*🌎చరిత్రలో ఈరోజు/ అక్టోబర్ 21🌎*
*◾అక్టోబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 294వ రోజు (లీపు సంవత్సరములో295వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 71 రోజులు మిగిలినవి.▪*
*🕘సంఘటనలు🕘*
*🔹1934: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్‌అధ్యక్షుడిగా 'కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం.*
*🔹1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లోస్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.*
*🔹1954: పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సునుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది.*
*🔹1990: దూరదర్శన్ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం.*
*❤జననాలు❤*
*♦1833: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896)*
*♦1881: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963)*
*♦1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.*
*♦1915: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు*
*♦1920: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు*
*♦1925: సూర్జీత్ సింగ్ బర్నాలా, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017)*
*♦1930: షమ్మీ కపూర్, భారత ప్రముఖ సినీనటుడు మరియు దర్శకుడు. (మ.2011)*
*♦1947: నోరి దత్తాత్రేయుడు, సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు మరియు రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు.*
*🍃మరణాలు🍃*
*🌷1985: పింగళి దశరధరామ్ హేతువాది, పత్రికా సంపాదకుడు.*
*🌷1986: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923)*
*🌷1996: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (జ.1915)*
*🌷2002: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు మరియు అనువాదకుడు. (జ.1920)*
*🌷2005: మహీధర నళినీమోహన్, సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు.*
*🌹పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*
*♦పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.*
No comments:
Post a Comment