🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*చరిత్రలో ఈ రోజు జనవరి 26*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*🇮🇳జనవరి 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 26వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 339 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 340 రోజులు).*
*🌹సంఘటనలు🌹*
*🇮🇳1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.*
*🇮🇳1950: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ..*
*🇮🇳1950:భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.*
*🇮🇳1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.*
*🇮🇳1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.*
*🇮🇳1950: భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.*
*🇮🇳1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.*
*🇮🇳1965: హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.*
*🇮🇳2001: గుజరాత్ లో భయంకర భూకంపం - 20,000 మంది దుర్మరణం.*
*🇮🇳జననాలు🇮🇳*
*🇮🇳1926: ఆవంచ హరికిషన్ నిజాం విమోచన ఉద్యమకారుడు .*
*🇮🇳1935: వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు*
*🇮🇳1956: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.*
*🇮🇳1957: శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .*
*🇮🇳1961: మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు మరియు సినీ నటుడు.*
*🇮🇳1968: రవితేజ (నటుడు),తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.*
*🇮🇳1968: నర్సింగ్ యాదవ్, తడు తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో కలిపి సుమారు 500 చిత్రాలలో నటించాడు*
*🇮🇳1985: నవదీప్, భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు*
*🍂మరణాలు🍂*
*🌹1839: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (జ.1763)*
*🌹1986: కొర్రపాటి గంగాధరరావు,. నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)*
*🌹2010: తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927)*
*🌹2015: ఆర్.కె.లక్ష్మణ్, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)*
*మధు*
*🇮🇳జాతీయ దినాలు🇮🇳*
*🇮🇳భారత గణతంత్ర దినోత్సవం🇮🇳*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*_🇮🇳🌹🇮🇳Happy Republic day to all🇮🇳🌹🇮🇳🖊_*
*🇮🇳🌹జాతీయ జెండా వందనం - నియమాలు*🇮🇳🌹
భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకలు, ప్రైవేట్ కార్యమ్రాల్లోనూ జాతీయ జండా ఎగురవేయటం జరగుతోంది. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తుంటాము. కనుక జండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు యిలా వున్నాయి.
*💧1) సాధారణ నియమాలు :*
- జాతీయ జెండా చేనేత (ఖాదీ, కాటన్, సిల్క్) గుడ్డతో తయారైంది కావాలి.
- జెండా పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో వుండాలి.
6300x4200 మి.మీ నుండి 150x100 మి.మీ వరకు మొత్తం 9 రకాల సైజ్‌ల జెండాలు పేర్కొనబడివి.
- ప్లాస్టిక్ జెండాలు వాడకూడదు. చిన్నసైజ్ పేపరు జండాలు వాడవచ్చు.
- పై నుండి క్రిందకి కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో వుండాలి.
- జెండాలోని తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం (24 ఆకులు) నీలం రంగులో వుండాలి.
- జెండాను ఎగురవేయటం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి.
- జెండాను నేలమీదగాని, నీటిమీదగానీ పడనీయకూడదు.
- జెండాను ఎగురవేసేటపుడు వడిగా (వేగంగా) ఎగురవేయాలి. దించేటప్పుడు నెమ్మదిగా దించాలి.
- జెండా పైన ఎలాంటి రాతలుగాని, ప్రింటింగ్ గాని వుండకూడదు.
- ఇతర జండాలతో కలిపి చేయాల్సివస్తే, జాతీయ జండా మిగిలిన వాటి కంటె కొంచెం ఎత్తుగా వుండాలి. ప్రధర్శనలో అయితే మిగిలిన వాటి కంటె మధ్యలో ఒకడుగు ముందు వుండాలి.
- జండా ఎప్పుడూ నిటారుగానే వుండాలి. క్రిందికి వంచకూడదు.
*💧2) పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో చెయ్యాల్సినవి.*
- పాఠశాలల మైదానంలో చతురస్రాకారంలో మూడు వైపుల విద్యార్థులను నిలబెట్టాలి. నాలుగోవైపు మధ్యలో హెడ్మాష్టర్, స్టూడెంట్స్ లీడర్, జెండా ఎగురవేసే వ్యక్తి (హెడ్మాష్టర్ కాకపోతే) మూడు స్థానాల్లో నిలబడాలి.
- విద్యార్థులను తరగతుల వారీగా 10 మందినొక స్క్వాడ్‌గా ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టాలి. క్లాస్ లీడర్ వరుస ముందు నిలబడాలి వరుసల మధ్యన, విద్యార్థుల మధ్యన 30 ఇంచ్‌ల దూరం వుండాలి.
- క్లాస్ లీడర్‌లు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్కూల్ లీడర్‌కి సెల్యూట్ చేయాలి. స్కూల్ లీడర్ వెళ్లి హెడ్మాష్టర్‌కి సెల్యూట్ చేయాలి. ఆ తర్వాత జండాను ఎగురవేయాలి.
- జెండా ఎగురవేయటానికి ముందు స్కూల్ లీడర్ విద్యార్థ్థులను అటెన్షన్‌లో వుంచాలి. ఎగురవేసిన వెంటనే అందరితో సెల్యూట్ చేయించి కొద్ది సేపు అలా వుంచి ఆర్డ్‌ర్ చెప్పి అటెన్షన్‌లో వుంచాలి.
- అటెన్షన్ వుంచి జాతీయ గీతం ఆలపించాలి, ఆతర్వాత ప్రతిజ్ఞ చేయాలి. హెడ్మాష్టర్ చెబుతుంటే విద్యార్థులు అనుసరించాలి.
జాతీయ దినోత్సవాల్లో జెండా వందనం సందర్భంలో చేయాల్సిన ప్రతిజ్ఞ Rule No.2.3-VII లో పేర్కొనబడింది.
"I Pledge allegiance to the National Flag and to the Soveriegn Socialist Secular Democratic Republic for which it stands"
*💧అనుభవాలే ఆచరణకు మార్గాలు:*
జండావందనం నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్లు తరచుగా వార్తల్లో తెలుస్తున్నాయి. కాగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతోంది.
Flag code of India సెక్షన్ v రూల్ నంబర్ 3.30 ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో కొన్ని పూలు వుంచి ఎగురవేయవచ్చు.
- పాఠశాలల్లో జెండా ఎవరు ఎగురవేయాలనే విషయంలోనూ కొన్ని వివాదాలు జరుగుతుంటాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కార్యనిర్వాహక బాధ్యులు (రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండిఓ, హెడ్మాష్టర్ మున్నగు) మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా విధాన నిర్ణాయక సంస్థల బాధ్యులు (ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ ఛైర్మన్, మండల పరిషత్ ఛైర్మన్, గ్రామ సర్పంచ్ మున్నగు వారు) వారి కార్యాలయాల్లో ఎగురేస్తుంటారు. పాఠశాలలు, కళాశాలలు విధాన నిర్ణాయక సంస్థలు కావు, కార్యనిర్వహణ సంస్థలే. కనుక పాఠశాలల్లో జనవరి 26న మరియు ఆగస్ట్ 15న జాతీయ జండాను హెడ్మాష్టరే ఎగురవేయాలి.
- జాతీయ జెండాని ఎగరేసే పోల్ గట్టిగా వుండాలి. జెండాని పైకి లాగేందుకు అనువుగా పైకి వెళ్ళిన వెంటనే జెండా ముడి విడివడే విధంగా వుండాలి. కొన్ని చోట్ల జెండా కర్రపడిపోవటం, పైకి వెళ్లిన తర్వాత ముడివిడకపోవటం, మళ్లీ కిందికి లాగటం, కాషాయ రంగు కిందికి వుండటం వంటి తప్పులు జరుగుతుంటాయి.
- సూర్యాస్తమయం వరకు పాఠశాలలోనే వుండి జెండాని జాగ్రతగా క్రిందికి దించి మడత పెట్టి బీరువాల్లో వుంచటం హెడ్మాష్టర్ బాధ్యతగానే చూడాలి. కొన్ని చోట్ల ఏదోటైమ్‌లో జెండా క్రింద పడటం, రాత్రికూడ ఎగురుతుండటం వంటి తప్పిదాల వలన హెడ్మాష్టర్‌లు సస్పెండ్ అయిన సందర్భాలు కూడా వున్నాయి. కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జండావందన కార్యక్రమం నియమాలను నిబద్ధతతో పాటించాలి.
*🌴🌲అడవులు – రకాలు🌲🌳*
_💦నేలలు, వర్షపాతంపై అడవుల విస్తరణ ఆధారపడి వుంటుంది._
*🍂🍃1. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు:*
_🍃≈125 సెం.మీ నుంచి 200 సెం.మీ వరకు వర్షం పడే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి._
_🍃≈ శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి._
_🍃≈ ఈ అడవుల్లోని ప్రధాన వృక్ష జాతులు- టేకు, వెదురు, మద్ది, వేగిస, బండారు, జిట్టెగి, చిరుమాను మొదలైనవి._
_🍃≈ రాష్ట్రంలో ప్రధాన అడవులు- ఆకురాల్చు రకం._
_🍃≈వీటినే రుతుపవన అరణ్యాలు అంటారు._
*🍀🍂2. అనార్ద్ర ఆకురాల్చు అడవులు:*
_🍂≈ 75-100 సెం.మీ వర్షం పడే ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి._
_🍂≈ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి._
_🍂≈ ఈ రకం అడవుల్లో ప్రధాన వృక్షాలు – మద్ది, టేకు, వెలగ, బిల్లు, వేప, దిరిసెన, బూరుగ, వెదురు, మోదుగ, ఎర్ర చందనం మొదలైనవి._
*🌳🌲3.చిట్టడవులు:*
_🍀≈70 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇవి ఉంటాయి._
_🍀≈ ఇవి ముళ్లజాతి పొద అడవులు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో విస్తరించి వున్నాయి._
_🍀≈ వీటిలోని ప్రధాన వృక్షాలు- తుమ్మ, బలుసు, రేగు, కలబంద, బ్రహ్మజెముడు మొదలైనవి._
*🌱🌿4. ఆటు- పోటు అడవులు:*
_🌿≈ నదులు, సముద్రం కలిసే బురద, ఒండ్రు, చిత్తడి నేలల్లో ఇవి పెరుగుతాయి._
_🌿≈ తుపాన్లు, సునామీల నుంచి రక్షణ కల్పిస్తాయి._
_🌿≈ వీటినే మాన్‌గ్రూవ్/ టైడల్ అడవులు అంటారు._
_🌿≈ మడ చెట్లు పెరగడం వల్ల వీటిని మడ అడవులు అంటారు._
_🌿≈ ఆంధ్రప్రదేశ్‌లోని టైడల్ అడవులను ‘కోరింగ అడవులు’ అంటారు._
_🌿≈ ఈ రకమైన అడవులు కృష్ణా – గోదావరి నదీ ముఖ ద్వారాల్లో ఉన్నాయి._
_🌿≈ ఈ అడవుల్లో వృక్ష జాతులు – మడ, ఉప్పుపొన్న, బొడ్డుపొన్న, ఉరడ, తెల్లిమడ, కదిలి, టిళ్ల మొదలైనవి._
*🌴🎍🌱5. సముద్ర తీరప్రాంత అడవులు:*
_🌱≈ సముద్ర తీర ప్రాంత ఇసుకలో ఇవి పెరుగుతాయి._
_🌱≈ చిన్న చిన్న పొదలు, సరుగుడు చెట్లు, పత్రితుంగ, బాలబంతి తీగ మొదలైనవి పెరుగుతాయి._
*🌳ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల వైశాల్యం–36,914.7 చ.కి.మీ.*
*🌳≈ రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణతా శాతం–23.04 %*
_*🌳≈ దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది.*_
*🌳≈ రాష్ట్రంలో దట్టమైన అడవుల విస్తీర్ణం–651.25 చ.కి.మీ.*
*🌳≈ రాష్ట్రంలో మధ్యరకం అడవులు–11,810.2 చ.కి.మీ*
*🌳≈ రాష్ట్రంలో ఓపెన్ ఫారెస్ట్ అటవీ ప్రాంతం-10,938.5 చ.కి.మీ*
_*🌳≈ రాష్ట్రంలో చిట్టడవుల వైశాల్యం–9,241.77 చ.కి.మీ*_
_*🌳≈ 1952 అటవీ విధాన తీర్మానం ప్రకారం అడవులు 33.3% ఉండాలి.*_
_🌴≈ రాష్ట్రంలోకెల్లా పెద్ద అడవులు –నల్లమల అడవులు._
_*🌴≈ అటవీ వైశాల్యం అత్యధికంగా ఉన్న జిల్లా -కడప జిల్లా(5052చ.కి.మీ)*_
_*🌴≈ అటవీ వైశాల్యం అత్యల్పంగా ఉన్న జిల్లా-కృష్ణా జిల్లా (644 చ.కి.మీ)*_
*🌴≈ శాతం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా – విశాఖపట్నం (39.5)*
*🌴≈శాతం పరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా – కృష్ణా (7.6)*
*🌲≈ అటవీ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ఆదాయం -రూ.19.89 కోట్లు (2015-16)*
*🍋🍓అటవీ ఉత్పత్తులు:*
*🍀టేకు🍀:*
_🌿గృహౌపకరణాలకు ఉపయోగపడుతుంది._
_🌿ఉభయ గోదావరి, విశాఖపట్నం,అడవుల్లో లభిస్తుంది._
*🌳ఎర్రచందనం:*
_🌱≈ అత్యంత ఖరీదైంది.రంగులు, బొమ్మలు, జంత్ర వాద్యాల తయారీలో ఉపయోగిస్తారు._
_🌿≈ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో పెరుగుతాయి._
_🌿≈ జర్మనీ, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతుంది._
*🌲మంచిగంధం:*
_☘≈ పౌడర్లు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు._
_☘≈ చిత్తూరు, అనంతపురం జిల్లాల అడవుల్లో పెరుగుతుంది._
*🌲కుంకుడు, కరక్కాయలు:*
_🎋≈ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు._
_🎋≈ ఉభయ గోదావరి, విశాఖ జిల్లా అడవుల్లో పెరుగుతాయి._
*🎍మగ వెదురు:*
_🎍≈ పోలీసు లాఠీల తయారీకి ఉపయోగిస్తారు._
_🎍≈విశాఖ అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి._
*🌳🌲అడవులు- సంరక్షణ:*
_🌴≈ అడవులను నరకడాన్ని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం1864, 1878ల్లో చట్టాలు చేసింది._
_🌴≈ 1952లో 33.3% అడవులు ఉండాలని జాతీయ అటవీ విధాన తీర్మానం చేశారు._
_🌴≈1988లో అడవులపై గిరిజనులకు భాగ స్వామ్యం కల్పిస్తూ అటవీ విధానాన్ని వునరుద్ధరించారు._
_🌴≈ 1974లో అడవుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు._
_🌴≈ 1980లో అడవుల సంరక్షణ చట్టం చేశారు._
_🌴≈ 2006లో పర్యావరణ విధానాన్ని ప్రకటించారు._
*🌳🌿🌱సామాజిక అడవులు:*
_☘వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించేందుకు, పరిశ్రమల అభివృద్ధికి, భూ క్రమక్షయాన్ని నివారించేం దుకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అడవుల పెంపకాన్ని ప్రోత్సహి స్తోంది._
_🍀సామాజిక అడవుల పెంపకం కార్యక్రమం 5వ పంచ వర్ష ప్రణాళికలో ప్రారంభమైనా 6వ ప్రణా ళికలో ఎక్కువగా ప్రోత్సహించారు._
_☘1976- 80 మధ్య కాలంలో దేశంలో భారీగా టేకు, ఎర్రచందనం, వెదురు, యూక లిప్టస్ లాంటి చెట్లను పెంచారు._
_🍀1980- 82లో ఆంధ్రప్రదేశ్‌లో వీటి పెంపకం చేపట్టారు._
*🌳🌴అటవీ పరిశోధన:*
_🌲హైదరాబాద్ కేంద్రంగా 1971- 72లో అటవీ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి, తిరుపతిల్లో పరిశోధనలకు సంబంధించి ఆరు ఉపకేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు._
*🌳🌾ఎకోపార్కు :*
_🌱ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద రాజీవ్ ఎకోపార్కును అభివృద్ధి చేసింది. దీన్ని ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు._
*🦋లోక్‌పాల్ – లోకాయుక్తలు🦋*
ప్రతి ప్రజాస్వామిక దేశంలో ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి సంస్థాగతమైన ఏర్పాట్లు చేసుకున్నారు.
అవి :
🔹అంబుడ్స్‌మన్ వ్యవస్థ,
🔹పాలనా న్యాయస్థానాల వ్యవస్థ,
🔹ప్రొక్యూరేటర్ సిస్టమ్.
⇒ పౌరుల ఇబ్బందులను తగ్గించడానికి ప్రపంచంలో పూర్వపు ప్రజాస్వామ్య దేశాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ స్కాండినేవియా అంబుడ్స్‌మన్. అంబుడ్స్‌మన్ వ్యవస్థపై అంతర్జాతీయ నిపుణుడైన డొనాల్డ్ రోవత్ అనుచిత పాలనా విధానాలపై సాధారణ పౌరుడు చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి అంబుడ్స్‌మన్ అద్వితీయమైన, సుముచితమైన వ్యవస్థ అని అభివర్ణించాడు.
⇒ అంబుడ్స్‌మన్ వ్యవస్థను మొదటిసారిగా 1809లో స్వీడన్‌లో నెలకొల్పారు. అంబుడ్ అనే స్వీడిష్ పదానికి ప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి లేదా మరో వ్యక్తి తరఫున మాట్లాడే వ్యక్తి అని అర్థం.
⇒ డొనాల్డ్ రోవత్ ప్రకారం అంబుడ్స్‌మన్ అంటే పాలనా, న్యాయపరమైన చర్యలకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టసభ నియమించిన అధికారి.
⇒ స్వీడిష్ అంబుడ్స్‌మన్‌ను పార్లమెంటు నాలుగేండ్ల కాలపరిమితితో నియమించింది. పార్లమెంటు విశ్వాసం కోల్పోయాడన్న కారణంతో మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. అతడు తన వార్షిక నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తాడు. అందుకే దీన్ని పార్లమెంటరీ అంబుడ్స్‌మన్ వ్యవస్థ అని కూడా అంటారు. ఇది సర్వ స్వతంత్ర వ్యవస్థ.
⇒ అంబుడ్స్‌మన్ ఒక రాజ్యాంగపరమైన అధికార సంస్థ. ప్రభుత్వ, న్యాయ, సైనికాధికారులంతా ఈ వ్యవస్థ పరిధిలోకి రావడం వల్ల వారంతా చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా, ఎవరివైపు మొగ్గు చూపకుండా న్యాయంగా వ్యవహరిస్తారు. అయితే ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి లేదా రద్దు చేయడానికి ఇతనికి ఏ అధికారం లేదు.
⇒ అంబుడ్స్‌మన్ వ్యవస్థ స్వీడన్ నుంచి ఇతర స్కాండినేవియా దేశాలైన ఫిన్లాండ్ (1919), డెన్మార్క్ (1955), నార్వే (1962)లకు వ్యాపించింది. ఈ వ్యవస్థను మొదట ఏర్పాటు చేసుకున్న కామన్‌వెల్త్ దేశం న్యూజిలాండ్. 1962లో న్యూజిలాండ్ పార్లమెంటరీ కమిషనర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పేరుతో అంబుడ్స్‌మన్‌ను నియమించింది. యునైటెడ్ కింగ్‌డమ్ 1967లో పార్లమెంటరీ కమిషనర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దాదాపు 40 దేశాలు వివిధ పేర్లతో అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.
*🦋భారత్‌లో ఏర్పాట్లు*
⇒ దేశంలో అవినీతిని అదుపు చేయడానికి పౌరుల ఇబ్బందులను, ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టపరంగా, సంస్థాపరంగా కింద పేర్కొన్న విధంగా ఏర్పాట్లు ఉన్నాయి.
1. ప్రభుత్వ ఉద్యోగుల విచారణ చట్టం, 1850
2. భారత శిక్షాస్మతి, 1860
3. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్, 1941
4. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, 1946
5. అవినీతి నిరోధక చట్టం, 1988
6. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం, 1952
7. అఖిల భారత సర్వీసుల రూల్స్, 1968
8. కేంద్ర సివిల్స్ సర్వీసెస్ రూల్స్, 1964
9. రైల్వే సర్వీసుల రూల్స్, 1966
10. వివిధ విభాగాల్లోని విజిలెన్స్ సంస్థలు
11. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), 1963
12. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), 1964
13. రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, 1964
14. రాష్ట్రాల్లో అవినీతి నిరోధక సంస్థలు (ఏసీబీలు)
15. రాష్ట్రాల్లో లోకాయుక్త (అంబుడ్స్‌మన్)
16. డివిజనల్ విజిలెన్స్ బోర్డ్
17. జిల్లా విజిలెన్స్ అధికారి
18. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
19. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
20. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
21. సుప్రీంకోర్టు, రాష్ట్రాల్లో హైకోర్టులు
22. పరిపాలనా ట్రిబ్యునళ్లు
23. క్యాబినెట్ సచివాలయంలో ప్రజా ఫిర్యాదుల సంచాలక కార్యాలయం, 1988.
24. పార్లమెంటు, వాటి కమిటీలు
25. కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఫైల్ టు ఫీల్డ్ కార్యక్రమం ఉంది. ఈ విధానంలో పాలనాధికారి స్వయంగా గ్రామం/ప్రాంతానికి వెళ్లి పౌరుల నుంచి ఫిర్యాదులను తీసుకుని, వీలైతే అక్కడిక్కడే సమస్యను పరిష్కరిస్తాడు.
*🦋లోక్‌పాల్*
⇒ పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి లోక్‌పాల్, లోకాయుక్త అనే రెండు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని భారత పాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్‌సీ) -(1966-1970) సిఫారసు చేసింది. ఈ సంస్థలను స్కాండినేవియా దేశాల్లో ఉన్న అంబుడ్స్‌మన్ వ్యవస్థ, న్యూజిలాండ్‌లో ఉన్న పార్లమెంటరీ కమిషనర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఏర్పాటు చేయాలని సూచించింది.
⇒ లోక్‌పాల్ కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మంత్రులు, కార్యదర్శులపై ఫిర్యాదులను, లోకాయుక్త ఇతర నిర్దిష్ట ఉన్నతాధికారులపై ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరపాలి.
⇒ పాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్‌సీ) ప్రకారం లోక్‌పాల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లను సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారు.
⇒ లోక్‌పాల్, లోకాయుక్తలకు ఎలాంటి లక్షణాలు ఉండాలో సూచిస్తూ ఏఆర్‌సీ పలు సిఫారసులను చేసింది.
*🦋లోకాయుక్తలు*
⇒ లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్చల స్థాయిలోనే ఉంటే, మరోవైపు అనేక రాష్ట్రాలు ఇప్పటికే లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం విశేషం.
⇒ లోకాయుక్త వ్యవస్థను మొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం 1971లో ఏర్పాటు చేసింది. ఒడిశా 1970లోనే లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ అది 1983లో అమల్లోకి వచ్చింది.
⇒ 2013 వరకు 18 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (ఢిల్లీ) లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఒడిశా-1970లో, మహారాష్ట్ర-1971లో, రాజస్థాన్-1973లో, బీహార్- 1974లో, ఉత్తరప్రదేశ్-1975లో, మధ్యప్రదేశ్- 1981లో, ఆంధ్రప్రదేశ్-1983లో, హిమాచల్‌ప్రదేశ్-1983లో, కర్ణాటక-1985లో, అస్సాం-1985లో, గుజరాత్-1986లో, పంజాబ్ -1995లో, ఢిల్లీ-1995లో, కేరళ-1999లో, జార్ఖండ్-2001లో, ఛత్తీస్‌గఢ్- 2002లో, హర్యానా-2002లో, ఉత్తరాఖండ్-2002లో, గోవా-2011లో లోకాయుక్తలను ఏర్పాటు చేసుకున్నాయి.
*🦋లోకాయుక్త – వివిధ అంశాలు*
⇒ నిర్మాణాత్మక భేదాలు : లోకాయుక్త వ్యవస్థల నిర్మాణం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు. రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు లోకాయుక్తతోపాటు ఉపలోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోగా.. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు కేవలం లోకాయుక్తను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాయి. పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాలు లోక్‌పాల్‌గా అధికారులను నియమించాయి. అయితే రాష్ట్రాల్లో ఇటువంటి నిర్మాణాన్ని ఏఆర్‌సీ సూచించలేదు.
⇒ నియామకం : రాష్ట్రంలో లోకాయుక్త, ఉపలోకాయుక్తలను గవర్నర్ నియమిస్తాడు. ఈ నియామకం చేపట్టేటప్పుడు గవర్నర్.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడిని సంప్రదిస్తాడు.
⇒ అర్హతలు : లోకాయుక్తగా నియమితులయ్యే వ్యక్తికి న్యాయసంబంధమైన విద్యార్హతలు ఉండాలని ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, కర్ణాటక, అస్సాం నిర్దేశించగా.. బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లు ఎటువంటి నిర్దిష్టమైన అర్హతలను నిర్ణయించలేదు.
⇒ పదవీకాలం : దాదాపు అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్త పదవీకాలం 5 ఏళ్లు లేదా సదరు అధికారికి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు. ఒకసారి పదవీకాలం పూర్తయితే పునర్నియామకానికి అర్హులుకారు.
⇒ అధికార పరిధి : లోకాయుక్త అధికార పరిధి విషయంలో రాష్ట్రాల మధ్య సారూప్యత లేదు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి లోకాయుక్త పరిధిలోకి వస్తాడు. మరికొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధి నుంచి మినహాయించారు. దాదాపు అన్ని రాష్ట్రాలు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులను లోకాయుక్త పరిధిలోకి తెచ్చాయి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాజీ మంత్రులు, మాజీ ఉన్నతోద్యోగులను కూడా లోకాయుక్త పరిధిలోకి తెచ్చింది.
*🦋ఇతర అంశాలు:*
1. లోకాయుక్త తన పనితీరుపై ఒక సమగ్రమైన వార్షిక నివేదికను ఏటా గవర్నర్‌కు సమర్పిస్తాడు. గవర్నర్ ఈ నివేదికకు తన వివరణను జతచేసి రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తాడు. లోకాయుక్త సంబంధిత రాష్ట్ర శాసనసభలకు జవాబుదారీగా ఉండాలి.
2. లోకాయుక్త తన కేసులకు సంబంధించిన విచారణల్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవచ్చు.
3. ప్రభుత్వ శాఖల నుంచి కేసులకు సంబంధించిన ఫైళ్లు, పత్రాలను ఇవాల్సిందిగా కోరవచ్చు.
4. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహాపూర్వకమైనవి మాత్రమే. వాటిని తప్పక పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
🔲చరిత్రలో ఈ రోజు/జనవరి 26
1925 : ప్రసిద్ది చెందిన అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది పాల్ న్యూమాన్ జననం.
1935 : తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత , రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు భావశ్రీజననం.
1950 :భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
1956 : భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి డయానా ఎడుల్జీజననం.
1968 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు రవితేజ జననం.
2010 : తెలుగు సినిమా ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుమరణం.
2015 : ప్రముఖ భారతీయ వ్యంగ్యచిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ మరణం
*🇮🇳భారత 69 వ గణతంత్ర దినోత్సవం స్పెషల్🇮🇳*
*🇮🇳ఈనెల 26వ తేదీన భారత గణతంత్ర వేడుకలు జరుపుకోనున్నాం. ఇందుకోసం యావత్ దేశం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాజ్యాంగం గురించి తెలియని కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం.*
*🇮🇳"రాజ్యాంగం మంచిదే కానీ, మంచి వారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది" అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు.*
*🇮🇳"ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం" అని అబ్రహం లింకన్ అన్నారు.*
*🇮🇳ప్రజాస్వామ్యానికి మూల గ్రంథంలాంటిది మన రాజ్యాంగం. మరి మన రాజ్యాంగం గురించీ, గణతంత్రం గురించి కొన్ని విషయాలు….*
*🇮🇳రాజ్యాంగం రాత ప్రతిని తయారు చేసేందుకు 1947 ఆగష్టు 29వ తేదీన రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
*🇮🇳 ఈ కమిటీకి డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అధ్యక్షుడు.*
*🇮🇳"భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, హోదాలోను, అవకాశాలలోను సమానత్వం, వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము.*
*🇮🇳1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము….." అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.*
*🇮🇳1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి శాసనంగా రూపొందించుకున్నప్పటికీ, 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్)గా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది ఈ భారత దేశ బృహత్ రాజ్యాంగం..*
*🇮🇳స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.*
*🇮🇳రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.*
*🇮🇳రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.*
*🇮🇳భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఫలితంగా భారత్ సంపూర్ణ గణతంత్ర దేశంగా అవతరించింది.*

No comments:
Post a Comment