది. అయితే ట్రిబ్యునల్ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తిరస్కరించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతానికి పైగా ప్రాంతంపై తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ పట్టుపడుతున్న చైనా వాదనకు ఎటువంటి న్యాయపరమైన ప్రాతిపదికా లేదని ద హేగ్‌లోని ట్రిబ్యునల్ కొట్టివేసింది. దక్షిణ చైనా సముద్రంలోని దీవులను తమ చక్రవర్తులు శతాబ్దాల కిందట కనుగొన్నారని, చరిత్ర అంతటా ఆ ప్రాంతంపై హక్కులు కలిగివున్నారని చైనా వాదిస్తోంది. అందులో కృత్రిమంగా దీవులు నిర్మించి, వాటిపై సైనిక స్థావరాలనూ ఏర్పాటు చేస్తోంది. చైనా వాదనను ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, బ్రూనై, తైవాన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ 2013లో ఐక్యరాజ్యసమితి శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టుకు ఫిర్యాదు చేయగా.. ఆ కోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.

నేపాల్ ప్రధాన మంత్రిపై అవిశ్వాసం
నేపాల్ ప్రధాన మంత్రి ఖడ్గ ప్రసాద్ ఓలిపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో సీపీఎన్-యూఎంఎల్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో మావోయిస్టు సెంటర్ మంత్రులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఓలి తాను పదవి నుంచి వైదొలగనని, పార్లమెంటులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సెంటర్, నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ), సీపీఎన్ (యునెటైడ్).. ఓలీపై నేపాల్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. 601 మంది సభ్యులు గల పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు మూడింటికి కలిపి 292 మంది సభ్యులున్నారు. ఓలి పార్టీ యూఎంఎల్‌కి 175 మంది సభ్యులున్నారు. తీర్మానం గట్టెక్కడానికి 299 మంది సభ్యుల మద్దతు అవసరం.

బాగ్దాద్ ఆత్మాహుతి పేలుళ్లలో 200 మంది మృతి
 ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జూలై 2న (అర్ధరాత్రి) ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 200 మంది మరణించగా, మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. దీంతోపాటు జూన్ 28న టర్కీలోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది మృతి చెందగా, 230 మందికిపైగా గాయపడ్డారు. 

హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో 105వ స్థానంలో భారత్
హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. మొత్తం 130 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం సందర్భంగా ఆయా దేశాలు.. ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రతిభను గుర్తించడం, అభివృద్ధి చేయడం వంటి అంశాల ఆధారంగా జూన్ 27న ర్యాంకులను ప్రకటించారు. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌లు నిలిచాయి. భారత్ కంటే చైనా (71), బంగ్లాదేశ్ (104), భూటాన్ (91), శ్రీలంక (50) వంటి దేశాలు మెరుగైన స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాల్లో భారత్ చివరి స్థానంలో ఉంది.

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2016 అంతర్జాతీయం
2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లు
 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో (పీఆర్‌బీ) పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్ పాపులేషన్ డేటాషీట్‌లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటా షీట్‌ను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది.

కొలంబియా ప్రభుత్వంతో ఫార్క్ శాంతి ఒప్పందం
వామపక్ష తీవ్రవాద సంస్థ.. కొలంబియా విప్లవ సాయుధ బలగాల (ఎఫ్‌ఏఆర్‌సీ-ఫార్క్)తో ఆ దేశ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు పక్షాలు క్యూబా రాజధాని హవానాలో ఆగస్టు 24న ప్రకటన విడుదల చేశాయి. దీంతో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో 1964లో ప్రారంభమైన అంతర్యుద్ధానికి తెరపడనుంది. దీనివల్ల ఇప్పటివరకు 2.6 లక్షల మంది మరణించగా, 68 లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు.

ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో షారుక్, అక్షయ్
ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల టాప్-10 జాబితాలో (2016కు) బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో షారుక్ ఖాన్ రూ. 221 కోట్లతో ఎనిమిదో స్థానంలో, అక్షయ్ కుమార్ రూ. 211 కోట్ల ఆదాయంతో పదో స్థానంలో (బ్రాడ్ పిట్‌తో కలిసి) ఉన్నారు. హీరో సల్మాన్ ఖాన్ రూ. 191కోట్ల ఆదాయంతో 14వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ 134 కోట్ల రూపాయలతో 18వ స్థానంలో ఉన్నారు.

రెజ్లింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఐరన్ మ్యాన్, డ్వాన్ జాన్సన్ రూ. 432కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జాకీచాన్ రూ.408 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. 

టాప్ టెన్ నటుల సంపాదన(రూ.కోట్లలో)

డ్వాన్ జాన్సన్

432

జాకీ చాన్

408

మాట్ డామోన్

369

టామ్ క్రూజ్

355

జానీ డెప్

322

బెన్ అఫ్లెక్

288

బిన్ డీజిల్

234

షారుక్ ఖాన్

221

రాబర్ట్ డౌనీ జూనియర్

221

అక్షయ్ కుమార్

211


మయన్మార్‌కు అధ్యక్షుడి భారత పర్యటన
మయన్మార్ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మయన్మార్ అధ్యక్షుడు యు హతిన్ క్యా భారత పర్యటనలో భాగంగా ఆగస్టు 29న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరు, చొరబాటు కార్యక్రమాల నిరోధం, రవాణా, వైద్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సంబంధాల్ని విస్తృతం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

యాపిల్‌కు రూ.లక్ష కోట్ల జరిమానా!
యూరప్ వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా పన్ను ప్రయోజనాలు పొందిందనే నెపంతో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) 13 బిలియన్ యూరోలను (దాదాపు రూ. లక్ష కోట్లు) జరిమానా విధించింది. ఐర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహనల ఆధారంగా యూరప్‌లో దాదాపు తన వ్యాపార లాభాలన్నింటిపైనా యాపిల్ పన్నులను ఎగ్గొంట్టిందని, వెంటనే వాటిని తిరిగి చెల్లించాలిని ఈసీ తన తీర్పులో పేర్కొంది.

బహుళజాతి కంపెనీలను ఆకర్షించటం కోసం ఐర్లాండ్ చాలా ఏళ్లుగా పన్ను ప్రోత్సాహకాలనిస్తోంది. వీటినే ‘స్వీట్ హార్ట్’ డీల్స్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ఈ డీల్స్ కారణంగా యాపిల్ తన ఇతర వ్యాపారాల్లోని లాభాలపై కూడా పన్ను చెల్లించలేదని ఈసీ తెలిపింది.

ఐరాస చీఫ్ రేసులో ఆంటోనియో ఆధిక్యం
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గట్టర్స్ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. ఆగస్టు 30న ముగిసిన 15 దేశాల భద్రతా మండలి మూడో దశ ఎన్నికల్లో ఆంటోనియోకు అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు రాగా, ఒక అభిప్రాయం నమోదు కాలేదు. గట్టర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. ఈ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.


ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ల్యాండర్ -10
ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ ల్యాండర్-10.. ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్-ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ సంఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్‌షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవైన ఎయిర్ ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్‌ఏవీ) రూపొందించింది.

భారత్‌లో ఆమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూసివేత
 అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ భారత్‌లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణె, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతోపాటు తమ ఈవెంట్లను వాయిదా వేస్తున్నట్లు ఆగస్టు 17న వెల్లడించింది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో ఆమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని ప్రోత్సహించారని ఆరోపిస్తూ.. కొందరు ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆగస్టు 16, 17 తేదీల్లో ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమ్నెస్టీ ఆఫీసుల మూసివేత నిర్ణయం తీసుకుంది. 

టాప్-10 సంపన్న దేశాల్లో భారత్
న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ 7వ స్థానం (5,200 బిలియన్ డాలర్లు)లో నిలిచింది. ఈ జాబితాలో 48,700 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా అగ్రస్థానం కైవసం చేసుకోగా తర్వాత రెండు, మూడు స్థానాల్లో చైనా (17,400 బిలియన్ డాలర్లు), జపాన్ (15,100 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. నాలుగు, ఐదు, ఆరవ స్థానాల్లో వరుసగా యునెటైడ్ కింగ్‌డమ్ (9,200 బిలియన్ డాలర్లు), జర్మనీ (9,100 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (6,600 బిలియన్ డాలర్లు) నిలిచాయి. ఇక కెనడా (4,700 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (4,500 బిలియన్ డాలర్లు), ఇటలీ (4,400 బిలియన్ డాలర్లు) దేశాలు భారత్ తర్వాత వరుసగా 8, 9, 10వ స్థానాల్లో ఉన్నాయి.

ఇటలీలో భారీ భూకంపం.. 120 మంది మృతి
ఇటలీలో ఆగస్టు 24 తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. 6.0 నుంచి 6.2 తీవ్రతతో దేశంలో పలు ప్రాంతాల్లో వచ్చిన భూ ప్రకంపనల వల్ల 120 మంది మృతి చెందగా 368 మందికిపైగా గాయాలయ్యాయి. భూకంపం ధాటికి ఎమాట్రిస్ నగరం పూర్తిగా ధ్వంసమైంది. 

2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత ఆ స్థాయిలో మళ్లీ ఇప్పుడు సంభవించింది.

