AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 10 February 2018

జాతీయం 2017 సంవత్సరం మొత్తం జనవరి నుండి డిసెంబరు వరకు

2017 జాతీయం 

జనవరి 2017 జాతీయం
తెలుగులో భీమ్ యాప్ 
డిజిటల్ చెల్లింపుల కోసం కేంద్రం రూపొందించిన భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ-BHIM యాప్ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ -NPCI జనవరి 25న తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషల్లో యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ను డిసెంబర్ 30న ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల చేశారు.

గణతంత్ర మార్చ్‌లో తొలిసారి పాల్గొన్న ఎన్‌ఎస్‌జీ 

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారత 68వ గణతంత్ర దినోత్సవాలు జనవరి 26న ఘనంగా జరిగాయి. అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతుకు 149 మంది సభ్యులతో కూడిన యూఏఈ సైనికుల బృందం సారథ్యం వహించింది. 

2017 గణతంత్ర వేడుకల ప్రత్యేకతలుబ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే జాతీయ భద్రతా దళం-NSG గణతంత్ర కవాతులో తొలిసారి పాల్గొంది.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను తొలిసారి గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు.భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశం యూఏఈ. 2016లో ఫ్రాన్స్ దళాలు తొలిసారి వేడుకల్లో పాల్గొన్నాయి.



మంచు చరియలు విరిగిపడి 20మంది మృతి

జమ్మూ కశ్మీర్‌లో మంచు చరియలు విరిగిపడి 20 మంది మృతి చెందారు. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. జనవరి 23 నుంచి కురుస్తున్న హిమపాతం కారణంగా కశ్మీర్‌లో సాధారణ ప్రజలు, సైనికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు

కొత్త పాస్‌పోర్టులను ఇకపై పోస్టాఫీసుల ద్వారా జారీ చేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు పెలైట్ ప్రాజెక్టు కింద మైసూరులోని పోస్టాఫీసులను ఎంపిక చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్‌పోర్టు కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 50 వేల చొప్పున ఏడాదికి 1.30 కోట్ల పాస్‌పోర్టులు జారీ అవుతున్నాయి.

దివ్యాంగుల చట్టపరిధిలోకి మరో 14 వ్యాధులు 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 పరిధిలోకి మరో 14 వ్యాధులు చేరాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 7 కేటగిరీలతో కలిపి మొత్తం 21 రకాల వ్యాధులు/వైకల్యాలు ఉన్న వారిని దివ్యాంగులుగానే పరిగణిస్తారు. ఈ బిల్లు 2016 డిసెంబర్ 14, 16 తేదీలలో రాజ్యసభ, లోక్‌సభల ఆమోదం పొందగా డిసెంబర్ 28 నుంచి అమల్లోకొచ్చింది. ఈ చట్టం ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, ఉన్నత విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. 

కొత్తగా చేర్చిన వ్యాధులు/వైకల్యాలు


మరుగుజ్జులుఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్సెరెబ్రల్ పాల్సీమస్కులర్ డిస్ట్రోప్రీక్రానిక్ న్యూరోలాజికల్ కండిషన్స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీస్మల్టిపుల్ సెలెరోసిస్స్పీచ్ అండ్ ల్యాంగ్వేజ్ డిసేబిలిటీతలసీమియాహిమోఫిలియాసికిల్ సెల్ డిసీజెస్యాసిడ్ దాడుల బాధితులుచెవుడుపార్కిన్‌సన్స్



చట్ట పరిధిలోని మొత్తంవైకల్యాలు/వ్యాధులు

1. Blindness 
2. Low-vision
3. Leprosy Cured persons 
4. Hearing Impairment (deaf and hard of hearing)
5. Locomotor Disability 
6. Dwarfism
7. Intellectual Disability 
8. Mental Illness
9. Autism Spectrum Disorder 
10. Cerebral Palsy
11. Muscular Dystrophy 
12. Chronic Neurological conditions
13. Specific Learning Disabilities 
14. Multiple Sclerosis
15. Speech and Language disability 
16. Thalassemia
17. Hemophilia 
18. Sickle Cell disease
19. Multiple Disabilities including deafblindness
20. Acid Attack victim 
21. Parkinson's disease

మనీ లాండరింగ్ కేసులో తొలి శిక్ష 

మనీలాండరింగ్ కేసులో దేశంలోనే తొలిసారిగా దోషికి శిక్షపడింది. ఝార్ఖండ్ మాజీ మంత్రి హరినారాయణ్ రాయ్‌కి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ రాంచీ ప్రత్యేక న్యాయస్థానం జనవరి 29న తీర్పునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం 2005 జూలై 1న అమల్లోకి వచ్చింది. 

తమిళనాడులో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం

ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పూర్తయింది. దాదాపు 8500 మంది ఆరు నెలలపాటు పనిచేసి నిర్ణీత గడువు కంటే ముందుగానే దీన్ని పూర్తి చేశారు. 10 చ.కి.మీ విస్తీర్ణంలో అదాని గ్రూప్ 648 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకే ప్రదేశంలో నిర్మితమైన ఈ విద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది కావడం విశేషం. లక్షా యాభై వేల గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని ఆ కంపెనీ జనవరి 26న పేర్కొంది.

గణతంత్ర దినోత్సవ కవాతు

గణతంత్ర దినోత్సవ కవాతులో ఉత్తమ స్థానాలు పొందిన బృందాల పేర్లను సైనిక అధికారులు జనవరి 29 ప్రకటించారు.
సైన్యం: మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ (ప్రథమ స్థానం)
పారామిలిటరీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం-సీఐఎస్‌ఎఫ్ (ప్రథమ స్థానం)
రాష్ట్ర శకటాలు: అరుణాచల్ ప్రదేశ్ (జడల బర్రెల నాట్యం) ప్రథమ స్థానం. త్రిపుర (రియాంగ్ గిరిజనుల హొజగిరి నృత్యం) ద్వితీయ స్థానం.
కేంద్ర శాఖల శకటాలు: ప్రథమ స్థానం... కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శాఖ (విజయాలు), ద్వితీయ స్థానం.. కేంద్ర ప్రజా పనుల శాఖ (పచ్చదనం- పరిశుభ్రత)

అవినీతి సూచీలో భారత్‌కు79వ స్థానం

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2016కు జనవరి 25న విడుదల చేసిన అవినీతి దృక్పథ సూచీలో భారత్ 79వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్, డెన్మార్క్ ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలవగా, సోమాలియా అట్టడుగు స్థానంలో ఉంది. బెర్లిన్‌కు చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్.. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక వేదిక వంటి సంస్థల డేటాను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించింది. ఇందులో భాగంగా మొత్తం 176 దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని పరిశీలించింది.

హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా ధర్మశాల

ధర్మశాలను హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా సీఎం వీరభద్రసింగ్ జనవరి 19న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, రెండో రాజధానిగా ధర్మశాల సముచితంగా ఉంటుందన్నారు. 2005లో తొలిసారి ధర్మశాలలో పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ 12సార్లు శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది.

జల్లికట్టుపై ఆర్డినెన్స్

నిషేధిత జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. జల్లికట్టు కోసం నిరసనలు, బంద్‌లతో తమిళనాడు మొత్తం స్తంభించడంతో తమిళనాడు పంపిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు స్వల్ప మార్పులతో కేంద్రం ఆమోదం తెలిపింది. జంతువులకు (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితరాలు) శిక్షణ ఇచ్చి ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది.

జల్లికట్టు బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం: తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై.. జల్లికట్టు బిల్లును జనవరి 23న ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి.


సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన జోధ్‌పూర్ న్యాయస్థానం 

18 ఏళ్ల నాటి అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జోధ్‌పూర్ న్యాయస్థానం జనవరి 18న తీర్పు వెలువరించింది. 1998 అక్టోబర్‌లో రాజస్తాన్‌లోని కంకానీలో సల్మాన్ రెండు కృష్ణజింకలను వేటాడాడని, ఇందుకోసం లెసైన్‌‌స గడువు ముగిసిన ఆయుధాలను కలిగి ఉండటమే కాక వాటిని వినియోగించాడన్నది అభియోగం. సల్మాన్‌పై ఉన్న 4 కేసుల్లో అక్రమాయుధాల కేసు ఒకటి. 

విరాళాల సేకరణలో శివసేన ‘టాప్’ 

2015-16 ఏడాదికి అత్యధిక మొత్తం విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీగా శివసేన నిలిచింది. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌ల సంయుక్త నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల మొత్తం రూ.107.62 కోట్లు కాగా శివసేనకు రూ.86.8 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 6.6 కోట్లు వచ్చాయి.

105 చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం

ఎలాంటి ఉపయోగం లేకుండా కేవలం కాగితాలేకే పరిమితమైన 105 చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ జనవరి 18న ఆమోదం తెలిపింది. ఇందుకోసం ‘రద్దు-సవరణ బిల్లు-2017’ ను తీసుకురానుంది. వీటిలో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన చట్టాలున్నాయి. ఈ మేరకు ఇద్దరు సభ్యుల కమిటీ 1824 చట్టాలు ప్రస్తుత అవసరాలకు పనికిరావని తేల్చింది. మరో 139 చట్టాల రద్దును వివిధ మంత్రిత్వ శాఖలు వ్యతిరేకించాయి.

హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 40 మంది మృతి 

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జనవరి 20 అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 40 మంది చనిపోయారు. 71 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కూనేరు వద్ద పట్టాలు తప్పటంతో ఈ ప్రమాదం జరిగింది. 
గతంలో జరిగిన రైలు ప్రమాదాలు 

1981 జూన్ 6 : బిహార్‌లోని సహర్సా వద్ద ప్యాసింజర్ రైలు భాగమతి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.1995 ఆగస్టు 20 : ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 358 మంది చనిపోయారు.1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసాల్ వద్ద అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ ఢీకొనండంతో 268 మంది మృతిచెందారు.1998 నవంబరు 26: పంజాబ్‌లోని ఖాన్నా వద్ద జమ్మూ తావీ-సీల్డా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురవడంతో 212 మంది మరణించారు.2010 మే 28 : పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 170 మంది మరణించారు.

రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఆమోదం 
రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసేందుకు చేసిన సవరణను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 20న ఆమోదించారు. రైల్వే పద్దును సాధారణ బడ్జెట్‌లో కలిపేందుకు 2016 సెప్టెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ (వాణిజ్య కేటాయింపులు) నిబంధనలు-1961 చట్టంలో సవరణలు చేశారు.

వివాహ రద్దు అధికారం చర్చిలకు లేదు : సుప్రీంకోర్టు

క్రిస్టియన్ పర్సనల్ లా ప్రకారం చర్చి కోర్టులు క్రైస్తవ జంటలకు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలా విడాకులు మంజూరు చేయడం భారత చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానిస్తూ జనవరి 19న కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా చర్చి కోర్టులు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. చర్చి కోర్టులు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు 1996లోనే తీర్పు చెప్పింది.

నలుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష

మరణశిక్ష పడిన నలుగురు ఖైదీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు జనవరి 21న వారి శిక్షలను యావజ్జీవ ఖైదుగా మారుస్తూ సంతకం చేశారు. 1992లో బిహార్‌లో అగ్రవర్ణాలకు చెందిన 34 మందిని హత్య చేసిన కేసులో కృష్ణ మోచీ, నన్హే లాల్ మోచీ, బిర్‌క్యూర్ పాశ్వాన్, ధర్మేంద్ర సింగ్ అలియాస్ దారూసింగ్‌లకు 2001లో సెషన్‌‌స కోర్టు మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. వీరి తరఫున బిహార్ ప్రభుత్వం దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కేంద్రం తిరస్కరించి దోషులపై దయచూపొద్దంటూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 

బిహార్‌లో మహా మానవహారం

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవాహారాన్ని బిహార్ రాజధాని పట్నాలో జనవరి 20న ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో 2016 ఏప్రిల్ నుంచి అమలవుతోన్న సంపూర్ణ మద్యపాన నిషేధానికి మద్దతుగా మూడు కోట్ల మంది 11 వేల 400 కిలోమీటర్ల హారాన్ని నిర్మించారు. ఇస్రో సాయంతో ఉపగ్రహా చిత్రాలు తీశారు. గతంలో అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కి.మీతో బంగ్లాదేశ్ పేరిట ఉండేది. 

జాతీయ గీతాలాపనలో కొదియార్ భక్తుల రికార్డు

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కగ్‌వాడ్‌లో జనవరి 20న ఒకేసారి 3.5 లక్షల మంది జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. తమ ఆరాధ్య దేవత కొదియార్‌కు నూతన ఆలయాన్ని నిర్మించిన లువ్యా పటేల్ సామాజిక వర్గ ప్రజలు విగ్రహావిష్కరణ సందర్భంగా జనగణమన ఆలపించారు. 40 కి.మీ మేర శోభాయాత్ర నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోనూ చోటు దక్కించుకున్నారు.

రంజిత్ సిన్హాపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు 

బొగ్గు కుంభకోణం కేసులో అధికార దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్ సిన్హాపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ మాజీ ప్రత్యేక డెరైక్టర్ ఎంఎల్ శర్మ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. 

50 వేలకు మించిన లావాదేవీలపై పన్ను 

రూ.50 వేలకు పైబడిన నగదు లావాదేవీలపై పన్ను విధించాలని నగదు రహిత లావాదేవీల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ జనవరి 24న ప్రధాని మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. నగదు ఉపసంహరణపై ఒక గరిష్ట పరిమితి నిర్దేశించాలని సూచించిన కమిటీ ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై ఛార్జీలు ఉండకూడదని, వాటికి రాయితీలతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొంది. 
నివేదికలోని కీలక సిఫార్సులు 
నగదు వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా రూ. 50 వేలు, ఆ పైబడిన నగదు లావాదేవీలపై బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ టాక్స్ (BCTT)ను అమలు చేయాలి.నగదు రహిత లావాదేవీలు జరిపే వర్తకులకు ఎలాంటి చార్జీలు, పన్నులు వేయొద్దు.మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్ సెన్సర్లకు పన్ను రాయితీలు వర్తింపజేయాలి.నగదు రహిత లావాదేవీలను అమలు చేసేవారికి పన్ను తిరిగి చెల్లించాలి.ఆధార్ చెల్లింపులకు వీలుగా బయోమెట్రిక్ పరికరాలపై 50 శాతం రాయితీ ఇవ్వాలి.ఆధార్ ఆధారిత చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్-MDR విధించొద్దు.ఆదాయ పన్ను పరిధిలోకి రాని పౌరులు, చిన్నవ్యాపారుల స్మార్టు ఫోన్ కొనుగోలుకు రూ.1000 రాయితీ ఇవ్వాలి.1,54,000 పోస్టాఫీసుల్లో ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంలు సమకూర్చాలి.గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకులు తక్షణం నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలి.ప్రభుత్వరంగ సంస్థల పరిధిలోని లావాదేవీలన్నిటినీ నగదు రహితంగా మార్చాలి.


భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2015-16

 దేశవ్యాప్తంగా హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 2016 జూన్ 30 వరకు ఉన్న పెండింగ్ కేసులు, న్యాయమూర్తుల ఖాళీలపై సుప్రీంకోర్టు వార్షిక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 24 హైకోర్టుల్లో 40.54 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 44 శాతం న్యాయమూర్తుల కొరత ఉంది. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో దాదాపు 2.8 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 5 వేల జడ్జీ పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో సిబ్బందిని కనీసం ఏడు రెట్లు పెంచాలని, రాబోయే మూడేళ్లలో దాదాపు 15 వేల మందికి పైగా జడ్జీల్ని నియమించాలని ఈ నివేదిక పేర్కొంది.
నివేదిక ముఖ్యాంశాలు:

మొత్తం 24 హైకోర్టులకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 1,079 కాగా, కేవలం 608 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య కంటే ఇది 43.65 శాతం తక్కువ.హైకోర్టుల్లోని మొత్తం 40.54 లక్షల అపరిష్కృత కేసుల్లో సివిల్ కేసుల సంఖ్య 29,31,352 కాగా, క్రిమినల్ కేసులు 11,23,178. మొత్తం కేసుల్లో పదేళ్లకు పూర్వం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు 7,43,191.జిల్లా కోర్టుల్లో దేశవ్యాప్తంగా 2,81,25,066 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1,89,04,222 కేసుల్ని కిందిస్థాయి కోర్టులు పరిష్కరించాయి.జిల్లా కోర్టుల్లో 4,954 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండగా, అనుమతించిన న్యాయాధికారుల సంఖ్య 21,324 మందిగా నివేదిక పేర్కొంది.అపరిష్కృత కేసులు, న్యాయమూర్తుల ఖాళీల్లో అలహాబాద్ హైకోర్టు ముందంజలో ఉంది. మొత్తం 9.24 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా 3 లక్షలకు పైగా కేసులు 10 ఏళ్లకు కిందటివి. అలహాబాద్ హైకోర్టులో మొత్తం 160 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా 78 మందే ఉన్నారు.అలహాబాద్ తర్వాత మద్రాసు హైకోర్టులో అపరిష్కృత కేసులు 3,02,846 కాగా, 75 మంది న్యాయమూర్తులకుగాను 38 మందే ఉన్నారు.బాంబే హైకోర్టులో 2,98,263 కేసులు అపరిష్కృతంగా ఉండగా, అందులో 53,511 కేసులు పదేళ్లకు పూర్వం నాటివి. ఈ కోర్టుకు 94 మంది న్యాయమూర్తుల్ని కేటాయించగా 64 మందే ఉన్నారు.ఏపీ, తెలంగాణలో ఉమ్మడి హైకోర్టులో 2,78,695 కేసులు అపరిష్కృతంగా ఉండగా ఇందులో 24,606 కేసులు పదేళ్లనాటివి. 61 న్యాయమూర్తులు అవసరం కాగా ప్రస్తుతం 25 మంది ఉన్నారు.దేశంలో చత్తీస్‌గఢ్ హైకోర్టులో అత్యంత తక్కువగా 37 శాతం మాత్రమే న్యాయమూర్తులున్నారు. ఈ హైకోర్టుకు 22 మంది అవసరం కాగా ప్రస్తుతం 8 మందే పనిచేస్తున్నారు. ఇక పెండింగ్ కేసులు మాత్రం 54 వేలకు పైనే ఉన్నాయి.

ఒక శాతం సంపన్నుల చేతుల్లో 58 శాతం సంపద
దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా ఆక్స్‌ఫామ్ అనే సంస్థ ‘యాన్ ఎకానమీ ఫర్ 99 పర్సెంట్’ పేరుతో జనవరి 16న ఈ నివేదిక విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు
దేశంలో మొత్తం సంపద 3.1 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో 70 శాతం మంది సంపద 216 బిలియన్ డాలర్లు. ఇది 57 మంది బిలియనీర్ల సంపదకు సమానం.దేశంలోని 84 మంది బిలియనీర్ల సమష్టి సంపద 248 బిలియన్ డాలర్లు. వీరిలో తొలి మూడు స్థానాల్లో ఉన్నవారు... 1.ముకేశ్ అంబానీ (19.3 బిలియన్ డాలర్లు) 2. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్‌సంఘ్వి (16.7బిలియన్ డాలర్లు) 3. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ (15 బిలియన్ డాలర్లు).ప్రపంచ మొత్తం సంపద 255.7 ట్రిలియన్ డాలర్లు. ఇందులో 6.5 ట్రిలియన్ డాలర్లు కేవలం 8 మంది బిలియనీర్లు కలిగి ఉన్నారు. 1. బిల్‌గేట్స్ (75 బిలియన్ డాలర్లు) 2. అమన్సియో ఒర్టెగా (67 బిలియన్ డాలర్లు) 3. వారెన్ బఫెట్ (60.8 బిలియన్ డాలర్లు).2015 నుంచి ఒక్క శాతం మంది సంపన్నులు ప్రపంచ జనాభాకు మించిన సంపదను కలిగి ఉన్నారు.
బెంగళూరులో 14వ ప్రవాసి భారతీయ దినోత్సవం
 14వ ప్రవాసి భారతీయ దివస్ బెంగుళూరులో జనవరి 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సంతతికి చెందిన సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మైఖేల్ ఆశ్విన్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 8న హాజరై ప్రసంగించారు. మహాత్మా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చిన రోజును 2003 నుంచి ప్రవాసీ దివస్‌గా జరుపుకుంటున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 4న షెడ్యూలు ప్రకటించింది. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో జరుగుతాయి.
రాష్ట్రాల వారీగా ఎన్నికల తేదీలు

ఉత్తరప్రదేశ్


ఫిబ్రవరి 11, 15, 19, 23, 3, 8


పంజాబ్


ఫిబ్రవరి 4


గోవా


ఫిబ్రవరి 4


ఉత్తరాఖండ్


ఫిబ్రవరి 15


మణిపూర్


మార్చి 4, 8



రోడ్డు ప్రమాదాల మరణాల్లో ఉత్తరప్రదేశ్ టాప్

రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 18,047 మంది మరణిస్తున్నట్లు నేషనల్ ్రైకైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2014లో దేశవ్యాప్తంగా 4,50,000 రోడ్డు ప్రమాదాలు జరగగా 2015లో 4,64,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా తమిళనాడులో 69,059 ప్రమాదాలు జరగగా తర్వాతి స్థానాల్లో కర్ణాటక (44,011), మహారాష్ట్ర (42,250) ఉన్నాయి. 2011లో రోడ్డు ప్రమాదాల్లో 1,36,000 మంది మరణించగా 2015 నాటికి 9 శాతం (1,48,000) మరణాలు పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ రోడ్డు ప్రమాదాలు, ఆత్మ హత్యలపై విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. రోడ్డు రవాణా వల్ల దేశ జీడీపీకి 4.8 శాతం ఆదాయం లభిస్తుండగా రోడ్డు ప్రమాదాల వల్ల 1-3 శాతం నష్టం చేకూరుతోందని ప్రణాళిక సంఘం వెల్లడించింది.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వేటు

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పీపీఏ) వేటు వేసింది. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో 60 స్థానాలున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు

అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండుతో పాటు 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరండంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 60 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం పీపీఏ కు 43, బీజేపీకి 11 మంది సభ్యులున్నారు. తాజా నేపథ్యంలో బీజేపీ సభ్యులు 44 కు చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో అరుణాచల్ బీజేపీ పాలిత పదవ రాష్ట్రంగా నిలిచింది.
ఈశాన్య ప్రజాతంత్ర కూటమి(ఎన్‌ఈడీఏ) సంకీర్ణ ప్రభుత్వంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ భాగస్వామి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నెపంతో పెమా ఖండుతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలను డిసెంబర్ 31న పీపీఏ బహిష్కరించింది. దీంతో తనకు మద్దతుగా నిలిచిన 33 మందితో సహా ఖండూ బీజేపీలో చేరారు. ఖండూ 2016 సెప్టెంబర్‌లో కూడా 42 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.

తిరువనంతపురంలో 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్

77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరువనంతపురంలో డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్ర పరిశీలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.

మార్చి 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉంటే నేరం

2017, మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదం తెలిపింది. పాత నోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5 వేల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. రద్దయిన నోట్లు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్నా లేదా స్వీకరించినానేరంగా పరిగణిస్తారు.

20 వేల స్వచ్ఛంద సంస్థల లెసైన్సులు రద్దు 

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 27న దేశంలోని 20 వేల స్వచ్ఛంద సంస్థల లెసైన్సులను రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విదేశీయుల విభాగంపై నిర్వహించిన సమీక్షలో దేశంలో ఉన్న మొత్తం 33 వేల స్వచ్ఛంద సంస్థల్లో 20 వేల సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించినట్లు పేర్కొన్నారు.

న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సు

భారత న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ డిసెంబర్ 27న బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంపదలో 45 శాతాన్ని కోటీశ్వరులే నియంత్రిస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలున్న దేశాల్లో భారత్ పన్నెండో స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సామాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా, నరేశ్ ఉత్తమ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ సమావేశం జనవరి 1న నిర్ణయించింది. ఈ సమావేశంలో ములాయం సింగ్ యాదవ్‌ను జాతీయాధ్యక్షుడిగా, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతోపాటు సీనియర్ నేత అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.

కులమతాల పేరుతో ఓట్లు కోరడం అవినీతే: సుప్రీంకోర్టు

ఎన్నికల ప్రచారంలో మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్యేనని సుప్రీం కోర్టు జనవరి 2న స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హిందుత్వం జీవన విధానమన్న తన 21 ఏళ్ల నాటి వివాదాస్పద తీర్పును సవరించింది. ‘‘ప్రజాప్రాతినిధ్య (ఆర్‌పీ) చట్టం-1951లోని 123(3) సెక్షన్ ప్రకారం ‘అతని మతం’(హిజ్ రిలిజియన్) అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి కులమతాలూ అని అర్థం‘ అని జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు(మెజారిటీ జడ్జీలు) స్పష్టం చేశారు. వీరితో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విబేధించారు.
కులమతాల పేర్లతో ఓట్లు అడగడం అవినీతా, కాదా అన్న దానికి సంబంధించిన ఎన్నికల చట్ట నిబంధన విసృ్తతిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

AIMS DARE TO SUCCESS 
ఫిబ్రవరి 2017 జాతీయం

దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం ఆవిష్కరణ
దేశంలోనేఅతిపెద్ద శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఫిబ్రవరి 24న ఆవిష్కరించారు. 112 అడుగుల ఎత్తై ఆది యోగి విగ్రహాన్ని ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆదియోగ అనే పుస్తకాన్ని విడుదల చేసిన మోదీ ప్రపంచమంతా కోరుకునే శాంతి యోగాతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ర్ట సీఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు.

తీర నిఘా ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
తీర ప్రాంతాలపై నిఘా పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ) ఫిబ్రవరి 21న అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.800 కోట్లను వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో 38 రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

జాతీయ పార్కుల్లో బీబీసీ ఎంట్రీపై నిషేధం
భారతదేశంలోని జాతీయ పార్కుల్లోకి బీబీసీ, అందులో పనిచేసే జర్నలిస్ట్ జస్టిన్ రౌలత ప్రవేశంపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఫిబ్రవరి 27న జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌సీటీఏ) నిర్ణయం తీసుకుంది. అసోంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్‌లో భారత్ చేపడుతున్న జంతువుల రక్షణ చర్యలను ప్రశ్నిస్తూ బీబీసీ తీసిన డాక్యుమెంటరీ అత్యంత దారుణంగా ఉండటంతో ఎన్‌సీటీఏ ఈ చర్యలు తీసుకుంది.

సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 40 వేల మెగావాట్లు
దేశంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2020 నాటికి 40 వేల మెగావాట్లకు చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ ప్రతిపాదనలకు ఫిబ్రవరి 22న ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఒక్కోటి 500 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను రూ.8,100 కోట్లతో దేశంలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2016 డిసెంబర్ 31 నాటికి భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9,012 మెగావాట్లు. 

అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు ఆవిష్కరణ 
ఫస్ట్‌క్లాస్ సౌకర్యాలతో కూడిన అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలుని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఫిబ్రవరి 22న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రిజర్వేషన్ అవసరం లేని ఈ రైలులో మెత్తని సీట్లు, అల్యూమినియం ప్యానల్స్, ఎల్‌ఈడి లైట్లు, బయో టాయిలెట్లు వంటి సౌకర్యాలు కల్పించారు. మొదటి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ముంబై-టాటానగర్ మధ్య సేవలు అందిస్తుంది.త్వరలో ఎర్నాకుళం-హౌరా మధ్య మరో అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు.

సిమి చీఫ్ సఫ్దార్ హుస్సేన్ కు జీవితఖైదు
దేశ ద్రోహం కేసులో నిషేధిత సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) సంస్థ చీఫ్ సఫ్దార్ హుస్సేన్ నగోరి సహా మరో పది మంది కార్యకర్తలకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న న్యాయమూర్తి బి.కె.పలోడా తీర్పు వెలువరించారు. నిందితుల అభ్యర్థన మేరకు వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా కోర్టు తీర్పు వివరాలను వారికి తెలియజేశారు. మత విద్వేషాలను ప్రోత్సహించడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2008లో నిందితులపై దేశ ద్రోహం కేసు నమోదైంది. 

అంటువ్యాధుల నివారణకు కొత్త చట్టాన్ని రూపొందించిన కేంద్రం 
బయో టైజం సహా ప్రమాదకరమైన అంటువ్యాధుల నివారణకు ప్రజారోగ్య (అంటువ్యాధులు, బయోటైజం, విపత్తు నిర్మూలన, నియంత్రణ, నిర్వహణ)బిల్లు-2017కు రూపకల్పన చేసింది. దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ముసాయిదాను పంపింది. 120 ఏళ్ల క్రితం ఏర్పాటైన అంటువ్యాధుల చట్టం- 1897 స్థానంలో ఈ కొత్త బిల్లుని కేంద్రం తీసుకురానుంది. 

దేశంలో తొలి హెలిపోర్టు ప్రారంభం 
దక్షిణాసియాలోనే తొలిసారిగా ఢిల్లీలో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్ హెలిపోర్టు (హెలికాప్టర్లు నిలిపే స్థలం) అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఈ హెలిపోర్టును కేంద్ర పౌర విమాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. దీన్ని పవన్ హాన్స్ లిమిటెడ్ సంస్థ రూ.100 కోట్లతో 25 ఎకరాల్లో నిర్మించింది. 16 హెలికాప్టర్ల సామర్థ్యంతో 150 మంది ప్రయాణికులకు సేవలందించేలా ఇందులో సౌకర్యాలు ఉన్నాయి.

రాజ్యాంగ ధర్మాసనానికి తలాక్ పిటిషన్లు 
ముస్లిం సంప్రదాయాలైన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదలీ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. వీటిపై ఫిబ్రవరి 16న విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ల విచారణకు విస్తృత ధర్మాసనం అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటు కానున్న రాజ్యాంగ ధర్మాసనం కేసులను మార్చి 30న విచారించనుంది. 

సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
వాతావరణ మార్పులతో పర్యావరణానికి కలిగే ముప్పుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రదర్శన ప్రారంభమైంది. ఫిబ్రవరి 17న న్యూఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధ్దన్ జెండా ఊపి రైలుని ప్రారంభించారు. 7 నెలల పాటు దేశవ్యాప్తంగా తిరగనున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలు 68 స్టేషన్లలో ప్రదర్శన ఇవ్వనుంది. ఇందులో మొత్తం 16 బోగీల్లో ఉన్నాయి. ఒక్కో బోగీలో పర్యావరణానికి సంబంధించిన ఒక్కో అంశాన్ని ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. 

వైద్య కళాశాలల్లో ఈ-శవాలకు కేంద్రం అనుమతి
శరీర ధర్మశాస్త్రం గురించి వైద్య విద్యార్థులకు వివరించడానికి ప్రస్తుతం వాడుతున్న భౌతిక కాయాలకు బదులుగా ఎలక్ట్రానిక్ శవాలు ఉపయోగించనున్నారు. ఈ మేరకు తెలంగాణలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
సిమ్యులేటరీ విధానంలో మానవ భౌతికకాయం తరహాలోనే సృష్టించిన ఎలక్ట్రానిక్ శవం ఉంటుంది. ఇందులో గుండె, నరాలు, మెదడు, ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సల కోసం ఒక ప్రోగ్రామ్ తయారై ఉంటుంది. పరీక్ష చేసేటప్పుడు రక్తస్రావం జరుగుతున్నట్టు, గుండె కొట్టుకుంటున్నట్టు, ఊపిరితిత్తుల్లో శ్వాసప్రక్రియ జరుగుతున్నట్లు ఏర్పాట్లు ఉండటంతో దీని ద్వారా నిజమైన శవాన్ని పరీక్షించిన అనుభూతి కలుగుతుంది.

క్రియాశీలకంగా మారిన బారెన్ అగ్నిపర్వతం
దాదాపు 150 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో ఉన్న ‘బ్యారెన్ ఐలాండ్’ అగ్నిపర్వతం తాజాగా క్రియాశీలకంగా మారి లావాను వెదజల్లుతుంది. ఈ మేరకు గోవాలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐఓ) శాస్త్రవేత్తల బృందం ఫిబ్రవరి 18న తెలిపింది. మనదేశంలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఇదొక్కటే.
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో ఉన్న ఈ అగ్ని పర్వతం నుంచి 1991 నుంచి అప్పుడప్పుడు లావా, బూడిద వచ్చేవి. 2017 జనవరి 23న దీనిని పరీక్షించిన శాస్త్రవేత్తల బృందం అగ్నిపర్వత క్రియాశీలతను ద్రువీకరించారు.

ముగిసిన ఏరో ఇండియా-2017 ప్రదర్శన
బెంగళూరు యలహంక ఎయిర్‌బేస్‌లో ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఏరో ఇండియా-2017 అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ఫిబ్రవరి 18న ముగిసింది. 
ఏరో ఇండియా తదుపరి ప్రదర్శన 2019లో గోవాలో జరగనుంది. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలు 1996 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి బెంగళూరులో జరుగుతున్నాయి. వైమానిక రంగంలో గణనీయ ప్రగతిని సాధించిన కర్ణాటక ఈ రంగంలోని హార్డ్‌వేర్ ఎగుమతుల్లో 65 శాతం వాటా కలిగి ఉంది.

భారత్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ
ప్రపంచపు తొలి ఇంటర్ పోర్టబుల్ పేమెంట్ యాక్సప్టెన్సీ సొల్యూషన్ ‘భారత్‌క్యూఆర్ కోడ్’ (QR-Qucik Response) ను ఫిబ్రవరి 20న కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీని ద్వారా రిటైల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మరింత సులభతరం కానున్నాయి. ఈ విధానంలో ఐడీ, ఫోన్ నెంబర్ వంటివి అవసరం లేకుండానే వ్యాపారులు ఒక క్యూఆర్ కోడ్‌తో లావాదేవీలు నిర్వహించవచ్చు. వినియోగదారులు ఆ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ విధానం ఆండ్రాయిడ్ ఫోన్లలోనే పనిచేస్తుంది. 
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI, మాస్టర్‌కార్డ్, వీసా సంస్థలు సంయుక్తంగా భారత్ క్యూఆర్ కోడ్‌ను అభివృద్ధి చేశాయి. దీన్ని అమలు చేసేందుకు 15 బ్యాంకులు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

హైకోర్టు జడ్జికి ధిక్కార నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
దేశంలోనే తొలిసారిగా కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 8న కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఫిబ్రవరి 13న న్యాయమూర్తి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన స్వాధీనంలో ఉన్న అన్ని న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఫైళ్లను కోల్‌కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలని నిర్దేశించింది.

జస్టిస్ కర్ణన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా పలువురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ, ప్రధాని, ఇతరులకు లేఖలు రాశారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది.

విదేశాల్లో రూ.16,000 కోట్ల నల్లధనం గుర్తింపు
హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌బీసీ), ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే)లు ఇచ్చిన జాబితాలపై విచారణ జరిపి భారతీయులు విదేశాల్లో దాచిన రూ.16,200 కోట్ల నల్లడబ్బును గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో హెచ్‌ఎస్‌బీసీకి చెందిన విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8,200 కోట్ల నల్లడబ్బును పన్ను పరిధిలోకి తెచ్చినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 7న రాజ్యసభకు తెలిపారు. మరో రూ.8,000 కోట్లను రుణంగా తీసుకున్నట్లు గుర్తించామన్నారు. భారతీయులు దాచిన నల్లడబ్బుపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదన్నారు.

కంబాళ బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం 
కర్ణాటకలో సంప్రదాయ దున్నపోతుల పందెం (కంబాళ), ఎడ్ల పందేలకు చట్టబద్ధ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకి ఆ రాష్ట్ర శాసనసభ ఫిబ్రవరి 13న ఆమోదిం తెలిపింది. 1960నాటి జంతుహింస నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. 

స్టెంట్ల ధరలను 85 శాతం తగ్గించిన కేంద్రం
గుండె శస్త్ర చికిత్సలో ఎంతో కీలకమైన కరోనరీ స్టెంట్ల ధరల్ని 85 శాతం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 14న ప్రకటన చేసిన ప్రభుత్వం ధరల తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో బేర్ మెటల్ స్టెంట్(BMS) రూ. 7,260.. డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్(DES) రూ.29,600 లకు లభించనున్నాయి.

ఇప్పటివరకు BMS ధర గరిష్టంగా రూ. 45 వేలు ఉండగా, DES రూ. 1.21 లక్షల వరకూ ఉండేది. ధరల తగ్గింపుతో గుండె సంబంధిత చికిత్సలపై దేశవ్యాప్తంగా ఏటా రూ.4,450 కోట్ల మేర భారం తగ్గుతుంది. 

థియేటర్లలో జాతీయగీతంపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు 
సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు గౌరవ సూచకంగా ఎప్పుడు నిలబడలన్నదానిపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. ఈ అంశంలో పలు సందర్భాల్లో ఎదురవుతున్న గందరగోళానికి తెరదించుతూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమితల ధర్మాసనం ఫిబ్రవరి 14న వివరణ ఇచ్చింది. 

సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడాలని సినిమా కథ, న్యూస్‌రీల్, డాక్యుమెంటరీల్లో భాగంగా వచ్చే జాతీయ గీతానికి లేచి నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది. 

బాంబు దాడులు భారత్‌లోనే అధికం 
2016లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్‌లోనే జరిగినట్లు నేషనల్ బాంబ్ డేటా సెంటర్(NBDC) వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 14న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం గతేడాది భారత్‌లో 406 బాంబు దాడుల జరగ్గా 221 దాడులతో ఇరాక్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో 161, అఫ్గానిస్తాన్‌లో 132 దాడులతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. యుద్ధ సమయంలో ఇరాక్, అఫ్గాన్ దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే గతేడాది భారత్‌లో జరిగిన దాడులే అధికం.

తల్లిదండ్రులను పట్టించుకోకుంటే వేతనాల్లో కోతే!
పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై చర్య తీసుకోవాలని అసోం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వయసుపైబడిన తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో నుంచి కొంత మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందించనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా ఫిబ్రవరి 7న ఈ ప్రకటన చేశారు. దీన్ని 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి అమలుచేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని.. లేకుంటే ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుంటుందన్నారు.

డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ద్వారా 6 కోట్ల మంది గ్రామీణులకు డిజిటల్ అక్షరాస్యతను అందించే కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,351.38 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీన్ని 2019 మార్చి నాటికి పూర్తిచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం కింద 2017-18లో 2.75 కోట్ల మందికి, 2018-19లో 3 కోట్ల మందికి డిజిటల్ అక్షరాస్యతను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్ ఫోన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం, డిజిటల్ వ్యాలెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు.

నగదు రూప లావాదేవీలపై కేంద్రం కొరడా
రూ.3 లక్షలు లేదా అంతకుమించిన లావాదేవీలను నగదు రూపంలో చేస్తే అంతే మొత్తాన్ని (100 శాతం) జరిమానాగా విధించనున్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా ఫిబ్రవరి 5న తెలిపారు. నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించిన నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో చేర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంగా తెలిపారు.

ఎంపీ, మాజీ మంత్రి అహ్మద్ మృతి
పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి ఇ.అహ్మద్ (78) ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలోని మరణించారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. కేరళకు చెందిన ఐయూఎంఎల్ నేత.. అహ్మద్ యూపీఏ ప్రభుత్వంలో వివిధ శాఖల సహాయ మంత్రిగా, గల్ఫ్ దేశాల్లో భారత అనధికార రాయబారిగా సేవలందించారు. 

పంజాబ్, గోవాలో రికార్డు స్థాయి పోలింగ్ 
ఫిబ్రవరి 4న గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పంజాబ్‌లో 75 శాతం, గోవాలో 83 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఓటేయని వారికి ప్రశ్నించే అధికారం లేదు: సుప్రీంకోర్టు
 ఓటేయని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 5న ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా అక్రమ కట్టడాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీకి చెందిన వాయిస్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థకు చెందిన సామాజిక కార్యకర్త ధనేష్ తాను ఇంత వరకు ఒక్కసారి కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదని సుప్రీం కోర్టుకు చెప్పాడు. దీంతో జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ సామాజిక కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సహారా ఆస్తుల జప్తునకు సుప్రీం కోర్టు ఆదేశం 
సహారా సంస్థకు చెందిన రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మహారాష్ట్ర పుణెలోని ఆంబే వాలీలో రూ.39 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని ఫిబ్రవరి 6న తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 20 లోపల ఎటువంటి వివాదాల్లేని ఆస్తుల జాబితాను అందించాలని సహారా గ్రూప్‌ను ఆదేశించింది. 2016 అక్టోబర్ 31 నాటికి సహారా గ్రూప్ ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.47,669 కోట్లు.

AIMS DARE TO SUCCESS

మార్చి 2017 జాతీయం
నీటి ఎద్దడిపై నీతిఆయోగ్ ఆందోళన
దేశంలో పెరిగిపోతున్న నీటిఎద్దడిపై నీతిఆయోగ్ మార్చి 23న ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉపయోగిస్తున్న నీటిలో వ్యవసాయ అవసరాలకే 70 శాతం సరిపోతోందని, జలాల వినియోగ సమర్థతను మరో 20 శాతం పెంచేలా పరిశోధనలు చేయాలని పేర్కొంది.

గోవధకు మరణశిక్ష విధించాలని ప్రైవేటు బిల్లు
గోవధకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాజ్యసభలో మార్చి 24న ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. గోవుల సంఖ్యను స్థిరీకరించేలా ప్రాధికార సంస్థ ఏర్పాటు, రాజ్యాంగంలోని 37, 48 అధికరణలకు అనుగుణంగా చర్యలు, గోవధ నిషేధం ఉండాలని బిల్లులో పొందుపరిచారు. 

ఓబీసీలకు రాజ్యాంగబద్ధ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం 
ఎస్టీ, ఎస్టీలకు ఉన్నట్లుగానే జాతీయ స్థాయిలో ఓబీసీ(ఇతర వెనకబడిన వర్గాలు) లకు రాజ్యాంగబద్ధ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి 23న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతమున్న బీసీ జాతీయ కమిషన్‌ను రద్దు చేసే ప్రతిపాదననూ ఆమోదించింది. 
1993 ఆగస్టు 14న సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధ వ్యవస్థగా బీసీ జాతీయ కమిషన్ ఏర్పడింది. అయితే దీనికి ఓబీసీల ఫిర్యాదులను పరిష్కరించే అధికారం లేదు. అందుకోసం ఇప్పుడు కొత్తగా ‘సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్’ (ఎన్‌సీఎస్‌ఈబీసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక ఉప చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌సీఎస్‌ఈబీసీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం 
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు 

మానవుల అక్రమ రవాణాలో బెంగాల్ టాప్
దేశవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్చి 26న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి 2016లో బెంగాల్‌లో 3,576, రాజస్తాన్‌లో 1,422 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 61 శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. 548 కేసులతో గుజరాత్ మూడోస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 239, తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయి. 
అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్.. బంగ్లాదేశ్, యూఏఈలతో అవగాహనా ఒప్పందాల్ని కుదుర్చుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మనుషుల అక్రమ రవాణా కేసులు 
ఎప్పుడు : 2016
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారత్‌లో 

యూపీలో యాంటీ-రోమియో దళాలు ప్రారంభం 
 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఆ రాష్ట్ర పోలీసులు మార్చి 22న యాంటీ- రోమియో పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈవ్‌టీజింగ్‌ని అరికట్టేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు. అలాగే గోవధపై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని తన వ్యక్తిగత వెబ్‌సైట్ www.yogiadityanath.in ద్వారా తెలపాలని సీఎం ఆదిత్యనాథ్ కోరారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : యాంటీ-రోమియో డ్రైవ్ 
ఎప్పుడు : మార్చి 22
ఎక్కడ : ఉత్తర ప్రదేశ్
ఎందుకు : ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు 

దక్షిణాది జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు
దక్షిణాది రాష్ట్రాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని కేంద్ర జలవనరుల శాఖ మార్చి 25న ప్రకటించింది. దక్షిణాదిలోని 31 రిజర్వాయర్లలో మార్చి 24 నాటికి కేవలం 16 శాతం మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొంది. ఇది గతేడాది కంటే 2 శాతం, గత పదేళ్ల సగటు కంటే 13 శాతం తక్కువ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో ఉన్న ఈ 31 రిజర్వాయర్ల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 51.59 శతకోటి ఘనపు మీటర్లు (బీసీఎం). ప్రస్తుతం 8 బీసీఎం మాత్రమే నిల్వలున్నాయి. 

శశికళ, పన్నీర్ సెల్వం కొత్త పార్టీలు 
అన్నాడీఎంకేకు ఉన్న రెండాకుల ఎన్నికల చిహ్నం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల్లో ఎవరికీ చెందదని మార్చి 22న ఎన్నికల సంఘం తేల్చింది. దీంతో ఇరు వర్గాలు కొత్త పార్టీలు పెడుతున్నట్లు ప్రకటించాయి. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ పేరుతో పార్టీని ప్రకటించిన పన్నీర్ సెల్వం ఎన్నికల చిహ్నంగా రెండు లైట్ల విద్యుత్ స్తంభాన్ని ఎంచుకున్నారు. అన్నాడీఎంకే అమ్మ పేరుతో పార్టీని స్థాపించిన శశికళ వర్గం ఎన్నికల గుర్తుగా టోపీని ఎంచుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో రెండు పార్టీలు కేటాయించిన గుర్తులతో పోటీ చేయనున్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తమిళనాడులో రెండు కొత్త పార్టీల ఆవిర్భావం 
ఎప్పుడు : మార్చి 23 
ఎవరు : పార్టీలు స్థాపించిన పన్నీరు సెల్వం, శశికళ
ఎందుకు : అన్నాడీఎంకే చిహ్నాన్ని ఇరు వర్గాల్లో ఎవరికీ ఇవ్వని ఈసీ 

భారత్‌లోని ఐదు నగరాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు 
భారత్‌లోని ఐదు నగరాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ మేరకు మార్చి 22న రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్రం అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్, ముంబై నగరాలకు యునెస్కో వారసత్వ హోదా లభించిందని పేర్కొంది. 

