ఆసియా క్రీడలు
ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో(న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి.
17వ ఆసియా క్రీడలు
17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9,501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్ స్విమ్మర్ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు.
భారత స్వర్ణ పతక విజేతలు
భారత స్వర్ణ పతక విజేతలు
జీతూ రాయ్ (షూటింగ్)
యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్)
సానియా మీర్జా(టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్)
సాకేత్ మైనేని
సీమా పూనియా (మహిళల డిస్కస్ త్రో)
మేరీ కోమ్ (మహిళల బాక్సింగ్)
4 X 400 మీటర్ల రిలే (భారత మహిళల జట్టు)
భారత హాకీ జట్టు
పురుషుల కబడ్డీ జట్టు
మహిళల కబడ్డీ జట్టు
స్వ్కాష్ పురుషుల జట్టు
పురుషుల కాంపౌండ్ జట్టు (ఆర్చరీ)
ఆసియా క్రీడలు - వేదికలు
ఆసియా క్రీడలు - వేదికలు
ఇప్పటివరకు 17 ఆసియా క్రీడలు జరిగాయి.కొన్ని వేదికల వివరాలు.
సంవత్సరం | నగరం | దేశం |
1982 | న్యూఢిల్లీ | ఇండియా |
1986 | సియోల్ | దక్షిణ కొరియా |
1990 | బీజింగ్ | చైనా |
1994 | హిరోషిమా | జపాన్ |
1998 | బ్యాంకాక్ | థాయిలాండ్ |
2002 | బుసాన్ | దక్షిణ కొరియా |
2006 | దోహా | ఖతార్ |
2010 | గ్వాంగ్ | జు చైనా |
2014 | ఇంచియాన్ | ద క్షిణ కొరియా |
No comments:
Post a Comment