AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 10 February 2018

జాతీయం 2012 సంవత్సరం మార్చి నుండి డిసెంబరు వరకు మొత్తం

జాతీయం 2012 సంవత్సరం మార్చి నుండి డిసెంబరు వరకు మొత్తం 

మార్చి 2012 (01 - 07) జాతీయం

నేషనల్ టూరిజం అవార్డులు
2010-11కు జాతీయ పర్యాటక అవార్డులను రాష్ర్టపతి ప్రతిభాపాటిల్ ఫిబ్రవరి 29న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ర్ట, కేంద్రపాలిత ప్రభుత్వాలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు కనబర్చే ఉత్తమ పనితీరుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఈ అవార్డులు అందజేస్తోంది.

ఉత్తమ హెరిటేజ్ నగరం: హైదరాబాద్
ఉత్తమ ఎయిర్‌పోర్‌‌ట: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్)
ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్
బెస్ట్ డొమెస్టిక్ ఆపరేటర్: సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (వరుసగా ఐదోసారి ఈ అవార్డు పొందింది)
ఇన్నోవేటివ్, యునిక్ టూరిజం ప్రాజెక్ట్ అవార్డు: సిక్కిం (సోలోపోక్‌లో ప్రపంచస్థాయి టూరిజం కాంప్లెక్స్ నిర్మాణానికి)
సమగ్ర పర్యాటక రంగం అభివృద్ధికి ఇచ్చే బెస్ట్ స్టేట్ అవార్డు: సిక్కిం
క్లీన్ ఇండియా ప్రచారానికి బెస్ట్ స్టేట్: సిక్కిం

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో మార్చి 4న జరిపిన సూపర్ సోనిక్ క్షిపణి ‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే బ్రహ్మోస్ 290 కి.మీ. నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ఇది 2.8 మాక్ లేదా దాదాపు శబ్దవేగం కంటే మూడింతలు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. 300 కిలోల బరువు ఉన్న సంప్రదాయ ఆయుధాలను మోసుకుపోగలదు. దీన్ని 2007 జూన్‌లో భారత సైన్యంలో చేర్చారు. ఈ పరీక్షతో సైన్యం రెండో బ్రహ్మోస్ ఆపరేషన్‌లో రెజిమెంట్‌ను ప్రారంభించింది. త్వరలో అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడో బ్రహ్మోస్ యూని ట్ ప్రారంభం కానుంది. ఒక్కో ఆపరేషన్ యూనిట్‌లో 65 క్షిపణి వ్యవస్థలుంటాయి. బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. దీన్ని బ్రహ్మపుత్ర, మోస్కోవా నదుల పేర్లు కలిపి భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి.

కొత్త ఆర్మీ చీఫ్‌గా బిక్రమ్ సింగ్
సైనిక దళాల కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మార్చి 3న ప్రకటించింది. మే 31న పదవి విరమణ చేస్తున్న ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ స్థానంలో బిక్రమ్‌సింగ్ నియమితులయ్యారు. 2014 ఆగస్టు వరకూ బిక్రమ్‌సింగ్ పదవిలో కొనసాగుతారు.

ఆఫ్రో - ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవాలు
ఆఫ్రో - ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఏఏఆర్‌డీఓ) స్వర్ణోత్సవాలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి 5న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు ఖండాల్లో సుస్థిరాభివృద్ధి సాధించాలంటే గ్రామీణ పునర్ నిర్మాణం, పేదరికం నిర్మూలన మౌలిక అంశాలని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోని పేదవారిలో ముప్పాతిక వంతు ఆసియా, ఆఫ్రికాలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. వాతావరణ మార్పు చర్చల్లో, రియో 20 సదస్సులో ఉత్తమ ఫలితాల కోసం ఆఫ్రో, ఆసియన్ దేశాలు కలిసి పని చేయాలని ప్రధాని కోరారు. ఈ సంస్థలో 15 ఆఫ్రికన్ దేశాలు, 14 ఆసియా దేశాలు ఉన్నాయి.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం
మార్చి 5న న్యూఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదైంది. ఢిల్లీ - హర్యానా సరిహద్దులోని బహదూర్‌గఢ్ భూకంప కేంద్రంగా ఈ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దేశంలో ఈ ఏడాది సంభవించిన భూకంపాల్లో ఇది 19వది. జనవరిలో 10 సార్లు, ఫిబ్రవరిలో ఆరు సార్లు భూకంపాలు సంభవించాయి. భారత్‌లో 2011లో 80 భూకంపాలు సంభవించాయి. అవి 5.0 నుంచి 3.6 వరకు రిక్టర్ స్కేలుపై నమోదయ్యాయి. ఈ భూకంపాలు ఉత్తర భారతదేశంలోని జమ్మూకాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో సంభవించాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ప్రకారం దేశంలో తీవ్ర ప్రభావమున్న భూకంప జోన్ నాలుగులో 30 నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది.

ఆరోగ్య రక్షణకు జీడీపీలో 2.5 శాతానికి ప్రభుత్వ రంగం
ఆరోగ్య రక్షణకు 12వ పంచవర్ష ప్రణాళికలో నిధులు పెంచాలని ప్రణాళిక సంఘాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ వ్యయాన్ని వచ్చే ఐదేళ్లలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇది 1.4 శాతంగా ఉంది. యూనివర్సల్ హెల్త్‌కేర్‌పై నియమించిన శ్రీనాథ్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ సిఫారసుల ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో జీడీపీలో ఆరోగ్యంపై భారత్ అతి తక్కువ వ్యయం చేస్తోంది. శ్రీలంక 1.8 శాతం, చైనా 2.3 శాతం, థాయ్‌లాండ్ 3.3 శాతం, అమెరికా 7 శాతం, యు.కె., స్పెయిన్, జర్మనీ, ఇటలీ దేశాలు 6.5 నుంచి 8 శాతం వ్యయం చేస్తున్నాయి.

‘కొటాల’ గ్రామానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ‘కొటాల’ గ్రామ పంచాయితీకి కేంద్ర ప్రభుత్వ ‘గ్రామరత్న’ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 29న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ‘కొటాల’ను సందర్శించి ప్రదానం చేశారు. ‘భారత్ నిర్మాణ్’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అభివృద్ధిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు దక్కింది.

ఏపీలో 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్
ఒకేసారి 16 మంది శాసనసభ సభ్యులను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ మార్చి 2న అనర్హులుగా ప్రకటించారు. మరో సభ్యురాలి రాజీనామాను ఆమోదించారు. వీరంతా వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారు. 
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పేరా 2 (1) (బి) కింద వారిని అనర్హుల్ని చేశారు. 2011 డిసెంబర్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడంతో వారు ఈ సభ్యులు సభ్యత్వం కోల్పోయారు. దీంతో 294 మంది సభ్యులు ఉన్న సభలో కాంగ్రెస్ బలం 137కు పడిపోయింది. పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా అత్యధిక సంఖ్యలో అనర్హతకు గురయ్యారు. ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్‌లో 13 మంది బీఎస్పీ సభ్యులు అనర్హతకు గురయ్యారు.

ఎన్నికలు

యూపీ పీఠంపై ములాయం
ఐదు రాష్ట్రాల శాసన సభలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) విజ యం సాధించింది. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్‌పీ 225 సీట్లు గెలుచుకుంది. మాయావతి నేతృత్వంలోని అధికార బహుజన్ సమాజ్ పార్టీకి 79 సీట్లు మాత్రమే దక్కాయి. బీజేపీకి 47 రాగా, కాంగ్రెస్ తన మిత్రపక్షం ఆర్‌జేడీతో కలిసి 38 స్థానాల్లో విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 

పంజాబ్‌లో మళ్లీ అకాలీదళ్
అకాలీదళ్, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పంజాబ్‌లో తిరిగి గెలుపొందింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో అధికార అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీ మిత్ర పక్షాలు 68 స్థానాలతో అధికారం నిలుపు కున్నాయి. ఇందులో ఎస్‌ఏడీ 56, బీజేపీకి 12 సీట్లు వచ్చాయి. 46 సీట్లతో కాంగ్రెస్ మరో సారి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. 46 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఒకే కూటమికి వరుసగా రెండోసారి పట్టం కట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ లంబి స్థానం నుంచి గెలుపొందారు.

గోవాలో బీజేపీ జయకేతనం
గోవా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ, ఎంజీపీ కూటమి 24 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 9 సీట్లు దక్కాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మనోహర్ పారికర్ పనాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 

మణిపూర్‌లో కాంగ్రెస్
ఈశాన్య రాష్ర్టమైన మణిపూర్‌లో కాంగ్రెస్ మరోసారి విజయభావుటా ఎగురవేసింది. 60 స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్ 42 స్థానా లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. తృణముల్ కాంగ్రెస్ 7, ఎన్‌పీఎఫ్ 4 స్థానాల్లో గెలుపొందాయి. ముఖ్యమంత్రి ఒ.ఇబోబిసింగ్ తౌ బాల్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు.

ఉత్తరాఖండ్‌లో...
70 సీట్లున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు 32 బీజేపీకి 31, ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందారు. అధికార బీజేపీ, కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించలేక పోయాయి. బీసీ ఖండూరి కోట్ ద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

మార్చి 2012 (08 - 14) జాతీయం
సీఆర్‌ఆర్‌ను తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ మార్చి 8న నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 0.75 శాతం తగ్గించింది. దీంతో 5.5 శాతంగా ఉన్న సీఆర్‌ఆర్ 4.75 శాతానికి తగ్గింది. బ్యాంకు తన మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిధుల నిష్పత్తి పరిమాణం (సీఆర్‌ఆర్) ను తగ్గించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి *48,000 కోట్లు వస్తాయి. ద్రవ్య లభ్యతపై ఒత్తిడి తగ్గుతుంది.

గోవా ముఖ్యమంత్రిగా పారికర్
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మనోహర్ పారికర్ మార్చి 8న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది మూడోసారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పారికర్ మరోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. 40 స్థానాలున్న శాసనసభలో బీజేపీకి 21, మహారాష్ట్ర గోమంతిక్ పార్టీ 3 స్థానాలు గెల్చుకుని అధికారంలోకి వచ్చాయి.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎం.పి. విజయ్ బహుగుణను కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది. మార్చి 13న ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ బహుగుణ తేహ్రీ గార్వల్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన బహుగుణ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందన్ బహుగుణ కుమారుడు. విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్‌కు ఆరో ముఖ్యమంత్రి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ (38) ఎంపికయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) శాసనసభా పక్షం అఖిలేష్‌ను తమ నాయకుడిగా మార్చి 10న ఎన్నుకుంది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు అతి పిన్నవయస్కుడైన ముఖ్యమంత్రి. 1995లో మాయావతి 39 ఏళ్ల వయసులో యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ కుమారుడైన అఖిలేష్ యాదవ్ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలిసారి 2000లో కనౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.

పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్
పంజాబ్ ముఖ్యమంత్రిగా శిరోమణి అకాళీదల్‌కు చెందిన ప్రకాష్ సింగ్ బాదల్ ఐదోసారి మార్చి 14న ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీ పార్టీలు అధికారంలోకి రావడంతో బాదల్ మరోసారి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. శాసనసభలోని 117 స్థానాల్లో ఎస్‌ఏడీ, బీజేపీలకు 62 స్థానాలు, కాంగ్రెస్‌కు 45 స్థానాలు దక్కాయి.

మార్చి 2012 జాతీయం
సౌమిత్ర ఛటర్జీకి దాదాసాహెబ్ ఫాల్కే
బెంగాలీ నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ 2011 సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన ‘అపూర్ సంసార్’ చిత్రంతో 1959లో సినీ రంగంలోకి అడుగిడిన సౌమిత్ర దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. కేంద్ర ప్రభుత్వం 2004లో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. భారత ప్రభుత్వం అందజేసే అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ అవార్డును 1969లో ప్రముఖ దర్శకుడు-నిర్మాత, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలిచే దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఏర్పాటు చేశారు. పురస్కారం కింద రూ.10 లక్షల నగదు, స్వర్ణ కమలం బహూకరిస్తారు.

దేశంలో తగ్గిన పేదరికం
దేశంలో పేదరికం తగ్గి 2009-10 నాటికి 29.8 శాతానికి చేరుకుందని కేంద్ర ప్రణాళికా సంఘం మార్చి 19న విడుదల చేసిన తాజా అంచనాలు వెల్లడించాయి. 2004-05 తో పోలిస్తే ఇది 7.3 శాతం తక్కువ. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుదల ఎక్కువగా ఉంది. 2004-05 నాటికి దేశంలో పేదల సంఖ్య 40.72 కోట్లు (37.2 శాతం) ఉండగా 2009-10కి ఇది 34.47 కోట్ల(29.9 శాతం)కు చేరుకుంది. ఈ ఐదేళ్లలో గ్రామీణ పేదల సంఖ్య 8 శాతం తగ్గగా, పట్టణ పేదల సంఖ్య 4.8 శాతం వరకు తగ్గింది. ఆహారంపై పట్టణ ప్రాంతాల్లోనైతే రోజుకు రూ.32, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.28.65 ఖర్చు పెట్టే వారిని పేదలుగా ప్రణాళికా సంఘం పేర్కొంది.

రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్ 
కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్ మార్చి 20న ప్రమాణస్వీకారం చేశారు. రైల్వే చార్జీల పెంపును వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆదేశంతో రైల్వే శాఖ మంత్రి పదవికి దినేశ్ త్రివేదీ రాజీనామా చేశారు. దీంతో నౌకాయాన సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న ముకుల్ రాయ్‌ని రైల్వే మంత్రిగా మమత బెనర్జీ సిఫారసు చేశారు.

న్యూఢిల్లీలో ఆసియా సహజ వాయువు సదస్సు
ఆసియా సహజ వాయువు భాగస్వామ్య ఏడో సదస్సును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి 23న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్యాస్ వినియోగాన్ని పెంచుతామని, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గ్యాస్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. 12వ ప్రణాళిక చివరి (2017) నాటికి దేశంలో 30,000 కి.మీ. గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మన్మోహన్ పేర్కొన్నారు. ఈ సదస్సును గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్), భారత వాణిజ్య సమాఖ్య(ఫిక్కీ), ఇంటర్నేషనల్ గ్యాస్ యూనియన్ సంయుక్తంగా నిర్వహించాయి.

దేశంలో తొలి బ్రెయిలీ వార్తాపత్రిక 
దేశంలో తొలి బ్రెయిలీ వార్తాపత్రిక ‘రిలయన్స్ దృష్టి’ని మార్చి 19న ముంబైలో ఆవిష్కరించారు. ఇది హిందీ భాషలో పక్షం రోజులకు ఒకసారి వెలువడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 142 నిర్మల్ గ్రామ్ పురస్కారాలు
పారిశుద్ధ్యంలో నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్న అత్యుత్తమ గ్రామ పంచాయతీలను కేంద్రం మార్చి 21న జాతీయ స్థాయి ‘నిర్మల్ గ్రామ్ పురస్కార్-2011’తో సత్కరించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన 142 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల వారీగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 95 గ్రామపంచాయతీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి. ఖమ్మం (1), నల్లగొండ, కృష్ణా, రంగారెడ్డి (3), తూర్పు గోదావరి, గుంటూరు (5), కరీంనగర్, విశాఖపట్నం (7), మెదక్ (13) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రం తరపున పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి మాజీ సర్పంచి వై.చంటమ్మ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర 442, గుజరాత్ 422, మేఘాలయ 365, హర్యానా 330, హిమాచల్‌ప్రదేశ్ 323 గ్రామ పంచాయతీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి.

హైదరాబాద్‌లో ఇండియా సాఫ్ట్ 2012
అంతర్జాతీయ ఐటీ ప్రదర్శన, సదస్సు ‘ఇండియా సాఫ్ట్ 2012’ హైదరాబాద్‌లో మార్చి 21 నుంచి 23 వరకు జరిగింది. ఇందులో 60కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ జనాభా 5.63 కోట్లు
రాష్ట్రంలో పట్టణ జనాభా కంటే గ్రామీణ జనాభా రెట్టింపు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 5.63 కోట్ల మంది నివసిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 2.83 కోట్ల మంది నివాసం ఉంటున్నారు. జనాభా లెక్కల సేకరణ విభాగం జిల్లాల వారీగా గ్రామీణ, పట్టణ జనాభా లెక్కలను మార్చి 19న వెల్లడించింది. వివరాలు..గ్రామీణ జనాభాలో తూర్పుగోదావరి (36.36 లక్షలు), మహబూబ్ నగర్(34.45 లక్షలు) జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో రంగారెడ్డి (15.72 లక్షలు) జిల్లా ఉంది. హైదరాబాద్ పూర్తిగా పట్టణీకరణ చెందిన జిల్లా కావడంతో గ్రామీణ జనాభా లేదు. పట్టణ జనాభా అతి తక్కువ ఉన్న జిల్లా శ్రీకాకుళం (4.36 లక్షలు). రాష్ట్రంలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు.. హైదరాబాద్ (77.49 లక్షలు), వైజాగ్ (17.30 లక్షలు), విజయవాడ (14.91 లక్షలు). లక్ష జనాభా దాటిన పట్టణాల సంఖ్య: 46. పట్టణ జనాభా లక్షకు మించి ఉన్న శాసన సభ నియోజకవర్గాల సంఖ్య 13. నిజామాబాద్, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది. కానీ కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. 5.6 కోట్ల గ్రామీణ జనాభాలో 3 కోట్ల మంది అక్షరాస్యులు కాగా.. 2.8 కోట్ల మంది పట్టణ జనాభాలో 2 కోట్ల మంది అక్షరాస్యులు.

రైల్వే మంత్రి దినేష్ త్రివేది రాజీనామా
కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది మార్చి 18న తన పదవికి రాజీనామా చేశారు. రైల్వే బడ్జెట్ 2012-13లో రైలు చార్జీలు పెంచడాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూ త్రివేది రాజీనామాను కోరారు. పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన త్రివేది సంకీర్ణ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నారు.

మణిపూర్ ముఖ్యమంత్రిగా ఇబోబి సింగ్
 కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబి సింగ్ మణిపూర్ 23వ ముఖ్యమంత్రిగా మార్చి 14న ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రిగా సింగ్ ప్రమాణం చేయడం ఇది వరుసగా మూడోసారి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో 60 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది.

హైదరాబాద్‌లో విమాన మరమ్మతుల కేంద్రం ప్రారంభం
దేశంలో తొలి థర్డ్ పార్టీ విమాన నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్ని హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్ మార్చి 13న ప్రారంభించారు. ఇక్కడ ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాలకు నిర్వహణా సేవలు అందిస్తారు. దీన్ని రూ.350 కోట్లతో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్, మలేషియన్ ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అజిత్‌సింగ్ మాట్లాడుతూ భారత విమానయాన పరిశ్రమ ప్రపంచంలో తొమ్మిదో అతిపెద్ద పరిశ్రమని, దీని నికర విలువ 2020 నాటికి 2000 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో బీడీఎల్ యూనిట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అదనపు యూనిట్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సెరిగూడ గ్రామంలో మార్చి 18న శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రంలో భూతలం నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణులు తయారు చేస్తారు. రూ. 500 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బీడీఎల్‌కు హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు యూనిట్లు ఉన్నాయి.

