AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు టీచర్ల ముఖ్యమైన సమాచారం


*🌷పాత పద్ధతిలోనే టీచర్ల ఎంపిక పరీక్ష🔺*

*♦🔵తెలంగాణ: టీచర్ ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. సంబంధిత పరీక్షను పాత పద్ధతిలోనే నిర్వహించాలని సర్వసభ్య సమావేశం నిర్ణయించినట్టు తెలిసింది. వేకెన్సీలు, కొత్త జిల్లాల రోస్టర్ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తరువాత త్వరలో ప్రకటన విడుదలచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.*

*♦టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ -2017 కోసం చైర్మన్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో కమిషన్ సర్వసభ్య సమావేశం గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగింది.*

 *♦ఎంపిక ప్రక్రియలో కోర్టు చిక్కులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ప్రభుత్వం జారీచేసిన జీవోను, పాఠశాల విద్యాశాఖ అందించిన వివరాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిషన్ నిర్ణయించింది.*

*🌷కొత్త సిలబస్, కొత్త ప్యాటర్న్ జోలికి వెళ్లకుండా డీఎస్సీ పరీక్ష విధానంలోనే టీఆర్టీ నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక అంశాలు సమగ్రంగా అధ్యయనం చేసి, న్యాయపరమైన సమస్యలు రాకుండా నోటిఫికేషన్ జారీచేయాలని సమావేశం నిర్ణయించింది. నోటిఫికేషన్ వెలువడే సమయం నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేవరకు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చైర్మన్ ఘంటా చక్రపాణి సభ్యులకు సూచించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్తో ప్రతిరోజూ జిల్లాలవారీగా సమాచారం తెప్పించుకోవాలని చెప్పారు. దాదాపు 5 లక్షల మంది దరఖాస్తుచేసే అవకాశం ఉన్నందున 31 కేంద్రాల్లో అందుకు తగ్గట్టుగా పరీక్ష ఏర్పాట్లు ఉండాలని వివరించారు.*

No comments:

Post a Comment