AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Aptitude & Reasoning (రక్త సంబంధాలు (Blood Relations))

రక్త సంబంధాలు (Blood Relations)

* అందరికీ సుపరిచితమైన అంశం రక్త సంబంధాలు. ఎవరికి ఎవరు ఏమవుతారు అనే అంశం అందరికీ తెలుసు. కానీ రక్త సంబంధాలు దేశ వ్యాప్తంగా అన్నిచోట్ల ఒకే విధంగా ఉండవు.ఉదాహరణకు మన ప్రాంతంలో అమ్మ సోదరుని కొడుకును బావమరిది అని, అమ్మ సోదరుని కూతురుని మరదలు అని అంటాం. కానీ ఉత్తర భారతదేశంలో వీరిని సోదరుడు, సోదరిగా భావిస్తారు. కానీ పరీక్ష పరంగా మాత్రం వీరిని కజిన్ అని చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం..‘కజిన్’ అనే పదానికి తెలుగులో సరైన పదం లేదు. కాబట్టి పరీక్షలో ‘కజిన్’ అని మాత్రమే ఇస్తారు. అమ్మ సోదరి పిల్లల్ని లేదా నాన్న సోదరుని పిల్లల్ని మనం సోదరుడు, సోదరిగా భావించినప్పటికీ పరీక్షల దృష్ట్యా కజిన్ అనేదే సరైన సమాధానం అవుతుంది. ఆంగ్లంలో అంకుల్ అనే పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. సాధారణంగా అమ్మ సోదరుడు (మామ) లేదా నాన్న సోదరుడు (పెదనాన్న లేదా చిన్నాన్న) అంకుల్ అవుతాడు.అదేవిధంగా ఆంగ్లంలో ఆంటీ అనే పదాన్ని తెలుగులో అమ్మ సోదరి (పెద్దమ్మ లేదా చిన్నమ్మ) లేదా నాన్న సోదరి (అత్త)ని పిలవడానికి ఉపయోగిస్తాం.ఒక అబ్బాయి తన అమ్మ లేదా నాన్న ఏకైక కొడుకు అని చెబితే ఆ వ్యక్తిగానే తీసుకోవాలి. ఒక అబ్బాయి తన అమ్మ లేదా నాన్న ఏకైక కూతురు అని చెబితే ఆ అమ్మాయిని, చెప్పిన అబ్బాయికి సోదరిగా భావించాలి.
* పరీక్షల్లో అడిగే వరుసలు
* అమ్మ సోదరి - పెద్దమ్మ/చిన్నమ్మ(ఆంటీ)
* నాన్న సోదరి - అత్త (ఆంటీ)
* అమ్మ సోదరుడు - మామ (అంకుల్)
* నాన్న సోదరుడు - పెదనాన్న / చిన్నాన్న (అంకుల్)
* సోదరుడు లేదా సోదరి - తోడపుట్టినవారు / అమ్మా, నాన్న పిల్లలు అమ్మ లేదా నాన్నల సోదరుడు లేదా సోదరి పిల్లలు - కజిన్
* బావ/బావమరిది - భార్య లేదా భర్త సోదరుడు లేదా సోదరి భర్త
* వదిన/మరదలు- భార్య లేదా భర్త సోదరి లేదా
* సోదరుని భార్య
Q. ఒక వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ అతను, తన నాన్న ఏకైక కుమారుడు అని చెప్పాడు. అయితే అతనికి ఫోటోలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు?
జ.తన నాన్న ఏకైక కొడుకు అంటే అతనే కాబట్టి ఫోటోలో ఉంది తన ఫోటోనే. 
Q. అ ఏకైక కొడుకు ఆ అయితే ఆకి అ ఏమవుతాడు?
జ. అ ఏకైక కొడుకు ఆ. కానీ ఇక్కడ అ లింగం తెలియదు. కాబట్టి అ తల్లి లేదా తండ్రి కావచ్చు. కాబట్టి సరైన సమాధానం చెప్పలేం.