సీఆర్‌ఆర్‌ను తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ మార్చి 8న నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 0.75 శాతం తగ్గించింది. దీంతో 5.5 శాతంగా ఉన్న సీఆర్‌ఆర్ 4.75 శాతానికి తగ్గింది. బ్యాంకు తన మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిధుల నిష్పత్తి పరిమాణం (సీఆర్‌ఆర్) ను తగ్గించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి *48,000 కోట్లు వస్తాయి. ద్రవ్య లభ్యతపై ఒత్తిడి తగ్గుతుంది.

గోవా ముఖ్యమంత్రిగా పారికర్
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మనోహర్ పారికర్ మార్చి 8న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది మూడోసారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పారికర్ మరోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. 40 స్థానాలున్న శాసనసభలో బీజేపీకి 21, మహారాష్ట్ర గోమంతిక్ పార్టీ 3 స్థానాలు గెల్చుకుని అధికారంలోకి వచ్చాయి.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎం.పి. విజయ్ బహుగుణను కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది. మార్చి 13న ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ బహుగుణ తేహ్రీ గార్వల్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన బహుగుణ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందన్ బహుగుణ కుమారుడు. విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్‌కు ఆరో ముఖ్యమంత్రి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ (38) ఎంపికయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) శాసనసభా పక్షం అఖిలేష్‌ను తమ నాయకుడిగా మార్చి 10న ఎన్నుకుంది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు అతి పిన్నవయస్కుడైన ముఖ్యమంత్రి. 1995లో మాయావతి 39 ఏళ్ల వయసులో యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ కుమారుడైన అఖిలేష్ యాదవ్ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలిసారి 2000లో కనౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.

పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్
పంజాబ్ ముఖ్యమంత్రిగా శిరోమణి అకాళీదల్‌కు చెందిన ప్రకాష్ సింగ్ బాదల్ ఐదోసారి మార్చి 14న ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీ పార్టీలు అధికారంలోకి రావడంతో బాదల్ మరోసారి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. శాసనసభలోని 117 స్థానాల్లో ఎస్‌ఏడీ, బీజేపీలకు 62 స్థానాలు, కాంగ్రెస్‌కు 45 స్థానాలు దక్కాయి. 
నేషనల్ టూరిజం అవార్డులు
2010-11కు జాతీయ పర్యాటక అవార్డులను రాష్ర్టపతి ప్రతిభాపాటిల్ ఫిబ్రవరి 29న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ర్ట, కేంద్రపాలిత ప్రభుత్వాలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు కనబర్చే ఉత్తమ పనితీరుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఈ అవార్డులు అందజేస్తోంది.

ఉత్తమ హెరిటేజ్ నగరం: హైదరాబాద్
ఉత్తమ ఎయిర్‌పోర్‌‌ట: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్)
ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్
బెస్ట్ డొమెస్టిక్ ఆపరేటర్: సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (వరుసగా ఐదోసారి ఈ అవార్డు పొందింది)
ఇన్నోవేటివ్, యునిక్ టూరిజం ప్రాజెక్ట్ అవార్డు: సిక్కిం (సోలోపోక్‌లో ప్రపంచస్థాయి టూరిజం కాంప్లెక్స్ నిర్మాణానికి)
సమగ్ర పర్యాటక రంగం అభివృద్ధికి ఇచ్చే బెస్ట్ స్టేట్ అవార్డు: సిక్కిం
క్లీన్ ఇండియా ప్రచారానికి బెస్ట్ స్టేట్: సిక్కిం

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో మార్చి 4న జరిపిన సూపర్ సోనిక్ క్షిపణి ‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే బ్రహ్మోస్ 290 కి.మీ. నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ఇది 2.8 మాక్ లేదా దాదాపు శబ్దవేగం కంటే మూడింతలు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. 300 కిలోల బరువు ఉన్న సంప్రదాయ ఆయుధాలను మోసుకుపోగలదు. దీన్ని 2007 జూన్‌లో భారత సైన్యంలో చేర్చారు. ఈ పరీక్షతో సైన్యం రెండో బ్రహ్మోస్ ఆపరేషన్‌లో రెజిమెంట్‌ను ప్రారంభించింది. త్వరలో అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడో బ్రహ్మోస్ యూని ట్ ప్రారంభం కానుంది. ఒక్కో ఆపరేషన్ యూనిట్‌లో 65 క్షిపణి వ్యవస్థలుంటాయి. బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. దీన్ని బ్రహ్మపుత్ర, మోస్కోవా నదుల పేర్లు కలిపి భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి.

కొత్త ఆర్మీ చీఫ్‌గా బిక్రమ్ సింగ్
సైనిక దళాల కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మార్చి 3న ప్రకటించింది. మే 31న పదవి విరమణ చేస్తున్న ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ స్థానంలో బిక్రమ్‌సింగ్ నియమితులయ్యారు. 2014 ఆగస్టు వరకూ బిక్రమ్‌సింగ్ పదవిలో కొనసాగుతారు.

ఆఫ్రో - ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవాలు
ఆఫ్రో - ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఏఏఆర్‌డీఓ) స్వర్ణోత్సవాలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి 5న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు ఖండాల్లో సుస్థిరాభివృద్ధి సాధించాలంటే గ్రామీణ పునర్ నిర్మాణం, పేదరికం నిర్మూలన మౌలిక అంశాలని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోని పేదవారిలో ముప్పాతిక వంతు ఆసియా, ఆఫ్రికాలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. వాతావరణ మార్పు చర్చల్లో, రియో 20 సదస్సులో ఉత్తమ ఫలితాల కోసం ఆఫ్రో, ఆసియన్ దేశాలు కలిసి పని చేయాలని ప్రధాని కోరారు. ఈ సంస్థలో 15 ఆఫ్రికన్ దేశాలు, 14 ఆసియా దేశాలు ఉన్నాయి.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం
మార్చి 5న న్యూఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదైంది. ఢిల్లీ - హర్యానా సరిహద్దులోని బహదూర్‌గఢ్ భూకంప కేంద్రంగా ఈ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దేశంలో ఈ ఏడాది సంభవించిన భూకంపాల్లో ఇది 19వది. జనవరిలో 10 సార్లు, ఫిబ్రవరిలో ఆరు సార్లు భూకంపాలు సంభవించాయి. భారత్‌లో 2011లో 80 భూకంపాలు సంభవించాయి. అవి 5.0 నుంచి 3.6 వరకు రిక్టర్ స్కేలుపై నమోదయ్యాయి. ఈ భూకంపాలు ఉత్తర భారతదేశంలోని జమ్మూకాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో సంభవించాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ప్రకారం దేశంలో తీవ్ర ప్రభావమున్న భూకంప జోన్ నాలుగులో 30 నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది.

ఆరోగ్య రక్షణకు జీడీపీలో 2.5 శాతానికి ప్రభుత్వ రంగం
ఆరోగ్య రక్షణకు 12వ పంచవర్ష ప్రణాళికలో నిధులు పెంచాలని ప్రణాళిక సంఘాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ వ్యయాన్ని వచ్చే ఐదేళ్లలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇది 1.4 శాతంగా ఉంది. యూనివర్సల్ హెల్త్‌కేర్‌పై నియమించిన శ్రీనాథ్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ సిఫారసుల ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో జీడీపీలో ఆరోగ్యంపై భారత్ అతి తక్కువ వ్యయం చేస్తోంది. శ్రీలంక 1.8 శాతం, చైనా 2.3 శాతం, థాయ్‌లాండ్ 3.3 శాతం, అమెరికా 7 శాతం, యు.కె., స్పెయిన్, జర్మనీ, ఇటలీ దేశాలు 6.5 నుంచి 8 శాతం వ్యయం చేస్తున్నాయి.

‘కొటాల’ గ్రామానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ‘కొటాల’ గ్రామ పంచాయితీకి కేంద్ర ప్రభుత్వ ‘గ్రామరత్న’ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 29న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ‘కొటాల’ను సందర్శించి ప్రదానం చేశారు. ‘భారత్ నిర్మాణ్’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అభివృద్ధిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు దక్కింది.

ఏపీలో 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్
ఒకేసారి 16 మంది శాసనసభ సభ్యులను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ మార్చి 2న అనర్హులుగా ప్రకటించారు. మరో సభ్యురాలి రాజీనామాను ఆమోదించారు. వీరంతా వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారు. 
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పేరా 2 (1) (బి) కింద వారిని అనర్హుల్ని చేశారు. 2011 డిసెంబర్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడంతో వారు ఈ సభ్యులు సభ్యత్వం కోల్పోయారు. దీంతో 294 మంది సభ్యులు ఉన్న సభలో కాంగ్రెస్ బలం 137కు పడిపోయింది. పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా అత్యధిక సంఖ్యలో అనర్హతకు గురయ్యారు. ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్‌లో 13 మంది బీఎస్పీ సభ్యులు అనర్హతకు గురయ్యారు.

ఎన్నికలు

యూపీ పీఠంపై ములాయం
ఐదు రాష్ట్రాల శాసన సభలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) విజ యం సాధించింది. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్‌పీ 225 సీట్లు గెలుచుకుంది. మాయావతి నేతృత్వంలోని అధికార బహుజన్ సమాజ్ పార్టీకి 79 సీట్లు మాత్రమే దక్కాయి. బీజేపీకి 47 రాగా, కాంగ్రెస్ తన మిత్రపక్షం ఆర్‌జేడీతో కలిసి 38 స్థానాల్లో విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 

పంజాబ్‌లో మళ్లీ అకాలీదళ్
అకాలీదళ్, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పంజాబ్‌లో తిరిగి గెలుపొందింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో అధికార అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీ మిత్ర పక్షాలు 68 స్థానాలతో అధికారం నిలుపు కున్నాయి. ఇందులో ఎస్‌ఏడీ 56, బీజేపీకి 12 సీట్లు వచ్చాయి. 46 సీట్లతో కాంగ్రెస్ మరో సారి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. 46 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఒకే కూటమికి వరుసగా రెండోసారి పట్టం కట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ లంబి స్థానం నుంచి గెలుపొందారు.

గోవాలో బీజేపీ జయకేతనం
గోవా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ, ఎంజీపీ కూటమి 24 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 9 సీట్లు దక్కాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మనోహర్ పారికర్ పనాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 

మణిపూర్‌లో కాంగ్రెస్
ఈశాన్య రాష్ర్టమైన మణిపూర్‌లో కాంగ్రెస్ మరోసారి విజయభావుటా ఎగురవేసింది. 60 స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్ 42 స్థానా లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. తృణముల్ కాంగ్రెస్ 7, ఎన్‌పీఎఫ్ 4 స్థానాల్లో గెలుపొందాయి. ముఖ్యమంత్రి ఒ.ఇబోబిసింగ్ తౌ బాల్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు.

ఉత్తరాఖండ్‌లో...
70 సీట్లున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు 32 బీజేపీకి 31, ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందారు. అధికార బీజేపీ, కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించలేక పోయాయి. బీసీ ఖండూరి కోట్ ద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2012 జాతీయం
26 ఏప్రిల్- 02 మే 2012



పీఎస్‌ఎల్‌వీ-సీ19 విజయవంతం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ )-సి19ను ఏప్రిల్ 26న శ్రీహరికోట నుంచి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం(రీశాట్)-1ను 480కి.మీ. ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్య లో పీఎస్‌ఎల్‌వి-సీ19 ప్రవేశపెట్టింది. దీంతో రాడార్ ఇమేజింగ్ పరిజ్ఞానం ఉన్న అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల జాబితాలో భారత్ చేరింది. పూర్తి స్వ దేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్-1 బరువు 1858 కిలోలు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించిన బరువైన ఉపగ్రహం ఇదే. మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ తరహాకు చెందిన ఉపగ్రహం ద్వారా రాత్రి, పగలు మేఘావృత వాతావరణంలో కూడా భూఉపరితల చిత్రాలు దీని ద్వారా పొందొచ్చు. ఈ చిత్రాలు విపత్తుల నిర్వహణ, వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇలాంటి సమాచారం భారత్‌కు ఇప్ప టి వరకు కెనడా ఉపగ్రహం అందజేస్తోంది.



రాజ్యసభకు సచిన్, రేఖ
క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, నాటి హిందీ సినీనటి రేఖతో పాటు పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త అనూ అగాలను రాష్ర్టపతి ఏప్రిల్ 26న రాజ్యసభకు నామినేట్ చేసారు. 39 ఏళ్ల సచిన్ 100 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నటి రేఖ(57) 1980ల్లో బాలీవుడ్ అగ్రశ్రేణి నటిగా కొనసాగారు. అనూ అగా(70) థెర్మాస్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. సోనియాగాంధీ నాయకత్వంలోని జాతీయ సలహామండలిలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 80వ ప్రకరణ ప్రకారం సైన్‌‌స, సాహిత్యం, కళలు, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు చేసిన 12 మందిని రాజ్యసభకు రాష్ర్టపతి నామినేట్ చేస్తారు. ఎగువసభైన రాజ్యసభలో సభ్యుల సంఖ్య 250.



భారత క్రెడిట్ రేటింగ్ తగ్గించిన ఎస్ అండ్ పీ
భారతప్రభుత్వ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్‌‌డ అండ్ పూర్‌‌స (ఎస్ అండ్ పీ) ఏప్రిల్ 25న ప్రకటించింది. ప్రస్తుతమున్న స్థిరస్థాయి BBB+ నుంచి BBB+ ప్రతికూల స్థాయికి తగ్గించింది. వచ్చే రెండేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోతే, రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ సావరిన్ రేటింగ్‌ను కూడా తగ్గించే అవకాశముందని ఎస్ అండ్ పీ తెలిపింది. BBB- స్థాయి పెట్టుబడులకు అత్యంత ప్రతికూలమైంది. క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో కార్పొరేట్ సంస్థలు విదేశీ రుణాల సమీకరణపై క్యాపిటల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలు, కంపెనీలు వాటి రుణాల తిరిగి చెల్లింపుపై రేటింగ్ ఏజెన్సీలు తమ అభిప్రాయాన్ని రేటింగ్ రూపంలో తెలుపుతాయి. ఈ రేటింగ్‌‌స అత్యధిక సురక్షిత స్థాయి AAA నుంచి అట్టడుగు స్థాయి D వరకు ఉంటాయి.



మలేరియా వ్యాధికి స్వదేశీ మందు
మలేరియా వ్యాధికి దేశీయంగా తొలిసారి తయారుచేసిన మందు సిన్‌రియంను న్యూఢిల్లీలో ఏప్రిల్ 25న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ మార్కెట్‌కు విడుదల చేశారు. ఈ మందును ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్ తయారుచేసింది. పెద్దలకు సోకిన ప్లాస్మోడియం పాల్సీఫరుం మలేరియా చికిత్సకు ఈ మందును వాడతారు. ఇది 95 శాతంపైగా వ్యాధిని నయం చేస్తుంది. మలేరియా వల్ల ప్రపంచం లో ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. ఆగ్నేయాసియాలో ఏటా మలేరియా సోకుతున్న 2.5 మిలియన్లలో 77 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు.



నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ తెగ్ యుద్ధనౌక
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తెగ్‌ను ఏప్రిల్ 27న రష్యాలో భారత నౌకాదళంలో చేర్చారు. తల్వార్ తరగతికి చెందిన యుద్ధనౌకల్లో ఇది అధునాతనమైంది. ఉపరితలం నుంచి ఉపరి తలానికి ప్రయోగించే క్షిపణి బ్రహ్మోస్‌తో పాటు ఇతర ఆధునిక ఆయుధాలు, ఇందులో అమర్చొచ్చు. ఈ నౌక జూన్ నాటికి భారత తీరం చేరుతుంది. సెప్టెంబరు 2012-13 నాటికి తెగ్ తరగతికి చెందిన తర్కాష్, త్రిఖండ్ నౌకలు కూడా భారత్ చేరనున్నాయి.



అణు ఇంధన కమిషన్ చైర్మన్‌గా రతన్ కుమార్ సిన్హా
బార్‌‌క(బాబా అణు పరిశోధన సంస్థ) డెరైక్టర్ రతన్ కుమార్ సిన్హా అణు ఇంధన కమిషన్ (ఏఈసీ) చైర్మన్‌గా శ్రీకుమార్ బెనర్జీ స్థానంలో ఏప్రిల్ 27న నియమితులయ్యారు. ఈయన అణు ఇంధన విభాగం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు.

అటార్ని జనరల్‌గా వాహన్‌వతి నియామకం
అటార్నీ జనరల్‌గా గులామ్-ఇ-వాహన్‌వతి (63)ని రాష్ర్టపతి ఏప్రిల్ 30న తిరిగి నియ మించారు. జూన్ 8 నుంచి మరో రెండేళ్లు ఈ పదవిలో ఉంటారు. తొలిసారి 2009లో మూడే ళ్ల కాలానికి ఆయన నియమితులయ్యారు.

రాష్ట్రీయం
రాష్ర్టంలో 72కు తగ్గిన పులుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య 72కు తగ్గిందని అటవీశాఖ అధికారి హితుష్ మల్హోత్రా ఏప్రిల్ 26న తెలిపారు. పదేళ్ల క్రితం వీటి సంఖ్య 105 గా ఉండేది. దేశవ్యాప్తంగా కూడా పులుల సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు హక్కులు కల్పించడంతో అడవులు ఆక్రమణలకు గురవుతున్నాయని అన్నారు.



శాంతా సిన్హాకు యుధ్‌వీర్ అవార్డు
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్‌పర్సన్ శాంతా సిన్హాకు యుధ్‌వీర్-2012 అవార్డు లభించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ‘మిలాప్’ హిందీ దినపత్రిక వ్యవస్థాపకుడు యుధ్‌వీర్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు.



19- 25 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్

జాతీయం

ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద సౌర శక్తి విద్యుత్ కేంద్రాన్ని గుజరాత్‌లోని పఠాన్ జిల్లా చరంకా వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 19న ప్రారంభించారు. 600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ఈ కేంద్రాన్ని 3 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారు. చరంకా వద్ద 214 మెగావాట్లు.. ఆనంద్, జామ్‌నగర్, కచ్, పోర్‌బందర్ తదితర కేంద్రాల్లో మిగిలిన 386 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దేశంలో సౌర విద్యుత్ రంగంలో గుజరాత్‌కు 66 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దేశంలో 900 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆసియాలో అతి పెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. నాలుగు దశల్లో 2,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేపడుతున్న ఈ కేంద్రం 2019 నాటికి పూర్తికానుంది.

రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఏప్రిల్ 17న విడుదల చేసిన ద్రవ్యపరపతి విధాన ప్రకటనలో రెపో రేటును అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. స్వల్ప కాలానికి బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును (రెపో రేటు) గత మూడేళ్లలో ఆర్‌బీఐ తొలిసారి తగ్గించింది. దీంతో గృహ, వాహనాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. రివర్స్ రెపో రేటు(బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు)ను 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్) 4.75 శాతంగానే ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13) ఆర్థికాభివృద్ధి (జీడీపీ వృద్ధిరేటు) 7.3 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.

ఈసీని సమర్థించిన సుప్రీం కోర్టు
రాజకీయ పార్టీలకు గుర్తింపు మంజూరుపై ఎన్నికల కమిషన్(ఈసీ) అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈసీ అనుసరిస్తున్న విధానంలోని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పలు రాష్ట్రాల్లోని గుర్తింపు పొందని ప్రాంతీయ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు పొందడంతోపాటు కనీసం రెండు అసెంబ్లీ సీట్లు సాధించిన రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపు మంజూరు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీతోపాటు బహుజన్ వికాస్ అఘడి, దేశీయ ముర్పోక్కు ద్రవిడ ఖజగం తదితర పార్టీలు.. గతంలో తమకు కేటాయించిన గుర్తును ఈసీ మార్చడాన్ని సవాలు చేస్తూ 2008లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లన్నిటినీ పలుసార్లు విచారించిన సుప్రీం కోర్టు, ఈసీ అనుసరిస్తున్న విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 18న తీర్పు వెలువరించింది.

జాతీయ పంటల అంచనా కేంద్రం ప్రారంభం
దేశంలో పంటల దిగుబడులు, కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు ఉద్దేశించిన జాతీయ పంటల అంచనా కేంద్రాన్ని (ఎన్‌సీఎఫ్‌సీ) కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఏప్రిల్ 23న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రధాన పంటలైన వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న తదితర 11 పంటల దిగుబడులను ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంచనా వేస్తుంది. ఇస్రోతో కలిసి జిల్లాల్లో సబ్ డివిజన్ స్థాయిల్లో కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తుంది.

అగ్ని-5 పరీక్ష విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని ఏప్రిల్ 19న ఒడిషాలోని వీలర్ ఐలాండ్ నుంచి నిర్వహించారు. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి పరిధిలోకి చైనాలోని తూర్పు ప్రాంతాలు వస్తాయి. తూర్పు ఐరోపా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాలను కూడా ఇది చేరగలదు. ఈ ప్రయోగంతో ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్)లు క లిగి ఉన్న దేశాల సరసన భారత్ నిలిచింది. ప్రస్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ దేశాలు మాత్రమే ఈ సామర్థ్యం కలిగి ఉన్నాయి. అగ్ని-5 క్షిపణి పొడవు 55 అడుగులు, ఆరున్నర అడుగుల వ్యాసం. ధ్వని వేగం కంటే 24 రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. 1500 కిలోల బరువున్న పేలోడ్‌ను తీసుకెళ్తుంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఈ క్షిపణిని రూపొందించింది.

రాష్ట్రీయం

తుమ్మలపల్లె యురేనియం కేంద్రం ప్రారంభం
వైఎస్‌ఆర్ కడప జిల్లా తుమ్మలపల్లె ప్రాజెక్టులోని యురేనియం శుద్ధి కర్మాగారాన్ని అణు ఇంధన కమిషన్ చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఇది దేశంలో రెండో యురేనియం కేంద్రం. మొదటి కేంద్రాన్ని జార్ఖండ్‌లోని జాదుగూడలో నెలకొల్పారు. తుమ్మలపల్లె ప్రపంచంలో ఎక్కువ యురేనియం ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతం. 2032 నాటికి 60,000 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి తుమ్మలపల్లె కేంద్రం తోడ్పడుతుంది. ప్రస్తుతం దేశంలో 5000 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూ. 48,935 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌కు 2012-13 సంవత్సరానికిగాను రూ.48,935 కోట్లతో కూడిన వార్షిక ప్రణాళికకు.. ప్రణాళికా సంఘం ఏప్రిల్18న ఆమోదం తెలిపింది. ఇది 2011-12 వార్షిక ప్రణాళిక (రూ.43,000 కోట్లు)కంటే 13.8 శాతం ఎక్కువ. ఈ సందర్భంగా తగ్గిన వృద్ధి రేటు, తదితర అంశాలను ప్రణాళికా సంఘం ప్రస్తావించింది. 2010 -11లో 8.92 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2011-12లో 5.81 శాతానికి పడిపోయింది. 2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు 25.07 నుంచి 19.22 శాతం తగ్గడం పట్ల ప్రణాళికా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.


చేనేత దిగ్గజం రాములు మృతి
చేనేత రంగంలో నూతన ఒరవడులు సృష్టించి.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన చేనేత దిగ్గజం గజం రాములు(68) గుండెపోటుతో ఏప్రిల్ 20న హైదరాబాద్‌లో మరణించారు. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన రాములు.. ‘తేలియా రుమాల్’ అనే వస్త్రం రూపొందించి ఖ్యాతి గడించారు. విశ్వకర్మ, ఉత్తమ జాతీయ కళాకారుడు, యునెస్కో పురస్కారం, భారత్ జ్యోతి వంటి పలు అవార్డులు ఆయనకు దక్కాయి.


12- 18 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్

భారత్‌లో పాక్ రాయబారి బషీర్
భారత్‌లో పాకిస్థాన్ నూతన రాయబారిగా సల్మాన్ బషీర్ నియమితులయ్యారు. 2008 నుంచి ఈ ఏడాది మార్చి వరకు బషీర్ పాక్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. షాహిద్ మాలిక్ స్థానంలో బషీర్ బాధ్యతలు చేపడతారు.

వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మతంతో సంబంధం లేకుండా వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 12న నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జనన మరణాల చట్టం-1969లో సవరణల కోసం ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్న మలి విడత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టనుంది. తాజా సవరణ ద్వారా వైవాహిక వివాదాల్లో, పోషణకు సంబంధించిన అంశాల్లో మహిళలకు రక్షణ లభిస్తుంది. మతాంతర వివాహం చేసుకున్న జంటలకు గుర్తింపు, భార్యాభర్తల వయసు తదితర అంశాలపై కూడా దీని ద్వారా స్పష్టత వస్తుంది. బాల్య వివాహాలను అరిక ట్టటానికి వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, 18వ లా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది. సిక్కుల వివాహాలను హిందూ వివాహ చట్టం కింద కాకుండా ‘ఆనంద్ వివాహ చట్టం-1909’ కింద ప్రత్యేకంగా నమోదు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను కేంద్రం ఆమోదించింది.

విద్యా హక్కు చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2009-విద్యా హక్కు చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, నాన్ మైనార్టీ అన్ ఎయిడెడ్ పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని పేర్కొంది. మైనార్టీ విద్యా సంస్థలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. విద్యా హక్కు చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ రాజస్థాన్‌కు చెందిన అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల సొసైటీతోపాటు పలు ప్రైవేట్ విద్యా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనల అనంతరం సుప్రీం కోర్టు ఏప్రిల్ 12న తీర్పు వెలువరించింది. దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలందరికీ ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా హక్కు చట్టం-2009ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం పాఠశాల విద్యను ఉచితంగా పొందే హక్కు బాలలం దరికీ సమానంగా ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ, ఎయిడెడ్, నాన్ మైనార్టీ అన్ ఎయిడెడ్ స్కూళ్లన్నింటిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలి. డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకూడదు. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.

4జీ సేవలు ప్రారంభించిన ఎయిర్‌టెల్
దేశంలో తొలిసారిగా భారతీ ఎయిర్‌టెల్ 4జీ(ఫోర్త్ జనరేషన్) 
టెలికాం సేవలను ఏప్రిల్ 10న కోల్‌కతాలో ప్రారంభించింది. 3జీ కంటే 4జీ ప్రసారాలు 10 రెట్లు వేగంగా ఉంటాయి. దీంతో ఇంటర్నెట్, వీడియో 
ప్రసారాలు వేగంగా అందుతాయి.

త్రివిధ దళాధిపతులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు
రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం త్రివిధ దళాధిపతులు.. వీకే సింగ్(ఆర్మీ), ఎన్‌ఏకే బ్రౌన్ (ఎయిర్‌ఫోర్స్), నిర్మల్ వర్మ(నేవీ)లకు ఏప్రిల్ 10న సమన్లు జారీ చేసింది. త్రివిధ దళాలకు చెందిన బలగాల సన్నద్ధతపై వివరణ ఇచ్చేందుకు ఏప్రిల్ 20న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. రెండువైపులా యుద్ధం ముంచుకొస్తే ఇప్పటికిప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు లేవని ఇటీవలి జరిగిన సమావేశంలో రక్షణ శాఖ ఉన్నతాధికారులు పేర్కొనడంతో.. ఈ అంశంపై త్రివిధ దళాధిపతుల నుంచే నేరుగా వివరణ కోరాలని స్థాయీ సంఘం నిర్ణయించింది. సైనిక బలగాలకు రేషన్ సరఫరాలో అవకతవకలపై కాగ్ నివేదిక విడుదలైన నేపథ్యంలో గతేడాది జనవరిలో పార్లమెంటరీ ప్రజాల పద్దుల సంఘం త్రివిధ దళాధిపతుల వివరణ కోరింది. ఆ తర్వాత ఒక పార్లమెంటరీ సంఘం త్రివిధ దళాధిపతులను పిలిపిస్తుండటం ఇదే మొదటిసారి. పైగా బలగాల సన్నద్ధతపై వారి వివరణ కోరనుండటం స్వాతంత్య్రానంతర చరిత్రలో ఇదే తొలిసారి.

అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశం
దేశ అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సదస్సు ఏప్రిల్ 16న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ.. అంతర్గత భద్రత సమస్యలను ఎదుర్కోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సామర్థ్య నిర్మాణం, పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్స్ ప్రభావిత ఏడు రాష్ట్రాలు మినహా అంతర్గత భద్రతపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, నక్సలిజం, మత ఛాందస వాదం, వర్గ హింస దేశాన్ని పట్టి పీడిస్తున్న అంతర్గత సమస్యలని పేర్కొన్నారు. వీటిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం(ఎన్‌సీటీసీ) ఏర్పాటు, బీఎస్‌ఎఫ్, ఆర్‌పీఎఫ్ చట్టాల్లో సవరణ వంటి విషయాల్లో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో విమర్శించారు.

టైగర్ రిజర్వ్‌గా కవ్వాల్ సంరక్షణ కేంద్రం
ఆదిలాబాద్ జిల్లా, జన్నారం డివిజన్‌లోని కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ‘టైగర్ రిజర్వ్’గా రాష్ట్ర ప్రభు త్వం ఏప్రిల్10న నోటిఫై చేసింది. 892.33చదరపు కి.మీ. విస్తీర్ణం గల ఈ ప్రాంతం రాష్ట్రంలో రెండో పులుల సంరక్షణ కేంద్రం. దేశంలో 42వది. రాష్ట్రంలో ప్రస్తుతం శ్రీశైలంలో పులుల సంరక్షణ కేంద్రం ఉంది. కవ్వాల్‌లో 20 పులులు ఉన్నట్లు అనధికార లెక్కలు తెలుపుతున్నాయి.

భారత జల వారోత్సవాలు
భారత జల వారోత్సవాలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ఏప్రిల్ 10న ప్రారంభించారు. దేశంలో తొలి సారిగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ నీటి వినియోగంపై నియంత్రణ ఉండాలన్నారు. భూగర్భ జలాలను ఉమ్మడి వనరుగా గుర్తించాలన్నారు. నీటి సక్రమ వినియోగాన్ని 20 శాతానికి పెంచాలని ‘జాతీయ నీటి విధానం(నేషనల్ వాటర్ మిషన్)’ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

దక్షిణ మధ్యరైల్వేకి గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు
సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే జోన్లకు సంయుక్తంగా గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు లభించింది. ఏటా దేశంలోని 17 రైల్వే జోన్ల పని తీరును రైల్వే శాఖ ఉన్నతాధికారులు సమీక్షించి అత్యుత్తమ పనితీరు చూపిన జోన్‌కు ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు. ఆరేళ్ల తర్వాత దక్షిణ మధ్యరైల్వేకి ఈ పురస్కారం దక్కింది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రవాణా, స్టోర్స్ వంటి ఆరు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఉత్తమ ప్రతిభ చూపింది.

5- 11 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
నౌకాదళానికి ఐఎన్‌ఎస్ చక్ర
అణు ఇంధన సామర్థ్యం గల జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ చక్ర’ను ఏప్రిల్ 4న లాంఛనంగా భారత నావికాదళంలో ప్రవేశపెట్టారు. రష్యా నుంచి భారత్ లీజుకు తీసుకున్న అకులా శ్రేణికి చెందిన ఈ అణు జలాంతర్గామి పదేళ్ల పాటు నావికాదళంలో సేవలందిస్తుంది. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నం స్థావరంగా ‘చక్ర’ పని చే స్తుంది. (దీన్ని రష్యా నావికాదళంలో నెర్పా-152గా వ్యవహరించేవారు). దీంతో అణు ఆధారిత ఇంధనంతో జలాంతర్గామిని నిర్వహించే ఆరో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా మాత్రమే ఇటువంటి సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.
శత్రుదేశాల సెన్సార్‌లు చక్రను గుర్తించలేవు. 108 మీటర్ల పొడవు, 13.5 మీటర్ల వెడల్పు, 8,140 టన్నుల బరువు ఉన్న ఈ జలాంతర్గామి గంటకు 30-35 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 190 మెగావాట్ల అణు రియాక్టరు ఉంది. 500 కిలో మీటర్ల లోతులో పని చేయగలదు. ఈ ఏడాది జనవరి 23న రష్యా నావికాదళం దీన్ని భారత్‌కు అప్పగించింది. 2009లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ అరిహంత్ జలాంతర్గామి ప్రయోగ పరీక్షల దశలోనే ఉండటంతో భారత నావికాదళానికి ప్రస్తుతానికి సేవలందించడం లేదు. 

అవాక్స్ పరీక్ష విజయవంతం
గగనతల నిఘా హెచ్చరిక వ్యవస్థ‘ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్(అవాక్స్)’ వ్యవస్థకు తొలిసారిగా బ్రెజిల్‌లో నిర్వహించిన పరీక్ష విజయవంతమైందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) ఏప్రిల్ 5న ప్రకటించింది. దేశీయంగా రూపొందించిన రెండో అవాక్స్ వ్యవస్థ తొలి పరీక్ష విజయవంతం కావడంతో జూన్‌లో భారత వైమానిక దళానికి దీన్ని అప్పగించే అవకాశాలున్నాయి. దీన్ని ‘ఆకాశ నేత్రం’గా కూడా వ్యవరిస్తారు. ఇది శత్రువు దేశాల విమానాలను, మానవరహిత విమానాలను గుర్తించగలదు.

ప్రపంచంలో తొలి మహిళా పారామిలటరీ బ్యాండ్
ప్రపంచంలోనే మొట్టమెదటి సారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన పారామిలటరీ పైప్ బ్యాండ్(సంగీత బందం) ను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం(సీఆర్‌పీఎఫ్) ఏర్పాటు చేసుకుంది. న్యూఢిల్లీలో ఏప్రిల్ 9న నిర్వహించిన పరాక్రమ దినోత్సవం సందర్భంగా మహిళల బ్యాండ్ తన తొలి ప్రదర్శన ఇచ్చింది. 1986లో సీఆర్‌పీఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్ ఏర్పాటైంది. 

పాక్ అధ్యక్షుడు జర్దారీ భారత పర్యటన
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏప్రిల్ 8న భారత్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కాశ్మీర్ సహా సర్‌క్రీక్, సియాచిన్ సమస్యల ప్రస్తావన కూడా ఈ సందర్భంగా వచ్చింది. ముంబై దాడులకు కారణమైన హాఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్ భూభాగంపై భారత్ వ్యతిరేక చర్యలను అరికట్టాలని ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్, జర్దారీని కోరారు. పాక్ పర్యటనకు రావాలన్న జర్దారీ ఆహ్వానానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకారం తెలిపారు. జర్దారీ రాజస్థాన్‌లోని అజ్మీర్ ఖ్వాజా మొయినుద్దీన్ ఛీస్తి దర్గాను సందర్శించి ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దర్గాకు పది లక్షల డాలర్ల(రూ.5.11 కోట్లు) విరాళాన్ని ప్రకటించారు.

మలబార్-2012
భారత్-అమెరికా నౌకా దళాల 16వ ఉమ్మడి శిక్షణ కార్యక్రమం చెన్నై, అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని భారత సముద్ర తీరంలో ఏప్రిల్ 7న ప్రారంభమైంది. దీనికి ‘మలబార్-2012’ అనే పేరు పెట్టారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భారత నౌకా దళం తరపున ఐఎన్‌ఎస్ రణ విజయ్, ఐఎన్‌ఎస్ కులీష్, ఐఎన్‌ఎస్ శక్తి యుద్ధ నౌకలు , అమెరికా తరపున యుఎన్‌ఎస్ కారల్ విల్సన్(సివిఎన్-70), ఎస్‌ఎన్‌హర్లీ, ఎన్‌ఎస్ ఫంకర్ హిల్ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. భారత-అమెరికా దళాలు 1992 నుంచి ఉమ్మడి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. 

ఖతార్ రాజు భారత పర్యటన
ఖతార్ రాజు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ భారత్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు. థానీ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. కీలకమైన చమురు, గ్యాస్ అన్వేషణ పంపిణీ కార్యకలాపాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం, మరో ఐదు అంశాలపై ఇరు దేశాలు ఏప్రిల్ 9న అవగాహనకు వచ్చాయి. రష్యా, ఇరాన్‌ల తర్వాత సహజ వాయువు నిల్వలు అధికంగా ఉన్న మూడో ప్రాంతం ఖతార్. భారత్‌కు ద్రవీకృత సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ) అతి పెద్ద సరఫరాదారు ఖతార్. ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని ఖతార్ నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది.

29 మార్చి- 4 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద గల ఐటీఆర్ (ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్) నుంచి మార్చి 28న నిర్వహించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. దీన్ని ‘స్టీప్ డ్రైవ్’ అనే నూతన పద్ధతిలో పరీక్షించారు. ఈ ప్రయోగంలో బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగం కంటే రెండున్న రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లింది. ఈ క్షిపణిని పరీక్షించడం ఇది 29వ సారి. 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ 300 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. 

