DAILY UPDATES IN TELUGU
[11/17/2017, 19:26] AIMS DARE TO SUCCESS: పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ మహమ్మద్ హఫీజ్ బౌలింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ మరోసారి నిషేధం విధించింది.గత నెలలో శ్రీలంకతో సీరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో హఫీజ్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని గుర్తించిన ఐసీసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో 2014 డిసెంబర్‌లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్.. రెండోసారి 2015 జూన్‌లో ఏడాది నిషేధానికి గురయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ బౌలర్ హఫీజ్ పై మళ్లీ నిషేధం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఐసీసీ
ఎందుకు : వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా
[11/17/2017, 19:27] AIMS DARE TO SUCCESS: అత్యంత ప్రాచీన కళాసృష్టిలో ఒకటైన లియోనార్డో డావెన్సీ వేసిన దాదాపు 500 ఏళ్ల నాటి పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది.న్యూయార్క్‌లో క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో డావెన్సీ వేసిన ‘సాల్వేటర్ ముండి’ జీసస్ క్రైస్ట్ చిత్రం వేలంలో ఉంచారు. వేలంలో ఈ పెయింటింగ్ 450.3 మిలియన్ డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,941వేల కోట్లు.
అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా డావెన్సీ జీసస్ క్రైస్ట్ పెయింటింగ్ నిలిచినట్లు క్రిస్టీస్ వెల్లడించింది. గతంలో 2015 క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో పాబ్లో పికాసో వేసిన పెయింటింగ్ 179.4 మిలియన్ డాలర్లు పలికింది. ఈ రికార్డును డావెన్సీ పెయింటింగ్ అధిగమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డావెన్సీ చిత్రానికి వేలంలో 450.3 మిలియన్ డాలర్లు
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : క్రిస్టీస్
ఎక్కడ : న్యూయార్క్‌లో
[11/17/2017, 19:30] AIMS DARE TO SUCCESS: భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది.భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్ ఇవాన్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరద ముప్పును గుర్తించే పరికరం అభివృద్ధి
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : నాసా
[11/17/2017, 19:32] AIMS DARE TO SUCCESS: బ్రెగ్జిట్ అనంతర వ్యూహంలో భాగంగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో టెక్నాలజీ, కళలు, సృజనాత్మక పరిశ్రమల్లో పనిచేసే యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలకు చెందని నిపుణులకు ప్రస్తుతం జారీచేస్తున్న వీసాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అసాధారణ ప్రతిభ(ఎక్సెప్షనల్ టాలెంట్) ఉండే విదేశీయులకు టైర్-1 రూట్ ద్వారా ప్రస్తుతం 1,000 వీసాలు ఇస్తుండగా, దీన్ని 2 వేలకు పెంచుతామంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూరప్‌యేతర దేశాలకు బ్రిటన్ వీసాలు రెట్టింపు
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : బ్రిటన్
ఎందుకు : బ్రెగ్జిట్ అనంతర వ్యూహంలో భాగంగా
[11/17/2017, 19:33] AIMS DARE TO SUCCESS: రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు.
మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016-17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి.
కేబినెట్ నిర్ణయాలు...
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-అర్బన్) పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్ ఏరియాను పెంచేందుకు అనుమతి.
జీఎస్టీలో భాగంగా నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏర్పాటుకూ ఆమోదం. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చు. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీబీఈసీ చైర్మన్ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది.
ఐసీడీఎస్‌లో నాలుగు పథకాల్ని నవంబర్ 2018 వరకూ కొనసాగించాలని నిర్ణయం. ఇందులో అంగన్‌వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి.క్విక్ రివ్యూ:
ఏమిటి : పప్పు ధాన్యాల ఎగుమతికి అనుమతి
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర కేబినెట్
[11/17/2017, 19:34] AIMS DARE TO SUCCESS: ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయశాఖ నవంబర్ 16న ప్రకటించింది.18.71 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్ ద్వారా వ్యాపారులకు అమ్ముకున్నారని పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 44 మార్కెట్ల ద్వారా ఈ-నామ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాలను పోల్చుతూ తెలంగాణలో ఈ-నామ్ అమలు తీరును కేంద్రం తన నివేదికలో ప్రస్తావించింది.
ఒడిశాలో ఈ-నామ్ మార్కెట్లకు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల్లో కేవలం 2 శాతం మాత్రమే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, తెలంగాణలో ఏకంగా 85 శాతం ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారానే విక్రయించారు. ఏ రాష్ట్రంలోనూ ఆన్‌లైన్ ద్వారా ఈ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరగలేదని కేంద్ర నివేదికలో ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ - నామ్ అమలులో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర వ్యవసాయశాఖ
ఎందుకు : ఈ - నామ్ ద్వారా రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు
[11/17/2017, 19:34] AIMS DARE TO SUCCESS: ఆర్థిక రంగం, స్వచ్ఛతలో పురోగతికి గుర్తింపుగా రాష్ట్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి.ఇండియా టుడే ఏటా నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2017 సదస్సు నవంబర్ 16న ఢిల్లీలో జరిగింది. ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి రాష్ట్రానికి రెండు బెస్ట్ పెర్ఫార్మింగ్ లార్జ్ స్టేట్ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్ - 2017
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఇండియాటుడే
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : ఆర్థిక, స్వచ్ఛత రంగంలో తెలంగాణకు రెండు అవార్డులు
[11/17/2017, 19:35] AIMS DARE TO SUCCESS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. అంటే కొత్తగా 28 పోస్టులు పెరిగినట్లు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు ఉండగా కేడర్ రివ్యూలో భాగంగా మూడు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కి మరో 28 ఐఏఎస్ పోస్టులు మంజూరు
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఏపీలో 239కి పెరిగిన ఐఏఎస్ పోస్టుల సంఖ్య
[11/17/2017, 19:35] AIMS DARE TO SUCCESS: తూర్పు గోదావరి జిల్లా ‘గోదావరి పుష్కరాలు’ పేరుతో తీసిన డాక్యుమెంటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవార్టు ప్రకటించింది.అమరావతిలో నవంబర్ 14న వివిధ పేర్లతో ప్రకటించిన వివిధ కేటగిరీల్లో ‘గోదావరి పుష్కరాలు’కు 2015 ఏడాదికిగాను ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ అవార్డు వరించింది. ఈ డాక్యుమెంటరీ తీసిన నిర్మాత, దర్శకుడి పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి పుష్కరాల డాక్యుమెంటరీకి అవార్డు
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
[11/17/2017, 19:36] AIMS DARE TO SUCCESS: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లిలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకానుంది.ఈ మేరకు బాబా రామ్‌దేవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, తెలంగాణ టీఎస్‌ఐఐసీ ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డి నవంబర్ 15న ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విత్తనాభివృద్ధి, జంతువుల దాణా ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూడా పతంజలి సంస్థ ఆసక్తి కనబరిచింది.
లక్కంపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆహార శుద్ధి కర్మాగారంలో పసుపు, మిర్చి, మక్కలు, సోయా తదితర సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాల్ని సేకరించి శుద్ధి చేస్తారు. యూనిట్‌కు కావలసిన పసుపు, మిరప, సోయా, మక్కలు ఆ ప్రాంతంలోనే కొనుగోలు చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకడంతో పాటు ఆ ప్రాంత రైతులకు పంటలను ఒకేసారి అమ్ముకోడానికి వీలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : పతంజలి, టీఎస్ ఐఐసీ మధ్య అవగాహన ఒప్పందం
ఎక్కడ : లక్కంపల్లి, నిజామాబాద్ జిల్లా
[11/17/2017, 19:36] AIMS DARE TO SUCCESS: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు.అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే సంస్థ ప్యూ నవంబర్ 15న వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో 88 శాతం పాయింట్లతో మోదీ అగ్రస్థానంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 58 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వరసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 57%, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 39% పాయింట్లు దక్కాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య 2,464 భారతీయులపై ఈ సర్వే నిర్వహించించారు. దీని ప్రకారం.. ప్రతి పది మందిలో 8 మంది దేశ ఆర్థి క పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి 10 మందిలో 9 మంది మోదీపై సానుకూలంగా స్పందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ప్యూ రీసెర్చ్ సర్వే
[11/17/2017, 19:36] AIMS DARE TO SUCCESS: జింబాబ్వే సైన్యం ఆ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆయన ఇంట్లోనే నిర్బంధించింది.అయితే ఇది సైనిక తిరుగుబాటు కాదనీ, అధ్యక్షుడు, ఆయన కుటుంబీకులు ఇంట్లో క్షేమంగానే ఉన్నారనీ, ముగాబే చుట్టూ ఉన్న నేరస్తులే తమ లక్ష్యమని ఆర్మీ జనరల్స్ నవంబర్ 15న వెల్లడించారు. తమ లక్ష్యం పూర్తయిన వెంటనే దేశంలో సాధారణ స్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
1980 నుంచీ ఆయనే..
గతంలో రొడేసియా అనే పేరున్న జింబాబ్వే 1965లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుంది. నల్లజాతివారి సాయుధపోరాటం తర్వాత శ్వేతజాతి పాలన ముగిసింది. విమోచనపోరాటం నడిపిన రాబర్ట్ ముగాబే నాయకత్వాన 1980 ఎన్నికల్లో జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జాను) విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముగాబే అధికారంలోనే ఉన్నారు. 93 ఏళ్ల ముగాబే ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రపంచదేశాల అధ్యక్షుల్లోకెల్లా వయసులో పెద్దవారు. అలాగే 1980 నుంచి ఇప్పటికీ ఒక దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రపంచంలో ఈయన ఒక్కరే. ఇన్నేళ్ల పాలనలో సైన్యం ఆయనకు ఎదురుతిరగడం మాత్రం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే గృహ నిర్బంధం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : జింబాబ్వే సైన్యం
[11/17/2017, 19:37] AIMS DARE TO SUCCESS: ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రీడం హౌస్ అనే సంస్థ.. ఫ్రీడమే ఆన్ ది నెట్ - 2017 నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పలు తాజా అంశాలను చేర్చి ఈ నివేదికను రూపొందించింది. సర్వే నివేదికలో పేర్కొన్న ప్రధాన అంశాలు..
