TRT Notification లో
పేపర్ వాళ్ళు కూడా సరిగ్గా క్లారటీ ఇవ్వలేదు.
అసలు ఈ నాన్ లోకల్ బంపర్ ఆఫర్ అంటే తెలుసా!!!???
5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇచ్చిన కొలువుల జాతర ఇదా???
మనం అనుకున్నట్టు కొత్త జిల్లాల వల్ల అన్యాయం జరిగిన వారికి ఎలాంటి న్యాయం జరగలేదు.
అసలు పోస్టులు ఉన్న జిల్లాల వారికి కూడా న్యాయం జరగలేదు.
అన్ని జిల్లాలలో కలిపి
అసలు ఒపెన్ కేటగిరీ లో ఉన్నవి కేవలం 832 పోస్ట్లు మాత్రమే.
అందులో ఒపెన్ 20% అంటే 165 పోస్ట్లు అంటే 165 పోస్టులకే తెలంగాణ మొత్తం విద్యార్థులు పోటీ పడాల???
అసలు ఎవరి జిల్లాలలో ఎక్కువ అనుకుంటున్నారు??
మాది కామారెడ్డి పేరుకే 381 పోస్టులు.
అందులో SGT 220 కానీ తెలుగు మీడియం కి ఉన్నవి కేవలం 115,
అందులో మహిళలకు 30% రిజర్వేషన్,
SC, ST, BC ల రిజర్వేషన్ లు పోగా,
అందులో ఒపెన్ కేటగిరి 27.
ఇందులో నాన్ లోకల్ కి 3 పోస్టులు అన్నమాట.
381 పోస్టుల్లో 3 పోస్టులు నాన్ లోకల్ వారికి కేటాయించడం బంపర్ ఆఫర్.
ఎంత మోసం ఏ మీడియా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు.
నిరుద్యోగులు అంటే ఇంత చులకనా???
మనం పోరాడి ఆనాడు ఆంధ్ర పాలకుల నుండి మా పోస్టులు మా తెలంగాణ అన్నది ఇందుకేనా??
ఈ రోజు 40% విద్యార్థులు పోస్ట్ లు ఉన్నాయ్ అని ఎమ్ అనకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు వాళ్ళు మోసపోతారు.
దయచేసి ప్రతిఒక్కరూ నోటిఫికేషన్లోని రోస్టార్ పాయింట్స్ చూడండి మీ జిల్లాలో ఉన్న పోస్టుల్లో మీకు ఎన్ని ఉన్నాయో చూడండి.
అన్ని రిజర్వేషన్లు పోను మిగిలేవి కేవలం 50 to 100
5 సంవత్సరాల మన నిరీక్షణకు ప్రభుత్వం ఇచ్చిన వింత బహుమతి.
నోటిఫికేషన్ వేసినందుకు సంతోషపడాలో,
పోస్టూలులేక భాధ పడాలో తెలియని సందిగ్ధంలో ఉన్న నిరుద్యోగులను చూసైనా ప్రభుత్వం మరికొన్ని పోస్టులు వేయాలని కోరుకుంటున్నా...
దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలకు తెలిససేట్టు share చేయండి.
No comments:
Post a Comment