AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

కేరళ (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) కేరళ
అవతరణ: నవంబర్ 1, 1956
విస్తీర్ణం: 38,863 చ.కి.మీ.
రాజధాని: తిరువనంతపురం
సరిహద్దు రాష్ట్రాలు: తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్ 
జనాభా: 3,33,87,677
స్త్రీలు: 1,73,66,387
పురుషులు: 1,60,21,290
జనసాంద్రత: 859
లింగనిష్పత్తి: 1,084 
అక్షరాస్యత: 93.91
స్త్రీలు: 91.98
పురుషులు: 96.02 
మొత్తం జిల్లాలు: 14 (అల్పుజా, ఎర్నాకులం, ఇడుక్కి, కన్నూర్, కసార్‌గడ్ కొల్లాం, కొట్టాయం, కొజికోడ్, మలప్పురం, పాలక్కడ్, పతనం తిట్టా, తిరువనంతపురం, త్రిస్సుర్, వాయనాడ్)
మొత్తం గ్రామాలు: 1,364 
పట్టణాలు: 159
శాసనసభ: ఏకసభ
అసెంబ్లీ సీట్లు: 140
పార్లమెంట్: 
లోక్‌సభ సీట్లు: 20(18+2+0)
రాజ్యసభ: 9 
ప్రధాన రాజకీయ పార్టీలు: ఐఎన్‌సీ, సీపీఐ-ఎం, ముస్లిమ్‌లీగ్ కేరళ స్టేట్ కమిటీ, కేరళ కాంగ్రెస్ (ఎం), సీపీఐ, జేడీ(ఎస్), రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆఫ్ కేరళ, కేరళ కాంగ్రెస్ (బి), కేరళ కాంగ్రెస్ (జే), డెమోక్రటిక్ ఇందిరా కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీఎంపీ.
హైకోర్టు: కోచీ
ముఖ్యభాష: మళయాలం
మతాలు: హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. 
ముఖ్యపట్టణాలు: తిరువనంతపురం,  కోచి, కొజీకోడ్ , త్రిస్సుర్, కన్నూర్, కొట్టాయం, కొల్లం, అల్లపుజహ, పాలక్కడ్, మాలాపురం, పతనంతిట్టా. 
నదులు: పరియార్, బరత్‌పుజా (దీనిని నీల అని కూడా పిలుస్తారు), పంబా, చలియార్, కదుండిఅండ్ చలక్కుడి, అచంకోవిల్, కలడ, మువతుపూజా. మొత్తం 44 నదులున్నాయి. వీటిలో 41 పశ్చిమానికి ప్రవహిస్తాయి.  
పర్వతశిఖరాలు: అనమల, కరింకులం, ముకుట్టి, దేవిమల, అనైముడి(2,265 మీటర్లు) ఎత్తయిన శిఖరం.
జాతీయ పార్కులు: ఎర్నాకులం నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, పరంబికులం నేషనల్ పార్క్, పిప్పర నేషనల్ పార్క్, సెలైంట్ వ్యాలీ.
జలపాతాలు: అత్తిరాపల్లి, విజ్‌హచల్, పలరువి
ఖనిజాలు: లైమ్‌లైట్, రుటైల్, కొలిన్, సున్నపురాయి. 
పరిశ్రమలు: పీచు, జీడిపప్పు రెండు పెద్ద పరిశ్రమలు. చేనేత, వెదురు పరిశ్రమలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. భారతదేశ సముద్రపు ఉత్పత్తుల ఎగుమతుల్లో మూడింట ఒకవంతు కేరళకు చెందినవే. 
వ్యవసాయోత్పత్తులు: కేరళ వాణిజ్య పంటలకు అభివృద్ధి చెందింది. దీనివల్ల ఆహారోత్పత్తుల కొరత ఏర్పడింది. ఇండియా ఉత్పత్తుల్లో 91 శాతం రబ్బరు, 70 శాతం కొబ్బరి, 60 శాతం కర్ర పెండ్లం, దాదాపు 100 శాతం లెమన్ గ్రాస్ ఆయిల్(నిమ్మగడ్డి నూనె) కేరళ ఉత్పత్తులే.
రోడ్ల పొడవు: 1.61 లక్షల చ.కి.మీ
రైల్వేల పొడవు: 1,148 కి.మీ. 
ప్రధానరైల్వే స్టేషన్లు: తిరువనంతపురం, కొల్లాం, చెంగనూర్, తిరువల్ల, కొట్టాయం, అల్పుజ, ఎర్నాకులం, త్రిస్సుర్, పాలక్కడ్, కొజికోడ్, కన్నూర్, కాసర్‌గడ్
విమానాశ్రయాలు: తిరువనంతపురం, నిడుంబస్సరీ (ఇది దేశంలోనే మొదటి ప్రైవేట్ విమానాశ్రయం. 1999లో కోచిలో ఏర్పాటు చేశారు. 
నృత్యం: కథాకళి, మోహిని అట్టం, తెయ్యం, తుల్లాల్, మార్గంకల్లి, 
పండుగలు: ఓనమ్, విష్ణు, రంజాన్, క్రిస్ట్‌మస్, ఆవుల శివరాత్రి


No comments:

Post a Comment