AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 12 February 2018

ఇండియా & వరల్డ్ 2013 సంవత్సరం ఫిబ్రవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఇండియా & వరల్డ్ 2013 సంవత్సరం ఫిబ్రవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 

ఇండియా & వరల్డ్ 
ఫిబ్రవరి 2013 ద్వైపాక్షిక సంబంధాలు
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన
బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ఫిబ్రవరి 18 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. పౌర అణు సహకార ఒప్పందంపై చర్చలు ప్రారంభించడం, ముంబై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ నిర్మాణంలో బ్రిటన్ తోడ్పాటు తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. అంతేకాకుండా 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని కూడా ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి (ఇది 2011-12లో 16.25 బిలియన్ డాలర్లుగా ఉంది). ఇదే పర్యటనలో ఫిబ్రవరి 20న కామెరాన్ పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్ (రౌలట్ చట్టాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 13, 1919న అమతసర్ స్వర్ణదేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన పంజాబీలపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించాడు. ఇందులో 379 మంది చనిపోయారనీ బ్రిటిష్ ప్రభుత్వం , వేయి వరకు మతి చెందారని భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించాయి) ప్రాంతాన్ని, సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయాన్ని(గోల్డెన్ టెంపుల్) సందర్శించారు.

ముగిసిన భారత్ - ఫ్రాన్‌‌స చర్చలు
తక్కువ పరిధి ఉన్న ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల అభివద్ధిపై భారత్- ఫ్రాన్‌‌సల మధ్య ఫిబ్రవరి 14న చర్చలు ముగిశాయి. ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే భారత పర్యటనలో భాగంగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, ఫ్రాన్‌‌స అధ్యక్షుడు హాలాండేల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ ఒప్పందం విలువ ’30 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు, రక్షణ ఒప్పందాలు, అణుసహకారం, ఉగ్రవాద నిరోధం, మాలీ లో పరిస్థితులు వంటి అనేక అంశాలపై చర్చలు జరిపారు. జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రం ప్రగతిని కూడా సమీక్షించారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ 
మార్చి 2013 ద్వైపాక్షిక సంబంధాలు
ఈజిప్టు అధ్యక్షుడి భారత్ పర్యటన
ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ భారత పర్యటనలో మార్చి 19న ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో సైబర్ భద్రతపై అవగాహ న పత్రం, ఈజిప్టులోని అల్ అజహర్ యూనివర్సిటీలో ఐటీ సెంటర్ ఏర్పాటు, మేథో సంపత్తి హక్కులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సహకారానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇదే పర్యటనలో ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, సైనిక, సాంస్కతిక, పర్యాటక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడంపై ఇరు దేశాల నేతలు చర్చించారు. 

రాష్ట్రపతి మారిషస్ పర్యటన
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాట మారిషస్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రణబ్ పాల్గొన్నారు. ఆ దేశాధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్, ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారితో చర్చించారు. అలాగే, మారిషస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రణబ్‌కు గౌరవ డిగ్రీ (డాక్టర్ ఆఫ్ సివిల్ లా)ని ప్రదానం చేసింది. 

ద్వంద్వ పన్ను నివారణపై భారత్-భూటాన్ ఒప్పందం
ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై భారత్-భూటాన్‌లు న్యూఢిల్లీలో మార్చి 4న సంతకాలు చేశాయి. ఆర్థిక మంత్రి చిదంబరం, భూటాన్ ఆర్థిక మంత్రి లింపో వాండే నోర్బూలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆదాయపు పన్ను ఎగవేతను, ద్వంద్వ పన్నులను ఈ ఒప్పందం నివారిస్తుంది. పన్ను వసూళ్లు, సమాచార మార్పిడి వీలవుతుంది. భూటాన్ ఇటువంటి ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ 
మే 2013 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, చైనా మధ్య ఎనిమిది ఒప్పందాలు
చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మే 20న ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ైైైద్వైపాక్షిక వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు, జలవనరుల రంగంలో సహకారం, మాంసం, మత్స్య ఉత్పత్తుల వాణిజ్యంలో పరస్పర సహకారం, మురుగునీటి నిర్వహణలో సహకారం వంటివి ఉన్నాయి. మూడు రోజుల అధికార పర్యటనకు భారత్ వచ్చిన లీ కెకియాంగ్ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత భూభాగంలోకి ఇటీవల చైనా చొరబాటు, బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యాముల నిర్మాణం వంటి పలు అంశాలపై కూడా ఇరుదేశాల నేతలు చర్చించారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ 
సెప్టెంబరు 2013 ద్వైపాక్షిక సంబంధాలు
లైబీరియా అధ్యక్షురాలు సర్లీఫ్ భారత్ పర్యటన
లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ భారత్ పర్యటనలో సెప్టెంబర్ 11న నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ కోసం లైబీరియాకు భారత్ 144 మిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తుంది. రుణం, ఇంధన ఒప్పందాలతోపాటు ఉమ్మడి కమిషన్ ఏర్పాటు, విదేశీ సేవల సంస్థల మధ్య అవగాహన ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ శాంతి సుస్థిరతలను.. ప్రత్యేకంగా ఆఫ్రికా ఖండంలో మెరుగుపరిచేందుకు కలిసి పనిచేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. షర్లీఫ్ తన పర్యటనలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీలతో సమావేశమై చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు లైబీరియా మద్దతు ఇవ్వడాన్ని ప్రధాని మన్మోహన్ కొనియాడారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ 
అక్టోబరు 2013 ద్వైపాక్షిక సంబంధాలు
ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా పర్యటన
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన రష్యా పర్యటనలో అక్టోబర్ 21న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఇది ఇరుదేశాల మధ్య 14వ వార్షిక సమావేశం. ఇరు దేశాలు ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పేరిట ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సదుపాయాల కల్పనను ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయి. సిరియా సంక్షోభానికి రాజకీయంగా పరిష్కారం కనుగొనవచ్చన్న గట్టి నమ్మకాన్ని ఇరుదేశాలు వెలిబుచ్చాయి. ఇంధనం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, ఎరువులు, విమానయాన రంగాల్లో మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో మూడు, నాలుగు రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ ఒప్పందాన్ని వేగవంతం చేస్తామని ఇరు దేశాలు తెలిపాయి. ఈ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మాస్కో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

