అంతర్జాతీయం 2012 సంవత్సరం మార్చి నుండి డిసెంబరు వరకు మొత్తం
మార్చి 2012 (01 - 07) అంతర్జాతీయం
అణుపరీక్షల నిలిపివేతకు అంగీకరించిన ఉత్తర కొరియా
అణు పరీక్షలు, కార్యక్రమాల నిలిపివేత, సుదూర పరిధి క్షిపణుల అభివృద్ధిపై మారటోరియానికి ఉత్తర కొరియా అంగీకరించినట్లు ఫిబ్రవరి 29న అమెరికా తెలిపింది. దీనికి బదులుగా 2,40,000 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు అమెరికా అందిస్తుంది. యాంగ్‌బయోన్‌లో యురేనియం శుద్ధిని నిలిపివేయడం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీకి కూడా ఉత్తర కొరియా అంగీకరించింది.
|
సుదీర్ఘకాలం ఉత్తర కొరియాను పాలించిన జిమ్ జోంగ్-ఇల్ 2011 డిసెంబర్‌లో మరణించడంతో ఉత్తర కొరియా అణు కార్యక్రమాల్ని అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 1990లో సంభవించిన కరువు కారణంగా ఉత్తర కొరియా తీవ్ర ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొంటోంది.
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నిక
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మూడోసారి ఎన్నికయ్యారు. రష్యా అధ్య క్ష పదవికి మార్చి 4న ఎన్నికలు జరిగాయి. పుతిన్‌కు 64 శాతం ఓట్లు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులు గెన్నడీ జ్యుగనోవ్‌కు 17.17 శాతం ఓట్లు, మరో అభ్యర్థి మైఖేల్ ప్రొఖోరోవ్‌కు 7.82 శాతం ఓట్లు వచ్చాయి. గత నాలుగేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న పుతిన్ 2000-2008 మధ్య కాలంలో అధ్యక్షుడిగా కొనసాగారు.
వాంగ్ షూకు ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్
ఆర్కిటెక్చర్‌లో నోబెల్‌గా పిలిచే ‘ప్రిట్జ్‌కర్ ప్రైజ్’ ఈ ఏడాది చైనాకు చెందిన వాంగ్ షూ (48)కు లభించింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుకరిస్తారు.
మార్చి 2012 అంతర్జాతీయం
ఆయుధాల దిగుమతిలో అగ్రస్థానంలో భారత్
ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో జరిగే మొత్తం ఆయుధాల అమ్మకాల్లో భారత్ కొనుగోలు చేసే వాటా 10 శాతంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో భారత్ ఆయుధ దిగుమతులు 38 శాతం పెరిగాయి. ఈ వివరాలను స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎస్‌ఐపీఆర్‌ఐ) తాజా నివేదిక వెల్లడించింది. 2006-07లో ఆయుధాల దిగుమతిలో ప్రథమ స్థానంలో నిలిచిన చైనా ప్రస్తుతం నాలుగో స్థానానికి పరిమితమైందని ఎస్‌ఐపీఆర్‌ఐ పేర్కొంది.
ఎండ్రే సెమరేడీకి 2012 అబెల్‌ప్రైజ్
హంగేరీ గణిత శాస్త్రవేత్త ఎండ్రే సెమరేడీ 2012 సంవత్సరానికి అబెల్ ప్రైజ్‌కు ఎంపికైయ్యారు. డిస్‌క్రీట్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో చేసిన కృషికిగాను ఎండ్రేకు ఈ పురస్కారం దక్కింది. గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌గా వ్యవహరించే ఈ అవార్డును 2003 నుంచి నార్వే అకాడమీ ఆఫ్ సెన్సైస్ అండ్ లెటర్స్ అందజేస్తుంది. నార్వే గణిత మేధావి నీల్స్ హెన్రిన్ అబెల్ పేరిట ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. దీని కింద మిలియన్ డాలర్లు బహూకరిస్తారు.
ప్రధాని దక్షిణ కొరియా పర్యటన
దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి 25న ఆ దేశ అధ్యక్షుడు లీమ్యూంగ్ బాక్‌తో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తరింపజేసుకోవాలని ఈ సందర్భంగా ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 40 మిలియన్ డాలర్లకు పెంచాలని కూడా ఒప్పందం చేసుకున్నాయి.
మాలిలో తిరుగుబాటు
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో అధికారం హస్తగతం చేసుకున్నట్లు మార్చి 22న ఆ దేశ సైన్యం ప్రకటించింది. సైన్యం ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి, మంత్రులను అరెస్టు చేసింది. దేశ సరిహద్దులను మూసివేసింది. ఏప్రిల్ 29న దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నూతనంగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తామని సైన్యం ప్రకటించింది. దేశ ఉత్తర ప్రాంతంలోని తురేగ్ జాతి తీవ్రవాదుల పట్ల ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని సైన్యం పేర్కొంది. మాలి ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతంపై దక్షిణ ప్రాంతం ఆధిపత్యం కొనసాగిస్తోంది. దీంతో 1960 నుంచి నాలుగుసార్లు తిరుగుబాట్లు జరిగాయి.
హాంకాంగ్ కొత్త అధినేత యింగ్
హాంకాంగ్ నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా లీంగ్‌చున్ యింగ్ ఎన్నికయ్యారు. మార్చి 25న జరిగిన ఎన్నికల్లో యింగ్ విజయం సాధించారు. జూలైలో బాధ్యతలు చేపడతారు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో కూడిన కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకుంటుంది. పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే ఈ పదవి అత్యున్నత రాజకీయ పదవి. హాంకాంగ్ నగరం 1997లో చైనా పరిపాలన కిందకి వచ్చింది.
జర్మనీ అధ్యక్షుడిగా జోచిమ్ గాక్ ఎన్నిక
 జర్మనీ అధ్యక్షుడిగా జోచిమ్ గాక్ ఎన్నికయ్యారు. మార్చి 18న జరిగిన ఎన్నికల్లో హక్కుల కార్యకర్త గాక్ వామపక్ష పార్టీ డీ లింగ్‌కు చెందిన బీట్ కార్‌ల్సఫెడ్‌పై విజయం సాధించారు. పార్లమెంట్‌లోని 1232 ఓట్లకు గాక్‌కు 991 ఓట్లు వచ్చాయి. జర్మనీలో మూడేళ్లలో మూడో సారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అవినీతి ఆరోపణలపై ఇద్దరు అధ్యక్షులు క్రిస్టియన్ వుల్ఫ్, హాస్ట్ కోహ్లెర్‌లు రాజీనామా చేశారు.
బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా ప్రచురణ నిలిపివేత
బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా ప్రచురణను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ మార్చి 14న ప్రకటించింది. 200 ఏళ్లకు పైగా వస్తున్న ఈ ప్రచురణను నిలిపివేయడం ఇదే తొలిసారి. వీకీపీడియా లాంటి ఆన్‌లైన్ ఉచిత ప్రచురణలు అందుబాటులోకి రావడంతో పుస్తక ప్రచురణను నిలిపివేసి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని బ్రిటానికా సంస్థ నిర్ణయించింది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాను తొలిసారి 1768లో స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్‌గ నుంచి ప్రచురించారు. 1990లో అత్యధికంగా 1,20,00 సెట్లు అమ్ముడు పోయాయి.
సార్క్ సెక్రటరీ జనరల్‌గా అహమ్మద్ సలీం
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) కొత్త సెక్రటరీ జనరల్‌గా అహమ్మద్ సలీం మార్చి 13న బాధ్యతలు స్వీకరించారు. మాల్దీవులకు చెందిన సలీం సార్‌క మొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఫాతిమా దియానా సయీద్ స్థానంలో నియమితులయ్యారు. మాల్దీవుల క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా మొహమ్మద్ అరెస్టుపై ఫాతిమా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె రాజీనామా చేశారు.

AIMS DARE TO SUCCESS
ఏప్రిల్ 2012 అంతర్జాతీయం
26 ఏప్రిల్- 02 మే 2012 కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయం
భారత్ శ్రీలంక, మాల్దీవుల దోస్త్-XI నౌకావిన్యాసాలు
భారత్ కోస్ట్‌గార్‌డ్సతో కలిసి శ్రీలంక, మాల్దీవులు నాలుగు రోజులపాటు జరిపిన నౌకా విన్యాసాలు మార్చి 26న ముగిసాయి. సముద్ర దొంగలను అరికట్టడానికి ఈ విన్యాసాలు మాలే తీరంలో నిర్వహించారు. ఈ 11వ విన్యాసాలకు దోస్త్-XIగా పేరుపెట్టారు. వ్యూహాత్మక ప్రాంతం ఇండియన్ ఓసియన్ రిజియన్ (ఐఓఆర్)లో తమ కోస్ట్‌గార్‌డ్స మధ్య సహకారం మరింత పెంచుకోవడానికి ఈ విన్యాసాలు నిర్వహించారు. భారత్, మాల్దీవులు మొదటి ద్వైవార్షిక విన్యాసాలను 1991లో నిర్వహించాయి. 2012 విన్యాసాల్లో శ్రీలంక కూడా చేరింది.
హతాఫ్-4 క్షిపణి పరీక్ష జరిపిన పాకిస్తాన్
హతాఫ్-4 క్షిపణిని పాకిస్తాన్ ఏప్రిల్ 25న పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యమున్న ఈ క్షిపణి 1000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. హతాఫ్-4(షహీన్-1ఏ) భారత్ లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలదు.
అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయమూర్తిగా భండారి
అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారి ఏప్రిల్ 27న ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఎన్నికల్లో ఫిలిప్పైన్ న్యాయమూర్తిపై భండారి విజయం సాధించారు. 197 ఓట్లకు భండారికి 122 వచ్చాయి. 2012 నుంచి ఆరేళ్లు భండారీ ఐసీజే న్యాయమూర్తిగా కొనసాగుతారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ఐసీజేలో న్యాయమూర్తి పదవి దక్కింది. 15 మంది సభ్యులున్న ఐసీజేలో భండారీ ఆసియాకు చెందిన మూడో ప్రతినిధి.
సీచెల్స్‌లో రాష్ర్టపతి పర్యటన
భారత రాష్ర్టపతి ప్రతిభాపాటిల్ మూడు రోజులపాటు సీచెల్స్ దేశంలో పర్యటించారు. ఏప్రిల్ 30న సీచెల్స్ నేషనల్ అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. ఆ దేశ అధ్యక్షుడు జేమ్స్ అలెక్స్ మైఖేల్‌తో చర్చలు జరిపారు. సీచెల్స్‌కు 50 మిలియన్ డాలర్ల రుణం, 25 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను భారత్ ప్రకటించింది. మోనో రైలు ప్రాజెక్ట్, సౌర విద్యుత్ కేంద్రం, డ్యామ్ నిర్మాణానికి భారత్ అంగీకరించింది. హిందూ మహాసముద్రంలో 116 దీవులతో కూడిన దేశం సీచెల్స్.
12- 18 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
ఉత్తర కొరియా ఉపగ్రహ ప్రయోగం విఫలం
ఉత్తర కొరియా ఏప్రిల్ 13న చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లటానికి నింగిలోకి ఎగిసిన రాకెట్ మార్గమధ్యంలోనే కూలిపోయి సముద్రంలో పడిపోయింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ఇల్‌సంగ్ శత జయంతి సందర్భంగా ఆ దేశం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ‘దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగ సాంకేతిక సామర్థ్యాన్ని’ పరీక్షించుకోవటానికే ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడుతోందని జపాన్, దక్షిణ కొరియా, అమెరికా దేశాలు విమర్శించాయి.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా జిమ్ యంగ్
ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా అమెరికా నామినేట్ చేసిన వైద్య రంగ నిపుణుడు, కొరియా- అమెరికన్ జిమ్ యంగ్ కిమ్ ఎన్నికయ్యారు. ప్రపంచ బ్యాంక్ 12వ అధ్యక్షుడిగా కిమ్ జూలై 1న ప్రస్తుత అధ్యక్షుడు రాబర్ట్ బి. జోలిక్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో కిమ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్‌ఐవీ/ఎయిడ్స్ విభాగానికి డెరైక్టర్‌గా వ్యవహరించారు.
2011లో 45వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో గతేడాది (2011) లో 45 వేల మంది భారతీయులకు.. అమెరికా పౌరసత్వం లభించినట్లు ఆ దేశ అంతర్గత భద్రతా విభాగం నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. అత్యధిక సంఖ్యలో అమెరికా పౌరసత్వాలు పొందిన విదేశీయుల్లో మెక్సికో తర్వాత రెండో స్థానంలో భారతీయులు (45,985) నిలిచారు. 2011లో 94,738 మంది మెక్సికన్లకు అమెరికా పౌరసత్వం లభించింది. తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్ (42,520), చైనా (32,864), కొలంబియా (22,693) దేశస్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్‌క నగరాల్లో నివసిస్తున్నారు. 2012లో ఇప్పటికే 61,142 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందినట్లు నివేదిక వివరించింది.
5- 11 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
మలావి అధ్యక్షురాలిగా జాయిస్ బందా
మలావి నూతన అధ్యక్షురాలిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు, పీపుల్స్ పార్టీ నేత జాయిస్ బందా ఏప్రిల్ 7న ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా ఉన్న బింగువా ముతారికా ఏప్రిల్ 5న గుండెపోటుతో మృతి చెందడంతో బందా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. మలావి అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు.
20వ ఆసియాన్ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) 20వ సదస్సు ఏప్రిల్ 3,4 తేదీల్లో కాంబోడియా రాజధాని పామ్‌పెన్‌లో జరిగింది. మయన్మార్‌పై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఆసియాన్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసింది. వివాదాస్పద ఖండాంతర రాకెట్ ప్రయోగం విరమించుకోవాలని ఉత్తరకొరియాను కోరింది. 2015 నాటికి ఆసియాన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని కూడా ఆసియాన్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆసియా న్‌లో 10 దేశాలు బ్రూనే, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్,లావోస్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 8.8 శాతం మంది ప్రజలు ఆసియాన్ దేశాల్లో నివసిస్తున్నారు. 1967, ఆగస్టు 8న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఏర్పాటైన ఆసియాన్ తొలి సమావేశం 1976 బాలి(ఇండోనేషియా)లో జరిగింది.
