AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

క్రీడలు Sports కామన్వెల్త్ క్రీడలు

కామన్వెల్త్ క్రీడలు

కామన్వెల్త్ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930-50 కాలంలో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా, 1954-66 మధ్య బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970-74 కాలంలో బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగుసార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.
20వ కామన్వెల్త్ క్రీడలు
20వ కామన్వెల్త్ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్ తరపున షూటర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని చేబూని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది.

భారత స్వర్ణపతక విజేతలు
సంజిత కుముక్‌చామ్మహిళల వెయిట్ లిఫ్టింగ్
సుఖేన్ డేపురుషుల వెయిట్ లిఫ్టింగ్
అభినవ్ బింద్రాషూటింగ్
అపూర్వి చందేలమహిళల షూటింగ్
రాహి సర్నోబత్మహిళల షూటింగ్
సతీష్ శివలింగంవెయిట్ లిఫ్టింగ్
జీతూ రాయ్షూటింగ్
అమిత్ కుమార్రెజ్లింగ్
వినేష్ ఫోగత్మహిళల రెజ్లింగ్
సుశీల్ కుమార్రెజ్లింగ్
బబిత కుమారిమహిళల రెజ్లింగ్
యోగేశ్వర్ దత్రెజ్లింగ్
వికాస్ గౌడడిస్కస్ త్రో
దీపికా పల్లికల్, జ్యోత్స్న చిన్నప్పస్క్వాష్ (మహిళల డబుల్స్)
పారుపల్లి కశ్యప్బ్యాడ్మింటన్

కామన్వెల్త్ క్రీడలు- వేదికలు 
ఇప్పటివరకు 20 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.కొన్నింటి వివరాలు.
సంవత్సరంనగరందేశం
1930హామిల్టన్కెనడా
1934లండన్ఇంగ్లండ్
1938సిడ్నీఆస్ట్రేలియా
1950అక్లాండ్న్యూజిలాండ్
1954వాంకోవర్కెనడా
1998కౌలాలంపూర్మలేసియా
2002మాంచెస్టర్ఇంగ్లండ్
2006మెల్‌బోర్న్ఆస్ట్రేలియా
2010న్యూఢిల్లీఇండియా
2014గ్లాస్గోస్కాట్లాండ్


No comments:

Post a Comment