5 ఏళ్లలో వెయ్యి మె.వా. సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయనున్న రైల్వే 
భారతీయ రైల్వే వచ్చే 5 ఏళ్లలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మార్చి 25న వెల్లడించారు. 
మొత్తంగా రైల్వేల నిర్వహణ కోసం ప్రస్తుతం వెచ్చిస్తున్న ఇంధన వ్యయంలో పదేళ్లలో రూ.41 వేల కోట్లు ఆదా చేయాలన్నది లక్ష్యం. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైల్వలో సౌర విద్యుత్ ఉత్పత్తి 
ఎప్పుడు : 5 ఏళ్లలో వెయి మెగావాట్లు 
ఎవరు : ఇండియన్ రైల్వేస్ 
ఎందుకు : ఇంధన వ్యయాన్ని తగ్గించుకునేందుకు 

అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ
2015-16 గణాంకాల ప్రకారం భారత్‌లో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే మార్చి 27న రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) విలువల ప్రకారం.. ఢిల్లీ, ఫరీదాబాద్, వారణాసి, లక్నో, జైపూర్, కాన్పూర్, పట్నా, ముజఫర్‌నగర్ నగరాల్లో గాలి తీవ్రంగా కలుషితమైంది. 
ఆగ్రా, జోధ్‌పూర్, గుర్గావ్, గయా, సోలాపూర్, చంద్రాపూర్, చెన్నైలలో ఓ మోస్తరుగా కలుషితమైంది. 
హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, నవీ ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌లాంటి నగరాల్లో వాయు నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరాలు 
ఎప్పుడు : 2015-16 గణాంకాల ప్రకారం 
ఎవరు : కేంద్ర పర్యావరణ శాఖ
ఎక్కడ : ఢిల్లీలో అత్యధికం 

సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీంకోర్టు
సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆయా పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ కార్డును తప్పనిసరి చేయలేవని చెప్పింది. ఈ మేరకు ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని మార్చి 27న కోర్టు అభిప్రాయపడింది. 
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, ఐటీ రిటర్న్ దాఖలు వంటి సంక్షేమేతర అంశాలకు ఆధార్‌ను అడ్డుకోమని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ తప్పనిసరి కాదని 2015 ఆగస్టు 11న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి కాదు 
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : సుప్రీం కోర్టు 

మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం 
మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లు - 2016కు లోక్‌సభ మార్చి 27న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించడం నేరం కాదు. మానసిక వికలాంగులు మెరుగైన వైద్యం పొందే హక్కు, వారి ఆస్తిని కాపాడుకునే హక్కులను కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లు - 2016కు లోక్‌సభ ఆమోదం 
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

జాతీయ వైద్య విధానం - 2017
జాతీయ వైద్య విధానం-2017ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 16న కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో ఈ విధానాన్ని ఆవిష్కరించారు. దేశంలో వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేయాలనే లక్ష్యంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసింది. ఇందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించటంతోపాటు అన్ని మందులను అందుబాటులో ఉంచటం ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి. ఆయుర్దాయాన్ని 67.5 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, పాఠశాలలు, పని కేంద్రాల్లో మరింత విసృ్తతంగా యోగాను ప్రారంభించాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ప్రజారోగ్యంపై వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.5 శాతం ఉండగా దీన్ని ఒక నిర్దిష్ట కాలక్రమంలో 2.5 శాతానికి పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 
పాలసీలోని ముఖ్యాంశాలు 
పేషెంట్లకు సాధికారత కల్పించేలా చికిత్స సరిగా అందని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు ట్రిబ్యునళ్ల ఏర్పాటు.2025 కల్లా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటును 23కి, ప్రసూతి మరణాల రేటును 2020 కల్లా 100కు తగ్గించాలి.2019 కల్లా శిశు (ఏడాదిలోపు చిన్నారులు) మరణాల రేటును 28కి, 2025 కల్లా నియోనటల్ (పుట్టిన నెలరోజులోపు చిన్నారులు) మరణాల రేటును 16కు, గర్భస్థ శిశువు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు మార్చాలని లక్ష్యం.సంతాన సాఫల్య రేటును 2025కల్లా ప్రస్తుతమున్న 2.5 నుంచి 2.1కు తగ్గించాలి.2018 కల్లా కుష్టు వ్యాధి నిర్మూలన.క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ వైద్య విధానం - 2017 
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : పార్లమెంటులో ప్రకటన 
ఎందుకు : ఆరోగ్య భారత్ సాకారం కోసం 

గోవా శాసనసభలో బలపరీక్ష నెగ్గిన పరీకర్ 
 గోవాలో మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మార్చి 16న జరిగిన బల నిరూపణలో నెగ్గింది. ఈ మేరకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బలం నిరూపించు కుంది. బీజేపీ నుంచి 12 మంది, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ఎంజీపీల నుంచి ముగ్గురు చొప్పున, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఎన్సీపీ సభ్యుడు కలిపి మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బలపరీక్ష నెగ్గిన మనోహర్ పరీకర్ 
ఎప్పుడు : మార్చి 16 
ఎక్కడ : గోవా శాసనసభలో 

టైమ్స్ ఆసియాలో ఐఐఎస్సీకి 27వ ర్యాంకు 
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో 2017లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్సీ ) 27వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు మార్చి 16న టీహెచ్‌ఈ వెల్లడించిన జాబితాలో ఐఐఎస్సీతో పాటు ఐఐటీ-బాంబే (42వ ర్యాంకు), తమిళనాడులోని వేల్-టెక్ యూనివర్సిటీ (43), ఐఐటీ-ఢిల్లీ (54), ఐఐటీ-మద్రాసు (62) ర్యాంకుల్లో నిలిచాయి. మొత్తంగా ఆసియాలోని టాప్-300 యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి 33 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. ఇందులో ఉస్మానియా, ఎస్వీయూ, ఆచార్య నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 
టీహెచ్‌ఈ ఆసియా ర్యాంకింగ్స్‌లో సింగపూర్ జాతీయ వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీహెచ్‌ఈ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ 2017 
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : టైమ్స్ గ్రూప్ 
ఎక్కడ : ఆసియా వ్యాప్తంగా

క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ లో మణిపాల్‌కు చోటు
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017లో మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ చోటు దక్కించుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ మార్చి 16న వివరాలను వెల్లడించారు. 2016లో ఫార్మకాలజీ విభాగంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో ఈ కళాశాల ప్రథమ స్థానం పొందింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్‌‌స 2017
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్‌కి చోటు

రాజీతోనే ఆయోధ్య వివాదం పరిష్కారం : సుప్రీం కోర్టు 
అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ మేరకు కేసును తర్వగా విచారించాలంటూ పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం మార్చి 21న ఈ సూచన చేసింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. 
వివాదాస్పద స్థలానికి సంబంధించిన 2.77 ఎకరాల్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై కోర్టు వెలుపల చర్చలకు సుప్రీం కోర్టు సూచన
ఎప్పుడు : మార్చి 21 
ఎవరు : సీజేఐ జగదీశ్ సింగ్ ఖేహర్ 
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య 
ఎందుకు : ఎన్నో ఏళ్లుగా ఉన్న వివాదం పరిష్కారం కోసం

ఉచిత గ్యాస్‌కు ఆధార్ తప్పనిసరి
 ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే నిరుపేద మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 8న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆధార్ లేనివారు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే 2017 ఖరీఫ్ సీజన్ నుంచి పంటల బీమా పొందే రైతులకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. 
మూడేళ్లలో ఐదు కోట్ల మంది నిరుపేద మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎంయూవైకి ఆధార్ తప్పనిసరి 
ఎప్పుడు : మార్చి 8 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

ఓన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ జాతికి అంకితం
గుజరాత్‌లోని ద హేజ్ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్)లో ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపాల్)ను ప్రధాని నరేంద్రమోదీ మార్చి 7న జాతికి అంకితం చేశారు. రూ.30,000 కోట్లతో నిర్మించిన ఈ ప్లాంటు దేశంలోనే అతిపెద్ద పెట్రో రసాయనాల ప్లాంటు అని ప్రధాని తెలిపారు. 2018 నాటికి దేశ పాలిమర్ రంగంలో ఓపాల్ వాటా 13 శాతానికి చేరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రసూతి సెలవుల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం 
ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు-2016కు లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ మేరకు మార్చి 9న కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. దీని ప్రకారం సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెరుగుతాయి. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే తొలి రెండు కాన్పులకే 26 వారాల ప్రసూతి సెలవులు వర్తిస్తాయి. మూడో కాన్పుకు 12 వారాలే ఇస్తారు. 
ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. తద్వారా మహిళలకు అత్యధిక ప్రసూతి సెలవులు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కెనడా (50 వారాలు), నార్వే (44 వారాల)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 
బిల్లులోని ఇతర అంశాలు 
చట్ట ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకునే, అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు.కనీసం 50 మంది పనిచేస్తున్న సంస్థలు నిర్ధారిత దూరంలో పిల్లల సంరక్షణ కేంద్రాన్ని (క్రెచ్) ఏర్పాటు చేయాలి. తల్లి రోజులో 4 సార్లు అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలి.క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు-2016కు లోక్‌సభ ఆమోదం
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : కేంద్ర కార్మిక శాఖ
ఎందుకు : పసూతి సెలవులను 26 వారాలకు పెంచేందుకు 

అవినీతి పెండింగ్ కేసులు రైల్వేలోనే అధికం 
ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉందని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తెలిపింది. మార్చి 10న వెల్లడైన ఈ వివరాల ప్రకారం రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై 193 కేసులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైల్వేలో పెండింగ్ అవినీతి కేసులు అధికం 
ఎప్పుడు : మార్చి 10 
ఎవరు : కేంద్ర విజిలెన్స్ కమిషన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు - 2017
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మార్చి 12న వెలువడ్డాయి. యూపీలో 403 స్థానాలకు గాను బీజేపీ 312 స్థానాల్లో గెలుపొందింది. మిత్రపక్షాలైన అప్నాదళ్, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) సీట్లతో కలుపుకుంటే ఆ సంఖ్య 325. ఎస్పీ-కాంగ్రెస్ 54, బీఎస్పీ 19 స్థానాలకే పరిమితమయ్యాయి. 1977లో జనతాపార్టీ యూపీలో అత్యధికంగా 352 సీట్లను గెల్చుకుంది. 
పంజాబ్‌లో కాంగ్రెస్ 77 స్థానాలు సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోగా ఉత్తరాఖండ్‌లో బీజేపీ (56 సీట్లు) ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. గోవా, మణిపూర్‌లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. 
మణిపూర్‌లో సీఎం ఇబోబిసింగ్‌పై పోటీ చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల ఓడిపోయారు. ఆమెకు కేవలం 90 ఓట్లే వచ్చాయి. దీంతో రాజకీయాల నుంచి వెదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. 
ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇరోమ్ షర్మిల 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలియన్స్ (పీఆర్‌జేఏ) పార్టీ స్థాపించారు. 
రాష్ట్రాల వారీగా ఫలితాలు 

ఉత్తరప్రదేశ్ ( మొత్తం సీట్లు 403 )

పార్టీ

2017లో సీట్లు

ఓట్ల శాతం

2012లో సీట్లు

బీజేపీ

312

39.7 శాతం

47

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)

47

21.8శాతం

224

కాంగ్రెస్

07

6.2శాతం

28

బీఎస్పీ

19

22.2 శాతం

80

ఆర్‌ఎల్డీ

01

1.8శాతం

09

ఉత్తరాఖండ్ ( మొత్తం సీట్లు 70)

పార్టీ

2017లో సీట్లు

ఓట్ల శాతం

2012లో సీట్లు

బీజేపీ

57

46.5

31

కాంగ్రెస్

11

33.5

32

బీఎస్పీ

00

7.0

03

యూకేకేడీ

00

0.7

01

మణిపూర్ ( మొత్తం సీట్లు 60)

పార్టీ

2017లో సీట్లు

ఓట్ల శాతం

2012లో సీట్లు

బీజేపీ

21

36.3

00

కాంగ్రెస్

28

35.1

42

టీఎంసీ

01

1.4

07

ఎస్‌పీఎఫ్

04

7.2

04

ఎన్‌పీపీ

04

5.1

00

ఎల్‌జేపీ

01

2.5

01

ఎన్‌సీపీ

00

1.0

01

పంజాబ్ ( మొత్తం సీట్లు 117)

పార్టీ

2017లో సీట్లు

ఓట్ల శాతం

2012లో సీట్లు

బీజేపీ

03

5.4

12

కాంగ్రెస్

77

38.5

46

ఆప్

20

23.7

--

ఎస్‌ఏడీ

15

25.2

56

గోవా ( మొత్తం సీట్లు 40 )

పార్టీ

2017లో సీట్లు

ఓట్ల శాతం

2012లో సీట్లు

బీజేపీ

13

32.5

21

కాంగ్రెస్

17

28.4

09

జీపీఎఫ్

03

3.5

-

ఎంజీపీ

03

11.3

03

జీవీపీ

0

0.6

02

ఎన్‌సీపీ

01

2.3

-


తమిళనాడు జిల్లా మేజిస్ట్రేట్ పర్యావరణ తీర్పు
బెయిల్‌పై విడుదలయ్యే వారు తప్పనిసరిగా వంద తుమ్మచెట్లు నరకాలని తమిళనాడులోని అరియలూరు జిల్లా న్యాయస్థానం మార్చి 15న వినూత్న తీర్పు ఇచ్చింది. బెయిల్‌పై వచ్చినవారు చెట్లు నరికినట్లుగా గ్రామ నిర్వాహక అధికారి నుంచి నివేదిక తీసుకుని సమర్పించాలని సూచించింది. 
గత కొన్నేళ్లలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా తుమ్మ చెట్లు విసృ్తతంగా పెరిగాయి. వీటి వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటడంతో పాటు గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీనిపై స్పందించిన మద్రాసు హైకోర్టు, మదురై హైకోర్టు బెంచ్‌లు భూగర్భజలాల పరిరక్షణ కోసం తుమ్మ చెట్లను తొలగించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాయి. దీంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అరియలూరు కోర్టు ఈ విషయంలో పర్యావరణ అనుకూల తీర్పుచెప్పింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెయిల్‌పై వస్తే వంద తుమ్మ చెట్లు కొట్టాలన్న కోర్టు 
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : అరియలూరు జిల్లా న్యాయస్థానం 
ఎక్కడ : తమిళనాడు
ఎందుకు : రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన తుమ్మచెట్లను తగ్గించేందుకు 

శత్రు ఆస్తుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
1968 నాటి శత్రు ఆస్తుల (Enemy Properties) చట్టంలో సవరణలకు లోక్‌సభ మార్చి 14న ఆమోదం తెలిపింది. ఈ మేరకు సభలో ప్రవేశపెట్టిన శత్రు ఆస్తుల (సవరణ, చెల్లుబాటు) బిల్లు - 2016 మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీని ప్రకారం దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనాకు తరలివెళ్లిన వారి వారసులకు భారత్‌లో వదిలివెళ్లిన ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. అలాగే ఇక నుంచి ఈ ఆస్తులు ‘Custodian of Enemy Properties of India’ విభాగం అధీనంలో ఉంటాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : శత్రు ఆస్తుల (సవరణ, చెల్లుబాటు) బిల్లు - 2016కు లోక్‌సభ ఆమోదం 
ఎప్పుడు : మార్చి 14 
ఎందుకు : దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనాకు వెళ్లిన వారికి భారత్‌లో ఉన్న ఆస్తులపై హక్కు లేకుండా చేసేందుకు

రద్దయిన పాత నోట్లు పది కంటే ఎక్కువుంటే జరిమానా 
 రద్దయిన రూ. 500, రూ. 1,000 నోట్లను 10 కంటే ఎక్కువ కలిగి ఉంటే ఇకపై జరిమానా పడుతుంది. ఈ మేరకు ఇలా కలిగి ఉండటాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ కేంద్రం తీసుకొచ్చిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్(సెసెషన్ ఆఫ్ లయబిలిటీస్) బిల్లు-2017కు ఫిబ్రవరి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీంతో అదే రోజు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది.

చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.10 వేలు, లేదా కలిగి ఉన్న నోట్ల ముఖ విలువకు ఐదు రెట్లు, వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. అధ్యయనం, పరిశోధన కోసం 25 నోట్ల వరకు ఉంచుకోవచ్చు.

రిషికేశ్‌లో 29వ అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ 
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 29వ అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ మార్చి 1న ప్రారంభమైంది. గంగానది ఒడ్డున వారం రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉద్దేశించి మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యోగా ఫెస్టివల్‌లో వెయ్యి మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 29వ అంతర్జాతీయ యోగా ఫెస్టివల్
ఎప్పుడు : మార్చి 1 - 7
ఎక్కడ : రిషికేశ్ (ఉత్తరాఖండ్)
ఎవరు : కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ, పరమార్థ్ నికేతన్ 

తమిళనాడులో కోలా, పెప్సీలపై నిషేధం
విదేశీ సంస్థలైన కోకా కోలా, పెప్సీ శీతల పానీయాల అమ్మకాలను నిషేధించాలని తమిళనాడు వర్తక సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిషేధాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అమెరికా సంస్థ అయిన పెటా వల్లే జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించిందన్నది తమిళనాడు వర్తక సంఘం ఆరోపణ. అందుకే అమెరికాకు చెందిన కోకా కోలా, పెప్సీ శీతల పానీయాలను రాష్ట్రంలో నిషేధించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

గ్రామాల్లో లింగ నిష్పతి 1,009
2015-16 నాటికి దేశ వ్యాప్త లింగ నిష్పత్తి (ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 991గా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 1,009గా తేలింది. ఈ మేరకు 2015-16 సంవత్సరానికి నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 4 (NFHS-4) ఈ వివరాలు వెల్లడించింది. 

లింగనిష్పత్తి వివరాలు 
జనన సమయంలో లింగనిష్పత్తి దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 914 నుంచి 919కి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో 899గా నమోదైంది.ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో లింగనిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో 1,018కాగా పట్టణ ప్రాంతాల్లో 1,027 గా నమోదైంది. అదే జనన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 880 కాగా, పట్టణ ప్రాంతాల్లో 1,010 గా నమోదైంది.తెలంగాణ మొత్తం జనాభాలో లింగనిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో 1,035కాగా పట్టణ ప్రాంతాల్లో 976 గా నమోదైంది. అదే జనన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 865 కాగా, పట్టణ ప్రాంతాల్లో 884 గా నమోదైంది.హరియాణాలో జనన సమయంలో లింగ నిష్పత్తి 762 (2005-06) నుంచి 836కి పెరిగింది. అక్కడి గ్రామాల్లో మాత్రం ఇది 785కే పరిమితమైంది.
ప్రపంచంలోనే ఉన్న సింహాల్లో 70 శాతం భారత్‌లోనే
ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 3న న్యూఢిల్లీలో ప్రపంచ వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ దవే మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మొత్తం సింహాల్లో 70 శాతం మేర భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. సుమారు దేశంలో 2400 సింహాలు ఉన్నాయని తెలిపారు.

కేంద్ర, సమగ్ర జీఎస్‌టీ బిల్లల ముసాయిదాకు ఆమోదం 
కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ), సమగ్ర జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) బిల్లుల తుది ముసాయిదాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ (11వ సమావేశం) జీఎస్టీ పరిధి నుంచి రైతులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం వ్యవసాయదారులు జీఎస్టీ కింద నమోదు కావాల్సిన అవసరం లేదు. ఏడాదికి రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులకు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. జీఎస్టీ ముసాయిదా చట్టంలో 40 శాతం వరకు పన్ను (కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం) విధించాలన్న నిబంధన ఉంటుందని, అయితే అమల్లోకి వచ్చే సగటు పన్ను రేట్లు గతంలో ఆమోదించిన 5, 12, 18, 28 శాతాలుగానే ఉంటాయని కేంద్రం పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ నుంచి రైతులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు 
ఎప్పుడు : మార్చి 4న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
ఎవరు :కేంద్ర ప్రభుత్వం 

అత్తారీలో దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం 
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన అత్తారీలో దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకాన్ని మార్చి 5న ఆవిష్కరించారు. స్తంభం పొడవు 110 మీటర్లు (360 అడుగులు) కాగా బరువు 55 టన్నులు. జెండా పొడవు 120 అడుగులు, వెడల్పు 80 అడుగులు. పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి కూడా జెండాను చూడొచ్చు.

మొదట జార్ఖండ్ రాజధాని రాంచీలో దేశంలోనే ఎత్తయిన జాతీయ జెండాను (293 అడుగులు) నెలకొల్పారు. ఈ ఘనతను అధిగమిస్తూ తెలంగాణలోని హైదరాబాద్‌లో 300 అడుగుల ఎత్తయిన స్తంభం ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ :అత్తారీ (అమృత్‌సర్, పంజాబ్)
ఎవరు : పంజాబ్ ప్రభుత్వం 

తొలి ప్లాస్టిక్ రహిత నగరంగా తిరువనంతపురం 
కేరళ రాజధాని తిరువనంతపురం దేశంలోనే తొలి ప్లాస్టిక్ రహిత నగరంగా నిలవనుంది. ఈ మేరకు నగర పాలక పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై మార్చి 1 నుంచి నిషేధాన్ని విధించింది. ఇకపై నగరంలో నిర్వహించే ఏ వేడుక, ఉత్సవంలోనూ ప్లాస్టిక్‌తో తయారయ్యే సంచులు, ప్లేట్లు, గ్లాసులు, పాలిథీన్ కవర్లను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ప్లాస్టిక్ రహిత నగరం 
ఎప్పుడు : మార్చి 1 
ఎక్కడ :తిరువనంతపురం (కేరళ)
ఎవరు :తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్

పంచాయతీల్లో లింగ సమానత్వానికి కేబినెట్ ఆమోదం
పంచాయతీల్లో మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా భారత్-ఐక్యరాజ్యసమితి మధ్య జరిగిన అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ (మంత్రిత్వ శాఖ) ద్వారా పాలనా సంస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఎన్నికై న మహిళా ప్రతినిధుల సామర్థ్య నిర్మాణానికి, సాధికారత కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడతారు. మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నిర్ణయాలను అమలు చేస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-ఐరాస లింగ సమానత్వ ఒప్పందానికి కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

ఐఐఎస్సీకి ప్రపంచ ఎనిమిదో ర్యాంకు
యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) మార్చి 6న ప్రకటించిన ఉత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్‌‌సలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్సీ) 8వ ర్యాంకు సాధించింది. 2017లో ‘ఉత్తమ చిన్న విశ్వవిద్యాలయాలు’ విభాగంలో ఐఐఎస్సీకి ఈ ర్యాంకు దక్కింది. తద్వారా ప్రపంచ టాప్ 10 యూనివర్సిటీలో జాబితాలో తొలిసారి స్థానం దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయంగా ఐఐఎస్సీ గుర్తింపు పొందింది. 5 వేల మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలను చిన్న వర్సిటీలుగా పరిగణిస్తారు. 

మొదటి మూడు స్థానాల్లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా), ఎకోలే నార్మలే సుపీరియర్ (ఫ్రాన్‌‌స), పొహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (దక్షిణ కొరియా)లు ఉన్నాయి. 2015-16లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో టీహెచ్‌ఈ ప్రకటించిన టాప్ 100 వర్సిటీల్లో దేశం నుంచి మొదటి సారి ఐఐఎస్సీ చోటు దక్కించుకొని 99వ స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీహెచ్‌ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐఎస్సీకి 8వ ర్యాంకు
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : టైమ్స్ గ్రూప్ 

వర్క్ ఫ్రం హోమ్ ప్రారంభించిన ఎస్‌బీఐ
ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తూ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) మార్చి 7న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అత్యవసర సమయాల్లో మొబైల్ పరికరాల ద్వారా ఇంటి నుంచే విధులు నిర్వర్తించేందుకు తోడ్పడే ఈ విధానాన్ని బ్యాంక్ బోర్డు ఇటీవలే ఆమోదించింది. ఇందుకోసం ఉపయోగించే మొబైల్ డివైజ్‌లలోని యాప్స్, డేటా సురక్షితంగా ఉండేలా మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీలను వినియోగించుకోనుంది. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, ఫిర్యాదుల పరిష్కార అప్లికేషన్‌‌స మొదలైన వాటిని కూడా వర్క్ ఫ్రం హోమ్ సర్వీసుల్లో పొందుపర్చనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

దేశంలో మహిళల కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాంకు ఐసీసీఐ. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వర్క్ ఫ్రం హోమ్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 7 
ఎవరు :భారతీయ స్టేట్ బ్యాంక్

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2017 జాతీయం
‘ఉడాన్’ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ 
ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలకు ఉద్దేశించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ మేరకు పథకంలోని తొలి సర్వీసు ( షిమ్లా - ఢిల్లీ ) ను ఏప్రిల్ 27న జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు కడప- హైదరాబాద్, నాందేడ్- హైదరాబాద్ రూట్లలో కూడా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. 
ఉడాన్ పథకం కింద విమానయాన టికెట్ల ధరల గరిష్ట పరిమితి రూ. 2,500గా ఉంటుంది. మార్కెట్ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రాంతీయంగా కనెక్టివిటీని పెంచే దిశగా చేపట్టిన ఉడాన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్ట మొదటిదని ప్రధాని కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉడాన్ పథకం ప్రారంభం 
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 
ఎక్కడ : షిమ్లా
ఎందుకు : ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలకు 

ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం 
ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మేరకు ఏప్రిల్ 26న వెలువడిన ఫలితాల్లో బీజేపీ 181 వార్డులను గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 48 వార్డులు, కాంగ్రెస్ 30 వార్డుల్లో గెలుపొందాయి. ఢిల్లీ కార్పోరేషన్‌లో మొత్తం 272 వార్డులు ఉండగా 270 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : 181 వార్డుల్లో బీజేపీ విజయం 
ఎక్కడ : ఢిల్లీలో 

పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 136వ ర్యాంకు 
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ 2016లో 133వ స్థానంలో ఉన్న భారత్ 2017 నివేదికలో మరో 3 ర్యాంకులు దిగజారి 136 స్థానంలో నిలచింది. ఈ మేరకు రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ అనే సంస్థWorld Press Freedom Index - 2017ను ఏప్రిల్ 26న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రష్యా, భారత్, చైనా సహా 72 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదకర స్థితిలో ఉంది. 
మొత్తం 180 దేశాలతో రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌లో నార్వే తొలి స్థానంలో ఉండగా స్వీడన్ 2, ఫిన్లాండ్ 3వ స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియా అట్టడుగున 180వ స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : World Press Freedom Index - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ 
ఎక్కడ : 136వ స్థానంలో భారత్ 

హౌరా-కోల్‌కత్తా మధ్య తొలి నీటి సొరంగం
దేశంలోనే తొలి నీటి సొరంగ మార్గం కోల్‌కత్తాలోని హూగ్లీ (గంగా) నదిలో నిర్మితమవుతోంది. హౌరా - కోల్‌కత్తా నగరాలను అనుసంధానం చేసే ఈస్ట్ వెస్ట్ మెట్రో కోసం నిర్మిస్తోన్న ఈ భారీ సొరంగ మార్గం 2017 జూలై నాటికి పూర్తికానుంది. మొత్తం 10.8 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని భారీ టన్నెల్ బోరింగ్ యంత్రంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 8,900 కోట్లు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో తొలి నీటి సొరంగ మార్గం 
ఎప్పుడు : 2017 జూలై నాటికి
ఎవరు : ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రా 
ఎక్కడ : కోల్‌కత్తాలో 
ఎందుకు : హౌరా - కోల్‌కత్తా మధ్య మెట్రో కోసం 

అబూజ్‌మడ్ తొలి రెవెన్యూ సర్వే ప్రారంభం
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన అబూజ్‌మడ్ ప్రాంతంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా రెవెన్యూ సర్వే జరుగుతోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా భూ రికార్డుల్ని రూపొందిస్తారు. దీంతో అక్కడి 237 గ్రామాల్లోని స్థానిక తెగల వారైన 35 వేలమందికి భూ పట్టాలు లభిస్తారుు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూర్కీ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా కారణాల వల్ల ఇప్పటివరకు ఇక్కడ రెవెన్యూ సర్వే చేపట్టలేదు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అబూజ్‌మడ్ తొలి రెవెన్యూ సర్వే ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 
ఎక్కడ : నారాయణ్‌పూర్ జిల్లాలో

2024 నుంచి జమిలి ఎన్నికలకు నీతి ఆయోగ్ సూచన 
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 2024 నుంచి ఒకేసారి ఎన్నికలు జరపాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ మేరకు పరిపాలనకు ఎన్నికల ప్రచారంతో ఇబ్బంది కలగకుండా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేసారి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా(2017-2020) ముసాయిదాలో పేర్కొంది. 
ముసాయిదాలో ప్రతిపాదనలు 

జమిలి ఎన్నికల ప్రతిపాదన అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును గరిష్టంగా ఒకసారి తగ్గించడం కానీ, పొడిగించడం గానీ చేయాలని సూచించింది.

రోడ్ మ్యాప్ కోసం రాజ్యంగ నిపుణులు, మేధావులు, ప్రభుత్వాధికారులు, పార్టీల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా ఒక నివేదికను ఖరారు చేయాలి.

రాజ్యాంగ, చట్ట సవరణలు, జమిలి ఎన్నికలకు మారడానికి ఆచరణ సాధ్యమైన విధానం వంటి వాటిని పరిశీలించి, 2018 మార్చి నాటికి బ్లూ-ప్రింట్‌ను సిద్ధం చేయాలి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 3 ఏళ్ల కార్యాచరణ ఎజెండా (2017-2020)
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : 2024 నుంచి జమిలి ఎన్నికల నిర్వహణకు సూచన 

ఆసియా పసిఫిక్ ప్రాంతాల జాబితాలో ముంబై, చెన్నై 
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 పర్యాటక ప్రాంతాల జాబితాలో ముంబై, చెన్నై స్థానం దక్కించుకున్నాయి. చెన్నై (52 లక్షల మంది పర్యాటకుల రాకతో) 14వ స్థానాన్ని, ముంబై(49 లక్షల మంది పర్యాటకులతో) 15వ స్థానంలో నిలిచాయి. ఏప్రిల్ 26న విడుదల చేసిన మాస్టర్‌కార్‌‌డ ఆసియా పసిఫిక్ పర్యాటక ప్రాంతాలు-2017 జాబితా ప్రకారం 2016లో దాదాపు 34 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 22 దేశాల్లో గల 171 పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. వీరిలో ఎక్కువ మందికి బ్యాంకాక్ గమ్యస్థానంగా మారింది. రెండు, మూడు స్థానాల్లో సింగపూర్, టోక్యో నిలిచాయి.

ఆవులకూ ఆధార్ తరహా గుర్తింపు సంఖ్య
దేశంలోని అన్ని ఆవులకు, వాటి సంతతికి ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు (యూఐడీ) సంఖ్య కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఏప్రిల్ 24న తెలిపింది. బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా జరుగుతున్న పశువుల స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు వాటికి యూఐడీ ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ.. ట్యాంపర్ చేయడానికి వీల్లేని పాలీయురేథేన్ (ప్లాస్టిక్) ట్యాగులను పశువులకు జోడించాలని సూచించింది.

బాబ్రి కేసులో విచారణ కొనసాగించాలి: సుప్రీంకోర్టు
 బాబ్రి మసీదు కూల్చివేత కేసులో బీజీపే అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా మరో 16 మందిపై విచారణ కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏప్రిల్ 19న తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లక్నోలోని ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని అప్పటి వరకూ న్యాయమూర్తిని బదిలీ చేయరాదని తీర్పులో పేర్కొంది. 
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కల్యాణ్‌సింగ్ ప్రస్తుతం రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్నందున విచారణ నుంచి ప్రస్తుతం ఆయనకు మినహాయింపు లభించింది. పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయనపైనా విచారణ జరగనుంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం తెలిసిందే. బీజేపీ నేతల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అడ్వాణీతో పాటు 21 మందిపై కుట్ర అభియోగాలను అలహాబాద్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాబ్రీ కేసులో విచారణ కొనసాగించాలని సీబీఐకి ఆదేశం 
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : సుప్రీం కోర్టు 
ఎక్కడ : లక్నో ట్రయల్ కోర్టులో 
ఎందుకు : 2 ఏళ్లలో విచారణ పూర్తి చేసేందుకు

వీవీఐపీల కార్లపై ఎర్రబుగ్గల తొలగింపు 
వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఏప్రిల్ 19న కేంద్ర కేబినెట్ నిశ్చయించింది. అంబులెన్‌‌సలు, అగ్నిమాపక వాహనాలతోపాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. 
ఇప్పటికే వీఐపీ వాహనాలకు బుగ్గలు, సైరన్లు లేని విధానాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బుగ్గ కార్ల సంస్కృతికి స్వస్తి 
ఎప్పుడు : మే 1 నుంచి 
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

స్టెంట్లను అత్యవసర క్లాజులో చేర్చిన కేంద్రం
హృద్రోగులకు అమర్చే స్టెంట్లను నిరంతరం సరఫరా చేయాలని తయారీదారులను ఆదేశించిన కేంద్రం, వాటిని అత్యవసర క్లాజు కింద చేరుస్తూ ఏప్రిల్ 25న నిర్ణయం తీసుకుంది. ఇటీవల మెడ్‌ట్రానిక్, అబాట్ లాంటి బహుళజాతి సంస్థలు తమ స్టెంట్లను భారత్ నుంచి ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరడంతో ఫార్మాసూటికల్ విభాగం (డీఓపీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులు-2013 ప్రకారం ప్రజా ప్రయోజనాల నిమిత్తం స్టెంట్లను అత్యవసర క్లాజులో చేర్చింది. ఈ నిబంధనలు ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యవసర క్లాజులోకి స్టెంట్ల సరఫరా 
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : స్టెంట్లను అందుబాటులో ఉంచేందుకు 

ప్రముఖుల పేర్లపై సెలవులను రద్దు చేసిన యూపీ 
ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రకటిస్తున్న 15 ప్రభుత్వ సెలవులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖుల జయంతి, వర్ధంతి రోజున పాఠశాలలకు సెలవులు ఇవ్వడానికి బదులు వారి గురించి రెండు గంటల పాటు విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం వివరించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ రోజుల్లో సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖుల పేర్లపై సెలవులు రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 
ఎందుకు : పాఠశాలల పనిదినాలు పెంచడానికి 

అంధత్వ నిర్ధారణ ప్రమాణాల్లో మార్పు 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా భారత్ అంధత్వ నిర్ధారణ నిర్వచనాన్ని మార్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 19న ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 3 మీటర్ల దూరం నుంచి చేతి వేళ్లను సరిగా లెక్కించలేని వారికి అంధత్వం ఉన్నట్లు భావిస్తారు. ఇప్పటి వరకు (1976 నుంచి) ఈ దూరం 6 మీటర్లుగా ఉండేది.

గోవా రాష్ట్ర వృక్షంగా కొబ్బరి చెట్టు
గోవా రాష్ట్ర వృక్షంగా కొబ్బరి చెట్టును ప్రకటించనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ ఏప్రిల్ 22న వెల్లడించారు. గత ప్రభుత్వం కొబ్బరి చెట్టును వృక్షాల జాబితా నుంచి తొలగించింది. ఆ నిర్ణయాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు.

జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం 
 ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన జీఎస్టీ అనుబంధ బిల్లులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు సీజీఎస్టీ, ఐజీఎస్టీ, రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులకు ఏప్రిల్ 13న ఆయన ఆమోదం తెలిపారు. కొత్త పన్నుల విధానం అమలులోకి రావాలంటే ఈ బిల్లులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీలు ఆమోదం తెలపాలి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ బిల్లులకు ఆమోదం 
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 
ఎందుకు : దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కోసం

ఆపరేషన్ క్లీన్ మనీ రెండో దశ ప్రారంభం 
నల్లధన అక్రమార్కులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ఏప్రిల్ 14న ప్రారంభించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో 1,300 మంది అత్యంత అనుమానిత వ్యక్తులతో సహా 60 వేల మందికి పైగా వ్యక్తులు, సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వారందరికీ నోటీసులు పంపనుంది. 
2017 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో ఐదు లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన 17 లక్షలకు పైగా అనుమానిత ఖాతాదారులకు ఐటీ శాఖ ఎస్సెమ్మెస్ - ఈ మెయిల్స్ పంపించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆపరేషన్ క్లీన్ మనీ -2 ప్రారంభం 
ఎప్పుడు : ఏప్రిల్ 14 
ఎవరు : కేంద్ర ఆదాయ పన్నుల శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : నల్లధన అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు 

భీమ్-ఆధార్ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ‘భీమ్-ఆధార్’ యాప్‌ను ఏప్రిల్ 14న నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. ఆధార్ కార్డులోని వేలిముద్రల సాయంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడానికీ, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికీ ఈ యాప్ ఉపకరిస్తుంది.
భీమ్ యాప్‌కు అనుసంధానంగా మరో రెండు పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. ఇందులో ఒకటి క్యాష్ బ్యాక్ పథకం కాగా మరొకటి రిఫరల్ బోనస్ (ఇతరులకు యాప్‌ను సూచిస్తే రూ. 10 నగదు ప్రోత్సాహం) పథకం. ఈ రెండింటి కింద రూ.495 కోట్లను ప్రోత్సాహకంగా ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భీమ్-ఆధార్ యాప్ ప్రారంభం 
ఎప్పుడు : ఏప్రిల్ 14 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : నాగ్‌పూర్, మహారాష్ట్ర
ఎందుకు : డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 

లక్కీ గ్రాహక్‌లో రూ. కోటి గెలుచుకున్న శ్రద్ధా మోహన్ 
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ పథకం మెగా డ్రాలో మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా మోహన్ మంగ్షెటే కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 14న నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆమె ఈ బహుమతి అందుకున్నారు. ఈ పథకంలో రెండో బహుమతిని (రూ.50 లక్షలను) గుజరాత్ ఖంభట్‌కు చెందిన హార్దిక్ కుమారు గెలుచుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లక్కీ గ్రాహక్ మెగా డ్రా 
ఎప్పుడు : ఏప్రిల్ 14 
ఎవరు : రూ. కోటి గెలుచుకున్న శ్రద్ధా మోహన్ 
ఎక్కడ : మహారాష్ట్ర 
ఎందుకు : డిజిటల్ లావాదేవీలు జరిపినందుకు 

నేపాల్, చైనా తొలి ఉమ్మడి సైనిక విన్యాసాలు 
నేపాల్, చైనా దేశాల తొలి ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏప్రిల్ 16న ఖాట్మాండులో ప్రారంభమయ్యాయి. సగర్‌మఠ ఫ్రెండ్‌షిప్ 2017 పేరుతో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం ఏప్రిల్ 25 వరకూ కొనసాగనుంది. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు రెండు దేశాలు ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. 
ఎవరెస్టు శిఖరాన్ని నేపాలీ భాషలో సగర్‌మఠ్ అని పిలుస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సగర్‌మఠ్ ఫ్రెండ్‌షిప్ 2017 సైనిక విన్యాసాలు 
ఎప్పుడు : ఏప్రిల్ 16 - ఏప్రిల్ 25 
ఎవరు : నేపాల్ , చైనా 
ఎక్కడ : ఖాట్మాండులో 
ఎందుకు : తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 

ఆగ్రా విమానాశ్రయానికి దీన్‌దయాళ్ పేరు
ఆగ్రా విమానాశ్రయానికి ఆరెస్సెస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గోరఖ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో నిర్మిస్తున్న సివిల్ టెర్మినల్‌కు మహాయోగి గోరఖ్‌నాథ్ పేరు పెట్టనున్నారు. ఏప్రిల్ 18న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆగ్రా విమానశ్రయానికి దీన్‌దయాళ్ పేరు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

ప్రధానితో అమెరికా జాతీయ సలహాదారు భేటీ
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ ఏప్రిల్ 18న ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడం, ప్రాంతీయ శాంతి భద్రతల్లో స్థిరత్వం నెలకొల్పడం వంటి అంశాలపై ఇరువురు చర్చించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక భారత్ పర్యటనకు వచ్చిన యూఎస్ తొలి ఉన్నతస్థాయి అధికారి మెక్‌మాస్టర్. ఒబామా ప్రభుత్వం గత డిసెంబర్‌లో భారత్‌కు ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను కల్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భారత పర్యటన
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్
ఎక్కడ : ఢిల్లీ

‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంతో అపార నష్టం’
యమునా తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం కారణంగా అపార నష్టం జరిగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిపుణుల కమిటీ ఏప్రిల్ 12న వెల్లడించింది. ఉత్సవం కారణంగా నదీ తీరప్రాంతం ధ్వంసమవడంతోపాటు నదికి ఎడమ వైపు దాదాపు 300 ఎకరాలు, కుడి వైపు 120 ఎకరాలు.. మొత్తం 420 ఎకరాల ముంపు ప్రాంతంపై పర్యావరణ పరంగా తీవ్ర ప్రభావం పడిందని కమిటీ పేర్కొంది.

రైల్వే డెవలప్‌మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదం 
 రైల్వే డెవలప్‌మెంట్ అథారిటికీ కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 5న ఆమోదం తెలిపింది. ఇది రైల్వే రంగంలో అతిపెద్ద సంస్కరణని ప్రభుత్వం పేర్కొంది. రైల్వే వ్యవస్థలోని లోటుపాట్లను పరిష్కరించటం, టికెట్ రేట్లను నిర్ణయించటం, ప్రయాణికుల సౌకర్యం, ల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులు, పారదర్శకత పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైల్వే డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం 
ఎప్పుడు : ఏప్రిల్ 5 
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : రైల్వే రంగంలో సంస్కరణల కోసం 

జీఎస్టీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం 
వస్తు, సేవల పన్ను బిల్లు - జీఎస్టీకి సంబంధించిన నాలుగు అనుబంధ బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ మేరకు కేంద్ర జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ) 2017, సమీకృత జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ) 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ బిల్లు(యూటీజీఎస్టీ) 2017ను ఏప్రిల్ 6న రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్జీఎస్టీ) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అనుబంధ బిల్లులకు ఆమోదం 
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కోసం 

భారత్‌లో 25 శాతం మంది పిల్లల్లో కుంగుబాటు 
భారత్‌లోని 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ప్రతి నలుగురిలో ఒకరు (25 శాతం మంది) కుంగుబాటుకు లోనవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2012లో భారత్‌లో 15-29 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి లక్ష మందిలో ఆత్మహత్యల రేటు 35.5గా ఉంది. 
2017 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ : DEPRESSION : LETS TALK
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ కుంగుబాటు నివేదిక - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ 
ఎందుకు : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 

దేశవ్యాప్తంగా వినియోగంలోకి బీఎస్-4 ఇంధనం 
దేశవ్యాప్తంగా బీఎస్-4 ఇంధన వినియోగం 2017 ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. బీఎస్-3 తో పోలిస్తే బీఎస్-4 ఇంధనలో సల్ఫర్ శాతం తక్కువగా ఉంటుంది. ఇంధనంలో ఈ మార్పులతో వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల శాత ం తగ్గుతుంది. 
భారత్‌లో 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను సుప్రీంకోర్టు ఇటీవలే నిషేధించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమల్లోకి బీఎస్-4 ఇంధన వినియోగం 
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : భారత ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 

250 ఏళ్లు పూర్తి చేసుకున్న సర్వే జనరల్ ఆఫ్ ఇండియా
దేశంలో పౌర, సైనిక అవసరాలకు మ్యాపుల్ని రూపొందించే సర్వే జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఐ) ఏప్రిల్ 10న 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశ, రాష్ట్రాల సరిహద్దులు, నదులు, డ్యాములు, రోడ్లు, వరద ప్రభావిత మైదాన ప్రాంతాలు, వివిధ స్థలాకృతులతో పాటు పట్టణ, నగర ప్రణాళిక మ్యాపుల్ని రూపొందించడం ఎస్‌జీఐ విధి. దీనిని 1767లో స్థాపించారు. 
ఎస్‌జీఐ విశేషాలు 

1783లో ఎస్‌జీఐ తొలిసారి అవిభక్త భారత పటాన్ని ‘మ్యాప్ ఆఫ్ హిందుస్తాన్’ గా విడుదల చేసింది.1802లో ఎస్‌జీఐ ‘ట్రిగొనమెట్రిక్ సర్వే’ను జరిపింది. మద్రాసు రాష్ట్రంలోని సెయింట్ థామస్ పర్వతం నుంచి ముస్సోరీ వరకూ 40 ఏళ్ల పాటు ఈ సర్వే సాగింది.ప్రస్తుతం ఎస్‌జీఐ సైన్యం కోసం జియో స్పేషియల్ (భౌగోళిక) మ్యాపుల్ని తయారుచేస్తోంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 250 ఏళ్లు పూర్తి చేసుకున్న సర్వే జనరల్ ఆఫ్ ఇండియా
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎందుకు : దేశంలో పౌర, సైనిక అవసరాలకు మ్యాపుల్ని రూపొందించేందుకు

న్యూఢిల్లీలో జాతీయ పర్యావరణ సదస్సు
క్యాపిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఏప్రిల్ 10న జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన నలుగురు పర్యావరణ వేత్తలకు క్యాపిటల్ ఫౌండేషన్ పర్యావరణ అవార్డులు ప్రదానం చేశారు. 
అవార్డు గ్రహీతలు 
జస్టిస్ కుల్దీప్ సింగ్ జాతీయ అవార్డు - జస్టిస్ స్వతంత్రకుమార్, ఎన్జీటీ ఛైర్మన్ 
ప్రొఫెసర్ టి.శివాజీ రావ్ జాతీయ అవార్డు - ప్రొఫెసర్ ధర్మేంద్ర సింగ్
వార్షిక అవార్డులు - దిలీప్ రే( మే ఫెయిర్ గ్రూప్ హోటల్స్ సీఎండీ), రాకేష్ మల్హోత్రా (సింబోటిక్ సైన్‌‌స సంస్థ చైర్మన్ ) 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేపిటల్ ఫౌండేషన్ పర్యావరణ అవార్డులు 
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : కేపిటల్ ఫౌండేషన్ 
ఎక్కడ : న్యూఢిల్లీ 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 

మోటార్ వాహనాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
మోటార్ వాహనాల బిల్లు (సవరణ)-2016కు లోక్‌సభ ఏప్రిల్ 10న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు తెస్తూ కేంద్రం ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టింది.
మద్యం సేవించి వాహనాలు నడపటం, ఓవర్ లోడింగ్, అతి వేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో రహదారి ప్రమాదాల ద్వారా సంభవించే మరణాలను 50 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోటార్ వాహనాల సవరణ బిల్లు - 2016కి ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : లోక్‌సభ 
ఎందుకు : రహదారి నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు 

జాతీయ ఓబీసీ కమిషన్ బిల్లుకి లోక్‌సభ ఆమోదం 
రాజ్యాంగ హోదాతో కొత్త జాతీయ ఓబీసీ కమిషన్ (ఎన్‌సీఎస్‌ఈబీసీ) ఏర్పాటుకు ఉద్దేశించిన 102వ రాజ్యాంగ సవరణ బిల్లు - 2017కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 10న కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకి అనుకూలంగా 360 మంది సభ్యులు ఓటు వేశారు.
మొత్తం ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయనున్న ఎన్‌సీఎస్‌ఈబీసీలో ఒక మహిళకూ చోటు కల్పించనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఓబీసీ కమిషన్ బిల్లుకి ఆమోదం 
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : లోక్‌సభ
ఎక్కడ : న్యూఢిల్లీ 
ఎందుకు : రాజ్యాంగ హోదాతో ఎన్‌సీఎస్‌ఈబీసీ ఏర్పాటుకు 

న్యూఢిల్లీలో స్వచ్ఛాగ్రహ ప్రదర్శన 
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాగ్రహ (Swachhagraha-Bapu Ko Karyanjali) ప్రదర్శనను ఏప్రిల్ 10న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. చంపారణ్ నుంచి మహాత్మా గాంధీ సత్యాగ్రహం ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 
స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛాగ్రహ ప్రదర్శన ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 10న
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించి వందేళ్లు పూర్తయినందుకు

కేరళలో తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం 
కేరళలో మాతృభాష మలయాళాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న ఆర్డినెన్‌‌స తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అనుబంధమున్న స్కూళ్లు, సెల్ఫ్ ఫైనాన్‌‌స ఇన్‌స్టిట్యూషన్‌‌స) పదో తరగతి వరకు మలయాళంను తప్పనిసరిగా బోధించాలి. 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం 
ఎప్పుడు : 2017-18 విద్యా సంవత్సరం నుంచి 
ఎవరు : కేరళ ప్రభుత్వం 
ఎక్కడ : కేరళలో 
ఎందుకు : కేరళ మాతృభాష పరిరక్షణ కోసం 

విశాఖ ఐఐపీఈకి కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రత్యేక చట్టం ద్వారా విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ (ఐఐపీఈ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ వర్సిటీ స్థాపనకు అవసరమైన రూ.655.46 కోట్ల మేర మూలధన వ్యయానికి అంగీకారం తెలిపింది. అలాగే ఎండోమెంట్ ఫండ్ కింద వర్సిటీకి రూ.200 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం లభించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వర్సిటీని ఏర్పాటు చేయనుంది. ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సబ్బవరం మండలంలో 200 ఎకరాలు కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖ ఐఐపీఈకి ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎక్కడ : విశాఖపట్నం
ఎందుకు : పెట్రోలియం వర్శిటీ ఏర్పాటుకు

ఎఫ్‌డీడీఐకి జాతీయ సంస్థ హోదా
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)కు జాతీయ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఏప్రిల్ 5న ఆమోదం తెలిపింది. 

ఇద్దరు పిల్లలకు మించితే ప్రభుత్వఉద్యోగానికి అనర్హులు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని అసోం ప్రభుత్వం ఏప్రిల్ 9న ప్రకటించింది. అలాగే చట్టపరంగా పెళ్లి వయసు రాకుండానే వివాహం చేసుకునేవారికీ ఇదే నిబంధన తీసుకొస్తున్నట్లు పేర్కొంది. 

పర్యాటక పోటీతత్వంలో భారత్‌కు 40వ ర్యాంక్
ప్రపంచ పర్యాటక పోటీతత్వంలో భారత్ ఒక్కసారిగా 12 స్థానాలను మెరుగుపరచుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) నివేదిక ప్రకారం 2015లో 52వ ర్యాంక్ పొందిన భారత్.. 2016లో 40వ ర్యాంక్ సాధించింది.

దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం 
 జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని చెనాని-నష్రీ ప్రధాన రహదారిలో నిర్మించిన దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారిని ఏప్రిల్ 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మార్గం కశ్మీర్ లోయను జమ్మూతో కలుపుతుంది.
సొరంగ మార్గం విశేషాలు 

9.2 కిలోమీటర్ల చెనాని-నాష్రి సొరంగ మార్గం దేశంలోనే అత్యంత పొడవైనది. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3,720 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగమార్గం నార్వేలో (24.51 కిలోమీటర్లు) ఉంది.ఈ మార్గం వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 31 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణ సమయం 2 గంటలు తగ్గుతుంది.ఈ మర్గం వల్ల ప్రతి రోజూ రూ. 27 లక్షల విలువైన ఇంధనం ఆదా అవుతుంది.వాహనాదారుల భద్రత నిమిత్తం మార్గం మొత్తం మీద 124 సీసీటీవీ కెమెరాలను, అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులకు రోడ్డు మార్గం చక్కగా కనపడేలా విద్యుత్ దీపాలను అమర్చారు.ఇది ఆసియాలోనే అతి పొడవైన రెండు మార్గాల సొరంగం.ప్రయాణికులకు తాజా గాలిని అందించే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సొరంగ మార్గాల్లో ప్రపంచంలో ఇది ఆరోది కాగా భారత్‌లో మొదటిది.శ్రీనగర్‌లో ప్రారంభమై కన్యాకుమారి దాకా సాగే జాతీయ రహదారి 44పై ఈ టన్నెల్ ఉంది. మొత్తం 3,745 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లు సహా 11 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. భారత్‌లో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే.క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం 
ఎప్పుడు : ఏప్రిల్ 2 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని చెనాని-నష్రీ ప్రధాన రహదారిలో 
ఎందుకు : కశ్మీర్ లోయను జమ్మూతో కలిపేందుకు 

ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాలపై నిషేధం 
భారత్ స్టేజ్ (బీఎస్)- 4 కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను సుప్రీం కోర్టు నిషేధించింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి వీటిని నిషేధిస్తూ మార్చి 29న తీర్పు వెలువరించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచే దేశవ్యాప్తంగా బీఎస్-4 ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. 
దేశంలోని వాహన తయారీదారులు, డీలర్ల వద్ద ప్రస్తుతం బీఎస్-3 ప్రమాణాలున్న వాహనాలు 7 లక్షల వరకూ ఉంటాయన్నది అంచనా. బీఎస్-3 ఇంజన్లు కలిగిన వాహనాలు బీఎస్-4 వాహనాలతో పోల్చితే 80 శాతం అధికంగా కాలుష్య కారకాలను గాలిలోకి విడుదల చేస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాలపై నిషేధం 
ఎప్పుడు : మార్చి 29 
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 

భారత్, మలేసియాల మధ్య 7 ఒప్పందాలు
మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ భారత పర్యటనలో భాగంగా ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మలేసియాను సందర్శించే భారత పర్యాటకులను ప్రోత్సహించేలా వీసా రుసుము రద్దు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో అనుమతి, రెండు దేశాల్లోని కోర్సులకు పరస్పరం గుర్తింపు వంటి అంశాలు ఉన్నాయి.

దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ - 2017 
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) దేశంలోని ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది. ఓవరాల్ వర్సిటీస్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, కాలేజీల విభాగాల్లో ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ఓవరాల్ విభాగంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో బెంగళూరులోని 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ప్రథమ స్థానంలో నిలిచింది. 
ఓవరాల్ కేటగిరిలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) దేశంలో 14వ స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో హైదరాబాద్ ఐఐటీ 26, ఉస్మానియా యూనివర్సిటీ 38, ఎస్వీయూ 68, ఏయూ 69 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఫార్మసీ విభాగంలో ఏయూ 18వ స్థానంలో నిలిచింది. 
టాప్ 10 విద్యా సంస్థలు 

సంస్థ

పట్టణం

ర్యాంకు

ఐఐఎస్‌సీ

బెంగళూరు

1

జేఎన్‌యూ

ఢిల్లీ

2

బీహెచ్‌యూ

వారణాసి

3

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్

బెంగళూరు

4

జాదవ్‌పూర్ వర్సిటీ

కోల్‌కత్తా

5

అన్నా యూనివర్సిటీ

చెన్నై

6

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

హైదరాబాద్

7

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ

ఢిల్లీ

8

అమృత విశ్వ విద్యాపీఠం

కోయంబత్తూర్

9

సావిత్రిబాయి పూలే వర్సిటీ

పూణె

10


న్యూఢిల్లీలో ఎస్‌ఏఎస్‌ఈసీ సదస్సు 
దక్షిణాసియా ఉప-ప్రాంతీయ ఆర్థిక సహకార సంస్థ ( South Asia Subregional Economic Cooperation - SASEC ) సదస్సు న్యూఢిల్లీలో ఏప్రిల్ 3న జరిగింది. 2025 నాటికి ఎస్‌ఏఎస్‌ఈసీ దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటక విలువను 70 బిలియన్ డాలర్లకు పెంచాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఏడు సభ్య దేశాల (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, మైన్మార్ ) ఆర్థిక మంత్రులు నిర్ణయించారు. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్ 2001లో ఎస్‌ఏఎస్‌ఈసీని ఏర్పాటు చేశాయి. మిగతా మూడు దేశాలు ఆ తర్వాత ఇందులో చేరాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌ఏఎస్‌ఈసీ సదస్సు - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 3 
ఎక్కడ : న్యూఢిల్లీ 
ఎందుకు : పరస్పర సహకారంతో సభ్య దేశాల అభివృద్ధి

హైవేలపై మద్యం నిషేధం
జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని సుప్రీంకోర్టు మార్చి 31న ఆదేశించింది. 2016, డిసెంబర్ 15కు ముందు లెసైన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలు రాష్ట్రాలు) వారికి మాత్రం కొంత గడువు ఇచ్చింది.

నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి 
అస్సాం ప్రజలు ఏటా ఘనంగా జరుపుకునే నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 31న ప్రారంభించారు. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రవహించే 21 జిల్లాల్లో ఈ వేడుకలను ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. మన దేశంలో జరిపే నదీ ఉత్సవాల్లో నమామి బ్రహ్మపుత్ర వేడుకలే అతి పెద్దవి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నమామి బ్రహ్మపుత్ర ఉత్సవాలు - 2017
ఎప్పుడు : మార్చి 31 
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 
ఎక్కడ : అస్సాం 

రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన యూపీ ప్రభుత్వం 
ఉత్తరప్రదేశ్‌లో రూ.36,359 కోట్ల మేర రైతు రుణమాఫీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో 2.15 కోట్ల మంది చిన్న, మధ్య తరహా రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ‘కిసాన్ రాహత్ బాండ్ల’ను జారీ చేయనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతు రుణమాఫీకి ప్రభుత్వ ఆమోదం 
ఎప్పుడు : ఏప్రిల్ 4 
ఎక్కడ : ఉత్తరప్రదేశ్ 
ఎందుకు : రూ.36,359 కోట్ల రుణాల మాఫీకి 

150 ఏళ్ల పూర్తిచేసుకున్న అలహాబాద్ హైకోర్టు
దేశంలో పురాతనమైన హైకోర్టుగా గుర్తింపు పొందిన అలహాబాద్ హైకోర్టు 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 2017 మార్చి 14 నుంచి ఏప్రిల్ 2 వరకూ 150 ఏళ్ల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 
ఇండియన్ హైకోర్ట్స్ చట్టం 1861 ప్రకారం 1866లో ఈ కోర్టు ఏర్పడింది. మొదట్లో హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ ఫర్ ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్‌గా వ్యవహరించే ఈ కోర్టు పేరుని 1919లో అలహాబాద్ హైకోర్టుగా మార్చారు. దేశంలో కోల్‌కత్తా, మద్రాస్, బాంబే తర్వాత పురాతమైన హైకోర్టు ఇదే. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అలహాబాద్ హైకోర్టు 150 ఏళ్ల వేడుకలు 
ఎప్పుడు : 2017 మార్చి 14 - ఏప్రిల్ 2 
ఎక్కడ : అలహాబాద్ 
ఎందుకు : హైకోర్టు ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయినందుకు 

టెక్స్‌టైల్ పాలసీ - 2017 
దేశీయ వస్త్రోత్పత్తి రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన టెక్స్‌టైల్ పాలసీని ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 8 పవర్‌లూమ్ క్లస్టర్లలో పవర్‌టెక్స్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరమగ్గాలు ఉన్న సిరిసిల్లకు ఈ పథకంలో స్థానం దక్కింది. ఈ పథకం ప్రకారం పవర్‌లూమ్స్‌లో మగ్గాల ఆధునికీకరణకు కేంద్రం మరింత సాయం అందిస్తుంది. నూలు డిపో ఏర్పాటుకు ముద్ర బ్యాంకు ద్వారా రూ.2 కోట్ల రుణం ఇస్తుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెక్స్‌టైల్ పాలసీ - 2017 ప్రకటన 
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : కేంద్ర జౌళి శాఖ
ఎందుకు : దేశీయ వస్త్ర ఉత్పత్తి రంగాన్ని ఆధునీకరించేందుకు 

నోయిడాలో స్మార్ట్ ఇండియా హ్యాకథన్ - 2017
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఏప్రిల్ 1, 2వ తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథన్ - 2017 కార్యక్రమం జరిగింది. నాస్కాం, మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10 వేల మంది పాల్గొన్నారు. ఏఐసీటీఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 
యువతలోని ప్రతిభను వెలికితీసి, వారు రూపొందించిన ఆవిష్కరణల్ని సామాజిక సమస్యల పరిష్కారానికి వినియోగిండమే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లక్ష్యం. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మార్ట్ ఇండియా హ్యాకథన్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 1-2 
ఎవరు : నాస్కాం, మానవ వనరుల శాఖ 
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్ 
ఎందుకు : యువతలోని ప్రతిభ వెలికితీసేందుకు 

ఎస్‌హెచ్‌జీల ద్వారా రైళ్లలో ఈ-కేటరింగ్ 
స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రైళ్లలో ప్రాంతీయ రుచులు అందించేలా స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్ సదుపాయాన్ని రైల్వే శాఖ ప్రారంభించనుంది. ఈ మేరకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ 9 ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు మైసూర్, ఎర్నాకులం, అద్రా (పశ్చిమ బెంగాల్) తదితర పది స్టేషన్లలో ఈ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌హెచ్‌జీల ద్వారా రైళ్లలో ఈ-కేటరింగ్ 
ఎక్కడ : పది స్టేషన్లలో
ఎవరు : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్
ఎందుకు : ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు

AIMS DARE TO SUCCESS 

మే 2017 జాతీయం
ఆన్‌లైన్‌లో అకడమిక్ వివరాల కోసం ఈసనద్ 
 సర్టిఫికెట్ల ధ్రువీకరణ సహా విద్యార్థుల అకడమిక్ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండేలా కేంద్రం ప్రభుత్వం ఈసనద్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల వెరిఫికేషన్ కోసం కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ‘ఈసనద్’ అనే పోర్టల్‌ను మే 24న ప్రారంభించింది. దీనిలో సీబీఎస్‌ఈకి చెందిన ‘పరిణామ్ మంజూష’ సహా విద్యార్థుల అకడమిక్ వివరాలు, సర్టిఫికెట్లన్నీ అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆన్‌లైన్‌లో అకడమిక్ వివరాల కోసం ఈసనద్ 
ఎప్పుడు : మే 24 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్ల సర్వీసులు 
ప్రభుత్వ రంగ దిగ్గజ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ శాటిలైట్ ఫోన్ సర్వీస్‌ను మే 24న ప్రారంభించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మొబైల్ శాటిలైట్ ఆర్గనైజేషన్ (ఐఎన్‌ఎంఏఆర్‌ఎస్‌ఏటీ) ద్వారా ఈ సేవలను తొలిగా గవర్నమెంట్ ఏజెన్సీలకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది.
స్టేట్ పోలీస్, రైల్వేస్, సరిహద్దు భద్రతా దళం, ఇతర ప్రభుత్వ సంస్థలకు తొలిగా ఫోన్లను అందివ్వనున్నారు. ప్రస్తుతం శాటిలైట్ ఫోన్ల సర్వీసులు అందిస్తోన్న టాటా కమ్యూనికేషన్‌‌స గడువు జూన్ 30 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత అన్ని కనెక్షన్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు బదిలీ అవుతాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : శాటిలైట్ల ఫోన్ సర్వీసులు 
ఎప్పుడు : మే 24
ఎవరు : బీఎస్‌ఎన్‌ఎల్ 

ఐదుగురు మావోయిస్టులకు మరణశిక్ష
2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లను కాల్చిచంపిన కేసులో ఐదుగురు మావోయిస్టులను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి ముంగర్ కోర్టు మే 25న మరణశిక్ష విధించింది. దోషులు విపిన్ మండల్, అధికలాల్ పండిట్, రాతు కోడా, వానో కోడా, మను కోడాలకు అడిషనల్ సెషన్‌‌స జడ్జి జ్యోతి స్వరూప్ శ్రీవాత్సవ రూ.25 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. 2014 ఏప్రిల్‌లో గంగ్టా-లక్ష్మీపూర్ మార్గంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై 50 మంది నక్సలైట్లు మెరుపు దాడి చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదుగురు మావోయిస్టులకు మరణశిక్ష
ఎప్పుడు : మే 25
ఎవరు : ముంగర్ కోర్టు, బిహార్ 
ఎందుకు : 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లను కాల్చిచంపిన కేసులో

టాప్-10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్
ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్ ఐదో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ‘ట్రిప్ అడ్వైజర్’ సంస్థ ‘ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్‌మార్క్స్’ పేరిట ఈ జాబితాను మే 25న విడుదల చేసింది. 
కాంబోడియాలోని అంగ్ కోర్‌వాట్ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకోగా రెండు, మూడు స్థానాల్లో అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, స్పెయిన్‌లోని మెజ్‌క్విటా క్యాథడ్రెల్ డీ కోర్డొబా నిలిచాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ అద్భుత కట్టడాల్లో 5వ స్థానంలో తాజ్‌మహల్ 
ఎప్పుడు : మే 25
ఎవరు : ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్‌మార్క్స్, ట్రిప్ అడ్వయిజర్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

కేరళలో వృద్ధులకు ‘అక్షర సాగరం’
అక్షరాస్యతలో ముందుండే కేరళ అక్షరసాగరం పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. తీరప్రాంతాలలోని వృద్ధులకు చదువు చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. తీరప్రాంతంలో నివసిస్తున్న పెద్ద వయసు వారిని గుర్తించి, చదువు చెప్పి పంచాయతీ స్థాయిలో ప్రభుత్వం అక్షరాస్యతను పెంచనుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న వారిలో 86 ఏళ్ల వయస్సుపైబడిన వృద్ధులు కూడా ఉన్నారు.
మొదటి దశలో 81 తీరప్రాంత వార్డులు, 15 పంచాయతిలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మలప్పురం, తిరువనంతపురం, కసరగాడ్ జిల్లాలను దీనికోసం ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వృద్ధులకు అక్షరసాగరం 
ఎప్పుడు : మే 2017
ఎవరు : కేరళ ప్రభుత్వం 
ఎక్కడ : కేరళలో 
ఎందుకు : తీర ప్రాంత వృద్ధుల్లో అక్షరాస్యత పెంచేందుకు 

పశువుల క్రయవిక్రయాలపై ఆంక్షలు 
సంతల్లో పశువుల (ఆవు, గేదె, ఎద్దు, ఒంటెలు) క్రయ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పశువుల క్రూరత్వ నిరోధక చట్టం-2017 (పశువుల సంతల నియంత్రణ)లో పలు మార్పులు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మే 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త నిబంధనలు 
కొత్త నిబంధనల ప్రకారం ఇకపై సంతలో పశువులను కొని కబేళాలకు తరలించడం కుదరదు. కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే సంతల్లో పశువుల క్రయవిక్రయాలు సాగాలి. ఈ నిబంధనలు వట్టిపోయిన పశువులకూ వర్తిస్తాయి.పశువుల విక్రయం సమయంలో తాను వ్యవసాయ దారుడినని రుజువు చేసుకునేలా అమ్మేవ్యక్తి, వాటిని కబేళాలకు తరలించేందుకు కాదంటూ కొనుగోలుదారులు హామీ పత్రం సమర్పించాలి. దీనిని పశువుల సంత నిర్వహణ కమిటీలు ధ్రువీకరించాలి.పశువుల సంత నిర్వహణ కమిటీ పశు విక్రయాలకు సంబంధించి దాదాపు ఆరు నెలల రికార్డులు అందుబాటులో ఉంచాలి.అనుమతి లేకుండా పశువుల కొనుగోలుదారులు వేరే రాష్ట్రంలో వాటిని విక్రయించకూడదు.క్విక్ రివ్యూ:
ఏమిటి : సంతలో పశువుల విక్రయాలపై ఆంక్షలు 
ఎప్పుడు : మే 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా 

ధోలా-సదియా వంతెనను ప్రారంభించిన మోదీ 
అసోంలోని సదియా ప్రాంతంలో లోహిత్ నది (బ్రహ్మపుత్ర ఉపనది)పై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెన (9.15 కిలోమీటర్లు)ను ప్రధాని నరేంద్ర మోదీ మే 26న జాతికి అంకితం చేశారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఈ వంతెనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత-గాయకుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. మహారాష్ట్రలోని ముంబయిలో బాంద్రా - వోర్లీ మధ్య ఉన్న 3.5 కిలోమీటర్ల వంతెన ఇంతకముందు భారత్‌లోని అతిపొడవైన వంతెనగా ఉండేది. 
ధోలా-సదియా వంతెన విశేషాలు 
ఈ వంతెనతో అసోం - అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం 165 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 5 గంటలు తగ్గుతుంది.2011లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు వ్యయం రూ.950 కోట్లు. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ దీన్ని నిర్మించింది.యుద్ధ ట్యాంకులు వెళ్లినా తట్టుకునే సామర్థ్యంతో వంతెనను నిర్మించారు. దీని ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లోకి సైనిక బలగాలు సులువుగా చేరేందుకు వీలు కలుగుతుంది.ఈ వంతెన భారత్ - చైనా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే నదిపై పొడవైన వంతెన ప్రారంభం
ఎప్పుడు : మే 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : సదియా, అసోం 

ఎన్డీఏ ప్రభుత్వ మూడేళ్ల సంబరాలు 
2017 మే 26తో ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న దేశవ్యాప్త సంబరాలను అసోంలోని గువాహటిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నవభారత నిర్మాణంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాల వ్యాపార కేంద్రంగా మార్చనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా భారత్‌ను సూపర్ పవర్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అనంతరం అస్సాంలోని కామరూప్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

‘సంపద’ను ప్రారంభించిన మోదీ
అస్సాంలోని ధేమాజీ జిల్లాలో భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.6 వేల కోట్లతో ‘సంపద’ (స్కీమ్ ఫర్ ఆగ్రో-మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆగ్రో-ప్రాసెసింగ్) పథకాన్ని ప్రారంభించారు.

గుజరాత్‌లో ఆవులకు ‘ఆధార్’ 
గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ఆధార్’ పద్ధతికి శ్రీకారం చుట్టిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. ఆవుల చెవుల్లో ఐడీ నంబర్‌తో ఉండే డిజిటల్ చిప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రమంతా టెక్నిషీయన్ల బృందాలను పంపించింది. తొలిదశలో భాగంగా.. 37వేల ఆవులకు యునిక్ ఐడెంటీ నంబర్లను కేటాయించనుంది. ఆవుల ఆక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ డిజిటల్ చిప్‌లు ఉపయోగపడతాయని ప్రభుత్వం వివరించింది. 
ఈ చిప్‌ల్లో ఆవులకు కేటాయించిన నంబర్, వాటి అడ్రసు, రంగు, ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. 
గోవధకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే చట్టాన్ని గుజరాత్ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో తీసుకొచ్చింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్‌లో ఆవులకూ ‘ఆధార్’ 
ఎప్పుడు : మే 26
ఎవరు : గుజరాత్ ప్రభుత్వం 
ఎందుకు : గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు

అడ్వాణీ, జోషి, ఉమా భారతిపై కుట్ర అభియోగాలు
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రూ. 50 వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం. 
ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అడ్వాణీ , జోషి, ఉమా భారతి సహా 12 మందిపై కుట్ర అభియోగాలు 
ఎప్పుడు : మే 30 
ఎవరు : సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 
ఎక్కడ : లక్నో 
ఎందుకు : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో

జయలలిత, శశికళ ఆస్తుల జప్తు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన ఆస్తుల జప్తుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మే 30న ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకూడి, తంజావూరు జిల్లాల్లోని వీరి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక అవినీతి నిరోధక, నిఘా విభాగ డెరైక్టర్ మంజునాథ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 6 జిల్లాల్లోని 68 ఆస్తుల జప్తుకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆస్తులకు తమిళనాడు ప్రభుత్వమే పూర్తి హక్కుదారుగా ఉంటుంది. అవసరమైతే శాఖాపరమైన అవసరాలకు వాడుకోవచ్చు లేదా బహిరంగ వేలం వేయొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జయలలిత, శశికళ ఆస్తుల జప్తు
ఎప్పుడు : మే 30
ఎవరు : త మిళనాడు ప్రభుత్వం 

పశువధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు స్టే
పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు మే 30న నాలుగు వారాల స్టే విధించింది. ఈ మేరకు నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మదురై బెంచ్‌కి చెందిన జస్టిస్ ఎంవీ మురళీధరన్, జస్టిస్ సీవీ కార్తికేయన్‌ల ధర్మాసనం ఆదేశించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పశువధ నిషేధంపై స్టే 
ఎప్పుడు : మే 30
ఎవరు : మద్రాస్ హైకోర్టు 

‘దంగల్’కు చైనాలో వెయ్యి కోట్లు
భారత్‌లో వసూళ్ల రికార్డు సృష్టించిన అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’.. చైనాలో వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తం చైనా సినీ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన సినిమాల్లో 33వదిగా మరో రికార్డునూ సొంతం చేసుకుంది. చైనా కరెన్సీలో ఒక బిలియన్ ఆర్‌ఎంబీలను దంగల్ వసూలు చేసిందని ‘మయన్’ వెబ్‌సైట్ తెలిపింది. చైనాలో ‘మయన్’ ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్. 
కాగా చైనాలో దంగల్‌ను మే 5న విడుదల చేశారు. అప్పటి నుంచి 15 రోజుల పాటు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద తొలి స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. వెయ్యి కోట్ల దాటిన దంగల్ సినిమా వసూళ్లు
ఎప్పుడు : మే 30
ఎక్కడ : చైనాలో 

భారత్‌లో ఆన్‌లైన్ విద్యకు భారీ మార్కెట్
2021 నాటికి భారత్‌లో ఆన్‌లైన్ విద్యారంగం మార్కెట్ 1.96 బిలియన్ డాలర్ల (రూ.12,544 కోట్లు సుమారు)కు చేరుకుంటుందని గూగుల్-కేపీఎంజీ నివేదిక పేర్కొంది. పెయిడ్ యూజర్లు (డబ్బులు చెల్లించి సేవలు పొందేవారు) 2016లో 16 లక్షల మంది ఉండగా... 2021 నాటికి వీరి సంఖ్య ఆరు రెట్ల వృద్ధితో 96 లక్షలకు చేరుతుందని ‘భారత్‌లో ఆన్‌లైన్ విద్య: 2021’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
ఇతర వివరాలు.. 
ఆన్‌లైన్‌లో విద్యా సంబంధిత సమాచారం కోసం అన్వేషించే వారి సంఖ్య గత రెండేళ్లలో రెండు రెట్లు, మొబైల్స్ ద్వారా వెతికే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. మొత్తం మీద ఈ విధంగా శోధించే వారిలో 44 శాతం మంది ఆరు మెట్రో నగరాలకు వెలుపలి నుంచే ఉన్నారు.2016లో ఒక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారానే విద్యా సంబంధిత కంటెంట్ వినియోగంలో నాలుగు రెట్ల పెరుగుదల కనిపించింది.ఆన్‌లైన్‌లో పరీక్షలకు సన్నద్ధమయ్యే విభాగం ఏటా 64 శాతం పెరుగుతూ 2021కి 51.5 కోట్లకు విస్తరించనుంది.క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో ఆన్‌లైన్ విద్య - 2021
ఎప్పుడు : మే 30
ఎవరు : గూగుల్-కేపీఎంజీ

ప్రసూతి ప్రయోజన పథకానికి కేబినెట్ ఆమోదం
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్నందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మే 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గర్భవతిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు రూ.1000, ఆర్నెల్ల తర్వాత రూ.2000, ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన తర్వాత మరో రెండు వేల రూపాయలను (మొదటి విడత బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్-బి టీకాలు వేయించుకున్నారన్న ధ్రువీకరణ తర్వాతే) అందజేస్తారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రసూతి ప్రయోజన పథకానికి ఆమోదం
ఎప్పుడు : మే 17
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : పాలిచ్చే తల్లులకు రూ. 6వేలు ఆర్థిక సహాయం 

10 అణువిద్యుత్ ప్లాంట్లకు కేబినెట్ ఆమోదం 
 దేశీయ అణు విద్యుదుత్పత్తికి తోడ్పాటునందించేందుకు 10 అణురియాక్టర్ల నిర్మాణానికి కేబినెట్ మే 17న ఆమోదం తెలిపింది. కేంద్రం ఒకేసారి ఇన్ని రియాక్టర్లకు అనుమతివ్వటం ఇదే మొదటిసారి. ఒక్కో ప్లాంట్ సామర్థ్యం 700 మెగావాట్లు. వీటి నిర్మాణం పూర్తయితే 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 
ప్రస్తుతం భారత్‌లో ఉన్న 22 ప్లాంట్ల ద్వారా 6780 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాజస్తాన్, గుజరాత్, తమిళనాడుల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల ద్వారా 2021-22 కల్లా మరో 6700 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : మే 17
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎక్కడ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో 
ఎందుకు : అణు విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు 

కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్షపై ఐసీజే స్టే
కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) స్టే విధించింది. ఈ మేరకు మే 15న భారత్, పాకిస్తాన్‌ల వాదనలు విన్న ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్ష అమలుపై స్టే విధిస్తూ మే 18న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను అమలు చేయరాదంటూ పాక్‌ను ఆదేశించింది. 
ఈ కేసులో పాక్ వైఖరిని తప్పుపట్టిన న్యాయస్థానం.. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి (1977లో భారత్-పాకిస్థాన్‌లు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి) వ్యతిరేకమని స్పష్టం చేసింది. జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది. 
జాధవ్ కేసు పూర్వపరాలు 
2016 మార్చి 23న బలూచిస్తాన్‌లో భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ (46)ను అరెస్టు చేసిన పాకిస్తాన్ బలగాలు అతడిపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశాయి. దీనిపై స్పందించిన భారత్ జాధవ్ గతంలో నేవీలో పనిచేశారని.. అయితే ఆయన అరెస్టుకు ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతడికి సంబంధం లేదని ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో జాధవ్‌పై విచారణ ప్రారంభించిన పాక్ మిలటరీ కోర్టు భారత్ చెప్పిన అంశాలను పరిగణలోకీ తీసుకోలేదు. అత్యంత వివాదాస్పదంగా కేవలం నాలుగు విచారణల్లోనే జాధవ్‌ను దోషిగా తేల్చిన మిలటరీ కోర్టు.. 2017 ఫిబ్రవరి 10న మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు 2017 ఏప్రిల్ 10న అధికారికంగా ప్రకటించారు. 
దీనిపై భారత ప్రభుత్వం నెదర్లాండ్‌‌సలోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం మే 15 - 18 వరకూ విచారణ జరిపింది. భారత్‌తోపాటు పాకిస్థాన్ వాదనలు వినిపించాయి ( కేవలం ఒక్క రూపాయి ఫీజుతో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు ). పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జాధవ్‌కు ఎలాంటి దౌత్యసాయం అందకుండా అడ్డుకుంటోందని భారత్ వివరించింది. దీనిపై తాము 16 సార్లు విన్నవించినా కూడా తిరస్కరించిందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనను పాకిస్థాన్ తప్పుబట్టింది. జాధవ్ ఒక గూఢచారి అని.. వియన్నా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు, గూఢచర్యం చేసేవారికి దౌత్యసాయం ఉండదని వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. తమ తుది తీర్పు వచ్చేవరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది.
పాక్ వాదన వీగిందిలా...
‘‘జాధవ్ మరణశిక్షపై అప్పీలును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదు’’...‘‘గూఢచర్యం కింద అరెస్టైన వ్యక్తికి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించే హక్కు ఉండదు’’...అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ వాదనల్లోని రెండు ప్రధానాంశాలివి. ఈ రెండింటినీ ఐసీజే తోసిపుచ్చింది. వివిధ దేశాల్లో దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి హక్కులు, దౌత్యపరమైన రక్షణలు ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిన ఉండాలనే ఉద్దేశంతో వియన్నాలో 1963లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 1967 మార్చి 19 నుంచి వియన్నా ఒప్పందం (Vienna Convention on Consular Relations, 1963 )అమలులోకి వచ్చింది. దీనిపై భారత్ పాకిస్తాన్ 1969 ఏప్రిల్ 14, 1977 నవంబర్ 28న సంతకాలు చేశాయి. 
ఐసీజే పరిధిపై...
‘వియన్నా ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ఏదైనా వివాదం వస్తే, అది తప్పనిసరిగా ఐసీజే పరిధిలోకే వస్తుంది. ఇరుపార్టీల్లో ఎవరైనా ఐసీజేను ఆశ్రయించవచ్చు’ అనేది ఒప్పందంలోని ఓ నిబంధన. దీని మూలంగానే పాక్ మొదటి వాదన వీగిపోయింది.

వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ఏంటంటే..
స్వదేశస్తులకు సంబంధించి దౌత్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడానికి వీలుగా...సొంత దేశానికి చెందిన వ్యక్తులను కలుసుకోవడానికి దౌత్య సిబ్బందికి, తమ దేశ దౌత్యవేత్తలను సంప్రదించడానికి ఆ దేశంలోని విదేశీయులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి.ఏ దేశంలోనైనా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా, అరెస్టు చేసినా... సదరు వ్యక్తి కోరుకుంటే తక్షణం ఈ సమాచారాన్ని అతని దేశ రాయబార కార్యాలయానికి చేరవేయాలి.అరెస్టయిన వ్యక్తి రాయబార కార్యాలయానికి రాసే లేఖలను వెంటనే పంపాలి. అతినికున్న హక్కుల గురించి స్పష్టంగా చెప్పాలి.అరెస్టయిన తమ దేశస్తుడిని జైలులో కలుసుకొనే, మాట్లాడే హక్కు దౌత్య సిబ్బందికి ఉంటుంది. అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ న్యాయ సహాయాన్ని కూడా అందించవచ్చు.

ఎవరైనా వ్యక్తి ఫలానా నేరాల కింద అరెస్టయితే... ఆ దేశ దౌత్య సిబ్బందికి పై హక్కులు ఉండవని ఎక్కడా పేర్కొనలేదు. అందుకే గూఢచర్యం కింద అరెస్టయితే దౌత్య సిబ్బందికి హక్కులుండవనే పాక్ రెండో వాదన వీగిపోయింది.
ఎందుకు కలవనివ్వట్లేదు?
జాధవ్‌ను కలవడానికి అనుమతించాలని భారత్ ఎంత గట్టిగా డిమాండ్ చేసినా పాక్ ఎందుకు ససేమిరా అంటోందంటే, అతనిపై విచారణ మిలటరీ కోర్టులో రహస్యంగా జరిగింది. జాధవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను పాక్ చూపడం లేదు. ఆయనతో బలవంతంగా ఒప్పించిన వీడియో మాత్రమే పాక్ వద్ద ఉంది. ఒకవేళ భారత దౌత్య సిబ్బంది జాధవ్‌ను కలిస్తే అసలు జరిగిందేమిటో ఆయన వివరిస్తాడు. పైగా దౌత్య సిబ్బంది అతనితో మాట్లాడితే న్యాయ సహాయమూ అందుతుంది. అందుకనే పాక్ భారత దౌత్య సిబ్బందికి జాదవ్‌ను కలిసే అవకాశమివ్వడం లేదు. 

అంతర్జాతీయ నాయస్థానం విధులు విధానాలు 
హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కుల్‌భూషణ్ జాధవ్ కేసుతో ఈ న్యాయస్థానం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఐసీజే ఏర్పాటు, విధి విధానాలపై సమగ్ర విశ్లేషణ మీకోసం.... 
ఐసీజే ఏర్పాటు 
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన న్యాయ సంస్థగా 1945 జూన్‌లో నెదర్లాండ్‌‌సలోని దక్షిణ హాలండ్ ప్రావిన్సు, ద హేగ్ నగరంలోని శాంతి సౌధంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఏర్పాటైంది. ఐరాస ఆరు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఈ ప్రపంచ న్యాయస్థానం ఒక్కటే న్యూయార్క్ వెలుపల ఉండడం విశేషం. 
ఐసీజే విధులు 
సభ్య దేశాలు నివేదించిన న్యాయపరమైన వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరించడం దీని బాధ్యత. ఐరాస అధికార విభాగాలు, ప్రత్యేక సంస్థలు అడిగిన న్యాయపరమైన అంశాలపై ఇది సలహాపూర్వకమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంది. ఇలా రెండు రకాల విచారణ పరిధి ఐసీజేకు కల్పించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా మొత్తం 15 మంది ఎన్నికై న న్యాయమూర్తులతో ఐసీజే పనిచేస్తుంది. ఐసీజే జడ్జీలను ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఎన్నుకుంటాయి. ఈ రెండు సంస్థల సంయుక్త సమావేశాల్లో, విడివిడి సమావేశాల్లో పూర్తి మెజారిటీ వచ్చిన వారే న్యాయమూర్తులుగా ఎన్నికవుతారు. ఐసీజే ప్రస్తుత అధ్యక్షుడు రోనీ అబ్రహాం ఫ్రాన్‌‌సకు చెందిన న్యాయకోవిదుడు. 
ఐసీజే జడ్జీగా ఎన్నికై తే స్వతంత్రులే...
ఒకసారి ఐసీజే జడ్జీగా ఎన్నికై న తర్వాత ఎవరూ కూడా వారి దేశాల ప్రభుత్వాలకుగానీ, మరేదైనా దేశాల(ప్రభుత్వాల)కుగానీ ప్రతినిధులు కారు. ఐరాస ఇతర విభాగాల్లో దేశాల ప్రతినిధులుంటారు. ఈ జడ్జీలు మాత్రం స్వతంత్రులు. ఏక కాలంలో ఒకే దేశానికి చెందిన ఇద్దరు జడ్జీలుగా ఉండడానికి వీల్లేదు. భద్రతా మండలిలో సభ్యత్వం మాదిరిగానే ఆఫ్రికా నుంచి ముగ్గురు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల నుంచి ఇద్దరు, ఆసియా నుంచి ముగ్గురు, తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇద్దరు, పశ్చిమ ఐరోపాతోపాటు పలు ఇతర దేశాల నుంచి ఐదుగురు, చొప్పున జడ్జీలు ఐసీజేలో ఉంటారు.
జడ్జీలుగా చేసిన భారతీయులు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దల్వీర్ భండారీ ఐసీజే ప్రస్తుత 15 మంది జడ్జీల్లో ఒకరు. ఆయన 2012లో ఎన్నికయ్యారు. ఆయనకు ముందు భారత్‌కు చెందిన సర్ బెనెగళ్ నర్సింగ్‌రావు(1952-53), డా.నాగేంద్రసింగ్(1973-88), ఆర్‌ఎస్ పాఠక్(1988-90) ఐసీజే జడ్జీలుగా పనిచేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కూడా పనిచేసిన నాగేంద్రసింగ్ 1985-88 మధ్య మూడేళ్లు ప్రపంచ కోర్టు ప్రెసిడెంట్‌గా సేవలందించడం విశేషం. 1950లో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి ఎంసీ చాగ్లా, 2002లో సుప్రీంకోర్టు మాజీ జడ్జీ బీపీ జీవన్‌రెడ్డిలు ఐసీజే తాత్కాలిక(అడ్‌హాక్) జడ్జీలుగా పనిచేశారు.
ఐసీజే అధ్యక్షుడు - రోని అబ్రహం ( 2015 ఫిబ్రవరి 6 - 2018 ఫిబ్రవరి 5 )
ఐసీజే ఉపాధ్యక్షుడు - అబ్దుల్‌కావీ యూసఫ్(2015 ఫిబ్రవరి 6 - 2018 ఫిబ్రవరి 5 )

జనసాంద్రత లో ముంబైకి మొదటి స్థానం 
జనసాంద్రత పరంగా ముంబై దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు నగరాలు నిలిచాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. హెచ్‌ఎండీకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సంస్థ లీ అసోసియేట్స్ మే 20న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. 
నివేదిక ప్రకారం ముంబైలో చదరపు కిలోమీటర్‌కు 21,000 మంది నివసిస్తుండగా, దేశ రాజధాని ఢిల్లీలో 20,932 మంది, హైదరాబాద్‌లో 10,263 మంది నివసిస్తున్నారు. సింగపూర్‌లో చ.కి.మీ.కు 7,801, టొరంటోలో 4,334 మంది మాత్రమే ఉన్నారు.
నగరాల వారీగా జనసాంద్రత

నగరంవిస్తీర్ణం (చ.కి.మీ.)జనాభాజన సాంద్రత (చ.కి.మీ.కు)ముంబై6031.24 కోట్లు21,000ఢిల్లీ7821.63 కోట్లు20,932బెంగళూరు70984 లక్షలు11,909హైదరాబాద్68069 లక్షలు10,263సింగపూర్71956 లక్షలు7,801టోరంటో63027 లక్షలు4,334

క్విక్ రివ్యూ:
ఏమిటి : జనసాంద్రతలో ముంబైకి మొదటిస్థానం 
ఎప్పుడు : మే 20
ఎవరు : లీ అసోసియేట్స్ 

అమర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారామిలటరీ జవాన్ల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారాన్ని అందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) శరాతంగ్ పోస్ట్‌లో మే 20న నిర్వహించిన ‘సైనిక్ సమ్మేళన్’లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పారామిలిటరీ బలగాల్లోని 34,000 కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించామని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరుల కుటుంబాలకు రూ. కోటి 
ఎప్పుడు : మే 20 
ఎవరు : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 
ఎందుకు : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు

దేశంలోని మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగం 
సోషల్ మీడియా వినియోగంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై మహానగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ 4వ స్థానంలో నిలవగా.. ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో కోల్‌కతా నిలిచింది. దేశంలోని మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగంపై సర్వే నిర్వహించిన సోషల్ మీడియా ట్రెండ్స్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 
కోటి జనాభాకు చేరువైన హైదరాబాద్ మహానగరంలో సుమారు 40 లక్షల మంది సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. హైదరాబాద్ నగరవాసులు ప్రధానంగా వాట్సాప్, ఫేస్‌బుక్ సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగం 
ఎవరు : సోషల్ మీడియా ట్రెండ్స్ సర్వే 
ఎక్కడ : భారత్‌లో 

భారీ నౌకాదళ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం 
రూ. 20వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రైవేటు రంగంలో నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దాదాపు 30వేల టన్నుల నుంచి 40 వేల టన్నుల సామర్థ్యంతో ఈ నౌకలు ఉండనున్నాయి. ప్రైవేటు రంగంలో చేపట్టనున్న అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అనుమతులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెండు నౌకల నిర్మాణ బాధ్యతలను విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌కు, మరో రెండు నౌకల బాధ్యతలను ఇతర సంస్థలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ రంగంలో చేపట్టనున్న అతిపెద్ద ప్రైవేటు ప్రాజెక్టు 
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి

తలాక్‌కు సంఘ బహిష్కరణ : ఐఏఎంపీఎల్‌బీ 
ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లింలకు సంఘ బహిష్కరణ విధించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఐఏఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఈ మేరకు ట్రిపుల్ తలాక్ పాటించొద్దంటూ పెళ్లికొడులకు చెప్పాలని ఖాజీలకు సలహావళి జారీ చేస్తామని మే 22న సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌లో తెలిపింది. షరియత్ ప్రకారం ట్రిపుల్ తలాక్ అవాంఛనీయమని, భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి భార్యాభర్తల కోసం షరియత్‌కు అనుగుణంగా ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. 
భార్యాభర్తల వివాద పరిష్కారానికి నియమావళి జారీ

వివాదాన్ని భార్యాభర్తలు తొలుత పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. చేసిన తప్పులను మరచిపోయేందుకు యత్నించాలి. ఫలితం లేకపోతే తాత్కాలికంగా విడిగా ఉండాలి.అలా పరిష్కారం కాకపోతే ఇద్దరి తరఫు కుటుంబాల్లోని పెద్దలు రాజీకి ప్రయత్నించాలి. ఫలితం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అప్పుడు కూడా తలాక్ అని ఒకసారి మాత్రమే చెప్పాలి. ఇద్దత్ (వేచి ఉండే కాలం) వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఇద్దత్‌లో సమస్య పరిష్కారమైతే తిరిగి భార్యాభర్తలుగా జీవించవచ్చు. పరిష్కారం కాకపోతే ఇద్దత్ ముగిశాక వివాహం రద్దు అవుతుంది.ఇద్దత్ కాలంలో భార్య గర్భిణి అయితే ఇద్దత్‌ను ప్రసవం వరకు పొడిగించాలి. ఇద్దత్ తర్వాత రాజీ కుదిరితే విడిపోయిన జంట మళ్లీ పెళ్లాడి వివాహాన్ని పునరుద్ధరించుకోవచ్చు.విడాకులకు మరో పద్ధతినీ అనుసరించవచ్చు. తొలి తలాక్ చెప్పిన తర్వాత, రెండో నెలలో మరో తలాక్, మూడో నెలలో మరో తలాక్ చెప్పి తద్వారా విడాకులు పొందొచ్చు. మూడో తలాక్ ముందు రాజీ కుదిరితే తిరిగి భార్యాభర్తలుగా ఉండొచ్చు. భర్తతో కలసి ఉండటం ఇష్టం లేకపోతే భార్య ‘ఖులా’ ద్వారా విడాకులు పొందొచ్చు.క్విక్ రివ్యూ:
ఏమిటి : తలాక్‌కు సంఘ బహిష్కరణ విధించాలన్న ఐఏఎంపీఎల్‌బీ
ఎప్పుడు : మే 22
ఎవరు : సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పణ

దేశంలో తొలి లగ్జరీ రైలు తేజస్ ప్రారంభం 
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తేజస్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలెక్కింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్, గోవాలోని కర్మాలి స్టేషన్ల మధ్య నడిచే తొలి తేజస్ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మే 22న ముంబైలో జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 200 కి.మీ. వేగంతో వెళ్లగల ఈ రైలు ప్రస్తుతానికి 130 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ 630 కి.మీ దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుంటుంది. వర్షాకాలం తప్ప మిగిలిన రోజుల్లో ముంబై-గోవాల మధ్య వారానికి ఐదు రోజులు, వర్షాకాలంలో వారానికి మూడు రోజులు ఈ రైలు నడవనుంది. మొత్తం 20 బోగీలు ఉంటాయి. రైలు బోగీలను పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. భారతీయ రైల్వేలో ఇప్పటికి ఇదే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు.
తేజస్ రైలు ప్రత్యేకతలుభారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన రైలు. ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్‌‌స, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు.ఇది పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారైంది. ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు. దుమ్ము, ధూళి కూడా అంటుకోదు.ముంబై నుంచి గోవా వరకు చార్జీ రూ. 2,585. ఆహారంతో కలిపి అయితే రూ. 2,740. సాధారణ చెయిర్‌కార్‌లో రూ. 1,185, ఆహారంతో కలిపి అయితే రూ. 1,310.సీట్లను అత్యంత అధునాతన డిజైన్‌తో తయారు చేశారు. రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులుండవు. అలసట ఉండదు.ఈ రైల్లో అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్ టెక్నాలజీ ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపేందుకు అవకాశం.ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ద్వారా రైలు ఎక్కడుందో సులభంగా తెలుస్తుంది. వికలాంగులకు బ్రెయిలీ లిపిలో సమాచారాన్ని ఏర్పాటు చేశారు.క్విక్ రివ్యూ:
ఏమిటి : లగ్జరీ రైలు తేజస్ ప్రారంభం 
ఎప్పుడు : మే 22 
ఎవరు : కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 
ఎక్కడ : ముంబై - గోవా మధ్య

యూపీలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా హెల్మెట్ లేనివారికి పెట్రోల్ విక్రయించొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని లక్నోలో మే 22 నుంచి నో హెల్మెట్ - నో ఫ్యూయల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి ఇంధనం విక్రయించకూడదని లక్నోలోని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించిన ప్రభుత్వం.. అలా వచ్చే వారి బైక్ నంబర్లను నోట్ చేసి పోలీసులకు ఇవ్వాలని సూచించింది. ఇది విజయవంతమైతే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తారు. 
2016లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నో హెల్మెట్ - నో ఫ్యూయల్ విధానం 
ఎప్పుడు : మే 22
ఎవరు : యూపీ ప్రభుత్వం 
ఎక్కడ : లక్నోలో 
ఎందుకు : రహదారి ప్రమాదాల నివారణకు 

పరిశోధనకు ‘వజ్ర’ కార్యక్రమం 
భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ శాస్త్రవేత్తలు మూడు నెలలు పనిచేసేలా కేంద్రం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది. ‘విజిటింగ్ అడ్వాన్‌‌సడ్ జాయింట్ రీసెర్చ్’(వజ్ర)గా పిలిచే ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తారు. విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో పనిచేసేలా ప్రోత్సహించడంతో పాటు, మన పరిశోధక విద్యార్థులకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ‘మన విద్యార్థులకు విదేశీ పరిశోధన సంస్కృతిని పరిచయం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. శాస్త్రవేత్తలు తొలి నెల్లో 9.72 లక్షలు, తర్వాత నెలకు 6.48 లక్షలు వేతనంగా పొందుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశీయ శాస్త్ర సంస్థల్లో పరిశోధనకు వజ్ర కార్యక్రమం
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ శాస్త్రవేత్తలు మూడు నెలలు పనిచేసేందుకు

దేశీయ వలసల్లో 3వ స్థానం 
అంతర్గత వలసలు అధికంగా నమోదవుతున్న మూడో దేశంగా భారత్ నిలిచింది. 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోని(భారత్‌లో) వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారని అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం(ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి(ఎన్‌ఆర్‌సీ).. మే 22న విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. దీని ప్రకారం అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలస వెళ్లగా, 59 లక్షల మందితో ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానంలో ఉంది.

సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రారంభం
సుప్రీం కోర్టులో సమగ్ర కేసు సమాచార నిర్వహణ వ్యవస్థ (integrated case management system) అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మే 10న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా డిజిటల్ ఫైలింగ్ చేసిన కేసు వివరాలను దేశంలో ఉన్న 24 హైకోర్టులతో పాటు సబార్డినేట్ కోర్టులతో అనుసంధానం చేస్తారు. 
ఈ వ్యవస్థ ద్వారా కక్షిదారులు కేసుకు సంబంధించిన వివరాలను పొందటంతోపాటు ఆన్‌లైన్‌లోనే కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టులో సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు : మే 10 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : కేసుల వివరాల డిజిటిల్ ఫైలింగ్ కోసం 

ట్రిపుల్ తలాక్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మే 11న విచారణ ప్రారంభించింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించమని తెలిపింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే దానిపై చర్చ జరుగుతుందని.. ఇది ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్ధారణ అయితే దీని రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) సభ్యులుగా (ఒక్కో మతం నుంచి ఒక్కరు) ఉన్నారు.
ట్రిపుల్ తలాక్ ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకం అని సైరా బానో అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్‌పై విచారణ ప్రారంభం
ఎప్పుడు : మే 11
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్ధతను నిర్ధారించడానికి

విద్యుదీకరణపై ప్రధాని సమీక్ష
విద్యుదీకరణ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 9న సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 18,452 గ్రామాలకుగాను 13 వేల గ్రామాలకు విద్యుదీకరణ పూర్తైదని, లక్ష్యం ప్రకారం 1000 రోజుల్లో అన్ని గ్రామాలకు విద్యుదీకరణను పూర్తి చేస్తామని ప్రధానమంత్రికి అధికారులు వివరించారు.

చార్‌ధామ్‌కు రైలు మార్గంపై సర్వే పూర్తి
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ (యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్- బద్రీనాథ్) పుణ్య క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే రైల్వే మార్గం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రైల్వే వికాస్ నిగమ్ దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేసింది. మొత్తం 327 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ.43292 కోట్ల వ్యయంతో (అంచనా) నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చార్‌దామ్‌కు రైలు మార్గం
ఎప్పుడు : ప్రతిపాదించి సర్వే పూర్తిచేశారు 
ఎవరు : రైల్వే మంత్రిత్వ శాఖ

ఫిట్ ఇండియా సర్వే - 2017 
దేశంలో 20 - 25 ఏళ్ల మధ్య వయసున్న యువతలో 6.5 మంది వ్యాయామాలపై అవగాహన కలిగి ఉన్నారని రీబాక్ సంస్థ వెల్లడించింది. వ్యాయామం విషయంలో భారతీయుల ఆలోచనలు, అలవాట్లను గుర్తించేందుకు ‘ఫిట్ ఇండియా’ పేరిట ఒక సర్వే నిర్వహించిన సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది మహా నగరాల్లో 20-25 మధ్య వయసున్న 1,500 మందిని సర్వే చేయడం ద్వారా రీబాక్ ఈ ఫలితాలను రాబట్టింది. 

సర్వే వివరాలు 

ఫిట్‌నెస్‌పై అవగాహన విషయంలో పుణె అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం స్కోరు 7.6 కాగా చండీగఢ్ 7.3 స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. కోల్‌కతా (6.71), ఢిల్లీ/ఎన్‌సీఆర్ (6.68), హైదరాబాద్ (6.6), బెంగళూరు (6.34), చెన్నై (6.21) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఈ తరం యువత అత్యధికంగా పాల్గొనే ఫిట్‌నెస్ కార్యక్రమం ‘యోగా’. బెంగళూరులో అత్యధికులు (74 శాతం) యోగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంఖ్య చెన్నైలో 71 శాతంగా, హైదరాబాద్‌లో 67 శాతంగా ఉంది.

వ్యాయామానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అత్యధికులు యూట్యూబ్‌పై ఆధారపడుతున్నారు. సర్వే చేసిన వారిలో 69 శాతం మంది హైదరాబాదీలు యూట్యూబ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య బెంగళూరులో 68 శాతం.. చెన్నైలో 58 శాతం మాత్రమే.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిట్ ఇండియా సర్వే - 2017
ఎప్పుడు : మే 12 
ఎవరు : రీబాక్
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : వ్యాయామంపై భారతీయుల ఆలోచనలు తెలుసుకునేందుకు

‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం : సుప్రీంకోర్టు 
ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మే 12న జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివేదించడంతో ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. 

పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017
పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ తేల్చింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన సంస్థ 10 అంశాలను నేపథ్యంగా తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాల పాలనా తీరుపై పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్-2017ను విడుదల చేసింది. ఈ నివేదికలో పాలనాపరంగా కేరళ, తమిళనాడు, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలవగా.. తెలంగాణ 20వ స్థానంలో ఉంది. 
అవసరమైన మౌలిక వసతులు, మానవ అభివృద్ధికి మద్దతు, సామాజిక రక్షణ, మహిళలు-పిల్లలు, న్యాయ పరిష్కార సేవలు, నేరా లు-శాంతిభద్రతలు, పర్యావరణం, పారదర్శకత-జవాబుదారీతనం, ద్రవ్య నిర్వహణ, ఆర్థిక స్వేచ్ఛ అంశాలతో కూడిన 10 నేపథ్యాలను పరిశీలించి ఈ సంస్థ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. 

ద్రవ్య నిర్వహణలో తెలంగాణ ఫస్ట్.. ఏపీకి 28
రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం పెరుగుదల తదితర విషయాలతో కూడిన ‘ద్రవ్య నిర్వహణ’లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. ఏపీ 28వ స్థానంలో నిలిచింది. 
ఏ అంశంలో ఏ స్థానం..

పారిశ్రామిక ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన తదితర ‘ఆర్థిక స్వేచ్ఛ’ అంశంలో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో నిలిచాయి.

విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, గృహ నిర్మాణం తదితర ‘అవసరమైన మౌలిక వసతులు’ అంశంలో ఏపీ 6, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి.

విద్య, ఆరోగ్యం తదితర అంశాలతో కూడిన ‘మానవ అభివృద్ధికి చేయూత’లో ఏపీ 17, తెలంగాణ 26వ స్థానం దక్కాయి.

ప్రజాపంపిణీ వ్యవస్థ, సామాజిక న్యాయం-సాధికారత, మైనారిటీల సంక్షేమం, ఉపాధి కల్పన తదితర ‘సామాజిక భద్రత’ అంశంలో ఏపీ 24, తెలంగాణ చివరన 30వ స్థానంలో నిలిచాయి.

పిల్లలపై నేరాలు, బాలకార్మికులు, ఐసీడీఎస్ లబ్ధిదారుల శాతం, లింగ నిష్పత్తి, పౌష్టికాహార లోపం, ఆసుపత్రుల్లో ప్రసవాలు తదితర ‘మహిళలు-పిల్లలు’ అంశంలో ఏపీ 19, తెలంగాణ 21వ స్థానంలో ఉన్నాయి.

అత్యాచారాలు, హత్యలు, వరకట్న బాధిత చావులు, కస్టోడియల్ మరణాలు, పోలీసు సిబ్బంది సంఖ్య తదితర విషయాలను పరిశీలించే ‘నేరాలు, శాంతిభద్రతలు’ అంశంలో ఏపీ 11, తెలంగాణ 21 స్థానంలో నిలిచాయి.

కేసుల పెండెన్సీ, న్యాయాధికారుల ఖాళీలు, అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తదితర అంశాలతో కూడిన ‘న్యాయ సేవల పరిష్కారం’లో ఏపీ 23, తెలంగాణ 21వ స్థానాలతో వెనకపడ్డాయి.

కాలుష్యం, పర్యారణ ఉల్లంఘనలు, అటవీ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వంటి అంశాలున్న ‘పర్యావరణం’లో ఏపీ 20, తెలంగాణ 28వ స్థానంలో నిలిచాయి.

ఈ-గవర్నెన్స్‌ సేవలు, ఆర్‌టీఐ, లోకాయుక్త చట్టం, ఏసీబీ కేసుల పరిష్కారం, ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డులు తదితర విషయాలపై పరిశీలన చేసిన ‘పారదర్శకత, జవాబుదారీతనం’ అంశంలో ఏపీ 23, తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : మే 15
ఎవరు : పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్
ఎందుకు : పాలనలోని వివిధ అంశాల్లో రాష్ట్రాలకు ర్యాంకింగ్స్

నమామి దేవి నర్మదే సేవా యాత్ర ముగింపు 
నర్మదా నది పరిరక్షణ కోసం చేపట్టిన నమామి దేవి నర్మదే సేవా యాత్ర మే 15న ముగిసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నర్మదా నది సంరక్షణకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడాన్ని ‘భవిష్యత్ దృష్టితో చేసిన సరైన కార్యక్రమం’ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ముందు నర్మదా నది జన్మస్థానమైన అమర్‌కంఠక్ వద్ద మోదీ పూజలు నిర్వహించారు. 
నమామి దేవి నర్మదే సేవా యాత్రను 2016 డిసెంబర్ 11న అమర్‌కంఠక్‌లో ప్రారంభించారు. సుమారు 150 రోజుల పాటు సాగిన ఈ యాత్ర 1100 ఊళ్ల మీదుగా 3,344 కి.మీ., పాటు సాగింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నమామి దేవి నర్మదే సేవా యాత్ర ముగింపు
ఎప్పుడు : మే 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో
ఎందుకు : నర్మదా నది రక్షణ కోసం 

చెన్నైలో భూగర్భ మెట్రో రైలు సేవలు ప్రారంభం
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయడు మే 14న చెన్నైలో (తిరుమంగళంలో) భూగర్భ మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ప్రజలు తరలివెళ్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.

చక్కెర సబ్సిడీ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం 
 పేదలకు అంత్యోదయ అన్న యోజన కింద ఇచ్చే చక్కెర సబ్సిడీని కేంద్రం పునరుద్ధరించింది. ఈ మేరకు మే 3న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కేజీ చక్కెరపై రూ.18.50 సబ్సిడీని రాష్ట్రాలకు అందించడానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల కేంద్రంపై రూ.550 కోట్ల భారం పడనుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : చక్కెర సబ్సిడీ పునరుద్ధరణకు ఆమోదం 
ఎప్పుడు : మే 3 
ఎవరు : కేంద్ర కేబినెట్ 

దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ప్రారంభం 
భారత్‌లోనే తొలి ప్రైవేటు ఆయుధ కార్మాగారం మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఈ మేరకు భిండ్ జిల్లా మలన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కర్మాగారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మే 4న ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పుంజ్ లాయిడ్ రక్ష సిస్టమ్స్ (భారత్), ఇజ్రాయిల్ వెపన్ సిస్టమ్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ఈ కర్మాగారం ద్వారా ఎక్స్95 కార్బైన్ అండ్ అసాల్ట్ రైఫిల్, గాలిల్ స్నైపర్ రైఫిల్, తావోర్ అసాల్ట్ రైఫిల్, నెగేవ్ లైట్ మెషిన్‌గన్‌లను ఉత్పత్తి చేయనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ప్రారంభం 
ఎప్పుడు : మే 4 
ఎవరు : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ 
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లోని మలన్‌పూర్‌లో
ఎందుకు : మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 

బిల్కిస్ బానో కేసులో 12 మందికి జీవిత ఖైదు
గుజరాత్‌లో సంచలనం రేపిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు మే 4న తీర్పు వెలువరించిన న్యాయస్థానం దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదేసమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులు, వైద్యులను నిర్దోషులుగా ప్రకటించిన కింది కోర్టు తీర్పును పక్కనబెట్టింది. కాగా, ఈ ఏడుగురూ ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని శిక్షాకాలంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. 
2002 గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్‌లోని బిల్కిస్ ఇంటిపై దాడి చేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబ సభ్యులైన ఏడుగురిని హతమార్చారు. ఈ కేసులో 2008లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్కిస్ బానో కేసులో 12 మందికి జీవిత ఖైదు 
ఎప్పుడు : మే 4
ఎవరు : బాంబే హైకోర్టు 

‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష విధించిన సుప్రీం కోర్టు
నిర్భయ కేసులో నలుగురు హంతకులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు దోషులు ముకేశ్ (29), పవన్ (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31)లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ మే 5న తీర్పు వెలువరించింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా.. పాశవిక, అమానవీయ, అత్యంత దుర్మార్గమైన దాడిగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం అభివర్ణించింది. 
2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి దోషులు ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయటంతోపాటు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టుని తీర్పుని సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా ఈ రెండు కోర్టుల తీర్పులని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో మరో దోషి రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా బాలనేరస్తుడు మూడేళ్ల జైలుశిక్ష అనంతరం జువెనైల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు
ఎప్పుడు : మే 5
ఎవరు : సుప్రీం కోర్టు 
ఎందుకు : డిసెంబర్ 16, 2012 నాటి నిర్భయ కేసులో 

హెచ్‌ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్ జారీకి సుప్రీం ఆదేశం 
ప్రాణాంతకర హెచ్‌ఐవీ సోకిన చిన్నారులను సైతం బలహీనవర్గాల జాబితా (డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్)లో చేరుస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని సుప్రీంకోర్టు మే 5న ఆదేశించింది. చిన్నారులకు ఉచిత, నిర్భంద విద్యా హక్కు కల్పిస్తూ 2009లో తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్‌లో చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కొత్త నోటిఫికేషన్ తెచ్చాయని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అదేబాటలో నడవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌మినహా మిగతావన్నీ వచ్చే ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్ జారీచేయాలని కోర్టు నిర్దేశించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్ 
ఎప్పుడు : మే 5
ఎవరు : రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం 
ఎందుకు : చిన్నారులను బలహీనవర్గాల జాబితాలో చేర్చేందుకు 

దాణా కేసులో 9 నెలల్లో విచారణ ముగించాలన్న సుప్రీంకోర్టు 
దాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగు కేసుల్లో వేర్వేరుగా విచారణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు లాలూపై నేరపూరిత కుట్ర అభియోగాలను కొట్టేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతూ మే 8న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే లాలూతో పాటు మిగిలిన నిందితులపై విచారణ ప్రక్రియను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 
లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం చోటు చేసుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : లాలూపై నాలుగు కేసుల్లో విచారణకు ఆదేశం 
ఎప్పుడు : మే 8
ఎవరు : సుప్రీం కోర్టు 
ఎందుకు : దాణా కుంభకోణానికి సంబంధించి

మావోయిస్టుల అణచివేతకు ‘సమాధాన్’ వ్యూహం
మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సదస్సు రెండ్రోజుల పాటు ( మే 8 - 9 ) న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మావోయిస్టుల అణచివేసేందుకు ‘సమాధాన్’ (SAMADHAN) వ్యూహాన్ని వివరించారు. నక్సల్స్ విషయంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే ప్రధాన లక్ష్యమని రాజ్‌నాథ్ చెప్పారు. 
సమాధాన్ వ్యూహం..
S- Smart Leadership 
A - Agressive Strategy
M - Motivation and Training 
A - Actionable Intelligence
D - Dashboard Key Performance Indicators (KPI), Key Resuly Area (KRA)
H - Harnessing Technology
A - Action Plan for Each Theatre
N - No Access to Finance 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ ‘సమాధాన్’ వ్యూహం
ఎవరు : కేంద్ర హోంశాఖ 
ఎందుకు : మావోయిస్టుల అణచివేతకు

మధ్యప్రదేశ్ బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో మార్పు
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌తో కాకుండా.. జనవరితో మొదలుపెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మే 2న నిర్ణయించింది. ఇటీవల నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్ విధానానికి మార్చాలనే ఆలోచనకు ప్రధాని నరేంద్రమోదీ మద్దతు పలికిన నేపథ్యంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

10 ఏళ్లలో 2.37 కోట్లు పెరిగిన పత్రికల ప్రతులు
భారత్‌లో పదేళ్లలో పత్రికల ప్రతుల సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదల నమోదైందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) వెల్లడించింది. ఈ మేరకు మే 8న ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం పత్రికల వార్షిక వృద్ధిరేటు 4.87 శాతంగా ఉంది. 2006లో ప్రతుల సంఖ్య రోజుకు 3.91 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది 6.28 కోట్లకు చేరింది. 
అక్షరాస్యత పెరగడం, పత్రికా పఠనం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారడం, పత్రికలు, వాటి ధరలు అందుబాటులో ఉండడంతో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతోందని ఏబీసీ పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 ఏళ్లలో 2.37 కోట్లు పెరిగిన పత్రికల ప్రతులు
ఎప్పుడు : మే 8
ఎవరు : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ 
ఎక్కడ : భారత్‌లో

రామానుజాచార్య స్టాంప్ ఆవిష్కరణ
రామానుజాచార్య సహస్రాబ్ది (1000వ జన్మదిన వేడుకలు) ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూపొందించిన తపాలా బిళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 1న ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రామానుజాచార్య తొలి తపాలాబిళ్లను ప్రధాని చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామానుజాచార్య స్టాంప్ ఆవిష్కరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : ప్రధాని మోదీ
ఎందుకు : రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా

రెండో ఎత్తైన జెండా ఆవిష్కరణ
దేశంలోనే రెండో ఎత్తైన జెండాను మే 1న మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నెలకొల్పారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్ కేఎస్‌బీపీ ట్రస్టు ఏర్పాటు చేసిన 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా పొడవు 90 అడుగులు కాగా వెడల్పు 60 అడుగులు. దేశంలో ఎత్తైన జెండా భారత్, పాక్ సరిహద్దులో అట్టారి వద్ద (360 అడుగులు) ఉంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే రెండో ఎత్తై జెండా ఆవిష్కరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : కేఎస్‌బీపీ ట్రస్టు
ఎక్కడ : కొల్హాపూర్, మహారాష్ట్ర

AIMS DARE TO SUCCESS 

జూన్ 2017 జాతీయం
కర్ణాటకలో రైతు రుణమాఫీ
 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌ల కోవలో కర్ణాటక ప్రభుత్వం కూడా రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.50 వేల లోపు ఉండి సహకార బ్యాంకులు, సంఘాల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జాతీయ, గ్రామీణ, ప్రైవేటు బ్యాంకుల్లో అప్పులు పొందిన రైతులకు రుణమాఫీ వర్తించదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు. రుణాలను రద్దు చేయడం వల్ల ఖజానాపై రూ.8,165 కోట్ల భారం పడనుంది. ఈ నెల 20 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న 22,27,506 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రైతు రుణాలను మాఫీ చేసిన మరో రాష్ట్రం 
ఎప్పుడు : జూన్ 21
ఎవరు: కర్ణాటక ప్రభుత్వం 
ఎందుకు : రూ. 50 వేల లోపు రుణాలకే వర్తింపు 

స్మార్ట్ సిటీల మూడో జాబితాలో 30 నగరాలు 
స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా అభివృద్ధి చేసే నగరాల 3వ జాబితాను కేంద్రం జూన్ 23న విడుదల చేసింది. పట్టణ పరివర్తన అంశంపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మొత్తం 30 నగరాలతో కూడిన జాబితాను వెల్లడించింది. దీంతో ఇప్పటి దాకా ప్రకటించిన స్మార్ట్ సిటీల సంఖ్య 90కి చేరింది. తదుపరి దఫాలో 20 పట్టణాల నుంచి 10 స్మార్ట్ సిటీలను ఎంపికచేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు.
ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం తొలిస్థానంలో, ఆ తరువాత వరుసగా ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయ్‌పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కరీంనగర్ (తెలంగాణ), ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాలకు చోటు దక్కింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన నగరాలకు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి నిధులు అందుతాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 500 కోట్లు కాగా రాష్ట్రం వాటా రూ.500 కోట్లు.
తాజా జాబితాలోని ఇతర పట్టణాలు
పట్నా, ముజఫర్‌పూర్, పుదుచ్చేరి, గాంధీనగర్, శ్రీనగర్, సాగర్, కర్నల్, సాత్నా, బెంగళూరు, షిమ్లా, డెహ్రాడూన్, తిరుప్తూపర్, పింప్రిచించ్వాడ్, బిలాస్‌పూర్, పాసీఘా ట్, జమ్మూ, దాహోద్, తిరునల్వేలి, తూతుక్కుడి, తిరుచిరాపల్లి, ఝాన్సీ, ఐజ్వాల్, అలహాబాద్, అలీగఢ్, గ్యాంగ్‌టక్.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్మార్ట్ సిటీల 3వ జాబితా విడుదల
ఎప్పుడు : జూన్ 23 
ఎవరు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 

మహారాష్ట్రలో 34 వేల కోట్ల రుణమాఫీ
కరువు, పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న మహారాష్ట్ర రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.34,020 కోట్ల భారీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు రద్దు కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ కృషి సమ్మాన్ యోజన’గా నామకరణం చేసిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జూన్ 24న ప్రకటించారు. పథకంతో 40 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి పూర్తి విముక్తి, మరో 49 లక్షల మందికి కొంత ఉపశమనం కలగనుంది. దేశంలో ఒక రాష్ట్రం ఇంత పెద్ద రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని ఫడ్నవిస్ తెలిపారు. దీని కోసం రాష్ట్రంలోని అధికార బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని అందిస్తారని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మహారాష్ట్రలో రూ.34 వేల కోట్ల రుణమాఫీ
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ 
ఎందుకు : రైతులను ఆదుకునేందుకు 

మన్‌కీబాత్‌లో విజయనగరం జిల్లాకు ప్రధాని ప్రశంసలు 
మన్‌కీబాత్ కార్యక్రమంలో జూన్ 24న రేడియోలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంలా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాను ఉదహరించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అధికారులు జిల్లాలోని 71 గ్రామాల్లో 100 గంటలు నిర్విరామంగా శ్రమించి 10 వేల మరుగు దొడ్లను నిర్మించారని ప్రశంసించారు. వీటి నిర్మాణం వల్ల 71 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయన్నారు. అలాగే.. ముస్లింల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్ బిజనౌర్ జిల్లాలో 3,500 కుటుంబాలున్న ముబారక్‌పూర్ గ్రామ ప్రజలంతా కలసి రంజాన్ సందర్భంగా మరుగుదొడ్డి నిర్మించారని మోదీ కొనియాడారు. 
మదురై మహిళ సాధికారత..
‘గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వస్తువులు అమ్ముతున్నానంటూ తమిళనాడు మదురైకి చెందిన ఓ మహిళ రాసిన ఉత్తరాన్ని ప్రధాని ప్రస్తావించారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని, ఆమె నుంచి ప్రధాని కార్యాలయం కూడా రెండు వస్తువులు కొనుగోలు చేసిందని మోదీ చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మన్‌కీబాత్
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : స్వచ్ఛభారత్ అమలులో విజయనగరం జిల్లాకు ప్రశంస

జాతీయ విద్యా విధానంపై కమిటీ
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై కసరత్తు చేసేందుకు అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. భారత విద్యా విధానానికి కొత్తరూపు తీసుకొచ్చే నిర్ణయంలో భాగంగా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ జూన్ 26న ప్రకటించింది. 
జాతీయ విద్యా విధానంపై కొన్నేళ్ల కిందట టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2016లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కృష్ణస్వామి కస్తూరిరంగన్ నేతృత్వంలో జాతీయ విద్యా విధానంపై కమిటీ 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ
ఎందుకు : విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం

దేశీయ తేలియాడే డాక్ ప్రారంభం
నౌకా దళం కోసం తొలిసారిగా దేశీయంగా నిర్మించిన తేలియాడే డాక్ (ఎఫ్‌డీఎన్-2)ను జూన్ 20న చెన్నైలో ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థనిర్మించిన ఈ డాక్ పొడవు 185 మీటర్లు కాగా, వెడల్పు 40 మీటర్లు. ఇది అన్ని రకాల నౌకల మరమ్మతులకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని అండమాన్ నికోబార్‌లో ఉంచనున్నారు. ఇప్పటికే ఇలాంటిదొకటి చెన్నైలో ఉంది. 

ఉదయ్ ర్యాంకింగ్స్‌లో గుజరాత్ టాప్ 
ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం సంస్కరణల అమల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వజ్ర విధానం ప్రారంభం
అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 22న వజ్ర(విజిటింగ్ అడ్వాన్స్‌డ్ జాయింట్ రీసెర్చ్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ దీనికి సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు.

కాండ్లాలో తొలి స్మార్ట్ పోర్ట్ సిటీ 
 దేశంలోని తొలి స్మార్ట్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ (ఎస్‌ఐపీసీ) గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్ సమీపంలోని కాండ్లాలో ఏర్పాటు కానుంది. కాండ్లా పోర్ట్ ట్రస్ట్ (కేపీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ పారిశ్రామిక కారిడార్ రూ. 10 వేల కోట్లపైగా పెట్టుబడులను ఆకర్షించనుంది. ఇందులో వంట నూనెలు, ఫర్నిచర్, ఉప్పు ఆధారిత తదితర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
1,425 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐపీసీలో 580 ఎకరాల్లో స్మార్ట్ అర్బన్ టౌన్‌షిప్, 845 ఎకరాల్లో ఆధునిక పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత తొలి స్మార్ట్ పోర్ట్‌సిటీ 
ఎప్పుడు : జూన్ 15 
ఎవరు : కాండ్లా పోర్ట్‌ట్రస్ట్
ఎక్కడ : గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్ సమీపంలోని కాండ్లాలో 

యూపీలో సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 15న నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్ మంత్రి మొహసీన్ రజా తెలిపారు. బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో ఎస్పీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్‌తో పాటు షియా బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 
ఎందుకు : బోర్డులపై అవినీతి ఆరోపణలతో 

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 60వ స్థానంలో భారత్ 
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2017లో భారత్ 6 స్థానాలు మెరుగుపరచుకుని 60వ స్థానంలో నిలిచింది. దీంతో మధ్య, దక్షిణాసియా ప్రాంతంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడంతో ఆసియా ప్రాంతపు వర్ధమాన ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. 
కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 130 దేశాలతో ఈ జాబితాను రూపొందించాయి. ఇందులో స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్‌‌స, అమెరికా, యూకే దేశాలు వరుసగా అగ్ర స్థానాల్లో ఉన్నాయి. చైనా 22వ స్థానంలో ఉండగా శ్రీలంక 90, నేపాల్ 109, పాకిస్తాన్ 113, బంగ్లాదేశ్ 114వ స్థానాల్లో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 
ఎక్కడ : 60వ స్థానంలో భారత్ 

పోలీసుల కాల్పుల్లో వారానికి ఇద్దరు మృతి 
గడిచిన ఏడేళ్లలో పోలీసు కాల్పుల్లో సగటున వారానికి ఇద్దరు పౌరులు మరణించారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2009 నుంచి 2015 మధ్య దేశంలో 4,747 పోలీసుల కాల్పుల ఘనటలు నమోదు కాగా ఈ కాల్పుల్లో 796 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ భాగం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనలే. రాష్ట్రాలవారీగా చూస్తే 2015లో రాజస్థాన్‌లో అత్యధికంగా 35 పోలీసు కాల్పుల ఘటనలు నమోదు కాగా మహారాష్ట్రలో 33, ఉత్తరప్రదేశ్‌లో 29 రికార్డయ్యాయి. అల్లర్లు, దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యతిరేక చర్యలు.. మొదలైన సమయాల్లో పోలీసు కాల్పులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే 2009 నుంచి 2015 మధ్య జరిగిన కాల్పుల్లో 471 మంది పోలీసు సిబ్బంది కూడా మరణించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పోలీస్ కాల్పుల్లో వారానికి ఇద్దరు మృతి 
ఎప్పుడు : 2009 - 2015 మధ్య 
ఎవరు : ఎన్‌సీఆర్‌బీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

జవాన్ల శాశ్వత వైకల్యానికి రూ.20 లక్షలు
విధి నిర్వహణలో 100 శాతం అంగవైకల్యం పొందిన జవాన్లకు ఇస్తున్న నష్టపరిహారాన్ని రూ.9 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర హోంశాఖ జూన్ 17న నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 1 తర్వాత వైకల్యం పొందినవారికే ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వీరితో పాటు విధి నిర్వహణలో గాయపడ్డ జవాన్లకు వైకల్య స్థాయిని బట్టి నష్టపరిహారాన్ని అందిస్తామని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విధి నిర్వహణలో వైకల్యం పొందిన జవాన్లకు పరిహారం 20 లక్షలకు పెంపు 
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : కేంద్ర హోంశాఖ

ముంబై పేలుళ్ల కేసులో అబూసలేంను దోషిగా తేల్చిన టాడాకోర్టు
1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో సూత్రధారి ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్ అబూ సలేం సహా ఆరుగురిని టాడా ప్రత్యేక కోర్టు జూన్ 16న దోషులుగా నిర్ధారించింది. అబ్దుల్ ఖయ్యూం అనే మరో నిందితుడిని సరైన ఆధారాల్లేనందున నిర్దోషిగా ప్రకటించింది. 
అబూసలేం, ముస్తఫా , కరీముల్లా ఖాన్, ఫిరోజ్, అబ్దుల్ రషీద్ ఖాన్, తాహిర్ మర్చంట్‌లను నేరపూరిత కుట్ర, భారత శిక్షాస్మృతి, టాడా కింద హత్యానేరం, విధ్వంసక సామాగ్రి, ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజల ఆస్తుల విధ్వంసం వంటి కేసుల్లో దోషులుగా తేల్చగా, సిద్దిఖీని అబూసలేం, ఇతరులకు ఆయుధాలు సరఫరా చేయటంలో సహకరించిన నేరంలో టాడా చట్టాల కింద దోషిగా తేల్చారు. 
24 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి రెండో విడత విచారణలో భాగంగా టాడా కోర్టు తాజా తీర్పునిచ్చింది. 2007 నాటి తొలి విడత విచారణలో కోర్టు 100 మందిని దోషులుగా, 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో టైగర్ మెమన్, యాకూబ్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసాతో సహా పలువురు ఈ దాడులకు కుట్ర పన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముంబై పేలుళ్ల కేసులో దోషుల నిర్ధారణ 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : టాడా కోర్టు 
ఎందుకు : 1993 ముంబయిలో బాంబు పేలుళ్లకు పాల్పడినందుకు 

బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి
కొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ జూన్ 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా ఆధార్ నంబర్‌ను తెలపాలి. అంతేకాకుండా రూ.50,000 అంతకు మించిన మొత్తాల లావాదేవీలకు సైతం ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి. 
ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : బ్యాంకు లావాదేవీలపై పూర్తి సమాచారం కోసం 

పంజాబ్‌లో రైతు రుణమాఫీ
ఎన్నికల హామీ మేరకు పంజాబ్ రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రుణమాఫీలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు(5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు) రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాల్ని కూడా ప్రభుత్వమే చెల్లించడంతో పాటు.. వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ మేరకు జూన్ 19న అసెంబ్లీలో అమరీందర్ ప్రకటన చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 10.25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని, ఇందులో 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులు 8.75 లక్షలు ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రకటించిన రుణమాఫీ కంటే రెండింతలు మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త టీ హక్యూ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పంజాబ్‌లో రైతు రుణమాఫీ 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : సీఎం అమిరీందర్ సింగ్ 
ఎందుకు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 

జూలై 1 నుంచి డిపార్చర్ కార్డ్స్ విధానం రద్దు
విదేశాలకు వెళ్లే భారతీయులకు వచ్చే నెల నుంచి విమానాశ్రయాల వద్ద ప్రయాణానికి ముందు ‘డిపార్చర్ కార్డ్స్’ పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే రైలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవారు మాత్రం ఈ ప్రయాణ పత్రాల్ని పూర్తి చేయాలని ఒక ఉత్తర్వులో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణానికి ముందు పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నెంబరు, చిరునామా, విమానం నెంబర్, ప్రయాణ తేదీ తదితర వివరాలు డిపార్చర్ కార్డ్‌లో పూరించాలి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డిపార్చర్ విధానం రద్దు 
ఎప్పుడు : జూలై 1 నుంచి 
ఎవరు : భారత ప్రభుత్వం 
ఎక్కడ : విమానాశ్రయాల్లో 
ఎందుకు : ప్రయాణ అవాంతరాలు లేకుండా చేసేందుకు

జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక
భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం(ఈసీ) జూన్ 7న షెడ్యూలు జారీ చేసింది. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్నామని ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ జారీచేసి ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. 
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను త్వరలో జారీ చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీం జైదీ వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిశాకే జరుపుతామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం 2017, జులై 24తో ముగియనుంది. కాగా, సీఈసీ జైదీ వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల ఫలితాన్ని నోటిఫై చేసేనాటికి ఆయన పదవిలో ఉండరు. 
ఎన్నికల షెడ్యూలునోటిఫికేషన్14.06.2017నామినేషన్లకు గడువు28.06.2017నామినేషన్ల పరిశీలన29.06.2017అభ్యర్థిత్వాలఉపసంహరణ గడువు01.07.2017పోలింగ్17.07.2017ఓట్ల లెక్కింపు20.07.2017

ఎన్నికల్లో ఎవరి బలమెంత?
ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే వీరికి 35.47 శాతం ఓట్లున్నాయి. మరో ఆరు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, ఆప్, ఐఎన్‌ఎల్‌డీలు తమ రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. 
ఎన్డీయే పక్షాల బలం

పార్టీ

మొత్తం ఓట్ల విలువ

ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం

బీజేపీ4,42,11740.03టీడీపీ31,1162.82శివసేన25,8932.34- మిగిలిన ఎన్డీయే పార్టీల బలాన్ని కలుపుకుంటే ఎన్డీయే బలం ( ఓట్ల విలువ- 5,37,683, ఓట్ల శాతం - 48.64)
యూపీఏ పక్షాల ఓట్ల శాతం

పార్టీ

మొత్తం ఓట్ల విలువ

ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం

కాంగ్రెస్1,61,47814.62తృణమూల్63,8475.78సమాజ్‌వాదీ26,0602.36సీపీఎం27,0692.45- మిగిలిన యూపీఏ పార్టీల బలాన్ని కలుపుకుంటే మొత్తం ( ఓట్ల విలువ - 3,91,739, ఓట్ల శాతం -35.47)
తటస్థ పార్టీలు
పార్టీమొత్తం ఓట్ల విలువఎలక్టోరల్‌లో ఓట్ల శాతంఅన్నాడీఎంకే59,2245.36బీజేడీ32,8922.98టీఆర్‌ఎస్22,0481.99వైఎస్సార్‌సీపీ16,8481.53మొత్తం1,44,30213.06ఎవరు ఎన్ను కుంటారు?
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎన్నికై న లోక్‌సభ సభ్యులు(543), ఎన్నికై న రాజ్యసభ సభ్యులు(233), ఎన్నికై న రాష్ట్ర శాసనసభల సభ్యులు(ఢిల్లీ, పుదుచ్చేరి సహా) ఉంటారు. మొత్తం 4,896 మంది ఓటేయడానికి అర్హులు. వీరిలో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు. నామినేటెడ్ సభ్యులకు, రాష్ట్రాల శాసన మండళ్ల సభ్యులకు ఓటు హక్కు ఉండదు. 
పోలింగ్ ఎలా..?
ఓటింగ్‌ను దామాషా ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. కనుక పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఓటర్లు.. అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమంలో ఓటేస్తారు. అభ్యర్థుల పేర్ల ఎదురుగా 1, 2, 3... ఇలా అంకెలు రాస్తారు. ఓటు చెల్లాలంటే మొదటి ప్రాధాన్యత నమోదు తప్పనిసరి. ఇతర ప్రాధాన్యతల నమోదు ఐచ్ఛికం. 
ఓట్ల లెక్కింపు ఎలా?
రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ను 50 మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది ద్వితీయ ప్రతిపాదకులుగా ఉండాలి. అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఏ అభ్యర్థికీ ఈ కోటా రాకపోతే.. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించేదాకా ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు 
వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచుతారు. అప్పటికీ ఎవరికీ అవసరమైన కోటా రాకపోతే 
చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. 
ఓట్లకు విలువ ఇలా: 
ఎంపీల ఓట్లకు ఒక విలువ, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువలు ఉంటాయి. దేశాధినేత.. దేశ ప్రజలందరికీ దామాషా పద్ధతి ప్రకారం ప్రాతినిధ్యం వహించేలా, కేంద్ర, రాష్ట్రాలకు సమాన ఓటు హక్కు ఉండేలా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ఓట్ల విలువను ఇలా లెక్కిస్తారు.. 
ఒక ఎమ్మెల్యే ఓటు విలువ: 1971 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్ర మొత్తం జనాభా / ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై న మొత్తం సభ్యుల సంఖ్య × 1000 
రాష్ట్ర శాసనసభ సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ: ఒక ఎమ్మెల్యే ఓటు విలువ × మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 
మొత్తం 31 రాష్ట్రాల్లోని (ఢిల్లీ పుదుచ్చేరి సహా) శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ: మొత్తం 31 రాష్ట్రాల్లోని అందరు ఎమ్మెల్యేల ఓట్ల విలువ మొత్తం = 5,49,474 
ఎంపీ ఓటు విలువ: అందరు ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ (5,49,474) / మొత్తం పార్లమెంటు సభ్యుల సంఖ్య (776) = 708 
అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ: ఒక ఎంపీ ఓటు విలువ × మొత్తం ఎంపీల సంఖ్య = 5,49,408 
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మొత్తం విలువ: అందరు శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ + అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ = 5,49,474 + 5,49,408 = 10,98,882

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువరాష్ట్రంఅసెంబ్లీ స్థానాలుఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువమొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువఆంధ్రప్రదేశ్17515927,825తెలంగాణ11913215,708గమనిక: గత రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148 కాగా ఈసారి ఏపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159కి పెరిగింది. తెలంగాణలో 132కు తగ్గింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ విలువలను ఖరారు చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాష్ట్రపతి ఎన్నిక విధానం 
ఎప్పుడు : జులై 17 
ఎవరు : ఎన్నికల సంఘం 

పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూ వారి మార్పులు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ చమురు సంస్థలకు చెందిన 58 వేల పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారనున్నాయి. ఈ మేరకు ధరలను రోజూ సమీక్షించాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయించాయి. దీంతో పెట్రోల్ ధరలు రోజూ మారుతూ... ఒకే రోజులో కూడా మూడు కంపెనీల బంకుల్లో మూడు రకాలుగా ఉండనున్నాయి. 
ధరలను ఏరోజుకారోజు దినపత్రికల్లో ముద్రించడంతో పాటు మొబైల్ యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా తెలియపరుస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూవారీ మార్పులు 
ఎప్పుడు : జూన్ 16 నుంచి 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : ఐవోసీ, బీపీ, హెచ్‌పీ 

‘టాప్ 200’లో భారత విద్యాసంస్థలకు చోటు 
ప్రపంచ వ్యాప్తంగా 200 అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో తొలిసారిగా మూడు భారతీయ ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన క్యూఎస్ వరల్డ్ సంస్థ ‘టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్’ పేరుతో విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఐఐఎస్సీ, ఢిల్లీ, బొంబాయి ఐఐటీలు ర్యాంకులు దక్కించుకున్నాయి. బెంగళూరు ఐఐఎస్‌సీ ర్యాంకు గత ఏడాది 190 కాగా, ఈసారి 152కు చేరింది. ఢిల్లీ ఐఐటీ ర్యాంకు 185 నుంచి 179కి, బొంబాయి ఐఐటీ ర్యాంకు 219 నుంచి 179కి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 వేల యూనివర్సిటీల నుంచి 200 అగ్రశ్రేణి విద్యాసంస్థలను క్యూఎస్ వరల్డ్ ఎంపిక చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్ 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : క్యూఎస్ వరల్డ్ 

పాన్, ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు పాక్షిక స్టే 
పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై (21వ అధికరణ) రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని జూన్ 9న వెలువరించిన తీర్పులో పేర్కొంది. ఇంతవరకు ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చని.. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. 
పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకొచ్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాన్‌తో ఆధార్ అనుసంధానంపై పాక్షిక స్టే 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : సుప్రీం కోర్టు 

మహారాష్ట్రలో రైతుకు రుణ మాఫీ
మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేస్తామని జూన్ 11న ప్రకటించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు సమస్యల పరిష్కారానికి నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, రైతు నాయకుల మధ్య చర్చల్లో ఆ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో జూన్ 1 నుంచి రైతులు ప్రారంభించిన ఆందోళనను విరమించారు. 
ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.07 కోట్ల మంది రైతులకు లాభం కలుగుతుంది. చిన్న, మధ్య తరహా రైతులకు సంబంధించిన సుమారు రూ. 30 వేల కోట్ల రుణాలు రద్దవుతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రూ. 30 వేల కోట్ల రైతు రుణాల మాఫీ 
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : మహారాష్ట్రలో 
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్రలో అత్యధిక బాల్యవివాహాలు 
దేశంలోని 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి నిర్ణీత వయసుకంటే ముందే వివాహం జరుగుతుంది. ఇది గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), యంగ్ లివ్స్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.
2011కి ముందు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న టాప్ 70 జిల్లాల్లో 16 మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 16 జిల్లాల్లో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిల బాల్య వివాహాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. రాజస్థాన్‌లో అబ్బాయిలు 8.6 శాతం, అమ్మాయిలు 8.3 శాతం మందికి నిర్ణీత వయసులోగానే వివాహం అవుతుంది. మొత్తంగా 13 రాష్ట్రాల్లోని(ఉమ్మడి ఏపీతో కలిపి) 70 జిల్లాల్లో 21.1 శాతం బాలికల వివాహాలు జరగగా.. 22.5 శాతం అబ్బాయిల వివాహాలు జరిగాయి.
దేశంలో బాలికల వివాహాల శాతంసంవత్సరంగ్రామాల్లోపట్టణాల్లోమొత్తం20012.75 %1.78%2.51%20112.43%2.45%2.44%క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో బాల్య వివాహాలపై సర్వే 
ఎప్పుడు : 2001-2011 మధ్య కాలంలో 
ఎవరు : జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), యంగ్ లివ్స్‌ ఇండియా
ఎక్కడ : దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో 

నేతాజీ 1945లో చనిపోయారు: క్రేంద్ర హోంశాఖ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని కేంద్ర ప్రభుత్వం మే 31న స్పష్టం చేసింది. నేతాజీ మృతిపై కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు సమాచార హక్కు కింద గతంలో దరఖాస్తు చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నేతాజీ చనిపోయారనే నిర్ధారణకు వచ్చామని హోం శాఖ తెలిపింది. నేతాజీ కొన్ని రోజులపాటు గుమ్నమి బాబాగా మారువేషంలో జీవించారనే వాదనననూ అధికారులు కొట్టిపారేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో చనిపోయారని స్పష్టీకరణ 
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్ర హోంశాఖ 

ఐరాస సాధారణ అసెంబ్లీ చీఫ్‌గా లాజ్‌కాక్
స్లోవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ లాజ్‌కాక్(54) ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిజి దౌత్యవేత్త పీటర్ థాంప్సన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌లో మొదలయ్యే యూఎన్ 72వ సాధారణ అసెంబ్లీ సెషన్‌కు లాజ్‌కాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతేడాది యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడ్డ వారిలో లాక్‌జాక్ ఒకరు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస సాధారణ అసెంబ్లీకి నూతన చీఫ్ 
ఎప్పుడు : మే 31 
ఎవరు : మిరోస్లావ్ లాజ్‌కాక్

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న రాజస్థాన్ హైకోర్టు
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మే 31న సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొంది. జైపూర్‌లోని ప్రభుత్వ గోశాలలో గతేడాది వందకుపైగా ఆవులు మృత్యువాతపడటంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ మహేశ్ చంద్ శర్మ (ఏక సభ్య ధర్మాసనం) తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఐఎండీ పోటీతత్వ జాబితాలో 45వ స్థానంలో భారత్ 
అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్ గతేడాదితో పోల్చుకుంటే నాలుగు స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్ (ఐఎండీ) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జూన్ 3న జాబితాను విడుదల చేసింది. చైనా ఏడు స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది. 
ఈ జాబితాలో హాంగ్‌కాంగ్ మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, సింగపూర్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎండీ పోటీతత్వ జాబితా - 2017 
ఎప్పుడు : జూన్ 4 
ఎక్కడ : 45వ స్థానంలో భారత్ 
ఎవరు : ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్

యుద్ధరంగంలోకి మహిళలను అనుమతించనున్న భారత్ ఆర్మీ 
భారత సైన్యం భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. లింగపరమైన అడ్డంకులను అధిగమిస్తూ యుద్ధరంగంలోకి మహిళ లను అనుమతించనుంది. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాటంలో పురుషులు మాత్రమే కనిపించగా.. ఇక ముందు మహిళలు సైతం పాలుపంచుకోనున్నారు. ఈ మేరకు మహిళలను యుద్ధంలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తామని, దీనికి సంబంధించిన మార్పులకు రంగం సిద్ధం చేశామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ జూన్ 4న వెల్లడించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ హోదాలోకి ఇకపై మహిళలను అనుమతి స్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగంగా సాగుతోందని, తొలుతగా మహిళలను మిలిటరీ పోలీసులుగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటామని చెప్పారు. 
ప్రస్తుతం మిలిటరీ విభాగానికి అనుసంధానంగా ఉండే మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఇప్పటికే మహిళకు అవకాశం కల్పిస్తున్నారు. 
ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్‌, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు మాత్రమే యుద్ధరంగంలోకి మహిళలను అనుమతిస్తున్నాయి.

యూపీలో గోవధపై జాతీయ భద్రత చట్టం
గోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం(ఎన్‌ఎస్‌ఏ), గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్కన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు జూన్ 6న ఆదేశాలు జారీ చేశారు. గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోవధపై జాతీయ భద్రత చట్టం 
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లో 

పెండింగ్ కేసుల పరిష్కారానికి "న్యాయమిత్ర"
దేశంలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం న్యాయమిత్రలను నియమించనుంది. జూన్ 6న అలహాబాద్ హైకోర్టులో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టెలీ లా సర్వీస్ అందించే విధానాన్ని ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తులను న్యాయమిత్రలుగా నియమిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 7.50 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యాయమిత్రలుగా విశ్రాంత న్యాయమూర్తులు 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : కేంద్రన్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 
ఎందుకు : పెండింగ్ కేసుల పరిష్కారానికి 

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ నూతన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో జూన్ 3న సమావేశమయ్యారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, పారిస్ ఒప్పందానికి మించి కృషి చేస్తుందని తెలిపారు. మెక్రాన్ మాట్లాడుతూ భూ తాపానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. రక్షణ సహకారం, సముద్ర జలాల భద్రత, ఉగ్రవాదంపై పోరుకు భారత్‌తో కలసి పని చేస్తామని తెలిపారు. 
రష్యా పర్యటన: మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జూన్ 1న భేటీ అయ్యారు. ఈ ఏడాదితో భారత్-రష్యా సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5వ, 6వ యూనిట్‌ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఇంద్ర-2017 పేరిట త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 
స్పెయిన్ పర్యటన: మోదీ.. స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో మే 31న సమావేశమయ్యారు. భారత్‌లో విస్తరించేందుకు స్పెయిన్ కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఏడు ఒప్పందాలు కుదిరాయి. 
జర్మనీ పర్యటన: మోదీ.. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో మే 30న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో.. సైబర్ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్ మేనేజర్స్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్ శిక్షణ ప్రోత్సాహం తదితర రంగాలు ఉన్నాయి.

AIMS DARE TO SUCCESS 

జూలై 2017 జాతీయం
బిహార్‌లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం 
 లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. సీఎం నితీశ్ కుమార్(జేడీయూ) ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జూలై 26న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ మోదీ.. నితీశ్‌కు మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖనందించారు. దీంతో జూలై 27న బిహార్ సీఎంగా జేడీయూ నేత నితీశ్ ప్రమాణం చేశారు. 
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. 243 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 178 స్థానాలు గెలిచాయి. జేడీయూ నేత నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లాలూ ఇద్దరు కుమారుల్లో ఒకరు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టగా మరొకరికి మంత్రి పదవి దక్కింది. అనంతరం.. లాలూ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడుల నేపథ్యంలో.. ప్రజలకు వివరణ ఇవ్వాలని లాలూ కుమారులను నితీశ్ కొంతకాలం క్రితమే కోరారు. దీన్ని లాలూ కుటుంబం బాహాటంగానే ఖండించింది. జూలై 26న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ తన కుమారులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు. దీంతో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడపటం కష్టమని భావించిన నితీశ్ కుమార్.. కూటమితో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 
అసెంబ్లీలో బలాబలాలు

పార్టీ

సీట్లు

ఆర్‌జేడీ

80

జేడీ(యూ)

71

కాంగ్రెస్

27

బీజేపీ

53

ఇతరులు

12

క్విక్ రివ్యూ:
ఏమిటి : కొలువుదీరిన జేడీయూ-బీజేపీ ప్రభుత్వం 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : సీఎం నితీశ్ కుమార్ 
ఎక్కడ : బిహార్‌లో 
ఎందుకు : ఆర్జేడీతో జేడీయూ తెగతెంపుల నేపథ్యంలో 

కనీస వేతన బిల్లుకు కేబినెట్ ఆమోదం
అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ జూలై 27న ఆమోద ముద్ర వేసింది. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. 
కనీస వేతనాల చట్టం-1948, వేతనాల చెల్లింపు చట్టం-1936, బోనస్ చెల్లింపు చట్టం-1965, సమాన వేతనాల చట్టం-1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకుమించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కనీస వేతన బిల్లుకు ఆమోదం 
ఎప్పుడు : జూలై 26
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా 

గోప్యత హక్కుకి కొన్ని పరిమితులు ఉండాలి : కేంద్రం
రాజ్యాంగం ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాలని కేంద్రం జూలై 26న సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గోప్యతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనానికి నివేదించారు. ప్రైవసీకి సంబంధించిన చాలా అంశాలను ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని పేర్కొన్నారు. 
పశ్చిమ బెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, పంజాబ్‌ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోప్యత హక్కుకి కొన్ని పరిమితులు ఉండాలన్న కేంద్రం 
ఎప్పుడు : జూలై 26
ఎవరు : సుప్రీంకోర్టు 

బస్సులకు డిజైన్ కోడ్
ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐఎస్-052 కోడ్ పేరిట బస్ బాడీ కోడ్‌ను అమల్లోకి తేనుంది. 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో ఇక దేశవ్యాప్తంగా బస్సులన్నీ కేటగిరీల వారీగా ఒకే తరహాలో ఉండనున్నాయి. ప్రమాదాలను నివారించేలా, ఒకవేళ ప్రమాదాలు జరిగితే సులువుగా బయటపడేలా బస్‌బాడీ నిర్మాణం, ప్రయాణికులకు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన సీట్లు, డ్రైవర్ క్యాబిన్ విషయంలో ప్రత్యేక నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ విషయమై ఇప్పటికే బస్‌బాడీ నిర్మాణ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు పుణెలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్‌‌సపోర్టు ప్రతినిధులు దేశవ్యాప్తంగా ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బస్సులకు ప్రత్యేకంగా ఏఐఎస్-052 కోడ్ 
ఎప్పుడు : జూలై 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు

ఐఐఎం బిల్లు - 2017కు లోక్‌సభ ఆమోదం 
దేశంలోని 20 అత్యుత్తమ ఐఐఎం(ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఐఐఎం బిల్లు - 2017ను లోక్‌సభ జూలై 29న ఆమోదించింది. విద్యా, పరిశోధన రంగాల్లో ఐఐఎంలు ప్రపంచ ప్రమాణాలను అందుకునేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఐఎం బిల్లు - 2017కు ఆమోదం 
ఎప్పుడు : జూలై 28
ఎవరు : లోక్‌సభ 
ఎందుకు : దేశంలోని 20 అత్యుత్తమ ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు 

భూకంపాల జోన్‌లో 29 నగరాలు 
దేశంలో 29 నగరాలు భూకంపాల జోన్‌లో ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) నివేదిక వెల్లడించింది. వాటిలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తొమ్మిది రాష్ట్రాల రాజధానులున్నాయి. ఇవి ఎక్కువగా హిమాలయాల పరిధిలో ఉన్నాయి. దీనికి ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తింపు ఉంది. 
ఢిల్లీ, పట్నా, శ్రీనగర్, కొహిమా, పుదుచ్చేరి, గువాహటి, గ్యాంగ్‌టక్, సిమ్లా, డెహ్రాడూన్, ఇంఫాల్, చండీగఢ్‌లు భూకంపం సంభవించే ప్రాంతాలలో మొదటి, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలో భూకంపం సంభవించే ప్రాంతాలను ఐదు జోన్లుగా వర్గీకరించింది. ఐదో జోన్ అత్యంత తీవ్రత కలిగిన ప్రాంతం. ఈ జోన్‌లో ఈశాన్య ప్రాంతమైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని కచ్, ఉత్తర బిహార్‌లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భూకంపాల జోన్‌లో 29 నగరాలు 
ఎప్పుడు : జూలై 30
ఎవరు : నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

2022 నాటికి నవభారత నిర్మాణం : ప్రధాని మోదీ 
2022 నాటికి(దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా) దేశంలోని కుల, మతతత్వాలతోపాటుగా పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, చెత్తలను పారద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జూలై 30న మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని.. జీఎస్టీని చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. 
దేశానికి ప్రధాన సమస్యలుగా మారిన మతతత్వం, కుల వ్యవస్థ, అవినీతి, ఉగ్రవాదం, పేదరికాన్ని 2022 నాటికి దేశం నుంచి నిర్మూలించేలా ప్రతి భారతీయుడు కృషిచేయాలని.. ఈ దిశగా ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీని ద్వారానే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యేలోపు నవభారత నిర్మాణం జరుగుతుందన్నారు. 1942, ఆగస్టు 9న మహాత్ముడు ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కారణంగానే.. 1947లో బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లారని గుర్తుచేసిన మోదీ.. 2017లో నవభారత నిర్మాణానికి ప్రతి భారతీయుడు ప్రతినబూనటం ద్వారా 2022 కల్లా ఫలితాలు సాధించగలమన్నారు. 

జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం 
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు-2017 జూలై 31న రాజ్యసభ ఆమోదం పొందింది. విపక్షాలు సూచించిన విధంగా బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదించి అమోదించారు. ఈ బిల్లును లోక్‌సభ ఏప్రిల్‌లో ఆమోదించి రాజ్యసభకు పంపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు ఆమోదం 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు

టపాసులలో 5 లోహాల వినియోగంపై నిషేధం 
వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్న 5 హానికర లోహాలను టపాసులలో వినియోగించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధ ర్మాసనం ఈ మేరకు జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. టపాసుల తయారీలో లిథియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, ఆంటిమోని, లెడ్ లోహాలను వాడరాదని పేర్కొంది. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌ఓ) ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టపాసులలో వినియోగించే 5 లోహాలపై నిషేధం 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా

ఈశాన్య రాష్ట్రాలకు 2,350 కోట్ల వరద సహాయం 
ఈశాన్య రాష్ట్రాలకు వరద సాయంగా రూ.2,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని వరదలపై తాజా పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులతో సమీక్షించిన మోదీ.. అసోం రాష్ట్రానికి తక్షణసాయంగా రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్లు
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలండ్, అసోం 
ఎందుకు : వరద సహాయంగా 

ఐసిస్, చైనాలతోనే భారత్‌కు ముప్పు
ఐసిస్, వాతావరణ మార్పులు, చైనా దుందుడుకుతనం.. ఈ మూడు భారత్‌కు పొంచి ఉన్న ప్రధాన ముప్పులని అత్యధిక శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘ప్యూ’ చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ఐసిస్ వల్ల భారత్‌కు ముప్పు ఉందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. వాతావరణంలో మార్పుల వల్ల ఇబ్బందులు తప్పవని 47 శాతం మంది చెప్పారు. 44 శాతం మంది భారత్‌కు ఉన్న అతిపెద్ద ముప్పు చైనాయేనని పేర్కొన్నారు. మరో 43 శాతం మంది సైబర్ దాడులే అత్యంత ప్రమాదకరంగా మారాయన్నారు. అమెరికాతోపాటు ఐరోపా, ఆసియా ఖండాల్లోని 18 దేశాల్లో సర్వే చేసిన ప్యూ.. ఆ నివేదికలను ఆగస్టు 1న విడుదల చేసింది. చైనా, రష్యా, అమెరికాల్లో ఏది అత్యంత ప్రమాదకర దేశమని అడగ్గా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు చైనాయేనని చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 18 దేశాలకు పొంచి ఉన్న ముప్పుపై సర్వే 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్యూ సంస్థ

దేశంలో రెండు టైమ్‌జోన్ల అమలు పరిశీలన
దేశంలో రెండు వేర్వేరు టైమ్‌జోన్ల అమలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం జులై 19న లోక్‌సభలో తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉంది. కాబట్టి రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనితీరు మెరుగుపడుతుందని బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ లేవనెత్తిన అంశంపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో రెండు టైం జోన్ల అమలు పరిశీలన
ఎప్పుడు : జూలై 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ లేవనెత్తిన అంశంపై

‘ఆహార భద్రత’కు సుప్రీం కోర్టు ఆదేశాలు
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31లోగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కార్యదర్శి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత కార్యదర్శులతో కనీసం ఒకసారైనా సమావేశమై చట్టం అమలవుతున్న తీరును సమీక్షించాలని పేర్కొంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒప్పించాలని సూచించింది. ఆహార కమిషన్‌లను ఏడాదిలోగా ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆహార భద్రత అమలుకు ఆదేశాలు
ఎప్పుడు : జూలై 21 
ఎవరు : సుప్రీంకోర్టు 

ప్రతి పదినిమిషాలకో సైబర్ నేరం: సెర్ట్ ఇన్
భారత్‌లో సగటున ప్రతి పది నిమిషాలకు ఒక సైబర్ నేరం నమోదైనట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్‌‌స టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) తెలిపింది. 2016లో సగటున ప్రతి 12 నిమిషాలకు ఒక నేరం జరిగేదని ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందని సెర్ట్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2017 జనవరి నుంచి జూన్ మధ్య ఫిషింగ్, నెట్‌వర్క్ స్కానింగ్, సైట్లలోకి చొరబాటు, వైరస్, ర్యాన్సమ్‌వేర్ వంటి తదితర మొత్తం 27,482 సైబర్ కేసులు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సైబర్ కేసుల్లో పెరుగుదల
ఎప్పుడు : 2017 ప్రథమార్థంలో
ఎవరు : సెర్ట్-ఇన్
ఎక్కడ : భారత్‌లో

మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్సు
కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్రం షీ బాక్స్ (సెక్సువల్ హరాస్‌మెంట్ ఎలక్ట్రానిక్ బాక్సు) పేరుతో ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ఉండే ఈ బాక్స్ ద్వారా పనిచేసే ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయవచ్చు. మొదట దీన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే వర్తింపచేస్తారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్స్
ఎప్పుడు : జూలై 24
ఎక్కడ : ఆన్‌లైన్‌లో
ఎందుకు : పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు

వందేమాతరం తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు 
తమిళనాడులోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలలో తప్పనిసరిగా వందేమాతర గేయాన్ని ఆలపించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో సోమ, శుక్రవారం అలాగే కార్యాలయాల్లో నెలకు ఒకసారి తప్పనిసరిగా పాడాలని న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులతో వారానికి రెండుసార్లు జాతీయ గేయాన్ని ఆలపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా నెలకు ఒకసారైనా వినిపించాలని అన్నారు. బెంగాలీ, సంస్కృతంలో పాడటం కష్టంగా ఉంటే దాన్ని తమిళంలోకి తర్జుమా చేయాలన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలి 
ఎప్పుడు : జూలై 25
ఎవరు : మద్రాస్ హైకోర్టు 
ఎక్కడ : పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు 

పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా గుజరాత్
పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాల జాబితాను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకన మిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) జూలై 18న ప్రకటించింది. మొత్తం 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం(ఢిల్లీ)తో రూపొందిం చిన ఈ జాబితాలో గుజరాత్‌కు మొదటి స్థానం దక్కింది. ఢిల్లీ రెండో స్థానంలో నిల వగా; ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మూడు, ఐదు స్థానాలు లభించాయి. వీటితో పాటు హరియాణా(4), తమిళనాడు(6), కేరళ(7), కర్ణాటక(9), మధ్యప్రదేశ్(10).. టాప్ 10లో నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో లభించే కార్మిక శక్తి, మౌలిక వసతులు, ఆర్థిక వాతావరణం, పాలన-రాజకీయ స్థిరత్వం, అవగాహన, భూములు వంటి ఆరు ముఖ్యాంశాలు, 51 ఉప అంశాలను బేరీజు వేసి ర్యాంకులను నిర్ణయించారు. 2016 జాబితాతో పోలిస్తే గుజరాత్, ఢిల్లీలు తిరిగి తమ స్థానాలను నిలబెట్టుకోగా.. హరియాణా, తెలంగాణ వేగంగా టాప్-5లోకి అడుగుపెట్టాయి. ఆర్థిక వాతావరణానికి సంబంధించి గుజరాత్ అగ్రస్థానంలో నిలవగా..మౌలిక సదుపాయాల కల్పనలో ఢిల్లీ తొలి ర్యాంకు సాధించింది. కార్మిక సమస్యలను తీర్చడంలో తమిళనాడు, భూముల విషయంలో మధ్యప్రదేశ్ ముందువరుసలో ఉన్నాయి.

నదుల అనుసంధానానికి 30 లింకుల గుర్తింపు
దేశంలో నదుల అనుసంధానానికి 30 లింకుల్ని గుర్తించినట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ లోక్‌సభలో తెలిపారు. ఇందులో ఎనిమిది లింకులు ఆంధ్రా, తెలంగాణ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానం కోసం గుర్తించిన 30 లింకుల్లో 16 నైరుతి రాష్ట్రాల్లో, 14 హిమాలయ ప్రాంతాల్లో ఉన్నట్లు వెల్లడించారు. వీటిపై సర్వే, పరిశోధన అనంతరం నైరుతి రాష్ట్రాల్లోని 14 లింకుల్ని, హిమాలయ ప్రాంతంలోని 2 లింకుల్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు. వీటికి డీపీఆర్‌లు రూపొందించేటప్పుడు పర్యావరణ, సామాజిక ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేస్తామన్నారు.
ఆంధ్ర, తెలంగాణల్లో గుర్తించినవి
మహానది(మణిభద్ర)-గోదావరి(ధవళేశ్వరం)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(పులిచింతల)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(నాగార్జునసాగర్)
గోదావరి(పోలవరం)-కృష్ణా(విజయవాడ)
కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా
కృష్ణా (శ్రీశైలం)-పెన్నా
కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నా(సోమశిల)
పెన్నా(సోమశిల)- కావేరి (గ్రాండ్ ఆనికట్)

పారామిలటరీ వైద్యుల ‘రిటైర్మెంట్’ పెంపు
కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్న వైద్యుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ జూలై 12న నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ మొదలైన కేంద్ర బలగాలతోపాటుగా అస్సామ్ రైఫిల్స్‌లో పనిచేస్తున్న జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసును మరో ఐదేళ్లు పెంచాలంటూ చాలాకాలంగా ప్రతిపాదన ఉంది. ఈ మేరకు వీరితోపాటుగా స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసునూ 60 నుంచి 65కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరితోపాటుగా కల్యాణి (పశ్చిమబెంగాల్), నాగ్‌పూర్ (మహారాష్ట్ర) ఎయిమ్స్ ఆసుపత్రులకు ఒక్కో డెరైక్టర్ పోస్టును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పారామిలటరీ వైద్యుల పదవీకాలం 65 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కేంద్ర కేబినెట్ 

మహారాష్ట్రలో ఉచిత గర్భనిరోధక ఇంజెక్షన్లు 
దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉచిత గర్భ నిరోధక ఇంజెక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. "అంతర" పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా.. గర్భ నివారణకు మాత్రలు వాడే మహిళలకు ఉచితంగా గర్భ నిరోధక ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భ నిరోధకానికి ఇది సురక్షితమైన పద్ధతని పేర్కొన్న ప్రభుత్వం... ఈ ఇంజెక్షన్ 3 నెలల పాటు పనిచేస్తుందని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర కార్యక్రమం ప్రారంభం 
ఎప్పుడు : జూలై 12
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం 
ఎక్కడ : మహారాష్ట్రలో
ఎందుకు : ఉచితంగా గర్భ నిరోధక ఇంజెక్షన్ల ఇచ్చేందుకు

‘సుస్థిర అభివృద్ధి’లో 116వ స్థానంలో భారత్
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దేశాల తాజా జాబితాలో భారత్‌కు 116వ స్థానం దక్కింది. మొత్తం 157 దేశాల్లో 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 58.1 పాయింట్లు పొందిన భారత్.. నేపాల్, ఇరాన్, శ్రీలంక, భూటాన్, చైనా కన్నా వెనుకంజలో ఉంది. పాకిస్తాన్ 122వ స్థానంలో నిలిచింది. 
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్న దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలేమీ కావని నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్, ఫిన్‌లాండ్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సుస్థిర అభివృద్ధిలో భారత్‌కు 116వ స్థానం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : Sustainable Development Solutions Network

గంగా నది ప్రక్షాళనకు నూతన మార్గదర్శకాలు 
కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. ఈ మేరకు నదిని పరిరక్షించేందుకు జూలై 13న మార్గదర్శకాలు జారీ చేసింది. 
మార్గదర్శకాలు..

‘అభివృద్ధి రహిత ప్రాంతం’(నో డెవలప్‌మెంట్ జోన్)గా హరిద్వార్- ఉన్నావోల మధ్య గంగా నది తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో తీరం నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దు.నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్ చేయరాదు.నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్ చేసినవారు పర్యావరణ పరిహారం కింద రూ.50 వేల జరిమానా.నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంజీసీ) కింద చేపట్టిన ప్రక్షాళన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలి.క్విక్ రివ్యూ: 
ఏమిటి : గంగా నది ప్రక్షాళనకు మార్గదర్శకాలు జారీ 
ఎప్పుడు : జూలై 13
ఎవరు : జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 

గుజరాత్‌లో హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం 
దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు కానుంది. 2023 నాటికి దేశంలో తొలి హై స్పీడ్ రైలుని ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. హైస్పీడ్ రైలు వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం 
ఎప్పుడు : జూలై 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్ 

సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత నిర్ణయించిన రాజస్తాన్ 
దేశంలోనే తొలిసారిగా రాజస్తాన్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, చేనేత, డైరీ తదితర సొసైటీలకు జరిగే పాలకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 5 నుంచి 8వ తరగతి విద్యార్హతలు నిర్దేశిస్తూ జూలై 13న కొత్త నిబంధనలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత
ఎప్పుడు : జూలై 13
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం 
ఎక్కడ : రాజస్తాన్‌లో 

రైల్వేల్లో బహుళ సేవలకు ‘సార్థి’ యాప్
బహుళ రైల్వే సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా రైల్వేశాఖ ‘రైల్ సార్థి’ అనే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. టికెట్ బుకింగ్, భోజనం ఆర్డర్ ఇవ్వడం, మహిళల రక్షణ తదితర అంశాలున్న ఈ యాప్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు జూలై 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ యాప్ వల్ల ప్రయాణికులకు వేర్వేరు వెబ్‌సైట్లను వెతికే ఇబ్బంది తప్పుతుందన్నారు. రైల్వే సేవలన్నీ ఒకేచోట లభించడమే ఇందుకు కారణమన్నారు. సార్థి యాప్ ద్వారా విమానం టికెట్లను సైతం బుక్ చేసుకోవచ్చని ప్రభు తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రైల్ సార్థి యాప్ ఆవిష్కరణ 
ఎప్పుడు : జూలై 14
ఎవరు : రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : రైల్వే సేవలన్నీ ఒకేచోట పొందేందుకు వీలుగా

కరువు నిర్ధారణకు కొత్త మార్గదర్శకాలు
కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. 
6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం
కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 
1) వర్షాభావ పరిస్థితులు 
2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రెస్పైల్) 
3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ) 
4) నార్మలైజ్డ్ డిఫరెన్స్‌ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్‌ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ) 
5) సాగు విస్తీర్ణం 
6) దిగుబడుల లెక్కవీటిలో ఐదు అంశాలు అనుకూలంగా ఉంటే కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇస్తారు. అప్పుడు నాలుగింటిని గీటురాయిగా తీసుకుంటారు.వర్షపాతం విషయానికి వస్తే 50 శాతానికి తక్కువగా ఉండాలి. వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండాలి.సాగు విస్తీర్ణాన్నీ లెక్కిస్తారు. పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవాలి. పశుగ్రాసానికి కొరత ఏర్పడాలి. అందులో ఇప్పటివరకు మధ్యస్థ, తీవ్ర కరువు ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటించారు. ఆ ప్రకారం కేంద్రం సాయం ప్రకటించేది. ఇకనుంచి కరువు సాధారణంగా ఉంటే ఆయా మండలాలను లెక్కలోకి తీసుకోరని అధికారులు అంటున్నారు. మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేయడం వల్ల కరువు మండ లాలు తగ్గే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా తీవ్ర కరువు పరిస్థితులను ఈ ఆరు అంశాల తీవ్రతను బట్టి నిర్ణయిస్తారని తెలుస్తోంది.క్విక్ రివ్యూ: 
ఏమిటి : కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో మార్పులు 
ఎప్పుడు : జూలై 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

ప్రజాదరణలో మోదీ సర్కారు టాప్
ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అగ్రస్థానం దక్కించుకుంది. 2016 సంవత్సరానికి ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ’(ఓఈసీడీ) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 73 శాతం భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు కేవలం 30% అమెరికన్లు మాత్రమే మద్దతు పలికారు. 
అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలుస్థానందేశంప్రజాదరణ శాతం1భారత్73 %2కెనడా62 %3టర్కీ58 %4రష్యా58 %5జర్మనీ55 %6దక్షిణాఫ్రికా48 %7ఆస్ట్రేలియా45 %8యూకే41 %9జపాన్36 %10అమెరికా30 %క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రజాదరణలో మొదటి స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 
ఎప్పుడు : జూలై 14
ఎవరు : ఓఈసీడీ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

ఫేస్‌బుక్ యూజర్లలో భారత్ టాప్ 
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. మొత్తం 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లతో భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్ మందే యాక్టివ్ యూజర్లున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్ అధిగమించిందని నెక్స్ట్‌వెబ్ సంస్థ జూలై 13న వెల్లడించింది. గత ఆరునెలల కాలంలోనే భారత్‌లో యాక్టివ్ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. మొత్తంగా 2 బిలియన్ యూజర్ల మార్కును దాటినట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫేస్‌బుక్ యూజర్లలో తొలిస్థానంలో భారత్ 
ఎప్పుడు : జూలై 13
ఎవరు : నెక్స్ట్‌వెబ్ సంస్థ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 
ఎందుకు : భారత్‌లో 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు

సీఎస్‌ఐ సర్వేలో రాయ్‌పూర్ విమానాశ్రయం టాప్ 
2017 జనవరి - జూన్ మధ్య కాలానికి గాను వెల్లడించిన ప్రయాణికుల సంతృప్తి సూచీ (సీఎస్‌ఐ)లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ స్వామి వివేకానంద విమానాశ్రయం తొలి స్థానంలో నిలిచింది. ఓ స్వతంత్ర ఏజెన్సీ.. రవాణా, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకొని 49 విమానాశ్రయాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో మొత్తం 5 మార్కులకు గాను రాయ్‌పూర్ విమానాశ్రయం 4.84 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఉదయ్‌పూర్, అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విమానాశ్రయాలపై సీఎస్‌ఐ సర్వే 
ఎప్పుడు : జూలై 14
ఎవరు : తొలి స్థానంలో రాయ్‌పూర్ విమానాశ్రయం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా

సౌరవిద్యుత్‌తో నడిచే తొలి రైలు ప్రారంభం 
సౌరవిద్యుత్(1600 హెచ్‌పీ) వ్యవస్థతో కూడిన తొలి డీఈఎమ్‌యూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలుని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు జూలై 14న సఫ్దర్‌జంగ్(న్యూఢిల్లీ) రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని సరై రోహిల్లా - హర్యానాలోని ఫరూక్‌నగర్ మధ్య నడుస్తుంది. రైలులోని చివరి ఆరు భోగీల్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో భోగీలో 16 సోలార్ పలకలను అమర్చారు. భోగీల్లోని లైట్లు, ఫ్యాన్లకు వీటి ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సౌరవిద్యుత్‌తో కూడిన డీఈఎమ్‌యూ రైలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 14 
ఎవరు : భారతీయ రైల్వే 
ఎక్కడ : న్యూఢిల్లీ

కేరళలో ఆటజిం ఇనిస్టిట్యూట్ 
ఆటిజం వ్యాధి(మెదడు అభివృద్ధిలో లోపాలు)తో బాధపడే చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేరళలో Center for Autism and other Disabilities Rehabilitation Research and Education (CADRRE) ఏర్పాటు కానుంది. 2017 సెప్టంబర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 
National Institute of Speech and Hearing (NISH) ఫౌండర్ డెరైక్టర్ జి.విజయరాఘవన్ ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపడతారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆటజిం ఇనిస్టిట్యూట్ 
ఎప్పుడు : 2017 సెప్టెంబర్‌లో 
ఎవరు : ఎన్‌ఐఎస్‌హెచ్ 
ఎక్కడ : కే రళలో 

రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం పోలింగ్
భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 17న ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో 99 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్. 
ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేయగా.. యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం పోలింగ్ 
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత ఎన్నికల సంఘం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వే స్టేషన్ 
దేశంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే మొదటి రైల్వే స్టేషన్‌గా ముంబైలోని మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. టికెట్ బుకింగ్ క్లర్క్, టీటీ, రైల్వే పోలీస్ తదితర హోదాల్లో ఈ స్టేషన్‌లో మొత్తం 30 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్‌కు మేనేజర్‌గా ఉన్న మమతా కులకర్ణి.. సెంట్రల్ రైల్వేలో ఈ హోదా పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వేస్టేషన్ 
ఎప్పుడు : జూలై 17
ఎక్కడ : మతుంగ రైల్వే స్టేషన్, ముంబై 

గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జూలై 18న నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. 
9 మంది సభ్యుల ధర్మాసనం జూలై 19 నుంచే విచారణ ప్రారంభించి.. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టుపై ఆదేశాలిచ్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
ఎప్పుడు : జూలై 18
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు

కర్ణాటకకు ప్రత్యేక జెండాకు కమిటీ ఏర్పాటు 
రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం.. జెండా రూపకల్పనకు 9 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు. 
దేశానికంతటికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏ రాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 
కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాష్ట్రానికి ప్రత్యేక జెండా కోసం కమిటీ 
ఎప్పుడు : జూలై 18 
ఎవరు : కర్ణాటక సీఎం సిద్ధారామయ్య 
ఎక్కడ : కర్ణాటక

రాజస్తాన్‌లో ఆవుల పోషణకు రోజుకి రూ. 70
ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్తాన్ ఆవుల పోషణకు (ఒక్కో ఆవుకి) రోజుకు రూ.70 అందించనుంది. దూడ కూడా ఉంటే మరో రూ.35 అదనంగా ఇవ్వనుంది. సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకాల లావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్ను విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 
రాజస్తాన్‌లో సామాన్యులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఒక్కొక్కరికి రూ.26.65. ఇక్కడ నగరాల్లో నివసిస్తూ రోజుకు రూ.28 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే గ్రామాల్లో రూ.25.16 కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ఈ కేటగిరీలోకి చేర్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆవుల పోషణకు రోజుకి రూ. 70
ఎప్పుడు : జూలై 5
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్‌లో 
ఎందుకు : ఆవుల సంరక్షణ కోసం 

జీఎస్టీని ఆమోదించిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుపై ప్రతిపాదించిన తీర్మానాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీ జూలై 5న ఆమోదించింది. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హసీబ్ డ్రాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేషనల్ కాన్ఫరెన్‌‌స(ఎన్‌సీ), కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ సభ్యుడు తీర్మానాన్ని వ్యతిరేకించారు. విపక్షాల అభ్యంతరాలపై మంత్రి సమాధానమిస్తూ 370 ఆర్టికల్ ద్వారా జమ్మూకశ్మీర్‌కు సంక్రమించిన ప్రత్యేక ప్రతిపత్తికి, ప్రత్యేక పన్నుల విధానానికి ఎలాంటి ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. 
కశ్మీర్ అసెంబ్లీ తీర్మానంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు జీఎస్టీ అమలుకు ఆమోదం తెలిపినట్లు అయింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీఎస్టీకి ఆమోదం 
ఎప్పుడు : జూలై 5
ఎవరు : జమ్మకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ 

కశ్మీర్‌లో అమల్లోకి వస్తు సేవల పన్ను 
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) జూలై 6 అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోనూ అమల్లోకి వచ్చింది. జమ్మూకశ్మీర్ జీఎస్టీ బిల్లు-2017ను మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రత్యేక హోదాకు విఘాతం కలుగుతుందని విపక్షాలు ఆరోపించగా.. జీఎస్టీ అమలుపై నెలకొన్న ఆందోళనలను పరిష్కారిస్తామని సీఎం మెహబూబా హామీ ఇచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీఎస్టీ అమలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 6
ఎవరు : జమ్ము కశ్మీర్ ప్రభుత్వం 
ఎక్కడ : జమ్ముకశ్మీర్‌లో 

సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు
ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) తెలిపింది. ఈ మేరకు ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ) 2వ నివేదికను జూలై 6న విడుదల చేసింది. ఇందులో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్‌లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు 
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

ఆధార్‌కు ఎఫ్‌ఎస్‌బీ ప్రశంసలు
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ పథకం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బ్యాంకింగ్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయడానికి, నగదు వ్యవహారాలను తగ్గించడానికి భారత్ ఆధార్‌ను వినియోగిస్తోందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్(ఎఫ్‌ఎస్‌బీ) అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ఆధార్ వినియోగం వల్ల రెమిటెన్‌‌స చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలు తగ్గే అవకాశమున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక విధానాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కరస్పాండెంట్ బ్యాంకింగ్ కోఆర్డినేషన్ గ్రూప్(సీబీసీజీ)ను ఎఫ్‌ఎస్‌బీ ఏర్పాటుచేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆధార్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు 
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ 

మైనారిటీలకు 100 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
మైనారిటీ యువత సంక్షేమం కోసం రానున్న ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో గరీబ్ నవాజ్ పేరిట వృత్తి విద్యా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జూలై 6న ప్రభుత్వ రంగ సంస్థ మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సమావేశంలో కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు నోయిడా, లక్నో, ముంబై, నాగపూర్, భోపాల్, పట్నా, రాంచీ తదితర జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మైనారిటీలకు 100 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు 
ఎప్పుడు : జూలై 6
ఎవరు : మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 

సూరత్‌లో పింక్ ఆటో సర్వీస్ 
మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే ఆటో సేవలను గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) ప్రారంభించింది. ‘పింక్ ఆటో సర్వీస్’ పేరుతో జూలై 2న ఆరంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలు గౌరవప్రదంగా జీవించేందుకు కార్పొరేషనే వారికి డ్రైవింగ్ నేర్పించి ఆటో కొనుక్కోవడానికి బ్యాంకు రుణాలను ఇప్పించింది. ఇందులో 25 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో లబ్ధిదారు నెలకు రూ.18 వేల వరకు సంపాదించగలుగుతుందని ఎస్‌ఎంసీ భావిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పింక్ ఆటో సర్వీస్ 
ఎప్పుడు : జూలై 2
ఎవరు : సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ 
ఎక్కడ : సూరత్, గుజరాత్ 
ఎందుకు : మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి

ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్
గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. యునెస్కో నిర్ణయంతో భారత్ చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్ 
ఎప్పుడు : జూలై 9
ఎవరు : యునెస్కో 

డిజిటల్‌లోకి మూడు విద్యా కార్యక్రమాలు
విద్యారంగానికి సంబంధించిన మూడు డిజిటల్ కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 9న ప్రారంభించారు. 
‘స్వయం’ ద్వారా విద్యార్థులు ఇంటర్నెట్ సదుపాయంతో ఆన్‌లైన్‌లో క్లాసులు వినొచ్చు. 
‘స్వయం ప్రభ’ ద్వారా డీటీహెచ్ రూపంలో విద్యార్థులు వారి ఇంట్లోని టీవీల్లో వచ్చే 32 విద్యా చానళ్ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ సేవలు ఉచితం కాగా డీటీహెచ్ ఏర్పాటుకు మాత్రం రూ.1,500 ఖర్చవుతుంది. 
అలాగే విద్యార్థులందరి ధ్రువపత్రాలను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపరచడం కోసం ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ని కూడా ప్రణబ్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వయం, స్వయం ప్రభ, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ కార్యక్రమాలు ప్రారంభం 
ఎప్పుడు : జూలై 9
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

‘విద్య’లో ముస్లింల వెనుకబాటు
విద్యాపరంగా మైనార్టీలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్యానెల్ వెల్లడించింది. కేంద్ర పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు మూడంచల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లింలలో సాధికారత వస్తుందని సూచించింది. వారికోసం 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, 5 జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని పేర్కొంది. పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలు లేదా నవోదయ విద్యాలయాల మాదిరిగా నడపాలని సూచించింది. 
మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిధుల ద్వారా నడిచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గతేడాది డిసెంబర్ 29న 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విద్యలో ముస్లింల వెనుకబాటు 
ఎప్పుడు : జూలై 9
ఎవరు : కేంద్ర నిధులతో నడిచే సంస్థ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం
గాలిపటాలకు ఉపయోగించే నైలాన్, సింథటిక్ మాంజాల వినియోగంపై దేశవ్యాప్తంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే నైలాన్, సింథటిక్ మాంజాల తయారీ, క్రయ విక్రయాలపై కూడా ఎన్జీటీ నిషేధం విధించింది. 
దేశంలో అనేక పండుగలకు గాలిపటాలను ఎగర వేయడం మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, వీటికి నైలాన్, సింథటిక్, చైనా మాంజాలను ఉపయోగిస్తున్నారు. అవి మనతో పాటు, పక్షులకు, జంతువులకు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా కొన్ని ప్రాణాంతక ప్రమాదాలకూ కారణమవుతున్నాయని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వం లోని బెంచ్ వ్యాఖ్యానించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం 
ఎప్పుడు : జూలై 11
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : పర్యావరణ, జంతు రక్షణలో భాగంగా 

పశువుల విక్రయంపై ‘స్టే’ ఇక దేశవ్యాప్తం
కబేళాల కోసం పశువుల క్రయవిక్రయాలను నిషేధిస్తూ కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్‌పై మద్రాసు హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు జూలై 11న దేశానికంతటికీ వర్తింపజేసింది. స్టేను ఎత్తివేయాలని తాము కోరడం లేదనీ, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి సవరించిన నోటిఫి కేషన్‌ను త్వరలోనే తెస్తామని కేంద్రం తరఫున్యాయవాది కోర్టుకు చెప్పారు. కేంద్రం నుంచి ఏ అభ్యంతరం లేకపోవడంతో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, మరో న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్టేను దేశవ్యాప్తంగా అమలు చేసింది. అలాగే కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే.. అది అమల్లోకి రాకముందైనా సరే ఎవరైనా సుప్రీం తలుపు తట్టవచ్చని ధర్మాసనం పేర్కొంది. జంతు వధశాలల కోసం పశువులను రైతులు అమ్మకుండా, వ్యాపారులు కొనకుండా నిషేధం విధిస్తూ కేంద్రం మే 23న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పశువుల విక్రయంపై దేశవ్యాప్తంగా స్టే 
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సుప్రీం కోర్టు 

వివాహాల తప్పనిసరి నమోదుకు లా కమిషన్ సిఫారసు
వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత లా కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు తన నివేదికను జూలై 4న సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. వివాహాల నమోదుకు అందరికీ వర్తించేలా ఒక సంస్థ ఏర్పాటుచేయాలని పేర్కొంది. దీంతో ప్రజల హక్కులకు మరింత రక్షణ కల్పిచడంతోపాటు మరిన్ని కొత్త హక్కులు లభిస్తాయని పేర్కొంది. ఏ సంప్రదాయం, వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా) ప్రకారం వివాహాలు జరిగినా నమోదు తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న జనన, మరణ నమోదు చట్టం-1969 కింద ఈ అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని సూచించింది. జనన, మరణాల నమోదుకు బాధ్యులుగా ఉన్నవారికే ఈ బాధ్యతాఅప్పగించాలని పేర్కొంది. సరైన కారణం లేకుండా వివాహ నమోదులో జాప్యం చేస్తే రోజుకు రూ.5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, నమోదును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించింది. 
వివాహాల నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాలు, ఇతరత్ర ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో భార్య పేరు రాయడంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రం జతచేయడాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. వివాహం ఏ దేశ చట్ట ప్రకారం జరిగినా భార్యాభర్తల్లో కనీసం ఒకరు భారతీయులైతే వారి వివాహాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నివేదించింది.

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రపై జూలై 10న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. గుజరాత్‌కు చెందిన యాత్రికుల బృందం అమర్‌నాథ్ యాత్ర ముగించుకొని బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఓటరు నమోదు కోసం ఫేస్‌బుక్‌తో ఈసీ జట్టు 
 ఓటర్ల నమోదు కార్యక్రమం గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు ఫేస్‌బుక్ భారత ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర 13 భారతీయ భాషల్లో జూలై 1 నుంచి 4 మధ్యలో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లకు రిమైండర్లు పంపనుంది. ఇందులోని రిజిస్టర్ నౌ బటన్‌ను .. నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్‌కు అనుసంధానం చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫేస్‌బుక్-ఈసీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు డ్రైవ్ 
ఎప్పుడు : జూలై 1 - 4
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : ఓటరు నమోదు కార్యక్రమం గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు


ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక 
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 29న షెడ్యూల్ జారీ చేసింది. జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. జూలై 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణ గడువు 21తో ముగుస్తుందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఆగస్టు 5న పోలింగ్ నిర్వహిస్తామని, అదే రోజు కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.
2016లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో ఈసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పోలింగ్‌లో ప్రత్యేక పెన్నులు ఉపయోగించనున్నారు. ఓటర్లు ఈ పెన్నుతో మాత్రమే తమ అభ్యర్థికి మార్కింగ్ చేయాలి. వేరే ఏ పెన్ను వాడినా ఓట్లు చెల్లదు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విప్ జారీ చేయడానికి వీల్లేదనీ ఈసీ స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : భారత ఎన్నికల కమిషన్ 
ఎందుకు : ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10న ముగుస్తున్నందున

సౌని యోజన కింద అజి డ్యాంకు నీటి తరలింపు 
సౌని యోజన (Saurashtra-Narmada Avataran Irrigation Yojana) కింద గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద ఉన్న అజీ జలాశయాన్ని నర్మదా నది నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 29న ప్రారంభించారు. ఈ పథకం కింద నర్మదా నదిలో అధిక ప్రవాహం ఉన్నప్పుడు సౌరాష్ట్ర పరిధిలోని 115 జలాశయాలకు నీటిని తరలిస్తారు. తద్వారా 10 లక్షల 22 వేల 589 ఎకరాలకు నీటిని అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అజి డ్యాంకు నీటి తరలింపు కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : నరేంద్రమోదీ
ఎక్కడ : గుజరాత్‌లోని రాజ్‌కోట్

నాథులా మార్గం ద్వారా మానస సరోవర యాత్ర రద్దు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సిక్కిం నాథులా మార్గం ద్వారా ఏటా సాగే కైలాస మానస సరోవర యాత్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 30న నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద చైనా-భారత్ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అయితే ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ నుంచి వెళ్లే యాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగనుంది. 
15,160 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస మానస సరోవర యాత్ర రెండు మార్గాల ద్వారా ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగుతుంది. హిందువులు, బౌద్ధులు, జైనులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మానస సరోవర యాత్ర రద్దు 
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో

పిల్లల చదువుకు సగటు ఖర్చు రూ. 12 లక్షలు
భారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.12.22 లక్షలని హెచ్‌ఎస్‌బీసీ ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్’ సిరీస్ ‘హయ్యర్ అండ్ హయ్యర్’ నివేదిక పేర్కొంది. ఇది.. ప్రాథమిక పాఠశాల నుంచి పన్నెండో తరగతి వరకు అవుతున్న వ్యయం. ప్రపంచ సగటు రూ.28.58 లక్షల (44,221 డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇందులో ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, రవాణా, వసతి తదితర ఖర్చులన్నీ ఉన్నాయి. అలాగే 59% మంది భారత తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం వేతనాల నుంచి ఖర్చు చేస్తుండగా, మరికొంతమంది సేవింగ్‌‌స, పెట్టుబడులు, ఇన్సూరెన్‌‌స ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. 
ప్రపంచవ్యాప్తంగా చూస్తే... హాంకాంగ్ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అత్యధికంగా సగటున రూ.85.42 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తరువాతి స్థానాల్లో యూఏఈ (రూ.64.23 లక్షలు), సింగపూర్ (రూ.45.85 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉండగా... ఫ్రాన్‌‌స రూ.10.8 లక్షలతో అట్టడుగున ఉంది. 
పీజీకే అధిక ప్రాధాన్యం 
భారత్‌లోని ప్రతి పది మందిలో 9 మంది (94 శాతం) తల్లిదండ్రులు తమ పిల్లలతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయించాలని భావిస్తున్నారు. వీరిలో 79 శాతం మంది అందుకు తగిన నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ద వ్యాల్యూ ఎడ్యుకేషన్ నివేదిక
ఎప్పుడు : జూలై 2
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ 
ఎక్కడ : భారత్‌లో పిల్లల చదువు కోసం సగటు ఖర్చు రూ.12.22 లక్షలు

గుజరాత్‌లో టెక్స్‌టైల్ ఇండియా - 2017 సదస్సు 
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టైక్స్‌టైల్ ఇండియా - 2017 ప్రదర్శన జరిగింది. జూన్ 30న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ప్రదర్శన జూలై 2 వరకూ కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర జౌళి శాఖ - పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య 65 ఒప్పందాలు కుదిరాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టెక్స్‌టైల్ ఇండియా - 2017
ఎప్పుడు : జూన్ 30 - జూలై 2 
ఎవరు : కేంద్ర జౌళి శాఖ 
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్ 

ఇన్నోవేట్ ఇన్ ఇండియా ప్రారంభం 
బయో ఫార్మాసూటికల్స్ అభివృద్ధి కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇన్నోవేట్ ఇన్ ఇండియా - i3 కార్యక్రమాన్ని జూలై 1న ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఉన్న బయో ఫార్మాసూటికల్స్ పరిశ్రమలను విద్యా సంస్థలతో అనుసంధానం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. తద్వారా దేశీయ ఫార్మా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం కోసం భారత్ 250 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇన్నోవెట్ ఇండియా కార్యక్రమం ప్రారంభం 
ఎప్పుడు : జూలై 1 
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ 
ఎందుకు : బయో ఫార్మా కంపెనీలు - విద్యా సంస్థల అనుసంధానం కోసం 

యువత కోసం ప్రధాని మోదీ పుస్తకం 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కోసం ఓ పుస్తకం రాయాలని సంకల్పించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం, మార్కుల కంటే విజ్ఞానం ఎందుకు ముఖ్యం, భవిష్యత్తు బాధ్యతను ఎలా స్వీకరించాలనే కీలక అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. తద్వారా పదవిలో ఉండగా పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ (పీఆర్‌హెచ్) ఇండియా ప్రచురిస్తున్న ఈ పుస్తకం డిసెంబర్‌లో పలు భాషల్లో మార్కెట్‌లోకి రానుంది. దీనికి స్వచ్ఛంద సేవాసంస్థ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సాంకేతిక విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యువత కోసం ప్రత్యేక పుస్తకం 
ఎప్పుడు : జూలై 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : పది, పదకొండు తరగతుల విద్యార్థుల కోసం 

పర్యాటక కేంద్రంగా మోదీ టీ స్టాల్
ప్రధాని మోదీ చిన్నతనంలో టీ అమ్మిన దుకాణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. గుజరాత్‌లోని మెహ్‌సన జిల్లా వడ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఆ టీ స్టాల్ ఉంది. మోదీ జన్మస్థలాన్ని ప్రపంచ పర్యాటక పటంలో కనిపించేలా తీర్చిదిద్దే భారీ ప్రాజెక్టులో భాగంగా టీ స్టాల్‌ను పర్యాటక ప్రాంతంగా మార్పు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు పురావస్తు శాఖల అధికారులు వడ్‌నగర్ పట్టణాన్ని సందర్శించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పర్యాటక కేంద్రంగా మోదీ టీ స్టాల్ 
ఎప్పుడు : జూలై 3
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ
ఎక్కడ : వడ్‌నగర్ రైల్వే స్టేషన్, మెహ్‌సన జిల్లా, గుజరాత్ 
ఎందుకు : మోదీ జన్మస్థలాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2017 జాతీయం
ప్రధానికి సలహాలు ఇవ్వనున్న సీఈవో గ్రూప్‌లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నీతి ఆయోగ్ సీఈవో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరు బృందాలుగా ఏర్పడిన 200 మంది సీఈవోలు.. ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సరళ వ్యాపారం, పరిపాలన తదితర అంశాల్లో ప్రధాని, కేంద్ర మంత్రివర్గానికి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 2022 నాటికి సరికొత్త భారత్, మేక్ ఇన్ ఇండియా, రేపటి నగరాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంశాలపై ఈ ఆరు బృందాలు పనిచేస్తాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆరు సీఈవో బృందాల ఏర్పాటు 
ఎప్పుడు : ఆగస్టు 21 
ఎవరు : నీతిఆయోగ్ 
ఎందుకు : అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు

మెంటార్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభం 
దేశవ్యాప్తంగా 900కుపైగా ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లోని విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన మెంటార్ ఇండియా క్యాంపెయిన్‌ను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆగస్టు 23న ప్రారంభించారు. ఇందులో భాగంగా నీతిఆయోగ్ ఎంపిక చేసిన వివిధ రంగాల్లోని నాయకులు(లీడర్స్) వారంలో రెండు గంటల పాటు విద్యార్థులతో సమావేశమవుతారు. తద్వారా విద్యార్థుల్లో డిజైన్, కంప్యూటేషనల్ నైపుణ్యాలు పెంపొందిస్తారు. 
అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఇన్నోవేషన్ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే ఆలోచనలకు రూపు ఇస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మెంటార్ ఇండియా కార్యక్రమం ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

సివిల్స్ అధికారుల కేటాయింపునకు జోనల్ విధానం 
సివిల్ సర్వీసెస్ అధికారులకు కేడర్ల కేటాయింపులో నూతన విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఓఎస్) అధికారులు ఇకపై రాష్ట్రాలకు బదులుగా జోన్ల కేడర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో జాతీయ సమగ్రత భావనను పెంపొందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
నూతన విధానం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 26 కేడర్లను 5 జోన్లుగా విభజించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం ప్రకారం అభ్యర్థి ప్రతి జోన్‌లోనూ ఒక రాష్ట్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఇకపై ఒకే జోన్‌లో రెండు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇవ్వడం కుదరదు.
ఏ జోన్లో ఏ రాష్ట్రాలు... 
జోన్-1: అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్తాన్, హరియాణా, కేంద్రపాలిత ప్రాంతాలు 
జోన్-2: ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా
జోన్-3: గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ 
జోన్-4: పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ 
జోన్-5: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ 

ఓబీసీ వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్ 
రిజర్వేషన్ ఫలాలను ఓబీసీలకు మరింత సమర్థవంతంగా అందేలా ఓబీసీ వర్గీకరణ చేపట్టేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిషన్ ఓబీసీ కేటగిరీల్లో (కేంద్ర జాబితాలోని)ని కులాలు, వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లను పరిశీలించి 12 వారాల్లో వర్గీకరణకు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలను ఖరారు చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఓబీసీల వర్గీకరణ జరిగింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఓబీసీ వర్గీకరణకు ప్రత్యేక కమిషన్ 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఓబీసీలకు మరింత సమర్థవంతంగా రిజర్వేషన్లను అందించేందుకు 

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే 
 వ్యక్తిగత గోప్యతపై దేశ అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం ‘రైట్ టు ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విసృ్తత ధర్మాసనం ఆగస్టు 24న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే.. ఆధార్‌పై ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. 
ఉల్లంఘనే అంటూ పిటిషన్లు..
కేంద్ర ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్ అనుసంధానించడం వ్యక్తిగత హక్కును ఉల్లంఘించడమేనని ఆందోళన వ్యక్తంచేస్తూ 2015లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్‌పై విచారించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది. ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు జులై 18న సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు ఉందా, లేదా అనే దానిపై చర్చించాలని, వీటిపై స్పష్టత వచ్చాకే ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణను చేపడుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇప్పుడే తొలిసారి కాదు..
వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టులో చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. 1954లో ఎంపీ శర్మ కేసులో భాగంగా వ్యక్తిగత గోప్యతపై చర్చ జరిగింది. ఆ తర్వాత 1963లో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ రెండు కేసుల్లో కూడా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని ధర్మాసనం తేల్చింది. ఆ తర్వాత 1970, 80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చినా.. సంఖ్యాపరంగా అవి చిన్న ధర్మాసనాలు కావడంతో.. 1954, 63లో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆధార్ అనుసంధానం చేయడంతో మరోసారి ఈ ప్రశ్న తలెత్తింది. అయితే గతంలో పరస్పర విరుద్ధ తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విసృ్తతమైన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. దీంతో తొమ్మిది మంది న్యాయమూర్తులతో విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. గతంలో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఏకగ్రీవంగా తేల్చింది.

తదుపరి తీర్పే కీలకం.. 
ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులకు, మొబైల్ కంపెనీ సిమ్‌లకు ఆధార్ కార్డును అనుసంధానించడంపై సందిగ్ధత ఏర్పడింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, ఆధార్‌పై అభ్యంతరాలను ప్రస్తావించలేదు. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికి తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు, వ్యక్తిగత గోప్యత కిందకే వస్తాయని పలువురు న్యాయవాదులంటున్నారు. అయితే ఇప్పటికే ఆధార్ అనుసంధానం ప్రక్రియ 80 శాతం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడేం చేస్తారనే విషయమై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ అనుసంధాన ప్రక్రియ వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుందా? వస్తే ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ పీటముడిపై ఏర్పడిన సందిగ్థతను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ‘గోప్యత’ అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? లేదా అనే దానిపై తీర్పు చెప్పనుంది.

గోప్యత అంటే! 
వ్యక్తిగత అన్యోన్యత, కుటుంబ జీవితం, వివాహం, సంతానం, ఇల్లు, లింగ నేపథ్యం వంటి అంశాలన్నీ గోప్యత కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ‘తన జీవితం ఎలా ఉండాలో కోరుకోవటం గోప్యత అవుతుంది. భిన్నత్వాన్ని కాపాడుతూ.. మన సంస్కృతిలోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గోప్యత సూచిస్తుంది. గోప్యతపై న్యాయపరమైన అంచనాలు సన్నిహితం నుంచి వ్యక్తిగతంలో, వ్యక్తిగతం నుంచి బహిరంగ అంశాల్లో వేర్వేరుగా ఉంటాయి. అయితే బహిరంగ వేదికపై వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకుండా చేయటం చాలా ముఖ్యం’ అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

సముద్ర గర్భ మిషన్‌ను ప్రారంభించనున్న భారత్ 
సముద్రం అడుగన ఉన్న సహజ వనరులను సరైన రీతిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సముద్ర గర్భ మిషన్ (డీప్ ఓషన్ మిషన్)ను చేపట్టనుంది. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వశాఖ (Ministry of Earth Sciences) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2018 జనవరిలో ప్రారంభించనున్నారు. 
భారత్‌కు 7,500 కి.మీ. తీర ప్రాంతం.. 2.4 మిలియన్ చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) ఉంది. భారత్‌కు చెందిన సముద్ర జలాల్లో అపారమైన శక్తి, ఆహారం, ఔషధ వనరులు ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డీప్ ఓషన్ మిషన్ 
ఎప్పుడు : 2018 జనవరి 
ఎవరు : భారత ప్రభుత్వం 
ఎక్కడ : భారత సముద్ర జలాల్లో 
ఎందుకు : సహజ వనరులను వెలికితీసేందుకు 

కేసుల సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ: నీతిఆయోగ్ 
న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించవచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. దీంతో పాటు ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారానే న్యాయవ్యవస్థలో నియామకాలను చేయాలని ప్రతిపాదించింది. కోర్టు పనితీరులో ప్రపంచశ్రేణి ప్రమాణాలను పాటించేందుకు ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్, ది ఫెడరల్ జ్యుడీషియల్ సెంటర్ (యూఎస్), ది నేషనల్ ఆఫ్ కోర్ట్్స (యూఎస్), సింగపూర్‌లోని సబా ర్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలని సూచించింది.

ఒకేసారి ఎన్నికలకు నీతి ఆయోగ్ సిఫార్సు 
 దేశంలో 2024 నాటికల్లా లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో, తగ్గించడమో చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. 2017-18 నుంచి 2019-20 కోసం రూపొందించిన త్రైవార్షిక ప్రణాళికలో ఈ విషయాలను ప్రస్తావించింది. అలాగే దేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్య కాదని, అర్హతలు, నైపుణ్యాలు ఉన్న వారికి ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు, వేతనాలు లభించకపోవడమే తీవ్ర సమస్యని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తీరప్రాంత ఉపాధి మండళ్ల (సీఈజడ్)ను ఏర్పాటు చేస్తే కొన్ని బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తరలి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిఫార్సు
ఎప్పుడు : 2024 నాటికి
ఎవరు : నీతి ఆయోగ్ 
ఎందుకు : ఎన్నికల వ్యయాన్ని తగ్గించేందుకు 

వైవాహిక అత్యాచారం నేరం కాదు : కేంద్రం 
భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని, అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. భర్తలను వేధింపులకు గురిచేయడానికి భార్యలకు అది ఒక సులభమైన ఆయుధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని (మారిటల్ రేప్)ను నేరంగా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్రం ఆగస్టు 29న అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 498 ఏ (గృహ హింస వ్యతిరేక చట్టం) దుర్వినియోగమవుతున్న సంగతి సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వైవాహిక అత్యాచారం నేరం కాదు 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ 

దక్షిణాది రాష్ట్రాల మధ్య ‘విద్యుత్’ సహకారం
దక్షిణాది రాష్ట్రాలు విద్యుత్‌ను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆగస్టు 22న ముగిసిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది.

ఛత్తీస్‌గఢ్‌లో ఉచితంగా స్మార్ట్ ఫోన్లు 
ఛత్తీస్‌గఢ్‌లో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. ఈ పథకానికి సంచార్ క్రాంతి యోజన అని పేరు పెట్టారు. 

దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభం
ముంబైలో ఏర్పాటుచేసిన విదేశ్ భవన్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 27న ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కార్యాలయం ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి మహారాష్ర్టలో ఉన్న అన్ని కీలక కార్యాలయాలు విదేశ్ భవన్‌లో ఉంటాయి.

కృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గింపు 
 మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు వైద్యశాలలు వాస్తవ వెల కన్నా లక్ష రూపాయకుల పైగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి... రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి. 
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మోకాలి మార్పిడి చికిత్సలు అవసరమైనవారు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, వారిలో ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్ష మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విసృ్తతంగా వాడే కోబాల్ట్-క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ.1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. ఇంతకుముందు దీనికి ఆసుపత్రులు గరిష్టంగా దాదాపు 9 లక్షల వరకు వసూలు చేసేవి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపు 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్రప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునేందుకు 

యూపీలో ఆన్‌లైన్‌లో మదరసాల నమోదు 
ఇస్లాం విద్యా సంస్థలు మదరసాల్లో అక్రమాలు నిరోధించేందుకు, వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. మదరసాల్లో అక్రమాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటి నమోదును ఆన్‌లైన్ చేయడం వల్ల మదరసాల నిర్వహణ, ఉపాధ్యాయులు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని వక్ఫ్ మంత్రి మోహసిన్ రాజా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న డిజిటల్ విధానంలో ఈ చర్య ఓ భాగం.

మధ్యప్రదేశ్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ 
మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే.. అటవీ శాఖకు మాత్రం ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. 12వ తరగతిలో 75 శాతం లేదా, సీబీఎస్‌ఈలో 85 శాతం పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య ఖర్చును బీజేపీ భరిస్తుందని చౌహాన్ ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మధ్యప్రదేశ్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 
ఎందుకు : వివిధ ప్రభుత్వ విభాగాల్లో అమలు

తమిళనాడులో ఒక్కటైన ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు 
ఆర్నెల్ల విభేదాల అనంతరం ఏఐఏడీఎంకే లోని పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనమయ్యాయి. అధికార మార్పిడి విషయంలో రెండు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం, ప్రభుత్వ బాధ్యతలు పళని స్వామి నిర్వర్తించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా పన్నీరు సెల్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలతోపాటు మరికొన్ని శాఖలను పన్నీర్ వర్గానికి ఇచ్చేందుకు కూడా సీఎం పళనిస్వామి అంగీకరించారు. ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఏంకే సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 
డిప్యూటీగా పన్నీర్ ప్రమాణం 
అనంతరం గవర్నర్ విద్యాసాగర్‌రావు పన్నీర్‌సెల్వంతో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ చేయించారు. డిప్యూటీ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం.. ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శాఖలను నిర్వహిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విలీనమైన పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు 
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఏఐఏడీఎంకే లోని రెండు వర్గాలు 
ఎక్కడ : తమిళనాడు 

2018 నాటికి ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
2018 మార్చి నాటికి పాస్‌పోర్టుల జారీ కోసం పోలీసులు భౌతికంగా వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్టు(సీసీటీఎన్‌ఎస్)ను విదేశాంగ శాఖ నేతృత్వంలోని పాస్‌పోర్టు సేవలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పోలీసులు భౌతికంగా వెరిఫికేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే వ్యక్తుల వివరాలు (గతంలో నేరచరిత్ర ఏమైనా ఉంటే) తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో భాగంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 21న న్యూఢిల్లీలో డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. 
దేశంలోని మొత్తం 15,398 పోలీస్ స్టేషన్లలో 13,775 స్టేషన్లను సీసీటీఎన్‌ఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ 
ఎప్పుడు : 2018 నాటికి 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో జాప్యాన్ని నివారించేందుకు 

రవాణా సేవలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి 
తెలంగాణలో రవాణా శాఖ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 23 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్సుల జారీ, యాజమాన్య హక్కు బదలాయింపు, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ తదితర సేవలకు ఆధార్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. 

ట్రిపుల్ తలాక్ చెల్లదు : సుప్రీంకోర్టు 
ముస్లింలు అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ చెల్లదనీ, ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు చెప్పింది. పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్ తలాక్ ఖురాన్ సూక్తులకు వ్యతిరేకమనీ, అంగీకారయోగ్యం కాదని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్‌లు ఇచ్చిన మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తేలుస్తూ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్ విడివిడిగా తీర్పులివ్వగా... జస్టిస్ లలిత్ మాత్రం నారిమన్ తీర్పుతో ఏకీభవించారు. అలా వీరిది మెజారిటీ తీర్పు అయి్యంది. కాగా మైనారిటీ తీర్పునిచ్చిన జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం విరుద్ధ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ట్రిపుల్ తలాక్ దీర్ఘకాలంగా వాడుకలో ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని... షరియా చట్టాలు కూడా ఆమోదిస్తున్నందున అది మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్-25 కిందకు వస్తుందన్నారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, ఆలోగా రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి ఈ అంశంలో చట్టం చేయడానికి ఏకతాటిపైకి రావాలని కోరారు. 
సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ 16న సుమోటోగా ఓ పిల్‌ను చేపట్టింది. సుప్రీం పిల్‌కు షాయరా భానోతోపాటు మరో నలుగురు బాధిత మహిళల పిటిషన్లూ తోడయ్యాయి. మరో రెండు పిటిషన్లను ఇతర సంస్థలు వేశాయి. మొత్తం ఈ ఏడు పిటిషన్లను సుమోటో పిల్‌తో కలిపి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి ఈ తీర్పునిచ్చింది. 
‘ఇన్‌స్టంట్’కే నో
సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది... ఉన్నపళంగా మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం (ఇన్‌స్టంట్) చెల్లదని మాత్రమే. అంతేకాని మొత్తం ట్రిపుల్ తలాక్ విధానాన్ని నిషేధించలేదు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు మూడురకాలు.
తలాక్-ఎ-అహ్‌సాన్: ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవడానికి సరైన మార్గంగా దీన్ని పరిగణిస్తారు. అహ్‌సాన్ అనే పదానికి అర్థం... అత్యుత్తమ లేదా సరైన. దీని ప్రకారం... భార్య రుతుక్రమంలో లేనప్పుడు... భర్త ఏకవాక్యంలో విడాకులు ఇస్తున్నట్లు చెప్పాలి. తర్వాత భార్య నిర్దేశిత కాలంపాటు నిరీక్షించాలి. ఈ కాలాన్ని ఇద్దత్ అంటారు. మూడు నెలసరులు ‘ఇద్దత్’గా ఉంటుంది. ఒకవేళ భార్య గర్భంతో ఉంటే శిశువు జన్మించేదాకా ఇద్దత్ కాలం ఉంటుంది. ఈ సమయంలోపు భర్త మనసు మార్చుకుంటే... తలాక్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఇద్దత్ కాలం ముగిస్తే మాత్రం విడాకులు మంజూరైనట్లే. 
తలాక్-ఎ-హసన్: పునరాలోచనకు తగినంత సమయం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంతవరకు మంచి పద్ధతిగానే పరిగణిస్తారు. ఈ విధానంలో మూడునెలల వ్యవధిలో నెలకోమారు చొప్పున భర్త మూడుసార్లు భార్యకు తలాక్ చెబుతాడు. తర్వాత విడాకులు మంజూరవుతాయి. ఒకవేళ ఆలోపు మనసు మార్చుకుంటే... వైవాహిక బంధాన్ని కొనసాగించవచ్చు. 
తలాక్-ఎ-బిద్దత్: ‘తలాక్... తలాక్... తలాక్’ అని వరుసగా మూడుసార్లు చెప్పేసి విడాకులు తీసుకోవడమే తలాక్-ఎ-బిద్దత్. షరియా చట్టం ప్రకారం ఇది చెల్లుబాటవుతోంది. ఒమేయద్ రాజులు విడాకులకు సులభమార్గంగా దీన్ని పరిచయం చేశారు. ఒక్కసారిగా మూడు పర్యాయాలు భర్త తలాక్ చెప్పాడంటే ఇక అంతే. విడాకులే. నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. 
క్షణికావేశంలో, అనాలోచితంగా నిర్ణయం తీసుకుని జీవిత భాగస్వామిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ... క్షణాల్లో విడాకులిచ్చేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తలాక్‌ను 22 ముస్లిం మెజారిటీ దేశాలు నిషేధించడం గమనార్హం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ట్రిపుల్ తలాక్ చెల్లదు 
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : సుప్రీంకోర్టు 

డిజిటల్ పోలీస్ పోర్టల్సేవలు ప్రారంభం
డిజిటల్ పోలీస్ పోర్టల్(డీపీపీ)ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగస్టు 21న ప్రారంభించారు. నేరాలు, నేరస్థులపై నిఘా నెట్‌వర్క్ వ్యవస్థలు (సీసీటీఎన్‌ఎస్) అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. నేరాలు, నేరస్థుల వివరాలతో జాతీయ సమాచార నిధి ఏర్పాటే సీసీటీఎన్‌ఎస్ లక్ష్యం. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు, వివరాల ధ్రువీకరణ, అభ్యర్థనలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 11 శోధన సదుపాయాలను, 46 నివేదికలను రాష్ట్ర పోలీస్ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, పరిశోధన సంస్థలు పొందొచ్చు. సీసీటీఎన్‌ఎస్ సమాచార నిధిలో ఇప్పటివరకు ఏడు కోట్ల నేరాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. 

ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో22 మంది మృతి
ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖత్‌లి వద్ద ఆగస్టు 19న పట్టాలు తప్పడంతో 22 మంది మరణించారు. 156 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

బిహార్ వరదల్లో 98 మంది మృతి 
బిహార్‌లో వరదల వల్ల ఆగస్టు 18 నాటికి 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాలకు చెందిన 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.13 లక్షల మంది 504 సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జాతీయ రహదారులతోపాటు 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. 70 మంది ఆర్మీ సిబ్బంది, 114 ఎన్‌డీఆర్‌ఎఫ్, 92 ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

బెంగళూరులో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2017 
 భారత్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆగస్టు 9, 10 తేదీల్లో బెంగళూరులో భారత సాంకేతిక సదస్సు జరిగింది. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది ‘పారిశ్రామిక విప్లవం 4.0’ పేరుతో సదస్సు నిర్వహించారు.భారత్ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు 10 అంశాలు కీలకమని భావించిన నిర్వాహకులు కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై చర్చలు జరిపారు. 
సదస్సులో భాగంగా వ్యవసాయంపై 200 మందితో వర్క్‌షాపు నిర్వహించారు. ఇక్రిశాట్, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్న ఈ వర్క్‌షాపులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, కూలీలు, సాగులో జాగ్రత్తలపై చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9, 10 
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : సాంకేతికతతో పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతిపై చర్చించేందుకు 

రిజర్వేషన్ల కోసం మరాఠాల భారీ ర్యాలీ
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సహా పలు డిమాండ్లతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠాలు ఆగస్టు 9న భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది మరాఠా ప్రజలు కాషాయ టోపీలు, జెండాలతో ముంబైలో ‘మరాఠా క్రాంతి మోర్చా’ పేరుతో మౌన ప్రదర్శన నిర్వహించారు. 12 కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారు. 
ర్యాలీతో వెంటనే స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తుతం ఓబీసీలకు 605 కోర్సుల్లో ఇస్తున్న ఉపకారవేతనాలు, సౌకర్యాలను మరాఠా విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, బీసీలకు మాదిరిగానే మరాఠా విద్యార్థులకు హాస్టళ్లు నిర్మిస్తామన్నారు. మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పించడాన్ని 2014లోనే బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2003-04లోనూ మరాఠాలను ఓబీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ తిరస్కరించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మరాఠా క్రాంతి మోర్చా ర్యాలీ 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : మరాఠాలు 
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం 

ఐటీఐలకు బోర్డు ఏర్పాటు చేస్తాం: కేంద్రం
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆగస్టు 9న వెల్లడించారు. ఐటీఐల్లో ప్రాక్టికల్‌కు 70 శాతం, ఎంచుకున్న సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు ఉండేలా జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు తరహాలో సర్టిఫికెట్లు జారీచేయడం వీలవుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐటీఐలకు జాతీయ బోర్డు 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : సీబీఎస్‌ఈ తరహాలో ఐటీఐ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు 

సైగలతో జాతీయ గీతాలాపన
సైగలతో జాతీయ గీతం ఆలపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఆగస్టు 10న విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలని.. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నామని మంత్రి అన్నారు. 
గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సైగలతో జాతీయ గీలాపన వీడియో 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతో

మదర్సాలు ‘పంద్రాగస్టు’ను చిత్రీకరించాలి: యూపీ ప్రభుత్వం 
ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడమేకాక, కార్యక్రమాన్ని ఫొటోలు తీసి, వీడియోలో చిత్రీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతపై సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించాలని పేర్కొంది. ఆదేశాల్ని పాటించని మదర్సాలపై చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమ సహాయ మంత్రి బల్‌దేవ్ హెచ్చరించారు. 

వితంతువుల పరిస్థితుల అధ్యయనానికి కమిటీ 
ఆవాస కేంద్రాల్లోని నిరుపేద వితంతువులకు తగిన గౌరవం దక్కడంలేదని సుప్రీం కోర్టు ఆగస్టు 11న ఆవేదన వ్యక్తం చేసింది. అసలు వారికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రద్దయిపోయినట్లు మనం ప్రవర్తిస్తున్నామని విస్మయం వ్యక్తం చేసింది. వితంతు పునర్వివాహం ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ అభిప్రాయపడింది. వితంతువులపై మూస ఆలోచనా ధోరణులకు వారి పునర్వివాహాలతో అడ్డుకట్ట వేయొచ్చంది. వితంతువుల పరిస్థితిపై కోర్టుకు చేరిన పలు నివేదికలను అధ్యయనం చేసి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సూచించాలని ఆదేశిస్తూ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వితంతువుల పరిస్థితుల అధ్యయనానికి కమిటీ 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : సుప్రీంకోర్టు 

10 ప్రాజెక్టులకు క్లీన్ గంగా మిషన్ ఆమోదం 
బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లతో చేపట్టే 10 ప్రాజెక్టులకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆమోదం తెలిపింది. వీటిలో 8 ప్రాజెక్టులు మురుగు నీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించినవి. మిగతా రెండు.. ఘాట్ల అభివృద్ధి, గంగా జ్ఞాన కేంద్రానికి సంబంధించినవి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గంగా నది శుద్ధికి 10 ప్రాజెక్టులు ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా 
ఎక్కడ : బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 

బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం 
బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు - 2017కు రాజ్యసభ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఇంతకముందే ఈ బిల్లుని ఆమోదించింది. రుణ ఎగవేతదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేస్తూ సవరణ బిల్లు తీసుకొచ్చింది. 
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) విలువ రూ.6.41 లక్షల కోట్లు కాగా మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిపి ఈ మొత్తం రూ. 8.02 లక్షల కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు - 2017కు ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : రుణ ఎగవేతదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు 

2022 నాటికి 60 గిగావాట్ల పవన విద్యుదుత్పత్తి 
కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశవ్యాప్తంగా 60 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆగస్టు 10న వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరాలంటే ఏటా 5,500 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 32.5 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2022 నాటికి 60 గిగావాట్ల పవన్ విద్యుత్ ఉత్పత్తి 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

ఓడీఎఫ్ ఆవాసాలుగా గంగా నది తీరంలోని గ్రామాలు 
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది తీరం వెంట ఉన్న 4,480 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత ఆవాసాలుగా(ఓడీఎఫ్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నిర్వహించిన "గంగా గ్రామ్ సమ్మేళన్" లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ మేరకు ప్రకటన చేశారు. నమామి గంగా కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. అలాగే... గంగా నది తీర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల పరిరక్షణ-పునరుజ్జీవం, సేంద్రీయ వ్యవసాయం వంటి కోసం "గంగా గ్రామ్" అనే కార్యక్రమాన్ని తోమర్ ప్రారంభించారు. తొలి దశలో 24 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఓడీఎఫ్ ఆవాసాలుగా గంగా నది తీరంలోని 4,480 గ్రామాలు 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
ఎక్కడ : బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ 

ఏనుగుల రక్షణకు గజ్ యాత్ర ప్రారంభం 
ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12న) సందర్భంగా దేశంలో ఏనుగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ''గజ్ యాత్ర'' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. వేటగాళ్ల బారి నుంచి ఏనుగులను రక్షించడం, అడవిలో నిఘా వ్యవస్థలను మరింత మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఏటా ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గజ్ యాత్ర ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : 12 రాష్ట్రాల మీదుగా 
ఎందుకు : ఏనుగుల సంరక్షణ కోసం 

గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం 
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఇందుకోసం రూ.85 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నామని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ వైద్య కళాశాలలో వారం రోజుల వ్యవధిలో 60కిపైగా చిన్నారులు చనిపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం 
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఉత్తరప్రదేశ్ 
ఎందుకు : బీఆర్‌డీ వైద్య కళాశాలలో చిన్నారుల మరణాల నేపథ్యంలో 

రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 35ఏ 
జమ్మూ కశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ ‘35ఏ’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ఆర్టికల్ లింగ వివక్షకు అనుకూలంగా ఉందా? రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందా? అన్న అంశాల్ని ఆ ధర్మాసనం పరిశీలించవచ్చని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 35ఏ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను.. అదే తరహా పెండింగ్ పిటిషన్‌లకు జతచేస్తూ వాటన్నింటిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 35ఏ 
ఎప్పుడు : ఆగస్టు 14 
ఎవరు : సుప్రీంకోర్టు 

"భారత్ కే వీర్" పై లైవ్ ట్వీటర్ వాల్ 
భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా "భారత్ కే వీర్" (Bharat Ke Veer) పోర్టల్‌ను ప్రచారం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లైవ్ ట్వీటర్ వాల్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం న్యూఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో అమరులైన సైనికులకు వందనాలు సమర్పిస్తూ hashtag Bharat Ke Veerతో చేసే ట్వీట్లు ఈ ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శితమవుతాయి. 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సీఏపీఎఫ్ అమరుల కుటుంబాలకు సహాయం చేసేందుకు 2017 ఏప్రిల్‌లో Bharat Ke Veer పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా విరాళాలు సమీకరిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ కే వీర్‌పై లైవ్ ట్వీటర్ వాల్ 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 
ఎందుకు : భారత్ కే వీర్ పోర్టల్ ప్రమోషన్ కోసం 

ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం 
కల్లోల కశ్మీర్‌ను మరొకసారి భూలోక స్వర్గంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కశ్మీర్ సమస్య దూషణలతోనో, తూటాలతోనో పరిష్కారం కాదని.. అందుకు కశ్మీరీలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, వారితో మమేకం కావడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. సంప్రదాయ కుర్తా, పైజామా, రాజస్తానీ తలపాగాతో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ప్రధాని ఆగస్టు 15న ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రధానిగా నాలుగోసారి ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. గత మూడేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక నిర్ణయాల్ని ప్రస్తావించారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సాహసోపేత నిర్ణయాలని అభివర్ణించారు. చైనాతో డోక్లాం వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సముద్రం, సరిహద్దులు ఎక్కడైనా సరే, ఎలాంటి భద్రతా సవాలునైనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందన్నారు. విశ్వాసాల పేరిట జరిగే హింస ఆమోదయోగ్యం కాదని, మతవాదం, కులతత్వం విషంతో సమానమని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొన్న ప్రకృతి విపత్తులను, యూపీ ఆస్పత్రిలో ఇటీవలి చిన్నారుల మరణాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. 

‘బ్లూవేల్’ లింక్‌లను తొలగించాలని కేంద్రం ఆదేశం 
ప్రమాదకర ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్‌లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేంద్రం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆగస్టు 11న గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్‌లకు ఓ లేఖ రాసింది. 50 రోజులపాటు సాగే బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో లీనమై ఇటీవల మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్‌లో ఒకరు పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆన్‌లైన్ గేమ్ బ్లూవేల్ లింకుల తొలగింపునకు ఆదేశం 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : విద్యార్థులు, యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నందున 

75 ఏళ్ల ‘క్విట్ ఇండియా’పై తీర్మానం
క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 9న లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఉభయసభల్లో సంబంధిత తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

కేరళ, హరియాణాలో 100 శాతం పారిశుద్ధ్యం
కేంద్రం నిర్వహించిన గ్రామీణ పారిశుద్ధ్య సర్వేలో కేరళ, హరియాణా ముందుండగా బిహార్ చివరి స్థానంలో నిలిచింది. సర్వే వివరాలను తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 8న విడుదల చేసింది. సర్వేలో భాగంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016 మే-జూన్ మధ్యన దేశవ్యాప్తంగా 4,626 గ్రామాల్లోని 1.4 లక్షల గ్రామీణ గృహాలను పరిశీలించింది. కేరళ, హరియాణాల్లో దాదాపు అన్ని గ్రామీణ గృహాలకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. బిహార్‌లో 30 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37 శాతం ఇళ్లలోనూ, దేశంలో 62.45 శాతం ఇళ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.

గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం: సుప్రీంకోర్టు
వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా? లేదా? అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం ఆగస్టు 2న తన తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు. 
మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ అభిప్రాయపడింది. భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 130 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే, దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోప్యత హక్కుపై విచారణ 
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : తీర్పుని రిజర్వులో ఉంచిన సర్వోన్నత న్యాయస్థానం 

రత్లే, క్రిష్ణగంగ ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు అనుమతి
జమ్మూ కశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న క్రిష్ణగంగ, రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే 1960నాటి సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి కొన్ని పరిమితులకు లోబడి ఆనకట్టల నిర్మాణాలు ఉండాలంది. పాకిస్తాన్, భారత్ నుంచి కార్యదర్శి స్థాయి అధికారులు తన వద్ద చర్చలు జరిపిన అనంతరం ఓ ప్రకటనను ప్రపంచ బ్యాంకు ఆగస్టు 1న విడుదల చేసింది. 
సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ నుంచి పాక్‌కు ప్రవహిస్తున్న పశ్చిమ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారత్... ఈ వ్యవహారంతో సంబంధంలేని ఇతర వ్యక్తి/సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. సింధునది ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై భారత్ 330 మెగావాట్ల సామర్థ్యంగల క్రిష్ణగంగ, 850 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాలను ఇప్పటికే ప్రారంభించగా, వీటిపై పాకిస్తాన్ అభ్యంతరాలు తెలుపుతూ వస్తోంది. ఈ ప్రాజెక్టుల ఆకృతులు సాంకేతికంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లం ఘిస్తున్నాయని పాక్ వాదిస్తోంది. వివాదాన్ని పరిష్కరించాలంటూ పాక్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. తాజాగా పాక్, భారత్ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఈ వారంలో భేటీ అయ్యారు. తదుపరి దఫా చర్చలు సెప్టెంబరులో జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రత్లే, క్రిష్ణగంగ ప్రాజెక్టులకు అనుమతి 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : జమ్ముకాశ్మీర్

అన్ని రంగాల్లోనూ అవినీతి జాఢ్యం: సుప్రీం
దేశవ్యాప్తంగా అన్ని కీలక రంగాల్లోనూ అవినీతి వేళ్లూనుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశాభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇది తీవ్ర అవరోధంగా మారిందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విధులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసమే తాము పనిచేస్తున్నామన్న సృ్పహ అధికారుల్లో ఉన్నప్పుడే అవినీతిని అరికట్టగలమని కోర్టు అభిప్రాయపడింది. 
20 ఏళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ నీరా యాదవ్, ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్‌లకు విధించిన శిక్షను సమర్థించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ప్రజలు లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించనంతవరకు ఈ జాఢ్యం నుంచి సమాజం విముక్తి పొందలేదని అభిప్రాయపడింది. అంతేకాకుండా బంధుప్రీతితో అనర్హులకు లబ్ధి చేకూర్చడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అన్ని రంగాల్లో అవినీతి జాఢ్యం ఉందని వ్యాఖ్య
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : సుప్రీంకోర్టు 

రహదారులపై 50 కి.మీ.కు ఓ వసతి కేంద్రం
జాతీయ రహదారులపై ప్రతి 50 కి.మీ.కు ఒక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కారీ ఆగస్టు 3న చెప్పారు. ఆ వసతి కేంద్రాల్లో ఆహార శాలలు, విశ్రాంతి గదులు, స్థానిక ఉత్పత్తుల విక్రయాలు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. జాతీయ రహదారుల గుండా వెళ్లే ప్రయాణికులు, డ్రైవర్లు సేద తీరేందుకు వసతి కేంద్రాలు ఉపయోగపడటంతోపాటు, స్థానిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కూడా ఉపకరిస్తాయని గడ్కారీ వివరించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రహదారులపై 50 కి.మీ.కు ఓ వసతి కేంద్రం 
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ప్రయాణికులు, డ్రైవర్లు సేద తీరేందుకు 

విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు- 2017ను లోక్‌సభ ఆగస్టు 4న ఆమోదించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఇప్పటికే విశాఖలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్‌కార్పొరేట్ చేసేందుకు గానూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఐపీఈ బిల్లు - 2017కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : లోక్‌సభ 
ఎందుకు : ఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిచ్చేందుకు 

హెలీ ట్యాక్సీ సేవలని ప్రారంభించిన బీఐఏఎల్ 
దేశంలో తొలిసారిగా హెలీ ట్యాక్సీ సేవల్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) అందుబాటులోకి తెచ్చింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆగస్టు 4న ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. బెంగళూరులోని పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలనుంచి ఎయిర్‌పోర్టుకు చేరాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. దీంతో తుంబీ ఏవియేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో బీఐఏఎల్ హెలీట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒక హెలికాప్టర్‌లో ఐదుగురు, మరో హెలికాప్టర్‌లో 13 మంది ప్రయాణించవచ్చు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో తొలి హెలీ ట్యాక్సీ సేవలు ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 4 
ఎవరు : బీఐఏఎల్
ఎక్కడ : బెంగళూరు 

మరణ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి 2017 అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు మినహా దేశమంతటా ఇది వర్తించనుంది. ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై రకరకాల డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ విషయమై తమ అభిప్రాయాలను అక్టోబర్ 1 కల్లా తెలియజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మరణ ధృవీకరణకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : 2017 అక్టోబర్ 1 నుంచి
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

‘అయోధ్య’ పిటిషన్ల విచారణకు బెంచ్
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఆగస్టు 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభిస్తుంది. 
అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆయోధ్య-బాబ్రీ పిటిషన్లపై విచారణకు బెంచ్ 
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు 

‘సంకల్ప్ పర్వం’గా ఆగస్టు 15
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న దేశప్రజలు ‘సంకల్ప్ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషిచేస్తామని పౌరులు ఆ రోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ ఏడాది ఆగస్టు 15న ‘సంకల్ప్ పర్వం’ నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తాజా ఉత్తర్వులో పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సంకల్ప్ పర్వ్ దినోత్సవం 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 

మసీదు నిర్మాణంపై షియా వక్భ్‌బోర్డు అఫిడవిట్ 
అయోధ్యలో రామ మందిరం-బాబ్రీ మసీదు సమస్యకు పరిష్కారంగా వివాదాస్పద స్థలానికి కొంచెం దూరంలో మసీదును నిర్మించవచ్చని ఉత్తరప్రదేశ్ షియా కేంద్ర వక్ఫ్‌బోర్డు ఆగస్టు 8న సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే బాబ్రీ మసీదు స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు తమదని చెప్పుకుంటుండటాన్ని షియా వక్ఫ్‌బోర్డు వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దీనిని ప్రస్తావిస్తూ మసీదు స్థలం తమదేననీ, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపే హక్కు తమకే ఉందని షియా వక్ఫ్‌బోర్డు పేర్కొంది. కొత్తగా నిర్మించే మసీదు, ఆలయం తగినంత దూరంలో ఉండాలనీ, ప్రార్థనా స్థలాల్లో ఒకమతం వారు వాడే లౌడ్ స్పీకర్ల వల్ల మరో మతం వారికి ఇబ్బంది ఉండకూడదని వక్ఫ్‌బోర్టు కోర్టుకు విన్నవించింది. 
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ మందిరాలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ పిటిషన్లను త్వరగా విచారించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును గతంలో కోరారు. దీంతో పిటిషన్లపై విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నియమించారు. 

పశువులకు ఆరోగ్య కార్డులు 
పశువుల సంఖ్య, ఆరోగ్య వివరాల సేకరణ కోసం కేంద్రం చేపట్టిన ‘యానిమల్ హెల్త్ కార్డ్’ కార్యక్రమాన్ని ఆగస్టు 8న తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాల మేరకు తమిళనాడులో వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు తదితర 105 కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా కోవై, సేలం, వేలూరు, విల్లుపురం, మదురై సహా ఏడు జిల్లాల్లో వీటిని అందజేస్తారు. 
మూడు రంగుల్లో కార్డులు 
పశువుల ఆరోగ్యాన్ని పరిశీలించడం, వాటి సంఖ్య, సంతానోత్పత్తి, వ్యాధులు తదితర వివరాలను సేకరించి ప్రతి పశువుకు 12 అంకెలు గల సిరీస్‌తో కార్డులో నమోదు చేస్తారు. సంకరజాతి, నాటు పశువు, బర్రె అని మూడు రకాలతో వేర్వేరు రంగుల్లో ఈ కార్డులను అందిస్తారు. పశువుల యజమానుల వద్ద పశువు ఫోటో, గుర్తులు, వయసు, గుర్తింపు నంబర్, పశువులకు వేసిన ఇంజెక్షన్ల వివరాలన్నీ ఉంటాయి. ఈ వివరాలన్నీ పశు సంరక్షణ విభాగ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. పశువులకు ప్రత్యేక కార్డులు ఇవ్వడం ద్వారా చోరీ సంఘటనలు, మాంసం కోసం అక్రమంగా తరలించడం వంటివి అడ్డుకోవచ్చునని పశు సంరక్షణ విభాగ అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యానిమల్ హెల్త్ కార్డ్ కార్యక్రమం 
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : కేంద్ర పశు సంవర్ధక శాఖ 
ఎక్కడ : కోయంబత్తూరు, తమిళనాడు 
ఎందుకు : పశువుల సమగ్ర వివరాలతో 12 అంకెల గుర్తింపు కార్డుల జారీకి 

ఆక్రమణలో 33 లక్షల ఎకరాల అటవీ భూమి
దేశంలో 33.21 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ ఆగస్టు 1న లోక్‌సభకు తెలిపారు. గోవా, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. తెలంగాణలో 7,551 ఎకరాలు, ఏపీలో 4,177 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 13 లక్షల ఎకరాలు, అసోంలో 7 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు.

భారత్‌లో వ్యవసాయం ప్రమాదకరం
భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయం చేయడం ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒక నివేదికలో పేర్కొంది. పంట ఎదిగే కాలంలో 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ప్రతి డిగ్రీకి 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగస్టు 1న ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన జర్నల్‌లో వెల్లడించింది. 2050 నాటికి దేశంలో భూతాపోన్నతి మరో మూడు డిగ్రీలు పెరుగుతుందని, అప్పుడు రైతుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. వారిలో 58 శాతం మంది రైతులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, పంటలు దెబ్బతిని ఏటా లక్షా 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2017 జాతీయం
సహకార సమ్మేళన్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 
మహారాష్ట్ర సహకార నేత లక్ష్మణ్ మాధవ్‌రావ్ ఇనామ్‌దార్ శతజయంతి సందర్భంగా సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలో నిర్వహించిన "సహకార సమ్మేళన్"లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇనామ్‌దార్‌పై రాసిన రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించిన మోదీ.. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపుచేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా రైతులకు సహాయం చేయాలని సహకార సంఘాలను కోరారు. తేనెటీగల పెంపకం, ఫార్మా రంగంలో మంచి డిమాండ్ ఉన్న సముద్రపు నాచు (సీవీడ్) పెంపకం వంటి కొత్త వాణిజ్య అంశాలపై దృష్టి పెట్టేలా వారిని ప్రోత్సహించాలన్నారు. 
1979లో ముంబై కేంద్రంగా ‘సహకార భారతి’ని స్థాపించిన ఇనామ్‌దార్.. సహకార సంఘాల ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సహకార సమ్మేళన్
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : మహారాష్ట్ర సహకార నేత లక్ష్మణ్ మాధవ్ రావ్ ఇనామ్‌దార్ శతజయంతి సందర్భంగా

పీఐబీకి పత్రికల సర్క్యులేషన్ బాధ్యతలు 
 దేశవ్యాప్తంగా పత్రికల సర్క్యులేషన్‌ను నిర్ధారించే బాధ్యతను ఇకపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కు అప్పగిస్తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎన్‌ఐ) ఈ బాధ్యతలు నిర్వర్తించేది. ఇప్పటికే పలువురు పీఐబీ అధికారులను ఇందుకోసం నియమిస్తూ సెప్టెంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు పత్రికల సర్య్కులేషన్ బాధ్యతలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ

ఖేలో ఇండియా పథకానికి కేబినెట్ ఆమోదం 
గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన వసతులు, చేయూతనందించేందుకు పునర్ వ్యవస్థీకరించిన ఖేలో ఇండియా పథకానికి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 21న ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా వెయ్యి మంది అథ్లెట్లకు ఏటా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల స్కాలర్‌షిప్ అందిస్తారు. అలాగే... దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 విశ్వవిద్యాలయాలను క్రీడా రత్నాల వేదికలుగా తీర్చిదిద్దుతారు. 
2017-18, 2019-20లలో ఈ కార్యక్రమానికి రూ.1,756 కోట్లు అవసరమవుతాయని కేంద్రం అంచనా వేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖేలో ఇండియా పథకానికి ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు, ప్రోత్సాహం కోసం 

న్యూఢిల్లీలో ఐఏఏ కొత్త క్యాంపస్ ప్రారంభం 
న్యూఢిల్లీలో అత్యాధునిక హంగులు, సౌకర్యాలతో నిర్మించిన ఇండియన్ ఏవియేషన్ అకాడమీ(ఐఏఏ) కొత్త క్యాంపస్‌ను పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సెప్టెంబర్ 21న ప్రారంభించారు. NIAMAR(National Institute of Aviation Management and research Society) విధానంలో భాగంగా 2010 జూలై 22న ఐఏఏను ఏర్పాటు చేశారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ, పరిశోధన, కన్సల్టేషన్ వంటి సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇండియన్ ఏవియేషన్ అకాడమీ కొత్త క్యాంపస్ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు
ఎక్కడ : న్యూఢిల్లీలో 

వారణాసిలో 14 ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22న రూ.1,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు బలువా, సామనే ఘాట్‌ల వద్ద రూ. 189 కోట్ల విలువైన రెండు వంతెనల్ని ప్రారంభించారు. జల్ అంబులెన్‌‌స (గంగానదిపై అంబులెన్‌‌స సేవలు), జల్ శవ్ వాహన్(గంగా నదిపై మృతదేహాల్ని తీసుకెళ్లే బోట్) సేవల్ని వీడియో లింక్ ద్వారా ప్రారంభించి వారణాసి నగరానికి అంకితం చేశారు. తుల్సీ మానస్ మందిర్‌లో రామాయణ్‌పై తపాలా బిళ్లను విడుదల చేశారు. వారణాసిలో దాదాపు రూ. 300 కోట్లతో నిర్మించిన దీన్‌దయాళ్ హస్తకళా వర్తక కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే వారణాసి నుంచి గుజరాత్‌లోని వడోదర, సూరత్‌లకు వెళ్లే మహామనా ఎక్స్‌ప్రెస్ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 14 ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్ 

మూడేళ్లు పూర్తి చేసుకున్న మన్ కీ బాత్ కార్యక్రమం 
ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేందుకే మన్ కీ బాత్ కార్యక్రమమని, తన సొంత అభిప్రాయాలు చెప్పేందుకు కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 24న ‘మన్ కీ బాత్’ 36వ మాసాంతపు కార్యక్రమంలో మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు చేరువయ్యేందుకే నిర్వహిస్తున్నామని చెప్పారు. 30 నిమిషాల ప్రసంగంలో.. సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు, మీడియా నిపుణులు, విశ్వ విద్యాలయాలు మన్ కీ బాత్‌పై విశ్లేషణలు చేసి.. దాని సానుకూలతలు, ప్రతికూలతల్ని ప్రచారం చేయాలని కోరారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మూడేళ్ల పూర్తిచేసుకున్న మన్ కీ బాత్ కార్యక్రమం 
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 

నగరాల్లో ఆరోగ్యంపై జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం
దేశంలోని నగరాల్లో ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహం.. ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. రోజువారీ అవసరాల కంటే తక్కువ మోతాదులో పోషకాలు, విటమిన్లు తీసుకుంటుండటం ఈ పరిస్థితికి కారణం కావచ్చని పేర్కొంది. ఈ మేరకు 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.72 లక్షల మందిపై చేసిన అధ్యయనం నివేదికను ఇటీవల విడుదల చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సంద ర్భంగా దేశంలోని నగరాల్లో నివసిస్తున్న వారి పౌష్టికత, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అంశాలపై ఈ అధ్యయనం నిర్వహించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలోని నగరవాసుల ఆరోగ్యం, పౌష్టికతపై అధ్యయనం 
ఎప్పుడు : 2015-16
ఎవరు : జాతీయ పోషకాహార సంస్థ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 

భారత్‌లో 2020 కల్లా 5జీ టెక్నాలజీ 
దేశంలో 2020 నాటికి 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరంను ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడటానికి రూ.500 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేయనుందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా సెప్టెంబర్ 26న వెల్లడించారు. 3జీ, 4జీ టెక్నాలజీల్లో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ప్రభుత్వం చేజార్చుకుందని, కానీ 5జీ ప్రమాణాలు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించాలని తాము భావిస్తున్నామని మంత్రి చెప్పారు. తద్వారా దేశీయంగా 50 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోడవంపై కేంద్రం దృష్టి సారించింది. 
ఈ మేరకు ఏర్పాటైన 5జీ ఇండియా 2020 ఫోరంలో టెలికం విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్, ఐటీ కార్యదర్శి అజయ్ కుమార్ సాహ్నీ, శాస్త్ర..సాంకేతిక విభాగం కార్యదర్శి అశుతోష్ శర్మతో పాటు టెక్నాలజీ నిపుణులు ఉంటారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2020 నాటికి 5జీ టెక్నాలజీ 
ఎప్పుడు : సెప్టెంబర్ 26 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : భారత్‌లో 

ప్రవాసుల కోసం మదద్ వెబ్‌సైట్
గల్ఫ్‌తోపాటు ఇతర దేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేం దుకు కేంద్ర ప్రభుత్వం ‘మదద్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు వారధిగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన 
 ముంబయి - అహ్మదాబాద్ మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి సెప్టెంబర్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుని నిర్మించనున్నారు. ఇందులో 468 కిలోమీటర్లు ఉపరితల రైల్వే మార్గం కాగా 27 కిలోమీటర్లు గొట్టపు మార్గం. ఇది సముద్రగర్భం గుండా సాగుతుంది. 
ప్రాజెక్టు ముఖ్యాంశాలు.. 
బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రూ.1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.88,000 కోట్లను కేవలం 0.1 శాతం వడ్డీకి జపాన్ రుణంగా అందిస్తోంది. ఈ రుణం మొత్తాన్ని 50 సంవత్సరాల్లో తీర్చాలి.ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 825 హెక్టార్ల భూమిని ఇప్పటికే సేకరించారు. ఈ మార్గంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ 508 కిలోమీటర్ల గమ్యాన్ని కేవలం 2 గంటల 58 నిమిషాల్లో చేరుకుంటుంది.ఈ మార్గంలో నడిపేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 4 రైళ్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. నిర్వహణ కోసం 4 వేల మంది భారతీయులకు రానున్న మూడేళ్లలో శిక్షణ ఇస్తారు. ఇప్పటికే భారతీయ రైల్వేకు చెందిన 300 మంది ప్రస్తుతం జపాన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.2020 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 20 వేల మందికి ఉపాధి దక్కుతుంది.క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముంబై - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి శంకుస్థాపన 
ఎప్పుడు : సెప్టెంబర్ 14 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే 
ఎక్కడ : అహ్మదాబాద్ 

గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్‌కు 103వ స్థానం 
గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్-2017లో భారత్ 103 స్థానంలో నిలిచింది. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సెప్టెంబర్ 13న ఈ నివేదికను విడుదల చేసింది. జాబితాలో నార్వే తొలి స్థానాన్ని దక్కించుకోగా.. ఫిన్‌లాండ్ రెండు, స్విట్జర్లాండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 
బ్రిక్స్ దేశాల పరంగా చూస్తే ఈ నివేదికలో భారత్‌దే అట్టడుగు స్థానం. 
గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్-2016లో భారత్ 105వ ర్యాంకులో నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం 
ఎక్కడ : 103వ స్థానంలో భారత్ 

రోహింగ్యాలకు సాయం కోసం ఆపరేషన్ ఇన్‌సానియత్ 
మయన్మార్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్‌కు భారీగా వస్తోన్న రోహింగ్యా శరణార్థులకు సాయం అందించేందుకు భారత్ 'ఆపరేషన్ ఇన్‌సానియత్' చేపట్టింది. ఇందులో భాగంగా రోహింగ్యా శరణార్థుల కోసం ఆహారంతో పాటు నిత్యావసర వస్తువులు, దోమ తెరలను సరఫరా చేస్తుంది. అలాగే.. బంగ్లాదేశ్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆపరేషన్ ఇన్‌సానియత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 14 
ఎవరు : భారత ప్రభుత్వం 
ఎక్కడ : బంగ్లాదేశ్‌లో 
ఎందుకు : రోహింగ్యా శరణార్థుల సహాయార్థం 

‘స్వచ్ఛత హీ సేవ’ ప్రారంభించిన రాష్ట్రపతి 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌కు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛత హీ సేవ’(స్వచ్ఛతే సేవ) ప్రచారం కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 2 వరకూ సాగే ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈశ్వరీ గంజ్ గ్రామంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. గ్రామాన్ని బహిర్భూమి రహితంగా మార్చేందుకు ఈశ్వరీగంజ్ గ్రామస్తులు చూపిన చొరవను రాష్ట్రపతి ప్రశంసించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వచ్ఛత హీ సేవ ప్రారంభం 
ఎప్పుడు : సెప్టెంబర్ 15 
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఎక్కడ : ఈశ్వరీ గంజ్ గ్రామం, ఉత్తరప్రదేశ్ 
ఎందుకు : స్వచ్ఛభారత్‌కు 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 

సర్దార్ సరోవర్ ఆనకట్టను ఆవిష్కరించిన ప్రధాని మోదీ 
గుజరాత్‌లోని దభోయ్ సమీపంలో కెవాదియా వద్ద నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్టను సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అనంతరం.. ఆనకట్టను జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం 1980లోనే ప్రారంభించినా.. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్యాం ఎత్తు పెంచుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఏడాది జూన్ 17న డ్యామ్ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. ఎత్తు పెంచిన ఆనకట్టనే తాజాగా మోదీ ప్రారంభించారు. 
ప్రయోజనాలివి... 
సర్దార్ సరోవర్ ఆనకట్టతో గుజరాత్‌లో 131 పట్టణ ప్రాంతాలు, 9,633 గ్రామాల (గుజరాత్‌లోని మొత్తం గ్రామాల్లో ఇది 53 శాతం)కు తాగునీరు లభిస్తుంది.గుజరాత్‌లో మొత్తం 15 జిల్లాల్లోని 3,112 గ్రామాల్లోని 18.54 లక్షల హెక్టార్ల ఎకరాలకు సాగునీరు.గుజరాత్‌తోపాటు రాజస్తాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మర్, జలోర్‌లో 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరు.

క్విక్ రివ్యూ: 
ఏమిటి : సర్దార్ సరోవర్ ఆనకట్ట ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 17 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : దభోయ్, గుజరాత్ 

రోహింగ్యాలతో జాతీయ భద్రతకు ముప్పు: కేంద్రం 
భారత్‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యా ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు రోహింగ్యాల వలసలపై సెప్టెంబర్ 18న కేంద్రం.. కోర్టు రిజిస్ట్రీకి సమగ్ర అఫిడవిట్‌ను సమర్పించింది. ప్రస్తుతం భారత్‌లోని రోహింగ్యా శరణార్థుల్లో కొందరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు ఐసిస్, లష్కరే తోయిబా, అల్‌కాయిదా తదితర ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని, వారు భారత్‌లోనే ఉంటే జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని విన్నవించింది. 
ఐక్యరాజ్యసమితి 1951 శరణార్థుల తీర్మానంపై భారత్ సంతకం చేయనందున రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న నిబంధనలు తమకు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలరీత్యా విధానపరమైన నిర్ణయాల ద్వారా రోహింగ్యాలను మయన్మార్‌కు తిప్పిపంపడానికి అనుమతించాలని సుప్రీంకోర్టుని కోరింది. 


గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్-2016 
దేశంలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య 17 లక్షలకు పైగానే ఉంది. ఇటీవల విడుదలైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్-2016 ఈ విషయాలను వెల్లడిస్తోంది. 2016లో దేశంలో మరణాలకు కారణమవుతున్న పది అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అందులో గుండె సంబంధిత వ్యాధులు తొలి స్థానంలో ఉన్నాయి. 2005లో కూడా గుండె సంబంధిత వ్యాధులదే ఫస్ట్ ప్లేస్. 
నివేదికలోని వివరాలు..

గుండె సంబంధిత వ్యాధుల వల్ల 2016లో దేశంలో 17 లక్షల మంది మరణించారు. 2005తో పోలిస్తే ఈ సంఖ్య 53 శాతం పెరిగింది.దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో గుండె సంబంధిత వ్యాధులు 17.8 శాతం ఉన్నాయి.డయేరియా వల్ల మరణాల సంఖ్య 2005తో పోలిస్తే 26 శాతం పెరిగింది. 2016లో 7,78,000 డయేరియా మరణాలు నమోదయ్యాయి.2016లో రెండో ప్రధాన కారణమైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల వల్ల దేశంలో 8,48,000 మంది ప్రాణాలు కోల్పోయారు.నాలుగో ప్రధాన కారణమైన పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల వల్ల 2016లో 6,94,000 మంది మరణించారు.నెలలు నిండకుండా పుట్టిన శిశు మరణాల సంఖ్య 2005తో పోలిస్తే 2016లో 43.6 శాతం తగ్గి 1,44,000గా నమోదైంది.క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్-2016 
ఎప్పుడు : సెప్టెంబర్ 19 
ఎక్కడ : భారత్‌లో 

చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం 
1960ల్లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలగకుండా చక్మా, హజోంగ్‌లకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బౌద్ధులైన చక్మాలు, హిందువులైన హజోంగ్‌లు మతహింస సహా వివిధ కారణాలతో 1964లో భారత్‌కు వలస వచ్చారు. అప్పుడు వారు 5 వేల మంది దాకా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు చేరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం 
ఎప్పుడు : సెప్టెంబర్ 13 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : అరుణాచల్ ప్రదేశ్‌లో 

కావేరి పుష్కరాలు 
కావేరి నది పుష్కరాలు సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యాయి. ఇవి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

రహదారి ప్రమాదాల్లో రోజుకు 400 మందికి పైగా మృతి
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 400 మందికి పైగా మరణిస్తున్నారు. ఇందులో సగానికిపైగా 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు వారే. ఈ మేరకు ‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు - 2016’ తాజా నివేదికను రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ సెప్టెంబర్ 6న విడుదల చేశారు. 
ఈ నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 4.1 శాతం మేర తగ్గింది. మొత్తంగా గత ఏడాది 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే 1,50,785 మంది ప్రాణాలు కోల్పోగా, 4,94,624 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో రోడ్డు ప్రమాదాలు - 2016 నివేదిక
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ
ఎందుకు : దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో రోజుకి 400 మందికిపైగా మృతి

1993 ముంబై పేలుళ్ల కేసు దోషులకు శిక్ష ఖరారు 
1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక టాడా కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ దారుణ మారణకాండలో క్రియాశీలకంగా వ్యవహరించిన.. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్‌లకు మరణశిక్ష, గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. కుట్రలో భాగస్వాములైన కరీముల్లాఖాన్‌కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్దిఖీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఫిరోజ్ ఖాన్‌కు రూ. 4.75 లక్షలు, కరీముల్లా ఖాన్‌కు రూ. 8.88 లక్షలు, తాహిర్ మర్చంట్‌కు రూ. 4.85 లక్షలు, అబూ సలేంకు రూ. 8.51 లక్షలు, రియాజ్ సిద్దిఖీకి రూ. 10వేల జరిమానా విధించింది. 
అసలేం జరిగింది? 
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చేశారు. దీనికి ప్రతీకారంగా దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం అనుచరులు వ్యూహం రచించారు. 1993 మార్చి12న ముంబైలో ఆర్డీఎక్స్ సాయంతో పలుచోట్ల భారీ విధ్వంసం సృష్టించారు. 13చోట్ల బాంబులను పేల్చారు. ఈ మారణకాండలో 257 మంది మృతి చెందగా.. 700 మందికి గాయాలయ్యాయి. 

విమానాల్లో 'నో ఫ్లై' జాబితా మార్గదర్శకాలు 
విమానయాన సంస్థల సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై మూడు నెలల నుంచి జీవిత కాలంపాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలిసారిగా ‘నో ఫ్లై’ జాబితాకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్ప్రవర్తన లేని ప్రయాణికుల జాబితాను సిద్ధం చేసింది. ప్రయాణికుల దురుసు ప్రవర్తనను మూడు రకాలుగా విభజించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ... తీవ్రతను బట్టి ఒక్కోదానికి ఒక్కో కాలపరిమితిగల శిక్షను ఖరారు చేసింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో.. భద్రతా ప్రమాణాల్లో భాగంగా ప్రపంచంలో ‘నో ఫ్లై’జాబితా రూపొందిస్తున్న మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. 
ముఖ్య మార్గదర్శకాలు..ప్రయాణికుడిపై విమాన పైలట్ ఇన్ కమాండ్ ఫిర్యాదు చేయవచ్చు. సదరు సంస్థ అంతర్గత కమిటీ దీనిపై 30 రోజుల్లోగా విచారణ జరపాలి.ఒకవేళ ఈ గడువు లోగా దర్యాప్తు పూర్తికాకపోతే సదరు ప్రయాణికుడు విమానాల్లో విహరించవచ్చు.దుష్ప్రవర్తన తీవ్రతను బట్టి ఎంత కాలం నిషేధం విధించాలన్నది కమిటీ నిర్ణయిస్తుంది.ప్రయాణికుడిపై తీసుకున్న చర్యలను విమానయాన సంస్థ కేంద్రానికి తెలపాలిహోంశాఖ సూచన మేరకు జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ప్రయాణికుల పేర్లను కూడా ‘నో ఫ్లై’జాబితాలో చేర్చాలి.ఈ నిబంధనలు అన్ని దేశీయ, విదేశీ విమాన సేవలకు, అన్ని విమానాశ్రయాలకూ వర్తిస్తాయి. అయితే ఓ దేశీయ విమానయాన సంస్థ ‘నో ఫ్లై’జాబితాకు ఇతర సంస్థలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఒక సంస్థ నిషేధించిన ప్రయాణికుడి విషయంలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఇతర విమాన సంస్థలకు ఉంటుంది.

3 రకాల నిషేధాలివే...
దూషణ: మూడు నెలల నిషేధం (తిట్టడం, మాటలతో వేధించడం, మద్యం సేవించి ఇబ్బంది కలిగించడం వంటివి) 
భౌతిక దాడి: ఆరు నెలల నిషేధం (తొయ్యడం, కొట్టడం, అసభ్య ప్రవర్తన) 
బెదిరించడం: రెండేళ్ల నుంచి జీవిత కాల నిషేధం (దీన్ని తీవ్రమైన చర్యగా భావిస్తారు. చంపుతానని బెదిరించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటివి) 
- నిషేధంపై ప్రయాణికుడు 60 రోజుల్లోగా మంత్రిత్వ శాఖ అప్పిలేట్ కమిటీని సంప్రదించవచ్చు. ఒకవేళ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు. 

మిలటరీ పోలీసులుగా మహిళలు
ఆర్మీలో పోలీసులుగా మహిళలను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు సెప్టెంబర్ 8న రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏడాదికి 52 మంది చొప్పున దాదాపు 800 మంది మహిళల్ని సైన్యంలో పోలీసులుగా నియమించనున్నారు. ఆర్మీలో పోలీసులుగా చేరిన మహిళల్లో కొందరిని కశ్మీర్ లోయకు కేటాయిస్తారు. స్థానిక మహిళలను తనిఖీ చేయడం సహా పలు విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. 
సెన్యంలో లింగభేదాలు తొలగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత సైన్యంలో పోలీసులుగా మహిళలను చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రక్షణ శాఖ

‘ఆధార్’ లేని సిమ్‌లు రద్దు 
ఆధార్‌తో అనుసంధానమవని సిమ్ కార్డులను ఫిబ్రవరి 2018 తర్వాత రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి సిమ్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలని, ఏడాదిలోగా దీన్ని అమలు చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత అనుసంధానం పూర్తికాని మొబైల్ సిమ్‌కార్డులను రద్దుచేయాలని భావిస్తోంది. దీని ద్వారా నేరస్తులు, ఉగ్రవాదులు, మోసగాళ్లు సిమ్‌కార్డులను వినియోగించేందుకు వీలుండదు.

న్యూఢిల్లీలో యంగ్ ఇండియా న్యూ ఇండియా సదస్సు 
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 ఏళ్లు పూర్తయిన సందర్భాలని పురస్కరించుకొని.. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 11న ' Young India New India - Resurgent Nation. From Sankalp to Siddi ' పేరిట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 125 ఏళ్ల క్రితం 9/11 (సెప్టెంబర్ 11)న చికాగోలో స్వామి వివేకానంద ఇచ్చిన శాంతి, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుని ఉంటే.. 16 ఏళ్ల క్రితం అమెరికాలో 9/11 ఘటన (డబ్ల్యూటీసీ టవర్ల కూల్చి వేత తదితర ఉగ్ర విధ్వంసం) చోటు చేసుకునేది కాదని అన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యంగ్ ఇండియా న్యూ ఇండియా సదస్సు 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ 
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎందుకు : పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 ఏళ్లు పూర్తయిన సందర్భాలని పురస్కరించుకొని 

కుంభమేళాపై ఇండస్ విశ్వవిద్యాలయం డాక్యుమెంటరీ 
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవంగా గుర్తింపు పొందిన కుంభమేళా ఇతివృత్తంపై అహ్మదాబాద్‌లోని ఇండస్ విశ్వవిద్యాలయం రూపొందించిన డాక్యుమెంటరీని... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెప్టెంబర్ 11న ఆవిష్కరించారు. భారతదేశ చరిత్ర, సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. 
దేశంలోని పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతాల్లో 12 ఏళ్లకోసారి కుంభమేళా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నాసిక్, ప్రయాగ, ఉజ్జయిని, హరిద్వార్‌లలో ఈ ఉత్సవం జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్‌లో మహా కుంభమేళా జరుగుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కుంభమేళా ఇతివృత్తంపై డాక్యుమెంటరీ 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఇండస్ విశ్వవిద్యాలయం
ఎక్కడ : అహ్మదాబాద్ 

కెంట్ ఆర్‌వో లఘుచిత్రం ఆవిష్కరణ
అద్భుతమైన కశ్మీర్ లోయ అందాలను వివరిస్తూ ‘కెంట్ ఆర్‌వో’ సంస్థ రూపొందించిన వాదీ-ఏ-కశ్మీర్ లఘుచిత్రాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 11న ఆవిష్కరించారు. అనంతరం షార్ట్‌ఫిల్మ్‌ను భారత్ తరఫున రాజ్‌నాథ్ కశ్మీర్‌కు అంకితమిచ్చారు.
కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా ‘లా అండ్ కెన్నెత్ సాచీ అండ్ సాచీ’ సంస్థ ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించింది. ఆరు నిమిషాల నిడివిగల ఈ చిత్రంలో కశ్మీరీల ఆప్యాయతతోపాటు, కెంట్ ఆర్‌వోలాగా కశ్మీరీలతో అన్ని రాష్ట్రాలవారి స్వచ్ఛమైన ప్రేమానుబంధాలను చూపించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కెంట్ ఆర్‌వో రూపొందించిన వాదీ-ఏ-కశ్మీర్ లఘుచిత్రం ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 
ఎందుకు : కశ్మీర్ లోయ అందాలను వివరించేందుకు

విడాకులకు ఆర్నెల్ల విరామం అక్కర్లేదు
దంపతులకు విడాకులు మంజూరు చేసేముందు.. పునరాలోచనకు అవకాశం కల్పించేందుకు కనీసం ఆర్నెల్ల సమయం ఇచ్చే నిబంధనను ఇకపై ట్రయల్ కోర్టులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని వచ్చిన దంపతులకు.. వారి మధ్య సయోధ్యకు అవకాశం లేదని విచారణ కోర్టు భావిస్తే.. ఆ నిబంధనను పాటించకుండానే విడాకులు మంజూరు చేయొచ్చని సెప్టెంబర్ 12న పేర్కొంది. 
హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం.. విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలైన తరువాత.. తదుపరి విచారణకు కనీసం ఆర్నెల్ల విరామం ఉండాలి. అయితే, ఆ చట్టంలో ఈ నిబంధన ఉన్న సెక్షన్ 13బీ(2)ను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, అది సలహాపూర్వకమైనది మాత్రమేనని, దంపతులిద్దరూ తిరిగి కలిసే అవకాశాల్లేవని విచారణ కోర్టు భావిస్తే.. తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం పేర్కొంది.

యుద్ధ విధుల్లోకి ఆర్మీ సివిల్ సిబ్బంది 
సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా ఆర్మీలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టనున్నట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 30న వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్మీలో సివిల్ విధులు నిర్వహిస్తున్న 57,000 మంది అధికారులు, జూనియర్ కమిషన్‌‌డ అధికారులను యుద్ధ విధుల్లోకి తీసుకోనున్నారు. 
ఆర్మీలో నిర్మాణాత్మక సంస్కరణల కోసం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకత్కర్ కమిటీ సమర్పించిన నివేదికలోని 99 సిఫార్సుల్లో 65 అంశాలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. 2019, డిసెంబర్ 31 నాటికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 39 సైనిక క్షేత్రాలను దశల వారీగా మూసివేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

పశ్చిమబెంగాల్ గోవిందోభాగ్ వరికి జీఐ గుర్తింపు 
 పశ్చిమబెంగాల్ బుర్ద్వాన్ జిల్లాలో పండే గోవిందోభాగ్ రకం వరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ లభించింది. ఈ మేరకు ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ (GIR) ఆగస్టు 30న ప్రకటించింది. గోబిందోభాగ్ రకం వరికి జీఐ ట్యాగ్ కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 2015లో జీఐఆర్‌కు దరఖాస్తు చేసింది.
ఉత్పత్తి, తయారీ పరంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ప్రత్యేక గుర్తింపు సాధించిన ఉత్పత్తులకు జీఐఆర్ జీఐ ట్యాగ్ ఇస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోవిందోభాగ్ వరికి జీఐ ట్యాగ్
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : జీఐఆర్
ఎక్కడ : బుర్ద్వాన్, పశ్చిమబెంగాల్ 

బోఫోర్స్‌పై పునర్విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోఫోర్స్ కుంభకోణం కేసును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 30 తర్వాత కేసు విచారణ చేపట్టనుంది.
విచారణలో భాగంగా 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోదీ.. హిందూజా సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్‌చంద్‌తో పాటు బోఫోర్స్ కంపెనీపై అభియోగాలను కొట్టేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 90 రోజుల గడువులోగా అప్పీలు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో 2005 అక్టోబర్ 18న బీజేపీ సీనియర్ నేత అజయ్ కుమార్ అగర్వాల్ సుప్రీంకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
బోఫోర్స్ కుంభకోణం నేపథ్యం
400 అత్యాధునిక తుపాకుల సరఫరా కోసం స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్, భారత ప్రభుత్వం మధ్య 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కోసం భారత్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు బోఫోర్స్ భారీ ముడుపులు చెల్లించినట్టు 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో ప్రకటించింది. దీంతో 1990 జనవరిలో సీబీఐ అప్పటి బోఫోర్స్ ప్రెసిడెంట్ మార్టిన్ ఆర్డ్‌బో, మధ్యవర్తి విన్ చద్దా, హిందూజా సోదరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బోఫోర్స్ కుంభకోణం కేసు పునర్విచారణకు అంగీకారం 
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : సుప్రీంకోర్టు

కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ 
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిమండలిని పునర్ వ్యవస్థీకరించారు. ఈ మేరకు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురికి కేబినెట్ హోదా ప్రమోషన్ లభించగా.. కొత్తగా తొమ్మిది మంది సహాయ మంత్రులుగా సెప్టెంబర్ 3న ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు మొత్తం మంత్రుల సంఖ్య 75(మోదీ కాకుండా)కి చేరింది.
కొత్తగా ప్రమోషన్ పొందిన మంత్రుల్లో నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్‌కు పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి.. పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖలు దక్కాయి. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. 
కేబినెట్ హోదా పొందిన మంత్రులు 
నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ 
ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి 
పీయూష్ గోయల్ - రైల్వే శాఖ 
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ వ్యవహారాలు 
కొత్త మంత్రుల శాఖలు 
రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక శక్తి (స్వతంత్ర) 
హర్‌దీప్ సింగ్ పురీ - గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి (స్వతంత్ర) 
అల్ఫోన్‌‌స కణ్ణాంథనం - పర్యాటకం, ఎలక్ట్రానిక్స్ (స్వతంత్ర) 
అశ్విని కుమార్ చౌబే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం (సహాయ) 
వీరేంద్ర కుమార్ - మహిళా, శిశు సంక్షేమ శాఖ (సహాయ) 
సత్యపాల్ సింగ్ - మానవ వనరుల అభివృద్ధి శాఖ, జల వనరుల శాఖ, నదుల అభివృద్ధి (సహాయ) 
గజేంద్ర షెకావత్ - వ్యవసాయం, రైతు సంక్షేమం (సహాయ) 
శివ ప్రతాప్ శుక్లా - ఆర్థిక శాఖ (సహాయ)
అనంత్‌కుమార్ హెగ్డే - నైపుణ్యాభివృద్ధి (సహాయ)

పార్లమెంటరీ కమిటీకి నల్లధనం నివేదికలు 
దేశంలో, విదేశాల్లో భారతీయుల నల్లధనం వివరాలపై మూడు అధ్యయన నివేదికల్ని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపింది. నల్లధనం వివరాల అంచనా బాధ్యతల్ని యూపీఏ హయాంలో మూడు సంస్థలకు అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్‌‌స అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ ఫరీదాబాద్‌లు నల్లధనం లెక్కల్ని రూపొందించి 2013, 2014ల్లో ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదికల్నే ఇప్పుడు ఆర్థిక శాఖపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం పంపింది. భారత్‌లో నల్లధనంపై ప్రభుత్వం తరఫున ఇంతవరకూ అధికారిక నివేదికల్లేవు. 
అమెరికా సంస్థ జీఎఫ్‌ఐ అధ్యయనం ప్రకారం 2005-14 మధ్య రూ.48.28 లక్షల కోట్ల నల్లధనం భారత్‌లోకి వచ్చింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పార్లమెంటరీ కమిటీకి నల్లధనం నివేదికలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ-ఢీల్లీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్-ఫరీదాబాద్

నల్లధనంపై ఎలాంటి సమాచారం లేదు : ఆర్‌బీఐ
పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా చలామణీ నుంచి ఎంత మేర నల్లధనం తొలగిపోయింది అనే విషయంపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదే విధంగా లెక్కల్లో చూపని ఎంత ధనం చట్టబద్ధంగా ఖాతాల్లోకి వచ్చిందన్న వివరాలు లేవని పేర్కొంది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దుపై స్థాయీ సంఘం లేవనెత్తిన అంశాలపై రిజర్వ్ బ్యాంక్ తాజాగా రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
డీమోనిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లోకి జమయిన పెద్ద నోట్ల విలువ సుమారు రూ. 15.28 లక్షల కోట్లు ఉంటుందని, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో కొంత మార్పులు, చేర్పులు ఉండొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, చైనా నిర్ణయం 
73 రోజులుగా భారత్-చైనా దేశాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లాం సమస్య, ఇతర సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 5న సమావేశమైన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. డోక్లాం వంటి సమస్యలు మళ్లీ ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచకుండా భద్రతా బలగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని నిర్ణయించారు. 
నిర్మాణాత్మక సంబంధాలపై.. 
భారత్-చైనా దేశాల అభివృద్ధికి తోడ్పాటునందించేలా సంయుక్త ఆర్థిక, భద్రత, వ్యూహాత్మక బృందాల ఏర్పాటుపైనా మోదీ-జిన్‌పింగ్ చర్చించారు. రక్షణ, భద్రతా బలగాలు బలమైన సంబంధాలను, సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇటీవల జరిగిన పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడాలని సమావేశంలో నిర్ణయించారు. పంచశీల శాంతి సూత్రాలు, పరస్పర రాజకీయ విశ్వాసం, పరస్పర ప్రయోజన సహకారం, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి విషయంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్ అన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, చైనా నిర్ణయం 
ఎప్పుడు : సెప్టెంబర్ 5 
ఎవరు : ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 
ఎక్కడ : చైనా 

‘క్రీమీలేయర్’లోకి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు 
ఓబీసీల్లోని సంపన్న వర్గమైన క్రీమీలేయర్ పరిధి విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 30న ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లోని కొన్ని పోస్టులు దీని కిందికి వస్తాయి. దీనివల్ల ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, కుటుంబీకులు ఓబీసీ కోటాలో రిజర్వేషన్‌కు దూరమవుతారు.

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2017 జాతీయం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల 
 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే... హిమాచల్‌ప్రదేశ్‌తో పాటుగానే డిసెంబర్ 18న గుజరాత్ ఎన్నికలకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ఏకే జోతి అక్టోబర్ 25న వెల్లడించారు. 
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని 50,128 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ధ్రువీకరణ పత్రాల (వీవీపీఏటీ)తో కూడిన ఈవీఎంలతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో ఒక పూర్తిస్థాయి మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఈసారి ఏర్పాటు చేయనున్నారు. 

నవంబర్ 8న ‘నల్లధన వ్యతిరేక దినం’
నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నవంబర్ 8తో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజును ‘నల్లధన వ్యతిరేక దినం’గా జరుపుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నల్లధనం వ్యతిరేక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారని ఆయన మీడియాకు వెల్లడించారు. 
మరోవైపు నవంబర్ 8న ‘బ్లాక్ డే’గా జరుపుకోవాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా 18 పార్టీలు పిలుపునిచ్చాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నల్లధన వ్యతిరేక దినం 
ఎప్పుడు : నవంబర్ 8న
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా 

బుల్లెట్ రైలుకు ‘చిరుత’ లోగో ఖరారు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1.08లక్షల కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు ‘లోగో డిజైన్’ పోటీలో 27 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ చక్రధర్ ఆళ్ల విజేతగా నిలిచారు. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న చిరుత పులి రైలు ఇంజన్‌పై కనిపించేలా ‘లోగో’ను సృష్టించి కాంపిటీషన్‌లో గెలిచాడు. ఈ మేరకు సతీశ్ గుజ్రాల్ నేతృత్వంలోని కమిటీ చక్రధర్ లోగోను తుది విజేతగా ప్రకటించింది. ఇకపై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై ఈ లోగోనే వాడనున్నారు. 
ప్రస్తుతం చక్రధర్ అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)లో గ్రాఫిక్ డిజైన్ పీజీ రెండో సంవత్సరం అభ్యసిస్తున్నాడు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కలుపుతూ 500 కి.మీ. పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ చేపడుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బుల్లెట్ రైలు లోగో ఖరారు 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : డిజైనర్ చక్రధర్ ఆళ్ల 

ఆధార్ లింక్ గడువు మార్చి 31 వరకు పొడగింపు
వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ గడువును ఇప్పటికీ ఆధార్ లేని వారికి (కొత్తగా నమోదు చేసుకొని లింక్ చేసుకోవాలి) మాత్రమే పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి అక్టోబర్ 25న వివరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంకే ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు పెంపు
ఎప్పుడు : 2018 మార్చి వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీలో అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు 
అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు అక్టోబర్ 26న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించేలా త్వరలోనే కొత్త వినియోగదారుల చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎక్కడ : న్యూఢ్లిలీలో 
ఎవరు : సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 

బోర్డింగ్ పాస్‌తో ఆధార్ కార్డు అనుసంధానం 
బోర్డింగ్ పాస్, తనిఖీల వంటివేవీ లేకుండా నేరుగా విమానం ఎక్కే వ్యవస్థ త్వరలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టికెట్ బుకింగ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకోగానే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, బ్యాగేజ్ వంటివి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలియజేసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఫేస్ రికగ్నిషన్, వేలిముద్ర, ఐరిస్ వంటి వాటిని పరిశీలించామని, వీటిల్లో ఆధార్ అనుసంధానం ద్వారా ముఖ గుర్తింపు వ్యవస్థను ఎంచుకున్నామని ఎయిర్‌పోర్టు సీఈఓ కిశోర్ వెల్లడించారు. 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఆరంభిస్తామని, ఫలితాలు పరిశీలించాక, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకున్నాక ఈ సేవల్ని ఆరంభిస్తామని తెలియజేశారు. దశల వారీగా బెంగళూరుతో పాటూ ఇతర విమానాశ్రయాలకూ దీన్ని విస్తరిస్తామని చెప్పారు.

అత్యాధునిక ఆయుధాలకు 40 వేలకోట్లు
అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత ఆర్మీ రూ.40 వేల కోట్లు వెచ్చించనుంది. ఇందులో భాగంగా 7 లక్షల రైఫిళ్లు, 44 వేల తేలికపాటి మెషిన్ గన్లు (ఎల్‌ఎంజీ), దాదాపు 44,600 కార్బైన్లను ఆర్మీ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు సరిహద్దులో చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలు అవసరమని ఆర్మీ పలుమార్లు చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అత్యాధునిక ఆయుధాలకు 40 వేల కోట్ల ఖర్చు
ఎప్పుడు : త్వరలో 
ఎవరు : భారత ఆర్మీ
ఎందుకు : చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో

రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆధార్ అనుసంధానం’ పిటిషన్
వివిధ సేవలు, సంక్షేమ పథకాల లబ్ధ్దికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ చివరి వారంలో విచారిస్తుందని సుప్రీంకోర్టు అక్టోబర్ 30న వెల్లడించింది. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ విజ్ఞప్తి మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజ్యాంగ ధర్మాసనానికి ఆధార్ అనుసంధానం కేసు
ఎప్పుడు : నవంబర్ చివరివారం 
ఎవరు : సుప్రీంకోర్టు

పటేల్ 142వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 
భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జయంతి వేడుకలను అక్టోబర్ 31న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం నుంచి.. ఇండియాగేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోదీ... తొలి కేంద్ర హోం మంత్రి రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత కారణంగానే దేశం నేడు ఐక్యంగా ఉందని అన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జయంతి వేడుకలు 
ఎప్పుడు : అక్టోబర్ 31 
ఎవరు : ఐక్యతా పరుగును ప్రారంభించిన ప్రధాని మోదీ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

కర్ణాటకలో ఉపేంద్ర "ప్రజ్ఞావంత జనతా పార్టీ"
కన్నడతో పాటు తెలుగు సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అక్టోబర్ 31న ప్రకటించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటన చేశారు. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించినట్లు చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలని ఉపేంద్ర అన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రజ్ఞావంత జనతా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన 
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : సినీ నటుడు ఉపేంద్ర
ఎక్కడ : కర్ణాటకలో 

రోడ్డు ప్రమాద కేసులపై వయసు ఆధారంగా పరిహారం 
రోడ్డు ప్రమాద బాధితులకు అందాల్సిన పరిహారంపై అక్టోబర్ 31న సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బాధితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి పరిహారం అందాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇన్సూరెన్‌‌స సంస్థలు బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై వేసిన పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది. 
తీర్పు వివరాలు..
బాధితుడు పర్మినెంట్ ఉద్యోగి అయి అతని వయసు 40 ఏళ్ల లోపు ఉన్నట్లయితే.. అతడి భవిష్యత్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ వేతనం (యాక్చువల్ శాలరీ) లో 50 శాతం అదనంగా చెల్లించాలి.బాధితుడి వయసు 40-50 ఏళ్లలోపున్నట్లయితే 30 శాతం అదనంగా, 50-60 ఏళ్ల లోపుంటే 15 శాతం అదనంగా చెల్లించాలి.బాధితుడు స్వయం ఉపాధి లేదా నిర్ణీత వేతన జీవి అయి 40 ఏళ్ల లోపు వాడైతే.. ఎస్టాబ్లిష్డ్ ఆదాయానికి అదనంగా 40 శాతం చెల్లించాలి.రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితుడు చనిపోయిన పక్షంలో.. అతని అంత్యక్రియలకు రూ.15వేలు చెల్లించాలి. ఇది కూడా ప్రతీ మూడేళ్లకోసారి 10 శాతం పెరుగుతుంది.
ఆధార్ లేదని రేషన్ నిరాకరించొద్దు
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు అందించే రేషన్ సరుకులను ఆధార్ లేదని, రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాలేదనే కారణాలతో నిరాకరించొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సాకులతో లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించరాదని అక్టోబర్ 26న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. జార్ఖండ్‌లో రేషన్ సరుకులు నిరాకరించడంతో ఓ కుటుంబంలోని 11 ఏళ్ల బాలిక ఆకలిని తట్టుకోలేక మరణించిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

వినియోగదారుల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సు
యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ఆధ్వర్యంలో వినియోగదారుల పరిరక్షణపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 26న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా 1986 నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సవరించి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు.

భారత్‌లో కాలుష్యంతో 25 లక్షల మంది మృతి 
 ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు భారత్‌లోనే అత్యధికమని అగ్రశ్రేణి వైద్య పత్రిక ది లాన్సెట్ పేర్కొంది. 2015లో కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది చనిపోతే, ఒక్క భారత్‌లోనే 25 లక్షల మంది మృత్యువాత పడ్డారని వెల్లడించింది. ఈ జాబితాలో 18 లక్షల మరణాలతో చైనా రెండో స్థానంలో ఉందన్నారు. ఐఐటీ ఢిల్లీతో పాటు అమెరికాకు చెందిన ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 
ప్రపంచ వ్యాప్తంగా 2015లో వాయు కాలుష్యంతో 65 లక్షల మంది చనిపోతే, నీటి కాలుష్యంతో 18 లక్షల మంది, పని ప్రదేశంలో కాలుష్యంతో 8 లక్షల మంది దుర్మరణం చెందారని నివేదిక వెల్లడించింది. పారిశ్రామికంగా వేగంగా పురోగమిస్తున్న భారత్, చైనా, పాక్, బంగ్లాదేశ్, మడగాస్కర్, కెన్యాల్లో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరు కాలుష్యం కారణంగానే మరణించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య మరణాలపై ది లాన్సెట్ నివేదిక 
ఎప్పుడు : 2015లో
ఎక్కడ : భారత్‌లో 25 లక్షల మంది మృతి 
ఎందుకు : వాతావరణ కాలుష్యం కారణంగా 

కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ 
అక్టోబర్ 19న దీపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకున్న ప్రధాని మోదీ అక్టోబర్ 20న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదార్‌నాథుడికి రుద్రాభిషేకం చేశారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యాలు మెరుగుపరచటం, మందాకినీ, సరస్వతి నదుల రిటైనింగ్ వాల్స్, ఘాట్‌ల నిర్మాణం, దేవాలయానికి వెళ్లే రోడ్డును పునర్నిర్మించటం, వరదల్లో ధ్వంసమైన ఆది గురు శంకరాచార్య సమాధిని పునరుద్ధరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్‌ను అభిమాన పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. 2022 కల్లా ఈ రాష్ట్రం పూర్తి ఆర్గానిక్ రాష్ట్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
అండమాన్‌లో వేడుకల్లో నిర్మలా 
బంగాళాఖాతంలోని అత్యంత వ్యూహాత్మక త్రివిధ దళాల కేంద్రమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సైనికులతో కలిసి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భద్రతా సన్నద్ధతను సమీక్షించారు. అండమాన్ నికోబార్ కమాండ్ ఏరియా ప్రాంతంలోని కోస్ట్ గార్డ్ బేస్, నౌకాదళ కేంద్రాలనూ ఆమె సందర్శించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ 
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : ఉత్తరాఖండ్ 

గుజరాత్‌లో రోరో ఫెర్రీ సర్వీసులు ప్రారంభం 
సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంతో అనుసంధానించే ‘రోరో’ ఫెర్రీ సర్వీసులను (రోల్ ఆన్-రోల్ ఆఫ్) ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న ప్రారంభించారు. భరూచ్ జిల్లా ఘోఘా- భావ్‌నగర్ జిల్లా దహేజ్ మధ్య ఈ సేవలు నడుస్తాయి. 100 మంది అంధ విద్యార్థులతో కలిసి ఘోఘా నుంచి దహేజ్ వరకూ ఫెర్రీలో ప్రధాని ప్రయాణించారు. మొదటి దశ ఫెర్రీ సేవల్ని కేవలం ప్రయాణికుల కోసమే ప్రారంభించారు. రెండు నెలల అనంతరం ప్రారంభమయ్యే రెండో దశలో కార్లు వంటి తేలికపాటి వాహనాల్ని కూడా తరలించవచ్చు. ఈ ఫెర్రీ సేవలతో ఘోఘా-భరూచ్‌ల మధ్య రోడ్డు మార్గం ద్వారా ఉన్న దూరం 330 కి.మీ. కాగా, జలమార్గంలో అది కేవలం 30 కి.మీ. మాత్రమే. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోరో ఫెర్రీ సర్వీసులు ప్రారంభం 
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : భరూచ్ జిల్లా ఘోఘా- భావ్‌నగర్ జిల్లా దహేజ్ మధ్య
ఎందుకు : సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంలో అనుసంధానించేందుకు

ఎయిర్‌పోర్టుల భద్రతకు సోషల్ మీడియా 
దేశంలోని ఎయిర్‌పోర్టులు, అణువిద్యుత్, అంతరిక్ష కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణ, పటిష్టానికి తొలిసారిగా సోషల్ మీడియా సమాచారాన్ని వినియోగించబోతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు రక్షణ కల్పిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం(సీఐఎస్‌ఎఫ్) చెన్నై సమీపంలోని అరక్కోణం వద్ద సోషల్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శిక్షణ పొందిన సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు సోషల్ మీడియా ట్రెండ్‌‌స, వార్తలు, నివేదికలు, ఇతర సమాచారాన్ని సమన్వయపరిచి ఎయిర్‌పోర్టులు, ఇతర కీలక సంస్థలకు వాటిని ఎప్పటికప్పుడు చేరవేస్తారు. ఇందుకోసం ట్వీటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఫ్లికర్‌ల సేవల్ని వాడుకోనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎయిర్‌పోర్ట్‌ల భద్రతకు సోషల్ మీడియా కేంద్రం 
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : సీఐఎస్‌ఎఫ్ 
ఎక్కడ : అరక్కోణం, చెన్నై 
ఎందుకు : ఎయిర్‌పోర్ట్‌లు, అణు విద్యుత్, అంతరిక్ష కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణకు 

100 సీసీ లోపు బైక్‌లపై డబుల్స్ నిషేధం
100 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ప్రయాణించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఒకవేళ వెనక సీటు ఉంటే కొత్త వాహనాల(100 సీసీ కంటే తక్కువ) రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అక్టోబర్ 13న ఆ రాష్ట్ర రవాణా శాఖ జీవో విడుదల చేసింది. ఒక రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిబంధనల్ని అమల్లోకి తెచ్చారు. అలాగే 100 సీసీ లోపు వాహనాలకు వెనుక సీట్లు ఉంటే కొత్తగా రిజిస్టర్ చేయవద్దని, ఇప్పటికే రిజిస్టర్ చేసి ఉంటే వెనుక సీట్లలో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 100 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలపై డబుల్స్ నిషేధం 
ఎప్పుడు : అక్టోబర్ 23 నుంచి 
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం 
ఎక్కడ : కర్ణాటకలో 

జాతీయ గీతం ప్రసార నిబంధనల మార్పునకు సుప్రీంకోర్టు సూచన 
సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరంది. సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది.

లక్నో-ఆగ్రా హైవేపై యుద్ధవిమానాల ల్యాండింగ్
అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) ‘టచ్ అండ్ గో’ పేరుతో కసరత్తులు నిర్వహించింది. ఈ మేరకు ఐఏఎఫ్ యుద్ధ, రవాణా విమానాలు అక్టోబర్ 24న ఎక్స్‌ప్రెస్‌వేపై దిగి అనంతరం గాల్లోకి ఎగురుతూ తమ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. లక్నోకు 65 కి.మీ. దూరంలోని ఉన్నావ్ జిల్లా బంగర్‌మౌ సమీపంలో చేపట్టిన కసరత్తుల్లో 12కు పైగా మిరేజ్-2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో పాటు 35 వేల కిలోల బరువైన సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానం పాలుపంచుకున్నాయి. 
సీ-130జే విమానాలు 2010లో వాయుసేనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎక్స్‌ప్రెస్ వేపై దిగడం మాత్రం ఇదే మొదటిసారి. ఒకేసారి 200 మంది కమాండోలను తరలించే సామర్థ్యం దీని సొంతం. ధర దాదాపు రూ. 900 కోట్లు. ఇక 2015, 16ల్లో మిరేజ్-2000 విమానాలు యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ‘టచ్ అండ్ గో’ డ్రిల్‌లో పాలుపంచుకోగా.. గత నవంబర్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఆరు సుఖోయ్-30 జెట్‌లు యుద్ధ సన్నద్ధతను చాటిచెప్పాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత వాయుసేన ‘టచ్ అండ్ గో’ కసరత్తులు 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎక్కడ : లక్నో - ఆగ్రా జాతీయ రహదారిపై 
ఎందుకు : అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు 

రైతుల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పథకం
రైతులకు దన్నుగా ఉండాలనే లక్ష్యంతో అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘భవంతర్ భుగ్దాన్ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు, వ్యాపారి సరకును కొనే మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

అఖిల భారత ఆయుర్వేద సంస్థ ప్రారంభం
ఢిల్లీలో నిర్మించిన తొలి అఖిల భారత ఆయుర్వేద సంస్థను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 17న (ఆయుర్వేద దినోత్సవం) జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య విధానాల కిందఆరోగ్య విప్లవాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగా గత మూడేళ్లలో 65 ఆయుష్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు.

ఏడవ వేతన సంఘం సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసులను అమలుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో అక్టోబర్ 11న సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా యూజీసీ నిధులతో నడిచే 106 యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే 329 యూనివర్సిటీలు, వర్సిటీలకు అనుబంధంగా ఉన్న 12,912 ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లోని 7.58 లక్షల మంది టీచర్లు, ప్రొఫెసర్లు, బోధన సిబ్బందికి లబ్ధి జరుగుతుంది. వీరితోపాటుగా 119 కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎస్‌సీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీఐఈల్లోని ఉపాధ్యాయులకూ వేతనాలు పెరుగుతాయి. 
ఈ వేతన సవరణ అమలు వల్ల ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, అకడమిక్ ఉద్యోగుల వేతనాల్లో రూ.10,400 నుంచి 49,800 వరకు పెంపుదల ఉంటుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే విద్యాసంస్థల్లో వేతన సవరణ మార్పులకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం అవసరం. అయితే.. మార్చిన తర్వాత పెరిగే వేతనాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,800 కోట్ల భారం పడుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏడవ వేతన సంఘం సిఫారసులకు ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : యూనివర్సిటీల్లో టీచర్లు, ప్రొఫెసర్లు, బోధన సిబ్బందికి వేతనాల పెంపు కోసం 

సంకల్ప్, స్ట్రైవ్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం 
రూ.6,655 కోట్ల ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకొచ్చే సంకల్ప్ (స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్‌‌జ అవేర్‌నెస్ ఫర్ లైవ్‌లీహుడ్ ప్రమోషన్), స్ట్రైవ్ (స్కిల్ స్ట్రెంతెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్‌హాన్‌‌సమెంట్) పథకాలకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 11న ఆమోదం తెలిపింది. అలాగే.. వచ్చే మూడునుంచి ఐదేళ్లలో 3 లక్షల మంది భారత యువతను ఉద్యోగ శిక్షణ కోసం జపాన్‌కు పంపాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఇందుకు అవసరమైన ఖర్చులను జపాన్ భరిస్తుంది. ప్రభుత్వేతర సంస్థగా ఉన్న అంతర్జాతీయ సముద్రయాన విభాగం ఐఏఎల్‌ఏను ప్రభుత్వ సంస్థగా (వివిధదేశాల మధ్య సముద్ర బంధాలు పెరిగేలా) మార్చాలన్న ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సంకల్ప్, స్ట్రైవ్ పథకాలకు ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకొచ్చేందుకు 

మైనర్ భార్యతో కాపురం అత్యాచారమే: సుప్రీం కోర్టు
మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం నేరమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 15-18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఐపీసీలోని సెక్షన్ 375లోని మినహాయింపు-2 చెబుతోందని.. చట్టంలో ఇలాంటి మినహాయింపునివ్వడం నిరంకుశమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం అక్టోబర్ 11న వెలువరించిన తీర్పులో పేర్కొంది. పార్లమెంటు ఏ విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశ్నించింది. బాలికల హక్కులు కాలరాసినట్లే
‘అన్ని చట్టాల్లో కనీస వివాహ వయసు 18 ఏళ్లు. అయితే ఐపీసీలో మాత్రం 18 ఏళ్లలోపు భార్యతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించకుండా మినహాయించడం నిలకడలేని, నిరంకుశ నిర్ణయం. ఇది బాలికల హక్కులను కాలరాసినట్లే’అని జస్టిస్ దీపక్ గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు. మినహాయింపునివ్వడం రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణలను ఉల్లంఘించడమే అని తెలిపారు. 
చెల్లని వివాహాల రద్దు ఎలా? 
హిందూ, ముస్లిం వివాహ చట్టాల్లోని నిబంధనలు బాల్య వివాహ నిషేధ చట్టాన్ని (పీసీఎంఏ) అపహాస్యం చేసేలా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ముస్లిం వివాహాల రద్దు చట్టం - 1939 ప్రకారం.. 15 ఏళ్ల లోపున్న బాలికకు వివాహం జరిగితే, ఆమె 18 ఏళ్లు నిండక ముందే, అది కూడా భర్తతో శృంగార జరగకపోతేనే విడాకులను కోరొచ్చు. ‘బాలిక మేజర్ కాక ముందే, అది కూడా శృంగారం జరగకపోతేనే విడాకులు కోరొచ్చన్న నిబంధన ఈ చట్టాన్ని అపహాస్యం పాలుచేస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇక హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం.. తనకు 15 ఏళ్లలోపు జరిగిన వివాహాన్ని బాలిక 15 ఏళ్లు దాటిన తరువాత, 18 ఏళ్లు నిండక ముందు రద్దుచేయాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేయొచ్చని తెలిపింది. అసలు 15 ఏళ్లలోపు వివాహం చెల్లదని, దాని రద్దుని కోరే ప్రశ్నే ఉత్పన్నం కావొద్దని పేర్కొంది.
తీర్పులోని ప్రధానాంశాలుభారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 375కు ధర్మాసనం సవరణ చేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని అధికరణం 14, 15, 21లను ఉల్లంఘిస్తోందంది.చిన్నారుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన అన్ని చట్టాల్లో సమరూపత ఉండాలని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలితో ఉన్న బంధానికి అతీతంగా ఒక రేపిస్టు ఎప్పటికీ రేపిస్టేనన్న యూరోపియన్ మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యలను ఉటంకించింది.18 ఏళ్ల లోపు భార్యతో లైంగిక చర్యలో పాల్గొన్న భర్తను నేరస్తుడిగా పరిగణించనందుకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. సామాజిక సంక్షేమ పథకాలపై ఆకట్టుకునే నినాదాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోదనీ, వాటి అమల్లోనూ చిత్తశుద్ధితో పనిచేయాలంది.ఇదీ చరిత్ర..
1860: వివాహానికి బాలికకు కనీస వయసును నిర్ధారించకున్నా, భర్తతో శృంగారానికి అంగీకరించడానికి కనీస వయసు 10 ఏళ్లుగా నిర్ణయం.
1891: ఈ వయసు 12 ఏళ్లకు పెంపు. 
1925: శృంగారానికి అంగీకరించేందుకు కనీస వయసు 14 ఏళ్లకు పెంపు, ఐపీసీ సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపును 13 ఏళ్లకు పెంచారు. 
1929: బాల్య వివాహ నియంత్రణ చట్టానికి ఆమోదం. వివాహానికి, శృంగారానికి కనీస వయసు 14 ఏళ్లుగా నిర్ధారణ. సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపుకు ఎలాంటి మార్పు చేయలేదు. 
1940: ఐపీసీకి చేసిన సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లకు పెంపు. సెక్షన్ 375 మినహాయింపు కింద 15 ఏళ్లకు పెంచారు. వివాహాల నియంత్రణ చట్టం ప్రకారం వివాహానికి బాలికల కనీస వయసు కూడా 15 ఏళ్లుగా నిర్ణయం. 
1978: ఐపీసీ సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లుగా నిర్ణయం. మినహాయింపు కింద వివాహ కనీస వయసు 15 ఏళ్లలో మార్పు లేదు. మహిళకు వివాహ కనీస వయసు 18 ఏళ్లకు పెంపు.
2013: నిర్భయ ఘటన నేపథ్యంలో శృంగారానికి కనీస వయసు 18 ఏళ్లకు పెంపు.
చాలా దేశాల్లో నేరం
ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నారు. యూరోప్‌లో 22 దేశాల్లో, ఉభయ అమెరికా ఖండాల్లో 22 దేశాల్లో, ఆఫ్రికాలో 11 దేశాల్లో, ఆసియా, ఆస్ట్రేలియాల్లో కలిపి.. 15 దేశాల్లో మారిటల్ రేప్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించిన తొలిదేశం పోలండ్. 1932లో పోలండ్ ఈ మేరకు చట్టం చేసింది. అమెరికాలో 1970లో మొదలై 1993 దాకా మొత్తం 50 రాష్ట్రాలూ దీన్ని నేరం చేశాయి. మహిళలపై హింసకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటు తీర్మానం చేసి.. మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని పిలుపునిచ్చింది. దాంతో ఫ్రాన్‌‌స, జర్మనీ, నెదర్లాండ్‌‌స, బెల్జియం తదితర దేశాలు మినహాయింపును ఎత్తివేశాయి. 1991లో బ్రిటన్ ఈ పనిచేసింది. మన పొరుగునున్న చిన్నదేశం నేపాల్ 2002లోనే మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని సమాన రక్షణ, వ్యక్తిగత గోప్యత హక్కులను ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తేల్చడంతో నేపాల్ ప్రభుత్వం చట్టాలను మార్చింది.

