AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 25 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 12


*🌍చరిత్రలో ఈ రోజు/ అక్టోబర్ 12*🌍

*◾అక్టోబర్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 285వ రోజు (లీపు సంవత్సరములో286వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 80 రోజులు మిగిలినవి.*▪

*⏱సంఘటనలు*⏱

*🌷1965: 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికోలోప్రారంభమయ్యాయి.*

*🌷1998: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ప్రమాణ స్వీకారం.*

*🌷1999: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.*

*🌷2000: జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు).*

*❤జననాలు❤*

*🌷1911: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు విజయ్ మర్చంట్.*

*🌷1917: బూర్గుల రంగనాథరావు, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి.*

*🌷1918: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. (మ.1986)*

*🌷1929: రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు మరియు విద్యావేత్త*
.

*🌷1932: యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట మరియు 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.*

*🌷1936: రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత.*

*🌷1945: పంతుల జోగారావు, వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.*

*🌷1948: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998)*

*🍃మరణాలు🍃*

*♦1967: రామమనోహర్ లోహియా, ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు.*

*♦1993: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు మరియు మాజీ గవర్నరు. (జ.1921)*

*♦2012: ఘండికోట బ్రహ్మాజీరావు, ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)*

*🇮🇳పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🌷సమాచార హక్కు చట్టంఅమలులోకి వచ్చిన రోజు.*

*🌷ప్రపంచ దృష్టి దినోత్సవం.*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

   *🌷సుభాషిత వాక్కు*🌷

*"వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గాని వేషం కాదు...!"*

*"When I have fully decided that a result is worth getting, I go ahead of it and make trial after trial until it comes.”*

   *♦మంచి పద్యం♦*

*కల్లచెప్పి నీవు కలకాలముందువా*
*సత్యములను చెప్పి సలుపు మంచి*
*మంచి చెడ్డ లెరిగి మంచివాడివికమ్ము*
*ఇలనిదానపురపు వెలుగుబాట*

*భావం*:-

*అబద్ధం చెప్పి ఎల్లకాలం జీవించలేము. నిజము మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకో*

 ఈ రోజు జికె

 *నిర్మాణం*                 *ప్రాంతం*

*రాష్ట్రపతి భవన్ - ఢిల్లీ*

*కుతుబ్ మీనార్ - ఢిల్లీ*

*జమా మసీదు - ఢిల్లీ*

*ఇండియా గేట్ - ఢిల్లీ*

*జంతర్ మంతర్ - ఢిల్లీ*

*ఎర్రకోట - ఢిల్లీ *

*సారనాథ్ స్తూపం - వారణాశి*

*మీనాక్షి దేవాలయం - మధురై (TN)*

*ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం - ముంబాయి*

ఈ రోజు జికె

*1)👉 ఆదికవి నన్నయ్య ఏ రాజు యొక్క ఆస్థాన కవి?*

A: *రాజ రాజ నరేంద్రుడు.*

*2)👉 కాకతీయుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది?*

A) *మోటుపల్లి.*

*3)👉 ఇండియాలో ఎత్తైన కాంక్రీట్ డ్యాం ఏది?*

A) *నాగార్జునసాగర్.*

*4)👉 ప్లూటో గ్రహం యొక్క మార్చబడిన కొత్త పేరు ఏమిటి?*

A) *ఆస్టరాయిడ్ నంబర్ 134340.*

*5)👉 ఆంధ్రాలో దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు?*

A:  *గాడిచర్ల హరిసర్వోత్తమ రావు.*

*6)👉 ఇంగ్లీష్ చానల్ ను ఈదిన మొదటి భారతీయుడు ఎవరు?*

A: *మిహిర్ సేన్*

*7)👉 ఏ గ్రంథి వలన అధిక ఆవేశం కలుగుతుంది?*

A:👉 *అడ్రనల్ గ్రంథి.*

*8)👉 కేండిలా దేనికి ప్రమాణం?*

A: *కాంతి తీవ్రతకు.*

*9)👉 దంత వైద్యుడు వాడే కటకం ఏది?*

A: *పుటాకార కటకం.*

*10)👉 ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలు ఏవి?*

A: *1)అరబిక్.*
     *2) ఇంగ్లీష్.*
     *3) ఫ్రెంచ్.*
     *4) స్పానిష్*
      *5)రష్యన్.*
       *6) చైనీస్*

ఈ రోజు జికె

1)👉 2017 సంవత్సరంకు గాను  "అర్థశాస్త్రంలో నోబెల్" బహుమతి ఎవరికి లభించనుంది?
A: *రిచర్డ్ హెచ్.థాలర్(అమెరికా)*

2)👉 ప్రస్తుత "శ్రీలంక అధ్యక్షుడు" ఎవరు?
A: *మైత్రిపాల సిరిసేన*

3) "ప్రస్తుత టాటా గ్రూప్ ఛైర్మన్" ఎవరు?
A: *చంద్రశేఖరన్*

4)👉 భారత జాతీయ కాంగ్రెస్ ను "మైక్రోస్కోపిక్ మైనారిటీ" గా విమర్శించింది ఎవరు?
A: *లార్డ్  డఫ్రిన్*

5)👉 "తంతి తపాలా,రైల్వే సౌకర్యాలను"  ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
A: *లార్డ్ డల్హౌసీ*

No comments:

Post a Comment