AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 25 October 2017

చరిత్రలో ఈ రోజు ఆధునిక కంప్యూటర్ ఛార్లెస్ బాబేజ్


*💻ఆధునిక కంప్యూటర్ సృష్టికర్త.."ఛార్లెస్ బాబేజ్‌" వర్దంతి నేడు*..✍🔍

*★సమస్యకు సంబంధించిన దత్తాంశాన్ని స్వీకరించి, ముందుగా ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం ఆ డేటాను విశ్లేషించి ఫలితాన్ని అందించే ఎల్రక్టా నిక్ పరికరాన్ని కంప్యూటర్ లేదా గణనయంత్రంఅంటారు ఇది గణనలను అత్యంత వేగంగా చేస్తుం ది, సమాచారాన్ని నిల్వ ఉంచుతుంది.*

*◆ క్రీ.పూ. 3500కు ముందే చైనీయులు లెక్కలు చేయడానికి 'అబాకస్' అనే చట్రాన్ని వాడారు. 'బ్లెయిజ్ పాస్కల్' రూపొందించిన 'పాస్కల్ యంత్రాన్ని' మొదటి ఎల్రక్టానిక్ క్యాలిక్యులేటర్‌ గా పిలుస్తారు. ఈ యంత్రమే తర్వాతి కాలంలో కంప్యూటర్‌ను రూపొందించ డానికి ప్రేరణ ఇచ్చింది. అందుకే ఛార్లెస్ బాబేజ్‌ను ఆధునిక కంప్యూటర్ సృష్టికర్తగా పేరుగాంచాడు.*

*◆ఫ్రెంచి దేశస్థుడెన బ్లెయిజ్ పాస్కల్*
*మొదటి గణన యంత్రాన్ని రూపొందిం చాడు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌కు పాస్కల్ అని పేరు పెట్టారు.*

*◆తొలితరం కంప్యూటర్లు (1945 - 1952): వీటిని 1946లో అమెరికాకు చెందిన ప్రెస్పర్ ఎకర్ట్, జె.విలియం మార్షలీ రూపొందించారు.*

*◆1860లో ఛార్లెస్ బాబేజ్ కంప్యూటర్‌కు ప్రేరణ ఇచ్చే సాధనాన్ని కనుగొన్నాడు.*

*■1791 డిసెంబర్ 26న ఇంగ్లాండ్‌లోని లండన్‌లో జన్మించిన ఛార్లెస్ బాజేజ్ అక్టోబరు 18, 1871 (వయసు 79)లో మరణించాడు.గణితము, ఇంజనీరింగ్, పొలిటి కల్ ఎకానమీ, కంప్యూ టర్ సైన్సు శాస్త్రములందు నిష్ణాతుడిగా పేరుగాంచాడు. ఇంగ్లాండ్‌లోని ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయాలలో విద్యనభ్యసించాడు. ఎక్కువగా ఫ్రెంచి తత్వవేత్తలు, రష్యన్ తత్వవేత్తల ప్రభావం ఈయనపై ఉంది. కార్ల్ మార్క్స, జాన్ స్టువర్ట్ మిల్ వంటిరచయితల ప్రభావం ఎక్కువే. చార్లెస్ బబేజ్ ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకా నికల్ ఇంజనీరు, మరియు నమూనా ప్రోగ్రామబుల్ కం ప్యూటర్‌ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడు. ఈయనను కంప్యూటర్ పిత అని కూడా అంటారు.*

*■ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ లేని వ్యవస్థ, రంగం ఏదీ లేదు. కంప్యూటర్ లేని జీవనాన్ని ఊహించుకోవడమే కష్టం.ఇంతవరకూ మానవుడు నిర్మించిన మరే సాధనమూ కంప్యూటర్ చూపిన ప్రభావం చూపలేదంటే దాని శక్తిని అంచనా వెయ్యచ్చు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన కం ప్యూటర్ రంగంలో మన దేశం కూడా ఎంతో పురోగతిని సాధంచింది. కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాధా రణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్ లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మాగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవస రాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్‌లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్రత్యేక అవసరాలను దౄఎష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి.*

*🍄వ్యక్తిగత జీవితము:*
*■1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంప తులకు లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యా భ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులను కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో పూర్తిచేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గౌరవపట్టా పొందారు. కేంబ్రిడ్జిలో గణితాచార్యుడిగా కొంతకాలం పనిచేసి మంచి గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకొన్నారు.*

*⚙కంప్యూటర్ డిజైన్:*

*■ గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబేజ్*
 *యాంత్రికముగా పట్టిక లను తయారు చేసే విధానము కనుక్కోగడానికి ప్రయత్నిం చాడు. బాబాజ్ ఇంజన్ మొదటి మెకాని కల్ కంప్యూ టర్. కాని అది నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు.*

*■ సొంతంగా గణనలు చేసే యంత్రానికి బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - ', సాంకే తికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యం త్రాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్ కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు అని పిలిచారు.*

*■ రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ బాబేజ్ తయారు చేశారు. గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆ్రస్టనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు.*

*■ బాబేజ్ జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ అనేసంస్థను కూడా స్థాపించారు  1871లో 79వ ఏట మరణించారు.*

No comments:

Post a Comment