*🌎చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 20*🌎
*❤జననాలు*❤
*▪1569 : మొఘల్ సామ్రాజ్యపునాలుగవ చక్రవర్తి జహాంగీర్ జననం (మ.1627).*
*▪1911 : ప్రముఖ సంఘసంస్కర్త శ్రీరామ్ శర్మ ఆచార్య జననం (మ.1990).*
*▪1914: అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003)*
*▪1924: అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (మ.2014)*
*▪1944: అన్నయ్య గారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు.*
*▪1954: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013)*
*▪1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.*
*🍃మరణాలు*🍃
*♦1933: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847)*
*♦1999: టి.ఆర్. రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922)*
*♦2013: ఛాయరాజ్, ప్రముఖ కవి మరియు రచయిత. (జ.1948)*
*జాతీయ దినాలు*🇮🇳
*♦రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినం.*
▪▪▪▪▪▪▪▪▪
*📕నేటి పంచాంగం*📕
*బుధవారం 20.09.17*
శ్రీ హేవళంబినామ సంవత్సరం
దక్షిణాయనం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి అమావాస్య ఉ.10.24 వరకు
తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి
నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు
తదుపరి హస్త
వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు
దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు
రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభ సమయాలు..లేవు
🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧
ఎన్టీఆర్ విద్యోన్నతిలో పైరవీలదే పైచేయి!
* చక్రం తిప్పిన కొన్ని ప్రయివేట్ శిక్షణ సంస్థల నిర్వాహకులు
* పాత పద్ధతిలోనే విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ
ఈనాడు, అమరావతి: ‘ఎన్టీఆర్ విద్యోన్నతి'లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలదే పైచేయి అవుతోంది. అమలులో లోపాలను గమనించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సాంఘిక సంక్షేమశాఖను నోడల్ ఏజెన్సీగా నియమించినా కథ మళ్లీ మొదటికే వచ్చింది. శిక్షణ సంస్థల లాబీయింగ్‌తో సాంఘిక సంక్షేమశాఖ నోడల్ బాధ్యతల నుంచి వైదొలగింది. గతంలోలా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధానమే రాష్ట్రంలో మళ్లీ అమలులోకి రానుంది. గతేడాది(2016-17) బీసీలకు, ఈబీసీలకు బీసీ సంక్షేమశాఖ, కాపులకు కాపు కార్పొరేషన్, బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సాంఘిక సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సివిల్స్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. ఇందుకోసం అప్పట్లో సాంఘిక సంక్షేమశాఖ, మిగతా శాఖలు ఐదేసి శిక్షణ సంస్థలను ఎంపికచేశాయి. ఈ ఏడాది అన్ని వర్గాల విద్యార్థులకు శిక్షణ కోసం ప్రవేశపరీక్ష నిర్వహణ నుంచి ఎంపిక, శిక్షణ కేంద్రాలకు పంపే బాధ్యతను సాంఘిక సంక్షేమశాఖ చేపట్టింది. అయితే వివిధ ఒత్తిళ్ల కారణంగా ప్రస్తుతం చేతులెత్తేయడం విద్యార్థులను ఆందోళనపరుస్తోంది. జూన్‌లో పరీక్షకు హాజరైన 50వేల మంది విద్యార్థులకు జేఎన్‌టీయూ - కాకినాడ ర్యాంకులు కేటాయించింది. వీరందరికీ మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించి 3850 మందిని శిక్షణ కేంద్రాలకు పంపాలి. ఈ దశలో సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే కౌన్సెలింగ్, శిక్షణ బాధ్యత తీసుకుంటామని, మిగతావారి విషయం బీసీ సంక్షేమశాఖ, కార్పొరేషన్లు చూడాల్సిందేనని లేఖలు రాయడం చర్చకు దారితీసింది.
* మాయాజాలం..?
గతేడాదికి భిన్నంగా ఈసారి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినపుడే ఎంపిక చేసుకునేలా పది శిక్షణసంస్థల వివరాలు ఎన్టీఆర్ విద్యోన్నతి వెబ్‌సైట్‌లో పెట్టారు. ఫలితంగా మెరుగైన సంస్థలనే విద్యార్థులు ఎంచుకున్నారు. దీంతో గతేడాది బాగా లబ్ధిపొందిన కొన్ని సంస్థలకు ఇపుడు అంతగా విద్యార్థుల మద్దతు లభించలేదు. విషయాన్ని అనుకూలురైన అధికారుల నుంచి తెలుసుకున్న వాటి నిర్వాహకులు రాజకీయంగా చక్రం తిప్పడం ప్రారంభించారు. వీరికి ఒకరిద్దరు మంత్రులు, మరో ఇద్దరు ఐఏఎస్‌లు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. గతేడాదిలా విద్యార్థులకు శిక్షణ ఇప్పించే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో తమకు లబ్ధి చేకూరుతుందని భావించిన శిక్షణసంస్ధలు ‘ఉన్నత' స్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. ఇందులో మంత్రుల జోక్యాన్ని గమనించిన అధికారులు.. కౌన్సెలింగ్ పైనా వూగిసలాట ప్రదర్శించారు. రెండు, మూడు శిక్షణ సంస్థల తరఫున మరో సీనియర్ మంత్రి వకాల్తా పుచ్చుకోవడంతో సాంఘిక సంక్షేమశాఖ ‘నోడల్ ఏజెన్సీ' బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.
శిక్షణకు ఎంపిక చేయనున్న విద్యార్థులు: 3,850
వీరిలో ఎస్సీలు: 700, బీసీలు: 1,000
ఎస్టీలు: 300, కాపులు: 750
మైనారిటీలు: 300, బ్రాహ్మణులు: 50
ఇతరులు: 750
పథకం: ఎన్టీఆర్ విద్యోన్నతి
అంచనా వ్యయం: రూ.80 కోట్లు
విద్యార్థుల శిక్షణ కాలం: 9 నెలలు
ఒక్కో విద్యార్థి కోసం చెల్లించే ఫీజు: రూ.1,00,000
నెలకు విద్యార్థులకు ఇచ్చే స్టైపండ్: రూ.10,000
సివిల్స్ శిక్షణకు ఎస్సీ విద్యార్థుల ఎంపిక
* 21 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన
మిగతా విద్యార్థుల విషయమై కిమ్మనని అధికారులు!
ఎన్టీఆర్ విద్యోన్నతిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ కోసం ఎస్సీ విద్యార్థులను ఎంపికచేస్తూ సాంఘిక సంక్షేమశాఖ మంగళవారం (సెప్టెంబరు 19) ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల క్రితం నిర్వహించిన ప్రవేశపరీక్షలకు 14,060 మంది ఎస్సీ విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల మదింపు తరువాత జేఎన్‌టీయూ - కాకినాడ వీరిలో 700 మందిని ఎంపిక చేయగా.. వివిధ శిక్షణ కేంద్రాలకు కేటాయించారు. సెప్టెంబరు 21 నుంచి 24 మధ్య ఎంపికైన విద్యార్థులు తమ కుల, జనన, కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆరు నుంచి పదో తరగతి స్టడీ, డిగ్రీ సర్టిఫికెట్లతోపాటు మార్కుల మెమో, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు, విద్యార్థి పేరుతో ఉన్న బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ నకలు తదితర సమాచారంతో ఎంపికైన శిక్షణ కేంద్రాలకు హాజరవ్వాలని అధికారులు సూచించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు శిక్షణ కేంద్రాల వద్ద సాంఘిక సంక్షేమశాఖ తరఫున అధికారులను ఏర్పాటుచేస్తున్నారు.
* మిగతా వారి మాటో..?
వివిధ వర్గాల నుంచి జూన్‌లో నిర్వహించిన ప్రవేశపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 48,045 మంది విద్యార్థులు హాజరైతే కేవలం ఎస్సీ విద్యార్థుల్లో అర్హులనే ఎంపిక చేయడంతో మిగతా వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎస్టీ, మైనారిటీ, బీసీ, కాపు, ఈబీసీ విద్యార్థుల ఫలితాలపై అధికారులు నోరు మెదపడం లేదు.
🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧
*✍పుస్తక కోటి.. ఖరగ్‌పూర్ ఐఐటీ!*
*👉ఈపుస్తకాలతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు*
*👉- ఒకటో తరగతి నుంచి పరిశోధనల వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు..*
*👉- 70కి పైగా భాషలు.. అన్నీ ఆన్‌లైన్‌లో..*
*👉ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకలేదన్న బెంగ అక్కర్లేదు.*
*👉కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే..దాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు.. చదువుకోవడం ఎలా.. అనే ఆందోళన కాలేజీ విద్యార్థులకు అసలే అవసరం లేదు..*
*👉యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,రాష్ట్ర సర్వీసు కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచన వద్దు..*
*✳ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పరిశోధనలకు అవసరమైన రిఫరెన్స్ పుస్తకాల దాకా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. వీడియోలు చూడవచ్చు.. ఆడియో వినవచ్చు.. పీడీఎఫ్ కాపీలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. సుమారు కోటికిపైగా పుస్తకాలు, ఆర్టికల్స్, రచనలు, వ్యాసాలను ఐఐటీ ఖరగ్‌పూర్ ఆన్‌లైన్‌లో (https://ndl.iitkgp.ac.in/) అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సహకారంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీని రూపొందించింది.*
*👉ఒక్క క్లిక్.. సమస్తం కళ్లముందు!*
*✳డిజిటల్ పుస్తకాలు, ఆర్టికల్స్, ఇతర అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికీ చదువు, సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థి వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను ఒకే దగ్గరకు చేర్చింది. పైసా చెల్లించనవసరం లేకుండా విద్యార్థులు ఉచి తంగా తీసుకోవచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు.*
*✳ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ డిజిటల్ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటిని కంప్యూటరీకరించి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.*
*👉రిజిస్ట్రేషన్ సులభం*
*✳డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈమెయిల్ ఐడీ, చదువుతున్న లేదా చదివిన కోర్సు, వర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత ఈమెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు.*
*👉డిజిటల్ లైబ్రరీ ప్రత్యేకతలెన్నో..*
⇒ 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్
⇒ లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు
⇒ రాత ప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు
⇒ 18 వేలకు పైగా ఉపన్యాసాలు
⇒ 33 వేలకు పైగా గత ప్రశ్నపత్రాలు
⇒ వర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, జవాబులు
⇒ వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్ కోర్సులు
⇒ వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు
⇒ సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు
*👉అందుబాటులో ఉన్న ఈపుస్తకాలు *
5,36,487 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్, ప్రోగ్రామింగ్
1,52,340 ఫిలాసఫీ, సైకాలజీ: తత్వశాస్త్రం, మానసిక తత్వశాస్త్రం, అస్తిత్వ, విశ్వ ఆవిర్భావం, లాజిక్, ఎథిక్స్
1,67,671 మతంతత్వం, మత సిద్ధాంతం, దైవ భావన, సైన్స్ అండ్ రిలీజియన్
ఆర్ట్స్.. 1,45,290
లిటరేచర్ 4,40,607
హిస్టరీ జియోగ్రఫీ 3,65,535
8,70,802 సోషల్ సైన్సెస్: సోషియాలజీ,ఆంత్రొపాలజీ, సామాజిక మార్పు,రాజకీయ, అర్థ, న్యాయశాస్త్రాలు,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిలటరీ సైన్స్
56,17,754 టెక్నాలజీ: వ్యవసాయ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సుల పుస్తకాలు
22,65,577 నేచురల్ సైన్సెస్:వైద్యం, ఆరోగ్యం, ఫిజియాలజీ,ఫార్మకాలజీ, థెరపీ, సర్జరీకి సంబంధించిన వైద్య పుస్తకాలు
భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, తమిళ్, గుజరాతీ తదితరాలు, విదేశీ భాషలు
ఫార్మాట్లు పీడీఎఫ్, హెచ్‌టీఎల్/హెచ్‌టీఎంఎల్, ఎంపీ3/4/ఎంపీఈజీ4, ఎఫ్‌ఎల్‌వీ, డాక్యుమెంట్
70కి పైగా భాషల్లో..కోటికి పైగా ఈపుస్తకాలు.
🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧🏧
Sending link for previous study materials
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMTkRKbHlqYlJDa3M
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMR3M4WFpUUE9HN3c
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMT1dlTHprY3FDRVk
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMV2thb1F2ZTBVY28
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMNVZCMWxGRFQyTXM
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMX2I1MEFIMGNiOWc
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMV2thb1F2ZTBVY28
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMT0dBY0t1NXVkSDQ
RUKS MATERIAL WORLD
IIT JEE STUDY MATERIAL
https://drive.google.com/drive/folders/0B668otTUwgi5QVdXbXBUYUd2X1E
ETOOS STUDY MATERIAL ASSIGNMENT DPP
https://drive.google.com/drive/folders/0B668otTUwgi5Y19PX21EUEJYVkU
Allen test series
https://drive.google.com/drive/folders/0B668otTUwgi5S1hidlNfVjJ2aFE
JEE TEST PAPERS
https://drive.google.com/drive/folders/0B5ANCEEzzUomV1N3NXpGblFSTEE
FIITJEE AITS COMPLETE PACKAGE
https://drive.google.com/drive/folders/0B5ANCEEzzUomdHJ6aFVFRkpJc2s
TEST PAPERS OF FIITJEE RESONANCE AAKASH ETC.
https://drive.google.com/drive/folders/0B-XA5etMiOvnWmMzQ3JOVFVXOUk
ALLEN TEST SERIES
https://drive.google.com/drive/folders/0B5ANCEEzzUomTDZ6ZjRxNk9RRXc
BRILLIANT STUDY MATERIAL AND FEW TEXTBOOKS
https://drive.google.com/drive/folders/0B1gizVoKrowNSldjU1pXTWswaWs
ETOOS-PHYSICS VIDEO LECTURES BY NV SIR
https://drive.google.com/drive/folders/0B1NT-XXtIDE_cE4ybFpJblFDNzA
AIITs PAPER
https://drive.google.com/file/d/0B_p5L3bHsFOKMElGdHI5OG1mLUNfYUZxX3Y0eVVZcm1VY3pJ/view
RESONENCE CHAPTER TEST
https://drive.google.com/file/d/0B_p5L3bHsFOKVnFZWW1HVnh1dzdYdTVKb2kwN1pwWGpRaEJv/view
FITJEE AIITS
https://drive.google.com/file/d/0B_p5L3bHsFOKS1ozc1F3NXZGY3c/view
ORGANIC CHEMISTRY
https://drive.google.com/drive/folders/0B6tUgUuYohuYTG9wY2k0ck5yM00
RESOURCES FOR jee
https://drive.google.com/drive/folders/0B8PfFHtjSXQxfnpaNVhKUFNfY1hRWFo5UXB4b2tSM2EyYmt4OGJCNnZFUGtTSjVhbVRxTnc
INORGANIC CHEMISTRY
https://drive.google.com/drive/folders/0B94Z4pA1dBzPa3VyMVR1eTh3eXc
BACKUP STUDY MATERIAL
https://drive.google.com/drive/folders/0B_4SB-IimX5hfkp6UFctbHo2V2V3eEpsYTc5emxuUEJPd1BfLUxYTC04LXloaUZvN0g3Szg
IIT JEE MOCK TEST
https://drive.google.com/drive/folders/0BwM9pPurCln4XzRrclBXRnF6azg
PHYSICS
https://drive.google.com/drive/folders/0B7EaN2e8usIgYVkzaFZLT010cUE
MOTION CLASSES
https://drive.google.com/drive/folders/0Bw_HeuQYV7uVaDlCQVZrSGplNlU
IIT JEE STUDY MATERIAL
https://drive.google.com/drive/folders/0B_0JVL_SZENRVkxVOGdXVjNWWG8
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMN3NVaVNTLXJDZ1E
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMQ0gwSlhIZmM2MTA
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMRVN3TkY0M2xUQm8
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMQjNfZlUtUnBEOVE
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMT0dBY0t1NXVkSDQ
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMX0FoVzJhX2dqLWM
https://drive.google.com/folderview?id=0B8IMEe9b-KGMX2I1MEFIMGNiOWc
No comments:
Post a Comment