AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 25 October 2017

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 19


*దీపావళి శుభాకాంక్షలతో*

*🌍చరిత్రలో ఈరోజు/అక్టోబర్ 19*🌍

*అక్టోబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 292వ రోజు (లీపు సంవత్సరములో 293వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 73 రోజులు మిగిలినవి'*◾

  *🕘సంఘటనల*🕘

*🌷1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.*

     *🔺1954: బీజింగ్లో భారత ప్రధానమంత్రి నెహ్రూచైనా నాయకుడు మావోను కలిసాడు.*
 *🔺1970: పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సులనుప్రభుత్వం రద్దు చేసింది.*

*🔺1983: ప్రొ.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ తన 73వ పుట్టినరోజునాడు ఫిజిక్స్ నోబెల్ పురస్కారానికిప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు.*

*🔺1983: ముంబైలో 13 జౌళి పరిశ్రమ లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మెముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్నాయకత్వం వహించాడు.*

*🔺1987: అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఘోరపతనం. డౌ జోన్స్‌ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్‌చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండేగా ప్రసిద్ధి చెందింది.*

 *❤జననాలు*❤

*♦1864: ఆచంట సాంఖ్యాయన శర్మ తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)*

*♦1910: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (1910—1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.*

*♦1916: వడ్డూరి అచ్యుతరామ కవి, ప్రముఖ తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు పురాణ ప్రవచకుడు. (మ.1996)*

*♦1917: ఎస్.ఎస్.శ్రీఖండే, ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త.*

*♦1929: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. (మ.2010)*

*♦1955: గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు.*

*♦1958: రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి మరియు శతకకారుడు.*

*♦1987: సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు*

*🍃మరణాలు*🍃

*🌷1937: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు. (జ.1871)*

*🌷1986: టంగుటూరి అంజయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919)*

*🌷1987: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు. (జ. 1915)*

*🌷2013: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత. (జ.1928)*

*🌷2015: కళ్ళు చిదంబరం, ప్రముఖ తెలుగు హాస్య నటుడు. (జ.1945)*

*♦పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🌹దీపావళి పర్వదినం*

No comments:

Post a Comment