AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

ఇతర వివరాలు Other details మహిళా సాధికారత మరెప్పుడు సాధ్యం

మహిళా సాధికారత మరెప్పుడు సాధ్యం

మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు. – స్వామి వివేకానంద
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత) అని ఆర్యోక్తి. సృష్టికి మూలం స్త్రీ. దేవుడికి ప్రతిరూపం తల్లి. అలాంటి తల్లి తల్లడిల్లి కన్నీరు కారిస్తే అది మనకు మంచిదా? కాదు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి 2014 సంవత్సరానికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను నిర్వహిస్తోంది.ఈ వేడుకను ఐరాస గత వంద సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఈ సారి “మహిళలకు సమానత్వమే మనకు ప్రగతి’’(Equality for women is progress for all) అనే థీమ్ తో వేడుకలు నిర్వహిస్తుంది. ఈ రోజున ఆయా రంగాల్లో ప్రముఖ మహిళలు సాధించిన ప్రగతిని స్పూర్తిగా తీసుకొని ముందుగా సాగేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింస, వేధింపులు చూస్తుంటే మనం పూర్తిగా తిరోగమిస్తున్నామనిపిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ మాతృమూర్తిని వేధించి మనం బాగుకున్నదేంటి? వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మహిళా సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు తలెత్తినా, ఎందరో నినదించినా ఫలితం లేకుండా పోయంది. మహిళల చదువు ఏ సమాజానికైనా వెలుగునిస్తుంది. వారిలో చైతన్యం ప్రపంచాన్ని నడిపిస్తుంది. మహిళల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం రావాలి. ఆయా రంగాల్లో రాణించిన, రాణిస్తున్న వారిని స్పూర్తిగా తీసుకోవాలి. వీరికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరునిది.

సమానత్వం సాధించాలంటే మహిళలు కదం తొక్కి ముందుకు కదలాలి. వేళ్లూనుకున్న వివక్షా పూరిత భావజాలాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. తమ హక్కుల కోసం పోరాడాలి. మేము మానవులనమే అని, మాకు హక్కులుంటాయని వెలుగెత్తి చాటాలి.వివేకానందుడు చెప్పినట్టు ఏ పక్షి ఒక రెక్కతో ఎగరలేదు. స్త్రీ సమానత్వం సాధిస్తే తప్ప మన సమాజం అభివృద్ది చెందదు. మహిళా దినోత్సం సందర్భంగా చరిత్ర నుంచి ప్రస్తుతం వరకు ప్రముఖ ప్రథమ మహిళల గురించి సమగ్ర సమాచారం.

