AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 8 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 29 2018


చరిత్రలో ఈ రోజు జనవరి 29 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ ప్రచురణ.1780భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
రామకృష్ణ మఠం ప్రారంభం.1939రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
భారత సంగీత నాటక అకాడమీ స్థాపన.1953భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ నియామకం.2006ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మొసలికంటి తిరుమలరావు1901ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు. (మ.1970)
అబ్దుస్ సలం19261979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
పంగులూరి రామన్ సుబ్బారావు1932ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
వేటూరి సుందరరామ్మూర్తి1936తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
బైరిశెట్టి భాస్కరరావు1936ప్రముఖ సినీ దర్శకుడు. (మ.2014)
రేవూరి అనంత పద్మనాభరావు1947కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా ప్రసిద్ధులు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
రాం నివాస్ మీర్థా2010భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి
చోళ లింగయ్య2010తెలంగాణ పోరాట యోధుడు.
🏧🏧🏧🏧🏧🏧
*✍5 ఉద్యోగ ప్రకటనల ఫలితాలు విడుదల చేసిన టిఎస్‌పిఎస్‌సి.*

*❇హైదరాబాద్: ఐదు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన ఫలితాలను టిఎస్‌పిఎస్‌సి సోమవారం విడుదల చేసింది. పిసిబిలో ఎఇఇ, జూనియర్ అసిస్టెంట్ కం.టైపిస్ట్ ఉద్యోగ నాయామక ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే గిరిజన గురుకుల పాఠవాలల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ నియామక ఫలితాలు కూడా విడుదల చేసింది టిఎస్‌పిఎస్‌సి. వీటితో పాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ పోస్టుల ఉద్యోగ నియామక ఫలితాలను వెల్లడించింది. ఫలితాల కోసం టిఎస్‌పిఎస్‌సి అధికార వెబ్‌సైట్ www.tspsc.gov.inలో చూడొచ్చు.*
🏧🏧🏧🏧🏧🏧
💥 *హైదరాబాద్ లో మోహరించిన ప్రభుత్వ టీచర్లు ---  ఆందోళన లో పంచాయతీ రాజ్ టీచర్లు*

💥 *రేపు హైకోర్టు లో ఏకీకృత సర్వీస్ రూల్స్‌ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ టీచర్లు హైదరాబాద్ చేరుకుని తమ న్యాయవాదులను కలుసుకుని రేపటి కేసు మరో 4 నెలలు వాయిదా వేయించాలని  కోరుతూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది*

*💥మరోవైపు ఈసారి తమకు అనుకూలంగా ఏకీకృత సర్వీస్ రూల్స్‌ అమలయ్యే లా చేయాలని పంచాయతీ రాజ్ టీచర్ల సంఘ నాయకులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు*

💥 *ఈ సందర్భంగా కమీషనర్ ను కలవటానికి వెళ్లిన నాయకులకు వారు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురి అయినట్లు తెలుస్తోంది*

*💥దీంతో పంచాయతీ రాజ్ సంఘ నాయకులు జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ వారిని కలిసి GP ప్రభుత్వ న్యాయవాది రేపు తప్పని సరిగా హాజరు అయ్యేలా చేయమని మరియు తమకు న్యాయం చేయాలని కోరారు*

💥 *మరోపక్క ప్రభుత్వ టీచర్లు తమ న్యాయవాదులను కలుసుకుని తమకు అనుకూలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు*
*దీంతో పంచాయతీ రాజ్ టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు*.
🏧🏧🏧🏧🏧🏧
భారతదేశంలోని ముఖ్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు

1. అచానక్మర్ శాంక్చుయరీ – బిలాస్ పూర్,ఛత్తీస్ గఢ్

2. ఇంటాంగికీ శాంక్చుయరీ – కోహిమా, నాగాలాండ్

3. కవ్వాల్ శాంక్చుయరీ – జన్నారం, ఆంధ్రప్రదేశ్

4. కజిరంగా జాతీయ పార్కు – జోర్హట్, అసోం

5. కిన్నెరసాని శాంక్చుయరీ – ఖమ్మం, ఆంధ్రప్రదేశ్

6. కొల్లేరు – ఏలూరు, ఆంధ్రప్రదేశ్

7. కార్బెట్ జాతీయ పార్కు – నైనిటాల్, ఉత్తరాఖండ్

8. ఖంగ్ చాందైందా – గాంగ్ టక్, సిక్కిం

9. గరమ్ పానీ శాంక్చుయరీ – దింపు, అసోం

10. గాంధీసాగర్ శాంక్చుయరీ – మంద్ సౌర్, మధ్యప్రదేశ్

11. గిర్ అడవి – జునాగఢ్,గుజరాత్

12. గౌతమబుద్ధ శాంక్చుయరీ – గయ, బీహార్

13. ఘనా బర్డ్ శాంక్చుయరీ – భరత్పూర్, రాజస్థాన్

14. చంద్రప్రభ శాంక్చుయరీ – వారణాసి సమీపంలో, ఉత్తరప్రదేశ్

15. జల్దపార శాంక్చుయరీ – పశ్చిమబెంగాల్

16. డచిగామ్ శాంక్చుయరీ – డచిగామ్, కాశ్మీర్

17. డాట్మా శాంక్చుయరీ – సింగ్భమ్, బీహార్

18. తాన్సా శాంక్చుయరీ – థానె, మహారాష్ట్ర

19. తుంగభద్ర శాంక్చుయరీ – బళ్లారి, కర్ణాటక

20. దండేలి శాంక్చుయరీ – ధార్వార్, కర్ణాటక

21. దుధ్వా జాతీయ పార్కు – లఖాయ్ పుర్బెరి, ఉత్తరప్రదేశ్

22. నందపా శాంక్చుయరీ – చిరప్, అరుణాచలప్రదేశ్

23. టిరమవేగోన్ జాతీయ పార్కు – భండారా, మహారాష్ట్ర

24. నాగర్సోల్ జాతీయ పార్కు – కుర్గ్, కర్ణాటక

25. పాంచ్ మర్హి శాంక్చయరీ – హోషంగాబాద్, మధ్యప్రదేశ్

26. పాకాల శాంక్చుయరీ – వరంగల్, ఆంధ్రప్రదేశ్

27. పారంబికులమ్ శాంక్చుయరీ – పాల్ఘాట్, కేరళ

28. పెంచ్ జాతీయ పార్కు – లాగపూర్, మహారాష్ట్ర

29. పెరియార్ శాంక్చుయరీ – ఇడుక్కి, కేరళ

30. బందీపూర్ శాంక్చుయరీ – కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు

31. బనార్ గట్టి జాతీయ పార్కు – బెంగళూరు, కర్ణాటక

32. బంధ్వాగఢ్ జాతీయ పార్కు – షాడోత్, మధ్యప్రదేశ్

33. బొరివ్లి జాతీయ పార్కు – ముంబయి

34. భద్రా శాంక్చుయరీ – చిక్ మంగుశూరు, కర్ణాటక

35. భీమబంధ్ శాంక్చుయరీ – మోంఘిర్, బీహార్

36. రంగన్ తిట్టూ బర్డ్ శాంక్చుయరీ – కర్ణాటకలోని కావేరీనదిలోలి దీవులు

37. రోహ్లా జాతీయ పార్కు – కులు, హిమాచల్ ప్రదేశ్

38. వైనాడ్ శాంక్చుయరీ – కన్ననూర్, కోజికోడ్,కేరళ

39. వల్వడార్ జాతీయ పార్కు – భావనగర్, గుజరాత్

40. వేదాంతంగల్ బర్డ్ శాంక్చుయరీ – తమిళనాడు

41. శివపురి జాతీయపార్కు – శివపురి, మధ్యప్రదేశ్

42. షికారీతేవి శాంక్చుయరీ – మండి, హిమాచల్ ప్రదేశ్

43. సరస్వతీలోయ శాంక్చుయరీ – షిమోగా, కర్ణాటక

44. సరిస్కా శాంక్చుయరీ – ఆల్వర్, రాజస్థాన్

45. హజారీబాగ్ శాంక్చుయరీ – హజారీబాగం, జార్ఖండ్
🌱🍂🍃🌾📚🌾🍃🍂🌱
*👩‍🏫జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం-2005👨‍🏫*

🔹సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన బాలబాలికలు తమ శారీరక, మనోవైజ్ఞానిక, మేధోపర లక్షణాలకు అనుగుణంగా అభ్యసించి విజయం సాధించడానికి తోడ్పడే విధంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్పుచెందుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యతలను ప్రతిబింబించే పాఠ్యప్రణాళిక రూపకల్పన జరిగితే దేశ పురోగతి జరుగుతుందనడంలో అతిశయోక్తిలేదు.

*💁‍♂CF-2005 లక్షణాలు:*

1. సంబద్ధత (Releva-cy)

2. సరళత (Flexibility)

3. నాణ్యత (Quality)

👉ఈ మూడు లక్షణాలు పాఠ్యప్రణాళికా చట్రం ప్రధాన దృక్పథంలో ఉండాలనేది ప్రధాన లక్ష్యం.

*💁మౌలిక సూత్రాలు:*

👉పాఠశాల బయటి జీవితాన్ని, ఉపాధ్యాయుడు తన బోధనతో విద్యార్థులకు అందించే జ్ఞానంతో అనుసంధానం చేయాలి.

👉విద్యార్థులు కంఠతాపట్టే పద్ధతుల నుంచి అర్థవంతంగా చదవగలిగే పద్ధతులకు పాఠ్యప్రణాళిక మారాలి.

👉విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడే శిశుకేంద్ర పాఠ్యాంశాలు రూపొందాలి.

👉పరీక్ష విధానాలు సరళంగా ఉండి, తరగతిగది-జీవితంలో సమన్వయపరచాలి.

👉బాలబాలికలు పాఠ్యపుస్తకాల వలయంలో చిక్కుకోకుండా వారి ప్రజాస్వామిక, పర్యావరణ వికాసానికి కృషిచేయాలి.

*🌷ప్రధాన అంశాలు:*

🔸ప్రొ. యశ్‌పాల్ కమిటీ భావనల ఆధారంగా ఎన్‌సీఎఫ్-2005 రూపొందించబడింది.

🔸బరువు కాని చదువు, భారంలేని విద్య లక్ష్యంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸పాఠశాలలో చేపట్టే వివిధ కార్యక్రమాలు సృజనాత్మకంగా ఉండాలి కానీ, యాంత్రికంగా ఉండకూడదు.

🔸ప్రజాస్వామిక విలువల పట్ల, రాజ్యాంగ సూత్రాలపట్ల నిబద్ధతను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక తోడ్పడాలి.

🔸స్వతంత్రంగా ఆలోచించి, పనిచేసి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించాలి.

🔸ప్రజలు, పౌరులందరినీ గౌరవించే స్వభావాన్ని బాలబాలికల్లో రంగరించాలి.

🔸ఇతరుల సంక్షేమం, అనుభూతులపై సున్నితంగా స్పందించడం, ప్రపంచం గురించిన జ్ఞానం, అవగాహన, విలువలకు కట్టుబడే హేతుశీలతను కలిగించాలి.

🔸ఎలా నేర్చుకోవాలో తెలియచెప్పాలి. అలా నేర్చుకున్నదాన్ని అవసరమైతే సవరించుకోవడం వంటి జ్ఞాననిర్మాణ ప్రక్రియలను నొక్కి చెప్పాలి.

🔸జ్ఞానపునాదిని ఏర్పరిచే అనుభవాలతో నిండిన పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸జ్ఞానోత్పత్తి కార్యక్రమంలో పిల్లలను భాగస్వాములను చేయగలిగేలా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸పాఠ్యేతర అంశాలకు, సహపాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

🔸మానవ సమాజశాస్త్రం అంటే చేతివృత్తులు, కళలకు సంబంధించిన జ్ఞానం పాఠ్యప్రణాళికలో ముఖ్యమైన భాగం కావాలి.

🔸పాఠశాల వాతావరణానికి, సామాజిక వాతావరణానికి అడ్డంకులు లేని విధంగా, జ్ఞానాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానించుకోగలిగే విధంగా పాఠ్యప్రణాళిక ఉండాలి.

🔸జ్ఞానం సబ్జెక్టుల ఆధారంగా దేనికది విడదీసి చూడకుండ పరస్పరాధితంగా ఉండాలి.

🔸ప్రస్తుత పాఠ్యాంశాల్లోనే సమాజానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. కొత్త సబ్జెక్టులు పెట్టి బరువు పెంచకూడదు.

🔸ప్రాథమిక విద్యవరకు అన్ని కృత్యాల్లోనూ భాష, గణితానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

🔸ప్రణాళిక రూపకల్పనలో స్థానికాంశాలే ప్రతిబింబించాలి.

🔸పాఠ్యగ్రంథం కేవలం విషయ జ్ఞానం కలిగించేదిగా కాకుండా, సహాయకారిగా కూడా ఉండాలి.

🔸స్త్రీల విషయం మరచిపోకుండా పితృస్వామిక వ్యవస్థా చట్రాన్ని ఛేదించే వైపుగా పాఠ్యప్రణాళిక ఉండాలి. స్త్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

🔸నీతి, నిజాయితీ, సహకారం మొదలైన నైతికాంశాలు కూడా ప్రణాళికలో భాగమవ్వాలి.

🔸పిల్లల వయస్సుకు తగిన జ్ఞానాన్నిచ్చే బోధనానుభవాలతో కూడిన భాష, పద్ధతులు, విషయాలను పాఠ్యప్రణాళికలో పొందుపర్చాలి.

🔸ప్రాంతీయ, కుల, మత, వర్గ, లింగ, ధనిక, పేద వివక్షలను, అసమానతలను తొలగించే మార్పుకు దారితేసేందుకు అనువుగా పాఠ్యపుస్తకాన్ని మలచాలి.

🔸అభ్యాసకుల ఆకాంక్షలను, లక్ష్యాలను పాఠ్యప్రణాళికాధారంగా సాధించడానికి తోడ్పడాలి.

🔸స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ భావన, సర్వజనసంక్షేమం, లౌకికతత్వం, మానవ హక్కులను గౌరవించడం పట్ల నిబద్ధతను పెంచగలగాలి.

🔸జ్ఞాననైపుణ్యాలు విద్యార్థుల్లో కలిగించే నాణ్యతాపరమైన దృక్కోణాలను పరిశీలించి పొందుపర్చాలి.

*🌷అభ్యసనం-జ్ఞానం🌷*

_🔹అభ్యసనం కింది విధంగా ఉంటే ఫలవంతంగా ఉంటుందని ఎన్‌సీఎఫ్ 2005 పేర్కొంటున్నది._

_🔸పిల్లల అభ్యసనంలో తల్లిదండ్రులను, సమాజాన్ని భాగస్వాములను చేయాలి._

_🔹కొద్దిమంది విద్యార్థులే రాణించే విధంగా కాకుండా అందరూ రాణించేలా ఉండాలి._

_🔸పిల్లల అవసరాలకు తగిన అభ్యసన వాతావరణం కల్పించేందుకు వీలుగా ఉపాధ్యాయునికి స్వయంప్రతిపత్తి ఉండాలి._

_🔹జ్ఞానోత్పత్తి కార్యక్రమంలో పిల్లల్ని భాగస్వాములనుచేసి అభ్యసనం కొనసాగించాలి._

_🔸అభ్యసన ప్రక్రియలో భాగంగా ఏర్పడిన పీరియడ్ కచ్చితంగా 45 ని.లు అమలయ్యేలా చూడాలి._

_🔹అభ్యసన క్రమాన్ని ఆటంకపరిచే పోటీతత్వధోరణిని నిరోధించాలి. దానిస్థానంలో ఆసక్తిని పెంపొందించాలి._

