AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

Disaster management విపత్తు నిర్వహణ – 5

విపత్తు నిర్వహణ – 5

జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది
– 11వ ఆర్థిక సంఘం
ఇండియాలో విపత్తు కార్యనిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం? 
– 2005, మే 30
మొదటి విపత్తు నిర్వహణ కాంగ్రెస్‌ జరిగిన తేదీ? 
– నవంబర్‌ 29, 2006.
నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ ఎక్కడ ఉంది? 
– నాగ్‌పూర్‌
‘సిదర్‌’ అనే తుపాన్‌ ఏ దేశాన్ని తాకింది?
– బంగ్లాదేశ్‌
భారతదేశ మొత్తం భూభాగంలో వరదలు సంభవించే అవకాశం ఉన్న భూమి శాతం?
– 12%
అమెచ్యూర్‌ రేడియోకి మరో పేరు? 
– హామ్‌ రేడియో
అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది? 
– హోనోలులు
‘సునామీ’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? 
– జపాన్‌ భాష
ఏ మంత్రిత్వ శాఖ విపత్తు కార్యకలాపాలను నిర్వహిస్తుంది?
– హోం మంత్రిత్వ శాఖ
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్కడ ఉంది? 
– న్యూఢిల్లీ
1945, ఆగస్టు 9న ఫ్యాట్‌మాన్‌ అనే అణ్వాయుధాన్ని ఏ నగరం మీద ప్రయోగించారు? 
– నాగసాకి
W.H.O నివేదిక ప్రకారం ఏ వాయువు అధికంగా వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది?
– కార్బన్‌ మోనాక్సైడ్‌
భారతదేశంలో అతి పెద్ద గని విపత్తు జరిగిన సంవత్సరం? 
–1975, డిసెంబర్‌ 27
2013, ఫిబ్రవరి 21న ఏ నగరంలో జంట బాంబు పేలుళ్లు జరిగాయి?
–హైదరాబాద్‌
భారత పార్లమెంట్‌పై తీవ్రవాద దాడి జరిగిన సంవత్సరం? 
– 2001, డిసెంబర్‌ 13
తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో విద్యార్థుల మరణానికి కారణమైన విపత్తు?
– అగ్ని ప్రమాదం
రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? 
– మహారాష్ట్ర
భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన వల్ల విడుదలైన విష వాయువు? 
– మిథైల్‌ ఐసోసైనైడ్‌
చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగిన దేశం? 
– ఉక్రెయిన్‌
2014, జూలై 30న కొండచరియలు విరిగిపడి శిథిలమైన గ్రామం? 
–మాలిన్, మహారాష్ట్ర
భూపాతాల విపత్తులకు సంబంధించి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే మంత్రిత్వ శాఖ? 
– గనుల మంత్రిత్వ శాఖ
విపత్తుల వల్ల భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి ఎంత శాతం మేర నష్టం వాటిల్లుతోంది? 
– 2%
‘కరువు యాజమాన్యం కాదు.. కావాల్సింది –రుతుపవన యాజమాన్యం’ అని అన్నదెవరు? 
– ఎం.ఎస్‌. స్వామినాథన్‌
అంతర్జాతీయ జల వనరుల దశాబ్దం? 
– 2005–2015
ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
–1977–78
తీవ్ర కరువు అంటే? 
– సాధారణ వర్షపాతం 50% కంటే తక్కువ ఉండడం
అత్యధిక తీవ్రమైన కరువుగా పేర్కొనదగినది? 
– జల సంబంధ కరువు
2009, అక్టోబర్‌లో ఏ నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి? 
– కృష్ణానది
2015లో తుపాన్, వరదల వల్ల చెన్నై నగరంలో ఎంతమంది మరణించారు? 
– 347
సెంట్రల్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ బోర్డ్‌ సిఫార్సులతో వరద ప్రాంతాల్లో అవాసాలను నిషేధిస్తూ చట్టం చేసిన రాష్ట్రం? 
– మణిపూర్‌
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది? 
– చెన్నై
జాతీయ జల వనరుల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం? 
– 1962
ఇండియన్‌ మెటీరియోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (IMD) ఎక్కడ ఉంది? 
– న్యూఢిల్లీ
ఒడిశా దుఖఃదాయిని అని దేన్ని పిలుస్తారు?
– బ్రాహ్మణి నది
జాతీయ చక్రవాత ముప్పు నియంత్రణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రాలు? 
– ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌
2014, అక్టోబర్‌లో రూ.10,000 కోట్ల నష్టాన్ని కలిగించిన తుపాన్‌? 
–హుద్‌–హుద్‌
లైలా తుపాన్‌ సంభవించిన సంవత్సరం? 
– 2010, మే 20
తుపాన్లను ఇండోనేషియాలో ఏమంటారు? 
– భగ్నాస్‌
ప్రపంచంలో అతి పెద్ద తుపానుగా ప్రసిద్ధి చెందింది? 
– ‘టిప్‌’ అనే చక్రవాతం
విపత్తుల అత్యవసర ఎఫ్‌.ఎం. రేడియోను ప్రారంభించిన రాష్ట్రం? 
–తమిళనాడు
చరిత్రలో సుదీర్ఘ కాలం (31 రోజులు) చక్రవాతం సంభవించిన తుపాన్‌?
– టైపూన్‌ జాన్‌
తొలిసారి సైక్లోన్‌ అనే పదాన్ని ఉపయోగించింది? 
– హెన్రీ పెడింగ్‌టన్‌
2016, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు డిజాస్టర్‌ రిస్క్‌ కాన్ఫరెన్స్‌ను ఏ నగరంలో నిర్వహించారు? 
– దావోస్‌
భారతదేశంలో తొలిసారి ఏ ప్రాంతంలో సునామీ సంభవించింది?
– కచ్‌ ప్రాంతం, 326 ఆ.ఇ
ఏ సముద్రంలో 2004, డిసెంబర్‌లో సునామీ వచ్చింది? 
– హిందూ మహాసముద్రం
ప్రపంచంలో గులకరాళ్ల సునామీగా ప్రసిద్ధి చెందింది? 
– లిటుయాబే – అలస్కా
సునామీలు ఎక్కువగా (25.4% మేర) ఏ ప్రాంతం వద్ద వస్తాయి
– ఓషియానియా ప్రాంతం
పసిఫిక్‌ సునామీ మ్యూజియం ఎక్కడ ఉంది?
– హిలో ప్రాంతం, హవాయి దీవులు
సునామీలను గుర్తించే ప్రాంతీయ సునామీ ఏజెన్సీ (INCOIS ఎక్కడ ఉంది?
– హైదరాబాద్‌
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అంటార్కిటికా అండ్‌ ఓషియానిక్‌ రీసెర్చ్‌ అనే సునామీ సంస్థ ఎక్కడ ఉంది? 
– గోవా, డోనాపౌలా
సునామీలు తీర ప్రాంతంలో గరిష్ట ఎత్తుకు చేరుకోవడాన్ని ఏమంటారు?
–రన్‌ అప్‌
తొలిసారి ఏ చరిత్రకారుడు భూకంపాల వల్లే సునామీలు సంభవిస్తాయని గుర్తించాడు? 
– థుసిడైట్స్‌
సునామీలు ఎక్కువగా ఏ సముద్రంలో వస్తాయి?
– పసిఫిక్‌
తెలంగాణలో అతిపెద్ద భూకంపం?
– భద్రాచలం భూకంపం, 1969
జాతీయ భూ భౌతిక సంస్థ ఎక్కడ ఉంది? 
– హైదరాబాద్‌
ప్రపంచంలో రిక్టర్‌ స్కేలుపై నమోదైన పెద్ద భూకంపం? 
– చిలీ భూకంపం, 1960
స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? 
– ఎఫ్‌.హెచ్‌. రీడ్‌
మెర్కిలీ స్కేల్‌లో అంకెల్ని ఏ భాషలో గుర్తించారు? 
– రోమన్‌ భాష
రిక్టర్‌ స్కేలును రూపొందించింది?
– చార్లెస్‌ రిక్టర్, 1935
సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఎక్కడ ఉంది? 
– న్యూఢిల్లీ
ఏ యూనివర్సిటీ విపత్తు నిర్వహణ సర్టిఫికేట్‌ కోర్సును ప్రవేశపెట్టింది? 
–ఇగ్నో
సూపర్‌ సైక్లోన్‌ ఏ రాష్ట్రంలో సంభవించింది? 
–ఒడిశా
దేశంలోని విపత్తు ప్రతిస్పందన దళాల సంఖ్య? 
– 12
అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవం? 
– అక్టోబర్‌ 13
ప్రపంచంలో విపత్తు ముప్పు తీవ్రంగా గల నగరాలు? 
– టోక్యో, మనీలా
1980–2010 మధ్య కాలంలో విపత్తుల వల్ల భారతదేశంలో సంభవించిన మరణాలు? 
– 1,43,039
విపత్తులను 5 గ్రూపులుగా విభజించిన కమిటీ? 
– జె.సి.పంత్‌ కమిటీ
ఏ భాషా పదం Disaster అనే ఇంగ్లిష్‌ పదానికి మూలం? 
– (Disastre ఫ్రెంచి పదం)
జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం? 
– అక్టోబర్‌ 29
ఏ సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు? 
– 1986
దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం గల నగరాలు? 
– ముంబై, ఢిల్లీ
ప్రపంచంలో మొదటి విపత్తు నమోదైన ప్రాంతం? 
– ఏథెన్స్‌
జల వనరుల నిర్వహణకు రాజస్థాన్‌ ప్రారంభించిన పథకం? 
– జలతరంగ్‌
సముద్ర గర్భంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు? 
– సునామీ
ఇండియాలో తీరం వెంట టైడ్‌ గేజ్‌ నెట్‌వర్క్‌ నిర్వహించే సంస్థ? 
– సర్వే ఆఫ్‌ ఇండియా
సునామీల వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 
– 800–1000 కి.మీ.
సునామీలను విపత్తుల జాబితాలో చేర్చిన సంవత్సరం? 
– 2004
భుజ్‌ భూకంపం ఏ రాష్ట్రంలో సంభవించింది? 
– గుజరాత్‌
హిమాలయాల ప్రాంతంలో భూకంపాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది? 
– రూర్కీ యూనివర్సిటీ
భుజ్‌ భూకంపానికి కారణం?
– విరూపకారక బలాలు
దక్షిణ అమెరికాలో తుపాన్లను ఏమంటారు? 
– టోర్నడోలు
చక్రవాతాలు సాధారణంగా ఏయే అక్షాంశాల మధ్య సంభవిస్తాయి? 
– 5ని 20ని
‘నిషా’ తుపాన్‌ సంభవించిన సంవత్సరం? 
– 2008
బ్రహ్మపుత్ర నది వల్ల వరదలకు గురయ్యే రాష్ట్రం? 
– అసోం
రోజుకు ఎంత నీటిని వినియోగించే వారిని నీటి విలన్‌ అంటారు? 
– 600 లీటర్లకు పైగా
బాబా అటామిక్‌ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? 
– ముంబై
రిస్క్‌ మ్యాపింగ్‌ దేన్ని సూచిస్తుంది?
– నీటితో కప్పి ఉండే ప్రాంతాల వివరాలను
అపద్భంధు పథకం మొదలైన సంవత్సరం?
– 1998
2004 సునామీ వల్ల భారతదేశంలోని ఏయే ప్రాంతాల్లో టైడ్‌ గేజ్‌ పరికరాలు దెబ్బతిన్నాయి?
– చెన్నై, నాగపట్నం, ట్యుటికోరిన్‌
సగటున ఒక చక్రవాతం జీవిత కాలం? 
– 6 రోజులు
దేశంలో వరదల వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది?
–ఉత్తరప్రదేశ్‌
ఏ ప్రణాళిక కాలంలో ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించారు?
– 11వ ప్రణాళిక
చార్‌ధామ్‌ వరదల వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోయిన సంవత్సరం? 
– 2013
దాగి ఉన్న మహమ్మారిగా దేన్ని పిలుస్తారు? 
–రోడ్డు ప్రమాదాలు


No comments:

Post a Comment