AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

Aptitude & Reasoning (ఊహనలు - తీర్మానాలు(Assumptions - Conclusions))

ఊహనలు - తీర్మానాలు(Assumptions - Conclusions)

తీర్మానం (Conclusion) : ఇచ్చిన వాక్యం లేదా భాగం ఆధారంగా ఒక విషయాన్ని ఊహించి, నిర్ణయించడాన్ని తీర్మానం అంటారు. ఈ విభాగంలో ఇచ్చే ప్రశ్నలు ఒక ఊహనం లేదా ఊహనల సమూహంపై ఆధారపడి ఉంటాయి. ఇచ్చిన తీర్మానానికి ఏ ఊహనలు సరిపోతాయో అభ్యర్థి నిర్ణయించాలి.
* ఇంగ్లిష్‌లో ఉండే (Conclusion) కు తెలుగులో తీర్మానం, ముగింపు తదితర అర్థాలున్నాయి.
ఊహనం(Assumption): ఊహనం అంటే ఊహించింది లేదా ఒక భావన (ఇలా ఉంటుంది) అని అర్థం.
* ఇంగ్లిష్‌లో ఉండే (Assumption)కు తెలుగులో 'ఊహనం, తలంచు, అనుకొను' తదితర అర్థాలు ఉంటాయి.

కింది ప్రతి ప్రశ్నకు రెండు ఊహనలు I, II ఉంటాయి. వాటిద్వారా ఒక తీర్మానం చేయవచ్చు. ఊహనలు అసంబద్ధం కావచ్చు. కానీ తీర్మానం ఊహనలతో అధిక సంబంధం కలిగి ఉంటుంది. మీరు మొదట ఊహనలను తీసుకుని, ఇచ్చిన తీర్మానాన్ని నిర్ణయించి, జవాబును గుర్తించాల్సి ఉంటుంది.
Q.ఊహనలు: I. 30 ఏళ్లకు పైబడిన ఏ వ్యక్తి సమావేశంలో పాల్గొనకూడదు. 
II. గోపాల్ సమావేశంలో పాల్గొన్నాడు. 
తీర్మానం: గోపాల్ వయసు 30 సంవత్సరాలకంటే తక్కువ. 
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం 
జ. ఎ 
సాధన: ఊహనం I ప్రకారం ఏ వ్యక్తి సమావేశంలో పాల్గొనవచ్చో ఆ వ్యక్తికి 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. ఊహనం II ప్రకారం గోపాల్ సమావేశంలో పాల్గొన్నాడు. అంటే, అతడికి 30 ఏళ్లకంటే తక్కువగా ఉన్నట్లు అర్థం. కాబట్టి, ఇచ్చిన రెండు ఊహనల నుంచి గోపాల్ వయసు 30 ఏళ్ల కంటే తక్కువ అని కచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి, ఇచ్చిన తీర్మానం 'సత్యం' అవుతుంది 
Q. ఊహనలు: I. నాకు ఒక పోలీసు అధికారి తెలుసు.
II. అతడు ఎక్కువగా తాగుతాడు.
తీర్మానం: అందరు పోలీసు అధికారులూ ఎక్కువగా తాగుతారు.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ.డి
సాధన: చాలా మంది పోలీసు అధికారుల్లో ఒకరు మాత్రమే నాకు తెలుసు. అతడు ఎక్కువగా తాగుతాడు. అతడికి ఉండే లక్షణాలు మిగిలిన పోలీసు అధికారులకూ ఉంటాయని అనుకోలేం. కాబట్టి ఇచ్చిన తీర్మానం 'సందిగ్ధమైంది' అవుతుంది. 
Q. ఊహనలు: I. సాధారణంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లు పెళ్లి చేసుకోరు.
II. రోనాల్డో బ్రెజిల్ దేశం ఫుట్‌బాల్ ఆటగాడు.
తీర్మానం: రోనాల్డో పెళ్లి చేసుకోకుండా ఉండాలి.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ. డి
సాధన: ఊహనం I. సాధారణంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లు పెళ్లి చేసుకోరు. అయితే కచ్చితంగా పెళ్లి చేసుకోకూడదనే నియమం లేదు. అంటే కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం. ఊహనం II. ప్రకారం రోనాల్డో బ్రెజిల్ దేశం ఫుట్‌బాల్ ఆటగాడు. అతడు పెళ్లి చేసుకుంటాడో, చేసుకోడో కచ్చితంగా చెప్పలేదు. కాబట్టి ఇచ్చిన తీర్మానాన్ని నమ్మలేం. కాబట్టి, ఇచ్చిన తీర్మానం 'సందిగ్ధమైంది' అవుతుంది.
Q. ఊహనలు: I. పక్షులు గాలిలో ఎగురుతాయి.
II. చేపలు సముద్రంలో ఈదుతాయి.
తీర్మానం: సింహాలు నేలపై నడుస్తాయి.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ. ఎ
సాధన: ఊహనం I. పక్షులు గాలిలో ఎగురుతాయి. అంటే పక్షులు కచ్చితంగా గాలిలోనే ఎగురుతాయి.
ఊహనం II. చేపలు సముద్రంలో ఈదుతాయి. అంటే చేపలు సముద్రంలో కచ్చితంగా ఈదుతాయి. ఇచ్చిన తీర్మానంలో సింహాలు నేలపై నడుస్తాయి. అంటే అవి తప్పక నేలపై నడుస్తాయి. దీని ద్వారా ఇచ్చిన తీర్మానాన్ని కచ్చితంగా నిర్ధరించవచ్చు. కాబట్టి, తీర్మానం 'సత్యం' అవుతుంది.
Q. ఊహనలు: I. M, N ల వెనుక P ఉంది.
II. P వెనుక Q ఉంది.
తీర్మానం: M వెనుక Q ఉంది.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ.సి
సాధన: ఊహనంI. M, N ల వెనుక P ఉంది. కానీ, ఎటు వైపు నుంచి వెనుక ఉందో కచ్చితంగా చెప్పలేదు. ఊహనం II ద్వారా P వెనుక Q ఉంది. అంటే M, N వెనుక ఉంది. ఇచ్చిన తీర్మానంలో దిశను ఇవ్వలేదు. కాబట్టి, బహుశా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. కాబట్టి, ఇచ్చిన తీర్మానం 'అసంగతమైంది' అవుతుంది. దీన్ని పటం రూపంలో చూస్తే మనం దిశ ఇవ్వలేదు కాబట్టి పడమర, తూర్పు దిశల నుంచి చూస్తే..
ఊహనం I నుంచి పడమరవైపు నుంచి P, N, M, N, P తూర్పువైపు నుంచి
ఊహనం II నుంచి పడమర వైపు నుంచి Q, P, Q తూర్పు వైపు నుంచి
M వెనుక Q బహుశ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
Q.ఊహనలు: I. హెచ్.పి. ఒక వాయువు.
II. ఈ సిలిండర్‌లో వాయువు ఉంది.
తీర్మానం: ఈ సిలిండర్‌లో హెచ్.పి. ఉంది.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ. డి
సాధన: ఊహనం I లో హెచ్.పి. అనేది ఒక వాయువు అని కచ్చితంగా ఇచ్చారు.
ఊహనం II లో ఈ సిలిండరులో వాయువు ఉందని పేర్కొన్నారు. అంటే దానిలో కచ్చితంగా హెచ్.పి. వాయువు ఉందని మనం నమ్మలేం. కాబట్టి, ఇచ్చిన తీర్మానం 'సందిగ్ధమైంది' అవుతుంది.
Q. ఊహనలు: I. విమానాలకు రెక్కలుండవు.
II. జంతువులకు రెక్కలుండవు.
తీర్మానం: అందువల్ల విమానాలు జంతువులు.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ. బి
సాధన: ఊహనలు I, II మధ్య సంబంధాన్ని నిర్ధరించలేం. ఎందుకంటే ఊహనం I లో ఉన్న వర్గానికి ఊహనం II లో ఉన్న వర్గానికి మధ్య సంబంధాన్ని కనుక్కోవడం సాధ్యంకాదు. కాబట్టి తీర్మానంలో పేర్కొన్నట్లు విమానాలు జంతువులు కావు. ఇది కచ్చితంగా అసత్యం.
Q.ఊహనలు: I. స్వాతంత్య్ర సమర యోధులకు తామ్ర పత్రాలు ఇస్తారు.
II. కృష్ణ ఒక స్వాతంత్య్ర సమరయోధుడు.
తీర్మానం: కృష్ణకు తామ్రపత్రం ఇచ్చారు.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ. ఎ
సాధన: ఊహనం I. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారికి తామ్రపత్రాలు ఇస్తారు.
II. కృష్ణ ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అంటే అతడికి కచ్చితంగా తామ్రపత్రం ఇస్తారు. ఇచ్చిన తీర్మానం 'సత్యం' అవుతుంది.
Q.ఊహనలు: I. ఆడపిల్లలందరూ మోడలింగ్‌పై ఆసక్తి చూపిస్తారు.
II. Y కి మోడలింగ్‌పై ఆసక్తి లేదు.
తీర్మానం: Y ఆడపిల్లకాదు.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ. ఎ
సాధన: ఊహనం I. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆడపిల్ల కావాలి. ఊహనం II ప్రకారం Y కి మోడలింగ్‌పై ఆసక్తిలేదు. అంటే Y ఆడపిల్లకాదు అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇచ్చిన తీర్మానంలో Y ఆడపిల్లకాదు. అది కచ్చితంగా 'సత్యం' అవుతుంది. 
Q. ఊహనలు: I. చాలామంది హిందువులు, సిక్కులు పాకిస్థాన్ యాత్రకు వెళతారు.
II. పాకిస్థాన్ నుంచి చాలామంది మహమ్మదీయులు భారతదేశ పుణ్యక్షేత్రాలకు వస్తారు.
తీర్మానం: భారత, పాకిస్థాన్ల మధ్య పరస్పర అంగీకారం ఉంది.
ఎ) సత్యం బి) అసత్యం సి) అసంగతం డి) సందిగ్ధం
జ. ఎ
సాధన: ఊహనం I ప్రకారం హిందువులు, సిక్కులు పాకిస్థాన్‌కు యాత్రకు వెళతారు.
ఊహనం II ప్రకారం పాకిస్థాన్ నుంచి చాలామంది మహమ్మదీయులు భారతదేశ పుణ్యక్షేత్రాలకు వస్తారు. ఇచ్చిన తీర్మానంలో భారత్, పాకిస్థాన్ల మధ్య పరస్పర అంగీకారం ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా సత్యం అవుతుంది.


No comments:

Post a Comment