మొత్తం సర్వే చేసిన 65 దేశాలకుగాను 30 దేశాల్లోని ప్రభుత్వాలు సోషల్ మీడియాపై బలవంతపు ఆధిపత్యాన్ని సాధించాయి. చైనాలోని టిబెట్, ఇథియోపియాలోని ఒరోమో, భారత్‌లో కశ్మీర్‌లలో ఈ సేవలపై తరచూ ఆంక్షలు పెడుతున్నారు.
ఆయా అంశాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఇంటర్నెట్ స్వేచ్ఛపై 14 దేశాలు నియంత్రణలు విధించాయి.
వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (వీపీఎన్)లను అడ్డుకోవడం కోసం ప్రస్తుతం 14 దేశాలు సెన్సార్‌షిప్‌ను విధించాయి. ఆరుదేశాల్లో వీపీఎన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిషేధించారు.
ప్రతిపక్షాల విమర్శలను సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టేందుకు టర్కీలో ప్రభుత్వం ఆరు వేల మందిని నియామించుకుంది.
రష్యా అనుకూల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధికారులు రష్యా ఆధారిత సేవలను నిలిపివేశారు.
వరుసగా మూడో ఏడాది కూడా చైనా ఇంటర్నెట్ స్వేచ్ఛను అధికంగా నియంత్రించిన దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో సిరియా, ఇథియోపియా ఉన్నాయి.
ఇంటర్నెట్ ఉన్నా.. స్వేచ్ఛలో వెనుకబాటే!
ఇంటర్నెట్ అందుబాటు, వేగం విషయంలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. కానీ ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలుస్తోంది. పాకిస్తాన్, సౌదీ అట్టడుగున ఉన్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛలో ఇస్టోనియా, ఐస్‌లాండ్ ప్రథమస్థానంలో.. కెనడా 2వ, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నెట్ స్వేచ్ఛలో 41వ స్థానంలో భారత్
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ఫ్రీడమ్ ఆన్ ది నెట్-2017 సర్వే
ఎక్కడ : 65 దేశాల జాబితాలో
[11/17/2017, 19:38] AIMS DARE TO SUCCESS: భారత తొలి ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సుని ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో నవంబర్ 14న నిర్వహించారు.భారత్‌లో జరుగుతున్న 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సులో భాగంగా.. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. గిరిజన యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు
ఎప్పుడు : నవంబర్
ఎవరు : నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : దంతెవాడ, ఛత్తీస్‌గఢ్
[11/17/2017, 19:38] AIMS DARE TO SUCCESS: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు.14 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహిస్తోంది. వియత్నాం భాగస్వామ్య దేశంగా.. జార్ఖండ్ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరిస్తున్నాయి. 22 దేశాలకు చెందిన 7 వేల మంది ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఈ ఫెయిర్‌లో ప్రదర్శనకు ఉంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్
ఎప్పుడు : నవంబర్ 14 - 28
ఎవరు : ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్
ఎక్కడ : ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ
[11/17/2017, 19:39] AIMS DARE TO SUCCESS: 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత 10 ఏళ్లు పెరిగింది.ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన తాజా అధ్యయనంలో ఈ జీవనరేఖలు బయటపడ్డాయి. పురుషుల సగటు జీవిత కాలం 66.9 సంవత్సరాలకు పెరగ్గా, మహిళల జీవన సంభావ్యత 70.3 సంవత్సరాలకు పెరిగిందని జర్నల్ ప్రచురించింది. మహిళల ఆయుష్షు సంభావ్యత కేరళలో అధికంగా 78.7 ఏళ్లు ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 66.8 ఏళ్లు ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. సగటు జీవిత కాలం పెరగటానికి భారత దేశంలో పెరుగుతున్న అత్యాధునిక వైద్యసదుపాయాలతో పాటు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేనని లాన్సెట్ స్పష్టం చేసింది. కాని దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయని సర్వే తెలిపింది. అభివృద్ధి చెందిన కేరళ, గోవా వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు అన్ని రకాల వైద్య సేవల్లో 4 రెట్లు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లు పెరిగిన భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : లాన్సెట్ జర్నల్
[11/17/2017, 19:39] AIMS DARE TO SUCCESS: రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి.అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రసగుల్లా భౌగోళిక గుర్తింపు
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : పశ్చిమ బెంగాల్‌కు
[11/17/2017, 19:40] AIMS DARE TO SUCCESS: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఎదురులేని ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించిన చైనా ఆధిపత్య ధోరణిని కట్టడిచేయడానికి రంగం సిద్ధమైంది.దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆటలు సాగకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌తో కూడిన నాలుగుదేశాల కూటమి (క్వాడ్రిలేటరల్-క్వాడ్) అవసరమని జపాన్ ప్రధాని షింజో అబే 2007లోనే భారత పార్లమెంటులో ప్రసంగిస్తూ సూచించారు. తర్వాత నెల రోజులకే ఆయన పదవి నుంచి వైదొలిగాక ఈ ‘చైనా వ్యతిరేక’ చతుర్భుజం ప్రతిపాదన మరుగునపడిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు అబే ప్రధానిగా తన స్థానం బలోపేతం చేసుకున్నాక ఈ ప్రతిపాదనకు గట్టి ఆమోదముద్ర లభించింది. 31వ ఆగ్నేయాసియా, 12వ తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ఫిలిప్పీన్‌స వచ్చిన ఈ నాలుగు దేశాల అధికారులు మనీలాలో నవంబర్ 12న సమావేశమయ్యారు. నాలుగు రాజ్యాల కూటమి ప్రతిపాదనపై ఉన్నతాధికారుల స్థాయిలో అక్కడ చర్చలు జరిగాయి.
షింజో లక్ష్యమేంటి?
అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ప్రధానపాత్ర పోషించే ఆసియా, పసిఫిక్ దేశాలకు రవాణాపరంగా దక్షిణ చైనా సముద్రం ఎంతో కీలకమైనది. అయితే ప్రపంచీకరణ ఫలాలతో బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా ఈ సముద్ర ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించేలా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. పొరుగు దేశాలను బెదిరించే ధోరణిలో ప్రకటనలు చేస్తోంది. అలాగే గతంలో జపాన్ చైనాతో ప్రాదేశిక వివాదాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు రాజ్యం అనుసరించే పెత్తందారీ ధోరణులకు వ్యతిరేకంగా సంకీర్ణం నిర్మించాలనే పట్టుదలతో జపాన్ ఉంది. తాజా పరిణామాల ఫలితంగా చైనాకు ఇండియా మరింత దూరం కావడంతో భారత్‌ను ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని కూడా అబే భావిస్తున్నారు. అలాగే అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచీ చైనాను కట్టడి చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమెరికా కూడా ఈ కూటమి ప్రతిపాదనపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికాను అనుసరించే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ‘చతుర్భుజం’ లో భాగంకావడానికి సిద్ధమైంది.
కూటమిలోకి భారత్?
హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా ప్రాంతం మీదుగా ముడి చమురు చైనాకు రవాణా అవుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై తన ప్రభావం, ఆధిపత్యం ఉండేలా చైనా పావులు కదుపుతూ చాలా వరకు అనుకున్నది సాధించింది. దౌత్య, ప్రాంతీయ సంబంధాల్లో భారత్ కొంత వెనుకబడటం చైనాకు ఇప్పటి వరకూ కలిసొచ్చింది. అయితే ఇటీవల రెండు నెలలకు పైగా డోక్లామ్ వివాదంతో భారత్ విసిగిపోయింది. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసేందుకు ‘క్వాడ్’ కూటమిలో చేరడం ఇప్పుడు భారత్‌కు మంచి అవకాశంగా కనిపిస్తోంది. మనీలాలో జరిగిన అధికారుల స్థాయి చతుర్భుజ కూటమి సమావేశంలో నాలుగు దేశాల ప్రతినిధులూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అందరూ అంతర్జాతీయ చట్టాలను అనుసరించడం, సముద్రాల్లో నౌకలు, ఆకాశంలో విమానాల రవాణాకు అడ్డంకులు లేకుండా చూడడం, ఓడలకు భద్రత కల్పిస్తూ, ఉగ్రవాదుల నుంచి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించారు. చైనా తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వన్ బెల్డ్- వన్ రోడ్ ప్రాజెక్టును ఆర్భాటంగా చేపడుతుండగా, ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ కూడా ఓ ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఈ ప్రాంతంలో సూచిస్తున్నారు. ఈ కూటమి బలపడితే కొత్త ప్రాజెక్టు పని సులువవుతుందనీ పలువురు భావిస్తున్నారు. ఏదేమై నా ఆర్థికంగా బలమైన 4 పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ పేరుతో చేతులు కలపడం చైనాకు పెద్ద సవాలే.
[11/17/2017, 19:43] AIMS DARE TO SUCCESS: ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదుర్కొం టున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 31వ ‘ఆసియాన్-భారత్’ సదస్సులో నవంబర్ 14న మోదీ పేర్కొన్నారు.
ఆసియాన్ దేశాధినేతలకు ఆహ్వానం
భారత్, ఆసియాన్ మధ్య ‘పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం’పై ప్రసంగించిన ప్రధాని మోదీ.. 25, జనవరి 2018న న్యూఢిల్లీలో ఇండో-ఆసియాన్ ప్రత్యేక సదస్సుకి దేశాధినేతలను ఆహ్వానించారు.
ఆసియాన్ సభ్య దేశాలు..
ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్‌స, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన కూటమిలో ఒకటైన ఆసియాన్‌లో భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్ సదస్సుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్’(ఆర్‌సీఈపీ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ఆర్‌సీఈపీలో 10 ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఈ దేశాలు చర్చలు కొనసాగించాయి.
