*🌏 చరిత్రలో ఈరోజు 🌎*
*🌅జనవరి 27*🌅
*🏞సంఘటనలు*🏞
1926: మొట్టమొదటి సారి టెలివిజన్ను - లండన్ లో - ప్రదర్శించారు.
1988: భారత్లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
*🌻🌻జననాలు*🌻🌻
1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు.
1928: పోతుకూచి సాంబశివరావు, ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది.
1936: కోడూరి కౌసల్యాదేవి, సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.
1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
1979: డానియెల్ వెట్టోరీ, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.
*🌹🌹మరణాలు*🌹🌹
1986: అనగాని భగవంతరావు, ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923)
2008: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
2009: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)
2010: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
🏧🏧🏧🏧🏧🏧*"మోసేది బరువనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యతనుకుంటే మోయాలనిపిస్తుంది"*
*"నువ్వు ప్రయత్నిస్తుంటే చూసి నవ్వేవాడికి ఏదోరోజు నువ్వు గెలిచాక చెప్పే ప్రతీమాటా ఓ పుస్తకం అవుతుంది"*
*"నీకెప్పుడు ఓడిపోయాననిపిస్తే అప్పుడు చచ్చిపో,తెల్లారితే మళ్లీ పుట్టు మరో కొత్త ప్రయత్నంతో"*
*"నువ్వెంటో తెలుసుకోవడానికి వేదాంతం అవసరం లేదు, కాసింత ఏకాంతం చాలు"*
*"కన్నీళ్లు కళ్లలోంచి బయటికి పోతే బాధ పోతుంది, లోపలికి పోతే బాధ్యత పెరుగుతుంది"*
*"నువ్వు ఒంటరి అని నీకు అనిపిస్తుందంటే ప్రపంచానికి నువ్వెంటో చూపించే సమయం దగ్గరకొచ్చిందని అర్ధం"*
*శుభోదయం*
🔲 సూక్తులు
▪నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.
▪నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది.
▪నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.
▪నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను
▪న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
▪పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది - అర్బిక్పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది.
🏧🏧🏧🏧🏧🏧
_*శుభోదయం*_
--------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
-------------------------
" సంతృప్తి లేనివాడికి కోటి రూపాయిలు దొరికినా దండగే..!
సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయిలు సంపాదించినా పండగే..!! "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" అకారణంగా ఓ వ్యక్తి నీ మీద అతి ప్రేమ చూపుతున్నాడంటే అతడు నిన్ను మోసం చేసే ఉంటాడు..!
లేదా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటాడు..!!"
🏧🏧🏧🏧🏧🏧📖 మన ఇతిహాసాలు 📓*
*వాలి - సుగ్రీవులు*
వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు (ఋక్షరజుడు?) అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకంకి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగంలోను, కంఠభాగంలోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములొ వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగంలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు.
*వాలి , సుగ్రీవులు మద్య వైర్యం*
సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడిని బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి, దుఃఖిస్తూ కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు. అయితే కొంత కాలానికి వాలి తిరిగి వచ్చాడు. దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండ బిలాన్ని మూసివేశాడని దూషించి అతన్ని రాజ్యంలోంచి తరిమేశాడు. తన అనుచరులైన హనుమంతుడు, మరి కొద్ది మంది పరివారంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తల దాచుకొన్నాడు.
రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే “వాలి” కథ కూడా ఒకటి. పూర్వం వాలి, సుగ్రీవులు అనే ఇద్దరు సోదరులు వుండేవారు. వీరిద్దరిలో సుగ్రీవుడు ఎంత ఉత్తముడో వాలి అంత హీనుడు. ఇద్దరూ చూడటానికి ఒకేరకంగా వుండటం వల్ల వాలి దానిని అదునుగా తీసుకుని ఎన్నో పాపాలను చేసి, వాటిని సుగ్రీవుని మీద మోసేసేవాడు. అలాగే సుగ్రీవుడు చేసే మంచి పనులకు ఇతను చేసినట్టుగా నలుగురిలో చెప్పుకునేవాడు.