న్యాయ వ్యవస్థ జవాబుదారీ బిల్లుకు ఆమోదం
న్యాయ ప్రమాణాలు, జవాబుదారీ బిల్లు 2010కి లోక్‌సభ మార్చి 29న ఆమోదం తెలిపింది. సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు వీలుగా ఓ వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే జడ్జీల విచారణ చట్టం-1968 రద్దు అవుతుంది. అదే సమయంలో పాత చట్టంలోని పార్లమెంట్‌కు సుప్రీం, హైకోర్టు జడ్జీల అభిశంసన అధికారం వంటి కీలక అంశాలు కొనసాగుతాయి. అంతేకాకుండా.. సుప్రీం, హైకోర్టు జడ్జీలు వారి ఆస్తులను వెల్లడించాలి. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే కమిటీ కార్యకలాపాలను వీడియో తీయాలన్న స్థాయి సంఘం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

2010లో 5.56 లక్షల క్యాన్సర్ మరణాలు
భారత్‌లో 2010లో 5.56 లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారని ‘ది లాన్సెట్’ అనే అంతర్జాతీయ పత్రిక మార్చి 28 సంచికలో తెలిపింది. వీరిలో 71 శాతం మంది 30-69 సంవత్సరాల మధ్య వయసు వారు. పురుషుల్లో ఎక్కువ మంది నోటి క్యాన్సర్ వల్ల.. మిహ ళల్లో ఎక్కువ మంది సర్వికల్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. సర్వికల్ క్యాన్సర్‌తో దేశంలో ప్రతి ఏటా 33,000 మంది మృత్యువాత పడుతున్నారు.

ఆరు ఒప్పందాలపై భారత్-బ్రెజిల్ సంతకాలు
బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి మార్చి 30న ఒప్పందాలు కుదిరాయి. ఇందులో శాస్త్రసాంకేతిక రంగం, బయోటెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, భారత్‌లో బ్రెజిల్ విద్యార్థులకు, పరిశోధకులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలు ఉన్నాయి. రక్షణ, అణు ఇంధనం, మరికొన్ని ప్రధాన రంగాల్లో పూర్తిగా సహకరించుకోవాలని, గ్లోబల్ గవర్నెన్స్ విధానంలో ముఖ్యంగా జి-20 ప్రక్రియకు సంబంధించి చర్చలు విస్తరించుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇరు దేశాలు అంగీకరించాయి.

మిస్ ఇండియా వరల్డ్ వన్య మిశ్రా
మిస్ ఇండియా-2012గా చండీగఢ్‌కు చెందిన వన్య మిశ్రా ఎంపికయ్యారు. మార్చి 30న ముంబైలో జరిగిన పోటీలో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ను ప్రాచీ మిశ్రా గెలుచుకోగా, మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌గా రోఛెల్లీ మరియా రావు నిలిచింది. వీరు 2012 మిస్ వరల్డ్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషన్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తారు.

భారత్‌లో అమెరికా రాయబారిగా పావెల్
భారత్‌లో అమెరికా రాయబారిగా నాన్సీ పావెల్ నియామకాన్ని అమెరికా చట్ట సభ సెనెట్ మార్చి 30న ఖరారు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో తిమోతీ రోమర్ రాజీనామాతో ఈ పదవి ఖాళీగా ఉంది. దీంతో ఆ పదవిలో డిసెంబర్ 16న నాన్సీ పావెల్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.

AIMS DARE TO SUCCESS 

మే 2012 జాతీయం
విదేశాల్లో 20 భారతీయ కంపెనీలకు 80 బిలియన్ డాలర్ల ఆస్తులు
విదేశాల్లో 20 భారతీయ పెద్ద కంపెనీలు కలిసి 80 బిలియన్ డాలర్లు (4 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులు కలిగి ఉన్నట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) తన ట్రాన్స్‌నేషనాలిటీ ఇండెక్స్ (టీఎన్‌ఐ)లో తెలిపింది. వీటిలో మొదటి ఆరు అతిపెద్ద కంపెనీలు 50 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, హిండాల్కో, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐదు ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఉన్నాయి. ఈ 20 సంస్థల విదేశీ ఆదాయం 126 బిలియన్లుగా అంచనా వేశారు.

గోధుమ ఉత్పత్తిని దెబ్బతీయనున్న వాతావరణ మార్పు
ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమ ఉత్పత్తి ఆరు మిలియన్ టన్నులు తగ్గిపోతుందని వాతావరణ మార్పుపై ప్రభుత్వ నివేదిక తెలిపింది. దీనికి సంబంధించి భారత్ రెండో నివేదికను వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్‌కు మే 10న సమర్పించింది. భారత్‌లో 2010-11లో అత్యధిక స్థాయిలో 85.93 మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తి జరిగింది. వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలు చేపట్టాలని, అవి నష్టాన్ని తగ్గించగలవని తెలిపింది.

ఎడిన్‌బర్గ్‌లో ఠాగూర్ అధ్యయన కేంద్రం
స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం, ఆయన రచనలపై అధ్యయనానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా మే 9న ఈ కేంద్రం ఏర్పాటును ప్రకటించారు. ఈ కేంద్రానికి ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ అకడెమిక్ డెరైక్టర్ ఇంద్రా నాథ్ చౌదరి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ది స్కాటిష్ సెంటర్ ఫర్ ఠాగూర్ స్టడీస్ అట్ ఎడిన్‌బర్గ్ నాపియర్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటయ్యే ఈ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ భారతీయ సంస్కృతి, విద్య, తత్వం, కళలు, సాహిత్యంలో ఠాగూర్ ప్రభావాన్ని ప్రధానంగా తీసుకుంటూ వాటిని ప్రోత్సహిస్తుంది.

టి.బి. కేసులు నమోదు చేయాలని కేంద్రం ఆదేశం
ట్యూబర్ క్యులోసిస్ (టి.బి.) వ్యాధిని ‘నోటిఫైయబుల్ డిసీజ్’గా కేంద్రం మే 9న ప్రకటించింది. దీంతో ఈ వ్యాధి సోకిన ప్రతి కేసును ప్రైవేట్ డాక్టర్లు, ఆసుపత్రులు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు టి.బి. రోగుల రికార్డును ప్రైవేట్ డాక్టర్లు నిర్వహించేవారు కాదు.
టి.బి. వ్యాధికి సరైన పరీక్షలు, వ్యాధి నియంత్రణ, వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించడం వంటి చర్యలు తీసుకోవడానకి ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారం అవసరం. మందులకు లొంగని టి.బి. దేశంలో బాగా ప్రబలుతోంది. దేశంలో ఏటా 15 లక్షల కేసులు నమోదవుతున్నాయి. 2010లో 3,60,000 మంది టి.బి. వ్యాధితో మరణించారు.

ములాయంసింగ్‌కు ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్ అవార్డు
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, పాకిస్తాన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మహమ్మద్ చౌదరి సహా ఐదుగురు ప్రముఖులను ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్స్ అవార్డ్-2012కు ఎంపిక చేశారు. లండన్‌లో ఈ నెల 28న నిర్వహించే కార్యక్రమంలో బ్రిటన్ సుప్రీంకోర్టు అధ్యక్షుడు లార్డ్ ఫిలిప్స్ ఈ అవార్డులను అందజేస్తారు.


కాపీరైట్ బిల్లుకు కేంద్రం ఆమోదం
కాఫీరైట్ సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇన్నోవేషన్ వర్సిటీల ఏర్పాటు, ఉన్నత విద్యా సంస్థలకు తప్పనిసరి అక్రిడేషన్ బిల్లులకు కూడా ఆమోదం తెలుపుతూ మే 10న కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

రూ. 7 వేల కోట్ల ప్రాజెక్టులకు రక్షణ శాఖ ఓకే
ఎం 777 రకానికి చెందిన 145 అల్ట్రా లైట్ శతఘు్నల కొనుగోలు ప్రాజెక్టు సహా మొత్తం రూ. ఏడు వేల కోట్లకు పైగా రక్షణ సామగ్రి కొనుగోళ్ల ప్రాజెక్టులకు రక్షణ మంత్రిత్వ శాఖ మే 11న ఆమోదం తెలిపింది. సైనిక బలగాల ఆధునీకరణను వేగవంతం చేయడంలో భాగంగా రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని రక్షణ సేకరణ మండలి(డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పార్లమెంట్ తొలి సమావేశానికి 60 ఏళ్లు 
పార్లమెంట్ తొలి సమావేశం జరిగి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 13న లోక్‌సభ, రాజ్యసభలు ప్రత్యేకంగా కొలువుదీరాయి. ఈ సందర్భంగా తొలి లోక్‌సభకు చెందిన నలుగురు సభ్యులను మే 13న ఘనంగా సత్కరించారు. 
వీరిలో రిషాంగ్ కేషింగ్(మణిపూర్), రేషమ్‌లాల్ జాంగ్డే(ఛత్తీస్‌గఢ్), మన రాష్ట్రానికి చెందిన కందాళ సుబ్రహ్మణ్య తిలక్(92), కానేటి మోహనరావు(87)లు ఉన్నారు. రిషాంగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. సుబ్రహ్మణ్య తిలక్ విజయనగరం నుంచి సోషలిస్ట్ పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో తొలి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జర్నల్ ఆఫ్ పార్టీలెస్ డెమోక్రసీ గౌరవ సంపాదకుడిగా కొనసాగుతున్నారు. తెలుగు శక్తి పేరిట స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. కానేటి మోహన్‌రావు 1952లో కమ్యూనిస్టు పార్టీ తరపున రాజమండ్రి ఎస్సీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 
రూ. 5, రూ. 10 నాణేల విడుదల
పార్లమెంట్ వజ్రోత్సవాల సందర్భంగా రూ. 5, రూ. 10 స్మారక నాణేలను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ విడుదల చేశారు. వీటితో పాటు రాజ్యాంగ సభలో, పార్లమెంట్‌లో అప్పటి నేతలు చేసిన ప్రసంగాలతో కూడిన కొన్ని పుస్తకాలను కూడా రాష్ర్టపతి ఆవిష్కరించారు. 
లోక్‌సభ మొదటి సమావేశం మే 13, 1952లో జరిగింది. 
లోక్‌సభ తొలి స్పీకర్: జీవీ మౌలాలంకార్ 
రాజ్యసభ తొలి చైర్మన్: ఎస్. రాధాకృష్ణన్



గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రెండో సారి నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ నెల 3న ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.లోకూర్ ప్రమాణస్వీకారం చేయించారు.



రవిశంకర్‌కు ఠాగూర్ అంతర్జాతీయ పుర స్కారం
సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ తొలిసారిగా ప్రదానం చేస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఠాగూర్ 150వ జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 7న న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. పురస్కారం పేరును ‘ఠాగూర్ అంతర్జాతీయ సాంస్కృతిక, సామరస్య అవార్డు’గా మార్చినట్లు ఆయన తెలిపారు. ఈ పురస్కారం కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం బహూకరిస్తారు. ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్ల గ్రాంటు ప్రకటించింది.

అశోక మిత్రన్‌కు ఎన్టీఆర్ సాహితీ పురస్కారం
ఎన్టీఆర్ ఆరో జాతీయ సాహితీ పురస్కారానికి తమిళ సాహితీవేత్త అశోకమిత్రన్ ఎంపికయ్యారు. 2007 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, బంగారు పతకం,ప్రశంసాపత్రం అందజేస్తారు. ఎన్టీఆర్ జయంతి రోజైన ఈ నెల 28న ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.

ప్రాణహిత-చేవెళ్లపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఒప్పందం
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఈ నెల 5న న్యూఢిల్లీలో కుదిరింది. దీని ప్రకారం ప్రాజెక్టు కోసం అంతర్రాష్ట్ర బోర్డును ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పరిశీలనలు ఈ మండలి ఆధ్వర్యంలోనే సాగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 16,40,000 ఏకరాలకు సాగునీరందుతుంది. దీంతోపాటు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగు నీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు కూడా లభిస్తుంది.

సుకుమా కలెక్టర్‌ను విడుదల చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ఈ నెల 3న మావోయిస్టుల చెర నుంచి విడుదలయ్యారు. ఆయనను మావోయిస్టులు ఏప్రిల్ 21న అపహరించుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్యవర్తుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కలెక్టర్‌ను వదిలి పెట్టారు. మధ్యవర్తులుగా ప్రొఫెసర్ హరగోపాల్, బీడీ శర్మలు మావోయిస్టులతో చర్చలు జరిపారు. ఒప్పందం ప్రకారం జైళ్లలో ఉన్న మావోయిస్టులపై కేసులను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.

AIMS DARE TO SUCCESS 

జూన్ 2012 జాతీయం
28 జూన్ - 04 జూలై 2012 జాతీయం

జాతీయం
ప్రణబ్ రాజీనామా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ జూన్ 26న తన పదవికి రాజీనామా చేశారు. జూలై 19న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రణబ్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలతోపాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

వీరభద్ర సింగ్ రాజీనామా
కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి వీరభద్రసింగ్ జూన్ 26న తన పదవికి రాజీనామా చేశారు. 1989 నాటి లంచం కేసులో హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు మంత్రితోపాటు ఆయన భార్యపై అభియోగాలు నమోదు చేయడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. 1989లో ఆయన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక వేత్తల నుంచి ముడుపులు పొందారని ఆరోపణ. ఈ లావాదేవీలకు సంబంధించిన సంభాషణల ఆడియో సీడీ 2007లో వెలుగు చూసింది. దీంతో వీరభద్రసింగ్‌పై 2009 ఆగస్టులో కేసు నమోదు చేశారు.

కల్పనా చావ్లా పేరిట పథకం
బెంగళూరు మహానగర పాలిక మహిళల ఆర్థిక స్వావలంబన కోసం దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా పేరిట కొత్త పథకాన్ని జూన్ 28న ప్రకటించింది. మహిళ కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహించే 50 వార్డుల్లో పేద మహిళలను గుర్తించి కంప్యూటర్ కోర్సులు, కుట్టు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్స్ తదితర వాటిల్లో శిక్షణ నిస్తారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్, సంగ్మా నామినేషన్లు
భారత నూతన రాష్ట్రపతి కోసం జూలై 19న జరిగే ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ జూన్ 28న నామినేషన్ దాఖలు చేశారు. ఆదే రోజు లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈయనకు బీజేపీ, బీజేడీ,
ఏఐఏడీఎంకె పార్టీలు మద్దతిస్తున్నాయి. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో 10.98 లక్షల ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతిగా గెలవాలంటే ఒక అభ్యర్థికి కావల్సిన ఓట్లు 5,49,442. 

సుర్జీత్ సింగ్‌ను విడుదల చేసిన పాక్
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టై 31 ఏళ్లుగా పాకిస్థాన్‌లో జైలు జీవితం గడిపిన భారత్‌కు చెందిన సుర్జీత్‌సింగ్(69)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 28న ఆయన వాఘా సరిహద్దు గుండా భారత్‌లో అడుగు పెట్టారు. గూఢచర్యానికి పాల్పడ్డాడం టూ 1980లో సుర్జీత్‌ను పాక్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం పాక్ సైనిక చట్టాల ప్రకారం 1985లో మరణశిక్ష విధించారు. అయితే ఈ శిక్షను 1989లో నాటి పాక్ అధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ జీవితఖైదుకు తగ్గించారు.

రాష్ట్రీయం
నూతన సీఎస్‌గా మిన్నీ మాథ్యూ
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేస్తున్న మిన్నీ మాథ్యూ నియమితులయ్యారు. మాథ్యూ వచ్చే ఏడాది జనవరిలో పదవీ విరమణ చేస్తారు. 1976 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మాథ్యూ స్వరాష్ట్రం కేరళ. ఈమె సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ కాగా.. తొలి మహిళా సీఎస్ (2002లో) సతీనాయర్ కూడా కేరళకు చెందినవారే.

25 పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం
రాష్ట్రంలో రూ.40,379 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పే 25 పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి జూన్ 27న ఆమోదం తెలిపింది. వీటిని కడప, కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, విజయనగరం, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలలో నెలకొల్పుతారు.

శ్రీకాకుళంలో ‘ఈ వాణి’
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల సమాచారాన్ని వాయిస్ మెయిల్ ద్వారా రేషన్ కార్డుదారులకు చేరవేసే విధానం ‘ఈ వాణి’ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. ఈ విధానంలో సరుకులు రేషన్ దుకాణాలకు విడుదలైన వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్లకు వాయిస్ మెయిల్ ద్వారా సమాచారం వెళుతుంది.

21- 27 జూన్ 2012


జాతీయం



అడ్వాంటేజ్ ఏపీ-2012
ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించేందుకు ఉద్దేశించిన ‘అడ్వాంటేజ్ ఏపీ-2012’ సదస్సు జూన్ 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సులో 2012-17 కాలంలో అమల్లో ఉండే ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పాలసీని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విడుదల చేశారు.

ఇందులో రాష్ట్ర రాజధాని సహా పలు ఇతర నగరాల్లో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలు నెలకొల్పేందుకు తగిన ప్రోత్సాహకాలు, ప్రస్తుత ఫ్యాబ్‌సిటీ, ఏరోనాటికల్ సెజ్‌లను ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలకు ఆయువుపట్టుగా మార్చడం,పరిశోధన, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, అనుమతుల కోసం సింగిల్ విండోను ఏర్పాటుచేయడం, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కంపెనీలకు రాయితీలు వంటి తదితర అంశాలు ఉన్నాయి.

దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి సచిన్ పైలట్ ఈ సందర్భంగా వెల్లడిం చారు. రూ.20 వేల కోట్లతో రానున్న మూడేళ్లలో ఈ ప్రాజె క్టు పూర్తిచేయనున్నట్లు పైలట్ వివరించారు.

ఐటీసీ సోషల్ ఫారెస్ట్రీకి అంతర్జాతీయ అవార్డు
ఖమ్మం జిల్లాలో ఐటీసీ సంస్థ అమలు చేస్తున్న సామాజిక వనాల పెంపకం పథకానికి(సోషల్ ఫారెస్ట్రీ), 2012 వరల్డ్ బిజినెస్ అండ్ డెవలప్‌మెంట్ అవార్డు లభించింది. రియో డి జనీరో(బ్రెజిల్)లో నిర్వహించిన రియో+20 ధరిత్రీ శిఖరాగ్ర సదస్సులో ఈ పురస్కారాన్ని ఐటీసీకి ప్రదానం చేశారు.

భారత్‌లో ఈ అవార్డు అందుకున్న ఏకైక సంస్థ ఐటీసీ. రాష్ట్రంలో 1,25,000 హెక్టార్లలో సామాజిక వనాల పెంపకం పూర్తి చేసి 56 మిలియన్ల పని దినాలను కల్పించడంలో విజయం సాధించినందుకుగాను ఐటీసీకీ ఈ పురస్కారం లభించింది.