‘తూర్పు ఆసియా’ది కీలక పాత్ర
ఆసియాన్-భారత్ సదస్సుతో పాటు.. తూర్పు ఆసియా సదస్సులో కూడా ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆసియా ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్యపర అంశాల పరిష్కారంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని, ఆ కూటమితో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈస్ట్ ఆసియా సదస్సు ఎంతో ముఖ్యమైన వేదిక. 2005లో ప్రారంభమైన ఈ సదస్సు వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలు, తూర్పు ఆసియా ఆర్థిక వికాసంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా సదస్సులో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
[11/17/2017, 19:44] AIMS DARE TO SUCCESS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది పురస్కారాలను నవంబర్ 14న ప్రకటించింది. వీటితో పాటు మూడు సంవత్సరాలకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బీఎన్‌రెడ్డి అవార్డు, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డు, రఘుపతి - వెంకయ్య అవార్డులను ప్రకటించారు.

అవార్డు విజేతలు
ఎన్టీఆర్ జాతీయ అవార్డు
2014
కమల్‌హాసన్
2015
కె. రాఘవేంద్రరావు
2016
రజనీకాంత్
బీఎన్‌రెడ్డి అవార్డు
2014
ఎస్.ఎస్.రాజమౌళి
2015
త్రివిక్రమ్ శ్రీనివాస్
2016
బోయపాటి శ్రీను
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు
2014
ఆర్.నారాయణమూర్తి
2015
ఎం.ఎం. కీరవాణి
2016
కె.ఎస్.రామారావు
రఘుపతి వెంకయ్య అవార్డు
2014
కృష్ణంరాజు
2015
ఈశ్వర్
2016
చిరంజీవి
2014 నంది అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం
లెజెండ్
ద్వితీయ ఉత్తమ చిత్రం
మనం
తృతీయ ఉత్తమ చిత్రం
హితుడు
ఉత్తమ దర్శకుడు
బోయపాటి శ్రీను (లెజెండ్)
ఉత్తమ నటుడు
నందమూరి బాలకృష్ణ (లెజెండ్)
ఉత్తమ నటి
అంజలి (గీతాంజలి)
ఉత్తమ విలన్
జగపతిబాబు (లెజెండ్)
ఉత్తమ సహాయ నటుడు
అక్కినేని నాగచైతన్య (మనం)
ఉత్తమ సహాయ నటి
లక్ష్మీమంచు (చందమామ కథలు)
ఉత్తమ హాస్య నటుడు
బ్రహ్మానందం (రేసుగుర్రం)
ఉత్తమ బాలనటుడు
గౌతమ్ కృష్ణ (1 నేనొక్కడినే)
ఉత్తమ బాలనటి
అనూహ్య (ఆత్రేయ)
ఉత్తమతొలిచిత్ర దర్శకుడు
చందు మొండేటి (కార్తికేయ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్
ఏయస్ రవికుమార్ చౌదరి
(పిల్లా నువ్వులేని జీవితం)
ఉత్తమ కథా రచయిత
కృష్ణవంశీ
(గోవిందుడు అందరివాడేలే)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్
సాయి శ్రీరామ్ (అలా ఎలా)
ఉత్తమ గాయకుడు
విజయ్ ఏసుదాసు (లెజెండ్)
ఉత్తమ గాయని
కేయస్ చిత్ర (ముకుంద)
ఉత్తమ కళాదర్శకుడు
విజయకృష్ణ
ఉత్తమ కొరియోగ్రాఫర్
ప్రేమ్క్ష్రిత్ (ఆగడు)
ఉత్తమ ఆడియో గ్రాఫర్
ఇ. రాధకృష్ణ (కేరింత)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్
ఉద్దండు (ఓరి దేవుడోయ్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్
కృష్ణ (శనిదేవుడు)
ఉత్తమ మాటల రచయిత
ఎమ్. రత్నం (లెజెండ్)
ఉత్తమ గేయ రచయిత
చైతన్య ప్రసాద్ (బ్రోకర్ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు
అనూప్ రూబెన్స్ (మనం)
ఉత్తమ ఎడిటర్
కోటగిరి వెంకటేశ్వర్‌రావు (లెజెండ్)
ఉత్తమ ఫైట్స్
రామ్‌లక్ష్మణ్ (లెజెండ్)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్
రవిశంకర్. పి (రేసుగుర్రం)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్
చిన్మయి (మనం)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
రఘునాథ్ (లెజెండ్)
ఉత్తమ సినీ విమర్శకుడు
పులగం చిన్నారాయణ
స్పెషల్ జ్యూరీ అవార్డు
సుద్దాల అశోక్ తేజ
2015 నంది అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం
బాహుబలి
ద్వితీయ ఉత్తమ చిత్రం
ఎవడే సుబ్రమణ్యం
తృతీయ ఉత్తమ చిత్రం
నేను శైలజ
ఉత్తమ దర్శకుడు
రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటుడు
మహేశ్‌బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి
అనుష్క (సైజ్ జీరో)
ఉత్తమ విలన్
రానా (బాహుబలి)
ఉత్తమ సహాయ నటుడు
పోసాని కృష్ణమురళి (టెంపర్)
ఉత్తమ సహాయ నటి
రమ్యకృష్ణ (బాహుబలి)
ఉత్తమ హాస్య నటుడు
‘వెన్నెల’ కిశోర్ (భలే భలే మగాడివోయ్)
ఉత్తమ బాలనటుడు
మాస్టర్ ఎన్టీఆర్ (దాన వీర శూర కర్ణ)
ఉత్తమ బాలనటి
బేబీ కారుణ్య (దాన వీర శూర కర్ణ)
తొలి చిత్ర దర్శకుడు
నాగ అశ్విన్ (ఎవడే సుబ్రమణ్యం)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్
కిశోర్ తిరుమల (నేను శైలజ)
ఉత్తమ కథా రచయిత
క్రిష్ జాగర్లమూడి (కంచె)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్
జ్ఞానశేఖర్ (కంచె, మళ్ళీ మళ్ళీ ఇది...)
ఉత్తమ గాయకుడు
కీరవాణి (జటా..జటా - బాహుబలి)
గాయని
చిన్మయి (గతమా.. గతమా)
ఉత్తమ కళాదర్శకుడు
సాబు శిరిల్ (బాహుబలి)
ఉత్తమ కొరియోగ్రాఫర్
ప్రేమ్ రక్షిత్ (బాహుబలి)
ఉత్తమ ఆడియో గ్రాఫర్
పీఎమ్ సతీష్ (బాహుబలి)
ఉత్తమ కాస్ట్యూమ్స్
రమా రాజమౌళి, ప్రశాంతి (బాహుబలి)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్
ఆర్. మాధవరావు (దానవీరశూర కర్ణ)
ఉత్తమ మాటల రచయిత
బుర్రాసాయి మాధవ్ (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు)
ఉత్తమ గేయ రచయిత
రామజోగయ్య శాస్త్రి (పోరా శ్రీమంతుడా..)
ఉత్తమ సంగీత దర్శకుడు
ఎమ్.ఎమ్. కీరవాణి (బాహుబలి)
ఉత్తమ ఎడిటర్
ఎన్. నవీన్ (లేడీస్ అండ్ జెంటిల్‌మెన్)
ఉత్తమ ఫైట్స్
పీటర్ హెయిన్స్ (బాహుబలి)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్
రవిశంకర్ (కట్టప్ప-సత్యరాజ్-బాహుబలి)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్
సౌమ్య (రుద్రమదేవి-అనుష్క)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
ఎస్.శ్రీనివాస్ మోహన్ (బాహుబలి)
ఎస్వీ రంగారావు పురస్కారం
అల్లుఅర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ సినీ విమర్శకుడు
డా. కంపెల్ల రవిచంద్రన్
స్పెషల్ జ్యూరీ అవార్డు
పీసీ రెడ్డి
2016 నంది అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం
పెళ్ళిచూపులు
ద్వితీయ ఉత్తమ చిత్రం
అర్ధనారి
తృతీయ ఉత్తమ చిత్రం
మనలో ఒకడు
ఉత్తమ దర్శకుడు
సతీశ్ వేగేశ్న (శతమానం భవతి)
ఉత్తమ నటుడు
జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ నటి
రితూ వర్మ (పెళ్ళిచూపులు)
ఉత్తమ విలన్
ఆది పినిశెట్టి (సరైనోడు)
ఉత్తమ సహాయ నటుడు
మోహన్‌లాల్ (జనతా గ్యారేజ్)
ఉత్తమ సహాయ నటి
జయసుధ (శతమానం భవతి)
ఉత్తమ హాస్య నటుడు
సప్తగిరి (ఎక్స్‌ప్రెస్ రాజా)
ఉత్తమ హాస్యనటి
ప్రగతి (కళ్యాణ వైభోగమే)
ఉత్తమ బాలనటుడు
మైఖేల్ గాంధి (సుప్రీమ్)
ఉత్తమ బాలనటి
రైనా రావ్ (మనమంతా)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు
కల్యాణ్‌కృష్ణ కురసాల (సోగ్గాడే చిన్నినాయనా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్
రవికాంత్ పేరెపు, అడివి శేష్ (క్షణం)
ఉత్తమ కథా రచయిత
కొరటాల శివ (జనతా గ్యారేజ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్
సమీర్‌రెడ్డి (శతమానం భవతి)
ఉత్తమ గాయకుడు
‘వందేమాతరం’ శ్రీనివాస్ (దండకారణ్యం)
ఉత్తమ గాయని
చిన్మయి (కళ్యాణవైభోగమే)
ఉత్తమ కళాదర్శకుడు
ఎ.ఎస్. ప్రకాశ్ (జనతా గ్యారేజ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్
రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ ఆడియో గ్రాఫర్
ఇ. రాధాకృష్ణ (సరైనోడు)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్
వి. తిరుమలేశ్వర రావ్ (శ్రీ చిలుకూరి బాలాజి)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్
రంజిత్ (అర్ధనారి)
ఉత్తమ మాటల రచయిత
అవసరాల శ్రీనివాస్ (జ్యో అచ్యుతానంద)
ఉత్తమ గేయ రచయిత
రామజోగయ్య శాస్త్రి (ప్రణామం ప్రణామం)
ఉత్తమ సంగీత దర్శకుడు
మిక్కీ జె. మేయర్ (అ ఆ)
ఉత్తమ ఎడిటర్
నవీన్ నూలి (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ ఫైట్స్
వెంకట్ (సుప్రీమ్)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్
వాసు (అర్ధనారి)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్
లిప్సికా (ఎక్కిడికి పోతావు చిన్నవాడా)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
ఫైర్‌ప్లైయ్ (సోగ్గాడే చిన్నినాయనా)
తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం:
పసిడితెర (పులగం చిన్నారాయణ)
స్పెషల్ జ్యూరీ అవార్డు
నాని (జెంటిల్‌మన్)
కాంస్య నంది
చంద్రశేఖర్ ఏలేటి (మనమంతా)
కాంస్య నంది
సాగర్ కె.చంద్ర (అప్పట్లో ఒకడుండేవాడు)
స్పెషల్ జ్యూరీ అవార్డు
పరుచూరి బ్రదర్స్
[11/17/2017, 19:44] AIMS DARE TO SUCCESS: ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘ఫెడ్ కప్’ను అమెరికా జట్టు సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్, ప్రపంచ పదో ర్యాంకర్ కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, అలీసన్ రిస్కీ సభ్యులుగా ఉన్న అమెరికా ఫైనల్లో 3-2తో బెలారస్‌పై గెలిచింది. చివరిసారి 2000లో ఫెడ్ కప్‌ను దక్కించుకున్న అమెరికా తాజా విజయంతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫెడ్ కప్ - 2017
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : విజేత అమెరికా
[11/17/2017, 19:45] AIMS DARE TO SUCCESS: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. భారత్‌కే చెందిన పురవ్ రాజా ద్వయం అమెరికాలో జరిగిన నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్-పురవ్ రాజా ద్వయం 7-6 (7/4), 7-6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించారుు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ - 2017
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : డబుల్స్ టైటిల్ విజేత లియాండర్ పేస్ - పురవ్ రాజా
[11/17/2017, 19:45] AIMS DARE TO SUCCESS: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు.  రెండో స్థానంలో వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు. తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెజిల్ గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : విజేత సెబాస్టియన్ వెటెల్
[11/17/2017, 19:45] AIMS DARE TO SUCCESS: కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ నవంబర్ 13న ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని నవంబర్ 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎందుకు : అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు
[11/17/2017, 19:46] AIMS DARE TO SUCCESS: ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విసృ్తతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విసృ్తతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్-అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు మోదీ పేర్కొన్నారు.
ఆసియాన్ బిజినెస్ ఫోరంతో మోదీ సమావేశం
ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు.
ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలు
ఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్‌ఆర్‌ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్‌ఆర్‌ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూపొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1-3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
ఎప్పుడు : నవంబర్ 13
ఎక్కడ : మనీలా, ఫిలిప్పీన్స్
ఎందుకు : ఆసియాన్ సదస్సు సందర్భంగా
[11/17/2017, 19:46] AIMS DARE TO SUCCESS: దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు నవంబర్ 13న అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్‌స మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హనోయ్ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ చైనా సముద్రంపై రాజీ
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : చైనా, వియత్నాం
[11/17/2017, 19:46] AIMS DARE TO SUCCESS: రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు.
 ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 12న రాత్రి 9.48 గంటల (భారత కాలమానం నవంబర్ 12న రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్‌షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లో పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారిపోయాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాక్ - ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం
ఎప్పుడు : నవంబర్ 12
ఎక్కడ : ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో
[11/17/2017, 19:47] AIMS DARE TO SUCCESS: భారత క్రికెటర్ ధోని అకాడమీ.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రారంభమైంది.దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్ట్స్ క్లబ్, ఆర్కా స్పోర్ట్స్ క్లబ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రానికి ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) అని పేరు పెట్టారు. నవంబర్ 11న ఈ అకాడమీని ధోని లాంఛనంగా ప్రారంభించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 11
ఎక్కడ : యూఏఈ
[11/17/2017, 19:47] AIMS DARE TO SUCCESS: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధానిలో నవంబర్ 12 నుంచి ప్రారంభం కావాల్సిన ‘సరి-బేసి’ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.మహిళలు, ద్విచక్ర వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
[11/17/2017, 19:47] AIMS DARE TO SUCCESS: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారులు ఇకపై తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు.ఇప్పటివరకు ఈ పరిమితి 20 అక్షరాలే ఉండగా నవంబర్ 11 నుంచి దానిని ట్వీటర్ 50కి పెంచింది. ఏదేనీ ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ గతవారమే 140 నుంచి 280కి రెట్టింపు చేయడం తెలిసిందే. పొడవైన పేర్లు కలిగినవారు తమ పూర్తి పేరును ఇకపై డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు తాజా చర్య ఉపయోగకరంగా ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్వీటర్ డిస్ ప్లే నేమ్ పరిమితి పెంపు
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ట్వీటర్
ఎందుకు : 20 అక్షరాల నుంచి పరిమితి 50 అక్షరాలకు పెంపు
[11/17/2017, 19:47] AIMS DARE TO SUCCESS: భారత క్యూ స్పోర్‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ 17వ సారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్(150 అప్ ఫార్మాట్)గా నిలిచాడు.నవంబర్ 12న జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. 2016లో బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు.
గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్-2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్-2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : విజేత పంకజ్ అద్వానీ
[11/17/2017, 19:48] AIMS DARE TO SUCCESS: అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.
నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూకంపాలను సైతం తట్టుకునే వంతెన నిర్మాణం
ఎక్కడ : కశ్మీర్‌లోని చినాబ్ నదిపై
ఎందుకు : భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా
[11/17/2017, 19:49] AIMS DARE TO SUCCESS: ఇండియా-ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల మండలి) 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఫిలిప్పీన్‌సలో పర్యటిస్తున్నారు.ఇండియా-ఆసియాన్‌తోపాటు మోదీ 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ పాల్గొంటారు. ఆసియాన్ 50వ వార్షికోత్సవ సంబరాలు, ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) నేతల సమావేశం, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొననున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తేతోపాటు అక్కడకు వచ్చే అన్ని దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు.
ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఫిలిప్పీన్‌స అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్‌స జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిలిప్పీన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
ఎప్పుడు : నవంబర్ 12 - 14
ఎందుకు : ఇండియా-ఆసియాన్, 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు
[11/17/2017, 19:49] AIMS DARE TO SUCCESS: అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఏకై క పిల్లిగా గుర్తింపు పొందిన ‘ఫెలికిట్టె’కి మరో అరుదైన గౌరవం లభించనుంది.ఫ్రాన్స్ లో ఐదడుగుల ‘ఫెలికిట్టె’ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి లండన్‌కు చెందిన మాథ్యూ గై అనే వ్యక్తి కిక్‌స్టార్టర్ వెబ్‌సైట్‌లో నిధుల సేకరణను ప్రారంభించారు.
1963 అక్టోబర్ 18న ఫ్రాన్‌స ప్రయోగించిన వెరొనిక్ ఏజీ1 రాకెట్‌లో ఈ పిల్లి భూమి నుంచి 157 కి.మీ. మేర అంతరిక్షంలోకి ప్రయాణించి, 15 నిమిషాల అనంతరం సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఒక పిల్లి అంతరిక్షంలోకి వెళ్లిన సంగతిని ప్రజలకు తెలిపేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని మాథ్యూ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన పిల్లి ఫెలికిట్టెకు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : మాథ్యా గై
ఎక్కడ : ఫ్రాన్స్‌లో
[11/17/2017, 19:50] AIMS DARE TO SUCCESS: విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో నవంబర్ 12న బోటు బోల్తాపడింది.ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్ క్లబ్‌కు చెందినవారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళుతుండగా బోటు బోల్తా పడింది. అనుమతిలేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం.. బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం, నదీ మార్గంపై డ్రైవర్‌కు అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి
ఎప్పుడు : నవంబర్ 12
ఎక్కడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద
[11/17/2017, 19:50] AIMS DARE TO SUCCESS: భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ తన కెరీర్‌లో ఏడో ప్రొఫెషనల్ టైటిల్‌ను సాధించాడు.నవంబర్ 10న ముగిసిన జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ అంతర్జాతీయ స్క్వాష్ సర్క్యూట్ టోర్నీలో ప్రపంచ 21వ ర్యాంకర్ సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరవ్ 11-6, 11-8, 11-8తో ఐదో సీడ్ నికొలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరవ్‌కు 7,671 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు) లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ స్క్వాష్ సర్క్యూట్ టోర్నమెంట్
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : విజేత సౌరవ్ ఘోషాల్
[11/17/2017, 19:50] AIMS DARE TO SUCCESS: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.బిహార్‌లోని పట్నాలో నవంబర్ 10న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : విజేత లలిత్ బాబు
[11/17/2017, 19:50] AIMS DARE TO SUCCESS: ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు
[11/17/2017, 19:51] AIMS DARE TO SUCCESS: ఎగ్జిబిషన్ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : న్యూఢిల్లీ శివారులో
[11/17/2017, 19:55] AIMS DARE TO SUCCESS: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 10న జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్‌లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జడ్జీల వేతనాల పెంపు కోసం జస్టిస్ వెంకట రామారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
[11/17/2017, 19:56] AIMS DARE TO SUCCESS: ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది.హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు CTCR (కౌంటర్ టైజం, కౌంటర్ ర్యాడికలైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ వంటి సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (CIS) కొత్తగా ఏర్పాటైంది. మరికొన్ని విభాగాలను ఒకదానిలో మరొకటి విలీనం చేశారు. ఇకపై హోం మంత్రిత్వ శాఖ కింద 18 విభాగాలు ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోంశాఖ కింద 18 విభాగాలు
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : కొత్తగా సీటీసీఆర్, సీఐఎస్ విభాగాల ఏర్పాటు
[11/17/2017, 19:56] AIMS DARE TO SUCCESS: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది.జాధవ్‌ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్‌లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది.
[11/17/2017, 19:56] AIMS DARE TO SUCCESS: ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది.2019, మార్చి 29, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే నవంబర్ 10న ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్‌సలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ‘ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెగ్జిట్‌కు ముహూర్తం ఖరారు
ఎప్పుడు : 2019, మార్చి 29
ఎవరు : బ్రిటన్ ప్రధాని థెరెసా మే
ఎందుకు : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు
[11/17/2017, 19:56] AIMS DARE TO SUCCESS: దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు.ప్రస్తుత ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తొలి మహిళ.. ఘోష్. ఆమె ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండీగా పనిచేశారు. నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఘోష్ సభ్యురాలు కాగా.. నాస్కామ్ ఫౌండేషన్ ట్రస్టీగా కూడా ఉన్నారు.
దేశీ ఐటీ, బీపీవో రంగం ప్రస్తుతం 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : దేబ్‌జానీ ఘోష్
[11/17/2017, 19:57] AIMS DARE TO SUCCESS: దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది.గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం నవంబర్ 10న విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది.
విభాగాల వారీగా...
ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది.కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది.విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెప్టెంబర్ పారిశ్రామిక వృద్ధి 3.8 శాతం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర గణాంక విభాగం
[11/17/2017, 19:57] AIMS DARE TO SUCCESS: కరీంనగర్‌లో ఐటీ హబ్ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేశారు.కరీంనగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లకు కూడా ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.
[11/17/2017, 19:57] AIMS DARE TO SUCCESS: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని హజ్రత్ జహంగీర్‌పీర్ దర్గా (జేపీ దర్గా)ను సీఎం కేసీఆర్ నవంబర్ 10న సందర్శించారు.డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలసి చాదర్ సమర్పించి మొక్కు చెల్లించారు. న్యాజ్ (కందూరు) చేసి.. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు విందు ఇచ్చారు. అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర... పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని పచ్చగా మారుస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జహంగీర్ పీర్ దర్గాలో మొక్కులు చెల్లింపు
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ముఖ్యమంత్రి కేసీఆర్
ఎక్కడ : కొత్తూరు మండలం, రంగారెడ్డి జిల్లా
[11/17/2017, 19:58] AIMS DARE TO SUCCESS: రాష్ట్ర ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు.అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీ
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : మహేందర్‌రెడ్డి
ఎందుకు : అనురాగ్ శర్మ పదవీ విరమణతో
[11/17/2017, 19:58] AIMS DARE TO SUCCESS: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నవంబర్ 16న ప్రకటించింది.నవంబర్ 20 - 28 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
అమితాబ్ బచ్చన్ ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 190కిపైగా చిత్రాల్లో నటించారు. 4 జాతీయ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమితాబ్ బచ్చన్‌కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఐఎఫ్‌ఎఫ్‌ఐ, గోవా
AIMS DARE TO SUCCESS
[11/18/2017, 16:53] AIMS DARE TO SUCCESS: ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ శిఖరాగ్ర సమావేశం - 2017 విశాఖపట్నంలో నవంబర్ 15-17 వరకు జరిగింది.ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయరంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని బిల్‌గేట్స్ ప్రకటించారు. భారత్‌లో మూడు అంశాల్లో తమ ఫౌండేషన్ ఆసక్తి చూపుతోందని చెప్పారు. సామాజికాభివృద్ధి, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, ప్రపంచానికి ఎంతో అవసరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం తమ ఫౌండేషన్ లక్ష్యాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశం - 2017
ఎప్పుడు : నవంబర్ 15 -17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం
[11/18/2017, 16:54] AIMS DARE TO SUCCESS: భారత ప్రభుత్వం చేపడుతున్న వరుస సంస్కరణలను అమెరికా రేటింగ్స్ సంస్థ మూడీస్ ఎట్టకేలకు గుర్తించింది.భారత సౌర్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచుతూ నవంబర్ 17న నిర్ణయం తీసుకుంది. భారత్ విషయంలో తన దృక్పథాన్ని సానుకూలం నుంచి స్థిరత్వానికి సవరించిన మూడీస్.. ఆర్థిక, సంస్థాగత సంస్కరణల విషయంలో క్రమానుగత పురోగతి వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని పేర్కొంది. పెరిగిపోతున్న రుణ భారాన్ని నిలకడగా ఉంచేందుకు ఈ సంస్కరణలు తోడ్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. జీఎస్టీ అమలు, ద్రవ్యపరపతి విధాన కార్యాచరణ మెరుగుపరచడం, మొండి బకాయిల ప్రక్షాళనకు తీసుకున్న చర్యలను మూడీస్ ప్రస్తావించింది.
రేటింగ్ నిర్వచనం
బీఏఏ2 అంటే పెట్టుబడులకు సంబంధించి మోస్తరు క్రెడిట్ రిస్క్‌కు సూచిక. బీఏఏ3 అంటే పెట్టుబడులకు సంబంధించి అతి తక్కువ గ్రేడ్. చెత్త గ్రేడ్ కంటే ఓ మెట్టు పైన. మూడీస్ చివరిసారిగా 2004లో భారత సౌర్వభౌమ రేటింగ్‌ను సవరించింది. ఆ తర్వాత మార్పు చేయడం మళ్లీ ఇదే. గతేడాది మాత్రం భారత్ పట్ల తన వైఖరిని స్థిరత్వం నుంచి సానుకూలానికి మార్చింది.
వచ్చే ఏడాది జీడీపీ 7.5 శాతం
దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది. 2016-17లో జీడీపీ 7.1 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. డీమోనిటైజేషన్, జీఎస్టీ స్వల్ప కాలంలో వృద్ధిని అడ్డుకున్నప్పటికీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ రేటు 7.5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.
ఓఎన్‌జీసీకి టాప్ రేటింగ్
మన దేశానికి చెందిన నాలుగు ఆర్థిక సంస్థలతోపాటు, ప్రభుత్వరంగ కంపెనీల రేటింగ్‌ను మూడీస్ పెంచింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్‌స కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)ల దీర్ఘకాలిక రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు మార్చింది. భారత సార్వభౌమ రేటింగ్‌ను మించి ఓఎన్‌జీసీ బీఏఏ1 రేటింగ్‌ను దక్కించుకుంది. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీల విదేశీ కరెన్సీ జారీ రేటింగ్‌ను బీఏఏ2కు పెంచింది. అలాగే, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌హెచ్‌ఏఐ, గెయిల్‌లకూ ఇదే రేటింగ్ దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత సార్వభౌమ రేటింగ్ పెంపు
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : మూడీస్
ఎందుకు : బీఏఏ3 నుంచి బీఏఏ2 కి పెంపు
[11/18/2017, 16:54] AIMS DARE TO SUCCESS: మానవ ప్రమేయం లేకుండానే శత్రువుల్ని గుర్తించి హతమార్చే రోబోల వినియోగంపై చర్చించేందుకు, నిబంధనల్ని రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కు చెందిన ఓ కమిటీ నవంబర్ 17న అంగీకారం తెలిపింది.రోజుల పాటు ‘కిల్లర్ రోబో’ల వినియోగంపై సాగిన ఈ సమావేశంలో ఈ రోబోల్ని నిషేధించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ రోబోల వినియోగంలో కొంతైనా మానవప్రమేయం ఉండాలన్నాయి. సైనిక బడ్జెట్‌తో పాటు సాంకేతికత తక్కువగా ఉన్న 22 దేశాలు ఈ మేరకు స్పందించాయి. ఈ సమావేశం నిబంధనల రూపకల్పనలో తొలి అడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కిల్లర్ రోబోల వినియోగంపై వచ్చే ఏడాది మళ్లీ సమావేశమయ్యేందుకు పలు దేశాలు అంగీకరించాయి.
[11/18/2017, 16:54] AIMS DARE TO SUCCESS: జేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు.పార్టీని, ‘బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు నవంబర్ 17న ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్‌కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది.
బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నితీశ్ కుమార్‌దే జేడీ(యూ)
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కేంద్ర ఎన్నికల కమిషన్
[11/18/2017, 16:55] AIMS DARE TO SUCCESS: వచ్చే ఏడాదికి అమెరికా భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. నేషనల్ డిఫెన్‌స ఆథరైజేషన్ చట్టం-2018(ఎన్‌డీఏఏ) పేరిట రూపొందించిన 700 బిలియన్ డాలర్ల(సుమారు 45.44 లక్షల కోట్లు) ఈ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ నవంబర్ 17న ఆమోదించింది.సైనిక, భద్రత సాయం పొందడానికి ఇందులో పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. అదే సమయంలో భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుకు అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన దక్షిణాసియా వ్యూహానికి ఇందులో చోటు కల్పించారు. తదుపరి దశలో ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి.
భారత్‌కు అమెరికా కల్పించిన ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాపై ఉమ్మడి నిర్వచనం ఇవ్వాలని విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులను బిల్లు కోరింది. 2017 రక్షణ బడ్జెట్‌లోనే భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ప్రకటించింది. ఈ గౌరవం భారత్‌కే ప్రత్యేకమని, దీని వల్ల రెండు దేశాల మధ్య రక్షణ వ్యాపారం, సాంకేతిక సహకారం అమెరికా మిత్ర దేశాలతో సమాన స్థాయికి చేరుతుందని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్ నేషనల్ డిఫెన్‌స ఆథరైజేషన్ చట్టం-2018కి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : అమెరికా కాంగ్రెస్
ఎందుకు : 700 బిలియన్ డాలర్లతో రక్షణ బడ్జెట్
[11/18/2017, 16:55] AIMS DARE TO SUCCESS: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పలు షరతులు విధించింది.సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగమనే విషయం గుర్తించాలని పేర్కొంది. నదుల సహజ ప్రవాహ దిశను మార్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేయాలని తెలిపింది. పర్యావరణ అనుమతి (ఈసీ)కి అదనంగా పలు షరతులు విధించింది. తమ ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం 145 పేజీల తీర్పును నవంబర్ 17న వెలువరించింది.
ఈసీకి అదనంగా విధించిన ముఖ్యమైన షరతులు..
నది గానీ, సహజ వరద నీటి ప్రవాహ పద్ధతిని గానీ, ప్రవాహ దిశను గానీ మార్చేందుకు అనుమతి లేదు. ప్రవాహ దిశను స్ట్రెయిట్‌గా చేయడానికి అనుమతించడం లేదు. అలాంటి మార్పుల వల్ల నేల కోతకు గురవుతుంది. భూగర్భ నీరు తగ్గుతుంది.కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి. ఉపరితలంపై ప్రవాహ వేగం తగ్గించేందుకు, భూగర్భ నీటి నిల్వ పెంచేందుకు అటవీకరణ చేపట్టాలి.రాజధాని నగరంలో ఉన్న 251 ఎకరాల అటవీ స్థలాన్ని సంరక్షించాలి. అటవీయేతర అవసరాలకు వినియోగించరాదు. కనీసం పార్కులు, వినోద కార్యక్రమాలకు ఆ భూమిని వినియోగించరాదు.క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి నిర్మాణానికి షరతులతో కూడిన అనుమతి
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
AIMS DARE TO SUCCESS
[11/20/2017, 16:44] AIMS DARE TO SUCCESS: స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి భారత్ 7,170 డాలర్ల ఆదాయంతో 126వ ర్యాంకులో నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఈ మేరకు నవంబర్ 18న తాజా గణాంకాలు విడుదల చేసింది. గతేడాది(2016) ఐఎంఎఫ్ గణాంకాల్లో భారత్ 6,690 డాలర్ల తలసరి ఆదాయంతో 127వ ర్యాంకులో ఉంది.  కొనుగోలు శక్తి ఆధారంగా(పర్చేజ్ పవర్ ప్యారిటీ) ప్రపంచంలోని 200 దేశాల జీడీపీలను లెక్కలోకి తీసుకొని ఐఎంఎఫ్ ఈ ర్యాంకింగ్‌సను నిర్ణయించింది. ఇటీవలి ‘ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం’ నివేదికలో భాగంగానే ఈ జాబితాను కూడా ప్రవేశపెట్టింది. ర్యాంకింగ్‌సలో 1,24,930 డాలర్ల తలసరి ఆదాయంతో ఖతార్ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2,3 స్థానాల్లో మకావూ(1,14,430 డాలర్లు), లగ్జెంబర్గ్(1,09,190 డాలర్లు) నిలిచాయి.
బ్రిక్స్ దేశాల్లో రష్యా తలసరి ఆదాయం 27,900 డాలర్లు, చైనా 16,620 డాలర్లు, బ్రెజిల్ 15,500 డాలర్లు, దక్షిణాఫ్రికా 13,440 డాలర్లతో భారత్‌కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి.
పర్చేజ్ పవర్ ప్యారిటీ(పీపీపీ) అంటే..:
ఏదైనా ఒక దేశం కరెన్సీని మరో దేశం కరెన్సీలోకి మార్పిడి చేసినప్పుడు మొదటి దేశంలోని నిర్ధేశిత కరెన్సీతో ఏ విధంగా వస్తు, సేవల పరిమాణం లభిస్తుందో.. అదే విధంగా రెండో దేశంలో కూడా నిర్ధేశిత మొత్తం(కరెన్సీని మార్పిడి చేయడం ద్వారా లభించే సొమ్ము)తో అంతే పరిమాణంలో సేవలు, వస్తువులను కొనుగోలు చేయగలగడం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తలసరి ఆదాయంలో 126వ ర్యాంకులో భారత్
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఐఎంఎఫ్
ఎక్కడ : 200 దేశాల జాబితాలో
[11/20/2017, 16:44] AIMS DARE TO SUCCESS: దేశంలో తొలి సోషల్ మీడియా సదస్సు, సోషల్ మీడియా అవార్డుల ప్రదానోత్సవం - SMSA నవంబర్ 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. సౌత్ ఇండియా సోషల్ మీడియా బెస్ట్ హీరోగా దగ్గుబాటి రానాకు, సోషల్ మీడియా బెస్ట్ హీరోయిన్‌గా దీపికా పదుకునేకు పురస్కారాలు లభించాయి. సోషల్ మీడియాలో సంగీత సంచలనం అవార్డుని యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌కు దక్కింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఈ అవార్డులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విబ్రీ మీడియా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రానా, దీపికా పదుకునే, అనిరుధ్‌లకు సోషల్ మీడియా అవార్డులు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విబ్రీ మీడియా
ఎక్కడ : అమరావతి
[11/20/2017, 16:45] AIMS DARE TO SUCCESS: స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి కీలక ముందడుగు పడింది. భారత్‌తో ఆటోమేటిక్‌గా ఈ వివరాలు పంచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందానికి స్విట్జర్లాండ్ పార్లమెంట్ కమిటీ నవంబర్ 18న ఆమోదం తెలిపింది. భారత్‌తో పాటు మరో 40 దేశాలకు వర్తించే ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్ ఎగువ సభలోని ఆర్థిక వ్యవహారాలు, పన్ను ఎగవేతల కమిషన్ ఆమోదం తెలిపింది. సమాచార మార్పిడి జరిగిన తరువాత తలెత్తే వివాదాలను ఎదుర్కొనేలా నిబంధనలను పటిష్టం చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సూచించింది. ఇక తదుపరి దశలో ఈ ఒప్పందాన్ని నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎగువ సభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే 2019 నుంచి ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది.
[11/20/2017, 16:45] AIMS DARE TO SUCCESS: ఏడుసార్లు విశ్వవిజేత... వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్... టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ నైమ్ సులేమాన్‌ఒగ్లు అనారోగ్యంతో నవంబర్ 18న కన్నుమూశారు. కేవలం 4.8 అడుగుల ఎత్తుండే సులేమాన్ ఒగ్లును వెయిట్‌లిఫ్టింగ్ ప్రపంచంలో ‘ద పాకెట్ హెర్క్యూలెస్’గా పిలుస్తారు.
1988 సియోల్ (60 కేజీలు), 1992 బార్సిలోనా (60 కేజీలు), 1996 అట్లాంటా (64 కేజీలు) ఒలింపిక్స్ క్రీడల్లో ఆయన స్వర్ణ పతకాలు గెలిచారు. తన శరీర బరువుకు 2.5 రెట్లు బరువునెత్తిన తొలి, ఏకై క వెయిట్ లిఫ్టర్ ఆయనే. 22 ఏళ్లకే 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆయన 2000లో సిడ్నీ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెయిట్‌లిఫ్టర్ సులేమాన్ ఒగ్లు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఏడుసార్లు విశ్వవిజేత. వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్.
[11/20/2017, 16:45] AIMS DARE TO SUCCESS:  జింబాబ్వే అధికార జాను-పీఎఫ్ పార్టీ చీఫ్ పదవి నుంచి ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను తొలగించింది. ఆ స్థానంలో మాజీ ఉపాధ్యక్షుడు ఎమర్సన్ ఎమ్‌నాంగా గ్వాని నియమించింది. 2018లో జరిగే ఎన్నికల్లో తమ అధ్యక్ష అభ్యర్థి ఎమర్సన్ అని ప్రకటించింది. ముగాబే భార్య గ్రేస్‌ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ఇంతకముందు జింబాబ్వే ఆర్మీ ముగాబేను గృహ నిర్బంధంలోకి తీసుకుంది.
[11/20/2017, 16:46] AIMS DARE TO SUCCESS: భారత్‌లో ఈ సంవత్సరం జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పుణే ఓపెన్‌లో భారత స్టార్ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు.  నవంబర్ 18న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 4-6, 6-3, 6-4తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. యూకీ కెరీర్‌లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పుణే ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత యూకీ బాంబ్రీ
[11/20/2017, 16:46] AIMS DARE TO SUCCESS: నానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది. సముద్ర తీరాలు కుచించుకుపోవడం వల్ల భూమ్యాకర్షణ, భ్రమణ శక్తులు ప్రభావితమవుతాయని, సముద్ర మట్టాల పెరుగుదలల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 సెం.మీ., ముంబైలో అయితే 15.26 సెం.మీ.లు పెరుగుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి(15.16 సెం.మీ.) ఇదే తరహా ముప్పు ఉందని అంచనా వేసింది.
‘గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్’ అనే పరికరం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 293 తీర ప్రాంత నగరాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరుగుతున్న మంచు పలకలతో ముంబై, మంగళూరు నగరాలకు ముప్పు
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : నాసా
[11/20/2017, 16:46] AIMS DARE TO SUCCESS: హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించింది. చైనాలోని సాన్యా నగరంలో నవంబర్ 18న నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది. యియి 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది.
బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ..
మిస్ వర్డల్ - 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు.
రీటా ఫారియా నుంచి ఛిల్లర్ వరకూ...
మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు.
భారత్‌కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ వరల్డ్ - 2017 టైటిల్
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మానుషి ఛిల్లర్ (భారత్)
ఎక్కడ : సాన్యా నగరం, చైనా
[11/20/2017, 16:47] AIMS DARE TO SUCCESS: ప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉందని వాటర్ ఎయిడ్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 19న ‘వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ‘ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్-2017’ పేరిట మూడో వార్షిక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం భారత్‌లో ఏకంగా 73.22 కోట్ల మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంటే 130 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో సగానికిపైగా (56 శాతం) ప్రజలు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.
ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 34.35 కోట్ల మంది(జనాభాలో 25%)కి టాయిలెట్ సౌకర్యం లేదని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా(12.28 కోట్లు- దేశ జనాభాలో 67%), ఇథియోఫియా(9.24 కోట్లు- జనాభాలో 93%), బంగ్లాదేశ్(8.55 కోట్లు- జనాభాలో 85.5%) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్-2017 నివేదిక
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : వాటర్ ఎయిడ్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో భారత్
[11/20/2017, 16:47] AIMS DARE TO SUCCESS: రాష్ట్రవ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది.ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ నవంబర్ 16న ఆమోదముద్ర వేసింది. 1966లోనే ఉర్దూను రెండో భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది. పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం
AIMS DARE TO SUCCESS
[11/21/2017, 20:06] AIMS DARE TO SUCCESS: పురుషుల టెన్నిస్ సీజన్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్‌గా అవతరించాడు.నవంబర్ 19న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో... దిమిత్రోవ్ 7-6, 4-6, 6-3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. తద్వారా 1998లో అలెక్స్ కొరెత్యా (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్ గుర్తింపు పొందాడు.
విజేతగా నిలిచిన దిమిత్రోవ్‌కు 25,49,000 డాలర్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు), రన్నరప్ గాఫిన్‌కు 11,58,000 డాలర్లు (రూ. 7 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటీపీ వరల్డ్ టూర్ - 2017
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : పురుషుల టైటిల్ విజేత గ్రిగోర్ దిమిత్రోవ్
[11/21/2017, 20:07] AIMS DARE TO SUCCESS: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి నీలేకని తాము సైతం సమాజ సేవకు సంపదను ధారపోస్తామంటూ ముందుకొచ్చారు.తమ సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తుల సమూహం ‘ద గివింగ్ ప్లెడ్‌జ’లో నీలేకని దంపతులు చేరారు. ఇందుకు సంబంధించి అంగీకారం తెలుపుతూ నీలేకని రాసిన లేఖను ద గివింగ్ ప్లెడ్‌జ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
గివింగ్ ప్లెడ్‌జను బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా, వారెన్ బఫెట్ కలసి 2010లో ఏర్పాటు చేశారు. అధిక ధనవంతులను దాతృత్వం దిశగా ప్రోత్సహించేందుకు ఇది ఏర్పాటయింది. ఈ నెట్‌వర్క్‌లో మన దేశం నుంచి విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, శోభా డెవలపర్స్ ఎమిరటస్ చైర్మన్ పీఎన్‌సీ మీనన్ ఇంతకుముందే చేరగా, వీరి బాటలోనే నీలేకని దంపతులు నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ద గివింగ్ ప్లెడ్‌జ’లోకి నీలేకని దంపతులు
ఎప్పుడు : నవంబర్ 20
ఎందుకు : సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు
[11/21/2017, 20:08] AIMS DARE TO SUCCESS: ప్రతిష్టాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదికవుతోంది.ఫిబ్రవరి 19- 21 తేదీల్లో హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమం జరుగనుంది. 80 దేశాల నుంచి 5,000 మంది వివిధ రంగాల నిపుణులు హాజరవుతారని టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని నవంబర్ 19న తెలిపారు. భారత సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రోత్సహించేందుకు ఈ సదస్సులు జరుపుతున్నట్టు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ వరల్డ్ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 19 - 21
ఎక్కడ : హైదరాబాద్‌లో
[11/21/2017, 20:08] AIMS DARE TO SUCCESS: ఉద్యోగ, విద్య రంగాల్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చిన వారికి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి మూడేళ్లలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి మాత్రమే స్థానికతకు అర్హత ఉంటుందని గతంలో ఉత్తర్వులిచ్చారు. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి స్థానికత అర్హత కలిగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
[11/21/2017, 20:08] AIMS DARE TO SUCCESS: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.నవంబర్ 19న వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర కొరియాను ఎప్పుడో ఉగ్రవాద ప్రోత్సాహ దేశంగా గుర్తించాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షల్ని అమెరికా ఆర్థిక శాఖ వెల్లడిస్తుందని ఆయన చెప్పారు.
[11/21/2017, 20:09] AIMS DARE TO SUCCESS: తమిళ సినీ నటి త్రిష ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) సెలబ్రిటీ అడ్వకేట్‌గా వ్యవహరించనున్నారు.బాలల హక్కులు, వారి సమస్యలపై త్రిష ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారని నవంబర్ 20న యూనిసెఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలు, పిల్లల్లో రక్తహీనత, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై అకృత్యాలు తదితర సమస్యలపై పోరాటంలో త్రిష భాగస్వాములవుతారని యూనిసెఫ్ ఉన్నతాధికారి జాబ్ జకారియా చెప్పారు. కుటుంబాల్లో, సామాజిక వర్గాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చిన్నారుల హక్కులకు భంగం వాటిల్లిన సందర్భాల్లో ఆమె క్రియాశీలంగా వ్యవహరిస్తారని జకారియా చెప్పారు. యూనిసెఫ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తొలి దక్షిణభారత నటి త్రిషనే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూనిసెఫ్ బాలల హక్కుల ప్రచారకర్తగా త్రిష
ఎప్పుడు : నవంబర్ 20
ఎందుకు : బాలల హక్కులు, వారి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు
[11/21/2017, 20:09] AIMS DARE TO SUCCESS: ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది.ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు అప్పగించింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్‌డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి.
ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్ స్పైక్ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘స్పైక్ క్షిపణుల’ ప్రతిపాదనల ఉపసంహరణకునిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : భారత్
ఎందుకు : దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయాలని నిర్ణయం
[11/21/2017, 20:09] AIMS DARE TO SUCCESS: ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా అమ్ముల పొదిలోకి చేరనుంది.డాంగ్‌ఫెంగ్ -41గా పిలుస్తున్న ఈ కొత్త క్షిపణి.. మాక్ 10 కంటే వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా ఈ ఖండాంతర క్షిపణి సొంతమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 2012లో ప్రకటించిన ఈ క్షిపణిని ఇంతవరకూ ఏడు సార్లు పరీక్షించగా.. తాజాగా మరోసారి నవంబర్ మొదటి వారంలో పరీక్షించినట్లు సమాచారం. 2018 ప్రథమార్ధానికి ఈ అత్యాధునిక క్షిపణి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందుబాటులోకి రానుంది. 12 వేల కి.మి. దూరంలో లక్ష్యాల్ని ఛేదించే డాంగ్‌ఫెంగ్-41లో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా అమ్ముల పొదిలోకి డాంగ్‌ఫెంగ్ -41 క్షిపణి
ఎప్పుడు : 2018 ప్రథమార్ధానికి
ఎవరు : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ
ఎందుకు : ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే సామర్థ్యం
[11/21/2017, 20:09] AIMS DARE TO SUCCESS: హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రికె.తారకరామారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బొటానికల్ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్ పార్కు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : మంత్రి కేటీఆర్
ఎక్కడ : హైదరాబాద్‌లో
[11/21/2017, 20:09] AIMS DARE TO SUCCESS: భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిహంత్ 2009 జూలై 26న ప్రారంభమైంది. 2016 అక్టోబర్ నుంచి ఇది నావికాదళంలో చేరి సేవలందిస్తోంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామన్ నవంబర్ 19న విశాఖలోని నేవల్ డాక్ యార్డులో జలప్రవేశం చేసింది.
ఆరో దేశం.. భారత్
ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణు జలాంతర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్ అరిహంత్‌తో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు కలిగిన ఆరో దేశంగా భారత్ చేరింది. అడ్వాన్‌సడ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టు కింద మొత్తం ఐదు అణు జలాంతర్గాములను నావికా దళం కోసం భారత్ నిర్మించతలపెట్టింది. ఇందులో మొదటిది ఐఎన్‌ఎస్ అరిహంత్, రెండోది అరిధామన్. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ ఐదు అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌కంటే అరిధామన్ రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిధామన్ సముద్ర సన్నాహాలు, ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేరడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఇదీ సామర్థ్యం..
బరువు : 6,000 టన్నులు
టెస్ట్ డెప్త్ : 400 మీటర్ల వరకు
వేగం : గంటకు సముద్ర ఉపరితలంపై 12 - 15 నాటికల్ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్ మైళ్లు
ఆయుధాలు : 750 - 1900 కి.మీల లక్ష్యాన్ని ఛేదించే కె - 15 ఎస్‌ఎల్‌బీఎం అణు క్షిపణులు - 24. కె- 4 ఎస్‌ఎల్‌బీఎం క్షిపణులు 8 ( 3,500 కీ.మీ.ల పరిధి)
టార్పెడోలు : 21 అడుగుల పొడవుండే టార్పెడోలు - 6
AIMS DARE TO SUCCESS
[11/22/2017, 12:27] AIMS DARE TO SUCCESS: పురుషుల టెన్నిస్ సీజన్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్‌గా అవతరించాడు.నవంబర్ 19న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో... దిమిత్రోవ్ 7-6, 4-6, 6-3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. తద్వారా 1998లో అలెక్స్ కొరెత్యా (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్ గుర్తింపు పొందాడు.

[11/22/2017, 12:28] AIMS DARE TO SUCCESS: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి నీలేకని తాము సైతం సమాజ సేవకు సంపదను ధారపోస్తామంటూ ముందుకొచ్చారు.తమ సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తుల సమూహం ‘ద గివింగ్ ప్లెడ్‌జ’లో నీలేకని దంపతులు చేరారు. ఇందుకు సంబంధించి అంగీకారం తెలుపుతూ నీలేకని రాసిన లేఖను ద గివింగ్ ప్లెడ్‌జ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

[11/22/2017, 12:28] AIMS DARE TO SUCCESS: ఉద్యోగ, విద్య రంగాల్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చిన వారికి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి మూడేళ్లలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి మాత్రమే స్థానికతకు అర్హత ఉంటుందని గతంలో ఉత్తర్వులిచ్చారు. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి స్థానికత అర్హత కలిగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
[11/22/2017, 12:29] AIMS DARE TO SUCCESS: ప్రతిష్టాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదికవుతోంది.ఫిబ్రవరి 19- 21 తేదీల్లో హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమం జరుగనుంది. 80 దేశాల నుంచి 5,000 మంది వివిధ రంగాల నిపుణులు హాజరవుతారని టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని నవంబర్ 19న తెలిపారు. భారత సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రోత్సహించేందుకు ఈ సదస్సులు జరుపుతున్నట్టు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ వరల్డ్ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 19 - 21
ఎక్కడ : హైదరాబాద్‌లో
AIMS DARE TO SUCCESS
[11/24/2017, 15:43] AIMS DARE TO SUCCESS: ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
కన్వీనర్‌గా అరవింద్ మోదీ
ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్‌మోదీ కన్వీనర్‌గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్‌ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ చట్టాల సమీక్షకు అరవింద్ మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు
[11/24/2017, 15:43] AIMS DARE TO SUCCESS: 15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని నవంబర్ 22న కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది.ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆర్థిక సంఘం తన సిఫార్సులను సమర్పించేందుకు రెండేళ్ల సమయం తీసుకోవడం సాధారణం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వఆర్థిక సంఘం ఏర్పాటుకు నిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
[11/24/2017, 15:44] AIMS DARE TO SUCCESS: రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది.ఇందుకు సంబంధించిన ఆర్డినెన్‌సకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ ఆర్డినెన్‌స రూపొందించింది. ఈ ఆర్డినెన్‌స స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులతో ఆర్డినెన్స్
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రుణ ఎగవేతకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారానికి
[11/24/2017, 15:44] AIMS DARE TO SUCCESS: సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న అంగీకరించింది.ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపునకు అంగీకారం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
[11/24/2017, 15:44] AIMS DARE TO SUCCESS: దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో ‘ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.గ్రామీణ మహిళలకు చేరువై వారిలో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. నవంబర్ 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘బేటీ బచావో-బేటీ పడావో’ విస్తరణ
115 జిల్లాల్లో బ్లాకు స్థాయిలో 920 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాగే ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో-బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 ‘వన్‌స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఆమోదం తెలిపింది. విస్తృత పథకమైన ‘ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017-20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా బాగా వెనకబడిన 115 జిల్లాల్లో ‘ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : గ్రామీణ మహిళలకు చేరువై వారిలో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు
[11/24/2017, 15:45] AIMS DARE TO SUCCESS: బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో అత్యున్నత విద్య అందించే టాప్-20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు సంపాదించాయి.ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్‌స(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్‌సలో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌స-బెంగళూరు(10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం టాప్-10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన వర్సిటీలే 8 స్థానాలను కై వసం చేసుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ టాప్ - 20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యా సంస్థలు
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : క్వాకరెల్లీ సైమండ్స్
[11/24/2017, 15:45] AIMS DARE TO SUCCESS: వాయు సేనలో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది.ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని నవంబర్ 22న యుద్ధ విమానం సుఖోయ్-30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది.
బ్రోహ్మోస్ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. బ్రహ్మోస్, సుఖోయ్-30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది.
ఎక్కడి నుంచైనా ప్రయోగం..
భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. బ్రహ్మోస్. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ-700 ఒనిక్ సూపర్‌సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)-రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు.
బ్రహ్మోస్ ప్రత్యేకతలు..
290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు.ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్-30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే.సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు.బ్రహ్మోస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది.క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది.ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు.ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది.మరో 40 సుఖోయ్-30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.
[11/24/2017, 15:45] AIMS DARE TO SUCCESS: ఆంధ్రాబ్యాంకు రూపొందించిన ‘పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకం’ (ఎస్‌బీజీ)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 21న విజయవాడలో ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య పేరుతో స్వయం సహాయక సంఘాల తీరుతెన్నులను మార్చే విధంగా పథకం ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఎస్‌బీజీ పథకం ద్వారా 184 గ్రూపులకు చెందిన 1100 మంది మహిళలకు రూ.13.14 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను మ్యారేజ్ మిత్రలుగా నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్
మత్స్యకారులందరికీ 50 ఏళ్లకే పింఛను సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రాబ్యాంక్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : స్వయం వ్యాపార సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు
[11/24/2017, 18:58] AIMS DARE TO SUCCESS: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారు, బ్యాంకులకు బకాయి పడిన ఖాతాదారులు (ఎన్‌పీఏ) దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా... వేలానికి వచ్చే ఆస్తులకు బిడ్డింగ్ వేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.ఇందుకు సంబంధించి ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సవరణల ఆర్డినెన్‌సకు నవంబర్ 23న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ ముద్రపడింది.
తొలి దశలో బ్యాంకులకు రూ.5,000 కోట్లకుపైగా బకాయిలు పడిన 12 భారీ ఎన్‌పీఏ కేసుల్లో దివాలా పరిష్కార చర్యలు ఇప్పటికే ఐబీసీ కింద మొదలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐబీసీ ఆర్డినెన్‌సకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : రుణ ఎగవేత దారులపై చర్యలు తీసుకునేందుకు
[11/24/2017, 18:58] AIMS DARE TO SUCCESS: కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వెయి్య గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించింది.ఈ మేరకు 16 రాష్ట్రాల పరిధిలోని వెయ్యి గ్రామాల్లో పది లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించనుంది. హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(హెచ్‌ఆర్‌డీపీ)లో భాగంగా రెండున్నరేళ్ల కాలంలో 750 వెనకబడిన గ్రామాలకు సాధికారత కల్పించామని బ్యాంకు పేర్కొంది. హెచ్‌ఆర్‌డీపీలో భాగంగా విద్య, నీరు, పారిశుద్ధ్యం, అందరికీ బ్యాంకింగ్ సేవలు తదితర రంగాల్లో మెరుగుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వచ్చే ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
[11/24/2017, 18:59] AIMS DARE TO SUCCESS: ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది.ఈ మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలో మిట్టల్ కుటుంబ సభ్యులకు ఉన్న మూడు శాతం వాటా కూడా విరాళంలో భాగమే. ఈ మొత్తాన్ని తమ కుటుంబం తరఫున ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ఇవ్వనున్నట్టు సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. తన సోదరులు రాకేశ్, రాజన్‌తో కలసి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉచితంగా విద్యనందించేందుకు సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మిట్టల్ చెప్పారు. ఉత్తర భారతంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. విరాళంలో అధిక భాగం యూనివర్సిటీ ప్రాజెక్టుపైనే వెచ్చించనున్నామని, కొంత మేర ఇప్పటికే నిర్వహిస్తున్న సత్యభారతి స్కూళ్ల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక సేవకు రూ. 7,000 కోట్ల విరాళం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం
[11/24/2017, 18:59] AIMS DARE TO SUCCESS: తపాలా బిళ్లల సేకరణపై మనసు లగ్నం చేసేవారికి కేంద్రప్రభుత్వం ఏకంగా ఉపకార వేతనం (స్కాలర్‌షిప్) అందించనుంది.పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు వారిలో తపాలాబిళ్లల సేకరణ అలవాటును పెంచాలని నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఎంపికై న వారికి రూ.ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది. ఈ మేరకు దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో స్పర్శ్ (ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్)ను స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీగా పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : తపాలా బిళ్లల సేకరణ చేసే విద్యార్థులకు ఉపకార వేతనం అందించేందుకు
[11/24/2017, 18:59] AIMS DARE TO SUCCESS: అన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నవంబర్ 23న నిర్ణయం తీసుకుంది.అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. రెండాకుల గుర్తు కోసం ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ, దినకరన్ తీవ్రంగా పోరాడారు.
ఇది రెండోసారి..!
అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పళనిస్వామి - పన్నీర్ సెల్వం వర్గానికే రెండాకుల గుర్తు
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
ఎక్కడ : తమిళనాడు, పుదుచ్చేరి
[11/24/2017, 18:59] AIMS DARE TO SUCCESS: భారత అటవీ చట్టం-1927కు సవరణలు చేస్తూ కేంద్రం పంపిన ఆర్డినెన్‌సకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 23న ఆమోదముద్ర వేశారు.తాజా సవరణల్లో అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించారు. దీంతో అటవీ ప్రాంతం కాని చోట్ల పెరిగే వెదురు చెట్లను నరకడానికి, రవాణా చేయడానికి అనుమతులు అక్కర్లేదు. వెదురు చెట్ల సాగును పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత అటవీ చట్టం-1927 సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగింపు
[11/24/2017, 19:00] AIMS DARE TO SUCCESS: ఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పారు.
ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పనిచేసే ఈ యాప్.. ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమంగ్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎందుకు : ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా
[11/24/2017, 19:00] AIMS DARE TO SUCCESS: ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సైబర్ ముప్పుని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో నవంబర్ 23, 24 తేదీల్లో 5వ సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు(Global conference on cyber space) జరిగింది.ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్
ఎప్పుడు : నవంబర్ 23, 24
ఎక్కడ : న్యూఢిల్లీ
[11/24/2017, 19:00] AIMS DARE TO SUCCESS: గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబర్ 23న చెప్పారు.మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించిందని ఆయన వివరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తామని.. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణించి.. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని తెలిపారు. అలాగే.. చెన్నై - బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక కోసం ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడి
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర మంత్రి నితిన్ గ డ్కారీ
ఎందుకు : గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు
[11/24/2017, 19:00] AIMS DARE TO SUCCESS: దేశీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఇందులో భాగంగా హైక్ యూజర్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్ సర్వీసులు పొందొచ్చు. 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు
ఎప్పుడు : నవంబర్ 22
ఎందుకు : యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు
[11/25/2017, 16:42] AIMS DARE TO SUCCESS: సునామీల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రంలోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో నవంబర్ 24న మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు.గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తుల శాఖ, రాష్ట్ర విపత్తుల శాఖ, ఇన్కొయిస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సునామీ వస్తున్నట్టుగా ఇన్కొయిస్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, రాష్ట్ర విపత్తుల శాఖ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ 9 కోస్తా జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మాక్ ఎక్సర్‌సైజ్ చేపట్టారు.
కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ మెగా మాక్ డ్రిల్ జరిగింది.
[11/25/2017, 16:42] AIMS DARE TO SUCCESS: భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.నవంబర్ 24న జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)-ఎల్గిన్ (రష్యా) జోడి 6-3, 6-0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్-మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెంగళూరు ఓపెన్ - 2017
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : డబుల్స్ విజేత దివిజ్ శరణ్(భారత్), ఎల్గిన్(రష్యా)
[11/25/2017, 16:42] AIMS DARE TO SUCCESS: భారత్‌కు ఇస్తున్న రేటింగ్‘బీబీబీ-మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది.అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది.
2007 వరకూ ఎస్‌అండ్‌పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్‌అండ్‌పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్‌అండ్‌పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ‘బీబీబీ-మైనస్’ రేటింగ్ కొనసాగింపు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : స్టాండర్డ్ అండ్ పూర్
[11/25/2017, 16:43] AIMS DARE TO SUCCESS: డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 24న ఈ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ-కామర్స్ సంస్థలతో ఎస్‌బీఐ చేతులు కలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యెనో యాప్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఎస్‌బీఐ
ఎందుకు : డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు
[11/25/2017, 16:43] AIMS DARE TO SUCCESS: కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్‌స అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) డిప్యూటీ డెరైక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు.రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : పర్యావరణ కార్యక్రమంలో భాగంగా

No comments:
Post a Comment