AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు టీచర్ పోస్ట్ లు


*మోడల్ స్కూళ్లలో 750 టీచర్ పోస్టుల భర్తీ*

*మరో శుభవార్త*

*♦నోటిఫికేషన్కు విద్యాశాఖ కసరత్తు*

*ప్రభుత్వ పరిశీలనలో సర్వీస్రూల్స్ ఫైల్*

*♦టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే అవకాశం*

*తెలంగాణ: నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. మోడల్ స్కూల్ టీచర్ పోస్టులను త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 750 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర మోడల్ స్కూల్ సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.*

*♦ వీటిలో 250 టీజీటీ, 400 పీజీటీ, 100 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. మోడల్ స్కూల్ టీచర్ పోస్టులకు ఇప్పటివరకు సర్వీస్ రూల్స్ లేవు. వీటికి కూడా సర్వీస్ రూల్స్ను వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలతో తయారుచేసిన ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ అమలుచేసే అంశాన్ని న్యాయశాఖ పరిశీలిస్తున్నది.*

*అనంతరం సాధారణ పరిపాలనశాఖ పరిశీలించాక.. ఈ అంశం తిరిగి విద్యాశాఖకు చేరుతుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు. సర్కారు నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే జిల్లాలవారీగా ఖాళీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదలచేస్తామని చెప్పారు. మోడల్ స్కూళ్లలోని టీచర్ పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) ప్రకారమే విద్యార్హతలు ఉంటాయి*

No comments:

Post a Comment