AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 25 October 2017

చరిత్రలో నేటి జికె


*1. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన దేశమేది..??*
 *A)అమెరికా*

*2. సూర్యుడి బాహ్య వాతావరణ పరిశోధన కోసం నాసా పంపనున్న స్పేస్ క్రాఫ్ట్ ఏది..??*

*A) పార్కర్ సోలార్ ప్రోబ్ (సూర్యుడిపై నాసా పంపిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇది)*


*3. ఎస్.సీ.ఓ (షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్) సభ్యదేశాలేవి..??*

*A) చైనా, రష్యా, కజకస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, కిర్గిస్థాన్ పూర్తిస్థాయి సభ్యులు (ఆప్ఘనిస్థాన్, బెలారస్, ఇండియా, ఇరాన్, మంగోలియా, పాకిస్థాన్ దేశాలు పరిశీలక హోదా కలిగి ఉన్నాయి)*


*4. ఉడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ లో చోటు సంపాదించిన భారతీయురాలు ఎవరు..??*

*A) నిరుపమా రావు (ఈమె గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు)*


*5. ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జరిగిన సమావేశంలో రెండు దేశాల త్రివిధ దళాల విన్యాసాలు తొలిసారి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విన్యాసాలకు ఏమని పేరు పెట్టారు..??*

*A) ఇంద్ర – 2017*


*6. భారత్ ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనాలేంటి..??*

*A) 2017లో భారత్ వృద్ధి 7.5%గా, 2018లో 7.7% శాతం*


*7. గ్లోబల్ 300 సిటీస్ జాబితాలో భారత్ నుంచి ఎన్ని నగరాలకు చోటు దక్కింది..??*

*A) 9 నగరాలు*


*8. కొత్తగా చలామణీలోకి రాబోయే ఒక్క రూపాయి నోటుపై ఏ ఇంగ్లీష్ అక్షరం ముద్రిస్తారు..??*

*A) L*


*9. మే 2017లో చైనా వైపు నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు..??*

*A) అనితా కుండూ (హర్యానాకు చెందిన సబ్ ఇన్స్ పెక్టర్ ఈమె. 2013 లో ఈమె నేపాల్ వైపు నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు)*

No comments:

Post a Comment