AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 17


*🌍చరిత్రలో ఈరోజు/అక్టోబర్ 17*🌍

*▪అక్టోబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 290వ రోజు (లీపు సంవత్సరములో291వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 75 రోజులు మిగిలినవి.*◾

*⏱సంఘటనలు*⏱

*♦1933: నాజీ ల దురాగతాలు భరించలేక మాతృభూమి (జర్మనీ) ని వదిలి ఐన్‌స్టీన్‌ అమెరికాకు పయనం.*

*♦1979: మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతివచ్చింది.*

*♦2003: 'జితి జితాయి పాలిటిక్స్‌'... మధ్యప్రదేశ్‌లో హిజ్రా ల తొలి రాజకీయపార్టీ స్థాపన.*

*♦1949: జమ్ము, కాశ్మీర్‌ లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి.*

*❤జననాలు*❤

*🌷1872: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసిన ఇతిహాసకుడు.*

*🌷1901: జి.ఎస్.మేల్కోటే, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు మరియు పరిపాలనా దక్షుడు. (మ.1982)*

*🌷1920: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948)*

*🌷1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త. (మ.2011)*

*🌷1955: స్మితా పాటిల్, హిందీ సినీనటి. (మ.1986)*

*🌷1970: అనిల్ కుంబ్లే, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు*

*🍃మరణాలు*🍃

*♦1937: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధినిసంపాదకుడు. (జ.1877)*

*♦2014: ఎనుముల సావిత్రీదేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.*

*🌷పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం.*

నేటి జికె

*1) మెదడులోని కణాలను దేని ద్వారా గుర్తిస్తారు?*

*జ: రేడియో ఫాస్పరస్*

*2) తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు ఏమిటి?*

*జ: చంద్రకాంత్.*

*3) ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?*

*జ: తిరుమల*

*4) ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు?*

*జ: టాటా గ్రూప్.*

*5) చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు?*

*జ: GSLV MK-2.*

*6) చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసినది ఎవరు?*

*జ: డాక్టర్ అన్నాదురై.*

*7) నేషనల్ బెలూన్ లాంచింగ్ ఎక్కడ ఉంది?*

*జ: హైదరాబాద్.*

*8) మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?*

*జ: శుక్రుడు*

*9) నాసా-ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ ఏమిటి?*

*జ: నిసార్.*

*10) రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహన నౌక ఏది?*

*జ: GSLV-3.*

No comments:

Post a Comment