తెలంగాణ ‘సమగ్ర కుటుంబ సర్వే’లో ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ‘సమగ్ర కుటుంబ సర్వే’ పేరిట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
జనాభా గణాంకాలతోపాటు ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3,63,03,012గా తేలింది. రాష్ర్టంలోని పది జిల్లాల్లో మొత్తం 1,01 కోట్ల కుటుంబాల నుంచి సమగ్ర వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 91.38 లక్షల కుటుంబాలు డిక్లరేషన్ సమర్పించాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 61,36,368 మంది నివాసం ఉన్నట్లు సర్వేలో తేలింది.
రెండో స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో 42,84,024 జనాభా ఉంది.
ట్రాన్స్‌జెండర్స్(హిజ్రాలు) అత్యధికంగా 10,965 మంది రంగారెడ్డిలో నివసిస్తున్నారు.
బీసీలు 1,85,61,856 లక్షలు (51.08%).
ఓసీలు 78,12,858 మంది(21.50 శాతం).
ఎస్సీలు 63,60,158 మంది(17.50శాతం).
మైనార్టీల జనాభా 52,53,710(14.46శాతం).
తెలంగాణాలోని పది జిల్లాల్లో మొత్తం 88,85,514 మంది హిందువులు (మొత్తం జనాభాలో 87.17శాతం) నివసిస్తున్నారు.
అత్యధికంగా 14,18,792 మంది హిందువులు రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్నారు.
మొత్తం 10,193,027 కుటుంబాలున్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైంది.
వీరిలో 2,490,594 కుటుంబాలు సొంత ఇళ్లు కలిగి ఉండగా, 2,458,381 కుటుంబాలు వారు మాత్రం అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు.
గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో 324,312 కుటుంబాల వారు ప్లాస్టిక్ పైకప్పు ఉన్న తాత్కాలిక ఇళ్లలో నివసిస్తున్నారు.
రాష్ట్రంలో బోరుబావులు, చెరువులు, కుంటలు, సాగునీటి కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 69.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి.
అత్యంత వెనకబడిన జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 11.08 లక్షల ఎకరాల్లో... అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 57,684 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు.
మొత్తం 5,01,643 మంది వికలాంగులున్నారు.
రాష్ట్రంలోని 10 జిల్లాల్లో చరాస్తులు కలిగిన కుటుంబాలు మొత్తం 10,193,027 ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలున్న కుటుంబాలు మొత్తం 2,278,182.
త్రిచక్ర (ఆటోలు) వాహనాలున్న కుటుంబాలు 116,792, కార్లు ఉన్న కుటుంబాలు 300,184, ట్రాక్టర్, ఇతర వ్యవసాయ యంత్రాలున్న కుటుంబాలు 89,469, ఇంటికి ఏసీ కలిగి ఉన్న కుటుంబాలు 70,755 వరకు ఉన్నట్లు తేలింది.
రాష్ట్రంలో 7.58 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో, 32 వేల మంది క్యాన్సర్ తో, 1.17 లక్షల మంది గుండె జబ్బుతో, 69 వేల మంది పక్షవాతం, 75 వేల మంది ఆస్తమా, 66 వేల మంది ఫ్లోరోసిస్, 37 వేల మంది ైపైలేరియాతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఒక మహిళ మాత్రమే ఉంటున్న కుటుంబాలు 82.98 లక్షలు
18.48 లక్షల కుటుంబాలకు మహిళలే కుటుంబ పెద్దలుగా వ్యవహరిస్తున్నారు.
ఒకే వ్యక్తి ఉన్న కుటుంబాలు రాష్ట్రంలో 8.55 లక్షలున్నాయి.
అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 1.39 లక్షల కుటుంబాల్లో కేవలం ఒకరే నివసిస్తున్నారు.
జిల్లాల వారీగా జనాభా
రంగారెడ్డి | 61,36,368 |
మహబూబ్‌నగర్ | 42,84,024 |
హైదరాబాద్ | 37,94,218 |
కరీంనగర్ | 38,38,323 |
వరంగల్ | 36,46,955 |
నల్లగొండ | 35,95,203 |
మెదక్ | 30,92,584 |
ఆదిలాబాద్ | 28,24,953 |
ఖమ్మం | 26,23,072 |
నిజామాబాద్ | 24,67,312 |
No comments:
Post a Comment