ఎన్‌ఐఏ తొలి చీఫ్ రాధా వినోద్ మృతి
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) వ్యవస్థాపక డెరైక్టర్ జనరల్ రాధా వినోద్ రాజు(62) కొచ్చిలో జూన్ 21న మరణించారు. 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 26/11 ముంబై దాడుల అనంతరం ఎన్‌ఐఏను ఏర్పాటు చేశారు.

14- 20 జూన్ 2012
జాతీయం
బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు గాంధీ అవార్డు
భారత్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు లండన్‌లోని గాంధీ ఫౌండేషన్ అంతర్జాతీయ శాంతి పురస్కారాలను ప్రకటించింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వీరికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. బెంగాల్‌కు చెందిన పిల్లల వైద్యుడైన సేన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా ఛ త్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యం కోసం విశేష కృషి చేశారు. జార్ఖండ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త బులూ ఇమామ్ పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ శాంతి అవార్డును గాంధీ ఫౌండేషన్ 1998 లో ఏర్పాటు చేసింది. గాంధీ సిద్ధాంతాలను ప్రభోదిస్తూ, అహింసా మార్గాన్ని అనుసరించే వ్యక్తులు, గ్రూపులకు ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.

ఐటీడీసీ చైర్మన్‌గా వాఘేలా
ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్‌గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా జూన్ 13న బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అశోకా గ్రూప్ హోటళ్లను ఐటీడీసీ నిర్వహిస్తోంది. ఐటీడీసీ చైర్మన్‌కు కేబినెట్ స్థాయి హోదా ఉంటుంది.

భారత వృద్ధి రేటు 6.9 శాతం 
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2012-13లో 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ‘గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్’ పేరిట ప్రపంచ బ్యాంకు జూన్ 12న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం భారత్ 2013-14లో 7.2 శాతం, 2014-15లో 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుంది. సంస్కరణలు నిలిచిపోవడం, విద్యుత్ సమస్య, బలహీన ద్రవ్య విధానం వంటి కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి సన్నగిల్లిందని నివేదిక విశ్లేషించింది. 2011-12లో భారత జీడీపీ 6.5 శాతానికి క్షీణించింది.


బార్క్ డెరైక్టర్‌గా శేఖర్ బసు
బాబా అణు పరిశోధన కేంద్రం(బార్క్) డెరైక్టర్‌గా శేఖర్ బసు నియమితులయ్యారు. ప్రస్తుతం బసు న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఐబీఏ చైర్మన్‌గా అలోక్ మిశ్రా
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ అలోక్ మిశ్రా ఎన్నికయ్యారు. కె.ఆర్. కామత్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్), జేపీ దువా(అలహాబాద్ బ్యాంక్), చందా కొచ్చర్(ఐసీఐసీఐ బ్యాంక్) డిప్యూటీ చైర్ పర్సన్‌లుగా ఎన్నికయ్యారు.


07- 13 జూన్ 2012



సీఈసీగా వి.ఎస్.సంపత్
నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా వీరవల్లి సుందరం(వి.ఎస్.) సంపత్ జూన్ 6న నియమితులయ్యారు. ఎస్.వై. ఖురేషి స్థానంలో జూన్ 11న సంపత్ బాధ్యతలు స్వీకరించారు. 2015 జనవరిలో 65 ఏళ్ల వయసులో ఆయన పదవీ విరమణ చేస్తారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం కమిషనర్ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే దాకా (వీటిలో ఏది ముందు పూర్తయితే అది) పదవిలో కొనసాగుతారు. ఎన్నికల సంఘంలో ఇప్పుడు ఉన్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో 62 ఏళ్ల సంపత్, హెచ్.ఎస్. బ్రహ్మ కంటే సీనియర్ కావడంతో సంప్రదాయాన్ని పాటించి ఆయనకే సీఈసీగా పదోన్నతి కల్పించారు. సంపత్ 2009 ఏప్రిల్‌లో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన 1973 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.

నౌకాదళ ప్రధానాధికారిగా దేవేంద్ర జోషి 
భారత నౌకాదళ ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ దేవేంద్ర జోషి నియమితులు కానున్నారు. జలాంతర్గాముల విధ్వంసక యుద్ధతంత్రంలో నిపుణుడైన జోషి ప్రస్తుతం పశ్చిమ నౌకాదళ ముఖ్యాధికారిగా వ్యవహరిస్తున్నారు. 2012 ఆగస్ట్ 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్ నిర్మల్ వర్మ స్థానంలో జోషి బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జోషి 1974 ఏప్రిల్ 1న 
భారతీయ నౌకదళంలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరడం ద్వారా కెరీర్ ప్రారంభించారు.

ఆనంద్ మహీంద్రాకు లీడర్‌షిప్ అవార్డు
భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) నాయకత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయనతోపాటు అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ అలన్ ములాలీ కూడా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సంస్థ భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందింపజేయడానికి కృషి చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన బాలికల నిష్పత్తి
ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు బాలికల నిష్పత్తి 943కు తగ్గింది (ఇది 2001లో 961). ఆరు సంవత్సరాలలోపు ప్రతి 1000 మంది బాలురకు బాలికల నిష్పత్తి పట్టణాల్లో 946 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 942గా ఉంది (ఇది 2001 లో పట్టణాల్లో 963, గ్రామీణ ప్రాంతాల్లో 955). రాష్ట్ర జనగణన విభాగం జూన్ 7 విడుదల చేసిన మండలాల వారీ జనాభా ఈ వివరాలను వెల్లడించాయి. 
రాష్ట్ర మొత్తం జనాభా:
* 8,46,65,533 (గ్రామీణ జనాభా-5,63,11,788. పట్టణ జనాభా-2,83,53,745).
* రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పట్టణ జనాభాతో పోల్చితే గ్రామీణ జనాభా వృద్ధి రేటు తగ్గింది. 
* అత్యధిక జనాభా ఉన్న మండలాల జాబితాలో 10.35 లక్షల జనాభాతో విజయవాడ అర్బన్ తొలిస్థానంలో నిలవగా.. మారేడుమిల్లి (తూర్పుగోదావరి)కి చివరి స్థానం దక్కింది.
* రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు. బాల బాలికల (0 నుంచి 6 ఏళ్ల వయసు) నిష్పత్తి అత్యంత తక్కువగా నల్గొండ జిల్లా చిట్యాల(528)లో నమోదయింది. రెండో స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం (704) నిలిచింది. 
* రాష్ట్ర సగటు అక్షరాస్యత 67.66 శాతం (దేశ సగటు అక్షరాస్యత 74.04). 2001లో 2.61 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 2.45 కోట్లకు తగ్గింది.

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌గా ఆర్‌పీ సింగ్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) నూతన చైర్మన్‌గా రాజీందర్ పాల్ సింగ్ (ఆర్.పి.సింగ్) జూన్ 11న నియమితులయ్యారు. ఈయన 1976 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ (రిటైర్డ్) అధికారి. ఆర్.పి.సింగ్ ఈ పదవిలో మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కొనసాగుతారు.

జాతీయం
ఐఎస్‌సీఏ శత వార్షికోత్సవం
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్‌సీఏ) శత వార్షికోత్సవాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జూన్ 2న కలకత్తా యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిని ‘భారత్‌లో శాస్త్ర సంవత్సరం’గా ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 100 పరిశోధన ఫెలోషిప్‌లు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2003 నాటి విధానపత్రం స్థానంలో శరవేగంగా మారిపోతున్న శాస్త్రరంగాన్ని ప్రతిబింబిస్తూ నూతన శాస్త్రసాంకేతిక విధానాన్ని రూపొందిస్తామన్నారు.



జాతీయ టెలికాం విధానం 2012కు కేబినెట్ ఆమోదం
జాతీయ నూతన టెలికాం విధానం(ఎన్‌టీపీ) 2012కు కేంద్ర కేబినెట్ మే 31న ఆమోదం తెలిపింది. కొత్త విధానం వల్ల రోమింగ్ చార్జీలు రద్దవుతాయి. దేశమంతటా ఉచిత రోమింగ్, పూర్తి స్థాయి నెంబర్ పోర్టబిలిటీ అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఎక్కడ ఏ నెట్‌వర్క్‌కు మారినా ప్రస్తుతం ఉపయోగిస్తున్న నెంబరునే ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 39 శాతం టెలికాం సర్వీసులను 2020 నాటికి 100 శాతానికి పెంచుతారు. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను కనీసం 2 ఎంబీపీఎస్‌కు పెంచుతారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. కొత్త విధానంలో ఆపరేటర్లకు లెసైన్సులు, స్పెక్ట్రమ్ విడిగా కల్పిస్తారు. ఏకీకృత లెసైన్సింగ్ విధానం అమల్లోకి వస్తుంది. ఆపరేటర్లు కేవలం ఒకే టెక్నాలజీకి పరిమితం కాకుండా ఏ టెక్నాలజీ ద్వారానైనా సర్వీసులు అందించవచ్చు.

సైనికాధిపతిగా బిక్రమ్ సింగ్
భారత సైనిక దళానికి 25వ సైనికాధిపతిగా జనరల్ బిక్రమ్ సింగ్ మే 31న బాధ్యతలు స్వీకరించారు. జనరల్ విజయ్ కుమార్ (వీకే) సింగ్ నుంచి పగ్గాలు చేపట్టిన బిక్రమ్ సింగ్ రెండు సంవత్సరాల మూడు నెలలపాటు పదవిలో కొనసాగుతారు. ఇంతకుముందు ఈయన కోల్‌కతా కేంద్రంగా ఉన్న తూర్పు సైనిక విభాగం అధిపతిగా పని చేశారు. ఇండియన్ మిలటరీ అకాడమీ ద్వారా 1972, మార్చి 31న సిఖ్ లైట్ ఇన్‌ఫ్రాంటీ రెజిమెంట్‌లో చేరడం ద్వారా కెరీర్ ప్రారంభించారు.

హైదరాబాద్‌లో బ్రిటన్ కాన్సులేట్
బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయా(కాన్సులేట్)న్ని మే 31న హైదరాబాద్‌లో ఆ దేశ దౌత్య విభాగాధిపతి సైమన్ ఫ్రేజర్ ప్రారంభించారు. ఇది హైదరాబాద్‌లో మూడో కాన్సులేట్ కార్యాలయం. మొదట ఇరాన్, 2008 లో అమెరికాలు తమ కాన్సులేట్ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. దీంతో భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాల సంఖ్య ఏడుకు చేరింది.

భట్టాచార్యకు బ్రిటన్ సాహిత్య పురస్కారం
బ్రిటన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ప్రదానం చేసే ‘ఆన్‌డాట్జీ-2012’ బహుమతికి ఢిల్లీకి చెందిన రాహుల్ భట్టాచార్య ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘ద స్లై కంపెనీ ఆఫ్ పీపుల్ హూ కేర్’ నవలకుగాను ఈ బహుమతి లభించింది. భారతీయ పాత్రికేయుడి సాహసకృత్యాలే ఇతివృత్తంగా ఈ నవల సాగుతుంది. ఒక భారతీయుడికి తొలిసారిగా ఈ అవార్డు దక్కింది. భట్టాచార్య ‘పండిట్స్ ఫ్రమ్ పాకిస్థాన్’ అనే క్రికెట్ పుస్తకాన్ని కూడా రాశారు.

‘ఆకాశ్’ పరీక్ష విజయవంతం
వైమానిక దళంలో ఉపయోగించే ‘ఆకాశ్’ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టె స్ట్ రేంజ్ నుంచి జూన్ 1న విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షి పణులు 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించాయి. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణి 60 కిలోల బరువుగల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.

AIMS DARE TO SUCCESS 

జూలై 2012 జాతీయం
12- 18 జూలై 2012

జాతీయం
కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీశ్ శెట్టర్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా జగదీశ్ శెట్టర్ జూలై 12న ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితోపాటు కె.ఎస్. ఈశ్వరప్ప ఆర్. ఆశోక్‌లను ఉపముఖ్యమంత్రులుగా నియమించారు. 2008లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శెట్టర్ మూడో ముఖ్యమంత్రి. రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రి.

దేశంలో తొలి ఫుడ్‌పార్‌‌క ప్రారంభం
దేశంలో నెలకొల్పిన తొలి మెగాఫుడ్ పార్‌‌కను చిత్తూరు జిల్లా మొగిలి వద్ద కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌పవార్ జూలై 9న ప్రారంభించారు. 147 ఎకరాల్లో నెలకొల్పిన ఈ శ్రీనిఫుడ్ పార్‌‌కలో విత్తనాల నుంచి తుది వినియోగం వరకు అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలు కల్పించారు. ఇందులో ఫుడ్ ప్రాసెస్ చేసేవారికి, వ్యవసాయ దారులకు, రిటైలర్లకు, ఎగుమతిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దేశంలో మంజూరైన 10 ఫుడ్ పార్కుల్లో ఇదే మొదట పనిచేయడం ప్రారంభించింది.

నటుడు దారాసింగ్ మృతి
బాలీవుడ్ తొలితరం హీరో, మల్లయోధుడు దారాసింగ్ (84) ముంబైలో జూలై 12న మరణించారు. ఆయన తొలిసారి 1952 సంగ్‌దిల్ చిత్రంలో నటించగా చివరిసారిగా 2007లో జబ్ వుయ్ మెట్ చిత్రంలో నటించారు. ఆయన టీవీ సీరియల్ రామాయణంలో
హనుమంతుడిగా మంచి పేరు గడించారు.

అత్యుత్తమ వాణిజ్య నగరంగా ఢిల్లీ
ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ (ఐఎఫ్‌సి) అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన అత్యుత్తమ వాణిజ్య నగరాల జాబితాలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా తర్వాత స్థానాలను ద క్కించుకున్నాయి . గిరాకీ, పోటీ సామర్థ్యం, పరిశ్రమలు అనుసరిస్తున్న ప్రమాణాలు అనే నాలుగు అంశాల ఆధారంగా ఐఎఫ్‌సి జాబితా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే న్యూయార్‌‌క, లండన్‌లు మొదటి , రెండో స్థానాల్లో నిలిచిచాయి

ఎల్‌టీటీఈపై నిషేధం పొడిగింపు
లిబరేషన్ టైగర్‌‌స ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టీటీఈ)పై 2014 మార్చి 31 వరకు భారత ప్రభుత్వం నిషేధం పొడిగించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను జూలై 14న విడుదల చేసింది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత కేంద్రం ఎల్‌టీటీఈపై నిషేధం విధించింది. 2009 శ్రీలంక దళాలు ఆ సంస్థ అధిపతి ప్రభాకరన్‌ను మట్టు బెట్టడంతో ఎల్‌టీటీఈ పూర్తిగా దెబ్బతింది. ఎల్‌టీటీఈ ఇంకా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, దానివల్ల ప్రజల భద్రతకు ముప్పు ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.


04- 11 జూలై 2012

ఫోర్బ్స్ జాబితాలో 8 భారతీయ కంపెనీలు 
2012 సంవత్సరానికి ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించిన అతిపెద్ద 500 కంపెనీల్లో ఎనిమిది భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. వీటిలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లకు మొదటి 100 కంపెనీల్లో స్థానం దక్కింది. వీటి వార్షిక ఆదాయం 86,016 మిలియన్ డాలర్లు.

గత సంవత్సరం 98వ స్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ ఈసారి 83 స్థానానికి, 134వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 99వ స్థానానికి చేరాయి. వీటితో పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన భారతీయ కంపెనీల జాబితాలో టాటా స్టీల్(401వ స్థానం), టాటా మోటార్స్(314వ స్థానం), భారత్ పెట్రోలియం(225వ స్థానం), హిందుస్థాన్ పెట్రోలియం( 267వ స్థానం), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ 357వ స్థానం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(285వ స్థానం) ఉన్నాయి. ఈ జాబితాలో రాయల్ డచ్ షెల్ మొదటిస్థానంలో ఉంది.

భారత్‌పై ఐరాస సహస్రాబ్ధి అభివృద్ధి నివేదిక 
భారతదేశంలో 626 మిలియన్ల మంది జనాభాకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ధి అభివృద్ధి నివేదిక -2012 పేర్కొంది. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికమని తెలిపింది. 2011 జూన్ చివరి నాటికి దేశంలోని 98.1 శాతం గ్రామాలకు మొబైల్ ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వ చ్చిందని నివేదిక పేర్కొంది.

అయితే ప్రపంచంలో 1.1 బిలియన్ మందికి (15 శాతం జనాభాకు) పారిశుధ్య సౌకర్యాలు లేవని, భారత్‌లో కూడా ఇవి చాలా తక్కువగా మెరుగుపడ్డాయని తెలిపింది. సహస్రాబ్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే పారిశుధ్య సౌకర్యాలు లేని వారి సంఖ్యను 2015 నాటికి 38 శాతానికి తగ్గించాల్సి ఉందని అభిప్రాయపడింది. 2011 చివరి నాటికి ప్రపంచంలో 35 శాతం మంది జనాభాకు ఆన్‌లైన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని నివేదిక తెలిపింది.

యూఎన్‌డీఓఎఫ్ అధిపతిగా ఇక్బాల్ సింగ్
సైనిక దళాల ఉపసంహరణ ను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితి సేనకు(యూఎన్‌డీఓఎఫ్) అధిపతిగా భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ఇక్బాల్ సింగ్ సింఘా నియమితులయ్యారు. ఫిలిప్పీన్స్ మేజర్ జనరల్ నటాలియో సి. ఎకర్మ స్థానంలో సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2012 జాతీయం
లక్ష్య-1 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి అతి చిన్న పైలట్ రహిత విమానం ‘లక్ష్య-1’ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఆగస్టు 23న ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఆరు అడుగుల పొడవు ఉండే ఈ విమానం 30-35 నిమిషాల వరకు ప్రయాణిస్తుంది. వైమానిక దళ పైలట్లతో పాటు సాధారణ పైలట్ల శిక్షణ కోసం రూపొందించిన ‘లక్ష్య-1’ను నేలపై నుంచి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని రూపొందించింది.

రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కురియన్
రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.జె. కురియన్ ఆగస్టు 21న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న కె. రహ్మన్ ఖాన్ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియడంతో కురియన్ ఎన్నిక అనివార్యమైంది.

క్యాట్ చైర్మన్‌గా జస్టిస్ ఆలం
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా జస్టిస్ సయ్యద్ రఫత్ ఆలం ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.

పృథ్వి-2 పరీక్ష విజయవంతం 
పృథ్వి -2 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 25న విజయవంతంగా నిర్వహించారు. అణ్వస్త్ర సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల సంప్రదాయ అణ్వాస్త్రాలను మోసుకుపోగలదు. 9 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం గల ఈ క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పటికే సైన్యంలో ప్రవేశపెట్టారు.

కోస్టల్ రాడార్ల క్లస్టర్లు ప్రారంభం
కోస్తా తీరంలో నిఘాను పెంచేందుకు ఉద్దేశించిన కోస్టల్ రాడార్లకు చెందిన మహారాష్ట్ర క్లస్టర్‌ను రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని ముంబైలో ఆగస్టు 25న ప్రారంభించారు. ఈ రాడార్లలో 10 నాటికల్ మైళ్ల దూరం వరకు పరిశీలించగల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో నైట్ విజన్, ఆటోమేటిక్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్, థెర్మల్ సెన్సార్లు ఉంటాయి. కోస్టల్ రాడార్ల ఏర్పాటు ప్రాజెక్ట్ కింద మొదటి దశలో రూ.600 కోట్ల ఖర్చుతో కోస్తా తీరంలో 46 స్టాటిక్ సోన్సార్లు ఏర్పాటు చేస్తారు.

కొత్త ఈసీ నసీమ్ జైదీ
ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ ఆగస్టు 7న నియమితులయ్యారు. ఇదివరకు ఈసీగా పనిచేసిన వీఎస్ సంపత్ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పదోన్నతి పొందడంతో జైదీని కొత్త ఈసీగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. జైదీ 2017 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జైదీ యూపీ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జూలై 31న పౌర విమానయాన శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జైదీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల మండలిలో భారత్ ప్రతినిధిగా 2005- 2008 వరకూ వ్యవహరించారు. భారత విమానాశ్రయాల సంస్థ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో మరో ఈసీగా హెచ్‌ఎస్ బ్రహ్మ ఉన్నారు.

విజయవంతమైన అగ్ని-2 క్షిపణి పరీక్ష
మధ్యంతర శ్రేణి క్షిపణి-2ను భారతసైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు9న ఈ పరీక్ష నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించిన ఈ క్షిపణి 2000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 17 టన్నుల బరువుగల ఈ క్షిపణి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటి కే సైన్యంలో చేరిన ఈక్షిపణి సైన్యానికి శిక్ష ణనిచ్చే కార్యక్ర మంలో భాగంగా ప్రస్తుత పరీక్షను నిర్వహించారు.

అరుణగ్రహంపై దిగిన క్యూరియాసిటీ
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ శోధక నౌక ఆగస్టు 6 ఉదయం 11.01 నిమిషాలకు దిగ్విజయంగా అరుణగ్రహంపై కాలు మోపింది. ఎనిమిదిన్నర నెలల్లో సుమారు 56.7 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్యూరియాసిటీ ఏడు నిమిషాల ఉత్కంఠభరిత ‘ఎంట్రీ డిసెంట్ అండ్ ల్యాండింగ్’ ప్రక్రియను ముగించి సురక్షితంగా అంగారకుడిపైకి చేరింది. అంగారకుడిపైకి చేరిన సమాచారంతోపాటు నిమిషాల వ్యవధిలో అక్కడి ఫొటోలను పంపడం మొదలుపెట్టింది. జీవం తాలూకూ ఆనవాళ్లు ఉండే అవకాశాలపై అంచనా వేయడానికి పంపించిన క్యూరియాసిటీ మనిషి ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శోధక నౌకల్లో అతిపెద్దది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. క్యూరియాసిటీలోని ప్లూటోనియం బ్యాటరీ కనీసం పదేళ్లపాటు నిరాఘాటంగా పనిచేయగలదు. నాసా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 250 కోట్ల డాలర్లు (రూ.పదివేల కోట్లపైనే) ఖర్చుపెట్టింది. దాదాపు టన్ను బరువు ఉన్న క్యూరియాసిటీ గాలే క్రేటర్ (దాదాపు 154 కిలోమీటర్ల వ్యాసార్ధమున్న లోయ)లో దిగింది.

రెండోసారి ఉపరాష్ట్రపతిగా అన్సారీ
రెండోసారి ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 7న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీ 252 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన అన్సారీ ఎన్‌డిఏ అభ్యర్థి జశ్వంత్ సింగ్‌పై విజయం సాధించారు. మొత్తం 790 మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల్లో మూడు ఖాళీలుపోగా 787 మందికి గానూ 736 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 8 చెల్లలేదు. 47 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. చెల్లిన 728 ఓట్లలో అన్సారీకి 490, జస్వంత్ సింగ్‌కు 238 ఓట్లు వచ్చాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 నుంచి 1962 వరకు) తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి రెండుసార్లు ఎన్నికైన అభ్యర్థి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ 1961 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఆఫ్గనిస్తాన్, యూఏఈ దేశాల్లో ప్రధాన దౌత్య అధికారిగా పనిచేశారు. 1993-95 కాలంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. 2007 ఆగస్టు 11 నుంచి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.

రాష్ట్రంలో క్రీడలకు 2శాతం రిజర్వేషన్లు
ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 29 క్రీడాంశాల్లో రిజర్వేషన్లు వర్తింప చేస్తారు. క్రీడా పోటీ, స్థాయి గెలుపొందిన పతకాల ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తారు.

ఐఐసీటీ శాస్త్రవేత్తకు-యంగ్ సైంటిస్ట్ అవార్డు
సీఎస్‌ఐఆర్-ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాశ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏఎస్‌ఐ-యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు (2012) లభించింది. రసాయన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 35 ఏళ్లలోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఎన్‌ఏఎస్‌ఐ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియా) ఏటా ఈఅవార్డును ప్రకటిస్తుంది. ఐఐసీటీ రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సూర్య ప్రకాశ్ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్‌కు అవసరమైన పరికరాల తయా రీ, పలుచనైన ఆర్గానిక్ సోలార్ సెల్స్ రూపకల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి.

గొల్లభామ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి
మెదక్ జిల్లా సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు నేసిన గొల్లభామల చీరకు జియోగ్రాఫీ ఇండికేషన్ అప్లికేషన్(జీఐఏ) గుర్తింపు లభించింది. ఈ జీఐఏ జాబితా వరుస సంఖ్య 188గా నిలవడంతో ఈ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1940లో సిద్దిపేటకు చెందిన రచ్చ రాందాస్, కాంటసాయిలు కలిసి మొదట ఈ చీరను తయారు చేశారు.

పర్యాటక రంగంలో రెండోస్థానంలో రాష్ట్రం
స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో 2011లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2011లో 15.31 కోట్ల మంది రాష్ట్రాన్ని సందర్శించారు. కాగా 2011లో ఉత్తరప్రదేశ్‌ను 15.54 కోట్ల మంది సందర్శించడంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో నిలిచాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర(24.7 శాతం), రెండో స్థానంలో తమిళనాడు(17.3 శాతం), మూడోస్థానంలో న్యూఢిల్లీ(11.1శాతం) నిలిచాయి. 2011లో మొత్తం 1.94 కోట్ల మంది విదేశీయులు భారత్‌ను సందర్శించారు.



రాజస్థాన్‌లో అమల్లోకి విచారణ హక్కు చట్టం
విచారణ హక్కు చట్టాన్ని దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రం ఆగస్టు 1 నుంచి అమలులోకి తెచ్చింది. పాలనాపరమైన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ఈ చట్టం సాయపడుతుంది. పాలనాపరమైన అంశాలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించని ఉద్యోగులకు ఈ చట్టం కింద రూ.500 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తా మని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు.

పదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్పు 
స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే రిజర్వేషన్లు ఇకపై పదేళ్ల కొకసారి రొటేషన్‌పై మారనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన పదేళ్ల విధానానికి ఆగస్టు 1న రాష్ట్ర మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవలసి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై రాష్ట్రప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిధిలో కనీసం ఐదు శాతం జ నాభా ఉంటేనే ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఎంపీ. ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీల సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కూడా మంత్రుల బృందం సానుకూలత చూపించింది.

హైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి
హైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ప్రతిపాదనకు రాజకీయ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. ఇందుకు రాజ్యాంగంలోని 371 ప్రకరణకు సవరణ చేయవలసి ఉంది. వెనుకబడిన ఉత్తర కర్ణాటకలోని ఆరు జిల్లాలను(గుల్బర్గా,యాదగిరి, రాయచూర్, బీదర్, కొప్పళ, బళ్లారి)హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంగా పేర్కొంటారు. ప్రత్యేక ప్రతిపత్తి హోదా వలన ఈ ప్రాంతానికి ప్రాంతీయ మండలి లేదా బోర్డు ఏర్పాటు చేస్తారు. ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తారు. అభివృద్ధికి అత్యధిక గ్రాంట్లు విడుదలవుతాయి.

జీటీఏ సభ్యుల ప్రమాణ స్వీకారం
గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)లోని 45 మంది సభ్యులతోపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిమల్ గురుంగ్ ఆగస్టు4న ప్రమాణ స్వీకారం చేశారు. గూర్ఖాలాండ్ కొండ ప్రాంత అభివృద్ధికి జీటీఏ కృషి చేస్తోంది. కొంత కాలంగా ప్రత్యేక రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. 2011 జూలై 18న కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం జీటీఏ ఏర్పాటైంది. కేంద్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజెఎం) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జూలై 29 జీటీఏకు జరిగిన ఎన్నికల్లో పోటీ లేకుండా 45 స్థానాలను జీజేఎం గెలుచుకుంది.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2012 జాతీయం
బుద్ధిస్ట్ యూనివర్సిటీకి శంకుస్థాపన
మధ్యప్రదేశ్‌లోని సాంచీలో ‘సాంచీ యూనివర్సిటీ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ ఇండిక్ స్టడీస్’కు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే సెప్టెంబర్ 21న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాన మంత్రి జిగ్మే వై. థిన్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

గగనతల నియంత్రణ హెచ్చరిక వ్యవస్థ
గగనతల నియంత్రణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (ఏఈడబ్ల్యూ అండ్ సీ) ను భారత వైమానిక దళ అధిపతి ఎన్.ఎ.కె. బ్రౌనే సెప్టెంబర్ 20న లాంఛనంగా ఆవిష్కరించారు. బ్రెజిల్ తయారు చేసిన విమానానికి ఏఈడబ్ల్యూ అండ్ సీ వ్యవస్థను అనుసంధానం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ 2014 నాటికి వినియోగంలోకి వస్తుంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ అత్యంత ఆధునికమైంది. దీంతో సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నిఘా వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరింది

నూతన ఐటీ విధానం
నూతన ‘జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానం-2012’కు కేంద్రం సెప్టెంబర్ 20న ఆమోదం తెలిపింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ద్వారా దేశ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను అధిగమించాలని ఈ విధానంలో నిర్ణయించారు. ఐసీటీ శక్తిని వినియోగించడం ద్వారా జీవన ప్రమాణాలను మార్చాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం 2020 నాటికి కోటి మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. 100 బిలియన్ డాలర్లు ఉన్న ఐటీ మార్కెట్‌ను 300 బిలియన్ డాలర్ల మేర అభివృద్ధి చేయడానికి ఈ విధానం తోడ్పడుతుంది. ప్రస్తుతం 69 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతులు 2020 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. నూతన విధానం ప్రకారం ప్రతి కుటుంబంలో ఒకరిని ఇ-అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతుంది. 

మద్దతు ఉపసంహరించిన తృణమూల్
కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. డీజిల్ ధరల పెంపు, సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడం, రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి వంటి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మద్దతు ఉపసంహరించుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సెప్టెంబర్ 18న ప్రకటించింది. అంతేకాకుండా ఆ పార్టీకి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రు లు సెప్టెంబర్ 21న తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 19. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో యూపీఏ కూటమి బలం 270 నుంచి 251కి తగ్గింది. 

పాలస్తీనా అధ్యక్షుడి భారత్ పర్యటన
పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా అబ్బాస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సెప్టెంబర్ 11న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర దేశం హోదాకు పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా భారత్ 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కూడా పాలస్తీనాకు ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోసహా మరోరెండు అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిశీలక హోదా నుంచి ఉన్నత స్థానాన్ని పాలస్తీనా కోరుకుంటుంది. 

ఏపీ నూతన భూకేటాయింపు విధానం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త భూ కేటాయింపు విధానాన్ని అమల్లోకి తెస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, విద్య, మత ఛారిటబుల్, స్వచ్ఛంద, ఇతర ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపునకు సంబంధించి కొత్త విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజా ప్రయోజనాలకు మాత్రమే భూములు కేటాయిస్తారు. వనరుల సేకరణ కోసం భూ అమ్మకాలపై నిషేధం విధించారు. మెట్ట, బీడు భూములను మాత్రమే పారిశ్రామిక అవసరాల కోసం కేటాయిస్తారు. చిన్న పట్టణాలు, మండల ప్రధాన కేంద్రాలకు 2 కి.మీ పరిధిలో భూ కేటాయింపులు ఉండవు. పరిశ్రమలకు అనుమతి నివ్వరు. కేటాయింపులో పర్యావరణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి భూపరిపాలన శాఖ ఛీఫ్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో 8 మంది సభ్యులుంటారు. ఈ అథారిటీ ఆన్‌లైన్ ల్యాండ్ బ్యాంక్‌ను నిర్వహిస్తుంది. ప్రభుత్వ భూములకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగి ఉంటుంది. 

పీఎస్‌ఎల్‌వీ -సి 21 విజయవంతం 
పోలార్ శాటిలైట్ లాంచ్ వెిహ కల్(పీఎస్‌ఎల్‌వీ)-సి 21 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 9న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో 100 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇందులో 62 ఉప గ్రహాలు, 37 రాకెట్లు, ఒక స్పేస్ క్యాప్సూల్ ఉన్నాయి. పీఎస్‌ఎల్‌వీ- సి 21 ద్వారా మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఈ మూడింటిలో ఫ్రాన్స్‌కు చెందిన ‘స్పాట్-6’, జపాన్‌కు చెందిన ‘ప్రొయిటెరస్’, భారత్‌కు చెందిన ‘మినీ రెడిస్’ ఉన్నాయి. భూమికి 655 కిలోమీటర్ల ఎత్తులో 98.23 డిగ్రీల వాలుతో సూర్యానువర్తన ధ్రువ కక్ష్య(సన్ సిక్రోనస్ ఆర్బిట్)లో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. స్పాట్-6 కోసం ఫ్రాన్స్‌రూ.100 కోట్లు చెల్లిస్తుంది. ఈ ప్రయోగాన్ని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు.

స్పాట్-6: ఫ్రాన్స్‌కు చెందిన ఆస్ట్రియం కంపెనీ రూపొందించింది. 715 కిలోల బరువుగల స్పాట్-6 భూ పరిశీలన కోసం చిత్రాలను తీస్తుంది. ఏడేళ్ల పాటు పనిచేస్తుంది.

ప్రొయిటెరస్: 15 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని జపాన్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు రూపొందించారు. జపాన్‌లోని కాన్యాయి జిల్లా చిత్రాలను తీసి పంపుతుంది. విద్యుత్ థ్రస్టర్లు వినియోగంపై అధ్యయనానికి ఉపయోగపడుతుంది.

మినీ రెడిస్: నావిగేషన్ విధానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు 50 కిలోల ఈ పేలోడ్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది.

ప్రాదేశిక సైన్యంలో సచిన్ పైలట్
కేంద్ర కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ (35) ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో సెప్టెంబర్ 6న అధికారిగా చేరారు. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ అధికారిగా చేరిన తొలి కేంద్ర మంత్రిగా సచిన్ రికార్డు సృష్టించారు. సిక్ రెజిమెంట్ కు చెందిన 124 టి.ఎ బెటాలియన్‌లో అధికారిగా చేరారు. ఇందుకోసం ఆయన ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డు, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మెడికల్ పరీక్షలను కూడా పూర్తి చేసుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో ఆయన శిక్షణ పూర్తి చేయాల్సి ఉంది. రాజస్థాన్‌లోని దేసా నియోజకవర్గం నుంచి సచిన్ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెటర్లు క పిల్‌దేవ్, ఎం.ఎస్. ధోని, నటుడు మోహన్‌లాల్ ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్స్‌గా చేరారు.

భారత్ చేరిన డ్రీమ్ లైనర్ 
అత్యంత ఆధునిక ప్రయాణికుల రవాణా విమానం ‘బోయింగ్ 787 డ్రీమ్ లైనర్’ సెప్టెంబర్ 8న భారత్ చేరింది. అమెరికాలోని దక్షిణ కరోలినాలోని బోయింగ్ ఫ్యాక్టరీ నుంచి 15 గంటల్లో న్యూఢిల్లీ చేరింది. 2008 నాటికి అందేలా మొత్తం 27 డ్రీమ్ లైనర్ల కొనుగోలుకు బోయింగ్‌తో ఎయిర్ ఇండియా ఒప్పందం చేసుకోగా తొలి విమానం సెప్టెంబర్ 8న చేరింది. ఎలాంటి విరామం లేకుండా 16,000 కి.మీ. ప్రయాణించడం డ్రీమ్ లైనర్ ప్రత్యేకత. 210 నుంచి 290 మంది వరకు ప్రయాణించొచ్చు. విమాన తయారీలో అల్యూమినియం బదులు కర్బన మిశ్రమ లోహాన్ని వినియోగించడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇంధన సామర్థ్యం 20 శాతం పెరుగుతుంది.

భారత్-పాక్ వీసా నిబంధనల ఒప్పందం 
కొత్త వీసా నిబంధనలకు సంబంధించి భారత్, పాకిస్థాన్‌లు సెప్టెంబర్ 8న సంతకాలు చేసాయి. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.ఎం. కృష్ణ, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్‌లు వీసా ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో వీసా జారీ చేయడం, పర్యాటకులకు, యాత్రికులకు గ్రూప్ వీసాలు, వ్యాపారవేత్తలకు ప్రత్యేక వీసాల జారీ, వృద్ధులకు చెక్‌పోస్టుల వద్ద సత్వరం వీసా మంజూరు చేయడం ప్రధానాంశాలు. సాంస్కృతిక మార్పిడుల ఒప్పందంపైనా ఇరు దేశాలు సంతకాలు చేసాయి. పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖర్‌తో ఉగ్రవాదం, జమ్ము కాశ్మీర్, సియాచిన్ వంటి ద్వైపాక్షిక అంశాలపై కూడా కృష్ణ చర్చలు జరిపారు.