Q.రాధ ఎదరుగా వస్తున్న అబ్బాయిని పరిచయం చేస్తూ, అతను నా సోదరి తండ్రి ఏకైక కొడుకు అని చెప్పాడు. అయితే రాధకు అతను ఏమవుతాడు?
జ. రాధ సోదరి తండ్రి రాధకు తండ్రి అవుతారు. రాధ తండ్రి కొడుకు, రాధకు సోదరుడు అవుతాడు. 
Q. ఒక ఛాయా చిత్రం చూపి ఒకతను ఈ విధంగా చెప్పాడు. ‘నాకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెల్లు కానీ లేరు. కానీ ఆ మానవుని తండ్రి, నా తండ్రి కొడుకు’ ఇది ఎవరి ఛాయా చిత్రం?
జ. నాకు అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు కానీ లేదు అనే వాక్యం ద్వారా అతను, తన తల్లిదండ్రులకు ఏకైక కొడుకు అని తెలుస్తుంది. ఇందులో రెండో వాక్యం ఆ మానవుని తండ్రి, నా తండ్రి కొడుకు అని చెప్పాడు. అంటే ఆ మానవుని తండ్రి అతనే అని అర్థమవుతుంది.
Q. శివ ఎదురుగా వస్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ, ఆమె మా అమ్మ సోదరుని కూతురు అని చెప్పాడు. అయితే శివకు ఆ అమ్మాయి ఏమవుతుంది?
జ.అమ్మ సోదరుడు మామ. మామ కూతురు మరదలు. కానీ పరీక్ష దృష్ట్యా కజిన్ అనేదే సరైన సమాధానం.
Q. మధు ఒకమ్మాయిని పరిచయం చేస్తూ, ఆ అమ్మాయి తల్లి, నా తండ్రి ఏకైక కుమారుడి భార్య అని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి మధుకు ఏమవుతుంది?
జ. మధు అమ్మాయిని పరిచయం చేస్తూ, అమ్మాయి తల్లి గురించి చెప్పాడు. ఆ అమ్మాయి తల్లి, మధు తండ్రి ఏకైక కొడుకు భార్య అని చెప్పాడు. మధు తండ్రి ఏకైక కొడుకు అంటే అతనే అవుతాడు. అంటే ఆ అమ్మాయి తల్లి మధు భార్య అవుతుంది.
ఙ ఆ అమ్మాయి మధుకు కూతురు అవుతుంది.
Q. ధీరజ్, ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ, అతని ఏకైక సోదరుడు, నా కూతురు తండ్రికి అని చెప్పాడు. అయితే ధీరజ్‌కు ఆ వ్యక్తి ఏమవుతాడు?
జ.ధీరజ్ కూతురి తండ్రికి తండ్రి అంటే ధీరజ్‌కు తండ్రి అవుతాడు. కాబట్టి ధీరజ్ తండ్రి, తాను పరిచయం చేస్తున్న వ్యక్తికి సోదరుడు. అంటే ధీరజ్ పరిచయం చేస్తున్న వ్యక్తి, తన తండ్రి సోదరుడు. కాబట్టి అతను ధీరజ్‌కు పెదనాన్న/ చిన్నాన్న (అంకుల్) అవుతాడు.
Q. అ,ఆ సోదరులు. ఇ, ఈ సోదరీమణులు. అ కూతురు ఇ. అయితే ఈకి ఆ ఏమవుతాడు?
జ. ఇ, ఈ సోదరీమణులు. అ కూతురు ఇ. కాబట్టి ఇ, ఈ ఇద్దరు అ కూతుళ్లు.
ఈ తండ్రి సోదరుడు ఆ. కాబట్టి ఈకి ఆ పెదనాన్న/చిన్నాన్న (అంకుల్) అవుతాడు.
Q.వినయ్, రాజును పరిచయం చేస్తూ, ఇతను మానాన్న ఏకైక కొడుకు కొడుకు అని చెప్పాడు. అయితే వినయ్‌కు రాజు ఏమవుతాడు?
జ. వినయ్ నాన్న ఏకైక కొడుకు అంటే వినయ్ అవుతాడు.
వినయ్‌కు రాజు కొడుకు అవుతాడు.
Q. .హర్ష, ఆదిత్యను పరిచయం చేస్తూ, ‘ఇతని తల్లి, మా నాన్న ఏకైక కొడుకు భార్య’ అని చెప్పాడు. అయితే హర్షకు ఆదిత్య ఏమవుతాడు?
జ.హర్ష నాన్న ఏకైక కొడుకు భార్య అంటే హర్ష భార్య అవుతుంది. ఆదిత్య తల్లి, హర్ష భార్య ఒక్కరే. అంటే హర్షకు ఆదిత్య కొడుకు అవుతాడు.
Q. రవి, మధును పరిచయం చేస్తూ, ఇతను నా కూతురు తండ్రి సోదరుడు అని చెప్పాడు. అయితే రవికి మధు ఏమవుతాడు?
జ.రవి కూతురు తండ్రి అంటే రవి అవుతాడు.
ఙ రవికి మధు సోదరుడు అవుతాడు.
Q. .ఒక కుటుంబంలో భార్యాభర్త ఉన్నారు. వారికి ముగ్గురు కొడుకులు. ప్రతీ కొడుక్కి ఇద్దరు సోదరీమణులు. అయితే ఆ కుటుంబంలో ఎంతమంది మగవారు, ఎంతమంది ఆడవారు?
జ.ప్రతి కొడుక్కి ఇద్దరు సోదరీమణులు అంటే 3ప2 = 6 అనేది సరైంది కాదు. వారి ముగ్గురికి కలిపి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అంటే ప్రతీ కొడుక్కి ఇద్దరు సోదరీమణులుగా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబంలోని ఆడ, మగ సభ్యుల సంఖ్యను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
Q. ఫొటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ విజయ్‌ ఇలా అంటున్నాడు. ‘అతను నా తండ్రి తండ్రి భార్యకు ఏకైక కుమారుని భార్యకు ఏకైక కోడలి కుమార్తెకు భర్త’. అయితే ఫొటోలోని వ్యక్తి విజయ్‌కు ఏమవుతాడు?
జ.అల్లుడు
వివరణ: అతను అంటే ఫొటోలోని వ్యక్తి.
నా అంటే చెబుతున్న వ్యక్తి విజయ్‌.
నా తండ్రి తండ్రి భార్య అంటే విజయ్‌ తాతగారికి భార్య అంటే విజయ్‌కు నాయనమ్మ
నా తండ్రి తండ్రి భార్యకు ఏకైక కుమారుని భార్య అంటే విజయ్‌కు తండ్రి భార్య అంటే విజయ్‌కు తల్లి
నా తండ్రి తండ్రి భార్యకు ఏకైక కుమారుని భార్యకు ఏకైక కోడలు అంటే విజయ్‌ తల్లికి ఏకైక కోడలు అంటే విజయ్‌ భార్య.
నా తండ్రి తండ్రి భార్యకు ఏకైక కుమారుని భార్యకు ఏకైక కోడలి కూతురు భర్త అంటే విజయ్‌ భార్య కుమార్తెకు భర్త అంటే విజయ్‌ కుమార్తెకు భర్త అంటే విజయ్‌కు అల్లుడు అవుతారు. 
Q. వేదికపై ఉన్న మహిళను చూపిస్తూ వెంకట్‌ ఇలా అంటున్నాడు. ‘ఆమె నా కుమారుని తల్లి తల్లి భర్తకు ఏకైక కుమార్తె’ అయిన ఆ మహిళకు వెంకట్‌ ఏమవుతాడు?