ఫోర్బ్స్ జాబితాలో దీపికా పదుకొనే
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తొలిసారిగా ఫోర్బ్స్ జాబితాలోకెక్కింది. ఈ మేగజీన్ విడుదల చేసిన ‘‘ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే హీరోయిన్ల జాబితా’’ లో దీపికా ఏడాదికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.67.7 కోట్లు) రెమ్యూనరేషన్‌తో పదో స్థానంలో నిలిచింది. 2007లో షారుఖ్ ఖాన్ సరసన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో దీపికా పదుకొనే తెరంగేట్రం చేసింది.

ఆస్కార్ విజేత, హంగర్ గేమ్స్ నటీమణి లారెన్స్ ఈ జాబితాలో 46 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.308.69 కోట్లు) వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలిచింది.

టాప్-10 నటీమణుల సంపాదన (రూ.కోట్లలో)

జె న్నిఫర్ లారెన్స్

308.82

మెలిస్సా మెకార్తీ

221.57

స్కార్లెట్ జొహాన్‌సన్

167.86

జెన్నిఫర్ అనిస్టన్

140.98

ఫ్యాన్ బింగ్‌బ్యాంగ్

114.14

చార్లిజ్ థెరాన్

110.78

అమీ ఆడమ్స్

90.64

జూలియా రాబర్ట్స్

80.56

మిలా కునిస్

73.85

దీపికా పదుకునే

67.70



ఫోర్బ్స్ టెక్ కుబేరుల్లో ప్రేమ్‌జీ, శివ్ నాడార్
ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ప్రపంచపు టెక్నాలజీ రంగంలోని ‘‘టాప్-100 అత్యంత సంపన్నుల జాబితా’’ లో భారత్ నుంచి ఇద్దరు స్థానం పొందారు. వీరిలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఉన్నారు. ప్రేమ్‌జీ 16 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానంలో, నాడార్ 11.6 బిలియన్ డాలర్ల సంపదతో 17వ స్థానంలో నిలిచారు.

ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 78 బిలియన్ డాలర్లు. తర్వాతి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. 

మానవ వనరుల సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన హ్యూమన్ క్యాపిటల్ సదస్సు-2016లో ఆగస్టు 10న ‘బిల్డింగ్ ఎ ఫ్యూచర్ రెడీ వర్క్‌ఫోర్స్, ఇండియన్ ఎక్స్‌పీరియెన్స్’ అనే అంశంపై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రసంగించారు. వచ్చే ఐదేళ్లలో పది లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సులో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే, ప్రపంచ బ్యాంక్ మానవాభివృద్ధి విభాగం డెరైక్టర్ అమిత్ ధర్ తదితరులు పాల్గొన్నారు.

ఎంఎస్ సుబ్బులక్ష్మి స్మారకార్థం ఐరాస స్టాంపు
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మికి అత్యంత అరుదైన గౌరవం దక్కనుంది.సుబ్బులక్ష్మి శతజయంతి సందర్భంగా ఆమె స్మారకార్థం ఐక్యరాజ్యసమితి ఒక స్టాంపును విడుదల చేసింది. 70వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జనరల్ అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేశారు. 

ఐరాసలో రెహమాన్ సంగీత కచేరీ
ఆగస్టు 15న ఐరాస జనరల్ అసెంబ్లీ హాలులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరీ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక భారతీయుడు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. 1966 అక్టోబరులో సుబ్బులక్ష్మి మొదటిసారి ఇక్కడ కచేరీ చేశారు.

ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల హోం మంత్రుల సదస్సు
సార్క్ దేశాల హోం మంత్రుల 7వ సదస్సు ఆగస్టు 4న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఉగ్రవా దాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకొని, వాటిని ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సార్క్ సభ్యదేశమైన బంగ్లాదేశ్ మినహా అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మాల్దీవుల హోం మంత్రులు పాల్గొన్నారు.

నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణం
నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు చీఫ్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆగస్టు 4న ప్రమాణస్వీకారం చేశారు. ఆగస్టు 3న పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్-మావోయిస్టు సెంటర్ చీఫ్ ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు, వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. 

థాయ్‌లాండ్ సైనిక రాజ్యాంగానికి ప్రజామోదం
సైన్యం రూపొందించిన రాజ్యాంగానికి సంబంధించి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజార్టీ ఓట్లు అనుకూలంగా వచ్చినట్లు థాయ్‌లాండ్ ఎన్నికల సంఘం ఆగస్టు 6న వెల్లడించింది. కొత్త రాజ్యాంగం ప్రకారం 2017లో ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వంపై సైన్యానికి నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. సెనేట్‌లో సైనిక కమాండర్లకు స్థానాలను రిజర్వు చేస్తారు.

నేపాల్ ప్రధాన మంత్రిగా ప్రచండ ఎన్నిక 
నేపాల్ కొత్త ప్రధాన మంత్రిగా మావోయిస్టు చీఫ్ ప్రచండ (పుష్ప కమల్ దహల్) ఆగస్టు 3న ఎన్నికయ్యారు. పదవికి ఆయనొక్కరేపోటీపడ్డారు. పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్-మావోయిస్టు సెంటర్ చీఫ్ అయిన ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు, వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. 595 మంది సభ్యులకుగాను 22 మంది ఓటేయలేదు. సభలో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్, యునెటైడ్ డెమొక్రటిక్ మధేసి ఫ్రంట్, ఫెడరల్ అలయెన్స్ సభ్యులు, చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు పలికాయి. మావోయిస్టుల మద్దతు వాపసుతో ఖడ్గ ప్రసాద్ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అవసరమైంది. ప్రచండ 2008-2009 మధ్య నేపాల్ ప్రధానిగా ఉన్నారు.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2016 అంతర్జాతీయం
ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు మృతి
ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్ పెరెజ్ (93) సెప్టెంబర్ 28న కన్నుమూశారు. 1923లో పోలండ్‌లోని విస్‌న్యూలో జన్మించిన పెరెజ్ 1934లో ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. దాదాపు ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆయన 1959లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండు సార్లు ప్రధాన మంత్రిగా, 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి కోసం చేసిన కృషికి గాను 1994లో పెరెజ్‌కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.

ఇస్లామాబాద్ సార్క్ సదస్సు వాయిదా
ఇస్లామాబాద్‌లో నవంబర్ 9, 10 తేదీల్లో జరగాల్సిన 19వ సార్క్ సమావేశాల్ని వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ సెప్టెంబర్ 30న ప్రకటించింది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు సార్క్ సదస్సును బహిష్కరించాయి.

కొలంబియా శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ప్రజలు
సెప్టెంబర్ 26న కొలంబియా ప్రభుత్వానికి, కొలంబియన్ విప్లవ సాయుధ బలగాల (Revolutionary Armed Forces of Colombia) కు మధ్య జరిగిన శాంతి ఒప్పందాన్ని ఆ దేశ ప్రజలు తిరస్కరించారు. శాంతి ఒప్పందంపై అక్టోబర్ 2న పభుత్వం రెఫరెండం నిర్వహించగా 50.23 శాతం మంది వ్యతిరేకంగా, 49.76 శాతం మంది అనుకూలంగా ఓటేశారు.

FARC 52 ఏళ్లుగా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంది. దీని ఫలితంగా ఆ దేశంలో 2.5 లక్షల మంది చనిపోయారు. నాలుగేళ్ల చర్చల అనంతరం ప్రభుత్వం, FARC మధ్య సెప్టెంబర్ 26న శాంతి ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఎఫ్‌ఏఆర్‌సీ ఆయుధాల్ని త్యజించి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన నిరాయుధ జోన్‌కు వెళ్లాలి. కానీ తాజా రెఫరెండంలో ఎఫ్‌ఏఆర్‌సీని శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భద్రతామండలి సంస్కరణలకు జీ-4 డిమాండ్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని జీ-4 దేశాలు (భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) డిమాండ్ చేశాయి. 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ వాస్తవికతల దృష్ట్యా.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి.. తాము న్యాయబద్ధమైన అభ్యర్థులమని పేర్కొన్నాయి. ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్, జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్‌మీర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి జోస్ సెర్రా, జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఫుమియో కిషిడా సెప్టెంబర్ 21న న్యూయార్క్‌లో సమావేశమయ్యారు.

పారిస్ ఒప్పందానికి లైన్ క్లియర్
పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి అవసరమైన దేశాల ఆమోదం లభించింది. ఈ ఒప్పందంలో సెప్టెంబర్ 21న 31 దేశాలు అధికారికంగా భాగస్వాములయ్యాయి. దీంతో ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల సంఖ్య 60కి చేరింది. వాతావరణ మార్పు ఒప్పందం అమల్లోకి రావటానికి కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది.

జుకర్‌బర్గ్ 20 వేల కోట్ల విరాళం
ఈ శతాబ్దం చివరినాటికి అన్ని వ్యాధులను నిర్మూలించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం సాధించడానికి ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ సెప్టెంబర్ 22న రూ.20,100 కోట్ల (3 బిలియన్లు) భారీ విరాళంను ప్రకటించారు. ఇది వరకే తమ సంపదలో 99 శాతాన్ని ధార్మిక కార్యకలాపాలకు ప్రకటించిన జుకర్‌బర్గ్ దంపతులు వచ్చే పదేళ్లలో వ్యాధుల నిర్మూలనకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. మన పిల్లల జీవితకాలంలో అన్ని వ్యాధుల్ని నయం చేయడం, నివారణకు కలిసికట్టుగా పనిచేయడమే లక్ష్యమని పిల్లల వైద్య నిపుణురాలైన చాన్ చెప్పారు. 

పాక్, రష్యాల మధ్య ఫ్రెండ్‌షిప్-2016
‘ఫ్రెండ్‌షిప్-2016’ పేరుతో తొలిసారిగా పాకిస్తాన్, రష్యాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 10 వరకు జరిగే పాక్-రష్యా జారుుంట్ డ్రిల్ కోసం రష్యాలోని కాంటిజెంట్ ఆఫ్ రష్యన్ గ్రౌండ్ దళాలు సెప్టెంబర్ 23న పాక్‌కు చేరుకున్నారుు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని గిలిగిత్-బాల్టిస్థాన్‌లోని రట్టులో ఉన్న సైనిక శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రెండు దేశాలకు చెందిన దాదాపు 200 మంది సైనికులు ఇందులో పాల్గొంటారు.

చైనాలో జీ-20 అవినీతి నిరోధక శాఖ
జీ-20 దేశాల అవినీతి నిరోధక శాఖను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు. ఇది జీ-20 దేశాల అవినీతిపై అధ్యయనం చేస్తుంది. ఆగస్టులో జరిగిన జీ-20 సమావేశాల్లో చైనా దీనిని ప్రతిపాదించగా సభ్య దేశాలంతా మద్దతు తెలిపాయి.

90 శాతం గాలి కలుషితమే: డబ్ల్యూహెచ్‌వో
ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రతి 10 మందిలో 9 మంది కాలుష్యపూరిత వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, గుండె వ్యాధుల బారిన పడుతున్నారని వివరించింది. వాయు కాలుష్యం వల్ల ఏటా 65 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదిక పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 300 ప్రదేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ వివరాలను విడుదల చేశారు. ఆరోగ్యానికి హాని చేసే పార్టిక్యులేట్ మ్యాటర్ (ధూళికణాలు) గాలిలో 2.5 మైక్రోమీటర్లకు మించకూడదు కానీ ఇది చాలా ప్రాంతాల్లో పరిమితికి మించి ఉంది. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది.

పాక్‌లో హిందూ వివాహ బిల్లుకు ఆమోదం
హిందూ మహిళల హక్కులను కాపాడటానికి ఉద్దేశించిన హిందూ వివాహ బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ దిగువ సభ సెప్టెంబర్ 26న ఆమోదించింది. తద్వారా మైనార్టీలైన హిందువులు తమ పెళ్లిళ్లను రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు చట్టప్రకారం అన్ని వివాహ హక్కులు పొందుతారు.

బిల్లులోని ముఖ్యాంశాలు:
హిందూ వివాహాలను 15 రోజుల్లోగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి.
వివాహానికి కనీస వయోపరిమితి 18 ఏళ్లు. దీనిని అతిక్రమిస్తే 6 నెలల జైలు, రూ.5 వేల జరిమానా.
భర్త చనిపోయిన ఆరు నెలల తర్వాత వితంతువులు తిరిగి మరో పెళ్లి చేసుకోవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడి భారత పర్యటన
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్రఘనీ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 14న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య నేరస్తుల పరస్పర మార్పిడి, పౌర, వాణిజ్య అంశాల్లో సహకారం, ఆవల ఉన్న స్థలాన్ని శాంతియుతంగా ఉపయోగించుకొనేందుకు సహకరించుకోవడం వంటి మూడు ఒప్పందాలు కుదిరాయి. అఫ్గానిస్తాన్‌లో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, విద్యుత్, మౌలిక సౌకర్యాల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలకు బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,689 కోట్లు) ఆర్థిక సాయాన్ని మోదీ ప్రకటించారు. 

బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం
ద క్షిణ గోవాలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 16న ముగిసింది. ఈ సమావేశంలో హరిత సంబంధిత అంశాలపై పరస్పర సహకారానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పారిస్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు, సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ (ఇండిపెండెంట్ చార్‌‌జ) మంత్రి అనిల్ దవే తెలిపారు.

నేపాల్ పునర్నిర్మాణానికి భారత్ 5 వేల కోట్ల సాయం
నేపాల్ భూకంపం అనంతరం సాగుతున్న పునర్నిర్మాణ పనులకు రూ.5,025 కోట్ల సాయం చేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ మేరకు భారత్, నేపాల్ మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. 4 నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ లేదా ప్రచండ సెప్టెంబర్ 16న నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

విశాఖలో పట్టణీకరణపై బిక్స్ సదస్సు
విశాఖపట్నంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పట్టణీకరణ ఆవశ్యతక, దాని వల్ల తలెత్తే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు 2011 నాటికి 32 శాతం ఉన్న పట్టణీకరణ 2050 నాటికి 70 శాతానికి పెరుగుతుందని చెప్పారు. దేశంలో 2011లో పట్టణ జనాభా 377 మిలియన్లు కాగా రానున్న 15 ఏళ్లలో 600 మిలియన్లకు చేరుతుందని తెలిపారు.

ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘన విజయం
రష్యా ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు చెందిన పార్టీ సెప్టెంబర్ 18న జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీంతో పుతిన్ నాలుగోసారి రష్యాకు అధ్యక్షుడు కానున్నాడు. ‘స్టేట్ డ్యూమా’ (పార్లమెంటు దిగువసభ)ఎన్నికల్లో యునెటైడ్ రష్యా పార్టీకి 54.3% ఓట్లు లభించాయి. ఈ ఓట్లతో 450 మంది సభ్యులుండే డ్యూమాలో అధికార పార్టీకి 343 సీట్లు లభించాయి.

శరణార్థుల రక్షణకు ఐరాస తీర్మానం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది శరణార్థులు, వలసదారుల జీవితాలను కాపాడేందుకు కీలక తీర్మానాన్ని 193 దేశాల నేతలు సెప్టెంబర్ 19న ఆమోదించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించిన ఈ తీర్మానంలో శరణార్థుల హక్కులను కాపాడి, పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. అయితే తీర్మానానికి చట్టబద్ధత లేదు.

ఆసియాన్ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్-ఆసియాన్) సదస్సు సెప్టెంబర్ 6-8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్‌లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్ విజన్ ఇన్‌టూ రియాలిటీ ఫర్ ఎ డైనమిక్ ఆసియాన్ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 అమలుపై ఆసియాన్ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ‘వన్ ఆసియాన్, వన్ రెస్పాన్స్’ అనే ఆసియాన్ డిక్లరేషన్‌పై నేతలు సంతకాలు చేశారు. ఈ ప్రాంతంతోపాటు వెలుపలి ప్రాంతంలో సంభవించే విపత్తులపై ఆసియాన్ ఒకటిగా స్పందించాలని నిర్ణయించారు.

ఆసియాన్-భారత్ సదస్సు
ఆసియాన్ సదస్సులో భాగంగా సెప్టెంబర్ 8న 14వ ఆసియాన్-భారత్ సదస్సు జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విదేశీ ఉగ్రవాదం పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆసియాన్ సభ్యదేశాలు సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

తూర్పు ఆసియా సదస్సు
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 8న లావోస్‌లోని వియంటైన్‌లో జరిగింది. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అణు భద్రతకు చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా 18 దేశాలు అణు నిరాయుధీకరణ, అణు సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి నిరోధానికి మద్దతు పలికాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు పాల్గొన్నాయి. 
2005లో తూర్పు ఆసియా శిఖరాగ్ర వేదిక ఏర్పాటు చేసిన నాటి నుంచి భారత్ అందులో సభ్యురాలిగా ఉంది.

నిరాశ్రయులుగా 5 కోట్ల మంది చిన్నారులు
యుద్ధం, హింస, అంతర్గత తిరుగుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ వెల్లడించింది. యునిసెఫ్ అంచనా ప్రకారం వివిధ దేశాల్లో చెలరేగుతున్న హింస కారణంగా 2.8 కోట్ల చిన్నారులు నిరాశ్రయులవగా దాదాపు 1.7 కోట్ల మంది స్వదేశంలోనే నిరాదరణకు గురవుతున్నారు. అంతర్గత యుద్ధాలు, పేదరికం కారణంగా 2 కోట్ల మంది చిన్నారులు ఇళ్లు వదిలి వెళ్తున్నారు. 2015లో యునిసెఫ్ చేరదీసిన పిల్లల్లో 45 శాతం మంది సిరియా, అఫ్గానిస్తాన్ల నుంచే ఉన్నారు.

పారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన అమెరికా, చైనా 
పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను సెప్టెంబర్ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు అందించాయి. పారిస్ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీని కోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది.

ఎత్తయిన వంతెనతో చైనా రికార్డు
ప్రపంచాన్ని అబ్బురపరిచే నిర్మాణాలు చేపట్టే చైనా తాజాగా ప్రపంచంలోనే అతి ఎత్తయిన వంతెనను నిర్మించింది. చైనాలోని బీపాంజియాంగ్‌లో సిడూ నదిపై నిర్మించిన ఈ వంతెన సెప్టెంబర్ 10న పూర్తయింది. దీని ఎత్తు 565 మీటర్లు, పొడవు 1,341 మీటర్లు. ఇప్పటి వరకు ఎత్తయిన వంతెన రికార్డు ఫ్రాన్స్ లోని మిలౌ వడయాక్ట్ (343 మీటర్లు) పేరిట ఉంది.