_🔹సహజ అభ్యసన క్రమాన్ని హరించే అంశాలను తరగతిగదిలో నిరోధించాలి._

_🔸తరగతి గదిలో పిల్లలు చర్చించకుండా నిశ్శబ్ధంగా ఉండటం, టీచర్ అడిగే ప్రశ్నకు ఒక్కరే జవాబు చెప్పడం, జవాబు తెలిసినవారినే చెప్పమనడం వంటి అంశాలను నిరోధించాలి._

_🔹విద్యార్థులు ప్రపంచాన్ని పరిశీలిస్తూ, స్పందిస్తూ పనిచేస్తూ భాగస్వాములై అభ్యసనం కొనసాగించాలి._

సక్రియుడైన అభ్యాసకునికి (Active Lear-er) ప్రాధాన్యమివ్వాలి.

_🔸జ్ఞాన నిర్మాణం కోసం బోధన జరగాలి._

_🔹విమర్శనాత్మక బోధన వ్యూహాలకు ప్రాధాన్యమివ్వాలి._

_🔹సాక్ష్యనిరూపణ, వాస్తవనిరూపణలకు చెందిన ఎపిస్టెమిక్ అవగాహన కల్పించడం._

_🔸జ్ఞాన పునఃసృజన (Recreati-g K-owledge), జ్ఞానవరణం పెంపొందించే అభ్యసనంపై శ్రద్ధ వహించాలి._

*💁‍♂బోధనాభ్యసన ప్రక్రియ*

_🌷బోధనాభ్యసన ప్రక్రియలు యాంత్రికంగా కాకుండా, సృజనాత్మకంగా ఉండాలి._

_🌷కృత్యాల రూపంలో, సామర్థ్య ఆధారితంగా ఉండాలి._

_🌷పిల్లల్లో నైపుణ్యాలు, అనుభవాలు అభివృద్ధిపరిచే విధంగా ఉండాలి._

_🌷ఆడుతూ, పాడుతూ నేర్చుకోగలిగేలా ఉండాలి._

_🌷పిల్లలకు భయాన్ని కాకుండా ఉల్లాసాన్ని కలిగించేవిగా బోధనాభ్యసన ప్రకియ ఉండాలి._

_🌷ప్రాజెక్టు, అన్వేషణ, ప్రయోగపద్ధతిలో అభ్యసన ప్రక్రియ జరగాలి._

*👨‍🏫CF-2005- ఉపాధ్యాయుడు*

*👉CF-2005 ప్రకారం ఉపాధ్యాయుడు పిల్లల అంతర్గత శక్తులను వెలికితీయగలగాలి.*

_👉పిల్లలు స్వయంగా జ్ఞానం నిర్మించుకునే ప్రక్రియలో ఉపాధ్యాయుడు భాగస్వామి కావాలి._

_👉భాషను గొప్ప బోధనావనరుగా ఉపయోగించుకోవాలి._

_👉పిల్లల హక్కులను కాపాడాలి._

*👉పిల్లల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక భిన్నత్వాలను అర్థం చేసుకుని అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.*

*👉శాంతి, సహనం, న్యాయం మొదలైన విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలి.*

_👉నిరంతర విద్యార్థిగా ఉండాలి._

*🌷పాఠశాల దశలు🌷*

*💁పూర్వ ప్రాథమిక విద్య (ECCE)*

👉క్రీడల ద్వారా, అభినయగీతాల ద్వారా, బోధనోపకరణ కృత్యాల ద్వారా అవగాహన కలిగించాలి.

👉విద్య పూర్వ సంస్థలు కేవలం ప్రాథమిక పాఠశాలల్లో చేరడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి.

👉ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ- లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

*🌷ఎలిమెంటరీ పాఠశాల🌷*

👉1 నుంచి 8వ తరగతివరకు అందించే విద్య ఎలిమెంటరీ విద్య.

👉3Rs (రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్) చదవడం, రాయడం, లెక్కలు చేయడం నిర్బంధ విద్యకు ప్రాధాన్యమివ్వాలి.

పిల్లల భాషాభివృద్ధికి కృషిచేయాలి.

👉గిరిజన భాషలు, ఇతర భాషల వారికి వారి సొంత భాషల్లో అభ్యసన సౌకర్యాలు కల్పించాలి.

👉1వ తరగతి నుంచి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాలి.

👉బహుభాషా నేపథ్యంలో త్రిభాషకు ప్రాధాన్యమివ్వాలి.

👉మూసపద్ధతిలో విద్యాప్రణాళిక కాకుండా వృత్తి నైపుణ్యాలు పెంపొందించే పని ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేయాలి.

👉విద్యాప్రణాళిక కేవలం ఫలితాలకోసం కాకుండా ప్రక్రియ ప్రధానమైనదిగా ఉండాలి.

*🌷సెంకడరీ పాఠశాల🌷*

👉9, 10 సెకండరీ స్థాయి పిల్లలకు సృజనాత్మకమైన, ఉత్పత్తిదాయకమైన పనినైపుణ్యాలు అలవర్చాలి.

👉గ్రంథాలయ పుస్తకాల పఠనం, ప్రయోగశాల అనుభవాలు కలిగించాలి.

👉కుట్టుపని, వస్తువుల తయారీ, పారామెడికల్ కోర్సుల వృత్తి విషయాలు చేర్చి నైపుణ్యాలు పెంపొందించాలి.

👉హయ్యర్ సెకండరీ పాఠశాల- +2 స్థాయిలో విద్యార్థులు తమ ఆసక్తులు, అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా భావి జీవితాలకు తగిన కోర్సులను ఎంపికచేసుకునే విద్యా అవకాశాలు కల్పించాలి.

👉వైద్య, ఇంజినీరింగ్ ఇతర కోర్సులకు కావలసిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని అందించే విద్యా ప్రణాళిక రూపొందించాలి.

*🌷CF-2005 - భాష🌷*

🔸పాఠశాలల్లో పిల్లల మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలి.

🔸విద్యార్థుల్లో బహు భాషా జ్ఞానాన్ని పెంపొందించాలి.

🔹త్రిభాషా సూత్రం (తెలుగు, హిందీ, ఇంగ్లిష్)లో భాగంగా భాషా పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అందించాలి.

🔹1వ తరగతి నుంచే ఇంగ్లిష్‌పై అవగాహన కల్పించాలి. అదేవిధంగా మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

హిందీయేతర రాష్ర్టాల్లో హిందీని ప్రవేశపెట్టాలి.

🔸+2 స్థాయిలో ప్రాచీన (సంస్కృత), విదేశీ భాషల అధ్యయనాన్ని ప్రారంభించాలి.

🔸పిల్లలు తమ సొంతభాషలో ఆలోచనలను, అనుభవాలను వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించాలి.

*🌷గణితం🌷*

👉పిల్లల్లో గణిత సామర్థ్యాలు అభివృద్ధిచేయడం, గణితంలో రాణించే చతుర్విధ ప్రక్రియలు (సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం) వచ్చేలా చూడాలి.

👉సమస్యా పరిష్కార శక్తి, తార్కిక సామర్థ్యాలు పెంపొందాలి.

*👉గణితం అంటే పిల్లలు భయపడకుండా ఉల్లాసంగా నేర్చుకునే గణిత క్రీడలు, పజిల్స్, కృత్యాల ద్వారా బోధన జరగాలి.*

👉సాంకేతిక పరిజ్ఞానమైన కంప్యూటర్ విద్యనందించాలి.

*🌷సైన్స్🌷*

🔹విద్యార్థులు తమ నిత్యజీవిత అంశాలను విశ్లేషించి, పరీక్షించేవిధంగా ప్రయోగపద్ధతిలో బోధన జరగాలి.

*🔹శాస్త్రీయ దృక్పథాన్ని, వైఖరులను పెంపొందించే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.*

🔹విద్యార్థులు తమంతట తామే నేర్చుకునే ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

No comments:

Post a Comment