*🌎చరిత్రలో ఈరోజు/ అక్టోబర్ 22*🌎
*◾అక్టోబర్ 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 295వ రోజు (లీపు సంవత్సరములో296వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 70 రోజులు మిగిలినవి.*◾
*⏱సంఘటనలు*⏱
*🔹1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ కి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసిం సేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు.*
*🔹1953: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.*
*🔹1960: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.*
*🔹1966: సోవియట్ యూనియన్ లూనా-12అంతరిక్షనౌకను ప్రయోగించింది.*
*🔹1975: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9శుక్రగ్రహంపై దిగింది.*
*🔹1981: పారిస్-లియాన్ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.*
*🔹2008: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1నుప్రయోగించింది.*
*🔹2015 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది.*
*❤జననాలు*❤
*Komaram Bheem*
*♦1894: కోలవెన్ను రామకోటీశ్వరరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు.*
*♦1901: కొమురం భీమ్ హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవంశమునకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940)*
*♦1927: గుంటూరు శేషేంద్ర శర్మ, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత*
*🍃మరణాలు*🍃
*🌷1996:పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896)*
*🌹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹అంతర్జాతీయ నత్తి అవగాహన రోజు.*
No comments:
Post a Comment