AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

తమిళనాడు (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES)

   (భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు INDIAN STATES & UNION TERRITORIES) తమిళనాడు

అవతరణ: ఆగస్టు 15,1947లో మద్రాసు ప్రొవిన్సీగా ఉండేది. జనవరి 26, 1950లో మద్రాసు రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత 1969లో తమిళనాడుగా పేరు మార్చారు.
విస్తీర్ణం: 1,30,058 చ.కి.మీ.
రాజధాని: చెన్నై
సరిహద్దు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి
సరిహద్దు దేశం: శ్రీలంక
సముద్రం: బంగాళఖాతం, హిందూ మహాసముద్రం
జనాభా: 3,33,87,677
స్త్రీలు: 3,59,80,087
పురుషులు: 3,61,58,871
జనసాంద్రత: 555
లింగనిష్పత్తి: 995
అక్షరాస్యత: 80.33
స్త్రీలు: 73.86
పురుషులు: 86.81
మొత్తం జిల్లాలు: 31 (అరియలూర్, చెన్నై, కోయంబతూరు, కడలూరు, ధర్మపూరి, డిండిగల్, ఈరోడ్,  కాంచీపురం, కన్యాకుమారి, కృష్ణగిరి, కరూర్, మధురై, నాగపట్నం, నమక్కల్, నీలగిరి, పెరంబదూర్, రామనంతపురం, పెదుక్కొటాయ్, సేలం, శివగంగా, తంజావూరు, తెని, తిరువన్నమలై, తిరువరూర్, తిరున్వేలీ, తిరువల్లూర్, తిరుచిరాపల్లి, తుత్తూకుడై, వెల్లూరు, విలుప్పురం, విరుదునగర్)
మొత్తం గ్రామాలు: 15,400
పట్టణాలు: 832
కార్యనిర్వాహక శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 234 (నియామక సభ్యులు కాకుండా)
పార్లమెంట్
లోక్‌సభ: 39 (32 + 7 + 0)
రాజ్యసభ: 18
ప్రధాన రాజకీయ పార్టీలు: ఆల్ ఇండియా ద్రావిడ మున్నెట్ర కజగం(ఏఐడిఎంకె), ద్రావిడ మున్నెట్ర కజగం (డిఎంకె), తమిళ మనిల కాంగ్రెస్(ముపనార్), పట్టాలి మక్కల్ కచ్చి (పిఎంకె), ఐఎన్‌సీ, సీపీఐ-ఎం, సీపీఐ, బీజేపీ, ఎంజీఆర్ అన్నా డిఎంకె, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్.
హైకోర్టు: చెన్నై
ముఖ్య భాష: తమిళ్
ప్రధానమతం: హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీ.
ప్రధాన నగరాలు: అబుత్తుర్, చెన్నై, ఆవడి, కొయంబతూర్, మధురై, ఇరోడి, వెల్లూరు, సేలం, తంజావూరు, కడలూరు, టుటీకొరిన్, తిరుచిరాపల్లి, తిరున్వేలీ, నైవేలీ, ఉదగమండలం(ఊటీ), నాగర్‌కొయిల్, పుదుకొతాయ్
నదులు: పాలర్, కావేరీ, వెగయ్, చియ్యర్, పొన్నియర్, మియర్, భవాని, తామరపానీ, చిత్తర్, వెల్లర్, నోయల్, సురులి, వైపర్ మొదలైనవి.
పర్వత శ్రేణులు: పశ్చిమానంతా పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి. అయితే పాలగట్ ప్రాంతంలో 25 కిలో మీటర్లు వెడల్పుతో ఖాళీ ఏర్పడింది. దీన్ని పాలగట్ గ్యాప్ అంటారు. ఈ పాలగట్ గ్యాప్‌కు దక్షిణాన ఉండే కొండలను అన్నమలై కొండలు అంటారు. తూర్నున పలని
కొండలు ఉన్నాయి. వీటిలో కొడెకైనాల్ ప్రసిద్ద హిల్ స్టేషన్. నీలగిరి జిల్లాలో ఉండే ఉదకమండలంలో ఉండే దొడబెట్టా ఎత్తయిన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2,640 మీటర్ల ఎత్తున ఉంది.
ఖనిజాలు: లిగ్‌నైట్, సున్నపురాయి, మ్యాగ్నసైట్, మైకా, క్వాట్జరైట్, ఫెలస్పర్, బాక్సైట్, జిప్సమ్, 
పరిశ్రమలు: కాటన్ వస్త్రాలు, ఆటోమొబైల్, రసాయన ఎరువులు, కాగితం, కాగితం వస్తువులు, రైల్వే వ్యాగన్‌లు, పెట్టెలు, ఆర్మీట్యాంక్‌లు, సిమెంట్, ఇనుము-ఉక్కు, కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సాఫ్ట్‌వేర్.
వ్యవసాయోత్పత్తులు: వరి, మొక్కజోన్న, జొన్న, సజ్జ, రాగి, పప్పు దినుసులు, చెరకు, నూనెగింజలు, పత్తి, మిరప, కాఫీ, టీ, రబ్బరు, యాలకులు.
రోడ్ల పొడవు: 61,641 కి.మీ
రైల్వేలైన్ పొడవు: 3,927 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: చెన్నై, మధురై, తిరుచిరాపల్లి, కోయంబతూరు, ఈరోడ్, సేలం, తిరున్వేలీ. 
విమానాశ్రయాలు: మీనంబకం అంతర్జాతీయ విమానాశ్రయం-చెన్నై, మధురై, తిరుచిరాపల్లి, కోయంబతూరు, సేలం.
ఓడరేవు: చెన్నై, తుత్తుకుడై(టుటీకోరిన్), కడలూరు, నాగపట్నం.
నృత్యం: భరతనాట్యం, కళాక్షేత్ర, కోలాటం, కుమ్మి, కావడి, కరాగమ్స్
పండుగలు: పొంగల్, జల్లికట్టు (దున్నపోతుల కొట్లాట), చితిరై-మధురై, ఆదిపెరుక్కు (ఏరువాక), మహామగం, డాన్స్ ఫెస్టివల్, కంతూరీ, కార్తీగాయ్, నవరాత్రి మొదలైనవి.


No comments:

Post a Comment