వర్గీస్ కురియన్ మృతి 
క్షీర విప్లవ పితామహుడు, పాల ఉత్పత్తిలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన పద్మవిభూషణ్ వర్గీస్ కురియన్(90) గుజరాత్‌లోని నాడియాద్‌లో సెప్టెంబర్ 9న మరణించారు. 1921లో కేరళలో జన్మించిన కురియన్ 1949లో గుజరాత్ చేరుకున్నారు. ఆనంద్ డైరీలో పనిచేస్తూ పాడి రంగంలో స్థానిక రైతుల సమస్యలను పరిష్కరించారు. పాడి పరిశ్రమ విభాగంలో తొలిసారి సహకార వ్యవస్థలకు ఆవిష్కరణ చేశారు. అంతేకాక తొలిసారి గేదె పాలతో పాల పొడిని తయారు చేసిన ఘనత సాధించారు. అప్పటి వరకు ఆవు పాలతో పాల పొడి తయారు చేసేవారు. అమూల్ డైరీని అభివృద్ధి చేశారు. రూ. 13,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో అమూల్ ఆసియాలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. పాడి పరిశ్రమ విభాగంలో ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగానే 1960లో రెండు కోట్ల మెట్రిక్ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2011 నాటికి 12.2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ ంలో పాల ఉత్పత్తిలో 17 శాతం భారత్‌లో జరుగుతుంది. నాటి ప్రధాని నెహ్రూ జాతీయ పాడి అభివృద్ధి మండలిని స్థాపించి కురియన్‌ను చెర్మన్‌గా నియమించారు. 1965లో పద్మశ్రీ, 1966 పద్మ భూషణ్, 1999లో పద్మ విభూషణ్ వంటి అత్యున్నత అవార్డులతోపాటు ఆసియా నోబెల్‌గా పిలిచే రామన్ మెగసెసె పురస్కారాన్ని కూడా కురియన్ అందుకున్నారు.

అణు శాస్త్రవేత్త రోహిణీ ప్రసాద్ మృతి
రచయిత, అణు శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణి ప్రసాద్ (63) సెప్టెంబర్ 8న ముంబైలో మరణించారు. ఈయన ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్)లో అణు శాస్త్రవేత్తగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో పని చేశారు. విశ్వాంతరాళం, జీవ విజ్ఞానం- సమాజం, మానవ పరిణామం, అణువులు దేవుడు చేసిన మనుషులు వంటి అత్యంత ఆదరణ పొందిన సైన్స్ పుస్తకాలు రాసారు. ఈయన ప్రముఖ రచయిత కొడవగంటి కుటుంబరావు కుమారుడు.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతమే
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 4న పేర్కొంది. ఈ రిజర్వేషన్లు 60.5 శాతం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. 50 శాతానికి పరిమితమై ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వ జీవో ప్రకారం బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లున్నాయి. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది.



తీర గస్తీ నౌక రాజ్ కిరణ్ ప్రారంభం
భారత తీర భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన తీర గస్తీ నౌక ‘రాజ్‌కిరణ్’ను ఆగస్టు 29న విశాఖపట్నం కోస్ట్ గార్డ్ జెట్టీ నౌక దళానికి అప్పగించారు. అత్యాధునిక కమ్యూనికేషన్, నావిగేషనల్ వ్యవస్థలు ఈ నౌకలో ఉన్నాయి. 35 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. నిఘా, ఆపద నుంచి కాపాడటం, రక్షణ, వైద్యం వంటి పలు రకాలైన విధులను ఇది నిర్వహిస్తుంది. హాల్దియా కేంద్రంగా ఇది పనిచేస్తుంది.

నౌకా దళాధిపతిగా డి.కె. జోషి
నౌకా దళాధిపతిగా అడ్మిరల్ దేవేందర్ కుమార్ జోషి ఆగస్టు 31న బాధ్యతలు స్వీకరించారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ స్పెషలిస్టుగా జోషి గుర్తింపు పొందారు. పదవీ విరమణ చేసిన నిర్మల్ వర్మ స్థానంలో జోషి నియమితులయ్యారు.

రాష్ట్రానికి అక్షరాస్యత మిషన్ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీకి మూడు జాతీయ అవార్డులు లభించాయి. అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధిలో ఈ పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు సాక్షర్ భారత్ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జిల్లాస్థాయిలో విజయనగరం, పంచాయతీ కేటగిరీలో అనంతపురం జిల్లాలోని పి. యేలేరు గ్రామం అవార్డులు పొందాయి. అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధిలో కృషి చేస్తున్న సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ ఏర్పాటు చేసింది.

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా బ్రౌనే
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీఓఎన్‌సీ) చైర్మన్‌గా వైమానిక దళాధిపతి మార్షల్ ఎన్.ఎ.కె. బ్రౌనే సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. మూడు దళాల అధిపతుల్లో అత్యంత సీనియర్ అయిన బ్రౌనే అడ్మిరల్ నిర్మల్ వర్మ స్థానంలో నియమితులయ్యారు. మూడు దళాలకు సంబంధించిన విధాన పరమైన నిర్ణయాల్లో సీఓఎన్‌సీ సమన్వయాన్ని చేకూరుస్తుంది.

లైంగిక వేధింపుల నియంత్రణ బిల్లు
పార్లమెంటులో రెండు కీలకమైన బిల్లులు సెప్టెంబర్ 3న ఆమోదం పొందాయి. పని ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే బిల్లు, జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థను విస్తరించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు కూడా ఆమోదం పొందాయి. పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల (నియంత్రణ, నిషేధ, పరిష్కార) బిల్లు-2010ను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ తీర్‌‌థ ప్రవేశపెట్టగా, ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం ఇళ్లలో పనిచేసే పనిమనుషులతోసహా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి రూ.50వేల వరకు జరిమానా పడుతుంది.

బాలకార్మిక నిరోధ చట్టానికి సవరణ 
దేశంలో ఇప్పటివరకూ 14 ఏళ్లలోపు చిన్నారులను ప్రమాదకర పనుల్లో పెట్టుకోవడంపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా ప్రమాదరహిత పనుల్లో పెట్టుకోవడంపైనా నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆగస్ట్ 28న ఆమోదించింది. ఈ మేరకు బాలకార్మిక నిరోధక, నియంత్రణ చట్టంలో సవరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. దీని ప్రకారం 14 ఏళ్లలోపు చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం.

ఇందుకు గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు లేదా నిర్దేశించిన విధంగా జరిమానా పడుతుంది. మరోవైపు 18 ఏళ్లలోపు చిన్నారులను మైనింగ్ వంటి ప్రమాదకర పరిశ్రమల్లో బాలకార్మికులుగా పెట్టుకోవడంపైనా పూర్తిస్థాయి నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు కూడా సర్కారు ఆమోదముద్ర వేసింది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1.26 కోట్ల మంది బాలకార్మికులున్నారు. 2009 ఆగస్టు 4న ఆమోదం పొందిన విద్యాహక్కు చట్ట ప్రకారం 6-14 వయసు వారికి ఉచిత నిర్భంద విద్యనందించాలి.

టైమ్ మ్యాగజీన్‌పై అమీర్ ఖాన్
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ‘సత్యమేవ జయతే’ టీవీ కార్యక్రమంతో కొత్త ఒరవడి సృష్టించిన బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ‘టైమ్’ మ్యాగజీన్ ముఖచిత్ర కథనానికి ఎంపికయ్యారు. ఆసియా నుంచి వెలువడే టైమ్ మేగజీన్ ఎడిషన్‌లో ఆమిర్ కనిపించనున్నారు.

‘ఖాన్ అన్వేషణ’ పేరుతో ఈ సంచిక వచ్చే వారం మార్కెట్‌లోకి విడుదలవుతుంది. ఆగస్టు 15న ప్రసారమైన కార్యక్రమంలో దేశంలో పెరుగుతున్న భ్రూణ హత్యలు, లైంగి క వేధింపులు, గృహహింస అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాలీవుడ్ తారల్లో పర్వీన్ బాబీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లు గతంలో టైమ్ ముఖచిత్రాన్ని అలంకరించారు.

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2012 జాతీయం
కేంద్రమంత్రి వర్గ విస్తరణ
కేంద్ర మంత్రివర్గాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అక్టోబర్ 28న విస్తరించారు. ఇందులో రాష్ర్టం నుంచి కొత్తగా ఐదుగురికి.. చిరంజీవి (పర్యాటకశాఖ), కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (రైల్వే), సర్వే సత్యనారాయణ (రోడ్డు రవాణా, హైవేలు), బలరామ్ నాయక్ (సామాజిక న్యాయం), కిల్లి కృపారాణి (టెలికాం, ఐటీ) చోటు దక్కింది. దీంతో కేబినెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిథ్యం 10కి చేరింది (గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్‌ను లెక్కిస్తే మొత్తం మంత్రుల సంఖ్య 11 అవుతుంది. దీంతో కేంద్రంలో అత్యధిక మంత్రులు గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది). నూతన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్ ఖుర్షీద్ నియమితులయ్యారు. పవన్ కుమార్ బన్సాల్‌ను రైల్వే శాఖకు మార్చారు. 17 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు రైల్వే శాఖ దక్కింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏడుగురు మంత్రులు రాజీనామాలు చేశారు. కాగా 22 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 78కి చేరింది. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య 81 వరకు ఉండొచ్చు.

ల‌క్ష కోట్లతో జేఎన్ఎన్ యూఆర్ఎం-2
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప‌ట్టణ న‌వీక‌ర‌ణ (జేఎన్ఎన్ యూఆర్ఎం) రెండో విడత ప‌థ‌కానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. ల‌క్షకోట్లతో 2013 జ‌న‌వ‌రి నుంచి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు.

స‌న్ టీవి నెట్‌వ‌ర్క్ కు హైద‌రాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీ
హైద‌రాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీని త‌మిళ‌నాడుకి చెందిన స‌న్‌టీవి నెట్ వ‌ర్క్ సొంతం చేసుకుంది. డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ ర‌ద్దవ‌డంతో కొత్త ఫ్రాంచైజీ కోసం బీసీసీఐ బిడ్ ల‌ని ఆహ్వానించింది. స‌న్‌టీవితో పాటు, పీవీపీ వెంచ‌ర్స్ బిడ్ లు దాఖ‌లు చేసాయి. అత్యధికంగా ఆయిదేళ్ల ఒప్పందానికి ఏడాదికి రూ. 85.05 కోట్లతో బిడ్ కోట్ చేసిన‌ స‌న్‌టీవీ నెట్ వ‌ర్క్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. 

అణు సహకారంపై అంగీకారం
అణు సహకారంపై చర్యలు ప్రారంభించేందుకు ఆస్ట్రేలియా- భారత్ అంగీకరించాయి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి జూలియా గిలార్డ్ భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 17న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. భద్రత, రక్షణ, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాల్లో సహకారం విస్తరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా ప్రకటించారు. విద్యార్థుల పర్యటన, సంక్షేమం, నైపుణ్యం, అభివృద్ధి, జౌళి, అంతరిక్ష రంగాల్లో సహకారానికి సంబంధించి నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ప్రతి సంవత్సరం ఉన్నతస్థాయి చర్చలు జరిపేందుకు కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక పౌర అణు సహకారానికి రెండు దేశాలు సుముఖంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్ తెలిపారు. గిలార్డ్ భారత రాష్ట్రపతితో కూడా సమావేశమై ద్వైపాక్షిక ప్రాముఖ్యత గల అంశాలపై చర్చలు జరిపారు.

సంపన్న నగరాల్లో ముంబై, ఢిల్లీ
ప్రపంచంలో సంపన్న నగరాలుగా అభివృద్ధి చెందుతున్న 95 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీలకు చోటుదక్కింది. ముంబై 52వ స్థానంలో, ఢిల్లీ 58వ స్థానంలో నిలిచినట్లు ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ సిటీస్’ పేరుతో ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ హాబిటాట్’ అక్టోబర్ 17న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూయార్క్, టొరంటో, లండన్, స్టాక్‌హోమ్ ఉన్నాయి. కాగా, ఐటీ విప్లవం సాధించిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని యూఎన్ హాబిటాట్ ప్రత్యేకంగా అభినందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ దేశ ఫార్మసీ రాజధానిగా మారిందంటూ కితాబిచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాలు సంపన్నతతో కూడిన అభివృద్ధి సాధించాలంటే తమ ప్రాధాన్యతలను మార్చుకోవాలని పేర్కొంది.

ఆధార్ ఆధారిత సేవలు ప్రారంభం
ఆధార్ కార్డు అనుసంధానిత సేవలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలు అక్టోబర్ 20న రాజస్థాన్‌లోని దూదూలో ప్రారంభించారు. ఆధార్ కార్డులు ప్రవేశపెట్టి.. రెండేళ్లు అయిన సందర్భంగా ఈ సేవలు ప్రారంభించి, 21వ కోటి ఆధార్ కార్డును కూడా ఈ సందర్భంగా అందజేశారు. 

ముగిసిన జీవ వైవిధ్య సదస్సు
జీవ వైవిద్య పరిరక్షణ కోసం నిధుల సమీకరణపై కార్యాచరణ ప్రణాళికను అంగీకరిస్తూ ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య సదస్సు అక్టోబర్ 19న హైదరాబాద్‌లో ముగిసింది. జంతు, పక్షి జాతుల పరిరక్షణకు 2015 నాటికి రెండింతలు నిధులు అందించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. దాంతో జీవ వైవిధ్య పరిరక్షణకు 12 బిలియన్ డాలర్లు నిధులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకు ఇవి 6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత్ తన వంతుగా 50 మిలియన్ డాలర్లు సమకూరుస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అక్టోబర్ 16న ప్రకటించారు. ఈ సందర్భంగా నగోయా(జపాన్) సదస్సులో నిర్ణయించిన 20 లక్ష్యాలను సాధించడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. జీవ వైవిధ్య సదస్సులను 2020 వరకు ప్రతి రెండేళ్ల కొకసారి నిర్వహించాలని నిర్ణయించారు. వాతావరణ మార్పులు -జీవవైవిధ్యం, నీటి వనరుల పరిరక్షణ, ద్వీపాలు,, సముద్ర తీరప్రాంత వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ, లింగ వివక్షత, స్థానికుల భాగస్వామ్యం, పేదరిక నిర్మూలన, అభివృద్ధి త దితర అంశాలను సదస్సు ఆమోదించింది. తర్వాత 2014లో జీవవైవిధ్య సదస్సును రిపబ్లిక్ ఆఫ్ కొరియా నిర్వహిస్తుంది.

పార్లమెంట్ మహిళా స్పీకర్ల సమావేశం 
పార్లమెంట్ మహిళా స్పీకర్ల ఏడో సమావేశం న్యూఢిల్లీలో అక్టోబర్ 4న ముగిసింది. పార్లమెంట్, ఇతర నామినేటెడ్ సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు ప్రోత్సహించాలని సదస్సు పిలుపునిచ్చింది. రెండు రోజులు జరిగిన సమావేశంలో పలు దేశాల మహిళా స్పీకర్లు పాల్గొన్నారు. ప్రపంచంలోని 190 పార్లమెంటుల్లో 37 మంది మాత్రమే మహిళా స్పీకర్లున్నారు. ఈ సమావేశాన్ని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, ఇండియన్ పార్లమెంట్ నిర్వహించాయి.

వాణిజ్య సహకార ఒప్పందం
ఉమ్మడి ప్రయోజనాలకు ఉద్దేశించిన ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్, వాషింగ్టన్ రాష్ట్రాలు సంతకాలు చేశాయి. వాషింగ్టన్ గవర్నర్ క్రిష్టినే గ్రెగోరీ నాయకత్వంలో హైదరాబాద్‌లో పర్యటించిన ట్రేడ్ మిషన్ కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై అక్టోబర్ 3న హైదరాబాద్‌లో గవర్నర్ గ్రెగోరీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకాలు చేశారు. వాణిజ్య, సాంస్కృతిక రంగాలు ఐటీ, బీటీ, నైపుణ్య అభివృద్ధి, వ్యవసాయం, తోటల పెంపకం, క్లీన్ ఎనర్జీ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం రంగాల్లో రెండు రాష్ట్రాలు సహకరించుకుంటాయి.

సౌర ఇంధన విధానం 2012
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 సౌర ఇంధన విధానాన్ని సెప్టెంబర్ 26న ప్రకటించింది. ఈ విధానం ప్రకారం 2014 జూన్ నాటికి సౌర విద్యుత్ కేంద్రాలను ప్రారంభించిన వారందరికీ ఏడేళ్లపాటు ప్రోత్సాహకాలు అందుతాయి. వీలింగ్, ట్రాన్స్‌మిషన్ చార్జీలు ఉండవు.

ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 
ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు - 11వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) హైదరాబాద్‌లో అక్టోబర్ 1 న ప్రారంభమైంది. అక్టోబర్ 19వ తేదీ వరకు జరుగుతుంది. తొలిరోజు జీవ భద్రతపై కార్టేజెనా ఒప్పందం అమలుపై చర్చించారు. జీవ భద్రతపై 2003 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిన కార్టేజెనా ఒప్పందం, తదుపరి తీర్మానాలు, వాటి అమలు తదితర అంశాలపై అక్టోబర్ 1 నుంచి ఐదు రోజులపాటు చర్చలు జరుగుతాయి. జీవ భద్రతపై ఇది ఆరోసదస్సు. ఈ జీవవైవిధ్య సదస్సులో 193 దేశాల నుంచి 9000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. గతంలో ఈ సదస్సు 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగింది. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి 1992లో బ్రెజిల్‌లోని రియోడిజెనీరోలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ సదస్సులు జరుగుతున్నాయి.

స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్
విద్యుత్ పొదుపు, సమర్థవంత వినియోగం కోసం ‘స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్’ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన శాఖ సెప్టెంబర్ 26న ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు.

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2012 జాతీయం
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నవంబర్ 16న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ మండలిలో సభ్యత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ సమావేశంలో పాల్గొన్నారు. మనుషుల అక్రమ రవాణాను నివారించేందుకు ప్రత్యేక నోడల్ సంస్థను, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక చోట కోర్టును ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. వ్యాపారులు, పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఒకే విధంగా ఉండాలన్న ప్రతిపాదనను కూడా సమావేశం అంగీకరించింది. 

నీటి పరిరక్షణ దినంగా ఇందిర జయంతి
నీటి పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ 19ని నీటి పరిరక్షణ దినంగా కేంద్ర జలవనరుల శాఖ పాటించనుంది. ఇందిర జయంతిని ప్రభుత్వం ఇప్పటికే జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తోంది.

భారత్‌కు యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ తర్కాష్ 
రష్యాలోని కలినిన్‌గార్డ్‌లో నవంబర్ 9న జరిగిన కార్యక్రమంలో ఆ దేశం నిర్మించిన మల్టీరోల్ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ తర్కాష్’ను భారత్ అందుకుంది. ఆధునికీకరించిన క్రివాక్-3 (తల్వార్) తరగతికి చెందిన తర్కాష్ యుద్ధ నౌకలను 1.6 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసేందుకు 2006లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే క్రివాక్ భారత్‌కు అందింది. మొదటి నౌక ‘ఐఎన్‌ఎస్ టేగ్’ గత మార్చిలో భారత్ చేరింది. ‘ఐఎన్‌ఎస్ త్రిఖండ్’ను 2013లో రష్యా అందిస్తుంది. ఈ తరహా నౌకలో ఎనిమిది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు అమర్చి ఉంటాయి.

రాష్ట్ర కళాకారులకు సంత్ కబీర్ అవార్డులు
దేశంలో చేనేత, హస్తకళలకు ప్రతి ఏటా ఇచ్చే శిల్పగురు, సంత్ కబీర్ అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబర్ 9న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. మొత్తం 20 మందికి శిల్పగురు అవార్డులు, 18 మందికి సంత్ కబీర్ పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. మన రాష్ట్రానికి చెందిన 11 మందికి ఈ అవార్డులు లభించాయి. వీరిలో గజం భృగుమహారుషి, గజం యాదగరి, గుడు శ్రీను, ఆనందం నాగరాజు, గజం భద్రయ్య, పున్నా కృష్ణ, జెల్ల వెంకటేశం (నల్గొండ జిల్లా), అర్రోజు అశోక్ దంపతులు (కరీంనగర్ జిల్లా), కందగట్ల బాలామణి (హైదరాబాద్)లకు చేనేత విభాగంలో జాతీయ అవార్డులు దక్కాయి. సయ్యద్ ఒమర్ (హైదరాబాద్), గౌరా బత్తిని రమణయ్య (నెల్లూరు జిల్లా), గజం అంజయ్య, గజం రాము (నల్గొండ జిల్లా)లు సంత్ కబీర్ పురస్కారాలను స్వీకరించారు. ఈ అవార్డులను 1965లో ప్రవేశ పెట్టారు.

తొలి మల్టీ టాస్కింగ్ ఉమెన్ కమెండో యూనిట్
దేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన ప్రత్యేక పోలీసు దళం ‘వీరాంగన’ అసోంలో ఏర్పాటైంది. దేశంలోనే ఇది తొలి మల్టీ టాస్కింగ్ ఉమెన్ కమెండో యూనిట్. ఆ రాష్ట్ర పోలీసు విభాగంలోని వివిధ బెటాలియన్ల నుంచి ఎంపిక చేసిన 100 మంది మహిళా కానిస్టేబుల్స్‌తో ఈ యూనిట్ ఏర్పాటైంది. వీరికి తమిళనాడులో ప్రత్యేక శిక్షణనిచ్చారు. గువహటిలో స్త్రీలపై పెరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఈ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

ఇ-9 విద్యా మంత్రుల సమావేశం
న్యూఢిల్లీలో ఇ-9 దేశాల విద్యా మంత్రుల సమావేశం నవంబర్ 9,10 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో పాఠ్యాంశాల్లో సంస్కరణలు, పాఠశాలలను సమ్మిళితం చేయడంలో వ్యూహాలకు సంబంధించి నిబద్ధతకు ఆమో దం తెలిపారు. 2015 నాటికి అందరికీ విద్య అందించేందుకు జరుగుతున్న ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. అత్యం త జనాభా గల తొమ్మిది దేశాలు.. భారత్, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, మెక్సికో, నైజీరియా, పాకిస్థాన్‌లు ఇ-9లో సభ్య దేశాలు. ప్రపంచంలోని 60 శాతం జనాభా, 70 శాతం వయోజన నిరక్షరాస్యులు ఈ దేశాల్లోనే ఉన్నారు. ఇ-9 ఫోరంను 1993 లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ ఫోరం కార్యాలయ అధ్యక్ష బాధ్యతలను 2012-14 కాలానికి భారత్ చేపట్టింది.

అణు విద్యుత్ కేంద్రం భూసేకరణకు ఉత్తర్వులు 
శ్రీకాకుళంలో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నవంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 1,916.27 ఎకరాల భూమిని సేకరిస్తారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 6000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 2005లో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 

ఇండియన్ రికార్డ్స్‌లో ధర్మవరం పట్టుచీర
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ధర్మవరం పట్టు చీరకు స్థానం లభించింది. ఇందుకు సంబంధించి టాలెంట్ సెర్చ్ విభాగం ప్రతినిధి అక్టోబర్ 30 న ప్రకటన చేశారు. ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్ పెద్దయ్యగారి మోహన్ రూపొందించిన ‘శిల్పకళా వైభవం’ పట్టు చీరకు ఈ గుర్తింపు దక్కింది. చీర అంచు, కొంగును భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు గుర్తొచ్చేలా రూపొందించారు. 

రాష్ట్రంలో నీలం తుఫాను
రాష్ర్టంలో అక్టోబర్ 31 నుంచి నీలం తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురిసిన వానలకు మొత్తంగా 14 లక్షల ఎకరాల పంట నీటిలో మునిగింది. మొత్తం రాష్ట్రంలో నీలం తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. వరద ఉధృతికి పలు గ్రామాలు, పట్టణాలు నీటి దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు.

AIMS DARE TO SUCCESS 

డిసెంబరు 2012 జాతీయం
పుతిన్ పర్యటనలో రక్షణ ఒప్పందాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2012, డిసెంబర్ 24న భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రష్యా నుంచి ఎంఐ-17 బీ-5 రకానికి చెందిన 71 హెలికాప్టర్ల సరఫరా, ఎస్‌యు-30 ఎంకేఐ యుద్ధ విమానాల సాంకేతిక పరికరాల సరఫరాకు సంబంధించిన రక్షణ ఒప్పందాలు కూడా ఉన్నాయి. వీటి విలువ భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 20,000 కోట్లు. 

12వ పంచవర్ష ప్రణాళిక కు ఆమోద ముద్ర
దేశ అత్యున్నత విధాన నిర్ణయ మండలి ‘జాతీయ అభివద్ధి మండలి’(ఎన్‌డీసీ) 2012, డిసెంబర్ 27న 12వ పంచవర్ష (2012-17) ప్రణాళికకు ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రణాళికా కాలంలో 8.2 శాతం సగటు వద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుంది. 2004 నుంచి పేదరికం తగ్గుదల రేటు వేగం పుంజుకుందని, ఏడాదికి 2 శాతం చొప్పున పేదరికం తగ్గుతూ వస్తోందని సమావేశం అభిప్రాయపడింది. 

జలవనరుల విధానం 2012కు ఆమోదం
జాతీయ జలవనరుల విధానం 2012కు జాతీయ జలవనరుల మండలి ఆమోదించింది. నూతన జల విధానం ద్వారా జాతీయ చట్ట ప్రణాళికను రూపొందిస్తారు. జలవనరుల చార్జీలు నిర్ణయించేందుకు రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. భూగర్భ జలవనరులకు సంబంధించిన చట్టాలు, నీటి కేటాయింపులు, వనరుల ప్రెవేటీకరణకు సంబంధించిన చట్టాలను నూతన విధానానికి అనుగుణంగా రూపొందిస్తారు.

నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు
తిరుపతిలో 2012, డిసెంబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలు జరిగాయి. ఈ సభలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. డిసెంబర్ 29న ముగింపు కార్యక్రమంలో 2013ను తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్లకొక సారి ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించడం, గ్రామ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లో అధికార భాషగా తెలుగును అమలు చేయడం వంటి తీర్మానాలను ఆమోదించింది. తదుపరి (ఐదో) ప్రపంచ తెలుగు మహాసభలను అమెరికాలో నిర్వహించనున్నారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మహా సభలు జరిగాయి. మొదటి సారిగా 1975లో హైదరాబాద్‌లో జరిగాయి. రెండో సభలకు 1981లో మలేషియా రాజధాని కౌలాలంపూర్, మూడో మహా సభలకు 1990లో మారిషస్ ఆతిథ్యం ఇచ్చాయి.

ఎస్సీ, ఎస్టీ కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ (ఎస్సీ,ఎస్టీ)లకు రిజర్వేషన్లు కల్పించే 117వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ డిసెంబర్ 17న ఆమోదం తెలిపింది. మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో 194 మంది ఈ బిల్లుకు మద్దతు పలికారు. 10 మంది వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని 16(4)వ అధికరణానికి చేసే సవరణలతో.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల వెనుకబాటుతనానికి సంబంధించిన సమాచారంతో నిమిత్తం లేకుండా, వారి జనాభా ఆధారంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలవుతుంది.

అంతర్రాష్ట్ర మండలి పునర్వ్యవస్థీకరణ
కేంద్ర, రాష్ట్రాల మధ్య చక్కని సంబంధాలు కొనసాగేలా చూసేందుకు ఉద్దేశించిన అంతర్రాష్ట్ర మండలిని డిసెంబర్ 12న పునర్వ్యవస్థీకరించారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షత వహించే ఈ మండలిలో అన్ని రాష్ట్రాల, అసెంబ్లీలున్న కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. కొత్తగా రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్‌కు చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికవడం, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మండలిలో మార్పులు చేయాల్సి వచ్చింది.

ఫార్చూన్ 500 భారత కంపెనీల జాబితా
ఫార్చూన్ 500 భారత కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రసిద్ధ బిజినెస్ మ్యాగజైన్, ఫార్చూన్ రూపొందించిన ఈ జాబితాలో రూ.4,20,287 కోట్ల ఆదాయంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానం సాధించింది. మూడో స్థానంలో భారత్ పెట్రోలియం నిలిచింది. గత ఏడాది కూడా ఈ మూడు కంపెనీలే మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది జాబితాలో కొత్తగా 55 కంపెనీలు, మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలకు చోటు దక్కింది. 

ఇక లింగతటస్థ నేరంగా లైంగికదాడి
లైంగికదాడిని లింగతటస్థ నేరంగా పరిగణిస్తూ రూపొందించిన క్రిమినల్ లా సవరణ బిల్లుకు డిసెంబర్ 4న లోక్‌సభ ఆమోదం తెలిపింది. చట్టంలో ఉన్న ‘అత్యాచారం’ (రేప్) అనే పదాన్ని తొలగించి, దాని బదులు ‘లైంగికదాడి’ (సెక్సువల్ అసాల్ట్) అనే పదాన్ని చేర్చారు. బిల్లులో ‘లైంగికదాడి’ నిర్వచనాన్ని విస్తృతం చేశారు. దీనివల్ల లైంగికదాడులకు బాధితులైన పురుషులు సైతం, ఇలాంటి కేసుల్లో బాధితులైన మహిళలతో సమానంగా ఒకే చట్టం పరిధిలోకి వస్తారు. తాజా బిల్లు ప్రకారం, లైంగికదాడుల కేసుల్లో నేరానికి పాల్పడిన వారు పురుషులైనా, మహిళలైనా జీవితఖైదుకు గురవుతారు.

ఉత్తమ నివాసయోగ్య నగరం బెంగళూరు
భారత్‌లో అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా బెంగళూరు ఎంపికైంది. అంతర్జాతీయ మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ..మెర్సెర్స్ తాజా నగరాలపై చేపట్టిన సర్వేలో ఈ అంశం తేలింది. మెర్సెర్స్ విడుదల చేసిన జీవన నాణ్యత సూచీలో బెంగళూరు (ప్రపంచంలో 139వ స్థానం) తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూఢిల్లీ (143) ముంబై (146), చెన్నై (150), కోల్‌కతా (151) ఉన్నాయి. మౌలిక సౌకర్యాల పరంగా చూస్తే దేశంలో ముంబై అత్యుత్తమ నగరంగా నిలిచింది (ప్రపంచంలో 134వ ర్యాంకు). ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. వియాన్నా అగ్రస్థానంలో ఉండగా.. జ్యూరిచ్, అక్లాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

భారత్‌లో తగ్గిన హెచ్‌ఐవీ కేసులు
భారత్‌లో గత దశాబ్దంలో హెచ్‌ఐవీ కేసులు 57 శాతం తగ్గినట్లు ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఏసీఓ) నవంబర్ 30న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం వార్షికంగా నమోదయ్యే హెచ్‌ఐవీ కేసులు 2000లో 2.74 లక్షలు ఉండగా..ఇవి 2011 నాటికి 1.16 లక్షలకు తగ్గాయి. అత్యంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్‌లలో 31 శాతం మంది హెచ్‌ఐవీ రోగులు ఉన్నారు.

హైదరాబాద్ మెట్రోకుఅంతర్జాతీయ గుర్తింపు
ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోరైలుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ‘స్ట్రాటజిక్ టాప్-100 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు’ల్లో మెట్రో రైలుకు స్థానం దక్కింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు న్యూయార్క్‌లో జరిగే గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడర్‌షిప్ ఫోరంలో ఈ ప్రాజెక్టు నమూనాను ప్రదర్శించనున్నారు.ఇందులో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ (టెక్ సిటీ-గిఫ్ట్), ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులకు కూడా చోటు దక్కింది.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల బాలికల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌లో ఒక చైర్ పర్సన్, ఆరుగురు సభ్యులుంటారు. ఇందులో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలి. ఇటువంటి కమిషన్‌లు 2006లోనే ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయి.

మాజీ ప్రధాని గుజ్రాల్ మృతి
భారత మాజీ ప్రధాన మంత్రి ఇందర్‌కుమార్ గుజ్రాల్ (92) అనారోగ్యంతో నవంబర్ 30న గుర్గావ్‌లో తుది శ్వాస విడిచారు. గుజ్రాల్ 1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి వరకు భారత 12వ ప్రధానమంత్రిగా పని చేశారు. గుజ్రాల్ 1919 డిసెంబర్ 4న జీలం (పంజాబ్, ప్రస్తుత పాకిస్థాన్) లో జన్మించారు. దేశ విభజన తర్వాత ఢిల్లీకి వలస వచ్చారు. 1967-76 మధ్య ఇందిరా గాంధీ ప్రభుత్వంలో పార్లమెంటరీ, సమాచార, పట్టణాభివృద్ధి, ప్రణాళిక శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 1976-80 మధ్య సోవియెట్ రష్యాలో భారత రాయబారిగా వ్యవహరించారు. వి.పి.సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (1989-90)లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. దక్షిణాసియా దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పేందుకు ఆయన సిద్ధాంతీకరించిన ఐదు సూత్రాలను ‘గుజ్రాల్ సిద్ధాంతం’గా పరిగణిస్తారు. హెచ్.డి.దేవెగౌడ నేతృత్వంలోని యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం (1996-97)లో కూడా గుజ్రాల్ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

బోర్లాంగ్ అవార్డుల ప్రదానం
2012 నార్మన్ బోర్లాంగ్ అవార్డులను భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) శాస్త్రవేత్తలు కె.వి. ప్రభు, ఆశోక్ కుమార్ సింగ్‌లు న్యూఢిల్లీలో నవంబర్ 28న అందుకున్నారు. వీరిద్దరు బాస్మతి బియ్యంపై పరిశోధనలు నిర్వహించారు. ప్రభు బాస్మతి-6, బాస్మతి-1121 రకం వరి వంగడాల అభివృద్ధిలో పాల్పంచుకోగా.. అశోక్ ఏడు బాస్మతి వంగడాల సృష్టికి కృషి చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాంగ్ పేరిట కోరమాండల్ అంతర్జాతీయ సంస్థ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. 1972 నుంచి అందజేస్తున్న ఈ పురస్కారం కింద రూ. ఐదు లక్షల నగదు, బంగారు పతకం, ప్రశంసా పత్రం అందజేస్తారు.

ఎలక్షన్ కమిషన్ ప్రచారకర్తలుగా సైనా, మేరీ కామ్ 
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్), మేరీ కామ్ (బాక్సింగ్)లను భారత ఎలక్షన్ కమిషన్ ప్రచారకర్తలుగా నియమించుకుంది. ఈ నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ను పెంచేందుకు వీళ్లు దోహదం చేస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్. ధోనిలు ఎలక్షన్ కమిషన్ ‘జాతీయ ఐకాన్’లుగా ఉన్నారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు, ఓటింగ్ శాతం మెరుగుపర్చేందుకు దేశంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తుల సేవలను ఎన్నికల కమిషన్ వినియోగించుకుంటుంది.

‘రా’ చీఫ్‌గా అలోక్ జోషి 
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ జోషి నియమితులయ్యారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ(ఏసీసీ) జోషి నియామకాన్ని నవంబర్ 27న ఖరారు చేసింది. హర్యానా కేడర్ 1976 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన 59 ఏళ్ల జోషి డిసెంబర్ 30న ‘రా’ బాధ్యతలు స్వీకరించి, రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన ‘రా’ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఆమోదం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు చట్ట బద్ధత కల్పిస్తూ ప్రవేశ పెట్టిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 2న ఆమోదం తెలిపింది. దీంతో సబ్‌ప్లాన్‌కు చట్ట బద్ధత కల్పించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇందుకోసం శాసనసభ ప్రత్యేకంగా మూడు రోజులపాటు (నవంబర్ 30, డిసెంబర్ 1,2 తేదీల్లో) సమావేశమైంది. ఈ చట్టం 2013-14 బడ్జెట్ నుంచి అమల్లోకి వస్తుంది. ప్రణాళిక, కేటాయింపు, నిధుల వినియోగం అనే మూడు అంశాలు సబ్‌ప్లాన్ కిందకు వస్తాయి. జనాభా ప్రకారం బడ్జెట్‌లో ఎస్సీలకు 12.3 శాతం, ఎస్టీలకు 6.6 శాతం నిధులు కేటాయించాలి. ముఖ్యమంత్రి నేతృత్వంలోని స్టేట్ కౌన్సిల్ ఈ నిధులను విడుదల చేస్తుంది. ఈ కౌన్సిల్ సంవత్సరానికి రెండుసార్లు సమావేశమవుతుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని చాలా కాలంగా ప్రణాళికా సంఘం, జాతీయాభివృద్ధి మండలి రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నాయి. 

పంజాబీ చిత్రానికి గోల్డెన్ పీకాక్
గోవాలో జరిగిన 43వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నవంబర్ 30న ముగిసింది. మీరా నాయర్ చిత్రం ‘ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్’ను ముగింపు చిత్రంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అందజేసిన అవార్డుల వివరాలు.. ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్ అవార్డు): అన్హేగోర్హేద దాన్ (పంజాబీ చిత్రం, దర్శకుడు గోవింద్ సింగ్). ఉత్తమ దర్శకుడు (సిల్వర్ పీకాక్ అవార్డు): క్యూవాన్ జీయాన్ 
(ది వెయిట్ చిత్రం). ఉత్తమ నటుడు:మార్సిన్ డో రోసింక్సీ (రోజ్, పోలిష్-రష్యన్-జర్మన్ చిత్రం). ఉత్తమ నటి: అంజ లీ పాటిల్ (సింహళ-తమిళ చిత్రం, విత్ యు-విత్‌ఔట్).

ఎన్‌ఎస్‌ఈ కొత్త సీఈఓగా చిత్రా రామకృష్ణ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నూతన సీఈఓగా చిత్రా రామకృష్ణ నవంబర్ 26న నియమితులయ్యారు. ఏప్రిల్ 1, 2013 నుంచి బాధ్యతలు చేపట్టి ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె ఎన్‌ఎస్‌ఈ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ రవి నారాయణ్‌ను వైస్ చైర్మన్‌గా ఎన్‌ఎస్‌ఈ బోర్డు ఎన్నుకుంది.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment