AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Disaster management భూకంపాలు

భూకంపాలు

సాధారణంగా భూమి ఉపరితలం ఆకస్మికంగా కదలడాన్నే భూకంపం అంటారు.
రిక్టర్ స్కేలును అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ రిక్టర్ 1935లో రూపొందించాడు.
భూకంపం సంభవించే భూ అంతర్భాంగంలోని ప్రదేశాన్ని భూకంపనాభి అంటారు.
భూకంప నాభిపై గల భూ ఉపరితల ప్రాంతాన్ని భూకంప అధి కేంద్రం అంటారు.
భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘సిస్మాలజీ’ అంటారు.
ఐసోసెసిమల్ రేఖలు: సమాన భూకంప తీవ్రత గల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోసెసిమల్ రేఖలు అంటారు. ఇవి సాధారణంగా కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి.
భూకంప తరంగ లేఖిని: భూకంప తరంగాలను గుర్తించి, నమోదుచేసే పరికరాన్ని ‘భూకంప తరంగ లేఖిని’ (సిస్మోగ్రాఫ్) అంటారు.
భూకంప తరంగ చిత్రం:  భూకంప తరంగాలను భూకంప లేఖిని ద్వారా గ్రాఫ్‌లా తయారుచేసే చిత్రాన్ని భూకంప తరంగ చిత్రం (సిస్మోగ్రామ్) అంటారు.

భూకంప తరంగాలు మూడు రకాలు. అవి..
 P తరంగాలు 
వీటిని ప్రాథమిక తరంగాలు, పుష్ తరంగాలు అంటారు. ఇవి శబ్ద తరంగాలను పోలి ఉంటాయి. ఇవి S తరంగాల కంటే 1.7 రెట్ల అధిక వేగంతో, అధి కేంద్రం నుంచి 104° కోణంలో వంగి ప్రయాణిస్తాయి. ఇవి ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా అంటే ఎలాంటి మాధ్యమం ద్వారా అయినా ప్రయాణిస్తాయి. వీటి వేగం సెకనుకు 5.4 కి.మీ. నుంచి 13.8 కి.మీ. ఇవి ఒత్తిడి కలిగించే తరంగాలు. భూమి ఉపరితలాన్ని ముందుగా చేరే తరంగాలు ఇవే. ఇవి తరంగ మార్గం వెంట అణువులను ముందుకు, వెనక్కు కదుపుతూ ప్రయాణిస్తాయి.

 S తరంగాలు
 వీటిని గౌణ తరంగాలు, సెకండరీ తరంగాలు అంటారు. కాంతి తరంగాలను పోలి, ప్రయాణించే మార్గానికి లంబ కోణంలో ఉంటాయి. అందుకే వీటి ని తిర్యక్ తరంగాలు అంటారు. ఈ తరంగాలు ద్రవ పదార్థాల ద్వారా ప్రయాణించలేవు. వీటిని చీల్చే తరంగాలని అంటారు. వేగం సెకనుకు 3.2 కి.మీ నుంచి 7.2 కి.మీ. ఇవి తరంగ మార్గం వెంట అణువులను పైకి కిందకు కదుపుతూ ప్రయాణిస్తాయి.

 L తరంగాలు 
 P, S తరంగాలు భూ ఉపరితలానికి చేరేసరికి L తరంగాలుగా మార్పు చెందుతాయి. వీటిని దీర్ఘ తరంగాలు, ర్యాలీ తరంగాలు అంటారు. భూమి ఉపరితలంలో తరంగ మార్గానికి లంబంగా ప్రయాణిస్తే ‘లవ్’ తరంగాలు అని, తరంగ మార్గానికి సముద్ర కెరటంలా వర్తులాకారంలో ప్రయాణిస్తే ‘ర్యాలీ’ తరంగాలు అని అంటారు. ఇవి భూ ఉపరితల పొరల ద్వారా ప్రయాణించడం ద్వారా అత్యధిక నష్టాన్ని కలిగిస్తాయి. వీటి వేగం సెకనుకు 4 కి.మీ. నుంచి 4.3 కి.మీ.

 లోతు ఆధారంగా భూకంపాలు మూడు రకాలు
 1. గాధ భూకంపాలు: భూకంప నాభి 60 కి.మీ. లోతు వరకు ఉంటుంది.
 2. మాధ్యమిక నాభి భూకంపాలు: 60- 300 కి.మీ లోతు వరకు ఉంటాయి.
 3. అగాధ భూకంపాలు: 300-700 కి.మీ. లోతు వరకు ఉంటాయి. వీటిని లోతు నాభి భూకంపాలు అంటారు.

 భూకంప కారణాలు
 1965లో ప్రతిపాదించిన ఫలక విరూపణ సిద్ధాంతం ప్రకారం ఫలకాలు భూప్రావారంపై కదులుతూ, ఒక దానికొకటి తాకినప్పుడు ఒత్తిడి కలుగుతుంది. దీనివ ల్ల ఫలకాల చలనాలు కింది విధంగా ఉండొచ్చు.
 ఒకదానికి దూరంగా మరొక ఫలకం జరగడం.
 ఒకదానికెదురుగా మరొకటి నెట్టుకొని రావడం.
 ఒకదాని అంచుపై మరొక ఫలకం అంచు తాకుతూ వెళ్లడం.
 ఉపరితల కారణాలు: కొండచరియలు జారడం, హిమ సంపాతాలు, సొరంగ పైకప్పులు కూలడం, భూగర్భంలో అణుపరీక్షల వల్ల భూకంపాలు వస్తాయి.
 అగ్నిపర్వత సంబంధ కారణాలు: అగ్ని పర్వతాలు పేలడానికి ముందుగా లేదా పేలిన తర్వాత భూ కంపాలు సంభవిస్తాయి.
 పాతాళ సంబంధ కారణాలు: భూ అంతర్భాగంలో జరిగే రసాయనిక మార్పులు, రేడియోధార్మిక విచ్ఛిత్తి వల్ల భూకంపాలు వస్తాయి. ఇవి 24 కి.మీ నుంచి 640 కి.మీ. లోతులో సంభవిస్తాయి.
 విరూప కారక కారణాలు: భూ అంతర్భాగంలో రాతి పొరల కదలికల వల్ల అవి సర్దుకునే సమయంలో భూకంపాలు వస్తాయి. భూకంపాల్లో ఎక్కువ శాతం విరూప కారక కారణాల వల్లే సంభవిస్తాయి. శక్తిమంత భూకంపాలు సంభవించడానికి కూడా ఇదే కారణం.
 ఉదా: 1906లో శాన్‌ఫ్రాన్సిస్కో భూకంపం.

 స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం: శాన్‌ఫ్రాన్సిస్కో భూకంపం ఆధారంగా ఎఫ్.హెచ్.రీడ్ స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని  ప్రకారం శిలలు స్థితి స్థాపకతను (Elastic) నిరోధిస్తాయి. తర్వాత క్రమంగా వంగి చివరకు బీటలు ఏర్పడి, రాతి పొరలు స్థానభ్రంశం చెందుతాయి. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం పీడన శక్తి వల్ల భూకంపం వస్తుందని రీడ్ వ్యక్తీకరించాడు.

 భూకంప లక్షణాలు
 భూకంప వాస్తవ పగులు ప్రక్రియ కొద్ది సెకన్లు మాత్రమే ఉంటుంది. భూకంపాల వల్ల ఏర్పడే శక్తి తరంగ రూపంలో ఉంటుంది. భూకంపానికి ముందు పాములు, ఎలుకలు భూమి లోపలి నుంచి బయటకు వస్తాయి. భూకంపాలు ఏ సమయంలోనైనా (రాత్రి లేదా పగలు) వచ్చే అవకాశం ఉంది. భూకంపం తీవ్రత భూకంప నాభి వద్ద ఎక్కువ. భారీ భూకంపాలు ఒక నిమిషం పాటు వస్తాయి.

 భూకంపాలు - స్కేళ్లు
రోసీ ఫారల్ స్కేలు: దీన్ని ఫ్రాన్‌‌సలో అభివృద్ధి చేశారు .
షిండే స్కేలు: దీన్ని జపాన్‌లో అభివృద్ధి చేశారు. దీనిలో 1 నుంచి 7 విభాగాలు ఉంటాయి. భూకంప తీవ్రత స్కేలుపై 6 -7 మధ్య ఉంటే నష్ట తీవ్రత అధికంగా ఉంటుంది.
మెర్కిలీ స్కేలు: ఇటలీకి చెందిన మెర్కిలీ దీన్ని రూపొందించాడు. దీనిలో ఐ నుంచి గీఐఐ వరకు విభాగాలుంటాయి. ఈ స్కేల్లోని విభాగాలను రోమన్ అంకెల్లో గుర్తించారు. భూకంప తీవ్రత  XI, XII ఉంటే కట్టడాలు కూలతాయి. నదీ ప్రవాహ మార్గాలు మారతాయి. జన జీవనం
అతలాకుతలం అవుతుంది.

రిక్టర్ స్కేలు: భూతల ప్రకంపనలను నిరంతరం లెక్కించే రిక్టర్ స్కేలును అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ రిక్టర్ 1935లో రూపొందించాడు. దీనిలో 0 నుంచి 9 విభాగాలున్నాయి. మొత్తం 10 విభాగాలు.
 ‘ట్రైనైట్రోటోలిన్’ (TNT) అనే రసాయనిక పదార్థం ద్వారా విడుదలయ్యే శక్తితో భూకంపన శక్తిని పోలుస్తూ రిక్టర్ ఈ విభజన చేశాడు.
స్కేలుపై ఉన్న ప్రతి ఏకాంకం, కిందటి ఏకాకం కంటే 30 రెట్లు అధిక శక్తిని సూచిస్తుంది.
 ఇప్పటి వరకు రిక్టర్ స్కేలుపై నమోదైన పెద్ద భూ కంపం- 1960 చిలీ భూకంపం (తీవ్రత 9.2).

 భారతదేశంలో భూకంప మండలాలు
 భూకంప తీవ్రత ఆధారంగా భారతదేశాన్ని 5 భూకంప జోన్లుగా విభజించారు.
 జోన్ 5: ఈశాన్య భారతదేశం, ఉత్తర బిహార్, పశ్చిమ, మధ్య హిమాలయ ప్రాంతం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ (కాంగ్రా), గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకశ్మీర్ ప్రాంతాలు.
 ఈ జోన్‌ను అత్యంత తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తించారు.
 జోన్ 4: గంగా, సింధూ మైదానం, న్యూఢిల్లీ, శ్రీనగర్, సిక్కిం, అమృత్‌సర్, జలంధర్.
 జోన్ 3: లక్షదీవులు, కేరళ, గుజరాత్, ఏపీ తీర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, నర్మదా నది పగులు లోయ, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దు, మహారాష్ర్ట, తూర్పు, పశ్చిమ కనుమల ప్రాంతాలు.
 దేశంలో ఎక్కువ భాగం ఈ జోన్‌లోనే ఉంది.
 జోన్ 2: తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యభారత్, గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దక్కన్ ప్రాంతం, రాయపూర్, రాంచీ,  జైపూర్ ప్రాంతాలు.
 అయితే 1997లో వల్నరబులిటీ అట్లాస్ ఆఫ్ ఇండియా... భూకంప జోన్ 1ని రెండో జోన్‌లో విలీనం చేసి 2వ జోన్‌గా పేరు మార్చింది. అందువల్ల ప్రస్తుతం భూకంప జోన్లు 4 మాత్రమే.
 2వ జోన్ తక్కువ భూకంప తీవ్రత కలిగింది. కాగా, జోన్ 5లో భూకంప తీవ్రత ఎక్కువ.
 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్‌‌డ (BIS) రూపొందించిన భూకంప మండల మ్యాప్ ప్రకారం దేశంలో 65 శాతానికి పైగా భూభాగం7, అంతకు మించిన తీవ్రతతో భూకంపాలు సంభవించే ముప్పును కలిగి ఉంది.

 భూకంపాలు  - ప్రపంచ విస్తరణ
 ప్రపంచంలో సంవత్సరానికి 10 లక్షల భూ కంపాలు సంభవిస్తున్నట్లు అంచనా. ఇవి ఎక్కువ శాతం సముద్ర గర్భాల్లోనే సంభవిస్తున్నాయి.
 ప్రపంచంలో భూకంప ప్రమాదాలు లేని ఖండం - ఆస్ట్రేలియా.
 విరూప కారక భూకంపాలు అధిక తీవ్రతతో సంభవిస్తాయి.
 పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం: 68% భూ కంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని పసిఫిక్ అగ్ని వలయం లేదా Ring of Fire అంటారు. అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు గల ఈ మేఖలలో ఇండోనేసియన్ ‘ఆర్చిపెలాగో’ కూడా ఉంది.

 ప్రపంచ మధ్య పర్వత ప్రాంతం: 21% భూ కంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తున్నాయి. ఆల్ఫ్స్ పర్వతాల నుంచి కాకసస్ పర్వతాలు, హిమాలయాల వరకు ఈ ప్రాంతం విస్తరించి ఉంది.
 ఇతర ప్రాంతాలు: 11% భూకంపాలు ప్రపంచంలో ఏ ఇతర ప్రాంతంలోనైనా సంభవించే అవకాశం ఉంది.

 భూకంపాల పరిశోధన
 భారతదేశంలో భూకంపాల అధ్యయనం కోసం వాతావరణ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
 వాతావరణ శాఖ 1898లో తొలిసారి కోల్‌కతాలో ఒక అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పింది.
 1961లో హైదరాబాద్‌లో జాతీయ భూ భౌతిక సంస్థ (NGRI)ను నెలకొల్పారు. దీనిలో డిజిటల్ టెలీ వ్యవస్థతో పాటు జియోస్కోప్ వ్యస్థను కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ప్రపంచ భూకంప అధ్యన కేంద్రాలతో అనుసంధానించారు.
 హిమాలయ ప్రాంతాల్లో వచ్చే భూకంపాల అధ్యయనానికి ఉత్తరాఖండ్‌లో రూర్కి వర్సిటీలో భూకంప అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భూకంపాలను తట్టుకునే ఇళ్లు, భవనాల నిర్మాణాలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు.
 జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1851లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ భారత్‌లో తొలిసారి భూకంప ప్రాంతాల రేఖాచిత్రాలను తయారు చేసింది.
 2007 అక్టోబర్‌లో జాతీయ సముద్ర సమాచార కేంద్రాన్ని (INCOIS- Indian National Centre for Ocean Information Services) హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఈ కేంద్రంలో ముందస్తు భూకంప, సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
 మహారాష్ర్టలోని లాతూర్ వద్ద శాశ్వత సిస్మలాజికల్ అబ్జర్వేటరీ కేంద్రాన్ని నెలకొల్పారు.
 2005, జూలైలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, పితోర్‌గఢ్‌లో ముందస్తు భూకంప హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఉపశమన చర్యలు
నిర్మాణాత్మక చర్యలు: భూకంపాలను తట్టుకొనేలా భవనాలు నిర్మించాలి. నది ఒడ్డున, ఒండ్రు నేలల్లో భవనాలు నిర్మించకూడదు.
మునిసిపాలిటీ సిబ్బంది భనవ నిర్మాణాలను పర్యవేక్షించాలి.
నిర్మాణేతర చర్యలు: సురక్షిత భవనాల నిర్మాణానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్‌‌డ్స నిబంధనలను రూపొందిస్తుంది.
ప్రజల్లో అవగాహన పెంచాలి.
భూకంపాల నుంచి రక్షించుకోవటంలో డ్రాప్-కవర్-హోల్డ్ విధానం ఎంతో ప్రభావవంతమైంది.

జాతీయ భవన నిర్మాణ కోడ్: దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్యక్రమాల క్రమబద్ధీకరణకు 1970లో భుత్వం జాతీయ భవన నిర్మాణ కోడ్ (NBC)ని రూపొందించింది. దీన్ని 1983లో సమీక్షించారు. దీనికి 1987లో రెండు, 1977లో ఒక సవరణ చేశారు. సమీక్షించిన భవన నిర్మాణ
కోడ్‌ను 2005లో ప్రారంభించారు.
భవనాలు దీర్ఘ చతురస్రాకార ప్రణాళిక  కలిగి ఉండాలి.
పొడవైన గోడలు, పటిష్ట కాంక్రీట్ స్తంభాలు ఉండాలి.
T, L, U, X ఆకారంలో ఉండే భవనాలకు మధ్యలో ఖాళీ వదిలి, దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా విభజించాలి.
కిటికీలు, తలుపులు చిన్నవిగా గోడల మధ్యలో ఉండాలి. మూలలు, గోడలు కలిసే చోట నిలువు దూలాలు (వెర్టికల్ రెయిన్ ఫోర్‌‌సమెంట్) ఏర్పాటుచేయాలి.


No comments:

Post a Comment