జ.భర్త
వివరణ: ఆమె అంటే వేదికపై ఉన్న మహిళ
నా అంటే చెబుతున్న వ్యక్తి వెంకట్‌.
నా కుమారుని తల్లి అంటే వెంకట్‌కు కుమారుని తల్లి అంటే వెంకట్‌కు భార్య.
నా కుమారుని తల్లి తల్లి అంటే వెంకట్‌ భార్యకు తల్లి అంటే వెంకట్‌కు అత్తగారు.
నా కుమారుని తల్లి తల్లికి భర్త అంటే వెంకట్‌ అత్తగారికి భర్త అంటే వెంకట్‌కు మామగారు
నా కుమారుని తల్లి తల్లి భర్తకు ఏకైక కుమార్తె అంటే వెంకట్‌ మామగారికి ఏకైక కుమార్తె అంటే వెంకట్‌కు భార్య.
వేదికపై ఉన్న మహిళ వెంకట్‌కు భార్య అవుతుంది. కాని ప్రశ్నలో ఆమెకు వెంకట్‌ ఏమవుతారు అని అడిగారు. కావునా ఆమెకు వెంకట్‌ భర్త అవుతారు. 
Q. ఫొటోలో ఉన్న మహిళను చూపిస్తూ ఆకాష్‌ ఇలా అంటున్నారు. ‘ఆమె భర్త కుమార్తె నా తండ్రికి ఏకైక కుమార్తెకు కుమార్తె’ అయితే ఆ బాలికకు ఆకాష్‌ ఏమవుతాడు?
జ.సోదరుడు
వివరణ: ఆమె అంటే ఫొటోలోని మహిళ
నా అంటే చెబుతున్న వ్యక్తి ఆకాష్‌
ఆమె భర్త కుమార్తె అంటే ఆమెకు కుమార్తె
నా తండ్రికి ఏకైక కుమార్తె అంటే ఆకాష్‌ తండ్రికి కుమార్తె అంటే ఆకాష్‌కు సోదరి.
నా తండ్రి ఏకైక కుమార్తెకు కుమార్తె అంటే ఆకాష్‌కు సోదరి కుమార్తె అంటే ఆకాష్‌కు మేనకోడలు అవుతుంది.
ఆమెకు కుమార్తె ఆకాష్‌కు మేనకోడలు అంటే ఆకాష్‌కు ఆమె సోదరి అవుతుంది. ఆమెకు ఆకాష్‌ సోదరుడు అవుతాడు.
Q.A, B సోదరులు. A సోదరిK. K తల్లి T. F భర్త B. Z కుమారుడు జ. M తల్లి F. N భార్య K. B కుమారుడు M. ఖT తల్లి Y. K కుమార్తె J. N కుమారుడు G. పై సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి
1. T కు N ఏమవుతాడు?
ఎ) అల్లుడు బి) కుమారుడు సి) కోడలు డి) కుమార్తె
2. A కు Y ఏమవుతారు?
ఎ) నాయనమ్మ బి) తాతగారు సి) అమ్మమ్మ డి) తల్లి
3. A కు Y ఏమవుతారు?
ఎ) కుమారుడు బి) అల్లుడు సి) మనుమరాలు డి) కోడలు
4. A కు G ఏమవుతారు?
ఎ) అల్లుడు బి) మేనల్లుడు సి) కుమారుడు డి) బావ
5. B కు N ఏమవుతారు?
ఎ) సోదరుడు బి) కుమారుడు సి) బావ డి) అల్లుడు
6. K కు M ఏమవుతారు?
ఎ) మేనల్లుడు బి) మేనకోడలు సి) కుమారుడు డి) సోదరుడు
7. B కు J ఏమవుతారు?
ఎ) కుమార్తె బి) మనుమరాలు సి) మేనకోడలు డి) సోదరి
జ.వివరణ: భార్యాభర్తల సంబంధాన్ని తెలియ జేస్తుంది. + మగవారిని, - ఆడవారిని సూచిస్తుంది.
సేమ్‌ లైన్ అంటే సోదరి, సోదరుడు, భార్య, భర్త వీరందరిది ఒకే జనరేషన్ కాబట్టి సేమ్‌ లైన్ రాసుకోవాలి.

యారో గుర్తు పైకి చూపిస్తుంది. అంటే కింది వ్యక్తికి పై వ్యక్తి పెద్దవారు అవుతారు. యారో గుర్తు కిందికి చూపిస్తుంది అంటే పై వ్యక్తికి కింది వ్యక్తి చిన్నవారు అవుతారు. ఇక్కడ K, F రెండూ + గుర్తులో ఉన్నవి. అంటే K కి కుమారుడు F.
F కు తండ్రి K.

ఇక్కడ G అక్షరం +లో ఉంది. అంటే మగవారు
J అక్షరం - లో ఉంది. అంటే ఆడవారు.
ఈ గుర్తులు, అక్షరాల సంబంధం ఏమంటే G కి కుమార్తె J. J కి తండ్రి G.

సమాధానాలు వివరణలతో:
1. సమాధానం: ఎ
T కు కుమార్తె K. K కు భర్త N. కాబట్టి T కు N కుమార్తె భర్త అంటే అల్లుడు అవుతారు.
2. సమాధానం: సి
A కు తండ్రి Z. Z భార్య T . A కు T తండ్రి భార్య తల్లి అవుతుంది.
T కు తల్లి Y కాబట్టి A కు Y తల్లి తల్లి అంటే అమ్మమ్మ అవుతుంది.
3. సమాధానం: డి
Zకు A, B కుమారులు. B భార్య F. అంటే Z కు F కుమారుని భార్య అంటే కోడలు అవుతుంది.
4. సమాధానం: బి
A కు సోదరి K. K కుమారుడు G అంటే A కు G సోదరి కుమారుడు అంటే మేనల్లుడు అవుతారు.
5. సమాధానం: సి
A, Bలు సోదరులు. వీరి సోదరి K. K భర్త N. అంటే B కు N సోదరి భర్త అంటే బావ అవుతారు.
6. సమాధానం: ఎ
K కు A, Bలు సోదరులు. B కుమారుడు M. K కు M సోదరుని కుమారుడు అంటే మేనల్లుడు అవుతారు.
7. సమాధానం: సి
A, B లు సోదరులు. వీరి సోదరి K. K కుమార్తె J.
B కు J సోదరి కుమార్తె అంటే మేనకోడలు అవుతుంది.
Q. P, Q భార్యాభర్తలు. L, N సోదరులు. F భర్త L. P తల్లి K. N తండ్రి P. Q తండ్రి R. Q కుమార్తె E. G భర్త R. J భార్య E. పై సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి.
8.P కు G ఏమవుతారు?
ఎ) అత్తగారు బి) మామగారు సి) మేనమామ డి) ఎవరూకాదు
9. K కు Q ఏమవుతారు?
ఎ) కుమారుడు బి) మేనల్లుడు సి) కోడలు డి) కుమార్తె
10. N కు J ఏమవుతారు?
ఎ) బావ బి) మేనకోడలు సి) సోదరుడు డి) కుమారుడు
11. N కు K ఏమవుతారు?
ఎ) అమ్మమ్మ బి) నాయనమ్మ సి) తాతగారు డి) ఎవరూ కాదు
12. Q కు J ఏమవుతారు?
ఎ) మేనల్లుడు బి) కుమారుడు సి) సోదరుడు డి) అల్లుడు
13. F కు P ఏమవుతారు?
ఎ) మామగారు బి) అత్తగారు సి) మేనత్త డి) మేనమామ
14. J కు L ఏమవుతారు?
ఎ) మేనల్లుడు బి) సోదరుడు సి) బావమరిది డి) ఎవరూ కాదు
15. R కు E ఏమవుతారు?
ఎ) మనవడు బి) మనుమరాలు సి) కుమార్తె డి) మేనకోడలు
జ.సమాధానాలు వివరణలతో:
8. సమాధానం: ఎ
P భార్య Q. Q తల్లి G. అంటే P కు G భార్య తల్లి అంటే అత్తగారు అవుతారు.
9. సమాధానం: సి
K కుమారుడు P. P భార్య Q అంటే K కు Q కుమారుని భార్య అంటే కోడలు అవుతుంది.
10. సమాధానం: ఎ
N సోదరి E. E భర్త J. అంటే N కు J సోదరి భర్త అంటే బావ అవుతారు.
11. సమాధానం: బి
N తండ్రి P. P తల్లి K అంటే N కు K తండ్రి తల్లి అంటే నాయనమ్మ అవుతుంది
12. సమాధానం: డి
Q కుమార్తె E. E భర్త J. అంటే Q కు J కుమార్తె భర్త అంటే అల్లుడు అవుతారు.
13. సమాధానం: ఎ
F భర్త L. L తండ్రి P. అంటే F కు P భర్త తండ్రి అంటే మామగారు అవుతారు.
14. సమాధానం: సి
J భార్య E. E సోదరుడు L. అంటే J కు L భార్య సోదరుడు అంటే బావమరిది అవుతారు
15. సమాధానం: బి
R కుమార్తె Q. Q కుమార్తె E అంటే R కు E కుమార్తె కుమార్తె అంటే మనుమరాలు అవుతుంది.
Q.ఒక కుటుంబంలో Q, P, R, S, T అనే అయిదుగురు వ్యక్తులు ఉన్నారు.... I. P, S లు పెళ్లయిన జంట.
II. S పురుషుడు కాదు.
III. T అనే వ్యక్తి P కుమారుడు, Q కుమారుడు P.
IV. T సోదరి R. అయితే S, Q కు ఏమవుతుంది?
జ.కోడలు
వివరణ:
I. నుంచి P, S లు పెళ్లయిన జంట, కాబట్టి వారిని కింది విధంగా సూచించవచ్చు.
II. నుంచి S పురుషుడు కాదు. అంటే S స్త్రీ కాబట్టి
III. నుంచి T అనే వ్యక్తి P కుమారుడు, Q కుమారుడు P. ఈ సంబంధాన్ని కింది విధంగా సూచించవచ్చు.
IV. నుంచి T సోదరి R కాబట్టి, మొత్తం కుటుంబ చిత్రాన్ని కింది విధంగా సూచించవచ్చు.
పక్క చిత్రం ఆధారంగా, S, Q కుమారుడి భార్య, కాబట్టి S, Q కు కోడలు అవుతుంది.
Q. A, B కు సోదరి. C, B కు తల్లి. D, C కు తండ్రి. E, D కు తల్లి. అయితే A, D కు ఏమవుతారు?
జ.మనుమరాలు 
Q. P, Q, R, S, T, U అనే పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వారిలో P, T లు సోదరులు. T సోదరి U. P పినతండ్రి ఒకేఒక కుమారుడు R. Q, S లు R తండ్రి ఒకేఒక సోదరుడి కుమార్తెలు. అయితే R, U కు ఏమవుతారు?
జ.సోదరుడు 
Q. P కుమారుడు Q. Q కుమార్తె X. X మేనత్త R. R కుమారుడు L. అయితే L, P కు ఏమవుతారు?
జ.మనుమడు
Q.Q తండ్రి B. B కు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. R సోదరుడు Q. P కుమార్తె R. P మనుమరాలు జ. A తండ్రి S. అయితే S, Q కు ఏమవుతాడు?
జ.బావ
Q. A, Q, Y, Z లు వేర్వేరు వ్యక్తులు. Q తండ్రి Z. Y కుమార్తె జ. Z కుమారుడు Y. Y కుమారుడు P. P సోదరుడు B అయితే .....
జ.B, Y లు సోదరులు
Q. K సోదరుడు D, సోదరి M. T అనే వ్యక్తి R తండ్రి, M సోదరుడు R. K తల్లి F. అయితే T, F లకు కనీసం ఎంతమంది కుమారులు ఉంటారు?
జ.2
Q. ఒక వ్యక్తి ఒక స్త్రీతో 'నీ తల్లి యొక్క భర్త సోదరి నాకు అత్త' అన్నాడు. అయితే ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది?
జ.సోదరి
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తే..
నీ తల్లి యొక్క భర్త - నీ తండ్రి
నీ తండ్రి యొక్క సోదరి - నీ అత్త
కాబట్టి, ఆ స్త్రీ అత్త అతడికి కూడా అత్త అవుతుంది.
అంటే, ఆ స్త్రీ అతడికి సోదరి అవుతుంది. 
Q.ఒక మహిళను చూపుతూ కౌశిక్ ఇలా అన్నాడు. 'ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె'. అయితే ఆ మహిళ కౌశిక్‌కు ఏమవుతుంది?
జ.మేనత్త
ఈ ప్రశ్నలోని సంబంధాలు..
'నా తల్లి భర్త' అంటే కౌశిక్ తండ్రి,
తండ్రి యొక్క తల్లి అంటే కౌశిక్ నాయనమ్మ
నాయనమ్మ కుమార్తె అంటే కౌశిక్‌కు మేనత్త అవుతుంది. 
Q. A, B లు సోదరులు. C, D లు సోదరీమణులు. A కుమారుడు D కి సోదరుడు. అయితే C కి B ఏమవుతాడు?
జ. పినతండ్రి లేదా చిన్నాన్న
ఈ ప్రశ్నలో B, A యొక్క సోదరుడు, A కుమారుడు, D కి సోదరుడు అంటే D, A యొక్క కూతురు, C, D లు సోదరీమణులు. కాబట్టి C కూడా A కూతురు కాబట్టి C, B యొక్క సోదరుడి కుమార్తె. కాబట్టి, B, C కి పినతండ్రి లేదా చిన్నాన్న అవుతాడు.
Q. ఒక పరిభాషలో P × Q అంటే P కి భార్య Q అనీ, P - Q అంటే Q కు చెల్లి P అనీ, P ÷ Q అంటే P, Q లు అన్నదమ్ములని అర్థం. అయితే, A - B ÷ D లో A కి D ఏమవుతాడు?
జ. సోదరుడు
ఈ ప్రశ్నలో A - B అంటే B కి చెల్లి A అవుతుంది. ఇక్కడ B మగ లేదా ఆడ అంటే జండర్ తెలియదు. తర్వాత B ÷ D అంటే B, D లు అన్నదమ్ములు అవుతారు. ఇక్కడ A కి D ఏమవుతాడన్నప్పుడు 'B' తో సంబంధం లేదు.
కాబట్టి A కి D సోదరుడు అవుతాడని తెలుసుకోవచ్చు. 
Q. రవి సోదరుడు దీపక్. అతుల్ సోదరి రేఖ. రేఖ కుమారుడు రవి. అయితే రేఖకు దీపక్ ఏమవుతాడు?
జ. కుమారుడు
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాచారం ప్రకారం
* రవి సోదరుడు దీపక్.. అంటే, ఇద్దరూ మగవారు
* అతుల్ సోదరి రేఖ అంటే రేఖ ఆడ అవుతుంది.
* రేఖ కుమారుడు రవి. అంటే దీపక్ కూడా రేఖ కుమారుడే అవుతాడు. ఎందుకంటే దీపక్, రవి అన్నదమ్ములు. 
Q.ఒక పార్టీలో ఒక అమ్మమ్మ, తండ్రి, తల్లి నలుగురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క కొడుకు, ఇద్దరిద్దరు కుమార్తెలు చొప్పున ఉన్నారు. కుటుంబంలోని ఆడవారి సంఖ్య ఎంత?
జ. 14
ప్రశ్నలో ఇచ్చిన సమాచారం ప్రకారం కుటుంబంలోని ఆడవారి సంఖ్య: ఒక అమ్మమ్మ + తల్లి + (నలుగురు కొడుకుల భార్యలు) + ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు కుమార్తెలు 1 + 1 + 4 + 8 = 14
Q. అమిత్ రాహుల్ కుమారుడు. రాహుల్‌కు సోదరి అయిన సారికకు సోనీ అనే కొడుకు, రీటా అనే కూతురు ఉన్నారు. రాజా, సోనీకి మేనమామ అయితే అమిత్‌కు సోనీ ఏమవుతాడు?
జ.కజిన్
Q.శ్రీకాంత్ ఒక స్త్రీని చూపిస్తూ ''ఆమె ఒక స్త్రీకి కూతురు ఆ స్త్రీ నా తల్లి భర్తకు తల్లి" అన్నాడు. అయితే శ్రీకాంత్‌కు ఆమె ఏమవుతుంది?
జ. మేనత్త
ఈ ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను కింది విధంగా విశ్లేషించవచ్చు.
తల్లికి భర్త - తండ్రి
తండ్రికి తల్లి - నాయనమ్మ
నాయనమ్మకు కూతురు - తండ్రికి సోదరి
తండ్రికి సోదరి - మేనత్త
శ్రీకాంత్‌కి ఆ స్త్రీ మేనత్త అవుతుంది.
Q.ఒక వ్యక్తి ఒక స్త్రీని చూపిస్తూ ''ఆమె ఏకైక సోదరుడి కొడుకు నా భార్యకు సోదరుడు" అన్నాడు. అయితే ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది?
జ. మామకు సోదరి
ఈ ప్రశ్నలో ఇచ్చిన సమాచారం ప్రకారం
భార్యకు సోదరుడు - బావమరిది
స్త్రీ సోదరుడి కుమారుడు ఆ వ్యక్తికి బావమరిది
కాబట్టి, స్త్రీ సోదరుడు ఆ వ్యక్తి మామ
ఆ స్త్రీ ఆ వ్యక్తి మామకు సోదరి 
Q. ఒక స్త్రీ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ''ఇతడు నా తల్లి తల్లికి ఏకైక కుమారుడు అన్నది. అయితే ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది?
జ.మేనకోడలు
Q.సురేష్ ఒక ఫొటోలోని వ్యక్తిని చూపుతూ ''ఈమె మా తమ్ముడి సోదరి తల్లికి ఏకైక కుమార్తె" అన్నాడు. అయితే ఆ ఫొటోలోని స్త్రీ సురేష్‌కి ఏమవుతుంది?
జ.సోదరి
Q. ఒక పరిభాషలో P+Q అంటే P సోదరి Q అని, P-Q అంటే P సోదరుడు Q అని, P×Q అంటే P భర్త Q అని అర్థం. అయితే A+B-C లో A అనే వ్యక్తి C కి ఏమవుతాడు?
జ.సోదరుడు
Q. లక్ష్మి, మీనాలు రోహన్‌కు భార్యలు. షాలిని మీనాకు పెంపుడుకూతురు. షాలినికి లక్ష్మి ఏమవుతుంది?
జ.తల్లి
Q.B కి సోదరి జ. B తల్లి C. C తండ్రి D. D తల్లి E. అయితే, D కి A ఎవరు?
జ.మనుమరాలు
Q.B సోదరుడు జ. A తండ్రి C. E సోదరుడు D. B కూతురు E. అయితే D మామ ఎవరు?
జ. A


No comments:

Post a Comment