AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో నేటి జికె


*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

  *🌷మంచిమాట*

*అసూయ, ద్వేషం, అహంకారం అనేవి చెలరేగుతన్నంతదాకా మీకు ఏ శ్రేయమూ కలుగదు.*

*You were born to make an Impact*

     *🔺మంచి పద్యం*

*అన్ని ఉన్న వేళ ఆదమరచిపోతే*
*లెస్స బాధ కలుగు లేని వేళ*
*పైసలున్ననాడే పొదుపు చేస్తే మేలు*
*కరవులేక వచ్చు ధరణి మీద*

*🔹భావం:-*

*దీపమున్ననాడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా , ధనము సమకూరినపుడు పొదుపు చేయనిదే భవిష్యత్తు కష్టాలమయము అవుతుంది*


*♦జి కె టుడే♦*

*1) సంగీతం, నాట్యం, నాటకాలను ప్రోత్సహించేందుకు సంగీత నాటక అకాడమీని ఎప్పుడు స్థాపించారు ?*

*జ: 1953లో ఢిల్లీలో*

*2) ఢిల్లీలో రవీంద్రుని రంగశాల కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు ?*

*జ: సంగీత నాటక అకాడమీ*

*3) దేశ, విదేశాల్లో భారతీయ కళలపై అవగాహన పెంపొందించేందుకు ఏరాటైన అకాడమీ ఏది ?*

*జ: లలిత కళా అకాడమీ*

*4) లలిత కళా అకాడమీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ?*

*జ: కేంద్ర సాంస్కృతిక శాఖ*

*5) లలిత కళా అకాడమీ ప్రస్తుత ఛైర్మన్ ఎవరు ? ఈ పదవికి అర్హులను ఎవరు నియమిస్తారు ?*

*జ: కళ్యాణ్ కుమార్ చక్రవర్తి, రాష్ట్రపతి నియమిస్తారు.*

*6) లలిత కళా అకాడమీ 60 వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఉత్సవం పేరేంటి ?*

*జ: స్పిరిట్ ఆఫ్ ఢిల్లీ*

*7) అకాడమీ వెలువరించే జర్నల్స్ ఏవి ?*

*జ: లలిత కళాయావినియెంట్ (ఇంగ్లీష్), సంకలీన్ కళా జర్నల్ (హిందీ)*

*8) సంగీత నాటక అకాడమీకి చెందిన లైబ్రరీ ఎక్కడ ఉంది ? ఇక్కడ ఎన్ని సంగీత పరికరాలను ప్రదర్శిస్తున్నారు ?*

*జ: ఢిల్లీలోని రవీంద్ర భవన్ లో. 200కు పైగా సంగీత పరికరాలు*

*9) సంగీత నాటక అకాడమీ అవార్డు కింద ఎంత మొత్తం బహుకరిస్తారు ?*

*జ: లక్ష రూపాయలు*

No comments:

Post a Comment