మాలి ఉత్తర ప్రాంతంలో స్వతంత్ర ప్రకటన
మాలి ఉత్తర ప్రాంతాన్ని తరెగ్ తిరుగుబాటుదారులు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఏప్రిల్ 6, 2012 నుంచి ‘అజావద్’ పేరిట మాలి ఉత్తర ప్రాంతం స్వతంత్ర దేశంగా ఉంటుందని మాలి నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ అజావద్ సంస్థ ప్రకటించింది. దీంతో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉత్తరప్రాంతం, సైనిక పాలకుల కింద దక్షిణ ప్రాంతం ఉన్నాయి. సంచార జాతికి చెందిన తరెగ్ ప్రజలు 1958 నుంచి ఉత్తర ప్రాంత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. దేశ రాజధాని, ఆర్థిక వ్యవస్థ న ల్లజాతి ప్రజల నియంత్రణలో ఉంది. దీంతో ఉత్తర ప్రాంత అభివృద్ధిని దక్షిణ ప్రాంతీయులు నిర్లక్ష్యం చేస్తున్నారని తరెగ్‌లు ఆరోపిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో అధికారం హస్తగతం చేసుకున్నట్లు మార్చి 22న ఆ దేశ సైన్యం ప్రకటించింది. మాలి ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతంపై దక్షిణ ప్రాంతం ఆధిపత్యం కొనసాగిస్తోంది. దీంతో 1960 నుంచి నాలుగుసార్లు తిరుగుబాట్లు జరిగాయి.
ఐరాస పట్టణీకరణ నివేదిక
రానున్న నాలుగు దశాబ్దాల్లో భారత్, చైనాల్లోని నగరాల జనాభా కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి రూపొందించిన నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా నగర జనాభా పెరుగుదలలో ఆఫ్రికా, ఆసియా దేశాలు ముందుటాయని ఐరాస-డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆఫైర్స్ విడుదల చేసిన ‘రివిజన్ ఆఫ్ ద వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2011’ నివేదిక పేర్కొంది. ఆసియాలోని భారత్, చైనాలో, ఆఫ్రికాలోని నైజీరియాలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుందని నివేదిక వివరించింది. అమెరికా, ఇండోనేషియాల్లోనూ గణనీయంగా జనాభా పెరగనుందని తెలిపింది. భారత పట్టణ జనాభా వచ్చే నాలుగు దశాబ్దాల్లో (2010-50 నాటికి) 497 మిలియన్ల(దాదాపు 50 కోట్లు)కు చేరుకోవచ్చని ఈ నివేదిక తెలిపింది. దీని ప్రకారం.. ఇదే సమయంలో చైనా పట్టణ జనాభా 341 మిలియన్లకు పెరుగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా(20 మిలియన్లు), అమెరికా(103 మిలియన్లు), ఇండోనేషియా(92 మిలియన్లు) దేశాలు ఉంటాయి.
నగరాల పరంగా చూస్తే 2025 నాటికి 39 మిలియన్ల జనాభాతో జపాన్ రాజధాని టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలుస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ (33 మిలియన్లు), షాంఘై (చైనా-28.4 మిలియన్లు), ముంబై(27 మిలియన్లు) ఉంటాయని నివేదిక పేర్కొంది.
29 మార్చి- 4 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
సియోల్‌లో అణు భద్రత సదస్సు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రెండో అణు భద్రత సదస్సు మార్చి 26, 27 తేదీల్లో జరిగింది. ఇందులో 53 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అణు భద్రతను పటిష్టం చేయడం, అణు ఉగ్రవాద భయాన్ని తగ్గించడం, తీవ్రవాదులు, నేరస్తులు, ఇతర చట్ట వ్యతిరేక సంస్థలు అణు పదార్థాలు పొందకుండా నిరోధించే దిశగా పని చేయాలని సదస్సు తీర్మానించింది. అంతర్జాతీయ భద్రతకు అణు తీవ్రవాదం అత్యంత సవాలుగా నిలిచిందని సదస్సు పేర్కొంది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ప్రపంచంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తేనే అణుభద్రత సాధ్యమవుతుందని అన్నారు. అణు భద్రతపై తొలి సదస్సు 2010లో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగింది. తదుపరి సదస్సుకు 2014లో నెదర్లాండ్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.
దలైలామాకు టెంపుల్టన్ ప్రైజ్
టిబెట్ మత గురువు దలైలామా టెంపుల్టన్ ప్రైజ్-2012 కు ఎంపికయ్యారు. లండన్‌లో మే 14న జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డును జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ అందజేస్తుంది. దీన్ని 1972లో నెలకొల్పారు. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది.
అరబ్ లీగ్ సదస్సు
ఇ రాక్ రాజధాని బాగ్దాద్‌లో మార్చి 29న అరబ్ లీగ్ దేశాల సదస్సు జరిగింది. సిరియా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుక్కోవాలని సదస్సులో పాల్గొన్న నేతలు కోరారు. ఈ సదస్సును ఐక్యరాజ్యసమితి కార్యదర్శి బాన్-కీ-మూన్ ప్రారంభించారు. సిరియాలో సంక్షోభ నివారణ కోసం యూఎన్-అరబ్ లీగ్ ప్రతినిధి కోఫి అన్నన్ సూచించిన ప్రణాళికను అమలు చేయాలని ఆ దేశాధ్యక్షుడు అస్సాద్‌కు బాన్-కీ-మూన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అరబ్‌లీగ్ సదస్సు బాగ్దాద్‌లో జరిగింది. ఈ లీగ్ నుంచి సస్పెండ్ అయిన సిరియాను సదస్సుకు ఆహ్వానించలేదు. అరబ్ లీగ్‌లో 22 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ‘ఎర్త్ అవర్’
భూగోళం పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మార్చి 31న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి ‘ఎర్త్ అవర్’ పాటించారు. గతేడాది ఎర్త్ అవర్‌లో 135 దేశాలు పాల్గొనగా, ఈ ఏడాది ఆ సంఖ్య 147కు పెరిగింది. వాతావరణ మార్పులపై ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్‌ను తొలి సారిగా నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా మార్చి చివరి శనివారం ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. మన దేశంలో ఎర్త్ అవర్‌ను 2009 నుంచి నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల నాలుగో సదస్సు మార్చి 29న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్, చైనా అధ్యక్షుడు హూ జింటావో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ నేతలు ఉమ్మడి ఢిల్లీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఇందులోని ముఖ్యాంశాలు..
ఇరాన్ అణు కార్యక్రమం సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించడంప్రపంచ బ్యాంకు తరహాలో తమ ఆర్థిక అవసరాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలలో సంస్కరణలకు పిలుపు.తమ స్థానిక కరెన్సీలోనే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా సంబంధిత ఒప్పందాలపై సంతకాలు.తొలిసారి 2006లో న్యూయార్క్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. దీన్ని బ్రిక్(BRIC)గా వ్యవహరించేవారు. మొదటి సదస్సు 2009లో ఎకటెరిన్ బర్గ్(రష్యా)లో జరిగింది. రెండో సదస్సుకు బ్రెసిలియా(బ్రెజిల్), మూడో సదస్సుకు సాన్యా(చైనా) వేదికలుగా నిలిచాయి. ఈ సదస్సులో దక్షిణాఫ్రికా చేరడంతో ఈ కూటమిని బ్రిక్స్ (BRICS)గా వ్యవహరిస్తున్నారు. ఈ దే శాలు ప్రపంచ జనాభాలో సగ భాగం జనాభాను కలిగి ఉన్నాయి. ఐదో సదస్సుకు 2013లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది.
AIMS DARE TO SUCCESS
మే 2012 అంతర్జాతీయం
వాతావరణ మార్పుపై ఆసియా, పసిఫిక్ ప్రాంతం స్పందించాలన్న యూఎన్‌డీపీ
ఆసియా, పసిఫిక్ దేశాలు అభివృద్ధి, పెరుగుతున్న ఉద్గారాల మధ్య సమతౌల్యం పాటించాలని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) మే 10న నివేదికలో తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతమంతా తమ లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేందుకు ఆర్థికంగా వృద్ధి చెందాలని, అదే కాలంలో వాతావరణ మార్పుపై కూడా స్పందించాలని యూఎన్‌డీపీ ‘ఒన్ ప్లానెట్ టు షేర్ : సస్టైనింగ్ హ్యూమన్ ప్రోగ్రెస్ ఇన్ ఛేంజింగ్ క్లైమేట్’ నివేదికలో తెల్పింది.
ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోని సగం జనాభా ఉంది. సగం అతిపెద్ద నగరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆసియా పసిఫిక్‌లో 40 శాతం జనాభా పట్టణ ఆవాసాల్లోనే ఉంది. ఈ నగరాల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 6500 మంది ఉంటే లాటిన్ అమెరికాలో 4500 మంది, యూరప్‌లో 4000 మంది ఉన్నట్లు నివేదిక తెలిపింది. అత్యధిక జనసాంద్రత గల నగరాలు వాతావరణ మార్పునకు తీవ్రంగా గురౌతున్నాయి. దీనికి ముంబై (2005), జకర్తా (2007), బ్రిస్‌బెన్(2010-11), బ్యాంకాక్ (2011)ల్లో సంభవించిన భారీ వరదలను యూఎన్‌డీపీ ఉదాహరణగా పేర్కొంది. ఈ నివేదిక ఏక పక్షంగా ఉందని, భారత ప్రభుత్వాన్ని సంప్రదించలేదని, దీనిపై యూఎన్‌డీపీకి తమ అభ్యంతరాలు తెలియజేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
హతాఫ్-3 క్షిపణిని పరీక్షించిన పాక్
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం గల హతాఫ్-3 (ఘజ్నలీ) క్షిపణిని పాకిస్తాన్ మే 10న విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 290 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. భారత్ చేరుకోగల సామర్థ్యమున్న ఈ క్షిపణి సైనిక వ్యూహాత్మక దళ కమాండ్ వార్షిక శిక్షణలో భాగంగా పరీక్షించారు.
అత్యంత శక్తి మంతమైన తల్లిగా హిల్లరీ
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మాతృమూర్తుల జాబితాలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ నెంబర్ వన్‌గా నిలిచారు. ఇందులో పెప్సికో చైర్ పర్సన్ ఇంద్రా నూయి మూడో స్థానంలో, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరో స్థానంలో నిలిచారు. ప్రపంచ తల్లుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 20 మంది తల్లుల జాబితాను ఫోర్బ్స్ మేగజైన్ మే 13న విడుదల చేసింది. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ రెండో స్థానంలో, అమెరికా మొదటి మహిళ మిషెల్ ఒబామా ఏడో స్థానంలో నిలిచారు. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్‌సాన్ సూకీ 20వ స్థానంలో నిలిచారు. డబ్బు నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తదితర లక్షణాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
రాష్ట్రపతి దక్షిణాఫ్రికా పర్యటన
భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ నెల 2న ఆ దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. విద్యుత్, ఐటీ, ఆరోగ్యం, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని కూడా ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, పర్యావరణ మార్పులు, ప్రపంచ వాణిజ్య చర్చల్లో దక్షిణాఫ్రికా సహకారం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు. ఇదే పర్యటనలో మహాత్మా గాంధీ జైలు శిక్ష అనుభవించిన ఓల్డ్ ఫోర్ట్ కారాగారంలోనే ఆయన విగ్రహాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆవిష్కరించారు. 1908-13 మధ్య నాలుగు పర్యాయాలు గాంధీని ఈ జైలులోని నాలుగో నంబర్ గదిలో ఉంచారు. ప్రస్తుతం దీన్ని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంగా మార్చారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జైలు జీవితాన్ని గడిపిన రోబెన్ ఐస్‌లాండ్ కారాగారాన్ని కూడా రాష్ట్రపతి సందర్శించారు.
నేపాల్‌లో యూనిటీ ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకారం
కొత్త రాజ్యాంగం కోసం నేషనల్ యూనిటీ ప్రభుత్వం ఏర్పాటుకు నేపాల్ ప్రధాన రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి మినహా మొత్తం కేబినెట్ ఈ నెల 3న రాజీనామా చేసింది. మావోయిస్టు, మదేశీ పార్టీ మంత్రులు ఇందులో ఉన్నారు. 2008 లో రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత నేషనల్ యూనిటీ ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం ప్రకారం యూనిటీ ప్రభుత్వానికి మొదట భట్టరాయ్ నాయకత్వం వహిస్తారు. ఈ ప్రభుత్వంలో మావోయిస్టులతోపాటు నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునెటైడ్ డెమోక్రటిక్ మదేశీ ఫ్రంట్‌లు భాగస్వామ్య పక్షాలుగా ఉంటాయి. తర్వాత రెండో దఫా ప్రభుత్వానికి నేపాలీ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. ఈ నెల 27 నాటికి రాజ్యాంగం ఏర్పడాల్సి ఉంది. నూతన రాజ్యాంగం ప్రకారం సంవత్సరంలోపు ఎన్నికలు నిర్వహించాలి.
పార్లమెంట్ సభ్యురాలిగా సూకీ ప్రమాణస్వీకారం
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నేత ఆంగ్ సాన్ సూకీ ఈ నెల 2న ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని నేప్యిదాలోని దిగువ సభలో జరిగిన కార్యక్రమంలో తనతోపాటు ఎన్నికైన మరో 33 మంది పార్టీ నేతలతో కలిసి ప్రమాణం చేశారు. సూకీ తొలి సారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. గత ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో సూకీతో పాటు మరో 33 మంది విజయం సాధించారు. ప్రజాస్వామ్య ఉద్యమనేత సూకీని సైనిక ప్రభుత్వం 1989లో తొలిసారిగా నిర్బంధించింది. తర్వాత 21 సంవత్సరాల్లో 15 ఏళ్లు జైలు జీవితం గడిపారు. 2010 నవంబర్‌లో విడుదలయ్యారు. 1991లో సూకీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది.
14 శాతం పెద్దగా కనిపించిన చంద్రుడు
ఈ నెల 6న చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజు కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించాడు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీప బిందువు(పెరిజీ)లోకి అంటే.. సుమారు 2,21,802 మైళ్ల దూరంలోకి రావడంతో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఏడాదికోసారి చంద్రుడు ఇలా భూమికి దగ్గరగా వస్తాడు.
జపాన్‌లో అణు విద్యుత్ నిలిపివేత
జపాన్ అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. మొత్తం 50 అణు రియాక్టర్లలో చివరి అణు రియాక్టర్‌ను ఈ నెల 5న ఆ దేశం మూసివేసింది. గత ఏడాది వరకూ ఆ దేశ విద్యుత్ అవసరాల్లో 30 శాతం అణు విద్యుత్ రంగమే తీర్చేది. సునామీ నేపథ్యంలో పుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో సంభవించిన ప్రమాదంతో అక్కడి ప్రభుత్వం అణు రియాక్టర్ల మూసివేతకు శ్రీకారం చుట్టింది. 1970లలో అణు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేంత వరకు జపాన్ తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమైంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా హొలాండ్ గెలుపు
ఫ్రాన్స్ అధ్యక్ష పదవి కోసం ఈ నెల 6న ముగిసిన మలి విడత ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హొలాండ్ విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు కన్సర్వేటివ్ పార్టీకి చెందిన నికోలస్ సర్కోజీ ఓటమి పాలయ్యారు. దీంతో 22 ఏళ్ల తర్వాత సోషలిస్ట్ పార్టీ ఫ్రాన్స్‌లో అధికారంలోకి వచ్చింది. తొలి విడత పోలింగ్‌లోనూ హొలాండ్ గెలుపొందారు.
ఏడీబీ గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా ప్రణబ్
ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఈ నెల 6న జరిగిన ఏడీబీ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. 2013లో ఏడీబీ గవర్నర్ల సదస్సుకు న్యూఢిల్లీ వేదిక కానుంది.
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణం
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేశారు. పుతిన్ అధ్యక్ష పదవిని చేపట్టడం ఇది మూడోసారి. గతం లో 2000 -08 మధ్య రెండు సార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. పుతిన్ ఈ పదవిలో 2018 వరకు కొనసాగుతారు(అధ్యక్షుని పదవీ కాలాన్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు). మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ ప్రధానమంత్రి కానున్నారు.
AIMS DARE TO SUCCESS
జూన్ 2012 అంతర్జాతీయం
28 జూన్ - 04 జూలై 2012 అంతర్జాతీయం
అంతర్జాతీయం
అవినీతి నిరోధక టాస్క్‌ఫోర్స్‌కు
భారత్ నేతృత్వం
అవినీతి నిరోధక గ్లోబల్ టాస్క్‌ఫోర్స్‌కు భారత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) ప్రదీప్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యాంటీ-కరప్షన్ అథారిటీస్(ఐఏఏసీఏ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అవినీతి సంబంధ నేరాలను నిర్ధారించడం, అంతర్జాతీయ సహకారం పెంపొందించేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. అవినీతి నిరోధక సంస్థలు, విధానాలు, అనుసరించే పద్ధతులు, కార్యాచరణ వంటి అంశాలకు సంబంధించిన సమాచార మార్పిడి తదితర అంశాల్లోటాస్క్‌ఫోర్స్ తోడ్పడుతుంది. గత ఏప్రిల్‌లో టాంజానియాలో నిర్వహించిన ఐఏఏసీఏ కార్యనిర్వాహక సమావేశంలో గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును సీవీసీ ప్రదీప్ కుమార్ ప్రతిపాదించారు.
రతన్ టాటాకు రాక్‌ఫెల్లర్ అవార్డు
టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ అందజేసే లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారానికి ఎంపికయ్యారు. న్యూ యార్క్‌లో జూన్ 27న రతన్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. గతేడాది ఈ పురస్కారం అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు దక్కింది.
ఈజిప్టు అధ్యక్షుడిగా ముర్సీ ప్రమాణం
ఈజిప్టు నూతన అధ్యక్షుడిగా మహ్మద్ ముర్సీ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఈజిప్టులో తొలిసారి స్వేచ్ఛగా ఎన్నికైన అధ్యక్షుడిగా ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ అభ్యర్థి ముర్సీ ఘనత దక్కించుకున్నారు. ఈ విజయంతో 84 ఏళ్ల తర్వాత ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీకి అధికారం దక్కింది.
భూమికి చేరిన చైనా వ్యోమగాములు
చైనా తొలి మానవసహిత అంతరిక్ష అనుసంధానం పూర్తి చేసి షెంజౌ-9 వ్యోమనౌక 13 రోజుల అంతరిక్ష యాత్ర అనంతరం జూన్ 29న మంగోలియాలోని సిజివాంగ్‌లో దిగింది. ఇందులో తొలి మహిళా వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. 2020 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో భాగంగా చైనా ఈ అంతరిక్ష యాత్ర నిర్వహించింది.
లీప్ సెకన్
జూన్ 30వ తేదీన చివరి నిమిషానికి శాస్త్రవేత్తలు ఒక లీప్ సెకన్ కలిపారు. అంటే రాత్రి 11.59 గంటల తర్వాత 61 సెకన్లకు 12 అయింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తనచుట్టూ తాను ఒకసారి తిరగడానికి 86,400 సెకన్లు పడుతుంది. అయితే సూర్యుడి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, సముద్రపు అలల కారణంగా భూభ్రమణ సమయంలో అతి స్వల్పంగా తేడా ఏర్పడుతుంది. దీంతో సౌరకాలమానంలో ఏర్పడే స్వల్ప వ్యత్యాసాలను సరిచేసేందుకే శాస్త్రవేత్తలు లీప్ సెకన్‌ను, లీప్ సంవత్సరాన్ని కలుపుతుంటారు. ప్రస్తుతం కాలాన్ని గణించేందుకు పరమాణు గడియారాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక సెకన్ కాలంలో వందల కోట్ల వంతు కాలాన్ని కూడా కచ్చితంగా లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరమాణు కాలం (టీఏఐ), సౌరకాలమానానికి మధ్య ఏర్పడే స్వల్ప వ్యత్యాసాలను సరిచేసేందుకుగాను కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ)ని సవరించనున్నారు. ఈ పద్ధతిని 1972 నుంచి పాటిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ జాబితాలో పశ్చిమ కనుమలు
భారత్‌లోని పశ్చిమ కనుమలను ప్రపంచ వారసత్వ జాబితా (వరల్డ్ హెరిటేజ్ లిస్ట్)లో చేర్చాలని ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ జూలై 1న నిర్ణయించింది. పశ్చిమ కనుమల్లోని 39 వరుస ప్రదేశాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రారంభమై 1600 కి.మీ. పొడవున మహారాష్ట్ర, గోవా,కర్ణాటక, తమిళనాడు, కేరళలలో విస్తరించి కన్యాకుమారిలో ఈ పర్వత శ్రేణులు ముగుస్తాయి. ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత జీవ వైవిధ్యం కలిగిన పది ప్రాంతాల్లో ఒకటిగా పశ్చిమ కనుమలు గుర్తింపు పొందాయి. ఈ కనుమల సముదాయాల్లో విస్తరించిన అడవులు హిమాలయా పర్వతాల కంటే పురాతనమైనవి. పశ్చిమ కనుమలతోపాటు జర్మనీలోని చారిత్రక ఒపెరా హౌస్, పోర్చుగల్‌లోని సరిహద్దు పట్టణం, చాద్‌లో ఒకదానికొకటి అనుసంధానమైన ఎనిమిది సరస్సులకు కూడా హెరిటేజ్ జాబితాలో చోటు దక్కింది. అంతేకాకుండా వెస్ట్ బ్యాంక్‌లోని ఏసుక్రీస్తు జన్మించిన బెత్లెహామ్ నగరాన్ని, ఆయన పుట్టినట్లు భావిస్తున్న అక్కడి ‘నేటివిటీ చర్చి’ని కూడా ప్రపంచ హెరిటేజ్ జాబితాలో చేర్చాలని యునెస్కో జూన్ 29న నిర్ణయించింది.
.......................
అంతర్జాతీయం(21-27 జూన్)
అంతర్జాతీయం
గ్రీస్ ప్రధానిగా సమరస్
గ్రీస్ నూతన ప్రధానమంత్రిగా న్యూడెమోక్రసీ పార్టీ అధ్యక్షుడు అంటోనిస్ సమరస్ జూన్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 17న జరిగిన ఎన్నికల్లో 29.7 శాతం ఓట్లు సాధించి న్యూడెమోక్రసీ పార్టీ పార్లమెంట్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారీటీ రాలేదు. దీంతో పసోక్ పార్టీ, డెమోక్రటిక్ లెఫ్ట్ అనే మరో రెండు పార్టీలతో కలిసి న్యూడెమోక్రసీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
సూకీకి ఆక్స్‌ఫర్డ్ డాక్టరేట్
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీకి బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ జూన్ 20న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సూకీ 1967లో ఈ యూనివర్సిటీ నుంచి ఆర్థిక, రాజనీతి, తత్వశాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశారు. ఐర్లాండ్ ప్రజలు ‘ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ డబ్లిన్’ పురస్కారంతో కూడా ఆమెను సత్కరించారు.
మెక్సికోలో జీ-20 ఏడో సదస్సు
జీ-20 దేశాల సదస్సు ఏడో సదస్సు జూన్ 18-19 తేదీల్లో మెక్సికోలోని లాక్ కాబోస్‌లో జరిగింది. ఈ సందర్భంగా సదస్సు డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఆర్థిక విపణుల ఒడిదుడుకుల పరిష్కారంలో, వాణిజ్యాన్ని ప్రోత్సహించటంలో, ఉద్యోగాలను పెంచటంలో ఉమ్మడి చర్యలు చేపట్టాలని సదస్సు పిలుపునిచ్చింది.
ఐఎంఎఫ్‌ను బలోపేతం చేస్తూ సమకూర్చనున్న 450 బిలియన్ డాలర్లలో ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ 75 డాలర్లు అందించేందుకు సమ్మతించగా.. అందులో 10 బిలియన్ డాలర్లు భారత్ సమకూర్చనుంది. యూరోజోన్‌లో అస్థిరతను పరిష్కరించాలని సదస్సుకు హాజరైన నాయకులంతా అంగీకరించారు. ఐఎంఎఫ్ కోటా సంస్కరణలు చాలా నెమ్మదిగా సాగుతుండటం పట్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కోటాలు ఆర్థిక బలాలను సరళంగా, పారదర్శకంగా ప్రతిబింబించాలన్నారు. కోటా సంస్కరణలు పూర్తయితే.. ఐఎంఎఫ్‌లో భారత్ వాటా ప్రస్తుతం ఉన్న 2.44 శాతం నుంచి 2.75 శాతానికి పెరుగుతుంది. తద్వారా.. ప్రస్తుతం ఐఎంఎఫ్ వాటా దారుల్లో 11వ అతి పెద్ద వాటాదారుగా ఉన్న భారత్ స్థానం 8వ స్థానానికి పెరుగుతుంది. జీ-20 దేశాల తదుపరి సదస్సు 2013లో రష్యాలో జరుగుతుంది.
అంతరిక్ష రంగంలో చైనా మాన్యువల్ డాకింగ్
అంతరిక్ష రంగంలో చైనా జూన్ 24న ‘మానవ ప్రమేయ అనుసంధానం(మాన్యువల్ డాకింగ్)’ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో 2020 నాటికి తొలి స్పేస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలన్న దిశగా ముందడుగు వేసినట్లయింది. చైనా తొలి మహిళా వ్యో మగామి లియు యాంగ్ సహా షెంజౌ-9లో ఉన్న ముగ్గురు వ్యోమగాములు తియాంగాంగ్-1 మాడ్యుల్‌తో విజయవంతంగా అనుసంధానమయ్యారు. ఇది తొలి ప్రయోగాత్మక మాన్యువల్ డాకింగ్.
రియోలో ధరిత్రీ సదస్సు
ఐక్యరాజ్యసమితి ‘రియో+20’పేరిట ధరిత్రీ శిఖరాగ్ర సదస్సును బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జూన్ 20-22వ తేదీల్లో నిర్వహించింది. ‘‘సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన నేపథ్యంలో హరిత ఆర్థిక వ్యవస్థ-సుస్థిరాభివృద్ధి కోసం వ్యవస్థాపరమైన కార్యాచరణ’’ అనే ఇతివృత్తింతో జరిగిన ఈ సదస్సును ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రారంభించారు. ఇందులో 191 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ద ఫ్యూచర్ వియ్ వాంట్’ ముసాయిదా పత్రాన్ని ఆమోదించారు.
ఆకలి నుంచి ప్రజలను కాపాడేందుకు ‘జీరో హంగర్ ఛాలెంజ్’ అనే కార్యక్రమాన్ని బాన్ కీ మూన్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం.. సంవత్సరమంతా చాలినంత ఆహారం అందుబాటులోకి తేవడంలో 100 శాతం విజయం, గర్భిణులు-చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణ, సుస్థిర ఆహార వ్యవస్థ ఏర్పాటు, ఉత్పాదకతలో, ఆదాయంలో ముఖ్యంగా మహిళ ఆదాయంలో వృద్ధిని పెంచడం, ఆహార వృధాను సున్నా స్థాయికి తగ్గించడం వంటి లక్ష్యాలతో పని చేస్తుంది.
‘గ్రీన్ ఎకానమీ’ పేరిట అగ్రరాజ్యాలు ఇతర దేశాలపై ఏకపక్షంగా విధిస్తున్న వాణిజ్యపరమైన ఆంక్షలను భారత్ తోసిపుచ్చింది. భారత్ ప్రతిపాదన మేరకు సాంకేతిక బదలాయింపు, ఆర్థిక అంశాలపై తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు సదస్సు అంగీకారం తెలిపింది. సదస్సుకు హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా చైనా ప్రధాని వెన్ జియబావోతో ముఖాముఖి చర్చలు జరిపారు. రియోలో తొలి ధరిత్రీ సదస్సు జరిగిన 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడే ఈ సదస్సు జరగడం విశేషం. 1992లో నిర్వహించిన ధరిత్రీ సదస్సులో 172 దేశాలు పాల్గొన్నాయి.
ఈజిప్టు అధ్యక్షుడిగా మహ్మద్ ముర్సీ
ఈజిప్టు అధ్యక్షుడిగా ముస్లిం బ్రదర్‌హుడ్ అభ్యర్థి మహ్మద్ ముర్సీ విజయం సాధించారు. ముబారక్ పదవి కోల్పోయాక అధ్యక్ష పదవి కోసం జూన్ 16,17 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో ముర్సీకి 51.73 శాతం ఓట్లు రాగా ప్రత్యర్ధి షఫీక్(ముబారక్ హయాంలో చివరి ప్రధాని)కు 48.3 శాతం ఓట్లు దక్కాయి.
ఆరు దశాబ్దాల ముబారక్ నియంతృత్వ పాలనపై గతేడాది జనవరి 25న ప్రారంభమైన తిరుగుబాటు ఫిబ్రవరి 11న ఆయన పదవి నుంచి వైదొలగడంతో ముగిసింది. అప్పటి నుంచి సైనిక బలగాల అత్యున్నత మండలి ఈజిప్టు పాలన కొనసాగిస్తోంది.
పాక్ ప్రధానిపై అనర్హత వేటు
పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ కోర్టు ధిక్కారం కేసులో దోషిగా నిర్ధారితుడైనందున.. ప్రధానమంత్రి పదవికి అనర్హుడయ్యాడని ఆ దేశ సుప్రీం కోర్టు జూన్ 19న పేర్కొంది. గిలానీ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడయ్యాడని, ప్రధాని పదవి గత రెండు నెలలుగా ఖాళీగా ఉన్నట్లేనని కోర్టు వ్యాఖ్యానించింది.
దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై స్విట్జర్లాండ్ ముడుపుల కేసును తిరగదోడాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తిరస్కరించినందుకుగాను.. ప్రధాని గిలానీని కోర్టు ధిక్కారం కేసులో దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు గత ఏప్రిల్ 26న తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా గిలానీకి ప్రతీకాత్మకంగా ఒక నిమిషం పాటు శిక్షను కూడా విధించింది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా నిర్ధారితుడై శిక్షకు గురైన వ్యక్తి ప్రధానమంత్రి పదవికి అనర్హుడు.
నూతన ప్రధానిగా రజాపర్వేజ్ అష్రాఫ్
పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా అధికార పక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అభ్యర్థి రజాపర్వేజ్ అష్రాఫ్ జూన్ 22న ఎన్నికయ్యారు.
అంతర్జాతీయం(14-20 జూన్)
అంతర్జాతీయం
అమెరికా అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా గుర్తింపు పొందిన అమెరికా అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారత్‌కు చెందిన శ్రీకాంత్ శ్రీనివాసన్‌ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబమా నియమించారు. ప్రస్తుతం శ్రీనివాసన్ అమెరికా డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఈయన చండీగఢ్‌లో జన్మించారు. తర్వాత శ్రీనివాసన్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. స్టాన్‌ఫర్డ్ లా స్కూల్ నుంచి న్యాయ శాస్త్రం అభ్యసించారు.
డేనియల్ హిల్లేల్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ హిల్లేల్‌కు 2012 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లభించింది. వ్యవసాయ రంగంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఉన్న ప్రాధాన్యతపై ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. గత ఐదు దశాబ్దాలుగా వ్యవ సాయంలో నీటి సమర్ధ వినియోగం, పంట దిగుబడి పెంచడం, పర్యావరణ క్షీణత తగ్గించడం వంటి అంశాలపై డేనియల్ విశేషంగా కృషి చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్, ఇతర ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తిలో విప్లవం తీసుకొచ్చారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ నోర్మన్ బోర్లాగ్ ఏర్పాటు చేశారు. ఆహార, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పౌష్టికాహారం, మార్కెటింగ్, పేదరిక నిర్మూలన, రాజకీయ నాయకత్వం, సామాజిక శాస్త్రాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డు బహూకరిస్తారు.
అఫ్ఘానిస్థాన్‌పై అంతర్జాతీయ సదస్సు
అఫ్ఘానిస్థాన్ సమస్య పరిష్కారంతోపాటు ప్రాంతీయ సహకారం పెంపొందించే దిశగా చేపట్టాల్సిన చర్యలను సూచించడం కోసం జూన్ 14న కాబూల్‌లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇందులో భారత్, చైనా, రష్యా సహా 30 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 2014 లో నాటో దళాలు అఫ్ఘానిస్థాన్ నుంచి విరమించుకోనున్న నేపథ్యంలో ప్రాంతీయ తోడ్పాటు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. తీవ్రవాదం, మాదకద్రవ్యాల రవాణాపై పోరాడేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. సదస్సులో భారత ప్రతినిధిగా కేంద్ర న్యాయ, మైనార్టీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పాల్గొన్నారు.
ఇరాన్ ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు
ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించే ఆర్థిక ఆంక్షల విషయంలో భారత్‌సహా ఏడు దేశాలకు అమెరికా మినహాయింపునిచ్చింది. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను భారత్, మలేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టర్కీ, తైవాన్‌లు గణనీయంగా తగ్గించుకున్నాయని దాంతో ఆంక్షల నుంచి వీటికి మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
రోదసిలోకి చైనా మహిళ
చైనా జూన్ 16న తన తొలి మహిళా వ్యోమగామి లియు యాంగ్‌ను అంతరిక్షానికి పంపింది. దీంతో అమెరికా, రష్యాల తర్వాత రోదసీలో మానవ సహిత డాకింగ్ (అనుసంధానం) నిర్వహించిన మూడో దేశంగానూ చైనా రికార్డు సృష్టించనుంది. వాయవ్య చైనాలోని గోబి ఎడారిలో గల జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంర-9 వ్యోమనౌక (దేవుడి వాహనం అని అర్థం) ద్వారా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపినట్లు చైనా ప్రకటించింది. లియు ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా పనిచేశారు. చైనా తొలి మహిళా ఆస్ట్రోనాట్ కావడంతోపాటు అంతరిక్షంలోకి వెళ్లిన 57వ మహిళగా లియు రికార్డు సృష్టించారు. ఈమెతోపాటు పురుష వ్యోమగాములు జింగ్ హైపెంగ్, లియు వాంగ్‌లు షెంర-9లో అంతరిక్షానికి వెళ్లారు. రోదసీలో శాశ్వత స్థావరం దిశగా అమెరికా, రష్యాల తర్వాత సొంత అంతరిక్ష కేంద్రం (తియాంగాంగ్-1)ను ఏర్పాటు చేసుకుంటున్న మూడో దేశంగా చైనా అవతరించింది. ఈ ప్రయోగం కోసం ఉపయోగించిన రాకెట్ చైనా ఇంతవరకు రూపొందించిన రాకెట్లలోకెల్లా పొడవైనది, బరువైనది కావడం విశేషం. షెంర-9ను తియాంగాంగ్-1కు అనుసంధానం చేయడంతోపాటు ఈ ముగ్గురూ వ్యోమనౌక నుంచి బయటికి వచ్చి తియాంగాంగ్‌లోకి వెళతారు.
గ్రీస్ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ విజయం
గ్రీస్ పార్లమెంట్ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. 29.7 శాతం ఓట్లతో న్యూ డెమోక్రసీ 79 సీట్లను గెలుచుకుంది. 26.9 శాతం ఓట్లతో అతివాద వామపక్షం సిరిజా 71 స్థానాలను దక్కించుకని రెండో స్థానంలో నిలిచింది. గ్రీస్ ఎన్నికల విధానం ప్రకారం ఎక్కువసీట్లు సాధించిన పార్టీకి బోనస్‌గా 50 సీట్లు లభిస్తాయి. దీంతో న్యూ డెమోక్రసీకి మొత్తం 129 సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లో బోనస్ సీట్లతో కలిపి 300 స్థానాలు ఉంటాయి. ఆర్థిక ఉద్దీపనల అనుకూల న్యూ డెమోక్రసీ విజయంతో యూరో జోన్ సంక్షోభంతో సతమతమవుతున్న యూరప్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఉద్దీపనలను, పొదుపు చర్యలను వ్యతిరేకించే సిరిజా ఎన్నికల్లో గెలిస్తే గ్రీస్‌ను యూరో కరెన్సీ జోన్ నుంచి బయటకు తెస్తుందని, దీంతో ఆ దేశానికి అప్పులిచ్చిన దేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశీలకులు అంచనా వేశారు. గత నెల 6నజరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో తిరిగి జూన్ 17న ఎన్నికలు నిర్వహించారు.
ఇల్లినాయిన్ వర్సిటీ వీసీగా మిత్రా దత్తా
అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇల్లినాయిస్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా భారతీయ అమెరికన్ మిత్రా దత్తా నియమితులయ్యారు. ఈమె గౌహతీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ(ఫిజిక్స్) చేశారు.
ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా ఫతౌ బెన్‌సౌరా
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) నూతన చీఫ్ ప్రాసిక్యూటర్‌గా గాంబియన్ న్యాయవాది ఫతౌ బెన్‌సౌరా జూన్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఐసీసీ ప్రాసిక్యూటర్ల టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళ, మొదటి ఆఫ్రికన్ బెన్‌సౌరా.
21 ఏళ్ల తర్వాత సూకీ నోబెల్ ప్రసంగం
మయన్మార్ ప్రజాసామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ తన నోబెల్ శాంతి బహుమతి ప్రసంగాన్ని 21 ఏళ్ల తర్వాత జూన్ 16న ఇచ్చారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూకీ ప్రసంగిస్తూ.. ‘ఈ బహుమతి నన్ను ఒంటరితనం నుంచి బయటపడేసి, మానవ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఆనాటి జుంటా పాలనలోని బర్మాలో ప్రజాస్వామ్య, మానవ హక్కుల కోసం సాగిన పోరాటంపైకి ప్రపంచ దృష్టిని మళ్లించింది’ అని చెప్పారు. సూకీకి 1991లో నోబెల్ తి బహుమతి ప్రకటించారు. అప్పుడు ఆమె గృహనిర్బంధంలో ఉండడంతో..సూకీ తరఫున ఆమె భర్త మైఖేల్ అరిస్, కొడుకులు కిమ్, అలెగ్జాండర్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
అంతర్జాతీయం(07-13 జూన్)
బీజింగ్‌లో 12వ ఎస్‌సీఓ సదస్సు
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 12వ సదస్సు 2012 జూన్ 6,7 తేదీల్లో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగింది. ఈ సదస్సులో భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పాల్గొన్నారు. భారత్‌కు ఎస్‌సీవోలో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించాలని ఈ సందర్భంగా కృష్ణ విజ్ఞప్తి చేశారు. 2001లో ఏర్పడిన షాంఘై సహకార సంస్థలో చైనా, రష్యా, కజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్ పూర్తి స్థాయి సభ్యత్వం కలిగి ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, ఇరాన్, మంగోలియా దేశాలకు పరిశీలక హోదా ఉంది. శ్రీలంక, బెలారస్ దేశాలు చర్చల భాగస్వాములుగా ఉన్నాయి.
శుక్ర గ్రహం అంతర్యానం
సూర్యుని మీదుగా జూన్ 6న శుక్ర గ్రహం ప్రయాణించింది. సూర్యునిపై నల్లటి మచ్చలా శుక్ర గ్రహం భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. భూమికి, సూర్యుడికి మధ్య సరళరేఖపైకి శుక్ర గ్రహం రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సైన్స్ పరంగా చూస్తే ఈ ప్రక్రియ శుక్ర గ్రహణమే (అంతర్యానం). చివరి శుక్ర అంతర్యానం జూన్ 8, 2004లో ఏర్పడింది.
ఇలాంటి సంఘటనలు తిరిగి 105 సంవత్సరాల తర్వాత, ఎనిమిదేళ్ల వ్యవధిలో రెండుసార్లు (2117, 2125లలో) చోటు చేసుకుంటాయి. సాధారణంగా శుక్ర గ్రహం అంతర్యానం 121 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి, తర్వాత 105 సంవత్సరాలకు, తర్వాత ఎనిమిది సంవత్సరాలకు ఒక సారి సంభవిస్తుంది.
హతాఫ్-7ను పరీక్షించిన పాక్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హతాఫ్-7 అణు క్షిపణిని పాకిస్థాన్ జూన్ 5న విజయవంతంగా పరీక్షించింది. శత్రు రాడార్ల కళ్లుగప్పి తక్కువ ఎత్తులో దూసుకెళ్లే ఈ క్షిపణి సుమారు 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు కీలక ప్రాంతాలు హతాఫ్-7 పరిధిలోకి వస్తాయి. అగ్ని-5 ఖండాతర అణు క్షిపణిని భారత్ పరీక్షించిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్ ఐదు సార్లు వివిధ శ్రేణులకు చెందిన పలు రకాల హతాఫ్ క్షిపణులను పరీక్షించింది.
నోబెల్ అవార్డు నగదు తగ్గింపు
నోబెల్ బహుమతి కింద విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని 20 శాతం తగ్గించినట్లు జూన్ 11న నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది. 2001 నుంచి విజేతలకు కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.7.84 కోట్లు) చెల్లిస్తుండగా, 2012 నుంచి విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు(రూ.6.26 కోట్లు) చెల్లించనున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది. డైనమేట్ సృష్టికర్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట నోబెల్ అవార్డులను 1900లో ఏర్పాటు చేశారు. వైద్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రం వంటి రంగాల్లో కృషి చేసినవారికి వీటిని ప్రతి ఏటా ప్రదానం చేస్తారు.
అంతర్జాతీయం
ప్రధాని మయన్మార్ పర్యటన
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 27 నుంచి మూడు రోజుల పాటు మయన్మార్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు థీన్‌సీన్‌తో సమావేశమయ్యారు. ఇరువురు నేతల సమక్షంలో మే 28న రెండు దేశాల మధ్య పలు అంశాలకు సంబంధించి 12 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 500 మిలియన్ డాలర్ల రుణం, వాయు సేవలు, ఇరు దేశాల సరిహద్దు ప్రాంత అభివృద్ధి, ఉమ్మడి వాణిజ్యం, పెట్టుబడి ఫోరమ్ ఏర్పాటు, వ్యవసాయ పరిశోధన వంటి అంశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో మన్మోహన్ సింగ్ ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీతో కూడా సమావేశమయయ్యారు. గత 25 సంవత్సరాల్లో మయన్మార్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మన్మోహన్ సింగ్.
లైబీరియా మాజీ అధ్యక్షుడికి 50 ఏళ్ల జైలు శిక్ష
లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌కు లీడ్‌షెండమ్ (నెదర్లాండ్స్)లోని అంతర్జాతీయ యుద్ధ నేరాల కోర్టు మే 30న 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సరిహద్దు దేశం సియోర్రా లియోన్‌లో 1991-2001 మధ్య జరిగిన అంతర్యుద్ధం సందర్భంగా తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందించడంతోపాటు వారిని అమానుషకాండకు పురిగొల్పారన్న అభియోగాలపై ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 50 వేల మంది మరణించారు. రెబెల్స్‌కు ఆయుధాలిచ్చిన టేలర్ అందుకు ప్రతిగా వారి నుంచి బ్లడ్‌డైమండ్స్ (యుద్ధప్రాంతంలో తవ్వితీసిన వజ్రాలు)ను ముడుపులుగా తీసుకున్నారని ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని కోర్టు ధ్రువీకరించింది. నూరెంబర్గ్‌లో 1946లో నాజీల దురాగతాలపై విచారణ అనంతరం.. ఒక దేశ మాజీ అధ్యక్షుడిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో మళ్లీ విచారణ జరగడం ఇదే తొలిసారి.
స్పెల్లింగ్ బీ విజేత స్నిగ్ధ నందిపాటి
అమెరికాలో జరిగిన ‘స్పెల్లింగ్ బీ’ పోటీలో భారత సంతతి (ప్రవాసాంధ్ర కుటుంబానికి చెందిన) కి చెందిన స్నిగ్ధ నందిపాటి విజేతగా నిలిచింది. మే 31న జరిగిన పోటీలో చాలా కఠినమైన ఆంగ్లపదాలకు స్పెల్లింగ్‌ను చెప్పినందుకుగాను కాలిఫోర్నియాకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని స్నిగ్ధ ఈ ట్రోఫీని గెలుపొందింది. ఫ్రెంచ్ పదం గెటాపెన్స్ (జఠ్ఛ్ట్చఞ్ఛట)కు సరైన సమాధానం చెప్పడం ద్వారా ఈ విజయం సాధించింది.
హతాఫ్ క్షిపణిని పరీక్షించిన పాక్
అణ్వస్త్ర సామర్థ్యం గల హతాఫ్-8 క్రూయిజ్ క్షిపణిని పాకిస్థాన్ మే 31న విజయవంతంగా పరీక్షించింది. సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి పరిధిలో భారత్‌లోని పలు ప్రాంతాలు ఉన్నాయి.
మిడిల్ ఈస్ట్ లక్ష్యంగా ‘ప్లేమ్’ కంప్యూటర్ వైరస్
మిడిల్ ఈస్ట్ దేశాలైన ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, ఇరాన్, ఈజిప్టు, సూడాన్, సౌదీ అరేబియాలోని 5000 వరకు కంప్యూటర్లు ‘ప్లేమ్’ వైరస్ బారిన పడ్డాయి. 2010 లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు సోకిన ‘స్టుక్స్ నెట్’ కంటే ఇది 20 రెట్లు సంక్లిష్టమైంది. ఇది లక్ష్యంగా నిర్ణయించిన సంస్థల సమాచారాన్ని వివిధ రకాలుగా సేకరిస్తుంది. లోకల్ నెట్‌వర్క్ హార్డ్ డ్రైవ్‌లను స్కాన్, శబ్దాలను రికార్డు చేస్తుంది. బ్లూటూత్ ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను అందుకుంటుంది. సేవ్ చేసిన సమాచారాన్ని ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాల్లోని 80 సర్వర్లకు అందజేస్తుంది.
టమోటో జన్యు క్రమాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
టమోటో జన్యు క్రమాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బయోటెక్నాలజీలో అతి పెద్ద ముందడుగుగా దీన్ని భావిస్తున్నారు. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన సుమారు 300 మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. దీని వల్ల ఆవిష్కరణ ఖర్చు తగ్గడంతోపాటు వేగంగా ఉత్పత్తి సాధించేందుకు, చీడ పీడలను, కరువు తట్టుకునే టమోటో వంగడాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ ప్రయోగాలు ఇతర పంటల ఉత్పాదకతను కూడా పెంచేందుకు తోడ్పడుతాయి.
ముబారక్‌కు జీవిత ఖైదు
ఈజిప్టును మూడు దశాబ్దాలపాటు నిరంకుశంగా పాలించిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు న్యూకైరోలోని ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. తన పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమకారులను దారుణంగా చంపిన కేసులో ముబారక్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది. 2011 జనవరి, ఫిబ్రవరిలలో ముబారక్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో దాదాపు 850 మంది మరణించారు. కమాండర్‌గా కదనరంగంలో పోరాడిన ముబారక్ అంచెలంచెలుగా ఎదిగారు. 1981లో నాటి అధ్యక్షుడు సాదత్ హత్య తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రజా ఉద్యమాల ఫలితంగా గద్దెదిగారు.
AIMS DARE TO SUCCESS
జూలై 2012 అంతర్జాతీయం
తిరుగుబాటు వ్యతిరేక ఒప్పందంపై కాంగో, రువాండా సంతకాలు
తూర్పు కాంగోలో తిరుగుబాటు దళాలను తుదముట్టించేందుకు కాంగో, రువాండా దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కాంగో అధ్యక్షుడు జోసెఫ్ కబిలా, రువాండా అధ్యక్షుడు పౌల్ కగామే ఇతర నాయకులతో కలిసి జూలై 17న ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తూర్పు కాంగో ప్రాంతాల్లో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు అంతర్జాతీయ సైనిక దళం ఏర్పాటును ఈ ఒప్పందం సూచిస్తుంది.
తూర్పు కాంగో సరిహద్దు ప్రాంతాల్లో ‘తుత్సీ’ల నాయకత్వంలో ఎం 23 తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో ఇరుదేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. సరిహద్దు శత్రు దేశాలుగా కొనసాగిన కాంగో, రువాండా గతంలో యుద్ధానికి కూడా దిగాయి. తిరుగుబాటు దళాలకు తోడ్పడుతుందని పరస్పరం నిందించుకున్న రెండు దేశాలు నేడు తిరుగుబాటును అణచి వేసేందుకు చేతులు కలిపాయి.
డబ్ల్యూటీవోలో చేరికకు రష్యా ఆమోదం
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) లో చేరడానికి రష్యా ఎగువ సభ జూలై 18న ఆమో దం తెలిపింది. రష్యా డబ్ల్యూటీవోలో చేరికపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. గత 18 సంవత్సరాలుగా డబ్ల్యూటీవోలో రష్యా చేరికపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిగువసభ ‘డ్యూమా’ గత వారమే రష్యా చేరిక ఒప్పందానికి ఆమోదం తెలిపిం ది. ఈ బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయడమే మిగిలింది.
ఈ బిల్లు ఆమోదం పొందితే 30 రోజుల్లో రష్యా డబ్ల్యూటీవో సభ్యదేశమౌతుంది. డబ్ల్యూటీవోలో చేరిక వల్ల తయారీ రంగ పరిశ్రమ, వ్యవసాయ రంగం నాశనమవుతాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దిగుమతి సుంకాలు సరాసరి 9.56 శాతం నుంచి 2015 నాటికి ఆరు శాతానికి తగ్గించేందుకు రష్యా అంగీకరించిందని విమర్శకులు పేర్కొంటున్నారు.
హెచ్‌ఐవీ నివారణ మందుకు అమెరికా ఆమోదం
హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ వ్యాధి నివారణకు వాడే ‘తృవడా’కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ జూలై రెండో వారంలో ఆమోదం తెలిపింది. ఎయిడ్స్ వ్యాధి నివారణ మందుకు అమెరికా సంస్థ ఆమోదం తె లపడం ఇదే తొలిసారి. ‘గిలీడ్ సెన్సైస్’ సంస్థ తయారు చేసిన ఈ మందు 2004 నుంచి అందుబాటులో ఉంది. ఈ మందు వ్యాధి సోకకుండా నివారించేందుకు తోడ్పడుతుందని క్లినికల్ అధ్యయనాలు తెలిపాయి.
ప్రపంచంలో హెచ్‌ఐవీ బాధితులు 3.42 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు 3.42 కోట్లు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. 2011లో కొత్తగా 25 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకింది. భారత్‌లో 2000 నుంచి ఈ వ్యాధి సోకేవారి సంఖ్య సగానికి తగ్గిందని నివేదిక తెలిపింది.
12-18 జూలై 2012
అంతర్జాతీయం
జనాభా కార్యాచరణపై సదస్సు
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11న జనాభా కార్యాచరణపై జాతీ య సదస్సు జరిగింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జనసంఖ్య స్థిరత కోష్ ఈ సమావేశం నిర్వహి ంచింది. ‘‘టువర్‌డ్స ఎ బెటర్ టు మారో ’’ అనే ఇతివృత్తంతో జరిగిన సదస్సులో దేశ జనాభాను స్థిరీకరించేందుకు సంఘటిత కార్యాచరణకు పిలుపునిచ్చింది. కుటుంబ నియంత్రణను ముఖ్యంగా అత్యధిక ప్రాధాన్యత గల రాష్ట్రాల్లో పునరుద్ధరించడం, రాజకీయ నాయకులను, ఇతర మంత్రిత్వ శాఖలను భాగస్వామ్యం చేయ డం వంటి అంశాలను సదస్సు చర్చించింది.
ప్రపంచ తొలి తెలుగు చరిత్ర మహాసభలు
ప్రపంచ తొలి తెలుగు చరిత్ర మహాసభలు లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీలో జూలై 15న ముగిసాయి. రెండు రోజులు జరిగిన ఈ మహాసభలను లండన్‌లోని యునెటైడ్ కింగ్‌డమ్ తెలుగు సంఘం నిర్వహించింది. తెలుగుభాష, చరిత్ర, సాంస్కృతిక వికాసాలను భవిష్యత్తు తరాలకు అందించాలని, చరిత్ర పూర్వ యుగంలో తెలుగువారి ఉనికిపై పరిశోధనలు కొనసాగించాలని సదస్సు పిలుపునిచ్చింది. తెలుగు చరిత్రను పరిరక్షించేందుకు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సంస్థను ఏర్పాటు చేయాలని సదస్సు తీర్మానించింది.
ఏయూ కమిషన్ చైర్‌పర్సన్‌గా దామిని జూమా
ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) కమిషన్ ఛైర్‌పర్సన్‌గా దక్షిణాఫ్రికా హోంశాఖ మం త్రి కొనజానా దామిని జూమా (63) జూలె 15న ఎన్నికయ్యారు. ఈమె ఏయూ తొలి మహిళా నాయకురాలు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఈ పదవిని చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఎన్నికల్లో ఆమె గబాన్‌కు చెందిన జియన్ సింగ్‌పై విజయం సాధించింది. 54 ఆఫ్రికన్ యూనియన్ దేశాల్లో జూమాకు 37 ఓట్లు వచ్చాయి.
ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం
ద్వైపాక్షిక భద్రతా సహకార ఒప్పందంపై భారత్- మొజాంబిక్ దేశాలు జూలై 16న సంతకాలు చేసాయి. మొజాంబిక్ పర్యటనలో ఉన్న భారత హోంశాఖ సహాయమంత్రి ముల్లపల్లె రామచంద్రన్, మొజాంబిక్ ఇంటీరియల్ మంత్రి జోస్ మంద్రా ఇరుదేశాల మధ్య సహకారంతోపాటు ఉమ్మడి ప్రయోజనాలుగల వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అక్కడ కొన్ని దశాబ్దాలుగా 25,000 మంది భారత సంతతి వారు ఉన్నారు.
రచయిత స్టీపెన్ కోవె మృతి
ప్రముఖ ఆంగ్ల రచయిత కోవె (79) జూలె 16న సాల్టేలేక్ సిటీ సమీపాన ఇదాహాలో మరణించారు. ఆయన రాసిన సెవెన్ హ్యా బిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది, ఈ పుస్తకం 38 భాషల్లో 20 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయాయి
04-11 జూలై 2012
దైవకణాన్ని గుర్తించిన సెర్న్ శాస్త్రవేత్తలు
విశ్వంలోని పదార్థానికి ద్రవ్యరాశినిచ్చే ‘దైవకణాన్ని’ గుర్తించినట్లు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సెర్న్) శాస్త్రవేత్తలు జూలై 4న ప్రకటించారు. ఈ హిగ్స్‌బోసన్ ఉప పరమాణు కణాన్ని గుర్తించేందుకు 50 ఏళ్ల నుంచి పరిశోధన జరుగుతోంది. దీనివల్ల విశ్వంలోని ఇతర రహాస్యాలను కూడా కనుగొనేందుకు మార్గం ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ దైవ కణాన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దులో ఏర్పాటు చేసిన లార్జ్ హేడ్రెన్ కొలైడర్(ఎలెహెచ్‌సీ) ప్రయోగశాలలో కనుగొన్నారు. భూమికి లోపల 300 అడుగులు కింద 27 కిలో మీటర్ల భారీ గొట్టంలో ఈ ఎల్‌హెచ్‌సీని పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 21,000 కోట్లు ఖర్చుతో 2010 నుంచి పరిశోధనలు ప్రారంభించారు. ఈ ప్రయోగంలో 1200 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇందులో భారతీయులు 50 నుంచి 60 మంది ఉన్నారు. కొన్ని భారతీయ సంస్థలు కూడా ఈ పరిశోధనలకు తోడ్పడ్డాయి.
ఎల్‌హెచ్‌సీలో కాంతి వేగంతో రెండు ప్రోటాన్ పరమాణువులను ఢీ కొట్టించడం ద్వారా బిగ్‌బ్యాంగ్ తర్వాత ఏర్పడిన పరిస్థితులను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ ప్రక్రియలోనే దైవ కణాన్ని గుర్తించినట్లు సెర్న్ ప్రకటించింది.
హిగ్స్ బోసన్:
భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ పేరు నుంచి హిగ్స్ బోసన్‌లోని బోసన్ పేరును చేర్చారు. బోస్ ఐన్‌స్టీన్ సమకాలీకుడు. విశ్వంలోని ప్రతి దానికీ ద్రవ్యరాశి ఉంటుందని బోస్ పరిశోధనలు తెలియజేశాయి. హిగ్స్ అనేపదం బ్రిటీష్ శాస్త్రవేత్త పీటర్‌హిగ్స్ పేరులోంచి వచ్చింది. 1964లో హిగ్స్ మరో ఆరుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వం మొత్తం ఒక అదృశ్య శక్తి క్షేత్రం అవరించి ఉంటుందని ప్రతిపాదన చేశారు. ఆ క్షేత్రం చిన్న ప్రాథమిక కణాలతో వేర్వేరు శక్తులతో సంబంధాలేర్పరచుకుని ఉంటుందని పేర్కొన్నారు.
షహాబ్ క్షిపణిని పరీక్షించిన ఇరాన్
షహాబ్-3 బాలిస్టిక్ క్షిపణిని ఇరాన్ జూలై3న విజయవంతంగా పరీక్షించింది. గ్రేట్ ప్రొఫెట్-7 మూడు రోజుల విన్యాసాల్లో భాగంగా కావిక్ ఎడారిలో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ఈ పరీక్ష నిర్వహించింది. 2000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. దీంతోపాటు షహాబ్-1, షహాబ్-2 క్షిపణులను కూడా ఇరాన్ పరీక్షించింది. ఇవి రెండూ వరుసగా 300, 500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.
ఇండియన్ ముజాహిదీన్‌పై బ్రిటన్ నిషేధం
లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) పై నిషేధానికి సంబంధించిన ప్రతిపాదనకు బ్రిటన్ హౌస్ ఆఫ్ కామర్స్ జూలై 5న ఆమోదం తెలిపింది. బ్రిటన్ ఇప్పటివరకు నిషేధం విధించిన సంస్థల్లో ఐఎం 47వది. ప్రజలపై దాడులు చేయడంతోపాటు దీనివల్ల భారత్‌లోని బ్రిటన్ జాతీయులకు ప్రమాదం పొంచి ఉందని, భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష ్యంతో ముజాహిదీన్ పనిచేస్తోందని బ్రిటన్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ సంస్థపై ఇప్పటికే అమెరికా, న్యూజిలాండ్‌తోపాటు పలు దేశాలు నిషేధం విధించాయి. కాగా ఈ సంస్థపై భారత్‌లో 2010 నుంచి నిషేధం అమల్లో ఉంది.
పుకుషిమా ప్రమాదం మానవ తప్పిదమే
జపాన్‌లోని పుకుషిమా అణు కర్మాగార ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని.. ఈ దుర్ఘటనపై విచారణ నిర్వహించిన అత్యున్నత స్థాయి పార్లమెంటరీ విచారణ కమిషన్ జూలై 5న తెలిపింది. భూకంపాలు సంభవిస్తే తట్టుకునే స్థాయిలో అణు విద్యుత్ కేంద్రం లేదని పేర్కొంది.
ఈ విపత్తును ముందుగానే అంచనా వేసి, నివారించే అవకాశం ఉందని విచారణ కమిషన్ వాఖ్యానించింది. 2011 మార్చిలో సంభవించిన భారీ సునామీకి పుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం బాగా దెబ్బతింది. రియాక్టర్లు కరిగిపోయి రేడియేషన్ విస్తారంగా వెలువ డటంతో వేలాది మందిని ఆ ప్రాంతం నుంచి తరలించాల్సి వచ్చింది.
ఐరాస ప్రపంచ పెట్టుబడుల నివేదిక-2012
2011లో భారత్‌లోకి 32 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) వచ్చాయని ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్ (అంక్టాడ్) ప్రపంచ పెట్టుబడుల నివేదిక-2012 తెలిపింది. 2011 దక్షిణాసియా దేశాల్లోకి 39 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా అందులో భారత్‌కు 32 బిలియన్ డాలర్లు వచ్చాయని నివేదిక పేర్కొంది.
గత సంవత్సరంతో పోల్చితే 2011లో 23 శాతం ఎక్కువ ఎఫ్‌డీఐలు వచ్చాయి. భారత్ ఉత్తమ పనితీరు వల్లే దక్షిణాసియాకు పెట్టుబడులు పెరిగాయని అంక్టాడ్ నివేదిక తెలిపింది. భారత్- పాకిస్థాన్‌ల మధ్య మెరుగుపడుతున్న రాజకీయ సంబంధాలు కొత్త వ్యాపార అవకాశాలకు దారి తీస్తున్నాయని కూడా నివేదిక పేర్కొంది.
తూర్పు ఆసియా సదస్సు-విద్యా మంత్రుల సమావేశం
మొదటి తూర్పు ఆసియా సదస్సు- విద్యా మంత్రుల సమావేశం జూలై 5న ఇండోనేషియాలోని యోగ్యకర్తలో ముగిసింది. మూడు రోజులు జరిగిన ఈ సమావేశానికి భారత్ తరపున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డి.పురంధేశ్వరి హాజరయ్యారు. ‘ప్రాంతీయ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం’ ఏర్పాటు చేయాలని ఆమె ఈ సందర్భంగా ప్రతిపాదించారు. ఆసియన్ సభ్యదేశాల నుంచి, ఈ ప్రాంతంలోని ఇతర దేశాల నుంచి విద్యా మంత్రులు, ఉన్నత స్థాయి విద్యా అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
AIMS DARE TO SUCCESS
ఆగష్టు 2012 అంతర్జాతీయం
ఫోర్బ్స్ జాబితాలో మెర్కెల్‌కు మొదటి స్థానం
2012 సంవత్సరానికి ప్రపంచంలో శక్తివంతులైన మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఆగస్టు 22న విడుదల చేసింది. 100 మంది మహిళలతో కూడిన జాబితాలో జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌కు మొదటి స్థానం దక్కింది. గతేడాది ఆమె రెండోస్థానంలో ఉన్నారు. ద్వితీయస్థానంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ , తృతీయ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్‌కు ఏడోస్థానం దక్కింది.
ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోస్థానంలో నిలిచారు. గత సంవత్సరం ఈ జాబితాలో ఆమెకు ఏడోస్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఇంద్ర నూయీ(పెప్సీ కంపెనీ చైర్మన్) 12వ స్థానం, పదశ్రీ వారియర్ (సిస్కో సిస్టమ్స్ సీటీవో) 58వ స్థానం, చందా కొచ్చర్ (ఐసీఐసీఐ సీఈవో)59వ స్థానం, కిరణ్ మజుందార్‌షా(బయోకాన్ అధిపతి) 80వ స్థానంలో ఉన్నారు.
పాలపుంతను పోలిన జంట గెలాక్సీలు
అంతరిక్షంలో మన పాలపుంతను పోలిన జంట గెలాక్సీలను ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. పాలపుంత తరహా వర్తులాకారపు గెలాక్సీలు విశాల విశ్వంలో సర్వసాధారణంగా కనిపించేవే అయినా, తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లో మన పాలపుంత మాదిరి పోలికలు చాలా కనిపించాయి. ఈ జంట గెలాక్సీల్లోనూ పాలపుంత మాదిరిగానే ఉపగ్రహ కక్ష్యలూ, మగెలానిక్ మేఘాలూ ఉన్నాయి. పాలపుంతలో కనిపించే అతి అరుదైన మగెలానిక్ మేఘాలు తాజాగా గుర్తించిన జంట గెలాక్సీల్లోనూ కనిపిస్తున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ ఆరోన్ రాబోథమ్ చెప్పారు.
డబ్ల్యూటీవోలో చేరిన రష్యా
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లో రష్యా ఆగస్టు 22న చేరింది. 18 సంవత్సరాల చర్చల తర్వాత డబ్ల్యూటీవోలో రష్యా సభ్యత్వం పొందింది. గత జూలైలో రష్యా ఉభయ సభలు డబ్ల్యూటీవోలో చేరికకు ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు దిగుమతి సుంకాలు, సబ్సిడీలపై డబ్ల్యూటీవో ఆంక్షలు విధిస్తుంది. డబ్ల్యూటీవో చేరిక వల్ల తయారీ రంగం, వ్యవసాయ రంగం దెబ్బతింటాయని రష్యా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇథియోపియా ప్రధాని జెనావీ మృతి
ఇథియోపియా ప్రధాన మంత్రి మెలెస్ జెనావీ(57) అనారోగ్యంతో ఆగస్టు 21న మరణించారు. జెనావీ 1995 నుంచి ఇథియోపియా ప్రధానిగా ఉన్నారు. 1991లో నియంత కల్నల్ యెంగిస్లూ హైలే మారియ్ పాలన ముగియడంతో మెలెస్‌కు చెందిన ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జెనావీ 1995, 2000, 2005, 2010 ఎన్నికల్లో విజయం సాధించారు.
అమెరికా హైపర్ సోనిక్ విమాన పరీక్ష విఫలం
అమెరికా ప్రయోగించిన ‘ఎక్స్-51ఏ వేవ్ రైడర్’ అనే మానవ రహిత విమాన పరీక్ష విఫలమైంది. గంటకు 6,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు ఉద్దేశించిన ఈ విమాన పరీక్షను ఆగస్టు 14న నిర్వహించింది. స్కామ్ జెట్ ఇంజిన్‌తో నడిచే వేవ్ రైడర్ నియంత్రణ కోల్పోయి పసిఫిక్ మహాసముద్రంలో కూలింది.
AIMS DARE TO SUCCESS
సెప్టెంబరు 2012 అంతర్జాతీయం
అంధత్వ నివారణపై అంతర్జాతీయ సదస్సు
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (ఐఏసీబీ) తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ముగిసింది. కంటి ఆరోగ్య పరిరక్షణ, అంధత్వ నివారణకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని సదస్సు కోరింది. ఐక్యరాజ్య సమితి ‘విజన్ 2020’లో భాగంగా అంధత్వ నివారణపై తీసుకున్న చర్యల ప్రగతిని సదస్సు సమీక్షించింది. అంధత్వ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టే చర్యలకు ఐఏసీబీ సహకరిస్తుందని సదస్సు డిక్లరేషన్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్త అంధత్వ నివారణ సంస్థలు, పరిశోధన శాలలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ప్రపంచ హిందీ సదస్సు
తొమ్మిదో ప్రపంచ హిందీ సదస్సును జోహెన్నస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో సెప్టెంబర్ 22న భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్ కౌర్, దక్షిణాఫ్రికా ఆర్థిక మంత్రి ప్రవీణ్ గోవర్థన్ ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషకు ప్రాచుర్యం కల్పించేందుకు మూడు రోజులపాటు ఈ సదస్సు నిర్వహించారు. 1975లో తొలి సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేక హిందీ పుస్తకాలు, ప్రచురణలు ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా హిందీ మాట్లాడే వారి సంఖ్య 200 మిలియన్లని అంచనా. ప్రపంచంలో అధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటి.
వాల్దివోస్తోక్‌లో అపెక్ సదస్సు
రష్యాలోని వాల్దివోస్తోక్‌లో ఆసియా పసిఫిక్ దేశాల ఆర్థిక సహకార (అపెక్) గ్రూప్ సదస్సు సెప్టెంబర్ 8-9 తేదీల్లో జరిగింది. అపెక్ గ్రూపులోని 21 సభ్యదేశాల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థితి, ఆహార భద్రత, పెరుగుతున్న స్వీయ రక్షణ చర్యల పట్ల సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ‘గ్రీన్ టెక్నాలజీ’పై దిగుమతి సుంకం తగ్గింపు, వృద్ధిని పెంచేందుకు చర్యలు, యూరో రుణ సంక్షోభం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు వాణిజ్య సరళీకరణ వంటి చర్యలకు సదస్సు అంగీకరం తెలిపింది. ఎకో ఫ్రెండ్లీ పరికరాలైన సోలార్ బ్యాటరీస్, విండ్ టర్బైన్స్, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ టెక్నాలజీలపై సుంకాలను 2015 నాటికి 5 శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించాలని నిర్ణయించింది. 2013 అపెక్ సదస్సు ఇండోనేషియాలోని బాలీలో జరుగుతుంది.
సోమాలియా అధ్యక్షుడిగా హసన్
సోమాలియా నూతన అధ్యక్షుడిగా హసన్ షేక్ మొహముద్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 9 జరిగిన ఎన్నికల్లో 190 మంది పార్లమెం టు సభ్యులు హసన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మాజీ అధ్యక్షుడు షేక్ షరీఫ్ అహ్మద్‌కు 79 ఓట్లు మాత్రమే వచ్చాయి. హసన్ నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సోమాలియాలో 1991 నుంచి స్థిరమైన కేంద్రప్రభుత్వం ఏర్పాటు కాలేదు.
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు
69వ వె నిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను సెప్టెంబర్ 8న ప్రదానం చేశారు. వివరాలు..
ఉత్తమ చిత్రం (గోల్డెన్ లైన్ ప్రైజ్): ‘పీటా’, దర్శకత్వం కిమ్ కి డుక్ (దక్షిణ కొరియా)
ఉత్తమ దర్శకుడు (సిల్వర్ లైన్): పౌల్ థామస్ అండెర్సన్ (చిత్రం: ది మాస్టర్)
ఉత్తమ నటుడు: జాక్విన్ పోయినిక్స్, ఫిలప్ సేమౌర్
ఉత్తమ నటి: హదాస్ యారోన్ (ఇజ్రాయెల్)
చైనాలో నైరుతి ప్రాంతంలో భూకంపం
చైనాలో నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 7న సంభవించిన భారీ భూకంపం ధాటి కి 64 మంది మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.
స్పేస్ వాక్‌లో సునీత రికార్డు
భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అత్యధిక సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. సెప్టెంబర్ 5న ఆమె ఆరో స్పేస్ వాక్‌తో 44 గంటల 2 నిమిషాలు పూర్తి చేశారు. ఈ వాక్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేశారు. గతంలో పెగ్గీ విట్సన్ పేరుతో 39గంటల 46 నిమిషాలు ఉన్న స్పేస్ వాక్ రికార్డును సునీతా విలియమ్స్ అధిగమించారు.
ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బసు
భారత్‌కు చెందిన ఆర్థిక వేత్త కౌశిక్ బసు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకానమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సెప్టెంబర్ 5న నియమితులయ్యారు. జస్టిస్ యుపు లిన్ స్థానంలో నియమితులైన బసు అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. బసు ఇటీవల భారత ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
నామ్ సదస్సు
అలీనోద్యమం(నామ్) 16వ సదస్సు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆగస్టు 31న ముగిసింది. అధ్యక్ష బాధ్యతలను ఈజిప్టు నుంచి ఇరాన్ ఈ సందర్భంగా స్వీకరించింది. ఈ సదస్సు తర్వాత విడుదల చేసిన డిక్లరేషన్‌లో శాంతికి అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. పాల్గొన్న దేశాలన్నీ ఏకగ్రీవంగా నామ్ ఆశయాలు, లక్ష్యాల పట్ల తమ నిబద్ధత ను వ్యక్తం చేశాయి.
సరియా సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని సదస్సు కోరింది. విదేశీ జోక్యాన్ని వ్యతిరేకించింది. పాలస్తీనీయుల పట్ల సంఘీభావాన్ని సదస్సు వ్యక్తం చేసింది. ఆహార భద్రత, పేదరికంపై పోరు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థపై వ్యాధుల, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వంటి అంశాలను సదస్సులో చర్చించారు.
తీవ్రవాద వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం, ధనిక-పేద, పేద-పేద దేశాల సహకారం వంటి అంశాలను కూడా సదస్సులో చర్చించారు. భారత్ తరఫున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆగస్టు 30-31న రెండు రోజులుపాటు జరిగిన ఈ సదస్సులో 118 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అజర్‌బైజాన్ రిపబ్లిక్, ఫిజి కొత్త సభ్యులుగా నామ్‌లో చేరాయి. 2012 నాటికి 120 దేశాలు సభ్యదేశాలుగా, 17 దేశాలు పరిశీలక హోదాను కలిగి ఉన్నాయి. అంతకుముందు నాలుగు రోజులు పాటు అధికారుల, మంత్రుల సమావేశాలు జరిగాయి. 17వ నామ్ సదస్సు 2015లో వెనెజులాలో జరుగుతుంది.
1961లో నాటి యుగోస్లేవియాలో అలీనోద్యమం ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలోని మూడింట రెండు వంతుల దేశాలకు నామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది, ప్రపంచ జనాభాలో 55 శాతం మంది ప్రజలు నామ్ దేశాల్లో నివసిస్తున్నారు.
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
ఖండాంతర క్షిపణి ‘డాంగ్‌ఫెంగ్-41’ని గత నెలలో పరీక్షించినట్లు చైనా ఆగస్టు 28న ప్రకటించింది. ఈ క్షిపణి 14,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ఖండాలను చేరుకోగలదు. 10 అణ్వాయుధాలను మోసుకుపోగలదు. ఇది చైనా రూపొందించిన మూడో తరం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. భారత్ తన ఖండాంతర క్షిపణి ‘అగ్ని-5ను ఏప్రిల్‌లో పరీక్షించింది. ఇది 5,000 కిలోమీటర్లు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఉత్తరకొరియాలో తైఫూన్‌బలవెన్
ఉత్తరకొరియాలో ‘తైఫూన్‌బలవెన్’ తుపాను వల్ల ఆగస్టు 28న 15 మంది మరణించారు. దీనివల్ల పంటలు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి.
అమెరికాలో ఐసాక్ తుపాను: ఆగస్టు 28న అమెరికాలో సంభవించిన ‘ఐసాక్’ తుపాను వల్ల అనే క ప్రాంతాలు దెబ్బతిన్నాయి. న్యూ ఒర్లీన్స్, మిసిసిపి, లూసియానాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఏడేళ్ల క్రితం అమెరికా గల్ఫ్ తీరంలో సంభవించిన హరికేన్ కత్రినా వల్ల 1800 మంది మరణించారు.
సిద్ధార్థ దేవ్‌కు అమెరికా సాహిత్య అవార్డు
భారతీయ రచయిత సిద్ధార్థ దేవ్‌కు అమెరికా సాహిత్య పురస్కారం ‘పెన్ ఓపెన్ బుక్’ అవార్డు లభించింది. ‘ద బ్యూటిఫుల్ అండ్ ది డామ్డ్: ఏ పోట్రెయెట్ ఆఫ్ ది న్యూ ఇండియా’ అనే నాన్-ఫిక్షన్ పుస్తకం రాసినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అధిక జీతాలు పుచ్చుకునే కాల్ సెంటర్ ఉద్యోగుల నుంచి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల దాకా పలు వర్గాల ప్రజల జీవితాల గురించి ఆయన చక్కగా వివరించారని కొనియాడారు. ‘పెన్’ అవార్డు కింద 5 వేల డాలర్ల నగదు బహుమతి ఇస్తారు.
సింగపూర్ సీజేగా భారత సంతతి జడ్జి
సింగపూర్ కొత్త ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా భారత సంతతికి చెందిన జడ్జి సుందరేశ్ మీనన్ నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి సింగపూర్‌లో ఈ అత్యున్నత పదవిని చేపట్టడం తొలిసారి. ప్రస్తుతం సింగపూర్ అప్పీల్ జడ్జిగా ఉన్న మీనన్ నవంబర్ 6న కొత్త బాధ్యతలు చేపడతారు.
AIMS DARE TO SUCCESS
అక్టోబరు 2012 అంతర్జాతీయం
ఆసియాలోనే పెద్ద రేడియో టెలిస్కోప్ ను ఆవిష్కరించిన చైనా
ఉపగ్రహాలు, అంతరిక్షానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే పెద్ద రేడియో టెలిస్కోప్‌ను చైనా ఆవిష్కరించింది. 65 మీటర్ల వ్యాసం కలిగిన, ఆసియాలో పెద్దదైన ఈ టెలిస్కోప్‌ను షాంఘైలో ఏర్పాటు చేశారు. ఇందులో ఎనిమిది ఫ్రీక్వెన్సీ బాండ్లు ఉంటాయి.
హిల్లరీ మాంటెల్‌కు మ్యాన్ బుకర్ ప్రైజ్
బ్రిటిష్ నవలా రచయిత్రి హిల్లరీ మాంటెల్ (60)కు 2012 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘మాన్ బుకర్ ప్రైజ్’ను లండన్‌లో అక్టోబర్ 17న బహూకరించారు. మాంటెల్‌కు బహుమతి కింద 50,000 పౌండ్లు (రూ.40 లక్షలు) లభించాయి. చారిత్రక నవల ‘బ్రింగ్ ఆఫ్ ద బాడీస్’కుగాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. బ్రిటిష్ చరిత్రకు చెందిన అంశాన్ని ఈ నవలలో ఆవిష్కరించారు. మూడేళ్లలో ఆమెకిది రెండో మ్యాన్ బుకర్ ప్రైజ్. కాల్పనిక సాహిత్యంలో ఈ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న తొలి మహిళగా, తొలి బ్రిటిష్ రచయితగా ఆమె చరిత్ర సృష్టించారు. గతంలో ఆస్ట్రేలియా రచయిత పీటర్ కారే(1988, 2001), దక్షిణాఫ్రికా రచయిత జె..ఎం.కొయిట్టీ(1983, 1999)లు రెండు సార్లు ఈ అవార్డు అందుకున్నారు.
కంబోడియా మాజీ రాజు షిహనౌక్ మృతి
కంబోడియా దేశ మాజీ రాజు నరోడమ్ షిహనౌక్ (89) అక్టోబర్ 15న ఫోమ్‌ఫెన్‌లో మరణించారు. ఆయన 1941లో సింహాసనం అధిష్టించి 2004లో అనారోగ్యంతో అధికారం నుంచి వైదొలిగారు. 1953లో ఫ్రాన్స్ నుంచి కంబోడియా పూర్తి స్వాతంత్య్రం పొందేందుకు షిహనౌక్ కృషి చేశారు.
మాలీలో సైనిక చర్యకు భద్రతా మండలి ఆమోదం
మాలీ ఉత్తర ప్రాంతంలోని ఇస్లామిక్ తిరుగు బాటుదారుల అణచివేతకు సైనిక చర్య చేపట్టేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అక్టోబర్ 13న ఆమోదం తెలిపింది. సైనిక చర్యపై 45 రోజుల్లోపు సవివరమైన ప్రణాళికను అందజేయాలని ఆఫ్రికన్ సంస్థలను భద్రతా మండలి కోరింది. మాలీ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సమన్వయ సహకారాలందించాలని కూడా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను, ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలను భద్రతా మండలి కోరింది. మాలి ఉత్తర ప్రాంతంలోని ఇస్లామ్ గ్రూపులు, తురెగ్ తిరుగుబాటుదారులు ఉత్తర ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గత మార్చిలో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించారు. అప్ప టి నుంచి మాలీ ప్రభుత్వం, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ సంస్థ ‘ఏకోవాజ్’ అంతర్జాతీయ దేశాల జోక్యానికి భద్రతా మండలి ఆమోదం తెలపాలని కోరుతున్నాయి.
వెనెజులా అధ్యక్షుడిగా ఛావెజ్ తిరిగి ఎన్నిక
వెనెజులా అధ్యక్షుడిగా హ్యుగో ఛావెజ్ తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబర్ 8న ప్రకటించిన అధ్యక్ష ఎన్నికల్లో ఛావెజ్‌కు 54.42 శాతం ఓట్లు వచ్చాయి. అక్టోబర్ 7న జరిగిన ఓటింగ్‌లో 19 మిలియన్ల వెనెజులా ఓటర్లు పాల్గొన్నారు. ఛావెజ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ఈ విజయంతో 2013 జనవరి నుంచి మరో ఆరేళ్లపాటు అధ్యక్షుడిగా ఛావెజ్ కొనసాగుతారు.
శాంతి ఒప్పందానికి ఎంఎల్‌ఎఫ్ అంగీకారం
ఫిలిప్పైన్స్ ప్రభుత్వంతో శాంతి ప్రణాళికకు ముస్లిం తిరుగుబాటు గ్రూపు మరో ముస్లిం లిబరేషన్ ఫ్రంట్ అంగీకరించింది. ఈ ప్రణాళికను ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు బెనెగ్నో అక్వినో అక్టోబర్ 7న ప్రకటించారు. దీంతో దశాబ్దం నుంచి కొనసాగుతున్న వేర్పాటు పోరాటం ముగియనుంది. ఈ తిరుగుబాటులో ఒక లక్ష యాభై వేల మంది మరణించారు. ఈ ఒప్పందం ప్రకారం ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతం ‘మిండనావో’కు అర్ధ స్వయం ప్రతిపత్తిని కల్పిస్తారు. ఈ ప్రాంతం స్వయంప్రతిపత్తి కోసం 1970 నుంచి పోరాడుతున్నారు.
కువైట్ పార్లమెంట్ రద్దు
కువైట్ పార్లమెంటును రద్దు చేస్తూ రాజు షేక్ నబాహ్ అల్ అహ్మద్ అల్ నబాహ్ అక్టోబర్ 7న డిక్రీ జారీ చేశారు. కువైట్ రాజ్యాంగం ప్రకారం 60 రోజుల్లో (డిసెంబర్ 7 లో పు) సాధారణ ఎన్నికలు నిర్వహించాలి. 50 మంది సభ్యులున్న పార్లమెంటు రద్దుతో ఈ ఏడాది రెండోసారి మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2009 ఎన్నికల్లో ఏర్పడిన పార్లమెంటులోని కొందరు ఎంపీలపై ఆరోపణలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఇస్లామిస్టుల నేతృత్వంలోని పార్టీ ఎన్నికను రాజ్యాంగ కోర్టు రద్దు చేసి 2009 నాటి పార్లమెంట్‌ను పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని నిరసిస్తూ సమావేశాల బహిష్కరణ, దేశవ్యాప్త నిరసనలతో పార్లమెంట్‌ను రద్దు చేయాలని కేబినెట్ కూడా సిఫార్సు చేసింది.
విమాన వాహక నౌక ‘లియోనింగ్’
చైనా మొదటి విమాన వాహక నౌక ‘లియోనింగ్’ను సెప్టెంబర్ 25న లాంఛనంగా ప్రారంభించింది. 1998లో ఉక్రెయిన్ నుంచి పొందిన ‘వార్‌యాంగ్’ విమాన వాహక నౌకను చైనా పూర్తి సామర్థ్యంతో నిర్మించి లియోనింగ్‌గా పేరు పెట్టింది. దీంతో చైనా నౌకా దళ సామర్థ్యం బాగా పెరుగుతుంది. సంప్రదాయేతర ప్రమాదాలనే కాకుండా ప్రకృతి విపత్తులపై ప్రతిస్పందించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది.
నార్వే మంత్రిగా పాక్ సంతతి మహిళ
నార్వే సాంస్కృతిక శాఖ మంత్రిగా పాకిస్థాన్ సంతతికి చెందిన హదియా తజిక్(29) ను ఆ దేశ ప్రధానమంత్రి జీన్స్ స్టోల్‌టెన్‌బెర్గ్ సెప్టెంబర్ 24న నియమించారు. నార్వేలో ఈమె మొదటి ముస్లిం మహిళే కాకుండా అత్యంత పిన్న వయసు కలిగిన మంత్రి.
లాహోర్ కూడలికి భగత్ సింగ్ పేరు
అవిభాజ్య భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిషర్లపై వీరోచితంగా పోరాడిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ గుర్తుగా పాకిస్థాన్ ఆ దేశంలోని లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌కు భగత్‌సింగ్ చౌక్‌గా పేరు పెట్టింది. 1931 మార్చిలో భగత్‌సింగ్‌ను ఉరితీసిన నాటి లాహోర్ జైలు ఉన్న ప్రదేశంలోనే ప్రస్తుత కూడలిని నిర్మించారు.
సూకీకి అమెరికా వర్సిటీ డాక్టరేట్
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీకి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ సెప్టెంబర్ 29న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఐరాస సదస్సులో హర్‌దీప్ ప్రసంగం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో న్యాయ పాలనపై ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 67వ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భారత్ తరఫున యూఎన్‌లో భారత్ శాశ్వత ప్రతినిధి హర్‌దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. సెప్టెంబర్ 25న సదస్సులో ప్రసంగిస్తూ సంక్షోభ సమయాల్లో ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ అనధికార జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని సూచించారు.
AIMS DARE TO SUCCESS
నవంబరు 2012 అంతర్జాతీయం
చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్
చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మిలిటరీ కమిషన్ అధిపతిగా జీ జిన్‌పింగ్ నవంబర్ 15న బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుత అధ్యక్షుడు హూ జింటావో స్థానంలో 2013 మార్చిలో దేశాధ్యక్ష పగ్గాలు చేపడతారు. 10 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఈయన ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఉపప్రధాని లీ కెకియాంగ్ కూడా వచ్చే ఏడాది మార్చిలో వెన్‌జియాబావో స్థానంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీరిస్తారు. 1949లో అధికారానికి వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీలో ఇది ఐదో తరం నాయకత్వం. చైనా కమ్యూనిస్టు పార్టీ విధానాల ప్రకారం ప్రతీ పదేళ్లకు సీనియర్ నాయకులు పదవుల నుంచి తప్పుకొని కొత్త నాయకత్వానికి చోటిస్తారు. ప్రస్తుతం ఎన్నికైన నేతలు పార్టీ బాధ్యతలను నవంబర్ 15 నుంచి స్వీకరించారు. ప్రభుత్వ పరమైన బాధ్యతలను మాత్రం వచ్చే ఏడాది మార్చిలో జరిగే జాతీయ ప్రజామహా సభల్లో (పీపుల్స్ కాంగ్రెస్) స్వీకరిస్తారు.
వర్డ్ ఆఫ్ ది ఇయర్ ‘ఆమ్నిషాంబుల్స్’
‘ఆమ్నిషాంబుల్స్ (omnishambles)' అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. అత్యంత గందరగోళంగా, అసమర్థంగా నిర్వహించిన పరిస్థితిని అభివర్ణించడానికి బీబీసీ టెలివిజన్ ఈ పదాన్ని ఖాయం చేసింది. బీబీసీ టీవీ కార్యక్రమం ‘ది తింక్ ఆఫ్ ఇట్’లో ప్రభుత్వపరమైన కొన్ని పొరపాట్ల నుంచీ లండన్ ఒలింపిక్స్ సన్నాహాలకు సంబంధించిన సంక్షోభ పరిస్థితుల వరకూ వివిధ పరిణామాలను ఒక్క ముక్కలో అభివర్ణించేందుకు ‘ఆమ్నిషాంబుల్స్’ అనే పదాన్ని విస్తృతంగా వాడారు. ఆంగ్ల భాషలో చోటు చేసుకునే మార్పు చేర్పులను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అనంతరం అప్పటి పరిస్థితులకనుగుణంగా ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేస్తుంది.
సిరియా ప్రతిపక్ష గ్రూప్‌నకు జీసీసీ గుర్తింపు
సిరియా ప్రతిపక్షానికి చెందిన జాతీయ సంకీర్ణాన్ని.. ఆ దేశ ప్రజల చట్టబద్ధమైన ప్రతినిధిగా గుర్తిస్తున్నట్లు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నవంబర్ 13న ప్రకటించింది. నూతన సంకీర్ణం నవంబర్ 12న ఏర్పాటైంది. సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అస్సాద్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఖతర్ రాజధాని దోహలో జరిపిన చర్చల తర్వాత కొత్త సంకీర్ణం ఏర్పాటైంది. జీసీసీలో సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతర్, కువైట్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
నవంబర్ 10 ‘మలాలా డే’
పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జై గౌరవార్థం నవంబర్ 10ని ‘మలాలా డే’గా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు. చదువు కోసం పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యాహక్కుకు ప్రతినిధిగా మారిందని కూడా మూన్ ప్రశంసించారు. బాలికల చదువు కోసం ప్రచారం చేస్తున్న మలాలాపై గత నెలలో పాకిస్థాన్‌లో తాలిబన్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం మలాలా బ్రిటన్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఫోర్బ్స్ విద్యారంగ ఇన్నోవేటర్స్‌లో భారతీయులు
వినూత్నమైన టెక్నాలజీలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న 15 మందితో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఇద్దరు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. చౌక ట్యాబ్లెట్ పీసీలు ఆకాశ్ తయారీ సంస్థ డేటావిండ్ సీఈవో సునీత్‌సింగ్ టులి, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ అనంత్ అగర్వాల్ వీరిలో ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఒబామా ఎన్నిక
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో.. బరాక్ ఒబామా (డెమోక్రటిక్ పార్టీ) తిరిగి రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మిట్ రోమ్నీపై ఆయన విజయం సాధించారు. ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 538 ఓట్లలో అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు కనీసం 270 ఓట్లు అవసరం. కాగా, ఒబామాకు 332, రోమ్నీకి 206 ఓట్లు లభించాయి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం బిల్ క్లింటన్ తర్వాత వరుసగా రెండోసారి పదవి దక్కించుకున్న డెమోక్రటిక్ అభ్యర్థి ఒబామా.
బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్ తర్వాత వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనతను కూడా ఒబామా దక్కించుకున్నారు. 2013 జనవరిలో రెండో విడత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒబామా తొలిసారి 2008 నవంబర్‌లో అధ్యక్షుడి(44వ)గా ఎన్నికయ్యారు. ఆయన అసలు పేరు బరాక్ హుసేన్ ఒబామా జూనియర్. 1961 ఆగస్ట్ 4న హవాయిలోని హొనొలులులో జన్మించారు. ఆయన తల్లి అమెరికాకు చెందిన శ్వేత జాతీయురాలు ఆన్ డన్హామ్. తండ్రి కెన్యాలో జన్మించిన బరాక్ ఒబామా సీనియర్. ఒబామా 2009లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
రిమ్ విదేశాంగ మంత్రుల సమావేశం
హిందూ మహాసముద్ర తీర ప్రాంతానికి చెందిన.. ఓసియన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (ఐఓఆర్-ఎఆర్‌సి) దేశాల విదేశాంగ మంత్రుల 12వ సదస్సు న్యూఢిల్లీలో నవంబర్ 2న ముగిసింది. ఇందులో సముద్ర భద్రత మత్స్య సంపద నిర్వహణ, వాణిజ్యం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ వంటి అంశాలను చర్చించారు. అమెరికాను ఆరో చర్చల భాగస్వామిగా ఈ సమావేశంలో చేర్చుకున్నారు. చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జపాన్, యూకే దేశాలు ఇప్పటికే చర్చల భాగస్వాములుగా ఉన్నాయి. ప్రాంతీయంగా ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు మారిషస్‌లో 1997లో ఆస్ట్రేలియా, ఇండియా, కెన్యా, ఓమన్, సింగపూర్, దక్షిణాఫ్రికా దేశాలు ఐఓఆర్-ఎఆర్‌సిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇందులో 19 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. హిందూ మహాసముద్రం నుంచి 70 శాతం పెట్రోలియం ఉత్పత్తుల రవాణా జరుగుతుంది. ప్రపంచంలో సగం కంటైనర్ ట్రాఫిక్ ిహిందూ మహాసముద్రం ద్వారానే సాగుతుంది.
లండన్‌లో భారత సంతతి గూఢచారి విగ్రహం
భారత సంతతికి చెందిన గూఢచారి యువరాణి నూర్ ఇన్యాత్ ఖాన్ విగ్రహాన్ని నవంబర్ 8న లండన్‌లో ఆవిష్కరించనున్నారు. ఒక ముస్లిం లేదా ఆసియాకు చెందిన ఒక మహిళకు బ్రిటన్‌లో స్మారకాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. నూర్ 1914లో మాస్కోలో జన్మించారు. అక్కడి వారి కుటుంబం లండన్‌కు చేరింది. నూర్ తండ్రి భారతీయుడు, తల్లి అమెరికన్. 1940లో ఆమె మహిళా అనుబంధ వైమానిక దళంలో చేరారు. 1942లో విన్స్‌టన్ చర్చిల్‌కు చెందిన రహస్య దళం స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. నాజీలకు రహస్యాలు వెల్లడించని కారణంగా నిర్బంధించి 1944లో దచావులోని కాన్‌సెన్ ట్రేషన్ క్యాంప్‌లో కాల్చి చంపారు. మరణానంతరం ఈమెకు జార్జి క్రాస్ పురస్కారం, ఫ్రాన్స్ ప్రభుత్వ క్రాయిక్స్ డి గ్యుర్రె అవార్డులు లభించాయి.
AIMS DARE TO SUCCESS
డిసెంబరు 2012 అంతర్జాతీయం
చిట్టచివరి సంచికను ప్రచురించిన ‘న్యూస్‌వీక్’
అమెరికన్ వారపత్రిక ‘న్యూస్‌వీక్’ పాతకాలం నాటి ‘న్యూస్‌వీక్’ భవనం తెలుపు నలుపు చిత్రంతో ముద్రించిన తన చిట్టచివరి సంచికను 2012, డిసెంబర్ 24న విడుదల చేసింది. ‘న్యూస్‌వీక్’ తన తదుపరి సంచికలను ఎలక్ట్రానిక్ సంచికలుగానే తీసుకురానుంది.
జపాన్ కొత్త ప్రధానిగా షింజో అబే
జపాన్ కొత్త ప్రధానిగా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత షింజో అబే 2012, డిసెంబర్ 26న ఎన్నికయ్యారు. ఇందుకోసం పార్లమెంటు దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో అబేకు 328 ఓట్లు, డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్(డీపీజే) నేత బన్రీ కెయిడాకు 57 ఓట్లు వచ్చాయి. అబే 2006-09 మధ్య ప్రధానిగా పని చేశారు.
ఈజిప్టుకు తొలి ప్రజామోద రాజ్యాంగం
ఈజిప్టుకు తొలి ప్రజామోద రాజ్యాంగం లభించింది. ఇందుకోసం జరిగిన రెఫరెండంలో కొత్త రాజ్యాంగానికి ప్రజలు ఆమోదం తెలిపారు. గతేడాది డిసెంబర్ 15, 22న రెండు దశలుగా నిర్వహించిన రెఫరెండంలో మూడింట రెండు వంతుల మంది ఓటర్లు దీనికి మద్దతు ప్రకటించారు. ఫలితాల అనంతరం అధ్యక్షుడు ముర్సీ కొత్త రాజ్యాంగాన్ని చట్టంగా చేస్తూ డిసెంబర్ 25న డిక్రీపై సంతకం చేశారు.
మాలీ ప్రధాని అరెస్ట్
మాలీ ప్రధానమంత్రి చేయిక్ మోడిబో డయారాను డిసెంబర్ 11న ఆ దేశ సైనికులు అరెస్ట్ చేశారు. రాజీనామాకు డిమాండ్ చేశారు. దీంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలో వేర్పాటువాదంతో సంక్షోభం నెలకొంది. గత మార్చిలో సైన్యం తిరుగుబాటు చేయడంతో ఇస్లామిస్ట్ గ్రూపులు, సెక్యులర్ తురెగ్ తిరుగుబాటుదారులు ఉత్తర మాలీని ఆక్రమించారు.
జపాన్ ఎన్నికల్లో షింజో అబే విజయం
జపాన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) విజయం సాధించింది. డిసెంబర్ 17న ప్రకటించిన ఫలితాల్లో విజయం సాధించిన ఆ పార్టీ నాయకుడు షింజో అబే ప్రధానమంత్రి కానున్నారు. ప్రస్తుత ప్రధాని యోషిహికో నోడాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (డీపీజే) ఓడిపోయింది. ఎల్‌డీపీ 1955 నుంచి 2009 వరకు నిరంతరంగా జపాన్‌ను పాలించింది. 2009 ఎన్నికల్లో డీపీజే చేతిలో ఓడిపోయింది.
యుఎన్ టెలికమ్యూనికేషన్ ఒప్పందం
ఐక్యరాజ్యసమితి టెలికమ్యూనికేషన్ ఒప్పందంపై దుబాయ్‌లో డిసెంబర్ 14న సంతకాలు జరిగాయి. దుబాయ్‌లో డిసెంబర్ 3 నుంచి జరిగిన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై 89 దేశాలు సంతకాలు చేయగా, మరో 55 దేశాలు ఒప్పందాన్ని తిరస్కరించాయి. ఈ ఒప్పందం వల్ల సంతకాలు చేసిన దేశాలకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ సర్వీసులు పొందే హక్కు లభిస్తుంది. ఇంటర్నేషనల్ రేటింగ్, గ్లోబల్ క్యారియర్స్ మధ్య చార్జీలు, ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్ మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఒప్పందం సూచిస్తుంది.
‘మలాలా’ నిధి ఏర్పాటు
పాకిస్థాన్‌లో ఇటీవల తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ ఆస్పత్రిలో కోలుకుంటున్న హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ (15) పేరిట నిధి ఏర్పాటైంది. పాకిస్థాన్, యునెస్కోలు సంయుక్తంగా ఈ నిధిని ఏర్పాటు చేశాయి. దీని ద్వారా వచ్చే సొమ్మును పాకిస్థాన్ సహా ఇతర దేశాల్లోని బాలికల విద్య కోసం వినియోగించనున్నారు.
రాకెట్‌ను పరీక్షించిన ఉ.కొరియా
ఉత్తర కొరియా డిసెంబర్ 12న దీర్ఘశ్రేణి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ‘క్వాంగ్‌మియోంగ్‌సాంగ్-2’ రెండో వెర్షన్ ఉపగ్రహాన్ని సోహే అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ వార్తాసంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ ప్రయోగాన్ని ఉత్తర కొరియా పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌తోపాటు అమెరికా, రష్యా, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. ఈ ప్రయోగం కొరియా ద్వీపకల్పంలో అస్థిరత్వానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగం అవాంఛనీయమని, దాని వల్ల కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరత్వానికి విఘాతం కలుగుతుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ రాకెట్ ప్రయోగం భద్రతా మండలి తీర్మానానికి విరుద్ధమని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్ పేర్కొన్నారు.
టాప్-20 శక్తిమంతుల్లో సోనియా, మన్మోహన్
ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల వార్షిక జాబితాలో ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ టాప్-20లో నిలిచారు. సోనియా ఈసారి గతేడాది కంటే కాస్త తక్కువగా 12వ ర్యాంకుతో సరిపెట్టుకున్నారు. గతేడాది 19వ ర్యాంకులో నిలిచిన మన్మోహన్ 2012లో 20కి పడిపోయారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (51)కే శక్తిమంతుల జాబితాలో అగ్రస్థానం దక్కింది. గతేడాది నాలుగో స్థానంలో నిలిచిన జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (58) ఈసారి రెండో స్థానానికి ఎగబాకారు. మొత్తం 71 మందితో కూడిన జాబితాలో భారత్‌లో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీకి 37వ స్థానం దక్కింది.
టీఐ జాబితాలో భారత్‌కు 94వ స్థానం
ప్రపంచంలో అతి తక్కువ అవినీతి గల దేశాలుగా డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ నిలిచాయి. జర్మనీకి చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) డిసెంబర్ 5న విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఈ జాబితాలో భారత్ 94వ స్థానంలో నిలిచింది. టీఐ ప్రతి ఏడాది ప్రపంచ దేశాలకు అవినీతిలో రేటింగ్ ఇస్తుంది. ఆయా దేశాల్లోని ప్రభుత్వ విధానాలను పరిశీలించి ఈ రేటింగ్‌ను కేటాయిస్తుంది. ఈ క్రమంలో 100 మార్కులకు సర్వే నిర్వహిస్తుంది. ఇందులో ఎక్కువ మార్కులు సాధించిన దేశంలో అవినీతి తక్కువ ఉన్న దేశంగా రేటింగ్ టీఐ రేటింగ్ ఇస్తుంది. ఈ ఏడాది 176 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 90 మార్కులతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ 90 మార్కులతో అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. భారత్ 36 మార్కులతో 94వ స్థానంలో నిలిచింది. అమెరికా 19వ , శ్రీలంక 79వ, చైనా 80వ స్థానాలను దక్కించుకున్నాయి. గతేడాది ఈ జాబితాలో భారత్ 95వ స్థానంలో నిలిచింది.
గ్లోబల్ టై ఇండెక్స్
ఉగ్రవాదం బాధిత దేశాల జాబితా గ్లోబల్ టై ఇండెక్స్ (జీటీఐ)లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ 158 దేశాలతో కూడిన ఈ జాబితాను డిసెంబర్ 4న విడుదల చేసింది. ఇందులో ఇరాక్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఉగ్రవాదుల దాడుల సంఖ్య, ఉగ్రవాదం వల్ల సంభవించిన మరణాలు-గాయపడిన వారి సంఖ్య, ఆస్తుల నష్టం వంటి వాటి ఆధారంగా ఈ జీటీఐ జాబితాను రూపొందించారు.
‘హతాఫ్-5’ను పరీక్షించిన పాకిస్థాన్
అణ్వస్త్ర సామర్థ్యం గల మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి
‘హతాఫ్-5’ను పాకిస్థాన్ నవంబర్ 28న విజయవంతంగా పరీక్షించింది. ఇది 1,300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని సుదూర ప్రాంతాలకూ చేరుకోగలదు. హతాఫ్-5ను ‘ఘోరి’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ద్రవ ఇంధనంతో ప్రయాణించే ఈ క్షిపణి సంప్రదాయ ఆయుధాలతోపాటు అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు.

No comments:
Post a Comment