AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday, 8 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 25 2018


*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జనవరి 25*🌅

*🏞సంఘటనలు*🏞

1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది

1918: రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.

1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు

1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.

1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.

1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.

1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.

2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.

*🌻🌻జననాలు*🌻🌻

1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత మరియు వ్యాసకర్త. (మ.1991)

1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.

1925: పి. అచ్యుతరాం, ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)

1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (మ.1999)

1968: నర్సింగ్ యాదవ్, ప్రముఖ తెలుగు సినీ నటుడు.

1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.

1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు మరియు నటీమణి.

*🌹🌹మరణాలు*🌹🌹

1953: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)

1991: పి.ఆదినారాయణరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. (జ.1914)

1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)

2016: కల్పనా రంజని ప్రముఖ మలయాళ సినిమా నటి (జ.1965)

*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷

🔻ఇండియా పర్యాటకం దినోత్సవం,

🔻ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం

🔻జాతీయ ఓటర్ల దినోత్సవము .

_*శుభోదయం*_    
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు...
నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి..
నిన్ను నీవు నిరూపించుకునేందుకు వచ్చాయి..
కష్టాలకు కూడా తెలియాలి..
నిన్ను సాధించడం కష్టమని. "

               *-అబ్దుల్ కలామ్*

       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" ఓటమి ఉన్నంతవరకు కాదు..!
ఊపిరి ఉన్నంతవరకు పోరాడు..!
ఓటమి నీ కాళ్ల దగ్గర..
గెలుపు నీ కళ్ల ముందర నిలిచిపోతాయి. "

 *🇮🇳జాతీయ జెండా వందనం - నియమాలు*🇮🇳

భా రత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకలు, ప్రైవేట్‌ కార్యమ్రాల్లోనూ జాతీయ జండా ఎగురవేయటం జరగుతోంది. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తుంటాము. కనుక జండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు యిలా వున్నాయి. 

*1) సాధారణ నియమాలు :*

- జాతీయ జెండా చేనేత (ఖాదీ, కాటన్‌, సిల్క్‌) గుడ్డతో తయారైంది కావాలి.

- జెండా పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో వుండాలి.

6300x4200 మి.మీ నుండి 150x100 మి.మీ వరకు మొత్తం 9 రకాల సైజ్‌ల జెండాలు పేర్కొనబడివి.

- ప్లాస్టిక్‌ జెండాలు వాడకూడదు. చిన్నసైజ్‌ పేపరు జండాలు వాడవచ్చు.

- పై నుండి క్రిందకి కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో వుండాలి.

- జెండాలోని తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం (24 ఆకులు) నీలం రంగులో వుండాలి.

- జెండాను ఎగురవేయటం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి.

- జెండాను నేలమీదగాని, నీటిమీదగానీ పడనీయకూడదు.

- జెండాను ఎగురవేసేటపుడు వడిగా (వేగంగా) ఎగురవేయాలి. దించేటప్పుడు నెమ్మదిగా దించాలి.

- జెండా పైన ఎలాంటి రాతలుగాని, ప్రింటింగ్‌ గాని వుండకూడదు.

- ఇతర జండాలతో కలిపి చేయాల్సివస్తే, జాతీయ జండా మిగిలిన వాటి కంటె కొంచెం ఎత్తుగా వుండాలి. ప్రధర్శనలో అయితే మిగిలిన వాటి కంటె మధ్యలో ఒకడుగు ముందు వుండాలి.

- జండా ఎప్పుడూ నిటారుగానే వుండాలి. క్రిందికి వంచకూడదు.

*2) పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో చెయ్యాల్సినవి.*

- పాఠశాలల మైదానంలో చతురస్రాకారంలో మూడు వైపుల విద్యార్థులను నిలబెట్టాలి. నాలుగోవైపు మధ్యలో హెడ్మాష్టర్‌, స్టూడెంట్స్‌ లీడర్‌, జెండా ఎగురవేసే వ్యక్తి (హెడ్మాష్టర్‌ కాకపోతే) మూడు స్థానాల్లో నిలబడాలి.

- విద్యార్థులను తరగతుల వారీగా 10 మందినొక స్క్వాడ్‌గా ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టాలి. క్లాస్‌ లీడర్‌ వరుస ముందు నిలబడాలి వరుసల మధ్యన, విద్యార్థుల మధ్యన 30 ఇంచ్‌ల దూరం వుండాలి.

- క్లాస్‌ లీడర్‌లు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్కూల్‌ లీడర్‌కి సెల్యూట్‌ చేయాలి. స్కూల్‌ లీడర్‌ వెళ్లి హెడ్మాష్టర్‌కి సెల్యూట్‌ చేయాలి. ఆ తర్వాత జండాను ఎగురవేయాలి. 

- జెండా ఎగురవేయటానికి ముందు స్కూల్‌ లీడర్‌ విద్యార్థ్థులను అటెన్షన్‌లో వుంచాలి. ఎగురవేసిన వెంటనే అందరితో సెల్యూట్‌ చేయించి కొద్ది సేపు అలా వుంచి ఆర్డ్‌ర్‌ చెప్పి అటెన్షన్‌లో వుంచాలి. 

- అటెన్షన్‌ వుంచి జాతీయ గీతం ఆలపించాలి, ఆతర్వాత ప్రతిజ్ఞ చేయాలి. హెడ్మాష్టర్‌ చెబుతుంటే విద్యార్థులు అనుసరించాలి. 

జాతీయ దినోత్సవాల్లో జెండా వందనం సందర్భంలో చేయాల్సిన ప్రతిజ్ఞ Rule No.2.3-VII లో పేర్కొనబడింది. 

"I Pledge allegiance to the National  Flag and to the Soveriegn Socialist Secular Democratic Republic for which it stands"

*అనుభవాలే ఆచరణకు మార్గాలు:*

జండావందనం నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్లు తరచుగా వార్తల్లో తెలుస్తున్నాయి. కాగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతోంది.

 Flag code of India సెక్షన్‌ v రూల్‌ నంబర్‌ 3.30 ప్రకారం రిపబ్లిక్‌ డే, ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా జెండాలో కొన్ని పూలు వుంచి ఎగురవేయవచ్చు.

- పాఠశాలల్లో జెండా ఎవరు ఎగురవేయాలనే విషయంలోనూ కొన్ని వివాదాలు జరుగుతుంటాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా కార్యనిర్వాహక బాధ్యులు (రాష్ట్రపతి, గవర్నర్‌, కలెక్టర్‌, ఎండిఓ, హెడ్మాష్టర్‌ మున్నగు) మరియు ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా విధాన నిర్ణాయక సంస్థల బాధ్యులు (ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ ఛైర్మన్‌, గ్రామ సర్పంచ్‌ మున్నగు వారు) వారి కార్యాలయాల్లో ఎగురేస్తుంటారు. పాఠశాలలు, కళాశాలలు విధాన నిర్ణాయక సంస్థలు కావు, కార్యనిర్వహణ సంస్థలే. కనుక పాఠశాలల్లో జనవరి 26న మరియు ఆగస్ట్‌ 15న జాతీయ జండాను హెడ్మాష్టరే ఎగురవేయాలి. 

- జాతీయ జెండాని ఎగరేసే పోల్‌ గట్టిగా వుండాలి. జెండాని పైకి లాగేందుకు అనువుగా పైకి వెళ్ళిన వెంటనే జెండా ముడి విడివడే విధంగా వుండాలి. కొన్ని చోట్ల జెండా కర్రపడిపోవటం, పైకి వెళ్లిన తర్వాత ముడివిడకపోవటం, మళ్లీ కిందికి లాగటం, కాషాయ రంగు కిందికి వుండటం వంటి తప్పులు జరుగుతుంటాయి. 

- సూర్యాస్తమయం వరకు పాఠశాలలోనే వుండి జెండాని జాగ్రతగా క్రిందికి దించి మడత పెట్టి బీరువాల్లో వుంచటం హెడ్మాష్టర్‌ బాధ్యతగానే చూడాలి. కొన్ని చోట్ల ఏదోటైమ్‌లో జెండా క్రింద పడటం, రాత్రికూడ ఎగురుతుండటం వంటి తప్పిదాల వలన హెడ్మాష్టర్‌లు సస్పెండ్‌ అయిన సందర్భాలు కూడా వున్నాయి. కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జండావందన కార్యక్రమం నియమాలను నిబద్ధతతో పాటించాలి.
❇❇❇❇❇❇❇❇❇❇❇

*🛑జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా....🛑*

 *ఓటు హ‌క్కే కాదు..బాధ్య‌త..!*

*- సామాన్యుడి ఆయుధం ఓటు*

*- ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకం*

*భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలచేత, ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం కలిగిన దేశం. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రముఖ, ఏకైక పాత్ర పోషించేదే ప్రజాస్వామ్యం. కానీ ఈ మధ్యకాలంలో నోటు కోసం ఓటు, మద్యం కోసం ఓటు ఇలా ఓటు హక్కు దుర్వినియోగం అవుతోంది. అంతే కాకుండా చాలామంది అసలు ఓటు హక్కుని వినియోగించుకోవడమే మానేశారు. ఆ రోజుని హాలిడేగా ఎంజారు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు ప్రతిఒక్కరి బాధ్యత. 'జాతీయ ఓటరు దినోత్సవం' సందర్భంగా ఈ కథనం.*

రాజకీయ ప్రక్రియలో మరింత మంది యువకులు భాగస్వాములయ్యేందుకు వీలుగా ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2011 సంవత్సరంలో నిర్ణయించింది. కేంద్ర న్యాయశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని మంత్రివర్గం తన ఆమోదముద్ర వేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 18 ఏండ్లు దాటిన యువతీ యువకులను గుర్తించే కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలు జరపాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రతియేటా పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లకు జనవరి 25 నాటికి ఫొటో గుర్తింపు కార్డులిచ్చేందుకు ప్రణాళికను రూపొందించారు.
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25న ప్రారంభించింది. 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని అవగాహన తెచ్చేలా.. ఓటు హక్కు విలువను చాటిచెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైననే ఆధారపడి ఉంది. దేశభవిష్యత్తును ఓటర్లు ప్రజాప్రతినిధుల చేతిలో పెడుతున్నారు. ఆ ప్రజాప్రతినిధులే కర్కోటకులైతే, వారే లంచగొండులు, భూబకాసురులైతే ఇక ప్రజాస్వామ్యం అధోగతే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల కమిషన్‌ కీలక పాత్ర వహిస్తోంది. ఏ రాజకీయ పక్షానికి తలవంచక, స్వతంత్రంగా తన విధులను నిర్వహిస్తోంది. కేంద్రస్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రజాస్వామ్య మనుగడ, పటిష్టం ఓటరుపై ఆధారపడి ఉన్నందున ఆ రెండు సంఘాలు ఓటర్లను చైతన్యం చేస్తున్నాయి.

*యూరప్‌ జనాభాకంటే ఎక్కువ..*

మన దేశంలో ఇప్పుడు సుమారు 84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో పాలుపంచుకున్న వారికన్నా ఎక్కువేనని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. దేశ ఓటర్ల సంఖ్య యూరప్‌ జనాభాకన్నా ఎక్కువ. 1951 నాటి తొలి లోక్‌సభ ఎన్నికలప్పుడు దేశ ఓటర్ల సంఖ్య 17 కోట్ల 32 లక్షలు ఉండేది. జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం కార్యక్రమాల నిర్వహణ కోసం పిలుపునిస్తూ స్థానిక అధికారులచే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఓటరుగా బాధ్యత నిర్వహించుటకే ఓటరు గుర్తింపు కార్డు పొందాలని, ఓటు హక్కును వినియోంచుకొని ప్రజాస్వామ్యాన్ని పటిష్టపర్చాలని పిలుపునిస్తోం ది. అదేరోజు ఓటర్ల దినోత్సవ వేడుకల్లో కొత్తగా నమోదైన ఓటర్లను సన్మానిస్తారు. ఓటర్ల దినోత్సవంరోజు బూత్‌స్థాయి అధికారి, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతిజ్ఞ చేసేందుకు పిలుపునిస్తారు. ఓటు నమోదు కు సంబంధించి రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల అఫిడవిట్‌ ఆధారంగా ఓటును నమోదు చేసుకోవాలి.

*అర్హతలు..*

18 సంవత్సరాలు నిండి దేశ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులే. మానసిక వికలాంగులు, ఎన్నిక ల నేరాల్లో పాల్పడి నిర్ణీత నేరాల్లో శిక్ష అనుభవించిన వారు మాత్రమే అనర్హులు.
ఓటు హక్కు కోసం.. 
ఓటరుగా నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఫార్మ్‌ 6 ఫారాన్ని నింపి నిర్ణీత ప్రదేశంలో ఫొటో అంటించి, వయసు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో కలిసి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు అందజేయాల్సి ఉంటుంది. విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు కూడా ఫార్మ్‌ 6ఏ ను నింపి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
అభ్యంతరాలు తెలియజేయాలంటే..
ఓ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఏవైనా అభ్యంతరాలుంటే ఫార్మ్‌ 7ను నింపి ఈఆర్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండడం, తప్పుడు వివరాల నమోదు వంటి విషయాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

❇❇❇ ❇❇❇❇

 *ఓటు విలువ తెలుసుకో!*

జనాభీష్టాన్ని ప్రతిఫలించినపుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. తమ మనోభావాలను ప్రకటించేందుకు జనం చేతిలో ఉన్న పదునైన ఆయుధం ‘ఓటు’. రాజకీయ పార్టీల జాతకాలను మార్చే సత్తా తమకు ఉందని మన దేశంలో ఓటర్లు ఇప్పటికే పలుసార్లు నిరూపించారు. మహామహానేతలను మట్టికరపించి, ఓటు ద్వారా మార్పు తథ్యమని జనం తమ వివేకాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమంటే పెద్ద యజ్ఞమే. పాలనావ్యవస్థపై అసంతృప్తి పెల్లుబికినపుడు అధికారంలో ఉన్న నేతలను గద్దె దింపిన ఘనత మన ఓటర్లకు ఉంది. అయినా, ఇప్పటికీ మన దేశంలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతోంది. కొన్నివర్గాల వారు మాత్రమే పోలింగ్ పట్ల ఉత్సాహం చూపుతున్నారు. ‘ఓటు వేయడం కనీస బాధ్యత’ అని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రచారం చేస్తున్నప్పటికీ పట్టణ వాసుల్లో మాత్రం పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. పల్లె నుంచి పార్లమెంటు వరకూ ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న నినాదం ఇపుడు మార్మోగుతోంది. ఓటుహక్కుపై అన్ని వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు ఏటా జనవరి 25న ‘జాతీయ ఓటరు దినోత్సవం’ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆడియో, వీడియో ప్రదర్శనలతో పాటు క్విజ్, వ్యాసరచన, ఆటల పోటీలు, వీధి నాటికలు, పాటల పోటీలు, పలు కళాప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) వినియోగంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.స్థానిక సంస్థలు, చట్టసభలకు ఎన్నికలు జరిగినపుడు ఓటర్లంతా పోలింగ్‌కు వెళ్లాలన్న ఉద్దేశంతో పోలింగ్ రోజును సెలవుదినంగా ప్రకటిస్తున్నారు. విద్యాధికులు, పట్టణ వాసుల్లో చాలామంది పోలింగ్ రోజును విశ్రాంతి దినంగా భావిస్తూ ఓటు వేసేందుకు మాత్రం సుముఖత చూపడం లేదు. ఈ ధోరణిలో మార్పు తెచ్చేందుకే ‘ఓటరు దినోత్సవం’ పేరిట పలు అవగాహన కార్యక్రమాలను ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపు కార్డులను ఈరోజున అందజేస్తారు.అధికారంలో ఉన్న నేతలు పాలనలో విఫలమైనపుడు మార్పు రావాలని జనం కోరుకుంటే అందుకు ఏకైక సాధనం ఓటు. తమకు నచ్చిన వారికి అధికారం కట్టబెట్టి తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఓటు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. పాలకులపై అసంతృప్తి ఉన్నపుడు, మార్పు అనివార్యమని భావించినపుడు ఓటర్లంతా విధిగా పోలింగ్ బాట పట్టాలి. ‘మనం ఓటు వేయకపోతే ఏం?..’ అన్న అలసత్వం పనికిరాదు. ఎన్నికల వ్యవస్థలో ప్రతి ఓటూ విలువైనదే. మన అభిప్రాయాలను తెలియజేసేందుకు విధిగా ఓటు వేయాలన్న చైతన్యం ప్రతి వ్యక్తిలో రావాలి. ఓటుహక్కు కలిగి ఉండడం ఈ దేశ పౌరుడిగా ఒక గౌరవం, ఓటు వేయడం కనీస బాధ్యత అని ఓటర్లంతా గుర్తించాలి. ప్రజల గళం వినిపించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ఓటర్లుగా నమోదై, ఓటు వేయడం తప్పనిసరి అని అందరూ ప్రతిజ్ఞ చేయాలి. విజ్ఞత కలిగిన భారతీయ ఓటర్లు పలుసార్లు చారిత్రక నిర్ణయాలు తీసుకుని విదేశాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పరిపాలన సజావుగా సాగాలన్నా, సరైన నేతలకు పగ్గాలు ఇవ్వాలన్నా- అది ఓటు ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని ‘ఓటరు దినోత్సవం’ సందర్భంగానైనా అందరూ మననం చేసుకోవాలి.

*పోలింగ్ బాటలో మగువలు..*

‘ఓటమి గుణపాఠంతో తప్పులు సరిదిద్దుకొని విజయం సాధించు.. విజయం ఇచ్చిన అనుభవంతో మరిన్ని శిఖరాలు చేరేందుకు ప్రణాళికాబద్ధంగా నడుచుకో..’-అన్న మాటలు అనేక దేశాల్లో మహిళలు ఓటు హక్కు సాధించుకోవడం ద్వారా ఆచరణ సాధ్యమని తేటతెల్లమైంది. పురుషాధిక్యత కారణంగా ఇన్నాళ్లూ వివక్షకు గురైన మహిళల విషయంలో ఇపుడు ప్రపంచం దృష్టి మారుతోంది. మత ఛాందసవాదానికి ఆలవాలమైన ముస్లిం దేశాల్లో సైతం మహిళలకు ఇపుడు ఓటుహక్కు కల్పిస్తున్నారు. కరడుకట్టిన మత విశ్వాసాలకు నిలయమైన సౌదీ అరేబియాలో ఇటీవల మహిళలకు ఓటు హక్కు కల్పించడమే గాక, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా తొలిసారిగా అవకాశం కల్పించారు. గత నెలలో సౌదీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 978మంది మహిళలు పోటీ చేయగా, 18మంది వివిధ పదవులకు ఎన్నికయ్యరు.

*ఆ ఘనత ఇంగ్లాండ్‌దే..*

ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటుహక్కు కల్పించాలన్న ఉద్యమం ఇంగ్లాండ్‌లో పుట్టింది. స్ర్తిలకు ఓటు హక్కు కల్పించాలని బ్రిటీష్ పార్లమెంట్‌లో 1867లో జాన్ సువార్ట్‌మిల్ ప్రతిపాదించగా 194 మంది ఎంపీలు వ్యతిరేకించారు. 73 మంది ఎంపీలు మాత్రమే మద్దతు తెలపడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. 1893లో బ్రిటీష్ వలస రాజ్యమైన న్యూజిల్యాండ్ తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించి యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. మహిళలకు ఓటుహక్కు కల్పించాలన్న డిమాండ్‌తో 1897లో ‘నేషనల్ యూనియన్ ఆఫ్ ఉమెన్స్ సఫ్రంజ్ సొసైటీస్’ పేరిట మిలిసెంట్ పౌసెట్ అనే మహిళ ఒక సంస్థను ఏర్పాటుచేశారు. ఓటుహక్కు సంపాదించేందుకు ఉద్యమాలే శరణ్యం అంటూ 1903లో ఎమ్మిలీనె ఫంకృస్ట్ అనే మహిళ ‘ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’ను ఏర్పాటు చేశారు. ఆమె నుంచి స్ఫూర్తి పొందిన అమెరికా మహిళలు ఓటుహక్కు సాధనకు 1914లో ‘కాంగ్రెషనల్ యూనియన్’ను ఏర్పాటుచేసి, రెండేళ్ల తరువాత దానిని ‘నేషనల్ ఉమెన్స్ పార్టీ’గా మార్చారు. తమ ఉద్యమంలో భాగంగా మహిళలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’ ముందు ఆందోళనలు చేపట్టారు.

**1918లో ఆస్తి కలిగి, 30 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు బ్రిటన్‌లో తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. 1928లో 21 ఏళ్లు నిండిన స్ర్తిలందరికీ ఓటుహక్కు కల్పించారు. మహిళల ఆందోళనల ఫలితంగా అమెరికా ప్రభుత్వం 1920లో 19వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఓటుహక్కు కల్పించింది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2020 సంవత్సరంలో ప్రముఖ మహిళ ఫొటోతో పది డాలర్ల కరెన్సీ నోటు విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకూ అమెరికా కరెన్సీ నోట్లు లేదా నాణాలపై మహిళా నేతల చిత్రాలు లేకపోవడం గమనార్హం. 1929లోనే జర్మనీ, డెన్మార్క్,కెనడాలో మహిళలకు ఓటుహక్కు కల్పించారు.

**1944లో ఫ్రాన్స్‌లో, 1950లో భారత్‌లో మహిళలకు ఓటుహక్కు కల్పించారు. ఒకప్పుడు భూటాన్‌లో ఇంటికి ఒక ఓటు మాత్రమే ఉండేది. పురుషులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనేవారు. 2008లో లింగభేదం లేకుండా వయోజనులందరికీ అక్కడ ఓటు హక్కు కల్పించారు. కువైట్‌లో 2005లో మహిళలకు ఓటు హక్కు కల్పించగా, 2009 ఎన్నికల్లో తొలిసారిగా నలుగురు స్ర్తిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు.
❇❇❇❇❇❇❇❇❇❇❇

*♦మన పురాణపురుషులు♦*

*నలుడు*

షట్చక్రవర్తులు వరుసగా హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్త వీర్యార్జునుడు. అంటే షట్చక్రవర్తులలో రెండవాడు నలుడు.  పేరెన్నికగన్న పురాణ చక్రవర్తులు వీరు!

            నలుడు నిషధ దేశానికి రాజు. వీరసేనుని కొడుకు. ఉద్యానవనంలో నలుడు విహరిస్తూ రావడంతో ఆ పక్కనున్న సరస్సులోని హంసల గుంపు ఎగిరిపోయింది. చిక్కిన ఒక్క హంస తనని విడిచి పెట్టమని కోరింది. అలా విడిచి పెడితే మీరు వలచిన దమయంతికి మీ గురించి చెపుతానంది. దాంతో హంసను విడిచి పెట్టాడు నలుడు. హంస విదర్భకు వెళ్ళి దమయంతికి సంగతంతా చెప్పింది. దమయంతికి ప్రేమ కలిగేలా చేసింది. స్వయం వరానికి రమ్మన్న ఆహ్వానాన్ని మోసుకొచ్చి నలునికిచ్చింది.

            నలుని దమయంతి వరించనున్నదని తెలిసి ఇంద్రుడూ వరుణుడూ వాయువూ అగ్నీ దేవుళ్ళు నలుని వద్దకు వెళ్ళారు. చేస్తానని మాటయిస్తే చెప్తామని మాట తీసుకున్నారు. నలుడు మాట ఇచ్చాడు. మా నలుగురిలో ఎవరినైనా వరించమని నువ్వే చెప్పి ఆమె మనస్సు మరల్చమని కోరారు. నలుడు నలిగిన మనసుతో ఇంద్రుడు ఇచ్చిన ఉంగరం ధరించి దమయంతి ఉన్న అంతఃపురంలోకి అదృశ్యంగా  ప్రవేశించాడు. మనసు చంపుకొని దిక్పాలకుల కోరికని తను ప్రేమించిన దమయంతి ముందు పెట్టాడు. దమయంతి తన మనసు మారదని చెప్పింది.

            స్వయవరంలో నలుని పక్కన నలుగురు నలుని రూపంలోనే కూర్చున్నారు ఇంద్రాది దేవతలు. నలుని ప్రేమనే గెలిపించింది దమయంతి. సరస్వతీ దేవిని ప్రార్థించి నలుని మెడలో హారం వేసి గెలిపించుకుంది. దేవతలు ఈర్ష్యపడ్డా నలుడు దమయంతిని పెళ్ళాడి తన రాజ్యానికి తీసుకు వచ్చాడు. వారి సంతోషానికి చిహ్నంగా ఓ కూతుర్నీ కొడుకునీ కూడా కన్నారు.

            ఒకరోజు నలుడు అసుర సంధ్యవేళ నిద్రపోయాడు. దాంతో కలి అతనిలో ప్రవేశించాడు. ఇంకేముంది? నలుడు వ్యసనాలకు లోనయ్యాడు. పిన తండ్రి కొడుకుతో జూదం ఆడి ఓడిపోయాడు. పుష్యమిత్రుని మోసానికి రాజ్యం వదిలి అడవుల పాలయ్యాడు నలుడు. పిల్లల్ని తండ్రి దగ్గరకు పంపి దమయంతి నలుని వెంట వచ్చింది. ఎన్నో కష్టాలకోర్చింది. తిండికి కూడా కష్టమయింది. మీది వస్త్రాన్ని పక్షుల మీదికి విసరి పట్టుకోవాలని చూసి ఉన్న వస్త్రాన్నీ కోల్పోయాడు.బట్టకూ కష్టమయింది. దమయంతి పడుతున్న కష్టాలను చూడలేని నలుడు తనే దూరమయితే ఆమె పుట్టింటికి పోయి ఊరట పొందుతుందని ఆశించాడు. భార్య నిద్రలో ఉండగా దుఃఖిస్తూ వదిలి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ మంటల్లో చిక్కుకున్న కర్కోటకుడనే పామును రక్షించాడు. అదే పాము కాటుకు లోనయి రూపం కోల్పోయి కురూపి అయినాడు. ఇప్పుడు నిన్ను ఎవరూ గుర్తు పట్టరు, అందువల్ల నీకు మేలే జరుగుతుందని కర్కోటకుడు చెప్పాడు. మంచి రోజులొచ్చినప్పుడు నన్ను తల్చుకుంటే వస్త్రం వస్తుంది, అది కప్పుకుంటే యధా రూపు వస్తుందని చెప్పాడు. ఋతు పర్వుడనే రాజు దగ్గరకు వెళ్ళమన్నాడు. నలుడు అలా వెళ్ళి బాహుకుడనే పేరుతో వంటవాడిగా చేరాడు. నలుడు అద్భుతంగా వంటచేసి రాజుకు దగ్గరయ్యాడు. కొన్నాళ్ళకు భార్య దమయంతికి ద్వితీయ స్వయం వరమని విన్నాడు. ఋతుపర్వుడు ఆ స్వయంవరానికి వెళ్ళడానికి సమయం లేదు, వంద యోజనాలు. అశ్వహృదయమనే విద్య తెలిసిన నలుడు ఆ పనికి పూనుకున్నాడు. వేగం తెలియకుండా వెళ్ళడం చూసి ఋతుపర్వుడు అశ్వహృదయం నేర్పమని ప్రతిగా అక్ష హృదయం విద్య నేర్పాడు. దాని వల్ల నక్షత్రాలను నిముషాల మీద లెక్క పెట్టొచ్చు. విదర్భ చేరారు. ఆ రాత్రి దాసి తెచ్చిన తన బిడ్డల్ని చూసి నలుడు దుఃఖించాడు. భార్యని అడవిలో వదిలి వెళ్ళడం ధర్మమా అని దమయంతి తన తండ్రిని ఉద్దేశించి అన్నా అది నలునికే తాకింది. ఆమె సుఖపడుతుందని వదిలి వెళ్ళాడను కోవచ్చు గదా?, అయినా రెండో పెళ్ళికి సిద్ధమైపో తగునా అన్నాడు. కురూపిగా ఉండి గుర్తు పట్టలేక పోయినా బాహుకుడే నలుడని దమయంతి గుర్తించింది. విషయం తెలిసి ఋతుపర్వుడు భీష్మకునితో  వచ్చి అడిగితే నలుడు తెలీదన్నాడు. కలి నలునిలోంచి బయటకు వచ్చి చెప్పడం – నలుని ద్యానం – వస్త్రం కప్పుకోవడంతో నలునికి అసలు రూపు వచ్చింది. నలుడు దమయంతి ఒక్కటయ్యారు. గెల్చిన రాజ్యాన్ని ఏలుకున్నారు!.
♦♦♦♦♦♦♦♦♦♦♦

*✅ తెలుసుకుందాం ✅*

*🍅టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల?🍅*

✳వృక్షశాస్త్రం ప్రకారం టమాటా కూడా మిర్చి, వంకాయ, ఉమ్మెత్తకాయ కుటుంబమైన సొలనేసీ (solanaceae)కి చెందినదే. దీని శాస్త్రీయ నామం సొలానమ్‌ లైకోపెర్సికమ్‌. టమాటా పైపొర పలుచని సెల్యులోజ్‌ నిర్మితం. ఇందులో గట్టిగా కాకున్నా, దృఢంగా ఉండే లైకోపీన్‌ (lycopene) అనే గ్త్లెకోప్రోటీను ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ కేవలం తక్కువ సంఖ్యలో మోనోశాకరైడ్లు ఉన్న చక్కెరలను మాత్రమే అరాయించుకోగలవు. కానీ అధిక సంఖ్యలో చక్కెరలున్న సెల్యులోజ్‌లాంటి పాలీశాకరైడులను జీర్ణం చేయలేదు. టమాటా పండు చర్మం పాలీశాకరైడులు, గ్త్లెకోప్రొటీన్ల వంటి పెద్ద అణువులతో నిర్మితమయినందున అది జీర్ణం కాకుండా అలాగే పీలికలుగా విసర్జితమవుతుంది.
❇❇❇❇❇❇❇❇❇❇❇

*✍🏼 నేటి కథ ✍🏼*

*సన్యాసి - కౄరజంతువులు*

పచ్చని కొండల్లో ఒకానొకప్పుడు ఒక సన్యాసి నివసించేవాడు.

ఆయన ఆత్మ శుధ్ధంగాను, హృదయం స్వచ్ఛంగాను ఉండేవి.

నేలమీద నడిచే జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నీ జంటలు జంటలుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడేవి. ఆయన వాటితో ప్రేమగా సంభాషించేవాడు. అవి సంతోషంగా ఆయన మాటలు వినేవి. ఆయన చుట్టూ మూగేవి. చివరికి చీకటి పడ్డాక, ఆయన తన దీవెనలతో వాటిని గాలికీ, అడవికి అప్పగించేంత వరకు అక్కడి నుండి కదిలేవి కావు.

ఒకనాటి సాయకాలం ఆయన ప్రేమ గురించి చెబుతుండగా చిరుత పులి ఒకటి తల ఎత్తి అడిగింది ఆయనను- "మీరు మాకు ప్రేమించడం గురించి చెబుతున్నారు. మరి, చెప్పండి స్వామీ, మీ జంట ఏదీ?" అని.

"నాకు జంటదంటూ లేదు" అన్నాడు సన్యాసి.

అది వినగానే జంతువుల,పక్షుల సమూహం నుండి ఆశ్చర్యంతో కూడిన అరుపులు, ఊళలు, కూతలు వెలువడ్డాయి. అవన్నీ తమలో తాము మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి- "ఈయన మనకు ప్రేమించటం గురించీ, కలిసి జీవించటం గురించి చెబుతున్నాడు. జంటదే లేని ఈయనకు అవన్నీ ఏం తెలుసని?" అని.

తిరస్కారంగా అవన్నీ ఒక్కొక్కటిగా లేచి తమ దారిన తాము వెళ్ళిపోయాయి.

ఆ రోజు రాత్రి సన్యాసి ఒంటరిగా తన గుడిశెలో చాపమీద బోర్లా పడుకొని, బిగ్గరగా ఏడ్చాడు.
❇❇❇❇❇❇❇❇❇❇❇

*🤘 నేటి సుభాషితం🤘*

*నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే...ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.*

❇❇❇❇❇❇❇❇❇❇❇

*👬 నేటి చిన్నారి గీతం 👬*

*నా ముద్దులు*

పచ్చ పచ్చగా పెరిగే
మొక్కకు నా ముద్దులు, 
చక్క చక్కగా ఎదిగే 
చెట్టుకు నా ముద్దులు...
తియ్య తియ్యగా పలికే
చిలకకు నా ముద్దులు,
రయ్యి రయ్యినా సాగే 
ఉడతకు నా ముద్దులు...
ముద్దు ముద్దుగా కదిలే 
పిల్లికి నా ముద్దులు,
చిలిపి చిలిపిగా ఆడే
కుక్కకు నా ముద్దులు...
మంచి మంచిగా ఉంటే 
అందరికీ ముద్దులు,
పిచ్చి పిచ్చిగా ఉంటే 
ఎవరికైన గుద్దులు.
❇❇❇❇❇❇❇❇❇❇❇

*💎 నేటి ఆణిముత్యం 💎*

అనఘునికైన జేకుఱు ననర్హునిగూడి చరించినంతలో
మన మెరియంగ నప్పు డవ మానము, కీడు ధరిత్రియందు; నే
యనువుననైనదప్పవు; య దార్థము; తా నది యెట్టులన్నచో
నినుమునుగూర్చి యగ్నినల యింపదె సమ్మెట పెట్టు? భాస్కరా!

*భావం:*

ఇనుముతో కూడిన అగ్నికి సమ్మెటపోటు కల్గినట్లు, దుష్టునితో కలిస్తే, మరే సంబంధం లేకపోయినా, వానితో కలసి ఉన్నంతమాత్రానే, ఆ దుష్టునికి వచ్చే కీడు వానితో ఉన్నవారికి కూడా వచ్చును.

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  25, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 8 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న ఉదయం 8 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 19 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : బవ
వర్జ్యం :
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 56 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 5 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 7 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 20 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 6 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 51 ని॥ వరకు)
రాహుకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 16 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 28 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 7 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మేషము

🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" విజయ గాథల వల్ల సందేశాన్ని మాత్రమే పొందుతావు. అదే వైఫల్య గాధల వల్ల ఎలా విజయం సాధించాలో తెలుసు కోగలుగుతావు. "

                   _*-అబ్దుల్ కలాం*_

       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
"  నీ కంటికి కనిపించే ప్రతివారూ మంచివారని గుడ్డిగా నమ్మకు!
వారికి చేరువగా ఉండి చూడు సగానికి సగం మంది వేషగాళ్లే సుమా! "

         💦🐬🐥🐳💦
*🏀ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పరిధిలోకి ఆయుష్*
సీఎంకు ప్రతిపాదనలు పంపిన వైద్యారోగ్యశాఖ

 తెలంగాణ: సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తూనే.. సంప్రదాయ ఆయుష్ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నది. ఆయుష్ విభాగంలోని ఆయుర్వేదిక్, యునానీ, హోమియోపతి, నాచురోపతి వైద్య చికిత్సలకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దీనిపై రూపొందించిన ప్రతిపాదనలను వైద్యారోగ్యశాఖ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు నివేదించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆయుష్ చికిత్సలకు చెల్లించే రుసుముల వివరాలను సీఎం కేసీఆర్ పరిశీలించాక అమలుపరుచనున్నట్టు అధికారులు వెల్లడించారు.🌐

*🏀మే 6న ఎంసెట్ ఉండదు*

*నీట్ కోసం ఆ రోజున విరామం*

🏀 తెలంగాణ: ఈ ఏడాది మే 6న ఎంసెట్ పరీక్షలుండవని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మే 2, 3, 4, 5,7 తేదీల్లో యథావిధిగా ఆన్లైన్ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. మెడికల్ సీట్ల భర్తీ కోసం మే 6న జాతీయస్థాయిలో నీట్-2018 పరీక్ష జరుగుతుంది, కాబట్టి ఆ రోజున మాత్రం తాము ఎంసెట్ పరీక్షలు నిర్వహించబోమని, ఈ ఒక్కటి తప్ప గత నెలాఖరులో విడుదల చేసిన ఎంసెట్ షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు.

*-🌐మార్చి ఆఖరువరకు నీట్ దరఖాస్తుల స్వీకరణ*

జాతీయ స్థాయి నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) రాత పరీక్షను మే 6న నిర్వహించనున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం చేపట్టనున్న నీట్ను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ద్వారా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ఉన్న 55 వేల సీట్ల భర్తీకి నిర్వహించే నీట్ పరీక్షకు మార్చి నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.🏀

*⛔తెలంగాణకు ఆరు శౌర్య పతకాలు*

*-ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట పోలీస్ పతకాలు*

*-13మందికి ఉత్తమ పోలీస్సేవా పతకాలు*

*-అవార్డులు పొందిన పోలీసుల జాబితా*

*-విడుదలచేసిన కేంద్ర హోంశాఖ*

 ✳తెలంగాణ: పోలీస్శాఖలో విశిష్ట సేవలు అందించిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రకటించింది. ఈ మేరకు ఆ జాబితాను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. 

🅾పోలీస్ శౌర్య పతకం (పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ), రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవాపతకం, ఉత్తమ పోలీస్ సేవా పతకం సహా మొత్తం మూడు క్యాటగిరీల్లో కలిపి 795 మందికి అవార్డులు దక్కాయి. 

వీరిలో 75 మందికి రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవాపతకం, 

107 మందికి పోలీస్సేవా శౌర్య పతకం, 

613 మందికి ఉత్తమ పోలీస్ సేవా పతకాలు దక్కాయి.

 తెలంగాణ రాష్ట్రం నుంచి పోలీస్ శౌర్య సేవా పతకానికి (గ్యాలంట్రీ) ఆరుగురు,

 రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకానికి ఇద్దరు,

 ఉత్తమ పోలీస్ సేవా పతకానికి 13 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు.

*🔵పోలీస్ శౌర్య పతకం పొందినవారు*

బీ శ్రీరాములు, వెంకట శ్రీనివాస్రెడ్డి (ఏఏసీలు), జీ సురేశ్, ఎం మురళి, పీ లక్ష్మణుడు, హరీశ్ (జూనియర్ కమాండెంట్లు).

*🏀రాష్ట్రపతి విశిష్ట పోలీస్ సేవా పతకం పొందిన వారు* 

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, హైదరాబాద్కు చెందిన డీఎస్పీ నరేందర్ నారాయణరావు చుంగి.

*🔵ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందిన వారు*
ఎం రమేశ్ (గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్), డీ శివప్రసాద్రెడ్డి (అసిస్టెంట్ కమాండెంట్, టీఎస్ ఎస్పీ, రంగారెడ్డి), పీ వీరస్వామి (అసిస్టెంట్ కమాండెంట్, హైదరాబాద్), ఎస్ రంగారావు (ఏసీపీ, హైదరాబాద్), తుల్జారాం నరేందర్సింగ్ (డీఎస్పీ, హైదరాబాద్), చెట్లూరు శ్రీనివాసశాంతి (ఇన్స్పెక్టర్, హైదరాబాద్), గెద్దిపల్లి రణవీర్రెడ్డి(ఇన్స్పెక్టర్, హైదరాబాద్), పల్లే శంకర్రెడ్డి (ఎస్సై, హైదరాబాద్), ఎండీ ఫయాజ్ అహ్మద్షరీఫ్ (ఆర్మ్డ్ రిజర్వు ఎస్సై, హైదరాబాద్), వేమూరి శివానందరావు (హెచ్సీ, హైదరాబాద్), రాథోడ్ రోహిదాస్ నాయక్ (అసిస్టెంట్ ఆస్సాల్ట్ కమాండర్, హెచ్సీ, హైదరాబాద్), సీ శ్రీనివాస్ (జూనియర్ కమాండో పీసీ, హైదరాబాద్), ఎం సిద్దయ్య (హెడ్కానిస్టేబుల్, హైదరాబాద్).🌐

*🏀వర్సిటీ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు!*

*11 యూనివర్సిటీల్లో 1,061 ప్రొఫెసర్ పోస్టులు..*

 *జూన్ నాటికి నియామకాల పూర్తి*

 🅾తెలంగాణ: రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 1,061 అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

వీటిలో ప్రొఫెసర్ పోస్టులు 103, 

అసోసియేట్ ప్రొఫెసర్లు 266, 

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 692 ఉన్నాయి. 

ఈ విషయం పేర్కొంటూ పోస్టుల భర్తీకి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లకు మార్గదర్శకాలు పం పారు. 

దీంతో వీసీలు నోటిఫికేషన్ల జారీపై దృష్టి సారించారు. సబ్జెక్టులు, క్యాటగిరీల వారీగా ప్రకటించిన ఈ పోస్టులను రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేస్తారు. అనం తరం పాలక మండలి సభ్యులతో చర్చించి నోటిఫికేషన్ల షెడ్యూల్ను విడుదల చేయాల్సి ఉం టుంది.

 ఈ ప్రక్రియలన్నీ నిర్వహించి జూన్ నాటికి పోస్టుల భర్తీని పూర్తి చేసే అవకాశం ఉంది.

*🏀ప్రతీ మండలంలో ప్రణాళికా గణాంకాధికారులు!*

🔵 తెలంగాణ: ప్రతీ మండలంలో ప్రణాళికా గణాంకాధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.

 డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించాలనే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

రాష్ట్రంలో 584 మండలాలు ఉండగా, 121 మండలాల్లో మాత్రమే మండల ప్రణాళికా గణాంకాధికారులు పనిచేస్తున్నారు. 

463 మండలాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.🔵

*నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *25--01--2018* 
*గురు వారము*

*********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం:-* *తెలంగాణా రాష్ట్రసాధన ఉద్యమం-II*

*సమయం*:- *10.30 ని,,ల నుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*

*విషయం*:-  *జైవిక సంవర్గీకరణము*

*సమయం*:- *11.30ని,,

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *భౌతికశాస్త్రం*

*విషయం*:- *ఎర్త్ కేక్స్ అండ్ కాజెస్*

*సమయం*:- *2.00pm

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:-  *హిందీ*

*విషయం*:- *సాహసి సునీత - II*          

*సమయం*:- *2.45 pm 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*:  *గణితం*

*విషయం*:- *ప్రాక్టికల్ జామెట్రీ - I*

*సమయం*:- *3.40 pm

          ★★★★★★★
📋✒ *నవోదయ ఆరవ తరగతి ప్రవేశపరీక్ష వాయిదా!*

📝 *నవోదయ కేంద్రియ విద్యాలయ సమితి ఆరవ తరగతిలో 2018-19 విద్యా సంవత్సరానికి గానూ వచ్చే నెల 10న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష వాయిదా పడినట్లు నవోదయ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నవోదయ విద్యాలయ కేంద్రియ పాలన పరమైన కారణవల్ల ప్రవేశ పరీక్షలు వాయిదా వేసినట్లు తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.*
♦🏆 
 _________________________________

👨🏻‍🏫 *ఎన్‌ఎంఎంఎస్‌కు 3,485 మందికి అర్హత*

❇ *ఈనాడు, హైదరాబాద్‌: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పథకానికి తెలంగాణ నుంచి మొత్తం  3,485 మంది అర్హత సాధించారు. వారిలో చివరకు 2,921 మందిని ఎంపిక చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఈ ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు. నెలకు రూ. 500 చొప్పున 9వ తరగతి నుంచి ఇంటర్‌ పూర్తయ్యేవరకు అందజేస్తారు. 192 ఆదర్శ పాఠశాలల నుంచి 1,131 మంది అర్హత సాధించడం గమనార్హం.*
 _________________________________

🏛👨🏻‍🏫 *దాతలకు యాతనే! *

⚠ *బడి విరాళం భారీగా పెంపు*

🦋🌺 *ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలకు విరాళాలు ఇచ్చి తాము కోరుకున్న వారి పేరు పెట్టుకోవాలంటే ఇకమీదట కష్టమే. ఇందుకోసం భారీగా విరాళం ఇవ్వాల్సిందే. గతంలోని విరాళాల మొత్తాన్ని 5 నుంచి 10 రెట్లు పెంచుతూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు/స్థలం ఇవ్వడం, భవనాలు నిర్మించడం ద్వారా సర్కారు బడులకు దాతలపేర్లు పెట్టుకునేలా 2004లో అప్పటి ప్రభుత్వం జీఓ 162 జారీ చేసింది. ఆ ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వరసగా రూ. 5 లక్షలు, రూ. 7.5 లక్షలు, రూ. 10లక్షలు నగదు లేదా సమానమైన స్థలం ఇస్తే చాలు. దాన్ని తాజాగా వరసగా రూ. 25 లక్షలు, రూ. 50లక్షలు, రూ.కోటికి పెంచారు.*

🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" విజయ గాథల వల్ల సందేశాన్ని మాత్రమే పొందుతావు. అదే వైఫల్య గాధల వల్ల ఎలా విజయం సాధించాలో తెలుసు కోగలుగుతావు. "

                   _*-అబ్దుల్ కలాం*_

       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
"  నీ కంటికి కనిపించే ప్రతివారూ మంచివారని గుడ్డిగా నమ్మకు!
వారికి చేరువగా ఉండి చూడు సగానికి సగం మంది వేషగాళ్లే సుమా! "

         💦🐬🐥🐳💦
ఈ రోజు జికె 

1)👉 ఇస్రో ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
A: *K.శివన్*

2)👉 ఇటీవలి సర్వే ప్రకారం అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వార్తా పత్రిక ఏది?
A: *దైనిక్ జాగరణ్(7.03 కోట్లు)*

3)👉 PSLV-C40 ద్వారా ఇస్రో ఎన్ని ఉపగ్రహాలను  అంతరిక్షంలోకి పంపింది?
A: *31 ఉపగ్రహాలు*

4)👉 లింమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరిన ముంబాయిలోని *మాతుంగా* రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏమిటి?
A: *దేశంలోని తొలి మహిళా రైల్వే స్టేషన్*

5)👉 12వ దక్షిణాసియా క్రీడల మాస్కట్ ఏమిటి?
A: *తిఖోర్*
                   
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
 *🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*🔹సుభాషిత వాక్కు*🔹

*"మనిషి ఎక్కడ నమ్మకాన్ని కోల్పోతాడో,    అక్కడ ప్రేమని కూడా కోల్పోతాడు."*

*"The art of conversation lies in listening."*   

  *🌷మంచి పద్యం🌷*

*ఆచి తూచి పలుకు ఆదరమ్ము కలుగు*
*మాట వలన కలుగు మంచి విలువ*
*మంచి పలుకు చూడ మంచి బంగారము*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* 

*అనాలోచితంగా మాట్లాడకుండా, ఆలోచించి మాట్లాడినప్పుడే మనిషికి గౌరవం కలుగుతుంది. మంచిమాట మేలిమి ముత్యము వంటిది.*

  *♦నేటి జీ కె*♦

    *దినోత్సవాలు*

1) *జాతీయ గణాంక దినోత్సవం?*

     *ఆగస్టు-7*
    
2. *జాతీయ వైద్యుల దినోత్సవం?*

       *జూలై-1*

3. *జాతీయ చేనేత దినోత్సవం?*

      *ఆగస్టు-7*

4. *అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం?*

      *అక్టోబర్-15*

*5. *వరల్డ్ టాయిలెట్ డే?*

     *నవంబర్-19*

 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

1.👀అసమర్ధులకు అవరోధాలు కనిపిస్తాయి..
సమర్ధులకు అవకాశాలు కనిపిస్తాయి...
           -రవీంధ్రనాథ్ ఠాగూర్.

          🌱🌀🌱

2.😝తెలియనితనమే అన్ని దురదృష్టాలకు హేతువు..

ఏమీ నేర్చుకోక పోవడం కన్నా, అసలు పుట్టకుండా ఉండటమే చాలా ఉత్తమం...
                               -ప్లేటో.

           🌱🌀🌱

3.🙄ఉదయం నిద్ర లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు తెచ్చుకో....
మళ్ళీ ఆ తప్పును ఎన్నడూ చేయవు...
                 -ఆస్కార్డ్ వైల్డ్.

          🌱🌀🌱

4.😰అయిపోయిన వాటిని గురించి బాధ పడకు....
పూర్తి చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టు..
విజయం నీదే...
                         -వాల్టేర్.

         🌱🌀🌱

5.👍🏼విజయం సాధించాలంటే... 
10 శాతం ప్రేరణ... 
90 శాతం పరిశ్రమ కావాలి.
అదృష్టంతో...... 
విజయాలు రావు.
       -థామస్ ఆల్వా ఎడిసన్.

        🌱🌀🌱

6.😇మండిన కొవ్వత్తి మనది కానట్లే గడచిన ఏ నిమిషం నీది కాదు...
                 -అంబేడ్కర్.

         🌱🌀🌱

7.🙏విద్యపై ఎంత మొత్తం వెచ్చిస్తే..
చదువు అంతకు రెట్టింపు వడ్డీని ఇస్తుంది...
           -బెంజమిన్ ఫ్రాంక్లిన్.

          🌱🌀🌱

8.👍🏼 మూర్ఖుడయిన స్నేహితుడు, తెలివయిన శత్రువు కన్నా ప్రమాదం...
                   -షేక్ స్పియర్.

       🌱🌀🌱

9. 👌🏼గొప్ప విద్యను ఆశించడం విద్యార్ధుల హక్కు.....
వారు ఆశించిన దాని కన్నా గొప్ప విద్యను అందించడం ఉపాధ్యాయుని బాధ్యత...
                    -బిల్ గేట్స్.

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

*జాతీయ మరియు  అంతర్జాతీయ ప్రత్యేక రోజులు..*
📝📝📝📝📝📝📝📝
1. లూయిస్ బ్రెయిలీ డే - జనవరి 4

ప్రపంచ హాస్య దినం - జనవరి 10

3. నేషనల్ యూత్ డే - జనవరి 12

4. ఆర్మీ డే - జనవరి 15

5. లెప్రోసీ తగ్గింపు డే - జనవరి 30

6. ఇండియా టూరిజం డే - జనవరి 25

రిపబ్లిక్ డే - జనవరి 26

8. ఇంటర్నేషనల్ కస్టమ్స్ అండ్ ప్రొడక్ట్ డే - జనవరి 26

9. సర్వోడయ డే - జనవరి 30

10. మార్టిర్స్ డే - జనవరి 30

11. ప్రపంచ క్యాన్సర్ డే - 4 feb

12. రోజ్ డే - ఫిబ్రవరి 12

13. వాలెంటైన్స్ డే - ఫిబ్రవరి 14

14. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే - ఫిబ్రవరి 21

15. సెంట్రల్ ఎక్సైజ్ డే - 24 ఫిబ్రవరి

16. నేషనల్ సైన్స్ డే - ఫిబ్రవరి 28

17. నేషనల్ సెక్యూరిటీ డే - మార్చి 4

18. అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మార్చి 8

19. KWS ఎస్టాబ్లిష్మెంట్ డే - మార్చి 12

20. వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే - మార్చి 15

21. అర్మాం మాన్యుఫ్యాక్చరింగ్ డే - మార్చి 18

22. ప్రపంచ అటవీ దినోత్సవం - మార్చి 21

23. వరల్డ్ వాటర్ డే - మార్చి 22

24. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు తదితరులు - 23 రోజులు

25. ప్రపంచ వాతావరణ శాస్త్ర దినం - మార్చి 23

26. రామ్ మనోహర్ లోహియా జూబ్లీ - మార్చి 23

27. వరల్డ్ T20 డే - 24 మార్చ్

28. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డే - మార్చి 24

29. గణేష్ శంకర్ విద్యార్థి యొక్క త్యాగం డే - మార్చి 25

30. బంగ్లాదేశ్ జాతీయ దినం - మార్చి 26

31. వరల్డ్ థియేటర్ డే - మార్చి 27

32. ప్రపంచ ఆరోగ్య దినం - ఏప్రిల్ 7

33. అంబేద్కర్ జయంతి - ఏప్రిల్ 14

34. ప్రపంచ ఏరోనాటికల్ డే - ఏప్రిల్ 14

35. ప్రపంచ హెమోఫిలియా డే - ఏప్రిల్ 17

36. ప్రపంచ వారసత్వ దినం - ఏప్రిల్ 18

37. ఎర్త్ డే - ఏప్రిల్ 22

38. వరల్డ్ బుక్ డే - ఏప్రిల్ 23

39. ప్రపంచ లేబర్ డే - మే 1

40. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే - మే 3

41. ప్రపంచ వలస బర్డ్ డే - మే 8

42. ప్రపంచ రెడ్ క్రాస్ డే - మే 8

43. అంతర్జాతీయ Thalassemia డే - మే 8

44. నేషనల్ టెక్నాలజీ డే - మే 11

45. వరల్డ్ మ్యూజియం డే - మే 18

46. ​​వరల్డ్ నర్సెస్ డే - మే 12

47. వరల్డ్ ఫ్యామిలీ డే - మే 15

48. వరల్డ్ టెలీకమ్యూనికేషన్ డే - మే 17

49. యాంటీ టెర్రరిజం డే - మే 21

50. బయోలాజికల్ డైవర్సిటీ డే - మే 22

51. ఎవరెస్ట్ డే మౌంట్ - మే 29

52. ప్రపంచ టొబాకో డే - మే 31

53. ప్రపంచ పర్యావరణ దినం - 5 వ జూన్

54. వరల్డ్ బ్లడ్ డోనార్ డే - 14 వ జూన్

55. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎస్టాబ్లిష్మెంట్ డే - జూన్ 6

56. ప్రపంచ రెఫ్యూజీ డే - 20 వ జూన్

57. నేషనల్ స్టాటిస్టిక్స్ డే - 29 జూన్

58. పిసి మహాలనోబిస్ పుట్టినరోజు - జూన్ 29

60. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్థాపన దినం - 1 జూలై

61. డాక్టర్ డే - 1 వ జూలై

62. డా. విధీంద్ర రాయ్ పుట్టినరోజు - జూలై 1

63. ప్రపంచ జనాభా దినం - జూలై 11

64. కార్గిల్ స్మ్రితి డే - 26 జూలై

65. ప్రపంచ రొమ్ము దినం - ఆగష్టు 1

66. వరల్డ్ యూత్ డే - ఆగష్టు 12

67. స్వాతంత్ర్య దినోత్సవం - ఆగష్టు 15

68. నేషనల్ స్పోర్ట్స్ డే - ఆగష్టు 29

69. ధ్యాన్చంద్ పుట్టినరోజు - 29 ఆగస్టు

70. టీచర్స్ డే - సెప్టెంబర్ 5

71. ఇంటర్నేషనల్ లిటరసీ డే - సెప్టెంబర్ 8

72. హిందీ డే - సెప్టెంబర్ 14

73. వరల్డ్-బ్రదర్హుడ్ అండ్ క్షమాపణ రోజు-సెప్టెంబర్ 14

74. ఇంజనీర్ డే - సెప్టెంబర్ 15

75. క్రెడిట్స్ - 15 సెప్టెంబర్

76. ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ డే - సెప్టెంబర్ 16

77. ఆర్పిఎఫ్ స్థాపన రోజు - 20 సెప్టెంబర్

78. ప్రపంచ శాంతి దినం - సెప్టెంబర్ 21

79. వరల్డ్ టూరిజం డే - 27 సెప్టెంబర్

80. ఇంటర్నేషనల్ ఏజింగ్ డే - అక్టోబర్ 1

81. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి - అక్టోబర్ 2

82. ఇంటర్నేషనల్ అహింసాన్స్ డే - 2 అక్టోబర్

83. ప్రపంచ ప్రకృతి దినం - 3 అక్టోబర్

84. వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే - 4 వ అక్టోబర్

85. వరల్డ్ టీచర్స్ డే - అక్టోబర్ 5

86. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే - అక్టోబర్ 6

87. ఎయిర్ ఫోర్స్ డే - అక్టోబర్ 8

88. వరల్డ్ పోస్ట్ డే - అక్టోబర్ 9

89. వరల్డ్ విజన్ డే - అక్టోబర్ 10

90. జయప్రకాష్ జయంతి - అక్టోబర్ 11

91. వరల్డ్ స్టాండర్డ్స్ డే - అక్టోబర్ 14

92. వరల్డ్ అలర్జీ అవేర్నెస్ డే - అక్టోబర్ 16

93. ప్రపంచ ఆహార దినోత్సవం - అక్టోబర్ 16

94. ప్రపంచ అయోడిన్ డిసీజ్ డే - అక్టోబర్ 21

95. యునైటెడ్ నేషన్స్ డే - అక్టోబర్ 24

96. వరల్డ్ ఫ్రూరియాలిటీ డే - అక్టోబర్ 30

97. ఇందిరా గాంధీ యొక్క శిక్షా తేదీ - అక్టోబర్ 31

98. వరల్డ్ సర్వీస్ డే - నవంబర్ 9

99. లీగల్ లిటరసీ డే - 9 వ నవంబర్

100. బాలల దినోత్సవం - నవంబర్ 14

101. వరల్డ్ డయాబెటిస్ డే - నవంబర్ 14

102. వరల్డ్ స్టూడెంట్ డే - నవంబర్ 17

103. నేషనల్ జర్నలిజం డే - నవంబర్ 17

104. ప్రపంచ వయోజన రోజు - నవంబర్ 18

105. వరల్డ్ సివిల్ డే - నవంబర్ 19

106. యూనివర్సల్ చిల్డ్రన్స్ డే - నవంబర్ 20

107. వరల్డ్ టెలివిజన్ డే -

నవంబర్ 21

108. వరల్డ్ న్యూట్రిషన్ డే ప్రొహిబిషన్ డే - 25 నవంబర్

109. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డే - 26 నవంబర్

110. నేషనల్ లా డే - నవంబర్ 26

111. ప్రపంచ ఎయిడ్స్ డే - డిసెంబర్ 1

112. నావల్ డే - డిసెంబర్ 4

113. రసాయన క్రాష్ ప్రివెన్షన్ డే - డిసెంబర్ 4

114. ఇంటర్నేషనల్ వాలంటీర్ డే - డిసెంబర్ 5

115. సిటిజెన్స్ సేఫ్టీ డే - డిసెంబర్ 6

116. ఫ్లాగ్ డే - డిసెంబర్ 7

117. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే - డిసెంబర్ 7

118. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే - డిసెంబర్ 10

119. వరల్డ్ చైల్డ్ ఫండ్ డే - డిసెంబర్ 11

120. ప్రపంచ ఆస్తమా డే - డిసెంబర్ 11

121. నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే - డిసెంబర్ 14

122. గోవా లిబరేషన్ డే - డిసెంబర్ 19

123. ఫార్మర్స్ డే - డిసెంబర్ 23

124. నేషనల్ కన్స్యూమర్ డే - 24 డిసెంబరు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*Republic Day Speech 3

I would like to say good morning to My Respected Principal, Sir, Madam and my dear colleagues. As we all know that we get together here to celebrate 67thRepublic Day of our nation. This is very auspicious occasion for all of us. Since 1950, we are celebrating Republic Day every year with lots of joy and happiness. Before starting the celebration, our chief guest of the Republic Day hoists the national flag of India. Then we all stand up and sing our Indian national anthem which is a symbol unity and peace in India. Our National Anthem is written by the great poet Rabindranath Tagore.

Our national flag has three colors and a wheel in the center with 24 equal sticks. All the three colors of our Indian National Flag have some meaning. Top saffron colour of our flag denotes the strength and courage of our country. The middle white colour indicates peace however lower green colour indicates the growth and prosperity. There is a navy blue wheel in the center having 24 equal spokes indicating Dharma Chakra of the great king Ashoka.

We celebrate republic day on 26 Januaryas the Indian constitution came into force at this day in 1950. At republic day celebration, a big arrangement takes place by the government of India in New Delhi at Rajpath in front of the India Gate. Every year, a chief guest (prime minister of other country) is invited to fulfill the purpose of saying “Atithi Devo Bhava” as well as enhance the glory of the occasion. Indian army do republic day parade and take salute of the National Flag. There is also a big exhibition of the Indian culture and tradition takes place by the different Indian states to show the Unity in Diversity in India.

Jai Hind, Jai Bharat

No comments:

Post a Comment