AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 12 February 2018

ఇండియా & వరల్డ్ 2014 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఇండియా & వరల్డ్ 2014 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఇండియా & వరల్డ్ 
జనవరి 2014 ద్వైపాక్షిక సంబంధాలు
జపాన్ ప్రధాని భారత పర్యటన
జపాన్ ప్రధానమంత్రి షింజో అబే జనవరి 25-27 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. భారత్ 65వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. భద్రత, రాజకీయ, రక్షణ సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో సగం జపాన్ సహాయానికి సంబంధించినవి ఉన్నాయి.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ ఫిబ్రవరి 2014 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-ఫిజిల మధ్య ద్వంద్వ పన్నుల ఒప్పందం
ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై (డిటిఎఎ) భారత్- ఫిజిలు జనవరి 30న సంతకాలు చేశాయి. భారత్ తరపున ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఫిజి తరపున ఆ దేశ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి అయియజ్ ఖయూమ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద డివిడెండ్లు, వడ్డీ, రాయల్టీ, నిపుణుల సేవలందించినందుకు వసూలు చేసే రుసుములపై ఇరుదేశాల్లో పన్ను విధిస్తారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ మే 2014 ద్వైపాక్షిక సంబంధాలు
మామిడి, కూరగాయల దిగుమతులపై ఈయూ నిషేధం
భారత్ నుంచి దిగుమతి అయ్యే ఆల్ఫోన్సో రకం మామిడికాయలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు ఏప్రిల్ 28న తాత్కాలిక నిషేధం విధించాయి. వంకాయ, చేమ, కాకర, దోసకాయలపై కూడా ఈ నిషేధం ఉంటుంది. 2013లో భారత్ నుంచి దిగుమతైన పండ్లు, కూరగాయల్లో హానికర కీటకాలు ఉన్నట్లు గుర్తించడంతో యూరోపియన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధానికి యుైనె టెడ్ కింగ్‌డమ్ మద్దతు తెలిపింది. యూకే ఏటా భారత్ నుంచి 16 మిలియన్ల మామిడికాయలను దిగుమతి చేసుకుంటుంది. వీటి విలువ 6 మిలియన్ పౌండ్లు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ జూన్ 2014 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-ఫ్రాన్స్ సంయుక్త వాయు విన్యాసాలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రాన్‌‌సకు చెందిన ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వాయు విన్యాసాలు జూన్ 2న జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ప్రారంభమయ్యాయి. జూన్ 13 వరకు సాగే ఈ విన్యాసాలకు ‘ఈఎక్స్ గరుడ 5’ అనే పేరు పెట్టారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ జూలై 2014 ద్వైపాక్షిక సంబంధాలు
సుష్మాస్వరాజ్ నేపాల్ పర్యటన
భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నేపాల్ అధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా తదితరులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా రక్షణ, భద్రత, వాణిజ్యం, జల విద్యుత్.. తదితర రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీరించాయి. ఇండో- నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశానికి(జేసీఎం) సహ అధ్యక్షత వహించేందుకు, ఆగస్టు 3 నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేపాల్ పర్యటనకు రంగం సిద్ధం చేసేందుకు సుష్మా నేపాల్‌లో పర్యటించారు. 23 ఏళ్ల తర్వాత ఉభయ దేశాల మధ్య జేసీఎం సమావేశం జరిగింది.

భారత్, బ్రెజిల్ ఒప్పందాలు
పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారం, దౌత్య వ్యవహారాల్లో సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మూడు ఒప్పందాలపై జూలై 16న భారత్, బ్రెజిల్‌లు సంతకాలు చేశాయి. బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఆ మేరకు అవగాహనకు వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, రక్షణ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి.

సముద్ర వివాదంలో బంగ్లాదేశ్‌కు అనుకూల తీర్పు
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న బంగాళాఖాతం సముద్ర సరిహద్దు వివాదంపై ఐక్యరాజ్యసమితి ట్రైబ్యునల్ జూలై7న బంగ్లాదేశ్‌కు అనుకూల తీర్పునిచ్చింది. బంగాళాఖాతంలోని 25,602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 19,467 చ.కి.మీ విస్తీర్ణం బంగ్లాదేశ్‌కు చెందుతుందని ఐక్యరాజ్యసమితి ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భారత్ భూ సరిహద్దు ఒప్పందాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్పునకు అన్ని పక్షాలు కట్టుబడి ఉండాలి. అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు.

మారకేశ్ ఒప్పందాన్ని ఆమోదించిన భారత్ 
ప్రచురణలను అంధులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన మారకేశ్ ఒప్పందాన్ని భారత్ జూన్ 24న ఆమోదించింది. తద్వారా ఈ ఒప్పందంపై సంతకం చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ ఒప్పందాన్ని 2013 జూన్ 27న ప్రపంచ మేధోసంపత్తి హక్కుల సంస్థ (వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్)లోని 79 దేశాలు అంగీకరించాయి. ఈ ఆమోద పత్రాన్ని మేధో సంపత్తి హక్కుల సంస్థకు భారత్ సమర్పించింది. 20 దేశాలు ఆమోదిస్తే ఈ మారకేశ్ ఒప్పందం అమల్లోకి వస్తుంది. దీనిపై సంతకాలు చేసిన దేశాలు ప్రచురితమైన గ్రంథాలను బ్రెయిలీ లిపిలో అందుబాటులోకి తెచ్చేందుకు చట్టాలు రూపొందించాలి.

న్యూఢిల్లీ వేదికగా ఐబీఎస్‌ఏ సదస్సు 
2015లో నిర్వహించే ఏడో ఐబీఎస్‌ఏ (ఇండియా,బ్రెజిల్, దక్షిణాఫ్రికా) సదస్సుకు న్యూఢిల్లీ వేదిక కానుంది. వివిధ ఖండాలకు చెందిన ఈ మూడు దేశాల కూటమి ఏర్పాటుపై 2003 జూన్‌లో బ్రెజిల్ రాజధాని బ్రెసీలియాలో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు. అభివృద్ధి చెందుతున్న ఈ మూడు దేశాలు పరస్పర సహకారం, రాజకీయ, ఆర్థికాంశాలలో చేయూత, ఐబీఎస్‌ఏ ఫండ్ ద్వారా ప్రాజెక్టులు చేపట్టి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు తోడ్పాటు వంటి కీలకాంశాలపై సహరించుకుంటాయి.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ ఆగష్టు 2014 ద్వైపాక్షిక సంబంధాలు
మోడీ నేపాల్ పర్యటన 
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేపాల్‌లో రెండు రోజులు పర్యటించారు. ఇందులో భాగంగా ఆగస్టు 3న నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. 1990 తర్వాత నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి విదేశీ నేత నరేంద్రమోడీ. నేపాల్ ప్రధాని సుశీల్‌కుమార్ కొయిరాలాతో మోడీ సమావేశమయ్యారు. పర్యాటక రంగం అభివృద్ధి, గాయిటర్ నియంత్రణ కార్యక్రమం, దూరదర్శన్-నేపాల్ టెలివిజన్‌లకు సంబంధించిన మూడు అవగాహన పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు. 1950 నాటి శాంతి-మైత్రి ఒప్పందాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సమీక్షించి, సవరించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్ రంగాల్లో సహకారానికి, నూతన రాజ్యాంగ రచనలో తోడ్పాటుకు, స్కాలర్ షిప్‌ల సంఖ్యను 180 నుంచి 250కు పెంచడానికి మోడీ అంగీకరించారు. ఈ సందర్భంగా 16ఏళ్ల నుంచి తన సంరక్షణలో పెరిగిన జీత్‌బహుదూర్ అనే నేపాలీ యువకుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ సెప్టెంబరు 2014 ద్వైపాక్షిక సంబంధాలు
ఐక్యరాజ్యసమితిలో నరేంద్ర మోదీ ప్రసంగం 
ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భద్రతామండలిని 2015 నాటికి ప్రజాస్వామ్యయుతంగా, ప్రాతినిధ్య వేదికలా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే మాడిసన్ స్క్వే ర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

చైనాతో భారత్ 12 ఒప్పందాలు
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మూడు రోజుల భారత పర్యటనలో సెప్టెంబర్ 18న ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యలు పరిష్కారం కావాలని మోడీ జిన్‌పింగ్‌కు తెలిపారు. భారత్‌లో రానున్న ఐదేళ్లలో రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా హామీ ఇచ్చింది. చర్చల సందర్భంగా 12 ఒప్పందాలు కుదిరాయి. వీటితోపాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్, చైనాలోని గ్యాంగ్, ఝూ నగరాలను సోదర నగరాలుగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదిరింది.

ఆసియాన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 
ఆసియాన్‌తో సేవలు, పెట్టుబడులకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సెప్టెంబర్ 8న సంతకం చేసింది. ఆసియాన్ కూటమిలోని బ్రూనై, కాంబోడియా, లావోస్, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల పార్లమెంట్లు ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంది. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, రవాణా రంగాల్లో ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి.

ఆస్ట్రేలియాతో భారత్ అణు ఒప్పందం
భారత్-ఆస్ట్రేలియాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ పర్యటించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్, భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాల వినియోగానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. దీని ప్రకారం భారత్‌కు యురేనియం సరఫరా, రేడియో ఐసోటోపుల ఉత్పత్తి, అణుభద్రతతో పాటు ఇతర రంగాలలో ఆస్ట్రేలియా సహకరిస్తుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయడానికి నిరాకరించడంతో 2012లో ఆస్ట్రేలియా తన విధానాన్ని మార్చుకొని బారత్‌కు అణు సహకారాన్ని నిరాకరించింది. అప్పటి నుంచి ఐదు దఫాల చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.

కంచె నిర్మాణానికి భారత్ నిర్ణయం
బంగ్లాదేశ్ జలాల మీద సింగపూర్ నమూనా (స్కిడ్ మెరైన్ హెడ్జ్ మోడల్)లో కంచె నిర్మించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతంలో నదులు, చిత్తడి నేలతో నిండి ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వం ఆ నీటిపై కంచెను ఏర్పాటు చే యాలని భావిస్తోంది. కంచె నిర్మాణం పూర్తయితే దేశంలోకి వలసదారుల చొరబాటుకు అడ్డుకట్ట పడుతుంది.

ప్రధాని మోడీ జపాన్ పర్యటన 
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనలో సెప్టెంబర్ 1న ఆ దేశ ప్రధాని షింజో అబేతో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ, కాలుష్య రహిత ఇంధనం, రహదారుల నిర్మాణం, ఆరోగ్యం, మహిళా సంక్షేమ రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో జపాన్ ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను రూ. 2,10,000 కోట్లకు పెంచేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని స్మార్ట్‌సిటీల నిర్మాణం, జల సంరక్షణ, గంగా నదితోపాటు ఇతర నదుల ప్రక్షాళన, నైపుణ్యాల అభివృద్ధి, తయారీ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి రంగా ల్లో పెడతారు. 1998లో అణు పరీక్షల అనంతరం భారత్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు జపాన్ ప్రకటించింది.

భారత్ -వియత్నాం మధ్య ఏడు ఒప్పందాలు
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వియత్నాం పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 15న ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చమురు గ్యాస్ రంగాల్లో సహకారం, భారత్ నుంచి రక్షణ కొనుగోళ్ల కోసం 10 కోట్ల డాలర్ల రుణం, ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, కస్టమ్స్, యువజన వ్యవహారాలు, నైపుణ్యాల అభివృద్ధి, పశు వైద్యం వీటిలో ప్రధాన అంశాలు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వియత్నాం అధ్యక్షుడు ట్రూన్ టాన్ సంగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి ఇరు దేశాలు పిలుపునిచ్చాయి.

ఇండో-నేపాల్ సంయుక్త విన్యాసాలు 
భారత్-నేపాల్ దేశాలు సంయుక్తంగా పితోరాఘర్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలు ఆగస్టు 31తో ముగిశాయి. వీటికి సూర్యకిరణ్-7గా నామకరణం చేశారు. 14 రోజుల విన్యాసాల్లో భాగంగా విపత్తు నిర్వహణతోపాటు పలు అంశాలపై ప్రదర్శన లిచ్చారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ అక్టోబరు 2014 ద్వైపాక్షిక సంబంధాలు
రాష్ట్రపతి నార్వే, ఫిన్‌లాండ్ పర్యటన
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నార్వే పర్యటనలో ఈ నెల 14న ఇరుదేశాల మధ్య 13 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటిలో ఇరు దేశాల మధ్య రక్షణ, విద్య, పరిశోధన సంస్థల మధ్య ఒప్పందం, భారత్‌లో అత్యాధునిక చేపల పెంపకం కేంద్రం ఏర్పాటుతో పాటు 13 ఒప్పందాలు ఉన్నాయి. అక్టోబరు 15న ఫిన్‌లాండ్‌లో పర్యటించిన రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు సాయులి నీనిస్తోతో అధికారిక చర్చలు జరిపారు. అసోంలోని నుమాలిఘర్‌లో బయో రిఫైనరీ ఏర్పాటుతోపాలు 19 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత ప్రభుత్వం నూతనంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగం కావాలని నార్వే కంపెనీలను ప్రణబ్ ఆహ్వానించారు.

మోదీ-ఒబామా మధ్య శిఖరాగ్ర చర్చలు
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అమెరికా పర్యటనలో సెప్టెంబర్ 30న వాషింగ్టన్‌లో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉగ్రవాదంపై పోరులో రాజీలేకుండా వ్యవహరించాలని తీర్మానించారు. పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాద మూకలు లష్కరే తొయిబా, అల్‌ఖైదా, హఖ్ఖానీ నెట్‌వర్క్‌లను నిర్మూలించేందుకు నిర్ణయించారు. ఆర్థిక రంగంలో సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు,దక్షిణాసియాలో ఉగ్రవాదం, పశ్చిమాసియా సమస్య వంటి పలు అంశాలపై వారు చర్చలు జరిపారు. పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు ఒబామా తెలిపారు. రక్షణ రంగంలో సహకారాన్ని మరో పదేళ్లు పొడిగించేందుకు రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. విశాఖపట్టణం, అలహాబాద్, అజ్మీర్‌లను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దేందుకు అమెరికా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు.

సియాచిన్‌లో మోదీ పర్యటన
జమ్మూ-కాశ్మీర్‌లోని సియాచిన్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 23న దీపావళి పండుగను సైనికులతో జరుపుకున్నారు. సియాచిన్ ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తై యుద్ధ క్షేత్రం.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ నవంబరు 2014 ద్వైపాక్షిక సంబంధాలు
జపాన్‌లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
జపాన్ రాజధాని టోక్యోలో ఏడాదిపాటు రెండు దశల్లో జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం అక్టోబరు 27 న ప్రారంభమయింది. ఈ ఏడాది ఆగస్టులో ఆ దేశంలో పర్యటించిన ప్రధాని మోదీ జపాన్-భారత్ ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

భారత్-శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 
భారత్-శ్రీలంక దేశాలు నవంబరు 3న సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. దీనికి మిత్రశక్తి అని పేరు పెట్టారు. ఈ విన్యాసాలు కొలంబో సమీపంలోని ఓ దీవిలో నవంబరు 23వరకు నిర్వహించనున్నారు.

భారత్‌లో పర్యటించిన వియత్నాం ప్రధాని
వియత్నాం ప్రధాన మంత్రి గుయెన్ టాన్ డుంగ్ భారత్‌లో పర్యటించారు. అక్టోబరు 28న ప్రధాని మోదీతో సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో ప్రధానమైనది ఓఎన్‌జీసీ లిమిటెడ్, పెట్రో వియత్నాం సంస్థల మధ్య ఒప్పందం. దీని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో భారత్ కొత్తగా ఒక చమురు బ్లాకు, మరో సహజ వాయువు బ్లాకులో అన్వేషణ చేపడుతుంది. ఈ ప్రాంతంపై చైనా, వియత్నాంల మధ్య వివాదం కొనసాగుతోంది.

43 దేశాల ప్రజలకు ఈ-వీసా సౌకర్యం
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత్ 43 దేశాలకు చెందిన ప్రజలకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించింది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవంబరు 27న న్యూఢిల్లీలో ప్రారంభించారు. సౌకర్యం పొందిన దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, రష్యా ఉన్నాయి. ఈ-వీసా 30 రోజులపాటు చెల్లుబాటవుతుంది. ఏడాదిలో రెండుసార్లు దీన్ని వినియోగించుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, గోవా, కోచి విమానాశ్రయాల్లో తొలిసారిగా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.

నేపాల్ - భారత్ మధ్య 10 ఒప్పందాలు
18వ సార్క్ సదస్సులో భాగంగా నేపాల్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 25న ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య 10 ఒప్పందాలపై చర్చలు జరిగాయి. నేపాల్‌కు 100 కోట్ల అమెరికన్ డాలర్ల సాయం, మోటారు వాహనాల ఒప్పందం కింద ఇరు దేశాల్లో నిర్ధారించిన మార్గాల్లో ప్రయాణించేందుకు అనుమతి, ట్విన్ సిటీ ఒప్పందం కింద ఖాట్మండు-వారణాసి, జనక్‌పూర్- అయోధ్య, లుంబినీ-బోధ్ గయా నగరాల అనుసంధానం, ఇరు దేశాల సందర్శకులు రూ.500, రూ.1000 నోట్లు తీసుకెళ్లడానికి అనుమతి మొదలైనవి ఉన్నాయి. ఇప్పటివరకు రూ.100 నోట్లకే అవకాశం ఉండేది.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబరు 18న ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించా రు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతోపాటు ఉగ్రవాదంపై ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సామాజిక భద్రత, శిక్ష ఖరారైన ఖైదీల బదిలీ, పర్యటకంతో పాటు ఐదు ఒప్పందాలు కుదిరాయి. నవంబరు 19న ఫిజీ దేశంలో మోదీ పర్యటించారు. ఆ దేశ ప్రధాని బయనీ మరామతో చర్చించారు. ఫిజీకి రూ. 500 కోట్ల రుణంతోపాటు అభివృద్ధి సాయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఈ దేశంలో అడుగుపెట్టారు. 1981లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఫిజీలో పర్యటిం చారు.

AIMS DARE TO SUCCESS 

ఇండియా & వరల్డ్ డిసెంబరు 2014 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్‌కు అమెరికా రాయబారిగా రిచర్డ్ ప్రమాణం
భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా మేధావి వర్గంలో ప్రముఖుడుగా చెప్పదగిన రాహుల్ వర్మ నాన్సీ పోవెల్ స్థానంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయన నియామకాన్ని అమెరికా సెనేట్ గతంలో మూజువాణి ఓటుతో ఆమోదించింది. భారత్‌కు అమెరికా రాయబారిగా నియమితుడైన తొలి భారతీయ అమెరికన్‌గా రిచర్‌‌డ గుర్తింపు పొందారు.

భారత్, రష్యా మధ్య 20 ఒప్పందాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య డిసెంబర్ 11న ఢిల్లీలో సదస్సు జరిగింది. పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సదస్సులో రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. రష్యా తన అత్యాధునిక హెలికాప్టర్‌ను భారత్‌లో తయారుచేసేందుకు అంగీకరించింది. వాణిజ్య చెల్లింపులను ఇరు దేశాల కరెన్సీలోనే జరుపుకునేందుకు ప్రోత్సహించాలని భారత్-రష్యాలు అంగీకరించాయి. హైడ్రోకార్బన్ల ఉత్పత్తిలో సంయుక్త పరిశోధన, కుడంకుళం అణు కేంద్రంలో మూడు, నాలుగో యూనిట్‌ను నెలకొల్పడం వంటి ఒప్పందాలను ఇరుదేశాలకు సంబంధించిన సంస్థలు కుదుర్చుకున్నాయి.

భారత్-జపాన్ ఒప్పందాలు
భారత్ - జపాన్‌లు సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)లపై పరస్పర సహకారానికి అంగీకరించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఇరుదేశాల సంయుక్త కార్యాచరణ బృంద సమావేశం అనంతరం డిసెంబరు 4న ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. గ్రీన్ ఐసీటీ, సైబర్ సెక్యూరిటీ, విపత్తుల నిర్వహణలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ దాడుల అంశాలు వీటిలో ముఖ్యమైనవి. 

దక్షిణ చైనా సముద్ర వివాదంలోఐరాస జోక్యాన్ని తిరస్కరించిన చైనా 
దక్షిణ చైనా సముద్ర వివాదంలో ఐక్యరాజ్య సమితి జోక్యా న్ని చైనా డిసెంబరు7న తిరస్కరించింది. దీన్ని పరిష్కరించాలంటూ సమితిని ఫిలిప్పైన్స్ కోరగా... ద్వైపాక్షిక చర్చలతోనే వివాదం పరిష్కారమవుతుందని చైనా పేర్కొంది.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment