AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

Aptitude & Reasoning (కోడింగ్ - డీకోడింగ్ (Coding - Decoding))

కోడింగ్ - డీకోడింగ్ (Coding - Decoding)

* కోడింగ్ అంటే ఒక పదాన్ని లేదా సారాంశాన్ని మూడో వ్యక్తి గుర్తించకుండా సంకేతాలతో ఇవ్వడం. డీకోడింగ్ అంటే అలా సంకేతాలతో ఇచ్చిన పదాలను లేదా సారాంశాన్ని మామూలు పదంగా మార్చడం.
* టెస్ట్ ప్రశ్నలో ఇచ్చిన కోడ్ భాషను అభ్యర్థి గుర్తించి అదే విధంగా డీకోడింగ్ చేయగలుగుతున్నాడా లేదా అనే అంశాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిందే ఈ కోడింగ్, డీకోడింగ్.
* ఇచ్చిన పదాలు, సంఖ్యలు వాటి మధ్య సంబంధాలు నిజమైనవి కావు. అవి ఊహాత్మకమైనవి.
* రహస్య విషయాలు దానికి సంబంధించిన వ్యక్తులకు తప్ప మిగిలినవారికి తెలియకుండా ఉండేందుకు ఈ కోడింగ్ ఉపయోగిస్తారు.
* కోడింగ్, డీకోడింగ్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలను సాధన చేయడానికి ముందు అభ్యర్థికి అల్ఫాబెటికల్ ఆర్డర్‌మీద మంచి అవగాహన అవసరం. అలాగే రివర్స్ ఆర్డర్ మీద కూడా అవగాహన ఉండాలి.

కోడింగ్ - డీకోడింగ్ రకాలు

1. లెటర్ కోడింగ్
2. నెంబర్ కోడింగ్
3. నెంబర్ to లెటర్ కోడింగ్
4.మిక్స్‌డ్ కోడింగ్
5. ప్రతిక్షేపణ
6. మిక్స్‌డ్ లెటర్ కోడింగ్
7.మిక్స్‌డ్ నెంబర్ కోడింగ్

Letter Coding: దీనిలో ఒక ఇంగ్లిష్ పదాన్ని, దాని కోడ్ రూపాన్ని ఇచ్చి వేరే పదానికి కోడ్ రూపాన్ని లేదా కోడ్ రూపానికి సంబంధించిన పదాన్ని కనుక్కోవాలని అడుగుతారు.
Number Coding: దీనిలో సంఖ్యలను, ఆంగ్ల పదాలకు కోడ్‌గా లేదా ఆంగ్లపదాలను సంఖ్యలకు కోడ్‌గా ఇస్తారు.
Number to letter coding: దీనిలో ఒక సంఖ్యకు ఒక ఆంగ్ల అక్షరాన్ని కోడ్‌గా ఇస్తే, కొన్ని సంఖ్యల సమూహానికి కోడ్ కనుక్కోవాలి.
Matrix Coding: ఇందులో ఒక పదం ఇస్తారు. దానికి సంబంధించిన రెండు matrix ఇస్తారు. అందులో ఉన్న అక్షరానికి నిలువు లేదా అడ్డు వరుసల ద్వారా కోడ్ కనుక్కోవాలి.
Substitution: దీనిలో కొన్ని పదాలు లేదా వస్తువులు వేరొక పదంతో కోడ్ చేసి ఉంటాయి.
Mixed Letter Coding: దీనిలో 3 లేదా 4 పదాలున్న వాక్యాలను, వాటి కోడ్‌లను ఇచ్చి ఆ వాక్యాల్లో ఉన్న ఏదో ఒక పదం కోడ్ కనుక్కోమంటారు.
Mixed Number Coding: దీనిలో కొన్ని సంఖ్యలను ఆంగ్ల పదాలుగా కోడ్‌చేసి ఆ సంఖ్యల్లోని ఏదో ఒక అంకె కోడ్ అడుగుతారు.

A = 1 = Z 
B = 2 = Y
C = 3 = X
D = 4 = W
E = 5 = v
F = 6 = U
G = 7 = T
H = 8 = S
I = 9 = R
J = 10 = Q
K = 11 = P
L = 12 = O
M = 13 = N
N = 14 = M
O = 15 = l
P = 16 = K
Q = 17 = J 
R = 18 = I
S = 19 = H
T = 20 = G
U = 21 = F
V = 22 = E
W = 23 = D
X = 24 = C
Y = 25 = B
Z = 26 = A
Q. ఆంగ్ల వర్ణమాలలో ఎడమవైపు నుంచి 12వ అక్షరానికి ఎడమవైపు ఉన్న 5వ అక్షరం ఏది?
జ.ఆంగ్ల అక్షరక్రమంలో అక్షరాల స్థానాలను ఒకే దిశలో (ఎడమ నుంచి ఎడమ లేదా కుడి నుంచి కుడి వైపు) ఇచ్చి, అక్షర స్థానాన్ని కనుక్కోమంటే... ఆయా స్థానాల భేదాల్లో ఉన్న సంఖ్యను సూచించే అక్షరమే సమాధానం అవుతుంది.
పై సూచన నుంచి, ఎడమవైపు ఉన్న 5వ అక్షర స్థానం: 12 - 5 = 7. అంటే 7వ స్థానంలో ఉన్న అక్షరం G.
 
Q. ఆంగ్ల అక్షరమాలలో కుడివైపు నుంచి 11వ అక్షరానికి కుడివైపు వచ్చే 6వ అక్షరం ఏది?
జ.11 - 6 = 5.
కుడివైపు నుంచి 5వ అక్షరం V .
లేదా
ఎడమవైపు నుంచి కనుక్కోవడానికి 27 - 5 = 22వ అక్షరం 'V'.
Q. ఆంగ్ల అక్షర క్రమంలో ఎడమవైపు నుంచి 16వ అక్షరానికి కుడివైపున ఉన్న 7వ అక్షరం ఏది?
జ.ఆంగ్ల అక్షరక్రమంలో అక్షరాల స్థానాలను వేర్వేరు దిశల్లో (ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి) ఇస్తే... అక్షర స్థానం, ఇచ్చిన స్థానాల మొత్తంలోని అక్షరం అవుతుంది.
పై సూచన నుంచి, 16 + 7 = 23వ స్థానంలో ఉన్న అక్షరం W.
కాబట్టి ఎడమవైపు నుంచి 16వ అక్షరానికి కుడివైపు ఉన్న 7వ అక్షరం W అవుతుంది.
Q. ఆంగ్ల అక్షరక్రమంలో కుడివైపు నుంచి 7వ అక్షరానికి ఎడమవైపు ఉన్న 9వ అక్షరం ఏది ?
జ.అక్షర స్థానాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, 9 + 7 = 16
కుడివైపు నుంచి 16వ స్థానంలో ఉన్న అక్షరం 'K'.
Q. ఆంగ్ల అక్షరమాలలో A నుంచి ప్రారంభించి 'సరి' స్థానంలో ఉండే ప్రతి అక్షరాన్ని తొలగిస్తూ పోతే (అంటే 2వ, 4వ, 6వ....), కుడి చివరి నుంచి 10వ అక్షరం ఏమవుతుంది?
జ.అక్షరమాలలో A నుంచి ప్రారంభించి 2వ, 4వ, 6వ.. అక్షరాలని తొలగిస్తే, అక్షరక్రమం కింది విధంగా ఉంటుంది.
A C E G I K M O Q S U W Y
పై క్రమంలో కుడి చివరి నుంచి 10వ అక్షరం 'G'.
Q. ఆంగ్ల అక్షరమాలలో మొదటి సగం (A నుంచి M వరకు ఉన్న) అక్షరాలను వ్యతిరేక క్రమంలో (M నుంచి A వరకు) రాసినప్పుడు కుడివైపు నుంచి 8వ అక్షరానికి ఎడమవైపు వచ్చే 8వ అక్షరం ఏది?
జ.అక్షరమాలలో మొదటి సగం అంటే A నుంచి M వరకు ఉన్న అక్షరాలను వ్యతిరేక క్రమంలో రాస్తే కింది విధంగా ఉంటుంది.
MLKJIHGFEDCBA
కుడివైపు నుంచి 8వ అక్షరమైన 'H' కు ఎడమవైపున వచ్చే 8వ అక్షరం 'C'.
Q. CAPCET అనే ఆంగ్ల పదంలోని అక్షరాలను సరైన క్రమంలో ఉంచితే ఒక అర్థవంతమైన పదం వస్తుంది. ఆ పదంలోని చివరి అక్షరం ఏది?
జ.CAPCET లోని అక్షరాలను సరైన క్రమంలో రాస్తే వచ్చే పదం 'ACCEPT'. దీనిలోని చివరి అక్షరం 'T'.
Q. 'PERVERSION' అనే పదంలోని 1-6, 2-7, 3-8, 4-9, 5-10 స్థానాల్లోని అక్షరాలను పరస్పరం మార్పిడి చేశాక కుడివైపు నుంచి 7వ అక్షరం ఏమవుతుంది?
జ.'PERVERSION' అనే పదంలోని అక్షరాలను దత్తాంశం ఆధారంగా మార్పిడి చేస్తే, కింది విధంగా మారుతుంది.
RSIONPERVE
ఇందులోని 7వ అక్షరం 'O' అవుతుంది.
Q.'SECRETARIAT' అనే పదంలోని 2వ, 4వ, 6వ, 10వ అక్షరాలతో అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. ఆ పదంలోని అక్షరాలతో, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఏర్పడితే సమాధానం M, అర్థవంతమైన పదాలు ఏర్పడకపోతే X అవుతుంది. అయితే సరైన సమాధానం ఏది?
జ.'SECRETARIAT' పదంలోని 2వ, 4వ, 6వ, 10వ అక్షరాలు: E, R, T, A .
అర్థవంతమైన పదాలు TEAR, TARE, RATE. కాబట్టి సమాధానం M అవుతుంది.
Q. ఆంగ్ల వర్ణమాలలో A ను చిన్న ఆంగ్ల అక్షరంతోనూ, తర్వాత వచ్చే B ను పెద్ద ఆంగ్ల అక్షరంతోనూ సూచిస్తూ, మిగిలిన అన్ని అక్షరాలను ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి రాశారు. ఈ అమరిక ప్రకారం జులై నెల తర్వాత వచ్చే 3వ నెలను ఎలా సూచించవచ్చు?
జ.దత్తాంశం నుంచి మారిన ఆంగ్ల అక్షరక్రమం కింది విధంగా ఉంది.
a B c D e F g H i J k L m N o P q R s T u V w X y Z.
జులై తర్వాత 3వ నెల అక్టోబర్ (OCTOBER) 'OcToBeR' గా మారుతుంది.
Q. ఒక గడియారంలోని 12 అంకెలను ఆంగ్ల అచ్చులైన a, e, i, o, u లతో వరుసగా సూచిస్తే (అంటే 1ను aతో, 3ను iతో) ఉదయం 10.30కు గంటల ముల్లు ఏయే అక్షరాల మధ్య ఉంటుంది?
జ.a, u
Q. ఆంగ్ల అక్షరమాలను వ్యతిరేక క్రమంలో రాసి, Yతో ప్రారంభించి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే (ఏకాంతరంగా) అక్షరాలను తొలగించారు. ఇలా ఏర్పడిన అమరికలో మధ్య ఉండే అక్షరం ఏది?
జ.ఆంగ్ల అక్షరమాలను వ్యతిరేక క్రమంలో రాస్తే కింది విధంగా ఉంటుంది.
Z Y X W V U T S R Q P O N M L K J I H G F E D C B A
పై క్రమంలో, Y తో ప్రారంభించి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అక్షరాలను తొలగించగా అక్షరక్రమం కింది విధంగా మారుతుంది.
Z X V T R P N L J H F D B
పై అక్షరక్రమంలో 13 అక్షరాలున్నాయి. కాబట్టి 7వ అక్షరమైన 'N' మధ్యలో ఉండే అక్షరం అవుతుంది.
Q.TAIL ను VCKN గా రాస్తే, PEACEని ను ఎలా రాయవచ్చు?
జ. RGCEG
వివరణ: TAILలోని ప్రతి అక్షరాన్ని, రెండు అక్షరాల తర్వాత వచ్చే అక్షరంగా కోడ్ చేశారు. దీని ఆధారంగా PEACEను RGCEG విధంగా రాయవచ్చు.
Q.ఒక సంకేత భాషలో TRIPPLEను SQHOOKDగా రాస్తే, DISPOSEను ఏ విధంగా రాస్తారు?
జ.CHRONRD
వివరణ: TRIPPLE లోని ప్రతి అక్షరాన్ని దాని ముందు అక్షరంతో కోడ్ చేశారు. అదేవిధంగా DISPOSEను CHRONRDగా రాయవచ్చు.
Q. ఒక సంకేత భాషలో CAPITAL ను DCSMYGS గా రాస్తే, NATIONను ఏ విధంగా రాస్తారు?
జ.OCWMTT
వివరణ: CAPITAL లోని ప్రతి అక్షరాన్ని వరుసగా +1, +2, +3, +4, +5, +6, +7 స్థానాల తర్వాత వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. అదేవిధంగా DCSMYGSను OCWMTTగా రాయవచ్చు.
Q. ఒక సంకేత భాషలో STATE ను RRXPZగా రాస్తే INDIAను ఎలా రాయవచ్చు?
జ. HLAEV
వివరణ: STATE లోని ప్రతి అక్షరాన్ని వరుసగా -1, -2, -3, -4, -5 స్థానాల తేడాతో వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. అదే విధంగా INDIAను కోడ్ చేస్తే HLAEVగా ఉంటుంది.
Q. ఒక సంకేత భాషలో RAMANIను XFWFPJగా రాస్తే RAVALIని ఏ విధంగా రాయవచ్చు?
జ.XFZDNJ
వివరణ: RAMANI లోని ప్రతి అక్షరాన్ని +6, +5, +4, +3, +2, +1 స్థానాల తేడాల్లో వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. ఈ అమరిక ఆధారంగా RAVALIని XFZDNJగా రాయవచ్చు. 
Q. ఒక సంకేత భాషలో TELANGANA ను KWEUICXLZ గా రాస్తే ANDRA ను ఏ విధంగా రాస్తారు?
జ.VJAPZ
వివరణ: TELANGANA లోని అక్షరాలను వరుసగా -9, -8, -7, ....., -2,-1 స్థానాల తేడాతో వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. ఈ కోడ్ ఆధారంగా ANDRAను VJAPZగా రాయవచ్చు.
Q.ఒక సంకేత భాషలో CONVENTIONALను NOCENVIOTLANగా రాస్తే ENTHRONEMENTను ఏ విధంగా రాస్తారు?
జ.TNEROHEMNTNE
వివరణ:అక్షరాలను వ్యతిరేక క్రమంలో రాశారు. అలాగే 2, 3 సెట్లలో... 2, 3 అక్షరాలను 1, 2 అక్షరాలుగా; 1వ అక్షరాన్ని 3వ అక్షరంగా రాశారు. అదే విధంగా ENTHRONEMENTను ENT/HRO/NEM/ENTగా రాసి పై విధంగా కోడ్ చేస్తే TNEROHEMNTNEగా మారుతుంది. 
Q. ఒక సంకేత భాషలో VIJAYAWADAను ADAWAYAJIV గా రాస్తే HYDERABADను ఏ విధంగా రాస్తారు?
జ.DABAREDYH
వివరణ: VIJAYAWADA లోని అక్షరాలను వ్యతిరేక క్రమంలో రాస్తే ADAWAYAJIVగా మారుతుంది. అలాగే HYDERABAD ను DABAREDYHగా మారుతుంది. 
Q. ఒక సంకేత భాషలో PERCEPTIONను QMPTMQXDCLగానూ RELAYED ను PMZDNMOగానూ రాస్తే, NOTICED ను ఏ విధంగా రాస్తారు?
జ. LCXDTMO 
వివరణ: PERCEPTION ను QMPTMQXDCLగా రాశారు. 
కాబట్టి P = Q, E = M, R = P, C = T, E = M, P = Q, T = X, I = D, O = C, N = L 
అలాగే RELAYED ను PMZDNMOగా రాశారు. కాబట్టి R = P, E = M, L = Z, A = D, Y = N, E = M, D = O 
ఈ కోడ్ ఆధారంగా NOTICED = LCXDTMO 
Q.ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది? 
1. A,K,O,U
2. E,K,M,W
3. C,O,Y,U
4. C,S,Q,K
5. F,L,Q,Z
6. K,M,Y,R
7. K,L,H,Z
8. H,L,T,V
9. BD,LN,PT,TV
10.CF,HL,PT,VZ
11.BC,KJ,PQ,WX
12.GE,LJ,PM,TR
13. HD,PL,PT,XV
14.BY,EV,HQ,MN
15.CX,HS,PK,TR
16.CFK,GJO,LOT,HMP
17.HGE,LKI,MKH,TSQ
18.GEH,LOM,PNQ,TRU
19.HGI,NMO,RPQ,XWY
20.BAT,CAT,OUT,RAT
Q. ఒక కోడ్ భాషలో MADRAS అనే దాన్ని NBESBT గా రాస్తే BOMBAY ని ఏవిధంగా రాస్తారు?
జ. CPNCBZ
వివరణ : ఈ ప్రశ్నలో MADRASను NBESBT అంటే ప్రతి అక్షరం ముందు అక్షరం అవుతుంది.
M A D R A S 
+1 +1 +1 +1 +1 +1 
N B E S B T 
B O M B A Y
+1 +1 +1 +1 +1 +1
C P N C B Z
Q.ఒక పరిభాషలో ALTERED ను ZOGVIVW గా రాస్తే అదే భాషలో RELATED ను ఎలా రాస్తారు?
జ. IVOZGVW
వివరణ : ఈ ప్రశ్నలో ఇచ్చిన పదం ALTERED ను ZOGVIVW గా రాశారు. మామూలుగా చూస్తే దీనికి సంబంధం కనుక్కోవడం కష్టం. కాబట్టి A కు వ్యతిరేకంగా Z, L కు O. ఈ విధంగా చూస్తే.
A L T E R E D 
Z O G V I V W 
R E L A T E D
I V O Z G V W 
Q. ఒక కోడ్ భాషలో CONTRIBUTOR ను RTNOCIROTUB గా రాస్తే అదే భాషలో PROHIBITION ను ఏవిధంగా రాస్తారు?
జ.IHORPBNOITI 
వివరణ : ఈ ప్రశ్నలో ఇచ్చిన పదానికి కోడ్‌కు సంబంధం ఎలా ఉందంటే ఇచ్చిన పదంలో మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి. అందులో మొదటి 5 అక్షరాలను, చివరి 5 అక్షరాలను తిప్పి రాశారు. మధ్యలో ఉన్న ఒక అక్షరాన్ని అదే విధంగా రాశారు. కాబట్టి మనం కనుక్కోవలసిన
పదంలో కూడా 11 అక్షరాలు ఉన్నాయి. దీన్ని కూడా పై విధంగా భావించాలి.
Q.ఒక పరిభాషలో CORNER ను GSVRIV గా రాస్తే CENTRAL ను ఎలా రాస్తారు?
జ.GIRXVEP
వివరణ : ఈ ప్రశ్నలో ఇచ్చిన పదం CORNER ను GSVRIV గా రాయాలి. అంటే C కు +4 అక్షరాలను కలపాలి. ఇలా
O + 4 S, R + 4 V
C O R N E R 
+4 +4 +4 +4 +4 +4 
G S V R I V 
C E N T R A L
+4 +4 +4 +4 +4 +4 +4
G I R X V E P
Q.ఒక పరిభాషలో BOMBAY ను MYMYMY గా రాస్తే TAMILNADU ను ఏ విధంగా రాస్తారు?
జ. MNUMNUMNU
వివరణ : ఈ ప్రశ్నలో BOMBAY ను MYMYMY గా ఎలా రాశారంటే, రెండు అక్షరాలను వదిలి M ను తీసుకున్నారు. తర్వాత రెండు అక్షరాలను వదిలి Y ను తీసుకుని రెండింటిని అంటే MY ని BOMBAY లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నిసార్లు రాశారు. ఈ విధంగా TAMILNADU లో మొదటి రెండు అక్షరాలు వదిలి M ను, తర్వాత రెండు అక్షరాలు వదిలి N ను, మిగతా రెండు అక్షరాలు వదిలి U ను తీసుకుంటే అప్పుడు MNUఅవుతుంది. TAMILNADU లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నిసార్లు MNU వచ్చేలా రాయాలి. TAMILNADU లో 9 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు MNU ను 3 సార్లు రాయాలి. కాబట్టి MNUMNUMNU అవుతుంది. 
Q.ఒక పరిభాషలో HANGER ను TDIMCG గా రాస్తే అదే భాషలో KURESH ను ఏ విధంగా రాస్తారు?
జ.JRGEQWJ
వివరణ : ఈ ప్రశ్నలో HANGER ను TDIMCG గా రాయాలి. అంటే HANGER లో చివరి అక్షరం అంటే R కు బదులు +2 అక్షరం ఉపయోగిస్తే T అవుతుంది. E కి -1 అక్షరం ఉపయోగిస్తే D అవుతుంది. అంటే వెనుక నుంచి +2, -1 అనే విధంగా చేయాలి. 
Q.ఒక పరిభాషలో PAINT ను 74128, EXCEL ను 93596 గా రాస్తే ACCEPT ను ఏ విధంగా రాస్తారు?
జ.455978
వివరణ: ఈ ప్రశ్నలో ఇచ్చిన కోడ్‌లు.
P A I N T 
7 4 1 2 8 
E X C E L 
9 3 5 9 6 
కావాల్సిన కోడ్ A C C E P T
4 5 5 9 7 8 
Q. Z = 52, ACT = 48 అయితే BAT ఎంత?
జ.46
వివరణ: ఈ ప్రశ్నలో Z = 52 కావాలంటే Z = 26 దాన్ని 2 తో గుణించారు. అంటే ప్రతి అక్షరం విలువను 2 తో గుణించాలి. Z = 2, B = 4 ... Z = 52 కానీ ఇప్పుడు కావాల్సింది
A + C+ T = 2 + 6 + 40 = 48
B + A + T = 4 + 2 + 40 = 46 
Q. MAN = 30, CELL = 34 అయితే BANK ఎంత?
జ.30
వివరణ: ఈ ప్రశ్నలో ఇచ్చిన పదాల సంబంధాలు MAN = (13 + 1 + 14) + 2 = 30
A మొదటి అక్షరం 1
CELL = (3+5+12+12) +2 = 34
BANK = (2+1+14+11) +2 = 30
Q. BRANCH ను 2-18-1-14-3 గా రాస్తే అదే భాషలో BOMBAY ను ఏ విధంగా రాస్తారు?
జ.2-15-13-2-1-25
వివరణ: ఈ ప్రశ్నలో BRANCH ను 2-18-1-14-3-8 గా రాశారు అంటే B విలువ 2 R విలువ 18 ఈ విధంగా రాశారు. 
BOMBAY- 2-15-13-2-1-25 
Q. PRATAP ను 1618120116 గా రాస్తే అదే భాషలో NAVIN ను ఎలా రాస్తారు?
జ. 14122914
వివరణ: ఈ ప్రశ్నలో A=1, B=2, C=3... Z=26 అయితే PRATAP = 1618120116 అవుతుంది.
NAVIN = 14122914. 
Q.MOBILITY ని 46293927 గా రాస్తే అదే భాషలో EXAMINATION ను ఎలా రాస్తారు?
జ. 56149512965
వివరణ: ఈ ప్రశ్నలో A = 1, B = 2,.... Z = 26 అయితే MOBILITY లో ఉన్న అక్షరాలను వరుసగా M = 13 = 1 + 3 = 4, O = 15 = 1 + 5 = 6, B = 2, I = 9, L = 12 = 1 + 2 = 3, I = 9, T = 20 = 2 + 0 = 2, Y = 25 = 2 + 5 = 7 అన్నింటిని ఒకే దగ్గర రాస్తే MOBILITY = 46293927 ఈ విధంగా EXAMINATION రాయాలి. E = 5, X = 24 = 2 + 4 = 6, A = 1, M = 13 = 1 + 3 = 4, I = 9, N = 14 = 1 + 4 = 5, A = 1, T = 20 = 2 + 0 = 2, I = 9, O = 15 = 1 + 5 = 6, N = 14 = 1 + 4 = 5, అంటే 9 కంటే ఎక్కువ విలువలు ఉన్న వాటిని కలపాలి.
EXAMINATION = 56149512965 అవుతుంది.
Q. X ను 7 గా కోడ్ చేసి; P ని 9గా కోడ్ చేసి; Z ను 6గా కోడ్ చేసి; M ను 5గా కోడ్ చేసి; L ను 3గా కోడ్ చేసి, D ని 2గా కోడ్ చేస్తే PLDXMZ కోడ్ రూపం ఏమిటి?
జ. 932756
వివరణ: ఈ ప్రశ్నలో ఇచ్చిన ప్రకారం కోడ్ రాస్తే సమాధానం సులువుగా వస్తుంది.
P L D X M Z
9 3 2 7 5 6 
Q.NTR ను MOSUQS గా రాస్తే DEVI ని ఏ విధంగా రాస్తారు?
జ.CEDFUWHJ
వివరణ: ఈ ప్రశ్నలో NTR ను MOSUQS గా రాస్తే, అంటే NTR లో 3 అక్షరాలు ఉంటే డీకోడ్‌లో 6 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి N అక్షరానికి ముందు, వెనక ఉన్న అక్షరం MOT కి SUR కి QS అలాగే DEVI లో D కి ముందు, వెనుక అక్షరాలు CE, Eకి DF V కి UW , I కి HJ కాబట్టి DEVI డీకోడింగ్ CEDFUWHJ అవుతుంది. 
Q. ఒక పరిభాషలో TAP ను SZO గా రాస్తే అదే భాషలో FREEZE ని ఏ విధంగా రాస్తారు?
జ.EQDDYD
Q. JULY ను 9-20-11-24 గా రాస్తే అదే భాషలో AUGUST ను ఏ విధంగా రాస్తారు?
జ.0-20-6-20-18-19 
Q. GO = 32, SHE = 49 అయితే SOME ఎంత?
జ. 56 
Q.PALAM ను 43 గా రాస్తే అదే భాషలో SANTACRUZ ఎంత?
జ.123 
Q. A = 1, B = 2, ... Z = 26 అయితే BIDDIC కోడ్ ఎంత?
జ.294493 
Q.ఒక పరిభాషలో NEOMAN ను OGRQFJ గా రాస్తే అదే భాషలో ఏ పదం కోడ్ ZKCLUP గా రాస్తారు?
జ.YIZHPJ 
Q.ఒక పరిభాషలో MUNICIPALITY ను INMUAPCIYTLI గా రాస్తే అదే భాషలో JUDICIAL ను ఏ విధంగా రాస్తారు?
జ.IDJULACI
Q. ఒక పరిభాషలో MILD ను NKOH గా GATE ని ఎలా రాస్తారు?
జ.HCWI 
1. ఇచ్చిన అక్షరాల సంఖ్యలను రాస్తే
13 9 12 4 
M I L D → 13 + 1 = 14, 9 + 2 = 11, 
14 11 15 8
N K O H ఇందులో 12 + 3 = 15, 4 + 4 = 8

ఈ విధంగా ఇచ్చిన పదానికి GATE 
--> G = 7 + 1 = 8 = H
--> A = 1 + 2 = 3 + C
--> T = 20 + 3 = 23 = W
--> E = 5 + 4 = 9 = I
GATE ను HCWIగా రాయవచ్చు.
Q. ఒక పరిభాషలో DELHI ని CDKGH గా MADRAS ను ఎలా రాస్తారు?
జ.LZCQZR
వివరణ: ఇచ్చిన పదానికి
MADRAS ⇒ M =13-1 =12 = L
⇒ A = 1-1 = 0 = Z
⇒ D = 4-1 = 3 = C
⇒ R =18-1 =17 = Q
⇒ A = 1-1 = 0 = Z
⇒ S =19-1 =18 = R
MADRAS, నుLZCQZR గా రాయవచ్చు.
Q. ఒక పరిభాషలో FORGE ను FPTJI గా రాస్తే CULPRIT ని ఎలా రాస్తారు?
జ.CVNSVNZ
వివరణ: 6 15 18 7 5 
F O R G E 
6 16 20 10 9 
F P T J I
ఇచ్చిన పదానికి 3 21 12 16 18 9 20 
C U L P R I T 
3 + 0 = 3 = C
21 + 1 = 22 = V
12 + 2 = 14 = N
16 + 3 = 19 = S
18 + 4 = 22 = V
9 + 5 = 14 = N
20 + 6 = 26 = Z
CULPRIT ను CVNSVNZ గా రాయవచ్చు.
Q. ఒక పరిభాషలో CEJQ ను XVQJ గా రాస్తే BDIP ని ఎలా రాస్తారు?
జ.YWRK
వివరణ: C⇒X
E⇒V
J⇒Q
Q⇒J
B⇒Y
D⇒W
I⇒R
P⇒K
⇒YWRKగా రాయవచ్చు.
Q. ఒక పరిభాషలో MONKEY ని XDJMNL గా రాస్తే TIGER ని ఎలా రాస్తారు?
జ.QDFHS
వివరణ: 13 15 14 11 5 25 
M O N K E Y 
24 4 10 13 14 12
X D J M N L
దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే. ప్రతి ఆల్పాబెట్ కు, ఒక స్థానాన్ని తగ్గించుకుంటూ, పదాన్ని రివర్స్ చేయాలి.
T I G E R = 20 9 7 5 18
Y = 25 - 1 = 24 = X
E = 5 - 1 = 4 = D 
K = 11 - 1 = 10 = J 
N = 14 - 1 = 13 = M 
O = 15 - 1 = 14 = N 
M = 13 - 1 = 12 = L

R = 18 - 1 = 17 = Q
E = 5 - 1 = 4 = D
G = 7 - 1 = 6 = F
I = 9 - 1 = 8 = H
T = 20 - 1 = 19 = S
TIGER ను - Q D F H S గా రాయవచ్చు.
Q. ఒక పరిభాషలో CALANDER ను CLANAEDR గా రాస్తే CIRCULARను ఎలా రాస్తారు?
జ.CRIUCALR
వివరణ: CALANDER లో మొదటి, చివరి అక్షరాలను అలాగే ఉంచి మిగిలిన అక్షరాల్లో ప్రతి రెండింటినీ కలిపి, వాటిని తిప్పి (రివర్స్‌లో) రాస్తే CLANAEDR
CIRCULARను CRIUCALRగా రాయవచ్చు. 
Q. ఒక పరిభాషలో PORTUGESE ను ESEGUTROP గా రాస్తే MALAYALAM ను ఎలా రాస్తారు?
జ.MALAYALAM
వివరణ: PORTUGESE ను తిప్పిరాస్తే ESEGUTROP . అలాగే MALAYALAM ను తిప్పిరాస్తే MALAYALAM అవుతుంది. 
Q.ఒక పరిభాషలో OUT ను 152120 గా రాస్తే IN ఎలా రాస్తారు?
జ.914
వివరణ: ఇచ్చిన పదం OUT. ఈ అక్షరాల సంఖ్యలను వరుసగా ఒక దగ్గర రాస్తే 15 21 20 . అదే విధంగా IN అంటే 914 అవుతుంది. 
Q. ఒక పరిభాషలో S - V ని 8 - 5 గా రాస్తే ACCOMMODATE ను ఎలా రాస్తారు?
జ.26-24-24-12-14-14-12-23
వివరణ: ఈ ప్రశ్నలో S, V ల కోడ్‌లను 8, 5 గా ఇచ్చారు. S అంటే 19 కానీ, రివర్స్‌లో S కి 8, V కి 5 అవుతుంది.
A రివర్స్‌లో = Z = 26
C రివర్స్‌లో = X = 24
C రివర్స్‌లో = X = 24
O రివర్స్‌లో = L = 12
M రివర్స్‌లో = N = 14
M రివర్స్‌లో = N = 14
O రివర్స్‌లో = L = 12
D రివర్స్‌లో = W = 23
అంటే 26 - 24 - 24 - 12 - 14 - 14 - 12 - 23. 
Q. ఒక పరిభాషలో GO = 32, SHE = 49 అయితే HE = ?
జ.41
వివరణ: GO = 32, SHE = 49. G అక్షరానికి వ్యతిరేకదిశలో T, O కు వ్యతిరేకంగా L ఉన్నాయి. వాటికిచ్చిన సంఖ్యలను కలిపితే 32 అవుతుంది.
G O = రివర్స్‌లో = TL = 20 + 12 = 32
SHE = రివర్స్‌లో = HSV = 8 + 19 + 22 = 49
HE = రివర్స్‌లో = SV = 19 + 22 = 41 అవుతుంది. 
Q. ఒక పరిభాషలో DRIVER= 7, PEDESTRIAN = 11 అయితే ACCIDENT = ?
జ. 9
వివరణ: ఈ ప్రశ్నను విద్యార్థులు వివిధ కోణాల్లో ఆలోచిస్తారు. కానీ, ఇందులో DRIVER 6 అక్షరాలు ఉన్నాయి. దానికి + 1 చేసి 7 గా ఇచ్చారు.
అలాగే PEDESTRIAN = 10 + 1 = 11 మనకు కావలసింది. ACCIDENT = 8 + 1 = 9 అవుతుంది.
Q.ఒక పరిభాషలో PROMOTION ను QSP89 గా రాస్తే DEMOTION ను ఎలా రాస్తారు?
జ.EF89
వివరణ: ఈ ప్రశ్నలో MOTION కోడ్ 89 అవుతుంది. దానిముందు ఉండే అక్షరాలకు కేటాయించిన సంఖ్యలు..
16 17 18 19 15 16
P→Q, R→S, O→P
అలాగే DEMOTION లో MOTION కోడ్ 89. దీని ముందు అక్షరాలకు కేటాయించిన సంఖ్యలు..
4 5 5 6
D→E E→F
దీన్ని = EF 89 గా రాయాలి.
Q.ఒక పరిభాషలో HOTEL= 300 అయితే BORE = ?
జ.160
వివరణ: HOTEL = 300. ఈ అక్షరాలకు కేటాయించిన సంఖ్యలను కూడి, వచ్చిన సంఖ్యను 5 తో గుణిస్తే 300 వస్తుంది.
H O T E L
8 + 15 + 20 + 5 + 12 = 60 × 5 = 300
అలాగే BORE = 2 + 15 + 18 + 5 = 40 × 4 = 160 అవుతుంది.


No comments:

Post a Comment