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ 
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 12న ప్రకటించింది. నవంబర్ 9న ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 68 నియోజకవర్గాలకు ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ఆలోపే (డిసెంబర్ 18) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలుంటాయని తెలిపింది. 
హిమాచల్ ఎన్నికల్లో అన్ని ఈవీఎంలకు ఓటు ధ్రువీకరణ (వీవీపీఏటీ) యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 7,479 పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 

మైనర్ భార్యతో శృంగారానికి శిక్షలు ఖరారు
మైనర్ భార్యతో శృంగారాన్ని నేరంగా ప్రకటించిన సుప్రీంకోర్టు ఈ నేరానికి శిక్షలను ఖరారు చేసింది. ఈ విధమైన శృంగారంలో పాల్గొన్న వారికి ఐపీసీ ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష లేదా బాలలను అత్యాచార నేరాలనుంచి కాపాడే (పోస్కో) చట్టం ప్రకారం జీవిత ఖైదు విధించాలంది. 15-18 ఏళ్ల వయసున్న భార్యలపై శృంగారం విషయంలో ఐపీసీ 375 సెక్షన్‌లోని మినహాయింపు 2ను (భర్తల శిక్షకు సంబంధించిన) సవరించాలని సుప్రీంకోర్టు సూచించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మైనర్ భార్యతో శృంగారానికి శిక్షలు ఖరారు 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : సుప్రీంకోర్టు 

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం
ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (IFPRI) విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీ-2017లో భారత్ 100వ స్థానంలో నిలిచింది. మొత్తం 119 దేశాలతో సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ నివేదికలో భారత్ ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఇరాక్ కన్నా వెనుక స్థానంలో ఉండగా, పాకిస్తాన్ కన్నా కొంచెం మెరుగైన ర్యాంకు సాధించింది. భారత్‌లో ఆకలికి ముఖ్యమైన కారణం పిల్లల్లో అధిక శాతం పౌష్టికాహార లోపమని, దీన్ని తగ్గించాలంటే సమాజం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) తన నివేదికలో పేర్కొంది. గతేడాది భారత్ 97వ స్థానంలో ఉంది. 
2017 జాబితాలో చైనా (29), నేపాల్ (72), మయన్మార్ (77), శ్రీలంక (84), బంగ్లాదేశ్ (88)తో స్థానాల్లో ఉన్నాయి. పాక్(106), అఫ్గానిస్తాన్ 107వ ర్యాంకుతో భారత్ కన్నా వెనుక ఉన్నాయి. ఉత్తర కొరియా 93, ఇరాక్ 78వ స్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ ఆకలి సూచీ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్
ఎక్కడ : 100వ స్థానంలో భారత్

ఐలయ్య పుస్తకాన్ని నిషేధించలేం:సుప్రీంకోర్టు 
కంచ ఐలయ్య రాసిన వివాదాస్పద పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు- కోమటోళ్లు’ను నిషేధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కు అని, రచయితకు వ్యక్తిగతంగా తన భావాలను వ్యక్తపరిచే హక్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు పుస్తకాన్ని నిషేధించలేమన్న సుప్రీంకోర్టు 
ఎప్పుడు : అక్టోబర్ 13 
ఎవరు : రచయిత కంచ ఐలయ్య 

పట్నా వర్సిటీ వందేళ్ల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 
బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ వందేళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తద్వారా వందేళ్ల చరిత్రలో యూనివర్సిటీలో జరిగిన వేడుకలకు హాజరైన తొలి ప్రధానమంత్రిగా మోదీ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... యూనివర్సిటీల సంకెళ్లను తెంచి ప్రపంచంలోనే ఉత్తమ విద్యాకేంద్రాలుగా మార్చేందుకు దేశంలోని 20 వర్సిటీలకు రూ.10వేల కోట్లు కేటాయించనున్నట్లు స్పష్టంచేశారు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు వర్సిటీలకు ఐదేళ్లపాటు రూ.10వేల కోట్లు). పాత పద్ధతిలో కొనసాగే విద్యావిధానాన్ని పక్కనబెట్టి.. యువత ఆలోచనలను అత్యాధునిక సమాచారం, సృజనాత్మకతతో కూడిన విద్యావిధానంపై వర్సిటీలు దృష్టిపెట్టాలని మోదీ కోరారు. ఈ 20 యూనివర్సిటీల ఎంపిక ప్రభుత్వాలు, పార్టీల చేతుల్లో కాకుండా థర్డ్‌పార్టీ ప్రొఫెషనల్ ఏజెన్సీతో జరుగుతుందన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పట్నా యూనివర్సిటీ వందేళ్ల వేడుకలు 
ఎప్పుడు : అక్టోబర్ 14 
ఎవరు : వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ 
ఎక్కడ : బిహార్‌లో 

గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం 
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ 1.93 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందింది. బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా హఠాన్మరణంతో (ఏప్రిల్‌లో) ఖాళీ అయిన ఈ స్థానానికి అక్టోబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. అక్టోబర్ 15న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కడ్ 4,99,752 ఓట్లు సంపాదించగా.. బీజేపీ అభ్యర్థి స్వరన్ సలారియాకు 3,06,533 ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థి సురేశ్ ఖజురియా 23,579 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఆర్నెల్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఢిల్లీలో హార్లే డేవిడ్సన్ యూనివర్సిటీ 
అమెరికాకు చెందిన ఖరీదైన బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ భారత్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ ద్వారా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి టెక్నికల్, నాన్‌టెక్నికల్ కోర్సులలో శిక్షణ ఇస్తారు. అంతేకాక శిక్షణ పొందినవారిని ఉద్యోగులుగా చేర్చుకోవడం, డీలర్‌షిప్‌లను ఇవ్వడం వంటివి కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఏషియా పసిఫిక్ రీజియన్‌లలో మూడు యూనివర్సిటీలు ఉండగా, తాజాగా భారతదేశ రాజధాని ఢిల్లీలో నాలుగో యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు హార్లే డేవిడ్సన్ ఇండియా చైనా సంయుక్త మేనేజింగ్ డెరైక్టర్ పీటర్ మాక్ కెన్‌‌జ తెలిపారు. టెక్నికల్ ట్రైనింగ్‌తోపాటు యూనివర్సిటీ నిర్వహణ, ఫైనాన్‌‌స, బ్రాండింగ్ వంటి కోర్సులను అందిస్తామని, రాబోయే కొన్ని వారాల్లోనే యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ యూనివర్సిటీ 
ఎక్కడ : ఢిల్లీలో 
ఎందుకు : టెక్నికల్ ట్రైనింగ్‌తోపాటు యూనివర్సిటీ నిర్వహణ, ఫైనాన్‌‌స, బ్రాండింగ్ వంటి కోర్సులను అందించేందుకు 

పీపీపీ పద్ధతిలో మైక్రో ఇరిగేషన్ 
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించడమే లక్ష్యంగా అన్ని రాష్ట్రాల్లో మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ నీటి పారుదల) సాగు విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో దీనిని అమల్లోకి తేనుంది. ఇందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అక్టోబర్ 16న పంపించింది. ఈ మార్గదర్శకాలపై అభిప్రాయాలను నెల రోజుల్లోగా తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 
69 మిలియన్ హెక్టార్లలో ‘సూక్ష్మ’ సాగే లక్ష్యం 
ప్రస్తుతం ఒక్కో రైతుకు మైక్రో ఇరిగేషన్ సాగుకు ఐదు హెక్టార్ల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిని పది హెక్టార్లకు పెంచాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అలాగే... దేశంలో 160 మిలియన్ హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉంటే దాదాపు 65 మిలియన్ హెకార్లకు సాగునీరు అందుతోంది. ఇందులో కేవలం 8.6 మిలియన్ హెక్టార్లలోనే మైక్రో ఇరిగేషన్ విధానంలో సాగవుతున్నాయి. మైక్రో ఇరిగేషన్‌లో భాగంగా 4.7 మిలియన్ హెక్టార్లలో స్ప్రింకర్ల ద్వారా, 3.9 మిలియన్ హెక్టార్లలో డ్రిప్ ద్వారా సాగు చేస్తున్నారు. దేశంలో 69 మిలియన్ హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ సాగులోకి తేవాలని లక్ష్యంగా ఈ పీపీపీ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని కేంద్రం రూపొందించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీపీపీ పద్ధతిలో సూక్ష్మ సాగుకు ముసాయిదా మార్గదర్శకాలు విడుదల 
ఎప్పుడు : అక్టోబర్ 16 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

ముంబై ఎయిర్‌పోర్ట్ చిత్రంతో పోస్టల్ స్టాంపుల విడుదల 
వాణిజ్య రాజధాని ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 75 వసంతాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తపాలాశాఖ విమానాశ్రయం ముఖచిత్రంతో రెండు పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. 
1932 అక్టోబరు 15న జంజీర్ రతన్‌జీ దాదాబాయ్ టాటా మొదటి సారి సింగిల్ ఇంజిన్ విమానాన్ని కరాచీ నుంచి ముంబైకి నడిపారు. తరువాత రతన్‌జీ స్నేహితుడు మాజీ పెలైట్ నివిల్ విన్సెంట్ మద్రాసుకు నడిపారు. స్టాంపుపై రద్దీగా ఉన్న విమానాశ్రయ చిత్రంతోపాటు, ప్రయాణికులు దిగే చిత్రాన్ని ముద్రించారు. రూ.5, రూ.15 ముఖవిలువతో ఈ స్టాంపులను విడుదల చేశారు. విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత 1942 నుంచి దీనిని మిలటరీ పనులకు వినియోగించారు. స్వాంతంత్య్రం వచ్చిన తరువాత పౌర సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ టెర్మినల్ నుంచి రోజూ 867 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సంవత్సరానికి నాలుగున్నర కోట్ల మంది దీని ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముంబై ఎయిర్‌పోర్ట్ చిత్రంతో పోస్టల్ స్టాంపుల విడుదల 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : తపాలాశాఖ 
ఎందుకు : చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 75 వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 

డెంగీ వ్యాప్తిపై చెన్నైలో 12.5 లక్షల మందికి జరిమానా 
చెత్తకుప్పలు, మురికిగుంటలు తొలగించకపోవడం ద్వారా ప్రాణాంతక డెంగీ దోమల వ్యాప్తికి కారకులైన 12.5 లక్షల మంది చెన్నై వాసులకు అక్టోబర్ 12న తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే 2.5 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో డెంగీ మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఇకపైనా ఇదే పరిస్థితి కొనసాగితే రూ.5 వేలు, ఆ తరువాత రూ.10 వేల చొప్పున జరిమానా వసూలు చేస్తామని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ కార్తికేయన్ హెచ్చరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డెంగీ వ్యాప్తిపై 12.5 లక్షల మందికి రూ. 2 వేల జరిమానా 
ఎప్పుడు : అక్టోబర్ 12 
ఎవరు : తమిళనాడు ఆరోగ్య శాఖ 
ఎక్కడ : చెన్నైలో 

నియంతృత్వ పాలన కోరుకుంటున్న 55 శాతం భారతీయులు 
భారతీయుల్లో అత్యధికులు(55 శాతం మంది) నియంతృత్వ పాలనను కోరుకుంటున్నారని ప్యూ రీసెర్చ్ సర్వేలో తేలింది. ప్రపంచంలోని 38 ముఖ్య దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసం.. అనే అంశాలపై ప్యూ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16-మే 8 మధ్యలో 38 దేశాల్లో 41,953 మంది అభిప్రాయాలను ప్యూ రీసెర్స్ సేకరించింది. 
మరిన్ని వివరాలు.. 
సమష్టి నిర్ణయాల కంటే ఏకవ్యక్తి పాలనే మెరుగని భారతీయులు విశ్వసిస్తున్నారు.27 శాతం మంది పటిష్ట నాయకత్వాన్ని కోరుకోగా, 53 శాతం మంది సైనిక పాలనే మేలంటున్నారు.50 ఏళ్లకు పైబడిన వాళ్లలో మాత్రం అత్యధికులు సైనికపాలనకు తాము వ్యతిరేకమంటున్నారు.కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఏకంగా 85 శాతం మంది చెప్పారు.పార్లమెంటు, న్యాయస్థానాల జోక్యం లేకుండా.. శక్తిమంతమైన నాయకుడు నిర్ణయాలు తీసుకునే పాలనా విధానం మెరుగ్గా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి పాలన మంచిది కాదని 71 శాతం మంది పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్యూ రీసెర్చ్ సర్వే - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 17 
ఎవరు : ప్యూ రీసెర్చ్ 
ఎక్కడ : 38 దేశాల్లో 
ఎందుకు : దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసంపై 

48వ గవర్నర్ల సదస్సు 
48వ గవర్నర్ల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 12న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ పాల్గొన్నారు. 27 మంది గవర్నర్లు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులు హాజరయ్యారు. ‘నవ భారత్-2022’ లక్ష్యాలైన వసతులు, ప్రజాసేవ, రాష్ట్రాల్లో ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధిపై సదస్సులో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

బెంగళూరులో తల్లిపాల నిధి 
శిశువులకు తల్లి పాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందించేందుకు తల్లి పాల నిధిని బెంగళూరులోని మదర్ థెరిసా రోడ్డులో అక్టోబర్ 9న అందుబాటులోకి తెచ్చారు.

జమిలి ఎన్నికలకు సిద్ధం: ఎన్నికల సంఘం
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించేందుకు 2018 సెప్టెంబరు నాటికి సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషన్ (ఈసీ) అక్టోబర్ 4న పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఏమేం కావాలో తెలపాలని కేంద్రం ఈసీని అడిగింది. దీంతో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు), వీవీపీఏటీ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాల కొనుగోలుకు నిధులు కావాలని ఈసీ కోరగా ఆ మేరకు వీవీపీఏటీ యంత్రాల కొనుగోలు కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కొనుగోలు కోసం రూ.12 వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది. దీంతో అవసరమైన సామాగ్రితో వచ్చే సెప్టెంబర్ నాటికి జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ తెలిపారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధం
ఎప్పుడు : 2018 సెప్టెంబర్
ఎవరు : ఎన్నికల సంఘం

పర్యాటక ప్రచారానికి పర్యటన్ పర్వ్
 దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్రం అక్టోబర్ 4న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యాటక శాఖ పర్యటన్ పర్వ్’ పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొంటాయి. 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, పర్యాటక రంగం ప్రయోజనాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పర్యాటక ప్రచారానికి కొత్త కార్యక్రమం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ
ఎందుకు : ప్రముఖ పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించేందుకు

సైబర్ వేధింపుల బాధితుల్లో ముంబైది మొదటి స్థానం
ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్న బాధితుల సంఖ్యలో ముంబై అగ్రస్థానంలో ఉందని నార్టన్ బై సెమాంటిక్ అక్టోబర్ 5న వెల్లడించింది. ఈ జాబితాలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. కంప్యూటర్ భద్రత సాఫ్ట్‌వేర్ తయారు చేసే ఈ సంస్థ ఆన్‌లైన్ వేధింపుల తీరుతెన్నులపై ఇటీవల ఓ అధ్యయనం జరిపింది. దేశంలోని ప్రతి 10 మంది ఆన్‌లైన్ వినియోగదారుల్లో 8 మంది ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించింది.
సైబర్ వేధింపుల బాధితులు

ముంబై

51%

ఢిల్లీ

47%

హైదరాబాద్

46%

క్విక్ రివ్యూ: 
ఏమిటి : సైబర్ వేధింపుల బాధితుల సంఖ్యలో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : ముంబై
ఎవరు : నార్టన్ బై సెమాంటిక్ అనే కంప్యూటర్ భద్రత సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ

గాంధీజీ హత్య కేసులో అమికస్ క్యూరీ నియామకం
మహాత్మా గాంధీ హత్య కేసును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు అక్టోబర్ 6న అంగీకరించింది. ఈ మేరకు మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమిస్తున్నట్లు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది.
గాంధీ హత్యపై పునర్విచారణ జరపాలంటూ అభినవ భారత్ సంస్థ ట్రస్టీ డా.పంకజ్ ఫడ్నీస్ పిటిషన్ దాఖలు చేశారు. 1949లో గాడ్సేతో పాటు నారాయణ్ ఆప్టేల పిటిషన్లను తూర్పు పంజాబ్ హైకోర్టు తిరస్కరించిన అనంతరం ఈ కేసును సుప్రీం కోర్టు అసలు విచారించనేలేదని, 1966లో ఏర్పాటు చేసిన జేఎల్ కపూర్ కమిషన్ తన నివేదికను అత్యున్నత ధర్మాసనానికి సమర్పించలేదని ఫడ్నీస్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమికస్ క్యూరీని నియమించిన సుప్రీంకోర్టు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : అమరేందర్ శరణ్
ఎందుకు : గాంధీజీ హత్య కేసును పునర్విచారించేందుకు

అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రంగా బుడ్గె బుడ్గె 
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో జైపూర్‌లోని బుడ్గె బుడ్గె థర్మల్ విద్యుత్ కేంద్రం తొలి స్థానంలో నిలిచింది. గత ఆగస్టులో ఈ కేంద్రం అత్యధికంగా 98.43 శాతం పీఎల్‌ఎఫ్‌తో రికార్డు సాధించింది. తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 86.87 శాతం పీఎల్‌ఎఫ్‌తో జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. అది మినహా తెలుగు రాష్ట్రాల నుంచి మరే విద్యుత్ కేంద్రం టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. రామగుండంలో ఎన్టీపీసీకి చెందిన సూపర్ విద్యుత్ కేంద్రం ఒక్కటే 82.04 శాతం పీఎల్‌ఎఫ్‌తో 19వ ర్యాంకు సాధించి 25 విద్యుత్ కేంద్రాల జాబితాలో చోటు సంపాదించింది. 
ఒక విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే.. ఓ ఏడాది కాలంలో ఆ విద్యుత్ కేంద్రం సాధించిన ఉత్పత్తి శాతాన్ని పీఎల్‌ఎఫ్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలు నష్టాల బాట పట్టకుండా ఉండాలంటే ఏటా మెరుగైన పీఎల్‌ఎఫ్ సాధించాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితా 
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : తొలి స్థానంలో జైపూర్‌లోని బుడ్గె బుడ్గె కేంద్రం 

ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై తాత్కాలిక నిషేధం
ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో నవంబర్ 1 వరకు టపాసులు అమ్మడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. దీంతోపాటే టపాసులు విక్రయించే వ్యాపారులకు జారీ చేసిన తాత్కాలిక లెసైన్సులను కూడా రద్దు చేస్తున్నామని, అక్టోబర్ 9 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 1 తర్వాత బాణసంచా అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తామని, టపాసుల విక్రయాలకు అనుమతి ఇస్తామని ధర్మాసనంలోని మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ అశోక్ భూషణ్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టపాసుల అమ్మకాలపై తాత్కాలిక నిషేధం 
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : సుప్రీం కోర్టు 
ఎక్కడ : ఢిల్లీలో 

గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపు
గోధ్రా రైలు దగ్ధం కేసులో దోషులకు శిక్ష తగ్గిస్తూ గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరణ శిక్ష పడిన 11 మంది దోషులకు ఆ శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ అక్టోబర్ 9న తీర్పునిచ్చింది. అలాగే జీవిత ఖైదు పడిన మరో 20 మందికి అదే శిక్షను ఖరారు చేసింది. ఆ ఘటన సమయంలో శాంతి భద్రతలను సరిగా పరిరక్షించలేకపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ గోధ్రా ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం అందజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనంత్ ఎస్ డేవ్, జస్టిస్ జీఆర్ ఉద్వానీ ఆదేశాలు జారీ చేశారు. 
2002, ఫిబ్రవరి 27న సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలులో అయోధ్య నుంచి వస్తున్న ప్రయాణికులపై కొందరు ఆందోళనకారులు గోధ్రా స్టేషన్‌లో దాడిచేశారు. ఎస్-6 కోచ్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మృతిచెందారు. వీరిలో చాలా మంది కరసేవకులు ఉన్నారు. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 1,200 మంది మరణించారు. ఈ మారణహోమంపై విచారణ జరిపేందుకు అప్పటి గుజరాత్ ప్రభుత్వం జస్టిస్ నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గోధ్రా ఘటన వెనుక కుట్ర దాగి ఉందని విచారణలో కమిషన్ తేల్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోధ్రా అల్లర్ల కేసులో దోషులకు శిక్ష తగ్గింపు 
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : గుజరాత్ హైకోర్టు

విపత్తు నిర్వహణ’ తప్పనిసరి
ఉగ్రదాడులు, భూకంపాల వంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరును విద్యార్థులకు బోధించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అన్ని వర్సిటీలకు సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ కోర్సును తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

పోటీతత్వ సూచీలో భారత్‌కు 40వ స్థానం
 అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 40వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారింది. మొత్తం 137 దేశాలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (Global Competetive index) ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానాన్ని స్విట్జర్లాండ్ సాధించింది. ఈ జాబితాలో పొరుగు దేశం చైనా 27వ ర్యాంకులో ఉండగా, భారత్ 39వ ర్యాంకు నుంచి 40వ స్థానానికి పడిపోయింది. 
12 విభాగాల్లో ఆయా దేశాల పనితీరు ప్రాతిపదికగా వాటి ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్ నిర్ణయిస్తుంది. దీని ప్రకారం .. ఇన్‌ఫ్రా విభాగంలో భారత్ 66వ ర్యాంకు, ఉన్నత విద్య.. శిక్షణలో 75వ స్థానాన్ని దక్కించుకుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : వరల్డ్ ఎకనామిక్ ఫోరం 
ఎక్కడ : 40వ స్థానంలో భారత్ 

జాతీయ అంతర్గత భద్రతా పథకానికి కేబినెట్ ఆమోదం 
దేశంలో శాంతిభద్రతల వ్యవస్థను మెరుగుపరచడానికి.. పోలీసు బలగాలను ఆధునీకరించడానికి.. ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాటానికి ఉద్దేశించిన భారీ అంతర్గత భద్రతా పథకానికి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 27న ఆమోదం తెలిపింది. ఈ మేరకు పోలీసు బలగాలను ఆధునికీకరించేందుకు ‘మాడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ (MPF)’ పేరిట 2017-18 నుంచి 2019-20 వరకు మూడేళ్ల పాటు రూ.25,060 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. అలాగే... మొబైల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 
ఎంపీఎప్ పథకం వివరాలు...

పథకం మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.18,636 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.6,424 కోట్లుగా ఉంటుంది.ఎంపీఎఫ్ పథకంలో భాగంగా అంతర్గత భద్రత కోసం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.10,132 కోట్లు వెచ్చిస్తారు.పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధునాతనమైన ఫోరెన్సిక్ సైన్‌‌స లేబొరేటరీని ఏర్పాటు చేస్తారు. జైపూర్ లోని సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, కౌంటర్ టైజమ్‌ను, అలాగే గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్‌‌స యూనివర్సిటీని ఆధునీకరిస్తారు.క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎంపీఎస్ పథకానికి ఆమోదం 
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : పోలీసు బలగాలను ఆధునికీకరించేందుకు 

కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు పెంపు 
కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ సెప్టెంబర్ 27న నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వారికిఇది వర్తిస్తుంది. ప్రస్తుతం కేంద్ర వైద్యుల రిటైర్మెం ట్ వయసు కొన్ని విభాగాల్లో 60 ఏళ్లుగా, మరికొన్నింటిలో 62 ఏళ్లుగా ఉంది. దీంతో వివిధ విభాగాల్లోని 1,445 మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వైద్యులకు 

వైద్యులకూ ఆధార్ తరహా ఐడీ
డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వైద్యులకు ఆధార్ తరహాలో యునిక్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూపీఆర్‌ఎన్) ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు వైద్యులుగా ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇందువల్ల ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన వారికి ఆ రాష్ట్రంలో కేటాయించే నంబర్.. మరో రాష్ట్రంలో మరొకరికి కూడా ఉంటుంది. ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకే నంబర్‌పై పదుల సంఖ్యలో వైద్యులు ఉంటున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎంసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఎంసీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి్య యూపీఆర్‌ఎన్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వైద్యులకు ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్య 
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 
ఎక్కడ : దేశవ్యాప్తంగా

ప్రైవేటుతో పంచాయతీల అనుసంధానం
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు దాదాపు కోటి మందికిపైగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గ్రామ పంచాయతీలను ప్రైవేటు సంస్థలకు అనుసంధానిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) చురుగ్గా ఉండి బ్యాంకు ఖాతాలు, మౌలిక సదుపాయాలు ఉన్న 50,000 పంచాయతీలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. మిషన్ అంత్యోదయ పథకం కింద చేపడుతున్న ఈ చర్యల్లో భాగంగా ప్రైవేటు కంపెనీలకు ఎలాంటి సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించబోదని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హా చెప్పారు. 
ఈ విధానంలో కేంద్రం కేవలం పంచాయతీలకు, ప్రైవేటు సంస్థలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుంది. వేర్వేరు గ్రామాల్లో వ్యాపారాలకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో పంచుకుంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రైవేటు సంస్థలతో గ్రామ పంచాయతీల అనుసంధానం 
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు 

గన్ లెసైన్సుల్లో యూపీ టాప్
ఎక్కువ మంది పౌరులు తుపాకీ లెసైన్సులు పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీలో 12.77 లక్షల మందికి గన్ లెసైన్సు ఉంది. వేర్పాటువాదంతో సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్‌లో 3.69 లక్షల మంది గన్ లెసైన్సు పొందారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 33,69,444 మంది గన్ లెసైన్సులు సంపాదించారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తమ వ్యక్తిగత భద్రతను కారణంగా చూపి యూపీలో ఎక్కువ మంది లెసైన్సులు పొందారు. పంజాబ్‌లో 3,59,349 మంది, మధ్యప్రదేశ్‌లో 2,47,130 మంది, హరియాణాలో 1,41,926 మంది గన్ లెసైన్సులు పొందారు. అత్యంత తక్కువగా దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరో 125 మంది గన్ లెసైన్సులు సంపాదించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో గన్ లెసైన్సులు 33,69,444
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర హోంశాఖ 

ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి 
ఓబీసీ రిజర్వేషన్ల వ ర్గీకరణ కమిషన్ చైర్ పర్సన్‌గా ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2న ఏర్పాటు చేసింది. 
కమిషన్‌లో సభ్యులుగా డాక్టర్ జేకే బాలాజీ, ఆంథ్రోపాలజికల్ సర్వే ఇండియా డెరైక్టర్, భారత రిజిస్ట్రార్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఉంటారు. ఈ కమిషన్‌కు సామాజిక న్యాయశాఖలో జాయింట్ సెక్రెటరీ హోదా అధికారి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్ 12 వారాల్లో ఓబీసీ వర్గీకరణపై రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

మధుమేహంలో పుదుచ్చెరి ఫస్ట్
దేశంలో మధుమేహం (షుగర్/డయాబెటిస్)తో బాధపడుతున్నవారు పుదుచ్చెరిలో ఎక్కువ మంది ఉన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తెలిపింది. రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఉండగా తెలుగు రాష్ట్రాలు 5వ స్థానంలో నిలిచాయి. 

‘దివ్యాంగ్ సారథి’ ప్రారంభం
దివ్యాంగులకు అనేక అంశాల్లో ఉపకరించే దివ్యాంగ్ సారథి అనే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లట్ సెప్టెంబర్ 26న ప్రారంభించారు. ఈ యాప్.. దివ్యాంగుల సంక్షేమ పథకాలు, ఉపకారవేతనాలు, సంస్థాగత మద్దతు వ్యవస్థల వివరాలను అందిస్తుంది. దివ్యాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ సమాచారం మొత్తం ఈ యాప్ ద్వారాపొందొచ్చు. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా పని చేస్తుంది. 

కర్ణాటకలో మూఢనమ్మకాల నిషేధ చట్టానికి తీర్మానం
కర్ణాటకలో మూఢ నమ్మకాల నిషేధ చట్టం తేవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సెప్టెంబర్ 27న జరిగిన కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2017 జాతీయం
ఢిల్లీలో పేపర్ పరిశ్రమల అంతర్జాతీయ సమ్మేళనం
 పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ నవంబర్ 1న ఢిల్లీలో ప్రారంభించారు. సదస్సులో 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పొల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాయి. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : పేపర్ తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి

తొమ్మిది ప్రధాన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం 
ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన తొమ్మిది కీలకమైన బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. వీటిలో పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ అమెండ్‌మెంట్ బిల్లు, గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితరాలు ఉన్నట్లు రాష్ట్రపతిభవన్ వర్గాలు నవంబర్ 5న వెల్లడించాయి. గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిర్బంధ ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. దీంతో కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ, వారిని కోర్టులకు తీసుకొచ్చే ఇబ్బందులు పోలీసులకు ఉండవు. 

అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పునరుద్ధరణ 
2016లో ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పదవీ కాలం ముగియడంతో దాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర హోం శాఖ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైంది. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, తావర్‌చంద్ గెహ్లట్; పంజాబ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. 

భారతీయ కిచిడీకి గిన్నిస్ రికార్డు 
భారతీయుల సంప్రదాయ వంటకాల్లో ఒకటైన కిచిడీ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఢిల్లీలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో నవంబర్ 4న దాదాపు 918 కేజీల కిచిడీని తయారుచేసి చరిత్ర సృష్టించారు. అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ, సంజీవ్ కపూర్ అనే పాకశాస్త్ర ప్రవీణుడి నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారుచేసింది. 

లడఖ్‌లో అత్యంత ఎత్తయిన రహదారి 
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈశాన్య ప్రాంతంలోని ఇండో-చైనా సరిహద్దులోని చిసూమ్లే, డెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ 86 కి.మీ. పొడవుగల రోడ్డును భూ ఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో నిర్మించింది. 
వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 10 నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ స్థాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే 50 శాతం తక్కువగా ఉంటుంది. తద్వారా ఇక్కడ పనిచేసేవారు ప్రతి పది నిమిషాలకు ఓసారి ఆక్సిజన్ కోసం కిందకు వెళ్లాల్సి వచ్చేది. చాలామంది జ్ఞాపక శక్తి లోపం, కంటిచూపు మందగించడం, అధిక రక్తపోటు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హిమాంక్ అధికారి డీఎమ్ పుర్విమత్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో అత్యంత ఎత్తై రహదారి 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 
ఎక్కడ : లడఖ్, జమ్మూకాశ్మీర్ 

ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ పరికరం తప్పనిసరి 
డిసెంబర్ 1 నుంచి విక్రయించే కొత్త ఫోర్ వీలర్ వాహనాలన్నింటికి ‘ఫాస్టాగ్’ పరికరం తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నవంబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. 
వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చే ఈ డివైజ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ఆయా వాహనదారుల సేవింగ్‌‌స ఖాతా లేదా ప్రీపెయిడ్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. టోల్ గేట్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఈ ఫాస్టాగ్‌లలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 370 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి 
ఎప్పుడు : డిసెంబర్ 1 
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ 
ఎందుకు : టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడం కోసం 

ఎత్తయిన వంతెనకు ఇండియన్ రైల్వే శ్రీకారం 
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే నవంబర్ 6న ప్రారంభించింది. దీన్ని కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,005 కోట్లు. 1,315 మీటర్ల పొడవుగల వంతెన నిర్మాణానికి 25 వేల మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉపయోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణం ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కొంకణ్ రైల్వే (భారతీయ రైల్వే)
ఎక్కడ : కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై
ఎందుకు : ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా

AIMS DARE TO SUCCESS 
డిసెంబరు 2017 జాతీయం 

కేంద్ర విభాగాల్లో 4.12 లక్షల ఖాళీలుCurrent Affairsదేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2016, మార్చి 1 నాటికి దాదాపు 4.12 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం డిసెంబర్ 20న లోక్‌సభకు తెలిపింది. కేంద్ర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాల వార్షిక నివేదిక’ ప్రకారం 2016 మార్చి నాటికి మొత్తం 36.33 లక్షల ఉద్యోగాలకు గానూ 4.12 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి’ అని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. కేంద్ర సర్వీసుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. రైల్వేశాఖ భద్రతా విభాగంలో 2017, ఏప్రిల్ నాటికి 1.28 లక్షల ఖాళీలు ఉన్నాయి.

వడోదరలో తొలి రైల్వే వర్సిటీదేశంలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో నేషనల్ రైల్ అండ్ ట్రాన్‌‌సపోర్ట్ యూనివర్సిటీ(ఎన్‌ఆర్‌టీయూ) పేరిట దీన్ని నెలకొల్పాలని డిసెంబర్ 20న ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించినట్లయింది. కంపెనీల చట్టం-2013 ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ నెలకొల్పే లాభాపేక్ష లేని కంపెనీ ప్రతిపాదిత యూనివర్సిటీని నిర్వహిస్తుంది. వర్సిటీకి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు చాన్‌‌సలర్, ఇతర ముఖ్యమైన బోధనా సిబ్బందిని ఆ కంపెనీయే నియమిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. విద్య, పాలన విధులు నిర్వర్తించేందుకు స్వతంత్ర బోర్డును కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి రైల్వే వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం 
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎక్కడ : వడోదర, గుజరాత్ 

గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక అంతరాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి నదులను అనుసంధానం చేయడానికి జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సరికొత్త ప్రణాళిక రచించింది. అంతరాష్ట్ర జల వివాదాలు తలెత్తకుండా, ముంపు సమస్య లేకుండా.. తక్కువ ఖర్చుతో నాలుగు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం గోదావరి నదిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినెపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడ నుంచి 247 టీఎంసీలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. నాగార్జునసాగర్ నుంచి సోమశిల రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి తమిళనాడులోని కావేరీ గ్రాండ్ ఆనకట్టలోకి నీటిని తరలిస్తారు. 
మూడు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే.. నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక 
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 

2జీ స్పెక్ట్రమ్ కేసులో అందరూ నిర్దోషులే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ డిసెంబర్ 21న ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మొత్తం 17 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి
ఓపీ సైనీ ఉద్ఘాటించారు. కొందరు కొన్ని వివరాలను తెలివిగా అటూఇటూ మార్చి ఏమీ లేని చోట స్కామ్ సృష్టించారు’’ అని అన్నారు. 
2జీ స్పెక్ట్రమ్ లెసైన్సుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ 2010లో కాగ్ నివేదిక ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ముందొచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన 8 కంపెనీలకు 122 2జీ స్పెక్ట్రమ్ లెసైన్సులు కేటాయించింది. ఈ విధానంతో ఖజానాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని, లెసైన్సులు పొందినవారికి అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ నివేదిక ఇవ్వడంతో దేశంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011లో ఆయన్ను సీబీఐ ఆరెస్ట్ చేసింది. 15 నెలలపాలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. 2012లో సుప్రీంకోర్టు సైతం 122 2జీ లెసైన్సులను రద్దు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులందరనీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు 
ఎప్పుడు : డిసెంబర్ 21 
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు 

యూపీలో కల్తీ సారా’కు మరణశిక్షకల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ డిసెంబర్ 22న ఆమోదించింది. యూపీ ఎకై ్సజ్(సవరణ) చట్టం-2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్‌లో ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్‌‌స తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష 
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

ఢిల్లీ మెట్రో మెజెంటా మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ కొత్తగా నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న ప్రారంభించారు. అనంతరం.. యూపీ గవర్నర్ రామ్ నాయక్, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ పురీ తదితరులతో కలసి మోదీ మెట్రోరైలులో ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. పౌరులు వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ఇంధన వినియోగం తగ్గి, తద్వారా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చుతగ్గుతుందన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ మెట్రో మెజెంటా మార్గం ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ 

అభివృద్ధి ప్రాజెక్టులకు 56,070 హెక్టార్ల అటవీ భూములు గడిచిన మూడేళ్లలో (2014-15 నుంచి 2016-17 వరకు) దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 26న వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి 8వ స్థానంలో నిలిచింది. 
కాగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలసి ఈ మూడేళ్లలో 93,400 హెక్టార్లలోనే అడవులను పెంచాయి. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. ఆ మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా-2015 నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 21.60 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 18.80 శాతమే. ఏపీలో 24.42 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 15.25 శాతమే. 
ఇటీవల కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో 2013 నుంచి 2015 మధ్య 168 చదరపు కి.మీ. మేర (16,800 హెక్టార్ల మేర)అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అభివృద్ధి ప్రాజెక్టులకు అటవీ భూముల మళ్లింపులో రెండో స్థానంలో తెలంగాణ 
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 

మణిపూర్‌లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇండియన్ సైన్‌‌స కాంగ్రెస్ సమావేశం మణిపూర్‌కు తరలిపోయింది. కోల్‌కతాలో డిసెంబర్ 27న సమావేశమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు ఏడు విశ్వవిద్యాలయాలు సమావేశాల నిర్వహణకు పోటీ పడ్డాయి. చివరికి మణిపూర్ విశ్వవిద్యాలయానికి ఈ అవకాశం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా తాము ఈ సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినప్పటికీ, అందుకు అసోసియేషన్ తిరస్కరించింది. 105వ ఇంటర్నేషనల్ సైన్‌‌స కాంగ్రెస్ 2018 మార్చి 18 నుంచి 22 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది. 
ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం 2017 జనవరి మూడు నుంచి ఏడు వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలతో సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 
ఎప్పుడు : 2018, మార్చి 18 - 22 
ఎక్కడ : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంఫాల్ 

వలసల్లో మొదటి స్థానంలో భారత్ ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎక్కువగా ఉంటున్న వారి జాబితాలో భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 18న విడుదల చేసిన అంతర్జాతీయ వలస నివేదిక ప్రకారం- 1.7 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అత్యధికంగా గల్ఫ్ ప్రాంతంలో 50 లక్షల మంది నివసిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న దేశాలు యూఏఈ(30 లక్షలు), అమెరికా(20 లక్షలు), సౌదీ అరేబియా(20 లక్షలు). మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 25.8 కోట్ల మంది సొంత దేశంలో కాకుండా.. ఇతర దేశాల్లో నివసిస్తున్నారు. ఇది 2000 నాటితో పోల్చితే 49 శాతం ఎక్కువ. 

కంపెనీల చట్టం సవరణకు రాజ్యసభ ఆమోదం కంపెనీల చట్టం సవరణ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 19న ఆమోదించింది. ఇందులో దివాళా తీసే కంపెనీలపై కఠిన చర్యలు ప్రతిపాదించారు. కొత్తగా కార్పొరేట్ పాలనా ప్రమాణాల పటిష్టత, సరళతర వాణిజ్యానికి ఉపయోగపడేలా కొన్ని నిబంధనలు చేర్చారు. ఈ బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమోదించింది. 

బెంగళూరు నగరానికి అధికారిక చిహ్నం అధికారిక చిహ్నం (లోగో) రూపొందించుకున్న భారత్‌లోని తొలి నగరంగా బెంగళూరు ఘనతను సొంతం చేసుకుంది. కన్నడ, ఆంగ్ల లిపి కలగలిసిన ఈ లోగోనూ ఎరుపు, తెలుపు రంగులో రూపొందించారు. దీనిని కర్ణాటక పర్యాటక, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే డిసెంబర్ 24న ఆవిష్కరించారు. దీంతో న్యూయార్క్, మెల్‌బోర్న్, సింగపూర్ లాంటి సిటీల సరసన బెంగళూరు నిలిచింది. ఒక పోటీ నిర్వహించి ఈ లోగోను నిపుణుల బృందం ఎంపిక చేసింది. నమ్మూరుకి చెందిన డిజైనర్ వినోద్ కుమార్ చిహ్నాన్ని రూపొందించారు. ఇంగ్లిష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా డిజైన్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అధికారిక చిహ్నం (లోగో) రూపొందించుకున్న భారత్‌లోని తొలి నగరం 
ఎప్పుడు : డిసెంబర్ 24 
ఎవరు : బెంగళూరు 
ఎందుకు : పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు

మార్చి 1 నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుCurrent Affairsప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని విచారించేందుకు దేశవ్యాప్తంగా 2018 మార్చి నాటికి 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టుల్ని సంప్రదించి రాష్ట్రాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం డిసెంబర్ 14న ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 1, 2018
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : అన్ని రాష్ట్రాల్లో 
ఎందుకు : ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న 13,500 కేసులు విచారించేందుకు

ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదంట్రిపుల్ తలాక్ (తలాక్- ఇ-బిద్దత్) పై రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం డిసెంబర్ 15న ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం భర్త ముందస్తు సమాచారం లేకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసి, భార్యకు విడాకులు ఇవ్వటం నేరం. అందుకు గాను భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేట్లు బిల్లును రూపొందించారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ముసాయిదాను తయారు చేసింది. ఈ ఉప సంఘంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్, సహాయ మంత్రి పీపీ చౌదరి సభ్యులుగా ఉన్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు

  • రెండు వేలలోపు డెబిట్ కార్డులు, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీల చార్జీలైన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఆమోదం.
  • జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం) అమలును 2020 వరకు పొడిగిస్తూ రూ.2,400 కోట్లు కేటాయిపుంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ముందస్తు సమాచారం లేకుండా చెప్పే ట్రిపుల్ తలాక్‌ను నిరోధించడానికి

ఆగ్నేయాసియా గేట్‌వేగా మిజోరాం : మోదీ మిజోరం రాష్ట్రంలోని కొలాసిబ్ ప్రాంతంలో నిర్మించిన 60 మెగావాట్ల తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టుని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 16న ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోం రైఫిల్స్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రసంగించిన మోదీ.. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్‌‌సపోర్ట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విసృ్తత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్‌‌స వంటి 10 ఆసియన్ కూటమి దేశాలకు మిజోరాం ముఖద్వారంగా మారనుందని చెప్పారు.

గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తంగా 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 99 స్థానాలు గెలుచుకొని వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్‌కు 79 స్థానాలు, ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకున్నారు. గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మోజారిటీ 92 స్థానాలు. 
68 స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 44 స్థానాల్లో గెలిచి ఐదేళ్ల అనంతరం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 35 స్థానాలు.
ఈ రెండు రాష్ట్రాల్లో విజయంతో దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది. 

గుజరాత్; మొత్తం స్థానాలు- 182
బీజేపీ99
కాంగ్రెస్77
భారతీయ ట్రైబల్ పారీ2
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ1
స్వతంత్రులు3
ఓట్ల శాతం
బీజేపీ49.1 శాతం
కాంగ్రెస్41.4 శాతం
హిమాచల్‌ప్రదేశ్; మొత్తం స్థానాలు – 68
బీజేపీ44
కాంగ్రెస్21
సీపీఐ(ఎం)1
స్వంతంత్రులు2
ఓట్ల శాతం
బీజేపీ48.8 శాతం
కాంగ్రెస్41.7 శాతం

దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిదివ్యాంగులకు ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే అన్ని ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో 5 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టం -2016, సెక్షన్ 32 పరిధిలోకి వచ్చే అన్ని విద్యాసంస్థలు ఏటా ఈ నిబంధనను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.

ఆధార్ గడువు మార్చి 31 వరకు పొడిగింపుCurrent Affairs ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ గడువు 2018 మార్చి 31 వరకు పొడిగింపు
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు అనుసంధానం చేసుకోవడానికి

కులాంతర వివాహానికి రూ. 2.5 లక్షల ప్రోత్సాహం కుల విబేధాలను రూపుమాపే దిశగా కులాంతర వివాహాలను ప్రోత్సహించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 5న సవరించింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న వార్షికాదాయ పరిమితి నిబంధనను తొలగించింది. తాజా సవరణ ప్రకారం.. ఇకపై కులాంతర వివాహం చేసుకునే వారిలో ఒకరు దళితులైతే వారికి కేంద్రం నుంచి రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా లభిస్తుంది. 

కుంభమేళాకు సాంస్కృతిక వారసత్వ సంపద గుర్తింపు 
ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో కుంభమేళాను డిసెంబర్ 7న సాంస్కృతిక వారసత్వ సంపద’గా గుర్తించింది. ఈ మేరకు దక్షిణ కొరియాలోని జెజూలో డిసెంబర్ 4 నుంచి 9 వరకు జరిగిన సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 12వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు శాంతియుతంగా హాజరయ్యే సమ్మేళనమే కుంభమేళా. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుంభమేళాకు సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : యునెస్కో
ఎందుకు : ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే సమావేశం అయినందున

హైకోర్టుల్లో 40 లక్షల పెండింగ్ కేసులుదేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో దాదాపు 40.15 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో గత పదేళ్లకు సంబంధించినవే 5,97,650 కేసులున్నాయి. ఈ మేరకు 24 హైకోర్టులకు సంబంధించి 2016 చివరి వరకు పెండింగ్‌లో ఉన్న కేసులపై నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం పెండింగ్ కేసుల్లో చివరి పదేళ్లకు సంబంధించిన కేసుల శాతం 19.45గా ఉండగా ఒక్క బాంబే హైకోర్టులోనే లక్షకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైకోర్టుల్లో 40 లక్షల పెండింగ్ కేసులు
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా

గణతంత్ర వేడుకలకు 10 దేశాల అధినేతలుజనవరి 26న నిర్వహించే భారత 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పది ఆగ్నేయాసియా దేశాల అధినేతలను ఆహ్వానించనున్నారు. 60 ఏళ్లుగా ప్రతి గణతంత్ర దినోత్సవానికీ ఓ దేశాధినేతను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాధినేతలను ఆహ్వానించనున్నారు. 
ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 25న స్మారకోత్సవాలను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గణతంత్ర వేడుకలకు 10 దేశాల అధినేతలకు ఆహ్వానం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

పరువు హత్యకేసులో ఆరుగురికి ఉరిశిక్షకూతురు తక్కువ కులస్తుడిని పెళ్లాడటంతో అల్లుడిని చంపిన కేసులో మామతో సహా ఆరుగురికి మరణశిక్ష విధిస్తూ తమిళనాడులోని తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అలమేలు నటరాజన్ డిసెంబర్ 12న తీర్పు చెప్పారు. తిరుప్పూరు జిల్లాకు చెందిన శంకర్(22) దిండుగల్లు జిల్లాకు చెందిన కౌసల్య (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కౌసల్య తండ్రి మరో ఆరుగురితో కలిసి 2016 మార్చి 13న శంకర్‌ను హతమార్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరువు హత్యకేసులో ఆరుగురికి ఉరిశిక్ష
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, తమిళనాడు
ఎందుకు : కూతురు ఇతర సామాజిక వర్గం వారిని పెళ్లి చేసుకున్నందుకు అల్లుణ్ని చంపిన కేసులో

ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులుదేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. 2014 వరకు అధికారంలో ఉన్న, ప్రస్తుతం కొనసాగుతున్న మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారం కోసం కేంద్రం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి రూ.7.80 కోట్లను కేటాయించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు 12 ప్రత్యేక కోర్టులు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు

అత్యధిక మలేరియా కేసుల్లో భారత్‌కు మూడోస్థానంCurrent Affairs 2016 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)-2017 నివేదికను నవంబర్ 29న విడుదల చేసింది. 27 శాతం కేసులతో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా, 10 శాతంతో కాంగో రెండో స్థానంలో ఉంది. 
ప్రపంచ వ్యాప్తంగా 4.45 లక్షల మలేరియా మరణాలు సంభవించగా, 33,997 మరణాలతో కాంగో మొదటి స్థానం, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక మలేరియా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌కు మూడోస్థానం
ఎప్పుడు : 2016
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : మలేరియా నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున

కోపర్డీ’ దోషులకు ఉరిశిక్ష ఖరారుమహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డీ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన కేసులో దోషులకు అహ్మద్‌నగర్ సెషన్‌‌స కోర్టు నవంబర్ 29న మరణశిక్ష విధించింది. జితేంద్ర బాబూలాల్ షిండే(25), సంతోష్ గోరఖ్ భావల్(30), నితిన్ గోపీనాథ్ భైలూమే(23)లకు మరణశిక్ష విధిస్తూ అదనపు ప్రత్యేక జడ్జి సువర్ణ కేవలే తీర్పునిచ్చారు.
మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను 2016, జూలై 13న ఈ ముగ్గురు రేప్‌చేసి చంపేశారు. దీంతో అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద న్యాయమూర్తి నవంబర్ 18న వీరిని దోషులుగా నిర్ధారించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోపర్డీ దోషులకు మరణశిక్ష ఖరారు
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అహ్మద్‌నగర్ సెషన్స్ కోర్టు
ఎక్కడ : కోపర్డీ గ్రామం, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర
ఎందుకు : పదిహేనేళ్ల బాలికను రేప్‌చేసి చంపినందుకు

ఎన్‌సీబీసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదంజాతీయ బీసీ కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఓబీసీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభ యథాతథంగా ఆమోదించగా, రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1993లోనే ఏర్పాటుచేసిన ఎన్‌సీబీసీకి కేంద్ర జాబితాలో ఏఏ వర్గాలను చేర్చాలో, తొలగించాలో అన్న విషయమై సిఫార్సుచేసే అధికారం మాత్రమే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌సీబీసీ బిల్లుకు ఆమోదం 
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఎన్‌సీబీసీ కి రాజ్యాంగ బద్ధత కల్పించడానికి

నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ : ఎన్‌సీఆర్‌బీ నివేదికహత్యలు, మహిళలపై నేరాలు వంటి వాటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. మెట్రో నగరాలపరంగా చూస్తే ఢిల్లీలో ఎక్కువగా రేప్‌లు (40%) జరిగినట్లు తెలిపింది. 2016లో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 30న విడుదల చేశారు.
నివేదిక ముఖ్యాంశాలు

  • యూపీలో 2016లో అత్యధికంగా 4889 హత్యలు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం హత్యల్లో 16.1 శాతం. బిహార్ 2581 (8.4%) హత్యలతో తరువాతి స్థానంలో ఉంది.
  • మహిళలపై నేరాలకు సంబంధించి యూపీలో 49,262 (14.5%) కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్‌లో 32,513 (9.6) కేసులు నమోదయ్యాయి.
  • దేశవ్యాప్తంగా రేప్ కేసులు 2015తో పోల్చితే 12.4 శాతం పెరిగాయి. ఈ విషయంలో మధ్యప్రదేశ్(4882), యూపీ (4816), మహారాష్ట్ర(4,189) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఐపీసీ కింద నమోదైన కేసులు యూపీలో 9.5 శాతం ఉన్నాయి. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (8.9%), మహారాష్ట్ర (8.8%), కేరళ (8.7%) ఉన్నాయి.
  • అపహరణ కేసులు దేశవ్యాప్తంగా 6 శాతం పెరగగా.. పిల్లలపై నేరాలు 13.6 శాతం పెరిగాయి.
  • షెడ్యూల్డ్ కులాలపై దాడులు 5.5%, షెడ్యూల్డ్ తెగలపై 4.7 శాతం పెరిగాయి.
  • ఎస్సీలపై దాడులు యూపీలో అత్యధికంగా 25.6% నమోదవగా, తరువాతి స్థానంలో బిహార్ (14%), రాజస్తాన్ (12.6%) ఉన్నాయి.
  • ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1823(27.8 శాతం) కేసులు నమోదయ్యాయి.
  • మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాల్లో ఢిల్లీలోనే 33 శాతం చోటుచేసుకోగా, ముంబైలో 12.3% కేసులు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్
ఎప్పుడు : 2016
ఎవరు : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
ఎక్కడ : దేశవ్యాప్తంగా

‘ట్రిపుల్ తలాక్’కు మూడేళ్ల జైలుట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా ముసాయిదాను కేంద్రం రూపొందించింది. ఈ మేరకు ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది. 
ముస్లిం మహిళల హక్కుల చట్టాన్ని ‘షా బానో చట్టం-1986’గా కూడా పిలుస్తారు. షా బానో కేసు నేపథ్యంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు రక్షణ వర్తించేలా నిబంధనలుండటంతో విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్రం
ఎందుకు : విడాకులకు ముందే ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు

8 వేల మానవ అక్రమ రవాణా కేసులు నమోదుదేశవ్యాప్తంగా 2016లో 8132 మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. సగటున రోజుకు 63 మందిని పోలీసులు రక్షించినట్లు పేర్కొంది. ఈ కేసుల్లో 58 శాతం మంది బాధితులు 18 ఏళ్లలోపు వారే. వీటిల్లో 3,579 కేసుల (44 శాతం)తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, రాజస్తాన్ (1,422 కేసులు), గుజరాత్ (548), మహారాష్ట్ర (517), తమిళనాడు (434) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 8 వేల మానవ అక్రమ రవాణా కేసులు నమోదు
ఎప్పుడు : 2016
ఎవరు : నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో
ఎక్కడ : దేశవ్యాప్తంగా

No comments:

Post a Comment