AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 3 January 2018

క్రీడలు Sports 2016 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్

2016 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్

టెన్నిస్‌లో నాలుగు అతి ముఖ్యమైన టోర్నమెంట్లను ‘గ్రాండ్‌స్లామ్స్’ అంటారు. వీటినే ‘మేజర్‌‌స’ అని కూడా పిలుస్తారు. వీటిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను జనవరిలో మెల్‌బోర్‌‌నలో, ఫ్రెంచ్ ఓపెన్‌ను మే, జూన్‌లలో పారిస్‌లో, వింబుల్డన్‌ను జూన్, జూలైలలో లండన్‌లో, యూఎస్ ఓపెన్‌ను ఆగస్టు, సెప్టెంబర్‌లలో న్యూయార్‌‌కలో నిర్వహిస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లను హార్‌‌డ కోర్‌‌టలపై, ఫ్రెంచ్ ఓపెన్‌ను క్లే కోర్‌‌టపై ఆడతారు. వింబుల్డన్‌ను మాత్రమే పచ్చికపై నిర్వహిస్తారు.
ఈ నాలుగింటిలో వింబుల్డన్ అత్యంత పురాతనమైంది. దీన్ని 1877లో ప్రారంభించారు. యూఎస్ ఓపెన్‌ను 1881 నుంచి, ఫ్రెంచ్ ఓపెన్‌ను 1891 నుంచి, ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను1905 నుంచి నిర్వహిస్తున్నారు.

ఈ నాలుగు మేజర్ చాంపియన్‌షిప్‌లను ఒకే కేలండర్ సంవత్సరంలో సాధిస్తే ఆ ఘనతను గ్రాండ్‌స్లామ్‌గా అభివర్ణిస్తారు.

వరుసగా నాలుగు టోర్నమెంట్లను రెండు వేర్వేరు సంవత్సరాల్లో గెలిస్తే దాన్ని ‘నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్‌స్లామ్’ గా వ్యవహరిస్తారు. ఒక టెన్నిస్ క్రీడాకారుడు తన కెరీర్లో ఈ నాలుగు మేజర్లను గెలిస్తే దాన్ని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ అంటారు.
ఒకే కేలండర్ సంవత్సరంలో నాలుగు మేజర్లతోపాటు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కూడా సాధిస్తే అది ‘గోల్డెన్ గ్రాండ్‌స్లామ్’ లేదా ‘గోల్డెన్ స్లామ్’.

గ్రాండ్‌‌స్లామ్ విజేతలు
టెన్నిస్ చరిత్రలో సింగిల్స్‌లో ఒకే కేలండర్ ఇయర్‌లో గ్రాండ్‌స్లామ్ సాధించిన వ్యక్తులు కేవలం ఐదుగురు. వీరిలో రాడ్ లేవర్ ఈ ఘనతను రెండుసార్లు సాధించాడు.
పురుషుల సింగిల్స్
1938 డాన్ బడ్‌‌జ (అమెరికా)
1962 రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా)
1969 రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా)
మహిళల సింగిల్స్
1953 మౌరీన్ కనోలీ (అమెరికా)
1970 మార్గరెట్ కోర్‌‌ట (ఆస్ట్రేలియా)
1988 స్టెఫీగ్రాఫ్ (జర్మనీ)
నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్‌స్లామ్
పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనతను సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్ సాధించాడు. ఇతడు 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నమెంట్లు, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు.
మహిళల సింగిల్స్‌లో మార్టినా నవ్రతిలోవా (1983-84), స్టెఫీగ్రాఫ్ (1993-94), సెరెనా విలియమ్స్ (2002-03, 2014-15)లు నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్‌స్లామ్ సాధించారు.

కెరీర్ గ్రాండ్‌స్లామ్
8 మంది పురుష క్రీడాకారులు సింగిల్స్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించారు. వీరు ఫ్రెడ్ పెర్రీ, డాన్ బడ్‌‌జ, రాడ్ లేవర్, రాయ్ ఎమర్సన్, ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్.
10 మంది మహిళలు సింగిల్స్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించారు. వారు మౌరీన్ కనోలీ, డోరిస్ హార్‌‌ట, షిర్లీ ఫ్రై ఇర్విన్, మార్గరెట్ కోర్‌‌ట, బిల్లీ జీన్ కింగ్, క్రిస్ ఎవర్‌‌ట, మార్టినా నవ్రతిలోవా, స్టెఫీగ్రాఫ్, సెరెనా విలియమ్స్, మరియా షరపోవా.

గోల్డెన్ స్లామ్
టెన్నిస్‌లో గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక వ్యక్తి స్టెఫీగ్రాఫ్. ఆమె 1988లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లతో పాటు సియోల్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2016
పురుషుల సింగిల్స్: సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రేను ఓడించి ఈ ఏడాదిలో జరిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు. ఇది అతడికి ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. గతంలో జొకోవిచ్ 2008, 2011, 2013, 2014, 15లో ఈ టైటిల్ సాధించాడు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియాకు చెందిన రాయ్ ఎమర్సన్ పేరిట ఉన్న అత్యధిక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ (ఆరు) రికార్డును సమం చేశాడు.

మహిళల సింగిల్స్: జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్, అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించి తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. ఈ టైటిల్ విజయంతో కెర్బర్ 1999లో స్టెఫీగ్రాఫ్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన జర్మన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

పురుషుల డబుల్స్: జేమీ ముర్రే (బ్రిటన్), బ్రూనో సోరస్ (బ్రెజిల్)ల జోడి.. డేనియల్ నెస్టర్ (కెనడా) రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)లను ఫైనల్లో ఓడించింది.

మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఆండ్రియా హ్లవకోవా, లూసీ హ్రదెకాలను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది వీరికి వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ జోడీ 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లను సాధించింది.

మిక్స్‌డ్ డబుల్స్: ఎలీనా వెస్నినా (రష్యా), బ్రూనో సోరస్ (బ్రెజిల్)ల జంట.. కోకో వందెవెఘె (అమెరికా) హొరియా టెకావు (రుమేనియా)లను ఓడించింది.

ఫ్రెంచ్ ఓపెన్-2016
పురుషుల సింగిల్స్: సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ 2016 జూన్ 5న పారిస్‌లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో బ్రిటన్ క్రీడాకారుడు ఆండీ ముర్రేను ఓడించి తన తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో జొకోవిచ్ కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా నాన్ కేలండర్ ఇయర్ గ్రాండ్‌స్లామ్‌ను కూడా సాధించాడు. జొకోవిచ్‌కు ఇది 12వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.

మహిళల సింగిల్స్: స్పెయిన్ క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌ను ఓడించింది.

పురుషుల డబుల్స్: స్పెయిన్‌కు చెందిన లిసియానో లోపెజ్, మార్‌‌క లోపెజ్‌లు.. అమెరికన్ జంట.. మైక్ బ్రయాన్, బాబ్ బ్రయాన్‌లను ఓడించి పురుషుల డబుల్స్ టైటిల్ సాధించారు.

మహిళల డబుల్స్: క్రిస్టినా మ్లాథెనోవిక్, కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)లు ఎకతెరినా మకరోవా, ఎలీనా వెస్నినా (రష్యా)లను ఓడించారు.

మిక్స్‌డ్ డబుల్స్: లియాండర్ పేస్ (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)ల జంట.. ఫైనల్లో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా), సానియా మీర్జా (భారత్) జంటను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇది లియాండర్ పేస్‌కు 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ (ఎనిమిది పురుషుల డబుల్స్, 10 మిక్స్‌డ్ డబుల్ టైటిల్స్)

యూఎస్ ఓపెన్ -2016
పురుషుల సింగిల్స్: స్విట్జర్లాండ్‌కు చెందిన స్టానిస్లాస్ వావ్రింకా, సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. ఇది వావ్రింకాకు తొలి యూఎస్ ఓపెన్ టైటిల్, మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్.

మహిళల సింగిల్స్: జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ప్లిస్కోవాను ఫైనల్లో ఓడించి తన తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది.

పురుషుల డబుల్స్: బ్రూనో సోరస్ (బ్రెజిల్), జేమీ ముర్రే (బ్రిటన్)లు.. పాబ్లో కరెనో బస్టా, గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్)లను ఓడించారు.

మహిళల డబుల్స్: బెతానీ మాటెక్ శాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)లు.. కరోలినా గార్సియా (ఫ్రాన్స్), క్రిస్టీనా మ్లదెనోవిచ్ (ఫ్రాన్స్)లను ఓడించి మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

మిక్స్‌డ్ డబుల్స్: మాతె పావిక్ (క్రొయేషియా), లారా సిగ్మండ్ (జర్మనీ)ల జోడి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో వీరు అమెరికాకు చెందిన రాజీవ్ రామ్, కోకో వందెవెఘెలను ఓడించారు.

వింబుల్డన్ - 2016
పురుషుల సింగిల్స్: 2016 జూలై 10న జరిగిన ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్).. కెనడాకు చెందిన మిలోస్ రోనిక్‌ను ఓడించి వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇది ముర్రేకు రెండో వింబుల్డన్, మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్.

మహిళల సింగిల్స్: అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్.. జర్మనీకి చెందిన ఏంజెలిక్ కెర్బర్‌ను ఫైనల్లో ఓడించి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఇది సెరెనాకు ఏడో వింబుల్డన్ టైటిల్. దీంతో సెరెనా.. స్టెఫీగ్రాఫ్ 22 టైటిళ్ల రికార్డును సమం చేసింది.

పురుషుల డబుల్స్: ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహుత్, పియరీ హ్యుగ్స్ హెర్బర్ట్‌లు అదే దేశానికి చెందిన జులియన్ బెన్నెత్యూ, ఎడ్వ్‌ర్డ్ రోజర్ వాసెలిన్‌లను ఓడించి పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు.

మహిళల డబుల్స్: సెరెనా, వీనస్ విలియమ్స్‌లు (అమెరికా).. తిమియా బాబోస్ (హంగేరీ), యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్)లను ఓడించారు.

మిక్స్‌డ్ డబుల్స్: హెన్రీ కొంటెనెన్ (ఫిన్లాండ్), హీదర్ వాట్సన్ (బ్రిటన్)లు.. రాబర్ట్ ఫరా (కొలంబియా), అన్నా లెనా గ్రోన్‌ఫీల్డ్ (జర్మనీ)లపై గెలిచారు.

అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేతలు
పురుషుల సింగిల్స్
రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) - 17
పీట్ సంప్రాస్ (అమెరికా) - 14
రఫెల్ నాదల్ (స్పెయిన్) - 14
నొవాక్ జకోవిచ్ (సెర్బియా) - 12
రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) - 12
మహిళల సింగిల్స్
మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) - 24
స్టెఫీగ్రాఫ్ (జర్మనీ) - 22
సెరెనా విలియమ్స్ (అమెరికా) - 22
హెలెన్ విల్స్ మూడీ (అమెరికా)- 19
క్రిస్ ఎవర్ట్ (అమెరికా) - 18
మార్టినా నవ్రతిలోవా - 18


No comments:

Post a Comment