ఒకనాడు ఏ విధంగా అయితే రావణాసురుడు, సీతమ్మకు అపహించుకుపోయాడో అదేవిధంగా వాలి కూడా సుగ్రీవునిని బాగా కొట్టి, గాయపరిచి అతని భార్య అయిన ‘‘రుమ''ను ఎత్తుకుపోతాడు. ఆమెను కిష్కింధలో బంధించి దాచేస్తాడు. దీన్ని బట్టే తెలుస్తుంది సుగ్రీవుడు ఎంత ఉత్తముడో, వాలి అంత హీనుడని. ఈ ఘోర అవమానాన్ని భరించలేక సుగ్రీవుడు తన రాజ్యం నుంచి పారిపోయి ఋష్యమూకపర్వతంపై నివాసాన్ని ఏర్పరుచుకుంటాడు.
హనుమంతుడు మొదలైనవారితో కలిసి ఉంటూ భార్యను కలుసుకునే రోజు కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. కొన్నాళ్ల తరువాత అతనున్న ప్రదేశానికి సీతాన్వేషణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, హనుమంతులు, వారి సైన్యం తదితరులు అక్కడికి చేరుకుంటారు.
మొదట్లో సుగ్రీవుడు వారిని చూసి, తనను చంపడానికి వచ్చిన వారని భావించి హనుమంతుడితో గొడవ పడతాడు. అనంతరం రాముడిని చూసి తన తప్పును తెలుసుకొని వారి పట్ల సద్భావం కలిగి ఉంటాడు. తన సోదరుడు చేసిన దురాగతాన్ని వారికి వివరిస్తాడు. అతని విషాదగాధను విన్న రామదండు అతని రాజ్యాన్ని, భార్యని తిరిగి రప్పించేలా సహాయం చేస్తామని మాటిస్తారు.
రాముడు ఇలా చెబుతుండగానే సుగ్రీవుడు “వాలి ఎంతో బలశాలి. అతన్ని జయించడం అంత సులభం కాదు.” అని చెబుతాడు.
అప్పుడు రాముడు చిరునవ్వుతో తన విల్లును తీసి, ఒకే ఒక్క బాణంతో “సప్తతాళశ్రేణి”ని (ఏడు తాటిచెట్ల వరుస) కూల్చేస్తాడు. అది చూసిన సుగ్రీవుడు రాముడు ఎంతటి పరాక్రమబలవంతుడో తెలుసుకుంటాడు.
ఇది గడిచిన కొన్నాళ్ల తరువాత శ్రీరాముడు చెప్పినట్లుగానే సుగ్రీవుడు, వాలిని యుద్ధానికి పిలుస్తాడు. దాంతో వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఒక చెట్టుచాటులో వున్న శ్రీరాముడు, వాలికి సూటిగా బాణం వేయగా అది అతనికి తగులుతుంది. ఆ దెబ్బకు మూర్ఛపడిపోయిన వాలి “చెట్టు చాటు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా?” అని అడుగుతాడు వాలి.
అతని చెప్పిన మాటలకు రాముడు కోపాద్రిక్తుడై “తమ్ముణ్ణి చావకొట్టి, అతని భార్యను అపహరించుకుపోవడం న్యాయమా?” అని ప్రశ్నిస్తాడు రాముడు.
అప్పుడు వాలి తన తప్పును తెలుసుకుని, క్షమించమని పశ్చాత్తాపడతాడు.
“హే రామా! నీలాంటి మహోన్నత వ్యక్తి చేతిలో చావడం నా భాగ్యం.” అంటూ తుది శ్వాసను విడుస్తాడు. రాముని చలవతో సుగ్రీవుడు తన భార్యను చేరుకోవడమే కాకుండా తన రాజ్యం అయిన కిష్కింధను దక్కించుకుంటాడు.
*వాలి చివరి కోరికలు*
వాలి ఇలా అన్నాడు - “రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.”
తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.
పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.
అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు
🏧🏧🏧🏧🏧🏧
*✅ తెలుసుకుందాం ✅*
*⭕పాలకూర, టమాటా రెండూ కలిస్తేరాళ్లవుతాయా?*
✳పాలకూర, టమాటా కలిపి వండుకుని తింటే చాలు రాళ్లు ఏర్పడతాయనేంత తీవ్ర స్థాయిలో దీన్ని నమ్మక్కర్లేదు. అయితే ఇలా చెప్పడానికి కొంత వరకూ కారణం కూడా లేకపోలేదు. పాలకూరతో పాటు ఏ కూరలోనైనా, నీళ్లలో అయినా కాల్షియం, మెగ్నీషియం లవణాలుంటాయి. టమాట, చింతపండు వంటి వాటి రసాల్లో టార్టారిక్, ఆక్టాలిక్ ఆమ్ల లవణాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం అయాన్లు, టార్టరేట్ లేదా ఆక్సలేట్ అయాన్లు కలిసినప్పుడు వాటి గాఢత ఎక్కువ మోతాదులో ఉంటే అవి కాల్షియం టార్టరేట్ లేదా కాల్షియం ఆక్సిలేట్‌గా అవక్షేపం (precipitate) అవుతాయి. వీటి ద్రావణీయత (solubility) తక్కువ. అయితే కిడ్నీలు వడబోయలేనంత అధికమోతాదులో ఈ లవణాలను కూరగాయల్లో ఉండవు. కాబట్టి పరిమిత స్థాయిలో వాడితే ప్రమాదం లేదు.
🏧🏧🏧🏧🏧🏧
*✍🏼 నేటి కథ ✍🏼*
*🐊నవ్వులు - కన్నీళ్ళు*
నైలునది ఒడ్డున, సాయంకాలం పూట, నది ప్రశాంతంగా ఉన్న సమయంలో హైనా ఒకటి, ఒక మొసలిని కలిసింది. రెండు ఆగి, ఒకదానినొకటి పలకరించుకున్నాయి.
హైనా అడిగింది "బాగున్నారాండీ, మొసలిగారూ? ఎలా ఉంటోంది, మీ జీవితం?" అని.
మొసలి అన్నది, "అయ్యో ఏం చెప్పను, అస్సలు బాగాలేదు. నా బాధలో, దుఖంతో ఒక్కోసారి నేను ఏడుస్తాను. అప్పుడు చూసిన ప్రతి ప్రాణీ "అవి కేవలం 'మొసలి కన్నీళ్ళే' " అని తీసి పారేస్తుంటారు. అది విన్నప్పుడల్లా నాకు చెప్పలేనంత బాధకలుగుతుంది. అని.
అప్పుడు హైనా అన్నది- "నువ్వు నీ బాధ గురించీ, నీ దు:ఖం గురించీ చెప్పుకుంటున్నావు.
కానీ నా గురించి కూడా ఆలోచించు కొంచెం. నేను ఈ ప్రపంచపు అందాల్ని చూసీ చూసీ, దానిలోని అద్భుతాల్ని, వింతల్నీ గమనించి, ఆశ్చర్యానందాలతో, ప్రకృతి నవ్వుతో శృతి కలిపి నవ్వుతాను. అప్పుడల్లా అడవిలోని మనుషులు అంటారు: " 'ఇది కేవలం హైనా నవ్వే' అని!"
🏧🏧🏧🏧🏧🏧
*🤘 నేటి సుభాషితం🤘*
*తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి, ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. -మహాత్మాగాంధీ.*
🏧🏧🏧🏧🏧🏧
*👬 నేటి చిన్నారి గీతం 👬*
*సర్వ మతాలకు నిలయం*
సర్వమతాలకు నిలయం వేదాలకు ఆలయం
ఇదే ఇదే మన భారతం భావి పౌరులకు అంకితం
"సర్వమతాలకు"
ఉత్తర హిమగిరి శిఖరం దిగువన సాగర సదనం
గంగా యమున బ్రహ్మపుత్ర జీవనదులు ప్రవహించే దేశం
"సర్వమతాలకు"
అశోకుడిచ్చిన ధర్మ చక్రమూ గాంధీ నడిపిన సత్యాగ్రహమూ
ఆంగ్లేయులను తరిమి కొట్టిన రామరాజులు పుట్టిన దేశం
"సర్వమతాలకు"
వాల్మీకి ఇచ్చిన రామాయణము వేద వ్యాసుడి మహాభారతం
ప్రపంచానికి సున్నా నేర్పిన ఆర్యభట్టును కన్న దేశం
"సర్వమతాలకు"
చంద్రుని మీద వేసెను పాగా రాకెట్లు పంపే శ్రీహరి కోట
నాలుగు దిక్కులా విస్తరించిన ఐటి నిపుణులు ఉన్న దేశం
"సర్వమతాలకు"
🏧🏧🏧🏧🏧🏧
*💎 నేటి ఆణిముత్యం 💎*
పరజనము లాచరించెడి
దురితంబునఁగ్రోదగుణము దోఁచెడి నదిక
స్పురణన్ క్షమ గైకొనినం
దఱగు నది యెఱింగి
దగును గుమారీ!
భావం:-
ఓ కుమారీ!ఇతరుల చెడ్డగుణములు కోపమును కలుగచేయును,కాని జ్ఞానమెరిగి శాంతమును అలవర్చుకొనుము.శాంతమువలన కోపము నశించును.ఇది తెలిడికొని ప్రవర్తించుము
🏧🏧🏧🏧🏧🏧
*🗓 నేటి పంచాంగం 🗓*
*తేది : 27, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 11 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(నిన్న ఉదయం 7 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 2 ని॥ వరకు)
యోగము : బ్రహ్మము
కరణం : గరజ
వర్జ్యం :
ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 4 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 6 గం॥ 49 ని॥ నుంచి ఉదయం 8 గం॥ 13 ని॥ వరకు)
యమగండం :
(మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 17 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 8 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : వృషభము
విశేషం : సంకష్టహర చతుర్థి
🏧🏧🏧🏧🏧🏧
*📣బయటి రాష్ర్టాల డిస్టెన్స్ డిగ్రీలు చెల్లవు*
*♻అనుమతి నిరాకరిస్తున్న ఉన్నతవిద్యామండలి*
*🔊ఇగ్నో, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు అనుమతి*
*🌀బయటిప్రాంతాల వర్సిటీలు జారీచేసే ధ్రువపత్రాలు ఇక మీదట చెల్లవు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరరాష్ర్టాల యూనివర్సిటీలు రాష్ట్రంలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి ధ్రువపత్రాలను జారీచేస్తున్నాయి. విద్యార్థులు ఆ ధ్రువపత్రాలను పొంది పలు కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఇతరరాష్ర్టాల వర్సిటీలు జారీచేసే ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దని ఉన్నతవిద్యామండలి రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలకు సూచించింది. ప్రత్యేకచట్టం ద్వారా ఏర్పడ్డ ఇగ్నో, బీఆర్ అంబేద్కర్ వర్సీటీలు జారీచేసే ధ్రువపత్రాలను మాత్రమే అనుమతిస్తామని ఉన్నతవిద్యామండలి పేర్కొన్నది. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం దూరవిద్య కేంద్రాలకు అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీలు ఆయా రాష్ర్టాల పరిధిలోనే స్టడీసెంటర్లు ఏర్పాటు చేసుకోవాలి. అందుకు విరుద్ధంగా వర్సిటీలు జారీచేస్తున్న ధ్రువపత్రాలను ఉన్నతవిద్యామండలి అంగీకరించడం లేదు. విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, న్యాయవిద్య, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల సర్టిఫికెట్లను ఇతర రాష్ర్టాల యూనివర్సిటీల ద్వారా పొందుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.*
*🔺యాజమాన్య కోటా కింద ఆయా కళాశాలలు భర్తీ చేసుకున్న సీట్లను తిరిగి విద్యామండలి అంగీకరించాల్సి (రాటిఫికేషన్) ఉంటుంది. 2017-18 విద్యాసంవత్సరంలో దూరవిద్య కేంద్రాల నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకుని యాజమాన్య కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఇప్పటివరకు వంద మందికిపైగా ఉన్నారని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కోర్సులకు మాత్రమే తాము అనుమతి ఇస్తున్నామని విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మిగతా వాటిని తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. దూరవిద్యావిధానంలో బీఏ, బీకాం వంటి కొన్ని పరిమితమైన కోర్సులకే అనుమతి ఉంటుంది. ఇంజినీరింగ్, బ్యాచ్‌లర్ ఆఫ్ లా వంటి కోర్సులకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డెక్) అనుమతి ఇవ్వడం లేదు. న్యాయవిద్యకు సంబంధించిన కోర్సులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇంజినీరింగ్ కోర్సులకు ఐఏసీటీఈ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. దూర విద్యావిధానం ద్వారా ఇంజినీరింగ్ ధ్రువపత్రాలను జారీచేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. ఎంటెక్ వంటి కోర్సుల్లో చేరేందుకు రెగ్యులర్ విద్యావిధానం ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీలు జారీచేసిన ధ్రువపత్రాలకే తాము అనుమతిస్తున్నట్టు అధికారులు స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఇతర రాష్ర్టాల వర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్లను అంగీకరించవద్దని ఉన్నతవిద్యామండలి అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*1⃣ఇకమీదట నీట్‌కు ఒకే ప్రశ్నాపత్రం*
*🌼దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, దంత వైద్య (బీడీఎస్) కోర్సులకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్)లో ఈ ఏడాది నుంచి ఒకే సెట్ ప్రశ్నా పత్రం ఇవ్వనున్నట్లు సుప్రీం కోర్టుకు సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎఫ్.ఎ.నజీర్లతో కూడిన ధర్మాసనానికి సీబీఎస్‌ఈ ఈ మేరకు వెల్లడించింది. గతంలో హిందీ, ఇంగ్లిష్ సహా దాదాపు పది ప్రాంతీయ భాషల్లో వేరు వేరు ప్రశ్నాపత్రాలతో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఈ విధంగా వేరు వేరు ప్రశ్నాపత్రాలతో పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయడం సాధ్యపడదని, ఇది ఆమోదయోగ్యంగా లేదని గతంలో సుప్రీం కోర్టు సీబీఎస్‌ఈకి స్పష్టం చేసింది*
*💠అన్ని ప్రశ్నా పత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలన్నీ ఒకే స్థాయిలో ఉన్నప్పుడు వేరు వేరు ప్రశ్నా పత్రాల సెట్లు ఉండడంలో ఎలాంటి ఇబ్బందులుండవని సీబీఎస్‌ఈ చేసిన వ్యాఖ్యలను సుప్రీం తోసిపుచ్చింది. దీంతో సుప్రీం కోర్టు చేసిన సిఫార్సుల మేరకు ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి నీట్‌లో ఒకే ప్రశ్నా పత్రాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా చర్యలు తీసుకుంటామని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఒకే ప్రశ్నా పత్రం ఉండేలా సీబీఎస్‌ఈకి సిఫార్సు చేయాలని సంకల్ప్ ఛారిటబుల్ ట్రస్టు వ్యాజ్యం వేసిన నేపథ్యంలో సుప్రీం ఈ విచారణ చేపట్టింది.*
🏧🏧🏧🏧🏧🏧
*🌀రెండు మూడు నెలల్లో గ్రూప్-4 ప్రకటన*
*♦టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి*
*⚠రెండు మూడు నెలల్లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ప్రభుతాన్ని సంప్రదించిన అనంతరం నోటిఫికేషన్ వెలువరిస్తామన్నారు. శుక్రవారం ఆయన టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత, వేగం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో టీఎస్‌పీఎస్సీకి వివిధ వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఉద్యోగుల పనితీరు వల్లే టీఎస్‌పీఎఎస్సీకి గుర్తింపు దక్కిందన్నారు. కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి, సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.*
🏧🏧🏧🏧🏧🏧
*🔇పంచాయతీ ఎన్నికల ముందస్తు లేదు!*
*♦ఫిబ్రవరిలో నిర్వహణ లేనట్టే.. గ్రామీణ ఓటర్ల జాబితా సవరణే అడ్డంకి*
*🔹జాబితా సవరణకు షెడ్యూలు విడుదల.. మార్చి 24న తుది జాబితా*
*♦ఆ తర్వాతే ఎన్నికల ఆలోచన.. సూచనప్రాయంగా తెలిపిన సీఎం*
*🔺అసెంబ్లీ ప్రత్యేక భేటీ లేదు.. బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త చట్టం*
*🔊రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి ఓటర్ల జాబితా సవరణ రూపంలో ఊహించని అవరోధం ఎదురైంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండాపోయింది.*
*♻రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది జూలై 31తో ముగుస్తున్నది. ఈ నేపధ్యంలో మరో ఆర్నెల్ల సమయం ఉన్నా ప్రభుత్వం ముందస్తు పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడింది. వీటిని ఫిబ్రవరిలో నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. తండాలకు పంచాయతీ హోదా, కొత్త పంచాయతీల ఏర్పాటు, సరిహద్దుల గుర్తింపు వంటి ప్రక్రియల పూర్తికి జిల్లాల అధికార యంత్రాంగాన్ని పురమాయించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం తయారీకి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.*
*🌀త్వరితగతిన చట్టాన్ని ఆమోదింపజేసుకోవటానికి ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు కూడా సీఎం ప్రకటించారు. అయితే, రాష్ట్రంలోని 83 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఈనెల 23న షెడ్యూల్‌తోపాటు ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకోవటానికి, జాబితాలో చేర్పులు, మార్పులు, పేరు గల్లంతైనవారు తిరిగి నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మార్చి 22న ఓటర్ల తుది జాబితాను ముద్రించి, 24న విడుదల చేయనున్నారు.*
*🍥ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించడం అసాధ్యం. మార్చి 24 వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ వీలు కాదని సీఎం కేసీఆర్ శుక్రవారం కొద్దిమంది మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచనప్రాయంగా తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకల్లో పాల్గొని తనతోపాటు ప్రగతి భవన్‌కు వచ్చిన వారితో ఆయన కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని గట్టిగా అనుకున్నా, ఓటర్ల జాబితా సవరణతో వీలు కావటం లేదని చెప్పారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఇక చట్టం ఆమోదానికి తొందర ఎందుకని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.*
*🔺ఎలాగూ మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ సెషన్‌లోనే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించుకుందామని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యాక పంచాయతీ ఎన్నికల నిర్వహణ చూద్దామని అన్నారు. కాగా, మార్చి 11 నుంచి ప్రారంభించ తలపెట్టిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సన్నద్ధత తదితర అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.*
*పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నో ఏళ్ల భూ వివాదాలకు తెరపడబోతోందని, ఈ విషయమై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. బడ్జెట్ సమావేశాల కోసం శాఖల వారీగా సిద్ధం కావాలని ఆదేశించారు. సభలో విపక్షాలు లేవనెత్తే అంశాలను ముందే అంచనా వేసి, తగిన రీతిలో స్పందించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే, ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హైకోర్టు విభజన, రిజర్వేషన్ల పెంపు సహా రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి గట్టిగా పోరాడాలని పార్టీ ఎంపీలకు నిర్దేశించారు.*
🏧🏧🏧🏧🏧🏧
*🆕కొత్త ఆలోచనలకు కేంద్రం నిధులు*
*🔊సర్కారు బడులకు రూ. 69.74 కోట్లు మంజూరు*
*❇తెలంగాణకు రూ. 4.34 కోట్లు*
*🔷ఆంధ్రకు రూ. 6.18 కోట్లకు ఆమోదం*
*📕విశ్వవిద్యాలయాల స్థాయిలోనే కాదు సర్కారు పాఠశాలల్లోనూ విద్యార్థులకు సమాచార, సాంకేతికతను పరిచయం చేస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నవకల్పన ప్రణాళికకు పచ్చజెండా ఊపింది. నవకల్పన నిధి పేరిట ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకూ నిధులివ్వనుంది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా రూ.69.74 కోట్లు మంజూరు చేసింది.*
*📚తెలంగాణలోని విద్యార్థుల్లో చదివే అలవాటును పెంచేలా పాఠశాలల్లో గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నవకల్పన నిధి కింద నిధులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆయా రాష్ట్రాల పాఠశాల విద్యాశాఖలను కోరింది. వర్చువల్ తరగతి గదులు, డిజిటల్ తరగతులు, డిజిటల్ గ్రంథాలయాలు, టింకరింగ్ ప్రయోగశాలలు, సౌర విద్యుత్తుపై అవగాహన తదితర వినూత్న ప్రతిపాదనలు అందాయి. మొత్తం రూ.823.33 కోట్లకు ప్రతిపాదనలు అందగా అందులో రూ.69.74 కోట్లకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) అధికారులు ఆమోదం తెలిపారు. తెలంగాణకు రూ.4.34 కోట్లు మంజూరయ్యాయి. ఏపీకి రూ.6.18 కోట్లకు ఆమోదం దక్కింది.*
*📖చదివే అలవాటు పెంచే లక్ష్యం: తెలంగాణ విద్యాశాఖ రూ.97.11 కోట్ల విలువైన రెండు ప్రతిపాదనలు పంపింది. 445 పాఠశాలల్లో డిజిటల్ ప్రయోగశాలలు, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతిపాదించింది. ఒక్కో డిజిటల్ ప్రయోగశాలకు రూ.8.63 లక్షలు చొప్పున రూ.38.40 కోట్లు, ఒక్కో గ్రంథాలయానికి రూ.10.90 లక్షలు చొప్పున మొత్తం రూ.48.71 కోట్లు అవసరమని కోరింది. కేంద్రం మాత్రం ఒక్కో పాఠశాలలో రూ.4.34 లక్షలతో 100 పాఠశాలల్లో గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో బడిలో రూ.2 లక్షలు మౌలిక వసతుల కల్పనకు, మిగతా రూ.2.34 లక్షలు పుస్తకాల కొనుగోలుకు అందనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ నిధులు రానున్నాయని ఆర్‌ఎంఎస్‌ఏ సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు.*
🏧🏧🏧🏧🏧🏧
*⬆‘అడ్వాన్సుడ్’ పరీక్ష కేంద్రాల పెంపుదల*
*🖥ఆన్‌లైన్ విధానంతో విద్యార్థులకు మరింత చేరువ*
*1⃣దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్సుడ్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో ఈ సారి పరీక్షలు జరిగే నగరాలు, పట్టణాల సంఖ్య పెరిగింది. దీంతో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పరీక్ష రాసే అవస్థలు తప్పనున్నాయి.*
*♻ఐఐటీల్లో ప్రవేశానికి వచ్చే మే 20న జేఈఈ అడ్వాన్సుడ్ నిర్వహించనున్నారు.*
*🌼ఇప్పటివరకు జేఈఈ మెయిన్ మాత్రమే రెండు విధానాల్లో (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్) జరుపుతుండగా.. తొలిసారిగా అడ్వాన్సుడ్ పరీక్షను కేవలం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఇప్పటికే ఐఐటీ కౌన్సిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన సవివర కరపత్రాన్ని(బ్రోచర్) ఐఐటీ కాన్పూర్ శుక్రవారం విడుదల చేసింది.*
*🍥గతంలో మాదిరిగానే కామన్ మెరిట్ జాబితా (సీఎంఎల్.. జనరల్ కేటగిరీ విద్యార్థి) కింద ఉత్తీర్ణులు కావాలంటే 35 శాతం మార్కులు దక్కించుకోవాలి. మొత్తం 2.24 లక్షల మందిని అడ్వాన్సుడ్ పరీక్ష రాయడానికి ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను జేఈఈ అడ్వాన్సుడ్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.*
*💠తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పరీక్షా కేంద్రాలు*
*⚠గతేడాది వరకు ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలు ఉండేవి. ఈ సారి వాటికి అదనంగా అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, ఒంగోలులలోనూ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణలో ఇప్పటి వరకు హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో పరీక్షా కేంద్రాలు ఉండగా.. ఈ సారి కొత్తగా కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ నగరాలనూ చేర్చారు.*
*🛡ఇదీ అడ్వాన్సుడ్ కాలపట్టిక*
*🌀ఏప్రిల్ 30: జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడి*
*📚మే 2-7వ తేదీ వరకు: అడ్వాన్సుడ్ పరీక్షకు రిజిస్ట్రేషన్*
*🔷మే 14-20: హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు*
*♦మే 20: జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష (3 గంటల సమయం)*
🔘మే 22-25
*విద్యార్థులుపూర్తిచేసినఓఎంఆర్‌పత్రాన్నిమయిల్‌కు పంపిస్తారు*
*🔷మే 29: ఆన్‌లైన్‌లో పరీక్ష కీ పెడతారు*.
*♦మే 29-30: కీపై అభ్యంతరాల స్వీకరణ*
*♻జూన్ 10: అడ్వాన్సుడ్ ర్యాంకుల వెల్లడి*
*🔰జూన్ 10-11: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు రిజిస్ట్రేషన్*
*📋🖋జూన్ 14: ఆర్కిటెక్చర్ పరీక్ష*
*🌀జూన్ 18: ఆర్కిటెక్చర్ ర్యాంకుల వెల్లడి*
*♦జూన్ 19- జులై 15 వరకు: సీట్ల కేటాయింపు ( కౌన్సెలింగ్ ద్వారా)*
🏧🏧🏧🏧🏧🏧
*📚దూర విద్య.. అంతా మిథ్య!*
*❇ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా శ్రీనివాస్‌రెడ్డి డిగ్రీ చేశాడు. తెలంగాణ ఐసెట్ రాసి మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీఏలో చేరాడు.ర్యాటిఫికేషన్ కోసం అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యామండలికి వెళ్లగా పరిశీలించిన అధికారులు అతని సర్టిఫికెట్ చెల్లదని ప్రవేశాన్ని తిరస్కరించారు.*
- సిక్కిం మణిపాల్
*♻యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. తెలంగాణ లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్నీ ఉన్నత విద్యామండలి తిరస్కరించింది.*
*🌀ఇలా ఒకరు.. ఇద్దరు కాదు వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. విద్యలోనే కాదు ఉద్యోగాల్లోనూ ఇలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యామండలి తిరస్కరిస్తోంది. సుప్రీంకోర్టు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్‌డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని రాష్ట్ర యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి.. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ(ఎఫ్‌ఎన్‌ఓ డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. ఈ నిబంధనను తెలంగాణ ఉన్నత విద్యామండలి పక్కాగా అమలు చేస్తోంది. ఫలితంగా అనేక మంది విద్యార్థులు వివిధ కోర్సుల ప్రవేశాల్లో తిరస్కరణకు గురవుతున్నారు. దీంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రాష్ట్రంలోని స్టడీ సెంటర్ల ద్వారా 2013 తర్వాత చదివిన చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.*
*🔊50 ఇతర రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లు*
*🌼ఇతర రాష్ట్రాలకు చెందిన 50 వరకు రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య వంటి కోర్సులను దూర విద్య ద్వారా అందిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే వేల కాలేజీల్లో ఆయా విద్యా సంస్థలు 150 కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. వాటిల్లో 2 లక్షల మంది విద్యార్థులు వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఏపీలోని ఓ స్టడీ సెంటర్ ద్వారా అక్కడి వర్సిటీలో చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుతుంది.. అదే వర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్య స్టడీ సెంటర్ ద్వారా చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు కాదు. దీనిపై ప్రచారం లేకపోవడంతో విద్యార్థులకు తెలియడం లేదు. ఇతర రాష్ట్ర వర్సిటీలు ఆదాయం కోసం ఈ విషయాన్ని దాచిపెట్టి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.*
*♦ఉద్యోగాల్లోనూ తిరస్కరణ!*
*🔷ఇలాంటి సర్టిఫికెట్లను విద్యా ప్రవేశాల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆ సర్టిఫికెట్లను ఉద్యోగ నియామకాల విభాగాలు తిరస్కరిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటుండటంతో పలువురు అభ్యర్థులు ఉద్యోగాల్లోనూ తిరస్కరణకు గురి కావాల్సివస్తోంది.*
*🍥యూజీసీ నిబంధనల ప్రకారమే*
*💠యూజీసీ దూర విద్య, ఆఫ్ క్యాంపస్‌ల టెరిటోరియల్ జ్యూరిస్‌డిక్షన్ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర వర్సిటీ మరో రాష్ట్రంలో దూర విద్య కేంద్రాలను ఏర్పాటు చేసి కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. అందుకే అలా వచ్చే విద్యార్థుల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాం. ఇప్పటికైనా అలాంటి వాటిల్లో విద్యార్థులు చేరవద్దు. రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం లేని వారు తెలంగాణ రాష్ట్ర వర్సిటీల దూర విద్యా కేంద్రాల ద్వారా చదువుకోవాలి*.
– తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్
🏧🏧🏧🏧🏧🏧
*467 ఎంఆర్‌సీలకు కంప్యూటర్లు*
♦రాష్ట్రంలోని 467 మండల విద్యావనరుల కేంద్రాలకు కంప్యూటర్లను పాఠశాల విద్యాశాఖ అందిస్తున్నది. కంప్యూటర్‌తో పాటు స్కానర్, ప్రింటర్స్‌నూ ఇస్తున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులు సమాచారం అందించారు. ఇప్పటివరకు ఎంఆర్‌సీల్లో వివిధ పాఠశాలలకు చెందిన కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. అవి పాతవికావడంతో నిత్యం మోరాయించడంతో పాటు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త కంప్యూటర్లు వస్తుండ టంతో ఆ సమస్య తీరనుంది. అయితే పాత మండలాలకు మాత్రమే వీటిని కేటాయించారు. కొత్త మండలాలకూ వీటిని ఇవ్వకపో వడంతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు.
No comments:
Post a Comment