హాంగ్జౌలో జీ-20 సదస్సు
జీ-20 దేశాల 11వ సదస్సు చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో జరిగింది. ఈసదస్సు ప్రధానంగా దార్శనికత, సమగ్రత, స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవ స్థ, సమ్మిళితం వంటి అంశాలపై దృష్టి సారించింది. 2030 నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం కార్యక్రమాల రూపకల్పన- అమలు, అంతర్జాతీయంగా ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన నిర్మాణాత్మక చర్యలపై సదస్సులో చర్చించారు. పారిస్ వాతావరణ మార్పు ఒప్పందాన్ని ఆమోదించేందుకు అవసరమైన చట్టబద్ధ చర్యలను పూర్తిచేసేందుకు జీ-20 దేశాలు అంగీకరించాయి.

జీ-20 సమావేశంలో ప్రసంగించిన మోదీ దక్షిణాసియాలో పాకిస్తాన్ మాత్రమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పరోక్షంగా విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, ఆర్థికంగా సహాయమందించే వారిపై ఆంక్షలు విధించి వారిని ఒంటరిని చేయాలని చెప్పారు.
జీ-20 సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీలో భారత ప్రధాని మోడీ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 3,12,800 కోట్లతో అరేబియా సముద్రం గ్వదర్ పోర్టు నుంచి చైనా గ్జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌కు సీపెక్‌ను నిర్మిస్తున్నారు. చమురు, సహజవాయువుల రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాల నిర్మాణంతో పాటు ఇంధన ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు.

ప్రధాని సెప్టెంబర్ 7 నుంచి రెండ్రోజుల పాటు లావోస్‌లో జరగనున్న భారత-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు. 

బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా టెమర్
బ్రెజిల్ దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పదవీచ్యుతురాలైన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా పీఎండీబీ పార్టీకి చెందిన మిచెల్ టెమర్ సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. రౌసెఫ్ (68)ను అధ్యక్షస్థానం నుంచి తొలగిస్తూ ఆగస్టు 31న ఆ దేశ సెనేట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. రౌసెఫ్ కారణంగానే జాతీయ బడ్జెట్‌లో అక్రమాలు జరిగాయని ఆమెను పదవినుంచి తొలగించాలంటూ ఓటింగ్‌లో 61 మంది సెనెటర్లు (మొత్తం 81 మంది) అనుకూలంగా ఓటేశారు.దీంతో బ్రెజిల్‌లో 13 ఏళ్ల వామపక్ష వర్కర్స్ పార్టీ పాలనకు తెరపడింది. 

చైనాతో పాక్ జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందం 
చైనా నుంచి 8 జలాంతర్గాములు కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తొలి 4 జలాంతర్గాములు 2023 నాటికి, మిగిలినవి 2028 నాటికి పాకిస్తాన్‌కు అందుబాటులోకి రానున్నాయి.

వైట్‌హౌస్ కవిసమ్మేళనానికి భారత సంతతి యువత
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించే కవి సమ్మేళనానికి భారత సంతతికి చెందిన ఇద్దరు యువకులు ఎంపికయ్యారు. జార్జియాలో ఉంటున్న మాయా ఈశ్వరన్‌తోపాటు డల్లాస్‌లో ఉంటున్న గోపాల్ రామన్ సమ్మేళనంలో తమ కవితా సంపత్తిని ప్రదర్శించనున్నారు. 2011 నుంచి ‘నేషనల్ స్టూడెంట్స్ పొయెట్స్ ప్రోగ్రామ్’ (National Student Poets Program) పేరుతో అమెరికా అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం నేషనల్ స్కాలస్టిక్ ఆర్ట్ అండ్ రైటింగ్ అవార్డును అందజేస్తారు.

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2016 అంతర్జాతీయం
జీ జిన్‌పింగ్‌కు అత్యంత కీలక నాయకుడి హోదా
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అక్టోబర్ 28న అధికార కమ్యూనిస్టు పార్టీలో అత్యంత కీలక నాయకుడి హోదా పొందారు. నాలుగు రోజులపాటు జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో పార్టీ వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్‌కు కూడా ఈ హోదానిచ్చారు. కీలక నాయకుడి స్థాయిని దక్కించుకోవడం ద్వారా పార్టీ, సైన్యం, ప్రభుత్వంపై తన పట్టును మరింత పెంచుకునేందుకు జిన్‌పింగ్‌కు అవకాశం దక్కింది.

అతిపెద్ద మెరైన్ రిజర్వ్ ఏర్పాటుకు ఒప్పందం
ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సంరక్షణ కేంద్రం (మెరైన్ రిజర్వ్) ఏర్పాటుకు అక్టోబర్ 28న ఒప్పందం కుదిరింది. అంటార్కిటికాలోని ప్రకృతిసిద్ధ నిర్జన ప్రదేశాలను పరిరక్షించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటార్కిటికా సముద్ర జీవ వనరుల పరిరక్షణ సంస్థ- హోబర్డ్ వార్షిక సమావేశంలో ఈ ఒప్పందం ఖరారైంది. దీనికి సంస్థలోని 25 సభ్య దేశాలు మద్దతు తెలిపాయి.

ఆత్మాహుతి దాడి చేసే డ్రోన్‌ను ఆవిష్కరించిన ఇరాన్
భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను మోసుకెళ్లి ఢీ కొట్టడం ద్వారా లక్ష్యాలను నాశనం చేసే సరికొత్త ఆత్మాహుతి డ్రోన్‌ను ఇరాన్ అభివృద్ధి చేసినట్లు ఆ దేశ వార్తా సంస్థ అక్టోబర్ 25న వెల్లడించింది. ప్రాథమికంగా సముద్ర సంబంధిత నిఘా కోసం ఆ దేశ సైనిక విభాగం రివల్యూషనరీ గార్డ్స్ దీన్ని రూపొందించిందని, అయితే దీనికి సముద్రంతోపాటు భూమిపై లక్ష్యాలను కూడా ఆత్మాహుతి దాడులతో ఛేదించే సామర్థ్యం ఉందని పేర్కొంది. ఈ డ్రోన్‌లు నీటి ఉపరితలంపై కేవలం అర మీటర్ ఎత్తులో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.

ఇటలీలో భారీ భూకంపం
ఇటలీలో అక్టోబర్ 30న భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. ఆగ్నేయ పెరుజియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. అయితే 600 ఏళ్లనాటి బాసిలికా చర్చి కూలిపోయింది.

చైనా, బంగ్లాదేశ్ మధ్య 40 ఒప్పందాలు
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య విద్యుత్తు, రోడ్డు మార్గాలు - రైల్వే అనుసంధానత, మౌలిక వసతుల్లో పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో 40 ఒప్పందాలు కుదిరాయి. బంగ్లాదేశ్‌లో చైనా అధ్యక్షుడు పర్యటించడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి.ఈ ఒప్పందాల విలువ రూ. 1.3 లక్షల కోట్లు.

రెండు ఖండాలను కలిపే కేబుల్ లైన్ ఏర్పాటుకు అంగీకారం
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచంలో అత్యధిక దూరం సముద్ర గర్భంలో నుంచి కేబుల్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు ప్రకటించాయి. పసిఫిక్ మహాసముద్రం ద్వారా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి హాంగ్‌కాంగ్‌కు 12,800 కి.మీ హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా అమెరికా, ఆసియాలను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే అమెరికా, జపాన్‌ల మధ్య ప్రపంచంలోనే తొలి హై కెపాసిటీ ఇంటర్నెట్ కేబుల్ సముద్ర గర్భం నుంచి ఏర్పాటై ఉంది.

ఆకలి సూచీలో 97వ స్థానంలో భారత్
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ అక్టోబర్ 11న విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీ (GHI)లో భారత్ 97వ స్థానంలో నిలిచింది. 118 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేసిన సర్వే ఆధారంగా ఈ సూచీ రూపొందింది. నైజీరియా, చాద్, ఇథియోపియా, సియర్రాలియోన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల పరిస్థితి భారత్ కంటే దారుణంగా ఉంది. శ్రీలంక , బంగ్లాదేశ్, చైనా, నేపాల్‌లు.. భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. పౌష్టికాహారానికి నోచుకోని జనాభా ఎంత? ఐదేళ్ల వయసులో పిల్లలు మరణాలు, చదువుకునేవారు ఎంత మంది? వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 

కామన్‌వెల్త్ నుంచి వైదొలగిన మాల్దీవులు
కామన్‌వెల్త్ దేశాల గ్రూపు నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు అక్టోబర్ 13న ప్రకటించింది. 2012 నాటి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ నషీద్‌ను పదవీచుత్యుణ్ని చేయడానికి దారితీసిన పరిస్థితులను, రాజకీయ అశాంతిని అరికట్ట లేకపోయినందువల్ల ఆ దేశాన్ని శిక్షించాలని కామన్‌వెల్త్ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కామన్‌వెల్త్ నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు పేర్కొంది. 53 దేశాలున్న కామన్‌వెల్త్ దేశాల కూటమి నుంచి 2013లో జాంబియా వైదొలగగా, తర్వాత తప్పుకున్న దేశం మాల్దీవులు.

మార్షల్ ఐలాండ్స్ పిటిషన్ కొట్టివేత
భారత్.. అణ్వాయుధాల పోటీని పెంచిపోషిస్తోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో మార్షల్ ఐలాండ్స్ పిటిషన్ వేసింది. దీనికి భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశాల మధ్య తలెత్తే వివాదాలను మాత్రమే విచారించే అధికార పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉంది. కానీ మార్షల్ ఐలాండ్స్‌తో తమకు ఎప్పుడూ అణ్వాయుధాల విషయంలో వివాదం తలెత్తలేదు కాబట్టి ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని భారత్ పేర్కొంది. దీంతో 16 మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను అక్టోబర్ 4న కొట్టేసింది.

మ్యాథ్యూ తుపాను ధాటికి 1000 మంది మృతి
కరేబియన్ దీవుల్లో పేద దేశమైన హైతీలో అక్టోబర్ 7న సంభవించిన మాథ్యూ తుపాను దెబ్బకు 1000 మంది మృతి చెందారు. దాదాపు 29 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. 2010 నాటి భూకంప నష్టం మరవకముందే తాజాగా వచ్చిన హరికేన్ ధాటికి ఆ దేశ దక్షిణ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పాటు బహమాస్, జమైకా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, సెయింట్ విన్సెంట్, గ్రెనడాల్లోను 150 మంది మరణించినట్లు సమాచారం. అమెరికాలోని ఉత్తర కరోలినాలో కూడా 16 మంది మరణించారు. 1963లో హరికేన్ ఫ్లోరా ధాటికి 8 వేల మంది మరణించిన తర్వాత ఇదే అతిపెద్ద నష్టం. 2007లో హరికేన్ ఫెలిక్స్ తర్వాత అత్యంత శక్తివంతమైన (కేటగిరి 5 స్థాయి) తుపాను కూడా ఇదే.

ముందస్తు ఓటు వేసిన ఒబామా
 నవంబర్ 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అక్టోబర్ 8న ముందస్తు ఓటు వేశారు. ఆయన సొంత నగరం షికాగోలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ముందస్తు ఓటేసిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలిచారు.

అమెరికాలో ఐదుగురు ‘భారతీయ’ సంపన్నులు
ఫోర్బ్స్ సంస్థ అమెరికా వ్యాప్తంగా మొదటి 400 మంది సంపన్నులతో రూపొందించిన ‘రిచెస్ట్ పీపుల్ ఇన్ అమెరికా - 2016’లో భారత సంతతికి చెందిన ఐదుగురికి చోటు లభించింది. మొదటి స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ వరుసగా 23వ సారి సొంతం చేసుకున్నారు. ఆయన నెట్‌వర్త్ 81 బిలియన్ డాలర్లు.
టాప్ 400లోని భారతీయులు

వ్యక్తి

సంస్థ

సంపద (రూ.కోట్లలో)

ర్యాంక్

రొమేష్ వాద్వానీ

సింఫనీ టెక్నాలజీ

రూ.20,100

222

నీర్జా దేశాయ్

సింటెల్

రూ.16,750

274

రాకేష్ గంగ్వాల్

ఇండిగో ఎయిర్‌లైన్స్

రూ.14,740

321

జాన్ కపూర్

అకోర్న్, ఇన్సిస్ టెక్నాలజీస్

రూ.14,070

335

కవితార్క్ శ్రీరామ్

ఏంజెల్ ఇన్వెస్టర్

రూ.12,730

361

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2016 అంతర్జాతీయం
క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత
క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్ 26న మృతి చెందారు. కొన్ని ఆరోగ్య సమస్యసలతో 2008లో అధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకి అప్పగించారు.

1926 ఆగస్టు 13న ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన క్యాస్ట్రో.. 1953లో శాంటియాగోలోని మొన్కాడా మిలటరీ బ్యారక్‌లపై మొదటిసారి దాడి చేసి జైలుకెళ్లాడు. 15 సంవత్సరాలు శిక్ష పడగా క్షమాభిక్షపై 19 నెలలకే బయటకు వచ్చి 1959 జనవరి 8న క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టాపై తిరుగుబాటు చేసి క్యూబాను హస్త్తగతం చేసుకున్నారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన నాయకత్వంలోనే చేగువేరాతోపాటు వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా కార్యకర్తలు విప్లవ పోరాటం సాగించారు.

క్యాస్ట్రోను హత్య చేసేందుకు అమెరికా తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా ఏకంగా 638 సార్లు యత్నించి విఫలమైంది. 1961లో అమెరికా చేపట్టిన క్యూబన్ మిసైల్ క్రై సిస్ (ప్రపంచ ప్రమాదరకమైన సర్జికల్ దాడుల్లో ఒకటి)ను క్యాస్ట్రో తిప్పికొట్టాడు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో క్యూబన్ల జీవితాల గురించి 1960లో 269 నిమిషాలసేపు క్యాస్ట్రో చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది.

జపాన్‌లో భారీ భూకంపం, సునామీ
జపాన్ ఈశాన్య తీరంలో నవంబర్ 22న 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనికి కొనసాగింపుగా సునామీ కూడా వచ్చింది. భూకంప ప్రభావంతో కొన్ని నిమిషాల్లోనే సముద్ర అలలు మీటరు ఎత్తున లేచి ఫుకుషిమా అణుశక్తి కేంద్రాన్ని ముంచెత్తాయి. ఫుకుషిమా నగరానికి 37 కి.మీ. దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో 11.4 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

అత్యధిక వరి దిగుబడిని సాధించిన చైనా శాస్త్రవేత్త 
హైబ్రిడ్ వరి పితామహుడిగా పేరుగాంచిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్ లాంగ్‌పింగ్ భారీ స్థాయిలో వరి పండించి సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారని చైనా అధికారులు నవంబర్ 25న ప్రకటించారు. గ్యాంగ్‌డాంగ్‌లో ఆయన పండించిన వరి 0.07 హెక్టార్‌కు 1,533.78 కిలోల వార్షిక దిగుబడి ఇచ్చిందని తెలిపారు. హెబీ, యునాన్ ప్రాంతాల్లో 0.07 హెక్టార్‌కు వరుసగా 1,082.1 కిలోలు, 1,088 కిలోల దిగుబడి వచ్చిందని.. ఎత్తై ప్రాంతాల్లో ఇవి రికార్డు స్థాయి దిగుబడులని అన్నారు. యువాన్.. 1974లో ప్రపంచంలో మొట్టమొదటి సారిగా హైబ్రిడ్ వరిని అభివృద్ధి చేశారు.

పేటెంట్ హక్కుల్లో చైనా ప్రపంచ రికార్డు
మేధోసంపత్తి హక్కులకు సంబంధించి చైనా 2015లోనే 11 లక్షల దరఖాస్తులు చేసింది. పేటెంట్ హక్కుల కోసం వివిధ దేశాలు చేసుకున్న దరఖాస్తుల వివరాలను ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ మేధోసంపత్తి హక్కుల సంస్థ అధిపతి ఫ్రాన్సిస్ గుర్రీ నవంబర్ 24న వెల్లడించారు. ఈ జాబితాలో అమెరికా 5,78,000 దరఖాస్తులతో రెండో స్థానంలో, జపాన్ 3,25,000 దరఖాస్తులతో మూడో స్థానంలో, దక్షిణ కొరియా 2,14,000 దరఖాస్తులతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

కొలంబియా విమాన ప్రమాదంలో 75 మంది మృతి
కొలంబియాలో నవంబర్ 29న జరిగిన విమాన ప్రమాదంలో 75 మంది మృతి చెందారు. దక్షిణ అమెరికా బొలీవియాలోని జాస్ మరియా కార్డోవా విమానాశ్రయం నుంచి కొలంబియాలోని మెడిలిన్‌‌స విమానాశ్రయానికి వెళ్లాల్సిన విమానం మెడిలిన్‌‌స సమీపంలోని కొండల్లో ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 81 మందిలో ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

వరల్డ్ హ్యాపియెస్ట్ కంట్రీ డెన్మార్క్
ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితాలో 2016కు డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ‘వరల్డ్ హ్యాపినెస్ లెవల్స్’ నవంబర్ 16న విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2015లో మూడో స్థానంలో ఉన్న డెన్మార్క్.. ఈ ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, ఫిన్‌లాండ్‌లు నిలిచాయి. భారత్‌కు ఈ జాబితాలో 118వ స్థానం దక్కింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, వారి ఆరోగ్య ఆయుర్దాయాన్ని, తదితర అంశాల ఆధారంగా 156 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు.

అవినీతి ఆరోపణలపై రష్యా ఆర్థిక మంత్రి అరెస్ట్
రష్యా ఆర్థిక మంత్రి అలెక్సీ ఉల్యుకేవ్‌ను అవినీతి ఆరోపణలపై ఆ దేశ అధికారులు నవంబర్ 13న అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ రాస్నెట్.. మరో కంపెనీ బాష్నెట్‌ను కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చినందుకు రెండు మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఉల్యుకేవ్ దోషిగా తేలితే 15 ఏళ్ల వరకు జైలుశిక్ష పడొచ్చు.

సౌర కూటమి ముసాయిదా ఒప్పందం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఐ) ముసాయిదా ఒప్పందంపై 20కి పైగా దేశాలు మారకేష్ (మొరాకో)లో నవంబర్ 15న సంతకాలు చేశాయి. ఇది ఆమోదం పొందితే ఐఎస్‌ఏ ఒక ప్రధాన అంతర్జాతీయ సంస్థగా ఏర్పడుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తెలిపారు. ఐఎస్‌ఐ భారత్ కేంద్రంగా పనిచేస్తుంది.

ఇంటర్నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా పోస్ట్-ట్రూత్
ఇంటర్నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ‘పోస్ట్-ట్రూత్’ పదాన్ని నవంబర్ 16న ప్రకటించింది. పోస్ట్-ట్రూత్.. ఆల్ట్-రైట్, బ్రెక్సిటీర్ పదాలను అధిగమించి తొలి స్థానంలో నిలిచింది. ఈ పదాన్ని 2015తో పోల్చితే 2016లో ఎక్కువగా వాడారని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తెలిపింది. ప్రజాభిప్రాయ నిర్ణయంలో వాస్తవాల కంటే భావోద్వేగం, వ్యక్తిగత నమ్మకాలే అధికంగా ప్రభావితం చూపడాన్ని పోస్ట్-ట్రూత్‌గా పేర్కొంటున్నారు.

పారిస్ ఒప్పందం అమలుకు తుది గడువు 2018
పర్యావరణ మార్పులపై పోరాటానికి ఉన్నత స్థాయి రాజకీయ నిబద్ధత కావాలని మారకేష్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో 200 దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ సందర్భంగా నవంబర్ 18న 196 దేశాలు, ఐరోపా సమాజం సహా అన్ని పక్షాలు అంగీకారం తెలిపిన మారకేష్ చర్యల ప్రకటనను విడుదల చేశారు. పారిస్ ఒప్పందం అమలుకు సంబంధించిన నిబంధనలకు తుది రూపం ఇచ్చేందుకు 2018ను గడువుగా నిర్ణయించారు. 2015, డిసెంబర్‌లో తీసుకువచ్చిన పారిస్ ఒప్పందం అమలు కోసం ఆచరణాత్మక చర్యల ముసాయిదా రూపకల్పనకు మారకేష్ సదస్సు జరిగింది. పారిస్ ఒప్పందానికి ఇప్పటి వరకు 111 దేశాలు అంగీకారం తెలిపాయి.

తెలుగులో బీబీసీ ప్రసారాలు
 ఇప్పటికే 29 భాషల్లో ప్రసారాలు కొనసాగిస్తున్న యూకే మీడియా కంపెనీ బీబీసీ తన సేవలను మరో 11 భాషలకు విస్తరించనున్నట్లు నవంబర్ 16న ప్రకటించింది. ఇందులో భారతీయ భాషలు తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం బీబీసీ ప్రసారాలు హిందీ, బెంగాలీ, తమిళం భాషల్లో మాత్రమే కొనసాగుతున్నాయి. దీనికోసం యూకేకు బయట ఢిల్లీలో అతిపెద్ద బ్యూరోను బీబీసీ నెలకొల్పనుంది.

భారత్, పాకిస్తాన్‌లోనే ఉగ్రదాడులు అధికం
ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం ఉగ్రవాద దాడులు భారత్, పాకిస్తాన్, ఇరాక్, ఆఫ్గానిస్తాన్‌ల లోనే జరుగుతున్నాయని గ్లోబల్ టెరర్రిజం ఇండెక్స్ (జీటీఐ) నివేదిక తెలిపింది. 2015లో ఈ 4 దేశాల్లోనూ భారత్‌లోనే 50% ఉగ్రవాదుల దాడులు నమోదయ్యాయి. 2000 సంవత్సరం తర్వాత అత్యధికంగా 2015లో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 75 శాతం ఐసిస్, బోకో హరమ్, ఆల్‌ఖైదా, తాలిబన్‌లు చేస్తున్నవే.

ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీలో భారత్‌కు 22వ స్థానం
స్వీడన్‌కు చెందిన ఎడ్యుకేషన్ ఫస్ట్(ఈఎఫ్) ప్రకటించిన ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ ర్యాంకింగ్‌‌సలో భారత్‌కు 22వ స్థానం దక్కింది. గత ఏడాది ఈ ర్యాంకు 20. తాజా ర్యాంకుల్లో చైనా 31, పాకిస్తాన్ 48 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో అందరికంటే ఇంగ్లిష్ బాగా మాట్లాడగలిగే వారి జాబితాలో నెదర్లాండ్స్ మొదటి స్థానంలో నిలిచింది. డెన్మార్క్, స్వీడన్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. 2015లో మొత్తం 7 దేశాల్లోని 9,50,000 మంది రాసిన పరీక్షలను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. దీని ప్రకారం అన్ని దేశాల్లోనూ పురుషుల కంటే మహిళలకే ఇంగ్లిష్ భాష నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయి.
జాబితాలో మొదటి 10 దేశాలు

స్థానం

దేశం

1

నెదర్లాండ్స్

2

డెన్మార్క్

3

స్వీడన్

4

నార్వే

5

ఫిన్‌లాండ్

6

సింగపూర్

7

లక్సెంబర్గ్

8

ఆస్ట్రియా

9

జర్మనీ

10

పోలాండ్

22

భారత్

31

చైనా

48

పాకిస్తాన్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు 
అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ జాన్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. నవంబర్ 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్‌కు 305 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. పాపులర్ ఓట్లలో హిల్లరీ 47.7 శాతం (5,93,21,645), ట్రంప్ 47.5 శాతం (5,91,50,974) సాధించారు. ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ 2017, జనవరి 20న వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన 70 ఏళ్ల ట్రంప్ 18 నెలల కిందటే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యోగ భద్రత, ఉగ్రవాద ముప్పు నుంచి దేశానికి విముక్తి, వలసలకు అడ్డుకట్ట వంటి హామీలే ట్రంప్ గెలుపునకు ప్రధాన కారణం అయ్యాయి.
ట్రంప్ గెలుపొందిన రాష్ట్రాలు
పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, అలాస్కా, ఉటావా, అయోవా, అరిజోనా, విస్కాన్సన్, జార్జియా, ఒహయో, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, కాసస్, ఒక్లహోమా, టెక్సాస్, వయోమింగ్, ఇండియానా, కెంటకీ, టెన్నెసే, మిస్సిసిపీ, అర్కాన్సాస్, లూసియానా, వెస్ట్ వర్జీనియా, అలాబామా, సౌత్ కరోలినా, మోంటానా, ఐడహ, మిస్సోరీ, న్యూహ్యాంప్‌షైర్, మిషిగన్ రాష్ట్రాలు.
హిల్లరీ గెలుపొందిన రాష్ట్రాలు
కాలిఫోర్నియా, నెవెడా, హవాయ్, ఇలినాయిస్, న్యూ యార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, డెలావేర్, కొలొరాడో, న్యూ మెక్సికో, వర్జీనియా, ఒరేగాన్, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, మిన్నెసోటా, మైనేలో మూడు స్థానాలు డెమోక్రాట్ల ఖాతాలో... ఒకటి రిపబ్లికన్‌‌స ఖాతాలో.
ఈ ఎన్నికల్లో ఐదుగురు భారత సంతతి అమెరికన్లు విజయం సాధించారు.
కమలా హ్యారిస్ (51):ఈమె రెండు సార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో అమెరికా సెనేట్‌కు ఎంపికయ్యారు.
ప్రమీల జయపాల్: హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌‌సకు ఎంపికై న తొలి భారతీయ-అమెరికన్‌గా ప్రమీల (51) రికార్డు నెలకొల్పారు. సియాటెల్ నుంచి ఈమె ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. 
రాజా కృష్ణమూర్తి: రాజా కృష్ణమూర్తి ప్రతినిధుల సభకు అర్హత సాధించారు. ఇల్లినాయిస్‌లోని 8వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి (42) 2000, 2004ల్లో ఒబామా యూఎస్ సెనేట్ ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
రోహిత్ ఖన్నా: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన ఖన్నా (42) కాలిఫోర్నియాలోని 17వ డిస్ట్రిక్ట్ నుంచి హోండాపై విజయం సాధించారు.
అమీ బెరా: డెమొక్రటిక్ పార్టీ తరపున సాక్రమెంటో కౌంటీ నుంచి బరిలో దిగిన అమీ బెరా విజయం సాధించారు. ఈమె 2012, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. దీంతో గతంలో మూడుసార్లు కాంగ్రెస్‌కు ఎంపికై న భారతీయుడు దలీప్ సింగ్ సౌంద్ రికార్డును బెరా సమం చేశారు. జిందాల్ కూడా 2004, 2006లో రెండుసార్లు లూసియానా గవర్నర్‌గా ఎంపికయ్యారు.

న్యూజిలాండ్‌లో 7.8 తీవ్రతతో భూకంపం
న్యూజిలాండ్‌లో నవంబర్ 13న తీవ్ర భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 7.8గా నమోదైంది. క్రైస్ట్‌చర్చ్‌కు ఉత్తరంగా 90 కిలోమీటర్ల దూరంలో భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు దేశమంతా ప్రకంపనల ప్రభావం కనిపించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్, ఫోన్ సేవలు నిలిచిపోయాయి. ఇదే రోజున ఈశాన్య అర్జెంటీనాలో కూడా 6.2 తీవ్రతతో భూమి కంపించింది.

శాంతి స్థాపనకు కొలంబియాలో కొత్త ఒప్పందం
కొలంబియాలో గతంలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రజలు తిరస్కరించడంతో.. ప్రభుత్వం, తిరుగుబాటు సంస్థ (ఎఫ్‌ఏఆర్‌సీ) నవంబర్ 12న కొత్త ఒప్పందాన్ని ప్రకటించాయి. వివిధ సంస్థలు, ప్రజల సూచనల మేరకు పాత ఒప్పందంలో కొన్ని మార్పులు చేయడంతోపాటు అదనపు అంశాలను చేర్చారు. ఈ మేరకు శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన క్యూబా, నార్వే, దౌత్యవేత్తలు సంయుక్త ప్రకటన చేశారు. ఇది పాత ఒప్పందంతో పోల్చితే మెరుగైందన్నారు. తాజా ఒప్పందం కొలంబియా తిరుగుబాటు సంస్థ ఎఫ్‌ఏఆర్‌సీ.. ఆయుధాలను వదిలి రాజకీయ పార్టీగా ఏర్పడేందుకు వీలు కల్పిస్తుంది. దిద్దుబాటు చర్యలు చేపడితే తిరుగుబాటుదారులు జైలు శిక్ష నుంచి కూడా మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం 2016
అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా 2016 రికార్డుకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నవంబర్ 14న మొరాకోలోని మారకేష్‌లో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 2015తో పోల్చితే 2016లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. 2016 మే నెలలో రాజస్థాన్‌లోని ఫలోడీలో అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

2015లో 59 లక్షల మంది చిన్నారులు మృతి
ప్రపంచవ్యాప్తంగా 2015లో 59 లక్షల మంది (రోజుకు సుమారు 16 వేల మంది) ఐదేళ్లలోపు చిన్నారులు మృతి చెందారని తాజా అధ్యయనం తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఆసియా, ఆఫ్రికాలోని 10 దేశాల్లోనే (భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా, చైనా, అంగోలా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, టాంజానియా) 60 శాతం (36 లక్షలు) మరణాలు సంభవించాయి. జాన్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు 195 దేశాల్లో చిన్నారుల మరణాలపై అధ్యయనం చేసి నెలలు నిండకనే జన్మించడం వల్ల తలెత్తే సమస్యలు, నిమోనియా ఈ మరణాలకు ప్రధాన కారణాలని వెల్లడించారు.

1991-2015 మధ్య నాటికి ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను మూడింట రెండు వంతులు తగ్గించాలని సహస్రాబ్ది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ ఈ కాలంలో చిన్నారుల మరణాల రేటు 53 శాతం మాత్రమే తగ్గింది. సహస్రాభివృద్ధి లక్ష్యాల స్థానంలో గతేడాది నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ప్రతి వెయ్యి జననాలకు చిన్నారుల మరణాలను 25కి మించకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

చిన్నారుల మరణాల్లో 20 శాతం భారత్‌లోనే సంభవిస్తున్నాయి. ప్రతి 21 మందిలో ఒకరు ఐదేళ్లు నిండకనే కన్నుమూస్తున్నారు. నిమోనియా, డయేరియా కారణంగా భారత్‌లో గతేడాది సుమారు 2,96,279 మంది ఐదేళ్లలోపు చిన్నారులు మరణించారని ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ యాక్సెస్ సెంటర్(ఐవీఏసీ) తెలిపింది. నవంబర్ 12 ప్రపంచ నిమోనియా డే సందర్భంగా ఐవీఏసీ ‘నిమోనియా, డయేరియా ప్రోగ్రెస్ రిపోర్ట్-2016’ పేరుతో నివేదిక విడుదల చేసింది.

దక్షిణ కొరియా ప్రధానికి ఉద్వాసన
దక్షిణ కొరియా ప్రధానిని ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ జ్యున్-హై నవంబర్ 2న పదవి నుంచి తొలగించారు. అధ్యక్షురాలికి మిత్రురాలు అయిన చాయ్ సూన్-సిల్ అవినీతి ఆరోపణలతో ఇటీవల అరెస్టు కావడంతో దేశ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని హ్వాంగ్ క్యో-అహ్‌న్‌ను, ఆర్థిక మంత్రిని పదవుల నుంచి తప్పిస్తూ పార్క్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రధానిగా కిమ్ బ్యోంగ్-జూన్‌ను నియమించారు. దక్షిణ కొరియాలో ప్రధాని పదవి నామమాత్రమే అధ్యక్షుడికే పూర్తి అధికారాలు ఉంటాయి.

2016 మేటి పదంగా ‘బ్రెగ్జిట్’
 ‘బ్రెగ్జిట్’ను 2016 మేటి పదం (word of the year) గా ఎంపిక చేసినట్లు కొలిన్స్ డిక్షనరీ ప్రకటించింది. ‘ట్రంపిజమ్’ అనే పదంతో నెలకొన్న తీవ్ర పోటీలో బ్రెగ్జిట్ ఈ ఘనత సాధించింది. యూరప్ యూనియన్ నుంచి వైదొలగడానికి ‘బ్రెగ్జిట్’ (బ్రిటన్ ఎగ్జిట్) అనే రెఫరెండాన్ని 2016 జూన్‌లో నిర్వహించారు. రెఫరెండం నిర్వహణతో ఈ పదం వాడుక 3,400 శాతానికి పైగా పెరిగిందని కొలిన్ సంస్థ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఉద్దేశించిన ‘ట్రంపిజమ్’ పదం ఈ ఏడాది ఎక్కువగా వినియోగించిన రెండో పదంగా నిలిచింది.

240 మంది శరణార్థులు మృతి
మధ్యధరా సముద్రంలో నవంబర్ 2న రెండు పడవలు మునిగి 240 మంది శరణార్థులు చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం వెల్లడించింది. శరణార్థులంతా రబ్బరు పడవల్లో ప్రయాణిస్తుండగా అవి మునిగిపోయాయి.

అమెరికాలో కాల్ సెంటర్ కుంభకోణం
భారత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా అమెరికాలో భారీ కాల్‌సెంటర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీని విలువ రూ. 2 వేల కోట్లకు పైనేనని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అమెరికాకు చెందిన ఆదాయపు పన్ను వసూలు విభాగం ఐఆర్‌ఎస్(ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) ఏజెంట్లుగా పేర్కొంటూ వేలాది మంది అమెరికా పౌరుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన భోగవల్లి నరసింహ.

AIMS DARE TO SUCCESS 

డిసెంబరు 2016 అంతర్జాతీయం
నల్ల సముద్రంలో కూలిన రష్యా మిలిటరీ విమానం
రష్యా మిలిటరీ విమానం టీయూ-154 డిసెంబర్ 25నసోచీ తీరానికి 1.5 కి.మీ దూరంలో నల్ల సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 92 మంది మృతి చెందారు. దక్షిణ రష్యాలోని సోచీ పట్టణం నుంచి సిరియాకు బయలుదేరిన రెండు నిమిషాలకే విమానం అదృశ్యమైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

నాసా వ్యోమగామి సెల్లర్స్ కన్నుమూత
ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, అంతరిక్ష మాజీ వ్యోమగామి పియర్స్ సెల్లర్స్(61) డిసెంబర్ 23న మృతి చెందారు. 1981లో నాసాలో శాస్త్రవేత్తగా కెరీర్‌ను ప్రారంభించిన సెల్లర్స్ సెన్సైస్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ విభాగానికి డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశాడు. సెల్లర్స్ మూడు అంతరిక్ష నౌకలను రూపొందించడంతోపాటు 1996లో అంతరిక్షయాత్ర చేసిన బృందంలో సభ్యుడిగా ఉన్నారు.

పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ కన్నుమూత
ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైకేల్ (53) డిసెంబర్ 25న బ్రిటన్‌లో కన్నుమూశారు. 1963లో లండన్‌లో జన్మించిన మైకేల్ ‘వామ్!’ పాప్ గ్రూప్‌తో కెరీర్ ఆరంభించారు. 1980ల్లో జార్జ్ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడయ్యాయి.

అంతర్జాతీయ వలసదారుల నివేదిక -2015
ప్రపంచ దేశాల్లో అత్యధిక వలసదారులు భారతీయులేనని ప్యూ రీసెర్చ్ (pew research) అధ్యయనం తెలిపింది. నివేదిక ప్రకారం భారత్ నుంచి ఇతర దేశాల్లో కోటి 56 లక్షల మంది నివసిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయుల సంఖ్య 1990 నాటికి 20 లక్షలుండగా 2015 నాటికి 80 లక్షలకు చేరింది.

వలసదారుల సంతతి అధికంగా కలిగిన దేశాల్లో తర్వాత స్థానాల్లో వరుసగా మెక్సికో (కోటి 23 లక్షల మంది), రష్యా (కోటి 6 లక్షల మంది), చైనా (95 లక్షల మంది), బంగ్లాదేశ్ (72 లక్షల మంది) ఉన్నాయి.
అత్యధిక వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాలో మొత్తం 4 కోట్ల 66 లక్షల మంది వలసదారులు ఉన్నారు. ఆ తర్వాత జర్మనీ (కోటి 20 లక్షల మంది), రష్యా (కోటి 16 లక్షల మంది), సౌదీ అరేబియా (కోటి 2 లక్షల మంది), బ్రిటన్ (85 లక్షల మంది) దేశాలు ఎక్కువ మంది వలసదారులకు ఆశ్రయం ఇచ్చాయి.

వలసదారులు అధికంగా కలిగిన 10 దేశాలువలసదారులకు అధికంగా ఆశ్రయమిచ్చిన 10 దేశాలుస్థానందేశంవలసదారులుస్థానందేశంవలసదారుల సంఖ్య1భారత్15,580,0001అమెరికా46,630,0002మెక్సికో12,340,0002జర్మనీ12,010,0003రష్యా10,580,0003రష్యా11,640,0004చైనా9,550,0004సౌదీ అరేబియా10,190,0005బంగ్లాదేశ్7,210,0005యూకే8,540,0006పాకిస్తాన్5,940,0006యూఏఈ8,100,0007ఉక్రెయిన్5,830,0007కెనడా7,840,0008ఫిలిప్పైన్స్5,320,0008ఫ్రాన్స్7,780,0009సిరియా5,010,0009ఆస్ట్రేలియా6,760,00010యూకే4,920,00010స్పెయిన్5,850,000


రూ.21 కోట్లు పలికిన న్యూటన్ తొలి ముద్రణ పుస్తకం
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా తొలి ముద్రణ పుస్తకం వేలంలో రూ.21.1 కోట్లకు అమ్ముడైంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన శాస్త్ర సాంకేతిక ప్రచురణగా రికార్డు సృష్టించింది. క్రిస్టీ సంస్థ న్యూయార్క్‌లో డిసెంబర్ 18న నిర్వహించిన ఈ-వేలంలో అజ్ఞాత వ్యక్తి పుస్తకాన్ని సొంతం చేసుకున్నారు.

ఫోర్బ్స్ టాప్-10లో మోదీ
ఫోర్బ్స్ మేగజీన్ 74 మందితో వెలువరించిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా’ లో ప్రధాని మోదీ తొమ్మిదోస్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వరసగా నాలుగో ఏడాదీ తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 38వ, ఉత్తర కొరియా నేత కిమ్ 43వ, ఒబామా 48వ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 51వ, ఐసిస్ ఉగ్రనేత అబుబకర్ 57వ ర్యాంక్ పొందారు.

టాప్-10 శక్తివంతుల జాబితా
1 వ్లాదిమిర్ పుతిన్
2 డోనాల్డ్ ట్రంప్
3 ఏంజెలా మెర్కెల్
4 జీ జిన్‌పింగ్
5 పోప్ ఫ్రాన్సిస్
6 జానెట్ యెలెన్
7 బిల్‌గేట్స్
8 లారీపేజ్
9 నరేంద్ర మోదీ
10 మార్క్ జుకర్‌బర్గ్

ఐరాస అత్యవసర నిధికి భారత్ ఆర్థిక సాయం
ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి భారతదేశం 5 లక్షల అమెరికన్ డాలర్ల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. డిసెంబర్ 14న జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత దౌత్యవేత్త అంజనీ కుమార్ 2016-17 సంవత్సరానికి భారత్ తరఫున ఈ సహాయాన్ని ప్రకటించారు. యూఎన్‌లో అత్యవసర నిధిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ 60 లక్షల డాలర్లను అందించింది.

బయోడైవర్సిటీ అంతర్జాతీయ సదస్సు 
బయోడైవర్సిటీ అంతర్జాతీయ సదస్సు (కాప్13) మెక్సికోలోని కాన్‌కున్‌లో డిసెంబర్ 17న ముగిసింది. ఈ సదస్సులో తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.

వెనెజువెలాలో పెద్ద నోట్ల రద్దు
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆ దేశంలో పెద్ద కరెన్సీ నోట్ అయిన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ డిసెంబర్ 12న అత్యవసర డిక్రీ జారీ చేశారు. 

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు
దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆమె తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్క్‌పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్.

కఫాలాను రద్దు చేసిన ఖతార్
ఆధునిక బానిసత్వంగా భావించే కఫాలా పని వ్యవస్థను సమూలంగా రద్దు చేయాలని ఖతార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 13 నుంచి అమల్లోకి తేనున్నట్లు ఖతార్ కార్మిక శాఖ మంత్రి ఇసా బిన్ సాద్ అల్ జఫాలి ప్రకటించారు.

సురక్షిత నగరంగా బార్సిలోనా
సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్య భద్రత, మౌలిక భద్రత, వ్యక్తిగత భద్రత వంటి అంశాలపై రూపొందించిన టాప్ 15 సురక్షిత నగరాల జాబితాలో బార్సిలోనా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మొత్తం 50 నగరాల్లో సర్వే చేసి ఎకానమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్(ఈఐయూ) 15 ఉత్తమ నగరాల జాబితాను డిసెంబర్ 5న విడుదల చేసింది. భద్రత విషయంలో బార్సిలోనా మొదటిస్థానంలో నిలవగా సైబర్ సేఫ్టీలో స్వీడన్ రాజధాని స్టాక్ హోం, వ్యక్తిగత భద్రత విషయంలో సింగపూర్ టాప్‌లో నిలిచాయి.

టాప్ 15 సురక్షిత నగరాలుబార్సిలోనా75.16మాంట్రియల్75.60తైపీ76.51శాన్‌ఫ్రాన్సిస్కో76.63హాంకాంగ్77.24న్యూయార్క్78.06మెల్బోర్న్78.67టొరొంటో78.81జ్యూరిచ్78.81సిడ్నీ78.91ఆమ్‌స్టర్‌డ్యాం79.19స్టాక్ హోమ్80.02ఒసాకా82.36సింగపూర్84.61టోక్యో85.63


పాక్ విమాన ప్రమాదంలో 48 మంది మృతి
పాకిస్తాన్‌లోని అబోటాబాద్ పర్వతాల్లో డిసెంబర్ 7న జరిగిన విమాన ప్రమాదంలో 48 మంది మరణించారు. ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సులోని చిత్రల్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్‌‌సకు చెందిన పీకే-661 అనే విమానం ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రముఖ పాప్ గాయకుడు, ఇస్లాం మత బోధకుడు జునైద్ జంషెద్, ఆయన భార్య కూడా మృతి చెందారు.

ఇండోనేసియాలో భూకంపం.. 97 మంది మృతి
డిసెంబర్ 7న పశ్చిమ ఇండోనేసియాలో వచ్చిన భూకంపం ధాటికి 97 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. 2004లో సుమత్రా దీవుల్లోనే బలమైన భూకంపం, సునామీ కారణంగా ఇండోనేసియాలో లక్షా డెబ్భైవేల మంది మృతి చెందారు.

నైజీరియా చర్చి ప్రమాదంలో 160 మంది మృతి 
నైజీరియాలో డిసెంబర్ 10న ఓ చర్చిలో జరిగిన ప్రమాదంలో 160 మంది మృతి చెందారు. అక్వా ఇబోమ్ రాష్ట్ర రాజధాని యువోలోని రీనర్స్ బైబిల్ చర్చ్ ఇంటర్నేషనల్‌లో పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 2014 లాగోస్‌లోని సినగోగ్ చర్చికి చెందిన బహుళ అంతస్తుల అతిథి గృహం కూలిపోవడంతో 116 మంది చనిపోయారు.

740 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా
 ప్రపంచ జనాభా 2016లో 740 కోట్లకు చేరిందని ఐరాస జనాభా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జోర్డాన్‌లోని అమ్మాన్‌లో డిసెంబర్ 1న ప్రపంచ జనాభా నివేదిక-2016ను విడుదల చేసింది. జనాభాలో పదేళ్లలోపు చిన్నారులు 12.5 కోట్ల మంది ఉన్నారని.. వీరిలో 89 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది. ఆయా దేశాల్లో విద్య, ఆరోగ్యం, భద్రత విషయాల్లో బాలికలు అవరోధాలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. 24 ఏళ్లలోపు జనాభాలో సగం మంది ఎదుర్కొంటున్న లింగ వివక్షతను దూరం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఈ నివేదిక సూచించింది.

2016లో యూరప్‌కు వలస వెళ్తూ 4,700 మంది మృతి
2016లో బతుకు దెరువు కోసం యూరప్‌కు వలస వెళ్తూ మధ్యధరా సముద్రంలో 4,700 మంది మృతి చెందినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ (IOM) నవంబర్ 29న వెల్లడించింది. 2015తో పోల్చితే 2016లో యూరప్‌కు వెళ్లే వలసదారుల సంఖ్య తగ్గినప్పటికీ, మధ్యధరా సముద్రంలో మృతి చెందిన వారి సంఖ్య మాత్రం పెరిగిందని పేర్కొంది. ఐఓఎమ్ వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది సముద్ర మార్గం ద్వారా యూరప్ చేరుకున్న వలసదారుల సంఖ్య 8,83,393 కాగా, 2016లో ఆ సంఖ్య 3,48,664కు తగ్గింది.

చమురు ఉత్పత్తిలో కోతకు ఒపెక్ నిర్ణయం
చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు అంగీకరిస్తూ చమురు ఉత్పత్తుల సంఘం (ఒపెక్) నవంబర్ 30న నిర్ణయం తీసుకుంది. 2008 తర్వాత ఉత్పత్తిని తగ్గిస్తూ ఒపెక్ తీసుకున్న నిర్ణయం ఇదే. చమురు మార్కెట్‌ను సమతుల్యం చేసేందుకు ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులందరూ కలిసి తాజా నిర్ణయం తీసుకున్నారు.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment