AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

అండమాన్ నికోబర్ దీవులు (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

  (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)అండమాన్ నికోబర్ దీవులు

అవతరణ:నవంబర్1, 1956 లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. 
విస్తీర్ణం: 8,249 చ.కి.మీ.
రాజధాని: పోర్ట్‌బ్లేయర్
సరిహద్దు రాష్ట్రాలు: లేవు(చుట్టూ సముద్రం ఉంది)
జనాభా: 3,79,944
స్త్రీలు: 1,77,614
పురుషులు: 2,02,330
జనసాంద్రత: 46
లింగనిస్పత్తి: 878
అక్షరాస్యత: 86.27
స్త్రీలు: 81.84
పురుషులు: 90.11
మొత్తం జిల్లాలు: 3 (సౌత్ అండమాన్, నికోబర్, నార్త్ అండ్ మిడిల్ అండమాన్)
మొత్తం గ్రామాలు: 501
పట్టణాలు: 3
శాసనసభ: లేదు
పార్లమెంట్
లోక్‌సభ: 1
రాజ్యసభ: లేదు
హైకోర్టు: కొల్‌కత హైకోర్టు., పోర్ట్ బ్లేయర్‌లో సర్క్యూట్ బెంచ్
ముఖ్యభాష: స్థానిక మాండలికాలు, నికోబరిస్, బెంగాళి, హిందీ, తెలుగు, తమిళం, మళయాళం
ప్రధాన పట్టణాలు: శ్యామ్‌నగర్, నబగ్రామ్, మయాబండర్, ఉత్తర, చెక్‌పాయింట్, హార్బర్ తహాడ్, బేంబో ఫ్లాట్, రైటోమ్యో. పోర్ట్ మిడ్‌వో, వాండోర్.
పర్వతశిఖరాలు: అండమాన్ నికోబర్ దీవుల్లో శిఖరాలు సముద్రంలో లోపల నుంచి 1000 కి.మీ. దూరంలో ఉన్న మయన్మార్, సుమత్రా దీవుల వరకు వ్యాపించి ఉన్నాయి. వీటిలో ఒకటి 732 మీటర్లు ఎత్తయినది.
వ్యవసాయం: మొత్తం 48 ,594 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. 25 న్యూస్ పేపర్లు, 316 స్కూల్స్ ఉన్నాయి. 57 ఓడలతోపాటు 30, 000 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌తో పాటు అన్ని గ్రామాలకు విద్యుత్ సౌరక్యం ఉంది. 
పరిశ్రమలు: ఐలాండ్‌లో 1421 గుర్తింపు పొందిన చిన్నతరహా గ్రామీణ పరిశ్రమలున్నాయి. ఉదాహరణకు: చేపల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, బేవరేజస్, శీతల పానియాలు, పెయింట్, పీవీసీ కన్‌డ్యూయిట్ పైపులు, ఫర్నిచర్, హస్తకళలలు మొదలైన వస్తువులు.
వ్యవసాయోత్పత్తులు: వరి, పప్పుదాన్యాలు, కొబ్బరి, కాఫీ, చెరకు.
రవాణా: విమాన, నీటి రవాణా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. విమాన మార్గాన చెన్నై, కొల్‌కతకు, నీటి మార్గాన చెన్నై, కొల్‌కత, విశాఖపట్నానికి కూడా రవాణా సౌకర్యం ఉంది. అక్కడ ఉండే చిన్న చిన్న దీవులను మర బోట్లు, జట్టీలు కలుపుతుంటాయి
విమనాశ్రయం: ఫోర్ట్ బ్లెయర్.
అభయారణ్యాలు: మహాత్మాగాంధీ మెరైన్ నేషనల్ పార్క్. బరెన్, నర్కండమ్, నార్త్ రెఫ్, సౌత్ సాంటినెల్.
దీవులు: హేవ్‌లాక్, నీల్, జోలీ, బ్యూయ్, సింక్యూ, రెడ్‌స్కిన్, చిడియా తాపు(బర్డ్ ఐలాండ్), విపర్ ఐలాండ్.
బీచ్‌లు:  కార్బెన్ కేవ్, రాధనగర్, కట్‌బె ర్ట్‌బే, కర్మటాంగ్, రాఫ్ అండ్ స్మిత్, వాండోర్ బీచ్‌లు.


No comments:

Post a Comment