ప్రముఖ మహిళలు:
యజ్ఞవాల్కవ్యునితో చర్చలు జరిపిన మహిళ – గార్గి
వర్థమాన మహావీరుని తల్లి – త్రిశాల
బుద్ధుని తల్లి – మహామాయ
వర్థమానుని భార్య – యశోద
బుద్ధుని భార్య – యశోధర
వర్థమానుని కుమార్తె – అనోజ్ఞ
బుద్ధుడిని పెంచిన తల్లి – ప్రజాపతి గౌతమి
బుద్ధుని చర్యలతో మారిన వేశ్య – అమ్రపాలి
బుద్ధునికి పాయసం ఇచ్చింది – సుజాత
చంద్రగుప్త మౌర్యుని తల్లి – ముర
సెల్యుకస్‌ నికేటర్ కుమార్తే, చంద్రగుప్త మౌర్యుని భార్య – హెలీనా
నాసిక్ శాసనం వేయించింది – గౌతమీ బాలాశ్రీ
నానాఘాట్ శాసనం వేయించింది – నాగానిక
‘కరర్తీ’ అనే భంగిమ వలన మరణించిన కుంతలశాతకర్ణి భార్య - మలయవతి
మొదటి చంద్రగుప్తుని భార్య – కుమారదేవి
హర్షుని సోదరి – రాజశ్రీ
ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ – రజియా సుల్తానా
చిత్తోడ్ పాలకుడు రాణారతన్ సింగ్ భార్య (అద్భుత సుందరి) – రాణి పద్మిని
కాకతీయ రాజ్యాన్ని పాలించిన ఏకైక మహిళ – రుద్రమదేవి
కృష్ణ భక్తురాలైన భక్తి ఉద్యమకారిణి – మీరాభాయి
శ్రీ కృష్ణదేవరాయల తల్లి – నాగాంబ
శ్రీ కృష్ణదేవరాయల భార్యలు – తిరుమలదేవి, చిన్నాదేవి
షేర్షా వివాహమాడిన వితంతువు – లాడ్ మాలిక
అక్బర్ తల్లి – హామీదాభాను భేగం
అక్బర్ వివాహమాడిన రాజపుత్ర వనిత – జోద్ భాయి
అక్బర్‌ను ఎదిరించిన గోండ్వానా రాణి – దుర్గావతి
అక్బర్‌ను ఎదిరించిన అహ్మద్ నగర్ రాణి – చాంద్ బీబీ
జహంగీర్ వివాహమాడిన వితంతువు – మెహరున్నీసా
షాజహాన్ భార్య – ముంతాజ్ మహాల్
షాజహాన్ కుమార్తెలు – రోషనార, జహనారా
ఔరంగజేబు కుమార్తె –జేబున్నిసా
శివాజీ తల్లి – జిజియాభాయి
“ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్” అని ఎవరినంటారు – ఝాన్సీ లక్ష్మీభాయి
1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న అయోధ్య ప్రాంత మహిళ – బేగం హజ్రత్ మహల్
చివరి మొగల్ రాజు 2వ బహదూర్‌షా భార్య – జీనత్ మహల్
భారతదేశంలో తొలి మహిళా టీచర్ – సావిత్రి భాయి పూలే
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి మహిళ – అనీబిసెంట్
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ – సరోజినినాయుడు
జర్మనీలోని స్టట్‌గట్‌లో త్రివర్ణ పతాకం ఎగుర వేసిన తొలి మహిళ – మేడంకామా
అనుశీలన్ సమితిని ప్రోత్సహించిన మహిళ – మార్గరేట్ ఎలిజెబెత్ నోబుల్
అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మహిళ – కల్పనాచావ్లా
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ - బచేంద్రిఫాల్
గాంధీజీ తల్లి – పుత్లీభాయి
గాంధీజీ భార్య – కస్తూరిభాగాంధీ
నెహ్రూ తల్లి – స్వరూపరాణి
నెహ్రూ భార్య – కమలానెహ్రూ
ముంబాయి లోని క్రాంతి మైదాన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది – అరుణా అసఫ్‌అలీ
భారతదేశంలో ఒక రాష్ట్రానికి హోంమంత్రి అయిన తొలి మహిళ – సబితాఇంద్రారెడ్డి
మొదటి మహిళా I.P.S. అధికారి – కిరణ్ బేడి
ఒలంపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన మొదటి భారతీయురాలు – కరణం మల్లీశ్వరీ
భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు – విజయలక్ష్మీ విశ్వనాథన్
తొలి మహిళా లెప్టినెంట్ జనరల్ (సైనికదళం) – పునీతా అరోరా
మొదటి ఎయిర్ బస్ మహిళా ఫైలట్ – దుర్గా బెనర్జీ
భారత్‌లో మొదటి మహిళా అడ్వకేట్ – కోర్నేషియా సోరాబ్జీ
అస్కార్ అవార్డ్ పొందిన తొలి భారతీయ వ్యక్తి/మహిళ – భాను అతయ
ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళా - విజయలక్ష్మీ పండిట్
భారత తొలి మహిళా ప్రధానమంత్రి – ఇందిరాగాంధీ
మొదటిసారిగా గవర్నర్ అయిన తొలి భారతీయ మహిళ - సరోజిని నాయుడు
భారత్‌లో మొదటి మహిళా స్పీకర్ – షన్నోదేవి
భారతీదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి – సుచేతా కృపలాని
భారత్‌లో మొదటి మహిళా న్యాయమూర్తి – అన్నాచాందీ
భారత్‌లో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి – మీరా సాహెబ్ ఫాతీమా బీబీ
భారత్‌లో ఆధార్ కార్డు పొందిన తొలి మహిళ – రజనా సోనావానే
భారత్‌లో తొలి మహిళా ఎయిర్‌వైస్ అడ్మిరల్ (నేవి) – పునీతా అరోరా
భారత్‌లో వైమానిక దళంలో ఫైలట్ గా పనిచేసిన మొదటి మహిళ – హరితాకేర్
భారత్‌లో తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ (వైమానిక దళం) – పద్మాబందోపాధ్యాయ
భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ – బేబీ హర్ష
భారత్‌లో మొదటి మహిళా I.A.S. – అన్నాజార్జ్
భారత్‌లో మొదటి మహిళా D.G.P. – కంచన్ చౌదరీ భట్టాచార్య
విశ్వసుందరి అయిన తొలి భారతీయ వనిత – సుస్మితా సేన్
మిస్ ఏసియా ఫసిఫిక్ అయిన తొలి భారతీయ వనిత – దియా మీర్జా
ప్రపంచ సుందరి అయిన తొలి భారతీయ వనిత – రీటా ఫారియా
అతి పిన్నవయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించిన మహిళ – డిక్కీ డోల్మా
ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన తొలి భారతీయ మహిళ - ఆర్తీ సాహా
జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళ - ఆర్తీ సాహా
సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి భారతీయ మహిళ -బులా చౌదరీ
కలకత్తా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళ -కాదంబినీ గంగూలీ
దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలిభారతీయ మహిళ -రీనా కేశల్
అతిపిన్న వయసులో లోక్‌సభ సభ్యురాలయిన మహిళ -అగాథా సంగ్మా
అతిపిన్న వయసులో భారత్‌లో కేంద్ర మంత్రి పదవిని స్వీకరించిన తొలి మహిళ -సెల్జా కుమారీ
అతిపిన్న వయసులో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంక్‌ను పొందిన తొలి మహిళ - సుష్మాస్వరాజ్ 
భారత్‌లో మొదటి మహిళాకేంద్ర మంత్రి -విజయలక్ష్మీ పండిట్
ఛీప్‌ ఎలక్షన్ కమీషనర్ అయిన తొలి మహిళ -V.S. రమాదేవి
భారత్‌లో బుక్కర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ -అరుంధతీ రాయ్
భారతరత్న అవార్డు పొదింన తొలి మహిళ -ఇందిరా గాంధీ
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న తొలి మహిళ -కాదంబీనీ గంగూలీ
నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ -మదర్ థెరీస్సా
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినతొలి మహిళ -దేవికారాణి రోరిచ్
RBI తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ -K.J.ఉదేశీ
భూగోళం చుట్టివచ్చిన తొలి మహిళ -ఉజ్వలారాయ్
తొలి చలనచిత్ర నటి -కమాలాభాయి గోఖలే
లోక్‌సభ తొలి మహిళాస్పీకర్ -మీరాకుమార్
తొలి మిస్‌ ఇండియా -నటి ప్రమీలా
పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి -నర్గీస్ దత్
తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి -మాయావతి
ఙ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన తొలి మహిళ -ఆశాపూర్ణా దేవి
ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకం సాంధించిన తొలి మహిళ -అంజు బాబిజార్జ్
గ్రాండ్‌స్లామ్ గెల్చుకున్న తొలి భారతీయ మహిళ -సానియా మీర్జా
ప్రపంచ షూటింగ్‌లో స్వర్ణం పొదింన తొలి భారతీయ మహిళ -తేజస్వినీ సావంత్
భారత తొలి మహిళా రాష్ట్రపతి -ప్రతిభాసింగ్ పాటిల్
భారత్‌లో తొలి మహిళా మెజిస్ర్టేట్ -ఓమన కుంజమ్మ
జాతీయ మహిళా కమీషన్ తొలి ఛైర్‌పర్సన్ -జయంతీ పట్నాయక్
రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ -V.S.రమాదేవి
గోబీశీతల ఎడారి దాటిన తొలి మహిళ -సుచేతా కడేత్కర్
భారతరత్న పురస్కారం పొందిన సంగీతకారిణి -M.S.సుబ్బులక్ష్మి
శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ తొలి మహిళా అధ్యక్షురాలు -బీబీ జాగీర్‌కౌర్
సహాయ నిరాకరణోద్యమంలో ఆంధ్రలో అరెస్టు అయిన తొలి మహిళ -దువ్వూరి సుబ్బమ్మ
“గుంటూరు ఝాన్సీ” అని ఎవరినంటారు – ఉన్నవ లక్ష్మీబాయమ్మ
ఆంధ్రలొ తొలి వితంతు వివాహం చేసుకొన్నది – గౌరమ్మ(సీతమ్మ)
భూస్వాములను ఎదురించిన పాలకుర్తికి చెందిన ధీర వనిత - చాకలి ఐలమ్మ
సేకరణ:- 
యం. వెంకటరమణ రావు, 
చరిత్ర అధ్యాపకులు, నల్లగొండ


No comments:

Post a Comment