*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*🌷మంచిమాట*
*"కేవలం ఆశ మీదనే జీవించాలనుకునే వాళ్లు పస్తులు పడుకోక తప్పదు...ఆశను కార్యాచరణలోకి దింపాలి"..*
*Don't give up. Great things take time"*
*మంచి పద్యం*
*సంద్ర మందు నీరు సంతస మేయదు*
*చెరువు యందు నీరు చేయు మేలు*
*మంచివాడి యొక్క మక్కువ చాలును చెడ్డ వాడి యొక్క చెలిమి వద్దు*
*▪భావం:-*
*🔹సముద్రంలో ఎంత నీరు ఉన్న ఆనందాన్ని కలిగించదు. చెరువులో ఉన్న నీరే మేలు చేస్తుంది. అలాగే మంచివారి ప్రేమ చాలు. చెడ్డవారి స్నేహము వద్దు*
*🔺జి కె టుడే*🔺
*1) అమెరికా సహాయంతో భారత్ ప్రయోగించిర రాకెట్ ఏది?*
*జ: అపాచీ.*
*2) 2004 సునామీ వల్ల మునిగిపోయినట్లు రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతం ఏది?*
*జ: ఇందిరా పాయింట్.*
*3) ఏ రంగంలో లాక్టిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.?*
*జ: ఫార్మా, ప్లాస్టిక్, వస్త్ర పరిశ్రమ*
*4) కీ బోర్డు ఎలాంటి పరికరం ?*
*జ: ఇన్ పుట్.*
*5) భారత్ లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన సూరీ అనేది ఏంటి?*
*జ: మేక*
*6) క్లోనింగ్ ప్రక్రియ ఏపద్దతిపై ఆధారపడుతుంది?*
*జ: అలైంగిక ప్రత్యుత్పత్తి.*
*7) మొదటి రేబీస్ టీకాను అభివృద్ది చేసినది ఎవరు?*
*జ: లూయి పాశ్చర్.*
*8) భారత్ లో తొలి రియాక్టర్ ను తారాపూర్ లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?*
*జ: అమెరికా*
*9) ధోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?*
*జ: కేరళ*
*10) రక్త సరఫరా అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియో ధార్మిక ఐసోటోపు ఏది?*
*జ: సోడియం-24.*
No comments:
Post a Comment