AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో నేటి జికె

🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏

   *🔺సుభాషిత వాక్కు*

*ప్రతి వాళ్ళు గొప్ప సేవలు చేయలేకపోవచ్చు....!*
*కాని చేసిన చిన్న  సేవ  గొప్పగాఉండాలి....!*

*The opposite of love is not hate, it's. indifference. The opposite of art is not ugliness, it's indifference. The. opposite of faith is not heresy, it's. indifference. And the opposite of life is not death, it's indifference.*

         *🌹మంచి పద్యం🌹*
 
*ఉత్తపలుకు చూడ ఊకలా ఎగురును*
*పనికి రాని మాట పలుకు రాయి*
*మంచి మాట పలికి మంచిని పెంచుకో*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔹భావం*:-

*ఓ వేము ! వ్యర్ధమైన మాటలు గాలికి ఎగిరే పొట్టువంటివి. పనికిరాని పలుకు రాళ్ళ వంటివి. అర్ధవంతమైన మాటలతో ఓ మనిషి మంచిని పెంచుకో.*

      *♦నేటి జీ.కె♦*

*1) భారత ప్రజా ప్రతినిధులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని ఏ సంవత్సరం జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు?*

*జ: 1918లో*

*2) రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించింది ఎవరు ?*

*జ: ఎం.ఎన్ రాయ్*

*3) స్వరాజ్ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ?*

*జ: దాదా భాయ్ నౌరోజీ*

*4) 1921లో యంగ్ ఇండియా పత్రికలో ‘‘ భారత్ కు స్వాతంత్ర్యం అనేది భిక్ష కాదనీ, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదనీ, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ’’ అని ఎవరు అన్నారు ?*

*జ: మహాత్మాగాంధీ*

*5) 1924లో ఎవరి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను చెప్పారు ?*

*జ: మోతీలాల్ నెహ్రూ*
*( నోట్: మోతీలాల్ నెహ్రూయే తిరిగి 1928లో ఓ నివేదికను కూడా రూపొందించారు )*

*6) 1925లో బ్రిటీష్ పార్లమెంటులో కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెట్టి … ఐర్లాండ్ ప్రజలకు లాగే భారతీయులకూ శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని ఎవరు సూచించారు ?*
*జ: అనీబిసెంట్*

*7) 1930లో ఎక్కడ జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ‘‘సంపూర్ణ స్వరాజ్’’ సాధనే లక్ష్యమని తీర్మానించారు ?*

*జ: లాహోర్ లో*

*8) లాహోర్ లో ఎవరి అధ్యక్షతన జరిగిన INC సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ ను తీర్మానించారు ?*

*జ: జవహర్ లాల్ నెహ్రూ*

*9) 1930 జనవరి 1న ఏ నగరంలోని రావి నదీ తీరాన భారత స్వాతంత్ర్య త్రివర్ణ పతాకాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఎగురవేశారు ?*

*జ: లాహోర్ లో*

*10) 1930 జనవరి 26 న ఏ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సమావేశంలోనే భారతీయ జాతీయ కాంగ్రెస్ నిర్ణయించింది ?*

*జ: ‘‘స్వరాజ్ దినం’’*

No comments:

Post a Comment