AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday, 8 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 30 2018

*🌹చరిత్రలో ఈ రోజు/జనవరి 30*🌹

*సంఘటనలు*🍃

*అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.*

1948: మహాత్మా గాంధీ హత్య

*జననాలు*🌿

1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్
1905: కందుకూరి రామభద్రరావు, ప్రముఖ కవి
1910: సి.సుబ్రమణ్యం, సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, ప్రముఖ చర్మవైద్యులు. (మ.2005)
1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు

*మరణాలు*🍃

1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, ప్రసిద్ధ పండితులు మరియు రచయిత. (జ.1892)
2005: వడ్డెర చండీదాస్, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1937)
2016: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
2016: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ, ప్రజా సేవకుడు.

*పండుగలు మరియు జాతీయ దినాలు*

*అమరవీరుల సంస్మరణ దినం*
 *గాంధీజీ వర్థంతి*
 *కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.*
🏧🏧🏧🏧🏧🏧*💥ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ హాజరు*

♦అమలు యోచనలో విద్యాశాఖ

♦హాజరు అవకతవకలకు చెక్‌

♦పలు స్కూళ్లలో కానరాని రిజిస్టర్‌

♦హెచ్‌ఎంలు, టీచర్ల అవగాహన

♦సంఘాల నేతల ఇష్టారాజ్యం

🔷ఆంధ్రజ్యోతి: పాఠశాలకు వెళ్లకుండానే హాజరు వేయించుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు ఇక చెక్‌ పెట్టనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా హాజరు నమోదుకు ప్రత్యేకంగా పాఠశాల వెబ్‌సైట్‌ను రూపొందించడంతోపాటు మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

🔷దీంతో ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా జరగనుంది. సెలవు తీసుకోదలచిన ఉపాధ్యాయులు యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే సరిపోతుంది. అది నేరుగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు చేరుతుంది. అదే విధంగా పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఈ యాప్‌ ద్వారానే హాజరు వేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటే ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌లో హాజరును ప్రతిరోజూ క్రమం తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ హాజరు విధానం అమలును విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.

*🔷విస్తృత తనిఖీలకు చర్యలు..*
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ హాజరు విధానం అమలు చేయడం వల్ల ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండా హాజరు వేయించుకుంటే ఆ విషయం తనిఖీల్లో సులువుగా బయటపడుతుందని అధికారులు తెలిపారు. ఈ విధానం అమలు తర్వాత పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పలు అంశాలపై బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో అధికారులు విస్తుపోయే నిజాలు బయటపడినట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధ్యాయుల హాజరు విధానంలో అనేక అవకతవకలు జరిగినట్లు బృందాలు గుర్తించాయి. కొన్ని పాఠశాలల్లో హాజరు రిజిస్టర్‌ను సరిగా నిర్వహించడం లేదని, అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవగాహన కుదుర్చుకుని ఇష్టానుసారంగా సెలవులు తీసుకుంటున్నారని వెల్లడైంది. దీంతో పాఠశాలల్లో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారింది.

🔷సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇటీవల వరంగల్‌ జిల్లాలో ఓ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా.. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను సరిగా నిర్వహించని విషయాన్ని పసిగట్టారు. రోజుల తరబడి ఉపాధ్యాయులు హాజరు పట్టికలో సంతకం చేయకపోవడాన్ని, ఆ రోజు పాఠశాలకు రాని ఉపాధ్యాయుల లీవ్‌ లెటర్లు కూడా లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. హాజరులో ఈ అవకతవకలు స్వయంగా విద్యాశాఖ మంత్రికే ఎదురుకావడం గమనార్హం. ముఖ్యంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ప్రతి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కేలండర్‌ ఇయర్‌లో సాధారణ సెలవులు అదనంగా ఉంటాయి. అయితే వీరు.. వాటికన్నా అదనంగా సెలవులు వినియోగించుకుంటున్నట్లు తేలింది.
🏧🏧🏧🏧🏧🏧 *🔷ఆర్‌సీ నం. 83లో మార్పులు స్వల్పమే..*

♦హాజరులో అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు విద్యాశాఖ పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారాన్ని ప్రధానోపాధ్యాయుల నుంచి తొలగించి ఎంఈవోలకు ఇస్తూ ఇటీవల ఆర్‌సీ నం.83ను జారీ చేసింది. అయితే దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. వారి ఆందోళన నేపథ్యంలో జీవోలో స్వల్ప మార్పులు చేసేందుకు అధికారులు అంగీకరించారు. సెలవు మంజూరు అధికారం మళ్లీ హెచ్‌ఎంలకు ఇవ్వాలని నిర్ణయించారు.

♦పలు నిబంధనల్ని అమలు చేయనున్నారు. హాజరు రిజిస్టర్‌ను హెచ్‌ఎంలతోపాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఎంఈవో వద్ద కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల హాజరు, సెలవులను కచ్చితమైన సమయంలోగా స్కూల్‌ కాంప్లెక్స్‌కు పాఠశాల హెచ్‌ఎం తెలియజేయాల్సి ఉంటుంది. హాజరు మాత్రమే కాకుండా మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోయినా హాజరు వేయించుకుంటే తనిఖీల్లో బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
🏧🏧🏧🏧🏧🏧 *🍀షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్టీ*

🔷ఫిబ్రవరి 24-28 వరకు రాతపరీక్షలు

🔷 వాయిదా పుకార్లను నమ్మొద్దు : టీఎస్‌పీఎస్సీ

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతా యని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీ రాతపరీక్షలు వాయిదా పడతాయన్న పుకార్లను నమ్మొద్దని అభ్యర్థులను కోరింది.

♦ ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు టీఆర్టీ రాతపరీక్షలు నిర్వహిస్తామని, మార్చి 1 నుంచి 5 వరకు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వాటిపై మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది కీ మార్చి 25న విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని, మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుందని. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

♦టీఆర్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)కు 1,45,158 మంది, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ)కి 89,149 మంది, భాషా పండితులు (ఎల్‌పీ)కి 24,219 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)కు 2,177 మంది, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (పీఈటీ)కి 16,871 మంది చొప్పున మొత్తం 2,77,574 మంది దరఖాస్తు చేశారు.

♦ పాత పది జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. టీఆర్టీ వాయిదా పడుతుందని, మేలో తిరిగి రాతపరీక్షలు నిర్వహిస్తారని సోషల్‌ మీడియాలో వదంతులొచ్చాయి. ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్‌ను నవతెలంగాణ వివరణ కోరగా... టీఆర్టీని వాయిదా వేసే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. వాయిదా పడుతుందన్న వార్తలు పుకార్లని, వాటిని నమ్మొద్దని కోరారు.
🏧🏧🏧🏧🏧🏧 *🌸అర్బన్ గురుకుల సిబ్బంది జీతాల పెంపు*

🔷పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ

♦ రాష్ట్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గౌరవ వేతనాలను పెంచింది. స్పెషల్ ఆఫీసర్ల జీతాన్ని రూ.25 వేలకు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల జీతాన్ని రూ.20 వేలకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ విద్యాధికారులను ఆదేశించారు.
🏧🏧🏧🏧🏧🏧 *💥మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా 'తెలుగు'* 

🔷భాషా పండితుల పదోన్నతులపై న్యాయసలహా : కడియం శ్రీహరి

♦వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్‌ వరకూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

♦ తెలుగుభాష ఆసక్తికర, మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా మార్పులు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో తెలుగు భాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.

♦ తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల లో మాతభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విషయాన్ని అధికారులు కడియంకు వివరిం చారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయ డంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలు లో అభ్యంతర లేదని చెప్పినట్లు సబ్‌ కమిటీ వివరిం చింది.

♦ ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లా డుతూ..భాషా పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల తెలుగు ప్రపంచ మహాసభల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. దీనికోసం న్యాయ సలహా తీసుకుని పదోన్నతులు జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలని ఆదేశించారు.

♦ సమావేశం లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జి కిషన్‌, తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అమలు సబ్‌ కమిటీ చైర్మెన్‌, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, తెలుగు అధికార భాష కమిషన్‌ చైర్మెన్‌ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ శేషుకుమారి, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సువర్ణ వినాయక్‌ పాల్గొన్నారు.
🏧🏧🏧🏧🏧🏧 *💥‘స్థానికత’లో కీలక మార్పులు* 

🔷7వ తరగతిలోపు 4 ఏళ్లు ఒకేచోట చదివి ఉండాలి 

🔷మల్టీ జోన్లు ఉండవు 

🔷సీఎం వద్దకు ముసాయిదా

♦ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి స్థానికతకు ఉన్న నిబంధనలో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ వారికి స్థానికత లభిస్తుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా ‘జోన్లు, స్థానికత’పై నియమించిన కమిటీ నిర్ణయించింది. ముసాయిదాను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనకు పంపారు.

♦ ఇప్పటివరకు 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత (లోకల్‌) హోదా లభించే విధానం అమల్లో ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 6వ తరగతి నుంచే తల్లిదండ్రులు పిల్లలను ఇతర జిల్లాలకు, నగరాలకు పంపి చదివిస్తున్నారు. దీనివల్ల కుటుంబం, నివాసం ఒక జిల్లాలో ఉంటే.. ఉద్యోగాల ఎంపిక వద్దకు వచ్చేసరికి మరో జిల్లాకు స్థానికులు అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాల పెంపుతో అది మరింత పెద్ద సమస్య అయింది. 

♦అందుకే ప్రాథమిక విద్యను ఎక్కువగా సొంత గ్రామంలో/మండలంలో/జిల్లాలో చదువుతారు కాబట్టి *1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును పరిగణలోకి తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. అంటే ఆ ఏడేళ్ల విద్యలో నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు/జోనల్‌/రాష్ట్రానికి స్థానికుడు అవుతారు.* నివాసం ఆధారంగా స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని భావించినా అక్రమంగా ధ్రువపత్రాలు సృష్టించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. 

♦ఉద్యోగాల ఎంపికకు, బదిలీకి జిల్లా, జోనల్‌, రాష్ట్ర అనే మూడు కేడర్లు మాత్రమే ఉంటాయి. మొదట్లో మల్టీ జోనల్‌ కూడా పెట్టాలని భావించినా దానిపై కమిటీ సుముఖత చూపలేదు. ఈ సిఫారసులతో తయారు చేసిన ముసాయిదాను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపారు. ఆయన ఏమైనా మార్పులు సూచిస్తే ఆమేరకు మార్చనున్నారు.
🏧🏧🏧🏧🏧🏧 *🔷ఇంటింటికి ‘మన తెలుగు’*

♦ తెెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ జీవన మూలాలను అందరికీ తెలియజెప్పాలని...వాటిపై విస్త్రతంగా ప్రచారం చేసి భాషను మరింత పరిపుష్ఠం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని *ప్రతి ఇంటికి ‘మన తెలుగు’ అనే చిన్న పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించనుంది.* దీన్ని ఉగాది కానుకగా అందరికీ సరఫరా చేయనుంది. మొత్తం కోటి పుస్తకాలను అందించాలన్నది లక్ష్యం కాగా కనీసం ఇంటికి ఒకటి చొప్పున ఇవ్వనుంది.

♦ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పేర్లు నమోదు చేసుకున్న వారికి, అతిథులకు ఇచ్చిన కిట్లలో తెలంగాణ వైభవం, మరికొన్ని ఇతర పుస్తకాలతోపాటు మన తెలుగు పేరిట జేబులో ఇమిడే పరిమాణంలో ఉన్న పుస్తకాన్ని కూడా అందించిన విషయం తెలిసిందే. ఆనాడు 50 వేల కాపీలను ముద్రించి పంపిణీ చేశారు. దాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుస్తకం ప్రయోజకరంగా ఉందని ప్రశంసించారు. దానికి మరికొన్ని అంశాలను చేర్చి తెలంగాణ అంతటా పంపిణీ చేయాలని, ఉగాది కానుకగా ఇద్దామని ఆయన ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి(ఓఎస్‌డీ) దేశపతి శ్రీనివాస్‌ను పురమాయించారు. 

♦ఈ క్రమంలో ఆయన నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) పుస్తకాన్ని సరికొత్తగా రూపొందించే పనిలో నిమగ్నమైంది. కోటి పుస్తకాలను ముద్రించనున్నారు. దీనివల్ల కొత్త తరానికి తెలుగు భాష, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు లాంటి వాటిపై అవగాహన పెరుగుతుందని, తెలుగుపై ఆసక్తి పెంచుకుంటారని భావిస్తున్నారు.

*♦పుస్తకంలో ఏమున్నాయంటే?*
తెలుగు మహాసభల సందర్భంగా రూపొందించిన మన తెలుగు పుస్తకంలో మొత్తం 18 పుటలున్నాయి. దీంట్లో తెలుగు వర్ణమాల, అంకెలు, వారాలు, తిథులు, పక్షములు, మాసాలు, రుతువులు, నక్షత్రాలు, రాశులు, కార్తెలు, సంవత్సరాలు, ఆయనాలు, తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు, ఘన, ద్రవ పదార్థాలను కొలిచే పద్ధతులు, పొడవులు, భూములు,  బంగారాన్ని కొలిచే పద్ధతులపై సమాచారాన్ని పొందుపరిచారు. 

♦ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, పంచభూతాలు, షట్‌ రుచులు, సప్త రుషులు, అష్ట దిక్కులు, నవరత్నాలు, దశావతారాలను కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా సుమతి, వేమన శతకాలు, గణపతి, సరస్వతి, గురు ప్రార్థÄనలను వివరించారు. తెలంగాణ నుంచి ఉద్భవించిన తెలుగులో తొలి సాహిత్య ప్రక్రియలు 22 పేర్లను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

*♦కొత్తగా చేర్చే అంశాలు త్వరలో ఖరారు:*
ప్రస్తుతం మన తెలుగులోని అంశాలకు అదనంగా జాతీయాలు, పండగలు వంటి వాటిని చేర్చనున్నారు. ఇంకా ఏయే అంశాలను చేర్చాలన్న దానిపై సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌తో సమావేశమై చర్చించి త్వరలో ఖరారు చేస్తామని ఎస్‌సీఈఆర్‌టీ వర్గాలు పేర్కొన్నాయి. పుస్తకాలను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు. పుస్తకం పేరును కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ పేరును కూడా త్వరలో ఖరారు చేయనున్నారు.
🏧🏧🏧🏧🏧🏧 *💥ప్రభుత్వ బడులు బాగుపడ్డాయ్‌!* 

🔷విద్యార్థులు-తరగతిగదుల నిష్పత్తి... 

🔷విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి.. 

🔷పాఠశాలల్లో బాలికల చేరిక, వసతులు తదితరాల్లో దేశవ్యాప్తంగా మెరుగుదల 

🔷2017-18 ఆర్థిక సర్వే వెల్లడి 

♦ అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు గత కొన్నాళ్లుగా మెరుగుపడ్డాయని 2017-18 ఆర్థిక సర్వే వెల్లడించింది. లింగ సమానత్వ సూచీ(జీపీఐ)లో అంతరం తగ్గుముఖం పట్టిందని, పాఠశాలల్లో చేరే బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే పేర్కొంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులూ సమకూరాయని తెలిపింది. ఇక పాఠశాల చదువులు పూర్తిచేసే వారి సంఖ్యా అధికమయ్యందని, మధ్యలోనే ఎగనామం పెట్టే వారి సంఖ్య తగ్గుముఖంపట్టిందని వివరించింది. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంపైనా సంతృప్తి వ్యక్తంచేసింది. మొత్తంగా విద్యార్థులు-తరగతి గదుల నిష్పత్తి(ఎస్‌సీఆర్‌), విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) మెరుగుపడి ప్రభుత్వ విద్యలో నాణ్యతకు బాటలుపరిచిందని సర్వే వివరించింది.

*♦ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ తరగతి గది...* 
ఒక విద్యాసంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎంత మంది విద్యార్థులకు ఒక తరగతి (ఎస్‌సీఆర్‌)ఉండాలో నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి 30 మంది చిన్నారులకు ఒక తరగతి గది ఉండటం ఆదర్శప్రాయం. 

* 2009లో 30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదుల జాతీయ సగటు 43 శాతం. 

* 2015-16లో అవి 25.7 శాతానికి తగ్గాయి. 

* కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్‌సీఆర్‌ మెరుగుపడిందని సర్వే వెల్లడించింది.

*♦రాష్ట్రాల వారీగా పీటీఆర్‌..*
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో జాతీయ సగటు మెరుగ్గానే ఉన్నా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి పీటీఆర్‌ 60:1గా ఉండటం గమనార్హం. ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని సర్వే పేర్కొంది. ఈ నాలుగు రాష్ట్రాలలోనూ పీటీఆర్‌ను 30:1స్థాయికి తీసుకురావాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది.

*♦లైంగిక సమానత్వ సూచీ(జీపీఐ)లో...* 
బేటీ పడావో, బేటీ బచావో వంటి కార్యక్రమాల అమలుతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేరే  బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే వెల్లడించింది. అయితే, ఉన్నత విద్యాసంస్థల్లో బాలికల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉందని పేర్కొంది.

*♦విద్యార్థులు - ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్‌)లో...* 
ప్రాథమిక విద్యలో పీటీఆర్‌ 30:1, ప్రాథమికోన్నత విద్యలో 35:1గా ఉండటం ఆదర్శప్రాయంగా భావిస్తారు. అయితే 2015-16లో మన జాతీయ సగటు నిష్పత్తి 23:1గా ఉంది. అంటే ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారు. 

* మనలాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితులున్న దేశాల పీటీఆర్‌తో పోల్చినప్పుడు భారత్‌లో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి మెరుగ్గానే ఉందని యునెస్కో గణాంక సంస్థ సమాచారం వెల్లడిస్తోంది. 

* 2015లో పీటీఆర్‌లో అంతర్జాతీయ సగటు 23.4:1 

* అదే సమయంలో చైనాలో పీటీఆర్‌ 16.3:1, బ్రెజిల్‌లో 20.9:1, రష్యాలో 19.8:1, దక్షిణాఫ్రికాలో 33.6:1గా ఉంది. 

* పొరుగుదేశాలైన శ్రీలంకలో పీటీఆర్‌ 23.2:1, నేపాల్‌లో 23.1:1, భూటాన్‌లో 26.7:1, పాకిస్థాన్‌ 46.3:1
🏧🏧🏧🏧🏧🏧
🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారం బట్టి ఆధారపడి ఉంటుంది..!
తాటిచెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు, మర్రిచెట్టు కిందనే ఉన్నా ఎందరో దానికింద సెదతీరుతారు..!! "
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని గాని మార్చాలి అని గాని ప్రయత్నించకండి.
మీరే మారండి...!
కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాంగాని రోడ్డంతా తీవాచి పరుస్తామా..!! "
         💦🐬🐥🐳💦
*💥షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్టీ*

🔷ఫిబ్రవరి 24-28 వరకు రాతపరీక్షలు

🔷 వాయిదా పుకార్లను నమ్మొద్దు : టీఎస్‌పీఎస్సీ

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతా యని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీ రాతపరీక్షలు వాయిదా పడతాయన్న పుకార్లను నమ్మొద్దని అభ్యర్థులను కోరింది.

♦ ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు టీఆర్టీ రాతపరీక్షలు నిర్వహిస్తామని, మార్చి 1 నుంచి 5 వరకు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వాటిపై మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది కీ మార్చి 25న విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని, మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుందని. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

♦టీఆర్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)కు 1,45,158 మంది, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ)కి 89,149 మంది, భాషా పండితులు (ఎల్‌పీ)కి 24,219 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)కు 2,177 మంది, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (పీఈటీ)కి 16,871 మంది చొప్పున మొత్తం 2,77,574 మంది దరఖాస్తు చేశారు.

♦ పాత పది జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. టీఆర్టీ వాయిదా పడుతుందని, మేలో తిరిగి రాతపరీక్షలు నిర్వహిస్తారని సోషల్‌ మీడియాలో వదంతులొచ్చాయి. ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్‌ను నవతెలంగాణ వివరణ కోరగా... టీఆర్టీని వాయిదా వేసే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. వాయిదా పడుతుందన్న వార్తలు పుకార్లని, వాటిని నమ్మొద్దని కోరారు.
🏧🏧🏧🏧🏧🏧
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

  *🔹సుభాషిత వాక్కు🔹*

*"సక్రమ మార్గంలో చేసిన పని ఏదైనా సత్ఫలితాలను ఇవ్వకుండా ఉండదు!"*

*"To be yourself in a world that is constantly trying to make you something else is the greatest accomplishment.”* 
               
    *🌷మంచి పద్యం🌷*

*ఆలి పిల్ల పాప అంతయు మాయరా*
*మధ్య వచ్చువన్ని మాయలేర*
*మంచి తనము నిల్చు మహినందునొక్కటి*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:* 

*భార్య , పిల్లలు ఐహిక అంశాలన్నీ మధ్యలో వచ్చు శాశ్వతత్వం లేనివి. ఒక్క మంచి తనమే ఈ జగతిన శాశ్వతమైనది.*

    *♦నేటి జీ కె*♦

1) *అటవీ విధానం -1952ను అనుసరించి దేశంలో వుండాల్సిన అడవుల శాతం?*

*A. 33.3శాతం*

2. *ఏ సంవత్సరంలో పెద్దపులిని జాతీయ జంతువుగా ప్రకటించారు?*

*A. 1973*

3. *భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నూతన అటవీ విధానాన్ని ప్రకటించింది?*

*A. 1988*

4. *దేశంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న ఘరియల్‌ జాతి ఏ ప్రాణికి సంబంధించింది?*

*A.  మొసలి*

5. *మొసళ్ళ సంరక్షణ కోసం దేశంలో క్రొకడైల్‌ బ్యాంక్‌ను ఎక్కడ ఏర్పాటు చేసారు?*

*A.  చైన్నై*

6. *క్షార జలారణ్యాలలో పెరిగే వృక్షాన్ని గుర్తించండి?*

*A.  సుందరీ*
🏧🏧🏧🏧🏧🏧
*✍ప్రభుత్వ బడులు బాగుపడ్డాయ్‌!* 

*👉విద్యార్థులు-తరగతిగదుల నిష్పత్తి...*

*👉విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి..*

*👉పాఠశాలల్లో బాలికల చేరిక, వసతులు తదితరాల్లో దేశవ్యాప్తంగా మెరుగుదల*

*👉2017-18 ఆర్థిక సర్వే వెల్లడి*

*❇ అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు గత కొన్నాళ్లుగా మెరుగుపడ్డాయని 2017-18 ఆర్థిక సర్వే వెల్లడించింది. లింగ సమానత్వ సూచీ(జీపీఐ)లో అంతరం తగ్గుముఖం పట్టిందని, పాఠశాలల్లో చేరే బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వే పేర్కొంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులూ సమకూరాయని తెలిపింది. ఇక పాఠశాల చదువులు పూర్తిచేసే వారి సంఖ్యా అధికమయ్యందని, మధ్యలోనే ఎగనామం పెట్టే వారి సంఖ్య తగ్గుముఖంపట్టిందని వివరించింది. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంపైనా సంతృప్తి వ్యక్తంచేసింది. మొత్తంగా విద్యార్థులు-తరగతి గదుల నిష్పత్తి(ఎస్‌సీఆర్‌), విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) మెరుగుపడి ప్రభుత్వ విద్యలో నాణ్యతకు బాటలుపరిచిందని సర్వే వివరించింది.*

*👉ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ తరగతి గది...* 

*❇ఒక విద్యాసంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎంత మంది విద్యార్థులకు ఒక తరగతి (ఎస్‌సీఆర్‌)ఉండాలో నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి 30 మంది చిన్నారులకు ఒక తరగతి గది ఉండటం ఆదర్శప్రాయం.*

* 👉2009లో 30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదుల జాతీయ సగటు 43 శాతం.* 

*👉 2015-16లో అవి 25.7 శాతానికి తగ్గాయి.*

* ❇కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్‌సీఆర్‌ మెరుగుపడిందని సర్వే వెల్లడించింది.*

*👉రాష్ట్రాల వారీగా పీటీఆర్‌..*

*❇విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో జాతీయ సగటు మెరుగ్గానే ఉన్నా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి పీటీఆర్‌ 60:1గా ఉండటం గమనార్హం. ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని సర్వే పేర్కొంది. ఈ నాలుగు రాష్ట్రాలలోనూ పీటీఆర్‌ను 30:1స్థాయికి తీసుకురావాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది.*

*_👉విద్యార్థులు - ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్‌)లో..._* 

*❇ప్రాథమిక విద్యలో పీటీఆర్‌ 30:1, ప్రాథమికోన్నత విద్యలో 35:1గా ఉండటం ఆదర్శప్రాయంగా భావిస్తారు. అయితే 2015-16లో మన జాతీయ సగటు నిష్పత్తి 23:1గా ఉంది. అంటే ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారు.* 

*❇ మనలాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితులున్న దేశాల పీటీఆర్‌తో పోల్చినప్పుడు భారత్‌లో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి మెరుగ్గానే ఉందని యునెస్కో గణాంక సంస్థ సమాచారం వెల్లడిస్తోంది.*

* 👉2015లో పీటీఆర్‌లో అంతర్జాతీయ సగటు 23.4:1* 

* ❇అదే సమయంలో చైనాలో పీటీఆర్‌ 16.3:1, బ్రెజిల్‌లో 20.9:1, రష్యాలో 19.8:1, దక్షిణాఫ్రికాలో 33.6:1గా ఉంది.*

*❇పొరుగుదేశాలైన శ్రీలంకలో పీటీఆర్‌ 23.2:1, నేపాల్‌లో 23.1:1, భూటాన్‌లో 26.7:1, పాకిస్థాన్‌ 46.3:1*
🏧🏧🏧🏧🏧🏧
*✍షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్టీ*

*👉ఫిబ్రవరి 24-28 వరకు రాతపరీక్షలు*

*👉 వాయిదా పుకార్లను నమ్మొద్దు : టీఎస్‌పీఎస్సీ*

*❇ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాతపరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతా యని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం టీఆర్టీ రాతపరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్టీ రాతపరీక్షలు వాయిదా పడతాయన్న పుకార్లను నమ్మొద్దని అభ్యర్థులను కోరింది.*

*❇ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు టీఆర్టీ రాతపరీక్షలు నిర్వహిస్తామని, మార్చి 1 నుంచి 5 వరకు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వాటిపై మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది కీ మార్చి 25న విడుదల చేస్తామని, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని, మే 10న టీఆర్టీ నియామకాల జాబితా విడుదలవుతుందని. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.* 

*❇టీఆర్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)కు 1,45,158 మంది, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ)కి 89,149 మంది, భాషా పండితులు (ఎల్‌పీ)కి 24,219 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)కు 2,177 మంది, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ (పీఈటీ)కి 16,871 మంది చొప్పున మొత్తం 2,77,574 మంది దరఖాస్తు చేశారు.*

*❇ పాత పది జిల్లాల ప్రకారం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. టీఆర్టీ వాయిదా పడుతుందని, మేలో తిరిగి రాతపరీక్షలు నిర్వహిస్తారని సోషల్‌ మీడియాలో వదంతులొచ్చాయి. ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్‌ను నవతెలంగాణ వివరణ కోరగా... టీఆర్టీని వాయిదా వేసే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. వాయిదా పడుతుందన్న వార్తలు పుకార్లని, వాటిని నమ్మొద్దని కోరారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍‘స్థానికత’లో కీలక మార్పులు* 

*👉7వ తరగతిలోపు 4 ఏళ్లు ఒకేచోట చదివి ఉండాలి*

*👉మల్టీ జోన్లు ఉండవు*

*👉సీఎం వద్దకు ముసాయిదా*

*❇తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి స్థానికతకు ఉన్న నిబంధనలో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ వారికి స్థానికత లభిస్తుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా ‘జోన్లు, స్థానికత’పై నియమించిన కమిటీ నిర్ణయించింది. ముసాయిదాను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనకు పంపారు.*

*❇ఇప్పటివరకు 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత (లోకల్‌) హోదా లభించే విధానం అమల్లో ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 6వ తరగతి నుంచే తల్లిదండ్రులు పిల్లలను ఇతర జిల్లాలకు, నగరాలకు పంపి చదివిస్తున్నారు. దీనివల్ల కుటుంబం, నివాసం ఒక జిల్లాలో ఉంటే.. ఉద్యోగాల ఎంపిక వద్దకు వచ్చేసరికి మరో జిల్లాకు స్థానికులు అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాల పెంపుతో అది మరింత పెద్ద సమస్య అయింది.*

*❇అందుకే ప్రాథమిక విద్యను ఎక్కువగా సొంత గ్రామంలో/మండలంలో/జిల్లాలో చదువుతారు కాబట్టి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును పరిగణలోకి తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. అంటే ఆ ఏడేళ్ల విద్యలో నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు/జోనల్‌/రాష్ట్రానికి స్థానికుడు అవుతారు. నివాసం ఆధారంగా స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని భావించినా అక్రమంగా ధ్రువపత్రాలు సృష్టించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.*

*❇ఉద్యోగాల ఎంపికకు, బదిలీకి జిల్లా, జోనల్‌, రాష్ట్ర అనే మూడు కేడర్లు మాత్రమే ఉంటాయి. మొదట్లో మల్టీ జోనల్‌ కూడా పెట్టాలని భావించినా దానిపై కమిటీ సుముఖత చూపలేదు. ఈ సిఫారసులతో తయారు చేసిన ముసాయిదాను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపారు. ఆయన ఏమైనా మార్పులు సూచిస్తే ఆమేరకు మార్చనున్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా 'తెలుగు'* 

*👉భాషా పండితుల పదోన్నతులపై న్యాయసలహా : కడియం శ్రీహరి*

*❇వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియేట్‌ వరకూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.*

*❇తెలుగుభాష ఆసక్తికర, మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా మార్పులు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో తెలుగు భాష తప్పనిసరి అమలుపై ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.*

*❇తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల లో మాతభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విషయాన్ని అధికారులు కడియంకు వివరిం చారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలలో కూడా తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయ డంపై ఆయా ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలు లో అభ్యంతర లేదని చెప్పినట్లు సబ్‌ కమిటీ వివరిం చింది.*

*❇ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లా డుతూ..భాషా పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల తెలుగు ప్రపంచ మహాసభల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. దీనికోసం న్యాయ సలహా తీసుకుని పదోన్నతులు జరిగేవిధంగా పరిష్కార మార్గాలను సూచించాలని ఆదేశించారు.*

*❇సమావేశం లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జి కిషన్‌, తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అమలు సబ్‌ కమిటీ చైర్మెన్‌, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, తెలుగు అధికార భాష కమిషన్‌ చైర్మెన్‌ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ శేషుకుమారి, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సువర్ణ వినాయక్‌ పాల్గొన్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍ఆర్‌సీ నం. 83లో మార్పులు స్వల్పమే..*

*❇హాజరులో అవకతవకలకు చెక్‌ పెట్టేందుకు విద్యాశాఖ పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారాన్ని ప్రధానోపాధ్యాయుల నుంచి తొలగించి ఎంఈవోలకు ఇస్తూ ఇటీవల ఆర్‌సీ నం.83ను జారీ చేసింది. అయితే దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. వారి ఆందోళన నేపథ్యంలో జీవోలో స్వల్ప మార్పులు చేసేందుకు అధికారులు అంగీకరించారు. సెలవు మంజూరు అధికారం మళ్లీ హెచ్‌ఎంలకు ఇవ్వాలని నిర్ణయించారు.*

*❇పలు నిబంధనల్ని అమలు చేయనున్నారు. హాజరు రిజిస్టర్‌ను హెచ్‌ఎంలతోపాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఎంఈవో వద్ద కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల హాజరు, సెలవులను కచ్చితమైన సమయంలోగా స్కూల్‌ కాంప్లెక్స్‌కు పాఠశాల హెచ్‌ఎం తెలియజేయాల్సి ఉంటుంది. హాజరు మాత్రమే కాకుండా మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోయినా హాజరు వేయించుకుంటే తనిఖీల్లో బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.*
🏧🏧🏧🦋🦋🦋🦋🦋🦋🦋🦋🏧🏧🏧
*🌍ఆన్‌లైన్‌లో టీచర్ల సెలవులు*

*❇ప్రత్యేకంగా యాప్‌ తయారు చేయిస్తున్న విద్యాశాఖ*

*🍥వచ్చే ఏడాది నుంచి అమలుకు కసరత్తు*

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

*🍥ఉపాధ్యాయుల గైర్హాజరును క్రమబద్దీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త విధానం తీసుకురాబోతున్నది. ఇటీవల సెలవుల మంజూరుపై ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర గందరగోళం నెలకొనడంతో ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో హాజరుతో పాటు సెలవుల మంజూరు విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేయిస్తున్నది.*

*🌀రాష్ట్రంలో 25,966 ప్రభుత్వ పాఠశాలలుండగా, వీటిలో 1.20లక్షల మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెలవుల దుర్వినియోగంపై చాలా ఏండ్ల నుంచి విమర్శలున్నాయి. కొంతమంది టీచర్లు పాఠశాలలకు రాకున్నా,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడుకుని వచ్చినట్టు చూపించుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల డిప్యూటీసీఎం కడియం శ్రీహరి వరంగల్‌ పర్యటనలో ఇలాంటి డుమ్మా టీచర్ల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ టీచర్లను సస్పెండ్‌ చేశారు.*

*🔊రాష్ట్ర మానిటరింగ్‌ బృందాలు పరిశీలనలోనూ ఇలాంటి విషయాలు బహిర్గతమయ్యాయి. టీచర్లు అటెండెన్స్‌ రిజిస్టర్లు సరిగా నిర్వహించడం లేదని తేలింది. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 12న ఆర్‌సీ 83 ఉత్తర్వులు తీసుకొచ్చారు. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ టీచర్లు సెలవులు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఎంఈఓ అనుమతి తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. దీనిపై టీచర్లు పెద్దఎత్తున ఆందోళనలు చేయడంతో, సర్కారు ఆదేశాల మేరకు విద్యాశాఖ వెనక్కి తగ్గింది. సెలవులిచ్చే అధికారం హెచ్‌ఎంలకే ఉంటుందనీ, సమా చారం మాత్రం ఎంఈఓతో పాటు కాంప్లెక్స్‌ హెచ్‌ఎంకు ఇవ్వాల్సిందేనని మరో ఉత్తర్వులు ఇచ్చేందుకు విద్యాశాఖ రెడీ అయింది. రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వనుంది*

*🌎ఇక ఆన్‌లైన్‌లో సెలవులు..*

*📣డుమ్మా టీచర్లను కట్టడి చేసేందుకు విద్యాశాఖ కొత్త ఆలోచన చేసింది. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే హాజరు, సెలవుల విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన యాప్‌ రూపకల్పన కోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మాట్లాడినట్టు తెలిసింది. ఏపీలోనూ ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానమే అమలులో ఉంది. తెలంగాణలోనూ ఈవిధానం తీసుకొచ్చేలా విద్యాశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే ఏపీలో పాఠశాల హెచ్‌ఎంకు ట్యాబ్‌లు ఇచ్చారు..దానిలో రోజూ టీచర్లు సంతకం చేయాల్సి ఉంది. సిగల్‌ సమస్యతో కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. దీంతో ఈ విధానం ఇక్కడ సాధ్యమవుతుందా..? అనే దానిపైనా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయులు యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సెలవులు ఎక్కడి నుంచైనా తీసుకునేందుకు అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ పదిన్నర లోపు పాఠశాలలకు హాజరైన టీచర్ల వివరాలను హెచ్‌ఎంల ద్వారా ఎంఈఓ, డీఈఓలకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేండ్ల క్రితం నిజామాబాద్‌లోనూ ఆ జిల్లా డీఈఓ లింగయ్య ఇలాంటి విధానమే అమలు చేశారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో ప్రస్తుతం అమలు కావడం లేదు. ప్రస్తుతం మధ్యాహ్నభోజనం వివరాల తరహాలోనే టీచర్ల హాజరు విధానం అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*✍అర్బన్ గురుకుల సిబ్బంది జీతాల పెంపు*

*👉పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ*

*❇ రాష్ట్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గౌరవ వేతనాలను పెంచింది. స్పెషల్ ఆఫీసర్ల జీతాన్ని రూ.25 వేలకు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల జీతాన్ని రూ.20 వేలకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ విద్యాధికారులను ఆదేశించారు.*
🏧🏧🏧🏧🏧🏧
*_✍నేడు రెండు నిమిషాలు మౌనం పాటించాలి_*

*👉ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం*

*❇హైదరాబాద్: జాతిపిత మహత్మగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉదయం 10:58 నుండి 11 గంటలకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరింది. ఎవరికివారు మౌనం పాటించాలని, ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేయాలని, హారన్లు ఆపేయాలని ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేసింది.*
🌻🏧🏧🏧🏧🏧🏧🌻 
*⬛ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థులకు సర్కారు మొండిచేయి!* 

*🔊ఉద్యోగాలివ్వడం సాధ్యంకాదని తేల్చిన విద్యాశాఖ*

*📋🖊డీఎస్సీ 96, 98, 2012ల్లో ఎంపికై అనివార్య కారణాలతో ఉద్యోగాలు పొందని వారికి తెలంగాణ సర్కారు మొండిచేయి చూపించేలా కనిపిస్తున్నది. నిన్నమొన్నటి వరకూ పోస్టింగ్‌లు ఇస్తామంటూ ఊరించిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. సోమవారం సచివాలయంలో డిప్యూటీసీఎం కడియం శ్రీహరితో విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థుల సమస్యపై చర్చించినట్టు తెలిసింది. ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని విద్యాశాఖ అధికారులు డిప్యూటీసీఎం కడియం దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. ఒక వేళ ఇస్తే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, చేసిన నియామకాలు నిలువవని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయం జరిగినట్టు సమాచారం. అయితే గతంలో ఓల్డ్‌ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.*

No comments:

Post a Comment