బిగ్‌బ్యాంగ్ మళ్లీ ప్రారంభం
గ్రహాలు, ఉపగ్రహాలు, పాలపుంతలు.. వీటన్నింటినీ కలిపి విశ్వమంటున్నాం.
ఈ విశ్వంలోని నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరగడం, గ్రహాల చుట్టు ఉపగ్రహాలు తిరగడం, ఒక్కో గ్రహం ప్రత్యేక ద్రవ్యరాశిని, వాతావరణ పరిస్థితులను కలిగి ఉండడం వంటి అద్భుతాలన్నీ ఎలా జరుగుతున్నాయ్? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇస్తున్న సమాధానమే కృష్ట పదార్థం. దీనినే బ్రహ్మపదార్థంగా కూడా పిలుస్తున్నారు. దీనిని గుర్తించే మహాయజ్ఞాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ప్రారంభించారు.
ఈ విశ్వం ఆవిర్భావానికి కారణమైన బ్రహ్మపదార్థం ఉనికిని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు బిగ్‌బ్యాంగ్ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగంలో భాగంగా లార్జ్ హాడ్రన్ కొలైడర్(ఎల్‌హెచ్‌సీ) సహాయంతో ప్రోటాన్లను కొన్ని లక్షల సార్లు ఢీకొట్టించారు. ఈ క్రమంలోనే వారు 2012లో హిగ్స్‌బోసాన్(దైవకణం) కణాన్ని కనుగొన్నారు. తరువాత 2013లో దీన్ని ఆపేశారు. రెండు సంవత్సరాల విరామానంతరం తాజాగా భారీ హాడ్రాన్ కొలైడర్(ఎల్‌హెచ్‌సీ)ని ఆదివారం ఉదయం 10.40 నిమిషాలకు తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు కృష్ణ పదార్థ అన్వేషణ ఇంతకుముందు చేసిన దానికన్నా రెట్టింపు వేగంతో ముందుకెళ్లనుంది. ఆదివారం 27 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా ప్రోటాన్ బీమ్‌ను దాని వ్యతిరేక దిశలో మరొకదానిని పంపించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ కొలిజన్స్ ప్రారంభమవటానికి ఇంకో నెలరోజులు పడుతుందని సెర్న్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కణాలు 450 గిగా ఎలక్ట్రాన్ వోల్టులతో ప్రయాణించాయని, భవిష్యత్తులో ఇంజనీర్లు దాని శక్తిని 13వేల ఎలక్ట్రాన్ వోల్టులకు పెంచుతారని సెర్న్ పేర్కొంది.
దైవకణం అంటే...

మహా విస్ఫోటం తర్వాత ఏర్పడే వాతావరణంలో జనించే ఉపకణాల్లో ఏదో ఒక మిస్టరీ పార్టికల్(దైవకణం) ఉంటున్నదని శాస్త్రవేత్తల అంచనా. అదే దైవకణం. ఆ కణమే సృష్టికి మూలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే ఇతర కణాలకు ద్రవ్యరాశిని బదిలీ చేస్తుందని వారు భావిస్తున్నారు. ఈ కణాన్ని హిగ్స్‌బోసాన్ కణం అని కూడా పిలుస్తున్నారు.
ఎందుకు చేపట్టారు?
ఎందుకు చేపట్టారు?
మహావిస్ఫోటం తరువాత గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు, పాలపుంతలు, గ్రహశకలాలు ఎలా ఆవిర్భవించాయి? ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉండేవి? అసలు ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ప్రయోగం ఇది.
ఎవరు చేపట్టారు?
ఎవరు చేపట్టారు?
స్విట్జర్‌లాండ్‌లోని జెనీవా నగరానికి సమీపంలో.. సొరంగమార్గంలో బిగ్‌బ్యాంగ్ ప్రయోగాన్ని చేపట్టారు. ఐరోపా అణు పరిశోధనా సంస్థ(సెర్న్) ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
No comments:
Post a Comment