ఆసియాన్ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) 1967లో ఆగస్ట్ 8న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జకార్తాలో ఉంది. ఆగ్నేయాసియాలోని పది దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అవి.. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్‌స, సింగపూర్, థాయ్‌లాం డ్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్ (బర్మా), వియత్నాం. ఆసియాన్ సమావే శాలను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. 25వ ఆసియాన్ సదస్సు ఈ నెల 12న మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది.
12వ ఆసియాన్ - భారత్ సదస్సు
12వ ఆసియాన్ - భారత్ సదస్సు
12వ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య - భారత్ శిఖరాగ్ర సదస్సును నేపిటాలో నవంబర్ 12న నిర్వహించారు. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోడీ, మయన్మార్ అధ్యక్షుడు థేన్‌సేన్, ఆసియాన్‌లో ఇతర దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్నేయాసియాలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత, ఆసియాన్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఈ సదస్సులో ఆయన హిందీలో ప్రసంగించారు. ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధిలో పరస్పర సహకారానికి భారత్‌తో భాగస్వామిగా ఆసియాన్ ఉండాలన్నారు. సముద్ర జలాలు, సరిహద్దులకు సంబంధించి అన్ని దేశాలు, అంతర్జాతీయ నియమ, నిబంధనలను పాటించాలని కోరారు. భారత్ - ఆసియాన్ దేశాల మధ్య ప్రస్తుత వాణిజ్యం 76 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్ని 2015 చివరినాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment