AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు జికె


*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

    *🔹మంచిమాట🔹*

*సిగ్గు , మర్యాద లేని ధనవంతుడి కన్నా మంచి, మానవత్వం ఉన్న పేదవాడు మిన్న*

*All our dreams can come true, if we have the courage to pursue them*

   *మంచి పద్యం*

*🔹మాట గొప్ప తెలిసి మసులుము సోదరా*
*పలుకు జార వలదు ములుకులగును*
*మాట నీకు మంచి మర్యాద తెచ్చును*
*మరువ బోకు నీవు మాట బలము*

*♦భావం:-*

*🌷మాటకున్న గొప్పతనం తెలుసుకొని నడవాలి.అది నీకు మర్యాద తెస్తుంది. దాని బలాన్ని ఎప్పటికీ మరువ వద్దు. అది జారితే ముల్లు వలె కుచ్చుకుంటుంది*


*♦జి కె టుడే*♦

*1) భూకేంద్ర సిద్ధాంతకర్తగా ఎవర్ని పిలుస్తారు ?*

*జ: క్లాడియస్ టాలమీ (అలెగ్జాండ్రియా)*

*2) సూర్య కేంద్ర సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు ? ఏ దేశస్థుడు ?*

*జ: నికోలస్ కోపర్నికస్ (క్రీ.శ.1543లో), పోలెండ్ దేశం*

*3) కోపర్నికస్ రాసిన గ్రంథం ఏది ? (ఇందులోనే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు )*

*జ: On the Revolution of the Heavenly Bodies*

*4) భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పింది ఎవరు ?*

*జ: అరిస్టాటిల్*

*5)  ప్రపంచ పటాన్ని శాస్త్రీయంగా ఎవరు తయారు చేశారు ?*

*జ: అనాగ్జీమిండర్*

*6)) భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్, భారత భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు ?*

*జ: జేమ్స్ రన్నెల్*

No comments:

Post a Comment