*💡ప్రపంచానికి వెలుగునింపిన దార్శనికుడు.. "థామస్ అల్వా ఎడిసన్"వర్దంతి నేడు..*🔎
*★"మేధావి అంటే ఒక శాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ" అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు.*
*● సమస్యను కొత్త కోణంలో చూడండి విద్యుత్ బల్బుతోపాటు ఎన్నో వస్తువులను కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన అమెరికా పరిశోధకుడు థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం చాలా భిన్నంగా ఉండేది. తన పరిశోధనలకు అవసరమైన సహాయకులను ఎడిసన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తూ ఉండేవారు. మొదట సాధారణ ప్రశ్నలు అడిగిన తర్వాత.. తనకు తగిన అభ్యర్థి అనిపిస్తే అతడిని భోజనానికి తీసుకెళ్లేవారు. ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉండేది. భోజనం వచ్చిన తర్వాత ఎడిసన్ కొంత తీసుకొని నోట్లో వేసుకొనేవారు.*
*●ఈ ఆహారంలో ఉప్పు సరిపోలేదనుకుంటా! అంటూ అభ్యర్థిని నిశితంగా పరిశీలించేవారు. అప్పుడు సదరు అభ్యర్థి కూడా కొంత భోజనాన్ని రుచి చూసి, ఉప్పు సరిగ్గా ఉందో లేదో చెబితే అతడు ఎంపికైనట్లే. కానీ రుచి చూడకుండానే ఉప్పును కలుపుకుంటే.. ఇంటి ముఖం పట్టాల్సిందే. మనుషుల మనస్తత్వం ఎడిసన్‌కు బాగా తెలుసు. మానవులు సాధారణంగా ఇతరులు చెప్పినదాన్నే గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఏదైనా అంశంపై తమకు తగిన అనుభవం, పరిజ్ఞానం లేకపోయినా దానిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాన్నే అనుసరిస్తుంటారు.*
*●తమకు ఎదురైన సమస్యను కొత్త కోణంలో చూడడం, దాని పరిష్కారానికి భిన్నంగా ఆలోచించడం ఎక్కువ మందికి అలవాటు లేని పని. మనసులో ఒక అభిప్రాయం నాటుకుపోతే.. ఇక దాన్ని ఎప్పటికీ వదులు కోరు. ఇతరుల ఆలోచనలను అనుసరించ కుండా సొంతంగా ఆలోచించే వ్యక్తుల కోసం ఎడిసన్ గాలిస్తూ ఉండేవారు.*
*●మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాల ను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.*
*●ఆయన 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. 1889 లో పారిస్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్ కు చెందినవే.*
*🌟బాల్యం,విద్యాభ్యాసం..*
●ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ లకు ఏడవ మరియు చివరి సంతానం.ఇతని కుటుంబం డచ్ మూలాలు కలిగినది.
*●10 ఏళ్ళ వయస్సు నాటికి యీయన*
*సొంతం గా లాబొరేటరీని యేర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం రైళ్ళలో న్యూస్ పేపర్లు,స్వీట్లు అమ్మేవాడు. అతి చిన్నవయస్సు లోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు.1861లో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ "గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్" అనే ఓ మోస్తరు న్యూస్ పేపర్ నడిపాడు. ఈ సమయంలోనే ఆయనకు ప్రమాద వశాత్తు చెవుడు వచ్చింది. రైల్వే బోగీలోనే లాబొరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. పొరపాటుగాఅగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు ఆయనను దూరంగా ఉంచివేశారు.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*🔮ఆవిష్కరణలు:* 💡🕹
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*✽ 1862 లో ఎడిసన్ ఒక స్టేషను మాష్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుంచి 'టెలీగ్రఫీ'ని నేర్చుకున్నాడు.*
*✽ 1868 లో 'టెలిగ్రాఫ్' పేటెంట్ ను పొందగలిగాడు. బతుకు తెరువు కోసం స్టాక్ ఎక్సేంజీ టెలిగ్రాఫ్ ఏజన్సీలో పనికి కుదిరాడు. తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నాడు. ఏ కొద్ది మొత్తమో లభిస్తుందని అనుకున్న ఎడిసన్ కి నలబై వేల డాలర్లు ముట్టడంతో ఆశ్చర్యపో యాడు. అంతే, అప్పటి నుండి ఆయన ఆవిష్కరణలకు అంతం లేకుండా పోయింది.*
_*✧ 1878 లో ఎలక్ట్రిక్ బల్బ్ ను రూపొందించా డు. అది ఆర్థికంగా ఆయనకు మరింత ఎత్తుకు తీసుకుని వెళ్ళింది.*_
*✽ థర్మో అయానిక్ ఎమిషన్ గురించి కూడా అదే సమయంలో ఎడిసన్ వెల్లడించాడు.*
*✽ 1877లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టి నపుడు ప్రజలు సంభ్రమా శ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు "మెన్లో పార్క్ మాంత్రిడు" అనే పేరు పెట్టారు.*
*✽ 1887-1889 మధ్య కాలంలో టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్,మోషన్ పిక్చర్ కెమేరా, అలాగ ఎన్నింటినో యీయన రూపొందిచారు. 1931 న చనిపోయే నాటి వరకు సరికొత్త ఆవిష్కరణలు కోసం అనుక్షణం ఆరాట పడ్డాడు.*
*✽ 1912 లో యీయనకు నోబెల్ బహుమతి రావల్సింది కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. అయితే ఇది ఆయన గొప్పతనాన్ని ఏ కొంచెం కూడా తగ్గించలేదు.*
*✽ ఆయన అక్టోబరు 18 1931 న వెస్ట్ ఆరెంజ్, న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ లో కన్నుమూశా రు. ఆయన మరణించిన రోజున అమెరికాలో రాత్రి దేశమంతా బల్బ్ లు వేయకుండా (క్యాండిల్ తోనే ఉంటారు) ఉండి ఆయనకు నివాళులు అర్పిస్తారు.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*--ప్రేరణకల్గించే లక్షణాలు--*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*✧ మీకు ప్రేరణ కల్పించే గొప్ప వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారా? ఎడిసన్ గురించి చదివారుగా.. ఆయన బాల్యంలో పెద్ద ప్రతిభ ఉన్న విద్యార్థి కాదు. స్కూల్ కు మీ అబ్బాయి పనికిరాడని టిచర్ చేత గెంటివేయబడ్డ విద్యార్థి , పైగా చెవుడు కూడా ఉంది. పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎడిసన్ తన ఇంట్లోనే తల్లి ఆసక్తి మేర పట్టుదలతో విద్యాభ్యాసం కొనసాగించారు. ఎన్నో వస్తువులను కనిపెట్టారు.*
*✧ వైఫల్యాలు ఎదురైనా ముందుకే వెళ్లారు. అపజయాలను విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు.*
*✧ ప్రతి ఓటమి నుంచి ఓ విలువైన పాఠం నేర్చుకున్నానని ఆయన స్వయంగా చెప్పారు.*
*✧ ఎడిసన్ కీర్తి కిరీటంలో ఎన్నో పేటెంట్లు ఉన్నాయి. అలుపెరుగక శ్రమించే తత్వంతోనే విజయం సాధ్యమని ఆయన అన్నారు.*
*✧ మీ కృషికి సొంత ఆలోచనలను జోడించండి. రుచి చూడకుండానే భోజనంలో ఉప్పు వేసుకోకండి!!.*
(ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931)*
No comments:
Post a Comment