భారత్ - చైనాల మధ్య సరిహద్దు భద్రత సహకార ఒప్పందం
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చైనా పర్యటనలో అక్టోబర్ 23న ఇరు దేశాలు సరిహద్దు భద్రత సహకార ఒప్పందం (బీడీసీఏ)పై సంతకాలు చేశాయి. ప్రధాని మన్మోహన్, చైనా ప్రధాని లీ కెకియాంగ్ మధ్య చర్చల తర్వాత బీడీసీఏ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద వాస్తవాధీన రేఖ వెంట ఇరు పక్షాలు కవ్వింపు చర్యలకు దిగకూడదనే అంగీకారానికి వచ్చాయి. అదేవిధంగా ఎదురుకాల్పులకు పాల్పడకూడదని, ఒకరి ప్రాంతంలో మరొకరు చొరబాట్లు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. బీడీసీఏతోపాటు మొత్తం తొమ్మిది ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల్లో సీమాంతర నదులపై సహకారాన్ని పటిష్టం చేసుకోవడం, సాంస్కతిక రంగంలో సహకారం, బీహార్‌లో నలందా యూనివర్సిటీ ఏర్పాటు వంటివి ఉన్నాయి. వీటితోపాటు రహదారుల నిర్మాణం, ఇరు దేశాల్లోని అభివృద్ధి కేంద్రాలుగా ఉన్న నగరాల మధ్య సంబంధాలను బలోపేతం ఒప్పందాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్‌లను అనుసంధానం చేస్తూ ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేయాలని కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. 

అమల్లోకి భారత్ - బంగ్లాదేశ్ నేరస్థుల అప్పగింత ఒప్పందం
భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం అక్టోబర్ 23 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇరుదేశాల అధికారులు ఢాకాలో ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు నేరస్థులను, విచారణలో ఉన్న ఖైదీలను అవసరమైనప్పుడు మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఒప్పందం రాజకీయ ఖైదీలకు, ఆశ్రయం పొందిన ఇతర దేశస్థులకు వర్తించదు. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలంటే ఆరు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

లిమాలో భారత ఉత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
లాటిన్ అమెరికాలో జరిగే ఆరు రోజుల భారతీయ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ లిమా (పెరూ రాజధాని)లో అక్టోబర్ 26న ప్రారంభించారు. భరతనాట్యం, కథాకళి, కథక్, ఒడిస్సీ, చ్ఛావు, మణిపురి నృత్య కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అన్సారీ తన పర్యటనలో పెరూతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి లిమాలో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించారు.

భారత రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీ బెల్జియం పర్యటన
భారత రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీ తన బెల్జియం పర్యటనలో ఆ దేశ ప్రధానమంత్రి ఎలియా డి రూపోతో అక్టోబర్‌ 3న సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ప్రధాన మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఉన్నత విద్య తదితర రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి తమ దేశ మద్దతును ప్రధాని డిరూపో పునరుద్ఘాటించారు.

AIMS DARE TO SUCCESS

ఇండియా & వరల్డ్ 
నవంబరు 2013 ద్వైపాక్షిక సంబంధాలు
బ్రిటన్ ప్రధాని కెమెరూన్ భారత్ పర్యటన
 బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమెరూన్ భారత్ పర్యటనలో నవంబర్ 14న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య 2010 నుంచి వాణిజ్యం, పెట్టుబడుల్లో అత్యుత్తమ ప్రగతి చోటు చేసుకున్నట్లు నేతలు అంగీకరించారు. ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో ప్రగతిని వారు సమీక్షించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, యూరోజోన్‌లో కష్టనష్టాలు ఉన్నప్పటికీ భారత్-యూకే వాణిజ్యం పుంజుకోవడం పట్ల ఇరు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీలంకలో జరిగే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న కెమెరూన్ భారత్‌లో ఆగి న్యూఢిల్లీ, కోల్‌కతాలను సందర్శించారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ 
డిసెంబరు 2013 ద్వైపాక్షిక సంబంధాలు
విద్య, నైపుణ్యాలపై భారత్ - ఆస్ట్రేలియా ఒప్పందం
విద్య, నైపుణ్యాల రంగంలో సహకరించుకునేందుకు భారత్ - ఆస్ట్రేలియాలు నవంబర్ 29న న్యూఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆస్ట్రేలియా తాత్కాలిక హైకమిషనర్ బెర్నార్డ్ ఫిలిప్, కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖా మంత్రి ఎం.ఎం. పల్లంరాజు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఏర్పాటైన భారత్ - ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి అన్ని స్థాయిల్లో కార్యాచరణను రూపొందిస్తుంది. 2022 నాటికి భారత్ 500 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చే దశాబ్దాల్లో ప్రతి ఏటా 12 నుంచి 15 మిలియన్ల మంది మానవ వనరులను భారత్ సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నాణ్యతతో కూడిన శిక్షణ, ప్రమాణాలను ఆస్ట్రేలియా అందిస్తుందని బెర్నార్డ్ ఫిలిప్ తెలిపారు. ఈ సంఖ్య 2011లో 2.3 మిలియన్లు.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment