AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 12 February 2018

అంతర్జాతీయం 2017 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

అంతర్జాతీయం 2017 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 

జనవరి 2017 అంతర్జాతీయం
శక్తిమంతమైన దేశాల్లో భారత్‌కు 6వ స్థానం 
2017లో శక్తిమంతమైన మొదటి 8 దేశాల జాబితాలో భారత్‌కు 6వ స్థానం దక్కింది. ఈ మేరకు అమెరికన్ ఫారిన్ పాలసీ మేగజైన్ నివేదిక విడుదల చేసింది. జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉండగా చైనా, జపాన్ రెండోస్థానంలో సమానంగా నిలిచాయి. రష్యా నాలుగు, జర్మనీ ఐదు, భారత్ ఆరు, ఇరాన్ ఏడు, ఇజ్రాయెల్ 8వ స్థానంలో ఉన్నాయి.

శక్తిమంతమైన మొదటి 8 దేశాలు
1 అమెరికా 
2 చైనా, జపాన్
4 రష్యా
5 జర్మనీ
6 భారత్
7 ఇరాన్
8 ఇజ్రాయెల్

ఇస్లామిక్ దేశ పౌరులకు వీసాలు నిలిపివేసిన అమెరికా
ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులు 90 రోజుల పాటు అమెరికాలో ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించిన కార్య నిర్వాహక ఉత్తర్వులపై జనవరి 28న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 

ఉత్తర్వుల్లో కీలకాంశాలుఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకూ అమెరికా వీసాలు నిలిపివేత. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇది అమల్లో ఉంటుంది.అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశంపై నివరధిక నిషేధం. వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత.అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు నిలిపివేత.అమెరికాలోకి 7 ఇస్లామిక్ దేశాల పౌరుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. ట్రంప్ నిర్ణయానికి ప్రతిచర్యగా ఇరాన్‌లోకి అమెరికా పౌరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇరాన్ జనవరి 29న ప్రకటన చేసింది. 

ఫ్రాన్స్ సుందరి ఇరిస్ మిథెనరికి మిస్ యూనివర్స్ కిరీటం 
2017 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫ్రాన్స్ భామ ఇరిస్ మిథెనరి కైవసం చేసుకుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జనవరి 30న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. హైతీకి చెందిన రక్వెల్ పెలిసీర్ ఫస్ట్ రన్నరప్‌గా, కొలంబియాకు చెందిన ఆండ్రియా తోవర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. మిస్ ఫ్రాన్స్ అయిన 24 ఏళ్ల మిథెనరీ ప్రస్తుతం డెంటల్ సర్జరీలో డిగ్రీ చదువుతోంది. ఈ సారి పోటీల్లో భారత్‌కు చెందిన మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రోష్మితా హరిమూర్తి మొదటి 13 మందిలో స్థానం సంపాదించలేకపోయింది.

హెచ్-1బీ వీసా బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం 
హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ద హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ యాక్ట్- 2017’ బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ జనవరి 31న ఆమోదం తెలిపింది. అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయ సభలు ఆమోదిస్తే ఈ చట్టం అమల్లోకి వస్తోంది. హెచ్1బీ వీసాతో అమెరికాలో 3.5 లక్షల మంది ఉద్యోగాలు చేస్తుండగా అందులో 1.06 లక్షల మంది తెలుగువారు. 

హెచ్-1బీ వేతన సవరణ బిల్లులో ముఖ్యాంశాలుహెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని 60 వేల డాలర్లు(రూ.40.80 లక్షలు) నుంచి 1.30 లక్షల డాలర్లకు (రూ.88 లక్షలు) పెంచాలి. 1989 నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేదు.కొత్త చట్టం మేరకు విదేశీ ఉద్యోగులు వేతనాలు పెంచకుంటే వారి స్థానంలో తప్పనిసరిగా అమెరికన్లనే నియమించాలి.50 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేసే చిన్న కంపెనీలకు 20 శాతం వీసా కోటా తొలగింపు.హెచ్-1బీ వీసాల్లో 20 శాతం స్టార్టప్‌లకు కేటాయించాలి.


అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్ భవనం (వాషింగ్టన్ డీసీ) వద్ద అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్రంప్ రెండు బైబిళ్లపై (ఒకటి తన తల్లి బహూకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్ ప్రమాణం చేసింది) చేతులు ఉంచి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. ప్రమాణస్వీకారం పూర్తవగానే వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయానికి వెళ్లిన ట్రంప్ ఒబామాకేర్ (హెల్త్‌కేర్ చట్టం) రద్దు ఫైల్‌పైతొలిసంతకం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానంగా జన్మించారు. 1971లో తండ్రి నుంచి వ్యాపార బాధ్యతలు తీసుకున్న ట్రంప్ అనతికాలంలోనే రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్నట్లు 2015లో ప్రకటించిన ట్రంప్ 2016 జూలై 19న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అయ్యారు.

బ్రిటన్ పార్లమెంట్‌లో కశ్మీర్‌పై చర్చ
బ్రిటన్ పార్లమెంట్‌లో జనవరి 19న కశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. యూకే హౌస్ ఆఫ్ కామన్‌‌సలో జరిగిన చర్చలో.. భారత్-పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవడమే కశ్మీర్ సమస్యకు దీర్ఘకాల పరిష్కారమని, చర్చలు జరిగేలా బ్రిటన్ చొరవ తీసుకోవాలని సభ్యులు కోరారు. లడఖ్, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజల కోసం మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని, లడఖ్, జమ్మూ, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్‌బ్లాక్‌మన్ తెలిపారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది.

ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం నుంచి వైదొలిగిన అమెరికా
ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య (టీపీపీ) ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. సంబంధిత పత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 23న సంతకం చేశారు. ఒబామా హయాంలో వాణిజ్య సహకారం కోసం పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాలు(అమెరికా, జపాన్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, జపాన్, పెరూ, సింగపూర్, బ్రూనై, చిలీ)ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు 40 శాతం వాటా కలిగి ఉన్నాయి.

పడవ ప్రమాదంలో 180 మంది గల్లంతు
శరణార్థులతో లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న పడవ జనవరి 18న మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 180 మంది గల్లంతయ్యారు. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్లు లెక్కలు పేర్కొంటున్నాయి.

2016లో అత్యధిక ఉష్ణోగ్రతలు 
2016లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమెరికాలోని నోవా (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్) శాస్త్రవేత్తలు ప్రకటించారు. కువైట్‌లో ఆసియాలోనే అత్యధికంగా 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా 2016లో భూమి సగటు ఉష్ణోగ్రత 20 శతాబ్దపు సగటు కంటే దాదాపు 1.69 డిగ్రీ ఫారన్‌హీట్ (0.94 డిగ్రీ సెల్సియస్) ఎక్కువైందని వివరించారు. నోవా గణాంకాలను ప్రపంచ వాతావరణ సంస్థ ధ్రువీకరించిది.

అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ 
2016లో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిలిచింది. ఇది గతేడాది 8.36 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా ఈ గుర్తింపు పొందింది. జాతీయ, అంతర్జాతీయ, సరకు రవాణా విభాగాల్లో కలిపి అట్లాంటా, బీజింగ్ విమానాశ్రయాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

26 మందికి మరణశిక్షవిధించిన బంగ్లాదేశ్ కోర్టు
 2014లో ఏడుగుర్ని హత్యచేసిన కేసులో బంగ్లాదేశ్ కోర్టు 26 మందికి మరణశిక్ష విధించింది. ఈ మేరకు హంతకులను మరణించే వరకు ఉరి తీయాలని నారాయణ్‌గంజ్ జిల్లా, సెషన్‌‌స జడ్జి సయ్యద్ ఇనాయెత్ హొస్సైన్ జనవరి 16న తీర్పు వెలువరించారు. వీరిలో నగర మాజీ కౌన్సిలర్‌తో పాటు, బంగ్లాదేశ్ భద్రతా దళానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులున్నారు. ఒక అధికారి రాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ కాగా, ఒకరు ఆర్మీ మేజర్, మరొకరు నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉన్నారు.

కిర్గిస్తాన్ విమాన ప్రమాదంలో 37 మంది మృతి
కిర్గిస్తాన్ రాజధాని బిషెక్ మనాస్‌లో జనవరి 16న జరిగిన విమాన ప్రమాదంలో 37 మంది మృతి చెందారు. టర్కీకి చెందిన యాక్ట్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747-400 కార్గో విమానం హాంకాంగ్ నుంచి బిషెక్ మీదుగా ఇస్తాంబుల్ వెళుతోంది. మనాస్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తుండగా పొగమంచు వల్ల డచాసు గ్రామంలో కుప్పకూలింది.

ప్రపంచ డైనమిక్ సిటీల్లో టాప్ 10లో హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పు చెందుతున్న 30 మహానగరాల జాబితాలో హైదరాబాద్ ఐదోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా, హోచి మిన్ సిటీ(వియత్నాం), సిలికాన్ వ్యాలీ(అమెరికా), షాంఘై(చైనా) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ జోన్‌‌స లాంగ్ లాసెల్లే విడుదల చేసిన గ్లోబల్ ‘సిటీ మొమెంటమ్ ఇండెక్స్ (సీఎంఐ)’ ఈ వివరాలు వెల్లడించింది. జీడీపీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జనాభా, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలుండటం, రియల్ ఎస్టేట్ వృద్ధి, కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యం, మౌలిక వసతులు వంటి 42 అంశాలను పరిగణనలోకి తీసుకుని జేఎల్‌ఎల్ ఈ నివేదిక రూపొందించింది.

జాబితాలో టాప్-10 నగరాలు

నగరం

స్థానం

బెంగళూరు (భారత్)

1

హోచి మిన్ సిటీ (వియత్నాం)

2

సిలికాన్ వ్యాలీ(అమెరికా)

3

షాంఘై(చైనా)

4

హైదరాబాద్ (భారత్)

5

లండన్ (ఇంగ్లండ్)

6

హనోయ్ (వియత్నాం)

7

ఆస్టిన్ (అమెరికా)

8

బోస్టన్ (అమెరికా)

9

నైరోబి (కెన్యా)

10


జాబితాలో ఇతర భారత నగరాలు

పుణె

13

చెన్నై

17

ఢిల్లీ

23

ముంబై

25


లిబియా సముద్ర తీరంలో 180 మంది గల్లంతు
మధ్యధరా సముద్రంలో లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న తూర్పు ఆఫ్రికా శరణార్థుల్లో 180 మంది గల్లంతయ్యారు. జనవరి 14న లిబియా తీరంలో బయలుదేరిన టూటైర్ పడవ మోటారు చెడిపోవడంతో ప్రమాదానికి గురైంది. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు అంచనా. 

శక్తిమంతమైన పాస్‌పోర్టుగా జర్మనీ పాస్‌పోర్టు
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో జర్మనీ పాస్‌పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టాన్ కేపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో వీసాఫ్రీ స్కోర్ 157తో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా, 156 స్కోరుతో సింగపూర్ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ వీసాఫ్రీ స్కోర్ 46 తో భారత్ 78వ ర్యాంకు సాధించింది. చైనా, పాకిస్తాన్‌లు వరుసగా 58, 94 ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ అత్యంత తక్కువ స్కోరు (23)తో ఉంది.

ఐసిస్ చీఫ్ అంతానికి ‘కిల్ మిషన్’
ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలసి బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్‌ఏఎస్) ‘కిల్ మిషన్’ను ప్రారంభిం చింది. ఈ మిషన్ ఎస్‌ఏఎస్ స్నైపర్స్ నేతృత్వంలో సాగుతుంది. అబు బకర్ తలపై బహుమతిని అమెరికా ప్రభుత్వం 25 మిలియన్ డాలర్లకు పెంచింది.

సరికొత్త రికార్డు నెలకొల్పిన వ్యోమగామి పెగ్గీ వాట్సన్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు వెళ్లిన ఎక్స్‌పీడిషన్ 50 ఫ్లైట్ ఇంజనీర్ పెగ్గీ వాట్సన్ (56) ఏకంగా ఆరున్నర గంటలపాటు ఐఎస్‌ఎస్ బయట గడిపారు. దీంతో వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన పెద్ద వయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు.

ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో వంతెన నిర్మించిన చైనా
చైనాలో ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన వంతెనపై రాకపోక లు డిసెంబర్ 29న ప్రారంభమయ్యాయి. ఈ వంతెనను భూమి నుంచి 1854 అడుగుల ఎత్తున, 1341 మీటర్ల పొడవున నిర్మించారు. దీని కోసం సుమారు రూ.1005 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని పర్వతమయమైన నైరుతి చైనాలోని యున్నన్, గిర ప్రావిన్స్‌లను అనుసంధానం చేస్తూ నిర్మించారు.

ప్రపంచంలోనే పొడవైన రైలుమార్గం ప్రారంభించిన చైనా
ప్రపంచంలోనే అత్యంత పొడవైన, వేగవంతమైన రైలుమార్గంను చైనా డిసెంబర్ 28న ప్రారంభమైంది. 2,225 కిలోమీటర్ల మేర షాంఘై నుంచి కున్మింగ్ వరకు ఉండే ఈ మార్గం ఐదు ప్రావిన్స్‌లను కలుపుతూ సాగుతుంది. ఈ మార్గంలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు. చైనాలో ప్రస్తుతం మొత్తం 20 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైలుమార్గం ఉంది. 2030 నాటికి దీనిని 45,000 కిలోమీటర్లకు పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.

ఆయుధాల కొనుగోళ్లలో భారత్‌కు రెండోస్థానం
అమెరికా నుంచి 2008-15 మధ్య కాలంలో భారీగా ఆయుధాలు కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెసెనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008-15 పేరిట డిసెంబర్ 26న విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ కాలంలో అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు కోసం భారత్ 34 బిలియన్ డాలర్లు వెచ్చించగా, 93.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలతో సౌదీ అరేబియా తొలిస్థానంలో నిలిచింది.

శ్రీలంక మాజీ ప్రధాని విక్రమనాయకే కన్నుమూత
శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే (83) డిసెంబర్ 27న కన్నుమూశారు. ఆయన రెండు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు. 

10 వేల మీటర్ల లోతులో చైనా జలాంతర్గాముల పరిశోధన
పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన మూడు మానవ రహిత జలాంతర్గాములు 10 వేల మీటర్ల లోతులో పరిశోధన జరిపినట్లు పరిశోధకులు డిసెంబర్ 30న ప్రకటించారు. షాంఘై వర్సిటీలోని హడాల్ లైఫ్ సెన్సైస్ పరిశోధనా కేంద్రం డెరైక్టర్ క్యూ వీచెంగ్ నేతృత్వంలో మరియానా ట్రెంచ్‌లో డిసెంబర్ 25-27 మధ్య ఈ పరిశోధన చేపట్టారు.

2016లో 122 మంది జర్నలిస్టుల మృతి
ప్రపంచ వ్యాప్తంగా 2016లో 122 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది మరణించినట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య (ఐఎఫ్‌జే) నివేదిక పేర్కొంది. వీరిలో 93 మంది హత్యకు గురవగా, మిగిలినవారు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలిపింది. అత్యధికంగా ఇరాక్‌లో 15 మంది మరణించగా జాబితాలో 8వ స్థానంలో ఉన్న భారత్‌లో ఐదుగురు జర్నలిస్టులు మరణించారు.

AIMS DARE TO SUCCESS 

ఫిబ్రవరి 2017 అంతర్జాతీయం
అమల్లోకి డబ్ల్యూటీఓ వాణిజ్య సదుపాయాల ఒప్పందం
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు చెందిన వాణిజ్య సదుపాయాల ఒప్పందం (ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్) ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చింది. కస్టమ్స్ నిబంధనల సరళీకరణ తదితర అంశాలకు ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని భారత్‌తో సహా డబ్ల్యూటీఓలోని రెండింట మూడొంతుల సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ ఒప్పందం కారణంగా ప్రపంచ వాణిజ్యం ఏటా ట్రిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది.

పీహెచ్‌డీలు యూఎస్‌లోనే అత్యధికం
పరిశోధన రంగంలో అత్యధిక పీహెచ్‌డీలు సాధిస్తున్న దేశాలకు సంబంధించి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ఫిబ్రవరి 27న విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధికంగా డాక్టరేట్ డిగ్రీలు పొందుతున్నారు. ఉన్నత విద్యపై కమిటీ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ పాలసీ- 2016, సెప్టెంబర్‌లో రూపొందించిన నివేదికను ఓఈసీడీ ఆమోదించింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘంగా పిలిచే ఓఈసీడీలో 35 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

2015లో వాయు కాలుష్యం వల్ల 42 లక్షల మంది మృతి 
2015లో వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది మరణించారు. ఈ మొత్తంలో సగానికిపైగా (22 లక్షలు) భారత్, చైనాలకు చెందినవారే. ఈ మేరకు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఫిబ్రవరి 14న సర్వే వివరాలను వెల్లడించింది. 2015లో మానవుల ప్రాణాలను హరించిన కారణాల్లో వాయు కాలుష్యం ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 92 శాతం మంది ప్రజలు వాయుకాలుష్యం ఉన్న పరిసరాల్లో జీవిస్తున్నారు. వాయు కాలుష్యం చైనాలో అత్యధికంగా ఉండగా, భారత్ తర్వాతి స్థానంలో ఉంది. 1990 నుంచి 2015 మధ్య భారత్‌లో వాయు కాలుష్య మృతుల సంఖ్య 50 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. 

ఉగ్రవాదంపై జీ-20 కార్యబృందం ఏర్పాటు చేయండి: భారత్
ఉగ్రవాదంపై జీ-20 దేశాలతో కార్య బృందాన్ని ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. జర్మనీలోని బాన్ నగరంలో ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగిన జీ-20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశంలో ఈ ప్రతిపాదన చేసింది. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు.

వెనెజువెలా ఉపాధ్యక్షుడిపై అమెరికా నిషేధం
వెనెజువెలా ఉపాధ్యక్షుడు తారెక్ ఎల్ ఐస్సామిపై అమెరికా నిషేధం విధించింది. అతడిని మత్తు పదార్థాల చేరవేతదారుడిగా గుర్తిస్తూ బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ శాఖ ఫిబ్రవరి 13న ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశ ఫారిన్ నార్కోటిక్స్ కింగ్‌పిన్ డిసిగ్నేషన్ యాక్ట్ కింద ఆయనపై నిషేధం విధించినట్లు తెలిపింది.

సయీద్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన పాకిస్తాన్
పాక్ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తున్నట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఏటీఏ) నాలుగో జాబితాలో హఫీజ్, అతడు నిర్వహించే సంస్థలను ఫిబ్రవరి 18న చేర్చింది. ఈ జాబితా ప్రకారం ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు అనుమానితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో అవసరమున్న ప్రతీసారి కచ్చితంగా హాజరు కావలసి ఉంటుంది.

అమెరికా కాంగ్రెస్‌లో గ్రీన్‌కార్డుల చట్టసవరణ బిల్లు
గ్రీన్‌కార్డుల ద్వారా దేశంలోకి వస్తోన్న వారి సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం ప్రస్తుత చట్టాల సవరణకు ఉపక్రమించింది. ఈ మేరకు RAISE (the reforming american immigration for strong employment) బిల్లుని ఫిబ్రవరి 8న అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఏడాదికి పదిలక్షల మందికి గ్రీన్ కార్డులు ఇస్తుండగా దాన్ని ఐదు లక్షలకు తగ్గించే ఉద్దేశంతోనే ఈ బిల్లును రూపొందించారు. లాటరీల ద్వారా వీసాలిచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. 

సోమాలియా నూతన అధ్యక్షుడు అబ్దుల్లాహి ఫర్మాజో 
సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి మహ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 8న ఆ దేశ పార్లమెంట్‌లో రెండు విడతలుగా జరిగిన ఓటింగ్‌లో ఫర్మాజోకి అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి హసన్‌కు 97 ఓట్లు, మాజీ అధ్యక్షుడు షరీఫ్ అహ్మద్‌కు 45 ఓట్లు దక్కాయి. 2009 నుంచి 2010 వరకూ ఫర్మాజో సోమాలియా ప్రధానిగా పనిచేశారు.

బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు పచ్చజెండా
యూరోపియన్ యూనియన్-EU నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇందుకోసం రూపొందించిన బిల్లుపై హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ఫిబ్రవరి 9న రెండోసారి ఓటింగ్ జరిగింది. మొత్తం సభ్యుల్లో 494 మంది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేయగా 122 మంది దీన్ని వ్యతిరేకించారు. ఫిబ్రవరి 2న మొదటి సారి జరిగిన ఓటింగ్‌లో 498 మంది అనుకూలంగా 114 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇందుకు అనుగుణంగా మార్చి 31 లోపు ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియకు బ్రిటన్ ప్రథాని థెరెసా మే చర్చలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత రెండేళ్లలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. 

వీసా ఆంక్షలను తిరస్కరించిన అమెరికా అప్పీల్ కోర్టు 
ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ఆ దేశ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అప్పీల్ కోరు తిరస్కరించింది. ఈ మేరకు తొమ్మిదో సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఫిబ్రవరి 9న ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ట్రంప్ ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సియాటెల్ కోర్టు ఫిబ్రవరి 4న స్టే విధించింది. ఈ నిర్ణయంపై అప్పీల్ కోర్టుని ఆశ్రయించిన అమెరికా ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది. కోర్టు తీర్పులతో యూఎస్ ప్రభుత్వం ఇప్పటికే వీసా నిషేధాన్ని ఎత్తివేసింది.

ఆన్‌లైన్ షాపింగ్‌లో చైనీయులు టాప్ 
ఆన్‌లైన్ షాపింగ్‌లో చైనీయులదే అగ్రస్థానమని ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న నివేదిక విడుదల చేసింది. 36 శాతం మంది చైనీయులు వారానికి ఒకసారైనా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారని పేర్కొన్న సంస్థ అమెరికా 16 శాతం, జర్మనీ 15 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్, యూరప్‌లలోని 26 మార్కెట్ల నుంచి సేకరించిన గణాంకాలతో ఈ నివేదికను రూపొందించారు.

అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్లెర్సన్ 
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ప్రముఖ వ్యాపారవేత్త, ఎక్సాన్ మొబైల్ మాజీ సీఈవో టిల్లెర్సన్ ఫిబ్రవరి 2న బాధ్యతలు చేపట్టారు. ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. 

ట్రంప్‌పై పోరుకు ట్విట్టర్ విరాళం
ఏడు ఇస్లామిక్ దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్-ACLUకు వివిధ కంపెనీలు బాసటగా నిలుస్తున్నాయి. ఈ మేరకు ఆ సంస్థకు ట్విట్టర్ 1.59 మిలియన్ డాలర్ల (రూ.10.8 కోట్లు) విరాళం ప్రకటించింది.

వలసల నిషేధంపై వెనక్కి తగ్గిన అమెరికా 
ఏడు ముస్లిం దేశాల పౌరులకు వీసాలు నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశంలోని సియాటెల్ కోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు నిర్ణయాల అమలుపై ఫిబ్రవరి 4న స్టే విధించింది. కోర్టు ఆదేశాలతో వలసలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం తీర్పుని పునర్ పరిశీలించాలంటూ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసింది. అయితే కిందిస్థాయి కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను అమెరికా ఉన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. 

శ్రీలంకలో పాఠశాల ఏర్పాటుకు భారత్ సహాయం
శ్రీలంకలోని పొలన్నారువా జిల్లాలో విభిన్న తెగల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఏకాభిప్రాయ పత్రాలపై ఫిబ్రవరి 2న రెండు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఈ విద్యాలయంలో సిన్హాళీలు, తమిళులు, ముస్లింలకు సమాన అవకాశాలు కల్పించనున్నారు. మూడు భాషల్లో విద్యా బోధన అందించనున్న పాఠశాల నిర్మాణానికి భారత్ రూ.30 కోట్ల సహాయం అందిస్తుంది.

హెక్మత్యార్‌ను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించిన ఐరాస 
అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని, మిలిటరీ కమాండర్ గుల్బుద్దీన్ హెక్మత్యార్‌ను ఉగ్రవాదుల జాబితా నుంచి ఐరాస తొలగించింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి కమిటీ ఫిబ్రవరి 4న నిర్ణయాన్ని వెల్లడించింది. జప్తులో ఉన్న అతడి ఆస్తులకు విముక్తి కల్పించడంతో పాటు ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్‌కు వ్యతిరేకి అయిన హెక్మత్యార్‌కు ‘కాబూల్ కసాయి’అనే పేరుంది. 1997 నుంచి పాకిస్తాన్‌లోనే ఉంటోన్న అతడికి పాక్ గూడఛారి సంస్థ (ISI) తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 

రాణిగా 65 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలిజబెత్
ఇటీవలే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఫిబ్రవరి 6న రాణిగా 65 ఏళ్లు (sapphire jubilee) పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ఎక్కువకాలం సింహాసనాన్ని అధిరోహించిన బ్రిటన్ రాజ వంశస్తురాలిగా నిలిచారు.

ఎక్కువ దూరం ప్రయాణించే విమానం QR 920
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్‌వేస్ ప్రారంభించింది. దోహా విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 5న బయలుదేరిన క్యూఆర్ 920 విమానం ఫిబ్రవరి 6 ఉదయానికి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. ఏకధాటిగా 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ. పయనించి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. భూ ఉపరితలంపై ఉన్న దూరానికి అనుగుణంగా ప్రయాణించిన కిలోమీటర్లను లెక్కించారు. కాగా దూరాన్ని ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

సిరియాలో ఐదేళ్లలో 13 వేల మందికి ఉరి: ఆమ్నెస్టీ 
సిరియా రాజధాని డమస్కస్‌లోని Saydnaya జైలులో గత ఐదేళ్లలో 13 వేల మందిని ఉరి తీశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 7న ఓ నివేదిక విడుదల చేసింది. జైలు గార్డులు, జడ్జీలు తదితర 84 మంది సాక్షుల సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించిన సంస్థ 2011-15 మధ్య వారానికి కనీసం 50 మంది ఖైదీలను రహస్యంగా ఉరితీసేవారని పేర్కొంది. బాధితుల్లో ఎక్కువగా ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన సామాన్య పౌరులేనని నివేదిక తెలిపింది.

AIMS DARE TO SUCCESS 

మార్చి 2017 అంతర్జాతీయం
హాంగ్‌కాంగ్ పీఠంపై క్యారీల్యామ్
హాంగ్‌కాంగ్‌కు తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చైనా మద్దతు ఉన్న క్యారీల్యామ్ (59) మార్చి 26న ఎన్నికయ్యారు. ఒక దేశం, రెండు వ్యవస్థలు సూత్రం కింద 1997లో హాంగ్‌కాంగ్‌ను చైనాలో విలీనం చేసేందుకు బ్రిటన్ అంగీకరించింది. దీని ప్రకారం హాంగ్‌కాంగ్‌కు కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది.

ఇన్నోవేషన్ ఆఫీస్ అధిపతిగా ట్రంప్ అల్లుడు
 వాగ్దానాల అమలు, పాలనా వ్యవస్థ ప్రక్షాళన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన సృజనాత్మక కార్యాలయం (ఇన్నోవేషన్ ఆఫీస్) అధిపతిగా జేర్డ్ కుష్నర్ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 27న ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ‘ది వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ అమెరికన్ ఇన్నోషన్’గా పిలిచే ఈ కార్యాలయం అధ్యక్షుడికే మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. జేర్డ్ కుష్నర్ ట్రంప్ అల్లుడు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ఇన్నోవేషన్ ఆఫీస్ ఛైర్మన్ 
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : జేర్డ్ కుష్నర్
ఎందుకు : వాగ్దానాల అమలు, పాలనా వ్యవస్థ ప్రక్షాళన కోసం

2040 నాటికి 60 కోట్ల మంది పిల్లలకు నీటి కొరత
ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి సుమారు 60 కోట్ల మంది పిల్లలు తీవ్ర నీటి కొరత ఎదుర్కోనున్నట్లు యూనిసెఫ్ వెల్లడించింది. ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడతారని, ప్రజలు తక్కువ నీటితోనే జీవించాల్సి వస్తుందని మార్చి 21న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణం వేడెక్కడం, సముద్రాల విస్తీర్ణం పెరగడం, మంచు కరగడం, కరువులతోపాటు పెరుగుతున్న జనాభా కారణంగా నీటి వాడకం ఎక్కువవుతుందని, ఇది నీటి లభ్యతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఇప్పటికే దాదాపు 36 దేశాల్లో నీటి కొరత అధికంగా ఉందని పేర్కొంది. రోజూ సరైన పరిమాణంలో నీటిని తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది పిల్లలు డయేరియా బారిన పడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా రోజూ దాదాపు 800 మంది చిన్నారులు ఈ వ్యాధితో మరణిస్తున్నారని వెల్లడించింది.

2018లో టైటానిక్ సందర్శన
వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ ఓడను చూడాలని అనుకునే వారికి బ్లూ మార్బుల్ ప్రైవేట్ అనే సంస్థ ఆ అవకాశం కల్పించనుంది. ఈ మేరకు 2018 మేలో చేపట్టనున్న సాహస యాత్ర ద్వారా పర్యాటకులను అట్లాంటిక్ మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్ ఓడ వద్దకు తీసుకెళ్లనుంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి టికెట్ ధర 1,05,129 డాలర్లు (రూ.68 లక్షలు)గా నిర్ణయించగా ఇప్పటికే తొలిదశకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 8 రోజులు సాగే ప్రయాణం కెనడా నుంచి మొదలవుతుంది. 
1912 ఏప్రిల్ 14న ఆర్‌ఎంఎస్-టైటానిక్ ఓడ ఇంగ్లండ్ నుంచి అమెరికా వెళ్తూ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోయింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైటానిక్ ఓడ సందర్శన 
ఎప్పుడు : 2018 మే 
ఎవరు : బ్లూ మార్బుల్ ప్రైవేట్ సంస్థ
ఎక్కడ : అట్లాంటిక్ మహాసముద్రంలో

రిఫరెండంకు స్కాట్లాండ్ అంగీకారం
బ్రిటన్ నుంచి విడిపోయేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరాలని స్కాట్లాండ్ చట్ట సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఎడిన్‌బర్‌లో మార్చి 28న జరిగిన సమావేశంలో రిఫరెండమ్‌కు అనుకూలంగా 69, వ్యతిరేకంగా 59 మంది ఓట్లు వేశారు. దీంతో స్వతంత్ర దేశంగా ఉండేదుకు ప్రజాభిప్రాయం నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని స్కాట్లాండ్ అధికారికంగా కోరింది. 
2014లో నిర్వహించిన రిఫరెండమ్‌లో బ్రిటన్‌తో ఉండేందుకే స్కాట్లాండ్ వాసులు మొగ్గుచూపారు. అయితే ఇటీవల ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న స్కాట్లాండ్ విడిపోయేందుకు సిద్ధమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిఫరెండంకు స్కాట్లాండ్ అంగీకారం 
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : స్కాట్లాండ్ చట్ట సభలు
ఎందుకు : బ్రిటన్ నుంచి విడిపోయేందుకు 

అంతర్జాతీయ మేఘాల అట్లాస్ విడుదల
అంతర్జాతీయ మేఘాల అట్లాస్ డిజిటల్ ప్రతిని ప్రపంచ వాతావరణ సంస్థ మార్చి 23న వాషింగ్టన్‌లో విడుదల చేసింది. ఇందులో 12 కొత్త రకాల మేఘాలను గుర్తించింది. మేఘాలనేవి వాతావరణం, రుతువులు, జలచక్రంలో కీలకం. వీటి పరిశీలన,గుర్తింపులో ఈ అట్లాస్ ఒక అంతర్జాతీయ ప్రమాణంగా పనిచేస్తుంది. 

ఫార్చ్యూన్ ప్రపంచ గొప్ప నాయకులు-2017 
ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ వరల్డ్స్ గ్రేటెస్ట్ లీడర్స్-2017 జాబితాను మార్చి 23న విడుదల చేసింది. మొత్తం 50 నాయకులతో కూడిన ఈ జాబితాలో భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య 26వ స్థానంలో నిలిచారు. భారతీయ సంతతికి చెందిన లాస్ట్‌మైల్‌హెల్త్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజ్ పంజాబి 28వ స్థానంలో నిలిచారు. ఎస్‌బీఐకు సంబంధించి డీమోనిటైజేషన్, మొండిబకాయిలు వంటి పలు సమస్యలను ఎదుర్కోవడంలో భట్టాచార్య కీలకపాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది.
ఫార్చ్యూన్ టాప్ లీడర్స్

స్థానం

పేరు

సంస్థ

1

థియో ఎప్‌స్టీన్

షికాగో కబ్స్ బేస్ బాల్ ఆపరేషన్స్

2

జాక్ మా

అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్

3

పోప్ ఫ్రాన్సిస్

-

4

మిలిందా గేట్స్

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్

5

జెఫ్ బెజోస్

అమెజాన్ ఫౌండర్, సీఈవో

26

అరుంధతి భట్టాచార్య

భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్

28

రాజ్ పంజాబి

లాస్ట్ మైల్ హెల్త్ సీఈవో

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్చ్యూన్ టాప్-50 నాయకుల జాబితా 
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : 26వ స్థానంలో ఎస్‌బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య 

ట్రిప్ అడ్వైజర్ టాప్-25 ఆసియా పర్యాటక ప్రాంతాలు 
ట్రిప్ అడ్వైజర్ ఆసియా నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు ప్రాంతాలు స్థానం దక్కించున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ టాప్-25 నగరాలను మార్చి 23న వెల్లడించింది. వీటిల్లో గోవా (11వ స్థానం), న్యూఢిల్లీ (13వ స్థానం), జైపూర్ (18వ స్థానం), ఆగ్రా (19వ స్థానం) ఉన్నాయి. ఈ జాబితాలో ఇండోనేసియాలోని బాలి అగ్రస్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాప్-25 ఆసియా పర్యాటక ప్రాంతాలు 
ఎప్పుడు : మార్చి 23 
ఎవరు : ట్రిప్ అడ్వైజర్ 
ఎక్కడ : ఆసియాలో

హ్యూరాన్ వలస బిలియనీర్స్ - 2017 
ఇమ్మిగ్రేంట్ బిలియనీర్స్ (వలస కుబేరులు) 2017 నివేదికను హ్యూరాన్ సంస్థ మార్చి 25న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో మొత్తం 2,257 మంది అపర కుబేరులు ఉండగా వీరిలో 300 మంది పుట్టిన దేశంలో కాకుండా విదేశాల్లో బిలియనీర్లుగా ఎదిగారు. జర్మనీ నుంచి అత్యధికంగా 31 మంది, భారత్ నుంచి 30, చైనా నుంచి 24 మంది ఈ జాబితాలో ఉన్నారు. ప్రవాస భారత బిలియనీర్లలో తొలి 10 మందిలో ఉక్కు వ్యాపారి లక్ష్మీనివాస్ మిట్టల్ అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్ సహస్థాపకుడు సెర్జీ బ్రిన్ ప్రపంచంలోనే వలస కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వలస బిలియనీర్స్ రిపోర్ట్ - 2017 
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : హ్యూరాన్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా

వుమెన్ ఇన్ పాలిటిక్స్ 2017లో వెనకబడిన భారత్ 
ఐక్యరాజ్య సమితి వుమెన్ ఇన్ పాలిటిక్స్ 2017 మ్యాప్‌లో ఆసియాలోని పొరుగు దేశాల కన్నా భారత్ వెనకబడింది. ఈ మేరకు ఐరాస మహిళా విభాగం, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) మార్చి 14న ఈ నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం 2017, జనవరి 1 నాటికి 18.5 శాతం మహిళా మంత్రులతో భారత్ 186 దేశాల్లో 88వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో రువాండా, కెన్యా, మొజాంబిక్, దక్షిణ సూడాన్‌లు భారత్ కన్నా ముందంజలో ఉన్నాయి. పార్లమెంట్‌కు ఎన్నికైన మహిళల సంఖ్య పరంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో భారత్ 193 దేశాల్లో 148వ స్థానానికి దిగజారింది. లోక్‌సభలో మహిళా సభ్యులు 11.48 శాతం కాగా, ఎగువ సభలో వీరి శాతం 11 శాతంగా ఉంది. ఈ విషయంలో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఇరాక్ భారత్ కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వుమెన్ ఇన్ పాలిటిక్స్ 2017 మ్యాప్
ఎప్పుడు : మార్చి 14 
ఎవరు : ఐరాస మహిళా విభాగం, ఐపీయూ

ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితా - 2017 
 ప్రముఖ మ్యాగజైన ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా - 2017ను మార్చి 20న వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 86 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా నాలుగోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. బెర్క్‌షైర్ హాథ్‌వే చీఫ్ వారెన్ బఫెట్ 75.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 23.2 బిలియన్ డాలర్లతో 33వ స్థానంలో ఉన్నారు. 
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల జనాభా 2016తో పోలిస్తే ఈ సారి 13 శాతం పెరిగి 2,043కి చేరింది. 
శ్రీమంతుల జాబితా 

స్థానం

పేరు

సంస్థ

1

బిల్‌గేట్స్

మైక్రోసాఫ్ట్

2

వారెన్ బఫెట్

బెర్క్‌షైర్ హాథ్‌వే

3

బెజోస్

అమెజాన్

4

ఎ. ఒర్టేగా

చైన్ జరా

5

మార్క్ జుకెర్‌బర్గ్

ఫేస్‌బుక్


ఏ దేశంలో ఎంత మంది శ్రీమంతులు 

స్థానం

దేశం

శ్రీ‌మంతులు

1

అమెరికా

565

2

చైనా

319

3

జర్మనీ

114

4

భారత్

101

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితా - 2017 
ఎప్పుడు : మార్చి 20 
ఎవరు : తొలిస్థానంలో బిల్‌గేట్స్ 

వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ - 2017 నివేదిక 
ప్రపంచంలో నివాస యోగ్యమైన అత్యంత చవకై న నగరాల జాబితాలో భారత్ నుంచి నాలుగింటికి చోటు దక్కింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) మార్చి 21న విడుదల చేసిన వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ - 2017 నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం కజకిస్తాన్‌లోని అల్మటీ నగరం ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచింది. భారత్ నుంచి బెంగళూరుకు 3వ స్థానం, చెన్నైకి 6, ముంబైకి 7, ఢిల్లీకి 10వ స్థానాలు దక్కాయి. 

చవకైన నగరాలు

ఖరీదైన నగరం

స్థానం

నగరం

స్థానం

నగరం

1

ఆల్మటీ(కజకిస్తాన్)

1

సింగపూర్

2

లాగోస్(నైజీరియా)

2

హాంకాంగ్(చైనా)

3

బెంగళూరు(భారత్)

3

జ్యూరిక్(స్విట్జర్లాండ్)

4

కరాచీ(పాకిస్తాన్)

4

టోక్యో(జపాన్)

5

అల్జీర్స్(అల్జీరియా)

5

ఒసాక (జపాన్)

6

చెన్నై(భారత్)

6

సియోల్(ద.కొరియా)

7

ముంబై(భారత్)

7

జెనీవా(స్విట్జర్లాండ్)

8

కీవ్(ఉక్రెయిన్)

8

పారిస్(ఫ్రాన్స్)

9

బుకారెస్ట్(రుమేనియా)

9

న్యూయార్క్(అమెరికా)

10

న్యూఢిల్లీ(భారత్)

10

కోపెన్‌హాగెన్(డెన్మార్క్)

క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ - 2017 నివేదిక
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్

దక్షిణ కొరియా అధ్యక్షురాలు తొలగింపు
 అవినీతి ఆరోపణల నేపథ్యంలో అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్‌హేను అధికారికంగా పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం మార్చి 10న చారిత్రక తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూటర్లు ఇప్పటికే పార్క్ పేరును నిందితుల జాబితాలో చేర్చడంతో ధర్మాసనం ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్‌‌సకు అనుమతిచ్చింది. పార్క్ చర్యలు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే అని చీఫ్ జస్టిస్ జంగ్-మీ పేర్కొన్నారు. తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్‌తో కుమ్మకై ్క పార్క్ అవినీతికి పాల్పడ్డారని, కంపెనీల నుంచి లక్షల డాలర్లను వసూలు చేశారని, చోయ్‌ను ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునేలా అవకాశం కల్పించారని కోర్టు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ కొరియా అధ్యక్షురాలు పదవి నుంచి తొలగింపు
ఎప్పుడు : మార్చి 10 
ఎవరు : దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానం 

కాలుష్యంతో 17 లక్షల మంది పిల్లలు మృతి
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం వల్ల ఏటా 17 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. కలుషిత నీరు, ఇంట్లో పొగతాగడం, పారిశుద్ధ్యం లేకపోవడం తదితర కారణాల వల్ల చిన్నారుల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ మార్చి 6న తన నివేదికలో తెలిపింది. పిల్లల్లో ఎక్కువ మంది డయేరియా, మలేరియా, న్యూమోనియాతో చనిపోతున్నారు.

ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోరిన జీ4 దేశాలు
ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల దిశగా క్రియాశీలక ఆలోచనలకు సిద్ధంగా ఉన్నామని జీ4 (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) దేశాలు మార్చి 8న ప్రకటించాయి. అయితే భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తే సంస్కరణల్లో మాత్రమే పాలుపంచుకుంటామని ..వీటోపై సమీక్ష జరిగి నిర్ణయం తీసుకునేంత వరకు ఆ అధికారాన్ని (వీటో) వాడబోమని ప్రతిపాదించాయి. భద్రతామండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచేలా సంస్కరణలు తేవాలనే ప్రతిపాదనకు ఐరాసలో భారీ మద్దతు లభించిందని జీ 4 దేశాల తరఫున ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.

అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థను వ్యతిరేకించిన చైనా
దక్షిణ కొరియాలో అమెరికా ఏర్పాటు చేస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థపై చైనా మార్చి 7న తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణి వ్యవస్థకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, దీని పరిణామాలను అమెరికా, దక్షిణ కొరియా ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే అమెరికా మిస్సైల్ లాంఛర్లు, ఇతర సామాగ్రి దక్షిణ కొరియా చేరుకున్నాయి. తమ దేశ భద్రత ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా కచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ చెప్పారు. ఉత్తర కొరియా నాలుగు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన నేపథ్యంలో తన మిత్రపక్షమైన దక్షిణ కొరియాలో అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. 

2030 నాటికి శక్తిమంతమైన దేశాల్లో చైనా టాప్ 
2030 నాటికి శక్తిమంతమైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలుస్తుందని ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ మార్చి 10న ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో 32 దేశాలు చోటు దక్కించుకున్నాయి. వినిమయశక్తి సూచికతో కొలిచే ప్రపంచ స్థూల జాతియోత్పత్తి ఆధారంగా ఈ దేశాల ఆర్థిక శక్తిని సంస్థ అంచనా వేసింది. ఈ అంచనాల్లో చైనా తర్వాత అమెరికా ఆర్థిక శక్తివంతమైన దేశంగా నిలువగా భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. తదుపరి స్థానాల్లో జపాన్, ఇండోనేసియా, రష్యా నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ శక్తిమంతమైన దేశాల జాబితా
ఎప్పుడు : 2030 నాటికి 
ఎవరు : మొదటి స్థానంలో చైనా, 3వ స్థానంలో భారత్

19 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో జనగణన 
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో జనగణన జరుగుతోంది. ఈ మేరకు మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సుమారు 2 లక్షల బృందాలు, స్థానిక అధికారులు ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన సహా కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. చివరిసారిగా 1998లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా సుమారు 18 కోట్లుగా తేలింది. పాక్‌లో 1951, 1961, 1972, 1981 సంవత్సరాల్లో మొదటి నాలుగు జనాభా లెక్కలు జరిగాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌లో 6వ జనగణన
ఎప్పుడు : మార్చి 15 నుంచి 
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం 

సిరియాలో 652 మంది చిన్నారులు మృతి : యునిసెఫ్ 
2016లో సిరియాలో జరిగిన దాడుల్లో 652 మంది చిన్నారులు చనిపోయారని యునెటైడ్ నేషన్‌‌స చిల్డ్రన్‌‌స ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) ప్రకటించింది. ఆ దేశంలో సంక్షోభం మొదలై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 13న ఈ వివరాలు వెల్లడించింది. అంతర్యుద్ధంలో ప్రభుత్వం, తిరుగుబాటుదారులు స్కూళ్లు, ఆసుపత్రులు, ఆట స్థలాలు, పార్కులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని దీని వల్ల దాదాపు 17 లక్షల మంది చిన్నారులు చదువుకు దూరమవగా, మరో 23 లక్షల మంది పిల్లలు పశ్చిమాసియాలో శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారని తెలిపింది. ‘దరా’ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్కూళ్ల గోడలపై నినాదాలు రాసిన పిల్లల్ని అధికారులు అరెస్టు చేసి హింసిస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిరియా అంతర్యుద్ధంలో 652 మంది చిన్నారులు మృతి 
ఎప్పుడు : 2016లో
ఎవరు : యునిసెఫ్ 
ఎక్కడ : సిరియా 

అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరం వియన్నా 
అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితా - 2017లో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మెర్సర్ మార్చి 14న ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 231 నగరాల్లో రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, నేరాల నియంత్రణ, వినోదం, రవాణా ప్రమాణాలు వంటి అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ నివేదిక రూపొందించారు. ఇందులో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవగా అత్యంత చెత్త నగరంగా బాగ్దాద్ చివరి స్థానంలో నిలిచింది.
భారత్ నగరాల్లో హైదరాబాద్ వరుసగా మూడోసారి తొలి స్థానంలో నిలిచింది. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్ (25వ ర్యాంకు), అమెరికా నుంచి తొలిస్థానంలో శాన్‌ఫ్రాన్సిస్కో (29వ ర్యాంకు) నిలిచాయి. 
మెర్స్‌ర్ అత్యున్నత నగరాల జాబితా-2017

స్థానం

నగరం

1

వియన్నా (ఆస్ట్రియా)

2

జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)

3

ఆక్లాండ్ (న్యూజిలాండ్)

4

మ్యూనిక్ (జర్మనీ)

5

వాంకోవర్ (కెనడా)

క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యున్నత నగరాల జాబితా-2017
ఎప్పుడు : మార్చి 14 
ఎవరు : మెర్స్‌ర్ కన్సల్టెంట్ సంస్థ

అమెరికా మెడికేర్ చైర్మన్‌గా సీమా వర్మ 
అమెరికాలోని కీలకమైన మెడికేర్ అండ్ మెడికెయిడ్ సేవా కేంద్రాల అధిపతిగా భారత సంతతి మహిళ సీమా వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 15న వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈమెతో కలిపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో పనిచేస్తున్న ఇండో-అమెరికన్‌ల సంఖ్య ఆరుకు చేరింది.
ట్రంప్ ప్రభుత్వం ఉన్న ఇండో-అమెరికన్‌లు

1. నిక్కీ హేలీ

ఐరాసలో అమెరికా ప్రతినిధి

2. సీమా వర్మ

మెడికెయిడ్ అండ్ మెడికేర్ చైర్మన్

3. అజిత్ పాయ్

ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్స్ హెడ్

4. ప్రీత్ భారారా

యూఎస్ అటార్నీ ఫర్ సథరన్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్

5. రాజ్ షా

వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ టీమ్

క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా మెడికేర్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ 
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : భారత సంతతి మహిళ సీమా వర్మ

ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పావు శాతం పెంపు 
అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లు పావు శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుతం 0.75 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 1 శాతానికి పెంచుతున్నట్లు మార్చి 15న ఫెడ్ ప్రకటించింది. ఈ ఏడాది మరో రెండు విడతలు, 2018లో మూడు విడతల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ కమిటీ అంచనా వేసింది. 2007-09 మధ్య ఆర్థిక మాంద్యం పరిణామాల తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి. 2015 డిసెంబర్‌లో తొలిసారి, ఆ తర్వాత 2016 డిసెంబర్‌లో రెండోసారి వడ్డీ రేట్లు పెంచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పావు శాతం పెంపు 
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : అమెరికా ఫెడ్ కమిటీ 
ఎక్కడ : అమెరికా 

అమెరికా కాంగ్రెస్‌లో కాల్ సెంటర్ బిల్లు
కాల్ సెంటర్లను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కకుండా చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మార్చి 2న తిరిగి ప్రవేశపెట్టారు. ‘ది యూఎస్ కాల్ సెంటర్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్’ అనే ఈ బిల్లును డెమోక్రటిక్ పార్టీకి చెందిన జీన్ గ్రీన్, రిపబ్లిక్ పార్టీకి చెందిన డేవిడ్ మెక్ కిన్లేలు ప్రవేశపెట్టారు.

వలస నిషేధపు ఉత్తర్వులను సవరించిన అమెరికా 
 అమెరికాలోకి వలసల నిరోధం కోసం సవరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 6న సంతకం చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఆరు ముస్లిం ఆధిక్య దేశాల (సూడాన్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, యెమెన్) పౌరుల్ని 90 రోజుల పాటు అమెరికాలోకి అనుమతించరు. కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే ఈ ఉత్తర్వు వర్తిస్తుందని, ఇప్పటికే చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉంటే వారికి అమెరికాలో ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మార్చి 16 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. 

గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఇరాక్ కూడా ఉంది. అయితే అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేవారిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఇరాక్ అంగీకరించడంతో ఆ దేశం పేరును జాబితా నుంచి తొలగించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వలస నిషేధపు ఉత్తర్వులను సవరించిన అమెరికా
ఎప్పుడు : మార్చి 6 
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 

ఆసియా-పసిఫిక్ అవినీతి దేశాల్లో భారత్ టాప్ 
అవినీతి విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు ట్రాన్‌‌సపరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2016 నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే భారత్‌లో అవినీతి 41 శాతం పెరిగింది. సర్వేలో భారత్‌లో వివిధ ప్రభుత్వ పనుల కోసం లంచం ఇవ్వాల్సి వస్తోందని 69 శాతం మంది చెప్పారు. 65 శాతంతో వియత్నాం ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. చైనాలో 26 శాతం, పాక్‌లో 40 శాతం మంది లంచం చెల్లిస్తున్నామన్నారు. జపాన్ 0.2 శాతంతో అవినీతిలో చిట్టచివరన నిలవగా, దక్షిణ కొరియా 3 శాతంతో మెరుగైన స్థానంలో ఉంది. 

ఈ సర్వేలో 16 దేశాల్లోని 22 వేల మందిని ప్రశ్నించారు. దీని ప్రకారం 2016లో ఒక్కసారైనా లంచం చెల్లించినవారు దాదాపు 90 కోట్ల మంది ఉండొచ్చని సంస్థ పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా-పసిఫిక్ అవినీతి దేశాల్లో భారత్ టాప్
ఎప్పుడు : 2016
ఎవరు : టాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్

ఉత్తమ దేశం స్విట్జర్లాండ్
ప్రపంచంలోని ఉత్తమ దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. రెండోస్థానంలో కెనడా, మూడో స్థానంలో బ్రిటన్ నిలవగా భారత్ 25వ స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్, బీఏఈ కన్సల్టింగ్ సంయుక్తంగా నిర్వహించిన ‘బెస్ట్ కంట్రీస్-2017 సర్వే వివరాలను మార్చి 7న విడుదల చేశాయి.

ఈ జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై కొంత గౌరవం కోల్పోయామని సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది తెలిపారు. వివిధ దేశాలకు చెందిన 21 వేల మంది వాణిజ్యవేత్తలు, సాధారణ ప్రజానీకం, పలురంగాల ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 

ఉత్తమ దేశాల జాబితా-2017

స్థానం

దేశం

స్థానం

దేశం

1

స్విట్జర్లాండ్

6

స్వీడన్

2

కెనడా

7

అమెరికా

3

బ్రిటన్

8

ఆస్ట్రేలియా

4

జర్మనీ

9

ఫ్రాన్స్

5

జపాన్

10

నార్వే

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ దేశాల జాబితా - 2017
ఎప్పుడు : మార్చి 7 
ఎవరు :యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్, బీఏఈ కన్సల్టింగ్

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2017 అంతర్జాతీయం
మెటల్ మైనింగ్‌పై నిషేధం విధించిన ఎల్ సాల్వడోర్ 
ఎల్ సాల్వడోర్ దేశం మెటల్ మైనింగ్‌పై నిషేధం విధించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు సాంచెజ్ సెరెన్ ఏప్రిల్ 28న సంతకం చేశారు. తద్వారా ప్రపంచంలో మెటల్ మైనింగ్‌ని నిషేధించిన తొలి దేశంగా ఎల్ సాల్వడోర్ గుర్తింపు పొందింది. 
దేశంలో మెటల్ మైనింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందంటూ కొన్నేళ్లుగా ఉద్యమాలు సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెటల్ మైనింగ్‌పై నిషేధం విధించిన తొలి దేశం 
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : ఎల్ సాల్వడోర్ అధ్యక్షుడు సాంచెజ్ సెరెన్
ఎక్కడ : ఎల్ సాల్వడోర్‌లో 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం 


కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా
భారత్-పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా వెల్లడించింది. ఈ మేరకు దక్షిణాసియా ప్రాంతంలో కీలక పాత్ర పోషించేందుకు చైనా ఆసక్తిగా ఉందని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో తమ దేశం 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, అందువల్ల కశ్మీర్ సమస్య పరిష్కారం కావడం తమ దేశానికీ అవసరమేనని పేర్కొంది. ఇతర దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం చైనా అభిమతం కాదని అయితే విదేశాల్లోని తమ పెట్టుబడులకు రక్షణ కోసం మధ్యవర్తిత్వం చేస్తామని తెలిపింది. కశ్మీర్ వివాదంలో చైనా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి చైనా సిద్ధం
ఎప్పుడు : మే 2
ఎవరు : చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్
ఎందుకు : విదేశాల్లో చైనా పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు

నేపాల్ స్థానిక సంస్థల్లో భారతీయులకు పోటీ చేసే హక్కు
నేపాల్ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం భారతీయులను ఏప్రిల్ 27న అనుమతించింది. ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్‌తో సరిహద్దు ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాలను కలిపి టరాయి ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసించే భారతీయులకు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం ఇకపై దక్కనుంది. ఈ అవకాశం కోసం నేపాల్‌లోని భారతీయులు గత ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. 

ఉత్తర కొరియాలో తొలిసారిగా మానవ హక్కుల బృందం పర్యటన
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల బృందం తమ దేశంలో పర్యటించేందుకు ఉత్తర కొరియా ఏప్రిల్ 26న అంగీకారం తెలిపింది. కేటలినా డివన్‌డాస్ అగిలర్ నేతృత్వంలోని హక్కుల బృందం ఆ దేశంలో వైకల్యం పొందిన పౌరుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఓ పౌర హక్కుల సంఘాన్ని ఉత్తర కొరియా ఇప్పటివరకు దేశ పర్యటనకు అనుమతించలేదు.

హెచ్-1బీ వీసా మార్పుల ఉత్తర్వుపై ట్రంప్ సంతకం
 ‘అమెరికా ఉత్పత్తులనే కొనండి.. అమెరికన్‌లకే ఉద్యోగాలు ఇవ్వండి’ అనే నినాదంతో తయారైన వీసా నిబంధనల మార్పుల ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 18న సంతకం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం విదేశాల నుంచి అత్యున్నత స్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోకి అనుమతిస్తారు. అలాగే అధిక జీతం పొందే వారికే హెచ్-1బీ వీసాలు ఇస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్-1బీ వీసా ఉత్తర్వులు జారీ 
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
ఎక్కడ : అమెరికాలో 

ఆస్ట్రేలియా పౌరసత్వానికి నాలుగేళ్ల నిబంధన
ఆస్ట్రేలియా ప్రభుత్వం పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఇకపై ఆసీస్ పౌరసత్వం పొందాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతో పాటు కనీసం నాలుగేళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండాలని పేర్కొంటూ సరికొత్త చట్టాన్ని ఏప్రిల్ 20న ప్రవేశపెట్టింది. అలాగే ఈ చట్టం ప్రకారం ఆ దేశ పౌరసత్వం పొందేందుకు మూడు సార్లకు మించి పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఇంతక ముందు నివాస నిబంధన 12 నెలలు ఉండగా ఎన్ని సార్లయినా పరీక్ష రాసే వెసులుబాటు ఉండేది. 
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు ప్రాచుర్యం పొందిన 457 వర్క్ వీసాను ఆస్ట్రేలియా రెండు రోజుల క్రితం రద్దు చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా పౌరసత్వం నిబంధనలు కఠినతరం 
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : ఆస్ట్రేలియా ప్రభుత్వం 
ఎందుకు : విద్య, ఉద్యోగాల్లో ఆస్ట్రేలియా పౌరులకు ప్రాధాన్యత కోసం 

ఐరాసకు 2.5 లక్షల డాలర్లు అందజేసిన భారత్ 
ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికల వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తున్న ఐరాస ఎన్నికల విభాగానికి భారత్ 2 లక్షల 50 వేల డాలర్లు విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఐరాసలోని భారత్ మిషన్ తొలి సెక్రెటరీ ఈనమ్ గంభీర్ ఐరాసకు ఏప్రిల్ 20న చెక్ అందజేశారు. 2012లోనూ భారత్ ఇంతే మొత్తంలో నిధులను ఐరాస ఎన్నికల విభాగానికి ఇచ్చింది. 
1991లో ఐరాస స్థాపించిన ఎన్నికల సహాయ విభాగం 100కు పైగా దేశాల్లో ఎన్నికల నిర్వహణకు సహాయపడింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస ఎన్నికల విభాగానికి 2.5 లక్షల డాలర్ల సహాయం 
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : భారత్ 
ఎందుకు : వివిధ దేశాల్లో ఎన్నికల నిర్వహణకు సహకరించేందుకు 

3 ఆఫ్రికన్ దేశాలకు తొలి మలేరియా వ్యాక్సిన్ 
మలేరియా నియంత్రణ కోసం రూపొందించిన తొలి వ్యాక్సిన్‌ను ఆఫ్రికన్ దేశాలైన ఘనా, కెన్యా, మాల్వీ దేశాలకు 2018 నాటికి అందజేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 24న వెల్లడించింది. ఆర్టీఎస్, ఎస్ పేరుతో తయారుచేసిన ఈ వ్యాక్సిన్ మానవుడిలోని రోగనిరోధక వ్యవస్థకు మలేరియా పరాన్నజీవిపై పోరాడే శక్తిని కల్పిస్తుంది. దీన్ని వరుసగా మూడు నెలలపాటు నెలకో డోసు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగో డోసును 18 నెలల తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలి మలేరియా వ్యాక్సిన్ 
ఎప్పుడు : 2018 నాటికి 
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎక్కడ : ఘనా, కెన్యా, మాల్వీ దేశాలకు
ఎందుకు : మలేరియా నియంత్రణకు

బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు!
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఏప్రిల్ 18న ప్రకటించారు. బ్రిటన్‌లో సాధారణ షెడ్యూల్ ప్రకారం 2020లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

457 వీసాను రద్దు చేయనున్న ఆస్ట్రేలియా
 ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యత కల్పించి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు వర్క్ వీసా పాలసీ 457 వీసాను రద్దు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీని స్థానంలో ఇంగ్లిషులో మెరుగైన సామర్థ్యం, వృత్తి నైపుణ్యానికి ప్రాముఖ్యతలను ఇచ్చే కొత్త పాలసీని తీసుకురానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ వీసా ద్వారా భారతీయులు సహా 95 వేల మంది విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో ఉపాధి పొందుతున్నారు. కొత్త విధానంలో ఉన్నతమైన ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం, క్రిమినల్ హిస్టరీ చెక్, లేబర్ మార్కెట్ టెస్టింగ్, నాన్ డిస్క్రిమినేషన్ వర్క్‌ఫోర్స్ టెస్ట్, మార్కెట్ శాలరీ రేట్ అసెస్‌మెంట్ వంటి నిబంధనలతో పాటు కొత్తగా రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్‌‌సను తప్పనిసరి చేయనున్నారు.
457 వీసా అంటే?
ఆస్ట్రేలియాలో విదేశీయులను నైపుణ్య ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఉపయోగించే విధానమే 457 వీసా. దీనిపై వచ్చిన వాళ్లు నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియాలో పని చేయవచ్చు. 1990ల్లో వ్యాపారులకు, అత్యున్నత నిపుణత కలిగిన వలసదారుల కోసం తెచ్చిన ఈ విధానాన్ని ఆ తర్వాత మరింత విస్తరించారు. ఈ వీసాలను తీసుకునే భారతీయుల సంఖ్య 19.5% కాగా ఆ తర్వాతి స్థానాల్లో యూకే, చైనా ఉన్నాయి. 
అమెరికాలో హెచ్1బి వీసా నిబంధనలపై ట్రంప్ కఠిన నిబంధనలువిధించిన నేపథ్యంలో పలు దేశాలు ట్రంప్‌నే అనుసరిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో పాటు 2016 నవంబర్‌లో బ్రిటన్ కూడా అంతర్గత బదిలీలపై ఆంక్షలు విధించింది. దీని ప్రకారం భారత్ నుంచి అంతర్గత బదిలీ ద్వారా బ్రిటన్ వచ్చే ఉద్యోగికి కనిష్ట వేతన పరిమితిని 30 వేల పౌండ్లకు పెంచింది. ఇదే దారిలో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సమీక్షించే విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో సింగపూర్ కూడా తమ ఉద్యోగాలు భారతీయులకు దక్కకుండా చూస్తోంది. ఇందుకోసం 2016 జనవరి నుంచి భారతీయ ఐటీ కంపెనీలకు వీసాల జారీని నామమాత్రం చేసింది. ఇదిలా ఉండగా చమురు ధరలు పడిపోవడంతో ఆయిల్‌పైనే ఆధారపడ్డ సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో పలు పెద్దా, చిన్న కంపెనీలు మూతపడటంతో ఏడాదిలో 80 వేల మంది భారతీయులు తిరిగివచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వర్క్ వీసా పాలసీ 457 రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : ఆస్ట్రేలియా ప్రభుత్వం
ఎందుకు : ఆస్ట్రేలియా ఉద్యోగాలు స్థానికులకే దక్కేందుకు 

అఫ్గాన్‌పై అతిపెద్ద బాంబును ప్రయోగించిన అమెరికా 
‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’(ఎంఓఏబీ- Massive Ordnance Air Blast)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును అమెరికా అఫ్గనిస్తాన్‌పై ప్రయోగించింది. ఈ మేరకు ఏప్రిల్ 13న అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ సొరంగాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా నంగర్‌హర్ రాష్ట్రం అచిన్ ప్రాంతంలో ఖొరాసన్ సొరంగంపై 9,720 కిలోల బాంబును అమెరికా యుద్ధ విమానం (ఎంసీ-130) జారవిడిచింది. 2003లో తయారు చేసిన ఈ ఎంఓఏబీ (జీబీయూ-43బీ )ని యుద్ధ కేత్రంలో ప్రయోగించడం ఇదే మొదటిసారి. 
ఈ బాంబు తయారుచేసిన కొద్ది కాలానికే ఎంఓఏబీ కంటే శక్తివంతమైన ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్’ను రష్యా తయారుచేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంఓఏబీ బాంబును ప్రయోగించిన అమెరికా 
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : అమెరికా సైన్యం 
ఎక్కడ : అఫ్గనిస్తాన్‌లోని ఐసీసీ స్థావరాలపై 
ఎందుకు : ఐసీసీ ఉగ్రవాదులను అంతమొందించేందుకు 

టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు
టర్కీ అధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించే విషయమై ఆ దేశంలో చేపట్టిన రెఫరెండంలో అధ్యక్షుడు రిసెవ్ ఎర్డొగన్ విజయం సాధించారు. ఈ మేరకు ఏప్రిల్ 17న వెలువడిన ఫలితాల్లో రెఫరెండంకు అనుకూలంగా 51.41 శాతం మంది ఓటు వేయగా 48.59 శాతం మంది వ్యతిరేకించారు. 
టర్కీ కొత్త రాజ్యాంగం ప్రకారం 2019 నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. దేశాధ్యక్ష పదవికి ఒకరు రెండు సార్లు పోటీపడే అవకాశం ఉంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టర్కీ రెఫరెండం 
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అధ్యక్షుడు రిసెవ్ ఎర్డొగన్‌కు అనుకూలంగా 51.41 శాతం ఓట్లు
ఎక్కడ : టర్కీలో
ఎందుకు : దేశాధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించేందుకు

భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా శాంసంగ్
 దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ డ్యూరబుల్స్ సంస్థ శాంసంగ్ భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. ఈ మేరకు టీఆర్‌ఏ రీసెర్చ్ సంస్థ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ - 2017 నివేదికను ఏప్రిల్ 5న విడుదల చేసింది. దీని ప్రకారం విశ్వసనీయతలో శాంసంగ్ తొలి స్థానంలో ఉండగా సోనీ, ఎల్‌జీ సంస్థలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ సంస్థ 4, టాటా గ్రూప్ 5 స్థానాల్లో నిలిచాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ శాంసంగ్ 
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : టీఆర్‌ఏ రీసెర్చ్ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ - 2017
ఎక్కడ : భారత్‌లో 

అబుదాబిలో భారత్-యూఏఈ సాంస్కృతిక ఉత్సవాలు
భారత్ - యూఏఈ సాంస్కృతిక ఉత్సవాలు అబుదాబిలో జరిగాయి. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఉత్సవాల్లో మొదట భారత జాతి పిత మహాత్మ గాంధీ, యూఏఈ జాతి పిత షేక్ జయీద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వీడియోలను ప్రదర్శించారు. రెండు దేశాల సంస్కృతీ, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - యూఏఈ సాంస్కృతిక ఉత్సవాలు 
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : భారత్ - యూఏఈ
ఎక్కడ : అబుదాబి

సౌదీ అరేబియాలో ఆదాయ పన్ను రద్దు 
సౌదీ అరేబియా తమ దేశ ప్రజలు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతోపాటు కంపెనీలు కూడా వారి లాభాలపై ఎలాంటి పన్నులూ చెల్లించాల్సిన అవసరం లేదని ఆ దేశ ఆర్థిక మంత్రి ఏప్రిల్ 8న వెల్లడించారు.

మరణ శిక్షలను అమలు చేస్తున్న దేశాల్లో చైనా టాప్ 
మరణ శిక్షలు అమలు చేయడంలో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 11న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2016లో ప్రపంచ వ్యాప్తంగా 1,032 మందిని ఉరితీయగా అందులో అత్యధికంగా చైనాలోనే (వెయ్యికి పైగా అంచనా) అమలయ్యాయి. 
ఈ నివేదిక ప్రకారం 2016లో భారత్‌లో 136 మందికి ఉరిశిక్ష విధించారు. గతేడాది దేశంలో ఉరిశిక్షను అమలు చేయలేదు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2016లో ఉరిశిక్షలపై నివేదిక 
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ 
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా 

భారతీయుడికి ఉరిశిక్ష విధించిన పాకిస్తాన్ మిలటరీ కోర్టు 
భారతకు చెందిన కుల్ భూషణ్ జాధవ్ (46)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఏప్రిల్ 10న ఉరిశిక్ష విధించింది. జాధవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ జాధవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. 
2016 మార్చి 3న బలూచిస్తాన్ ప్రావిన్‌‌సలో కుల్ భూషణ్ జాధవ్‌ను అరెస్టు చేసిన పాక్ బలగాలు అతడిపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశాయి. అయితే జాధవ్ గతంలో నేవీలో పనిచేశారని తెలిపిన భారత్ అరెస్టుకు ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతనికి సంబంధం లేదని ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్ భూషణ్ జాధవ్‌కు ఉరిశిక్ష
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : పాకిస్తాన్ మిలటరీ కోర్టు 
ఎక్కడ : పాకిస్తాన్ 
ఎందుకు : గూఢచర్యం ఆరోపణలతో 

బ్రిటన్ నుంచి చైనా బయలుదేరిన సిల్క్ రోడ్ రైలు 
బ్రిటన్ నుంచి తొలి సరుకు రవాణా రైలు సిల్క్ రోడ్ మార్గం మీదుగా ఏప్రిల్ 10న చైనాకు బయలుదేరింది. ఈ రైలు 18 రోజుల పాటు 12 వేల కిలోమీటర్లు (7,500 మైళ్లు) ప్రయాణించి చైనా చేరుకోనుంది. 
చైనా నుంచి బ్రిటన్‌కు తొలి సరుకు రవాణా రైలు 2017 జనవరి 18న చేరుకుంది. 
ఈ రైలు ద్వారా బ్రిటన్ - చైనాల మధ్య ఉన్న వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతుందని రెండు దేశాలు భావిస్తున్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా బయలుదేరిన సిల్క్ రోడ్ రైలు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎక్కడ : బ్రిటన్ నుంచి 
ఎందుకు : రెండు దేశాల మధ్య సరుకు రవాణా కోసం 

హుజీ చీఫ్ అబ్దుల్ హన్నన్‌ను ఉరి తీసిన బంగ్లాదేశ్ 
నిషేధిత హర్కత్-ఉల్-జిహాద్ అల్ ఇస్లామిక్(హుజీ) ఉగ్రవాద సంస్థ చీఫ్ ముఫ్తీ అబ్దుల్ హన్నన్, అతడి ఇద్దరు అనుచరులను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 12న ఉరితీసింది. ఈశాన్య బంగ్లాదేశ్‌లోని సెల్హైట్‌లోని హజ్రత్ షాజలాల్ దర్గా వద్ద 2004లో వీరు ఉగ్రదాడికి పాల్పడి ముగ్గురి మృతికి కారణమయ్యారు. ఈ కేసులో గతంలోనే సుప్రీంకోర్టు వీరికి మరణశిక్ష విధించగా, ఇటీవలే దేశాధ్యక్షుడు అబ్దుల్ హమీద్ వీరి క్షమాభిక్ష దరఖాస్తులను తిరస్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హుజీ చీఫ్ అబ్దుల్ హన్నన్‌కు ఉరిశిక్ష అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : బంగ్లాదేశ్ 
ఎందుకు : 2004 హజ్రత్ షాజలాల్ దర్గా ఉగ్రదాడి కేసులో

సిరియాపై అమెరికా క్షిపణి దాడులు
సిరియాలోని షాయరత్ వైమానిక స్థావరం, పరిసరాలపై తోమహాక్ క్షిపణులతో ఏప్రిల్ 7న అమెరికా దాడి చేసింది. ఏప్రిల్ 5న సిరియాలోని ఖాన్‌షేఖున్‌లో జరిగిన రసాయనిక దాడిలో 58 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి ఈ ఎయిర్‌బేస్ నుంచే కార్యాచరణ జరిగిందనే ఉద్దేశంతో అమెరికా దాడికి దిగింది. 

భారత్-మంగోలియా సంయుక్త సైనిక విన్యాసాలు
నొమాడిక్ ఎలిఫెంట్ పేరుతో భారత్, మంగోలియా మధ్య రెండు వారాల పాటు జరిగే సైనిక విన్యాసాలు ఏప్రిల్ 5న మిజోరాంలోని వెరైంగేలో ప్రారంభమయ్యాయి.

ప్రపంచంలో 30 కోట్ల మందికి డిప్రెషన్
డిప్రెషన్ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)వెల్లడించింది. 2005 నుంచి 2015 నాటికి ఈ కేసులు ఏకంగా 18 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో డిప్రెషన్‌కు గురవుతున్నవారిలో 50 శాతం మంది చికిత్స తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ ఏప్రిల్ 2న తెలిపారు.

వాతావరణ ఒప్పందాలను రద్దు చేసిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా కాలంలో వాతావరణ మార్పులపై రూపొందించిన విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై మార్చి 28న సంతకం చేశారు. దీంతో ఇంధన వెలికితీత, బొగ్గు తవ్వకానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్న పాత విధానాలు రద్దయినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరికా ఇంధన రంగంలో ప్రభుత్వ ప్రమేయాన్ని నిలువరించామన్నారు. విద్యుచ్ఛక్తి ఉద్గారాల నియమాలను సమీక్షించాలని, శిలాజ ఇంధనాల వెలికితీతకు ప్రతిబంధకాలుగా ఉన్న నిబంధనలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని అధికార యంత్రాంగాన్ని ట్రంప్ ఆదేశించారు.

బ్రెగ్జిట్ ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని సంతకం
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగేందుకు(బ్రెగ్జిట్) ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే మార్చి 29న సంతకం చేశారు. దీని ప్రకారం ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 దేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈయూలోని బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు అందించారు. ఈ రెండేళ్లలో ఈయూ సభ్య దేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. కాగా, ఈయా దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. 

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ - 2017 
 బ్లూమ్ బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితా - 2017లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. మార్చి 30న ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం బిల్‌గేట్స్ సంపద విలువ 86 బిలియన్ డాలర్లు. 75.7 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ డాట్ కాం స్థాపకుడు జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ రెండో స్థానంలో ఉండగా 75.7 బిలియన్ డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 25వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ సంపద విలువ 27.7 బిలియన్ డాలర్లు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ - 2017 
ఎప్పుడు : మార్చి 30 
ఎవరు : బ్లూమ్‌బర్గ్

5 మిలియన్లు దాటిన సిరియా శరణార్థులు 
సిరియా శరణార్థుల సంఖ్య ఐదు మిలియన్లు దాటిందని ఐక్యరాజ్య సమితి మార్చి 30న ప్రకటించింది. వీరిలో స్త్రీలు, పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉందని వెల్లడించింది. 2015 లో శరణార్థులు 4.6 మిలియన్లుండగా, 2016లో ఈ సంఖ్య 4.85 మిలియన్లకు చేరింది. 2017లో ఇప్పటికే 5 మిలియన్లు దాటింది. 
గత ఆరు సంవత్సరాలుగా సిరియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడి ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5 మిలియన్‌లకు చేరిన సిరియా శరణార్థులు
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎక్కడ : సిరియా
ఎందుకు : అంతర్యుద్ధం కారణంగా 

కంప్యూటర్ ప్రోగ్రామర్ల హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం
కంప్యూటర్ ప్రాగ్రామర్ ఉద్యోగం కోసం హెచ్1 బీ వీసాతో వచ్చే విదేశీయుల వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించి మార్చి 31న కొత్త నియమావళిని జారీ చేసింది. దీని ప్రకారం ప్రత్యేక వృత్తి నిపుణుడిగా పరిగణించేందుకు ప్రారంభ స్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ అర్హుడు కాదని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) మార్గదర్శకాల్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఆ ఉద్యోగం ప్రత్యేక వృత్తి నిపుణత కోవకు చెందినదేనని రుజువు చేయాలి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్1 బీ వీసా నిబంధనలు కఠినతరం 
ఎప్పుడు : మార్చి 31 
ఎక్కడ : అమెరికా

యూఎన్‌ఎఫ్‌పీఏ సహాయ నిధులను వెనక్కి తీసుకున్న అమెరికా 
ఐక్యరాజ్య సమితి కుటుంబ నియంత్రణ ఫండ్ ( UNFPA )కి ఇచ్చే సహాయ నిధులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏప్రిల్ 4న అమెరికా ప్రకటించింది. చైనాలో ఈ సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు తమ దేశ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న అమెరికా 2017 సంవత్సరంలో 32.5 బిలియన్ డాలర్ల నిధులను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది.పపంచంలో జనాభా నియంత్రణ కోసం యూఎన్‌ఎఫ్‌పీఏ 150కి పైగా దేశాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్‌ఎఫ్‌పీఏ సహాయ నిధులను వెనక్కి తీసుకున్న అమెరికా 
ఎప్పుడు : ఏప్రిల్ 4 
ఎక్కడ : ఐరాస అనుబంధ సంస్థ

AIMS DARE TO SUCCESS 

మే 2017 అంతర్జాతీయం
ఆక్స్‌ఫర్డ్ పాఠాల్లో గాంధీ, లూథర్ కింగ్
 భారత్‌తో పాటు ఆసియాలోని పలు చారిత్రక అంశాలతో కూడిన చరిత్ర పేపర్‌ను తప్పనిసరి చేస్తూ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గాంధీతో పాటు 1960లో అమెరికా నల్లజాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్‌కింగ్ గురించి పాఠ్యాంశాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ చరిత్రపై ఉన్న రెండు పేపర్లకు అదనంగా డిగ్రీ (హిస్టరీ) విద్యార్థులు దీన్ని చదవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ‘మా పాఠ్యాంశాలు జాతివివక్షతో ఎందుకున్నాయి’ అనే నినాదంతో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్సఫర్డ్ పాఠాల్లో ఆసియా చారిత్రక అంశాలు 
ఎవరు : ఆక్సఫర్డ్ యూనివర్సిటీ 
ఎందుకు : పాఠ్యాంశాల్లో జాతి వివక్షకు తావులేకుండా 

ఇటలీలో జీ-7 దేశాల వార్షిక సదస్సు
జీ-7 దేశాల వార్షిక సదస్సు ఇటలీలోని టావోర్మినాలో మే 26, 27 తేదీల్లో జరిగింది. ఈ సదస్సు ప్రధానంగా విదేశీ విధానం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అసమానతల తగ్గింపు, వలస సమస్యలపై దృష్టిసారించింది. లింగ సమానత్వం, ఇన్నోవేషన్, నైపుణ్యం, శ్రామికుల సమస్యలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు నేతలు ఆమోదం తెలిపారు. ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ పాల్గొన్నాయి. 

అతి పెద్ద విమాన ప్రయాణం విజయవంతం
ప్రపంచంలోనే అతి పెద్ద(92 మీటర్ల పొడవైన) విమాన(ఎయిర్ ల్యాండర్ 10) ప్రయాణం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని లండన్‌లో మే 23న నిర్వహించారు. దీంతో ఈ విమానాన్ని వాణిజ్య సేవలకు వినియోగించే విషయంలో మరో ముందడుగు పడింది. హీలియం వాయువుతో నిండిన ఈ విమానం మానవ సహితంగా 6,100 మీటర్ల ఎత్తులో ఐదు రోజుల పాటు ఎగరగలదు. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సంస్థ దీన్ని తయారు చేసింది.

ఇరాన్ అధ్యక్షుడిగా రౌహానీ తిరిగి ఎన్నిక
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ ఘన విజయం సాధించారు. ఈ మేరకు మే 19న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 57 శాతం, సమీప ప్రత్యర్థి ఇబ్రహీం రైసీకి 38.3 శాతం ఓట్లు వచ్చాయి. రెండో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రౌహానీ ముందు ద్రవ్యోల్బణం, చమురు అమ్మకాల తగ్గుదల వంటి అనేక సవాళ్లున్నాయి. 
రౌహానీకి ముందు అధ్యక్షుడిగా ఉన్న అహ్మదీ నెజాద్ అమెరికాతో కయ్యానికి కాలుదువ్వేవారు. అణ్వస్త్ర కార్యక్రమం నిలిపివేతకు నిరాకరించారు. దీంతో పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై ఆంక్షలు విధించాయి. దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పాలనలో ఆపార అనుభవమున్న రౌహానీ 2013లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పరిస్థితులను చక్కదిద్దారు. 
1948లో జన్మించిన రౌహానీ 1972లో టెహ్రాన్ వర్సిటీ నుంచి న్యాయవిద్యలో పట్టా పుచ్చుకున్నారు. ఇస్లామిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న ఆయన నిఘావర్గాలు వెంటాడడంతో ప్రవాసానికి వెళ్లారు. 1979లో ఇరాన్ విప్లవం తర్వాత రౌహానీ సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. క్రమశిక్షణను నెలకొల్పి ఆర్మీ బేస్‌లను పటిష్టపరిచారు.1980-2000 మధ్య ఇరాన్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 1989-2005 మధ్య సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎన్‌ఎస్‌ఎసీ) కార్యదర్శిగానూ పనిచేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై పాశ్చాత్య దేశాలతో చర్చల్లో ముఖ్యభూమిక పోషించారు. యురేనియం శుద్ధిని నిలిపివేసేందుకు 2005లో అంగీకరించారు. 2013 అధ్యక్ష ఎన్నికల్లో రౌహానీ యువత, మధ్యతరగతి మద్దతుతో ఘన విజయం సాధించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు
ఎప్పుడు : మే 20
ఎవరు : మరోసారి ఎన్నికైన హసన్ రౌహానీ

సౌదీ అరేబియాతో అమెరికా భారీ ఆయుధ ఒప్పందం 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన సౌదీ అరేబియాలో మే 20న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో 110 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.1 లక్షల కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందాన్ని అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా రక్షణ పరికరాలు, సేవలను సౌదీ కొనుగోలు చేస్తుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ అరేబియాతో అమెరికా ఒప్పందం
ఎప్పుడు : మే 20
ఎవరు : అమెరికా - సౌదీ అరేబియా 
ఎందుకు : ఆయుధాల సరఫరా కోసం 

మాంచెస్టర్‌లో ఆత్మాహుతి దాడి
లండన్‌లోని మాంచెస్టర్‌లో మే 23న ఆత్మాహుతి దాడి జరిగింది. యూరప్‌లోని అతిపెద్ద ఇండోర్ ఎరీనా అయినా మాంచెస్టర్ ఎరీనాలో పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా దుండగుడు సల్మాన్ అబేదీ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 20కిపైగా యువతీ యువకులు, చిన్నారులు మృత్యువాత పడగా మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దాడికి పాల్పడింది తామే అని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ప్రకటించింది. క్విక్ రివ్యూ:
ఏమిటి : మాంచెస్టర్ మ్యూజిక్ కన్సర్ట్‌పై ఆత్మాహుతి దాడి
ఎప్పుడు : మే 23 
ఎవరు : ఐఎస్‌ఐఎస్ 
ఎక్కడ : లండన్ 

1888 విలయం ‘అత్యంత ఘోరం’
1888లో యూపీలోని మొరాదాబాద్‌లో సంభవించిన వడగండ్ల వాన అత్యంత ప్రమాదకర విలయమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ విపత్తులో దాదాపు 246 మంది మృత్యువాతపడ్డట్లు తెలిపింది. ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించినఈ తరహాప్రకృతి వైపరీత్యాల్లో దీన్నే అత్యంత ఘోరమైన విపత్తుగా గుర్తించింది.

 పార్లమెంటులో బిడ్డకు పాలిచ్చిన ఆస్ట్రేలియా సెనేటర్ 
ఆస్ట్రేలియా సెనేటర్ లారిసా వాటర్స్ (గ్రీన్ పార్టీ) పార్లమెంటులోనే తన చంటి బిడ్డకు చనుపాలిచ్చి చరిత్ర సృష్టించారు. ఈ మేరకు మే 9న సభలో జరిగిన ఓటింగ్‌కు పాపతో సహా హాజరయ్యారు. తద్వారా ఆస్ట్రేలియా పార్లమెంటులో బిడ్డకు పాలిచ్చిన తొలి సెనేటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన నిబంధనల్లో ఇటీవల చేసిన మార్పుల వల్లే వాటర్స్ తన పాపను పార్లమెంట్‌కు తీసుకు రావడానికి వీలు కలిగింది. 

2003లో ఆస్ట్రేలియాలోనే క్రిస్టీ మార్షల్ అనే విక్టోరియా ఎంపీ తన 11 రోజుల బిడ్డకు పార్లమెంట్‌లో పాలిచ్చినందుకు, సభ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. 2016లో ఐస్‌ల్యాండ్ పార్లమెంట్‌లో ఓ సభ్యురాలు తన బిడ్డకు పాలిస్తూనే మాట్లాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పార్లమెంటులో బిడ్డకు పాలిచ్చిన ఎంపీ
ఎప్పుడు : మే 9
ఎవరు : లారిసా వాటర్స్ 
ఎక్కడ : ఆస్ట్రేలియా 

అమెరికాపై అణు బాంబు వేస్తాం: ఉత్తర కొరియా
అమెరికా తన వైఖరి మార్చుకోకపోతే ఆ దేశంపై ఏ క్షణమైనా అణు బాంబులతో దాడి చేస్తామని ఉత్తర కొరియా మే 11న హెచ్చరించింది. అమెరికా చర్యల వల్ల తలెత్తే ఎలాంటి విపత్కర ఫలితాలకైనా ఆ దేశమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధి ‘రోడాంగ్ సిన్మన్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మరోవైపు ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే అణ్వాయుధ, క్షిపణి పరీక్షల ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా కేంద్ర నిఘా ఏజెన్సీ (సీఐఏ) ‘కొరియా మిషన్ సెంటర్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాపై అణుబాంబును వేస్తాం అని హెచ్చరిక
ఎప్పుడు : మే 11
ఎవరు : ఉత్తర కొరియా
ఎందుకు : కొరియా పట్ల అమెరికా వైఖరికి బదులుగా

శ్రీలంకలో అంతర్జాతీయ వెసాక్ వేడుకలు 
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 14వ అంతర్జాతీయ వెసాక్ (బుద్ధ జయంతి) వేడుకలు (మే 12 - 14) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగాయి. ఈ మేరకు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 12న సంబరాలను ప్రారంభించి ప్రసంగించారు. 
ఈ వేడుకల్లో మోదీతో పాటు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పాల్గొన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 14వ అంతర్జాతీయ వెసాక్ వేడుకలు 
ఎప్పుడు : మే 12 - 14 
ఎక్కడ : శ్రీలంక రాజధాని కొలంబోలో 
ఎవరు : ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్రమోదీ

 భారత రాష్ట్రాలపై అమెరికా వెబ్‌పోర్టల్
భారత్‌లోని ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, విధివిధానాలపై అవగాహన కల్పించేందుకు అమెరికా అత్యున్నత స్థాయి మేధోవర్గం ‘ఎంగేజింగ్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్‌ఐఎస్) ఆధ్వర్యంలో అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్‌ను ఇంధన సహాయ మంత్రి గ్రిఫిన్ థాంప్సన్, భారత్-అమెరికా విధాన అధ్యయన కేంద్రం సీనియర్ సలహాదారుడు రిచర్డ్ రొసౌ మే 12న ఆవిష్కరించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత రాష్ట్రాలపై వెబ్‌పోర్టల్
ఎప్పుడు : మే 12 
ఎవరు : అమెరికాలోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ 

చైనాలో బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సదస్సు 
చైనా రాజధాని బీజింగ్‌లో రెండు రోజుల పాటు (మే 14 - 15) బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ (బీఆర్‌ఎఫ్) సదస్సు జరిగింది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలను రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా అనుసంధానించే ఉద్దేశంతో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టును చేపట్టింది. ఈ అంశంపై జరిగిందే బీఆర్‌ఎఫ్ సదస్సు. గతంలో ఈ ప్రాజెక్టుకు వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) అని పేరు పెట్టగా అనంతరం బీఆర్‌ఐగా మార్పు చేశారు. 

ఈ సదస్సుకి గైర్హాజరైన భారత్.. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలపై తమ ఆందోళనలను చైనా పట్టించుకోనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. చైనా చేపడుతున్న బీఆర్‌ఐ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) కు వ్యతిరేకంగానే భారత్ ఈ నిర్ణయానికి వచ్చింది. సీపీఈసీ పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళ్తుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సదస్సు 
ఎప్పుడు : మే 14 - 16
ఎక్కడ : చైనాలో

బ్రిటన్ పార్లమెంట్ రద్దు 
బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ ‘హౌస్ ఆఫ్ కామన్స్’ మే 3న అధికారికంగా రద్దయింది. 2017 జూన్ 8న సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం సాధారణ ఎన్నికలకు కనీసం 25 పనిదినాల ముందే పార్లమెంట్‌ను రద్దు చేయాలి. దీంతో పార్లమెంట్ సభ్యులు తమ విశేష అధికారాలు కోల్పోతారు. మంత్రి పదవిలో ఉన్న ఎంపీలు మాత్రం ఎన్నికలు పూర్తయ్యే దాకా తమ విధులు నిర్వర్తిస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ పార్లమెంట్ రద్దు 
ఎప్పుడు : మే 3 
ఎందుకు : 2017 జూన్ 8న సాధారణ ఎన్నికల నేపథ్యంలో

రాచరిక విధులకు ప్రిన్స్ ఫిలిప్ స్వస్తి
 బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ (95) రాచరిక విధులకు దూరమవనున్నారు. 2018 నవంబర్ నుంచి ఆయన ప్రిన్స్ హోదాలో బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ మే 4న అధికారిక ప్రకటన చేసింది. అయితే అంతకుముందే నిర్ణయించిన కార్యక్రమాల్లో 2017 ఆగస్టు వరకు పాల్గొంటారని.. ఇకపై కొత్త ఆహ్వానాలను మాత్రం స్వీకరించరని పేర్కొంది. రాణి ఎలిజబెత్ మాత్రం యథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాచరిక విధులకు ప్రిన్స్ ఫిలిప్ స్వస్తి
ఎప్పుడు : 2018 నవంబర్ నుంచి 
ఎవరు : బకింగ్‌హామ్ ప్యాలెస్
ఎక్కడ : బ్రిటన్‌లో 

ఒబామా కేర్ రద్దుకు ఆమోదం
ఒబామా కేర్‌ను రద్దు చేస్తూ, కొత్త వైద్య విధానానికి ఆమోదం తెలుపుతూ అమెరికా ప్రతినిధుల సభ మే 4న అనుకూలంగా ఓటేసింది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్‌కు 217-213 ఓట్ల తేడాతో సభ ఆమోదం తెలిపింది. డెమోక్రాట్ సభ్యులంతా కొత్త బిల్లును వ్యతిరేకించగా రిపబ్లికన్లు అనుకూలంగా ఓటేశారు. ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒబామా కేర్ రద్దుకు ఆమోదం 
ఎప్పుడు : మే 4 
ఎవరు : అమెరికా ప్రతినిధుల సభ
ఎక్కడ : అమెరికాలో 
ఎందుకు : అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్‌ను తెచ్చేందుకు 

కులభూషణ్ జాధవ్‌కు మరణశిక్షపై ఐసీజే స్టే
భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) మే 9న స్టే విధించింది. పదవీ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాధవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 
గూఢచర్య ఆరోపణలపై జాధవ్‌కు పాక్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్ ఆయనను ఉరితీస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దౌత్యసంబంధాలు దెబ్బతింటాయని పాక్‌ను హెచ్చరించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కులభూషణ్ జాధవ్‌కు మరణశిక్షపై స్టే
ఎప్పుడు : మే 9 
ఎవరు : ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 
ఎక్కడ : హేగ్

ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మేక్రన్‌కు ఆధిక్యం
ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవికి జరిగిన తొలి విడత ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుకూల అభ్యర్థి, ఎన్ మార్చే పార్టీకి చెందిన ఇమ్మాన్యుయెల్ మేక్రన్ ఆధిక్యంలో ఉన్నారు. మే 7న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. 39 ఏళ్ల మేక్రన్ గెలిస్తే ఫ్రాన్స్‌కు అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడు అవుతారు. లిపెన్ (48) విజయం సాధిస్తే ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందుతారు.

AIMS DARE TO SUCCESS 

జూన్ 2017 అంతర్జాతీయం
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే
 ప్రపంచ వ్యాప్తంగా మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 51 వేల మంది యోగాలో పాల్గొన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో యోగా గురు రాందేవ్ బాబా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్యర్యంలో 54 వేల మందికి పైగా పాల్గొని గిన్నీస్ రికార్డు సృష్టించారు. లండన్ ఐ, ఐఫిల్ టవర్‌ల వద్ద కూడా భారీగా జనం ఆసనాలు వేశారు. న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి యోగాపై ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.
ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్ 11న ఏటా జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ యోగా దినోత్సవం 
ఎప్పుడు : జూన్ 21
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 
ఎవరు: యోగా ప్రత్యేక స్టాంప్ విడుదల చేసిన ఐరాస

సౌదీ యువరాజుగా బిన్ సల్మాన్ 
సౌదీ అరేబియా రాజు మహమ్మద్ సల్మాన్ తన కొడుకు, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహ్మద్ బిన్ సల్మాన్(31)ను యువరాజు(క్రౌన్ ప్రిన్స్)గా నియమించారు. దీంతో తన తరువాత సింహాసనాన్ని చేపట్టే అవకాశాన్ని కొడుకుకు కల్పించినట్లయింది. ఇప్పటిదాకా యువరాజు స్థానంలో ఉన్న సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్(51)ను తప్పించడంతో పాటు ఆయన్ని డిప్యూటీ ప్రధాని, అంతర్గత భద్రత మంత్రిగా కూడా తొలగించారు. యువరాజుగా ఎంపికై న మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక మండలి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సౌదీకి కొత్త యువరాజు 
ఎప్పుడు : జూన్ 21 
ఎవరు: బిన్ సల్మాన్ 
ఎక్కడ : సౌదీ అరేబియా 
ఎందుకు : మహ్మద్ బిన్ నయేఫ్ స్థానంలో

అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా టీసీఎస్
దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా అవతరించింది. ఈ మేరకు కేంబ్రిడ్‌‌జ గ్రూప్ వెలువరించిన నివేదికలో ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించి ఉపాధి కల్పనలో అగ్రస్థానాన్ని టీసీఎస్ కైవసం చేసుకుంది. 
టీసీఎస్ గత ఐదేళ్లలో (2012-2016) 12,500 మందికి పైగా అమెరికన్లకు ఉపాధి కల్పించింది. ఇదే సమయంలో అమెరికా ఉద్యోగి వృద్ధిలో 57 శాతం వాటాతో టాప్‌లో దూసుకెళ్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికాలో టాప్ ఎంప్లాయర్ 
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 
ఎందుకు : ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించిన ఉపాధి కల్పనలో 

అమెరికా ‘ట్రావెల్ బ్యాన్’కు అనుమతి
ఆరు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై అమెరికా ప్రభుత్వం విధించిన పాక్షిక నిషేధాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల్ని కింది కోర్టులు నిలుపుదల చేయగా.. అమెరికా సుప్రీంకోర్టు జూన్ 26న పునరుద్ధరించింది. ఈ సందర్భంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎవరు అర్హులన్న విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని నిర్దేశించింది. అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలతో చట్టబద్దమైన సంబంధాలుంటే వారు దేశంలో ప్రవేశించేందుకు అర్హులని స్పష్టం చేసింది. అలాగే చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారిని కూడా అనుమతించాల్సిందేనని పేర్కొంది. అక్టోబర్‌లో కేసు పూర్తి స్థాయి విచారణ వరకూ ఈ ఉత్తర్వులు కొనసాగుతాయి.
సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే 120 రోజుల పాటు శరణార్థులు అమెరికాలో ప్రవేశించడానికి వీలుండదు. సిరియన్ శరణార్థులపై నిరవధికంగా నిషేధం కొనసాగుతుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా ట్రావెల్ బ్యాన్‌కు అనుమతి 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: అమెరికా సుప్రీంకోర్టు 
ఎందుకు : ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని అడ్డుకునేందుకు 

గూగుల్‌కు ఈయూ 2.4 బిలియన్ యూరోల జరిమానా 
ఆన్‌లైన్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) 2.4 బిలియన్ యూరో (దాదాపు రూ.17 వేల కోట్లు)ల భారీ జరిమానా విధించింది. వ్యాపార చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఈ మొత్తం చెల్లించాల్సిందిగా ఈయూ కాంపిటీషన్ చీఫ్ వెస్టగర్ జూన్ 27న ఆదేశించారు. 
గూగుల్ తమ సొంత ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇతర కంపెనీల ఉత్పత్తులను తన సెర్చ్ ఇంజన్‌లో తక్కువగా చూపించిందని.. వినియోగదారునికి పోటీ కంపెనీల వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదని ఈయూ పేర్కొంది. ఇది ఈయూ వ్యాపార విధానాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. గూగుల్ తమ సంస్థల ఉత్పత్తులను సరిగా ప్రచారం చేయడంలేదని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన స్టార్‌బర్క్స్, ఆపిల్, అమెజాన్, మెక్‌డొనాల్డ్ తదితర సంస్థలు 2010లో ఈయూను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ఈయూ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గూగుల్‌కు 2.4 బిలియన్ యూరోల జరిమానా 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: యూరోపియన్ యూనియన్ 
ఎందుకు : ఈయూ వ్యాపార చట్టాలను ఉల్లంఘించినందుకు గాను 

ఉగ్రవాదంపై ఐటీ, సోషల్ మీడియా సంస్థల ఉమ్మడిపోరు
ఇంటర్నెట్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రముఖ టెక్నాలజీ, సోషల్ మీడియా సంస్థలు చేతులు కలిపాయి. ఆ మేరకు ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, యూట్యూబ్‌లు ‘గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టైజం’ పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. ఉగ్ర సమాచారంపై పోరులో ప్రస్తుతం, భవిష్యత్తులో సహకరించుకోవాల్సిన విభాగాల్ని గుర్తించడంతో పాటు, చిన్న టెక్నాలజీ కంపెనీలు, పౌర సంఘాల విభాగాలు, విద్యావేత్తలు, ప్రభుత్వాలు, ఈయూ, ఐరాస వంటి అంతర్జాతీయ విభాగాలతో కలిసి సాగేందుకు ఈ విభాగం కృషిచేస్తుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టైజం ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, యూట్యూబ్
ఎందుకు : ఇంటర్నెట్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు 

2100 నాటికి 200 కోట్ల శరణార్థులు 
వాతావరణ మార్పుల కారణంగా సముద్రమట్టాల పెరిగి 2100 నాటికి ప్రపంచ జనాభాలో 5వ వంతు అంటే దాదాపు 200 కోట్ల మంది వారి ఆవాసాలు కోల్పోనున్నారు. దీంతో వీరంతా శరణార్థులుగా మారనున్నారని ‘ల్యాండ్ యూజ్ పాలసీ’జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలు నీట మునుగుతాయని, దీంతో అక్కడ నివసిస్తున్న వారంతా ఎత్తైన ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చార్లెస్ గీస్లర్ హెచ్చరించారు.
2100 నాటికి 1100 కోట్ల జనాభా
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 900 కోట్లకు చేరనుంది. అదే 2100 నాటికి దాదాపు 1100 కోట్లకు చేరుకోనుంది. అయితే అంత జనాభాకు ఆహారం అందించాలంటే సారవంతమైన భూమి అవసరం. సముద్రమట్టాలు పెరిగి సారవంతమైన తీరప్రాంత భూములు, నదీ డెల్టా ప్రాంత భూములు మునిగిపోనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2100 నాటికి 200 కోట్ల శరణార్థులు 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ల్యాండ్ యూజ్ పాలసీ జర్నల్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 
ఎందుకు : వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరగడం వల్ల

ప్రపంచంలోనే తొలి ఏటీఎంకు బంగారు సొబగులు 
ప్రపంచంలోనే తొలి ఏటీఎంగా గుర్తింపు పొందిన ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్ వద్దగల ఏటీఎం.. ప్రపంచ తొలి బంగారు ఏటీఎంగా రూపాంతరం చెంది మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏటీఎం మిషన్ ఆవిర్భవించి అయిదు దశాబ్దాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రపంచంలో తొలి బంగారు ఏటీఎంగా దీన్ని మార్చివేశారు. దీంతోపాటు ఓ స్మారక ఫలకాన్ని జోడించి, వినియోగదారులకోసం రెడ్ కార్పెట్‌ను కూడా పరిచారు. 
1967, జూన్ 27న షెపెర్డ్-బారన్ మొదటి ఎటిఎమ్ (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) రూపొందించారు. అనంతరం ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్ తన మొదటి ఏటీఏం కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకు ఆరంభించిన ఆరింటిలో ఇది మొదటిది. బ్రిటిష్ టీవీ కామెడీ షో ‘ఆన్ ది బసెస్’లో నటించిన హాలీవుడ్ నటి రెగ్ వార్నీ ఈ ఏటీఎం నుంచి తొలిసారిగా నగదును ఉపసంహరించుకున్న వ్యక్తిగా నిలిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బంగారు ఏటీఎంగా ప్రపంచంలోనే తొలి ఏటీఎం 
ఎప్పుడు : జూన్ 27
ఎక్కడ : లండన్
ఎవరు: బార్క్‌లే బ్యాంకు 
ఎందుకు : ఏటీఎం మిషన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా

యెమెన్‌లో కలరాతో 1300 మంది మృతి
యెమెన్‌లో కలరా అనుమానిత కేసులు రెండు లక్షలు దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ జూన్ 24న ప్రకటించాయి. కలరా వల్ల ఇప్పటికే 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగో వంతు మంది పిల్లలే కావడం గమనార్హం.

9.8 బిలియన్లకు చేరనున్న ప్రపంచ జనాభా
2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి జూన్ 21న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు. వచ్చే ఏడేళ్లలో చైనా జనాభాను భారత్ అధిగమిస్తుందని నివేదిక తెలిపింది.

చైనాలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు‘ఫక్సింగ్’ను చైనా జూన్ 26న ప్రారంభించింది. ఈ అత్యాధునిక రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది బీజింగ్-షాంఘై మార్గంలో నడుస్తుంది.

ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017
 వయసుకు తగ్గ ఎదుగుదల లేని చిన్నారుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చిన్నారుల సంఖ్య 4.82 కోట్లు. అలాగే దేశంలో 3.1 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. ఇది కూడా ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్య. సేవ్ ద చిల్డ్రన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017 పేరుతో జూన్ 1న విడుదల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 
ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే పోషకాహార లోపం, విద్య అందకపోవడం, బాల కార్మికులు, బాల్య వివాహాలు, నెలలు నిండకుండానే జననాలు, శిశు భ్రూణహత్యలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది చిన్నారులు వివిధ కారణాల వల్ల ముందుగానే తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. సరైన ఎదుగుదల లేని పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోయి త్వరగా అనారోగ్యం, వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. 
దేశంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి చిన్నారులు 18.6%, అప్పర్ సెకండరీ వయసు కలిగిన 4.7 కోట్ల మంది పాఠశాలకు వెళ్లడం లేదు. 4-14 ఏళ్ల వయసు పిల్లల్లో 11.8 శాతం మంది (3.1 కోట్లు) బాల కార్మికులుగా మారి చదువు, విశ్రాంతి, ఆటలు, వినోదాన్ని కోల్పోతున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017 
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : సేవ్ ది చిల్డ్రన్ సంస్థ (భారత్)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

యూఎన్‌సీసీటీ ఏర్పాటుకు ఐరాస ఆమోదం 
సభ్య దేశాల్లో తీవ్రవాద అణచివేత చర్యలకు చేయూత అందించేందుకు ఉద్దేశించిన యూఎన్ తీవ్రవాద వ్యతిరేక కేంద్రం (UNCCT) ఏర్పాటుకు ఐరాస సాధారణ అసెంబ్లీ జూన్ 16న ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటుతో ఇప్పటి వరకు యూఎన్ డీపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటకల్ అఫైర్స్(డీపీఏ) ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ కార్యకలాపాలు యూఎన్‌సీసీటికి బదలీ అవుతాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూఎన్‌సీసీటీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ఐరాస 
ఎందుకు : సభ్య దేశాల్లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సహాయానికి 

ఏఐఐబీలో అర్జెంటీనా, మడగాస్కర్, టోంగాకు చోటు 
చైనా నేతృత్వంలోని ఆసియాన్ మౌలిక పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ)లో అర్జెంటీనా, మడగాస్కర్, టోంగా దేశాలకు సభ్యత్వం లభించింది. దక్షిణ కొరియాలోని జిజులో జరిగిన ఏఐఐబీ 2వ వార్షిక సమావేశంలో ఈ మూడు దేశాలకు సభ్యత్వం కల్పిస్తూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానం చేశారు. 
ఏఐఐబీ మొదటి వార్షిక సమావేశం 2016లో చైనాలోని బీజింగ్‌లో జరిగింది. 2016 జనవరి 11న భారత్‌కు ఏఐఐబీలో సభ్యత్వం లభించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏఐఐబీలో కొత్తగా 3 దేశాలకు సభ్యత్వం 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : అర్జెంటీనా, మడగాస్కర్, టోంగా

క్యూబాతో మైత్రి ఒప్పందాన్ని రద్దు చేసిన అమెరికా 
బరాక్ ఒబామా హయాంలో క్యూబాతో కుదిరిన మైత్రి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 16న రద్దు చేశారు. ఒబామా క్యూబాతో చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని, రౌల్ క్యాో్ట్ర సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించము అని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 
కాగా ట్రంప్ నిర్ణయాన్ని క్యూబా విమర్శించింది. ఈ విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాో్టత్రో కలిసి ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా 2014 డిసెంబర్‌లో ప్రకటించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : క్యూబాతో మైత్రి ఒప్పందం రద్దు 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
ఎందుకు : ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ 

ఐరాసపై యోగా వెలుగులు
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ భవంతిని ‘యోగా’ వెలుగులతో నింపేశారు. ఓ మహిళ యోగా చేస్తున్నట్లుగా, ‘యోగా’ ఆంగ్ల అక్షరాలు కనిపించేలా ఐరాస భవంతిపై లైట్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ జూన్ 19న ప్రారంభించారు. యోగా దినోత్సవం కోసం ఇలా ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేయడం వరసగా ఇది రెండోసారి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐరాసపై యోగా వెలుగులు 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : ప్రారంభించిన అనుపమ్ ఖేర్ 
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా 
ఎందుకు : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 

టాప్ - 500 కంప్యూటర్లలో చైనా ఫస్ట్ 
అమెరికా, జర్మనీ సంయుక్తంగా జూన్ 19న విడుదల చేసిన టాప్ 500 కంప్యూటర్లలో మొదటి స్థానాన్ని చైనా కంప్యూటర్లు దక్కించుకున్నాయి. సన్‌వే కంపెనీకి చెందిన థాయులైట్, తియాన్హే-2 కంప్యూటర్లు మొదటి, రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. స్విస్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌కు చెందిన పిజ్ డైంట్ కంప్యూటర్ మూడోస్థానంలో, అమెరికాకు చెందిన టైటాన్ నాల్గోస్థానంలో నిలిచాయి. కాగా 24 సంవత్సరాల చరిత్రలో అమెరికా మొదటి మూడుస్థానాల్లో నిలవకపోవడం ఇది రెండోసారి. 1996లో ఒకసారి జపాన్‌కు చెందిన కంప్యూటర్లు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టాప్ - 500 కంప్యూటర్స్ 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : మొదటి స్థానంలో థాయులైట్, తియాన్హే-2 కంప్యూటర్లు 
ఎక్కడ : చైనా

ఇరాన్ పార్లమెంటుపై ఐసిస్ దాడి 
ఇరాన్ పార్లమెంటు, ఆ దేశ విప్లవనాయకుడు ఆయతుల్లా ఖోమేని స్మారక భవనం వద్ద ఐసీసీ ఉగ్రవాదులు ఆయుధాలు, ఆత్మాహుతి దాడి చేశారు. జూన్ 7న జరిగిన ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. 
ఇరాన్ భద్రతా బలగాలు ఐదుగంటల పోరాటం తర్వాత అందరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇరాక్, సిరియాల్లో ఐసిస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్న ఐసిస్ తాజాగా విధ్వంసానికి దిగింది. 
మరోవైపు దాడి సమయంలోనూ పార్లమెంటు సమావేశాలు యధావిధిగా కొనసాగాయి. ఉగ్రదాడి విషయం తెలిసినా లోపలున్న ఎంపీలు ఏమాత్రం చెదిరిపోలేదు. తమ భద్రత విషయంలో ప్రత్యేక బలగాలపై పూర్తి నమ్మకంతో రోజూవారీ కార్యక్రమాలను కొనసాగించారు. కొందరు నిశ్శబ్దంగా ఉన్న తమ సెల్ఫీలను పోస్టు చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇరాన్ పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : పార్లమెంట్, ఖోమేని స్మారక భవనం వద్ద
ఎవరు : ఐసీస్ 

మయన్మార్‌లో విమానం గల్లంతు 
100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన వై-8ఎఫ్-200 విమానం జూన్ 7న గల్లంతైంది. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై-8ఎఫ్-200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 
విమానంలో సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మయన్మార్ విమానం వై-8ఎఫ్-200 గల్లంతు
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : అండమాన్ సముద్రంలో

పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం
 చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్ చెప్పే దిశగా భారత్‌తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయి. పారిస్‌లో జరిగిన ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సమావేశంలో ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూన్ 8న సంతకం చేశారు. దీంతో వివిధ దేశాలు కుదుర్చుకున్న 1,100 పైగా పన్ను ఒప్పంద నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు జరగనున్నాయి. 
ద్వంద్వ పన్నుల నివారణ కోసం భారత్‌కు ప్రస్తుతం సైప్రస్, మారిషస్, సింగపూర్ తదితర దేశాలతో ఒప్పందాలు(డీటీఏఏ) ఉన్నాయి. వీటిని ఊతంగా తీసుకుని పలు బహుళజాతి సంస్థలు పన్నుప్రయోజనాలు అత్యధికంగా ఉండే దేశాలకు ప్రధాన కార్యాలయాలను మళ్లించి, ఇతర దేశాల్లో ఆర్జించే లాభాలపై పన్నులను ఎగవేస్తున్నాయి. ఇది గుర్తించిన భారత్ ఇటీవలే కొన్ని దేశాలతో డీటీఏఏ ఒప్పందాలను సవరించింది. ప్రధాన కార్యాలయమున్న దేశంలో కాకుండా కార్పొరేట్లు ఆదాయం ఆర్జించే దేశాల్లోనే పన్నులు కట్టే విధంగా మార్పులు చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం
ఎప్పుడు : జూన్ 8
ఎక్కడ : పారిస్‌లో 
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 

ఎస్‌సీవోలో భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం 
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం లభించింది. కజకిస్తాన్‌లోని ఆస్తానాలో జూన్ 8-9 వరకు జరిగిన వార్షిక సదస్సులో ఈ మేరకు రెండు దేశాలకు సభ్యత్వం ఇచ్చారు. అలాగే సభ్య దేశాలు ఆస్తానా డిక్లరేషన్‌తో పాటు 10 ఇతర ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరు చేసే అంశం ఇందులో ప్రధానమైంది. 
ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ..
ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ .. ఉగ్రవాదంపై పోరులో ఎస్‌సీవో సహకారం చాలా కీలకమని అన్నారు. ఎస్‌సీవోలోని సభ్య దేశాలన్నీ తోటి సభ్య దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించుకుంటూ అనుసంధానత పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, ఉగ్ర సంస్థల్లో నియామకాలు, శిక్షణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అంతం చేసేందుకు సభ్య దేశాలన్నీ ఏకతాటిపై నడవాలని మోదీ కోరారు. 
ఎస్‌సీవో సదస్సుకు ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ఇరుదేశాలు కీలక సమస్యలను గౌరవిస్తూనే.. ఆ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌తో మోదీ తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాచారం, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరు చర్చించారు. 
ఎస్‌సీవోలో సభ్య దేశాలు (8)
చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎస్‌సీవో వార్షిక సదస్సు 
ఎప్పుడు : జూన్ 8-9
ఎక్కడ : కజకిస్తాన్‌లోని ఆస్తానా 
ఎవరు : భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం

బ్రిటన్‌లో హంగ్ పార్లమెంట్
బ్రెగ్జిట్ చర్చల కోసం పార్లమెంట్‌లో బలం పెంచుకునేందుకు బ్రిటన్ ప్రధాని థెరెసా మే 3 ఏళ్ల ముందుగానే నిర్వహించిన ఎన్నికల్లో ఆమె నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. ఈ మేరకు జూన్ 9న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలు గెలుపొందింది. లేబర్ పార్టీ 261, స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ 35, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ 12, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)10 స్థానాల్లో గెలుపొందాయి. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 650 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ 326 స్థానాలు. 
డీయూపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు థెరెసా మే ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జూన్ 9న విజ్ఞప్తి చేశారు. 
ఎంపీగా సిక్కు మహిళ రికార్డు
బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్‌‌జబాస్టన్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిపై 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. లేబర్ పార్టీకే చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్‌మన్‌జీత్ సింగ్ దేశి కూడా స్లోగ్ సీటు నుంచి గెలిచారు. ఈ ఫలితాలతో బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీల సంఖ్య 12కి పెరిగింది. 
బ్రెగ్జిట్ భవితవ్యంపై నీలినీడలు
భారీ మెజార్టీ కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థె రిసా మే వ్యూహం బెడిసికొట్టింది. ప్రస్తుత మెజార్టీ కూడా కోల్పోవడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు కారణమైన బ్రెగ్జిట్ సంక్షోభంలో పడింది. దీంతో బ్రెగ్జిట్ సంప్రదింపులు అనుకున్నట్టే ఈ నెల 19న మొదలవుతాయా? ఒకవేళ లేబర్ నేత కార్బిన్ ప్రధానైతే ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. 
బ్రెగ్జిట్ గుదిబండేనా?
ఈయూ నుంచి బయటపడేందుకు అవసరమైన చర్చలు ఆలస్యమైతే బ్రిటన్ నష్టపోతుంది. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ గతేడాది మార్చిలో 50వ అధికరణను అమలులోకి తెచ్చింది. దాని ప్రకారం సకాలంలో చర్చలు జరిపి ఈయూతో ఒప్పందానికి రావాలి. ఒప్పందం చేసుకున్నా లేకున్నా ఆ అధికరణంతో 2019 మార్చి చివరినాటికి ఈయూ నుంచి బ్రిటన్ బయపడాలి. చర్చలు జరిపి ఆలోగా ఒప్పందం చేసుకుంటే బ్రిటన్ కొంతమేర లాభపడుతుంది. లేదంటే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే ఈయూ నుంచి తప్పుకోవాలి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హంగ్ పార్లమెంటు ఏర్పడే సూచనలు
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కనందుకు

బ్రిటన్‌లో కొలువుదీరిన థెరిసా ప్రభుత్వం 
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలు థెరిసా మే ప్రధానిగా జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటయింది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 318, ప్రతిపక్ష లేబర్ పార్టీ 261 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా పది స్థానాలు గెలుచుకున్న డెమెక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి థెరిసా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 
భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు కేబినెట్‌లో చోటు కల్పించిన థెరిసా డమియన్ గ్రీన్‌ను ఉప-ప్రధానిగా నియమించారు. ఐదుగురు సీనియర్ మంత్రులు ఫిలిప్ హమ్మండ్, అంబర్ రుడ్, బోరిస్ జాన్సన్, డేవిడ్ డేవిస్, మైఖేల్ పాలన్‌లను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రిటన్‌లో ఏర్పాటైన ప్రభుత్వం 
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : థెరిసా మే 

కొండచరియలు విరిగిపడి బంగ్లాదేశ్‌లో 105 మంది మృతి 
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 105 మంది మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రంగమతి జిల్లాలో అత్యధికంగా 76 మంది మరణించారు. ఇందులో నలుగురు మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బంగ్లాదేశ్‌లో 105 మంది మృతి 
ఎప్పుడు : జూన్ 13
ఎందుకు : భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో 

జెనీవాలో 106వ అంతర్జాతీయ కార్మిక సమావేశం 
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 106వ సమావేశం జూన్ 5-17 వరకు జరిగింది. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్- 138, ప్రమాదకర పరిశ్రమల్లో 14 ఏళ్లలోపు బాలల నిషేధానికి నిర్దేశించిన కన్వెన్షన్-182 చట్టాలను భారత్ ఆమోదించిందని దత్తాత్రేయ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి సంతకం చేసిన ఉత్తర్వులను ఐఎల్‌వోకు సమర్పించారు. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం అమలు కోసం ఫిర్యాదుల పరిష్కారానికి ‘పెన్సిల్’ పేరుతో డిజిటల్ వేదికను రూపొందించామని దత్తాత్రేయ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ కార్మిక సంస్థ 106వ సమావేశం 
ఎప్పుడు : జూన్ 5 -17
ఎవరు : ఐఎల్ ఓ
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్ 

వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన ఫెడ్
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. జూన్ 13-14 వరకు జరిగిన ఫెడ్ కమిటీ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫెడ్ ఫండ్‌‌స రేటు 1-1.25 శాతానికి చేరుతుంది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును ఫెడ్ ఫండ్‌‌స రేటుగా వ్యవహరిస్తారు. కాగా ఈ ఏడాది ఇది రెండో పెంపు. జీరో వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి 2015 డిసెంబర్‌లో పెంపు ప్రక్రియను ఫెడ్ మొదలుపెట్టింది. అప్పటినుంచి తాజా పెంపు నాల్గవది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వడ్డీ రేట్లు పావు శాతం పెంపు 
ఎప్పుడు : జూన్ 13 
ఎవరు : అమెరికా ఫెడ్

కాబూల్ ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి 
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మే 31న జరిగిన ఉగ్రదాడిలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృతి చెందారు. మరో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. భారత రాయబార కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఈ దాడి జరగటంతో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈ దాడిలో బీబీసీ చానల్‌కు చెందిన డ్రైవర్ మృతిచెందగా.. నలుగురు జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి 
ఎప్పుడు : మే 31
ఎక్కడ : కాబూల్, అఫ్గనిస్తాన్ 

పోలండ్‌లో 2018 వాతావరణ సదస్సు
2018లో వాతావరణ మార్పు సదస్సును (యూఎన్‌సీసీసీ) పోలండ్‌లోని కతావీజ్ నగరంలో నిర్వహిస్తామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కతావీజ్ నగరం బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తూ.. యూరోప్‌లోనే అత్యంత కలుషిత ప్రాంతంగా పేరుగాంచింది. ఐరాస నిర్ణయం వల్ల ఇక్కడ పునరుత్పాదక ఇంధనాల వాడకం పెరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యకం చేశారు. పోలండ్‌లో ఇంతకుముందు 2008లో పోజ్నన్, 2013లో వార్సా నగరాల్లో ఈ సదస్సులు నిర్వహించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018 వాతావరణ సదస్సు 
ఎక్కడ : పోలాండ్‌లో 
ఎవరు : ఐరాస 

పారిస్ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా
గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి భూగోళాన్ని రక్షించే ఉద్దేశంతో కుదుర్చుకున్న పారిస్ పర్యావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం చైనా.. 13 ఏళ్ల పాటు కర్బన ఉద్గారాల్ని విడుదల చేయవచ్చని.. అమెరికాకు ఆ మినహాయింపు లేదని ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని కొనసాగిస్తామని చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని పలు నగరాలు, రాష్ట్రాల ప్రతినిధులు పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు ‘యునెటైడ్ స్టేట్స్ క్లైమేట్ అలయన్స్‌ను ఏర్పాటు చేసి ఐక్యరాజ్యసమితిని సంప్రదించనున్నారు.
పారిస్ ఒప్పందం అంటే?
పెట్రోన్స్‌లు, డీజిల్ వంటి ఇంధనాల అధిక వాడకం, పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది. ఫలితంగా కార్బన్‌డయాకై ్సడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల మోతాదు పెరిగి అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనేక పరిణామాలు కలగనున్నాయి. దీనిని నివారించేందుకు ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసుకున్న ఒప్పందమే పారిస్ ఒప్పందం. దీనిపై 195 దేశాలు సంతకాలు చేశాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది ఒప్పంద సంకల్పం.
ఒప్పదంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2025 నాటికి కర్బన ఉద్గారాలను 26 నుంచి 28 శాతం (200 కోట్ల టన్నులు) తగ్గిస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములుగా ఉన్న యునెటైడ్ నేషన్స్‌ గ్రీన్ కై ్లమెట్ ఫండ్‌కు ఏటా రూ. 6.5 లక్షల కోట్లు జమ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఒబామా అమెరికా తరఫున వంద కోట్ల డాలర్లు అందజేశారు. ఇప్పుడు అమెరికా వైదొలిగితే పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. దీని వల్ల మిగిలిన దేశాలపై భారం పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పారిస్ ఒప్పందం నుంచి వైదొలగనున్న అమెరికా
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
ఎందుకు : ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉందని

కాసినోపై కాల్పుల్లో 37 మంది మృతి
ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని ఓ కాసినోపై జరిపిన కాల్పుల్లో 37 మంది మృతి చెందారు. 14 కోట్ల విలువజేసే కాసినో చిప్స్(ఆట కోసం వాడే కాయిన్స్‌) దోపిడీ కోసం గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. కాసినోలో ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరపై కాల్పులు జరపడంతో అది పేలీ దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 37 మృతి చెందటంతో పాటు పదుల సంఖ్యలో గాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాసినోపై జరిపిన కాల్పుల్లో 37 మంది మృతి
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : గుర్తు తెలియని వ్యక్తి
ఎందుకు : కాసినో చిప్స్ దోపిడీ కోసం

ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలు 
ఖతర్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందంటూ ఆ దేశంతో సౌదీ అరేబియా సహా ఐదు అరబ్ దేశాలు దౌత్యసంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్‌ను వెలేసింది. ఈ మేరకు ఖతర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నామని లిబియాలోని సమాంతర ప్రభుత్వాల్లో ఒకటైన తూర్పు లిబియాలోని ప్రభుత్వం జూన్ 5న తెలిపింది. 
చుట్టుపక్కల ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ఖతర్ పలు ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తోందని సౌదీ, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు జూన్ 5న ఆరోపించాయి. ఖతర్‌తో రవాణా మార్గాలను మూసేస్తున్నామని, తమ దేశంలోని ఖతర్ పౌరులు రెండువారాల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించాయి. 
తమ పౌరులు ఖతర్‌కు వెళ్లొద్దని, తమ దేశాల్లోని ఖతర్ పౌరులు 14 రోజుల్లోగా వెళ్లిపోవాలని అరబ్ దేశాలు ఆదేశించాయి. ఖతర్‌తో ఉన్న సరిహద్దులను మూసేస్తున్నట్లు సౌదీ తెలిపింది. జూన్ 6 నుంచి ఖతర్‌కు తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎమిరేట్స్, ఇతిహాద్, ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీకి తమ సర్వీసులను తక్షణం మూసేస్తున్నట్లు ఖతర్ కూడా ప్రకటించింది. ఖతర్‌కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఈజిప్టు తెలిపింది. యెమన్‌లో ఇరాన్ మద్దతున్న రెబల్స్‌పై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి తమ గ్రూపు నుంచి ఖతర్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతర్‌తో పొరుగు దేశాల తెగతెంపుల నిర్ణయం పశ్చిమాసియాలోనే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రయోజనాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఐసిస్, తదితర ఉగ్ర సంస్థలపై పోరులో కీలకమైన అమెరికా ఎయిర్‌బేస్ ఖతర్‌లో ఉంది. 2022లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్రీడలు ఖతర్‌లోనే జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖతర్‌తో దౌత్యసంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలు 
ఎప్పుడు : జూన్ 5 
ఎవరు : సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు 

చైనా, నేపాల్ మధ్య జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం 
నేపాల్, చైనా సరిహద్దులో నిర్మించనున్న బుధిగందకి జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నేపాల్ రాజధాని కాట్మాండులో జూన్ 6న ఒప్పందంపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, ఫైనాన్స్ (ఈపీసీఎఫ్) మోడల్‌లో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నేపాల్, చైనా మధ్య ఒప్పందం 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : కాట్మాండులో 
ఎందుకు : బుధిగందకి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం

AIMS DARE TO SUCCESS 

జూలై 2017 అంతర్జాతీయం
భారత్‌పై అణుదాడి చేద్దామనుకున్నా : ముషార్రఫ్ 
2002 ఏడాదిలో భారత్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలా వద్దా అన్నదానిపై తాను తీవ్రంగా ఆలోచించినట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇటీవల తెలిపారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తనకు అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందనీ, కానీ భారత్ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతాయన్న భయంతో ఆగిపోయానని ముషార్రఫ్ ఓ జపాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు. 
1999 అక్టోబరులో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి 2001 నుంచి 2008 వరకు ముషార్రఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. వైద్య చికిత్సల నెపంతో పాకిస్తాన్ విడిచి వచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 

బిల్‌గేట్స్‌ను అధిగమించిన బెజోస్
ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరారు. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కూడా దాటేశారు. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు జూలై 27న అమెజాన్ షేరు ధర ఒక్కసారిగా దూసుకుపోవడంతో... బెజోస్ సంపద నికర విలువ ఏకంగా 90.9 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ప్రస్తుతం బిల్ గేట్స్ సంపద అంతకన్నా కాస్త తక్కువగా 90.7 బిలియన్ డాలర్లుగా ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ కుబేరులలో తొలి స్థానానికి అమెజాన్ వ్యవస్థాపకుడు
ఎప్పుడు : జూలై 27
ఎవరు : జెఫ్ బెజోస్ 
ఎందుకు : బిల్ గేట్స్‌ను అధిగమించిన బెజోస్

అమెరికా-మెక్సికో గోడకు 1.6 బిలియన్ డాలర్లు
 అమెరికా-మెక్సికో గోడ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు సహా 827 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ జూలై 28న ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు 235-192 ఓట్లతో పాసయింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల బలం ఉన్న సెనేట్‌లోనూ ఈ బిల్లు ఆమోదం పొందాలి.
మాదకద్రవ్యాల ప్రవాహం, అక్రమ వలసలను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా-మెక్సికో గోడ నిర్మాణ బిల్లుకి ఆమోదం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : అమెరికా ప్రతినిధుల సభ
ఎక్కడ : అమెరికా 

స్విట్జర్లాండ్‌లో ప్రపంచంలోనే అతిపొడవైన వేలాడే వంతెన 
స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతంలో జెర్మట్ మ్యాటర్‌హార్న్‌లోని స్విస్ అల్ఫీన్ రిసార్ట్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే వంతెనను నిర్మించారు. కేవలం పాదాచారుల కోసమే ఉద్దేశించిన ఈ వంతెన భూ ఉపరితలానికి 85 మీటర్ల ఎత్తులో, 494 మీటర్ల పొడవుతో ఉంది. కేవలం పది వారాల్లోనే నిర్మించిన ఈ వంతెనకు ఛార్లెస్ కువోనెన్ అని పేరు పెట్టారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలోనే అతిపొడవైన వేలాడే వంతెన 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎక్కడ : స్విస్ అల్ఫీన్ రిసార్ట్, స్విట్జర్లాండ్

చైనాలో బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశం
రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశాలు చైనాలోని చాంగ్‌కింగ్‌లో జూలై 26న ముగిశాయి. ఈ సమావేశాల్లో మన కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన ఆయన బ్రిక్స్ దేశాల కార్మిక సంస్థల మధ్య సమాచార మార్పిడి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంచుకోవచ్చన్నారు. సుస్థిర ఉద్యోగ కల్పన, జీవన ప్రమాణాల నాణ్యతను పెంచేందుకు పరస్పర సహకారంతో పనిచేస్తామని సమావేశాల ముగింపు సందర్భంగా బ్రిక్స్ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలో చైనాలోని షియామెన్‌లో బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు
రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలపై ఆర్థిక ఆంక్షలు విధించే బిల్లును జూలై 25న అమెరికా దిగువసభ (ప్రతినిధుల సభ) భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 419 మంది, వ్యతిరేకంగా ముగ్గురు ఓటు వేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలను చిన్నచూపు చూస్తూ వాటికి వ్యతిరేకంగా ఈ మూడు దేశాలు ప్రమాదకర, యుద్ధోన్మాద కార్యకలాపాలు చేపడుతున్నాయని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. దిగువ సభ ఆమోదంతో బిల్లు సెనేట్(ఎగువ సభ) పరిశీలనకు వెళ్లనుంది. బిల్లును రూపొందించిన ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎడ్ రాయిస్స్ మాట్లాడుతూ ఈ మూడు దేశాలు అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించడంతోపాటు పొరుగు దేశాల్లో అస్థిరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

2040 నుంచి బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలు నిషేధం
డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, వ్యాన్ల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్లు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్ గోవ్ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎయిర్ క్వాలిటీ ప్లాన్’ను జూలై 26న బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. 2040 నుంచి అన్ని వాహనాలు పూర్తిగా విద్యుత్‌తో నడిచేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు హైబ్రిడ్ వెహికల్స్‌తో సహా ఇతర అన్ని రకాల ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనుంది. 2040 నుంచి జీరో ఉద్గార వాహనాలే రోడ్లపై నడిచేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లో బ్రిటన్ ప్రభుత్వం కార్బన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

చైనా ఆర్మీ 90వ వార్షికోత్సంలో ఆయుధాల ప్రదర్శన
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) 90వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 30న ఇన్నర్ మంగోలియాలోని ఝరిహెలో భారీ పరేడ్, ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. దీనికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఇందులో 12 వేల దళాలు పాల్గొన్నాయి. 100కు పైగా యుద్ధవిమానాలు, 600 రకాల ఆయుధాలను ప్రదర్శించారు. వీటిలో సగం ఆయుధాలు కొత్తగా రూపొందించినవే. 1927, ఆగస్టు 1న మావో జెడాంగ్ నేతృత్వం లోని చైనా కమ్యూనిస్టు పార్టీ పీఎల్‌ఏను స్థాపించింది.

ఉగ్ర ఆశ్రయ దేశాల జాబితాలో పాకిస్తాన్
 పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలు, ప్రాంతాల జాబితాలో అమెరికా చేర్చింది. జాబితాలో అఫ్ఘానిస్తాన్, సోమాలియా, ఈజిప్టు, లెబనాన్, దక్షిణ ఫిలిప్పీన్‌‌స, కొలంబియా, వెనిజులా తదితర దేశాలు కూడా ఉన్నాయి.
పాక్‌లో 2016 నుంచి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు ఉగ్ర కార్యకలాపాలు, శిక్షణ, నిధుల సేకరణ కొనసాగిస్తున్నా పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకోలేదని ఉగ్రవాదంపై అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన వార్షిక నివేదిక ఆక్షేపించింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులతోపాటు మావోయిస్టుల నుంచి కూడా భారత్ దాడులు ఎదుర్కొంటోందని ఈ నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉగ్రవాద ఆశ్రయ దేశాల్లో పాకిస్తాన్‌ను చేర్చడం
ఎప్పుడు : జూలై 19
ఎవరు : అమెరికా
ఎందుకు : అఫ్ఘాన్ తాలిబాన్, హక్కానీ, లష్కరే, జైషే వంటిఉగ్రసంస్థలపై గట్టి చర్యలు తీసుకోనందుకు

పాక్‌కు సాయంలో కోతపెట్టిన అమెరికా 
హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ సంకీర్ణ సాయం కింద పాకిస్తాన్‌కు అందిస్తున్న 90కోట్ల డాలర్లలో 35కోట్ల డాలర్లకు అమెరికా కోతపెట్టింది. హక్కానీ ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాక్ తీసుకున్న చర్యలపై తాను సంతృప్తిగా లేనని అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కాంగ్రెస్ డిఫెన్‌‌స కమిటీకి తెలపడంతో పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్తాన్, పాక్‌ల విషయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సమీక్షించనున్న తరుణంలో సాయాన్ని నిలిపివేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాక్‌కు సాయంలో కోత 
ఎప్పుడు : జూలై 21
ఎవరు : అమెరికా 
ఎందుకు : హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ 

అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరిన ఆస్ట్రేలియా 
అంతర్జాతీయ సోలార్ కూటమి(ఐఎస్‌ఏ)లో సభ్యదేశంగా ఆస్ట్రేలియా చేరింది. తద్వారా ఈ కూటమిలో చేరిన 35వ దేశంగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది. అన్ని రంగాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, నిల్వ కోసం 2030 నాటికి వెయ్యి బిలియన్ డాలర్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఐఎస్‌ఏ ఏర్పాటైంది. భారత్, ఫ్రాన్స్ ఈ కూటమిగా నేతృత్వం వహిస్తున్నాయి.
2015 నవంబర్‌లో పారిస్‌లో జరిగిన 21వ కాప్ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఐఎస్‌ఏను ప్రారంభించారు. భారత్ ఈ నిధికి 1 మిలియన్ డాలర్లు ఇస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఎస్‌ఏలో చేరిన 35వ దేశం 
ఎప్పుడు : జూలై 21
ఎవరు : ఆస్ట్రేలియా 
ఎందుకు : సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నిధుల సమీకరణ కోసం

చైనా ఆర్మీ పది లక్షలకు కుదింపు
సైనిక బలగాలను భారీగా తగ్గించాలని చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 23 లక్షలు ఉన్న సైన్యాన్ని విడతల వారీగా 10 లక్షల లోపునకు తగ్గించాలని భావిస్తోంది. ఈ మేరకు చైనా ఆర్మీ అధికార పత్రిక పీఎల్‌ఏ డైలీ కథనం ప్రచురించింది. ఇంతవరకూ చైనా సంప్రదాయ సైనిక వ్యూహాల ప్రకారం సైన్యాన్ని భూతల పోరాటాలకు ఎక్కువగా వినియోగించేది. సంస్కరణల నేప థ్యంలో మిలటరీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రణాళిక ప్రకారం నేవీ, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్, మిస్సైల్ ఫోర్స్‌ను పెంచనుంది. ఆధునిక పరిజ్ఞానం, యుద్ధ తంత్రాల అమలు, కీలక లక్ష్యాల దిశగా మార్పులు ఉండబోతున్నాయని ఆ కథనం పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీఎల్‌ఏ సైన్యం పది లక్షలకు కుదింపు 
ఎప్పుడు : జూలై 12
ఎవరు : చైనా 
ఎందుకు : ప్రత్యామ్నాయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో భాగంగా 

అమెరికా రక్షణ వ్యయాల బిల్లులో 3 సవరణలు 
పాకిస్తాన్‌కు సైనిక సాయం విషయంలో కఠినవైఖరి అవలంబించాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది. ఆ మేరకు రక్షణ వ్యయాల బిల్లులో మూడు సవరణల్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఉగ్రవాదంపై పాక్ పోరు సంతృప్తికరంగా ఉంటేనే నిధులు మంజూరు చేయాలని తాజా సవరణల్లో స్పష్టం చేశారు. 651 బిలియన్ డాలర్ల జాతీయ భద్రతా అధికార చట్టం (ఎన్‌డీఏఏ)- 2018 ఆమోదం సందర్భంగా ఈ సవరణల్ని ప్రతిపాదించారు. ఈ బిల్లును జూలై 15న ప్రతినిధుల సభ 344-81 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఆ దేశ రక్షణ మంత్రి ధ్రువీకరణ అనంతరం ఎన్‌డీఏఏ యాక్ట్ 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 
తాజా సవరణల ప్రకారం ఉత్తర వజిరిస్థాన్‌లోని హక్కాని నెట్‌వర్క్‌పై పాక్ సైన్యం పోరాటం కొనసాగించకపోతే అమెరికా నుంచి వచ్చే 400 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 2,600 కోట్లు) సాయం నిలిపివేస్తారు. పాకిస్తాన్- అఫ్గాన్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కదలికల నియంత్రణకు పాక్ కృషిచేయాలి. అక్టోబర్ 1, 2017- డిసెంబర్ 31, 2018 మధ్య కాలానికి ఈ సాయం వర్తిస్తుంది.
ఈ బిల్లు ద్వారా భారత్ - అమెరికాల మధ్య రక్షణ రంగ సంబంధాలు కూడా బలపడనున్నాయి. భారత్‌తో రక్షణ సంబంధాలు బలోపేతం కోసం భారత-అమెరికన్ కాంగ్రెస్ నేత అమీ బెరా ప్రతిపాదించిన సవరణను ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సవరణను అమెరికా రక్షణ శాఖ మంత్రి ధ్రువీకరించాలి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రక్షణ వ్యయాల బిల్లులో సవరణలు 
ఎప్పుడు : జూలై 15
ఎవరు : అమెరికా 
ఎందుకు : పాక్‌కు సైనిక సాయం, భారత్ - అమెరికా రక్షణ బంధం బలోపేతానికి 

చెన్నైలో అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్
 ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్‌ ఫెస్ట్ - 2017’ చెన్నైలో జరగనుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ జూలై 15న తెలిపారు. సైన్స్‌ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి దాదాపు 10 వేల మంది శాస్త్రవేత్తలు ఈ సైన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ 
ఎప్పుడు : అక్టోబర్ 13-16, 2017
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : చెన్నై, తమిళనాడు 

ఖతార్‌తో అమెరికా ఉగ్ర వ్యతిరేక ఒప్పందం
ఖతార్‌తో అమెరికా జూలై 11న ఉగ్రవాద వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకుంది. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపిస్తూ నాలుగు అరబ్ దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా తాజా ఒప్పందం కుదుర్చుకుంది.

మానవ అక్రమ రవాణాలో ముందున్న చైనా
ప్రపంచంలో అత్యధికంగా మానవుల అక్రమ రవాణా చైనాలో జరుగుతోందని అమెరికా పేర్కొంది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో జూలై 10న వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది అక్రమ రవాణా అయ్యారని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం తెలిపింది.

హాంబర్గ్‌లో 12వ జీ-20 సదస్సు 
 ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా జర్మనీలోని హాంబర్గ్‌లో జూలై 7, 8న జీ-20 దేశాల సదస్సు జరిగింది. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని, అదే సమయంలో ఉగ్రసాయానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీ-20 సదస్సు తీర్మానించింది. 
జూలై 7న జీ-20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. ప్రపంచంలో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలన్నింటినీ అంతమొందించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదుల్ని చట్టం ముందు నిలబెట్టాలని.. అందుకోసం భద్రత, ప్రయాణం, వలసలు, ఇంటర్‌పోల్ తదితర విభాగాల్లో ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాచార వ్యవస్థను మెరుగుపర్చాలని తెలిపాయి. 
పారిస్ ఒప్పందంపై తీర్మానం 
గ్లోబల్ వార్మింగ్‌పై పోరుకు కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సులో భారత్ సహా 18 సభ్య దేశాలు స్పష్టం చేశాయి. సదస్సు ముగింపు సందర్భంగా జూలై 9న అధికారిక ప్రకటనలో ‘పారిస్ వాతావరణ ఒప్పందం అమలులో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా మినహా అన్ని దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయ’ని చెప్పాయి. పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఈ సదస్సులో ఒంటరైంది. 
ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు
ఐఎంఎఫ్ సంస్కరణల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, 2019లోగా కొత్త సంస్కరణల్ని రూపొందించాలి.మార్కెట్‌కు నష్టం కలిగించే సబ్సిడీలకు స్వస్తిచెప్పాలి. పారిశ్రామిక రంగంలో అధికోత్పత్తి సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయంగా సహకరించుకోవాలి.రక్షణ రంగంలో ఆయుధాల చట్టబద్ధ వ్యాపారానికి జీ20 సదస్సు అంగీకారం.వాణిజ్యం, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, స్వేచ్ఛా వాణిజ్య విఫణికి కట్టుబడి ఉండాలని తీర్మానం.
ప్రధాని మోదీ ప్రసంగం 
జీ-20 సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. జీ-20 దేశాలు ఉగ్రవాదుల జాబితాను ఇచ్చిపుచ్చుకోవటం, ఉగ్రవాదులను న్యాయపరమైన విచారణకోసం సభ్యదేశాలకు అప్పగించటం, వారికి అందే నిధులు, ఆయుధాల సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించటంలాంటి 11 సూత్రాల కార్యాచరణను సదస్సులో మోదీ సూచించారు. విస్ఫోటక కార్యాచరణ దళం (ఈఏటీఎఫ్) ఏర్పాటు చేసి ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా కట్టడి చేయవచ్చని ప్రధాని వెల్లడించారు. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల ప్రతినిధులకు జీ-20లో ప్రవేశాన్ని నిషేధించాలన్నారు. 
పర్యావరణ మార్పులు, పారిస్ ఒప్పందం విషయంలో జీ-20 దేశాలన్నీ సంపూర్ణ సహకారంతో ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు.
జీ-20 గురించి..
ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారం కోసం అంతర్జాతీయ వేదికగా జరిగే ముఖ్యమైన సదస్సుల్లో జీ-20 ఒకటి. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి జీ-20 కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానం సహా పలు కీలకాంశాలపై సభ్య దేశాల అధినేతలు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు చర్చలు జరుపుతారు. 
ఆసియన్ ఆర్థిక సంక్షోభం తర్వాత అంతర్జాతీయ ద్రవ్య స్థిరీకరణకు అవలంబించాల్సిన విధానాల రూపకల్పన కోసం 1999లో జీ-20ని ఏర్పాటు చేశారు.అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో 2008లో జీ-20 తొలి సమావేశం జరిగింది.ప్రపంచ జీడీపీలో 80 శాతం జీ-20 దేశాలు కలిగి ఉంటాయి.మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం జీ-20 దేశాల ద్వారానే జరుగుతుంది.ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ-20 దేశాల్లో ఉన్నారు.జీ-20 సభ్య దేశాలు 

ఈయూ

భారత్

చైనా

జపాన్

కెనడా

దక్షిణ కొరియా

యూకే

సౌదీ అరేబియా

అమెరికా

ఇండోనేషియా

మెక్సికో

బ్రెజిల్

ఫ్రాన్స్

దక్షిణాఫ్రికా

ఇటలీ

ఆస్ట్రేలియా

రష్యా

అర్జెంటీనా

టర్కీ

జర్మనీ



జీ-20 సమావేశాలు 
2008 - వాషింగ్టన్ డీసీ, అమెరికా2009 - లండన్, యూకే2009 - పిట్స్‌బర్గ్ , అమెరికా2010 - టొరంటో, కెనడా2010 - సియోల్, దక్షిణ కొరియా2011 - కేన్స్, ఫ్రాన్స్2012 - లాస్ కాబోస్, మెక్సికో2013 - సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా2014 - బ్రిస్బేన్, ఆస్ట్రేలియా2015 - అంటల్యా, టర్కీ2016 - హాంగ్జౌ, చైనా2017 - హాంబర్గ్, జర్మనీక్విక్ రివ్యూ: 
ఏమిటి : జీ-20 సమావేశం 
ఎప్పుడు : జూలై 7-8
ఎక్కడ : హాంబర్గ్, జర్మనీ
ఎందుకు : ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా

అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి ఆమోదం 
అణ్వాయుధాల నిషేధం కోసం తొలి చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జూలై 8న సంబంధిత తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఒప్పందానికి అనుకూలంగా 122 దేశాలు ఓటేయగా, నెదర్లాండ్‌‌స వ్యతిరేకంగా ఓటేసింది. సింగపూర్ గైర్హాజరైంది. అణ్వాయుధాల అభివృద్ధి, పరీక్షలు, తయారీ, సేకరణ, నిల్వ, వాడకం వంటి అన్ని కార్యక్రమాలను ఒప్పందం నిషేధించింది. ఈ ఆయుధాల పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడకూడదని స్పష్టం చేసింది. 
అణుశక్తి దేశాలైన భారత్, అమెరికా, బ్రిటన్, రష్యా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ తదితరాలు ఈ ఒప్పందం కోసం ఈ ఏడాది మార్చిలో జరిగిన చర్చలను బహిష్కరించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అణ్వాయుధాల నిషేధ ఒప్పందానికి ఆమోదం 
ఎప్పుడు : జూలై 8
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా 
ఎందుకు : అణ్వాయుధాలపై నిషేధానికి 

ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం: ఎస్‌ఓహెచ్‌ఆర్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ జూలై 11న వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజ్జార్‌లో ఉన్న ఐసిస్ కీలక నేతలు బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారని.. జూలై 11న ఈ విషయం తెలిసిందని పేర్కొంది. అయితే బాగ్దాదీ ఎక్కడ, ఎలా మరణించాడనేది తెలియదని సంస్థ డెరైక్టర్ రామి అబ్దుల్ రహ్మాన్ వివరించారు. 
బాగ్దాదీ మరణంపై ఐసిస్ స్పందించలేదు. ఇరాక్, సిరియాలలో ఐసిస్‌తో పోరాడుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్
ఎక్కడ : సిరియాలో 

గ్రీన్ కార్డులకు 12 ఏళ్ల నిరీక్షణ
అమెరికాలో నైపుణ్య ఉద్యోగులుగా శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే భారతీయుల ముందు 12 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ జాబితా ఉంది. అయితే ఏటా ఈ కార్డులు పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. 2015లో అమెరికాలో 36,318 మంది భారతీయులు తమ హోదాను శాశ్వత నివాసం హోదాకు సర్దుబాటు చేసుకున్నారు. కొత్తగా ప్రవేశించిన మరో 27,978 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత నివాసాన్ని పొందారు. ఈ మేరకు ప్యూ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఒక ఉద్యోగ సంబంధ విభాగంలో భారతీయుల ముందు ప్రస్తుతం 12 ఏళ్ల జాబితా ఉందని, ప్రభుత్వం 2005 మేలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తోందని పేర్కొంది. 2015లో 5,42,315 మంది తమ నివాస హోదాను శాశ్వత నివాస హోదాకు మార్చుకున్నారని వెల్లడించింది. గ్రీన్‌కార్డు దారులు ఐదేళ్లు అమెరికాలో ఉంటే ఆ దేశ పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్రీన్ కార్డు కోసం 12 ఏళ్ల నిరీక్షణ 
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ప్యూ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : అమెరికాలో 

ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో గుర్తింపు
జపాన్‌లోని ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదా దక్కింది. ఇక్కడి ద్వీప దేవతను సందర్శించుకునేందుకు ఏడాదికి 200 మందిని మాత్రమే అనుమతిస్తారు.అయితే మహిళలకు ప్రవేశం లేదు. సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమనే కారణంతోనే స్త్రీలను ఇక్కడికి అనుమతించడం లేదని తెలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలున్నాయి. స్మారక స్థలాలు, ప్రదేశాలు, నగరాలు, నిర్మాణాలు ఈ జాబితాలో ఉన్నాయి.

2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా 
 2019 ప్రపంచ పుస్తక రాజధానిగా యూఏఈలోని షార్జా నగరం ఎంపికైంది. ఈ మేరకు జూన్ 29న యునెస్కో ఓ ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(జీసీసీ)లో ఈ గుర్తింపు పొందిన తొలి నగరంగా షార్జా నిలిచింది.
2001 నుంచి యునెస్కో ఏటా ఓ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తిస్తుంది. 2001లో స్పెయిన్‌లోని మేడ్రిడ్ నగరానికి తొలి గుర్తింపు లభించింది. 2017కి గాను రిపబ్లిక్ ఆఫ్ గునియాలోని కొనార్కీ నగరం, 2018కి గాను గ్రీస్‌లోని ఏథెన్స్ నగరం ఈ గుర్తింపు పొందాయి. 
2003లో భారత్‌లోని న్యూఢిల్లీకి ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తింపు లభించింది. పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా యునెస్కో ఈ నగరాలను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా ఎంపిక
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : యునెస్కో
ఎందుకు : పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా

టీఏజేకేపై నిషేధం విధించిన పాకిస్తాన్ 
ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) ఫ్రంట్‌లో భాగమైన తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్(టీఏజేకే)పై పాకిస్తాన్ నిషేధం విధించింది. ఉగ్రవాద నిర్మూలనకు ఇస్తున్న నిధులను నిలిపేస్తామంటూ అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల కారణంగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 5న కశ్మీర్ దినోత్సవం అంటూ.. స్వాతంత్య్రం కావాలంటూ ర్యాలీలు తీయడం లాంటి కార్యక్రమాలను జేయూడీ నిర్వహించింది. దీంతో సయీద్‌ను లాహోర్‌లో 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. గతంలోనూ సయీద్‌ను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్‌పై నిషేధం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : పాకిస్తాన్ 

డోకా లా కనుమ మాదంటూ మ్యాప్ విడుదల చేసిన చైనా
సిక్కిం సెక్టార్‌లో ఉండే ‘డోకా లా’ కనుమను తమ దేశంలో భాగంగా చూపుతూ జూలై 1న చైనా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత సైనికులు తమ భూభాగంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని చైనా ఆరోపించినప్పుడు భారత సైనికులు వెళ్లింది ఈ కనుమ వద్దకే. కొన్నిరోజుల క్రితం భారత్, చైనా సైనికులు కలబడిందీ ఇక్కడే. డోకా లాను చైనా డాంగ్లాంగ్ అని పిలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రాంతం భారత్, చైనా, భూటాన్.. మూడు దేశాల సరిహద్దులో ఉంటుంది. కానీ 2012 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుని రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనాలో మ్యాపులో డోకా లా కనుమ 
ఎప్పుడు : జూలై 1
ఎవరు : చైనా 
ఎక్కడ : సిక్కిం సెక్టార్‌లో 

హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు 
బ్రిటిష్ పాలన నుంచి హాంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జూలై 1న హాంకాంగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఒక దేశం, రెండు వ్యవస్థలు విధానానికి హాంకాంగ్ ప్రజలు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.
హాంకాంగ్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను చైనా నిర్దేశిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ చాలాకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న అక్కడి ప్రజలు.. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనిపై జిన్‌పింగ్ మాట్లాడుతూ హాంకాంగ్ ప్రజలు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఇంతకముందు ఎన్నడూ లేరన్నారు. ఆసియాకు ఆర్థిక కేంద్రంగా ఉన్న హాంకాంగ్ మరింత అభివృద్ధి చెందటంపై దృష్టి పెట్టాలని, ఆందోళనలు పురోగతని దెబ్బతీస్తాయని అన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు
ఎప్పుడు : జూలై 1 
ఎవరు : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 
ఎందుకు : బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 

ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు 80 ఏళ్లు 
ప్రపంచంలోనే మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 999 జూలై 1తో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో బ్రిటన్ పోలీసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసులు, ఫైర్, అంబులెన్‌‌స, కోస్ట్‌గార్డ్ సిబ్బందులను అప్రమత్తం చేసి, వారి నుంచి సాయం పొందేందుకు బ్రిటన్‌లో ఇప్పటికీ ఈ నంబర్‌నే వినియోగిస్తున్నారు. ఈ హెల్ప్‌లైన్ సిబ్బంది 179 భాషలను అర్థం చేసుకుని, సహాయం అందించగలరు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 999కు 80 ఏళ్లు 
ఎప్పుడు : జూలై 1 నాటికి
ఎక్కడ : బ్రిటన్ 

జర్మనీలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత
స్వలింగ వివాహ పద్ధతికి జర్మన్ పార్లమెంటు జూన్ 30న ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా ‘లింగ భేదంతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకునేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది. ఈ చట్టం ప్రకారం 2001 నుంచి జర్మనీలో ఉంటున్న వారెవరైనా జంటగా మారితే వారు అన్ని రకాల వైవాహిక హక్కులను పొందుతారు.

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2017 అంతర్జాతీయం
భారత్ అమెరికాకు కీలక భాగస్వామి: ట్రంప్
అమెరికా ప్రవేశపెట్టిన కొత్త ‘దక్షిణాసియా విధానం’ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వర్జీనియా రాష్ట్రం అర్లింగ్టన్‌లోని ఫోర్ట్ మేయర్‌లో తన పాలనా యంత్రాంగంలోని ముఖ్య అధికారులు సహా సుమారు 2 వేల మందిని ఉద్దేశించి ఆగస్టు 22న ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ భద్రత, ఆర్థిక రంగాల్లో అమెరికాకు కీలక భాగస్వావి అన్నారు.
ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని పేర్కొన్న ట్రంప్ శాంతి నెలకొల్పేందుకు భారత్‌తో కలసి పనిచేయాలని సూచించారు. అఫ్గాన్‌లోని తమ సైనికులను వెనక్కి రప్పించే విషయంలో ఎలాంటి కాలపరిమితి లేదని, అక్కడ శాంతి, స్థిరత్వం తీసుకొచ్చేందుకు భారత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం 8,500 దళాలు అఫ్గాన్‌లో ఉండగా మరో 4 వేల దళాలను అక్కడికి పంపనున్నట్లు సమాచారం. 

ఐఎస్‌ఏకు త్వరలో ఐరాస అనుబంధ గుర్తింపు 
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రారంభించిన అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్‌ఏ)కు 2017 డిసెంబర్ నాటికి ఐరాస అనుబంధ గుర్తింపు లభించనుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 23న వెల్లడించారు. 121 దేశాల్లో అతి తక్కువ వ్యయంతో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రాజెక్టులపై పరిశోధన కోసం ఐఎస్‌ఏ పనిచేస్తుంది. ఇందుకోసం 10 ఏళ్లలో 300 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 
2015 నవంబర్ 30న పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌కు ఐరాస అనుబంధ గుర్తింపు
ఎప్పుడు : 2017 డిసెంబర్ నాటికి 
ఎందుకు : పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం

చైనాలో బ్రిక్స్ పరిపాలనా సెమినార్ 
బ్రిక్స్ పరిపాలనా సెమినార్ ఆగస్టు 17, 18 తేదీల్లో దక్షిణ చైనాలో జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, దక్షిణా ఆఫ్రికా)తో పాటు అభివృద్ధి చెందిన దేశాల నుంచి 160కిపైగా ప్రతినిధులు ఈ సెమినార్‌కు హాజరయ్యారు. “Openness, Inclusiveness, Mutual Benefits and Win-Win: Working Together to Build a Community of Shared Future for Mankind” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సమావేశాల్లో.. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు.
9వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని జియామెన్ నగరంలో జరుగుతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రిక్స్ పరిపాలనా సెమినార్ 
ఎప్పుడు : ఆగస్టు 17, 18
ఎవరు : బ్రిక్స్ కూటమి 
ఎక్కడ : చైనా 

డోక్లాం వివాదం పరిష్కారం: భారత్ 
భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైందని ఆగస్టు 28న భారత్ ప్రకటించింది. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరడంతో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడిందని తెలిపింది. ఈ మేరకు వీలైనంత త్వరగా డోక్లాం నుంచి సరిహద్దు బలగాల్ని వెనక్కి తీసుకునేందుకు భారత్, చైనా అంగీకరించాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు తమ బలగాల్ని ఉపసంహరించలేదని, పరిస్థితుల మేరకు మార్పులు ఉంటాయని చైనా పేర్కొంది. 
వివాదానికి కారణం
భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని భూభాగమే డోక్లాం. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. భూటాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలో యుద్ధట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా రోడ్డు నిర్మాణానికి చైనా జూన్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. రోడ్డు పూర్తయితే ఈశాన్య రాష్ట్రాలతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడి మెడ ప్రాంతం (చికెన్ నెక్) చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావించిన భారత్ భూటాన్‌కు మద్దతుగా తన సైన్యాన్ని మోహరించి దాన్ని అడ్డుకుంది. దీంతో భారత బంకర్లను చైనా ధ్వంసం చేసింది.

ప్రపంచంలో తొలి డైమండ్ ఫ్యూచర్స్ ప్రారంభం 
అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఐసీఈఎక్స్) డైమండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ఆగస్టు 28న ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్‌‌స ఎక్స్చేంజ్‌గా నిలిచింది. తొలి దశలో కంపల్సరీ డెలివరీతో 1 క్యారెట్ పరిమాణంలో కాంట్రాక్ట్స్‌ను ప్రారంభించామని.. డైమండ్ లావాదేవీలు నిర్వహించేవారికి ఇది పూర్తి పారదర్శకమైన కొత్త మార్కెట్‌ను సృష్టిస్తుందని ఐసీఈఎక్స్ మేనేజింగ్ డెరైక్టర్ సంజిత్ ప్రసాద్ తెలిపారు. ట్రేడింగ్ పరిమాణం రోజుకు దాదాపు రూ.5,000 కోట్ల మేర ఉండే వీలుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ తొలి డైమండ్ ఫ్యూచర్స్ ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్
ఎక్కడ : ముంబై

అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్
 ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలి యాలోని మెల్‌బోర్న్ నిలిచింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) తాజాగా నిర్వహించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 నగరాలపై స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాలను ఆధారంగా చేసుకుని ఈఐయూ ఈ సర్వే చేసింది. మొదటి లేదా చివరి పది నగరాల్లో ఏ భారత నగరానికీ చోటు దక్కలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్ 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

షాంఘై ర్యాంకింగ్స్ లో హార్వర్డ్‌కు అగ్రస్థానం 
షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ విడుదల చేసిన ‘అకడమిక్ ర్యాంకింగ్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం మొదటి ర్యాంకు సాధించింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రెండో ర్యాంకు, మసాచుసెట్స్ టెక్నాలజీ వర్సిటీ మూడో ర్యాంకు, కాలిఫోర్నియా వర్సిటీ నాల్గో ర్యాంకు సాధించాయి. ప్రిన్‌‌సటన్, ఆక్స్‌ఫర్డ్, కొలంబియా, కాలిఫోర్నియా టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, షికాగో వర్సిటీలు తొలి 10 జాబితాలో స్థానం పొందాయి. చైనాలోని ప్రతిష్టాత్మకమైన సింగువా వర్సిటీ తొలిసారిగా టాప్ 50లో చోటు దక్కించుకుంది. ఆసియా నుంచి మెరుగైన ర్యాంకు పొందిన వాటిలో టోక్యో యూనివర్సిటీ(24) ఉంది. యూరప్ నుంచి స్విస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఉత్తమ ర్యాంకు పొందింది. 2003 నుంచి షాంఘై సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమమైన తొలి 500 విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటిస్తోంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : షాంఘై యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : మొదటి స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ 
ఎక్కడ : అమెరికా 

ఖతార్ సరిహద్దు తెరిచిన సౌదీ
హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియా-ఖతార్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ముందడుగు పడింది. హజ్ యాత్రికుల కోసం ఖతార్ సరిహద్దును తిరిగి తెరవాలని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రియాద్‌వాసులు హజ్ యాత్రకు రావడానికి మార్గం సుగమమైంది. ఖతార్ రాజ కుటుంబ సభ్యుడైన షేక్ అబ్దుల్లా అల్ తానీతో జెడ్డాలో ప్రత్యేకంగా సమావేశమైన సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక జెట్ విమానాలను సౌదీలోని జెడ్డా నుంచి ఖతార్ రాజధాని దోహాకు పంపించనున్నట్లు సౌదీ మీడియా తెలిపింది. దీనికయ్యే ఖర్చంతా సౌదీ రాజు భరిస్తారంది. ఉగ్రవాదానికి మద్దతిస్తోందంటూ సౌదీ, ఈజిప్టు, బహ్రెయిన్, యూఏఈ.. ఇటీవల ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి.

చైనాలో తొలి సైబర్ కోర్టు ప్రారంభం 
ఇంటర్నెట్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి తొలి సైబర్ కోర్టును చైనా ప్రారంభించింది. జెజియాంగ్ ప్రావిన్‌‌సలో ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రమైన హాంగ్జూ నగరంలో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో వాణిజ్య వివాదాలతో పాటు కాపీరైట్ చట్టం ఉల్లంఘనలను ఈ న్యాయస్థానం విచారిస్తుంది. ఈ కోర్టులో విచారణ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. 2017 ఏడాది జూన్ నాటికి చైనాలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య 751 మిలియన్లకు చేరుకుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనాలో ప్రపంచ తొలి సైబర్ కోర్టు ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 17 
ఎక్కడ : హాంగ్జూ, చైనా 
ఎందుకు : ఆన్‌లైన్ వాణిజ్య వివాదాల పరిష్కారానికి 

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు 
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త వార్షిక సైనిక విన్యాసాలు ఆగస్టు 21న ప్రారంభమయ్యాయి. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఉత్తర కొరియా అభ్యంతరాల మధ్యే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. వేలాది మంది సైనికులు ఈ ఉల్చి-ఫ్రీడం గార్డియన్ సంయుక్త సైనిక కసరత్తు నిర్వహించారు. దక్షిణ కొరియాలో రెండు వారాల పాటు సాగే ఈ విన్యాసాల్లో క్షేత్ర స్థాయిలో కాల్పులు, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివేవీ లేకుండా కంప్యూటర్ల ఆధారంగా సాధన జరుగుతుంది. వీటిలో సుమారు 17,500 మంది అమెరికా సైనికులు, 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. కాగా ఇవి రక్షణాత్మక విన్యాసాలేనని, ద్వీపకల్పంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేవి కాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్ పేర్కొన్నారు.

స్పెయిన్ ఉగ్రదాడిలో 13 మంది మృతి 
స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్‌లో ఆగస్టు 17న ఓ వ్యాను పర్యాటకులపైకి దూసుకుపోవడంతో 13 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాదుల దాడి అని పోలీసులు ధ్రువీకరించారు.

అమెరికాపై క్షిపణి దాడి చేస్తాం: ఉత్తర కొరియా 
 పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరమైన గ్వామ్ ద్వీపం సమీపంలో క్షిపణి దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. తమ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందించింది. గ్వామ్ ద్వీపంపై మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి హ్వాసంగ్-12తో దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ సైనికాధికారిని ఉటంకిస్తూ ఉత్తర కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం అన్ని వైపుల నుంచి గ్వామ్‌పై విరుచుకుపడతామని తెలిపింది. 
మరోవైపు ఉత్తర కొరియా హెచ్చరికలపై ట్రంప్ దీటుగా స్పందించారు. అణ్వాయుధాలను ఆధునికీకరించే ఫైలుపైనే అధ్యక్షుడిగా తొలి సంతకాన్ని పెట్టానని.. ప్రస్తుతం అణ్వాయుధాల విభాగంలో అమెరికా ఎన్నడూ లేనంత శక్తిమంతంగా, బలంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికాపై క్షిపణి దాడి చేస్తామని హెచ్చరిక 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఉత్తర కొరియా 

భారత్‌లో సన్‌రైజ్ ప్రాజెక్టుకు బ్రిటన్ సాయం
భారత్‌లోని మూరుమూల గ్రామాల్లో ఐదు స్వయం సమృద్ధి సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 12 బ్రిటిష్, భారత విశ్వవిద్యాలయాలకు 7 మిలియన్ పౌండ్ల (రూ.58.09 కోట్లు)ను బ్రిటన్ ప్రభుత్వం గ్రాంటుగా అందజేసింది. ఇందులో భాగంగా భారత్‌లో సౌరశక్తి పరికరాల కోసం కొత్త తయారీ విధానాన్ని అభివృద్ధి చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో సన్‌రైజ్ ప్రాజెక్టుకు 7 మిలియన్ పౌండ్ల సాయం 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : బ్రిటన్ 
ఎందుకు : 5 స్వయం సమృద్ధి సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు 

80 దేశాలకు ఖతర్ వీసాఫ్రీ ఆఫర్
భారత్ సహా 80 దేశాల నుంచి ఖతర్‌కు వచ్చే పర్యాటకులకు వీసాలు అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం ఆగస్టు 9న ప్రకటించింది. నాలుగు అరబ్బు దేశాల నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటుండటం, 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకునేందుకు ఖతర్ ఈ నిర్ణయం తీసుకుంది. 
కొత్త వీసా విధానం ప్రకారం 33 దేశాల (వీటిలో ఎక్కువగా యూరప్ దేశాలు ఉన్నాయి) పర్యాటకులు ఖతర్‌కు వచ్చి 90 రోజులు ఉండొచ్చు. మరో 47 దేశాల ప్రజలు 30 రోజుల వరకు వీసా లేకుండా ఖతర్‌లో ఉండొచ్చు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 80 దేశాలకు ఉచిత వీసా 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఖతర్ 
ఎందుకు : ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు 

కాట్మాండులో 15వ బిమ్‌స్టెక్ మంత్రుల సమావేశం 
15వ బిమ్‌స్టెక్ (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation-BIMSTEC) మంత్రుల సమావేశం నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగింది. ఆగస్టు 10, 11 తేదీల్లో జరిగిన ఈ సమావేశాన్ని నేపాల ప్రధానమంత్రి షేర్ బహదూర్ దుబా ప్రారంభించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, తీవ్రవాదం, దౌత్య సంబంధాలపై చర్చించిన నేతలు.. 2016లో జరిగిన గోవా రిట్రీట్ తీర్మానాల అమలుకు మరింత సమర్థంగా కృషి చేయాలని నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 15వ బిమ్‌స్టెక్ మంత్రుల సమావేశం 
ఎప్పుడు : ఆగస్టు 10, 11
ఎక్కడ : ఖాట్మండు, నేపాల్ 

గ్లోబల్ ట్యాంక్ రేసు నుంచి భారత్ ఔట్
రష్యాలో జరిగిన అంతర్జాతీయ ‘ట్యాంక్ బైథ్లాన్’ పోటీల తదుపరి దశ నుంచి భారత ఆర్మీ జట్టు వైదొలిగింది. భారత ప్రధాన యుద్ధ ట్యాంకు టీ-90లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్‌లో భాగంగా రష్యాలోని అలాబినో పర్వత ప్రాంతంలో జూలై 29న ప్రారంభమైన ఈ పోటీల్లో (28 ఈవెంట్లు ఉంటాయి) భారత్, చైనా, రష్యా సహా 19 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో టాప్-12 జట్లు రెండో దశ రిలే రేసుకు ఎంపికయ్యాయి. భారత్ గత మూడేళ్లుగా ఈ పోటీల్లో పాల్గొంటోంది. ఈసారి పోటీల్లో భారత్ తొలిసారిగా టీ-90 ట్యాంకులతో బరిలో దిగింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ట్యాంకు బైథ్లాన్ 2017
ఎవరు : 19 దేశాలు
ఎక్కడ : రష్యాలో 

అంటార్కిటికాలో 100 అగ్నిపర్వతాల గుర్తింపు 
అంటార్కిటికాలో 100కు పైగా అగ్నిపర్వతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికా మంచు ఫలకానికి 2 కిలోమీటర్ల దిగువన ఈ పర్వతాలు ఉన్నాయని యూకేలోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. భూమిపై అతి ఎక్కువ అగ్నిపర్వతాలు గల ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. ఇవి 100 మీటర్ల నుంచి 3,850 మీటర్ల ఎత్తు ఉన్నాయని.. అన్ని పర్వతాలు దట్టమైన మంచు పొరలతో కప్పిఉన్నాయని తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంటార్కిటికాలో 100కుపైగా అగ్నిపర్వతాల గుర్తింపు 
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు
ఎక్కడ : యూకే 

ఉత్తర కొరియా దిగుమతులను నిలిపేసిన చైనా
ఐక్యరాజ్యసమితి కొత్త ఆంక్షల నేపథ్యంలో.. మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. బొగ్గు, ఇనుము, ముడి ఇనుము, సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతులను ఆగస్టు 15 నుంచి నిషేధిస్తున్నామని వెల్లడించింది. గత ఫిబ్రవరి నుంచే బొగ్గు దిగుమతిని నిలిపివేయగా.. తాజాగా ఇనుము తదితరాలను నిలిపి వేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షలను అమలు చేయడం వల్ల చైనాకు సుమారు రూ.6,500 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని అంచనా. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉత్తర కొరియా దిగుమతుల నిలిపివేత 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : చైనా 
ఎందుకు : ఐరాస ఆంక్షల నేపథ్యంలో 

పోలియో రహిత దేశంగా సోమాలియా 
సోమాలియాను పోలియో రహిత దేశంగా ఐక్యరాజ్య సమితి ఆగస్టు 14న ప్రకటించింది. గత మూడేళ్లుగా ఆ దేశంలో ఎలాంటి పోలియో కేసులు నమోదు కానందున.. ఐరాస ఈ మేరకు ప్రకటన చేసింది. ఆఫ్గనిస్తాన్, నైజీరియా, పాకిస్తాన్ దేశాల్లో మాత్రం ఇంకా పోలియో కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పోలియో రహిత దేశంగా సోమాలియా 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎందుకు : 3 ఏళ్లుగా నమోదు కాని పోలియో కేసులు 

ఉద్గారాల తగ్గింపుపై ఐరాసకు భారత్ హామీ 
కర్బన ఉద్గారాల తగ్గింపుపై క్యోటో ప్రోటోకాల్‌కు అనుగుణంగా 2020 నాటికి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కట్టుబడిఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి ఆగస్టు 8న భారత్ హామీ పత్రం సమర్పించింది. 1997 డిసెంబర్‌లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్ 2005 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల సాధనకు ఆయా దేశాలు కట్టుబడాల్సిన తొలి కాలవ్యవధి 2008-2012. 
ఖతార్‌లోని దోహాలో 2012లో జరిగిన వాతావరణ సదస్సులో ఈ ఒప్పందానికి సవరణ తీసుకొచ్చారు. దీన్ని దోహా సవరణగా పిలుస్తారు. 2013 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు సాధించాల్సిన లక్ష్యాలు, ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి.

ఆసియాన్ 50వ వార్షికోత్సవ ప్రకటన
ఆగ్నేసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 8న సమాఖ్య నేతలు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ఆసియాన్ 50వ వార్షికోత్సవాన్ని ఒక చారిత్రాత్మక సంఘటనగా, ఆసియాన్ సమాజ నిర్మాణం సాధించిన విజయంగా పేర్కొంది.

రైజ్ బిల్లుకి ట్రంప్ ఆమోదం 
అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) జారీకి అనుసరించిన లాటరీ విధానానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు స్వస్తి పలకనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా ఇకపై కార్డులు జారీ చేయనున్నారు. ఈ మేరకు గ్రీన్‌కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్’(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్‌డ్యూ రూపొందించిన ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వలసల్ని తగ్గించడమే బిల్లు ఉద్దేశమైనా బిల్లులో ప్రతిపాదించిన అంశాల ప్రకారం భారత్ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులకు ఈ బిల్లు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ, 26-30 ఏళ్ల మధ్య వయసు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం, మంచి వేతనం ఉంటే గ్రీన్‌కార్డులు పొందడం తేలిక కానుంది. ప్రస్తుతం అమెరికా ఏడాదికి 10 లక్షల గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. పదేళ్లలో సగానికి తగ్గించేలా ఈ బిల్లును రూపొందించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రైజ్ బిల్లుకి ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : అమెరికా 
ఎందుకు : అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) జారీకి

కాలగర్భంలో 4000భాషలు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న మూడింట రెండొంతుల భాషలు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచంలో మొత్తంగా 6000 భాషలున్నట్లు అంచనా. వాటిలో 2050 ఏడాదికల్లా 4000 భాషలు క్రమేపీ మూగబోయే ప్రమాదం ఉందని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎస్‌ఐ) తెలిపింది. 27 రాష్ట్రాల్లోని 780 భాషలపై 3000 మందితో అధ్యయనం నిర్వహించిన ఈ సంస్థ.. భారత్‌లో సుమారు 400 భాషలు కనుమరుగు కానున్నాయని తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం తీరప్రాంతాల్లో మాట్లాడుతున్న భాషలే ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి దొరకక సంప్రదాయ మత్స్యకార వర్గాలు తీరానికి దూరమవుతున్నాయి. కాగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠి, కన్నడ, మలయాళం, గుజరాతి, పంజాబీ భాషలకు కనుమరుగయ్యే ప్రమాదం లేదని, ఈ భాషలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉండడంతో ఈ జాబితాలోకి రావని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కనుమరుగు కానున్న 400 భాషలు 
ఎప్పుడు : 2050 నాటికి
ఎవరు : పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా
ఎక్కడ : భారతదేశంలో

భారత్, చైనాలో యువ ఇంటర్నెట్ యూజర్స్ అధికం 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 830 మిలియన్‌ల(83 కోట్ల) యువ ఇంటర్నెట్ వినియోగదారుల్లో 39 శాతం (320 మిలియన్) మంది భారత్, చైనాలోనే ఉన్నారు. ఐరాస అనుబంధ సంస్థ అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్(ఐటీయూ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో యువ ఇంటర్నెట్ యూజర్స్ 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఐటీయూ, ఐరాస
ఎక్కడ : భారత్, చైనాలో 39 శాతం మంది 

టిబెట్ పీఠభూమిపై ఎక్స్‌ప్రెస్ హైవే
ప్రపంచంలోనే ఎత్తయిన టిబెట్ పీఠభూమిపై చైనా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించింది. కింఘై ఫ్రావిన్స్‌లోని గాంగ్హె కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించారు. 634.8 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి చైనా వేల కోట్లను ఖర్చు చేసింది. దీన్ని సగటున 4 వేల మీటర్ల ఎత్తులో నిర్మించారు. రహదారిలో 36 శాతం పెర్మాఫ్రాస్ట్(మంచు)నేలపై ఉంటుంది. వాహనాల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత మార్పుల కారణంగా నేల కరిగిపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను స్థిరంగా ఉంచి నిర్మాణం చేపట్టారు.

2050 నాటికి 15 కోట్ల మందికి పౌష్టికాహార లోపం
వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపోన్నతి పెరగడంతోపాటు వరి, గోధుమ వంటి పంటల్లో ప్రొటీన్ వంటి పౌష్టికాహార పదార్థాలు లుప్తమవుతాయని శాస్త్రవేత్తలు ఆగస్టు 2న హెచ్చరించారు. పర్యవసానంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది పౌష్టికాహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2017 అంతర్జాతీయం
పర్యావరణ పరిరక్షణకు డికాప్రియో విరాళం
పపంచవ్యాప్తంగా ఉన్న 100కుపైగా పర్యావరణ పరిరక్షణ సంస్థలకు 20 మిలియన్ డాలర్లను గ్రాంటుగా అందజేయనున్నట్లు హాలీవుడ్ నటుడు లియోనార్డో డీకాప్రియో ప్రకటించారు. భూ సంరక్షణ, సముద్ర జలాలు, జీవుల పరిరక్షణ, అడవులను కాపాడుకోవడం, అంతరించిపోతున్న జీవులను రక్షించుకోవడంతోపాటు అత్యవసరంగా నివారించాల్సిన సమస్యల పరిష్కారానికి ఈ నిధులను ఉపయోగించాలని ఆయన సూచించారు. 
1998లోనే పర్యావరణ పరిరక్షణ కోసం ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన ఈ హాలీవుడ్ నటుడు.. అప్పటి నుంచి ఏదో ఓ రూపంలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పర్యావరణ పరిరక్షణకు 20 మిలియన్ డాలర్ల గ్రాంటు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : హలీవుడ్ నటుడు లియోనార్డో డీకాప్రియో

గూగుల్‌కి చేతికి హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారం
తైవాన్‌కి చెందిన హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కి విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. మొబైల్ హ్యాండ్‌సెట్స్ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు గూగుల్‌కి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. 
ఒప్పందం ప్రకారం హెచ్‌టీసీ పరిశోధన సిబ్బందిలో దాదాపు సగం మందిని (సుమారు 2,000) గూగుల్ చేర్చుకుంటుంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో ఈ డీల్ పూర్తవుతుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హెచ్‌టీసీలో కొంత భాగాన్ని కొనుగోలు చేయనున్న గూగుల్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎందుకు : మొబైల్ హ్యాండ్‌సెట్స్ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు

ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ లెక్కించనున్న నేపాల్ 
 ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తును తిరిగి లెక్కిస్తామని నేపాల్ తెలిపింది. 2015లో హిమాలయాల్లో సంభవించిన భీకర భూకంపంతో ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందని పలు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా భారత సర్వే విభాగం 1955లో ఎవరెస్ట్ ఎత్తును 8,848 మీటర్లుగా నిర్ధారించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తు మళ్లీ లెక్కింపు
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : నేపాల్ 
ఎందుకు : ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందన్న నివేదికల నేపథ్యంలో 

అణ్వాయుధ నిషేధ ఒడంబడికకు 50 దేశాల ఆమోదం
అణు ఆయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన ఒడంబడికకు 50 దేశాల ఆమోదం లభించింది. ఈ మేరకు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో ఆయా దేశాలు ఒడంబడికపై సంతకం చేశాయి. దీంతో.. 90 రోజుల ఇది అమల్లోకి వస్తుంది. ఈ ఒడంబడికపై సంతకం చేసిన తొలి దేశం బ్రెజిల్.
అణు ఆయుధాల ఉత్పత్తి, ప్రయోగం, పరిశోధన, కొనుగోలు, విక్రయం, నిల్వలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది జూలై 7న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 122 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. నెదర్లాండ్స్ వ్యతిరేకించింది. అయితే.. ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగి ఉన్న దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌లు.. ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అణ్వాయుధ నిషేధ ఒడంబడికకు 50 దేశాల ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 

బుల్లెట్ రైళ్ల వేగాన్ని 350 కి.మీ.కు పెంచిన చైనా
బుల్లెట్ రైళ్ల వేగాన్ని చైనా మళ్లీ గంటకు 350 కిలోమీటర్లకు పెంచింది. 2008లో ఇదే వేగంతో చైనా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టింది. అయితే.. 2011, జూలైలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించడంతో.. వేగమే ప్రమాదానికి కారణమనే అభిప్రాయంతో అపట్లో రైళ్ల వేగాన్ని 300 కిలోమీటర్లకు కుదించారు. అదే సమయంలో జపాన్ వంటి దేశాలు తమ వేగాన్ని పెంచి, సురక్షిత ప్రయాణానికి చిరునామాగా మారుతున్న తరుణంలో.. చైనా కూడా తమ సామర్థ్యాన్ని గరిష్టస్థాయికి పెంచుకునేందుకు గత కొన్నినెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 20న బీజింగ్ నుంచి బయల్దేరిన ఫ్యూజింగ్ బుల్లెట్ రైలు 1,318 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘై నగరాన్ని కేవలం 4 గంటల 28 నిమిషాల్లో చేరుకుంది. అంటే గంటకు 350 గరిష్ట వేగాన్ని అందుకుంది.

సామాజిక సేవ కోసం జుకర్‌బర్గ్ భారీ విరాళం 
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన కంపెనీలో కొన్ని వాటాలను విక్రయించడం ద్వారా 12 బిలియన్ డాలర్లు (రూ.76,800 కోట్ల డాలర్లు) సమీకరించనున్నట్టు వెల్లడించారు. ఈ నిధులను ఆరోగ్యం, విద్యా రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. ఇందుకోసం రానున్న 18 నెలల్లో 3.5 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు షేర్లను విక్రయించే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. ఫేస్‌బుక్ వాటాలకు ఇప్పుడు చాలా విలువ ఉందని, తన వాటాలో స్వల్ప మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం కేటాయించనున్నాని ఆయన వెల్లడించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సామాజిక సేవ కోసం 12 బిలియన్ డాలర్ల విరాళం 
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : మార్క్ జుకర్‌బర్గ్ 
ఎందుకు : కంపెనీలో కొన్ని వాటాలను విక్రయించడం ద్వారా 

ప్లాట్స్ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితా
దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్‌‌స ఇండస్ట్రీస్.. ప్రపంచంలోనే 250 అతి పెద్ద ఇంధన సంస్థల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఏడో స్థానం నుంచి నాలుగు స్థానాలు ఎగబాకింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్లాట్స్ సంస్థ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో గతేడాది 14వ స్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సారి 7వ స్థానానికి చేరింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 20వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకుంది. మొత్తంగా... 2017 ర్యాంకింగ్‌‌సలో 14 భారతీయ ఇంధన కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. 
అమెరికన్ సంస్థ ఎక్సాన్ మొబిల్ 12 సంవత్సరాల ఆధిపత్యానికి తెరదించుతూ.. రష్యాకి చెందిన గాజ్‌ప్రోమ్ ఈ లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జర్మనీకి చెందిన ఇ.ఆన్ ఏకంగా 112 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి చేరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాలో మూడో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్లాట్స్

జర్మనీ చాన్స్‌లర్ పదవికి అర్హత పొందిన మెర్కెల్ 
జర్మనీ పార్లమెంటు దిగువసభ బుందేస్టాగ్‌కు సెప్టెంబర్ 24న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఏంజిలా మెర్కెల్ వరసగా నాలుగోసారి చాన్‌‌సలర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందారు. అయితే 33 శాతం ఓట్లు, 246 సీట్లు గెలిచిన ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ (సీడీయూ)-క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమి... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం పొందలేకపోయింది. దీంతో ఫ్రీ డెమోక్రాటిక్ పార్టీ (ఎఫ్‌డీపీ), గ్రీన్ పార్టీలతో కలసి ఆమె అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎఫ్‌డీపీ 10.7% ఓట్లతో 80 సీట్లను, గ్రీన్ పార్టీ 8.9% ఓట్లతో 67 స్థానాలను గెలుచుకున్నాయి. సీడీయూ-సీఎస్‌యూ కూటమితోపాటు ఈ రెండు పార్టీల సీట్లను కలిపితే మెర్కెల్‌కు పూర్తి ఆధిక్యం లభిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జర్మనీ దిగువ సభ బుందేస్టాగ్ ఎన్నికల ఫలితాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్‌కు 33 శాతం ఓట్లు
ఎక్కడ : జర్మనీలో
ఎందుకు : వరసగా నాలుగోసారి చాన్‌‌సలర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందిన మెర్కెల్ 

ఉత్తర కొరియాపైనా ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రావెల్ బ్యాన్ జాబితాలోకి కొత్తగా ఉత్తర కొరియా సహా మూడు దేశాలను చేర్చారు. ఆరు ముస్లిం దేశాల (లిబియా, సూడాన్, ఇరాన్, సిరియా, యెమెన్, సోమాలియా) ప్రజలకు అమెరికాలోకి ప్రవేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో నిషేధ ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఆ ఆజ్ఞల గడువు సెప్టెంబర్ 24తో ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్తగా మరో మూడు దేశాలపై కూడా నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే సూడాన్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. క్షిపణి, అణు పరీక్షలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియాతోపాటు, వెనిజులా, చాద్ దేశాలపై కూడా ఆయన తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు. దీంతో ప్రస్తుతం అమెరికా నిషేధాజ్ఞలు ఎదుర్కొంటున్న మొత్తం దేశాల సంఖ్య 8కి చేరింది.

ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల జాబితా 
అమెరికాకు వెలుపల అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. వీరిద్దరు బ్యాంకింగ్ రంగానికి చెందిన వారే. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ అగ్రస్థానంలో నిలవగా... జీఎస్‌కే సీఈవో ఎమ్మా వాల్మ్‌స్లే రెండో స్థానంలో, ఎంజీ సీఈవో ఇసబెల్లా కొచర్ మూడో స్థానంలో నిలిచారు. 
అమెరికాలోని అత్యంత శక్తిమంతమైన మహిళల పేరిట ఫార్చ్యూన్ ప్రకటించిన మరో జాబితాలో పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయి రెండో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. జనరల్ మోటార్స్ చైర్మన్, సీఈవో మేరి బర్రా టాప్‌లో ఉన్నారు. లాక్‌హీడ్ మార్టిన్ చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో మారిల్లిన్ హేవ్సన్ మూడో స్థానంలో నిలిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా, అమెరికా వెలుపుల శక్తిమంతమైన మహిళల జాబితా 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : పార్చ్యూన్

42 వేల కోట్ల దావూద్ ఆస్తుల జప్తు
అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్‌లో ఉన్న 6.7 బిలియన్ డాలర్ల(రూ.42 వేల కోట్లు) విలువైన ఆస్తుల్ని ఆ దేశ ప్రభుత్వం సీజ్ చేసింది. యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ మెయిల్ కథనం ప్రకారం దావూద్‌కు వార్విక్‌షైర్‌లో ఒక హోటల్, బ్రిటన్ మిడ్‌లాండ్ ప్రాంతంలో నివాస సముదాయాలున్నాయి. 2015లో ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా దావూద్ ఆస్తుల వివరాల జాబితాను అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్‌కు అందచేశారు. ఆ జాబితాలో లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దావూద్, అతని సన్నిహితుల పేరిట ఇళ్లు, ఫ్లాట్స్, హోటల్స్ వివరాలు ఉన్నాయి. 

సింగపూర్ అధ్యక్షురాలిగా హలీమా 
 ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన హలీమా యాకూబ్ సింగపూర్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఒక మహిళ దేశ అత్యున్నత పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. నలుగురు ప్రత్యర్థులూ అర్హత ప్రమాణాలు అందుకోవడంలో విఫలం కావడం వల్ల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో.. ఓటింగ్ లేకుండానే ఆమె ఎన్నికయ్యారు. 
63 ఏళ్ల హలీమా సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా, అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున రెండు దశాబ్దాలు ఎంపీగా కొనసాగారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : హలీమా యాకూబ్
ఎక్కడ : సింగపూర్ 

చైనాలో బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్ మూసివేత 
క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద బిట్‌కాయిన్ ఎక్స్చేంజీల్లో ఒకటైన బీటీసీచైనా (బిట్‌కాయిన్ చైనా) మూతపడనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 30 నుంచి తమ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 4న పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక పత్రం విడుదల చేసిన దరిమిలా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బీటీసీచైనా మూసివేత 
ఎక్కడ : చైనాలో 
ఎవరు : బిట్‌కాయిన్ చైనా సంస్థ 
ఎందుకు : క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో

అమెరికాతో పోటీ పడటమేతమ లక్ష్యం: ఉత్తర కొరియా 
సైనిక సంపత్తి విషయంలో అమెరికాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సెప్టెంబర్ 16న ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని కిమ్ సంకేతాలిచ్చారు. ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి 

సాయుధ సిబ్బంది వాహకాలు

2,500

యుద్ధ ట్యాంకులు

4,060

ఆర్టిల్లరీ, ఎయిర్ డిఫెన్‌‌స గన్‌‌స

32,100

సైన్యం

10, 20,000

యుద్ధ విమానాలు

545

హెలికాప్టర్లు

286

ప్రధాన యుద్ధ నౌకలు

3

తీరప్రాంత గస్తీ నౌకలు

383

ల్యాండిగ్‌క్రాఫ్ట్+హోవర్ క్రాఫ్ట్

267

జలాంతర్గాములు

70


నేపాల్ సరిహద్దుకు చైనా రోడ్డు 
నేపాల్ సరిహద్దులో ఉన్న జాతీయ రహదారి G - 318ని, టిబెట్‌లోని షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన 40 కిలో మీటర్ల పొడవైన రోడ్డును చైనా సెప్టెంబర్ 18న అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనిని పౌర అవసరాలతోపాటు మిలిటరీ సేవలకు కూడా ఉపయోగించుకోనున్నారు. ఈ రహదారి ద్వారా దక్షిణాసియా ప్రాంతాల్లోకి చేరుకోవడానికి చైనాకు సులభమవుతుంది. టిబెట్ రాజధాని లాస, షిగాసే నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌కు సమాంతరంగా కొత్త రోడ్డు మార్గం ఉంది. జీ 318 రహదారి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరి నుంచే వెళ్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నేపాల్ సరిహద్దు నుంచి షిగాసే నగరాన్ని కలుపుతూ నిర్మించిన రోడ్డు ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : చైనా

దక్షిణ కొరియా, జపాన్‌తో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
దక్షిణ కొరియా, జపాన్‌తో సంయుక్తంగా అమెరికా సైనిక బలగాలు సెప్టెంబర్ 18న శక్తిమంతమైన అత్యాధునిక యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి. కొరియా ద్వీపకల్పం, జపాన్ సమీప ప్రాంతాల మీదుగా ఈ విన్యాసాలు కొనసాగాయి. ఈ విన్యాసాల్లో అమెరికా సైన్యానికి చెందిన రెండు బీ-1బీలు, నాలుగు ఎఫ్-35బీ యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వీటితోపాటు దక్షిణ కొరియా బలగాలకు చెందిన నాలుగు ఎఫ్-15కే యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 
జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించిన మూడు రోజుల తర్వాత అమెరికా ఈ విన్యాసాలు నిర్వహించింది

ఐరాస వేదికగా ఉత్తర కొరియాకు ట్రంప్ హెచ్చరిక
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తమను రెచ్చగొడుతూ ఉంటే.. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించేందుకు అన్ని దార్లూ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసుకుంటూ.. మిగిలిన ప్రపంచాన్ని హెచ్చరిస్తూ మానవాళికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తొలిసారి ప్రసంగించిన ట్రంప్.. ఉత్తర కొరియాపై సైనికచర్య ప్రారంభించేందుకు ఏమాత్రం సంకోచించబోమని తేల్చిచెప్పారు. 
భూమండలంపై ఏ దేశంలోనూ కిమ్ జోంగ్ ఉన్ వంటి అణ్వాయుధాలు, మిసైళ్లు కలిగిన నేరస్తులుండరని ట్రంప్ అన్నారు. కిమ్‌ను రాకెట్ మ్యాన్‌గా సంబోధించారు. రాకెట్ మ్యాన్ ఆత్మహత్య మిషన్‌లో ఉన్నారని ట్రంప్ హెచ్చరించారు. 
ఉగ్రసాయాన్ని ఉపేక్షించం 
ఈ ప్రసంగంలోనే పరోక్షంగా పాకిస్తాన్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి సాయం చేస్తున్న దేశాలను గుర్తించి వారిని బాధ్యులుగా చేయాలన్నారు. గత నెలలో పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం మానుకోవాలంటూ ట్రంప్ నేరుగా తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉత్తర కొరియాకు హెచ్చరిక
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : ఐరాస వేదికగా 
ఎందుకు : ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షల నేపథ్యంలో

హెచ్-1బీ వీసా ప్రక్రియను పునరుద్ధరించిన అమెరికా 
ఐదు నెలల కిందట అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్-1బీ వర్క్ వీసా దరఖాస్తుల ప్రక్రియను అమెరికా పునరుద్ధరించింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వీసాల జారీని నిలిపివేసింది. తిరిగి సెప్టెంబర్ 18న దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించింది. ఈ మేరకు 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రక్రియను పునఃప్రారంభించినట్టు ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరానికి 65 వేల వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హెచ్ - 1బీ వీసా ప్రక్రియ పునరుద్ధరణ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 18 
ఎవరు : అమెరికా

టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ - 2018
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్- 2018 వివరాలను సెప్టెంబర్ 6న ప్రకటించింది. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, విదేశీ విద్యార్థుల శాతం, బాల, బాలికల నిష్పత్తి, బోధన, పరిశోధన, ఇంటర్నేషనల్ ఔట్‌లుక్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్ ప్రకారం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3వ స్థానంలో ఉంది. 
ప్రపంచ వ్యాప్తంగా 1,102 యూనివర్సిటీలకు ర్యాంకులివ్వగా మన దేశంలోని 42 యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స గతేడాది 201-250 మధ్య స్థానంలో నిలవగా, ఈసారి 250-300 మధ్య ర్యాంకుకు పడిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ 801-1000 స్థానంలో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్- 2018
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : టైమ్స్ 
ఎక్కడ : తొలి స్థానంలో ఆక్‌్రఫర్డ్ యూనివర్సిటీ 

2040 నాటికి ఫ్రాన్స్‌లో చమురుఉత్పత్తులపై నిషేధం 
భూతాపాన్ని తగ్గించేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 2040 నాటికి దేశంలో చమురు, సహజవాయువుల ఉత్పత్తి నిషేధించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఇందుకోసం కొత్త బిల్లును తీసుకురానుంది. ఇప్పటికే చమురు తవ్వకాల అనుమతులకు సంబంధించిన లెసైన్‌‌సలను రెన్యువల్ చేయకూడదని ముసాయిదా బిల్లులో పేర్కొన్న ఫ్రాన్‌‌స.. చట్టాన్ని చేసి, అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే చమురు, గ్యాస్ ఉత్పత్తిని నిషేధించే తొలి దేశంగా ఫ్రాన్‌‌స నిలిచిపోనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2040 నాటికి చమురు ఉత్పత్తులపై నిషేధం 
ఎవరు : ఫ్రాన్స్ 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, భూతాపాన్ని తగ్గించేందుకు

పాక్‌కు చెందిన హబీబ్ బ్యాంకు మూసివేతకు అమెరికా ఆదేశం 
పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హబీబ్ బ్యాంక్ లిమిటెడ్(హెచ్‌బీఎల్) న్యూయార్క్ శాఖను మూసివేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీల కట్టడికి నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్‌ఎస్) తెలిపింది. దీంతో పాటు హబీబ్ బ్యాంకుపై 225 మిలియన్ డాలర్ల(రూ.14,385 కోట్లు) జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. 2006 ఒప్పందం ప్రకారం లోపాలను సరిదిద్దుకోవడానికి పలు అవకాశాలు ఇచ్చినప్పటికి హబీబ్ బ్యాంకు వాటిని వినియోగించుకోలేదని డీఎఫ్‌ఎస్ సూపరింటెండెంట్ మారియావుల్లో తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంకు మూసివేతకు అమెరికా ఆదేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : అమెరికా ప్రభుత్వం 
ఎందుకు : అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు కారణంగా 

ఫ్లోరిడాలో పెను విధ్వంసం సృష్టించిన 'ఇర్మా' 
హరికేన్ ఇర్మా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 10న ఫ్లోరిడా కీస్ వద్ద తీరాన్ని తాకిన ఇర్మా ధాటికి ఆ రాష్ట్ర తూర్పు తీరంలో ఊహించని స్థాయిలో ఆస్తినష్టం చోటుచేసుకుంది. హరికేన్ ప్రభావం ఫ్లోరిడాతో పాటు జార్జియా, అలబామా, దక్షిణ, ఉత్తర కరోలినాల్లో కనిపించింది. 
హార్వీ.. ఇర్మా.. ఎందుకీ పేర్లు? 
తుపానుల గురించి సమాచారం అందించడానికి, ప్రజలను సులభంగా అప్రమత్తం చేసేందుకు వీలుగా వాటికి మనుషుల పేర్లను పెట్టే విధానాన్ని అమెరికా తుపానుల కేంద్రం 1950ల్లో ప్రారంభించింది. 1953 తర్వాత తుపానులకు మహిళల పేర్లనే పెట్టేవారు. 1979 నుంచి మగవారి పేర్లను కూడా పెట్టడం ప్రారంభించారు. తుపాన్లకు ఏ పేరు పెట్టాలో తెలుపుతూ ప్రపంచ వాతావరణ సంస్థ వద్ద ముందుగానే ఒక జాబితా సిద్ధంగా ఉంటుంది. ఇలా ఒక్కో ఏడాదిలో వచ్చే తుపాన్లకు ఒక జాబితా ఉంటుంది. అలాగే ప్రతి ఆరేళ్లకూ అవే పేర్లు పునరావృతమవుతుంటాయి. అంటే 2017లో తుపాన్లకు పెట్టిన పేర్లనే 2023లోనూ మళ్లీ వాడతారు. ప్రాంతాన్ని బట్టి తుపానుల పేర్లు మారుతుంటాయి. అయితే ఏవైనా తుపాన్లు తీవ్ర స్థాయిలో విధ్వంసం సృష్టించి, చరిత్రలో మిగిలిపోయేలా నష్టాన్ని కలిగిస్తే మాత్రం వాటి పేర్లను మళ్లీ వాడరు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పెను విధ్వంసం సృష్టించిన హరికేన్ ఇర్మా 
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎక్కడ : ఫ్లోరిడా, అమెరికా 

స్పెయిన్‌లో ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా 
ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య సంస్థలకు అందకుండా నిలువరించలేకపోయిందంటూ స్పెయిన్ సమాచార రక్షణ సంస్థ ఫేస్‌బుక్‌కు 1.2 మిలియన్ యూరో(రూ.9.18 కోట్ల)ల జరిమానా విధించింది. ఖాతాదారుల నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోకుండా వారి ఆలోచన విధానం, లింగం, మత విశ్వాసాలు, వ్యక్తిగత అభిరుచులు తదితర అంశాలను ఫేస్‌బుక్ సేకరించిందని ఆరోపించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫేస్‌బుక్‌కు రూ.9.18 కోట్ల జరిమానా 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : స్పెయిన్ సమాచార రక్షణ సంస్థ 
ఎందుకు : ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య సంస్థలకు అందకుండా నిలువరించలేకపోయినందుకు 

బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం 
బ్రెగ్జిట్ (యూరప్ కూటమి (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం)కు సంబంధించిన ఓ బిల్లుకు బ్రిటిష్ పార్లమెంటు సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపింది. దీంతో బ్రెగ్జిట్ విషయంలో ప్రధాని థెరెసా మే ప్రభుత్వం మరో ముందడుగు వేసినటై్లంది. ఈ బిల్లుకు అనుకూలంగా 326 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 290 ఓట్లు పడ్డాయి. తదుపరి దశలో ఈ బిల్లును ఎంపీలు క్షుణ్నంగా పరిశీలిస్తారు. 1972 నాటి యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టాన్ని ఈ బిల్లు ద్వారా రద్దు చేయనున్నారు. అలాగే ఈయూ చట్టాలను ఈ బిల్లు యూకే (యునెటైడ్ కింగ్‌డమ్) చట్టాలుగా మారుస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : బ్రిటన్ పార్లమెంట్ 
ఎందుకు : ఈయూ చట్టాలను యూకే చట్టాలుగా మార్చేందుకు 


ఉత్తర కొరియాపై ఐరాస కఠిన ఆంక్షలు
ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి కఠిన ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఉత్తర కొరియాపై తీవ్రమైన ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెప్టెంబర్ 12న ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఉత్తర కొరియా ఇంధన దిగుమతులు, వస్త్రాల ఎగుమతిపై నిషేధం విధించినట్లయింది. 
అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియాను ప్రపంచం ఎప్పటికీ ఆమోదించదని, ఇప్పటికై నా ఆ దేశం అణు ప్రయోగాలు ఆపకపోతే.. తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ హెచ్చరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉత్తర కొరియాపై ఆంక్షలు
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎందుకు : వరుస క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో

ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు కెన్యా కఠినచట్టం 
 పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ కెన్యా ప్రపంచంలోకెల్లా కఠినమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆ దేశంలో ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, విక్రయం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. నిబంధనలను ఉల్లంఘించిన వారు 4 ఏళ్ల జైలు శిక్ష లేదా 40 వేల డాలర్ల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు కఠినమైన చట్టం 
ఎప్పుడు : ఆగస్టు 2017
ఎవరు : కెన్యా 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం

భారత్, స్విట్జర్లాండ్ మధ్య 2 ఒప్పందాలు 
రెల్వే రంగంలో సహకారానికి సంబంధించి భారత్, స్విట్జర్లాండ్ మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆగస్టు 31న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే.. నల్లధనం, పన్ను ఎగవేతల నిర్మూలనకు పరస్పర సహకారం కొనసాగించాలని భారత్, స్విట్జర్లాండ్‌లు నిర్ణయించాయి. ఇందుకు ఉన్న అన్ని మార్గాలను మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్, స్విట్జర్లాండ్ మధ్య 2 ఒప్పందాలు 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : రైల్వే రంగంలో సహకారానికి సంబంధించి 

పాక్‌కు 25.5 కోట్ల డాలర్ల యూఎస్ సాయం
పాకిస్తాన్‌కు 25.5 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,600 కోట్లు) విలువైన మిలిటరీ సాయాన్ని అందించనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 30న తెలియజేసింది. అయితే పాకిస్తాన్‌లో తలదాచుకొంటూ అఫ్గానిస్తాన్‌లోని అమెరికా సైనికులపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితేనే ఈ సాయం అందుతుందని షరతు విధించింది. ఉగ్రవాదులపై పాకిస్తాన్ సమర్థవంతంగా పోరాడిందా లేదా అనే విషయాన్ని విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్ నిర్ధారిస్తారనీ, పాక్ పనితీరుతో ఆయన సంతృప్తి చెందితేనే 25.5 కోట్ల డాలర్ల నిధులు విడుదలవుతాయని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాకిస్తాన్‌కు 25.5 కోట్ల డాలర్ల మిలిటరీ సాయం 
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : అమెరికా 

3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం చేసుకున్న అమెరికా 
అమెరికా-రష్యాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్‌ల్లోని రష్యా దౌత్య కార్యాలయాలను అమెరికా సెప్టెంబర్ 2న స్వాధీనం చేసుకుంది. గత నెలలో తమ దేశంలోని అమెరికా దౌత్య సిబ్బందిని రష్యా సగానికి పైగా తగ్గించింది. దీనికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దౌత్య కార్యకలాపాలకు రష్యా ఈ కార్యాలయాలను ఇకపై ఉపయోగించుకోవడానికి వీల్లేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భద్రత, నిర్వహణ సహా ఈ మూడు కార్యాలయాలూ పూర్తి స్థాయిలో తమ అధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 3 రష్యా కాన్సులేట్ల స్వాధీనం 
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : అమెరికా ప్రభుత్వం 
ఎక్కడ : అమెరికాలో 

‘బ్రిక్స్ బ్యాంకు’ తొలి ప్రాజెక్టు ప్రారంభం
భారత్ సహా బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంతో మొట్టమొదటి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించింది. షాంఘై లింగాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు 17 ఏళ్ల కాలానికి గాను 76 మిలియన్ డాలర్లు (రూ.486 కోట్లు) రుణం ఇచ్చేందుకు 2016 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. ఎన్‌డీబీ నుంచి ఆర్థిక సహకారం అందుకున్న తొలి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా లింగాంగ్ పారిశ్రామిక ప్రాంతంలో 100 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పరిశ్రమల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో తొలి దశ సెప్టెంబర్ 2న ప్రారంభమైంది. ఎన్‌డీబీని బ్రిక్స్ దేశాలు 2015లో ఏర్పాటు చేశాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రాజెక్టు ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)

మయన్మార్ నుంచి బంగ్లాకు రోహింగ్యా శరణార్థులు
మయన్మార్‌లో చెలరేగిన హింస కారణంగా గత పది రోజుల్లోనే(ఆగస్టు 21-సెప్టెంబర్ 1) దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింసవల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది. 
బ్రిటిష్ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు.
మరోవైపు.. భారత్‌లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 4న కేంద్రాన్ని ఆదేశించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బంగ్లాదేశ్‌కు 87 వేల మంది రోహింగ్యా శరణార్థులు 
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎక్కడ : మయన్మార్ నుంచి 
ఎందుకు : మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింసవల్ల

జియామెన్‌లో 9వ బ్రిక్స్ సదస్సు 
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్‌కు మరో భారీ దౌత్య విజయం దక్కింది. చైనాలోని జియామెన్‌లో సెప్టెంబర్ 3 - 5 వరకు జరిగిన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌతాఫ్రికా) సదస్సు డిక్లరేషన్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సహా ఉగ్రసంస్థలపై బ్రిక్స్ సభ్యదేశాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. పాక్ పేరెత్తకుండానే.. శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, మైకెల్ టెమర్, జాకబ్ జుమాలు ఈ సదస్సులో పాల్గొన్నారు. సమావేశాల ముగింపు సందర్భంగా 43 పేజీల జియామెన్ డిక్లరేషన్‌ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాగా.. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై చర్చ జరగటం ఇదే తొలిసారి. 
ఉగ్రవాదంపై ఆందోళన 
బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదం అంశాన్ని మోదీ లెవనెత్తారు. దీనికి ఇతర నేతల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో వారు కూడా మోదీ ప్రతిపాదనను సమర్థించారు. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ (ఈటీఐఎమ్), ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, తెహ్రికే తాలిబాన్, హిజ్బుత్ తహ్రీర్ వంటి సంస్థలు శాంతికి విఘాతం కల్పించటంపై బ్రిక్స్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు తుర్కిస్తాన్ ఏర్పాటు చేయాలంటూ చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సులో ఈటీఐఎమ్ చేస్తున్న విధ్వంసంపై ప్రత్యేకంగా చర్చించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండానే ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ముందుకెళ్లనున్నట్లు సభ్య దేశాలు పేర్కొన్నాయి.సాంప్రదాయ వైద్యాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని కూడా సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎబోలా, హెచ్‌ఐవీ, క్షయ, మలేరియాతోపాటుగా ఇతర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించింది.ఉత్తరకొరియా అణుపరీక్షలపైనా బ్రిక్స్ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రధాని మోదీ ప్రసంగం 
ప్రపంచంలోని ఓపెన్ ఎకానమీల్లో ఒకటిగా భారత్ వేగంగా పరిణామం చెందుతోందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా బిజినెస్ కౌన్సిల్‌తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ ద్వారా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిందని వెల్లడించారు. చెల్లింపులు, లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చేలా ప్రోత్సహిస్తున్న కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు స్థానికంగా తయారీని ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారిగా 40 శాతానికి చేరాయని.. 2016-17లో రూ.3.86 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని మోదీ వెల్లడించారు. పేదరిక నిర్మూలనతోపాటుగా వైద్యం, పారిశుద్ధ్యం నైపుణ్యం, ఆహార భద్రత, లింగ సమానత, విద్యుత్, విద్య రంగాలపై భారత్ మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ప్రధాని వెల్లడించారు.సౌరశక్తి వినియోగాన్ని పెంచే ఎజెండాతో అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ)ని మరింత బలోపేతం చేసే విషయంలో బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.బ్రిక్స్ దేశాలకూ రేటింగ్ ఏజెన్సీ
ఇప్పటిదాకా క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఆధిపత్యం చలాయిస్తున్న పశ్చిమ దేశాల ఏజెన్సీలకు చెక్ చెప్పే దిశగా వర్ధమాన దేశాలు తమ కోసం ప్రత్యేకంగా రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్ధమాన దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, ఇతర కార్పొరేట్ల ఆర్థిక అవసరాల కోసం బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తోడ్పడగలదని ఆయన చెప్పారు. బ్రిక్స్ సదస్సు ప్లీనరీ సెషన్‌లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఇతర వర్ధమాన దేశాలకూ లాభం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 
ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్‌ఏ (క్రెడిట్ రేటింగ్) మార్కెట్లో ఎస్‌అండ్‌పీ, మూడీస్, ఫిచ్ వంటి సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ మూడు సంస్థలూ అమెరికావే. 
నాలుగు ఒప్పందాలు ..
సదస్సు సందర్భంగా బ్రిక్స్ కూటమిలో భారత్ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం (2017-2020), బ్రిక్స్ కస్టమ్స్ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్ వ్యాపార మండలి, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. 
బ్రిక్స్ దేశాల గణాంకాలు..
ఆర్థికాభివృద్ధిలో బ్రిక్స్ దేశాల వాటా 50 శాతం.ప్రపంచ జనాభాలో 42.58 శాతం మంది బ్రిక్స్ దేశాల్లో ఉన్నారు.బ్రిక్స్ దేశాల విస్తీర్ణం 26.6 శాతం.2015 నాటి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో బ్రిక్స్ దేశాల వాటా 22.53 శాతం.అంతర్జాతీయ ద్రవ్యనిధిలో వాటా 14.91 శాతం.ప్రపంచ బ్యాంకులో ఓటింగ్ హక్కులు - 13.24 శాతం.
అక్రమ వలసదారులుగా అమెరికాలోని స్వాప్నికులు
చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 5న నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారిని అమెరికాలో స్వాప్నికులు (డ్రీమర్లు) అని పిలుస్తారు. ట్రంప్ తాజా నిర్ణయంతో 7 వేల మంది భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన, సరైన అనుమతి పత్రాల్లేని 8 లక్షల మందిపై ప్రభావం పడనుంది. స్వాప్నికుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో ఉంది. 
డ్రీమర్లు అమెరికాలోనే నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు చట్టపరంగా వెసులుబాటు కల్పిస్తూ ఒబామా 2012 ‘బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా (డీఏసీఏ)’ సహాయ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తాజాగా ట్రంప్ ఈ కార్యక్రమాన్నే రద్దు చేశారు. దీంతో వారంతా అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వాప్నికులను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ నిర్ణయం 
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : అమెరికాలో

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2017 అంతర్జాతీయం
సింగపూర్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తిమంతం
 ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులను జారీచేస్తున్న దేశాల జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో ఒక ఆసియా దేశం తొలి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఆర్థిక సలహాల సంస్థ ఆర్టన్ క్యాపిటల్ విడుదల చేసిన 'గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017'జాబితాలో రెండో స్థానంలో జర్మనీ నిలవగా భారత్ 75వ ర్యాంకును పొందింది. గత ఏడాది 78వ స్థానంలో నిలిచిన ఇండియా ఈసారి మూడుస్థానాలు మెరుగుపరుచుకుంది. భారతీయులకు 51 దేశాల్లో వీసా మినహాయింపు, లేదా వీసా ఆన్ అరైవల్ (విదేశీ విమానాశ్రయాల్లో దిగిన వెంటనే వీసా మంజూరు చేస్తారు) సౌకర్యం ఉంది. అఫ్గానిస్తాన్ చివరిదైన 94వ స్థానానికి పరిమితమవగా, పాకిస్తాన్, ఇరాక్‌లు సంయుక్తంగా 93వ స్థానంలో నిలిచాయి. 
టాప్-10 శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లు 

ర్యాంకు

దేశం

స్కోరు

1

సింగపూర్

159

2

జర్మనీ

158

3

స్వీడన్, దక్షిణ కొరియా

157

4

డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, జపాన్, యూకే

156

5

లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్‌‌స, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్

155

6

మలేసియా, ఐర్లాండ్, కెనడా, అమెరికా

154

7

ఆస్ట్రేలియా, గ్రీస్, న్యూజిలాండ్

153

8

మాల్టా, చెక్ రిపబ్లిక్, ఐస్‌లాండ్

152

9

హంగెరీ

150

10

స్లోవేనియా, స్లోవేకియా, పోలండ్, లిథువేనియా, లాత్వియా

149

ర్యాంకు ఎలా నిర్ణయిస్తారు..
వివిధ దేశాల మధ్య అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం ఏ దేశ పౌరులకై తే అత్యధిక దేశాల్లో వీసా అవసరం ఉండదో సదరు దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. సింగపూర్ దేశస్తులు వీసా అవసరం లేకుండా ఏకంగా 159 దేశాలకు వెళ్లే ఆస్కారం ఉంది కాబట్టి దానికి ప్రథమ స్థానం దక్కింది. ఇదివరకు జర్మనీతో కలిసి సింగపూర్ తొలి స్థానాన్ని పంచుకునేది. అయితే ఇటీవల సింగపూర్ ప్రజలకు పరాగ్వే వీసా మినహాయింపునిచ్చింది. దాంతో జర్మనీని రెండోస్థానానికి నెట్టిన సింగపూర్ తొలి స్థానానికి ఎగబాకింది. ఆసియా నుంచి దక్షిణకొరియా, జపాన్, మలేసియాలు కూడా మొదటి పది దేశాల్లో చోటు దక్కించుకున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆర్టన్ క్యాపిటల్
ఎక్కడ : తొలి స్థానంలో సింగపూర్, 75వ స్థానంలో భారత్ 

చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్
చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ.. దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు (రెండోసారి) జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది.
జిన్‌పింగ్, కెకియాంగ్ (కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని) కాక రూలింగ్ కౌన్సిల్‌లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్ (63) చోటు దక్కించుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్ 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : చైనా జాతీయ కమ్యూనిస్ట్ కాంగ్రెస్
ఎక్కడ : బీజింగ్ 

హవాయిలో రోడ్లపై ఫోన్లు వినియోగిస్తే జరిమానా
హవాయిలోని హోనొలులు నగరం రోడ్లపై నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చూడటంపై నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 25 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిచిన వారికి 35 డాలర్ల (రూ.2,200) జరిమానా విధిస్తారు. 
ఇటీవల అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను చూసుకోకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిస్తే 35 డాలర్ల జరిమానా 
ఎప్పుడు : అక్టోబర్ 25 నుంచి 
ఎక్కడ : హోనొలులు, హవాయి, అమెరికా 
ఎందుకు : రోడ్డు ప్రమాదాల నివారణకు 

స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించిన కాటలోనియా 
స్వాతంత్య్రానికే మొగ్గు చూపుతూ జరిగిన రెఫరెండానికి కొనసాగింపుగా స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అక్టోబర్ 27న బార్సిలోనాలోని కాటలోనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘గణతంత్ర స్వతంత్ర దేశంగా కాటలోనియాను ప్రకటిస్తున్నాం’ అనే ఆ తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటేశారు. 
అయితే ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని, అమలుకు వీలుకాదని స్పెయిన్ తేల్చిచెప్పింది. కాటలోనియాపై ప్రత్యక్ష పాలన విధించేలా ప్రధాని రజోయ్‌కి అధికారాలను అప్పగిస్తూ స్పెయిన్ సెనెట్ తీర్మానం చేసింది. ఐక్య స్పెయిన్‌కే యూరోపియన్ యూనియన్, అమెరికాలు మద్ధతు ప్రకటించాయి. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేసి, డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కాటలోనియా స్వాతంత్ర తీర్మానానికి ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : కాటలోనియా పార్లమెంట్ 
ఎందుకు : స్పెయిన్ నుంచి విడిపోయేందుకు 

సౌదీలో క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతి
ఇటీవల మహిళలను డ్రైవింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా తాజాగా వారిని క్రీడా మైదానాల్లోకి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం 2018 నుంచి అమల్లోకొస్తుందని, దీంతో వారు దేశంలోని మూడు ప్రధాన మైదానాలైన రియాద్, జెడ్డా, దామన్ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. అక్కడి గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మహిళల ప్రగతి కోసం పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతి
ఎప్పుడు : 2018 నుంచి
ఎవరు : రాజు మహ్మద్ బిన్ సల్మాన్ 
ఎక్కడ : సౌదీ అరేబియా
ఎందుకు : పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు

రోబోకు పౌరసత్వం 
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక రోబోకి పౌరసత్వం లభించింది. ‘సోఫియా’ అనే హ్యూమనాయిడ్ రోబోకి పౌరసత్వం ఇస్తున్నట్లు అక్టోబర్ 27న సౌదీ అరేబియా ప్రకటించింది.

తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించం: జిన్‌పింగ్ 
 స్వతంత్రంగా ఉండేందుకు తైవాన్ చేస్తున్న ప్రయత్నాలను విజయవంతం కానీయబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా భూభాగం నుంచి ఏ భాగమైనా, ఎవరైనా, ఏ సంస్థ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా విడిపోయేందుకు ప్రయత్నిస్తే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కావాలంటే, హాంకాంగ్, మకావ్‌ల్లో జరుగుతున్నట్లు ఒక దేశం రెండు వ్యవస్థల విధానం ద్వారా శాంతియుత పద్ధతిలో పాలన కొనసాగించుకునేందుకు అంగీకరిస్తాం. తైవాన్ అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తాం. ఈ మేరకు అక్టోబర్ 18న చైనా కమ్యూనిస్ట్ పార్టీ 19వ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. కీలక అంతర్గత, అంతర్జాతీయ అంశాలపై దేశ, పార్టీ విధానాలను సమావేశాలకు హాజరైన దాదాపు 2 వేల మంది ప్రతినిధులకు వివరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించేది లేదని స్పష్టీకరణ 
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 
ఎక్కడ : చైనా కమ్యూనిస్ట్ట్ పార్టీ 19వ సమావేశాల్లో 

కేటలోనియా సర్కారు రద్దుకు స్పెయిన్ నిర్ణయం 
కేటలోనియా వేర్పాటువాద ప్రభుత్వాన్ని రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. వేర్పాటువాద నేతలు స్వాతంత్య్రం ప్రకటించకుండా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 21న అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించిన ప్రధాని మేరియానో రాజోయ్ కేటలోనియా ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కేటలోనియన్ పార్లమెంటును రద్దుచేసేందుకు తనకు సంపూర్ణ అధికారాలివ్వాలని స్పెయిన్ సెనెట్‌ను ఆయన కోరారు. సెనెట్‌లో రాజోయ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పాపులర్ పార్టీకి మెజారిటీ ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేటలోనియా సర్కార్ రద్దుకు నిర్ణయం 
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : స్పెయిన్ ప్రధాని మేరియానో రాజోయ్ 

జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ విజయం
జపాన్ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని షింజో అబే పార్టీ విజయం సాధించింది. 465 మంది సభ్యులున్న దిగువ సభలో అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ప్రతినిధుల సభకు అక్టోబర్ 22న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లిబరల్ డెమొక్రటిక్‌కు 281, మిత్రపక్షం కొమెటోకు 29 కలిపి మొత్తం 310 స్థానాలు లభించడంతో దాదాపు మూడింట రెండొంతుల ఆధిక్యం దక్కినట్లయింది. అబే నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

లండన్‌లో కార్లపై కాలుష్య పన్ను 
కాలుష్యానికి కారణమవున్న కార్లకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త పన్నును అమల్లోకి తెచ్చింది. లండన్ నగరంలో తిరిగే పాత కార్లు, అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలకు 10 పౌండ్ల (రూ. 858) జరినామా విధించాలని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ నిర్ణయించారు. 2006కు ముందు రిజిస్టరైన డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఈ కాలుష్య పన్ను వర్తిస్తుంది. యూరప్‌లో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన లండన్‌లో తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాత కార్లు, అధిక కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలపై 10 పౌండ్ల జరిమానా
ఎప్పుడు : అక్టోబర్ 23 
ఎవరు : లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ 
ఎక్కడ : లండన్‌లో 
ఎందుకు : కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా

ఏఆర్ రెహ్మాన్ సంస్థతో యాపిల్ మ్యూజిక్ జట్టు
 మ్యాక్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహ్మాన్ నెలకొల్పిన కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీస్ (కేఎంఎంసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాపిల్ మ్యూజిక్ వెల్లడించింది. యాపిల్‌కి చెందిన ప్రొఫెషనల్ మ్యూజిక్ యాప్ లాజిక్ ప్రో ఎక్స్‌తో స్వరాల రూపకల్పన చేయడంలో మ్యాక్ ల్యాబ్స్‌లో శిక్షణనిస్తారు. ప్రస్తుతం చెన్నైలో ఒక సెంటర్ ఉండగా.. ముంబైలో మరోటి ఏర్పాటు చేయనున్నట్లు యాపిల్ తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చేందుకు 10 మ్యూజికల్ స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నట్లు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) ఎడీ క్యూ తెలిపారు. 
ఏఆర్ రెహ్మాన్ 2008లో కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీని నెలకొల్పారు. ఇందులో హిందుస్తానీ, వెస్టర్న్ క్లాసికల్ సంగీతం, మ్యూజిక్ టెక్నాలజీ వంటి వాటిలో శిక్షణనిస్తున్నారు. 

ఒబామా కేర్‌ను రద్దు చేసిన ట్రంప్ 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లుగానే మాజీ అధ్యక్షుడు ఒబామా తెచ్చిన ఆరోగ్య బీమా చట్టాన్ని(ఒబామా కేర్) అక్టోబర్ 12న రద్దు చేశారు. కాంగ్రెస్ సాయంతో ఒబామా కేర్‌ను రద్దు చేయాలని యత్నించినప్పటికీ వీలుకాకపోవడంతో తనకున్న విశేషాధికారాలతో కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒబామా కేర్ అమెరికన్ల పాలిట పీడకలగా మారిందని విమర్శించారు. తాజాగా తాను తీసుకువచ్చిన ఆరోగ్య బీమా వల్ల తక్కువ ధరలతోనే పాలసీలను బీమా సంస్థలు ప్రజలకు విక్రయించవచ్చని ట్రంప్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఒబామా కేర్ రద్దు 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : అమెరికాలో 

విద్య’కు గూగుల్ బిలియన్ డాలర్ల సాయం
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛంద సంస్థల ద్వారా 1 బిలియన్ డాలర్లమేర నిధులను ఖర్చు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామని గూగుల్ తెలిపింది. అలాగే సంస్థలోని ఉద్యోగులు కూడా ఈ అంశానికి సంబంధించి స్వచ్ఛందంగా సేవలందిస్తారని తెలియజేసింది. ‘గ్రో విత్ గూగుల్’ అనే కార్యక్రమాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా అమెరికన్లకు ఉద్యోగం సంపాదించడం ఎలా? వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడం ఎలా? వంటి పలు అంశాలపై శిక్షణనిస్తారు. వివిధ ఆన్‌లైన్ విద్యా సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విద్యా ప్రమాణాల పెంపునకు 1 బిలియన్ డాలర్ల సాయం 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : గూగుల్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

సోమాలియా బాంబు పేలుడులో 231 మంది మృతి 
సోమాలియా రాజధాని మొగదిషులో అక్టోబర్ 14న అత్యంత శక్తిమంతమైన బాంబు పేలడంతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 275 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్రికా కొమ్ముగా పేరుపడ్డ సోమాలియాలో ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడిని జాతీయ విపత్తుగా పేర్కొన్న సోమాలియా ప్రభుత్వం ఇది అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ పనేనని ఆరోపించింది. సోమాలియా అధ్యక్షుడు మొహమద్ అబ్దుల్లాహీ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. 

చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్‌పై డోక్లామ్ ప్రభావం 
492 కి.మీ. పొడవున్న చెన్నై-బెంగళూరు-మైసూరు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తిచేసి ఏడాది అయినప్పటికీ.. చైనా రైల్వే పనుల్లో ఎలాంటి పురోగతి చూపలేదని అధికారులు తెలిపారు. ఇందుకు భారత్-చైనాల మధ్య డోక్లామ్‌లో తలెత్తిన ఉద్రిక్తతే కారణమై ఉండొచ్చని రైల్వే శాఖ మొబిలిటి డెరైక్టరేట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో చైనా రైల్వే ఎరియువన్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్(సీఆర్‌ఈఈసీ) స్పందన కోసం గత 6 నెలలుగా ఈ-మెయిల్స్ పంపిస్తూన్నా వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదని అధికారులు వెల్లడించారు. 
దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని ప్రస్తుతమున్న 80 కి.మీ/గంట నుంచి 160 కి.మీ/గంటకు పెంచేందుకు వీలుగా చెన్నై-బెంగళూరు-మైసూరు వంటి 9 హైస్పీడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 
అక్టోబర్ 18 నుంచి చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్
ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలు అక్టోబర్ 18న ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు సాగే ఈ కీలక సమావేశాల్లో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కే మరోసారి చైనా పగ్గాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన ఎన్నిక దాదాపు ఖరారు కాగా జిన్‌పింగ్‌ను అధికారికంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోనున్నారు. చైనాలో సీపీసీ ప్రధాన కార్యదర్శే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 
స్టాండింగ్ కమిటీ చేతిలో అధికారాలు 
చైనాలో కీలక అధికారాలు ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ చేతుల్లోనే ఉంటాయి. ఆ కమిటీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న జిన్‌పింగ్ (64) దేశాధ్యక్షుడిగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సైనికాధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. మిగతా ఆరుగురిలో ప్రధాని లీ కెకియాంగ్ తదితరులు ఉన్నారు. 2002 పార్టీ సమావేశాల్లో చేసిన ఒప్పందం మేరకు అగ్రనేతలైన అధ్యక్షుడు, ప్రధాని రెండోసారి కమిటీలో కొనసాగనున్నారు. వారిద్దరినీ మినహాయిస్తే కమిటీలోని మిగిలిన ఐదుగురు సభ్యుల మార్పు దాదాపు ఖాయమైంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ 19వ సమావేశాలు 
ఎప్పుడు : అక్టోబర్ 18 నుంచి (వారం రోజులు)
ఎక్కడ : చైనాలో 

ఆసియా టాప్-50 యూనివర్సిటీల జాబితా 
ఆసియాలోని అత్యుత్తమ 50 యూనివర్సిటీల జాబితాలో మూడు భారత విద్యాసంస్థలకు స్థానం దక్కింది. క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్‌‌స (క్యూఎస్) సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మొదటి స్థానంలో (నిరుడు 3వ స్థానం) నిలవగా.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రెండో స్థానం (గతేడాది మొదటి స్థానం) దక్కించుకుంది. టాప్-10 జాబితాలో భారత యూనివర్సిటీలకు చోటు దక్కలేదు. ఐఐటీ-బాంబే 34వ స్థానంలో నిలవగా.. ఐఐటీ-ఢిల్లీ 41వ, ఐఐటీ-మద్రాస్ 48వ స్థానాలను దక్కించుకున్నాయి. తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స బెంగళూరు (51), ఐఐటీ కాన్పూర్ (59), ఢిల్లీ యూనివర్సిటీ (72), ఐఐటీ రూర్కీ (93), ఐఐటీ గువాహటి (98)లు ఉన్నాయి. 
ఆసియాలోని 400కు పైగా వర్సిటీలను పరిశీలించిన ఈ సంస్థ.. యూనివర్సిటీల్లో అధ్యాపకుల అర్హత (పీహెచ్‌డీ), దేశ, విదేశీ విద్యార్థుల సంఖ్య, అకడమిక్ ఫలితాలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్ నిర్ణయించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా టాప్ - 50 యూనివర్సిటీల జాబితా 
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : క్వాక్‌క్వాడ్రిల్లీ సైమండ్స్

ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిన ఈయూ
వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికా, దాని మిత్ర దేశాలకు హెచ్చరికలు పంపుతున్న ఉత్తర కొరియాపై యూరోపియన్ యూనియన్ మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ మేరకు లక్సెంబర్గ్‌లో జరిగిన ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. దీని ప్రకారం ఉత్తర కొరియాలో ఈయూ దేశాల పెట్టుబడులను నిషేధించారు. చమురు ఉత్పత్తుల సరఫరాను నిలిపివేశారు. ఈయూలో ఉన్న ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తులు స్వదేశానికి నగదు పంపకుండా నిషేధించారు. 
ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఐక్యరాజ్య సమితి.. ఇప్పటికే ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉత్తర కొరియపై మరిన్ని ఆంక్షలు 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎవరు : యూరోపియన్ యూనియన్

అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
 సౌదీ అరేబియాకు అత్యాధునిక టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్‌‌స(థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. థాడ్ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 97 వేల కోట్లు) అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. శక్తివంతమైన రాడార్లు అమర్చిన ఈ థాడ్ క్షిపణులు శత్రు దేశాల క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకుని పేల్చివేస్తాయి. గంటకు 10 వేల కి.మీ వేగంతో ప్రయాణించే థాడ్ క్షిపణులు 150 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగరగలవు. 
ఇప్పటికే థాడ్‌ను సౌదీ పొరుగు దేశాలైన ఖతర్, యూఏఈలకు అమెరికా సరఫరా చేసింది. అమెరికా ఆయుధ సంపత్తిలో థాడ్ అత్యంత సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ. శత్రు క్షిపణుల్ని కచ్చితంగా గుర్తించి పేల్చేందుకు ఇందులో రాడార్ వ్యవస్థలున్నాయి. 20 అడుగుల పొడవుండే థాడ్ క్షిపణులు టన్ను బరువుంటాయి. ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సాయంతో మిస్సైల్‌ను అంచనావేసి పేల్చేస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సౌదీ అరేబియాతో 15 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందానికి ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 6 
ఎవరు : అమెరికా 
ఎందుకు : టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్‌‌స(థాడ్) క్షిపణుల సరఫరా కోసం

చైనాలో 13 లక్షల అవినీతి అధికారులకు శిక్ష
చైనాలోని 13.4 లక్షల మంది అవినీతి అధికారులను ఆ దేశ ప్రభుత్వం శిక్షించింది. అవినీతిని నిర్మూలించేందుకుగాను ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించిన స్వీపింగ్ యాంటీ కరప్షన్’ కార్యక్రమంలో భాగంగా అవినీతి అధికారులను గుర్తించి శిక్షించారు. అక్టోబర్ 18న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) 19వ జాతీయ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ (సీసీడీఐ)కు నేతృత్వం వహిస్తున్న వాంగ్ క్విషాన్ ఈ వివరాలను అక్టోబర్ 8న వెల్లడించారు. 2012లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 13.4 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించినట్లు పేర్కొన్నారు. వీరిలో 13 వేల మంది మిలిటరీ అధికారులు ఉన్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అధికార పత్రిక వెల్లడించింది. మిలిటరీలో ఉద్యోగాలను అమ్ముకున్నారని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్‌గా పనిచేసిన జనరల్ జు కై హూతోపాటు జనరల్ జూ బోక్సంగ్‌ను కూడా శిక్షించారు.

చెల్లెలికి ప్రమోషన్ ఇచ్చిన కిమ్ 
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్.. పార్టీ కీలక పదవిలో తన సోదరిని నియమించారు. ఈ మేరకు కిమ్ యో జోంగ్‌ను పార్టీ శక్తిమంతమైన పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించినట్లు ప్రభుత్వ అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది. అక్టోబర్ 8న కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సౌదీలో మహిళల డ్రైవింగ్‌కు అనుమతి
 సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ రాచకుటుంబం సెప్టెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2018 జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. 
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మహిళలకు డ్రైవింగ్‌కు అనుమతి 
ఎప్పుడు : సెప్టెంబర్ 26 
ఎవరు : సౌదీ రాచకుటుంబం 
ఎక్కడ : సౌదీ అరేబియాలో

జపాన్ పార్లమెంట్ రద్దు
జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 28న ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం తాజా ఎన్నికలకు అబే పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జపాన్‌లో అక్టోబర్ 22న ఎన్నికలు జరిగే అవకాశముంది. అబే అధికారిక నిర్ణయాన్ని స్పీకర్ చదివి వినిపించగానే పార్లమెంట్ దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్ పార్లమెంటు రద్దు 
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : జపాన్ ప్రధాని షింజో అబే

కాటలోనియాలో ప్రజాభిప్రాయ సేకరణ
స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఆ దేశ ఈశాన్య ప్రాంతం కాటలోనియాలో అక్టోబర్ 1న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాటలోనియా జనాభా సుమారు 75 లక్షలు. ఆర్థికంగా బలమైన ఈ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతి, భాష ఉన్నాయి.

థాయ్‌లాండ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు
థాయ్‌లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రకు ఆ దేశ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బియ్యం రాయితీ పథకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలిగించారని కోర్టు తేల్చింది.

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2017 అంతర్జాతీయం
ఫెడ్ చైర్మన్‌గా జెరోమ్ పావెల్
 అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా జెరోమ్ పావెల్ (64) పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెనేట్ కూడా ఆమోదముద్ర వేస్తే పావెల్ నియామకం ఖరారు కానుంది. ప్రస్తుత ఫెడ్ చైర్మన్ జానెట్ యెలెన్ పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన పావెల్ 2012 నుంచి ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రపంచ ఎకానమీకే దిశానిర్దేశం చేసే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పదవిని అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తిమంతమైన హోదాగా పరిగణిస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ నియామకం 
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : జెరోమ్ పావెల్ 
ఎక్కడ : అమెరికా

ప్యారడైజ్ పత్రాల్లో 714 మంది భారతీయుల పేర్లు
ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) నవంబర్ 5న విడుదల చేసిన ప్యారడైజ్ పత్రాల్లో భారత్‌కు చెందిన 714 మందితో పాటు ప్రపంచంలోని 120 మంది రాజకీయ ప్రముఖుల పేర్లున్నాయి. ఇందులో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్ సహచరుడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుల పేర్లూ ఉన్నాయి. జర్మన్ పత్రిక సుడుషె జైటంగ్ పత్రిక ఈ వివరాలను సేకరించిందని ఐసీఐజే తెలిపింది.
విదేశీ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాదాపు కోటి 34 లక్షల పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఐసీఐజే ఈ జాబితాను వెల్లడిచింది. ముఖ్యంగా బెర్ముడా చుట్టూ ఉన్న దీవుల కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల్లో 180 దేశాలకు చెందిన ప్రముఖులు పెట్టుబడులు పెట్టగా, 714 పేర్లతో భారత్ 19వ స్థానంలో ఉందని తెలిపింది. అలాగే యాపిల్, నైక్, ఉబర్ సహా.. దాదాపు 100 బహుళజాతి సంస్థలు డొల్ల కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నించాయని తెలిపింది.
ప్యారడైజ్ పత్రాల జాబితాలో భారత్ నుంచి కేంద్ర మంత్రి జయంత్ సిన్హా, రాజ్యసభ బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, చిదంబరం కుమారుడు కార్తీ, అమితాబ్ బచ్చన్, విజయ్ మాల్య, నీరా రాడియా, సంజయ్‌దత్ భార్య మాన్యతాదత్ (దిల్‌నాషిన్) తదితరులున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్యారడైజ్ పత్రాల్లో 714 మంది భాతీయుల పేర్లు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారి జాబితా

జపాన్ చక్రవర్తితో ట్రంప్ భేటీ
ఆసియా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్ చక్రవర్తితోపాటు ఆ దేశ ప్రధాని షింజో అబేతో నవంబర్ 6న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాతో పాటు ఇతర అంతర్జాతీయ సమస్యలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ట్రంప్ 12 రోజులపాటు జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాల్లో పర్యటిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ చక్రవర్తితో ట్రంప్ భేటీ 
ఎప్పుడు : నవంబర్ 6
ఎక్కడ : జపాన్
ఎందుకు : ఆసియా పర్యటనలో భాగంగా

వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫేక్ న్యూస్’ 
2017 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫేక్ న్యూస్’ను కొల్లిన్స్ డిక్షనరీ నవంబర్ 3న లండన్‌లో ప్రకటించింది. ఈ పదాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా వాడారు. దీని వాడకం గత 12 నెలల్లో 365 శాతం పెరిగింది. సంచలనం కలిగించే రీతిలో అసత్య వార్తలను అందించడాన్ని ఫేక్ న్యూస్‌గా పేర్కొంటారు.

లెబనాన్ ప్రధాని రాజీనామా 
లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి తన పదవికి నవంబర్ 4న అనూహ్యంగా రాజీనామా చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాది వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో రాజకీయ పరిణామాలు మారడం, హరిరి హత్యకు దారి తీసే పరిస్థితులు నెలకొనడం, లెబనాన్‌తోపాటు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఆధిపత్యం పెరుగుతుండటం దీనికి కారణాలని భావిస్తున్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా హరిరి గతంలో పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతర్జాతీయ వాతావరణ సదస్సు
అంతర్జాతీయ వాతావరణ సదస్సు జర్మనీలోని బాన్‌లో నవంబర్ 6న ప్రారంభమైంది. వాతావరణ మార్పులతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న అనేక ద్వీప దేశాల్లో ఒకటైన ఫిజీ సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. ఈ కార్యక్రమం 12 రోజుల పాటు జరగనుంది. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరమని ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బైనిమరామా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులను భారత్ పెద్ద ముప్పుగా భావిస్తోందని మన దేశం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు.

AIMS DARE TO SUCCESS 

డిసెంబరు 2017 అంతర్జాతీయం 
బ్రెగ్జిట్ ప్రక్రియకు తుది గడువు 2020 Current Affairsయూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020, డిసెంబర్ 31ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ పేర్కొంది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై డిసెంబర్ 20న మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాల్ని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెగ్జిట్ ప్రక్రియకు తుది గడువు 
ఎప్పుడు : 2020 డిసెంబర్ 31
ఎవరు : ఈయూ 
ఎందుకు : ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు 

జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానంజెరూసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి.భారత్‌తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా తీర్మానం 
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎక్కడ : ఐరాసలో
ఎవరు : తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన భారత్ సహా 128 దేశాలు

ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలుఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిసెంబర్ 22న ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిం ది. ఆ దేశం నవంబర్ 29న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టడంతో భద్రతామండలి ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షల ఫలితంగా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు, విదేశాల్లోని శ్రామికుల నుంచి పొందే ఆదాయాలపై పరిమితులు ఉంటాయి.

గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదికCurrent Affairsభారత్‌లో అనారోగ్య, పర్యావరణ సమస్యలు తీవ్రంగా పెరగడానికి అత్యల్ప అక్షరాస్యతే కారణమని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాదిమందికి అక్షరజ్ఞానం లేకపోవడం వల్లే ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన లేదని పేర్కొంది. ఈ మేరకు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదికను డిసెంబర్ 14న విడుదల చేసింది.
2016 లో ప్రపంచవ్యాప్తంగా 44.7 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కాగా, దానిలో 20 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేశారు. ఈ- వేస్ట్ ఉత్పత్తిలో 7.2 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తూ చైనా మొదటి స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదిక
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : భారత్‌లో

ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్2017 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్ అనే పదాన్ని గుర్తిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ డిసెంబర్ 15న ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ప్రకారం యూత్‌క్వేక్ అంటే యువతరం ప్రభావం వల్ల లేదా వారి చర్యల కారణంగా వచ్చే సాంస్కృతిక, రాజకీయ, సామాజిక మార్పు’ అని అర్థం. ఈ ఏడాదిలో యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యాన్ని గుర్తిస్తూ భాషాపరమైన ఆసక్తి, దాని వాడకాన్ని పరిగణలోనికి తీసుకుని యూత్‌క్వేక్‌ను ఈ ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్ 
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు
ఎందుకు : యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యానికి గుర్తింపుగా

ట్వీటర్ న్యూస్ నెట్‌వర్క్ టిక్‌టాక్’వార్తల కోసం మొబైల్ ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడే వారిని దృష్టిలో ఉంచుకుని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీటర్ తాజాగా వార్తల సర్వీసులను ప్రారంభించింది. బ్లూమ్‌బర్గ్ మీడియాతో కలిసి టిక్‌టాక్’ పేరిట అంతర్జాతీయ న్యూస్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా బ్లూమ్‌బర్గ్ జర్నలిస్టులు రిపోర్ట్ చేసే వార్తలు, లైవ్ వీడియోలు ఉంటాయి. వీక్షకులు పంపే బ్రేకింగ్ న్యూస్ కంటెంట్‌ను కూడా బ్లూమ్‌బర్గ్ ఎడిటర్లు ధృవీకరించుకుని, ఎడిట్ చేసి అందిస్తారు. ఈ టిక్‌టాక్ న్యూస్ సర్వీసు కోసం బ్లూమ్‌బర్గ్ సంస్థ... ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, సోషల్ మీడియా అనలిస్టులు, ప్రోడక్ట్ డెవలపర్స్, ఇంజినీర్లు, డిజైనర్లు మొదలైన వారితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టిక్‌టాక్’ పేరిట అంతర్జాతీయ న్యూస్ నెట్‌వర్క్ 
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ట్వీటర్, బ్లూమ్ బర్గ్ 

జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా సమర్థించాయి. 
50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవద్దని కోరింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేం తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా 
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎక్కడ : ఐరాస భద్రతా మండలి
ఎందుకు : జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈజిప్టు తీర్మానాన్ని రూపొందించింది

ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతCurrent Affairs స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ డిసెంబర్ 7న ఆమోదించింది. ఇంతకుముందు ఈ బిల్లును పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43-12 మెజారిటీతో ఆమోదించగా.. తాజాగా ప్రతినిధుల సభ (దిగువ సభ) 146-4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేసి 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:ఏమిటి : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత 
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎక్కడ : ఆస్ట్రేలియా

సౌదీలో సినిమాలపై నిషేధం ఎత్తివేతసౌదీ అరేబియాలో 35 సంవత్సరాల కింద సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ డిసెంబర్11న ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వచ్చి 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయని ఛాందసవాదులు ఆందోళన చేయడంతో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు. ఇటీవల సౌదీలో మహిళలను డ్రైవింగ్, క్రీడామైదానాల్లోకి అనుమతించడం వంటి కీలక సంస్కరణలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ అరేబియాలో సినిమాలపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : రాజు మహ్మద్ బిన్ సల్మాన్
ఎందుకు : సామాజిక సంస్కరణల్లో భాగంగా

జెరూసలేం పాలస్తీనాదే : ఓఐసీఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ డిసెంబర్ 13న నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ డిక్లరేషన్‌లో తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొంటూ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరారు.
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను అమెరికా కాకుండా ఐక్యరాజ్య సమితి చేపట్టాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్
ఎందుకు : జెరూసలెంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని

విధ్వంసక ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియాCurrent Affairs అమెరికా, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు పెడచెవినపెడుతూ ఉత్తర కొరియా మూడోసారి అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో తాము పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా అవతరించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నవంబర్ 29న ప్రకటించారు. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఖండించాయి.
కొరియా పరీక్షించిన మూడో ఖండాంతర క్షిపణి అయిన హవాసాంగ్-15 భారీ అణు వార్‌హెడ్లను మోసుకెళ్తూ అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదు. ఇది 4,475 కి.మీ ఎత్తు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి సుమారు వేయి కి.మీ దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని చేధించిందని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : మూడో ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : ఉత్తర కొరియా

ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాలు కోతరోబోలు, ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే వెల్లడించింది. 46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను మెకిన్సే నవంబర్ 29న వెల్లడించింది. దీని వల్ల మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కోనున్నాయి. 
ఆటోమేషన్ వల్ల భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చని మెకిన్సే అంచనా వేసింది. అత్యధికంగా చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోగా అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాల కోత
ఎప్పుడు : 2030
ఎవరు : మెకిన్సే
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

ఉత్తర కొరియాను ధ్వంసం చేస్తాం : అమెరికాఉత్తర కొరియా చేస్తున్న వరుస క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే.. ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని ఇతర దేశాలకు పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా నవంబర్ 29న పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి విజయవంతమైన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈ విధంగా స్పందించారు. 
ఉత్తర కొరియా తాజాగా పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి, జూలైలో పరీక్షించిన హవాసాంగ్-14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరకొరియాను పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అమెరికా రాయబారి నిక్కీహేలి
ఎక్కడ : ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి సమావేశంలో
ఎందుకు : ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే

ట్రావెల్ బ్యాన్ కు అమెరికా సుప్రీం కోర్టు ఆమోదంఆరు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. దీంతో ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే ఇక్కడి వారికి సంబంధించినవారమని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉత్తర్వులు ముస్లింలపై వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ హవాయి, మేరీల్యాండ్ కోర్టులు స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు అమోదం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : అమెరికా సుప్రీం కోర్టు
ఎందుకు : అక్రమ వలసలు నిరోధించి ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా సెలైన్స్ బ్రేకర్స్’లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన సెలైన్‌‌స బ్రేకర్స్’ను టైమ్ మేగజీన్ 2017 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్ లైంగికంగా వేధించాడంటూ ఇటీవల పలువురు నటీమణులు, మోడళ్లు ప్రకటించడంతో తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్’ ద్వారా చాలా మంది మహిళలు తమ బాధలను పంచుకున్నారు. వీరినే సెలైన్స్ బ్రేకర్స్’గా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.
నేచర్ ఫొటోగ్రాఫర్ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి నరుటో’ ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి కొన్ని సెల్ఫీలు తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2017
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : సెలైన్స్ బ్రేకర్స్ (మీ టూ హ్యాష్‌ట్యాగ్)
ఎందుకు : తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్ ద్వారా వెల్లడించినందుకు

జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన ట్రంప్ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ 6న కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అమెరికా విదేశాంగ శాఖను ఆదేశించారు. జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం అని వారందరు కలిసే దేశాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు అమెరికా ముందుంటందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : జెరూసలేం మూడు గొప్ప మతాలకు ప్రధాన కేంద్రం అయినందున

No comments:

Post a Comment